ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. మెప్పించిన శ్రీనాథ్ మాగంటి | Ee Nagaraniki Emaindhi Movie Sequel ENE Trailer Out, Srinath Maganti Shines Alongside Vishwak Sen And Gang, Check Release Date Inside | Sakshi
Sakshi News home page

Srinath Maganti: ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. మెప్పించిన శ్రీనాథ్ మాగంటి

Nov 4 2026 2:51 PM | Updated on Nov 4 2026 3:01 PM

Srinath Maganti Shines ENE Repeat Movie Trailer

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. నలుగురి కుర్రాళ్ల పాత్రలకు ప్రేక్షకులంతా కనెక్ట్ అయ్యారు. మరోసారి సీక్వెల్‌తో ఈ కుర్రాళ్లు రాబోతోన్నారు. ఈసారి నలుగురిలో శ్రీనాథ్ మాగంటి ఒకడిగా కనిపించబోతోన్నారు. కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి అందరినీ ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నాడు. 'ఈNఈ రిపీట్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 19న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం ట్రైలర్‌ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ ఎప్పటిలానే తమ టైమింగ్‌తో ఆకట్టుకున్నారనిపిస్తోంది. ఈ గ్యాంగ్‌లో కొత్తగా చేరిన శ్రీనాథ్ సైతం అదరగొట్టేశాడు. ఆల్రెడీ ఆడియెన్స్‌లో రిజిష్టర్ అయిన పాత్రలో మెప్పించడం అంటే అంత సాధారణ విషయం కాదు. అయితే ఈ ట్రైలర్‌ని చూస్తే శ్రీనాథ్ ఈ కార్తిక్ పాత్రలో ఒదిగిపోయాడనిపిస్తోంది. ఆ గ్యాంగ్‌లో ఒకడిగా కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది.

ట్రైలర్‌లో కార్తీక్‌గా శ్రీనాథ్ కామెడీ టైమింగ్, లుక్, ప్రజెన్స్ అన్నీ బాగున్నాయి. అతను తన పాత్రలోని భావాన్ని అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ పాత్ర ఒక సిటీ కుర్రాడు, తన అభిరుచిని ఎంచుకోవడం వల్ల ఎదురయ్యే కాన్ ఫ్లిక్ట్స్ మధ్య నలిగిపోతుంటాడు.ఈ సీక్వెల్‌లో కార్తిక్ పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement