జమ్మూలో పాక్ యువకుడి కలకలం! | Pak Man Arrested Near Jammu Border | Sakshi
Sakshi News home page

జమ్మూలో పాక్ యువకుడి కలకలం!

Nov 21 2026 1:55 PM | Updated on Nov 21 2026 1:55 PM

Pak Man Arrested Near Jammu Border

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. ఆర్నియా సబ్‌సెక్టార్‌లోని సాయి కలాన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హరాపీర్ బ్రిడ్జి సమీపంలోని సాయి కలాన్ మోర్ వద్ద అతడిని గుర్తించారు. నిందితుడిని పాకిస్థాన్‌లోని లయ్యా జిల్లాకు చెందిన అవైస్ రజాగా గుర్తించారు.

ప్రాథమిక విచారణలో అతడు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మొదట దారి తప్పి వచ్చానని, ఆ తర్వాత అనుకోకుండా సరిహద్దు దాటానని చెప్పినట్లు సమాచారం. తన ప్రయాణ మార్గం, వచ్చిన ఉద్దేశం గురించి కూడా పరస్పర విరుద్ధమైన వివరాలు చెబుతున్నాడు. దీంతో అతడు అసలు విషయాన్ని దాచిపెడుతున్నాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

జమ్మూలోని ఆర్నియా-ఆర్ఎస్ పురా ప్రాంతంలో ఇటీవలి నెలల్లో ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 11న కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్ బోబియా ప్రాంతంలో 60-65 ఏళ్ల పాక్ చొరబాటుదారుడిని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 8న ఆర్ఎస్ పురా వద్ద సిరాజ్ ఖాన్, సెప్టెంబర్ 3న కనాచక్ ప్రాంతంలో నజీర్ అనే వ్యక్తిని బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది.

మార్చిలోనూ రామ్‌గఢ్ సెక్టార్‌లోని భల్లేర్ బోర్డర్ అవుట్‌పోస్ట్ సమీపంలో మరో వృద్ధుడిని భద్రతా బలగాలు పట్టుకున్నాయి. కొందరు అనుకోకుండా సరిహద్దు దాటినవారిగా తేలుతున్నప్పటికీ, ప్రతి ఘటనను భద్రతాపరమైన ముప్పుగానే పరిగణించి పూర్తిస్థాయిలో విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: శబరిమల భక్తులకు కేరళ సీఎం ప్రత్యేక విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement