హర్యానాలో గ్యాంగ్‌వార్‌.. నలుగురి హతం! | Gang war in Rohtak four youths shot dead | Sakshi
Sakshi News home page

హర్యానాలో గ్యాంగ్‌వార్‌.. నలుగురి హతం!

Nov 26 2026 7:54 AM | Updated on Nov 26 2026 7:54 AM

Gang war in Rohtak four youths shot dead

రోహ్‌తక్‌: హర్యానాలోని రోహ్‌తక్‌లో దారుణం చోటుచేసుకుంది. గ్యాంగ్‌వార్ నేపథ్యంలో ఖరావడ్ గ్రామ సమీపంలోని మిలన్ హోటల్‌లో నలుగురు యువకులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మృతుల్లో ముగ్గురు ఝజ్జర్ జిల్లాలోని డీఘల్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో పోలీసు యంత్రాంగంలో కలకలం రేగింది.

హోటల్‌లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కాల్పులు జరగడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఖరావడ్ పోలీస్‌చౌకీ ఉంది. పోలీస్‌చౌకీకి ఇంత సమీపంలోనే నలుగురి హత్య జరగడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఐజీ, ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ హత్యలను హిమాంశు, సన్నీ రిటోలియా గ్యాంగ్‌ల మధ్య కొనసాగుతున్న గ్యాంగ్‌వార్‌తో ముడిపెట్టి చూస్తున్నారు. అయితే హత్యలకు అసలు కారణాలు, నిందితుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు రోహ్‌తక్‌ పీజీఐకి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: కర్తార్‌పూర్‌ తెరవాలా? కేంద్రం నిర్ణయానికే హైకోర్టు మొగ్గు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement