హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీకి అర్జున్ దర్శకత్వం వహించడంతో పాటు అతిథి పాత్రలో నటించారు.
శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


