రామాయణలో కేజీఎఫ్ బ్యూటీ.. ఆ వార్తల్లో నిజమెంత? | Srinidhi Shetty selected as Seetha in Ramayana Movie news viral | Sakshi
Sakshi News home page

Ramayana Movie: రామాయణలో కేజీఎఫ్ బ్యూటీ.. ఆ వార్తల్లో నిజమెంత?

Nov 4 2026 2:30 AM | Updated on Nov 4 2026 2:30 AM

Srinidhi Shetty selected as Seetha in Ramayana Movie news viral

యశ్‌ కెరీర్‌లో తొలి పౌరాణిక చిత్రం ‘రామాయణ’. ఇందులో రావణుడిగా యశ్‌ కనిపించబోతున్నారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించారు. నవంబర్ 5న విడుదల కానుంది. ఈ మేరకు ప్రమోషన్స్‌ ప్రారంభించారు. ప్రస్తుతం మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో ఈ మూవీ ప్రీమియర్స్‌ కూడా ప్రదర్శించారు. 

తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో సీత పాత్ర కోసం శ్రీనిధి శెట్టి ఆడిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే యశ్ రావణుడిగా నటిస్తున్న నేపథ్యంలో.. కేజీఎఫ్‌లో జంటగా కనిపించిన తాము ఈ సినిమాలో ప్రత్యర్థులుగా కనిపిస్తే ప్రేక్షకులు ఎలా తీసుకుంటారోనని ఆమె సందేహం వ్యక్తం చేశారు.

అయితే యశ్‌ కోసం సీత పాత్రను వదులుకున్నారంటూ ప్రచారం మొదలైంది. కానీ మరో ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి అసలు విషయం స్పష్టం చేశారు. తాను సీత పాత్రను తిరస్కరించలేదని.. అసలు చిత్రబృందమే తనను ఎంపిక చేయలేదని శ్రీనిధి చెప్పారు. సీత పాత్రకు సాయి పల్లవి ఎంపిక కావడంపై కూడా సంతోషం వ్యక్తం చేశారు. దీంతో యశ్ కోసం ఆమె ఆ అవకాశాన్ని వదులుకున్నారనే ప్రచారంలో నిజం లేదని అర్థమైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement