శబరిమల భక్తులకు కేరళ సీఎం ప్రత్యేక విజ్ఞప్తి | Keralam chief minister v d Satheesan urges Sabarimala Pilgrims | Sakshi
Sakshi News home page

శబరిమల భక్తులకు కేరళ సీఎం ప్రత్యేక విజ్ఞప్తి

Nov 21 2026 1:20 PM | Updated on Nov 21 2026 1:20 PM

Keralam chief minister v d Satheesan urges Sabarimala Pilgrims

శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులు పవిత్ర పంపా నదిని, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ విజ్ఞప్తి చేశారు. వార్షిక మండల యాత్ర ప్రారంభం కావడంతో భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ సూచన చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం.. ఇలా ఆరు భాషల్లో ఎక్స్ వేదికగా సందేశం ఇచ్చారు.

పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిదే
‘శబరిమలను పవిత్రంగా ఉంచండి.. పంపాను పరిశుభ్రంగా ఉంచండి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. లక్షలాది మంది భక్తులకు శబరిమల అత్యంత పవిత్రమైన క్షేత్రమని, వారి యాత్రలో పంపా నది కూడా అంతర్భాగమని పేర్కొన్నారు. క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

నదిలో వ్యర్థాలు వేయొద్దు
ముఖ్యంగా భక్తులు నదిలో దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర వ్యర్థాలను పడేయకూడదని సూచించారు. భవిష్యత్ తరాల కోసం పంపా నది స్వచ్ఛతను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. శబరిమల కొండపై కొలువైన అయ్యప్ప స్వామి ఆలయంలో 41 రోజుల వార్షిక మండల యాత్ర నవంబర్ 17న ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భక్తులు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ఏఐతో చీటింగ్‌.. వివరాలిస్తే రూ.6.5 కోట్ల నజరానా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement