నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం మూకుత్తి అమ్మన్ 2’ ( తెలుగులో మహాశక్తి) . సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తుండగా.. రెజీనా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. నవంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నయనతార ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పంచుకున్నారు.


