నాకు జరిగినట్లు నా కూతురికి జరగనివ్వను! | Ranbir Kapoor: I Want to be Raaha friend | Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: ఆ గోడను బద్ధలు కొట్టాలనుకుంటున్నా.. నా కూతురితో..

Feb 11 2026 3:34 PM | Updated on Feb 11 2026 4:08 PM

Ranbir Kapoor: I Want to be Raaha friend

నాలాంటి పరిస్థితి నా కూతురికి రానివ్వనంటున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ మాట్లాడుతూ.. నా తండ్రి (నటుడు రణ్‌బీర్‌ కపూర్‌)కి, నాకు మధ్య కొంచెం గ్యాప్‌ ఉండేది. మేమిద్దరం అంత స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం కాదు. ఎందుకంటే ఆ జనరేషన్‌లో తండ్రీకొడుకుల మధ్య అలాంటి సీరియస్‌నెస్సే ఉండేది. ఇద్దరి మధ్య ఒక గోడ ఉండేది. నా కూతురి విషయానికి వచ్చేసరికి ఆ గోడను నేను కూల్చాలనుకుంటున్నాను. తనతో ఒక ఫ్రెండ్‌లా ఉండాలనుకుంటున్నాను. తను నచ్చినవన్నీ చేసేందుకు సపోర్ట్‌గా నిలబడాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

సినిమా
కాగా రణ్‌బీర్‌ కపూర్‌- ఆలియా భట్‌.. 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది ఈ దంపతులకు కూతురు రాహా జన్మించింది. ప్రస్తుతం రణ్‌బీర్‌- ఆలియా.. లవ్‌ అండ్‌ వార్‌ సినిమా చేస్తున్నారు. అలాగే రణ్‌బీర్‌.. రామాయణ మూవీలో రాముడిగా కనిపించనున్నాడు. నితేశ్‌ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి సీతగా కనిపించనుంది. యష్‌ రావణుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.

చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా చేశా: నిఖిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement