breaking news
Chhath festival
-
పండుగ సీజన్లో రైల్వేల బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి, ఛత్ పండుగల రద్దీని తగ్గిస్తూ ప్రయాణికులకు సౌలభ్యం కల్పించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజ్’పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌లో రిటర్న్ టికెట్ ప్రాథమిక ధరపై 20 శాతం రాయితీ లభిస్తుంది. ఈ మేరకు శనివారం కేంద్ర రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా చేసే బుకింగ్‌లు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర రైల్వేశాఖ ప్రకటించిన రౌండ్ ట్రిప్ ప్యాకేజ్‌లో భాగంగా వెళ్లే ప్రయాణం అక్టోబర్ 13 నుంచి 26 మధ్య, వచ్చే ప్రయాణం నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య ఉండాలి. రిటర్న్ టికెట్ బుకింగ్‌కు 60 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ వర్తించదు. రెండు ప్రయాణాలూ ఒకే ప్రయాణికుల పేర్లతో, ఒకే తరగతి, ఒకే గమ్యస్థానం ఉన్న జంటకు మాత్రమే అనుమతిస్తారు. అయితే రెండు ప్రయాణాల్లోనూ కన్ఫర్మ్డ్ టికెట్లు తప్పనిసరి. ఫ్లెక్సీ ఫేర్ రైళ్లు మినహా అన్ని సాధారణ, ప్రత్యేక రైళ్లకు రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ పథకం కింద బుక్ చేసిన టికెట్లకు రీఫండ్ లేదా మార్పులు అనుమతించరు. ఆన్లైన్ లేదా కౌంటర్.. రెండు టికెట్లు ఒకే విధానంలోనే బుక్ చేయాలి. ఈ స్కీమ్ పండుగ సీజన్లో రద్దీని విభజించడంతో పాటు, ప్రత్యేక రైళ్ల వినియోగాన్ని పెంచుతుందని కేంద్ర రైల్వేశాఖ ఆశిస్తోంది. ఆఫర్ వివరాలు→ బుకింగ్ ప్రారంభం: ఆగస్టు 14, 2025 → ప్రారంభ ప్రయాణం: అక్టోబర్ 13 నుంచి 26 వరకు → తిరుగు ప్రయాణం: నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 వరకు → రిటర్న్ టికెట్ బుకింగ్‌కు 60 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ వర్తించదు. → రానుపోను టికెట్లు ఒకే ప్రయాణికుల పేర్లతో, ఒకే తరగతి, ఒకే గమ్యస్థాన జంటకు మాత్రమే. → రెండు ప్రయాణాలకూ కన్ఫర్మ్డ్ టికెట్లు తప్పనిసరి. → ఫ్లెక్సీ ఫేర్ రైళ్లు మినహా అన్ని రైళ్లకు ఆఫర్ వర్తింపు. → టికెట్ బుక్ చేసిన తర్వాత మార్పులు, రీఫండ్లు ఉండవు. -
ఆసియాలో అతిపెద్ద ఛత్ ఘాట్ ఇదే..
పూర్వాంచల్: ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్లతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో ఛత్ పండుగ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోగల పూర్వాంచల్‌లో ఉన్న ఛత్ ఘాట్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. అర్పా నది ఒడ్డున నిర్మించిన ఈ ఛత్ ఘాట్ ఆసియాలోనే అతిపెద్ద ఛత్ ఘాట్‌గా పేరొందింది. ఈ ఘాట్ మొత్తం పొడవు సుమారు ఒక కిలోమీటర్లు ఉంటుంది. ఛత్ పూజలు నిర్వహించేందుకు ఈ ఘాట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.ఈ ఏడాది 50 వేల మందికి పైగా ఛత్వర్తీలు ఈ ఛత్ ఘాట్‌లో జరిగే పూజల్లో పాల్గొనే అవకాశం ఉంది. వీరితో పాటు లక్షల సంఖ్యలో వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి తరలిరానున్నారు. ఛత్ పండుగ సందర్భంగా అర్పా నది ఒడ్డును అందంగా అలంకరించారు. భద్రత దృష్ట్యా పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఈ ఘాట్‌ను జిల్లా యంత్రాంగం, భోజ్‌పురి సొసైటీ కొన్నేళ్ల క్రితమే నిర్మించింది. ప్రతి ఏటా ఛత్ పూజ సందర్భంగా ఇక్కడకు వేలాది మంది భక్తులు తరలివచ్చి, సూర్య భగవానుని ఆరాధిస్తారు. గత 24 సంవత్సరాలుగా భోజ్‌పురి కమ్యూనిటీ ప్రజలు ఈ ఘాట్‌ను ప్రార్థనా స్థలంగా ఉపయోగిస్తున్నారు. ఛత్ పూజలు జరిగే సమయంలో భక్తులు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఇక్కడ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పిస్తారు. భక్తులు నదిలో నిలబడి పూజలు చేస్తారు. ఇక్కడ జరిగే ఛత్ పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.ఇది కూడా చదవండి: పండగల్లో రూ. లక్ష కోట్ల వస్తువులు కొనేశారు -
ఛాత్ ఉత్సవాల్లో 30 మంది మృతి
పాట్నా: గోడ కూలడం, తొక్కిసలాట, మునిగిపోవడం వంటి వాటి కారణంగా బిహార్‌లో 30 మంది మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలు బిహార్ ప్రజలు జరుపుకునే ఛాత్ పండగ సందర్భంగా శని, ఆదివారాల్లో చోటుచేసుకున్నాయి. ఇద్దరు మహిళలు గోడ కూలిన ఘటనలో, ఇద్దరు పిల్లలు తొక్కిసలాటలో, మరో 26 మంది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉత్సవాల సందర్భంగా మునిగిపోయి మరణించారు. ఛాత్ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. లక్షలాది మంది ఈ పండుగను దేవాలయాల వద్ద, ఘాట్ల వద్ద స్నానాలాచరించి జరుపుకున్నారు. -
మాజీ సీఎం అనూహ్య నిర్ణయం
పాట్నా: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవీ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. బిహారీలు ఘనంగా నిర్వహించే 'ఛాత్' పండుగను ఈ ఏడాది జరుపుకోబోనని సోమవారం మీడియాకు చెప్పారు. పెళ్లైన నాటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఛాత్ పూజలో పాల్గొంటోన్న రబ్రీదేవీ.. ఒక రకంగా ఆ పండుగకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. లాలూ ఇంట జరిగే వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని కీలక రాజకీయపక్షాల నాయకులు సైతం హాజరై సందడిచేస్తారు. అయితే ఈ వారాంతంలో జరుగనున్న పండుగకు మాత్రం దూరంగా ఉంటానని రబ్రీ చెప్పారు. ఇంతకీ ఆమె నిర్ణయం వెనుక కారణం ఏమంటే.. ఇద్దరు కొడుకుల పెళ్లి. అవును. లాలూ-రబ్రీ దంపతుల కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ ల పెళ్లిళ్లు జరిగిన తర్వాతే తాను తిరిగి 'ఛాత్' పూజలో పాల్గొంటానని రబ్రీ దేవి అన్నారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో తేజస్వి యాదవ్ ఉపముఖ్యమంత్రికాగా, తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వీళ్లిద్దరి పెళ్లి విషయమై గడిచిన కొద్దిరోజులుగా లాలూ కుటుంబం తీవ్ర కసరత్తు చేస్తోంది. మొన్నటికిమొన్న రాష్ట్రంలో సమస్యలు తెలపాలంటూ వాట్సాప్ నెంబర్ ప్రకటించిన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు ఏకంగా 44వేల పెళ్లి ఆఫర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఎలాగైనాసరే వచ్చే ఎండలనాటికి ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు చేసి, కోడళ్లతో సహా వచ్చే ఏడాది ఛాత్ పండుగ జరుపుకోవాలన్న మాజీ సీఎం కల ఏమేరకు నెరవేరుతుందో చూడాలి! దీపావళి తర్వాతి వారాంతంలో ప్రారంభమయ్యే ఛాత్ పండుగను బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ సహా నేపాల్ లోనూ నాలుగురోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. -
లాలూ ఇంట ఛట్ సందడి
-
లాలూ లేకపోవడం చాలా బాధగా ఉంది: రబ్రీ
పవిత్రంగా జరుపుకునే ఛత్ పర్వదినాన లాలూ ప్రసాద్ యాదవ్ తమ మధ్య లేకపోవడం చాలా బాధ కలిగిస్తోంది అని ఆయన సతీమణి రబ్రీ దేవి అన్నారు. తన నివాసంలో రబ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఛత్ పండగ రోజున జరిగే కార్యక్రమాలను లాలూ దగ్గరుండి చూసుకునే వారు అని అన్నారు. ఛత్ రోజున కుటుంబ సభ్యులను, పార్టీ కార్యకర్తలను, ఇతరుల్లో సంతోషం నింపే వారని గతంలో జరుపుకున్న పండగలను గుర్తు చేసుకున్నారు. ఈ సారి లాలూ లేకపోవడం, మాలో విషాదాన్ని నింపింది అని అన్నారు. ఛత్ పండగ కార్యక్రమాల్లో భాగంగా సూర్య భగవానుడికి కోసం గోధుమలను ఎండపెట్టే కార్యక్రమాన్ని రబ్రీ ప్రారంభించారు. లాలూ జైల్లో ఉన్నప్పటికి.. ఆయన స్పూర్తి తమను నడిపిస్తోంది అని అన్నారు. పశుగ్రాస కుంభకోణంలో ప్రస్తుతం రాంచీ జైల్లో లాలూ ప్రసాద్ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.


