విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్’ (ఈ నగరానికి ఏమైంది రిపీట్).
తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ (2018) మూవీకి సీక్వెల్‌గా విశ్వక్ సేన్–తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లోనే ‘ఈఎన్‌ఈ రిపీట్’ రూపొందింది.
శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను ఇతర పాత్రలు పోషించారు.
ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా పతాకాలపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది.
వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘బతుకమ్మ...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. ‘‘బతుకమ్మ...’ పాటను ప్రతి ప్రేక్షకుడు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు చంద్రబోస్.


