breaking news
video
-
చేతులు కట్టేసి... న్యూడ్ వీడియో తీసి..
గచ్చిబౌలి (హైదరాబాద్): స్నాప్‌చాట్‌లో పరిచయమైన మహిళాటెకీకి మాయమాటలు చెప్పి హోటల్‌కు రప్పించి అనంతరం కత్తితో బెదిరించి చేతులు కట్టేసి, న్యూడ్ వీడియో తీసి ఓ యువకుడు రూ.1.10 లక్షలు దోచుకున్నాడు. ఈ ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా సూదివారిపాలెంకు చెందిన కిలారి నాగతేజ అలియాస్ నాని (24) గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. మాదాపూర్‌లోని హోలా కో లివింగ్ పీజీ హాస్టల్లో నివాసం ఉంటున్నాడు. అతనికి స్నాప్‌చాట్ యాప్ ద్వారా ఓ ఐటీ ఉద్యోగిని పరిచయమైంది. నాగతేజ ఐదు రోజుల క్రితం గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ సమీపంలోని ఎల్లో స్టోన్ హోటల్లో ఫేక్ డాక్యుమెంట్లతో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. యువతికి మాయమాటలు చెప్పి రాత్రి 8 గంటలకు హోటల్‌కు రప్పించాడు. అనంతరం యువతి చేతులు కట్టేసి, కత్తితో బెదిరించి న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీశాడు. డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో, మీ తల్లిదండ్రులకు ఆ వీడియో పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. గత్యంతరం లేని పరిస్థితిలో యువతి డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం యువతి ఫోన్ నంబర్‌తో క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో ఆ యువతి గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించగా నాగతేజను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు, ముగ్గురు యువతుల న్యూడ్ వీడియోలు కూడా అతని సెల్ ఫోన్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, నిందితుడి తల్లిదండ్రులు చిన్న కొడుకు చదువు కోసం ఉన్న ఒక్క ఎకరం పొలం అమ్మేసి రూ.10 లక్షలు తమ బ్యాంక్ ఖాతాల్లో ఉంచుకున్నారు. వారికి తెలియకుండానే ఇద్దరి ఖాతాల నుంచి మొత్తం డబ్బును నాగతేజ కాజేసి, క్రికెట్ బెట్టింగ్‌లలో పోగొట్టాడని పోలీసులు వెల్లడించారు. -
వివాదాస్పద వీడియోపై సీఎం భగవంత్‌మాన్ క్లారిటీ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మద్యం సేవిస్తూ.. సిక్కు మత గురువుల ఫోటోలపై సీఎం భగవంత్ మద్యం చల్లుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో ఇటీవల వైరల్‌గా మారింది. దీంతో విపక్ష పార్టీలన్నీ పంజాబ్ సీఎంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ వివాదాస్పద వీడియో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. అయితే, ఈ వీడియోపై సీఎం భగవంత్‌మాన్ స్పందిస్తూ.. ఆ వీడియో పూర్తిగా నకిలీదేనని.. తనను పోలిన వ్యక్తికి ప్రత్యేకంగా మాస్క్ వేయించి చిత్రీకరించారని.. రాజకీయ దురుద్దేశంతోనే వైరల్ చేశారని ఆయన తేల్చిపారేశారు.చండీగఢ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన భగవంత్ మాన్.. వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులోని వ్యక్తి తాను కాదని స్పష్టమవుతుందని చెప్పారు. చిన్నప్పుడే జరిగిన శస్త్రచికిత్స కారణంగా తన మెడపై ఉన్న మచ్చ వీడియోలో కనిపించడం లేదని పేర్కొన్నారు. “ఆ వీడియో సృష్టించిన వారు నా మెడపై ఉన్న మచ్చను పెట్టడం మర్చిపోయారు. వీడియోను స్లో మోషన్లో జూమ్ చేసి చూస్తే మెడ వద్ద మాస్క్ ఆనవాళ్లు కనిపిస్తాయని మాన్ తెలిపారు.వీడియోపై ఎలాంటి దర్యాప్తుకైనా తాను సిద్ధమని స్పష్టం చేసిన ఆయన.. అందులో కనిపిస్తున్న వ్యక్తి శరీరాకృతి, ఎత్తు, నడక తీరు తనతో ఏమాత్రం సరిపోలవని చెప్పారు. తన ఎత్తుతో పోలిస్తే ఆ వ్యక్తికి సుమారు రెండు అంగుళాల తేడా ఉందని పేర్కొన్నారు. ఈ వీడియోను రాజకీయ ప్రత్యర్థులు కావాలనే ప్రచారం చేస్తున్నారని మాన్ ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కొన్ని పార్టీలు మతపరమైన అంశాలను ఉపయోగించి తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నాయని విమర్శించారు. -
పక్కింటోడు నా బెడ్రూమ్లో కెమెరా పెట్టాడు..!
అన్నమయ్య జిలా: తన పడకగదిలో జరిగేదంతా కనిపించేలా సీసీ కెమెరా అమర్చారని ఓ బాధితుడు జిల్లా ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేశాడు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ వేదికకు మదనపల్లె మండలం, పోతబోలు గ్రామం, భూమకంవారిపల్లికి చెందిన భాస్కర్ హాజరయ్యాడు. తన నివాసంలోని పడక గదిని టార్గెట్ చేసి ప్రత్యర్థులైన గంగులప్ప, జయలక్ష్మిలు సీసీ కెమెరా ఏర్పాటు చేసి, కెమెరాలో రికార్డు అయిన వీడియోలను సెల్ ఫోన్ల ద్వారా బహిర్గతం చేసి తనను అవమానిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్యతో ఉన్న వీడియోలు చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు. -
‘చాలా చెప్పాలి..కానీ లాభం లేదు’ అంటూ ఆత్మహత్య, ఫేస్బుక్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్ విహార్‌లో ఒక 19 ఏళ్ల యువకుడు నివాస భవనం పైనుంచి కిందపడి మరణించిన ఘటన విషాదాన్ని నింపింది. కిందపడిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది.అశోక్ విహార్ ఫేజ్-2లోని స్వాభిమాన్ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారంబాధితుడిన అనురాగ్‌గా గుర్తించారు. ఆజాద్‌పూర్‌లోని లాలా బాగ్ నివాసి అయిన అనురాగ్ తండ్రి రాజా రామ్, ఢిల్లీ హోమ్ గార్డ్‌లో పనిచేస్తున్నారు. ఏమైందో తెలియద గానీ శుక్రవారం సాయంత్రం 4:45 గంటల సమయంలో ఒక యువకుడు భవనంపైనుచి దూకేశాడనే సమాచారం అశోక్ విహార్ పోలీస్ స్టేషన్‌కు తెలిసింది. వెంటనే బాధితుడిని దీప్ చంద్ బంధు ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.పోలీసు బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. కేసు తీవ్రత దృష్ట్యా, ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాలను సేకరించడానికి క్రైమ్ టీమ్‌ను కూడా పిలిపించారు.పోస్ట్‌మార్టం , తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం మృతదేహాన్ని బాబూ జగ్జీవన్ రామ్ మెమోరియల్ (BJRM) ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.ఫేస్బుక్ వీడియోదర్యాప్తులో భాగంగా ఘటనకు కొద్దిసేపటి ముందు అనురాగ్ తన ఫేస్బుక్ ఖాతాలో ఒక వీడియోను అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. "ఇది నా మొదటి వీడియో చివరిdr కూడా. నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే వాందరికీ సారీ. అలాగే నా వల్ల తమ జీవితాలు సరిగ్గా సాగడం లేదని భావించే వారికి క్షమాపణలు. చాలామందితో చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ దానివల్ల మారేదేమీ లేదు" అని వీడియోలో పేర్కొన్నాడు.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఆత్మహత్య కేసు కావచ్చునని తెలుస్తోంది. అయితే, ఏదైనా కుట్ర లేదా ఇతర కారణాల కోణంతో సహా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులు ఇంకా తెలియరాలేదని, పోస్ట్‌మార్టం నివేదిక, తదుపరి దర్యాప్తు తర్వాత మరణానికి గల కారణంపై స్పష్టత వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే! -
‘వర్క్ ఫ్రమ్ బైక్’ అంటే ఇదే కాబోలు.. వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటూ బైక్ నడుపుతూ వెళ్తున్న ఓ యువకుడి వీడియో.. వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ‘వర్క్ ఫ్రమ్ బైక్’ అంటూ ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వీడియోపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా స్పందించారు.రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానుకోవాలంటూ హితవు పలికిన సజ్జనార్.. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం. గుర్తుంచుకోండి... కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు. దయచేసి రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానేయండి. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి’’ అంటూ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది.రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా… pic.twitter.com/qSTFaFvf3w— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 13, 2026 -
రాజకీయాల్లోకి లారెన్స్.. కీలక ప్రకటన
ప్రముఖ నటుడు రాఘవా లారెన్స్ ఎట్టకేలకు ఊహాగానాలపై స్పందించారు. గత కొంతకాలంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారని.. ఫలానా పార్టీలో చేరి ఉపఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఇంకొంత కాలం సస్పెన్స్‌ను కొనసాగించాలనే ఆయన నిర్ణయించారు. రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేదానిని లారెన్స్ ప్రశ్నార్థకంగా వదిలేశారు. ఈ అంశాన్ని ప్రజలే నిర్ణయించాలంటూ ఎక్స్ ఖాతాలో తాజాగా ఆయనో వీడియో రిలీజ్ చేశారు. కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ నటుడైన లారెన్స్.. అటు సమాజ సేవతోనూ మంచి గుర్తింపు పొందారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై కుతూహలం నెలకొంది. ఈ ప్రచారం స్వయంగా ఆయనే స్పందించారు. తాను ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని.. పదవి కోసమో లేదంటే డబ్బు కోసం రాజకీయాలను ఆశ్రయించడం లేదని రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు. అయితే తనకు నమ్మకమైన, సన్నిహిత వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే.. అతనికి అండగా నిలిచి, వ్యక్తిగతంగా చేస్తున్న సమాజ సేవను మరింత పెద్ద స్థాయిలో చేయాలనే ఆలోచన మాత్రమే తనకు ఉందన్నారు. ప్రస్తుతం పరిస్థితులు తనను రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన స్థితికి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. రాజకీయాలపై తానే ఓ కీలక ప్రకటన చేస్తానని లారెన్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. అయితే దర్శక దిగ్గజం భారతీరాజా మృతితో ఆ ప్రకటనను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ తరుణంలో ఓ వీడియో రిలీజ్ చేశారిప్పుడు. ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయాల్లోకి వస్తానని, లేకుంటే లేదని తేల్చేశారు. ప్రజాశీర్వాదంతోనే.. తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఆయన కామెంట్ సెక్షన్లో పలువురు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఆయన ట్వీట్ సారాంశం.. Do your duty sincerely, without expecting anything in return.After watching this video, please share your advice and guidance in the comments. If you say “No,” I will not enter politics and will continue my selfless service to society. But if you say “Yes,” I am ready to enter… pic.twitter.com/VwPFjdaUqy— Raghava Lawrence (@offl_Lawrence) June 12, 2026ఫలితాలపై ఆశలు పెట్టుకోకుండా మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. మీరు 'వద్దు' అంటే నేను రాజకీయాల్లోకి రాను.. సమాజ సేవనే కొనసాగిస్తాను. 'అవును' అంటే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు, ఎవరితో కలిసి నా రాజకీయ ప్రయాణం ప్రారంభమవుతుందో త్వరలో వెల్లడిస్తాను.అయితే.. లారెన్స్ కేవలం నటుడిగానే కాదు, కొరియోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాతగానూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. చిన్న డ్యాన్సర్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. నటుడిగా, తర్వాత స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. అనంతరం హీరోగా మారి ముని, కాంచన, కాంచన-2, కాంచన-3 వంటి హారర్-కామెడీ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా కాంచన సిరీస్‌తో దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు తన తల్లి పేరిట దివ్యాంగులు, అనాథలు, పేద విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు. అందుకే ఆయన రాజకీయ అరంగేట్రంపై తమిళనాడులో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు లారెన్స్‌కు మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో విజయ్ నటించిన పలు చిత్రాలకు లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే లారెన్స్ సేవా కార్యక్రమాలకు విజయ్ ఆర్థిక సాయం అందించారు. దీంతో లారెన్స్ టీవీకే పార్టీలో చేరతారని, విజయ్ రాజీనామాతో(రెండింటిలో ఒకటి రాజీనామా చేయాల్సిన పరిస్థితిలో) ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీవీకే పార్టీ ఇప్పటిదాకా ఓ స్పష్టమైన ప్రకటన చేయలేదు. -
రహస్య వీడియోలతో వేధింపులు.. అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
కర్ణాటక: స్నానం చేస్తున్న మహిళ ఫోటో, వీడియోలను చిత్రీకరించుకుని వేధించడమే కాకుండా రూ.17 లక్షల నగదు వసూలు చేసిన నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని ఉణకల్‌లో జరిగింది. వివరాలు.. సుధ మృతురాలు. సిద్దారూఢ, అరుణ, మీనాక్షి, మల్లికార్జున, వీరప్ప, ప్రకాష్ బసవలింగప్ప, శివానంద, గిరిజాలపై కేసు నమోదైంది. సుధ ప్రస్తుతం ఉణకల్‌లో నివసిస్తూ సవదత్తి మునవళ్లిలో అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తోంది.రెండేళ్ల క్రితం ఇంట్లో స్నానం చేస్తుండగా ఫొటో, వీడియో తీసుకొని ఆమెపై నిందితులు వేధింపులకు పాల్పడి ఆమె నుంచి క్రమంగా రూ.17 లక్షల మేర వసూలు చేశారు. అంతేగాక చెక్ బౌన్స్ కేసులో సవదత్తి కోర్టు ద్వారా కూడా ఆమెను మనోవేదనకు గురి చేశారు. వారి వేధింపులు భరించలేక ఉణకల్లోని అద్దె ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
సీబీఎస్ఈలో జేబు దొంగలు.. జాగ్రత్త!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తున్న ఆన్సర్ షీట్ స్కానింగ్, రీవ్యాల్యుయేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విద్యార్థుల సమాధాన పత్రాలను స్కానింగ్ చేయడంలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవడానికి కూడా విద్యార్థుల నుంచే డబ్బు వసూలు చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు.ఈ సందర్భంగా ఎక్స్‌లో చేసిన పోస్టులో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “జేబుదొంగలతో జాగ్రత్త.. ఇప్పుడు వాళ్లు CBSEలోనే కూర్చున్నారు. బోర్డు తప్పు వల్ల మీ మార్కులు తప్పుగా నమోదైతే మీకు ఏమి దక్కుతుంది? ఒక బిల్లు మాత్రమే. డిజిటల్ స్కాన్డ్ కాపీకి ఒక్కో సబ్జెక్టుకు రూ.100, రీ-టోటలింగ్‌కు రూ.100, రీ-ఎవాల్యుయేషన్కు ఒక్కో ప్రశ్నకు రూ.25 చెల్లించాలి” అంటూ మండిపడ్డారు.जेबकतरों से सावधान - आज वो CBSE के अंदर बैठे हैं। CBSE की गलती से नंबर ग़लत आए तो आपको क्या मिलता है?एक bill:Digital scan copy: ₹100/विषयRe-totalling: ₹100/paperRe-evaluation: ₹25/सवालअपनी ही answer sheet की सही जाँच के लिए एक बच्चे को ₹2000 तक भरने पड़ सकते हैं।… pic.twitter.com/H0WS1xF6Zf— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2026సీబీఎస్ఈ పరీక్షల ఆన్సర్ షీట్ల స్కానింగ్, డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. విద్యార్థుల మార్కులు తప్పుగా అప్లోడ్ అవుతున్నాయని, వాటిని సరిచేయాలంటే మళ్లీ డబ్బు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. ఒక విద్యార్థి తన సమాధాన పత్రం సరిగ్గా మూల్యాంకనం అయ్యిందో లేదో నిర్ధారించుకోవడానికి సుమారు రూ.2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.CBSE’s May 2025 tender required answer sheets to be scanned with automatic robotic scanners, spines preserved, at a minimum of 300 DPI.The tender re-issued in August quietly removed all of it. “Scanners” became generic. Resolution dropped to 200 DPI.Now we know what that… https://t.co/XXdorOi3oq— Rahul Gandhi (@RahulGandhi) May 31, 2026“తప్పు సీబీఎస్ఈది.. శిక్ష విద్యార్థికి.. లాభం ప్రభుత్వానికి” అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా చూస్తే తప్పులు సరిదిద్దబడవని, మరింత పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో ఎక్కువ నష్టం చవిచూస్తున్నది పిల్లలేనని, వారి సమయం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే కొన్ని సందర్భాల్లో ఆన్సర్ షీట్లు మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. దీనివల్ల పేజీలు మిస్ కావడం, బ్లర్ కాపీలు రావడం, సమాధాన పత్రాలు పూర్తిగా అప్లోడ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.ఎవరీ సార్ధక్ సిద్ధాంత్..ఈ వివాదానికి సంబంధించి రాహుల్ గాంధీ షేర్ చేసిన పోస్ట్‌లో ఉన్న అంశాలను బయటపెట్టిన వ్యక్తి జార్ఖండ్‌కు చెందిన విద్యార్థి సార్థక్ సిద్ధాంత్. సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న టెండర్ పత్రాలను పరిశీలించిన ఆ 17 ఏళ్ల కుర్రాడు.. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) కాంట్రాక్ట్ నిబంధనలను మూడు దశల్లో సడలించినట్లు ఆధారాలతో వెల్లడించాడు. ఈ మార్పులు ప్రత్యేకంగా హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించాడు.సార్థక్ సిద్ధాంత్ తన వెబ్సైట్లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 2025 మేలో విడుదల చేసిన టెండర్లో ఆన్సర్ షీట్లను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్లతో, కనీసం 300 DPI నాణ్యతతో స్కాన్ చేయాలని పేర్కొన్నారు. అయితే అదే టెండర్‌ను ఆగస్టులో మళ్లీ విడుదల చేసినప్పుడు ఆ నిబంధనలను సడలించి, స్కానర్ల ప్రస్తావనను సాధారణీకరించడంతో పాటు రిజల్యూషన్‌ను 200 DPIకు తగ్గించినట్లు వెల్లడించారు. అనంతరం ఆన్సర్ షీట్లను మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు బయటపడిందని, దీనివల్లే బ్లర్ కాపీలు, మిస్సింగ్ పేజీలు, స్కాన్ కాని సమాధాన పత్రాల సమస్యలు వచ్చాయని ఆరోపించారు.ఇక రాహుల్ గాంధీ కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థపై కూడా విమర్శలు గుప్పించారు. గతంలో ఈ సంస్థ మరో పేరుతో వివాదాల్లో చిక్కుకుందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సమాధాన పత్రాల గందరగోళానికి సంబంధించిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నామని సీబీఎస్ఈ చెబుతోంది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్లకు చెందిన నిపుణులతో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వ్యవస్థను సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.మొత్తంగా, లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిన ఈ వివాదం దేశవ్యాప్తంగా విద్యా మూల్యాంకన వ్యవస్థ పారదర్శకత, సాంకేతిక ప్రమాణాలు, రీవ్యాల్యుయేషన్ ఫీజులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. -
పార్టీ కోసం కష్టబడ్డ మాలాంటి వాళ్ళను 2 ఆఫీస్ గేటు దగ్గరకు కూడా రానివ్వడం లేదు
-
మా చంద్రుడి వెలుగు చూడు!
ధర్మశాల: ‘నీ చీకటి మొత్తాన్ని నేను తీసుకున్నాను. మా వెలుగులీనుతున్న చందురుడిని నీ ముందుంచాను’... అరిజిత్ సింగ్ పాడిన హిందీ సూపర్ హిట్ పాట ‘చన్నా మేరేయా’లో లైన్ ఇది. గురువారం పంజాబ్ కింగ్స్‌పై అసాధారణ బ్యాటింగ్‌తో తిలక్ వర్మ మ్యాచ్ గెలిపించిన తర్వాత ముంబై ఇండియన్స్ ఈ పాట, అతను గెలుచుకున్న బహుమతులతో సహా వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది.దీని వెనక నేపథ్యం ఉంది. మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ రూపొందించిన ఒక వీడియో తీవ్ర విమర్శలపాలైంది. అందులో అతను తిలక్‌వర్మ నలుపు రంగులో ఉన్నాడనే ఉద్దేశాన్ని చూపిస్తూ ‘ఓయ్ అంధేరే (చీకటి)’ అంటూ అతడిని పిలిచాడు. సన్‌స్క్రీన్ వాడలేదా అంటూ ప్రశ్నిస్తూ అసలైన పంజాబీ మెరుపు రంగు ఇలా ఉంటుందంటూ నమన్ ధీర్‌ను చూపిస్తూ వ్యాఖ్యానించాడు. దీనికి తిలక్ ఆ సమయంలో సరైన రీతిలో జవాబివ్వలేకపోయాడు. వర్ణవివక్షను చూపించడం అర్ష్‌దీప్‌కు కొత్త కాదంటూ అన్ని వైపుల నుంచి అభిమానులు అతనిపై విరుచుకు పడ్డారు.గతంలోనూ సాయి సుదర్శన్, సాకిబ్ హసన్‌ల నలుపు రంగును ఉద్దేశించి అతను ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. అయితే గురువారం తన బ్యాట్‌తోనే పంజాబ్ కింగ్స్‌కు జవాబిచ్చిన తిలక్ ఒక రకంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. అతని గెలుపు సంబరాన్ని చూస్తున్న అర్ష్‌దీప్ మొహం వాడిపోయింది! ఇదే విషయాన్ని చూపిస్తూ తిలక్ చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నట్లుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వీడియో చేసి జవాబిచ్చింది.Open story, view & reply 👻#PBKSvMI pic.twitter.com/KBtOonNWKG— Mumbai Indians (@mipaltan) May 15, 2026 -
వైట్‌హౌస్‌లో అసలు జరిగింది ఇదే.. కీలక వీడియో విడుదల
వాషింగ్టన్: వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అమెరికా న్యాయశాఖ.. కీలక వీడియోను విడుదల చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపే ఉద్దేశంతో గత వారం జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ విందులోకి కోల్ టోమస్ అలెన్ చొరబడటానికి ప్రయత్నించిన దృశ్యాలు విడుదలయ్యాయి. అలెన్ లొంగిపోయే ముందు అసలు కాల్పులు జరిపాడా? సందేహాల మధ్య, వాషింగ్టన్ డిసి టాప్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ జీనైన్ పిరో, ఈ ఘటనకు సంబంధించిన ఎడిట్ చేసిన భద్రతా కెమెరా ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.సెక్యూరిటీ చెక్ పాయింట్లో నుంచి నిందితుడు ఒక్కసారిగా దూసుకొచ్చి కాల్పులు జరపడం సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. శనివారం నాటి విందు కంటే ఒక రోజు ముందుగానే అలెన్ ఆ హోటల్ పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. తనిఖీ కేంద్రం వద్ద మెటల్ డిటెక్టర్లను తొలగిస్తున్న సమయంలో అలెన్ ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌పై కాల్పులు జరిపి లోపలికి దూసుకెళ్లాడు. అలెన్.. సీక్రెట్ సర్వీస్ అధికారి కాల్పులు కారణంగా కిందపడలేదు. తనిఖీ కేంద్రం వద్ద ఉన్న ఒక మెటల్ డిటెక్టర్ బాక్స్‌ను ఢీకొని కింద పడిపోయాడు. ఏజెంట్ జరిపిన ఐదు రౌండ్ల కాల్పుల్లో ఏ ఒక్కటి కూడా అలెన్‌కు తగలలేదని అధికారులు తెలిపారు.అలెన్ మొదట కాల్పులు జరిపాడని ప్రభుత్వం వాదిస్తుండగా.. వాషింగ్టన్ పోస్ట్ వీడియో విశ్లేషణలో కేవలం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ జరిపిన నాలుగు షాట్లు మాత్రమే కనిపించాయి. ఏజెంట్‌పై అలెన్ కాల్పులు జరిపాడనడానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఆధారాలను సేకరిస్తోందని అలెన్ తరపు పబ్లిక్ డిఫెండర్లు పేర్కొన్నారు.🇺🇸 The United States has released high quality footage from the White House Correspondents Dinner shooting.This is not AI generated..😳 pic.twitter.com/AAP86I160M— Orbit News (@Orbit_News10) May 1, 2026 -
కదిరి పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన వీడియో
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరి పేలుడు ఘటనపై సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. వెంకన్న ఇంట్లో గ్యాస్ లీకై తొలుత అగ్ని ప్రమాదం జరగ్గా.. మంటలు ఆర్పేందుకు వెళ్లిన సమయంలో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ పేలాయి. మంటలు ఆర్పే సమయంలో స్థానికుడు వీడియో తీస్తుండగా బ్లాస్టింగ్ జరిగింది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు వెళ్లిన నలుగురు మృతిచెందగా. 18 మంది గాయపడ్డారు. సెల్ ఫోన్లో బ్లాస్టింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో పేలుడు దృశ్యాలు వైరల్‌గా మారాయి.కాగా, బుధవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో కదిరి పట్టణ శివారులోని కుమ్మరవాండ్లపల్లి.. కదిరి–రాయచోటి రోడ్డుకు అతి సమీపంలోని ఓ ఇంటి నుంచి పొగలు మొదలయ్యాయి.. స్థానికులంతా గుమికూడారు. ఇంట్లో వారు మాత్రం అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. మంటలు ఆర్పుదామన్న ఆత్రుతతో స్థానికుల్లో కొందరు లోపలికి వెళ్లారు. ఇంతలోనే భారీ పేలుడు.. ఆ ఇంటితో పాటు ఇరువైపులా ఉన్న ఇళ్లు నేలమట్టమయ్యాయి. లోపలికి వెళ్లిన వారిలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.కుమ్మరవాండ్లపల్లిలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు జరిగిన ఇంట్లో పదేళ్లుగా తెలంగాణవాసులు ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. జనావాసాల మధ్య ఇంట్లో పేలుడు పదార్థాలు పెట్టుకుని ఉంటున్నా ఎవరికీ అనుమానం రాకపోవడం గమనార్హం. వారు కదిరి చుట్టుపక్కల రహదారుల నిర్మాణం, వెంచర్లు, రైతుల భూముల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా పెద్దపెద్ద రాళ్లను బ్లాస్టింగ్ చేసేందుకు వెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు. -
రీల్స్ మోజులో మెడికోలు.. సేవలు మర్చిపోయారా?
