అక్కినేని నాగార్జున 100 వ చిత్రం ‘కింగ్ 100’. ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటి టబు స్పెషల్ గ్లింప్స్‌ను నవంబర్ 4 న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. టబు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
కాగా రా కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘కింగ్ 100’ డిసెంబర్ 24 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నాగార్జున 100వ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన తొలి గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా దీనిని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. టబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్రవనం PS’ రివ్యూ..


