​‍​‍‘మహంతి ఝాన్సీ రాణి అనే నేను’.. కింగ్‌100 టబు గ్లింప్స్‌ | Nagarjuna king 100 tabu glimps released | Sakshi
Sakshi News home page

​‍​‍‘మహంతి ఝాన్సీ రాణి అనే నేను’.. కింగ్‌100 టబు గ్లింప్స్‌

Nov 4 2026 9:45 AM | Updated on Nov 4 2026 9:53 AM

Nagarjuna king 100 tabu glimps released

అక్కినేని నాగార్జున 100 వ చిత్రం ‘కింగ్ 100’. ఈ  సినిమా నుంచి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటి టబు స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. టబు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. 

‘మనుషుల్లో రెండు రకాలు.. కష్టాన్ని నమ్మేవాళ్లు, అదృష్టాన్ని నమ్మేవాళ్లు.  ‘మహంతి ఝాన్సీ రాణి అనే నేను’.. అంటూ ఆమె చెప్పే డైలాగ్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్‌ గట్టిగానే మ్యూజిక్‌ అందించినట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతోంది.  

రా. కార్తిక్‌ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘కింగ్ 100’ డిసెంబర్ 24 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నాగార్జున 100వ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన తొలి  గ్లింప్స్‌ కూడా ఆకట్టుకుంది.

(ఇదీ చదవండి: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement