ఫ్యాన్స్‌ అత్యుత్సాహం.. కిందపడ్డ హీరో విజయ్‌ | After Jana Nayagan Event, Vijay Mobbed by Fans at Chennai Airport | Sakshi
Sakshi News home page

Vijay: హీరో విజయ్‌కు చేదు అనుభవం

Dec 29 2025 7:35 AM | Updated on Dec 29 2025 8:11 AM

After Jana Nayagan Event, Vijay Mobbed by Fans at Chennai Airport

తమిళ స్టార్‌ హీరో విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన చివరి సినిమా "జన నాయగణ్‌" మూవీ ఆడియోలాంచ్‌ ఈవెంట్‌ మలేషియాలో ఘనంగా నిర్వహించారు. భారీ స్టేజ్‌ సెటప్‌, లైటింగ్‌, సౌండ్‌ డిజైన్‌ ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌కు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. వారి కోసం విజయ్‌ స్టేజీపై స్టెప్పులేశాడు.

కిందపడ్డ విజయ్‌
మలేషియాలో అంతా అనుకున్నట్లుగానే ఈవెంట్‌ విజయవంతంగా జరిగింది. అయితే భారత్‌కు తిరిగొచ్చిన విజయ్‌కు చెన్నైలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చెన్నై ఎయిర్‌పోర్టులో హీరోను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అత్సుత్సాహంతో ఎగబడ్డారు. దీంతో తోపులాట కారణంగా విజయ్‌ కారు ఎక్కే సమయంలో తడబడి కిందపడిపోయాడు. వెంటనే సిబ్బంది ఆయన్ను పైకి లేపి క్షేమంగా కారు ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమా
విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయగణ్‌. ఇదే విషయాన్ని ఆయన తాజాగా మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్‌ ఈవెంట్‌లోనూ స్పష్టం చేశాడు. ఈ మూవీ విషయానికి వస్తే.. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మమితా బైజు కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ విలన్‌గా కనిపించనున్నాడు. తెలుగులో వచ్చిన నేలకొండ భగవంత్‌ కేసరి సినిమానే కొన్ని మార్పులు చేర్పులు చేసి జననాయగణ్‌గా తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన విజయ్‌.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. రాజకీయాల కోసం ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పాడు.

చదవండి: ఆస్పత్రిలో దర్శకుడు భారతీరాజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement