అల్లు అర్జున్.. తన కెరీర్ ప్రారంభం నుంచే వందల ట్రోల్స్‌ను దాటుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. గంగోత్రి సినిమా నాటికి తన వయసు 20 ఏళ్లు. హీరో లక్షణాలే లేవని నానా రకాలుగా విమర్శించారు. ట్రోలింగ్ అంటే ఏంటో కూడా తెలియని టైమ్‌లోనే తట్టుకుని నిలబడ్డాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా సరే తనలోంచి తన్నుకొచ్చే ఆత్మవిశ్వాసాన్ని కళ్లల్లోనూ, నవ్వులోనూ, ముఖంలోనూ చూపుతూ తనను తాను మేకోవర్ చేసుకున్నాడు. అలా తెలుగు చిత్రసీమ సగర్వంగా భావించే నటుడిగా అల్లు అర్జున్ ఎదిగాడు. తొలి తెలుగు జాతీయ ఉత్తమ నటుడిగా కీర్తికెక్కాడు. అయినప్పటికీ తనపై తీవ్రమైన ట్రోలింగ్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. పావలా విలువ కూడా చేయని వాళ్లే సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌కు దిగుతారని తెలిసిందే.
3వేల మంది ఫాలోవర్స్
ఈ క్రమంలో తాజాగా కావేరీ బారువా అనే బ్రాండింగ్ వ్యూహకర్త చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్‌తో ప్రకటనల్ని చిత్రీకరించేటప్పుడు 42 రకాల నిబంధనల్ని పాటించాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఒక వ్యూహకర్తగా తన వృత్తికి పనికొచ్చేలా ఉన్నాయి. తనను తాను వైరల్ చేసుకునేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోవర్స్ కేవలం 3వేలు మాత్రమే.. దీంతో తను ఒక వ్యూహకర్త కాబట్టి ఇలాగైనా తను పాపులర్ కావచ్చని పక్కా ప్లాన్‌తోనే బన్నీపై పేలవమైన విమర్శలు చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఆధారాలు లేకుండానే..
ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా అల్లు అర్జున్‌పై చేసిన విమర్శలు చాలా అభ్యంతరకంగా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. వారి ఒత్తిడితో ఆ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూను యూట్యూబ్‌లో తొలగించారు. అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు ఉంటాయని ఆమె చెప్పింది. కానీ, అవేంటి అనేది చెప్పలేదు. తనకు ఎవరో చెప్పారు అంటుంది. పైగా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర బంధువులు అంటుంది. అసలు బన్నీ ఎవరు.. ఆయన బంధువులు ఎవరు అనేది కూడా తెలియకుండా ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి అంటూ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. సంధ్య థియేటర్ గొడవ, ఎయిర్‌పోర్ట్‌లో మాస్క్ తీయాలంటూ వీడియో వైరల్, ఇప్పుడు స్ట్రాటజిస్ట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా కొందరు అల్లు అర్జున్‌కు వ్యతిరేఖంగా నడుపుతున్న
యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్
బన్నీపై ఆమె చేసిన కామెంట్లతో.. అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోయారు. 42 పాయింట్లతో ఒక పత్రాన్ని రెడీ చేసి సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ టీమ్ కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. బన్నీపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని కోరింది. బన్నీ ఇలాంటి రూల్స్ పెడుతారని ఎవరు చెప్పారో వివరాలు ఇవ్వాలని కోరింది. కానీ, వారి వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ వీడియోను తొలగించి సైలెంట్ అయిపోయారు.
ఒకవేళ ఆమె చెప్పిన వ్యాఖ్యల్లో నిజం ఉంటే బన్నీ గురించి చెప్పిన ఆ వ్యక్తి వివరాలు తెలపవచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కావేరీ బారువాతో పాటు హోస్ట్‌పై బూతులతో విరుచుకుపడుతున్నారు. వాటి వల్ల తాము ఇబ్బంది పడుతున్నామంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వారి అకౌంట్లు కూడా తొలగించేశారు. కావేరి బరువా చేసిన వ్యాఖ్యలు నమ్మేలా లేవని బన్నీ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఆయనతో పనిచేసిన వారందరూ బన్నీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారు. అవన్నీ కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(అల్లు అర్జున్ గురించి ఆయన అభిమానులు విడుదల చేసిన వీడియో)
Ilanti person mida edustaru 🙏 pic.twitter.com/IxBpgnHN3b
— 𝒞𝒽𝒾𝓀𝒾𝓉𝒽𝒶 (@chikithaaaaaaa) February 10, 2026