ఆదిలాబాద్‌టౌన్: రోగులకు వైద్య సేవలు అందించాల రిమ్స్ ఆస్పత్రి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారింది.. కొంతమంది మెడికోలు, జూడాలు, పలువురు వైద్యులు రీల్స్ చేయడం పట్ల చర్చ సాగుతోంది. విధులు నిర్వహించే సమయంలో ‘రీల్స్ మోజు’లో పడి రోగులనే మర్చిపోతున్నారనే విమర్శలు లేకపోలేదు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా తరహాలో ఏకంగా ఆపరేషన్ థియేటర్లో శస్త్ర చికిత్సకు ముందు రోగితో డ్యాన్స్ చేయడం, ఆస్పత్రిలోని ఇతర పరికరాలను చేతిలో పట్టుకొని సోషల్ మీడియా కోసం వీడియోలను చిత్రీకరిస్తున్నారు. విధుల్లో ఉన్న సమయంలో కాకుండా ఇతర సమయంలో రీల్స్ చేస్తే పట్టించుకునేది కాదని, ఆస్పత్రి ఆవరణతో పాటు ఆయా వార్డుల్లో వీడియోలు షూట్ చేస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. అయితే రోగులతో కలిసి వీడియోలు తీయడం ద్వారా ఆ రోగి గోప్యత బయట పడుతుందని పలువురు చెబుతున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులకు అసౌకర్యంగా మారిందని పేర్కొంటున్నారు.‘లైక్’ల కోసం..ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పలువురు ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రైవేట్ వైద్యులు, వారి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోలు అంతటా హల్చల్ కావడంతో రిమ్స్‌లోని పలువురు మెడికోలు, జూడాలు, కొంత మంది వైద్యులు సైతం వారిలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ‘లైక్స్’ కోసం వీడియోలు తీస్తూ రెచ్చిపోతున్నారు. ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు రోగులకు ఇబ్బందులు ఎదురైనా సరే.. ఫాలోవర్స్ కోసం నానా తంటాలు పడుతున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి్సన వీరే ఇలా డ్యాన్సులు చేయడం, రీల్స్ తయారు చేయడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను ఫోన్లో వివరణ కోరగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
అమెరికా దాడుల దృశ్యాలు.. ప్రపంచమంతా హడల్!
వాషింగ్టన్/దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింతగా ఎగసిపడుతున్నాయి. తాజాగా ఇరాన్ నౌకలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల దృశ్యాలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) విడుదల చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దశాబ్దాలుగా అంతర్జాతీయ నౌకాయానాన్ని వేధిస్తున్న ఇరాన్ ఆగడాలకు ఇక కాలం చెల్లిందని అమెరికా ఈ వీడియో ద్వారా ప్రపంచానికి తెలియజేసింది.దుబాయ్‌లో భారీ దాడులు.. ఇరాన్ సంచలన ప్రకటనమరోవైపు అమెరికా దాడులకు ధీటుగా బదులిచ్చామని ఇరాన్ ప్రకటించింది. దుబాయ్‌లోని రెండు అమెరికా సైనిక ‘రహస్య స్థావరాల’పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డామని ఇరాన్ స్టేట్ మీడియా ‘తస్నిమ్’ వెల్లడించింది. ఈ దాడుల్లో అమెరికాకు భారీ స్థాయిలో ప్రాణనష్టం వాటిల్లిందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) పేర్కొంది. For decades, Iranian naval vessels have threatened and harassed global shipping in regional waters, but those days are over. pic.twitter.com/J4WUwpfU24— U.S. Central Command (@CENTCOM) March 28, 2026హజ్రత్ ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌లోని రెండు స్థావరాలలో సుమారు 500 మంది అమెరికా సైనికులు ఉండగా, వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. మృతులను, క్షతగాత్రులను తరలించేందుకు దుబాయ్‌లోని అంబులెన్సులు గంటల తరబడి శ్రమించాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతం అమెరికా సైనికులకు స్మశానవాటికగా మారుతుందని, ట్రంప్‌తో పాటు అమెరికా సైనిక కమాండర్లు తలవంచక తప్పదని హెచ్చరించారు.గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు వార్నింగ్పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ‘మీ దేశాల అభివృద్ధి, భద్రతను కాపాడుకోవాలంటే.. అమెరికా, ఇజ్రాయెల్ శక్తులు మీ గడ్డపై నుంచి ఇరాన్‌పై దాడులు చేయకుండా అడ్డుకోండి’ అని ఆయన సూచించారు. ఇరాన్ ఎప్పుడూ ముందుగా దాడులకు దిగదని, అయితే తమ దేశ మౌలిక సదుపాయాలపై ఒక్క దాడి జరిగినా దానికి ప్రతిచర్య అత్యంత తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. కాగా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యేలా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను ప్రతిక్షణం గమనిస్తున్నాయి.ఇది కూడా చదవండి: Bengal Politics: దీదీ ‘చేప’లకు మోదీ గాలం? -
‘మీ ఆఫీస్ ఎదుటే పెట్రోల్ పోసుకుని చనిపోతా’
విజయవాడ: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు. ఇందులో తనకు జరిగిన అన్యాయంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు. తనకు అన్యాయం చేసిన అరవ శ్రీధర్ దర్జాగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నాడని, ఇక జనసేన పార్టీ విచారణ జరిపి ఏం లాభమని పవన్ కళ్యాణ్‌ను నిలదీశారు. జనసేన పార్టీ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటుందన్నారు. తనకు అన్యాయం జరిగిందని గత మూడు నెలలుగా చెబుతూనే ఉన్నానని, త్రిసభ్య కమిటీ వచ్చి రెండు నెలలవుతున్నా అరవ శ్రీధర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మీవైపు తప్పుంది కాబట్టే కమిటీ నివేదిక ఇవ్వడం లేదని, తనకు అన్యాయం చేయాలని చూస్తే జనసేన ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని చనిపోతానని హెచ్చరించారు. మీరంతా కలిసి నన్ను సక్సెస్ ఫుల్ గా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రేపు మీ కుటుంబాల్లో ఇలాగే జరిగితే.. మా పార్టీనే కదా అని ముడుచుకుని కూర్చుకుంటారా?, మీ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా సరే మీరు ఇలాగే వదిలేస్తారా? అని పవన్‌ను నిలదీశారు. -
అధికారిక నివాసంలో.. ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు..
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, మహరాష్ట్ర ఆహార,ఔషధాల నియంత్రణ శాఖ మంత్రి నరహరి జిర్వాల్ తన అధికారిక నివాసంలో ఓ ట్రాన్స్‌జెండర్‌తో రాస లీలలు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ వీడియోలపై నరహరి సోదరుడు ఎన్సీపీ నేత రవి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్ వెనుక కీలక నేతలు ఉన్నారు. ఆ నేతలే సదరు ట్రాన్సెజెండర్తో వీడియోలు తీయించారు. ట్రాన్స్‌జెండర్ కోటాలో ఎమ్మెల్సీతో పాటు ఇతర కీలక పదవులు పొందేందుకు మా సోదరుడి వీడియోలు తీశారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నరహరినే కాదు గతంలో తనని కూడా ట్రాన్స్ జెండర్ బెదిరించారాని గుర్తు చేశారు.ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేత, సామాజిక కార్యకర్త అంజలి దమనియా తీవ్రంగా స్పందించారు. ‘ఇది సిగ్గుచేటు. ఇదే మంత్రి గతంలో లంచం కేసులో కూడా ఇరుక్కున్నాడు. ఇలాంటి వ్యక్తిని పదవిలో ఉంచడం పార్టీకి అవమానం’ అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సక్పాల్ కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. ప్రపంచంలో ‘ఎప్స్టిన్ ఫైల్స్’ ఎలా చెడ్డపేరు తెచ్చుకున్నాయో, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది,” అని ఎద్దేవా చేశారు. ఇక ఎన్సీపీ నేత అమోల్ మిత్కరి మాత్రం ఈ వీడియోను పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ‘ఈ వీడియో ఎనిమిది నెలల పాతది. అసెంబ్లీ సెషన్ ముగిసిన వెంటనే ఎందుకు బయటకు వచ్చింది?. జ్యోతిష్కుడు అశోక్ ఖరాట్ కేసులో దృష్టి మళ్లించడానికి ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు. అలాగే, అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన భార్య సునేత్రా పవార్ ఎన్సీపీ అధ్యక్షురాలిగా రావాలని మొదటగా డిమాండ్ చేసింది జిర్వాల్. అప్పటి నుంచి ఆయనపై వరుసగా వివాదాలు ముసురుకుంటున్నాయని పేర్కొన్నారు.జిర్వాల్‌పై ఇదే మొదటి వివాదం కాదు. మహారాష్ట్రలోని దిండోరి గిరిజన ప్రాంతానికి చెందిన ఈ నాయకుడి కార్యాలయంలోని ఒక క్లర్క్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. లంచంలో మంత్రి ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో చర్చకు దారితీసింది. అప్పుడూ ప్రతిపక్షం ఆయన రాజీనామా కోరింది. ఈ రెండు వివాదాలు కూడా అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత వెలుగులోకి రావడం గమనార్హం.ఎన్సీపీ కొత్త అధ్యక్షురాలు సునేత్రా పవార్ పదవిలోకి వచ్చి ఒక నెల పూర్తయిన రోజే ఈ వీడియో బయటకు రావడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నాసిక్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి కొంతమంది పార్టీ నేతలు మహిళా విభాగం అధ్యక్షురాలు రూపాలి చకంకర్‌ను తొలగించాలని, జిర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని లేఖలు రాశారు. చకంకర్ పేరు కూడా జ్యోతిష్కుడు అశోక్ ఖరాట్ కేసులో వినిపించడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని వారు పేర్కొన్నారు.మొత్తం మీద, ఈ వీడియో వివాదం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతను తెచ్చింది. ఒకవైపు బ్లాక్మెయిల్ ఆరోపణలు, మరోవైపు రాజకీయ కుట్ర ఆరోపణలు, ఎన్సీపీ అంతర్గత విభేదాలు, ప్రతిపక్ష ఒత్తిడి ఇవన్నీ కలిపి జిర్వాల్ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చాయి. -
భార్య స్నానం చేస్తుండగా.. వీడియో తీసిన భర్త స్నేహితుడు!
