breaking news
Ene Repeat Movie
-
ఈషా రెబ్బా-తరుణ్ భాస్కర్ రిలేషన్.. ఆఫీషియల్ ప్రకటన
'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' తదితర సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ప్రస్తుతం నటుడిగాను రాణిస్తున్నారు. తాజాగా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు తరుణ్ భాస్కర్ మదర్ గీతా భాస్కర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తరుణ్ భాస్కర్ పార్ట్నర్ ఎవరనే విషయంపై కామెంట్స్ చేశారు. ఆమెనే తరుణ్ సోల్‌మేట్ అంటూ అఫీషియల్‌గా ప్రకటించారు.ఈ రెండేళ్లలో తరుణ్ భాస్కర్ ఎన్నో ఒడుదొడుకులు చూశాడని ఆమె అన్నారు. కోర్టు కేసులు, ఇల్లు కట్టడం వంటి సమస్యలు ఎన్నో వచ్చి పడ్డాయని తెలిపారు. ఇంటికి రాని రోజులు కూడా చాలా ఉన్నాయన్నారు. ఇంటికి వచ్చినప్పుడు రాత్రి పూట 2 గంటలకి, 4 గంటలకి భోజనం పెట్టడానికి ఒక మంచి సోల్ మేట్ దొరికిందని తెలిపింది. ఆమె మరెవరో కాదు.. మనందరం ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈషానే అంటూ వెల్లడించారు. ఈషానే తరుణ్‌కు ఫ్రెండ్ మాత్రమే కాదు.. మంచి సోల్‌మేట్ అని ప్రకటించింది. ఈషా వల్లనే ఈ మూవీని పూర్తి చేయగలిగాడని కూడా పేర్కొన్నారు. ఈషా రూపంలో తరుణ్‌కి మంచి తోడు దొరికిందని సంతోషం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరిపై వస్తున్న రూమర్స్‌కు ఇక తెరపడింది. త్వరలోనే ఈ జంట కూడా పెళ్లి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
ENE Repeat : సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
‘ఈఎన్ఈ రిపీట్’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
బతుకమ్మ పాట పండగలా ఉంటుంది: డైరెక్టర్ తరుణ్ భాస్కర్
‘‘మణిరత్నంగారి ‘సఖి’ సినిమాలోని ‘ఏడే ఏడేడే..’ పాట అంటే చాలా ఇష్టం. నా సినిమాల్లో అలాంటి పాట చేయాలనుకునేవాణ్ణి. ‘ఈఎన్ఈ రిపీట్’ మూవీలో కుదిరింది. ఈ ‘బతుకమ్మ...’ పాట థియేటర్లలో పండగలా ఉంటుంది’’ అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం చెప్పారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఈఎన్ఈ రిపీట్’. ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది.తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘బతుకమ్మ...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. ‘‘బతుకమ్మ...’ పాటను ప్రతి ప్రేక్షకుడు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు చంద్రబోస్. -
ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా ఉండడం వేస్ట్: తరుణ్ భాస్కర్
'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తాజాగా 'ఈ నగరానికి ఏమైంది 2'తో ప్రేక్షకులను పలకరించడానికి మళ్లీ వస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు. తాజాగా తరుణ్ భాస్కర్.. ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివి వైరల్ అవుతున్నాయి.'ఈ నగరానికి ఏమైంది 2' లాగే 'పెళ్లి చూపులు' సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారా? అని ఓ యాంకర్ ప్రశ్నించగా.. 'నాకు ఆ సీక్వెల్ వద్దు. ఈ సినిమాకి వచ్చిన ఒత్తిడికే నేను తట్టుకోలేకపోతున్నా. రిజల్ట్ బాగుండాలని కోరుకుంటున్నా కానీ.. అంచనాలు లేకుండా పని చేయడంలో ఒక హాయి ఉంటుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు బతకాలని ఉంది' అని తరుణ్ భాస్కర్ బదులిచ్చారు.ఎవడి చావు వాడు చస్తాడుపెళ్లి, పెళ్లి చూపుల గురించి తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'నా ఉద్దేశ్యంలో ఏ మనిషికైనా సహవాసం ఉండాలి. ఇప్పుడు జెన్ జీ వాళ్లు పెళ్లి మ్యాటర్‌ని.. సిచ్యువేషన్ షిప్ అని ఏదో అంటున్నారు. పెళ్లి అనేది మనం ఇష్టపూర్వకంగా చేసుకునేది. ఎవరైనా కలిసి బతుకుదాం అనుకుంటున్నారంటే వారిని అలాగే ఉండనివ్వండి. వాళ్లు సంతోషంగా ఉంటారు. ఎవడి చావు వాడు చస్తాడు. ఇప్పుడు చాలా కుటుంబాలలో పెళ్లి చేసుకున్న వాళ్లు మాట్లాడుకోకుండా.. ఇష్టం లేకపోయినా కలిసి జీవిస్తూ అవస్థలు పడుతున్నారు. అలాగే జీవితాంతం భరిస్తున్నారు. నేను డివోర్స్ తీసుకోకుండా ఉన్నాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ అదంతా సమయం వృథా అంతే' అని అన్నారు.కాగా విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఈఎన్ఈ రిపీట్(ఈ నగరానికి ఏమైంది రిపీట్). 2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో సూర్య..?) -
విశ్వక్ సేన్ కొత్తసినిమా.. క్రేజీ సాంగ్ రిలీజ్
విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఈఎన్ఈ రిపీట్(ఈ నగరానికి ఏమైంది రిపీట్). 2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ఈసినిమా నుంచి యూత్‌ఫుల్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘మిత్వా.. మిత్వా అంటే సాంగ్‌కి భరద్వాజ్ లిరిక్స్ అందించగా.. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. కాగా ఈ సినిమాలో శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను ఇతర పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: బొద్దుగా..లావుగా ఉండేవాడిని.. అలా కాకుండా ఉంటే: ఎన్టీఆర్ ) -
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. మెప్పించిన శ్రీనాథ్ మాగంటి
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. నలుగురి కుర్రాళ్ల పాత్రలకు ప్రేక్షకులంతా కనెక్ట్ అయ్యారు. మరోసారి సీక్వెల్‌తో ఈ కుర్రాళ్లు రాబోతోన్నారు. ఈసారి నలుగురిలో శ్రీనాథ్ మాగంటి ఒకడిగా కనిపించబోతోన్నారు. కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి అందరినీ ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నాడు. 'ఈNఈ రిపీట్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 19న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ ఎప్పటిలానే తమ టైమింగ్‌తో ఆకట్టుకున్నారనిపిస్తోంది. ఈ గ్యాంగ్‌లో కొత్తగా చేరిన శ్రీనాథ్ సైతం అదరగొట్టేశాడు. ఆల్రెడీ ఆడియెన్స్‌లో రిజిష్టర్ అయిన పాత్రలో మెప్పించడం అంటే అంత సాధారణ విషయం కాదు. అయితే ఈ ట్రైలర్‌ని చూస్తే శ్రీనాథ్ ఈ కార్తిక్ పాత్రలో ఒదిగిపోయాడనిపిస్తోంది. ఆ గ్యాంగ్‌లో ఒకడిగా కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది.ట్రైలర్లో కార్తీక్‌గా శ్రీనాథ్ కామెడీ టైమింగ్, లుక్, ప్రజెన్స్ అన్నీ బాగున్నాయి. అతను తన పాత్రలోని భావాన్ని అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ పాత్ర ఒక సిటీ కుర్రాడు, తన అభిరుచిని ఎంచుకోవడం వల్ల ఎదురయ్యే కాన్ ఫ్లిక్ట్స్ మధ్య నలిగిపోతుంటాడు.ఈ సీక్వెల్లో కార్తిక్ పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ : సినిమా హిట్ కాకపోతే ఉరి తీసేయండి..
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈఎన్ఈ రిపీట్’ (ఈ నగరానికి ఏమైంది రిపీట్). తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ (2018) మూవీకి సీక్వెల్‌గా విశ్వక్ సేన్–తరుణ్ భాస్కర్ కాంబినేషన్లోనే ‘ఈఎన్ఈ రిపీట్’ రూపొందింది. శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను ఇతర పాత్రలు పోషించారు. ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా పతాకాలపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.(చదవండి: రావణుడి పది తలలకు.. పది గొంతులు ..)ఈ నగరానికి ఏమైంది సినిమాలో చివర్లో విశ్వక్ సేన్ విజయ్ దేవరకొండతో షార్ట్ ఫిలిం తీస్తున్నట్టు చూపించారు. ఈ ట్రైలర్ అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. ‘ఏమైంది రా స్టోరీ నచ్చలేదా(విశ్వక్ సేన్), ‘హా.. నువ్వు రాసింది ఏమన్నా టైటానిక్ అనుకుంటున్నావా? (అభినవ్).. అంటే మనకిప్పుడు పాన్ ఇండియా కలెక్షన్స్ రావు అంటున్నావు(వెంకటేశ్ కాకుమా), సినిమా హిట్ కాకపోతే వీడిని ఉరితీసేయండి(అభినవ్), ‘పిచ్చెక్కిపోతుంది ఆడియన్స్‌కి’ లాంటి డైలాగ్స్‌తో ఆద్యంతం వినోదాత్మకంగా ట్రైలర్‌ని కట్ చేశారు. ట్రైలర్‌ని బట్టి చూస్తే.. విశ్వక్ సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు, ఈ నలుగురు ఫ్రెండ్స్ బ్యాంకాక్ వెళ్లి అక్కడ పడ్డ ఇబ్బందులు, మధ్యలో కామెడీతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. -
'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్.. రిలీజ్ డేట్ ఫిక్స్
తెలుగులో అప్పుడప్పుడు చిన్న సినిమాలే మంచి సక్సెస్ అందుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో తరుణ్ భాస్కర్ తీసిన 'ఈ నగరానికి ఏమైంది' ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ యూత్‌లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే చాన్నాళ్ల తర్వాత గతేడాది దీనికి సీక్వెల్ మొదలైంది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్'.. అధికారిక ప్రకటన)ఇకపోతే తొలి భాగంలో విశ్వక్ సేన్, అభినవ్, వెంకటేశ్, సుశాంత్, సిమ్రాన్ చౌదరి, అనీషా ఆంబ్రోస్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. ఇప్పుడు సీక్వెల్ విషయానికొచ్చేసరికి సుశాంత్ బదులు శ్రీనాథ్ మాగంటి వచ్చి చేరాడు. తొలి పార్ట్ గోవా నేపథ్యంగా తీయగా.. ఈసారి మాత్రం థాయ్‌ల్యాండ్ బ్యాక్‌డ్రాప్‌లో తీశారు. ఈ ఏడాది నవంబర్ 19న థియేటర్లలోకి మూవీని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.(ఇదీ చదవండి: రవితేజ 'ఇరుముడి'.. అయ్యప్ప సాంగ్ రిలీజ్)The gang is back to celebrate where it all began ❤️Celebrating the anniversary of #EeNagaranikiEmaindi with a release date announcement of ENE Repeat💥💥#ENERepeat in cinemas from NOVEMBER 19th, 2026 ✌🏻#8YearsOfENE #ENERepeatOnNov19th#TharunBhascker @VishwakSenActor… pic.twitter.com/Lkwz2VyWho— S Originals (@SOriginals1) June 29, 2026


