Kollywood
-
లాభాల్లో 70% వాటా డిమాండ్ చేస్తున్న హీరో
అమరన్ సినిమా తర్వాత శివకార్తికేయన్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన సినిమాలకు మార్కెట్ వాల్యూ కూడా పెరిగింది. అది దృష్టిలో పెట్టుకున్న హీరో కేవలం పారితోషికం కాకుండా లాభాల్లో వాటా అడుగుతున్నాడు. మదరాసి, పరాశక్తికి ఇదే రూల్ ఫాలో అయ్యాడట.. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకు కూడా ఇదే విధానం అమలు చేయనున్నాడంటూ కోలీవుడ్‌లో తెగ ప్రచారం జరుగుతోంది.సెయాన్ అంటే..శివకార్తికేయన్ ప్రస్తుతం సెయాన్ సినిమా చేస్తున్నాడు. స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. అమరన్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై శివకార్తికేయన్ చేస్తున్న రెండో చిత్రమిది. ఈ మూవీతోనే శివకుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సెయాన్ అంటే కుమారస్వామికి మరో పేరు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.లాభాల్లో వాటాఈ మూవీకి శివకార్తికేయన్ భారీ పారితోషికాలు గట్రా అడగలేదట! లాభాల్లో వాటా అడిగాడట! ఇప్పటికే రూ.10 కోట్ల అడ్వాన్స్ తీసుకున్న హీరో సినిమా రిలీజయ్యాక 70% లాభాలను డిమాండ్ చేశాడని తెలుస్తోంది. అంటే మిగిలిన 30% మాత్రం కమల్ హాసన్ బ్యానర్‌కు వెళ్తాయి. సెయాన్ బడ్జెట్ రూ.35 కోట్లని తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత జరగనుంది? బాక్సాఫీస్ వద్ద ఎంత రాబడుతుంది? అన్నది చూడాలి!చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రయిన బాలీవుడ్ నిర్మాత -
పిచ్చి రీల్స్ పంపుతాడు.. ఆంటీ బాలేదు నాన్న అనగానే..
బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీ అవుతుందని చాలామంది వాదన. ఆ విషయం తాను కూడా అంగీకరిస్తానంటోంది హీరోయిన్ శృతి హాసన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నెపోకిడ్ వంటి అంశాల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నేనస్సలు ఫైట్ చేయను. ఎందుకంటే నాకు తొలిసారి పాట పాడే అవకాశం చాలా ఈజీగా లభించింది. నా గొంతు ఇబ్బందిఇళయారాజా సర్ సంగీత దర్శకత్వంలో నాన్న సినిమాలోనే తొలిసారి పాట పాడాను. నా వాయిస్ గంభీరంగా ఉంటుందని ఇళయరాజా అంటుండేవారు. ఒకసారి ఆయన ఇంటికి వచ్చినప్పుడు నేను మా పేరెంట్స్‌పై అరుస్తున్నాను. అప్పుడాయన నీ గొంతులో మంచి రేంజ్ ఉందన్నారు. అయితే ఆయన్ని ఇంప్రెస్ చేసిన నా గొంతు చాలామందికి మాత్రం డామినెంట్‌గా అనిపించింది.నాన్న సలహా తీసుకోనునేను చిన్నప్పుడే పండిత్ మనోహర్ కులకర్ణి, సురేశ్ వాడక్కర్ వంటి మహామహుల వద్ద సంగీతం నేర్చుకున్నాను. అలా నాకు మంచి గురువులు లభించారు. కెరీర్లో ఏం చేయాలి? ఎటువైపు అడుగులు వేయాలి? అనే విషయంలో ఎన్నడూ నాన్న సలహా తీసుకోలేదు. అలాగే రజనీకాంత్‌ను కూడా సలహా అడగలేదు. కాకపోతే వాళ్లిద్దరూ చాలా కష్టపడతారు. పిచ్చి రీల్స్ దాన్ని ఇబ్బందిగా ఫీలవకుండా ఇష్టంగా, నిశ్శబ్ధంగా కష్టపడతారు. సినిమా కోసం ప్రాణాలైనా ఇస్తారు.. ఇద్దరూ పని రాక్షసులు. అటు ఆఫీసును, ఇటు ఇంటిని చక్కగా నిర్వహిస్తారు. నాన్నయితే ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే పిచ్చి రీల్స్ ఏవేవో పంపుతాడు. అది చూసినప్పుడు ఈ ఆంటీ ఫన్నీగా ఏం లేదు నాన్నా అంటుంటాను. అప్పుడాయన కొన్ని మంచి రీల్స్ పంపుతాడు.. అలాంటి వీడియోలు ఇష్టంచిన్న పాప అందంగా పాడుతున్నట్లు, గ్రామాల్లో వంట చేసే వీడియోలు.. ఇలాంటివి చూసి ఆయనెంతగానో సంతోషిస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చింది. కాగా ఐదేళ్లకే సింగర్‌గా పరిచయమైంది శృతి హాసన్. తేవార్ మగన్ (1992) మూవీలో పొట్రి పాడది పొన్నె అనే పాట ఆలపించింది. తర్వాత హీరోయిన్గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సింగర్‌గా, హీరోయిన్గా రాణిస్తోంది.చదవండి: మహేశ్‌బాబు సెట్లో ఎలా ఉంటారంటే?: బాలీవుడ్ నటి -
విజయ్- సాయిపల్లవితో మణిరత్నం కొత్త మూవీ
సాయిపల్లవికి పెద్ద అభిమానిని అని చెప్పుకునే మణిరత్నం తనతో సినిమా ప్రకటించాడు. థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఓ ప్రేమకథతో కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఇందులో విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటించనున్నారు.అదిరిన కాంబినేషన్లైకా ప్రొడక్షన్స్, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ కాంబో చూస్తుంటే సినిమా ఓ రేంజ్లో ఉండబోతుందని అభిమానులు అప్పుడే ఆశలు పెట్టేసుకుంటున్నారు. రూమర్స్నిజానికి ఈ సినిమాలో మొదటగా ధ్రువ్ విక్రమ్, రుక్మిణి వసంత్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, తర్వాత వారి స్థానంలో విజయ్ సేతుపతి, సాయిపల్లవిని తీసుకున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు అదే నిజమైంది. అలాగే సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు ఆయన స్థానంలో రెహమాన్‌ను తీసుకున్నారు.సినిమాకాగా విజయ్ సేతుపతి స్లమ్‌డాగ్, జైలర్ 2 సహా మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు సాయిపల్లవి హిందీలో రామాయణ, ఏక్ దిన్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి! View this post on Instagram A post shared by Madras Talkies (@madrastalkies) -
అమ్మాయిలతో జాగ్రత్త.. యూత్‌కు హీరోయిన్ సలహా
నటి పూనం బాజ్వాను అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే ప్రస్తుతం చిత్రాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఈమె తరచూ హల్చల్ చేస్తూనే ఉంటారు. పలు భాషల్లో కథానాయకిగా నటించిన బ్యూటీ తెలుగులో మెదటి సినిమా (2005)లో ఎంట్రీ ఇచ్చింది. అయితే, పరుగు, బాస్ సినిమాలతో పాపులర్ అయింది. తమిళంలో తేనావట్టు , కచేరి ఆరంభం, సేవల్ , తంబికోట్టై వంటి పలు చిత్రాలు నటించింది. అయితే స్క్రీన్ ప్లే అందాల ఆరబోతలో హద్దులు చెరీపేస్తూ కొన్ని ఐటమ్ సాంగ్స్ లో నటించిన ఈ అమ్మడు కథానాయకిగా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారనే చెప్పాలి. అయితే ఇంటర్నెట్లో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ యువత దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న ఈమె ఇన్ స్ట్రాగామ్‌లో దాదాపు 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. కాగా ఇటీవల తన సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నటి పూనం బాజ్వా(Poonam Bajwa) పేర్కొంటూ మీకు స్నేహితురాలుగానో, ప్రేయసి గానో, భార్యగానో కలిసి ప్రయాణించే యువతి ఏ దేశానికి మహారాణి కాక పోవచ్చుగాక, అయినా ఆమెను రాణి మాదిరిగానే భావించాలన్నారు. ఆమె అందాన్ని, ప్రేమను, శక్తిని అభినందించాలన్నారు. అంతేకాకుండా అన్ని మర్చిపోదాం అని చెప్పే యువత మరింత జాగురూకత వహించాలన్నారు. ఎందుకంటే మహిళలు ఏ విషయాన్ని మర్చిపోరని ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చే ఇతర అమ్మాయిలకు సంబంధించిన విషయాలను మర్చిపోరన్నారు. కాబట్టి అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని నటి పూనం బాజ్వా పేర్కొన్నారు. ఇవే పేర్కొన్న విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
'ఒత్తిడిలో మెడిసిన్‌లా ఈ సినిమా..' డైరెక్టర్‌పై నాగార్జున ప్రశంసలు
మేడ్ ఇన్ కొరియా మూవీపై టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా డైరెక్టర్ ఆర్ఏ కార్తీక్‌ను అభినందించారు. ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ మూవీని ఇప్పుడే చూశానని.. పూర్తిగా అస్వాదించానంటూ ట్వీట్ చేశారు. ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలాంటి సినిమా మంచి మెడిసిన్‌గా పనిచేస్తుందని నాగ్ కొనియాడారు. ఈ సినిమాలో మెప్పించిన ప్రియాంక మోహన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.కొరియన్ కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఈ మూవీలో ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించింది. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో నంబర్‌వన్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రశంసించారు. Congratulations to my director @Rakarthik_dir for this uplifting film feel good #MadeinKorea on Netflix!! Totally enjoyed it 😊the right medicine for these stressful times💐 special shout out to @priyankaamohan https://t.co/vV5Kqa3Pdq— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2026 -
'అలా చేయడం చాలా అసహ్యాంగా ఉంది'.. మంచు విష్ణు పోస్ట్ వైరల్
తమిళనాడు రాజకీయాలపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ చేశారు. పాలిటిక్స్‌లోకి హీరోయిన్లను లాగడం చాలా అసభ్యకరంగా ఉంటుందని అన్నారు. ఇది కేవలం తమిళనాడులో మాత్రమే కాదని.. ఎక్కడ జరిగినా సమంజసం కాదన్నారు. నటులు ఉంటే కేవలం రాజకీయాల్లో పావుగా వాడుకునే వస్తువులు కాదని ట్వీట్ చేశారు. వారికి కుటుంబం, గౌరవం, పర్సనల్ లైఫ్ అనేవి కూడా ఉంటాయన్నారు. ప్రజా చర్చ అనేది ప్రాథమిక గౌరవానికి, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని సూచించారు. మన భారతీయ సంస్కృతి, దాని మూలాల్లోనే మహిళలను శక్తిగా గౌరవిస్తామని రాసుకొచ్చారు. అలాంటి శక్తిగా భావించే మహిళలను వారిని వార్తా శీర్షికల కోసం అవమానించేలా ఉండకూడదని పోస్ట్ చేశారు. ఇక నుంచేనా మనం మంచిగా ప్రవర్తిద్దామని హితవు పలికారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.విజయ్- త్రిష ఎపిసోడ్‌పైనే..ఇటీవల కోలీవుడ్‌లో విజయ్-త్రిష వ్యవహారం అనూహ్యంగా తెరపైకొచ్చింది. విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో త్రిష గురించి చర్చ నడుస్తోంది. త్రిష- విజయ్‌ల మధ్య రిలేషన్ ఉందని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిషకు అండగా పలువురు కోలీవుడ్ నటీనటులు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. అది వారి వ్యక్తిగత జీవితమని.. మనం కేవలం సినిమాల గురించి మాత్రమే చర్చించాలని ఓ సీనియర్ నటుడు అన్నారు. తాజాగా మంచు విష్ణు సైతం ఈ విషయంతో త్రిషకు మద్దతుగా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. Reading about the political campaigns in my Tamil Nadu. Felt It’s in extremely poor taste to drag actresses into political narratives. Not just in TN but anywhere. Actors are not political punching bags. They are individuals with families, dignity, and a life beyond the…— Vishnu Manchu (@iVishnuManchu) March 17, 2026 -
'యూత్' ట్రైలర్: హీరో వెనక పడుతున్న ముగ్గురమ్మాయిలు
తమిళ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం యూత్. ఈ మూవీకి కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. జీవీ ప్రకాశ్ కుమార్ పైసా పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా సంగీతం అందించాడు. ఇటీవలే తమిళ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. తాజాగా యూత్ తెలుగు ట్రైలర్ వదిలారు. యూత్ తెలుగు ట్రైలర్'మీకు పుట్టినవాడు సాధారణమైన అబ్బాయి కాదు మేడమ్.. ఆ దేవుడే మీకు బిడ్డగా పుట్టాడు. వాడిని బ్యాడ్ బాయ్స్‌తో చేరనివ్వకండి' అన్న సంభాషణతో వీడియో మొదలవుతుంది. తీరా హీరో.. తనను ముగ్గురమ్మాయిలు ప్రేమిస్తున్నారని తెగ సంబరపడిపోతాడు. ఫైటింగ్, లవ్, కామెడీకి ఏమాత్రం కొదవ లేనట్లుగా చూపించారు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా ట్రైలర్ కట్ చేశారు. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. -
నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు
అడుసు తొక్కనేల.. కాలు కడగనేల! గడిచిన పది రోజుల్లో రెండుసార్లు సారీ చెప్పాడు తమిళ దర్శకుడు, నటుడు ఆర్.పార్తీబన్. ఓపక్క హీరో విజయ్ విడాకుల వ్యవహారం కోర్టులో కొనసాగుతుండగా త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లాడీ హీరో. దీంతో కొన్నాళ్లపాటు త్రిష బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే బాగుంటుందని పార్తిబన్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా.. క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసింది.కుల ప్రస్తావనఇంతలోనే మరో వివాదంలో ఇరుక్కున్నాడు పార్తిబన్. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కులం గురించి ప్రస్తావిస్తూ స్పీచ్ మొదలుపెట్టాడు. స్టేజీపై కులం ప్రస్తావన తేవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో మరోసారి క్షమాపణలు చెప్తూ పోస్ట్ పెట్టాడు. నేను ఎలాంటి తప్పునైనా సరే వెంటనే సరిదిద్దుకునే వ్యక్తిని. నిజం చెప్తున్నా.. ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు. ఇదే మొట్టమొదటిసారిఏదో నోరు జారాను. ఇన్నేండ్ల అనుభవంలో కుల ప్రస్తావన తేవడం ఇదే మొట్టమొదటిసారి. కానీ, కులానికి ప్రాధాన్యతనిచ్చేవారిని నేను అస్సలు ఇష్టపడను. కుల వ్యవస్థను తప్పుపడుతూ ఎన్నో సినిమాలు చేశాను. అనుకోకుండా పొరపాటు జరిగింది. అందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలతో ఎంతోమందిని బాధపెట్టానని అర్థమైంది.క్షమించండినేను కేవలం నా ప్రతిభను నమ్ముకుంటానే తప్ప కులాన్ని వాడుకునే వ్యక్తిని కాను. ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు జరగదని మాటిస్తున్నాను. వాస్తవానికి ఈ విషయం గురించి మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను. నా వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోయి ఎప్పటిలాగే నన్ను ప్రోత్సహించండి. సినిమామీరు నాపై ఉంచిన ప్రేమను, నమ్మకాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తాను అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా యాక్ట్ చేశారు.చదవండి: పీలింగ్స్ సాంగ్ బానే చూశారుగా.. ఈ పాటకెందుకంత రాద్ధాంతం? -
సినిమాపై భయం.. అబ్బాస్‌కు మంచి కమ్‌బ్యాక్!: హీరో
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం హ్యాపీ రాజ్. నటి శ్రీగౌరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ద్వారా నటుడు అబ్బాస్ రీఎంట్రీ ఇస్తున్నాడు. మరియరాజు ఇళంజెలియన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జయవర్ధ నిర్మించిన ఈ మూవీకి జయకాంత్ సురేశ్ సహనిర్మాతగా వ్యవహరించాడు.దేనికీ భయపడని వ్యక్తి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 27న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో జీవీ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు మరియరాజు దేనికీ భయపడని వ్యక్తి అన్నారు. ఆయన చెప్పిన కథ నచ్చిందని, అయితే మంచి నిర్మాత కోసం ఎదురుచూస్తున్న సమయంలో జయకాంత్, జయవర్ధ ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. మధ్యలోనే వదిలేస్తారా?కొత్త దర్శకుడు, కొత్త నిర్మాతలు కావడంతో ఈ మూవీని పూర్తి చేస్తారా? మధ్యలోనే వదిలేస్తారా? అన్న భయం కలిగిందన్నారు. ఇదే విషయాన్ని వారిని అడిగానన్నారు. అయితే వారు ఈ సినిమాను చాలా బాగా రూపొందించి, బిజినెస్ పూర్తి చేసి రిలీజ్‌కు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు. హ్యాపీరాజ్ చిత్రం తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు. అందరికీ ఏమో కానీ అబ్బాస్‌కు కచ్చితంగా ఈ మూవీ కంబ్యాక్‌గా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన అంత బాగా నటించారని కితాబిచ్చారు. -
అనిరుధ్‌తో జట్టుకట్టిన యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా
యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్‌నకు చెందిన యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా.. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇటీవల ప్రారంభించిన స్వతంత్ర రికార్డ్ లేబుల్ అల్బుక్వెర్క్ రికార్డ్స్‌తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా, అల్బుక్వెర్క్ రికార్డ్స్, అనిరుధ్ రూపొందించే పాప్, హిప్-హాప్ సంగీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ లేబుల్ ద్వారా విడుదలయ్యే తొలి సంగీత ప్రాజెక్ట్‌లో అనిరుధ్ పాల్గొనగా, వచ్చే నెల ప్రారంభంలో దీన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)2012లో అరంగేట్రం చేసిన అనిరుధ్.. 'వై దిస్ కొలవెరి డి' ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదించాడు. తర్వాత విడుదలైన తన 770కి పైగా పాటల ద్వారా మొత్తం 13 బిలియన్కు పైగా ఆడియో స్ట్రీమ్స్ సాధించాడు. దీంతో మొత్తం స్ట్రీమ్స్ పరంగా స్పాటిఫైలో అత్యధిక స్ట్రీమ్స్ పొందిన దక్షిణ భారతీయ కళాకారుడిగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తమిళ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (ఓఎస్టీ) రంగంలో ఎక్కువగా కోరుకునే సంగీత దర్శకుల్లో ఇతడొకరు. హుకుమ్, వాతీ కమింగ్, అరబిక్ కుతు, మోనికా, ఏ23 థీమ్, ఆజా రాజా, అయా షేర్ తదితర గ్లోబల్ హిట్లు ఇతడి ఖాతాలో ఉన్నాయి.(ఇదీ చదవండి: బూతు పాటపై కేంద్రం సీరియస్) -
విజయ్- త్రిష ఎపిసోడ్‌పై మరో కొత్త పుకారు!
కోలీవుడ్‌లో విజయ్- త్రిష ఎపిసోడ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం తర్వాత విజయ్- త్రిష జంటగా పెళ్లిలో కనిపించడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వరుస కథనాలొచ్చాయి.అయితే అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం త్రిష తల్లి ఉమా కృష్ణన్ అలా చేయడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. విజయ్- త్రిష కృష్ణన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పేర్కొంటూ అభిమానులు ఓ రీల్ రూపొందించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఆసక్తిగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక భారీ ప్రకటన వెలువడుతుందని వీడియోను పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన త్రిష మదర్ ఉమా కృష్ణన్ ఆ వీడియోను లైక్ కొట్టింది.ఈ రీల్‌కు త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టడంతో వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష, విజయ్‌ల బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఉమా కృష్ణన్ కూడా ఆసక్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చూసిన కొందరు త్రిష అభిమానులు సైతం ఉమా కృష్ణన్ పొరపాటున ఈ రీల్‌కు లైక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా త్రిష మదర్ 'థగ్ లైఫ్' మూవీ రిల్స్‌కు లైక్స్ కొట్టారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా విజయ్- త్రిష పెళ్లిపై క్లారిటీ రావాలంటే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. -
సినీ నటీనటులు వెబ్‌సిరీస్‌ల్లో నటించకూడదు
తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా తమిళ సినీ నిర్మాతల మండలి ఇటీవల చైన్నెలో సమావేశమైంది. తమిళ సినీ యాక్టివ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు టీజీ త్యాగరాజన్, తమిళనాడు సినీ థియేటర్ల సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రహ్మణ్యం, తమిళనాడు సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు ఆరుళ్పతి ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా ‘‘ నటీనటులు గానీ, దర్శకులు, ఇతర ప్రముఖ సాంకేతిక నిపుణులు ఓ నిర్మాత నుంచి అడ్వాన్స్ పొంది ఉంటే ముందుగా ఆయన చిత్రాన్ని పూర్తి చేయడానికే ప్రాధాన్యత నివ్వాలి. సినిమాల్లో నటించే నటీనటులు, దర్శకులు, సాంకేతిక వర్గం వెబ్ సిరీస్‌లో నటించడం గానీ, దర్శకత్వం వహించడం గానీ చేయరాదని తీర్మానించారు. అలా కాని పక్షంలో వారికి సినిమాల్లో పనిచేయడానికి సహకరించబోమని స్పష్టం చేశారు. ప్రముఖ నటులు రెవెన్యూ షేర్ విధానంలో చిత్రాల్లో నటించడానికి సహకరించాలి. చిత్రాలు విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని ఈ విధానాన్ని తమిళనాడులో మాత్రమే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లోనూ అమలు పరిచేలా ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. ఈ తీర్మానాన్ని అమలు పరచడానికి డిస్టిబూటర్లు, థియేటర్లతో కలిపి ఓ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలకు చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని సంఘాలు కట్టుబడి ఉండాలని తీర్మానం చేసినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్వాహకులు స్పష్టం చేశారు. -
ఊహించని కాంబో.. స్టార్ డైరెక్టర్‌తో రానా దగ్గుబాటి..!
సినీ ఇండస్ట్రీలో ఒక రేర్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైవిద్య భరితమై కథా చిత్రం తెరకెక్కింది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తరువాత ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం రానా కేవలం నటుడు మాత్రమే కాకుండా నిర్మాత కూడా రాణిస్తున్నారు. ఈయన 2005లోనే స్పిరిట్ మీడియా పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు చిత్రాలను నిర్మించారు. ఇటీవలే దుల్కర్ సల్మాన్‌తో కలిసి కాంత చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.అయితే కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గురించి తెలియని వారు ఉండరు. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా.. కార్తీక్ సుబ్బరాజ్‌కు చెందిన స్టోన్బెంట్ సంస్థ కలిసి నీళిరా అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని నిర్మించాయి. దీనికి శ్రీలంక తమిళుడు సోమిధరన్ దర్శకత్వం వహించారు. ఇందులో నటుడు నవీన్ చంద్ర, విదూ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్న ట్లు యూనిట్ వర్గాలు ఎక్స్ మీడియాలో పేర్కొ న్నారు. ఆ చిత్ర టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను పోస్ట్ చేశారు. -
విజయ్ జన నాయగన్.. ఈ సారైనా మోక్షం లభించేనా?
కోలీవుడ్ స్టార్ దళపతి హీరోగా నటించిన చిత్రం జన నాయగన్. రాజకీయల్లో ఎంట్రీకి ముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీంతో ఈ మూవీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమా వ్యవహారం కోర్టుకు చేరడంతో రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.ఈ మూవీని సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ రివ్యూ చేయాల్సి ఉంది. ఈనెల 9న జరగాల్సిన రివైజింగ్ కమిటీ ప్రదర్శన వాయిదా పడింది. బోర్డ్ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాను మార్చి 17న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం తప్పకుండా స్క్రీనింగ్ జరుగుతుందని సీబీఎఫ్సీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడం జరగనుంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్‌కు స్క్రీనింగ్‌కు సంబంధించి అధికారిక మెయిల్ అందినట్లు తెలుస్తోంది.జన నాయగన్‌ను జనవరి 9న గ్రాండ్‌గా విడుదల చేయాలని మొదట నిర్ణయించారు. కానీ ఈ చిత్రం ఒక వర్గం ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్‌ను నిలిపివేసింది. దీంతో సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని చూసిన ఒక సభ్యుడు సైన్యానికి సంబంధించిన సీన్స్ ఉన్నాయని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేశాడు. ఆ తర్వాత, జన నాయగన్ నిర్మాతలు జనవరి 6న కోర్టును ఆశ్రయించారు. సెన్సార్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ చర్యలతో జన నాయగన్ మేకర్స్, సెన్సార్ బోర్డ్‌కు మధ్య నెల రోజుల పాటు వివాదం కొనసాగింది. అయితే మూవీ టీమ్ తమ కేసును ఉపసంహరించుకోవడంతో ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపడానికి సెన్సార్ బోర్డ్ అంగీకరించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని రాజకీయ సందేశాలు ఉన్నందున.. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతిస్తుందో లేదో చూడాల్సిందే. -
అజిత్ కేరవాన్‌లో వంట చేసిపెట్టాడు: తమన్నా
సినిమారంగంలో భాషాబేధాలకు తావుండదు. ప్రతిభే కొలమానం. అలా స్వశక్తితో ఎదిగిన నటీమణుల్లో మిల్కీబ్యూటీ తమన్నా భాటియా ఒకరు. ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాదిలో అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కథానాయికగా సత్తా చాటుతూనే మరోపక్క ఐటమ్ సాంగ్స్‌లో నటిస్తూ అలరిస్తోంది. అలా ప్రత్యేక పాటల కోసం తమన్నా దాదాపు రూ.6 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్!ఆ మూవీ ఎంతో స్పెషల్ఇకపోతే ఈ హీరోయిన్ ఇటీవల చెన్నైలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను తమిళంలో కల్లూరి చిత్రంలో నటించానని, అది తన సినీజీవితంలో చాలా ముఖ్యమైనదని పేర్కొంది. ఆ సినిమాలోలాగే కాలేజీ లైఫ్‌ను విద్యార్థులు ఎంజాయ్ చేయాలంది. కాలేజీడేస్ మళ్లీ తిరిగిరావంది.స్వయంగా వంట చేసి..తాను సినీ పరిశ్రమలో 21 ఏళ్లుగా కొనసాగుతున్నానని, ఇంతలా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని సంతోషం వ్యక్తం చేసింది. తమిళంలో విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటించినట్లు తెలిపింది. నటుడు విజయ్ చాలా నిరాడంబరుడు, మంచి మనసు కలవాడంది. విజయ్, జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్స్ అని కితాబిచ్చింది. అజిత్ గురించి చెప్పాలంటే వీరం సినిమా సమయంలో తనకు ఆయన కేరవాన్‌లో ఇడ్లీ వండిపెట్టారని గుర్తు చేసుకుంది. ఆయనకు వంట చేయడం చాలా ఇష్టమని, మంచి కుటుంబ సభ్యుడిలా ఉంటాడని పేర్కొంది.చదవండి: ఆస్కార్ పండగ.. అత్యధికంగా ఆ చిత్రానికే ఎక్కువ అవార్డులు -
ఆ సినిమాలన్నీ ఫ్లాప్.. లాభమే లేదు: విజయ్ సేతుపతి
సినిమాలు తీయడమంటే ఆషామాషీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా బాక్సాఫీస్ వద్ద వైఫల్యం మూటగట్టుకోవడం తథ్యం. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది నిర్మాతలే.. కొడితే కుంభస్థలాన్ని కొడతారు.. లేదంటేనేమో తీవ్ర నష్టాలు చూస్తారు. అలా తాను నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదంటున్నాడు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి.ఆ నాలుగు ఫ్లాప్తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నా బ్యానర్లో సంగుతేవన్ అనే సినిమా స్టార్ట్ చేశాను. కానీ, అది మధ్యలోనే ఆగిపోయింది. దానివల్ల రూ.1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత నాలుగు సినిమాలు తీశాను. అవే.. ఆరెంజ్ మిఠాయి, మేకు తొడర్చి మలై, జుంగ, లాభం. వీటిలో ఒక్కటి కూడా నాకు లాభాల్ని తెచ్చిపెట్టలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకురావడంలో కూడా విఫలమయ్యాయి. సినిమాబాక్సాఫీస్ లెక్కలపరంగా అవి ఫ్లాప్ అయినప్పటికీ నాకు మాత్రం ఆ సినిమాలన్నీ ఇష్టం. కాబట్టి వాటిని నిర్మించినందుకు నేనేం బాధపడటం లేదు అన్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటుడిగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ మూవీ చేస్తున్నాడు. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్ చేస్తున్నాడు. ఇది కాకుండా పాకెట్ నోవెల్, జైలర్ 2, అరసన్‌తో పాటు మణిరత్నం మూవీ ఒకటి ఆయన చేతిలో ఉన్నాయి.చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి: ప్రియదర్శన్ -
పురుషులే అసలైన బాధితులు.. హీరో భార్య కౌంటర్
ఇటీవలి కాలంలో విడాకుల సంఖ్య పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి దూరడం వల్లే ఈ విడాకులు ఎక్కువవుతున్నాయి. తమ విడాకుల వ్యవహారానికి కూడా మూడో మనిషే (సింగర్ కెనీషా ఫ్రాన్సిస్) కారణమని తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆర్తి. తమిళ స్టార్ జంట రవి మోహన్- ఆర్తి 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో కనసాగుతోంది.పురుషులే అసలైన బాధితులుఇదిలా ఉంటే రవి ఇటీవల ఓ పోస్ట్ పెట్టాడు. అందులో మహిళలే కరెక్ట్ అని అందరూ అనుకుంటారు, కానీ పురుషులే అసలైన బాధితులు. అది మన న్యాయవ్యవస్థకు కూడా అర్థమవుతోంది. నేను ప్రేమించినవారికోసం ఏం చేశాను? నా మనసేంటి? అనేది ఏదో ఒకరోజు మీక్కూడా అర్థమవుతుంది. దయచేసి ప్రశాంతంగా బతకనివ్వండి.. మీ వికారమైన ఆలోచనలను మీదగ్గరే ఉంచుకోండి అని రాసుకొచ్చాడు.పిల్లల్ని ఎవరు పెంచారు?అతడి వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కరుత్తు కన్నమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. విడాకులు మంజూరవకముందే మరో అమ్మాయితో తిరుగుతున్న ఈయన సుద్దపూసలా మాట్లాడుతున్నాడు. ఇంతకూ పిల్లల్ని నువ్వే పెంచావా? లేదా ఆ బాధ్యతను ఆర్తిపై వేశావా? న్యాయవ్యవస్థ గురించి మాట్లాడేముందు పిల్లల్ని ఎవరు పెంచారో చెప్పు.. భరణం గురించి కాదు!ఎందుకీ దొంగ ఏడుపు?నువ్వేమో మరో అమ్మాయితో దర్జాగా తిరుగుతున్నావు. నీ భార్య మాత్రం నీ పిల్లలను చూసుకోవడంలోనే మునిగిపోయింది. పైగా నువ్వే అసలైన బాధితుడివి అని ఏడుస్తున్నావ్. నువ్వు చేసిన పని నీ భార్య చేసుంటే? విడాకులు ఫైనలైజ్ కాకముందే మరో మగాడితో ఆర్తి బయట తిరుగుతే ఈ ప్రపంచం ఊరుకుంటుందా? అదే పని ఆర్తి చేస్తే..ఒకవేళ తిరిగిన తర్వాత కూడా నేనే అసలైన బాధితురాలిని అని చెప్తే అందరూ నమ్ముతారా? లేదు కదా.. నువ్విలా విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం చాలా చెండాలంగా ఉంది అని ఆగ్రహించింది. ఈ పోస్ట్‌ను ఆర్తి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. నిశ్శబ్ధంగా ఉండటానికి బదులుగా నిజాయితీగా గొంతెత్తి ప్రశ్నించినందుకు గర్వంగా ఉంది.. అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది. View this post on Instagram A post shared by Karuththu Kannammaa (@karuththu_kannammaa2015) చదవండి: వారి కాళ్లకు నమస్కరించడం తప్ప ఏం చేయగలం?: మోహన్‌బాబు -
MGRపై చౌకబారు వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానన్నాడు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు.కొద్దిగా నోరు జారా..ఆ వీడియోలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. తమిళ సినీ ప్రేక్షకులు ఎంజీఆర్‌ను దైవంలా భావిస్తారు. నేను కూడా ఆయన్ను దేవుడిలాగే భావిస్తాను. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో కొద్దిగా నోరు జారాను. అది కావాలని అనలేదు. కొందరు దీన్ని పెద్దది చేశారు. ఆయనపై కామెంట్స్ చేసేంత ధైర్యం నాకెక్కడిది? నేను చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము నటిస్తుంటే వచ్చి చూసేవారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను తప్పుగా మాట్లాడతానా? ఏదేమైనా నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలాంటి కామెంట్స్ చేయను అని క్షమాపణలు తెలిపాడు.ఏం జరిగింది?కాగా ఇటీవల ఓ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ కాస్త నోరు జారాడు. తెలుగు నటుడు కాంతారావును పొగిడే క్రమంలో ఎంజీఆర్‌పై చులకన వ్యాఖ్యలు చేశాడు. కాంతారావును చూసి ఎంజీఆర్ ప్యాంటు తడుపుకునేవాడని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్ సెలబ్రిటీలు విశాల్, నాజర్ మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా ఉన్నాయన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. வருத்தம் தெரிவித்த நடிகர் ராஜேந்திர பிரசாத்!#ActorRejendraprasad #mgr #nadigarsangam #nasser#vishal pic.twitter.com/8dpyBRPW5Z— FridayCinema (@FridayCinemaOrg) March 13, 2026 -
గుండె ముక్కలైందన్న హీరో! బ్రేకప్ పోస్ట్?
తమిళ హీరో అర్జున్‌దాస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఎప్పుడూ సినిమా అప్డేట్స్ తప్ప పర్సనల్ విషయాలను పెద్దగా ఫ్యాన్స్‌తో పంచుకోడు. అలాంటిది ఆయన హార్ట్ బ్రేక్ అయినట్లు ఓ పోస్ట్ పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.అంతలా ప్రేమిస్తే..ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే.. మనం ఎవర్నైనా గాఢంగా ప్రేమిస్తే.. వాళ్లు మనల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు? అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. దీనికి హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశాడు. అర్జున్‌దాస్‌కు బ్రేకప్ఇది చూసిన అభిమానులు అర్జున్‌దాస్‌కు బ్రేకప్ అయిందా? అని చర్చిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదేదో కొత్త సినిమా ప్రమోషన్స్ అయుంటుంది, అంతా పబ్లిసిటీ స్టంట్ అని భావిస్తున్నారు. మరి ఈ పోస్ట్ వెనక మర్మమేంటో అర్జున్ దాసే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.సినిమాకాగా అర్జున్ దాస్ గతంలో ఐశ్వర్య లక్ష్మితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు. ఇకపోతే ఇతడు చివరగా ఓజీ సినిమాలో యాక్ట్ చేశాడు. ప్రస్తుతం కాన్ సిటీ సినిమా చేస్తున్నాడు.చదవండి: ఆశను కోల్పోవద్దు.. విడాకుల తర్వాత హన్సిక ఫస్ట్ పోస్ట్ -
ఇప్పటికీ భార్యనే డబ్బు అడుగుతా: శివకార్తికేయన్
తనకు డబ్బు కావాల్సి వస్తే భార్య దగ్గర చేయి చాస్తానంటున్నాడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్. తన బ్యాంకులో ఎంత డబ్బుందన్న విషయం కూడా తనకు తెలియదని చెప్తున్నాడు. ఈయన నిర్మాతగా వ్యవహరించిన 'తాయ్ కిళవి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం రూ.50 కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో శివకార్తికేయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.చేయి చాచి అడుగుతాఆయన మాట్లాడుతూ.. పెళ్లయినప్పటి నుంచి నా ఆర్థిక వ్యవహారాలన్నీ భార్య ఆర్తియే చూసుకుంటోంది. నా అకౌంట్లో ఎంత డబ్బుందన్న విషయం కూడా నాకు తెలీదు. నేను ఎప్పుడు, ఏ ఖర్చు పెట్టాలన్నా తనను అడిగి తీసుకుంటాను. ఒక టికెట్ కొనాలన్నా కూడా తనను చేయి చాచి మనీ అడుగుతాను. అందుకు నేను ఏమీ బాధపడను, పైగా గర్వపడుతున్నాను. తన ముందుచూపు, దూరదృష్టి, పొదుపు చేసే వైఖరి వల్లే ఈరోజు నేను నిర్మాతగా సినిమాలు తీయగలుగుతున్నాను. వాళ్లందరికీ సినిమా అంకితంతను అవన్నీ చూసుకోకపోయుంటే ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. రేపటికోసం జాగ్రత్తపడే ప్రతి మహిళకు మా సినిమా అంకితం. సంపాదన ఎంతున్నా సరే దానిలో ఎంతో కొంత వెనకేయాలనే ఆడవారు ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చాడు. కాగా కొత్త డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన తాయ్ కిళవి ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సింగం పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, ముత్తుకుమార్, రేచల్ రెబెకా, జార్జ్ మరియణ్ ప్రధాన పాత్రలు పోషించారు. నివాస్ కె.ప్రసన్న సంగీతం అందించాడు.చదవండి: భర్తకు విడాకులిచ్చిన హీరోయిన్ హన్సిక -
పూరి జగన్నాథ్ - సూర్య క్రేజీ కాంబినేషన్!
-
చేసిన రెండు సినిమాలు ఫ్లాప్.. అయినా మరో ఛాన్స్
తక్కువ టైంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. సొంత భాషలో హిట్స్ ఉన్నప్పటికీ తెలుగు, తమిళంలో చేసిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా చేస్తోంది. అయితే తమిళంలో చేసిన మూవీస్ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు రుక్మిణి మరో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)వరుస సినిమాలతో అలరిస్తున్న తమిళ హీరో ధనుష్.. ప్రస్తుతం విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో 'కర' మూవీ చేశాడు. మమిత బైజు హీరోయిన్. వచ్చే నెల 30న థియేటర్లలోకి రానుంది. మరోవైపు 'అమరన్' తీసిన రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలోనూ ధనుష్ ఓ సినిమా చేస్తున్నాడు. డీ55 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్స్. సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీని తర్వాత ధనుష్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించనున్నట్లు టాక్.ఇందులోనే దక్షిణాది క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్.. ధనుష్ సరసన నటించనుందట. ఇదే నిజమైతే వీళ్లిద్దరి కాంబోలో రూపొందే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ ప్రాజెక్టుకి అనిరుధ్ సంగీంతమందించనున్నాడట. ఇందులో ప్రతినాయకుడిగా విజయ్ కుమార్ నటిస్తారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.(ఇదీ చదవండి: తారకరత్న చివరి గుండె చప్పుడూ విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో) -
ఇద్దరు బ్యూటీస్‌తో ఆర్య.. ఇందులో 'బేబి' కూడా
డిఫరెంట్ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు ఆర్య. ఇంతకు ముందు నాన్ కడవుల్, మద్రాసు పట్టణం, మహాముని, టెడ్డీ, సార్పట్ట పరంపరై తదితర మూవీస్ చేశాడు. ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో 'వెట్టవన్'లో నటిస్తున్నాడు. దీని తర్వాత 'సార్పట్ట పరంపరై 2'లో కూడా నటించడానికి సిద్ధమవుతున్నాడు. తన 40వ చిత్రాన్ని జీవశంకర్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యాడు. ఇందులో నిఖిలా విమల్, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)నిఖిల్ మురళి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 12న పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఆర్యతో హీరోయిన్లు నిఖిలా విమల్, వైష్ణవి చైతన్య జిమ్‌లో కలిసి వర్కౌట్స్ చేస్తున్నట్లు ఫొటోలకు పోజులిచ్చారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం.. రొమాంటిక్ ప్రేమకథగా ఉండనుందని తెలుస్తోంది. 'బేబి' మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్యకు ఇదే తమిళంలో తొలి మూవీ.(ఇదీ చదవండి: తారకరత్న చివరి గుండె చప్పుడూ విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో) -
ఆయన్ని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా
ఇండస్ట్రీలో నటీనటులు అందరూ ఒకేలా ఉండరు. కొందరు వచ్చామా పనిచేశామా వెళ్లిపోయామా అన్నట్లు ఉంటారు. మరికొందరు మాత్రం తమ చర్యలతో తోటి నటీనటుల్ని చాలానే ఇబ్బందులు పెడుతుంటారు. తాజాగా తమిళ నటి సోనా.. ప్రముఖ కమెడియన్ వడివేలు గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన వల్ల నరకం చూశానన చెప్పుకొచ్చింది. అందుకే 16 సినిమాల్లో ఆయనకు జంటగా నటించే అవకాశమొచ్చినా తిరస్కరించినట్లు మరోసారి స్పష్టం చేసింది.(ఇదీ చదవండి: మరోసారి నోరుజారిన రాజేంద్ర ప్రసాద్)'కుశేలన్ (తెలుగులో 'కథానాయకుడు') తర్వాత వడివేలుతో కలిసి నటించమని నాకు 16కు పైగా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే వాటిని మర్యాదపూర్వకంగా తిరస్కరించాను. ఎందుకంటే నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం నాకు ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే ఆయనని నేను తట్టుకోలేనేమో అనిపించింది. ఓ రకంగా నరకం చూశాను. అందుకే ఆయనతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నాను. దీని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడకపవడమే మంచిదని అనుకుంటున్నాను' అని సోనా చెప్పుకొచ్చింది.తమిళంలో నటి, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సోనా.. ఎక్కువగా శృంగార తరహా పాత్రలే చేసింది. రజనీకాంత్ హీరోగా నటించిన కుశేలన్ చిత్రం తెలుగులో కథానాయకుడు పేరుతో రిలీజైంది. మూవీ ఇక్కడ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇందులో కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి. సోనా-వడివేలు కాంబినేషన్లోని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అయితే సెట్లో సోనాని వడివేలు ఎంతలా ఇబ్బంది పెట్టాడో ఏమో గానీ ఇలా ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వడివేలుపై గతంలోనూ పలువురు నటీనటులు ఇలాంటి ఆరోపణలే చేశారు. అందుకే చాన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు. కొన్నాళ్ల క్రితమే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అడపాదడపా మూవీస్ చేస్తున్నారు. మళ్లీ ఇలాంటి టైంలో సోనా, వడివేలుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సోనా తెలుగులోనూ ఆయుధం, వీడే, విలన్, ఆంధ్రావాలా తదితర సినిమాలు చేసింది. ప్రస్తుతానికైతే తమిళ, మలయాళ మూవీస్‌లోనే కనిపిస్తోంది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన) -
పర్సనల్ లైఫ్ జడ్జ్ చేయడానికి మీరెవరు?.. విజయ్- త్రిష వివాదంపై స్టార్ డైరెక్టర్
కోలీవుడ్‌లో విజయ్- త్రిష పేర్లే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా త్రిష పేరు తెరపైకొచ్చింది. ఇటీవల వీరిద్దరు జంటగా ఓ వివాహానికి కూడా హాజరు కావడంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే త్రిషపై కోలీవుడ్ దర్శకుడు పార్తిబన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత దర్శకుడు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.తాజాగా విజయ్- త్రిష వివాదంపై ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ స్పందించారు. మనం కేవలం నటీనటుల సినిమాల గురించి మాత్రమే చర్చించాలని సూచించారు. వారి వ్యక్తిగత జీవితాలపై చర్చించే హక్కు.. వారిని జడ్జ్ చేసే రైట్ మనకు లేదన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఈ వివాదం కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ హాట్ టాపిక్‌గా మారింది..విక్రమ్ భట్ తన పోస్ట్‌లో రాస్తూ.. ' విజయ్- త్రిషల వ్యక్తిగత జీవితాలపై చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ నిజమో, కాదో నాకు తెలియదు. ఒకవేళ అవి నిజమైతే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. వారిద్దరూ ఎంతో హుందాగా ఉన్నారు. ఏ విషయాన్ని దాచిపెట్టడం లేదు. ఇప్పుడు వాళ్లను ఎంతోమంది జడ్జ్ చేస్తున్నారు. ఆ ఇద్దరి గురించి మాట్లాడేవారంతా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. నటీనటుల సినిమాలు మాత్రమే మనం చూడాలి. వారి పర్సనల్ లైఫ్ గురించి మనకు అవసరం లేదు' అని రాసుకొచ్చారు.కాగా.. ఇటీవల రూ.30కోట్ల చీటింగ్ కేసు విషయంలో విక్రమ్ భట్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విక్రమ్, అతడి భార్య శ్వేతాంబరి భట్‌లకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ దంపతులు దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
మిషన్ నొక్కితే డబ్బే డబ్బు.. కాన్ సిటీ టీజర్ చూశారా?
డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు. దాదాపు అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్న తమిళ సినిమా "కాన్ సిటీ". కాకపోతే ఇక్కడ డబ్బులు చెట్లకు కాకుండా ఓ మిషన్‌కు కాస్తున్నాయి. అవును, బటన్ నొక్కితే చాలు లిమిట్ అనేదే లేకుండా ఎన్నిసార్లంటే అన్నిసార్లు డబ్బులు ప్రింట్ చేస్తూనే ఉంది.డబ్బులు ప్రింట్ చేసే మిషన్సోమవారం సాయంత్రం కాన్‌సిటీ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో.. డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని ఓ గంభీర స్వరం ఫోన్లో హీరోను నిలదీస్తుంది. దాంతో అసహనానికి లోనైన హీరో వస్తువులన్నింటినీ కిందపడేస్తాడు. అప్పుడే ఒక మిషన్‌ను సైతం కిందపడేయబోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పిడుగు పడి యంత్రం ఆన్ అవుతుంది, అందులో నుంచి రూ.500 నోటు బయటకు వస్తుంది. ఇంకేముంది.. నొక్కిన ప్రతిసారి నోట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది.చేతులు మారిన యంత్రందాంతో ఆ డబ్బంతా బ్యాగులో సర్దుకున్న హీరో ఆ యంత్రాన్ని జాగ్రత్తగా అల్మారాలో పెడతాడు. కట్ చేస్తే బట్టలు సర్దే సమయంలో భార్యకు ఆ మిషన్ కనిపిస్తుంది. బటన్ నొక్కితే డబ్బు వస్తుండటంతో దాన్ని తీసుకెళ్లి వంటగదిలో దాచేస్తుంది. అక్కడి నుంచి అది హీరో తల్లి చేతికి వెళ్తుంది. ఆమె దాన్ని పూజగదిలో దేవుడి ఫోటో వెనకాల భద్రపరుస్తుంది. తర్వాత సడన్‌గా మిషన్ కనిపించకుండా పోతుంది. వీధిలో నోట్ల వర్షంఇంటిల్లిపాది అంతా వెతుకుతారు. తీరా చూస్తే హీరో కొడుకు ఆ యంత్రంతో బాల్కనీలో ఆడుకుంటాడు. ఇంకేముంది, నడిరోడ్డులో డబ్బుల వర్షం.. దాన్ని దక్కించుకునేందుకు వీధిలో జనం ఎగబడుతుంటారు. మరిం తర్వాతేం జరిగిందో తెలియాలంటే కాన్ సిటీ చూడాల్సిందే! హరీశ్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్ మూవీకి సేన్ రోల్డన్ సంగీతం అందించాడు. అర్జున్ దాస్, అన్నాబెన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రాన్ని టీ సిరీస్ తెలుగులో తీసుకురానుంది. -
రూ.50 కోట్లు కొల్లగొట్టిన రాధిక శరత్ కుమార్ మూవీ
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా అలరించిన రాధిక శరత్‌కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే 'తాయ్ కిళవి' కోసం ఆమె ముసలమ్మగా నటించింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటినుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. 75 ఏళ్ల బామ్మగా రాధిక నటించడం, హీరో శివకార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హాఫ్ సెంచరీపాజిటివ్ రివ్యూలతో తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌పై మంచి పట్టు సాధించింది. కేవలం పది రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తాయ్ కిళవి రూ.50 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక సినిమా రిలీజైనప్పటినుంచి టాప్ హీరోలు, దర్శకుడు, హీరోయిన్లు అందరూ సినిమాను, ముఖ్యంగా రాధికను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. #ThaaiKizhavi crosses ₹50 Crore Worldwide GBOC in just 10 days! 💥Overwhelmed by the incredible love and support from everywhere. Thank you for making it a #MegaBlockbusterThaaiKizhavi ❤️#MorattuVasool@Siva_Kartikeyan @Sudhans2017 @KalaiArasu_ @SKProdOffl… pic.twitter.com/4aKJASW3hg— Sivakarthikeyan Productions (@SKProdOffl) March 9, 2026 చదవండి: వానిటీ వ్యాన్స్, వాష్‌రూమ్స్ ఏవీ లేవు: నటి -
జన నాయగన్‌కు మరో షాక్.. స్క్రీనింగ్ వాయిదా..!
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వస్తోన్న మూవీ జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ నటించిన చివరి చిత్రం ఇదే. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ బోర్డ్ వివాదంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో జన నాయగన్ రిలీజ్ మరింత ఆలస్యమవుతోంది. అయితే తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ ఈ మూవీని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ చేయాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా జన నాయగన్ రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ వాయిదా పడింది. కమిటీలోని ఓ సభ్యుడు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ప్రదర్శన రద్దు చేశారు. దీని వల్ల సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తోన్న జన నాయగన్ మేకర్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే దీనిపై సెన్సార్ బోర్డ్ సభ్యులు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే స్క్రీనింగ్ కోసం మరో తేదీని కేటాయిస్తారో? లేదో తెలియాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో మమిత బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, పూజా హెగ్డే, నరైన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సిన ఉన్నా వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే గతేడాది రివ్యూ చేసిన సెన్సార్ బోర్డ్ కొన్ని సవరణలు సూచించింది. అయినప్పటికీ కొన్ని మతపరమైన అంశాలు, సాయుధ దళాల లోగోలను ఉపయోగించడంపై సెన్సార్ కమిటీ సభ్యుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మూవీని మరోసారి సెన్సార్ చేయాలని రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్‌కు పంపారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. -
త్రిషపై అనుచిత కామెంట్స్.. సారీ అంటూ పోస్ట్
కోలీవుడ్ స్టార్ విజయ్ విడాకుల వివాదం తెరపైకి వచ్చాక అనూహ్యంగా హీరోయిన్ త్రిష పేరు వైరలవుతోంది. విజయ్‌కు అమెతో రిలేషన్ ఉందంటూ ఆయన భార్య సంగీత ఆరోపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇదిలా ఉండగా కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు త్రిషపై అనుచిత కామెంట్స్ చేశారు. ఓ ఈవెంట్లో పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.ఇది కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై హీరోయిన్ త్రిష కూడా అదేస్థాయిలో ఇచ్చిపడేసింది. ఆ నటుడికి అసలు బుర్రనే లేదంటూ ఎద్దేవా చేసింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో పార్తిబన్ స్పందించారు. ఈ మేరకు ఆయన క్షమాపణలు కోరారు. ఇప్పుడు జరిగిన దానికి నేనే సారీ చెప్పడం తప్ప వేరే మార్గం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదానికి ఇకపై ఫుల్స్టాప్ పడినట్లే.అసలేం జరిగిందంటే..తాజాగా ఓ మూవీ ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ.. త్రిష గురించి అభిప్రాయం చెప్పాలని పార్తిబన్‌ని అడిగింది. 'పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని అన్నాడు. అయితే పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు.. త్రిషని అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన సరదాగానే అన్నాడని, మిగతా వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.పార్తిబన్ విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2 తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ 'రచ్చ'లో చరణ్ తండ్రిగా చేశాడు. ఇతడు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే తెలుగు మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నటి సీతని 1990లో పెళ్లి చేసుకున్న పార్తిబన్.. 2001లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. -
నటుడు పార్తిబన్ పరువు తీసేసిన త్రిష.. ట్వీట్ వైరల్
హీరోయిన్ త్రిష రీసెంట్ టైంలో పెద్దగా సినిమాలు చేయలేదు. అయినా సరే సోషల్ మీడియా అంతా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. విజయ్‌తో ఈమె రిలేషన్లో ఉందనే రూమర్సే దీనికి కారణం. ఎక్కడా ఈ విషయాన్ని అధికారికం చేయనప్పటికీ.. దాదాపు అందరూ వీళ్లిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. తమిళ నటుడు పార్తిబన్ కూడా వీళ్ల బంధం గురించి పరోక్షంగా అర్థం వచ్చేలా చిల్లర కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.శనివారం రాత్రి చెన్నైలో జరిగిన ఓ అవార్డ్ వేడుకలో నటుడు దర్శకుడు పార్తిబన్, త్రిష గురించి మాట్లాడుతూ.. ఆమె ఇంట్లో ఉంటేనే మంచిది. బయటకు వస్తే ఎక్కడలేని సమస్యలన్నీ వస్తున్నాయి అని అన్నాడు. ఈ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలోనూ గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడీ విషయం కాస్త త్రిష వరకు చేరడంతో ఆమె కుడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్తిబన్‌కి అసలు బుర్ర లేదనేలా రాసుకొచ్చింది.'ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నా పేరు, ఫొటో చేర్చుతున్నామని చివరి నిమిషంలో నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. ఓ వ్యక్తి తన సహాయుకుడిని పంపించి నన్ను అడిగారు. అయితే మైక్రోఫోన్లో మాట్లాడినంత మాత్రాన అది తెలివైన వ్యాఖ్య లేదా కామెడీనో అవదు. అది కేవలం మూర్ఖత్వాన్ని ఎక్కువ వినిపించేలా చేస్తుంది. జ్ఞానం లేకుండా మాట్లాడే అసభ్య పదాలు, అవి ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాయో అనేదాని కంటే మాట్లాడిన వ్యక్తి తత్వాన్ని బయటపెడతాయి' అని త్రిష ట్వీట్ చేసింది. పార్తిబన్‌కి అసలు బుర్ర లేదు అని అర్థం వచ్చేలా త్రిష రాసుకొచ్చింది. -
త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు
తమిళనాడులో ఓవైపు ఎన్నికల హడావుడి ఉంది. మరోవైపు స్టార్ హీరో విజయ్ వైవాహిక బంధం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. రీసెంట్‌గానే ఇతడి భార్య సంగీత, కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఓ నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందనే కారణాన్ని పిటిషన్లో పేర్కొంది. ఇదలా ఉండగానే త్రిషతో కలిసి విజయ్ ఏకంగా ఓ పెళ్లికి వెళ్లడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. వీళ్లిద్దరి మధ్య ఏముందనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇంతలోనే తమిళ నటుడు, దర్శకుడు పార్తిబన్.. త్రిషపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్)తాజాగా ఓ మూవీ ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ.. త్రిష గురించి అభిప్రాయం చెప్పాలని పార్తిబన్‌ని అడిగింది. 'పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని అన్నాడు. అయితే పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు.. త్రిషని అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన సరదాగానే అన్నాడని, మిగతా వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.ఏదేమైనా పార్తిబన్ లాంటి ఓ సీనియర్ నటుడు, దర్శకుడు.. త్రిష లాంటి హీరోయిన్ గురించి పబ్లిక్‌గా ఇలా మాట్లాడటం సరికాదనే అభిప్రాయం పలువురు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. గతంలోనూ ఈ నటుడు హీరోయిన్ల గురించి నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలో కథ ఉందా? లేదా అనేది ప్రేక్షకులు చూడటం లేదు. హీరోయిన్ డ్యాన్స్ కోసమే సినిమాలు చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదు.. సినిమా హిట్టవుతుంది అని అన్నారు. తర్వాత తన మాటలపై విమర్శలు రావడంతో క్షమాపణ చెప్పుకొచ్చాడు.పార్తిబన్ విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2 తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ 'రచ్చ'లో చరణ్ తండ్రిగా చేశాడు. ఇతడు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే తెలుగు మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నటి సీతని 1990లో పెళ్లి చేసుకున్న పార్తిబన్.. 2001లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్)Parthiban attacks Trisha😝“Intha Kunthavai ah veetukullaye Kunthavaikirathu nalathu”😀pic.twitter.com/X5St5Ycnvk— Christopher Kanagaraj (@Chrissuccess) March 8, 2026 -
విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇతడి భార్య సంగీత.. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయడం, త్రిషతో విజయ్‌కి రిలేషనే ఉందనే రూమర్స్ ఓ వైపు చక్కర్లు కొడుతుండగానే ఓ పెళ్లికి ఆమెతోనే కలిసి రావడం లాంటివి హాట్ టాపిక్ అయిపోయాయి. అలానే విడాకులు మంజూరు అయ్యేంతవరకు తనని ఇంట్లోనే ఉండనివ్వాలని చెప్పి సంగీత మరో పిటిషన్ వేయడం, భరణంగా రూ.250 కోట్లు ఇవ్వనున్నాడనే కామెంట్స్ చర్చనీయాంశమైపోతున్నాయి. ఇలాంటి టైంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్.. తన విడాకులపై తొలిసారి స్పందించాడు.(ఇదీ చదవండి: బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ్.. తన టీవీకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఇవ్వబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. వీటితో పాటు తన విడాకుల వ్యవహారం గురించి కూడా పరోక్షంగా విజయ్ మాట్లాడారు.'నా జీవితంలో జరుగుతున్న పలు సంఘటనల గురించి మీరు కంగారు పడకండి. వాటి గురించి ఆలోచించి మీరు సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని నేను పరిష్కరించుకుంటాను. నా సమస్యల గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి లోనవడం నన్ను మరింతగా బాధపెడుతోంది' అని విజయ్.. తన విడాకుల గురించి ఇన్ డైరెక్ట్‌గా మాట్లాడారు. ఇప్పుడీ వ్యాఖ్యలు, వీడియో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!)Recently, there have been a few problems happening. I see that you are getting hurt while fighting for it. I’m getting hurt seeing you guys getting hurt. I’ll take care of the problems. Don’t get hurt. Nothing to worry about..- #ThalapathyVijay's speech pic.twitter.com/8QFSWVjklU— Laxmi Kanth (@iammoviebuff007) March 7, 2026 -
త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందో తెలుసా?
హీరోయిన్ త్రిష రెండు దశాబ్దాలకు పైగా సినీప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. వర్షం సినిమాతో తెలుగులో సెన్సేషన్ సృష్టించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సరసన గిల్లిలో హీరోయిన్గా యాక్ట్ చేసి స్టార్ స్టేటస్ అందుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. అయితే ఈ బ్యూటీ దళపతి విజయ్‌తో ప్రేమాయణం నడుపుతుందని చాలాకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇటీవల విజయ్, త్రిష జంటగా ఓ పెళ్లికి హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే త్రిష విజయ్ కంటే ముందు వేరే హీరోలతో లవ్‌లో పడింది. ఆ కథేంలో ఇప్పుడు చూసేద్దాం..హీరోలతో లవ్త్రిష తమిళంలో పలువురు స్టార్స్‌తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శింబుకి జోడీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ముదిరి ప్రేమగా మొగ్గలు తొడిగిందట. బయటకు వెళ్లినప్పుడు కూడా చేతిలోన చెయ్యేసి మరీ నడిచేవారు.. కానీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. ఆ తర్వాత దళపతి విజయ్‌తో ఎక్కువ సినిమాలు చేసిన సమయంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, కొంతకాలానికి ఆ రూమర్స్ దానంతటవే ఆగిపోయాయి.ప్రకంపనలు రేపిన సుచీలీక్స్అనంతరం త్రిష టాలీవుడ్ హీరో రానాకు క్లోజ్ అయింది. మొదట్లో వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకానొక సమయంలో ఈ స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ తర్వాతెందుకో విడిపోయారు. కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన సుచీలీక్స్ వ్యవహారంలో త్రిష-రానా క్లోజ్ ఫోటో ఒకటి బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తోనూ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. త్రిష వల్లే ధనుష్- ఐశ్వర్య వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లి క్యాన్సిల్వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ 2015లో పెళ్లికి రెడీ అయింది త్రిష. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్‌తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో వివాహం రద్దు చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని కండీషన్ పెట్టాడని, అది నచ్చకనే అతడిని పెళ్లి చేసుకోలేదని త్రిష ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ధనుష్‌తో త్రిష అంత క్లోజ్‌గా ఉండటం నచ్చకే అతడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని అంటుంటారు.విజయ్‌తో లవ్ఇప్పుడు మరోసారి విజయ్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది త్రిష. విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది హీరో భార్య సంగీత. ఈ సమయంలో విజయ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అందరికీ తాము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్తోంది. మరి విజయ్- సంగీత విడాకులు తీసుకున్నాక వీరు ప్రేమను పెళ్లి బంధంతో బలపర్చుకుంటారేమో చూడాలి!చదవండి: నోటికి ఎంతొస్తే అంత అనేస్తారా? బుర్రసాయి మాధవ్‌కు వరలక్ష్మి శరత్‌కుమార్ కౌంటర్ -
వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమా.. హీరోయిన్ ఎవరంటే..?
విక్టరీ వెంకటేష్ ఐదవసారి హిట్ మెషీన్ అనిల్ రావిపూడితో చేతులు కలిపాడు. 2027 సంక్రాంతికి మరో సినిమాతో రానున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో F2 , F3 , సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలు తెరపైకి వచ్చాయి. అయితే, 2027 పొంగల్ రేసులో బరిలోకి దిగబోతున్నట్లు వారు ఇప్పటికే ప్రకటించారు. ఈసారి వెంకటేష్ (Venkatesh), కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) ప్రధాన పాత్రల్లో సినిమా ఉండనుంది. అయితే, హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చర్చగా మారింది.తాజా సమాచారం ప్రకారం వెంకటేశ్ సరసన నటించేందుకు మహానటి కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ఆమె సంతకం చేసిందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన మరో హీరోయిన్ కోసం అనిల్ రావిపూడి వెతుకుతున్నాడని చెబుతున్నారు. కీర్తి గత కొంతకాలంగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన విజయం లేకపోడంతో కాస్త వెండితెరకు దూరమైంది. మరి అనిల్ రావిపూడి అయినా మహానటికి విజయాన్ని అందిస్తారేమో చూడాలి. భారీ బడ్జెట్‌తో సిద్ధం అవుతున్న ఈ మూవీకి నిర్మాత ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. -
ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను లెక్కచేయవా? విజయ్‌పై ఫైర్
స్టార్ హీరో విజయ్- సంగీత విడాకుల వ్యవహారం తమిళనాట సంచలనంగా మారింది. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కొన్నేళ్లుగా ఓ నటితో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆ కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సంగీత తన విడాకుల పిటిషన్లో పేర్కొంది. దీంతో విజయ్- సంగీత విడాకులకు హీరోయిన్ త్రిష కారణమా? అన్న చర్చ మొదలైంది.విడాకులుఆన్స్క్రీన్పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ విజయ్- త్రిష ప్రేమాయణం నడుపుతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. సంగీత విడాకుల పిటిషన్ వేసిన తర్వాత విజయ్.. దర్జాగా త్రిషను తీసుకుని ఓ పెళ్లికి హాజరయ్యాడు. జంటగా నిల్చుని ఫోటోకు పోజిచ్చాడు. ఇది చాలామంది అభిమానులకు మింగుడుపడలేదు. ఇప్పటికే విజయ్- సంగీత కలిసుండాలని చాలామంది ప్రార్థిస్తున్నారు. అలాంటి సమయంలో భార్యతో కలిసుండే ప్రసక్తే లేదని హింటిస్తూ ఇలా త్రిషతో పెళ్లికి వెళ్లడం అందర్నీ షాక్‌కు గురి చేసింది.అవతలివారి బాధను లెక్కచేయరా?ఈ వ్యవహారంపై విజయ్ అభిమాని, నటి సనం శెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్, త్రిష పెళ్లికి హాజరైన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను ఇసుమంతైనా పట్టించుకోకపోవడం విచారకరం. ఎంతోకాలంగా అభిమానిస్తున్న మాలాంటివాళ్లను మీరు తీవ్రంగా నిరాశపర్చారు అని రాసుకొచ్చింది. ఆమె కామెంట్స్‌ను కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం విమర్శించారు.ఎవరీ సనం శెట్టి?కాగా సనం శెట్టి విజయ్‌కు వీరాభిమాని. కరూర్ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా విజయ్ తప్పు లేదని బాధితులే చెప్పారంటూ అతడిని వెనకేసుకొచ్చింది. కానీ, ఈసారి మాత్రం భార్య బాధను పట్టించుకోకుండా ఇలా ప్రేయసితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం సభ్యత కాదని చురకలంటించింది. సనం శెట్టి.. తమిళ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పార్టిసిపేట్ చేసింది. తెలుగులో శ్రీమంతుడు, ప్రేమికుడు, సింగం 123 చిత్రాల్లో యాక్ట్ చేసింది.చదవండి: అప్పుడు భార్యను కొట్టి.. ఇప్పుడు అందరి ముందు క్షమాపణలు చెప్పిన మాస్క్ మ్యాన్ -
డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ కొత్తిల్లు కొనుగోలు చేశారు. తమిళనాడు చెన్నైలోని పోయిస్ గార్డెన్లో డూప్లెక్స్ అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు. దీని ధర దాదాపు రూ.31.5 కోట్లు అని తెలుస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ ఉన్న ఏరియాలోనే నయన్ జంట ఈ ఇల్లు కొనడం విశేషం. డూప్లెక్స్ అపార్ట్మెంట్ తేనాంపేటలోని లెగసీ ప్రాజెక్ట్‌లో నాలుగు, ఐదవ అంతస్తుల్లో ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ ఉంది. ఇది 14,369 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాను కలిగి ఉంది. దీని ధర చదరపు అడుగుకు రూ.21,946గా ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌కు 8 కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించారు. కాగా లేడీ సూపస్టార్ నయనతారకు కేరళలో పూర్వీకుల ఇల్లు ఉంది. సినిమాహైదరాబాద్లోని బంజారాహిల్స్‌లో రెండు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చెన్నై, కేరళలోని ఇతర ప్రాంతాల్లోనూ తనకు ప్రాపర్టీలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే నయనతార చివరగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో అలరించింది. ప్రస్తుతం టాక్సిక్ సహా నాలుగైదు మూవీస్ చేస్తోంది.చదవండి: హీరోయిన్ను అవమానించిన యామీ గౌతమ్? -
రీల్స్ పేరుతో ఇలాంటి ఫోటోలా.. రుక్మిణి వసంత్ ఫైర్
రుక్మిణి వసంత్‌కు కోపమొచ్చింది. చూడటానికి సాఫ్ట్‌గా ఉన్నా ఈ బ్యూటీలో కట్టలు తెంచుకునే ఆవేశం కూడా ఉందన్నది తేటతెల్లమైంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు పరిశ్రమను కన్నడ బ్యూటీ ఆకట్టుకుంది. ప్రస్తుతం టాప్ హీరోల సరసన వరస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్తుంది. ఇటీవల విడుదలైన ‘కాంతార-చాప్టర్ 1’ లోనూ యువరాణి పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నాయకిగా నటిస్తున్న ఈమె రాంగ్ యాంగిల్ ఫొటోలను తీసే ఫొటోగ్రాఫర్లపై ధ్వజం ఎత్తారు. సాధారణంగా షూటింగ్స్‌లోనే, ఇతర కార్యక్రమాలలోనో సెలబ్రిటీలు కనిపిస్తే ఫొటోగ్రాఫర్లు తన చేతి నైపుణ్యానికి పని చెబుతుంటారు. ఇక సినీ కథానాయికలను అయితే వివిధ భంగిమల్లో ఫొటోలు తీయడానికి తెగ ఉత్సాహపడతారు. కొందరైతే సొగసులను చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వైరల్ చేస్తుంటారు. ఇలాంటి చర్యలు తప్పుకాదు. అయితే హీరోయిన్లను రాంగ్ యాంగిల్లో ఫొటోలు తీసి రీల్స్ పేరుతో అన్ పాపులర్ చేసే ప్రైవేట్ ఫొటోగ్రాఫర్లతోనే సమస్య. ఇలాంటి విషయాలపైనే నటి రుక్మిణి వసంత్ మండిపడ్డారు. దీని గురించి ఆమె తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ నటీమణులను కించపరిచే విధంగా ప్రవర్తించే ఫొటోగ్రాఫర్ల చర్యలు ఖండించదగ్గవి అన్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవడానికి తాము ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. తాను వృత్తిలో భాగంగా నటించడానికి వేస్తున్నామని, అదే విధంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. అలాంటి సమయాల్లో తమను రాంగ్ యాంగిల్ చిత్రీకరించే కొందరు ప్రైవేటు ఫొటోగ్రాఫర్ల చర్యలను తీవ్రంగా ఖండిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నటీమణులను కించపరిచే వారిపై చర్యలకూ వెనుకాడబోమని నటి రుక్మిణి వసంత్ అన్నారు. -
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష.. వీడియో వైరల్
కోలీవుడ్ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్, త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు తాజాగా హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో వారిద్దరూ సరదాగ పలకరించుకున్నారు. వీరిద్దరి గురించి కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముందుగా త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని, తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కొద్దిరోజల గ్యాప్‌లోనే విజయ్ సతీమణి సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉన్నారని అందుకే విడాకులు కావాలంటూ పేర్కొంది. అయితే, ఈ కథలో త్రిష పేరు ప్రధానంగా వైరల్ అయింది. ఇప్పుడు విజయ్, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక పెళ్లికి వెళ్లడంతో వీడియో వైరల్ అవుతుంది.#Thalapathy @TVKVijayHQ President #Vijay and #Trisha attend #KalpathiSSuresh - #MeenakshiSuresh 's son wedding reception @actorvijay @trishtrashers pic.twitter.com/iQOQet9Z0A— Nikil Murukan (@onlynikil) March 5, 2026 -
విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నటుడు విజయ్ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఎడాపెడా చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్లో శింబు హీరోగా నటిస్తున్న అరసన్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్న ఈయన తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.బాలీవుడ్ బ్యూటీవిడాముయుర్చి ఫేమ్ మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించనున్నట్లు భోగట్టా! ఇకపోతే ఇందులో విజయ్ సేతుపతికి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్‌కుగానీ ఆమె ఒప్పుకుంటే కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో షురూ అయినట్లే! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
ఓజీ హీరోయిన్ ఓటీటీ మూవీ.. ఎమోషనల్‌గా ట్రైలర్
మొబైల్ ఫోన్ వినియోగం పెరిగాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. అలాగే ఓటీటీలు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ అంతా ఎంచక్కా ఉన్నచోటునే చూసే అవకాశం లభించింది. అలా చాలామంది కొరియన్ సినిమాలు, సిరీస్‌లకు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా కొందరమ్మాయిలైతే బానిసలైపోయారు!ఓటీటీ సినిమాదీంతో ఈ కొరియన్ కాన్సెప్ట్‌తో ఓ మూవీ తీశారు. ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ వదిలారు. అందులో ఓ అమ్మాయికి చిన్నప్పటినుంచి కొరియా అంటే చాలా ఇష్టం. కనీసం ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలన్నది తన కోరిక. అనుకున్నట్లుగా పెద్దయ్యాక ఎలాగోలా కొరియా వెళ్తుంది. కానీ అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అదే ట్రైలర్లో చూపించారు.మనసు చెప్పేది వినండిమనకు నచ్చిన పనిచేయడం కోసం ఎంతదూరమైనా వెళ్లొచ్చు. నీవల్ల కాదు అంటారు. తెలియనివారు మనపై ప్రేమ చూపిస్తారు.. బాగా తెలిసినవారు మనల్ని బాధపెడతారు. ఎంత ఏడ్చినా, ఎంత నవ్వినా.. మనల్ని చీరప్ చేసి మేమున్నామంటూ మనకోసం నలుగురు వస్తారు. ఈ అనుభవాల్ని మీకు ఎదురవ్వాలంటే మీ మనసు చెప్పేది వినండి అని హీరోయిన్ చెప్పే డైలాగ్ బాగుంది. మేడ్ ఇన్ కొరియా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 12న విడుదల కానుంది. చదవండి: ఆస్తుల్లేవ్.. అద్దె ఇంట్లో ఉంటున్నా: వరలక్ష్మి -
8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే
హీరోయిన్ స్నేహ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో హోమ్లీ పాత్రలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దక్షిణాదిలోని ఇతర భాషల్లోనూ చాలానే మూవీస్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. తనకు గతంలో పెద్ద ప్రమాదం జరిగిందని, 8 నెలల పాటు మంచానికే పరిమితమయ్యాయని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఓ దర్శకుడి వల్లే మళ్లీ ఇలా ఇప్పుడు మీ ముందున్నానని చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో మాట్లాడుతూ ఈ విషయాల్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'కెరీర్ పీక్ స్టేజీలో వరస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు ఓ ఘోర ప్రమాదం జరిగింది. అందులో నా చేతులు, కాళ్లు, వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కనీసం నిలబడటానికి కూడా ఎనిమిది నెలలు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో నరకం అనుభవించాను. కెరీర్ అక్కడితో ముగిసిపోయిందని అనుకున్నాను. ఆ టైంలో దర్శకుడు కరు పళనియప్పన్ 'పార్థిబన్ కనవు' స్టోరీతో నా దగ్గరకు వచ్చారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిసినా సరే నాపై నమ్మకం ఉంచి ఛాన్స్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం. ఆయన ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే మళ్లీ కెమెరా ముందుకు వచ్చనాను. ఆ దశ చాలా కష్టమైనది. కానీ అదే నన్ను మరింత బలంగా మార్చింది' అని స్నేహ ఎమోషనల్ అయింది.తెలుగు కుటుంబానికే చెందిన స్నేహ అసలు పేరు సుహాసిని. ముంబైలో పుట్టి, షార్జాలో పెరిగింది. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈమెని చూసిన ఓ మలయాళ నిర్మాత.. హీరోయిన్గా అవకాశమిచ్చాడు. అలా 2000లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. 'ప్రియమైన నీకు' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రాధాగోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు, మధుమాసంతో పాటు చాలానే మూవీస్ చేసింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నని పెళ్లి చేసుకుంది. అనంతరం సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసింది. రీసెంట్ టైంలో అయితే దళపతి విజయ్ 'గోట్'లో కనిపించింది.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ) -
నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం
టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ రాజా తండ్రి జి. రామరాజు(85) అనారోగ్యంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు తెలుపుతున్న ప్రకారం ఆయన కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. వృద్ధాప్యం కారణంగా చికిత్స కూడా ఆయన శరీరం సహకరించకపోవడంతో హైదరాబాద్ మధురానగర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రామరాజు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత శివాజీకి ఫోన్ కాల్ ద్వారా తన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు మాట్లాడి ధైర్యం చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో నటి.. కారు టైర్ పంక్చర్ కావడంతో..
తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదంలో బుల్లితెర నటి దేవి ప్రియ(38) ప్రమాదానికి గురయ్యారు. ఆమె కేవలం సీరియల్స్లలో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నై నుంచి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు థేని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెరంబలూర్ వద్ద తన కారు టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ ముత్తుగణేశ్(38) రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తున్న క్రమంలో అటువైపు వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అదుపుతప్పి దేవిప్రియ కారును బలంగా ఢీకొంది. దీంతో కారు డ్రైవర్ ముత్తుగణేశ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే, కారుకు కొద్ది దూరంలో నిలబడి ఉన్న దేవిప్రియ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ, ఆమె సహాయకుడు దివాకర్ (36) తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే స్థానికులు పెరంబలూర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
తండ్రిగా ప్రమోషన్ పొందిన 'పార్కింగ్' హీరో
తమిళ హీరో, పార్కింగ్ ఫేమ్ హరీశ్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించాడు. తనకు కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. నాకు, నర్మదకు ఈరోజు (మార్చి 2న) పాప పుట్టింది. ఆనందంగా ఉందితల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమఃశివాయ అంటూ ఓ లేఖ షేర్ చేశాడు. కాగా హరీశ్ కల్యాణ్- నర్మద ఉదయకుమార్ 2022 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.సినిమా2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్, ప్యార్ ప్రేమ కాదల్, లెట్స్ గెట్ మ్యారీడ్, పార్కింగ్, లబ్బర్ పండు, డీజిల్ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్ తొలినాళ్లలో తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న హరీశ్ కల్యాణ్ నూరు కోడి వానవిల్ మూవీ చేస్తున్నాడు. Elated to share the most wonderful news with all my dear family ❤️🤗God willing 🙏 pic.twitter.com/11Icq8OMMz— Harish Kalyan (@iamharishkalyan) March 2, 2026 చదవండి: పెళ్లికి ముందు సహజీవనం.. నాకు అవకాశం ఇచ్చుంటే..: లయ -
దుబాయ్‌లో మెగా డాటర్ శ్రీజ.. సోషల్‌మీడియాలో పోస్ట్
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడంతో పశ్చిమాసియాలోని పలు దేశాలు ఉన్న భారతీయులు ఆందోళనలో ఉన్నారు. అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్నందున చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ క్రమంలో దుబాయ్‌లో ఉన్న చిరంజీవి కూతురు శ్రీజ తాజాగా ఒక పోస్ట్ చేశారు.దుబాయ్‌లో తాను పిల్లలతో క్షేమంగా ఉన్నానంటూ శ్రీజ పోస్ట్ చేసింది. అక్కడి పరిస్థితిని తెలుసుకొని చాలామంది ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ తమ క్షేమం కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చాలామంది తమ పట్ల ప్రేమను చూపించడం ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. దుబాయ్‌లో ప్రస్తుతం శాంతియుతంగానే ఉందన్నారు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ఫోటోని షేర్ చేస్తూ.. మేము ఈ దేశాన్ని ఎంచుకున్నాము. కాబట్టి, ఈ దేశానికే కట్టుబడి ఉంటాం అని ఆమె పోస్ట్ చేశారు. శ్రీజ ఈ పోస్ట్ చేయడంతో ఆమె తన తన పిల్లలతో కలిసి దుబాయ్‌లో స్థిరపడినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
చదువుకోకపోవడం వల్లే ఈ దుస్థితి! స్పందించిన కమెడియన్
చెక్ బౌన్స్ కేసు కారణంగా కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ పేరు కొంతకాలంగా వార్తల్లో నానుతూ వస్తోంది. ఇటీవలే తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అందులో వ్లాగ్స్, కామెడీ, మినీ సిరీస్.. ఇలా ఏదో ఒకటి చేస్తూ అందరికీ వినోదాన్ని పంచుతానన్నాడు. విద్య కారణం కాదుఇకపోతే అతడికి చదువు రాకపోవడం వల్లే ఇలా కేసులో చికుక్కున్నాడని మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. అతడు మంచివాడే కానీ, పెద్దగా చదువుకోకపోవడం వల్లే ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సానుభూతి చూపించాడు. ఈ వ్యాఖ్యలపై రాజ్‌పాల్ యాదవ్ తాజాగా స్పందించాడు. తనకు చదువు రాదని ఎవరు చెప్పారని ప్రశ్నించాడు. కొన్ని సమస్యలకు చదువు సంద్య కారణం కాదు. నేను చదువుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందనడం కరెక్ట్ కాదు.కొన్నిసార్లు తప్పవునేను బాగానే చదువుకున్నాను. ఇప్పుడు నాకు 55 ఏళ్లు. 11 ఏళ్ల వయసులోనే పని చేయడం మొదలుపెట్టాను. నేను చదువురాని వాడినైతే ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా కొనసాగేవాడినే కాదు. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఒకానొక సందర్భంలో సమస్యల్లో చిక్కుకుంటారు. దానికి చదువుతో సంబంధమే లేదు అని చెప్పాడు. అదే సమయంలో ప్రియదర్శన్ అలా అన్నందుకు తనపై ఎటువంటి కోపం లేదన్నాడు. నీ కొడుకులాంటివాడినిఇంకా మాట్లాడుతూ.. నా జీవితంలో ముగ్గురు దర్శకులకు ప్రత్యేక స్థానం. రామ్ గోపాల్ వర్మ, డేవిడ్ ధావన్, ప్రియదర్శన్.. వీరిపై నాకు అపారమైన గౌరవం. కేవలం ఈ ముగ్గురి డైరెక్షన్లోనే దాదాపు 50 సినిమాలు చేసుంటాను. ప్రియదర్శన్కైతే నేనొక కొడుకులాంటివాడిని. కాకపోతే ఆయనకు పూర్తి విషయం తెలీదు.సినిమాకాబట్టి ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదు అని వివరణ ఇచ్చాడు. ఇకపోతే రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం భూత్ బంగ్లా సినిమా చేస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజ్‌పాల్ యాదవ్.. వెల్కమ్ టు ద జంగిల్, హైవాన్, మరో రెండు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు.చదవండి: వారణాసి అప్డేట్ ఇచ్చిన ప్రియాంక -
ఫ్యామిలీ మ్యాన్‌గా సూర్య.. టైటిల్ ఏంటో తెలుసా?
సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో ఇతర భాషా హీరోలకు ఘన విజయాలను అందించాడు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పుడు ఈయన కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం (మార్చి 2న) రిలీజ్ చేశారు. సూర్య కెరీర్లో 46వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు విశ్వనాథ్ అండ్ సన్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాపోస్టర్లో కళ్లజోడు ధరించిన హీరో సూర్య చిన్న బాబును ఎత్తుకుని స్టైలిస్ట్‌గా కనిపిస్తున్నాడు. ఇది మనసును తాకే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని మూవీ టీం ప్రకటించింది. జూలైలో సినిమా రిలీజ్ చేస్తామని పేర్కొంది. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.సినిమామరోవైపు సూర్య చేతిలో ఇంకో రెండు సినిమాలున్నాయి. ఒకటి.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న కరుప్పు మూవీ.. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో త్రిష కథానాయిక. మరోటి.. మలయాళ డైరెక్టర్ జిత్తు మాధవన్ డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు. ఇందులో సూర్య పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇందులో నజ్రియా హీరోయిన్గా కనిపించనుంది. Power in his presence. 🔥Warmth in his embrace.🤍Bringing back the vintage magic of @Suriya_offl in a heart-touching family spectacle. 🤩#VishwanathAndSons ~ The biggest family drama of the year arrives this July. 🫶🏻#VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena… pic.twitter.com/frvwNwuU8f— Sithara Entertainments (@SitharaEnts) March 2, 2026 చదవండి: అల్లు ఫ్యామిలీలో నయనిక సిస్టర్స్.. ఫోటో వైరల్ -
హీరో విజయ్ను అన్‌ఫాలో కొట్టిన కుమారుడు!
తమిళ స్టార్ హీరో విజయ్ నుంచి విడాకులకు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించింది. ఓ నటితో విజయ్‌కు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే విడిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిసిందే! దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.విజయ్ను అన్‌ఫాలో కొట్టిన జేసన్ఇదే సమయంలో నెటిజన్లు ఓ విషయాన్ని గుర్తించారు. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్.. తన తండ్రిని దూరం పెట్టినట్లు గమనించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దళపతిని అన్‌ఫాలో కొట్టాడంటున్నారు. అయితే జేసన్.. తన తల్లి విడాకులకు దరఖాస్తు చేశాకే తండ్రిని అన్‌ఫాలో చేశాడని కొందరు అంటుంటే.. అంతకుముందు నుంచే అతడు తండ్రిని ఫాలో అవట్లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.పెళ్లి - విడాకులుఏదేమైనా జేసన్.. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా విజయ్- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ జరగనుంది. ఆరోజు విజయ్ న్యాయస్థానం ఎదుట హాజరు కానున్నాడు.చదవండి: ఓటీటీలో విత్ లవ్.. రిలీజ్ ఎప్పుడంటే? -
ఓటీటీలో హిట్ సినిమా.. విత్ లవ్ రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకుడిగా, హీరోగా తొలి సినిమాలకే హిట్టు కొట్టి సెన్సేషన్ అయ్యాడు అభిషన్ జీవింత్. ఇతడు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం ఏకంగా రూ.90 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. నెక్స్ట్ సినిమా ఎవరితో అనుకుంటున్న తరుణంలో ఈ యంగ్ డైరెక్టర్ హీరోగా మారాడు. విత్ లవ్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు.ఓటీటీలో విత్ లవ్అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించాడు. సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా వ్యవహరించింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా విత్ లవ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తుంది. మార్చి 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి మరి.కథేంటంటే?సత్య (అభిషన్ జీవింత్) ఆర్కిటెక్ట్.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అలా ఒకరోజు అక్క బలవంతంతో కాఫీ షాప్‌లో ఓ అమ్మాయిని చూసేందుకు వెళ్తాడు. ఆ అమ్మాయే మోనీషా (అనస్వర రాజన్). మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్లో చదివామని, ఇద్దరూ సీనియర్- జూనియర్ అని తెలుస్తుంది. తమ చిన్నతనంలో ఎవర్నైతే ప్రేమించారో వారిని ఒకసారి కలవాలనుకుంటారు. మరి తర్వాతేం జరిగింది? వాళ్లని కలిశారా? ఈ పెళ్లి చూపులు ఏమయ్యాయి? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే! #WithLove will be streaming from March 6 on NETFLIX. pic.twitter.com/IoSzc2TXwW— Christopher Kanagaraj (@Chrissuccess) March 1, 2026 చదవండి: దుబాయ్‌లో చిక్కుకున్నా.. నన్ను భారత్‌కు తీసుకురండి: బాలీవుడ్ నటి -
ఆ హీరోయిన్ బయోపిక్‌లో నటించాలనుంది!
వివిధ భాషల్లో హీరోయిన్గా రాణిస్తోంది ప్రియాంక మోహన్. ఒంద్ కథే హెల్లా అనే కన్నడ చిత్రంతో కథానాయికగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిందీ బ్యూటీ. అదే ఏడాది నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగువారికీ పరిచయమైంది. ఆ వెంటనే డాక్టర్ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇలా తక్కువ కాలంలోనే మూడు భాషల్లో నటించే అవకాశాలను అందుకుని పక్కింటి అమ్మాయి ఇమేజ్ సొంతం చేసుకుంది.సినిమాఅయితే ఈ బ్యూటీకి 2025 పెద్దగా కలిసి రాలేదు, సరైన హిట్ పడలేదు. అంతే కాకుండా ఇప్పుడు తన చేతిలో భారీ ప్రాజెక్టులు కూడా ఏమీ లేవు. ప్రస్తుతం తమిళంలో నటుడు కెవిన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. కన్నడలో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ అనే చిత్రంలో యాక్ట్ చేస్తోంది. మరోవైపు ఈమె ప్రధాన పాత్రలో నటించిన మేడిన్ కొరియా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.ఆమె బయోపిక్‌లో నటించాలనుందిఇకపోతే ప్రతి నటికి ఏదో ఒక బయోపిక్‌లో నటించాలనే కోరిక ఉంటుంది. అలాంటి కోరిక మీకు ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు ప్రియాంక ఇలా స్పందించింది. దివంగత నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. కన్నడ నటి సౌందర్య.. మాతృభాషలో కన్నా తెలుగు, తమిళం భాషల్లోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ అందుకుంది. స్టార్ హీరోలందరితోనూ జోడీ కట్టింది. తక్కువకాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. అంతే తక్కువ కాలంలో విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైంది. మరి సౌందర్య బయోపిక్ తెరకెక్కిస్తారా? ఒకవేళ తీస్తే ప్రియాంకను హీరోయిన్గా తీసుకుంటారా? చూడాలి! -
తెలుగు పరిశ్రమపై తాప్సీ ప్రశంసలు
హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధానపాత్రలో నటించిన అస్సీ మూవీ తాజాగా విడుదలైంది. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తెలుగులో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ కొంత కాలంగా టాలీవుడ్ పరిశ్రమ పట్ల చేస్తున్న విమర్శలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. సౌత్ఇండస్ట్రీలో హీరోయిన్లు మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించాలని ఇక్కడి ఫిల్మ్‌మేకర్స్ తనపై ఒత్తిడి తెచ్చేవారని ఆరోపించింది. అయితే, ఆమె ఇప్పుడు యూటర్న్ తీసుకొని తెలుగు పరిశ్రమపై ప్రశంసలు కురింపించింది.తెలుగు, తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన తాప్సీ.. 'చష్మే బద్దూర్' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పింక్, థప్పడ్ వంటి సినిమాలతో తనకంటూ స్టార్ ఇమేజ్‌ని అక్కడ క్రియేట్ చేసుకుంది. తాజాగా బాలీవుడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు పరిశ్రమపై మక్కువను చాటుకుంది. తెలుగు సినిమాలో నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే పాత్రలు ఉంటాయని ఆమె గుర్తు చేసుకుంది. అయితే, తెలుగులో మాదిరి తమిళ పరిశ్రమలో అలాంటివి తక్కువగా కనిపిస్తాయని ఆమె పేర్కొంది. టాలీవుడ్ నుంచి తనకు మంచి పాత్రలే దక్కడంతో తెలుగు వారు తనను బాగా అభిమానిస్తారని చెప్పింది. తన విలువను పెంచిన సినిమాలన్నీ కూడా తెలుగు నుంచే ఉన్నాయని తెలిపింది. తన కెరీర్‌కు టాలీవుడ్ పరిశ్రమ ఎంతగానో ఉపయోగపడిందని తాప్సీ గుర్తు చేసుకుంది. ఝుమ్మంది నాదం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 2022లో చివరిగా ‘మిషన్ ఇంపాజిబుల్’లో మెరిసింది. -
తెలుగమ్మాయికి కోలీవుడ్ నుంచి పిలుపు!
వైష్ణవి చైతన్య.. యూట్యూబ్ దగ్గర మొదలైన ఆమె జర్నీ ఇప్పుడు సినిమా వరకు చేరింది. మొదట్లో అల వైకుంఠపురములో, రంగ్‌దే, టక్ జగదీశ్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. ఆనంద్ దేవరకొండ 'బేబీ' సినిమాతో హీరోయిన్గా మారి ఫస్ట్ మూవీకే మంచి మార్కులు కొట్టేసింది. ఈ ఒక్క సినిమాతోనే విశేషమైన గుర్తింపు, ప్రేమ, అవార్డులు అందుకుంది. కోలీవుడ్ ఎంట్రీప్రస్తుతం ఎపిక్: ద సెమిస్టర్ మూవీ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఓ వార్త వైరల్‌గా మారింది. జీవీ ప్రకాశ్ హీరోగా విఘ్నేశ్ కార్తీక్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ఇప్పటికే 'హాట్‌స్పాట్ టూ మచ్'తో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఈసారి ఏం ప్లాన్ చేయబోతున్నాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాఈ క్రమంలో అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో జీవీ ప్రకాశ్ హీరోగా, తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి అజిత్ హీరోగా నటించిన వాలిమై అనే తమిళ మూవీలో వైష్ణవి చైతన్య చిన్న రోల్ చేసింది. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమైతే మాత్రం కోలీవుడ్‌లో కథానాయికగా ఇదే తన తొలి సినిమా కానుంది.చదవండి: పెళ్లి వేడుకలో వరుణ్- లావణ్య.. ఎక్కడంటే? -
నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య
తమిళనాడులో దారుణం జరిగింది. ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణ(73) హత్యకు గురయ్యారు. ఈ విషయం ఇప్పుడు కలకలం సృష్టించింది. కొందరు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అలానే మృతుడి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరం లాంటి విలువైన వస్తువులు తీసుకుని పరారయ్యారు.సూర్యనారాయణ.. కొడైక్కెనాల్ సమీపంలోని కురించి ఆండవర్ కోయిల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈయనకు అక్కడే ఓ పెద్ద బంగ్లా కూడా ఉంది. అందులో ఆరుముగం, మురళి అనే ఇద్దరు పనివాళ్లు కూడా ఉన్నారు. రెండురోజుల క్రితం విహారయాత్ర కోసం అని వచ్చిన ఐదుగురు వ్యక్తులు.. దగ్గరలో బసకు దిగారు. శనివారం రాత్రి, బంగ్లా దగ్గరకు వచ్చిన వ్యక్తులు.. పనిమనుషులని చితకబాదారు. తర్వాత సూర్యనారాయణ ముఖానికి టేప్ చుట్టి దారుణంగా హింసించారు. ఈ క్రమంలోనే ఆయన ఊపిరాడక చనిపోయారు.సూర్యనారాయణని హత్య చేసిన అనంతరం ఆయన మెడలోని బంగారు గొలుసు, ఉంగరంతో పాటు సీసీటీవీల హార్ట్ డిస్క్‌లు తీసుకుని పరారయ్యారు. కాగా సూర్య 'మాయావి' సినిమాలో సహాయ నటిగా చేసిన విష్ణుప్రియ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. 2018లో ఈమెని ప్రేమించిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు సూర్యనారాయణ హత్యకు.. అప్పటి హత్యకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చిరంజీవికి సన్మానం.. గ్రాండ్ పార్టీలో సెలబ్రిటీలు
మెగాస్టార్ చిరంజీవి- దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం మన శంకరవరప్రసాద్‌గారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఘన విజయాన్ని అందుకున్న చిరంజీవి, చిత్ర యూనిట్‌ను కాకినాడ పోర్ట్ ఛైర్మన్ కె.వి.రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పార్టీలో చిత్ర నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటితోపాటు, దర్శకుడు అనిల్ రావిపూడి, కె.రాఘవేంద్రరావు, సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, డి.సురేష్‌బాబు, ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, వి.వి.వినాయక్, బాబీ, బుచ్చిబాబు సానా పాల్గొన్నారు. ఈ ఫోటోలను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయడు తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. Blockbuster celebrations continue for #MSG ✨Megastar #Chiranjeevi garu was felicitated at an exclusive gathering hosted by Shri K.V Rao, attended by eminent personalities including K. Raghavendra Rao, Ashwini Dutt, Anil Ravipudi, Bobby Kolli and several distinguished guests. pic.twitter.com/TP4gfApmg3— Ravanam Swami naidu (@swaminaidu_r) February 22, 2026 -
పిల్లలు నా మూవీ ఒక్కటి కూడా చూడలేదు: షాలిని
చిన్న వయసులోనే కెమెరా ముందు నటించడం మొదలుపెట్టింది షాలిని. బాలనటిగా 50కి పైగా సినిమాలు చేసింది. వాటిలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలున్నాయి. తెలుగులో బెజవాడ బెబ్బులి, జైలు పక్షి, శారదాంబ, చిన్నారి దేవత, బ్రహ్మ పుత్రుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి.. ఇలా పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది.బాలనటిగా, హీరోయిన్గా..1997లో అనియతిప్రావు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా మారింది. మలయాళంతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో కథానాయికగా మెప్పించింది. తమిళ స్టార్ హీరో అజిత్‌ను పెళ్లాడాక సినిమాలకు స్వస్తి చెప్పింది. ఇద్దరు పిల్లలు పుట్టాక వారిని చూసుకోవడంలోనే బిజీ అయిపోయింది. అయితే పిల్లలిద్దరూ ఇంతవరకు తన సినిమాలేవీ చూడలేదంటోంది షాలిని. ఒక్క సినిమా చూడలేదుతాజాగా ఓ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా పిల్లలు ఇంతవరకు నేను నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదు. ఎప్పుడైనా చూద్దామని ప్లాన్ చేసుకుంటారు. తీరా సమయం దగ్గరపడ్డాక తర్వాత చూద్దాం అని వాయిదా వస్తుంటారు. అయితే నేను యాక్ట్ చేసిన సాంగ్స్ మాత్రం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు. కానీ ఒక్క మూవీ కూడా పూర్తిగా చూడలేదు. ఇప్పటికైనా ఒక్క సినిమా అయినా చూడండ్రా.. అని స్టేజీపైనే పిల్లలను అభ్యర్థించింది షాలిని. View this post on Instagram A post shared by Reji babu Suresh babu (@rejibabusuresh) చదవండి: కుర్రాడైనా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న హీరోయిన్స్ -
కోలీవుడ్ కు షాక్ ఇచ్చిన విక్రమ్
-
అజిత్, విజయ్ మధ్య శత్రుత్వం? ఎలా ఉంటారో చెప్పిన షాలిని
కోలీవుడ్ స్టార్స్ అజిత్, విజయ్ మధ్య పోటీ సంగతేమో కానీ, వారి అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఎప్పుడూ మా హీరో గొప్ప, మా హీరో తోపు అని వాదులాడుకుంటూనే ఉంటారు. ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజైతే మాత్రం బాక్సాఫీస్ వద్ద రణరంగం లాంటి పరిస్థితే కనిపిస్తుంది.షాలిని ఆసక్తికర వ్యాఖ్యలుహీరోల మధ్య కూడా ఈ శత్రుత్వం ఉందని చాలామంది భావిస్తుంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదంటోంది అజిత్ సతీమణి, నటి షాలిని. తాజాగా చెన్నైలో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్లో షాలిని మాట్లాడుతూ.. అజిత్, విజయ్.. ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఒకరి సక్సెస్‌ను చూసి మరొకరు అభినందిస్తుంటారు. ఒకరిపై మరొకరికి సానుకూల అభిప్రాయం ఉంది అని పేర్కొంది. అప్పుడు కూడా వివాదంఇది విన్న అభిమానులు ఇద్దరు హీరోలు మనసున్న మనుషులే అని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది అజిత్‌ను కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది. అప్పుడు విజయ్ అజిత్‌కు కంగ్రాచ్యులేషన్స్ చెప్పలేదని వివాదం చెలరేగింది. దీంతో అతడి టీమ్ స్పందిస్తూ.. . అజిత్ సర్‌కు మొదటి కృతజ్ఞతలు చెప్పినవారిలో విజయ్ ఒకరు. సినిమాఇద్దరూ స్నేహపూర్వకంగా మెదులుతారు. అజిత్ సర్‌కు విజయ్ విషెస్ చెప్పలేదనడంలో ఎటువంటి నిజం లేదు అని వివరణ ఇచ్చింది. కాగా విజయ్ చివరగా నటించిన సినిమా జన నాయగణ్. జనవరిలో విడుదలవాల్సిన ఈ మూవీ సెన్సార్ కారణంగా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అజిత్.. ప్రస్తుతం కార్ రేసింగ్ పోటీల్లో బిజీగా ఉన్నాడు.చదవండి: తిరుమల గుడిలో అలాంటి అనుభవం.. శివానీ కామెంట్స్‌పై వివాదం -
మీవల్లే ఈ వేదన.. కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు: మీనా
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది మీనా. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, చిరంజీవి, వెంకటేశ్, మోహన్‌లాల్, మమ్ముట్టి.. ఇలా అందరు హీరోలతోనూ యాక్ట్ చేసింది. కొన్నేళ్ల క్రితం మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో ఆమె కొంతకాలంపాటు తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.రెండో పెళ్లంటూ ప్రచారంతీరని మనోవేదనతో ఆమె నరకం అనుభవిస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం మీనాకు రెండో పెళ్లి అంటూ అసత్య ప్రచారం ఊపందుకుంది. దయచేసి ఇటువంటి రూమర్స్ వ్యాప్తి చేయకండి అని మీనా కోరడంతో కొంతకాలం ఆ గాసిప్స్ పత్తా లేకుండా పోయాయి. కానీ తర్వాత మళ్లీ అదే తంతు. ఏదో ఒక హీరోతో మీనాకు లింక్ పెట్టడం, త్వరలోనే రెండో పెళ్లంటూ ప్రచారానికి తెర తీయడం సర్వసాధారణమైపోయింది.ఒంటరి ఆడదాన్ని అనేకదా!ఈ వ్యవహారంపై మీనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నాకు రెండో పెళ్లి అని చెత్తంతా రాస్తున్నారు. అందులో నిజం ఉంటే మీరు మాట్లాడుకోవడంలో తప్పు లేదు. కానీ మీకు మీరే ఏదో ఊహించుకుని, కల్పించుకుని రాయడం ముమ్మాటికీ తప్పే! నేనొక ఒంటరి మహిళను, అందులోనూ సెలబ్రిటీని అనే కదా మీకు నచ్చినట్లు రూమర్స్ సృష్టిస్తున్నారు. నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. పైగా నాకు ఓ కూతురుంది. మంచివాటిపై ఫోకస్ చేస్తా..తను ఇవన్నీ చూస్తే ఏమనుకుంటుంది? ఇదంతా నాకెంతో అసౌకర్యంగా ఉంది, చాలా చిరాకు తెప్పిస్తోంది. దీన్ని భరించడం నావల్ల కావడం లేదు. కానీ కర్మ అనేది ఒకటుంది. అదెవర్నీ వదిలిపెట్టదు. ఈ అనవసర ప్రచారంపై స్పందించి నా సమయం, ఎనర్జీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోదల్చుకోలేదు. నేను చాలా పాజిటివ్ వ్యక్తిని. ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్‌గా ఉండటానికే ప్రయత్నిస్తాను. మంచివిషయాలపైనే ఫోకస్ చేస్తాను అని మీనా చెప్పుకొచ్చింది.చదవండి: అమ్మ ఉగ్రరూపం.. గొంతు పట్టుకుని చెంప చెళ్లుమనిపించింది: ప్రియాంక -
'అర్ధరాత్రి 2 గంటలకు అతనికే కాల్ చేస్తా'.. అనుపమ షాకింగ్ ఆన్సర్
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గతేడాది వరుస సినిమాలతో అలరించింది. బైసన్, పరదా, కిష్కింధపురి చిత్రాలతో అభిమానులను మెప్పించింది. అయితే ప్రస్తుతం ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. దర్శకుడు ఆర్జే షాన్ కాంబినేషన్లో మరోసారి కనిపించనుంది.అయితే ఇటీవల ముంబయిలో ఓ అవార్డ్ వేడుకలో పాల్గొన్న అనుపమ అందరి దృష్టిని ఆకర్షించింది. బైసన్ కో స్టార్ ధృవ్ విక్రమ్‌తో కలిసి సందడి చేసింది. ఈ వేదికపై అనుపమకు హ్యాపీ బర్త్ డే అంటూ ధృవ్ విక్రమ్ విషెస్ తెలిపాడు. ఆ తర్వాత యాంకర్ అనుపమకు ఓ ప్రశ్న వేసింది. ఇండస్ట్రీలో అర్ధరాత్రి రెండు గంటలకు కాల్ చేయాలంటే ఎవరికీ చేస్తావ్ అని ప్రశ్నించింది. దీనికి అనుపమ ఆసక్తికర సమాధానమిచ్చింది. నేను ధృవ్‌కు కాల్ చేస్తానని నవ్వుతూ ఆన్సరిచ్చింది.ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన మరో అవార్డుల ఫంక్షన్లోనూ అనుమపతో ఉన్న సెల్ఫీని ధృవ్ విక్రమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి డేటింగ్ రూమర్స్ మరింత బలంగా వినిపిస్తున్నాయి. అయితే తమపై వస్తున్న రూమర్స్‌పై ఎవరూ కూడా స్పందించలేదు. Dhruv and anupama something something 🤭🫣 pic.twitter.com/vFvE5hM7qm— 𝓓𝓸𝓵𝓵𝔂 🤍 (@dollybiblio) February 18, 2026 -
హీరోయిన్ నిత్యా మేనన్ మరో ముందడుగు
హీరోయిన్ నిత్యా మేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే నాని, నితిన్ తదితర హీరోలతో పలు సినిమాలు చేసింది. హిట్స్ కొట్టింది. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్లో నటించిన ఈమె.. ప్రస్తుతం ఇతర దక్షిణాది భాషలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది ఈమె నుంచి మూడు తమిళ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతానికి నిత్య చేతిలో కొత్త ప్రాజెక్టులు అయితే ఏం లేనట్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాతగా ఓ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు ప్రకటించింది.(ఇదీ చదవండి: వాళ్లు తప్పు చేశారు.. నేను క్షమాపణలు చెబుతున్నా: రాజమౌళి తండ్రి)'కేయూరి ప్రొడక్షన్ (Keyuri Productions)' పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు వెల్లడించిన నిత్యా మేనన్.. ఇన్ స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. వ్యాపార లాభాల కంటే కథాబలం, లోతైన పాత్రలు, సమాజంపై ప్రభావం చూపే సినిమాలకే తన ప్రాధాన్యం అని పేర్కొంది. ప్రస్తుతానికి కొత్తగా ఈ నిర్మాణ సంస్థ నుంచి ప్రాజెక్టులేం ప్రకటించలేదు. చూస్తుంటే తనకున్న యాక్టింగ్ కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత నటి, నిర్మాత కొనసాగనుంది. 'అలా మొదలైంది' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిత్యా మేనన్.. ఇష్క్, గుండెజారి గల్లంతయిందే, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్ తదితర చిత్రాల్లో కనిపించింది.(ఇదీ చదవండి: ప్రముఖ హీరో ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత) View this post on Instagram A post shared by Keyuri (@keyuriproductions) -
ఏఐతో అద్భుతం.. రజినీకాంత్ మూవీ టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన చిత్రం కొచ్చాడయాన్. 2014లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించింది. గతంలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సాయంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ మూవీపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కార్టూన్ సినిమాను తలపించేలా ఉందంటూ ఆడియన్స్ ట్రోల్స్ చేశారు.అయితే తాజాగా ఈ మూవీకి సరికొత్త హంగులతో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో రూపొందించిన టీజర్ తలైవా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మొత్తాన్ని ఏఐ సాయంతో రీ జనరేట్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు రజినీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
విశాల్‌కు బిగ్ షాక్.. పది కోట్లు చెల్లించాల్సిందే..!