జగిత్యాలజోన్: ఓ వివాహిత తన ఇంట్లో స్నానం చేస్తుండగా.. చాటుగా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిలింగ్ చేసి.. ఆమెను శారీరకంగా లోబర్చుకున్న కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.6,600 జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిట్ల నర్సయ్య కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు. తన భర్తకు స్నేహితుడైన అదే మండలం నర్సాపూర్‌కు చెందిన నరేండ్ల మహేందర్ అప్పుడప్పుడు సదరు మహిళ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. మహేందర్ ఓ రోజు ఇంటికి వచ్చిన సమయంలో మహిళ స్నానం చేస్తోంది. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియా తీసి.. ఆమె భర్తకు ఆమె గురించి చెడుగా చెప్పాడు. ఫలితంగా భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మహిళ పుట్టింటికి చేరింది. దీంతో మహేందర్ తన ఫోన్లో ఉన్న మహిళ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. 2022 ఏప్రిల్ 19న కూడా రాత్రి సమయంలో వచ్చి వీడియోలు తొలగిస్తానని చెప్పి మళ్లీ శారీరకంగా లొంగదీసుకున్నాడు. వీడియోలు తీసేయమంటే, తాను అడిగినప్పుడల్లా కోరిక తీర్చాల్సిందేనని బెదిరించాడు. దీంతో సదరు మహిళ తనకు జరుగుతున్న అన్యాయాన్ని గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అప్పటి ధర్మపురి సీఐ బిల్లా కోటేశ్వర్ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడైన మహేందర్‌ను అరెస్ట్ చేసి..కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్‌కుమార్, బి.రాజు, వి.శ్రీధర్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో పరిశీలించిన అనంతరం మహేందర్‌కు పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.6,600 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో రిలీజ్
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు. అరవ శ్రీధర్‌పై జనసేన వేసిన కమిటీ రిపోర్టు ఇంతవరకు రాలేదు.. కమిటీ రిపోర్టు రాకుండా పార్టీ కార్యక్రమాలకు శ్రీధర్ ఎలా హాజరవుతాడు? అంటూ ఆమె ప్రశ్నించారు. ‘‘అరవ శ్రీధర్‌కు పవన్ కల్యాణ్ అంటే లెక్క లేదా?. లేదంటే ఇంటర్నెల్‌గా శ్రీధర్‌కు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారా?. ఒక వేళ కమిటీ రిపోర్టు ఇస్తే మాకు చెప్పండి. నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు.’’ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.కమిటీ నివేదిక ఇవ్వకుండానే కండువాతో అరవ శ్రీధర్ ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు పలుదఫాలు గర్భస్రావం చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తిరిగి పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటనపై ఓ కమిటీని నియమిస్తున్నామని, ఆ కమిటీ నివేదిక ఇచ్చేవరకు ఎమ్మెల్యే శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆదేశిస్తున్నట్లు జనసేన అధినాయకత్వం ప్రకటించడం తెలిసిందే.అయితే ఆ కమిటీ ఇంతవరకు ఎటువంటి నివేదిక ఇవ్వకపోగా.. ఎమ్మెల్యే శ్రీధర్ శుక్రవారం రైల్వేకోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లిలో జరిగిన కార్యక్రమంలో జనసేన కండువా కప్పుకొని పాల్గొనడం గమనార్హం. కమిటీ నివేదిక ఇవ్వకుండానే ఎమ్మెల్యే ఏ విధంగా పార్టీ కండువా కప్పుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.కమిటీ పేరుతో జనసేన నాయకత్వం కాలయాపన చేస్తోందని, అరవ శ్రీధర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఇంతవరకు ఎమ్మెల్యే నిర్వాకాలను కనీసం ఖండించకపోవటాన్ని తప్పుబడుతున్నారు. రెండు రోజుల కిందట అరవ శ్రీధర్ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించే నెపంతో పొలాల్లో పర్యటించి ప్రజలకు ముఖం చూపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. -
నెతన్యాహూ మరో సంచలన వీడియో
ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్ దాడులతో మొదలైన యుద్ధం వరుసగా 17వ రోజు భీకరంగా సాగుతోంది. ఒకవైపు ఇరాన్ సుప్రీం లీడర్ 56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రతీ కార దాడుల్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ, అతని భార్య, మరో కీలక అధికారి మరణించారన్న ఊహాగానాలు కూడా నెట్టింట విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే తన మరణం గురించి వస్తున్న పుకార్లకు సమాధానమిచ్చేలా నెతన్యాహూ పేరిట విడుదలైన వీడియోలు ఏఐ సృష్టి నెటిజన్లు వాదిస్తున్నారు. వీటిని తోసిపుచ్చుతూ విడుదలైన కాఫీ షాప్ వీడియో కూడా ఫేక్ అని గ్రోక్ తేల్చి చెప్పింది. ఇదీ చదవండి: మోజ్తబా ఖమేనీ ఆచూకీ : మరో బిగ్ ట్విస్ట్!దీంతో మరోసారి నెతన్యాహూ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెతన్యాహు, 'మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం, కలిసి గెలవడం' అని క్యాప్షన్‌తో సోమవారం ఒక కొత్త వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఆయన పౌరులతో సంభాషిస్తున్నట్లు కనిపించారు.שומרים על ההנחיות ומנצחים ביחד >> pic.twitter.com/HC5w3PqKuV— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 16, 2026నెటిజన్ల విమర్శలుఈ వీడియోలో నెతన్యాహు కదలికలు సహజంగా లేవని, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడిన వీడియో అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి పై స్పష్టత ఇవ్వడానికి బదులు, ఇలాంటి వీడియోలు విడుదల చేయడం పట్ల చాలా మంది పెదవి విరిచారు. ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో -
నెతన్యాహూ కాఫీ వీడియో : షాకింగ్ ‘డీప్‌ఫేక్’ చర్చ
ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం 17వ రోజుకు చేరింది. తమ సుప్రీంనేతమరణం తరువాత ఇరాన్ భీకరమైనప్రతిదాడులతో శత్రు దేశాలకు చెమటలు పట్టిస్తోంది. ప్రధానంగా అమెరికా సైనిక బేస్కేంద్రాలున్న గల్ఫ్ ప్రాంతంలో మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. రోజు రోజుకి ముదురుతున్న ఈ యుద్ధంలో గత వారం నుండి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు భద్రతపై ఊహాగానాలు చెలరేగాయి.ఈనేపథ్యంలో ఆయన మరణించినట్లు వస్తున్న పుకార్లను పటాపంచలు చేయడానికి విడుదల చేసిన కాఫీ వీడియో నెతన్యాహూ ఉనికిపై మరింత చర్చకు తావిచ్చింది. అసలు అది నిజమైనదేనా లేక 'డీప్‌ఫేక్' (AI సృష్టించినదా) అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇటీవల నెతన్యాహూ రిలీజ్ అయిన వీడియో ఏఐ సృష్టి అని, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోవడంతోనే ఇజ్రాయెల్ ఆయన ఏఐ వీడియో రిలీజ్ చేసిందనే అనుమానాలు వ్యక్తమైనాయి. ఆ వీడియోలో ఆయనకు ఎడమ చేతికి ఆరువేళ్లున్నాయంటూ ప్రచారం జోరుగా సాగింది. కాఫీ వీడియోపై ఆన్లైన్లో రచ్చదీనిపై స్పందనగా తాజాగా నెతన్యాహు ఆదివారం ఒక వీడియో రిలీజ్ చేశారు. జెరూసలేం హిల్స్‌లోని ది సతాఫ్ కేఫ్‌లో కాఫీ ఆర్డర్ చేస్తున్నట్లు చూపించే వీడియోను విడుదల చేశారు. తాను చనిపోలేదు అనే సందేశాన్ని ఈ వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేశారు. నా వేళ్లను లెక్కించాలనుకుంటున్నారా? ఇదిగో లెక్కించుకోండి అంటూ తన రెండు చేతులను పైకెత్తి కెమెరాకు తన వేళ్లను చూపించారు. అంతేకాదు తాను కాఫీ కోసం చనిపోతున్నాను అంటూ పుకార్లకు కౌంటర్ ఇచ్చారు. అటు బెంజమిన్ నెతన్యాహు చనిపోయారనే వార్తలను ఇప్పటికే ఇజ్రాయెల్ ఖండించింది.ఏఐ సృష్టే అంటున్న నెటిజన్లునెతన్యాహు ఎక్కడ, ఎలా ఉన్నారనే పుకార్ల మధ్య, కొత్త కాఫీ వీడియో మళ్లీ అనుమానాలను బలపరుస్తోంది. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు దీనిని కృత్రిమ మేధస్సు (AI) సృష్టి అని తేల్చారు. మరోవైపు గ్రోక్ కూడా 'డీప్‌ఫేక్' వెల్లడించింది. ఒక వినియోగదారుడి ప్రశ్నకు సమాధానమిస్తూ, ఎక్స్ AI చాట్‌బాట్, గ్రోక్, కాఫీ షాప్ వీడియోను 'AI-జనరేటెడ్' కంటెంట్‌గా తెలిపింది. ఈ ఏఐ వీడియోలో ఇజ్రాయెల్ తొలుత ఫేస్ గుండ్రంగా ఉంది. ఒక్కసారిగా కోలగా మారిందని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. అలాగే కప్పులోని కాఫీ పడిపోకుండా వింతగా ఉందని కొందరు. కౌంటర్ వెనుక ఉన్న ఒక కస్టమర్ మాస్క్ ధరించి ఉండటంపై కూడా మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో నెతన్యాహు కోటు జేబులు కూడా వింతగా కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషించారు.It's AI-generated. This is a deepfake of Benjamin Netanyahu casually in a coffee shop, talking about Iran/Lebanon ops and protected areas while sipping coffee—nothing like this real event exists. The original post explicitly calls it advanced unreleased AI.— Grok (@grok) March 15, 2026Got some serious questions about the validity of this blatantly obvious AI video…🤷🏻♂️Magical pocket…Coffee in the cup defying gravity…Customer with mask behind the counter 😂 Nice Try…..NOTenyahu 😎 pic.twitter.com/oBA5U3HByK— Freed Ninja (@freezymfe) March 15, 2026 -
అనసూయపై అసభ్యకర పోస్టులు.. ఇద్దరు అరెస్ట్
-
'అది చూసి నేనే షాకయ్యా'.. తనికెళ్ల భరణి వీడియో రిలీజ్
సోషల్ మీడియా గురించి టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడారు. తనికెళ్ల భరణి ఆస్తులు చూస్తే మీరంతా షాక్ అని ఒకరు థంబ్‌నెయిల్ రాసుకొచ్చారు. నిజంగా అది చూశాకా నేనే షాకయ్యా.. ఇంటిముందు అరడజన్ కార్లు కూడా ఉన్నాయని చూపించాడు. అదంతా చూసి మేము నవ్వుకున్నామని తెలిపారు.ఇప్పుడు ఒకదేశంపై యుద్ధం జరుగుతోంది.. నేను ఒక దేశానికి సపోర్ట్ చేస్తున్నట్లు.. ఒక వర్గానికి మద్దతుగా చేస్తున్నట్లు ఇష్టమొచ్చినట్లు పెట్టేస్తున్నారని తనికెళ్ల భరణి అన్నారు. నేను అన్ని వర్గాలు, మతాలను గౌరవిస్తానని.. ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదని.. భవిష్యత్తులో చేయనని తెలిపారు. ఇవీ చూసి నా మిత్రులు, శ్రేయోభిలాషులు బాధపడి ఉంటారని వెల్లడించారు. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు.. స్పందించవద్దని తనికెళ్ల భరణి కోరారు. సోషల్ మీడియా హద్దులు దాటుతొందా? pic.twitter.com/XKRqbSv2v8— Tanikella Bharani (@TanikellaBharni) March 2, 2026 -
అజిత్ పవార్ ‘దుర్ఘటన’.. జై పవార్ సంచలన వీడియో విడుదల
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దివంగత నేత అజిత్ పవార్ మృతికి కారణమైన విమాన ప్రమాద ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇదే విమాన ప్రయాణంలో వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ యజమాని రోహిత్ సింగ్ చీఫ్ పైలట్ సీటులో నిద్రపోతున్నట్లు కనిపిస్తున్న ఒక వీడియోను అజిత్ పవార్ కుమారుడు జై పవార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడిది సంచలనంగా మారింది. ఈ స్థాయి బాధ్యతారాహిత్యం క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రోహిత్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.జనవరి 28న పూణే జిల్లా బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ విమానాన్ని వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ నడుపుతున్నది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన జై పవార్.. తన తండ్రిని కోల్పోయిన వేదన వర్ణనాతీతమని, ఆ బాధ జీవితాంతం తమను వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్ స్థానంలో కూర్చుని నిద్రపోవడం ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టడమేనని, ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయమని జై పవార్ అన్నారు.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ వ్యవహారంపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని, ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ ముగిసేవరకు వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థకు చెందిన అన్ని విమానాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) శనివారం విడుదల చేసిన ప్రాథమిక నివేదికపై కూడా జై పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.Ajit Pawar's son Jay Pawar shares video showing VSR Ventures owner asleep in airplane cockpit. pic.twitter.com/WurvM6fueH— News Algebra (@NewsAlgebraIND) March 2, 2026ప్రమాద సమయంలో విజిబిలిటీ నిర్ణీత స్థాయి కంటే తక్కువగా ఉండటం, రన్‌వేపై గుర్తులు వెలిసిపోవడం, రన్‌వే ఉపరితలంపై చిన్నపాటి రాళ్లు ఉండటం ప్రమాదానికి కారణాలు కావచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక అసంపూర్తిగా ఉందని, దీనివల్ల తమకు న్యాయం జరగదని జై పవార్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రజలకు, బాధిత కుటుంబాలకు ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. విమాన ప్రమాదానికి సంబంధించిన విచారణలో భాగంగా ఈ తాజా వీడియోను కూడా పరిగణనలోకి తీసుకోవాలని జై పవార్ డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: చపాతీలు చేస్తూ చెత్త బుట్ట.. వంట మనిషిని పట్టుకున్న ఏఐ బాట్ -
చెప్పుతో కొట్టుకున్న టీడీపీ నేత.. వీడియో వైరల్
ప్రకాశం జిల్లా: దర్శి నియోజకవర్గ టీడీపీలో అసంతృప్త నేతలు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి మళ్లీ పోటీ చేసే ఉద్దేశం లేకపోవడం వల్లే టీడీపీ నేతల వద్దే కమీషన్లు వసూలు చేస్తూ అందిన కాడికి దోచుకుని ఊడ్చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ముండ్లమూరు మాజీ మండల కనీ్వనర్ సోమేపల్లి శ్రీనివాసరావు అయితే ఏకంగా 2024లో టీడీపీ అధికారంలోకి ఎందుకు వచ్చిందా అని తన చెప్పుతో తానే కొట్టుకున్న వీడియో సంచలనంగా మారింది. ఆ వీడియో చూసిన ప్రజలు సైతం అవాక్కయ్యారు. సాధారణంగా పారీ్టలో కొనసాగటం ఇష్టం లేకపోతే రాజీనామా చేస్తారు. అయితే తాను సెల్ఫీ వీడియో తీసుకుని మరీ చెప్పుతో కొట్టుకుని ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారంటే పార్టీ పరిస్థితి నియోజకవర్గంలో ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, 14 ఏళ్లు పార్టీ మండల కనీ్వనర్‌గా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తికే అసహనం పుట్టి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారంటే ఆ దారిలో మరి ఎంత మంది ఉన్నారన్న విషయం చర్చనీయాంశమైంది. ఇటీవల ముండ్లమూరులో ఓ వెంచర్ కు మట్టి తోలకాలు, ఇతర పనుల కాంట్రాక్ట్ మొత్తం వెంచర్ యజమాని వద్ద డీల్ కుదుర్చుకుని ఈయనే ఆ పనులు చేస్తున్నారు. భారీ వెంచర్ వేసేందుకు ఇన్చార్జ్ అనుమతి కోసం కోటి రూపాయలు డీల్ కుదిర్చారని, అందులో రూ.60 లక్షలు ఇవ్వగా ఇంకా రూ.40 లక్షలు ఇవ్వాలని సమాచారం. మిగతా డబ్బు కోసం ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారని తెలిసింది. అందులో భాగంగా తలెత్తిన వివాదం కూడా ఆయన చెప్పుతో కొట్టుకోవడానికి ఒక కారణంగా చర్చించుకుంటున్నారు. అంతే కాకుండా గతంలో చేసిన పనుల్లో కమీషన్లు ఇవ్వలేదని బిల్లులు అడ్డుకుని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి వివాదాల కారణంగానే ఇటీవల కాలంలో టీడీపీ నాయకులు సైతం జనసేన పార్టీలో చేరినట్లు సమాచారం. అధికార పారీ్టలో ఇలా నాయకుల అసంతృప్తికి కారణం ఇక్కడ కమీషన్ల దందాలేనని చెప్పుకుంటున్నారు. ఇతర సామాజికవర్గాలకు చెందిన టీడీపీ నాయకుల్లోనూ గొట్టిపాటి లక్ష్మి ఒంటెత్తుపోకడలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.నియోజకవర్గంలో ఇసుక, మట్టి ఏ నాయకున్నీ తోలుకోనివ్వకుండా మొత్తం ఇక్కడ ఇన్చార్జే దోచుకుంటున్నారని ఇసుక వనరులు ఉన్న ప్రాంతాల్లో టీడీపీ నాయకులు సైతం అసంతృప్తిగా ఉన్నారు. గతంలో అధికార పారీ్టకి చెందిన టిప్పర్లు ఇన్చార్జ్ అనుమతి లేకుండా ఇసుక సరఫరా చేస్తున్నారని కమ్మవారి పాలేనికి చెందిన టీడీపీ నేత లారీని కూడా ఇన్చార్జ్ అనుచరులు ధ్వంసం చేశారు. నియోజకవర్గంలో ఎక్కడైనా గ్రావెల్ ఎత్తాలన్నా తమకు కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేయడంతో టీడీపీ నేతలు కొందరు టిప్పర్లు కూడా అమ్ముకున్నారు. ఏ పనిచేయాలన్నా కప్పం కట్టాల్సిందే..నియోజకవర్గంలో ఏ పనులు చేసినా బిల్లులు చెల్లించాలంటే తమకు కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. గ్రామాల్లో అవకాశం ఉన్న చోట్ల చేపల చెరువులు పాటలు పెట్టకుండానే చేపలు వేయించి అనధికారికంగా దోపిడీకి పాల్పడుతున్నారు. పులిపాడు సమీపంలో పోలీసులను కాపలా పెట్టి మరీ చెరువు పక్కన పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డును తీసి వేసి ఆ రోడ్డు స్థానంలో అర ఎకరా ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకునేందుకు భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకుని నూతన రోడ్డును పోసి చెరువు భూమిని ఆక్రమించుకున్నారు. ఈ విషయంలో టీడీపీ ఇన్చార్జ్ పీఏ భారీ మొత్తంలో వసూళ్లు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో ఎవరైనా అధికారులు పని చేయాలంటే కప్పం కట్టాల్సిందేనన్న విషయం చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగానే ఇటీవల దర్శి ఎంపీడీఓ కార్యాలయంలో ఓ ఉద్యోగిని విధుల్లోకి తీసుకోలేదని సమాచారం. ముండ్లమూరు మండలంలోని ఓ మాజీ ఎంపీపీ కూడా ఇన్చార్జ్ తీరుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయనకు మండలం పెత్తనం మొత్తం నీదే అని చెప్పడం..ఆ తరువాత అధికారులకు ఫోన్ చేసి ఆయన చెప్పిన పనులు చెయ్యవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్ నాయకుడైన తనకు విలువ ఇవ్వడం లేదని ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేతలను విస్మరించి పనులు చక్కదిద్దేందుకు పైకం ముట్టచెప్పే వారికే పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎంతో మంది సీనియర్ నాయకులు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని ఆపార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. -
Youtuber కోమలి ఘటనలో బయటపడ్డ CCTV వీడియో
-
చంద్రబాబు అసలు స్వరూపం
-
లిఫ్ట్ ఫెయిల్ ..చిన్నారి తెగువతో తప్పిన ప్రమాదం
ఇటీవల కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు కామన్ గా మారాయి. తయారీ సంస్థలు సరైన విధంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఇక్కడ జరిగింది. అయితే లిఫ్ట్ లో చిక్కుకోబోయిన ఇద్దరు చిన్నారులను ఒక బాలిక మెలకువతో తక్షణమే స్పందించి కాపాడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.ఒక అపార్టుమెంటులోని ఎలివేటర్ లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే వారి కుటుంబసభ్యుల కోసం వేచిచూస్తు అక్కడే ఉన్న బాలిక లిఫ్ట్ ని తన చేతితో ఆపుతుంది. అయితే వారు లిఫ్ట్ ద్వారాల మధ్యలో ఉండగానే ఆ గేట్స్ అకస్మాత్తుగా క్లోజ్ అయ్యాయి. దీంతో ఆ చిన్నారి లోపలికి వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న బాలిక తక్షణమే స్పందించి వారికి తన చేయితే లిఫ్ట్ ని బిగియపట్టింది.తన శక్తికి మించిన పనైనా ఏమాత్రం అ ధైర్యపడకుండా బిగుతుగా లిఫ్ట్ గేటును పట్టుకుంది. ఇంతలోనే వారి కుటుంబసభ్యులు వచ్చి ఎట్టకేలకు బలవంతంగా ఆ చిన్నపిల్లలను బయిటకి తీశారు. దీంతో అంతా ఉపిరిపీల్చుకున్నారు. సాధారణంగా లిఫ్ట్ సెన్సార్స్ ఏదైనా అడ్డు చూపితేనే వెనక్కి వెళతాయి. అయితే ఇందులో చిన్న పాప అడ్డు ఉన్నప్పటికీ ఆ డోర్స్ క్లోజ్ అవడం ఆందోళనకు గురిచేస్తోంది.ఈ లిఫ్ట్ వీడియో ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బాలిక ధైర్యసాహసాలకను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో ఆ ఎలివెేటర్ల భద్రతని ప్రశ్నిస్తున్నారు. లిఫ్ట్ తయారిలో ఇలాంటి భద్రత ప్రమాణాలు పాటించకపోవడం ఏంటని ఇలాంటి వాటి వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. అయితే ఈ ప్రమాద ఘటన ఎక్కడ జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. A small girl is seen at the entrance of a residential lift. As the elevator doors began to close, she noticed another child running toward the lift from the corridor.Without hesitation, the girl used her own body to partially block the doorway, preventing the heavy doors from… pic.twitter.com/llUbPdk5eN— SUNIL KUMAR (@ijustsunil) February 21, 2026 -
రాహుల్ గాందీని కాల్చి పారేస్తాం
జైపూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీతోపాటు ఆ పారీ్టకి చెందిన మరో 25 మంది ఎంపీలను కాల్చి చంపుతామంటూ బెదిరింపు వీడియో విడుదల చేసిన ఓ వ్యక్తిని రాజస్తాన్‌లోని కోటా పట్టణంలో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడిని రాజ్ సింగ్‌గా గుర్తించారు. రాజ్ సింగ్ కర్ణీ సేనకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో 25 మంది కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను దూషించడం బీజేపీతోపాట కర్ణీ సేనను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిందన్నాడు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే ఆయా ఎంపీల ఇళ్లల్లోకి చొరబడి ధ్వంసం చేస్తామని హెచ్చరించాడు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే స్పీకర్ ఓం బిర్లాను అసభ్య పదజాలంతో దూషించారని రాజ్ సింగ్ ఆరోపించాడు. ఓం బిర్లా పట్ల మళ్లీ అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తుపాకీలో కాల్చేస్తామని వీడియోలో తేల్చిచెప్పాడు. 25 మంది ఎంపీలను 24 గంటల్లోగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు. లేకపోతే ఒకరి తర్వాత ఒకరిని కాల్చిపారేస్తామని పేర్కొన్నారు. ఈ వీడియోలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాజ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
రాజుగారు వచ్చారహో!
సౌరభ్‌జైన్ అనే భారతీయుడి కుటుంబంతో దుబాయ్ పాలకుడు సరదాగా గడిపిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది... దుబాయ్‌లోని సాయిహ్ అల్ సలాం ఎడారి. చుట్టూ ఇసుక తిన్నెలు, ప్రశాంతమైన అల్ ఖుద్రా సరస్సు. వారాంతాల్లో సరదాగా గడపడానికి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈసారి అక్కడికి దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎటువంటి హడావిడి, భద్రతా సిబ్బంది లేకుండా స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారు. సరస్సు దగ్గర ఆడుకుంటున్న పిల్లలను చూసి, కారు ఆపి ఆత్మీయంగా పలకరించారు. ఆశ్చర్యంతో చూస్తున్న వారి కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి చిరునవ్వుతో పలకరించారు. పిల్లలతో కలిసి ఫొటో దిగారు. ఈ అద్భుతమైన క్షణాలను సౌరభ్‌జైన్ తన ఫోన్లో బంధించాడు. ‘ఖుద్రా లేక్ దగ్గర గడిపిన ఒక సాధారణ వారాంతం అద్భుతం. దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్‌ని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, పిల్లలపై ఆయన చూపిన ప్రేమ, ఆత్మీయత మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి’ అంటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. చాలా తక్కువ టైమ్‌లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజనులు దీనిని ‘డ్రీమ్ ఆఫ్ మిలియ¯Œ ్స’ అంటున్నారు. -
అప్పుడు లెజండరీ యాక్టర్...ఇవాళ లైఫ్‌కోచ్‌గా..!
అప్పట్లో భారతీయ టెలివిజన్ రంగంలో తన అందం, గొంతుతో సంచలనం సృష్టించిన రూబీ భాటియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. అయితే, ఈసారి ఆమె వార్తల్లో నిలవడానికి కారణం ఆమె గ్లామర్ కాదు.. రూ. 1,000 కే అందిస్తున్న లైఫ్ కోచింగ్ సర్వీసెస్. ఈ ప్రకటనలు చూసిన నెటిజన్లు, ముఖ్యంగా 90ల కాలం నాటి అభిమానులు ఒక్కసారిగా మూగబోయారు. ఒకప్పుడు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్న ఒక లెజెండరీ యాంకర్.. 90వ దశకంలో భారతీయ టెలివిజన్ రంగంలో ఛానల్‌వి హవా నడిచిన కాలం. ఆ తరం యువతకు ఫ్యాషన్ ఐకాన్ రూబీ భాటియా. తన విలక్షణమైన ఇంగ్లీష్ యాక్సెంట్, చిరునవ్వు, మెరిసే కళ్ళతో ఆమె బుల్లితెరను శాసించేది. మాజీ మిస్ ఇండియా కెనడా అయిన రూబీ భారత్ మొట్టమొదటి వీడియో జాకీగానూ గుర్తింపు పొందారు. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆమె ఒక స్మార్ట్‌ఫోన్ కెమెరా ముందు కనిపిస్తూ నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, బరువు తగ్గడం, ఆందోళన, డిప్రెషన్ వంటి విషయాలపై లైఫ్ కోచింగ్ ఇస్తానంటూ ఆమె ఇటీవల వీడియోలు విడుదల చేశారు. వీటిని చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఆమెను ఇలా చూడటం మనుసుకి భారంగా ఉందంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తే, మరికొందరు మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీ అయినప్పటికీ కూడా ఏ పనీ చిన్నది కాదని భావించి, స్వయంగా తన సేవలను ప్రమోట్ చేసుకోవడం ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. For 90s kids, Ruby Bhatia was everywhere, a familiar, confident face on TV, VJing, anchoring, interviewing.Seeing her reels today, offering life coaching, makeup tips, and even asking people to WhatsApp her for work for ₹1000, just feels heavy.Not mocking her at all. It’s… pic.twitter.com/JAP2YPkZXp— Sapna Madan (@sapnamadan) January 29, 2026 (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!) -
పార్లమెంట్లో రభస: మహిళా ఎంపీల వీడియో విడుదల
న్యూఢిల్లీ: పార్లమెంట్లో మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర వాదప్రతివాదనలు తారాస్థాయికి చేరాయి. మరోవైపు ఫిబ్రవరి 4న లోక్‌సభలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తాజాగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగానికి మరికొద్ది నిమిషాల ముందు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు ప్రధాని కూర్చునే స్థానానికి అత్యంత సమీపంలోకి దూసుకెళ్లడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. సభలో నెలకొన్న గందరగోళం దృష్ట్యా, ప్రతిపక్ష ఎంపీలు దాడికి దిగే అవకాశం ఉందని భావించి, ఆ రోజు ప్రధానిని సభకు రావద్దని స్పీకర్ ఓం బిర్లా ముందే సూచించినట్లు తెలియవచ్చింది.ఈ ఘటనపై కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబట్టారు. వారి ఎంపీల దిగజారుడు ప్రవర్తనపై కాంగ్రెస్ గర్వపడుతోందని ఆయన విమర్శించారు. ‘మేము గనుక మా బీజేపీ ఎంపీలను ఆపకుండా, కాంగ్రెస్ ఎంపీలను ఎదుర్కొనేందుకు అనుమతించి ఉంటే, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. పార్లమెంటు గౌరవాన్ని, పవిత్రతను కాపాడాలన్నదే మా ప్రథమ ప్రాధాన్యత’ అని రిజిజు పేర్కొన్నారు. సభా మర్యాదలను కాపాడటానికే తాము సంయమనం పాటించామని ఆయన స్పష్టం చేశారు.ఈ నిరసన వెనుక జనరల్ (రిటైర్డ్) ఎం.ఎం. నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అనే ప్రచురితం కాని పుస్తక ప్రస్తావన ఉంది. గత వారం రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఈ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడంతో పార్లమెంటులో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ వివాదమే ఫిబ్రవరి 4నాటి గందరగోళానికి దారితీసింది. అప్పట్లో ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రధాని లక్ష్యంగా ప్రతిపక్ష ఎంపీలు వ్యూహరచన చేస్తున్నారని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించడంతో, ఆ రోజు సభ అర్థంతరంగా వాయిదా పడింది. Congress Party is proud of the most degrading behavior by their MPs !! If we had not stopped all BJP MPs and allowed the Women MPs to confront Cong. MPs, it would have led to very ugly scene. We have very high consideration, to protect the dignity & sanctity of the Parliament. https://t.co/tRj5HjLKFH pic.twitter.com/aTmktk4Y7E— Kiren Rijiju (@KirenRijiju) February 10, 2026 -
గుంటూరు కోర్టులో అంబటి రాంబాబు విజువల్స్
-
రీల్ చేస్తుండగా ఉరి బిగుసుకుని..
బాందా(యూపీ): సోషల్ మీడియాలో ఉరికి సంబంధించిన వీడియోల కోసం పదేపదే సెర్చ్ చేసిన ఓ మహిళ.. తానూ అలాంటి ఓ వీడియో తీసి పోస్ట్ చేయాలనుకుంది. ఇందుకోసం చీరను పైకప్పుకు కట్టి, మెడకు ఉరి బిగించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. తన నాలుగేళ్ల కూతురికి సెల్‌ఫోన్ ఇచ్చి, వీడియో స్టార్ట్ చేసి తగు సూచనలు చేసింది. చీరతో ఉరి వేసుకున్నుట్ల నటించడం మొదలుపెట్టింది. ఇంతలోనే అనుకోకుండా ఆమె కాలు జారి ఉరి బిగుసుకుంది. షూట్ చేస్తున్న చిన్నారి ఇదంతా నటనే అనుకుంది. కొద్ది సేపటికి తల్లి చీరకు వేలాడుతుండటంతో ఏడ్వడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వారు వచ్చి, కిందికి దించారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా మోహిని అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. యూపీలోని బాందా జిల్లా బబెరు పట్టణంలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. -
దోమలు చంపుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వ్యాప్తంగా 4,846 కాలనీల్లోని నీటినిల్వ ప్రదేశాలు, చెరువులు, కుంటలు, సెల్లార్లల్లో దోమల నివారణ చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ యంత్రాంగం చెబుతున్నా నగరవాసులకు దోమకాటు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీడైరెక్టర్ రాజమౌళి కొడుకు కార్తికేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యంగ్య వీడియో చర్చనీయాంశమైంది. షూటింగ్ సమయంలో దోమల వల్ల నటులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందుల్ని ఆ వీడియోలో చూపించారు. నగరంలోని దోమలబెడద,ప్రజల బాధను ప్రతిబింబిస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల కూకట్‌పల్లికి చెందిన ఓ ఇంజినీరు రూ.15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడారు. చెరువుల్లో గుర్రపుడెక్క నిర్మూలన పనుల బిల్లుల వ్యవహారం కావడంతో అది కూడా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ దోమల సమస్యపై సెటైరికల్ వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి కొడుకు కార్తికేయ pic.twitter.com/U0orlNGngM— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026 -
వీడియో వైరల్: మంచుకొండల్లో అరుదైన క్షణాలు..
ఒక మంచు చిరుత (Panthera uncia) చేసిన అరుదైన వేట దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కిబ్బర్ గ్రామంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆండ్రెస్ నోవాలెస్ తన కెమెరాలో బంధించారు. భారీ హిమపాతం తర్వాత ఆకాశం నిర్మలంగా మారిన సమయంలో కిబ్బర్ లోయ మంచుతో కప్పబడి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.ఓ మంచు చిరుత తన రెండు పిల్లలను లోయ కింద వదిలిపెట్టి.. ఒంటరిగా కొండ పైకి వెళ్లి అక్కడ మేత మేస్తున్న ఐబెక్స్(అడవి మేక జాతి) మందపై దాడి చేసింది. ఒక పెద్ద ఐబెక్స్‌ను లక్ష్యంగా చేసుకుని దానిపైకి దూకింది. ఐబెక్స్ తనను తాను రక్షించుకోవడానికి అత్యంత వేగంగా పరుగెత్తింది. ఈ క్రమంలో రెండు జంతువుల మధ్య పెనుగులాట జరిగింది. ఒక దశలో రెండు జంతువులు లోయ అంచున మృత్యువుకు అతి సమీపంలోకి వెళ్లాయి. అయితే, సరిగ్గా ఆ సమయంలో చిరుత పట్టు సడలడంతో.. ఐబెక్స్ చాకచక్యంగా దిశ మార్చుకుని అక్కడి నుండి తప్పించుకుంది.ఆండ్రెస్ నోవాలెస్ ఈ అనుభవాన్ని పంచుకుంటూ.. తన జీవితంలోనే అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. హిమాలయాల్లో మనుగడ సాగించడం ఎంత కఠినమో, ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపిస్తుందని పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పటికే ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఇది అద్భుతం.. ప్రకృతి అసలైన రూపం ఇది" అంటూ నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Andres Novales (@andresnovales_wildlife) -
సోషల్ మీడియా పోస్ట్.. యువతి అరెస్ట్
కొద్దిరోజుల క్రితం కేరళలో బస్సులో లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి వీడియో పోస్ట్ చేసి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారడంతో అవమాన భారంతో ఆయువకుడు బలవన్మరణానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కేరళ పోలీసులు ఆ వీడియో పోస్ట్ చేసిన యువతిని అరెస్టు చేశారు.గత శుక్రవారం దీపక్(42) అనే వ్యక్తి కన్నూర్ వెళ్లడానికి బస్సుఎక్కాడు. ఆసమయంలో బస్సులోనే ఉన్న శింజితా ముస్తాఫా (35) అనే మహిళ తనను దీపక్ తనను అసభ్యంగా తాకాడంటూ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇది కాస్త అక్కడ వైరల్‌గా మారడంతో అవమానభారంతో ఆ దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయువకుడి తప్పేమి లేదని యువతి ఫేమస్ కావాలనే ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని యువకుడు తరపు బంధువులు కేసు పెట్టారు.దీంతో ముస్తాఫా పరారైంది. తాజాగా ఆమెను తన బంధువుల ఇంటివద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన వీడియో ఎడిటడ్‌దని ఆ పూర్తి వీడియోని సైబర్ విభాగం రివవరీ చేసి చూస్తుందని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గతంలో శింజితా ముస్తాఫా స్పందిస్తూ " నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అతడు నన్ను అదేపనిగా తాకాడు. అది అపార్థంగా అనుకోకుండా జరిగింది కాదు. కావాలనే అలా చేశాడు ఇది ఖచ్చితంగా తప్పే నాకు అతను తాకడం ఇబ్బందిగా అనిపించిన తర్వాత రికార్డింగ్ చేయడం ప్రారంభించాను అయినప్పటికీ అతను తాకాడు" అని తెలిపింది.అయితే ఈ వివాదం రెండురోజుల తర్వాత దీపక్ తన ఇంటివద్ద ఉరివేసుకొని చనిపోయాడు. దీంతో అతను చాలా అమాయకుడని అన్యాయంగా తన కొడుకుపై అపనింద వేశారని అతని తల్లిదండ్రులు రోదించారు. దీనిపై కేరళ మానవహక్కుల సంఘం సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. దీనిపై సమగ్రవిచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. -
సోషల్ మీడియాలో ఇదేం తొండాట(డబుల్ గేమ్)?!
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అనే సామెత ఒకటి ఉంటుంది. కేరళ ఘటనలో తప్పెవరిది అనేది తేలకున్నా.. ఇప్పుడు చాలామంది ఈ సామెతను అన్వయింపజేస్తున్నారు. బస్సులో తనను లైంగికంగా వేధించాడని ఓ ఇన్ఫ్లుయెన్సర్ పోస్టు చేసిన వీడియో.. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన సంగతి తెలిసిందే కదా.. ఈ ఘటనలో ఏం జరిగిందో మరోసారి చూద్దాం. కోజికోడ్‌కు చెందిన దీపక్(42) బస్సులో వెళ్తున్నప్పుడు ఓ యువతి పక్కనే నిలబడి వీడియో తీసింది. అందులో దీపక్ తనను అసభ్యంగా తాకాడంటూ ఆ వీడియోను తన ఫాలోవర్స్‌కు చేరవేసింది. అంతే.. సదరు వ్యక్తిని తిట్టిపోస్తూ ట్రెండింగ్ నడిచింది. ఈ విషయం తనదాకా చేరడంతో ఆ వ్యక్తి భరించలేకపోయాడు. శుక్రవారం(జనవరి 16) ఈ ఘటన జరిగింది. శనివారం దీపక్ పుట్టినరోజునే ఈ వీడియో వైరల్ కావడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం బలన్మరణానికి పాల్పడి ఈ తతంగాన్ని ఇంతటితో ముగిద్దాం అనుకున్నాడు. కానీ, నెటిజన్స్ మాత్రం ఊరుకోలేదు. తిట్టిపోసిన అదే సోషల్ మీడియా ఈసారి ప్రాణాలతోలేని దీపక్‌కు మద్దతు ప్రకటించింది. సదరు యువతి ఫాలోయింగ్‌ను పెంచుకోవాలనే అలా చేసి ఉంటుందా?... పాపులారిటీ కోసం పాకులాడిందా? అనే అనుమానాలతో చర్చ మొదలుపెట్టారు. అయితే దీపక్ ఫ్యామిలీ ఈ డబుల్ గేమ్ సపోర్టును తిరస్కరించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంటర్నెట్లో అలా ఎలా విచారణ జరుపుతారని.. తమ బిడ్డది తప్పని తేలుస్తారని దీపక్ తల్లి అంటోంది. ఆ యువతి కంటే నెటిజన్లే డేంజర్ అని అంటోంది. షిమ్జితా ముస్తాఫా.. యాక్టివిస్ట్‌గానూ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గానూ గుర్తింపు దక్కించుకుంది. దీపక్ వేధింపుల వీడియోను పోస్ట్ చేశాక.. ఆమెకు అభినందనలు కురిశాయి. అయితే.. దీపక్ మరణం తర్వాత ఆమె ట్రోలింగ్‌కు గురైంది. పలువురు నెటిజన్లు ఆమెను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ వీడియోను తొలగించింది. తన చర్యను సమర్థించుకుంటూ మరో వీడియోను పోస్ట్ చేసింది(దానికి కామెంట్లు చేయకుండా ప్రైవసీ పెట్టుకుంది). పైగా ఈ విషయంలో తనకు పోలీసుల సపోర్ట్ లభించిందని చెప్పుకొచ్చింది. కానీ.. మగ ప్యాసింజర్లకు, మగ కండక్టర్లకు ఇవి తప్పవా?మూడు రోజుల క్రితం చేయని తప్పుకు తన మీద వీడియో తీసి తనను అవమానించినందుకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేపథ్యంగా, కేరళ బస్సుల్లో మగవారు అట్టపెట్టెలను అడ్డం పెట్టుకుని బస్సులో వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. pic.twitter.com/AXUEYp5Dfc— greatandhra (@greatandhranews) January 20, 2026కేరళ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. షిమ్జితా నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని క్లారిటీ ఇచ్చారు. పైగా ఆత్మహత్యకు ఉసిగొల్పిందంటూ దీపక్ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో షిమ్జితాపైనే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. ఆమె కోసం స్పెషల్ టీంలు గాలింపు జరుపుతున్నాయి. ఆమె దొరికితేనే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. నెటిజన్ల దెబ్బకు ఆమె సోషల్ మీడియా అకౌంట్లు కూడా డిలీట్ చేసేసుకుందని తెలుస్తోంది. ఆన్లైన్ వేధింపులు ఎంతటి విషాదాలకు దారి తీస్తుందో ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందని అంటున్నారు. కేరళ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. కొందరు పురుషులు (వయసు తారతమ్యం లేకుండా పెద్దవాళ్లతో సహా..) బస్సుల్లో ఎక్కి ఆడవాళ్ల మధ్యలో నిల్చుని తమను అనుమానించొద్దు అంటూ సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. -
నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి?.. హీరోయిన్ ఇంట్రో గ్లింప్స్ చూశారా?
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఆకాశంలో ఒక తార. ఈ మూవీకి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ను పరిచయం చేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తున్నట్లు గ్లింప్స్ రిలీజ్ చేశారు. నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. రోడ్డు కూడా సరిగా లేని ఈ ఊరి నుంచి ఆకాశానికి నిచ్చేనేశావా? ముందు ఈ ఊరి పొలిమేర దాటి చూపించు చూద్దాం అనే డైలాగ్ వింటుంటే.. కనీస వసతులు కూడా లేని పల్లెటూరి అమ్మాయి తన కలలను ఎలా సాధించుకుంది అనే కథాంశంతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. -
వ్యక్తి ప్రాణం తీసిన.. యువతి పోస్ట్
కేరళలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన తప్పు లేకపోయినా ఓ మహిళ తనను తీవ్రంగా అవమానించిందనే బాధతో ఓ యువకుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనను దూషిస్తూ వీడియో చేసి సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేసి తన పరువు తీసిందనే మనస్థాపంతో తనువు చాలించాడు.గోవిందపురంకు చెందిన దీపక్ అనే యువకుడు కోజికోడ్‌లో ఓ వస్త్రాల దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన వ్యక్తిగత పనిమీద కన్నూర్ వెళ్లడానికి బస్సుఎక్కాడు. ఆసమయంలో బస్సులో ఉన్న ఓయువతి తనను దీపక్ అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ వీడియో చేసింది. అది కాస్త ఇన్‌స్టాలో వైరలయ్యింది.దీంతో దీపక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అనంతరం తీవ్ర అవమాన భారంతో ఆదివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో తన తప్పేం లేదని శనివారం తన స్నేహితులతోనూ మాట్లాడినట్లు వారు పేర్కొన్నారు. దీపక్ చాలా మంచి వాడని అతని స్నేహితులు తెలిపారు. ఏడు సంవత్సరాలుగా తన వద్ద పనిచేస్తున్నాడని ఇప్పటివరకూ అతని గురించి ఒక్క చెడుమాట కూడా వినలేదని అతని పనిచేస్తున్న షాపు యజమాని పేర్కొన్నారు. అయితే ఈ ఘటన గురించి ఆ మహిళను సంప్రదించారు. బస్సులో తనతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు తన ఉద్దేశం ఏంటని ప్రశ్నించానని ఆమె తెలిపింది. వీడియో చిత్రీకరించిన సమయంలోనే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడుతుందని తెలిపానని అయితే అతను ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఆమహిళ పేర్కొంది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై మరింత లోతైన విచారణ చేయనున్నట్లు తెలిపారు. -
భార్య కాలిపోతుంటే... వీడియో తీశాడు!
సూరత్: వారిద్దరూ భార్యాభర్తలు. కొన్నాళ్లుగా తరచూ కీచులాడుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో ఒక రోజు వారి నడుమ మాటామాటా పెరిగింది. ఆవేశంలో భార్య ఒంటిపై డీజిల్ గుమ్మరించుకుని నిప్పంటించుకుంది. మంటల్లో చిక్కి హాహాకారాలు చేస్తుంటే కాపాడాల్సింది పోయి, ఆ ప్రబుద్ధుడు ఆమె మరణయాతనను తీరిగ్గా వీడియో తీస్తూ కూచున్నాడు! అంతేగాక, డీజిల్ పోసుకునేలా ఆమెను కావాలనే రెచ్చగొట్టినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది!! జనవరి 4న గుజరాత్లో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. బిహార్‌కు చెందిన రంజిత్ సాహా (33), ప్రతిమాదేవి (31) 2013లో ఇంటినుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం సూరత్‌లోని ఇచ్ఛాపూర్లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పిల్లలు, వారి చదువులు తదితరాల విషయమై కొంతకాలంగా దంపతులు తరచూ ఘర్షణ పడుతూ వస్తున్నారు. జనవరి 4న వారి మధ్య గొడవ పెద్దదైంది. ఆ క్రమంలో, చేతనైతే ఒంటిపై ఏమన్నా పోసుకుని అంటించుకోవాల్సిందిగా రంజిత్ రెచ్చగొట్టాడు. దాంతో ఆవేశానికి లోనైన ప్రతిమ, అతను అప్పటికే గ్యారేజీ నుంచి తెచ్చి ఉంచిన డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను వారించేందుకు గానీ, నిప్పింటించుకున్నాక కాపాడేందుకు గానీ రంజిత్ ఏమాత్రమూ ప్రయతి్నంచలేదు. పైగా, ఈ ఘటనలో తన ప్రమేయం లేదని నిరూపించుకునేందుకు ఆమె డీజిల్ పోసుకోవడం మొదలుకుని నిప్పంటించుకుని హాహాకారాలు చేయడం దాకా మొత్తం ఘటనను తన మొబైల్లో వీడియో తీస్తూ కూచుకున్నాడు! కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రతిమ వారం తర్వాత స్పృహలోకి వచి్చంది. తానే డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నానంటూ వాంగ్మూలమిచ్చి మరణించింది. కానీ ఆమె సోదరుడు మాత్రం రంజిత్ తీరుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంజిత్‌ను అదుపులోకి తీసుకుని అతని మొబైల్‌ను పరిశీలించగా ఈ వీడియో నిర్వాకం వెలుగులోకి వచి్చంది. ఫ్లోర్ క్లీనింగ్ కోసం ఫినాయిల్‌లో కలిపేందుకంటూ రంజిత్ గ్యారేజీ నుంచి డీజిల్ తెచ్చి ఇంట్లో పెట్టినట్టు విచారణలో తేలింది. బహుశా పక్కా ప్లాన్ ప్రకారమే అతను ఇదంతా చేసినట్టు వారు అనుమానిస్తున్నారు. అతనిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
చైల్డ్ పోర్న్ చూశారు.. పోలీసులు తాట తీశారు!
