దృశ్యం 3లో ప్రకాశ్‌ రాజ్‌.. కానీ! | Is Prakash Raj Replacing Akshaye Khanna in Drishyam 3 Movie? | Sakshi
Sakshi News home page

Prakash Raj: అక్షయ్‌ ఖన్నా స్థానంలో ప్రకాశ్‌ రాజ్‌? ఇదే క్లారిటీ

Feb 11 2026 12:47 PM | Updated on Feb 11 2026 1:01 PM

Is Prakash Raj Replacing Akshaye Khanna in Drishyam 3 Movie?

ఈ మధ్య ప్రకాశ్‌ రాజ్‌ గురించి అనేక రూమర్స్‌ వస్తున్నాయి. మొన్నటివరకు ఆయన ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్‌' సినిమా నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. దీంతో అదంతా ఫేక్‌ న్యూస్‌ అని అతడు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతలో మరో రూమర్‌ నెట్టింట వైరలవుతోంది. హిందీ 'దృశ్యం 3' సినిమాలో అక్షయ్‌ ఖన్నా తప్పుకున్న విషయం తెలిసిందే! 

ప్రకాశ్‌రాజ్‌ క్లారిటీ
ఆ స్థానంలో ప్రకాశ్‌ రాజ్‌ నటించనున్నాడన్నది లేటెస్ట్‌ టాక్‌. ఈ ఊహాగానాలపై ప్రకాశ్‌రాజ్‌ స్పందించాడు. తాను దృశ్యం 3లో నటిస్తున్నట్లు ప్రకటించాడు. కాకపోతే ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం లేదన్నాడు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశాడు. హిందీ మూవీ 'దృశ్యం 3'లో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. షూటింగ్‌ కూడా మొదలైంది. కాకపోతే నేను ఎవరినీ రీప్లేస్‌ చేయడంలేదు అని వెల్లడించాడు.

సూపర్‌ హిట్‌ ఫ్రాంచైజీ
దృశ్యం విషయానికి వస్తే.. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా పలు భాషల్లో రీమేకై అక్కడా విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన రెండో భాగం మరింత సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దృశ్యం ఫ్రాంచైజీలో మూడో భాగం రాబోతోంది. మలయాళంలో ఇప్పటికే షూటింగ్‌ పూర్తవగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా అభిషేక్‌ పాఠక్‌ దర్శకత్వంలో 'దృశ్యం 3' తెరకెక్కుతోంది. ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుంది.

దృశ్యం 3 నుంచి అక్షయ్‌ అవుట్‌
'దృశ్యం 2'లో పోలీస్‌ అధికారి పాత్రలో యాక్ట్‌ చేశాడు అక్షయ్‌ ఖన్నా. ఈ లెక్కన మూడో భాగంలోనూ అతడు ఉండాల్సిన వ్యక్తి! కానీ 'ధురంధర్‌' సక్సెస్‌ తర్వాత గర్వం అతడి తలకెక్కిందని, గొంతెమ్మ కోర్కెలు కోరాడని ప్రచారం జరిగింది. నిర్మాత కుమార్‌ మంగట్‌ పాఠక్‌ కూడా అదే నిజమన్నాడు.

గొంతెమ్మ కోర్కెలు
'అడిగినంత రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. కానీ, విగ్‌ కావాలని డిమాండ్‌ చేశాడు. దృశ్యం 2లో బట్టతలతో కనిపించి ఇప్పుడు జుట్టుతో కనిపిస్తే బాగోదని నచ్చజెప్పాం. అప్పటికే అడ్వాన్స్‌ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్‌ ఉందనగా సినిమా నుంచి తప్పుకోవడంతో నోటీసులు ఇచ్చాం' అని పేర్కొన్నాడు. దీంతో అతడి స్థానంలో జైదీప్‌ అహ్లావత్‌ను తీసుకున్నట్లు కూడా తెలిపాడు. ఇంతలోనే ప్రకాశ్‌ రాజ్‌ తెరమీదకు రావడం, ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది.

 

 

చదవండి: ఏదైనా జరగరానిది జరిగితే.. శ్రీహాన్‌ మంచి మనసు

Advertisement
 
Advertisement
Advertisement