కోలీవుడ్ హీరో, నిర్మాత విశాల్‌కు మద్రాస్ హైకోర్ట్ బిగ్ షాకిచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు సంబంధించిన కేసులో విశాల్‌కు చుక్కెదురైంది. డబ్బులు చెల్లించేందుకు మరింత గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఈ కేసులో మొదట లైకాకు చెల్లించాల్సిన రూ.21.29 కోట్లను 30శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. విశాల్ రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లు చెల్లించేందుకు ఆరు వారాల గడువు కావాలని విశాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ధర్మాసనం అందుకు విముఖత వ్యక్తం చేస్తూ విశాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా.. సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని.. ఆ డబ్బు తిరిగి చెల్లించలేదంటూ 2022లో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. -
కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పొద్దు: మంచు లక్ష్మీ సలహా
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని అక్క కొడుకు అజయ్ దీషన్ కథానాయకుడిగా నటించిన లేటేస్ట్ మూవీ బూకీ(తమిళంలో పూకీ). ఈ సినిమాకు గణేశ్ చంద్ర దర్శకత్వం వహించారు. ఈ మూవీ తెలుగులో బూకీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మించడంతో పాటు ఓ ముఖ్యమైన పాత్రలో కూడా నటించారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై హీరో అజయ్ దీషన్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. రిలేషన్షిప్ విషయంలో విజయ్ ఆంటోనీ మీకు ఎలాంటి సలహా ఇచ్చారని హీరోను అడిగింది. రిలేషన్షిప్లో ఒక ఫ్రెండ్‌గా ఉండమని చెప్పాడని.. ఆ స్నేహం ఒక ఐదేళ్ల పాటు కొనసాగితే అప్పుడు ఆలోచించాలని సలహా ఇచ్చాడని అన్నారు. ఇది విన్న మంచు లక్ష్మీ కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పకు అని సలహా ఇచ్చింది.అంతేకాకుండా ఈ మూవీ టైటిల్ గురించి కూడా మంచు లక్ష్మీ మాట్లాడింది. పూకీ అనే పదం తమిళంలో క్యూటీ అని అర్థమని చెప్పుకొచ్చింది. యంగ్‌స్టర్స్ ఎక్కువగా ఈ పదాన్ని వాడతారని తెలిపింది. సినిమాల వల్ల డబ్బులు పొగొట్టుకున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మంచు లక్ష్మీ స్పందించింది. అవునండి.. అప్పులు అనేవి వందశాతం నిజం.. ఐదేళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నానని తెలిపింది. కాగా.. ఈ చిత్రంలో ధనుషా హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో పాండియరాజన్, సునీల్, ఇందుమతి, మణికంఠన్, వివేక్ ప్రసన్న, బ్లాక్ పాండి, ఆదిత్య కతిర్, ప్రియాంక తదితరులు నటించారు. కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పకు.. - మంచు లక్ష్మి రిలేషన్ షిప్ అడ్వైజ్#ManchuLakshmi #Bookie #AjayDhishan #VijayAntony pic.twitter.com/tzYpB01CQt— Filmy Focus (@FilmyFocus) February 17, 2026 -
రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: స్టార్ హీరోయిన్
ప్రేమలో మోసపోయిన సినీ తారల్లో నటి మమతమోహన్‌దాస్ ఒకరు. ఈమె బహు భాషా నాయకి. మలయాళం, తమిళం,తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించి స్టార్ హీరోయిన్గా రాణించారు. తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, రుద్రంగి సినిమాల్లో నటించిన ఆమె తమిళంలో శివప్పధికారం, గురు ఎన్ ఆళు, తడయార తాక్క,ఎనిమి,మహారాజా తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో ప్రభు జయరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న మైడియర్ సిస్టర్ చిత్రంలో అరుళ్‌నిధితో కలసి నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఆ మధ్య క్యాన్సర్ మహ్మమారి బారిన పడ్డారు. అయితే దాని నుంచి పోరాడి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత మళ్లీ నటించడం మొదలెట్టిన మమత మోహన్‌దాస్ (Mamta Mohandas) తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. అందులో క్యాన్సర్ వ్యాధి నుంచి బయప పడి మళ్లీ నటిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు తనకు మళ్లీ ప్రేమపై దృష్టి మళ్లిందన్నారు. అలా మలయాళ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటుడితో డేటింగ్‌కు వెళ్లానని చెప్పారు. అయితే అతను మరో యువతితో నిశ్చితార్థం జరిగిందన్న విషయం తనకు ఆ తరువాతనే తెలిసిందన్నారు. దాంతో తన మనసు ముక్కలైయ్యిందన్నారు. ఒక అమ్మాయి నమ్మకాన్ని బద్ధలు కొట్టడానికి వారికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన చెందానన్నారు. దీని గురించి ఆ నటుడిని అడగ్గా చాలా లైట్‌గా తీసుకున్నాడని చెప్పారు. అయితే తాను మాత్రం ఆ ఘటనను జీర్ణించుకోలేకపోయానన్నారు. తన మాజీ భర్తతో మొదటిసారి పరిచయం ఎలా అయిందో కూడా ఆమె పంచుకున్నారు. ఒక కార్యక్రమంలో తనను చూసి వివాహం చేసుకుందామని ఆకాంక్షను వ్యక్తం చేశారని, అందుకు తాను తన తల్లిదండ్రులను అడగమని చెప్పానట్లు గుర్తు చేసుకున్నారు. అలా అప్పుడు తమ పెళ్లి జరిగిందని చెప్పారు. కాగా వివాహ బంధంపై తనకు నమ్మకం ఉందని, అది ఎప్పటికీ చెరగదని అన్నారు. ప్రస్తుతం మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన మాదిరిగానే అర్థం చేసుకోగలిగిన వ్యక్తి తారసపడితే కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు నటి మమత మోహన్‌దాస్ పేర్కొన్నారు. మమతకు 2011 నవంబరు 11న బహ్రెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్‌తో నిశ్చితార్థం జరిగింది. వీరికి 2011 డిసెంబరు 28న కోజికోడ్‌లో వివాహం జరిగింది. 2012 డిసెంబరు 12న అంటే కేవలం ఏడాదిలోనే ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు క్యాన్సర్ కారణంగానే వారిద్దరూ విడిపోయారని కొన్ని కథనాలు కూడా వచ్చాయి. -
లేటేస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. మణిరత్నం రివ్యూ
శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ తూ యా మైన్. సర్వైవల్ థ్రిల్లర్ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ వహించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో . ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.తాజాగా ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం వీక్షించారు. ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ఆయన ఈ సందర్భంగా తు యా మైన్ చిత్రబృందాన్ని అభినందించారు. మణిరత్నం మాట్లాడుతూ.. " ఈ మూవీతో బిజోయ్ నంబియార్ ఒక కైనెటిక్ ఎనర్జీని తీసుకొచ్చారు. ఇది థియేటర్లలో ప్రేక్షకుల మధ్య కూర్చొని పెద్ద తెరపై చూసినప్పుడే ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించగలం" అని ప్రశంసించారు.ప్రత్యేక ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు సైతం సినిమాపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరు అద్భుతమైన సినిమాగా అభివర్ణించగా.. మరికొందరు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, స్టోరీ టెల్లింగ్ కొత్త అనుభూతి ఇచ్చాయని పేర్కొన్నారు. మణిరత్నం వంటి లెజెండరీ డైరెక్టర్ నుంచి ప్రశంసలు లభించడం సినిమా విజయంపై మరింత ధీమాగా ఉందన్నారు.కాగా.. ఈ మూవీని కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ బ్యానర్లపై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి సంయుక్తంగా నిర్మించారు. యువతను లక్ష్యంగా చేసుకుని.. మునుపెన్నడూ చూడని ఎమోషన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందించారు. -
బీజేపీ నేత దారుణ కామెంట్స్‌పై స్పందించిన త్రిష
ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యనే తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. విజయ్‌ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కి రాజకీయాలు తెలియవు, ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా అనేశాడు. దీంతో పెద్ద చర్చే నడిచింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు.. ఈ విషయాన్ని ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఇప్పుడు త్రిష కూడా స్పందించింది. ఈమె తరఫున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు.(ఇదీ చదవండి: అలాంటి కంటెంట్‌కి లేని సమస్య.. టైటిల్స్‌కి ఎందుకు?)'ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్(త్రిష) ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్‌గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం' అని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటన విడుదల చేశారు.దళపతి విజయ్, త్రిష పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. చివరగా విజయ్ హీరోగా నటించిన 'గోట్' మూవీలో త్రిష, ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అయితే వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారనే రూమర్స్ చాన్నాళ్లుగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే వీటిని విజయ్‌పై విమర్శల చేయడానికి ఉపయోగించడమే ఈ మొత్తం వివాదానికి కారణమైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)Disrespect should and always will be called out. pic.twitter.com/FmXdIBvAJ6— Trish (@trishtrashers) February 16, 2026 -
అప్పుడు రూ.500 అప్పు.. ఇప్పుడు రూ.90 కోట్ల కలెక్షన్స్!
ఏదో ఒక కథ రాసుకున్నామా? పెద్ద హీరోను పెట్టామా? రెండు ఫైట్ సీన్లు, రెండు లవ్ సాంగ్స్‌తో మమ అనిపించేశామా? అంటే కుదరదు. ఈరోజుల్లో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే వారి మనసును కదిలించేలా సినిమా ఉండాలి. వారు పెట్టిన డబ్బుకు సంతృప్తినిచ్చేదై ఉండాలి. అలాగైతేనే జనం సినిమాకు ఓటేస్తున్నారు, లేదంటే మూవీ చిన్నదైనా, పెద్దదైనా జనం ముఖం చాటేస్తున్నారు.ఫస్ట్ సినిమాతోనే హిట్అలాంటిది తొలి సినిమాతోనే టాలెంట్ చూపించాడు తమిళ దర్శకుడు అభిషన్ జీవింత్. యూట్యూబర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అతడు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అభిషన్. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది మే 1న విడుదలవగా ప్రేక్షకులను నవ్విస్తూనే హృదయాలను కదిలించింది. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ప్రేమ వివాహంపెద్ద డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయకపోయినప్పటికీ సొంత టాలెంట్‌తో గొప్ప సినిమా తీసి అందరి మన్ననలు పొందాడు. రజనీకాంత్, సూర్య, రాజమౌళి, నాని.. ఇలా ఎందరో ప్రముఖులు ఆయన ప్రతిభను ప్రశంసించారు. ఈ ఆనందంలోనే అభిషన్.. ప్రియురాలిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ వివాహానికి టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మగేశ్ రాజు హాజరై బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చాడు. హీరోగానూ టాలెంట్ఇక దర్శకుడిగా నెక్స్ట్ ఏం సినిమా చేస్తాడు? అనుకుంటే హీరోగా మారాడు. విత్ లవ్ మూవీతో కథానాయకుడిగానూ విజయం సాధించాడు. అయితే ఒకప్పుడు అభిషన్ రోజూవారీ ఖర్చుల కోసం రూ.500 స్నేహితుడిని అప్పడిగాడు. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు బాక్సాఫీస్‌పై కోట్లు కురిపించే సినిమాలు తీసే రేంజ్‌కు ఎదిగాడు. 26 ఏళ్ల వయసులోనే ఇంత సక్సెస్ చూస్తున్న అభిషన్ మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిద్దాం!చదవండి: ఆ హీరోయిన్‌కు ఫోన్ చేసి సారీ చెప్పా: రవీనా టండన్ -
సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం
సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన సినిమాల్లో 'బాషా'కి ప్రత్యేక స్థానముంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత మరణించారు. వృద్ధాప్య సమస్యలతో నిర్మాత తమిళగన్ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల.. రజనీ సంతాపం వ్యక్తం చేశారు. బాధపడుతూ ట్వీట్ చేశారు.(ఇదీ చదవండి: హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్)'సోదరుడు లాంటి అళగన్ మృతి నాకు అత్యంత బాధాకరమైన విషయం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన కుటుంబానికి నా సానుభూతి' అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. నేటి సాయంత్రం (ఫిబ్రవరి 15) తమిళగన్ అంత్యక్రియలు జరగనున్నాయి. రజనీ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'బాషా' చిత్రాన్ని తమిళగన్, తన తల్ల రాజమ్మాళ్‌తో కలిసి నిర్మించారు. ఇతడి తండ్రి ఆర్ఎం వీరప్పన్ సమర్పకుడిగా వ్యవహరించారు. దీనితోపాటే మూండ్రు ముగం, పణక్కారన్, రాణువ వీరన్ కూడా తమిళగన్ నిర్మించారు. మందిరపున్నగై, నిలా పెన్నే చిత్రాలకు దర్శకుడిగానూ వ్యవహరించారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)மதிப்பிற்குரிய அமரர் ஆர்.எம். வீரப்பன் அவர்களின் புதல்வர், எனது அன்புத் தம்பி தமிழழகன் அருமையான மனிதர். அவரது திடீர் மறைவு எனக்கு மிகுந்த வேதனையளிக்கிறது. அவருடைய ஆத்மா சாந்தியடையட்டும். குடும்பத்தாருக்கு என் ஆழ்ந்த அனுதாபங்கள்.— Rajinikanth (@rajinikanth) February 15, 2026 -
ప్రియుడిని పెళ్లాడిన 'సార్ మేడమ్' నటి
తమిళ నటి రోషిణి హరిప్రియణ్ పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు కేఎస్ సుందర మూర్తిని ఆదివారం (ఫిబ్రవరి 15న) వివాహం చేసుకుంది. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సినిమాకాగా రోషిణి హరిప్రియణ్ భారతి కన్నమ్మ సీరియల్‌తో పాపులర్ అయింది. ఆ తర్వాత 'కూకు విత్ కోమలి' రియాలిటీ షో మూడో సీజన్లోనూ పాల్గొంది. అనంతరం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. గరుడన్, మద్రాస్ మ్యాట్నీ మూవీస్ చేసింది. చివరగా 'తలైవా తలైవి' సినిమాలో నటించింది. ఈ చిత్రం తెలుగులో 'సార్ మేడమ్' పేరిట రిలీజైంది. Bharathi Kannama serieal fame #RoshniHariPriyan getting married. pic.twitter.com/MRKxSFH4NG— CineFriday (@Cine_Friday) February 15, 2026 చదవండి: అది నా దురదృష్టం: రణ్‌బీర్ కపూర్ -
ప్రముఖ నటుడి కుమారుడి కారు బోల్తా..
తమిళ సినీ ప్రపంచంలో మన్సూర్ అలీ ఖాన్ ప్రముఖ విలన్‌గా, సహనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. లియో మూవీ విడుదల తర్వాత నటి త్రిషపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాడు. అయితే, ఆయన కుమారుడు తుగ్లక్ తన కారులో చెన్నై హాడోస్ రోడ్డు నుండి ఉత్తమర్ గాంధీ రోడ్డు వైపు వెళ్తుండగా..అకస్మాత్తుగా అదుపు తప్పి శాస్త్రి భవన్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఆపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా, కారులో ఉన్న తుగ్లక్ స్వల్ప గాయాలతో కిందపడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలు అతన్ని రక్షించి, ఘటన స్థలంలో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మైలాపూర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రమాదం జరిగినప్పుడు తుగ్లక్ మద్యం సేవించలేదని తెలిసింది. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. గత సంవత్సరం మాదకద్రవ్యాలు ఉపయోగించినందుకు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు తుగ్లక్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించడం గమనార్హం. -
ధనుశ్ వల్లే భారీ నష్టం.. రూ.20 కోట్లు చెల్సించాల్సిందే..!
కుబేరా, ఇడ్లీకడై, ఇష్క్ తేరే మే వంటి చిత్రాల తరువాత ధనుష్ నటిస్తోన్న తాజా చిత్రం కర. ఈ మూవీ టైటిల్‌ను పొంగల్ సందర్భంగా ప్రకటించారు. ఆయన కెరీర్లో ఇది 54వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాలో మమతా బైజు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా కథ, దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈ సినిమా సంగతి పక్కనపెడితే తాజాగా ధనుశ్ ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 2016లో ప్రకటించిన ఓ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడంతో నిర్మాణ సంస్థ ఆయనపై లీగల్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆగిపోవడం వల్ల రూ.20 కోట్ల పరిహారం కోరుతూ ధనుశ్కు.. తేనాండల్ ఫిల్మ్స్ లీగల్ నోటీసు పంపినట్లు తెలుస్తోంది.2016లో నాన్ రుద్రన్ అనే సినిమాను దర్శకత్వం వహించడంతో పాటు నటించడానికి ధనుష్ అంగీకరించారని తేనాండల్ ఫిల్మ్స్ తెలిపింది. అయితే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే ఈ సినిమా ఆగిపోవడంతో.. తమకు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారని తేనాండల్ ఫిల్మ్స్ ఆరోపిస్తోంది. చివరికీ ఆ సినిమా నుంచి కూడా ధనుశ్ తప్పుకున్నారని అంటోంది.ఈ మూవీ కోసం ముందస్తు చెల్లింపులు, ప్రీ-ప్రొడక్షన్ ఖర్చులకు గానూ దాదాపు రూ.20 కోట్ల నష్టాలు వచ్చాయని తేనాండల్ ఫిల్మ్స్ తెలిపింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టులో భాగమైన టాలీవుడ్ హీరో నాగార్జున, ఎస్జే సూర్య లాంటి స్టార్ నటులకు చెల్లించిన పారితోషికం కూడా ఇందులో భాగమని తెలుస్తోంది. ముఖ్యంగా ధనుష్ పూర్తి స్క్రిప్ట్ సమర్పించడంలో విఫలమవడం.. ఇతర ప్రొఫెషనల్ కమిట్మెంట్లకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే మా సినిమా ఆగిపోయిందని.. దీనివల్ల తమకు తీవ్ర నష్టం జరిగిందని నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. అందువల్లే చట్టపరమైన చర్యలకు దిగినట్లు తేనాండల్ ఫిల్మ్స్ ప్రకటించింది. -
సూర్య- జ్యోతిక ప్రేమను ఒప్పుకోలేదు!: హీరో తండ్రి
ప్రేమించడం ఈజీయేమో కానీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం మాత్రం కొంత కష్టమైన పనే! కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక ప్రేమాయణం హీరో తండ్రి, నటుడు శివకుమార్‌కు ఏమాత్రం ఇష్టం లేదట. కానీ సూర్య పట్టుపట్టి సాధించి, ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ విశేషాలను శివకుమార్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.జీవితాంతం ఒంటరిగానే..శివకుమార్ మాట్లాడుతూ.. మొదట్లో సూర్య ప్రేమను నేను ఒప్పుకోలేదు. పెళ్లంటూ చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటానని, లేదంటే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతానన్నాడు. వెంటనే నాకు నేను నటించిన 150 సినిమాలు కళ్లముందు కదిలాయి. అందులో చాలావరకు ప్రేమకథలే ఉన్నాయి. దీంతో వెంటనే అతడి ప్రేమను అంగీకరించాను.ఎలా ఉండేవాడు?వాడు మొదట్లో చాలా బిడియంగా ఉండేవాడు. రాధికా శరత్‌కుమారే వాడిని జ్యోతికతో మాట్లాడించింది. అలా మొదలైన మాటలు తర్వాత ప్రేమకు దారితీశాయి. ఎంతో మొహమాటంతో ఉండే వీడేనా ఈరోజు ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నాడు అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని శివకుమార్ సరదాగా చెప్పుకొచ్చాడు.ప్రేమ- పెళ్లిసూర్య, జ్యోతిక అనేక సినిమాల్లో కలిసి నటించారు. 'పూవెల్లం కేట్టుప్పార్' మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ 2006 సెప్టెంబర్ 11న పెళ్లితో మరింత బలపడింది. ఈ దంపతులకు కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం. సినిమాల విషయానికి వస్తే.. సూర్య ప్రస్తుతం 'కరుప్పు' సినిమా చేస్తున్నాడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. అలాగే హీరోయిన్ నజ్రియాతో సూర్య మరో సినిమా చేస్తున్నాడు.చదవండి: కొడుకు- కోడల్ని అభినందించిన మెగాస్టార్ -
లోకేశ్ హీరోగా 'డీసీ'.. వాలంటైన్స్ స్పెషల్ గ్లింప్స్
దర్శకులందరూ హీరోలవుతున్నారు. అలా తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూడా 'డీసీ' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాన్ని గతేడాది ప్రకటించారు. నేడు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు సందర్భంగా.. బ్లడీ వాలంటైన్ అంటూ డీసీ గ్లింప్స్ వదిలారు. అందులో ప్రేమ కన్నా రక్తపాతమే ఎక్కువ చూపించారు. లోకేశ్ పీకలు కోస్తూ కనిపించాడు. చివర్లో కారుపై కూడా రక్తమే కనిపిస్తోంది. చిన్న వీడియోలోనే ఇంత వయొలెన్స్ ఉంటే సినిమాలో ఎంతుంటుందో చూడాలి!డీసీ విషయానికి వస్తే.. లోకేశ్ దేవదాస్‌గా, వామిక గబ్బి.. చంద్ర పాత్రలో కనిపించనున్నారు. వీరి పేర్ల కలయిక ఆధారంగానే డీసీ (దేవదాస్ + చంద్ర) అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకతత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. కాగా ఖైదీ, విక్రమ్, కూలీ సినిమాలతో దర్శకుడిగా క్రేజ్ అందుకున్న లోకేశ్ హీరోగా ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి! చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివ జ్యోతి -
చిన్నతనం నుంచే నాకు గుర్తింపు లేదు: సింగర్
గాయని కెనిషా పేరు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఈమె మల్టీ టాలెంటెడ్ బ్యూటీ. గాయని, గీత రచయిత, డాన్సర్, నటి ఇలా పలు టాలెంట్స్ కలిగిన బెంగళూరు భామ కెనిషా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల నటుడు రవిమోహన్ స్నేహితురాలిగా వార్తల్లో నానుతున్న గాయని ఈమె. అంతే కాదు నటుడు రవిమోహన్‌కు ఆయన భార్యకు మధ్య మనస్పర్థలకు, వారు విడిపోవడానికి కారణం ఈమె అనే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికి బలం చేకూర్చే విధంగా రవిమోహన్, కెనిషా జంటగా తిరున్నారు.రవి మోహన్‌పై పొగడ్తలుఇలాంటి పరిస్థితుల్లో నటి కెనిషా సందర్భం వచ్చినప్పుడల్లా రవిమోహన్పై పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇటీవల శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రంలో రవిమోహన్ ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రవిమోహన్ హీరో అయినా విలన్ అయినా ఆయన వల్లే ఈ చిత్రం ఆడుతోంది. ఎవర్ గ్రీన్ రవిమోహన్ ముందు తన కళ్లకు ఎవరు కనిపించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రవితో బర్త్‌డే సెలబ్రేషన్స్రవిమోహన్కు నీడలా ఉంటున్న కెనిషా గత 7వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా రవిమోహన్ హాజరై పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇటీవల ఈ గాయని తన ఎక్స్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో తనకు చిన్న వయసులోనుంచే గుర్తింపు లేదంది. ప్రపంచమే మారిపోయిందితాను ఇతరుల నుంచి చిన్న గుర్తింపు, ప్రేమనే ఆశించానని తెలిపింది. అలాంటిది రవిమోహన్ వచ్చిన తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని, తన ఆలోచనలు, భావాలు, ప్రేమ తదితర విషయాలు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయంది. ఎవరేమనుకున్నా తాను బాధ పడనని, తాము నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నామంది. ఈ విషయం తమను అర్థం చేసుకున్న వారికి తెలుసని, కష్టాల్లో అండగా నిలబడినవారికి, రవిమోహన్‌కు ధన్యవాదాలని కెనిషా పేర్కొంది. -
మమితా బైజు కొత్త సినిమా.. నిర్మాతగా మారిన స్టార్ హీరో
నటి మమితా బైజు క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పదహారేళ్ల ప్రాయంలోనే నటిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ గత ఎనిమిదేళ్లగా మలయాళం, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ సక్సెస్ రేట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తను నటించిన మలయాళం చిత్రం ప్రేమలు మాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ ల్లోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెబల్ చిత్రంతో జివీ.ప్రకాష్ కుమార్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా నటించిన డ్యూడ్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది.తాజాగా విజయ్ కథానాయకుడుగా నటించిన జననాయకన్ చిత్రంలోనూ మమితా బైజు కీ రోల్ చేశారు. కాగా ప్రస్తుతం ధనుష్ సరసన నటిస్తున్న కారా చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. అదేవిధంగా బెత్లెహేమ్ కుడుంబ అనే మలయాళం చిత్రంలోని నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో ఆయనకు జంటగా కాకుండా ఆయన నిర్మించనున్న చిత్రంలో మమితా బైజు నాయకిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. చాలామంది నటుల మాదిరిగానే ప్రదీప్ రంగనాథన్ కూడా నిర్మాతగా మారిపోతున్నారు. ఈ చిత్రానికి ఆయన అసోసియేట్ డైరెక్టర్ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలుతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఎన్నో హిట్లు.. కానీ, స్కిన్ షో తప్పడం లేదా?
చిత్రపరిశ్రమలో కథానాయికలు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేది అందాల ప్రదర్శనకే అని చెప్పవచ్చు. అవకాశాల కోసం స్కిన్ ప్రదర్శనతో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తుంటారు. టాప్ హీరోయిన్గా ఎదిగినా, ఆ స్థానాన్ని నిలుపుకోవడానికి వారికి ఒకే ఒక్క ఆయుధం అందాలారబోతే. నటి రాశీఖన్నా ఇందుకు ఆతీతం కాదు. చూడ చక్కని నటి ఈ బ్యూటీ. అంతే కాదు పాన్ ఇండియా నటి అన్నది అదనపు గుర్తింపు. 2013లో మెడ్రాస్ కఫే అనే చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిస్తు మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలోకి ఇమైకా నొడిగల్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే అందులో హీరో అక్కగా నటించిన నయనతార ఆ క్రెడిక్ట్ను కొట్టేశారు. అయితే నటి రాశీఖన్నాకు ఆ చిత్రం మంచి ఎంట్రీనే అయ్యింది. అలా నటుడు రవిమోహన్‌కు జంటగా అడంగుమరు అనే చిత్రంలో నటించారు. ధనుష్‌తో కలిసి తిరుచిట్రంఫలం (తిరు) చిత్రంలో క్యామియో పాత్రలో నటించారు. సర్ధార్ చిత్రంలో నటుడు కార్తీకి జంటగా నటించారు. సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 4 చిత్రంలో తమన్నతో పోటీ పడి అందాలను ఆరబోశారు. విశేషం ఏమిటంటే కోలీవుడ్‌లో ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. తెలుగులోనూ హిట్ చిత్రాల్లో నటించారు. అలా నటిగా పుష్కర కాలాన్ని అధిగమించారు. అయినా ఈమెకు స్టార్ ఇమేజ్ రాకపోవడం గమనార్హం. అంతే కాదు ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ప్రత్కేక ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని హాట్‌హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఇవి ఎంత వరకు అవకాశాలను తీసుకొస్తాయో చూడాలి. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
అర్ధరాత్రి రజనీతో బైక్ రైడ్.. అనిరుధ్ తండ్రి మమ్మల్ని అడ్డుకుని!
దక్షిణాదిన ఎంతోమంది స్టార్ హీరోలతో జోడీ కట్టిన రాధికా శరత్‌కుమార్ ఈసారి చాలా డిఫరెంట్ పాత్రలో కనిపించనుంది. తను ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ "తాయి కిళవి". ఈ చిత్రంలో తను ఊరిలో రుణాలిచ్చే వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హీరో శివకార్తికేయన్ నిర్మించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది.బైక్‌పై తిరిగాంఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాధిక ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ఒకరోజు రజనీకాంత్, నేను బైక్‌పై చెన్నై అంతా తిరిగాం. నేను ఇక్కడే తిన్నాను, ఇక్కడే నిద్రపోయాను, ఇక్కడే కొన్నాళ్లు ఉన్నానంటూ రజనీ తను తిరిగిన ప్రదేశాలన్నీ నాకు చూపించాడు. రజనీ లైఫ్ స్టోరీ తన నోటి నుంచి వింటున్నప్పుడు చలించిపోయాను.జీవితంలో అనేక కష్టాలుఇన్ని కష్టాలు పడ్డాడా? అని ఫీలయ్యాను. చాలామంది జీవితంలో అనేక కష్టాలు చూసుండొచ్చు. కానీ, రజనీకాంత్ తన బాధ, కష్టం, శ్రమ.. ఇలా అన్నింటినీ ఓర్చుకుని అట్టడుగు స్థాయి నుంచి తారాస్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇకపోతే మేము అలా బైక్‌పై తిరుగుతూ ఉంటే సడన్‌గా ఒక కారు మమ్మల్ని చేజ్ చేసుకుంటూ వచ్చి మా ముందు ఆగింది. నాకు ఒక్కసారిగా భయమేసింది. సీక్రెట్ షికారు అనుకుని..అయితే వచ్చింది మరెవరో కాదు, రజనీకాంత్ భార్య లత సోదరుడు, నటుడు రాఘవేంద్ర. రజనీకాంత్ అర్ధరాత్రి ఒక మహిళను వెంటేసుకుని రహస్యంగా షికార్లు చేస్తున్నాడని భావించి మమ్మల్ని ఆపేందుకు వచ్చాడు. కానీ.. రజనీ, నేను షికారుకు వెళ్లామని లతకు ముందే తెలుసు. దీంతో అతడి ఆందోళన నీరుగారిపోయింది అని చెప్పుకొచ్చింది. కాగా రజనీకాంత్ భార్య, నిర్మాత, సింగర్ లత తమ్ముడే నటుడు రవి రాఘవేంద్ర. ఈయన కుమారుడు అనిరుధ్ రవిచందర్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు.చదవండి: సంతోషంగా లేను, మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు: శ్రీజ దమ్ము -
వైఎస్ జగన్‌ను కలిసిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ కలిశారు. చెన్నైలో జరిగిన సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ హీరోలు కార్తీ, సూర్య వైఎస్ జగన్‌ను ఆత్మీయంగా పలకరించారు. పెళ్లి వేడుకలో హీరోలు కార్తీ, సూర్యతో వైఎస్ జగన్‌తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు అటు రాజకీయాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తికర చర్చలకు దారి తీసింది. View this post on Instagram A post shared by Sakshi (@sakshinews) -
శరణ్య కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్ హీరోలు
ప్రముఖ నటి శరణ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. నటి శరణ్య- దర్శకనటుడు పొన్వన్నన్ దంపతుల చిన్న కూతురు చాందిని పెళ్లి పీటలెక్కింది. ఫిబ్రవరి 2న వివాహం జరగ్గా శుక్రవారం చెన్నైలో ఎంతో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్‌కు తమిళ స్టార్ హీరోలు ధనుష్, కార్తీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇద్దరూ డాక్టర్సే..చాందిని డాక్టర్ కాగా, అతడి భర్త ఫిలిప్ కూడా డాక్టర్ అని తెలుస్తోంది. 2025 డిసెంబర్లోనే వీరి నిశ్చితార్థం జరగ్గా ఇప్పుడు వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇకపోతే నటి శరణ్య.. తల్లి, అత్తమ్మ పాత్రలతో పేరు తెచ్చుకుంది. ఎంతోమంది స్టార్ హీరోలకు వెండితెరపై అమ్మగా కనిపించింది. గ్యాంగ్ లీడర్, రఘువరన్ బీటెక్, 24.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఈవిడ దర్శకుడు పొన్వన్నన్ను పెళ్లి చేసుకోగా వీరికి ప్రియదర్శిని, చాందిని సంతానం. కూతుర్లిద్దరూ డాక్టర్స్‌గా స్థిరపడ్డారు. Karthi at Saranya Ponvannan’s daughter marriage reception.💥pic.twitter.com/aWA2Ag3hN4— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026Dhanush at Saranya Ponvannan’s Daughter Wedding Reception💥pic.twitter.com/Ox0Yn0hpgt— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026 చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. క్షమించండి: ప్రభాకర్ -
ఆవేశంతో చితక్కొట్టా.. దర్శకుడు, హీరో ఆపారు: విశాల్ ప్రేయసి
సెట్లో ఒకసారి ఓ వ్యక్తిని చితకబాదానంటోంది హీరోయిన్ సాయి ధన్సిక. ఆవేశం పట్టలేక అతడిని కొడుతూ ఉంటే అది చూసి దర్శకుడు, హీరో తనను ఆపారంటోంది. సాయిధన్సిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా యోగి డా. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.ఫోటో అడిగితే..అందులో సాయి ధన్సిక మాట్లాడుతూ.. కేరళలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ వ్యక్తి నాతో ఫోటో దిగాలని మా అంకుల్(నా పర్యవేక్షకుడు)ని అడిగాడు. అయితే అతడు తాగి ఉన్నాడని గమనించి ఫోటో ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. వెంటనే ఆ తాగుబోతు మా అంకుల్‌ను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అదంతా చూసి నాలో కోపం కట్టలు తెచ్చుకుంది.చితకబాదా..ఆత్మరక్షణ కోసం నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఆ టాలెంట్ అంతా అప్పుడు ఉపయోగించాను. వాడ్ని పరిగెత్తి వెళ్లి మరీ పట్టుకుని చితకబాదాను. పదినిమిషాలు కొడుతూనే ఉన్నాను. డైరెక్టర్, హీరో నా చేతులు పట్టుకుని నన్ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. నా మనుషుల్ని ఏదైనా అంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే విచక్షణారహితంగా కొట్టాను అని సాయి ధన్సిక చెప్పుకొచ్చింది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో షికారు సినిమాలో నటించింది.పెళ్లిఇకపోతే సాయిధన్సిక, హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే! గతేడాది ఆగస్టు 29న (విశాల్ పుట్టినరోజున) వీరి వివాహం జరగాల్సింది. కానీ నడిగర్ సంఘం భవనం ఇంకా పూర్తి కాకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకుని ఎంగేజ్మెంట్తో సరిపెట్టుకున్నారు. మరి ఈ ఏడాది ఆగస్టు 29కైనా సాయి ధన్సిక మెడలో విశాల్ మూడు ముళ్లు వేస్తాడో, లేదో చూడాలి!చదవండి: నా సినిమా ఎఫెక్ట్ అవుతుందని భయపడ్డా: ఏడ్చేసిన చంద్రహాస్ -
అర్జున్ రెడ్డిని గుర్తు చేసేలా కొత్త సినిమా ట్రైలర్..
'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా పేరు పెద్ద సెన్సేషనల్ అయిపోయింది. ఈ మూవీ టేకింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే, తాజాగా విడుదలైన 'నిలవే' మూవీ ట్రైలర్‌కు ఇలాంటి రెస్పాన్సే వస్తుంది. ఈ ట్రైలర్‌ను చూసిన నెటిజన్లు చిత్ర దర్శకుడిని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. వీడేంటి సందీప్‌రెడ్డి స్టూడెంట్‌లా ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్లో కట్స్, ఎడిటింగ్, సంగీతం సూపర్ అంటూనే హీరోయిన్ పాత్రలో కనిపించిన శ్రేయాసి సేన్ నటన అదుర్స్ అంటున్నారు.సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూనే సాయి కె.వెన్నంతో కలిసి నిలవే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రేయాసి సేన్ కథానాయికగా నటిస్తుంది. రాజ్ అల్లాడ, గిరిధర్‌రావు పోలాడి, సాయి కె.వెన్నం నిర్మాతలు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి ఆదరణ రావడంతో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న శ్రేయాసి సేన్‌కు మంచి గుర్తింపు వస్తుంది. -
'360 గ్రాముల బంగారం'.. పాదపూజ చేసిన నటుడు
'మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు! మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు! నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు..' నిజమే కదా.. పాటలో చెప్పినట్లుగా ఈరోజుల్లో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పేరాశతో దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె నిజాయితీకి యావత్ దేశం చప్పట్లు కొడుతోంది.నిజాయితీజనవరి 11న చెన్నైలోని టీ నగర్లో పద్మ అనే మహిళ రోజూలాగే రోడ్డు శుభ్రం చేస్తోంది. చెత్త ఊడుస్తుండగా ఆమెకు ఓ బ్యాగు దొరికింది. అందులో రూ.45 లక్షలు విలువ చేసే 45 సవర్ల బంగారు ఆభరణాలు ఉండటంతో నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పగించి తన నిజాయితీ చాటుకుంది. అది తెలుసుకున్న రజనీకాంత్ ఆమెను నేరుగా ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసు కానుకగా ఇచ్చాడు.ఘనంగా సన్మానంఅప్పటినుంచి పద్మ పేరు మారుమోగుతూనే ఉంది. తాజాగా దర్శకనటుడు పార్తీబన్ (R Parthiban) ఓ కాలేజీలో జరుగుతున్న ఈవెంట్‌కు వెళ్లాడు. పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను కూడా ఆహ్వానించాడు. స్టేజీపై అందరిముందు ఆమెను ఘనంగా సన్మానించాడు. ఆమెకు చెప్పులు తొడిగి, కాళ్లకు నమస్కరించి చీర కానుకగా ఇచ్చాడు. అలాగే నెత్తిన కిరీటం పెట్టాడు. ఈ వీడియోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశాడు.అందుకే పాదపూజ చేశా..బంగారం విలువ పెరిగేకొద్దీ మానవత్వం తగ్గిపోతుంది. ఒక గ్రాము లక్ష రూపాయలకు చేరుకుంటున్నప్పుడు దానికోసం వేలాది మంది ప్రాణాలే పోవచ్చు. కానీ, పద్మ అనే మహిళ బంగారం కన్నా మానవత్వమే గొప్ప అని నిరూపించింది. సంవత్సరంలో 360 రోజులు పనిచేసే ఆమె 360 గ్రాముల బంగారం దొరికితే దాన్ని యజమానికి తిరిగిచ్చేసింది. అందుకే నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన కాలేజీ ఫంక్షన్‌కు తననూ తీసుకెళ్లాను. తనకు పాదపూజ చేసి కృతజ్ఞతలు చెప్పాను అని రాసుకొచ్చాడు. సినిమాఇది చూసిన నెటిజన్లు మీరు నిజంగా గొప్పవారు అని కొనియాడుతున్నారు. తమిళ నటుడు ఆర్.పార్తీబన్ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు నిర్మాత కూడా! సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన వందకు పైగా చిత్రాల్లో యాక్ట్ చేశాడు. యుగానికి ఒక్కడు, రచ్చ, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, ఇడ్లీ కొట్టు వంటి పలు చిత్రాల్లో నటించాడు. సుడల్ వెబ్ సిరీస్‌లోనూ కనిపించాడు. தங்கத்தின் மதிப்பு ஏற ஏற, மனிதத்தின் மரியாதை குறைந்துகொண்டே போய், ஒரு கிராம் ஒரு லட்ச ரூபாயை நெருங்கும்போது, லட்சக்கணக்கான உயிர்கள் கொல்லப்படுவது உறுதியாகிவிடும்.வருடத்தில் 360 நாளாவது உழைக்கும் துப்புரவு பணியாளர் திருமதி பத்மா அவர்கள், குப்பையில் கிடந்த 360 கிராம் நகையை… pic.twitter.com/tTRtd6gLWP— Radhakrishnan Parthiban (@rparthiepan) February 4, 2026 చదవండి: ఆరుసార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. నిక్ ఎమోషనల్ -
'పిల్లలందరికీ తండ్రులే హీరోలురా'.. ఆసక్తిగా గ్లింప్స్
బిజినెస్‌మేన్‌గా కెరీర్ ప్రారంభించి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అరుల్ శరవణన్. ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన లెజెండ్ శరవణన్‌గా ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లీడర్. ఈ మూవీకి దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఫైట్ సీన్స్ చూస్తుంటే కూతురి కోసం తండ్రి ఎంతవరకైనా వెళ్తాడనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చివర్లో పిల్లలందరికీ తండ్రులే హీరోలురా అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
అతడి వల్లే 4 ఏళ్లు సినిమాలకు దూరమయ్యా: మాధవన్
ఒకతను చేసిన చిన్న పని వల్ల నాలుగేళ్లు సినిమాలకే దూరంగా ఉన్నానంటున్నాడు ప్రముఖ నటుడు ఆర్.మాధవన్. సాలా ఖడూస్ (2016) సినిమాకు ముందు బ్రేక్ తీసుకున్నానని, అది తనకెంతో పనికొచ్చిందంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో ఓ తమిళ పాట చిత్రీకరణ కోసం ఆరెంజ్ ప్యాంట్, గ్రీన్ షర్ట్ ధరించి రోడ్డు మధ్యలో నిల్చున్నాను. నేనెవరో చూపిస్తా అన్నంత కోపంఅక్కడే కూర్చున్న ఓ రైతు నన్ను నిర్లక్ష్యంగా ఓ చూపు చూశాడు. అది నాకసలు నచ్చలేదు. చెన్నైకి రా.. నేనెవరో నీకు చూపిస్తా అని మనసులో అనుకున్నాను. కానీ ఎందుకో ఆ చూపు నన్ను వెంటాడింది. నన్ను ఆలోచింపజేసేలా చేసింది. నిజంగానే అసలు నేనేం చేస్తున్నాను అని అంతర్మథనానికి లోనయ్యాను. అందుకే బ్రేక్ తీసుకున్నాను. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను. అదిప్పటికీ పనికొస్తోందిసినిమాలు మానేసి ప్రదేశాలు తిరగడం మొదలుపెట్టాను. రిక్షా తొక్కేవారి దగ్గరి నుంచి చాలామందితో మాట్లాడాను. వారి జీవనశైలి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నాను. ఇలా అన్నింటినీ పరిశీలించాను. ఆ పర్యటన నాకెన్నో పాఠాలు నేర్పింది. ఎలాంటి పాత్రలు చేయాలి? ఎలాంటి సినిమాల్లో కనిపించాలన్నదానిపై స్పష్టత వచ్చింది. ఆ నాలుగేళ్లలో నేర్చుకున్నదాని ఫలితాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. మాధవన్ చివరగా ధురంధర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ధురంధర్ 2తో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాడు.చదవండి: నాకు స్టార్డమ్ తెచ్చిన మూవీ అదే.. : మహేశ్‌బాబు -
తలైవా మెచ్చిన కార్మికురాలు.. నిజాయితీలో బంగారం..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన గొప్ప మనసు చాటుకున్నారు. నిజాయితీ గల పారిశుద్ధ్య కార్మికురాలిని ఆయన అభినందించారు. చెన్నై మహానగర పాలకసంస్థలో కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. ఆమె నిజాయతీని సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకోవడంతో పాటు బంగారు గొలుసును బహుకరించారు.అసలేం జరిగిందంటే..చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మకు 45 తులాల బంగారం దొరికింది. తనకు దొరికిన ఆ బంగారాన్ని వెంటనే పోలీసులకు అప్పగించింది. దీంతో తనకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించడంపై ఆమె ప్రశంసలు వర్షం కురిసింది. ఆమె నిజాయితీని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ విషయం తెలుసుకున్న తలైవా ఆమెను ఇంటికి పిలిచి సన్మానించారు. ఆప్యాయంగా మాట్లాడిన రజనీకాంత్.. ఆమెకు ఒక బంగారపు గొలుసు గిఫ్ట్‌గా అందించారు. దీంతో ఆమె ముఖంలో ఆనందంతో నిండిపోయింది.అంతేకాకుండా పద్మకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వం ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో ఇచ్చింది. పరుల సొమ్ము తనకు వద్దని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ⭐ A Heartwarming Gesture by #SuperstarRajinikanth ⭐Superstar #Rajinikanth personally called Padmaa and honoured her with a gold chain 👑✨Padmaa, a frontline worker, earned widespread appreciation after she recovered 45 sovereigns of gold jewellery found on the road and… pic.twitter.com/1vHv6NBF7u— Danishkumar Sankaran (@S_Danishkumar) February 3, 2026 -
శ్రియా శరణ్ మూవీ.. రిలీజ్ కాకుండానే మూడు అవార్డులు..!
ఏదైనా సినిమా రిలీజై హిట్ అయితే ప్రశంసలు కురిపిస్తారు. అలాగే అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కథ బాగుండి సూపర్ హిట్ అయిన సినిమాలకు ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకంగా అవార్డులు ఇస్తుంటారు. కానీ రిలీజ్ కానీ సినిమాకు అవార్డ్స్, రివార్డ్స్ ఇవ్వడం మీరెక్కడైనా చూశారా? కానీ సరిగ్గా అదే జరిగింది. ఐదేళ్ల క్రితమే షూటింగ్ పూర్తయి రిలీజ్ కావాల్సిన మూవీ ఇప్పటివరకు థియేటర్లలోకి రాలేదు. కానీ తాజాగా అవార్డుల వేడుకలో మాత్రం ఏకంగా మూడింటిని సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ స్టోరేంటో తెలుసుకుందామా? విమల్, శ్రియా శరణ్ జంటగా నటించిన చిత్రం 'సందకరి'. తాజాగా ఈ చిత్రం మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఏడాది జనవరి 29న తమిళనాడు ప్రభుత్వం 2016 నుంచి 2022 సంవత్సరాల వరకు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులలో చాలా మంది అగ్రశ్రేణి నటీనటులు, చిత్రాలు, సాంకేతిక నిపుణులను ప్రభుత్వం గుర్తించి అవార్డులు అందించింది.అయితే 'సందకరి' అనే సినిమారు 2020 ఏడాదిగానూ మూడు అవార్డులను గెలుచుకుంది. ఇదే ఇప్పుడు ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేసింది. అసలు ఈ సినిమా విడుదల కాలేదని.. మరి ఇలాంటి చిత్రానికి అవార్డులకు ఎలా ఇచ్చారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ మూవీ ఉత్తమ చిత్రం (మూడవ బహుమతి) అవార్డును గెలుచుకోగా.. ఉత్తమ నేపథ్య గాయకుడు అమ్రిష్ (మేల్), అయ్యప్పన్ ఉత్తమ కళా దర్శకుడిగా అవార్డులకు ఎంపికయ్యారు. రిలీజ్ కానీ సినిమాకు అవార్డులు రావడమేంటని కోలీవుడ్ ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.అయితే తమిళనాడు రాష్ట్ర అవార్డులకు అర్హత పొందాలంటే ఆ చిత్రం థియేటర్లలో విడుదల అయి ఉండాలని నివేదికలు చెబుతున్నాయి. అంతే కాకుండా అవార్డుల కోసం ఆ ఏడాదిలో రిలీజైన ఎన్నో చిత్రాలు ఉండనే ఉన్నాయి. అవన్నీ కాదని.. ఒక మలయాళ రీమేక్‌కు మూడు అవార్డులు ఇవ్వడంపై నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు ఆశ్చర్య వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.కాగా.. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ మూవీ 'మై బాస్'కు రీమేక్‌గా సందకారిని తెరకెక్కించారు. ఈ చిత్రంలో దిలీప్, మమతా మోహన్‌దాస్ నటించారు. ఈ తమిళ వర్షన్లో విమల్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్ మదేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే అనేక కారణాలతో ఇప్పటికీ విడుదల కాలేదు. -
రజినీకాంత్ పొలిటికల్ నిర్ణయం.. కుమార్తె ఏమన్నారంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పాలిటిక్స్‌లోకి రానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నారు. తాజాగా తండ్రి నిర్ణయంపై ఆయన కుమార్తె సౌందర్య రజినీకాంత్ స్పందించారు. విత్ లవ్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. తన తండ్రి నిర్ణయం పట్ల తమకెలాంటి బాధ లేదన్నారు. ఆయనకు ఏది నచ్చితే కుటుంబమంతా మద్దతుగా ఉంటుందని తెలిపారు.అంతేకాకుండా రజనీ- కమల్‌హాసన్ సినిమాపై జరుగుతున్న ప్రచారంపై కూడా స్పందించారు. ఈ కాంబినేషన్ మూవీకి సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అవీ ఓకే అయితే త్వరలోనే వివరాలను ప్రకటిస్తామన్నారు. కాగా.. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం విత్ లవ్. ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజ్ కానుంది.నాన్నగారి రాజకీయ ప్రస్థానం విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు - సౌందర్య రజనీకాంత్#AbishanJeevinth #AnaswaraRajan #Madhan #WithLove #SoundaryaRajinikanth pic.twitter.com/BXkhJE02Z4— Filmy Focus (@FilmyFocus) January 30, 2026 -
ఒకే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్లు.. అందరూ తోపులే!
మన దేశంలో వ్యాపార, రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలోనూ కొన్ని కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతుంది. చాలా వరకు నటుల నుంచి నిర్మాతల వరకు, తమ కుటుంబ సభ్యులను సినీ పరిశ్రమలోకి తీసుకువచ్చి, వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాదు మరే ఇతర భాషా చిత్ర పరిశ్రమలో అయినా వారసుల హవా ఎప్పుటి నుంచో నడుస్తుంది. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ వచ్చిన విషయం మీకు తెలుసా.? అంతేకాదు అదే కుటుంబం నుంచి ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ వచ్చి.. కొన్నేళ్ల పాటు తమిళ చిత్ర పరిశ్రమను శాసించారంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. తమిళ సినిమాకు 'తొలి డ్రీమ్ గర్ల్'గా పేరొందిన 'టీఆర్ రాజకుమారి' కుటుంబమే దీనికి సాక్ష్యం. ఈ అరుదైన సినీ వంశం గురించి తెలుసుకోవాలంటే, ముందుగా రాజకుమారి నాయనమ్మ గుజ్జలాంబాళ్ నుంచి ప్రారంభించాలి. ఆమె ఒక ప్రసిద్ధ కర్ణాటక గాయని, సంగీత ప్రపంచంలో ఆమెకు గొప్ప పేరుంది. తంజావూరు వారి స్వస్థలం. ఈ కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన మొదటి వ్యక్తి ‘ఎస్పీఎల్ ధనలక్ష్మి’. 1935లో 'నేషనల్ మూవీ టోన్' అనే నిర్మాణ సంస్థ నిర్మించిన మొదటి చిత్రం 'పార్వతి కళ్యాణం'లో ధనలక్ష్మి హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఆమె సోదరి తమయంతి కూడా 1930వ దశకంలో కొన్ని చిత్రాలలో హీరోయిన్గా పని చేసింది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో హీరోయినే టీఆర్ రాజకుమారి.ఆమె అసలు పేరు రాజయ.1930లలోప్రముఖ దర్శకుడు కె.సుబ్రమణ్యం ఎస్పీఎల్ ధనలక్ష్మిని కలవడానికి వెళ్లాడు. ఆ సమయంలో ధనలక్ష్మి సోదరి కుమార్తె రాజయ కూడా అక్కడే ఉంది. ఆ అమ్మాయిని చూసి వెంటనే తన సినిమాలో హీరోయిన్గా చేయమని సుబ్రమణ్యం అడిగారట. రాజయ పేరును రాజకుమారిగా మార్చి, తన చిత్రం 'కచ్ఛ దేవయాని' (1941)లో ఆమెను నటింపజేశాడు. తొలి చిత్రంతోనే తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా రాజకుమారి తమిళ సినిమాకు 'డ్రీమ్ గర్ల్'గా తిరుగులేని విజయం సాధించింది.రాజకుమారి స్టార్ హీరోయిన్గా ఎదిగిన తర్వాత ఆమె ఫ్యామిలీ నుంచి మరికొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చాయి.వారిలో అత్యంత ముఖ్యమైన వారు టీఆర్ రామన్న. టీఆర్ రామన్న తమిళ సినిమాకు ప్రముఖ దర్శకుడు, నిర్మాతగా పేరుగాంచారు. ఎం.జీ.ఆర్, శివాజీ వంటి దిగ్గజాలతో సినిమా తీసిన ఏకైక నిర్మాత ఆయనే కావడం విశేషం.ఆ తర్వాత టీఆర్ రాజకుమారి కోడలు కుశల కుమారి కూడా 70వ దశకంలో చిత్రాలలో హీరోయిన్గా వెలుగొందింది. కొన్నాళ్ల తర్వాత ఎస్పీఎల్ ధనలక్ష్మి ఇద్దరు కూతుళ్లు కూడా సినిమాల్లోకి వచ్చింది. వాళ్లే జ్యోతి లక్ష్మి, జయమాలిని. ధనలక్ష్మికి మరో సోదరికి పిల్లలు లేకపోవడంతో జ్యోతి లక్ష్మిని వారికి దత్తత ఇచ్చారు. జ్యోతి లక్ష్మి, జయమాలిని ఇద్దరూ తమ గ్లామరస్ పాటలలో నృత్యం చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. జ్యోతి లక్ష్మి సుమారు 300 చిత్రాలలో నటించగా, జయమాలిని 500 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించింది.ఈ కుటుంబానికి చెందిన తదుపరి, చివరి తరం జ్యోతి మీనా. 'ఉళ్ళత్తై అళ్లిత' చిత్రంలో కౌండమణి పక్కన నటించిన జ్యోతి మీనా విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులతో కూడా డ్యాన్స్ చేసింది. ఆమె కొన్ని సినిమాలకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేసింది. జ్యోతి మీనా తండ్రి ఒక కెమెరామెన్ కావడంతో, ఈ కుటుంబం నుండి సాంకేతిక రంగంలోకి కూడా ఒక వ్యక్తి వచ్చారు. ఇలా ఒకే కుటుంబం నంచి మొత్తంగా ఏడుగురు హీరోయిన్లు, ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ వచ్చి.. కొన్నేళ్ల పాటు తమిళ ఇండస్ట్రీని శాసించారు. -
కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మృణాల్.. హీరో ఎవరంటే..?
‘సీతారామం, ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సుపరిచితురాలే. అయితే మృణాల్ ఠాకూర్‌కు కోలీవుడ్ నుంచి కబురు వచ్చిందట. శింబు హీరోగా తమిళంలో ‘ఓ మై కడవులే, డ్రాగన్ (తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ’గా విడుదలైంది)’ వంటి సక్సెస్ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేసుకున్నారట చిత్రం యూనిట్. మృణాల్‌కు ఆల్రెడీ మేకర్స్ ఈ సినిమా కథ వినిపించారని, ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.ఒకవేళ ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనున్న విషయం అధికారికంగా వెల్లడైతే, మృణాళ్‌కు తమిళ్లో ఇదే తొలి చిత్రం అవుతుంది. మరి..ఈ సినిమాతోనే మృణాల్ కోలీవుడ్ ఎంట్రీ జరుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా, అడవి శేష్ హీరోగా చేస్తున్న ‘డెకాయిట్’ చిత్రాలతో మృణాల్ ఠాకూర్ బిజీగా ఉన్నారు. అలాగే ఆమె హిందీలో నటించిన ‘దో దీవానే షెహర్ మే’ చిత్రం ఈ ఫిబ్రవరి 20న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు..మరికొన్ని హిందీ చిత్రాల్లోనూ ఆమె నటిస్తున్నారు.ప్రియాంకా చోప్రా లైఫ్ జర్నీ నాకు స్ఫూర్తి: మృణాల్ ఠాకూర్బాలీవుడ్ సక్సెస్ఫుల్ టాప్ హీరోయిన్ ప్రియాంకా లైఫ్ జర్నీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతున్నారు మృణాల్ ఠాకూర్. ఈ అంశంపై ఇటీవల ఆమె ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘సినీ ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండ సినిమాల్లోకి వచ్చారు ప్రియాంకా చోప్రా ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని, కష్టపడి గ్లోబల్ రేంజ్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలాగే ప్రియాంక చోప్రా యువతకు ఇచ్చే సూచనలు, సలహాలు నాకు చాలా ఇష్టం. ఇలా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ప్రియాంకా చోప్రా నాకు కూడా స్ఫూర్తి. నా ప్రయాణం, ప్రియాంక చోప్రా ప్రయాణం పూర్తిగా భిన్నమైనవి. కానీ మా ఇద్దరి మధ్యలో ఓ కామన్ పాయింట్ ఉంది. ఇద్దరం కూడా కష్టకాలంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా కృషి, పట్టుదలతో ముందుకు వెళ్తున్నాం’’ అని చెప్పారు మృణాల్. -
హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నారా? తమిళలోనూ అదే తంతు
గత కొన్నాళ్లలో ప్రెస్మీట్స్ అంటే తెలుగు సినిమా హీరోహీరోయిన్లు చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే చిత్రవిచిత్రమైన ప్రశ్నలు, కొన్నిసార్లయితే మరీ దారుణమైనవి అడుగుతూ సదరు సెలబ్రిటీలని పలువురు రిపోర్టర్లు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు తమిళంలోనూ ఒకరిద్దరు రిపోర్టర్లు ఇలానే తయారైనట్లు కనిపిస్తున్నారు. తాజాగా లోకేశ్ కనగరాజ్‌కి ఇలాంటి ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది.(ఇదీ చదవండి: రవితేజ 'ఇరుముడి'పై రీమేక్ రూమర్స్)గతేడాది 'కూలీ'తో వచ్చిన లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాకు దర్శకత్వం చేయనున్నాడు. రెండు వారాల క్రితం దీని ప్రకటన వచ్చింది. వీటి గురించి చెప్పేందుకు చెన్నైలో ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టాడు. తన గత, ప్రస్తుత చిత్రాల గురించి వివరాలు వెల్లడించాడు. అలానే 'ఖైదీ 2' ఎప్పుడు ఉండబోతుంది? ఎల్సీయూ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశాడు.ఇదే ప్రెస్మీట్లో ఓ రిపోర్టర్.. దర్శకుడు లోకేశ్‌ని ఇబ్బందికర రీతిలో ప్రశ్నించాడు. మీరు ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి? మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? అని సదరు రిపోర్టర్ అడగ్గా.. లేదు సర్ నాకు కుటుంబం ఉంది అని లోకేశ్ సమాధానమిచ్చాడు. అయినా సరే రిపోర్టర్ వదలకుండా.. రెండో ఫ్యామిలీ వద్దా? అన్నట్లు అడిగాడు. దీనికి ఆన్సర్ ఇవ్వని లోకేశ్.. ప్రెస్‌మీట్ అక్కడితో ముగించేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో సదరు రిపోర్టర్‌పై నెటిజన్లు రెచ్చిపోతున్నారు. చీప్ బిహేవియర్ అని కామెంట్స్ చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్.. 2012లో ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'.. తెలుగులోనూ)Loki-Enaku already family irukanga sirReporter-2nd family 🤮Poi un wife ta kelu da 2nd family venuma nu 😡 pic.twitter.com/uOSKTiMpXp— Shyam (@Shyam_1200) January 26, 2026 -
పరోటా మాస్టర్‌కి గోల్డ్ చెయిన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఎప్పటికప్పుడు గోల్డ్ చెయిన్స్ గిఫ్ట్ ఇస్తుంటారు. వీటిని అందుకున్న వాళ్లలో సెలబ్రిటీలే ఎక్కువగా ఉంటుంటారు. ఏదైనా సినిమా నచ్చితే.. హీరో లేదా దర్శకుడిని పిలిచి రజనీ.. బంగారు చెయిన్స్ ఇస్తుంటారు. ఈసారి మాత్రం పరోటాలు చేసే ఓ వ్యక్తికి ఇచ్చారు. అతడి కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకుని ఈ బహుమానం అందజేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)తమిళనాడులోని మధురైలో శేఖర్ అనే వ్యక్తి.. పరోటా షాప్ నడుపుతున్నాడు. గత 13 ఏళ్ల నుంచి 5 రుపాయలకే పరోటా అమ్ముతున్నాడు. గతంలో ఇతడికి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. ఇతడి పేరు శేఖర్ అయినప్పటికీ అందరూ రజనీకాంత్ శేఖర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే తలైవర్‌కి అంత వీరాభిమాని కాబట్టి. ఈ క్రమంలోనే తాజాగా రజనీ నుంచి శేఖర్ కుటుంబానికి పిలుపు వచ్చింది. తాజాగా శేఖర్ని ఇంటికి పిలిపించుకున్న రజనీకాంత్.. అతడికి బంగారు చెయిన్ బహుమతిగా ఇచ్చారు. (ఇదీ చదవండి: 'హుక్ స్టెప్' అలా పుట్టింది: కొరియోగ్రాఫర్ ఆట సందీప్) -
సూర్య వర్సెస్ ధనుష్.. కోలీవుడ్ లో బిగ్ క్లాష్..
-
నా కంటే ముందు చాలామందితో డేటింగ్ చేశాడు.. కాకపోతే: హీరోయిన్
సాధారణంగా హీరోయిన్లు ప్రేమలో ఉన్నాసరే దాన్ని బయటపెట్టరు. చాలా రహస్యంగా ఉంచుతారు. టాలీవుడ్లో అయితే రష్మిక-విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు టాక్. అయినా సరే తమ బంధాన్ని రివీల్ చేయట్లేదు. కానీ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ మాత్రం పదేళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ఆ విషయాన్ని ఎప్పుడో బయటపెట్టింది. తాజాగా ఈమె తన ప్రియుడి గురించి చెబుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రిలేషన్షిప్ గురించి ఓ విలువైన సలహా కూడా ఇచ్చింది.న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ప్రియా భవానీ శంకర్.. తమిళంలో మిడ్ రేంజ్ సినిమా హీరోయిన్గా అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. తాజాగా ఈమె లీడ్ రోల్ చేసిన 'హాట్ స్పాట్ 2' థియేటర్లలోకి వచ్చింది. అయితే కొన్నిరోజుల క్రితం ఈమె, తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ ఫేక్ అని వీళ్లిద్దరూ కలిసి చేసిన పోస్టుతో క్లారిటీ వచ్చేసింది. ప్రియ.. తన కాలేజీ మేట్ రాజ్ వేల్తో గత పదేళ్లుగా ప్రేమలో ఉంది. గతేడాదే వీళ్లు పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. కానీ ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన వీళ్లిద్దరికీ లేనట్లే కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ)తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ప్రియా భవానీ శంకర్ ఏం చెప్పిందంటే.. 'నాకు మొదటి, చివరి బాయ్‌ఫ్రెండ్ అతడు, ఎంతో బాధతో ఈ విషయాన్ని చెబుతున్నా(నవ్వుతూ). నాతో రిలేషన్ మొదలుపెట్టకముందు కాలేజీ టైంలో అతడు చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. నేను చెప్పేదేంటంటే మీ విధేయత చూపించడానికి ఎక్కువ కాలం రిలేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ టాక్సిక్ రిలేషన్షిప్ అనిపిస్తే వెంటనే బ్రేకప్ చెప్పేసి బంధం నుంచి బయటకొచ్చేయండి' అని చెప్పుకొచ్చింది.తెలుగులో ఈమె.. కల్యాణం కమనీయం, భీమా, జీబ్రా సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో టాలీవుడ్లో ప్రియకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతానికైతే తమిళంపైనే ఫోకస్ చేసింది.(ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)I am sad to say that he's my first & last boyfriend. But he dated many girls before our relationship. I would say that, you don't have to be in long relationship only to show your loyalty. If you feel it's toxic, come out of it 👏🏽— #PriyaBhavaniShankar pic.twitter.com/GFiEZovQxl— VCD (@VCDtweets) January 24, 2026 -
మృణాల్-ధనుష్ పెళ్లి చేసేశారు.. వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకుర్ ప్రేమలో ఉన్నారని.. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్నిరోజుల ముందు షాకింగ్ రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమని చాలామంది నమ్మేశారు కూడా. కానీ వీటిలో ఎలాంటి నిజం లేదని స్వయానా మృణాల్ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. దీంతో రిలాక్స్ అవుతారనుకుంటే ఇప్పుడు ఏకంగా ధనుష్-మృణాల్ పెళ్లి చేసేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)రీసెంట్ టైంలో ఏఐ(కృత్రిమ మేధ) వినియోగం చాలా పెరిగిపోయింది. తమకు నచ్చిన ఫొటోలు, వీడియోలని యూజర్స్ తయారు చేసుకుంటారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ నెటిజన్.. ఇలానే ధనుష్-మృణాల్ పెళ్లి జరిగినట్లు, ఈ కార్యక్రమానికి తమిళ ఇండస్ట్రీకి చెందిన దళపతి విజయ్, అజిత్, త్రిష, అనిరుధ్, శ్రుతి హాసన్, దుల్కర్ సల్మాన్ తదితరులు హాజరైనట్లు కూడా సృష్టించారు. ఇది ఫేక్ వీడియోనే అయినప్పటికీ యూజర్స్‌ని ఎంటర్టైన్ చేస్తుండటం విశేషం.ఈ పెళ్లి రూమర్స్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యని ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. కానీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ధనుష్ ఒంటరిగానే ఉంటున్నాడు. రీసెంట్ టైంలో మృణాల్ చేసిన సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ జరిగితే వీటిలో ధనుష్ కనిపించడం, డేటింగ్ రూమర్స్ రావడానికి కారణమైంది. ఈ క్రమంలోనే పెళ్లి గాసిప్స్ కూడా వచ్చాయి. అవి అబద్ధమని తెలిసినప్పటికీ సోషల్ మీడియాలో ఈ ఏఐ వీడియోలు వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: మెగా హీరో పాన్ ఇండియా సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?)Dey 😂😂😂Wedding 🙏🏻🙏🏻🙏🏻🙏🏻#MrunalThakur #Dhanush pic.twitter.com/tCWx7bTVcE— Swaasthi (@swaasthi) January 24, 2026 -
చెప్పు విసిరిన ఘటన.. 'నన్ను నేను మర్చిపోయా!'
సినీగేయరచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇటీవల కలకలం రేపింది. తమిళనాడులోని తిరుప్పూర్‌లో కొంగు కళ, సాహిత్య సంస్కృతి మండలి ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకుగానూ తిరుప్పూర్ కలెక్టరేట్‌కు రాగా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో అక్కడున్న ఓ మహిళ చెప్పు విసిరింది. తొలి పోస్ట్అయితే అది వైరముత్తుపై కాకుండా మరోవైపు పడింది. వెంటనే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తనకు మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు. ఈ ఘటన తర్వాత వైరముత్తు సోషల్ మీడియలో తొలిసారి ఓ పోస్ట్ పెట్టాడు. తిరుప్పూర్‌లో తను హాజరైన మరో కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. రెండువేలమంది విద్యార్థులు ఒక్కచోట చేరి చప్పట్లు కొడుతుంటే తనను తాను మర్చిపోయానన్నాడు.గతంలో ఆరోపణలుకాగా వైరముత్తు గతంలో మీటూ ఉద్యమ సమయంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చాలామంది మహిళలతో వైరముత్తు అసభ్యంగా నడుచుకున్నారంటూ సింగర్ చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను వైరముత్తు కొట్టిపారేశాడు. திருப்பூரில்வெற்றித் தமிழர் பேரவை ‘வள்ளுவர் மறை வைரமுத்து உரை’கையொப்பத் திருவிழாவைநிகழ்த்தியதுஏ.வி.பி அரங்கு முழுக்கஆயிரத்துக்கு மேற்பட்டபள்ளிப் பிள்ளைகள்;கல்லூரிக் கண்மணிகள்வெற்றித் தமிழர் பேரவையின்அவைத் தலைவர்ராம்ராஜ் நாகராஜன்அற்புதமான அறவுரை ஆற்றினார்… pic.twitter.com/Sjx88vuwvL— வைரமுத்து (@Vairamuthu) January 23, 2026 చదవండి: ప్రెగ్నెన్సీ అనుమానాలపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్ శివజ్యోతి -
పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ.. వీడియో వైరల్
తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.గత బుధవారం తిరుప్పూర్‌లో జరిగిన కొంగు కళ, సాహిత్య, సంస్కృతి మండలి ప్రారంభోత్సవానికి వైరముత్తుకి ఆహ్వానం అందింది. ఇందులో పాల్గొనేందుకు వైరముత్తు తిరుప్పూర్ కలెక్టరేట్‌కు వచ్చినప్పుడు ఎవరో చెప్పు విసిరారు. అయితే ఆ చెప్పు ఆయనపై కాకుండా మరో వ్యక్తిపై పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. చెప్పు విసిరిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కోలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. చెప్పు విసిరిన మహిళ పేరు జయ. 45 ఏళ్ల వయసు ఉన్న ఆ మహిళకు మతిస్థిమితం లేదు. కలెక్టర్ ఆఫీస్‌తో పాటు కోర్టు దగ్గర కూడా పలుసార్లు ఇలానే చెప్పులు విసిరిందట. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు తెలియజేస్తూ..ఆమెను అరెస్ట్ చేసినట్లుగా అధికారికంగా వెల్లడించారు. பாடல் ஆசிரியர் வைரமுத்துவை நோக்கி காலணிகள் வீச்சு..! என்ன காரணம்..? திருப்பூரில் பரபரப்பு..#tiruppur | #vairamuthu | #polimernews pic.twitter.com/I5EscQ5cWv— Polimer News (@polimernews) January 22, 2026ఈ ఘటన జరిగిన తర్వాత వైరముత్తు తొలిసారిగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తాజాగా ఆయన తిరుప్పూర్ లో విక్టోరియస్ తమిళ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ విద్యార్థులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘రెండు వేల మంది యువకులు ఏకగ్రీవంగా చప్పట్లు కొట్టడం చూసి, నన్ను నేను మర్చిపోయాను’ అంటూ రాసుకొచ్చాడు. చెప్పు విసిరిన ఘటనపై ఆయన స్పందించపోవడం గమనార్హం. అయితే ఆమెకు మతి స్థిమితం లేదనే విషయం తెలిసి.. వైరముత్తు ఆ ఘటనను లైట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వైరముత్తు వరుస వివాదాలతో వార్తల్లో ఉంటున్నారు. 2018లో, మీటూ ఉద్యమం సమయంలో, గాయని చిన్మయి శ్రీపాద భువన శేషన్ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే వైరమత్తు మాత్రం ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. திருப்பூரில்வெற்றித் தமிழர் பேரவை ‘வள்ளுவர் மறை வைரமுத்து உரை’கையொப்பத் திருவிழாவைநிகழ்த்தியதுஏ.வி.பி அரங்கு முழுக்கஆயிரத்துக்கு மேற்பட்டபள்ளிப் பிள்ளைகள்;கல்லூரிக் கண்மணிகள்வெற்றித் தமிழர் பேரவையின்அவைத் தலைவர்ராம்ராஜ் நாகராஜன்அற்புதமான அறவுரை ஆற்றினார்… pic.twitter.com/Sjx88vuwvL— வைரமுத்து (@Vairamuthu) January 23, 2026 -
గాయని ఎస్.జానకి కుటుంబంలో విషాదం
ప్రముఖ గాయని ఎస్.జానకి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ సింగర్ చిత్ర సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. మురళీకృష్ణ మరణం తనను షాక్‌కు గురిచేసిందని తాను మంచి సోదరుడిని కోల్పోయానంటూ తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కోరారు. మురళీకృష్ణకు కూడా సినీ రంగంతో అనుబంధం ఉంది. వినాయకుడు, మల్లెపువ్వు వంటి సినిమాల్లో ఆయన నటించారు. భరతనాట్యంలో ఆయనకు ప్రావీణ్యం ఉంది. పలువురు విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చారు. మురళీకృష్ణ మరణంతో సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. -
డేటింగ్లో ఉన్నా.. కానీ, తను ముస్లిం కాదు: ఫరియా అబ్దుల్లా
తొలి సినిమా 'జాతిరత్నాలు'తో 'చిట్టి' పేరుతో యూత్‌కు దగ్గరైన బ్యూటీ ఫరియా అబ్దుల్లా .. రీసెంట్గా గుర్రంపాపిరెడ్డి మూవీతో పాటు అనగనగా ఒక రాజులో ప్రత్యేక పాత్రలో మెరిసింది. కెరీర్ ప్రారంభంలో ఆమెను చూసిన వారందరూ కూడా ఉత్తరాది అమ్మాయి అనుకున్నారు. కానీ, ఆమె అచ్చమైన హైదరాబాదీ. పుట్టింది, పెరిగింది, చదివింది... భాగ్యనగరంలోనే. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది.ఫరియా అబ్దుల్లా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని తెలిపింది. తన ప్రియుడి గురించి మాట్లాడుతూ.. అతడు ముస్లిం కాదని, హిందూ కుటంబానికి చెందిన యువకుడని స్పష్టం చేసింది. అందరూ అనుకుంటున్నట్లు అతడు తన బాల్య స్నేహితుడు కాదని క్లారిటీ ఇచ్చింది. అయితే, సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనంటూ క్లూ ఇచ్చింది. అతను ఒక కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడని చెప్పింది. తాము ఇద్దరం కలిసి వర్క్ చేస్తూ ఒక టీమ్‌లా ముందుకు వెళ్తున్నట్లు మాట్లాడింది. కొంత కాలంగా తనలోని డ్యాన్స్, ర్యాప్‌లో వచ్చిన మార్పులకు అతనే కారణమని ఫరియా గుర్తుచేసుకుంది. తమ మధ్య ఉండే బంధం లవ్ అఫైర్ కాదని అదొక అనుబంధం అంటూ తనకు కాబోయే జీవిత భాగస్వామి గురించి చెప్పింది. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) -
తెలుగు హీరోయిన్లపై రాజాసాబ్ బ్యూటీ విమర్శలు
మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్.. మలయాళంతోపాటు సమానంగా తమిళంలోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్‌లో తను నటించిన మాస్టర్, పేట, తంగలాన్ చిత్రాలు తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్ 2 మూవీలో యాక్ట్ చేస్తోంది.డైలాగులు బేఖాతరుతాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడుతూ.. చాలాకాలం కిందట సంగతి ఇది. తెలుగు, తమిళంలో కొందరు హీరోయిన్లు డైలాగులను అసలు పట్టించుకునేవారే కాదు. ఒక సన్నివేశంలో బాధగా కనిపించాలంటే ఏడుపు ముఖం పెట్టి ఒకటి, రెండు, మూడు, నాలుగు అని లెక్కపెట్టేవారు. అంతే..! ఆవేశం, కోపం కలగలిపిన సీన్లలో ఏబీసీడీ అనే అక్షరాలను చదువుతూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు. మమ అనిపించేవారుఏబీసీడీ అన్న అక్షరాలను పదేపదే చదువుతూ ఉంటే పెదాలు కలుస్తూ ఉంటాయి. ఆ లిప్ సింక్ వల్ల డబ్బింగ్లో చెప్పే డైలాగ్స్‌కు సరిగ్గా సరిపోయేవి. కెరీర్ మొత్తం వాళ్లిలాగే నెట్టుకొచ్చారు. నేనైతే వారిలా అస్సలు చేయలేను అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్‌పై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర భాషా నటుల్ని తీసుకొచ్చి పెడితే ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే.. మాస్టర్ మూవీలో నిన్ను ట్రోల్ చేసిందెందుకో మర్చిపోయావా? అని మరికొందరు మాళవికపై సెటైర్లు వేస్తున్నారు. #MalavikaMohanan Acting in Master was trolled by all with her expression But She Commenting on others pic.twitter.com/tASuISbGrh— SillakiMovies (@sillakimovies) January 21, 2026 చదవండి: మమ్ముట్టి సినిమాలు రిజెక్ట్ చేశా..: హీరోయిన్ భావన -
'ఇంకా నిద్రపోతున్నారా?'.. హీరోను అవమానించేలా ప్రశ్న
తమిళ హీరో అశ్విన్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. తను ప్రధాన పాత్రలో నటించిన హాట్‌స్పాట్ 2 మచ్ మూవీ త్వరలో రిలీజవుతోంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సినిమా ప్రెస్మీట్లో ఓ రిపోర్టర్ అతడిని అవమానించేలా ప్రశ్న అడిగాడు. మీకు కథలు చెప్పేటప్పుడు నిద్రపోతున్నారా? లేదా మెలకువతో ఉండి వింటున్నారా? అని ప్రశ్నించాడు. అది విని అశ్విన్ అసహనానికి లోనయ్యాడు.హీరో కౌంటర్మీరెప్పుడూ సినిమా చూసేటప్పుడు థియేటర్లో నిద్రపోలేదా? అని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడేదో 40 కథలు చెప్పేసరికి నిద్రపోయానన్నాను. బహుశా ఆ సంఖ్య 40 కన్నా ఎక్కువే ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. అయినా దానిపై గతంలోనే క్లారిటీ ఇచ్చాను. అయినప్పటికీ మళ్లీ మళ్లీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? నన్ను అవమానించడానికా? అని కోప్పడ్డాడు.గతంలో ఏం జరిగింది?2022లో ఎన్న సొల్ల పోగిరై మూవీ ఆడియో లాంచ్‌లో అశ్విన్ కుమార్ మాట్లాడాడు. ఒకేరోజు దాదాపు 40 కథలు విన్నానని, అవి చాలా చప్పగా ఉండటంతో సగంలోనే నిద్రపోయానన్నాడు. ఆయన కామెంట్స్‌పై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన.. ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదంటూ క్షమాపణలు చెప్పాడు. అక్కడితో ఆ వివాదం సమసిపోయింది.హాట్‌స్పాట్ 2 మచ్ విషయానికి వస్తే.. ఇది 2024లో వచ్చిన హాట్‌స్పాట్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. విఘ్నేశ్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. అశ్విన్ కుమార్‌తో పాటు ప్రియ భవానీ శంకర్, ఆదిత్య భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ తమిళ చిత్రం జనవరి 23న విడుదలవుతోంది. కాగా సీరియల్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ కుమార్ (Ashwin Kumar Lakshmikanthan).. తెలుగులో అన్నీ మంచి శకునములే సినిమాలోనూ యాక్ట్ చేశాడు. #Reporter: Are you sleeping now listening to stories or you woke up❓#AshwinKumar: 40 is the number which I said generally, it could be more or less. Have you never slept while watching films in theatres? Why are you bringing this question now & degrading me? It was not to hurt… pic.twitter.com/RPhtEoSfo0— AmuthaBharathi (@CinemaWithAB) January 20, 2026 చదవండి: రాజాసాబ్ ఫ్లాప్.. ప్రభాస్ రియాక్షన్ ఏంటో చెప్పిన నిధి అగర్వాల్ -
బన్నీ సినిమాతో బిజీ.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్
తమిళంలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి.. బాలీవుడ్ వరకు వెళ్లి.. ఇప్పుడు అల్లు అర్జున్‌తో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న దర్శకుడు అట్లీ.. గుడ్ న్యూస్ చెప్పేశాడు. తన భార్య మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని బయటపెట్టాడు. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నారు.(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)తమిళ డైరెక్టర్ శంకర్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన అట్లీ.. 'రాజారాణి' మూవీతో దర్శకుడిగా మారాడు. తర్వాత దళపతి విజయ్‌తో తెరి, బిగిల్, మెర్సల్ లాంటి హ్యాట్రిక్ మూవీస్ తీశాడు. 2023లో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో తీసిన 'జవాన్'.. అదిరిపోయే సక్సెస్ అయింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో అట్లీ ఓ మూవీ చేస్తున్నాడు.అట్లీ వ్యక్తిగత విషయాలకొస్తే.. నటి ప్రియని 2014లో పెళ్లి చేసుకున్నాడు. 2023లో ఈమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడికి మీర్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత ప్రియ మరోసారి తల్లి కానుంది. చూస్తుంటే బన్నీతో మూవీ రిలీజయ్యేలోపే అట్లీ తండ్రి కాబోతున్నాడు. ఈ మేరకు ప్రియ బేబీ బంప్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు) -
'తెరి' వాయిదా.. కృతజ్ఞతలు చెప్పిన నిర్మాతలు
నటుడు విజయ్ చిత్రం విడుదలవుతోందంటే దాని ప్రభావం ఆయన అభిమానుల్లోనే కాకుండా చిత్ర పరిశ్రమలోనూ చాలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన గతంలో నటించిన చిత్రం 'తెరి' ( పోలీసోడు) రీ రిలీజ్ కానుంది. దీంతో ఇతర చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నటుడు విజయ్ హీరోగా వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మించిన తెరి సినిమాలో నటి సమంత, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. జన నాయగన్ వాయిదా పడటంతో విజయ్ ఫ్యాన్స్ కోసం తెరి చిత్రాన్ని ఈ నెల 23వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. దీంతో పాటు అజిత్ హీరోగా నటించిన మంగాత్తా చిత్రం కూడా అదే తేదీన రీ రిలీజ్ కానుంది. అయితే అదే తేదీన కొత్త చిత్రాలైన ద్రౌపది–2, హాట్‌స్పాట్–2 విడుదల కానున్నాయి. ఈ క్రమంలో విజయ్ నటించిన తెరి చిత్రం రీ రిలీజ్ కానుండడంతో ఈ చిన్న చిత్రాలకు థియేటర్ల సమస్య ఏర్పడింది. దీంతో హట్‌స్పాట్–2 చిత్ర దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్ తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చేశారు. అందులో తెరి చిత్ర విడుదలను వాయిదా వేయాల్సిందిగా నిర్మాత కలైపులి ఎస్.థానుకు విజ్ఞప్తి చేశారు. తెరి చిత్రం విడుదల కారణంగా తమ చిత్రానికి థియేటర్ల సమస్య వస్తోందని అందులో పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాన్ని ద్రౌపది–2 ,చిత్ర దర్శక, నిర్మాతలు ఎక్స్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. దీంతో చిన్న చిత్రాలను కాపాడేవిధంగా నిర్మాత కలైపులి ఎస్.థాను తెరి చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ద్రౌపది–2 చిత్ర దర్శక నిర్మాతలకు కాస్త రిలీఫ్ వచ్చినట్లు అయ్యింది. వెంటనే ఆ చిత్ర దర్శకుడు మోహన్.జీ, నిర్మాత చోళ చక్రవర్తి నిర్మాత కలైపులి ఎస్.థానును కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
మరోసారి స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్..
కోలీవుడ్‌లో కమల్ హాసన్, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి కథానాయకులుగా రాణిస్తున్న నటులు విజయ్, అజిత్. వీరిద్దరి మధ్య మంచి మిత్రభావం ఉంది. అయితే వీరి అభిమానులు మధ్య మాత్రం ఎప్పటినుంచో పోటీ తత్వం నెలకొంది. ముఖ్యంగా అజిత్, విజయ్ నటించిన చిత్రాలు ఒకేరోజు విడుదలైతే ఆ సమయాల్లో వారి అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు.30 ఏళ్లుగా..రెండు చిత్రాల్లో ఏ ఒక్కటి విజయం సాధించినా మరో హీరోపై విమర్శల దాడి జరుగుతుంటుంది. అలా గత 30 ఏళ్లకు పైగా విజయ్, అజిత్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటూ వస్తోంది. ఇకపోతే విజయ్ నటించిన చివరి మూవీ జననాయకన్ ఈ నెల 9వ తేదీన విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఇతర చిత్రాల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. రీరిలీజ్అదేవిధంగా గతంలో విడుదలైన కొన్ని చిత్రాలు ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్నాయి. అలాంటి వాటిలో నటుడు విజయ్ నటించిన తెరి, అజిత్ నటించిన మంగాత్తా చిత్రాలు కూడా చోటు చేసుకోవడం విశేషం. గతంలో మంచి విజయాలను సాధించిన ఈ రెండు చిత్రాలు ఈ నెల 23వ తేదీన రీరిలీజ్ కావడం మరో విశేషం. దీంతో ఈ చిత్రాలు సాధించే వసూళ్లపై ఆసక్తి నెలకొంది.1996 సంక్రాంతికి మొదలుఇకపోతే విజయ్, అజిత్ గతంలో నటించిన చిత్రాలు ఒకేసారి విడుదలైన సందర్భాలను పరిశీలిస్తే 1996 సంక్రాంతి సమయంలో విజయ్ నటించిన కోయంబత్తూర్ మాప్పిళై, అజిత్ నటించిన వాన్మతి చిత్రాలు రిలీజయ్యాయి. అదే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ నటించిన పూవే ఉనకాగా, అజిత్ నటించిన కల్లూరి వాసన్ చిత్రాలు మూడు రోజుల గ్యాప్‌తో విడుదలయ్యాయి. 1997లో విజయ్ నటించిన కాలమేల్లామ్ కార్తిరుప్పేన్ , అజిత్ నటించిన నేశం చిత్రాలు, అదే ఏడాది విజయ్ నటించిన కాదలుక్కు మర్యాదై, అజిత్ నటించిన రైట్టె జెండాపై వయసు చిత్రాలు వచ్చాయి.స్టార్ హీరోల సినిమాలు రిలీజ్1999లో విజయ్ నటించిన తుల్లాద మనం తుళ్ళుమ్ ,అజిత్ నటించిన ఉన్నైతేడి చిత్రాలు, 2000వ సంవత్సరంలో అజిత్ నటించిన ఉన్నై కొడు ఎన్నై తరువేన్ విజయ్ నటించిన ఖుషి చిత్రాలు, 2001లో విజయ్ నటించిన ఫ్రెండ్స్, అజిత్ నటించిన దీనా చిత్రాలు, 2002లో విజయ్ నటించిన భగవతి, అజిత్ నటించిన విలన్ చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇప్పుడు మరోసారి..2003లో విజయ్ నటించిన తిరుమలై , అజిత్ నటించిన ఆంజనేయ చిత్రాలు, 2006లో విజయ్ నటించిన ఆది ,అజిత్ నటించిన పరమశివం.., 2007లో విజయ్ నటించిన పోకిరి , అజిత్ నటించిన ఆల్వార్ .., 2014లో విజయం నటించిన జిల్లా, అజిత్ నటించిన వీరం చిత్రాలు, 2023లో అజిత్ నటించిన తుణివు, విజయ్ నటించిన వారిసు చిత్రాలు ఒకేసారి రిలీజయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ స్టార్ హీరోల తేరి, మంగాత్తా సినిమాలు ఒకేసారి రీ రిలీజ్ అవుతున్నాయి. -
దళపతి రేంజ్‌కు 'అల్లు అర్జున్'.. బిగ్ లైనప్‌తో ప్లాన్
అల్లు అర్జున్ పుష్పలో "ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా" అనే పాట తన నిజ జీవితానికి బాగా సెట్ అవుతుంది అని చెప్పొచ్చు. బన్నీ సినిమా విడుదలవుతుంది అంటే చాలు.. అందరికీ తెలిసిన ఒక వర్గం తనను కిందకు లాగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే, బన్నీ కూడా అంతే రేంజ్లో "ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నను కాల్చితే కత్తి అవుతాను" అంటూ తనను ట్రోల్ చేసే వారి గుండెల్లో దడ పుట్టిస్తాడు. టాలీవుడ్లో తన ఫ్యాన్స్ బేస్ చాలా బలంగానే ఉంది. ఇప్పుడు తన చూపు ఇతర ఇండస్ట్రీల మీద ఉంది. ‘ఆర్య’ సినిమా తర్వాత మలయాళంలో మల్లు అర్జున్ అయ్యాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్‌కు తన మార్కెట్ సత్తా చూపాడు. ఇప్పుడు అట్లీ, లోకేశ్ కనగరాజ్ మూవీస్‌తో తమిళ పరిశ్రమపై కన్నేశాడు. తన ప్లాన్ వర్కౌట్ అయితే, తమిళ్లో బిగ్‌స్టార్‌గా పాతుకుపోతాడు. అందుకే ఇప్పుడు వరుసగా తమిళ టాప్ దర్శకులతో ప్రాజెక్ట్‌లు మొదలుపెట్టాడనిపిస్తుంది.దళపతి బాయ్స్‌తో అల్లు అర్జున్దళపతి విజయ్ బాయ్స్‌గా అట్లీ, లోకేశ్ కనగరాజ్‌లకు ఇమేజ్ ఉంది. బిగిల్, మెర్సిల్, తేరి చిత్రాలతో విజయ్‌కి అట్లీ హిట్స్ ఇస్తే.. లియో, మాస్టర్ మూవీస్‌తో లోకేశ్ తన మార్క్ చూపించాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్‌తో వరుసగా సినిమాలు చేస్తుండటంతో విజయ్ ఫ్యాన్స్ కన్ను అల్లు అర్జున్ మీద పడింది. లోకేశ్ తన నెక్ట్స్ మూవీ బన్నీతో అని చెప్పగానే విజయ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. విజయ్, అల్లు అర్జున్‌ల ఏఐ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు.చెన్నైలో జరిగిన పుష్ప-2 ఈవెంట్లో బన్నీ తమిళంలోనే మాట్లాడి వారి ప్రేమను పొందాడు. తమిళ ప్రజలకు కావాల్సింది కూడా అదే.. వారి భాషలో మాట్లాడే హీరోలను తప్పకుండా అక్కున చేర్చుకుంటారు. కన్నడకు చెందిన రజనీకాంత్‌కు తమిళనాట ఎలాంటి ఆదరణ ఉందో తెలిసిందే.. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.అల్లు అర్జున్‌కు తమిళనాడులో సానుకూలతప్రస్తుతం అల్లు అర్జున్ చూపు తమిళనాడుపై ఉంది. కోలీవుడ్‌లో దళపతి విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల వైపు వెళ్తున్నారు. రజనీకాంత్ వయసు కారణంగా రాబోయే రోజుల్లో సినిమాలు చేసే ఛాన్స్ తక్కువగానే ఉండొచ్చు. ఆపై తమిళ మరో బిగ్ హీరో అజిత్ కూడా సినిమాలపై ఫోకస్ తగ్గించి.. కార్ రేసింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ముగ్గురి తర్వాత ఏర్పడుతున్న ఆ స్పేస్‌ను ఉపయోగించుకునేందుకు పక్కా వ్యూహంతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దళపతి విజయ్ మెచ్చిన దర్శకులతో బన్నీ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి తన ప్లాన్ సక్సెస్ అవుతుందనే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్‌కు టాప్ ఇమేజ్ ఉంది. ఇదే క్రమంలో తమిళనాడులో కూడా తన ప్లాన్ వర్కౌట్ అయితే సౌత్ ఇండియాలో బన్నీకి సినిమాలకు బిగ్గెస్ట్ మార్కెట్ ఏర్పడుతుంది.బిగ్ లైనప్ సినిమాలతో ప్లాన్అల్లు అర్జున్ చేతిలో రాబోయే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో పాటు టాప్ దర్శకులతోనే ఉన్నాయి. అట్లీ, లోకేశ్ కనగరాజ్, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ ఇలా వరుసగా పేరున్న డైరెక్టర్స్‌తో లైనప్ ఉంది. ఆపై తను ఎంచుకున్న స్టోరీలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. అట్లీ సినిమా హిట్ కొడితే చాలు.. సౌత్ ఇండియాలో తన మార్కెట్ పునాది బలంగా పడుతుంది. బాలీవుడ్లో ఎటూ ఖాన్ల మూవీస్‌కు పోటీగా బన్నీ మార్కెట్ ఉంది. ముఖ్యంగా బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బన్నీ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ఆపై తన ఫ్యూచర్ సినిమాల లైనప్ మరింత బలంగా ఉంది కాబట్టి ఇండస్ట్రీలో తన మార్క్ ఏంటో అల్లు అర్జున్ చూపించబోతున్నాడని తెలిసిపోతుంది. -
ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ పెళ్లి? అసలు నిజమిదే!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ రూమర్ తెగ వైరలవుతోంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఏంటి.. నిజమేనా? అని ఆశ్చర్యపోతున్నారు.ఇంత సడన్‌గా పెళ్లేంటి?అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వచ్చే నెలలో మృణాల్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలు ఉట్టి రూమర్సేనని హీరోయిన్ టీమ్ కొట్టిపారేసింది. ఫిబ్రవరిలో ఆమె సినిమా రిలీజ్ ఉంది, మార్చిలో మరో తెలుగు మూవీ వస్తోంది.. సినిమాలతో అంత బిజీగా ఉంటే ఇప్పుడింత సడన్‌గా పెళ్లెందుకు చేసుకుంటుందని ఆమె టీమ్ తిరిగి ప్రశ్నించింది. తనకసలు ఇప్పట్లో వివాహం చేసుకోవాలన్న ఆలోచనే లేదని, అనవసరంగా దీన్ని ఎవరో సృష్టించారని చెప్తోంది. దీంతో మృణాల్ పెళ్లి రూమర్స్‌కు ప్రస్తుతానికి ఫుల్స్టాప్ పడ్డట్లే కనిపిస్తోంది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. ధనుష్ చివరగా తేరే ఇష్క్ మే మూవీతో పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం కార మూవీ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ చివరగా సన్ ఆఫ్ సర్దార్ మూవీతో పలకరించింది. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. తెలుగులో హీరోయిన్గా నటించిన డెకాయిట్ మార్చిలో విడుదల కానుంది. అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ కథానాయికగా యాక్ట్ చేస్తోంది.చదవండి: నావల్లే డబ్బు పోయిందని ఇంతవరకు.. :శర్వానంద్ -
ధనుష్ కొత్త సినిమా టైటిల్ ఇదే..
కుబేరా, ఇడ్లీకడై, ఇష్క్ తేరే మే వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ధనుష్ నటిస్తున్న తాజా చిత్రానికి పొంగల్ పండగ సందర్భంగా టైటిల్ వెల్లడించారు. ఈయన నటిస్తున్న 54వ చిత్రం ఇది. దీనికి కర అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. దీనితో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, ఓ వీడియోను విడుదల చేశారు. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న నటిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్ రవికుమార్, జయరామ్, సురాజ్ వెంజురముడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేశ్.. థింక్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా కర చిత్రంలో ధనుష్ పేరు కరసామి అని వీడియోలో పేర్కొన్నారు. ధనుష్‌ను మాస్ గెటప్‌లో చూపించారు. ఈ మూవీని సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది. -
సూపర్ హిట్ మూవీ సీక్వెల్... ఆసక్తిగా ప్రోమో
ఆది హీరోగా వచ్చిన గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మరగద నానయం. ఈ సినిమాకు ఏఆర్కే శరవణ్ దర్శకత్వం వహించారు. 2017లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీని తెలుగులో మరకతమణి పేరుతో రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ను ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఈ కొత్త మూవీకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. పార్ట్-1లో నిక్కీ గల్రానీ హీరోయిన్గా నటించగా..ఇప్పుడు మాత్రం ప్రియా భవానీ శంకర్ కనిపించనుంది. ఈ చిత్రంలో సత్యరాజ్, నిక్కీ గల్రానీ, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ. అరుణ్రాజా కామరాజ్, మురుగానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఫస్ట్ సినిమా హీరోతో అలనాటి హీరోయిన్.. 37 ఏళ్లకు!
ముఖానికి ఇంత మేకప్ వేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పటి అందాల తార కనక. తమిళ సినీ ప్రపంచంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన దేవిక కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తమిళ, మలయాళ భాషల్లో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సడన్‌గా వెండితెరపై కనిపించకుండా పోయింది. వివాదాలతో వార్తల్లో..దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ మధ్యలో కనకకు క్యాన్సర్ అని, చనిపోయిందని రూమర్స్ రాగా అవన్నీ ఉట్టివే అని తేలిపోయాయి. తండ్రితో వివాదం కారణంగానూ వార్తల్లో నిలిచింది. కనక మానసిక పరిస్థితి సరిగా లేదని తండ్రి కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. కనక చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు దేవిక, దర్శకుడు దేవదాస్ విడిపోయారు. ఫస్ట్ సినిమా హీరోతల్లీకూతురు ఒంటరిగా ఉండేవారు. తల్లి చనిపోయాక కనక మరింత ఒంటరితనం అనుభవించింది. ఇల్లు దాటి బయటకు రాకుండా లోపల తాళం వేసుకుని జీవించేది. వివాదాలతోనే జీవితాన్ని గడిపిన కనక తాజాగా తన మొదటి హీరోను కలిసింది. కరకట్టక్కరన్ అనే తమిళ చిత్రం ద్వారా కనక హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. రామరాజన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏడాదిపాటు విజయవంతంగా ఆడింది. 37 ఏళ్ల తర్వాత కలయికతాజాగా హీరో రామరాజన్‌ను కలిసింది కనక. వీరివెంట మ్యూజిక్ డైరెక్టర్ దరన్ కుమార్ కూడా ఉన్నాడు. 37 ఏళ్ల తర్వాత కలయిక అంటూ ఈ రీయూనియన్ ఫోటోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు వాటే సర్ప్రైజ్ అని ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో కనకకి మేకప్ కొంచెం ఎక్కువైందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కనక.. తెలుగులో బ్రహ్మర్షి విశ్వామిత్ర, వాలు జడ తోలు బెల్టు సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Dharan Kumar (@dharankumar_c)చదవండి: జైలర్ 2లో యాక్ట్ చేశా.. రజనీకాంత్ కోసమే.. -
నేరుగా ఓటీటీలో విడుదలైన అనంత.. ఎక్కడంటే?
భక్తిరస కథాచిత్రాలు అరుదుగా ఉంటాయి. ఈ మధ్య విడుదలైన యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా అనంత అనే భక్తిరస కథాచిత్రం సంక్రాంతి సందర్భంగా మంగళవారం నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇది పుట్టపర్తి సాయిబాబా దైవలీలల గురించి చెప్పే సినిమా.అనంత సినిమాఇంతకుముందు బాషా, అన్నామలై వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన సురేశ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను గిరీశ్ కృష్ణమూర్తి నిర్మించారు. జగపతిబాబు, సుహాసిని, వైజీ.మహేంద్రన్, నిగల్‌గళ్ రవి, తలైవాసల్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని, గీత రచయిత స్నేషన్ మాటలు, పాటలు అందించారు.జీవిత చరిత్ర కాదుఇది సాయిబాబా జీవిత చరిత్ర కాదని, ఆయన మహిమలతో కూడిన భక్తిరస కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. పూర్తి విశ్వాసంతో బాబాను నమ్మితే ఫలితాలెలా ఉంటాయన్నది చెప్పే సినిమాయే అనంత అన్నారు. ఇందులో అందరూ అద్భుతంగా నటించారన్నారు. దేవా సంగీతం సినిమాకు పెద్ద బలం అని తెలిపారు.ఓటీటీలో నేరుగా రిలీజ్సినిమా చూసిన పలువురు ప్రముఖులు థియేటర్లలో విడుదల చేయమని కోరారన్నారు. అయితే ఓటీటీ సంస్థ కమిట్ అవడంతో హాట్‌స్టార్‌కు స్ట్రీమింగ్ హక్కులు ఇచ్చామన్నారు. ఈ సినిమా మంగళవారం అంటే జనవరి 13 నుంచి ఓటీటీలో ప్రసారం అవుతోందని, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు.చదవండి: రజనీకాంత్ కోసమే జైలర్ 2లో నటించా: విజయ్ సేతుపతి -
జైలర్ 2లో యాక్ట్ చేశా.. రజనీకాంత్ కోసమే..
తమిళ స్టార్ విజయ్ సేతుపతి.. హీరోగా, విలన్‌గా సినిమాలు చేస్తున్నాడు. అవసరమైతే అతిథి పాత్రలో కనిపించేందుకు కూడా సిద్ధమే అంటున్నాడు. తాజాగా ఆయన రజనీకాంత్ జైలర్ 2 మూవీలో యాక్ట్ చేసినట్లు ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. జైలర్ 2లో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. నాకు రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టం. అలాంటి రోల్స్ చేయనుఇండస్ట్రీలో ఎన్నో దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నవారి దగ్గరినుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. అలా జైలర్ 2లో ఆయన దగ్గరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నన్ను చాలామంది విలన్ పాత్రల కోసం సంప్రదిస్తున్నారు. అయితే అవన్నీ రొటీన్‌గా ఉంటున్నాయి. హీరోను ఎలివేట్ చేసే విలన్ పాత్రలు చేయడం నాకెంతమాత్రమూ ఇష్టం లేదు.మూకీ సినిమాతో..కథను ముందుకు నడిపిస్తూ ప్రేక్షకులకు థ్రిల్ పంచే విలన్ పాత్రల్ని మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం 'గాంధీ టాక్స్'. మూకీ (మాటలు లేని) సినిమాగా తెరకెక్కిన గాంధీ టాక్స్ జనవరి 30న విడుదలవుతోంది. ఈ మూవీలో అరవింద్ స్వామి, అదితిరావు హైదరి, సిద్దార్థ్ జాదవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.చదవండి: మహేశ్‌బాబు గుడ్‌న్యూస్.. ఆరోజే ఓపెనింగ్ -
హీరో నో రెమ్యునరేషన్.. హీరోయిన్ చేయనంది..
ద్రౌపది 2 మూవీలో నటించేందుకు హీరో రిచర్డ్ రిషి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చిత్ర దర్శకుడు మోహన్ జి పేర్కొన్నారు. ఈయన ఇంతకుముందు దర్శకత్వం వహించిన ద్రౌపది సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దానికి సీక్వెల్‌గా ద్రౌపది 2 తెరకెక్కిస్తున్నాడు.ఈ నెలలో రిలీజ్నేతాజీ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత చోళ చక్రవర్తి జీఎం ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి నిర్మించాడు. రక్షణ హీరోయిన్గా నటించిన ఇందులో నట్టి నటరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 23న విడుదల కానుంది.నెల రోజుల్లో షూటింగ్ పూర్తిఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత చోళ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంచి కథతో సినిమా చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు మోహన్ జి ఈ కథతో వచ్చారన్నాడు. సినిమా షూటింగ్‌ను 31 రోజుల్లో పూర్తి చేశారని తెలిపాడు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ నిర్వహించేవారని పేర్కొన్నాడు.ఆయన లేకపోతే ఈ సినిమా లేదుదర్శకుడు మోహన్ జీ మాట్లాడుతూ.. ఇది పీరియాడికల్ కథా చిత్రం అని చెప్పాడు. ద్రౌపది సినిమాలాగే ఈ మూవీకి కూడా అంతే సిన్సియర్‌గా పని చేశామన్నాడు. హీరో రిచర్డ్ రిషి లేకపోతే ఈ సినిమా లేదన్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని వెల్లడించాడు. అంతేకాకుండా గుర్రపు స్వారీ, కత్తి పోరాటాలలో శిక్షణ కోసం ఆయన రోజుకు 16 గంటల చొప్పున ఏడాది పాటు శ్రమించారని గుర్తు చేశారు. బడ్జెట్ దాటిపోయిందిముందు అనుకున్న బడ్జెట్‌ను దాటిపోయినా సరే కథపై నమ్మకంతో సపోర్ట్ చేసిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపాడు. ద్రౌపది మొదటి భాగంలో నటించిన హీరోయిన్ సీక్వెల్ చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో 25 మంది హీరోయిన్లను ఆడిషన్ చేసి చివరకు రక్షణను ఎంపిక చేశామన్నాడు. ఆమె చాలా ధైర్యవంతురాలని, మంచి ప్రతిభ ప్రదర్శించారన్నాడు. రక్షణకు మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. -
క్రేజీ కాంబో ఫిక్స్.. స్టార్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మూవీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ బాటపట్టారు. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే అట్లీతో జతకట్టిన బన్నీ.. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో మూవీకి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాకు ఏఏ23 వర్కింగ్ టైటిల్‌ను ప్రకటించింది. అల్లు అర్జున్.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. తొలిసారి వీరిద్దరు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్లో 23వ చిత్రంగా రానుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. A Collaboration that will be Eternal in Indian Cinema 🤘🏻🔥💥Icon Star @alluarjun X @Dir_Lokesh X @MythriOfficial X @anirudhofficialSTRIVE FOR GREATNESS🔥 ▶️ https://t.co/AGCi8q89x2Shoot begins in 2026 💥#AALoki #AA23 #LK7 pic.twitter.com/op2vnureqp— Mythri Movie Makers (@MythriOfficial) January 14, 2026 -
'పరాశక్తి' తర్వాత యంగ్ హీరోతో సుధ కొంగర చిత్రం
ఆమె చేసిందే తక్కువ చిత్రాలు.., కానీ, దర్శకురాలు సుధా కొంగర మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కెరీర్ ప్రారంభించింది తెలుగు చిత్ర పరిశ్రమలో.. ఉన్నత స్థాయికి చేరింది తమిళ పరిశ్రమలో.. ఆంధ్ర అందగాడు చిత్రం ద్వారా 2008లో దర్శకురాలిగా పరిచయం అయిన ఈమె తరువాత ద్రోహి, ఇరుదు చుట్రు, తెలుగులో గురు , సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం పరాశక్తి. నటుడు రవి మోహన్ ప్రతి నాయకుడిగా అధర్వ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం ద్వారా నటి శ్రీ లీల కథానాయకిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సంక్రాంతి సందర్భంగా గత 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. దీంతో దసరాలో సుధా కొంగర తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. అందుకు బదులు కూడా సమాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. యువ నటుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించనున్న చిత్రానికి సుధాకర్ దర్శకత్వం వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారంలో సారాంశం. ఈమె ఇంతకుముందే నటుడు ధృవ్ విక్రమ్‌కు కథను చెప్పినట్లు, అది ఆయనకు నచ్చినట్లు సమాచారం. అయితే చిత్రాల విషయంలో నిదానమే ప్రధానం అని భావించే మహిళా దర్శకురాలు సుధా కొంగర తన నూతన చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నదే ఇప్పుడు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల బైసన్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు విక్రమ్ తదుపరి నటించే చిత్రం పైన ఆసక్తి నెలకొంది. -
సడన్ సర్ప్రైజ్.. సంక్రాంతికి విజయ్ మూవీ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులకు ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్. ముందుగా బ్యాడ్‌న్యూస్ ఏంటంటే.. జన నాయగణ్ ఈ నెలలో రిలీజ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. గుడ్‌న్యూస్ ఏంటంటే.. సంక్రాంతికి జన నాయగణ్ లేకపోయినా విజయ్ బ్లాక్‌బస్టర్ మూవీ తేరి థియేటర్లలో రీరిలీజ్ అవుతోంది.పదేళ్ల సందర్భంగా..ఈ విషయాన్ని నిర్మాత ఎస్.కలైపులి థాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తేరి సినిమా వచ్చి ఈ ఏడాది ఏప్రిల్ 14కి పదేళ్లవుతుంది. ఈ క్రమంలో మళ్లీ అదే తారీఖున విజయ్ సినిమాను రీరిలీజ్ చేయాలని ఎప్పుడో ప్లాన్ చేశారు. కానీ విజయ్ చివరి మూవీ 'జననాయగణ్' సంక్రాంతికి రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.తేరి రీరిలీజ్వారికి కాస్త ఊరటనిచ్చేందుకు తేరి రిలీజ్‌ను ముందుకు జరిపారు. ఈ సంక్రాంతికి అంటే జనవరి 15న మళ్లీ విడుదల చేస్తున్నారు. తేరి సినిమా విషయానికి వస్తే ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. తేరీ తెలుగులో పోలీసుడు పేరిట డబ్ అయింది. ఈ సూపర్ హిట్ సినిమా పలు భాషల్లో రీమేక్ అయింది. గతేడాది హిందీలో బేబీ జాన్‌గా రీమేక్ అవగా బాలీవుడ్లో ఆకట్టుకోలేకపోయింది. ஜனவரி 15 முதல் அகிலமெங்கும்Thalapathy @actorvijay @Atlee_dir @gvprakash @Samanthaprabhu2 @iamAmyJackson #ThalapathyVijay #Theri #10YearsOfTheri pic.twitter.com/on3Pr30enp— Kalaippuli S Thanu (@theVcreations) January 10, 2026 చదవండి: బాలీవుడ్ ఎంట్రీ? స్పందించిన మలయాళ హీరోయిన్ -
పరిస్థితి మా చేయి దాటిపోయింది: నిర్మాత భావోద్వేగం
తన సినిమాలతో దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్నాడు హీరో విజయ్. ఇకపై ప్రజాసేవకే పరిమితం అవాలనుకున్న ఆయన జన నాయగణ్‌తో సినిమాలకు వీడ్కోలు పలకాలని భావించాడు. ఇదే తన చివరి చిత్రం అని ప్రకటించాడు. అభిమాన హీరోని చివరిసారి థియేటర్లో చూసుకుని సెలబ్రేట్ చేసుకునే రోజు కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూశారు. చివరి నిమిషంలో వాయిదాకానీ సెన్సార్ సమస్య కారణంగా చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో జన నాయగణ్ నిర్మాత వెంకట్ కె నారాయణ భావోద్వేగానికి లోనయ్యాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ.. జన నాగయణ్ సినిమాను 2025 డిసెంబర్ 18న సీబీఎఫ్‌సీకి పంపించాం. డిసెంబర్ 22న యూఏ 16+ సర్టిఫికెట్ ఇస్తామంటూ మాకు మెయిల్ చేశారు. సడన్‌గా ఓ ఫిర్యాదుఅలాగే కొన్ని మార్పులు చేయాలన్నారు. వాళ్లు సూచించినట్లుగా ఆ మార్పులు చేసి సినిమాను మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాం. సినిమా రిలీజ్‌కు మేమన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇంతలో సినిమాపై ఒక ఫిర్యాదు వచ్చిందని, దీన్ని రివైజింగ్ కమిటీకి పంపుతున్నామంటూ జనవరి 5న సెన్సార్ బోర్డు మెయిల్ చేసింది. ఆ ఫిర్యాదు ఏంటో? ఎవరు చేశారో? మాకు స్పష్టత లేదు. పరిస్థితి చేయిదాటిందిపైగా రివైజింగ్ కమిటీని సంప్రదించేందుకు సమయం మించిపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఏదేమైనా పరిస్థితి మా చేయిదాటిపోయింది. సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.. అందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. కొన్ని దశాబ్దాలుగా అభిమానులను అలరించిన హీరో విజయ్‌కు మంచి వీడ్కోలు దక్కాల్సింది! అని విచారం వ్యక్తం చేశాడు.అసలేంటి సమస్య?భగవంత్ కేసరి సినిమాను ఆధారంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం జన నాయగణ్. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సీబీఎఫ్సీ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేసింది. దీంతో రిలీజ్‌కు మూడురోజుల ముందు చిత్ర నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది. యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనంటూ మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో అటు చిత్రయూనిట్, ఇటు అభిమానులు సంతోషపడేలోపే మరో బాంబు పేలింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఎఫ్సీ మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంన్‌ను ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. View this post on Instagram A post shared by KVN Productions (@kvn.productions)చదవండి: రాజాసాబ్.. అందుకే ఎవరికీ మా సినిమా ఎక్కలేదు: మారుతి -
దళపతి విజయ్.. గతంలోనూ ఇలాంటి అనుభవాలే
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్' వాయిదా పడింది. లెక్క ప్రకారం ఈరోజే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతానికైతే కొత్త తేదీని ప్రకటించలేదు. 21వ తేదీన తర్వాత హియరింగ్ ఉంది. చూస్తుంటే ఈనెల రావడమే కష్టమే. దీని వెనక రాజకీయ కారణాలున్నాయని అభిమానులు, విజయ్ టీవీకే పార్టీ ఆరోపిస్తోంది. ఇదే కాదు గతంలోనూ విజయ్ చిత్రాలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి ఆ మూవీస్ ఏంటి?(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు)2023లో రిలీజైన 'లియో'కు చాలానే సమస్యలు ఏర్పడ్డాయి. తమిళనాడు వ్యాప్తంగా మార్నింగ్ షోలు వేయనివ్వలేదు. రోజుకి ఇన్ని షోలు మాత్రమే వేయాలని కఠినంగా వ్యవహరించారు. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశమివ్వలేదు. ఇలా పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. ఓవరాల్ రన్ ముగిసేసరికి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ మూవీగా నిలిచింది.2017లో రిలీజైన 'మెర్సల్'(అదిరింది).. రిలీజ్ తర్వాత రాజకీయ ఇబ్బందుల్లో ఎదుర్కొంది. జీఎస్టీ, నోట్ల రద్దు గురించి ఉన్న డైలాగ్స్ విమర్శలకు కారణమయ్యాయి. కొందరు నాయకులు.. ఏకంగా మూవీలో సీన్స్ తీసేయాలని డిమాండ్ చేశారు. అయినా సరే మేకర్స్ వెనక్కి తగ్గలేదు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు నమోదు చేసింది.2021లో రిలీజైన 'మాస్టర్'కు కొవిడ్ వల్ల సమస్యలు ఎదురయ్యాయి. అనుకున్న టైంకి విడుదల కాలేకపోయింది. థియేటర్ల కేటాయింపు, స్పెషల్ షోల కోసం అనుమతి ఇవ్వకపోవడం లాంటివి ఇబ్బంది పెట్టాయి. అలానే ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి ఇవ్వడంపై పలువురు పిటీషన్లు వేశారు. తర్వాత కోర్టు నుంచి ఆదేశాల వచ్చిన తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లు నమోదు చేసింది. విజయ్ స్టామినా ఏంటనేది మరోసారి నిరూపించింది.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్)2018లో 'సర్కార్' విడుదలకు ముందే అడ్డంకులు ఎదుర్కొంది. ఓటింగ్ సరళి, రాజకీయ పార్టీ గుర్తులు ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. వాటిని మ్యూట్ లేదా పూర్తిగా తీసేయమనే డిమాండ్స్ వినిపించాయి. కానీ కొన్ని మార్పులు చేసిన తర్వాత సినిమాని రిలీజ్ చేశారు. ప్రారంభంలో బాగానే ఆడింది కానీ లాంగ్ రన్లో ఓకే ఓకే అనిపించుకుంది.2015లో రిలీజైన 'పులి'కి అయితే పైన చెప్పినట్లు కాకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. విడుదలయ్యే కొన్నిరోజుల ముందు వరకు సమస్యలు తప్పలేదు. కొన్నిచోట్ల షోలు రద్దయ్యాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఓపెనింగ్స్ బాగానే తెచ్చుకుంది. తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.2012లో వచ్చిన 'తుపాకీ'కి అయితే విడుదలకు ముందే ఇబ్బందులు. టైటిల్, అలానే కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ, సామాజిక అంశాల దృష్ట్యా కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో చిన్న చిన్న మార్పులు చేసి పలు విషయాల్లో క్లారిటీ ఇచ్చిన తర్వాత థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. విజయ్ కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.2014లో వచ్చిన 'కత్తి' చిత్రానికి తిప్పలు తప్పలేదు. విడుదలకు ముందే నిర్మాతలపై విమర్శలు వచ్చాయి. శ్రీలంక తమిళ సెంటిమెంట్స్ అనుకూలంగా తీశారని రాజకీయ ఆరోపణలు చేశారు. బెదిరింపులు, చివరి నిమిషాల్లో హడావుడి వల్ల తమిళనాడు అంతటా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంతటా క్లియరెన్స్ తెచ్చుకుని అనుకున్న తేదీనే థియేటర్లలోకి వచ్చింది. విమర్శలు, ఆరోపణలు తట్టుకుని నిలబడింది. కమర్షియల్ సక్సెస్ అందుకుని విజయ్ ఇమేజ్ మరింత పెంచింది.(ఇదీ చదవండి: విజయ్ 'జన నాయగణ్'కి షాక్.. ఈనెలలో రిలీజ్ కష్టమే!) -
విజయ్ 'జన నాయగణ్'కి షాక్.. ఈనెలలో రిలీజ్ కష్టమే!
దళపతి విజయ్ 'జన నాయగణ్' చిత్రాన్ని కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదు. లెక్క ప్రకారం ఈ రోజే (జనవరి 09) థియేటర్లలోకి రావాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల ఆలస్యమైంది. ఈ మేరకు మొన్ననే నిర్మాతలు.. వాయిదా ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారమైపోతుందిలే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పట్లో ఇది తీరేలా కనిపించట్లేదు. తాజాగా అప్డేట్ ఏంటంటే?సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న 'జన నాయగణ్' సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని ఈరోజు మద్రాసు హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌పై డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాతలు కోర్టుపై ఒత్తిడి చేశారని డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు చిత్ర నిర్మాతలు, సోమవారం(జనవరి 11) నాడు సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. -
Allu Arjun: పుష్ప టార్గెట్ చేశాడంటే..! నీయవ్వ తగ్గేదేలే
-
హీరోయిన్గా రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్..
సినిమా మాధ్యమం చాలా పవర్ఫుల్. దీనికి చాలా మంది ఆకర్షితులవుతారు. పలువురు నటించాలని కలలు కంటారు. అందుకు కొందరు స్ఫూర్తి దాయకులవుతారు. అలా అగ్ర హీరోయిన్ నయనతారని స్ఫూర్తిగా తీసుకుని కథానాయికగా మారింది వర్ధమాన నటి ఐశ్వర్య కేఎస్. ఈమె హీరోయిన్గా నటించిన జస్టీస్ ఫర్ జెనీ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందింది. చిన్నతనం నుంచి ఆసక్తిపవర్ ఫుల్ పోలీస్ అధికారిగా భావోద్వేగాలతో కూడిన పాత్రలో నటించిన ఐశ్వర్య నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తాజాగా ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలు చెప్పింది. తనకు చిన్నతనం నుంచి కళలు, క్రీడలపై ఆసక్తి ఎక్కువ అంది. తాను కబడ్డీ క్రీడలో రాష్ట్ర స్థాయిలో తమిళనాడు తరఫున పోటీల్లో పాల్గొన్నానని చెప్పింది. అలా శారీరక వ్యాయామం చేయడం వల్ల నటనపై కూడా ఆత్మవిశ్వాసం కలిగిందని తెలిపింది.నా జీవితాన్ని మలుపు తిప్పిందికోవిడ్ కాలంలో ఒక షార్ట్ ఫిలింలో నటించే అవకాశం వచ్చిందని, అదే తన జీవితాన్ని మలుపు తిప్పిందని పేర్కొంది. తర్వాత జస్టిస్ ఫర్ జెనీలో నటించే అవకాశం వచ్చిందంది. తాజాగా నట్టి నటరాజ్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయంది. స్వయంకృషితో శ్రమించి అగ్ర కథానాయికగా ఎదిగిన నయనతార తనకు స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చింది. దర్శకులు వెట్రిమారన్, మారిసెల్వరాజ్ చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానంది. అలాగే కొత్త ఆలోచనతో వస్తున్న యువ దర్శకుల చిత్రాల్లోనూ నటించడానికి సిద్ధమంటోంది. -
పలు సవాళ్లు.. అన్నీ దాటుకుని సినిమా తీశా: సుధా కొంగర
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం పరాశక్తి. శ్రీలీల హీరోయిన్. రవిమోహన్ ప్రతినాయకుడిగా, అధర్వ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో నిర్మాత ఆకాశ్ భాస్కర్ తన డాన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శనివారం తెరపైకి రానుంది. స్క్రీన్‌ప్లే రాయడమే ఛాలెంజింగ్ఈ సందర్భంగా దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ.. పరాశక్తి సినిమా కథ రాసినప్పుడు పలువురి నుంచి అభినందనలు, అదే సమయంలో కథ గురించి పలు సందేహాలు తలెత్తాయన్నారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాయడమే ఛాలెంజింగ్‌గా మారిందన్నారు. అదే విధంగా సినిమా రిలీజ్ తర్వాత పలు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురూ హెచ్చరించారన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయాలని అయితే దర్శకుడు మణిరత్నంలాగా ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలని భావించి.. పలు సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ఈ సినిమాను నమ్మిన నిర్మాత ఆకాశ్ భాస్కర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నటీనటులతో పాటు, సాంకేతిక వర్గం ఈ సినిమాకోసం ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. పరాశక్తి తమిళ చిత్రపరిశ్రమలో ప్రత్యేక సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
జన నాయగన్ 'బుక్ మై షో' రీఫండ్.. చరిత్రలో ఇదే తొలిసారి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. సెన్సార్ బోర్డ్ నుంచి ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే, ఇందులో రాజకీయ కోణం ఉన్నట్లు విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే 'బుక్ మై షో'(BookMyShow) ద్వారా లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్లో అయితే ఈ సంక్రాంతికి ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా 'జన నాయగన్'(Jana Nayagan) రికార్డ్ క్రియేట్ చేసింది.బుక్ మై షోలో రికార్డ్'జన నాయగన్' వాయిదా పడటంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి 'బుక్‌మైషో' రీఫండ్ చేస్తుంది. టికెట్‌కు సంబంధించిన డబ్బులను ఎలా రీఫండ్ చేసుకోవాలో కూడా మెయిల్ ద్వారా పంపింది. భారతీయ సినిమా చరిత్రలో ఇది అతిపెద్ద రీఫండ్ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ విషయంలో జన నాయగన్ కొత్త చరిత్ర సృష్టించింది. సుమారు 5 లక్షలకు పైగా టిక్కెట్లను రీఫండ్ బుక్ మై షో చేస్తోంది. సుమారు రూ. 20 కోట్ల మేరకు ఆ సంస్ధ తిరిగి తన యూజర్స్‌కు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కోసం 'కమల్‌హాసన్' మేనల్లుడుజన నాయగన్ సెన్సార్ విషయంలో కమిటీలోని నలుగురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, కమిటీలోని ఒక సభ్యుడు భిన్నాభిప్రాయంతో ఉన్నట్లు CBFC ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సెన్సార్ సర్టిఫికెట్ జారీ ఆగిపోయింది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను నిలిపివేయాలన్న సిబిఎఫ్‌సి నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే, విజయ్ సినిమా తరుఫున కమల్‌హాసన్ మేనల్లుడు సతీశ్ పరాశరణ్ వాదిస్తున్నారు. -
ఆ స్టార్ హీరోకు వీరాభిమానిని: శ్రీలీల
అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగింది హీరోయిన్ శ్రీలీల. ఈ బెంగళూరు బ్యూటీ 'పెళ్లి సందడి' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రవితేజ, మహేశ్‌బాబు వంటి పెద్ద హీరోలతో జత కట్టి క్రేజ్ తెచ్చుకుంది. ఆ మధ్య అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప – 2 చిత్రంలో కిస్సిక్ అనే ప్రత్యేక పాటలో నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఎన్నో ఆశలుతాజాగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి శివకార్తీకేయన్‌కు జంటగా పరాశక్తి చిత్రంలో నటించింది. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఈనెల 10న తెరపైకి రానుంది. ఈమె తమిళంలో నేరుగా నటించిన చిత్రం పరాశక్తి కావడంతో శ్రీలీల ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఈ బ్యూటీ.. హీరో అజిత్‌కు వీరాభిమాని అని తెలిపింది. అంతే కాకుండా ఆయన అద్బుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని పేర్కొంది. అజిత్ సినిమాలో..ఈ అమ్మడు ఇటీవల మలేషియాలో కార్ రేస్‌లో పాల్గొన్న అజిత్‌ను కలిసి దిగిన ఫోటోను సామాజిక మాద్యమల్లో పోస్ట్ చేయగా అది నెటింట్లో వైరల్ అయ్యింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి కార్ రేస్‌లో పాల్గొంటున్న అజిత్ త్వరలో తన 64వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో అజిత్‌కు జంటగా శ్రీలీల నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే ఆమె అజిత్ గురించి గొప్పగా చెబుతున్నారనే ప్రచారం కూడా వైరల్ అవుతోంది. -
జీవీ.ప్రకాశ్ కుమార్ హ్యాపీరాజ్ షూటింగ్ పూర్తి
తమిళసినిమా: శత చిత్ర సంగీత దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత జీవి.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి హ్యాపీరాజ్. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జయవర్ధన్ నిర్మి స్తున్న ఈ చిత్రానికి మరియా ఇళంచెరియన్ దర్శకత్వం వహిస్తున్నారు. నటి శ్రీగౌరిప్రియ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో దర్శకుడు తెలుపుతూ ఇది వినోదంతో కూడిన కుటుంబ భావోద్రేకాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలు అలరించే ఫీల్ గుడ్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. నటీనటులు, సాంకేతిక వర్గం సహకారంతో చిత్ర షూటింగ్‌ను ప్రణాళిక ప్రకారం పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్రం సంతృప్తి కరంగా వచ్చిందని, ఈ చిత్ర షూటింగ్ అనుభవం మరిచిపోలేనిదని పేర్కొన్నారు. నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందన్నారు. చిత్ర కథలోని భావోద్రేకాలను చక్కగా తన నటనతో ప్రాణం పోశారన్నారు. నటి శ్రీగౌరిప్రియ చాలా బాగా నటించారని చెప్పారు. కాగా చాలా గ్యాప్ తరువాత ఇందులో నటుడు అబ్బాస్ కీలక పాత్రలో నటించినట్లు చెప్పారు. చిత్రం షూటింగ్ పూర్తి చేసిన సంతోషంతో నిర్మాణాంతర కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. చిత్ర ప్రోమోన ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. దీనికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, మదన్ కిస్టోఫర్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. -
'జన నాయగణ్' వాయిదా? 'రాజాసాబ్'కి లైన్ క్లియర్
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్'.. చెప్పిన తేదీకి థియేటర్లలో రిలీజ్ కావడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి కష్టాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ సమస్య తీరలేదు. నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈరోజు(జనవరి 07) వాదనలు జరిగాయి. తీర్పు రిజర్వ్‌లో పెట్టారు. 09వ తేదీన ఉదయం తుది ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ అసలేమైంది?(ఇదీ చదవండి: జీవో వచ్చేసింది.. 'రాజాసాబ్' టికెట్ ధర రూ.1000)రెండు వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు.. 'జన నాయగణ్' చూశారు. మూడు రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్స్ చేయమని మూవీ టీమ్‌కి సూచించారు. అలా చేస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని కూడా చెప్పారు. రెండు రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీమ్ పూర్తి చేశారు. వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేస్తుందనుకుంటే.. రెండు రోజుల తర్వాత కూడా సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్మాణ సంస్థ మరోసారి అడిగింది.ఇది జరిగిన తొమ్మిది రోజులకు అంటే జనవరి 05న సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ముంబైలోని ఆఫీస్‌ని సంప్రదించాలని సెన్సార్ సభ్యులు.. మూవీ టీమ్‌కి చెప్పారు. దీంతో నిర్మాణ సంస్థ.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో అత్యవసర పిటీషన్ వేసింది. త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పించేలా చూడాలని పేర్కొంది. తాజాగా ఈ విషయమై బుధవారం (జనవరి 07) ఇరువర్గాల మధ్య వాదనలు జరిగాయి.(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం)'జన నాయగణ్ చూసిన సభ్యుల్లో ఒకరు.. సినిమాలోని కొన్ని సీన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని రివిజన్ కమిటీ పరిశీలించాలి. తర్వాతే తదుపరి దశకు వెళ్తుంది. మరిన్ని మార్పులు చేయాల్సి వస్తే అది చట్ట ప్రకారం జరుగుతుంది. మూవీ చూసిన తర్వాత అప్పుడు సర్టిఫికెట్ మంజూరా చేస్తాం. మళ్లీ సమీక్షించాలని అవసరం లేదని మీరు(మూవీ టీమ్) కోర్టుకి వచ్చి చెప్పలేరు. చిత్రాన్ని ప్రస్తుతానికి నిలిపి ఉంచాలని సీబీఎఫ్సీ ఛైర్ పర్సన్ ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే సమాచారం అందించారు. నిర్మాతలకు కూడా జనవరి 05న ఇదే విషయాన్ని చెప్పారు. సినిమాని కొత్త కమిటీ మరోసారి సమీక్షిస్తుంది. అందుకు మరో 15 రోజులు పడుతుంది. దీనికి అంగీకారమైతే కొత్త కమిటీ ఏర్పాటుకు 20 రోజులు పడుతుంది' అని అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్.. కోర్టులో తన వాదనలు వినిపించారు.'మీరు చెప్పినట్లే ఇప్పటికే సినిమాలో మార్పులు చేశారు కదా' అని కోర్టు ప్రశ్నించగా.. సభ్యుల్లో ఒకరి నుంచి అభ్యంతరాలు వచ్చాయని, కమిటీ నిర్ణయానికి ఛైర్ పర్సన్ కట్టుబడి ఉంటారని సొలిసిటర్ జనరల్ న్యాయస్థానానికి విన్నవించారు. ఇకపోతే 'జన నాయగణ్' నిర్మాణ సంస్థ కేవీన్ ప్రొడక్షన్స్ తరఫు న్యాయవాది పరాశరన్ తన వాదనలు వినిపించారు.'మూవీకి సంబంధించిన ఏదైనా సరే 'ఈ-సినీ ప్రమాణ్' పోర్టల్ ద్వారా తెలియజేయాలి. కానీ సెన్సార్ వాళ్లు అలా వ్యవహరించలేదు. తమ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. సభ్యుల్లో ఒకరికి మాత్రమే అభ్యంతరాలున్నాయి. అంటే 4:1 నిష్పత్తిలో ఉంది. మెజార్టీ నిర్ణయం పాజిటివ్‌గానే ఉంది. అలాంటప్పుడు మరోసారి రివ్యూ కోసం ఎలా పంపుతారు? చట్టప్రకారం సెన్సార్ బోర్డ్ తమ విధులని పూర్తిగా విస్మరించింది' అని పరాశరన్ అన్నారు.ఈయన వాదనలపై స్పందించిన సొలిసిటర్ జనరల్.. సినిమాని మరోసారి సమీక్షించాలని తమకు ఎవరూ చెప్పలేదని, ఛైర్ పర్సన్‌కి నిర్ణయం తీసుకునే అధికారం ఉందని అన్నారు. వాదనలు విన్న జస్టిస్ ఆశా.. తీర్పుని రిజర్వ్ చేశారు. జనవరి 9న తుది ఉత్తర్వులు వెల్లడించనున్నారు. రిలీజ్ తేదీన తుది తీర్పు అంటే.. ఒకవేళ మూవీ టీమ్‌కి అనుకూలంగా వచ్చినా సరే అదే రోజున షోలు పడతాయా? లేదంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు 14వ తేదీకి మూవీ ఏమైనా వాయిదా పడుతుందా అనేది చూడాలి? ఒకవేళ విడుదల తేదీ మారితే మాత్రం 'రాజాసాబ్'కి పోటీ తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల విషయంలోనూ లైన్ క్లియర్ అయ్యే అవకాశముంటుంది.(ఇదీ చదవండి: ‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?) -
శివకార్తికేయన్‌కు కథ చెప్పిన పార్కింగ్ డైరెక్టర్!
సినిమా ఒక మాయాజాలం. ఇక్కడ ఎవరు, ఎప్పుడు పాపులర్ అవుతారో, ఎవరు ఎవరితో కలసి చిత్రాలు చేస్తారో ఊహించలేం. ఉదాహరణకు రజనీకాంత్ 173వ చిత్రం విషయానికే వస్తే దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అనే చర్చ జరిగింది. ధనుష్ సహా పలువురు దర్శకుల పేర్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా దర్శకుడు సుందర్ సి పేరు ఖరారైంది. డాన్ దర్శకుడితో రజనీకాంత్దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాంటిది హఠాత్తుగా ఆయన ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ పేరు తెరపైకి వచ్చింది. ఆహా.. లక్కీచాన్స్ అని అందరూ అనుకున్నారు. అంతలోనే డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు పేరు వినిపించింది. అయితే తాజాగా డాన్ చిత్రం ఫేమ్ శిబి చక్రవర్తి పేరు ఖరారైంది.పార్కింగ్ డైరెక్టర్ఇకపోతే పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఏం చేస్తున్నారని ఆరా తీస్తే ఆయన ఇటీవల శివకార్తికేయన్‌కు కథ వినిపించినట్లు తెలిసింది. శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన నటించిన పరాశక్తి చిత్రం ఈనెల 10న తెరపైకి రానుంది. తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఒక వేళ రామ్‌కుమార్ బాలకృష్ణన్ కథకు పచ్చజెండా ఊపితే వెంకట్ ప్రభుతో మూవీ చేశాకే ఆయన చిత్రం ఉండే అవకాశం ఉంది.చదవండి: ఉస్తాద్ భగత్‌సింగ్‌లో ఛాన్స్.. అందుకే వదిలేసుకున్నా: హీరోయిన్ -
విజయ్ చివరి సినిమా జననాయగన్ కాదా? మాట నిలబెట్టుకుంటాడా?
తమిళ స్టార్ హీరో విజయ్ తన కెరీర్ చివరి సినిమా జననాయగన్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్‌గా వస్తున్న జననాయగన్ ఈ నెల 9న విడుదల కానుంది. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, తన సినిమా ప్రయాణానికి ముగింపు పలికి ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ తన పార్టీ సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహిస్తూ రాజకీయ రంగంలో చురుకుగా ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవినే లక్ష్యంగా పెట్టుకుని తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. అయితే సినీ హీరోల రాజకీయ ప్రయాణం అంత సులభం కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు గుడ్‌బై చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి సరేసరి. మొదట్లో ప్రజలే తనకు ముఖ్యమని, సినిమాలు తనకు ప్రాధాన్యం కాదని పలుమార్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత మంచి డైరెక్షన్ టీమ్ ఉండి ఉంటే తను రాజకీయాల్లోకే వచ్చే వాన్ని కాదని ప్రకటించారు. ఇలా పవన్ ఎలాగైనా తన నాలుకను మడతేస్తూ ఉంటారు. ఇప్పుడు పొత్తులో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కినా కూడా సినిమాలు మాత్రం ఆపడం లేదు. కమల్ హాసన్ పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు విరామం ఇచ్చారు. తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఉపేంద్ర కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, తిరిగి దర్శకుడిగా, నటుడిగా బిజీగా మారిపోయారు. విజయ్‌కాంత్ మంచి స్థితిలో ఉన్న కెరీర్‌ను వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు. ఒక దశలో ప్రతిపక్ష నేతగా నిలిచినా, తర్వాత పార్టీ బలహీనమైపోయింది. విజయ్ రాజకీయాల్లో ఎంతవరకు విజయవంతం అవుతాడో చెప్పడం కష్టం. ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా, కనీస స్థాయిలో సీట్లు సాధించకపోయినా, ఆయన ప్రయాణం ఇతర స్టార్ హీరోల అనుభవాలకు భిన్నంగా ఉండకపోవచ్చు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకున్న క్రేజ్, ప్రజల మద్దతు రాజకీయాల్లోకి మారడం అంత తేలిక కాదు. ఇండస్ట్రీ బంగారు బాతు లాంటిది. అయినా పదవి లేకుండా రాజకీయ వేడి తట్టుకోవడం స్టార్ హీరోలకూ పెద్ద సవాలే మరి. -
'జన నాయగణ్' సినిమాపై రాజకీయ కుట్ర?
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. మరో మూడు రోజుల్లో అంటే ఈ శుక్రవారమే తెలుగు, తమిళంలో విడుదల కానుంది. మన దగ్గర పెద్దగా బజ్ లేదు గానీ తమిళనాడులో మాత్రం మంచి హైప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ)విజయ్ 'జన నాయగణ్' సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కావాలి. కానీ ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ రాలేదు. దాదాపు రెండు వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీ చూశారు. మూడు రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్స్ చేయమని మూవీ టీమ్‌కి సూచించారు. అలా చేస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని కూడా చెప్పారు. రెండు రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీమ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇది జరిగి రెండు రోజుల తర్వాత కూడా సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్మాణ సంస్థ మరోసారి అడిగింది.ఇది జరిగిన తొమ్మిది రోజులకు అంటే నిన్న(జనవరి 05).. సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ముంబైలోని ఆఫీస్‌ని సంప్రదించాలని చెప్పారు. దీంతో నిర్మాణ సంస్థ.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో కేసు వేసింది. త్వరగా ఇది ఇప్పించాలని పేర్కొంది. అయితే సెన్సార్ ఫార్మాలిటీస్ అంతా పూర్తయినా సరే ఇలా జరగడం వెనక ఎవరున్నారు? చెప్పిన తేదీకి రిలీజ్ అవుతుందా లేదా అని విజయ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.(ఇదీ చదవండి: 'అఖండ-2' ఫ్యాన్స్‌కు ట్విస్ట్ ఇచ్చిన 'నెట్‌ఫ్లిక్స్')రాజకీయ కారణాలతోనే తమ సినిమాకు ఇబ్బందులు పెడుతున్నారని విజయ్ టీవీకే పార్టీ ఆరోపణలు చేస్తోంది. విజయ్ పిటిషన్‌పై ఈ రోజు మధ్యాహ్నమే విచారణ జరగనుంది. ఇందులో ఏం తీర్పు వస్తుందో చూడాలి? ఈ ఏడాదిలోనే తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో విజయ్ సినిమాపై ఏమైనా రాజకీయ కుట్ర చేస్తున్నారా అనే సందేహం అభిమానులకు వస్తోంది.ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా.. పూజా హెగ్డే హీరోయిన్గా, మమిత బైజు కీలక పాత్ర చేసింది. తెలుగులో గతంలో వచ్చిన 'భగవంత్ కేసరి' రీమేక్ చేసి ఈ మూవీ తీశారు. కొన్నిరోజుల ముందు వరకు ఈ విషయమై రూమర్స్ వచ్చాయి గానీ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో రీమేక్ అనే క్లారిటీ వచ్చేసింది. ట్రోల్స్ కూడా ఎక్కువగానే చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఆ సినిమాలో చిన్మయి పాట కట్.. తేల్చేసిన దర్శకుడు) -
ఆ సినిమాలో చిన్మయి పాట కట్.. తేల్చేసిన దర్శకుడు
ఎప్పుడో ఏదో వివాదంతో చర్చనీయాంశమయ్యే సెలబ్రిటీ అనగానే చిన్మయి గుర్తొస్తుంది. స్వతహాగా సింగర్ అయినప్పటికీ ఫెమినిజం విషయమై నెటిజన్లకు ఈమెకు మధ్య మాటల పంచాయతీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యే శివాజీ వ్యాఖ్యలకు కూడా గట్టిగానే కౌంటర్స్ ఇచ్చింది. అంతకు ముందు ఓ సినిమాలో పాట పాడినందుకు సారీ చెప్పడంతోనూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ సాంగ్ సమస్యపై దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.తమిళంలో ఆరేళ్ల క్రితం 'ద్రౌపది' అనే మూవీ వచ్చింది. దర్శకుడు మోహన్ జీ తీసిన ఈ సినిమా అప్పట్లో వివాదాస్పదమైంది. మహిళా సంఘాలు, పలువురు కార్యకర్తలు ఈ చిత్రంపై నిరసన వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా, మహిళలని కించపరిచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లలో సింగర్ చిన్మయి కూడా ఉంది. అప్పట్లో మోహన్ vs చిన్మయి కౌంటర్స్ వేసుకున్నారు. అక్కడితో అది అయిపోయింది. ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీశారు.(ఇదీ చదవండి: 'ఖైదీ' పాప ఇప్పుడెలా మారిపోయిందో తెలుసా?)'ద్రౌపది 2' పేరుతో తీసిన ఈ సినిమాని మరికొద్ది రోజుల్లో తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇందులోనే చిన్మయి తనకు తెలియకుండానే ఓ పాట పాడింది. దీని గురించి నెల క్రితం చిన్నపాటి వివాదం నడిచింది. కొన్నాళ్ల క్రితం సంగీత దర్శకుడు జిబ్రాన్ అడగడంతో 'ఏమొకే' అనే పాట పాడానని.. అయితే ఏ సినిమా కోసమని అడగలేదని, ఒకవేళ ఈ మూవీ కోసమే అయితే అస్సలు పాడేదాన్ని కాదని అంటూ క్షమాపణ చెప్పింది. దర్శకుడు మోహన్ భావజాలం, సిద్ధాంతాలు నా దానికి పూర్తి వ్యతిరేకం అని ఏకంగా ట్వీట్ చేసింది.దీంతో ఆగ్రహం తెచ్చుకున్న దర్శకుడు మోహన్ జీ.. చిన్మయి, తన సినిమాకు కావాలనే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తుందని అప్పట్లో ఆరోపించారు. థియేటర్లలోకి సినిమా మరికొద్ది రోజుల్లో రాబోతున్న క్రమంలో సదరు పాటపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. చిన్మయి బదులు మరో గాయనితో పాడించిన వెర్షన్ సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. అలా ఈ సమస్య పరిష్కారమైపోయింది.(ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు) -
ఒక్క సినిమాతో ఫేమస్.. సీక్వెల్ వచ్చేలోపు హీరోయిన్ అయిపోద్దేమో?
గత కొన్నాళ్ల నుంచి దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ సీక్వెల్ ట్రెండ్ బాగా కనిపించింది. ఇందులో భాగంగా వచ్చి హిట్ అయిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఈ పాపనే తీసుకుంటే అలా ఓ మూవీలో చేసింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి సీక్వెల్ వచ్చేలోపు హీరోయిన్ అయిపోతుందేమోనని సందేహం వస్తోంది. మరి ఈ బాలనటి ఎవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మోనిక. తమిళనాడుకు చెందిన ఈమె.. విజయ్, అజిత్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి పలు సినిమాల్లో బాలనటిగా చేసింది. అయితే 'ఖైదీ'లో హీరో కార్తీ కూతురిగా నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తీసిన ఈ మూవీ 2019లో రిలీజైంది. అప్పటికి ఈమె వయసు 11 ఏళ్లు. తర్వాత లోకేశ్ కనగరాజ్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన 'విక్రమ్' క్లైమాక్స్‌లోనూ కాసేపు అలా కనిపించింది.'ఖైదీ 2'లోనూ ఈ పాప పాత్ర కచ్చితంగా ఉండే అవకాశముంది. చూస్తుంటే పాప పెరిగి పెద్దయిపోయింది. మరి ఖైదీ సీక్వెల్ ఎప్పుడొస్తుందో? అసలు వస్తుందో రాదో ప్రస్తుతానికైతే తెలియని పరిస్థితి. ఒకవేళ తీస్తే మాత్రం ఈ పాపని కాకుండా వెరే వాళ్లని పెట్టి మేనేజ్ చేయాల్సి ఉంటుంది. చూస్తుంటే లోకేశ్ కనగరాజ్ ఈ సీక్వెల్ తీసేలోపు ఈ బాలనటి.. హీరోయిన్‌గానూ సినిమాలు చేసేస్తుందేమోనని అనే కౌంటర్స్ పడుతున్నాయి.(ఇదీ చదవండి: నటి రాశికి క్షమాపణ చెప్పిన అనసూయ) -
వదంతులను నమ్మొద్దు.. భారతి రాజా కూతురి ప్రకటన
సీనియర్ సినీ దర్శకుడు భారతీరాజా ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో స్థానికంగా అంజీకరైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నారు. వైద్యులు ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు భారతీరాజా గురించి గత మూడు రోజులుగా రకరకాల ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో భారతి రాజా గురించి జరుగుతున్న ప్రచారంపై ఆయన కూతురు జనని స్పందించారు. ఆమె మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తన తండ్రి ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, వదంతులను నమ్మవద్దని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతోందని చెప్పారు. కాగా దర్శకుడు భారతీరాజా ఆరోగ్య వంతంగా ఇంటికి తిరిగి రావాలని, గీత రచయిత వైరముత్తు, తదితర సినీ ప్రముఖులతో పాటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.భారతీరాజా విషయానికి వస్తే.. ఈయన 16 వయదినిలే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిని డైరెక్ట్ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కళక్కే పోగులు రైల్, ముదల్ మరియాదై, అలైగల్ ఓయ్వదిలై వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. రాధిక, రాధ, కార్తీక్ వంటి పలువురు నటీనటులను సినిమాకు పరిచయం చేశారు. తెలుగులో సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, ఆరాధన, ఈతరం ఇల్లాలు వంటి పలు సినిమాలు చేశారు. -
ఈ హీరోకు తొలిసారి రూ.75 కోట్ల బడ్జెట్!
హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి, కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు సూరి. ఈయన హీరోగా నటించి విడుదలైన గరుడన్, మామన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా సూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మండాడి. ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మదిమారన్ పుహళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సముద్ర తీరంలో జరిగే జాలర్ల బోటు పందేల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న సినిమా. ఇందులో సూరి జాలరిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చాలా వర్కౌట్ చేసి పూర్తిగా మారిపోయారు. రూ.75 కోట్లతో రూపొందుతున్న మండాడి సూరి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ స్టంట్ నిపుణులతో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ 40 రోజులపాటు చిత్రికరించినట్లు చెప్పారు. చిత్రంలోని బోటు ఫైట్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయన్నారు. దీనికి ప్రకాష్‌కుమార్ సంగీతం మరింత బలాన్ని చేకూర్చిందన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. -
కీర్తి సురేశ్ అక్కలో ఈ టాలెంట్ కూడా ఉందా?
