ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’పై డైరెక్టర్‌ క్లారిటీ.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరంటే? | Music Director Ravi Basrur Confirms For Jr NTR Dragon Movie | Sakshi
Sakshi News home page

Jr NTR Dragon Movie: ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’కి మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఫిక్స్‌..

Nov 4 2026 11:53 AM | Updated on Nov 4 2026 11:59 AM

Music Director Ravi Basrur Confirms For Jr NTR Dragon Movie

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డ్రాగన్’.  ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరిని కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన డైరెక్టర్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నట్లు ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు.  ఆ మేరకు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు తెలియజేశారు.

మళ్లీ కలిసిన హిట్ కాంబినేషన్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గతంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రాలకు రవి బస్రూర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అలా సలార్ చిత్రంలోనూ వీరిద్దరి కాంబినేషన్ కొనసాగింది.  ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకు ప్రశాంత్ నీల్ ఎలాంటి ఎలివేషన్లు ప్లాన్ చేస్తున్నారు? వాటికి రవి బస్రూర్ సంగీతం ఎలా ఉండబోతోంది? అనే అంశాలపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది.  

కాగా ‘డ్రాగన్’ మూవీలో ఎన్టీఆర్‌ సరసన రుక్మిణి వ‌సంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిల్ కపూర్, బిజూ మీన‌న్‌, ఖుష్బూ సుంద‌ర్‌, గురు సోమ‌సుంద‌రం, అశుతోష్ రానా,  సిద్ధాంత్ గుప్తా, ప్ర‌భాస్ శ్రీను తదితరులు కనిపించనున్నారు.  ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 11న రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement