ఛఠ్ పూజలో పొడవాటి సింధూరం ఎందుకు? | Why do Women Apply long Sindoor during Chhathi Maiya Puja | Sakshi
Sakshi News home page

ఛఠ్ పూజలో పొడవాటి సింధూరం ఎందుకు?

Nov 14 2026 12:57 PM | Updated on Nov 14 2026 12:57 PM

Why do Women Apply long Sindoor during Chhathi Maiya Puja

న్యూఢిల్లీ: ఛఠ్  పర్వదినాన మహిళలు ధరించే ప్రత్యేక అలంకరణలో పొడవైన సింధూరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సాధారణంగా ఉత్తరాదిన వివాహిత మహిళలు పాపిట్లో సింధూరం పెట్టుకుంటారు. అయితే ఛఠ్ పూజ సమయంలో మాత్రం ముక్కు కొన నుంచి నుదుటి మధ్య భాగం వరకు పొడవుగా, సింధూరాన్ని పెట్టుకుంటారు. దీని వెనుక తరతరాలుగా వస్తున్న ఆచారం, మతపరమైన నమ్మకాలు ఉన్నాయి.

భర్త దీర్ఘాయుష్షు కోసం..
హిందూ సంప్రదాయంలో సింధూరాన్ని సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఛఠ్ వ్రతం ఆచరించే వివాహిత మహిళలు భర్త దీర్ఘాయుష్షు, కుటుంబ సంతోషం, వైవాహిక జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటూ పాపిడి నుంచి ముక్కు వరకు సింధూరం పెట్టుకుంటారు. దీనిని అఖండ సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు.

సింధూరం ప్రత్యేకత ఏమిటి?
ఛఠ్ పూజలో మహిళలు ఎక్కువగా ఆరెంజ్‌ లేదా ముదురు ఎరుపు రంగు సింధూరాన్ని పెట్టుకుంటారు. ఆరెంజ్‌ రంగు సూర్యుడి శక్తి, వెలుగుకు ప్రతీకగా భావిస్తారు. ఎరుపు రంగును శక్తి, ప్రేమ, శుభానికి సంకేతంగా చూస్తారు. ఛఠ్ పండుగలో సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల ఈ రంగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

బీహార్‌లో ఎక్కువగా కనిపించే ఆచారం
బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. సింధూరం పొడవుగా, స్పష్టంగా ఉంటే మరింత శుభప్రదమని నమ్ముతారు. అయితే సింధూరం పొడవుకు, భర్త ఆయుష్షుకు శాస్త్రీయ సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవు.

పదహారు అలంకరణలకు ప్రాధాన్యం
ఛఠ్ పూజలో మహిళలు చీర, గాజులు, బొట్టు, సింధూరం, మెట్టెలు వంటి సంప్రదాయ ఆభరణాలతో పదహారు అలంకరణలు చేసుకుంటారు. ఛఠీ మాతను పూజిస్తూ కుటుంబ సంతోషం, సంతానం ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రార్థిస్తారు.

ఇదీ చదవండి: గంగమ్మ నీరు.. అద్దంలా స్వచ్ఛం.. వీడియో వైరల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement