డ్రగ్స్‌తో కుటుంబాల కలలు నాశనం  | PM Narendra Modi urged young people to stay away from drugs | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌తో కుటుంబాల కలలు నాశనం 

Nov 24 2026 5:53 AM | Updated on Nov 24 2026 5:53 AM

PM Narendra Modi urged young people to stay away from drugs

ఇకనైనా యువత సరైన పథంలో వెళ్లేలా గురుద్వారాలు కృషిచేయాలి 

గురునానక్‌ దేవ్‌ జయంతి సందర్భంగా మోదీ ఉద్బోధ

న్యూఢిల్లీ: పంజాబ్‌లో యువతను మాదకద్రవ్యాల మహమ్మారి కబళిస్తున్న ఉదంతాలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. పంజాబ్‌లో అన్ని వర్గాలు, గురుద్వారాలు, సామాజిక సంస్థలు కలిసి కట్టుగా కృషిచేసి యువతను ఇకనైనా సరైన పథంలో పయనింపజేసేందుకు ముందడుగు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సిక్కుల తొలి గురువు శ్రీ గురునానక్‌ దేవ్‌ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూ అధికార నివాసం ‘లోక్‌ నివాస్‌’లో జరిగిన కార్యక్రమంలో మోదీ తలపాగా ధరించి పాల్గొన్నారు. 

ప్రకాశ్‌ పురబ్‌ కార్యక్రమంలో శబద్‌ కీర్తనలను ఆలకించారు. తర్వాత అక్కడి వాళ్లతో మోదీ మాట్లాడారు. పంజాబ్‌లో యువత అధికంగా మత్తుపదార్థాల బారిన పడుతున్న అంశాన్ని మోదీ ప్రస్తావించారు. ‘‘సకల జనుల సంక్షేమం కాంక్షించాలని గురువాణి ప్రబోధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు, హింసాత్మక ఘటనలు పెరుగుతున్న వేళ ఈ శాంతి సందేశం సదా ఆచరణీయం. ఇక భారత్‌లో యువత డ్రగ్స్‌ మహమ్మారి కబందహస్తాల నుంచి విముక్తంకావాలి. అప్పుడే వాళ్ల కలలు నిజమవుతాయి. వాళ్లు చదువుల్లో ఉన్నతంగా రాణిస్తారు. వాళ్ల కుటుంబాలకు, దేశాన్ని గర్వకారణంగా నిలుస్తారు.

 అలా జరగని పక్షంలో మత్తుపదార్థాల కారణంగా ఆయా కుటుంబాల కలలు కల్లలవుతాయి’’అని మోదీ అన్నారు. ‘‘వికసిత్‌ భారత్‌ వంటి అత్యున్నతమైన లక్ష్యాలను భారత్‌ సాకారం చేసుకోవాలంటే సిక్కు గురువుల నుంచి స్ఫూర్తి పొందాలి. వాళ్ల ఆశయాల నుంచి స్థైర్యం పొందాలి. చరిత్రను గమనిస్తే వలసపాలకుల కాలంలో భారత్‌ ఎంతో కష్టాలను చవిచూసింది. అప్పుడు సైతం సిక్కు గురువులు దేశ పరిరక్షణ కోసం ఎంతో తపించారు. దేశ ఉనికిని కాపాడేందుకు శ్రీ గురు తేగ్‌ బహదూర్‌ వీరమరణం పొంది నేటికి 350 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆయన త్యాగం నుంచి ఈ నేల ఎంతో స్ఫూర్తి పొందింది’’అని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement