విప్రో టెకీ అనుమానాస్పద మృతి : ప్రియుడు, ఇన్ఫీ ఉద్యోగి అరెస్ట్‌ | Wipro Techie Found Dead In Pune PG Boyfriend Working At Infosys Arrested | Sakshi
Sakshi News home page

విప్రో టెకీ అనుమానాస్పద మృతి : ప్రియుడు, ఇన్ఫీ ఉద్యోగి అరెస్ట్‌

Nov 23 2026 8:03 PM | Updated on Nov 23 2026 8:13 PM

Wipro Techie Found Dead In Pune PG Boyfriend Working At Infosys Arrested

పుణే:  పూణేలోని హింజేవాడి ఐటీ పార్క్ ప్రాంతంలో  విప్రోలో పనిచేస్తున్న  27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మరణం కలకలం రేపింది. మృతురాలిని  పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహంలో ఉంటున్న వార్ధాకు చెందిన కోమల్ రాజేంద్ర దహాకేగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇన్ఫోసిస్ ఉద్యోగి,  ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హింజేవాడి ఐటీ పార్క్ ప్రాంతంలో, ముఖ్యంగా పీజీ వసతి గృహాల్లో నివసిస్తున్న ఐటీ ఉద్యోగులలో ఆందోళన కలిగించింది.

ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం భౌతిక దాడికి దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.  కోమల్ రాజేంద్ర దహాకే  విప్రో సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అరెస్టయిన నిందితుడు శుభం జ్ఞానేశ్వర్ కల్బండే ఇన్ఫోసిస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 2) ప్రదీప్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, వీరిద్దరూ సుమారు 18 నెలలుగా ప్రేమలో ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున దహాకే ఉంటున్న పీజీ వసతి గృహంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ వివాదం కాస్తా భౌతిక దాడికి దారితీయడంతో, కల్బండే ఆమెపై చేతులతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఆ తర్వాత దహాకే మృతి చెందడంతో, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

ఇదీ చదవండి: రూ.2 కోట్ల కరెన్సీ దండ : పెళ్లికి బామ్మర్ది సర్‌ప్రైజ్‌

 

అయితే, ఆమె మరణానికి గల ఖచ్చితమైన వైద్యపరమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. దహాకే మరణానికి దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. దాడి ఎలా జరిగింది, పీజీ వసతి గృహంలో అసలు ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. 

ఇదీ చదవండి: ఎమ్మెల్యే కూతురు పెళ్లి : 50 లక్షల జామూన్లు, రూ.4 కోట్ల కారు, హార్స్‌ రేస్ ఇంకా..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement