మల్టీస్టారర్‌ మూవీలో.. | Suriya Walks Out and Nani to Join Mani Ratnam Film | Sakshi
Sakshi News home page

మల్టీస్టారర్‌ మూవీలో..

Nov 4 2026 3:47 AM | Updated on Nov 4 2026 3:47 AM

Suriya Walks Out and Nani to Join Mani Ratnam Film

హీరోలు ధనుష్, నాని  కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ మల్టీస్టారర్‌ కథను రెడీ చేశారట. ఈ చిత్రంలో ఓ హీరోగా ధనుష్‌ నటించనున్నారని సమాచారం. అయితే మరో హీరో పాత్రకు తొలుత సూర్య పేరు కోలీవుడ్‌లో వినిపించింది. తాజాగా నాని పేరు తెరపైకి వచ్చింది. ఇక మణిరత్నం దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు ఎప్పట్నుంచో వస్తున్న సంగతి తెలిసిందే.

మణిరత్నం దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘నవాబు’ చిత్రంలో శింబు చేసిన రోల్‌ను నాని చేయాల్సిందని, కాకపోతే కుదర్లేదని, ఇప్పుడు ఆ సమయం వచ్చిందని టాక్‌. మరి... ఈసారైనా మణిరత్నం దర్శకత్వంలో నాని హీరోగా సినిమా సెట్‌ అవుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. ఇక మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, సాయి పల్లవి జంటగా నటించిన ‘ఇంజి వెల్లమ్‌’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. 

త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది. మరోవైపు ప్రస్తుతం సుజిత్‌ డైరెక్షన్‌లో ‘బ్లడీ రోమియో’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు నాని. అలాగే ‘సత్యం సుందరం’ ఫేమ్‌ సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలోనూ నాని హీరోగా ఓ సినిమా చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement