యశ్ కెరీర్‌లో తొలి పౌరాణిక చిత్రం ‘రామాయణ’. ఇందులో రావణుడిగా యశ్ కనిపించబోతున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించారు. ఈ నెల 5న విడుదల కానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ భాగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యశ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పది వ్యక్తిత్వాలుగా చూపించాలని..
ఓ ఇంటర్వ్యూలో యశ్ మాట్లాడుతూ.. ‘రావణుడి పది తలలను కేవలం రూపానికి పరిమితం చేయకూడదు. మనిషిలో బలం, బలహీనత, సందేహం, అతివిశ్వాసం వంటి విభిన్న భావాలు ఉంటాయి. వాటినే పది వ్యక్తిత్వాలుగా చూపించాలనుకున్నాం. ప్రతి వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన గొంతు, హావభావాలు ఉండాలని నిర్ణయించుకున్నాం. కొన్ని వ్యక్తిత్వాలకు గతంలో చూసిన పాత్రల నుంచి ప్రేరణ తీసుకున్నాం. మరికొన్నింటిని ఊహలతో రూపొందించాం. ఈ విషయంలో నితీష్ తివారీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అయితే సాంకేతికంగా పెద్ద సమస్యలను ఎదుర్కొన్నాం. ఇది మేకప్ ఆర్టిస్ట్ ప్రశాంత్ సహకారంతోనే సాధ్యం అయింది. ఒక్కో సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు ఏడు రోజులు పట్టింది’ అని యశ్ తెలిపారు.
(ఇదీ చదవండి: నాగార్జున ‘కింగ్100’.. కొత్త అప్‌డేట్ వచ్చేసింది)
Rocking Star #Yash opens up about his preparation and thought process behind portraying Ravana in #Ramayana!! https://t.co/8EtZOGuhHH
— cinee worldd (@Cinee_Worldd) November 3, 2026


