బిగ్‌బాస్‌లో నామినేషన్ల రచ్చ.. ‘గేమ్‌ కోసం ఇంతలా దిగజారాలా..?’ | Biggboss 10 Telugu Day 58 Highlights | Sakshi
Sakshi News home page

Biggboss 10 Telugu Highlights: ‘రైతుబిడ్డని అన్యాయంగా పంపించేశాడు’

Nov 4 2026 8:27 AM | Updated on Nov 4 2026 8:39 AM

Biggboss 10 Telugu Day 58 Highlights

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ హౌస్‌లో మరోసారి రచ్చ రేపింది.  నిన్నటి ఎపిసోడ్‌లో ముకేశ్‌ గౌడ్‌, వర్షిణి ప్రధానంగా టార్గెట్‌ అయ్యారు. నామినేషన్ల సందర్భంగా పాత గొడవలు మళ్లీ తెరపైకి రావడంతో ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది.  అసలు నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

నరేష్‌ను టార్గెట్‌ చేసిన వర్షిణి
తొమ్మిదో వారం నామినేషన్లలో వర్షిణి.. నరేష్‌ను టార్గెట్‌ చేసింది. హోటల్‌ టాస్క్‌ సమయంలో ఝాన్సీ డబ్బులు అడిగినా నరేష్‌ ఇవ్వలేదని ప్రశ్నించింది. దేబ్జానీ చెప్పిన కారణంగానే అతడు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించింది. దీనికి నరేష్‌ గట్టిగా బదులిచ్చాడు. డబ్బులు తనవని, వాటిని ఇచ్చిన తర్వాత ఎలా ఖర్చు చేసుకోవాలనేది తన ఇష్టమని గతంలోనే చెప్పానని గుర్తుచేశాడు. అదే విషయాన్ని పదేపదే ప్రస్తావించాల్సిన అవసరం లేదని ఇది రియాలిజీ షో అని విషయం గుర్తుపెట్టుకోవాలని అసహనం వ్యక్తం చేశాడు.

వర్షిణిపై రామ్‌ ప్రసాద్‌ ఆరోపణలు
ఆ తర్వాత రామ్‌ ప్రసాద్‌ వర్షిణిని నామినేట్‌ చేశాడు. బయటకు స్నేహంగా ఉంటూ లోపల మరోలా వ్యవహరిస్తోందని,  తన అవసరాల కోసం నరేష్‌ను ఉపయోగించుకోవడం అనడం సరికాదని ఆరోపించాడు. తామిద్దరం పరస్పరం సహాయం చేసుకున్నామని అందులో ఒకరిని మరొకరు ఉపయోగించుకోవడం ఏముందని రామ్‌ ప్రసాద్‌ వర్షిణిని ప్రశ్నించాడు.

ముకేశ్‌ వ్యాఖ్యలపై శివ ఆగ్రహం
ముకేశ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ నామినేషన్లలో మరోసారి చర్చకు వచ్చాయి. దేబ్జానీ వెనుక శివ తిరుగుతున్నాడనే అర్థం వచ్చేలా ముకేశ్‌ మాట్లాడటంపై శివ తీవ్రంగా స్పందించాడు. ఒక మహిళ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. గేమ్‌లో మూడు స్టార్ల కోసం ఇంతలా దిగజారాలా అంటూ నిలదీశాడు. ముకేశ్‌ వ్యాఖ్యలపై త్రిగుణ్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఝాన్సీ( రైతుబిడ్డ)ని కూడా అన్యాయంగా పంపించేలా చేసింది ముకేశ్‌నే అని మండిపడ్డాడు. 

వ్యక్తిత్వం, ప్రవర్తనే ముఖ్యం..
దేబ్జానీ కూడా ముకేశ్‌ ప్రవర్తనను తప్పుబట్టింది. టాస్కుల్లో వేగం, బ్యాలెన్స్‌ కంటే వ్యక్తిత్వం, ప్రవర్తనే ముఖ్యమని చెప్పింది. ముకేశ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ నామినేట్‌ చేసింది. అతడి మాటలతో తాను బాధపడ్డానని చెప్పింది. దీంతో నామినేషన్ల ప్రక్రియలో మరోసారి హౌస్‌ వాతావరణం వేడెక్కింది.

(ఇదీ చదవండి: అల్లు అరవింద్‌తో నటించాలని ఉంది: నటి జయసుధ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement