ఎంతటి దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్క అడుగు పడిందంటే ఎంతో కొంత విజయం లభించినట్లే! అలా తన సినీ ప్రస్థానానికి పునాది వేసిన తొలి సినిమాను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. 1979లో వచ్చిన పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి నటప్రస్థానం మొదలైంది. తొలి మెట్టుకే విజయాన్ని అందుకుని గుండె నిండా ధైర్యంతో ముందడుగు వేశారు. తనను తాను చెక్కుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
చందమామ కథలాంటి అనుభూతి
తాజాగా ఆయన పునాదిరాళ్లు సెట్‌లో అడుగుపెట్టిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆతృత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.
నట జీవితానికి పునాది రాళ్లు
ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు" అని ట్వీట్ చేశారు. తన ఫస్ట్ మూవీ చిత్రీకరణ సమయంలో దిగిన ఫోటోలను ఈ పోస్ట్‌కు జత చేశారు.
ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు.
ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది.
ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.
ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు… pic.twitter.com/Rsc6UYmgiK— Chiranjeevi Konidela (@KChiruTweets) February 11, 2026


