ఇలకై లాసం భక్తుల శివనామస్మరణతో మార్మోగుతోంది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
లక్షలాది మంది భక్తులు నల్లమల అటవీప్రాంతం నుంచి పాదయాత్రగా శ్రీగిరి చేరుకుంటున్నారు