కీర్తి సురేశ్ సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. ఆమె అక్క రేవతి థాంక్యూ అనే షార్ట్ ఫిలింకి డైరెక్టర్‌గా వ్యవహరించింది. తను భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. అలాగే ఫిలిం కోర్సు కూడా పూర్తి చేసింది. తాజాగా ఆమె వాయిద్య కళాకారిణిగా మారింది. ఈ విషయాన్ని ఆమె తల్లి, నటి మేనక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.తొలిసారి..అట్టుకల్ దేవి అమ్మవారి గుడిలో నా కూతురు రేవతి తొలిసారి డోలు వాయించింది అంటూ వీడియో షేర్ చేసింది. అందులో రేవతి తెల్ల చీర కట్టుకుని, నెత్తిన పూలు పెట్టుకుని డోలును ఓ భుజానికి తగిలించుకుని తన గ్రూపుతో కలిసి వాయిస్తోంది. గతంలో రేవతిని నాట్యకళాకారిణిగా, దర్శకురాలిగా చూసిన అభిమానులు.. ఇప్పుడిలా డోలు వాయించడం చూసి తనలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.సినిమాకాగా రేవతి.. దర్శకుడు ప్రియదర్శన్ దగ్గర కొన్నేళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. మరక్కర్, వాశి, బరోజ్ సినిమాల నిర్మాణంలోనూ పాలు పంచుకుంది. కీర్తి సురేశ్ తెరపై హీరోయిన్గా కనిపిస్తే, ఆమె అక్క మాత్రం తెర వెనుకే ఎక్కువ భాగమయ్యేది. వీరి తల్లి మేనక మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది. తండ్రి సురేశ్ కుమార్ నిర్మాతగా రాణించాడు. View this post on Instagram A post shared by Menaka Suresh (@menaka.suresh) చదవండి: రామ్‌చరణ్‌తో అనిల్ రావిపూడి సినిమా -
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' టీజర్ విడుదల
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'.. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ప్రేక్షకులను మెప్పించేలా టీజర్ ఉంది. ముఖ్యంగా ప్రకాష్ చెరుకూరి అందించిన సంగీతం మరింత ఇంపాక్ట్ చూపుతుంది.ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. 'గత కొన్ని రోజులుగా చిన్న సినిమాలన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి . దీంతో మా అందరికి ఒక హోప్ వచ్చింది. సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. టికెట్ ధరలు తక్కువ ఉంటే ఆడియన్స్ అందరూ వచ్చి సినిమా చూస్తారని భావిస్తున్నాను. మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పాం. మనమందరం కూడా వ్యవసాయం నుంచే వచ్చాము. ఒక్కసారి మనమందరం వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని తరాలు కూడా వ్యవసాయం నుంచే వచ్చాయి. వ్యవసాయం గురించి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతూనే సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం.' అని ఆయన అన్నారు.ప్రొడ్యూసర్ అరవింద్ మాట్లాడుతూ .. 'ఈ మూవీ మంచి కంటెంట్‌తో పాటు హైలీ ఎంటర్టైన్ అందించేలా ఉంటుంది. ఈ కార్యక్రమానికి పల్స్ ఆఫ్ వర్కింగ్ ఫ్రొం హోం అని పెట్టాం. ఈ సినిమా పల్స్ ఏమిటో ఆడియన్స్ కి తెలియాలని. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో పాటు మీనింగ్ ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరింత ప్రమోషనల్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం.' అని ఆయన అన్నారు. -
హీరో విజయ్ సీఎం అవుతాడు: సుమన్
తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నాడు. ఈ ఏడాది జరగబోయే ఎలక్షన్స్‌లో తను స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' తరపున పోటీ చేయనున్నాడు. అయితే ఈసారి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నాడు సీనియర్ నటుడు సుమన్.జనాల్లో అనుమానాలుతాజాగా సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనాలు సెలబ్రిటీలను చాలారకాలుగా పరిశీలిస్తారు. ఈ హీరో నిజంగానే పొడుగ్గా ఉన్నాడా? ఎర్రగా ఉన్నాడా? ఆయన జుట్టు ఒరిజినలేనా? గొంతు తనదేనా? ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి హీరో సభకు వస్తుంటారు. మొదటిసారి వచ్చినంతమంది జనాలు రెండోసారి రారు. అయినా రెండోసారి, మూడోసారి కూడా పెద్ద మొత్తంలో జనాలు వస్తున్నారంటే అది భయంకరమైన ఫాలోయింగ్ అని అర్థం.సినిమా వదిలేయాల్సిందే!ఏదేమైనా ఆయన అదృష్టం, జాతకాన్ని బట్టి రాజకీయాల్లో ఫలితం ఉంటుంది. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చి గెల్చారంటే మాత్రం మూవీస్ వదిలేయాల్సిందే! ఎందుకంటే ప్రజలు ఆయనపై నమ్మకం పెట్టి గెలిపించారంటే ఎక్కడా ఏ తప్పూ జరగకుండా చూసుకోవాలి! సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఎక్కడైనా తప్పు జరిగిందనుకోండి.. ఆ నింద హీరోపైనే వేస్తారు.రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేంఅందుకే గెలిచేవరకు ఆగండి. గెలిచిన తర్వాత మాత్రం తప్పనిసరిగా సినీ జీవితాన్ని పక్కనపెట్టండి. సినిమాల్లోకి ఎప్పుడైనా రావొచ్చు.. కానీ రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేం.. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం.. ఇలా ఏమేం చేయాలో అన్నీ చేయండి.. ఆల్రెడీ సగంలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ప్రజాసేవకు అంకితం కండి. ప్రజలకు అనేక సమస్యలున్నాయి. విజయ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్మీరు షూటింగ్‌కు వెళ్తే ఏమంటారంటే.. ఆయన షూటింగ్‌కు వెళ్లకుంటే ఈ పని పూర్తి చేయొచ్చు అని పెదవి విరుస్తారు. ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చాక ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాను పూర్తి చేశారు తప్ప మళ్లీ సినిమాల్లోకి వెళ్లలేదు. విజయ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓటు వేయడానికి ఒకటీరెండు రోజుల ముందు ఏదైనా ఒక సంఘటన జరిగితే అంతా మారిపోతుంది. లేదు, ఆయనకు అదృష్టం ఉంటే కచ్చితంగా విజయ్ సీఎం అవుతాడు అని సుమన్ చెప్పుకొచ్చాడు.చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. గూండా అని పేరెంట్స్ తిట్టారు -
సంక్రాంతికి శివాజీ 2 వచ్చేస్తున్నాడు..!
-
అరె.. ఏంట్రా ఇది! జన నాయగణ్ ట్రైలర్లో ఏఐ!
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ ఈ సంక్రాంతితో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టనున్నాడు. ఆయన నటించిన చివరి చిత్రం 'జన నాయగణ్'. తెలుగులో 'జన నాయకుడు' పేరిట రిలీజవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. నిన్న రిలీజైన ట్రైలర్‌తో ఇది నిజమేనని రుజువైంది.తెలుగు మూవీ రీమేక్భగవంత్ కేసరి సినిమాను, పాత్రలను ఇక్కడ మక్కీకి మక్కీ దింపినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే కొన్ని సీన్ల కోసం ఏఐని వాడారంటూ ప్రచారం మొదలైంది. ట్రైలర్లో ఓ చోట గూగుల్ జెమిని ఏఐ మార్క్ కనిపించగా దానికి సంబంధించిన స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సినిమావిజయ్ చిట్టచివరి సినిమాలో కూడా ఏఐని ఉపయోగించడం ఏంట్రా బాబూ.. పైగా రీమేక్ సినిమాకు ఏఐ అవసరం ఏమొచ్చింది? రూ.400 కోట్ల బడ్జెట్.. ఈ చిన్న మిస్టేక్ కూడా గమనించుకోకపోతే ఎలా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జన నాయగణ్ విషయానికి వస్తే.. ఇందులో మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం జనవరి 9న విడుదలవుతోంది. They used AI Gemini shot and didn't bother to remove the watermark 😭#JanaNayagan pic.twitter.com/voi66tbLg0— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) January 3, 2026 చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్నల చేతిలో చీవాట్లు -
ద్రౌపది 2 మూవీలో తుగ్లక్ పాత్ర
దర్శకుడు మోహన్.జి ఇంతకుముందు దర్శకత్వం వహించిన చిత్రం ద్రౌపది. ఆ మూవీ విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా ద్రౌపది 2 తెరకెక్కుతోంది. రిచర్డ్ రిషి, రక్షణ జంటగా నటించిన ఇందులో నట్టి నటరాజ్, వైజీ.మహేంద్రన్, నాడోడిగళ్ భరణి, శరవణ సుబ్బయ్య, చిరాగ్ జానీ, దివి, దేవయాని శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నేతాజీ ప్రొడక్షన్స్ అధినేత చోళ చక్రవర్తి జిఎం ఫిలింస్ కార్పొరేషన్ సంస్థతో కలిసి నిర్మించారు.ద్రౌపది 2 విశేషాలుఫిలిప్ ఆర్ సుందర్ ఛాయాగ్రహణం, జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు యూ/ఏ సర్టిఫికెట్ పొంది త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. త్వరలోనే ఆడియో లాంచ్ సహా, ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. కాగా 14వ శతాబ్దానికి చెందిన తమిళ చరిత్రలోని ముఖ్యమైన అంశాలతో ద్రౌపది 2ని తెరకెక్కించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఇందులో ముగ్గురు ప్రతినాయకులు నటిస్తున్నారని.. అందులో ప్రధానంగా నటుడు చిరాగ్ జానీ నటిస్తున్నట్లు తెలిపారు. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ పాత్ర పోషించారని వెల్లడించారు. అతి తెలివి కలిగిన తుగ్లక్ పాత్ర తెరపై ఆవిష్కరించడం కాస్త కష్టంగా మారిందని, కానీ, చిరాగ్ జానీ సమర్థవంతంగా పాత్రను పోషించారని తెలిపారు. ఈ మేరకు చిరాగ్ జానీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. Terror Wears A Crown 👑Unveiling the Delhi Sultanate #MohdBinThugluq.. @JaniChiragjani Nailed it.. Roaring as First-Level Antagonist🔥@richardrishi@GhibranVaibodha@Rakshana1826 @natty_nataraj @Nethajifilm1032 @SureshChandraa@AbdulNassarOffl @DoneChannel1 pic.twitter.com/4aFcfLh95E— Mohan G Kshatriyan (@mohandreamer) January 2, 2026 -
శత్రువులు కూడా మిత్రువులే.. 'అద్దం' స్పెషల్ గిఫ్ట్!
తమిళ నటుడు బాలా.. భార్య కోకిలతో కలిసి కొత్త ఏడాది సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ సందర్భంగా భార్య అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. కొత్త సంవత్సరంలో తాను అందుకున్న స్పెషల్ గిఫ్ట్ అద్దం అని తెలిపాడు.తన సోదరి అమెరికా నుంచి ఈ బహుమతి పంపిందని, ఆ గిఫ్ట్ తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు.శత్రువుల్లేరుట్రోల్స్ను ఎలా డీల్ చేస్తావని కోకిల ప్రశ్నించింది. అందుకు బాలా స్పందిస్తూ.. మనం ఎదుటివారిని చూసేదాన్ని బట్టి వారు శత్రువులుగా కనిపిస్తారు. అదే ఫ్రెండ్స్‌గా చూస్తే.. ఇంకా శత్రువులుగా ఎందుకుంటారు? అని బదులిచ్చాడు. 2026లో నరదృష్టి ఉండకూడదని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.ముందడుగుపర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. మా పెళ్లి తర్వాత కూడా మేము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. ఈ కొత్త సంవత్సరం మా జీవితాల్లో ఓ అడుగు ముందుకు వేయబోతున్నాం. సినిమాల విషయానికి వస్తే.. నాలుగైదు కథలు విన్నాను, కానీ ఇంకా దేనికీ ఓకే చెప్పలేదు. అర్థవంతమైన పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.నాలుగు పెళ్లిళ్లుబాలా వైవాహిక జీవితం విషయానికి వస్తే.. 2008లో చందన సదాశివ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదికే ఆమెతో విడిపోయాడు. 2010లో మలయాళ సింగర్ అమృతా సురేశ్‌ను పెళ్లాడగా వీరికి ఓ కూతురు జన్మించింది. ఈ దంపతులు కూడా ఎంతోకాలం కలిసుండలేదు. 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్‌ను వివాహం చేసుకోగా వీరు కూడా విడిపోయారు. రెండేళ్ల క్రితం చుట్టాలమ్మాయి కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: పోకిరి విలన్‌కు యాక్సిడెంట్ -
ప్రదీప్ రంగనాథన్ సరసన టాప్ హీరోయిన్
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నాడు. దర్శకుడిగా తొలి చిత్రం (కోమాలి)తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ తర్వాత తను హీరోగా తెరపైకి వచ్చాడు. అలా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా లవ్‌టుడే సినిమా చేశాడు. యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. ఈ తర్వాత డ్రాగన్, డ్యూడ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. అయితే, మరోసారి దర్శకుడిగా ఒక భారీ చిత్రాన్ని ప్రదీప్ ప్లాన్ చేస్తున్నాడు.ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి.. ఇప్పుడు ప్రదీప్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి పాత్ర చాలా బలంగా ఉండనుందని టాక్.. ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా ఈ మూవీ నిలవనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మార్చిలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
నర్సు నుంచి హీరోయిన్ రేంజ్‌కు.. పెళ్లి కబురు చెప్పిన బ్యూటీ
మానవ జీవితంలో వివాహ బంధం చాలా ప్రవిత్రమైంది. అది అందంగా అమరడం ఒక వరం. పెళ్లి అనేది కొందరికి సరైన సమయంలో జరుగుతుంది. మరి కొందరికి కొంచెం ఆలస్యం కావొచ్చు. అయితే 99 శాతం మందికి జీవితం వివాహబంధంతో పరిపూర్ణం అవుతుంది. ఇకపోతే తమిళ నటి జూలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. సుమారు ఏడేళ్ల క్రితం చెన్నై మెరినా బీచ్ వద్ద జరిగిన జల్లికట్టు పోరాటంలో గొంతు కలిపి జూలీ పాపులర్ అయింది. మొదట ఆమె ఒక సాధారణ నర్సు.. జల్లికట్టు ఉద్యమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో తమిళ బిగ్‌బాస్-1 షోలో ఛాన్స్ రావడం అలా మరింత గుర్తింపు పొందారు. బిగ్‌బాస్ నుంచి బయటకువచ్చిన తరువాత సినిమా రంగం ఆహ్వానం వచ్చింది. అలా కొన్ని చిత్రాల్లో నటించిన జూలీ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ అయ్యారు. ప్రముఖ మోడల్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ ప్రముఖ హీరోయిన్లను మించి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి జూలీకి ఇప్పుడు కల్యాణ ఘడియలు వచ్చేశాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లో, ప్రేమ వివాహమో తెలియదుగానీ, మహ్మద్ జక్రీమ్ అనే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ బిగ్‌బాస్ గేమ్ షోలో కలిసి పాల్గొన్నారన్నది గమనార్హం. వీరి నిశ్చితార్థం వేడుక ఇటీవల జరిగింది. ఆ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జూలీ, మహ్మద్ జాక్రీన్ల వివాహం ఈ నెల 16వ తేదీ ఉదయం చైన్నై, సెంథామస్లోని సెయింట్ పేట్రిక్ చర్చిలో జరగనుంది. అదే రోజు సాయంత్రం వీరి వివాహ రిసెప్షన్ జరగనుందని తెలిసింది. View this post on Instagram A post shared by Julie (@mariajuliana_official) -
యోగిబాబు కెరీర్లో మైల్స్టోన్ సినిమా.. ఫస్ట్‌లుక్ విడుదల
మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన యోగిబాబు ఇప్పుడు బిజీ నటుడు. కమెడియన్ గానే కాకుండా హీరోగాను నటిస్తున్నారు. కోలీవుడ్‌లో యోగిబాబు లేని చిత్రం ప్రస్తుతకాలంలో లేదనే చెప్పవచ్చు. కాగా ఈయన నటిస్తున్న 300వ చిత్రానికి అర్జునన్ పేర్ పత్తు(Arjunan Peru Paththu) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటుడు విజయ్ సేతుపతి ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. దేవ్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డి తంగపాండి, ఎస్ కృతిక తంగ పాండి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆర్.రాజమోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందనే ఆనందాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేశారు. ఇది ఇంతకుముందు యోగిబాబు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. పాత వాహనాల విక్రయాల్లో జరిగే మోసాలను, తద్వారా గురయ్యే ప్రజల బాధలను ఆశ్రయించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. అదేవిధంగా ఇకపై పాత వాహనాల క్రయ విక్రయాలపై అవగాహన కలిగించే విధంగా, వాస్తవ ఘటనలతో రూపొందిస్తున్న చిత్రం అర్జునన్ పేర్ పత్తు అని చెప్పారు. ఇది అన్ని వర్గాలను ప్రేక్షకులను అలరింపజేసే చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం ద్వారా నటి అనామిక మహి నాయకిగా పరిచయం అవుతున్నారు. నటుడు కాళీ వెంకట్, అరుళ్ దాస్, అయిలి మదన్ ,ఎస్ సుబ్రహ్మణ్యం శివ, మైనర్ నందిని, సౌందర్య, సెన్ డ్రాయన్ ,హలో కందస్వామి, పావ లక్ష్మణ్, రంజన్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటూ దర్శకుడు లెనిన్ భారతి కీలకపాత్రలో నటిస్తున్నారు. చిత్ర షూటింగును చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు దర్శకుడు చెప్పారు. దీనికి డీ.ఇమాన్ సంగీతాన్ని, ప్రదీప్ కాళీరాజా ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే చిత్రం ట్రైలర్, ఆడియో విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
స్టార్ హీరోలను కాదని.. కోతితో దర్శకుడి సినిమా!
అజిత్, విజయ్‌కాంత్, సూర్య, ఆమిర్ ఖాన్, విజయ్, రజనీకాంత్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు దర్శకుడు ఏఆర్ మురుగదాస్. అయితే ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ చిత్రం పూర్తిగా నిరాశపర్చింది.వరుస అపజయాలుఅలాగే హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికిందర్ అపజయంపాలైంది. కొంచెం గ్యాప్ తర్వాత శివకార్తికేయన్ హీరోగా చేసిన మదరాసి కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఏఆర్ మురుగదాస్ నెక్స్ట్ సినిమా ఏంటన్న ఆసక్తి నెలకొంది.ఎప్పుడో అనుకున్నా..అయితే ఈసారి స్టార్ హీరోలను కాకుండా ఒక వానరాన్ని నమ్ముకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ భేటీలో పేర్కొన్నారు. తన నెక్స్ట్ సినిమాలో కోతి ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలిపారు. కాకపోతే ఆ కోతి గ్రాఫిక్స్‌లో రూపొందించనున్నామన్నారు. తాను సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న సమయంలోనే ఈ కథతో సినిమా చేయాలని భావించానని, ఇది బాలల ఇతివృత్తంతో రూపొందే సినిమాగా ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
నటుడిగా మారిన ఏఆర్ రెహమాన్
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఇప్పుడు నటుడిగా మారారు. ఇప్పటివరకు స్టేజీలపై తన గానం, సంగీతంతో అలరించిన ఆయన పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించారు. గతంలో దర్శకనిర్మాతగానూ పరిచయం చేసుకున్న రెహమాన్ తాజాగా నటుడిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. మూన్‌వాక్ సినిమాలో డ్యాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో కలిసి నటిస్తున్నారు.యంగ్ డైరెక్టర్గాబిహైండ్వుడ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ ఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ పలు ప్రత్యేకతలతో రూపొందుతోందని దర్శకుడు పేర్కొన్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు అనే తనే ప్రత్యేకతను మించి మూన్‌వాక్ మూవీ ద్వారా నటుడిగా రంగప్రవేశం చేస్తున్నాననన్నారు. ఇందులో తాను ఆక్రోశం కలిగిన యంగ్ డైరెక్టర్‌గా కనిపించనున్నట్లు చెప్పారు. అలాగే ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తూ 5 పాటలను ఆయనే పాడటం మరో విశేషం.ప్రభుదేవాతో డ్యాన్స్ఒక పాటలో ప్రభుదేవాతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవమని గుర్తు చేసుకున్నారు. ఆ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారని తెలిపారు. ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా నటించగా, యోగిబాబు త్రిపాత్రాభినయం చేశారని చెప్పుకొచ్చారు. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను జనవరి 4న చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ఈ మూవీలో అంజు వర్గీస్, అర్జున్ అశోకన్ సాక్షి, సుష్మిత, నిష్మా, స్వామినాధన్, రెడిన్ కింగ్స్టన్, రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే నెలలో మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
పిల్లల్ని కనాలనే ఆలోచన నాకు లేదు: వరలక్ష్మి శరత్ కుమార్
సామాన్యులైనా సెలబ్రిటీలైనా పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడో ఇప్పుడో పిల్లల్ని ప్లాన్ చేసుకుంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లల్ని వద్దనుకుంటున్నారు. ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి. ఇప్పుడు నటి వరలక్ష్మి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తనకు అసలు పిల్లల్ని కనాలనే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టేసింది. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మతనం గురించి చెప్పింది.'అమ్మతనం అనేది చాలా పెద్ద బాధ్యత. పిలల్ని కన్నంత మాత్రాన తల్లి అయిపోలేరు. ఎందుకంటే నేను నా చెల్లికి తల్లిగా ఉంటాను. నా పెంపుడు కుక్కలకు తల్లిగా వ్యవహరిస్తా. నా స్నేహితులని తల్లిలా చూసుకుంటా. సాయం కావాల్సిన వాళ్లకు తల్లిగా తోడుంటా. నా వరకు అమ్మతనం అంటే అర్థమిదే. నాకు వ్యక్తిగతంగా అయితే పిల్లల్ని కనాలనే ఆలోచన లేదు. భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో అసలు పెళ్లే వద్దనుకున్నాను. అలానే పిల్లల్ని వద్దనుకునే చాలామంది.. వాళ్లు తీసుకున్న మంచి నిర్ణయం అదే' అని వరలక్ష్మి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: అమ్మనాన్న విడాకులు.. రాధికనే కారణమని తిట్టుకున్నా: వరలక్ష్మి)సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన వరలక్ష్మి.. ప్రారంభంలో హీరోయిన్గా చేసింది. పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో మంచి మంచి పాత్రలు చేస్తూ అలరిస్తోంది. హీరో విశాల్‌తో ఈమెకు పెళ్లని కొన్నాళ్ల ముందు వార్తలొచ్చాయి. వాటికి చెక్ పెడుతూ గతేడాది నికోలాయ్ సచ్దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఓవైపు యాక్టింగ్, మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌తో వరలక్ష్మి బిజీగా ఉంది.వరలక్ష్మి పిల్లల్ని వద్దని అనుకోవడంపై చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాను చిన్నతంలో లైంగిక వేధింపులకు గురయ్యానని గతంలో ఓ షోలో చెప్పింది. ఐదారుగురు తనని ఇబ్బంది పెట్టారనే విషయం బయటపెట్టింది. అలానే ఈమెకు ఊహ తెలిసొచ్చిన తర్వాత తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఈమె తల్లి ఛాయాదేవి నుంచి విడిపోయిన తర్వాత శరత్ కుమార్, నటి రాధికని పెళ్లిచేసుకున్నారు. ఒకవేళ పిల్లల్ని కంటే తనలా ఎక్కడ ఇబ్బంది పడతారోనని వరలక్ష్మి ఆలోచిస్తున్నట్లు ఉంది. అందుకే ఈ వ్యాఖ్యలు చేసిందా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ ఎప్పుడంటే?) -
ఆ సినిమా చూసి డిస్టర్బ్ అయ్యా.. ఇది ఊహించలేదు!
'బైసన్' మూవీతో ఈ ఏడాది మంచి హిట్ అందుకున్నాడు తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్.. కేవలం ఐదు సినిమాలతోనే టాప్ దర్శకుడిగా మారిపోయాడు. 'పెరియేరమ్ పెరుమాల్', 'కర్ణన్', 'మామన్నన్', 'వాళై', 'బైసన్' చిత్రాలతో ఇండస్ట్రీలో తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇటీవల ఓ సినిమా తనను ఎంతగానో డిస్టర్బ్ చేసిందంటున్నాడు మారి సెల్వరాజ్.కలత చెందా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఓటీటీలో 'హోంబౌండ్' అనే హిందీ సినిమా చూశాను. ఆ తర్వాత రెండు, మూడు రోజులు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ సినిమా నాపై ఇంత ప్రభావాన్ని చూపుతుందనుకోలేదు. ఎంతో కలత చెందాను.. మనం మాత్రం కరోనా లాక్‌డౌన్‌ను మనం ఇంత ఈజీగా దాటేశామా? అనిపించింది. నా దృక్కోణాన్నే మార్చేసిందిహోంబౌండ్ చూశాక కొద్దిరోజులు ఎవరితోనూ మాట్లాడలేదు. సినిమాను మరింత ప్రామాణికంగా, వాస్తవికంగా ఎలా తీయాలో నన్ను ఆలోచించేలా చేసింది. ఒక దర్శకుడిగా నా దృక్కోణాన్నే మార్చేసింది అని చెప్పుకొచ్చాడు. హోంబౌండ్ విషయానికి వస్తే.. ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. నీరజ్ గెవాన్ దర్శకత్వం వహించాడు. మార్టిన్ స్కోర్సెస్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.చదవండి: చిన్న వయసులో ఆస్తులన్నీ కోల్పోయాం.. షాంపూలు అమ్మా: నటుడు -
ఆయన కూడా తప్పుకున్నట్లే.. డ్రాగన్ డైరెక్టర్‌కు ఛాన్స్!
రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒక క్రేజీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. రజనీకాంత్ కథానాయకుడుగా నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మొదట దర్శకుడు సుందర్.సి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటన చేశారు. సుందర్.సి అవుట్అంతేకాదు ఈ చిత్ర పూజ కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అనూహ్యంగా ఆ చిత్రం నుంచి దర్శకుడు సుందర్.సి వైదొలగడంతో పెద్ద చర్చే జరిగింది. అయితే రజనీకాంత్‌కు కథ సంతృప్తిని కలిగించకపోవడమే ఇందుకు కారణం అని నటుడు, నిర్మాత కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. పార్కింగ్ డైరెక్టర్ కూడా తప్పుకున్నట్లే!ఆ తర్వాత పార్కింగ్ చిత్రంతో జాతీయ అవార్డును పొందిన రామ్‌కుమార్ రజనీకాంత్ 173వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ మూవీ సెట్‌పైకి వెళ్లడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం జరిగింది. పార్కింగ్ చిత్రం తర్వాత రామ్‌కుమార్ శింబు హీరోగా చిత్రం చేయడానికి కమిట్ అయ్యారు. అయితే రజనీకాంత్‌కు దర్శకత్వం వహించే లక్కీచాన్స్ రావడంతో ముందుగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత శింబు హీరోగా సినిమా చేయాలని దర్శకుడు భావించినట్లు సమాచారం. కొత్తగా ఆయన పేరు తెరపైకి..అందుకు శింబు హీరోగా చిత్రాన్ని నిర్మించతలపెట్టిన డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఇప్పుడు ఈ యువ దర్శకుడు కూడా రజనీకాంత్ (Rajinikanth) సినిమా నుంచి వైదొలగినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా 'డ్రాగన్' చిత్ర దర్శకుడు అశ్వద్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చింది. ఈయన రజనీకాంత్ 173 వ చిత్రానికి దర్శకత్వం వహించినున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇదైనా ఫైనల్ అవుతుందో? లేదో? చూడాలి! -
హీరో విజయ్ పక్కన కచ్చితంగా నటిస్తా: హీరోయిన్
హీరో విజయ్‌కు జంటగా కచ్చితంగా నటిస్తానంటోంది హీరోయిన్, నిర్మాత సింథియా లూర్డే. సింథియా ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఈమె నిర్మించి, కథానాయికగా నటించిన చిత్రం అణలి. దినేశ్ దీన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డైరెక్టర్ పి.వాసు వారసుడు శక్తి వాసు ప్రతినాయకుడిగా నటించగా, బాలీవుడ్ నటుడు కబీన్ దుహాన్ సింగ్ మరో విలన్‌గా యాక్ట్ చేశాడు.జనవరి 2న రిలీజ్అభిషేక్, ఇళంగో కమరవెల్, నటి ఇనయ, జై సూర్య, మాథ్యూ వర్గీస్, అశోక్ పాండియన్, జాన్సన్ దివాకర్, వినోద్ సాగర్, బేబి శిమాలి, శివ ఇతర పాత్రల్లో నటించారు. రామలింగం చాయాగ్రహణం, దీపన్ చక్రవర్తి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 2న తెరపైకి రానుంది.హీరో లేడుసోమవారం సాయంత్రం చెన్నైలో ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరోయిన్ సింథియా లూర్డే మాట్లాడుతూ.. వర్ణాశ్రమమ్, దినసరి చిత్రాల తర్వాత తాను నిర్మించిన మూడో సినిమాయే అణాలి అని పేర్కొంది. ఇందులో తనే హీరోయిన్ అని.. హీరో ఎవరూ లేరంది. హీరోలు కూడా నటించేందుకు సంకోచించే యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా తానే రిస్క్ తీసుకుని నటించానంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి..ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో కథే ఉండటం లేదని, అయితే దినేష్ దీన చెప్పిక కథలో బలం ఉండటంతో ఈ సినిమా ఒప్పుకున్నానంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా పదివేల కంటైనర్లు కలిగిన యార్డ్‌లో బ్రహ్మాండమైన సెట్ వేసి 30 రోజులపాటు అక్కడే షూటింగ్ నిర్వహించినట్లు చెప్పింది. విజయ్ సరసన నటిస్తావిజయశాంతి తర్వాత పూర్తి యాక్షన్ హీరోయిన్గా నటించింది తానేనని పేర్కొంది. ఈ సినిమా రిలీజ్ హక్కులను రెడ్ జాయింట్ మూవీస్ సంస్థ పొందిందని తెలిపింది. జనవరి రెండున విడుదల చేస్తున్నామంది. హీరో విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పారంటున్నారని.. కానీ ఆయన మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. విజయ్ సరసన త్వరలోనే కచ్చితంగా నటిస్తానని సింథియా (Cynthia Lourde) బల్లగుద్ది చెప్పింది. -
మహిళా అభిమాని పెళ్లి.. సర్ప్రైజ్ చేసిన హీరో సూర్య
అభిమానుల పెళ్లికి సినిమా హీరో లేదా హీరోయిన్లు వెళ్లడం టాలీవుడ్లో ఎప్పుడైనా చూశారా? అస్సలు చూసుండరు. మహా అయితే వ్యక్తిగత సిబ్బంది పెళ్లి జరిగితే కొన్నిసార్లు కనిపిస్తారంతే. కానీ కోలీవుడ్‌లో మాత్రం ఫ్యాన్స్ పెళ్లిలో హీరోలు కనబడటం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. హీరో సూర్య ఇప్పుడు అలానే ఓ లేడీ ఫ్యాన్‌కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో షాక్ అవడం ఆమె వంతైంది.(ఇదీ చదవండి: ప్రభాస్ అందుకే చీర బహుమతిగా ఇచ్చాడు.. రాజాసాబ్ హీరోయిన్)అరవింద్ అనే కుర్రాడు కాజల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే తనకు కాబోయే భార్యకు హీరో సూర్య అంటే చాలా ఇష్టం. దీంతో రిక్వెస్ట్ చేసి సూర్య తన వివాహానికి వచ్చేలా ఒప్పించాడు. ఈ విషయాన్ని చివరి నిమిషం వరకు కాజల్‌కు చెప్పలేదు. సడన్‌గా కల్యాణ మండపంలో సూర్యని చూసి ఆమె షాకైంది. ఈ మొత్తాన్ని వీడియోగా తీసి కొత్త పెళ్లి జంట.. దాన్ని తమ ఇన్ స్టా పేజీ 'కాదల్స్'లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదే కాదు గతంలోనూ సూర్య.. పలువురు అభిమానుల పెళ్లికి హాజరై సర్ప్రైజ్ చేశాడు. తమిళ హీరో విశాల్, ఆర్య, కార్తీ, ధనుష్ తదితర హీరోలు కూడా ఫ్యాన్స్ వివాహాలకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో హీరోలు ఇలా చేస్తున్నారు. మరి తెలుగులో ఇలా అభిమానుల పెళ్లికి గానీ శుభకార్యాలకు గానీ అటెండ్ అయిన హీరోలు ఎంతమంది ఉన్నారు?(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?) View this post on Instagram A post shared by Aravind & Kajal (@kaadhals_) -
స్టార్ దర్శకుడితో 'కమల్ హాసన్' సినిమా.. జరిగేపనేనా..?
సినిమా రంగంలో ఏదైనా జరగవచ్చు. ఎవరు ఎవరినైనా దర్శకత్వం వహించవచ్చు. అయితే కథే ఇక్కడ ప్రధానాంశం. అది సరిగా సెట్ కాకపోవడంతోనే రజనీకాంత్ హీరోగా సుందర్.సి దర్శకత్వం వహించాల్సిన చిత్రం తెర రూపం దాల్చలేదు. తాజాగా ఒక రేర్ కాంబో గురించి వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే కమలహాసన్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో చిత్రం రూపొందే విషయమై చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం ఉంది. కమలహాసన్ ఏ తరహా చిత్రాన్నైనా చేయగలరు. అయితే వెట్రిమారన్‌కు ఒక ముద్ర ఉంది. ఆయన చిత్రాల కథలు వెనుకబడ్డ వర్గాల ఇతి వృత్తం, నేరారోపణలకు బలైన యువత ఇతి వృత్తంతో ఉంటాయి. తాజాగా ఈయన శింబు హీరోగా అరసన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉత్తర చెన్నైకి చెందిన గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను తన వి.క్రియేషన్ పతాకంపై నిర్మిస్తున్నారు. అదే విధంగా నటుడు కమలహాసన్ తాజాగా స్టంట్‌మాస్టర్ల ద్వయం అన్బరివ్ల దర్శతకత్వంలో నటిస్తూ, తన రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషన్ పతాకంపై నిర్మించే పనిలో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంతోగానీ, ఇదే గనుక జరిగితే కచ్చితంగా వైవిద్యభరిత కథా చిత్రం అవుతుంది. -
ప్రాణాలు తీసుకున్న ప్రముఖ సీరియల్ హీరోయిన్
ప్రముఖ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని తన ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో ఒక్కసారిగా తమిళ, కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఈ విషయమై బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నందిని.. సొంత భాషలో కాకుండా కన్నడ, తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన 'గౌరి' సీరియల్ ఈమెకు బోలెడంత పేరు తీసుకొచ్చింది. దీని షూటింగ్ కొన్నాళ్ల ముందు వరకు బెంగళూరులోనే జరిగింది. రీసెంట్‌గానే చెన్నైకి షిఫ్ట్ చేశారు. మొన్నటివరకు చిత్రీకరణలో పాల్గొన్న నందిని.. కాస్త బ్రేక్ తీసుకునేందుకు బెంగళూరులోని ఇంటికి వచ్చింది.అలాంటిది సడన్‌గా ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో తోటీనటీనటులు షాక్‌కి గురయ్యారు. 'గౌరి' సీరియల్ ప్రసారమవుతున్న కలైంజర్ టీవీ ఛానెల్.. నందిని మృతి విషయాన్ని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసి సంతాపం తెలియజేసింది. తోటినటుడు సతీష్ మాట్లాడుతూ.. నందినికి ఇంకా పెళ్లి కాలేదు. అసలు ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సీరియల్ నటి చనిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.🕊️ Rest in Peace, Actress Nandini🙏😢Your performance as Durga in Gauri serial will always be remembered Gone too soon. 💔#KalaignarTV #Nandini #Gauri #Durga #RestInPeace pic.twitter.com/UZR3P9Rf6x— Kalaignar TV (@kalaignartv_off) December 29, 2025