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌కు చెందిన కంధాడ శ్రీకాంత్ జీ2 సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. గతంలో హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ సంస్థలో హౌస్ కీపింగ్ బాయ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో ఓ బాలికపై లైంగిక దాడి చేశాడు. ఆ వీడియోలను తన సెల్ఫోన్లో రికార్డ్ చేసి గూగుల్ డ్రైవ్‌లో అప్లోడ్ చేశాడు. ఆన్లైన్లో సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న టీజీసీఎస్బీకి ఈ విషయం దృష్టికి వచ్చింది. ఆ వీడియోలోని వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. తాము గుర్తించే వరకు కూడా తమ చిన్నారిపై శ్రీకాంత్ లైంగికదాడికి పాల్పడినట్టు ఆ బాలిక తల్లిదండ్రులకు తెలియదని టీజీ సీఎస్బీ అధికారులు తెలిపారు. నిజామాబాద్ ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి విదేశీ చిన్నారుల పోర్న్ వీడియోలు బ్రౌస్ చేస్తున్నాడు. వీటిని తన గూగుల్ డ్రైవ్‌తో పాటు మొబైల్ ఫోన్లో స్టోర్ చేసుకున్నాడు. సైబర్ టిప్ లైన్ ద్వారా మూడు ఆన్లైన్ బ్రౌసింగ్లను సీఎస్బీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్ సీఎస్బీ యూనిట్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించారు. జూనియర్ అసిస్టెంట్‌ను అరెస్ట్ చేశారు. చిన్నారుల అశ్లీల చిత్రాలు చూస్తున్న ఇరిగేషన్ శాఖ జూనియర్ అసిస్టెంట్ సహా 24 మందిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) గురువారం అరెస్ట్ చేసింది. చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్న వారిపై ఆన్లైన్లో నిఘా పెట్టిన టీజీ సీఎస్బీ అధికారులు ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్‌లను తనిఖీ చేశారు. 18 ప్రత్యేక బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చిన్నారుల అశ్లీల చిత్రాలు, పోర్న్ వీడియోలు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వారిని, షేర్ చేయడంతో పాటు డౌన్లోడ్ చేసి స్టోర్ చేసుకున్నవారిని గుర్తించేందుకు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేంద్రంగా గత ఫిబ్రవరిలో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (సీపీయూ) ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సీఎస్ఈఏఎం (చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్)ను పదేపదే చూస్తున్నట్టు గుర్తించిన 24 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరిలో హైదరాబాద్‌లో 15 మందిని, వరంగల్‌లో ముగ్గురు, నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు సహా మొత్తం 24 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరంతా చైల్డ్ పోర్న్ చూడటంతో పాటు గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేసుకున్నట్టు గుర్తించినట్టు వెల్లడించారు. చిన్నారులకు సంబంధించిన పోర్న్ లేదా అశ్లీల చిత్రాల కోసం బ్రౌస్ చేసిన వారిని అరెస్ట్ చేసి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. సీఎస్బీ అధికారులను డీజీపీ శివధర్‌రెడ్డి అభినందించారు. -
ధర్మరాజు లేకుండానే.. అలుపెరుగని ప్రయాణం
మహాభారతంలో ధర్మరాజుతో కడదాకా నడుస్తుంది ఓ శునకం. ఆ మధ్య వచ్చిన పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్‌లో హతోడి త్యాగి అనే సుపారీ కిల్లర్ పాత్రకు వీధికుక్కలతో ముడిపెట్టిన సీక్వెన్స్ ప్రేక్షకుల్ని ఒకింత భావోద్వేగానికి గురి చేసింది. అయితే విశ్వాసం, కరుణ మాత్రమే కాదు.. శాంతి కోసమూ నాలుగు కాళ్ల అలోకా అలుపెరగని ప్రయాణంతో అందరి దృష్టికి ఆకర్షిస్తోంది. ఇంటర్నెట్లో రీల్స్ చూసేవాళ్లకు అలోక అనే పేరు తెలియక పోవచ్చు. కానీ స్క్రోలింగ్ చేసే సమయంలో ఎక్కడో ఒక దగ్గర కచ్చితంగా తారసపడుతుంది. అమెరికాలో పర్యటిస్తున్న బౌద్ధభిక్షువులతో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోందీ అలోక. దీనికి దక్కిన ఫేమ్‌తో ఏకంగా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌నే ఓపెన్ చేశారు. ఒకటి రెండు బిస్కెట్లు వేస్తేనే కృతజ్ఞతలు చూపించే కుక్క మాదిరే.. తనను కాపాడిన వాళ్లను వీడేదే లేదంటూ వెంట తిరుగుతోంది. స్వర్గాన్ని కాదని.. మహాప్రస్థాన ఘట్టంలో ధర్మారాజు భార్యాసహోదరులు స్వర్గానికి వెళ్తారు. అయితే తనతో వచ్చిన కుక్కను విడిచిపెట్టడానికి నిరాకరించడం వల్ల స్వర్గానికి వెళ్ళలేక కొద్దిసేపు నరకంలో గడపాల్సి వస్తుంది. తనతో పాటు ఉన్న జీవిని విడిచిపెట్టలేనని చెబుతాడాయన. అయితే.. ఆ కుక్క రూపంలో ఉన్నది ధర్మదేవతే అని తెలుసుకున్నాక చివరికి స్వర్గానికి చేరుకున్నాడు. ఈ కథ.. ధర్మరాజు యొక్క నిస్వార్థత, సత్యనిష్ఠ, విశ్వాసపాత్రత, అన్ని జీవుల పట్ల కరుణను తెలియజేస్తుంది. పాతాళ్ లోక్‌లో.. 2020 కరోనా టైంలో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన వెబ్ సిరీస్ పాతాళ్ లోక్. అందులో హతోడి త్యాగి అనే సుపారీ కిల్లర్ పాత్ర ఉంటుంది. సుత్తిని ఉపయోగించి భయంకరంగా చంపే పాత్రలో అభిషేక్ బెనర్జీ ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. క్రూరమైన పాత్ర అయినప్పటికీ కుక్కల పట్ల జాలి చూపించే వ్యక్తిగా అతనిలోని మానవీయ కోణాన్ని చూపించారు ఇందులో. ఆ కోణమే కథలో ఓ కీలక మలుపునకు కూడా కారణమవుతుంది. అలా ప్రేక్షకులు హతోడి త్యాగిని మరింత గుర్తుంచుకున్నారు. భూమ్మీద అలోకా.. కొందరు బౌద్ధ భిక్షువులు తమ శాంతి సందేశాన్ని వినిపించేందుకు భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ఓ కుక్క వారి కంటపడింది. కారు ఢీకొనడంతో గాయాలపాలైన ఆ కుక్కను వారు కాపాడారు. దానికి అలోక అని పేరు పెట్టి(పాలి భాషలో వెలుగు అని అర్థం) బాగోగులు చూసుకున్నారు. తనను కాపాడినందుకు వారి పట్ల ఎనలేని కృతజ్ఞత పెంచుకున్న ఆ శునకం నాటి నుంచీ వారి వెంటే సంచరిస్తోంది. ఇక అలోకా కథ తెలుసుకుని అమెరికాలో అనేక మంది ఆశ్చర్యపోయారు. శునకానికి కావాల్సిన వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు అనే డైలాగ్ ఉంది కదా.. అలా ఐక్యత, సహృద్భావం, శాంతిసామరస్యాలు వంటివి ప్రోత్సహించేందుకు బౌద్ధబిక్షువులతో పాటు ఈ పర్యటనలో అలోకా కూడా భాగమైందన్నమాట. -
టేబుల్‌పై నోట్ల కట్టలు.. టీఎంసీ నేత..!
కోల్‌కతా: ఓ టేబుల్‌పై నోట్ల కట్టల గుట్ట..ఆ వెనుక టీఎంసీ నేత ఒకరు కూర్చున్న వీడియో ఒకటి పశ్చిమబెంగాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర 24 పరగణాల జిల్లా బరాసత్–1 పంచాయతీ సమితి ఉపాధ్యక్షుడు మహ్మద్ గియాసుద్దీన్ మండల్, స్థానిక వ్యాపారి రకీబుల్ ఇస్లాంతోపాటు కూర్చుని ఉండగా వారికి ఎదురుగా ఉన్న టేబుల్‌పై పెద్ద మొత్తంలో డబ్బు కట్టలు కనిపిస్తున్నాయి. ఫోన్లో అవతలి వ్యక్తి.. ‘కొనేది క్యాష్లోనా, ఫైనాన్స్లోనా అని అడుగుతుండగా, అప్పుడే మరోవ్యక్తి నోట్ల కట్టలు నింపి ఉన్న నైలాన్ బ్యాగ్‌తో ఆ గదిలోకి ప్రవేశించడం కనిపిస్తోంది. మరికొద్ది నెలల్లోనే రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా వెలుగు చూసిన ఈ వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. టీఎంసీ అక్రమ లావాదేవీలకు ఇదే నిదర్శనమంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే, ఇది 2022 నాటి పాత వీడియో అని మండల్ కొట్టిపారేస్తున్నారు. అది ఓ భూమి లావాదేవీకి సంబంధించిన అంశమని, తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. వీడియో కనిపిస్తున్న నగదు రెండేళ్ల క్రితం జరిగిన భూ లావాదేవీకి సంబంధించిందని రకీబుల్ ఇస్లాం కూడా తెలిపారు. ఇందులో ఎలాంటి తప్పిదం లేదని చెప్పారు. ఆ భూమి వ్యవహారంలో మండల్ భాగస్వామిగా ఉన్నారని, వీడియోలో కనిపించేది తన ఆఫీసు కూడా కాదని రకీబుల్ అన్నారు. ఈ అంశంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని బరాసత్–1 పంచాయతీ టీఎంసీ కన్వీనర్ మహ్మద్ ఇషా సర్కార్ చెప్పారు. వీడియోలో పెద్ద ఎత్తున కనిపిస్తున్న నగదుపై అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పారు. అది అసలైన వీడియోనా కాదా అనేది తేలుస్తామన్నారు. వీడియోపై బీజేపీ నేత తపస్ మిత్రా మాట్లాడుతూ.. స్థానిక భూ మాఫియా వెనుక మహ్మద్ గియాసుద్దీన్ మండల్ హస్తముందని ఆరోపించారు. ఈ వీడియోను చూస్తే అధికార టీఎంసీ అసలు స్వరూపం తేటతెల్లమవుతుందని విమర్శించారు. -
పుతిన్ ఇంటికే గురిపెట్టారుగా!
ఉక్రెయిన్ సంక్షోభం ఈ ఫిబ్రవరితో నాలుగేళ్లు పూర్తి కానుంది. ఒకవైపు యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నా.. మరోవైపు ఇరుదేశాల కవ్వింపు చర్యలు మాత్రం ఆగడం లేదు. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపైనే డ్రోన్ దాడి జరగడం కలకలం రేపగా.. అమెరికా సహా పలు దేశాల అనుమానాల నేపథ్యంలో ఆ దాడులకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరిగిందనే.. ఇది ఉక్రెయిన్ సైన్యం పనేనని రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. ఆ దాడి తమ పని కాదని.. ఇది రష్యా ఆడుతున్న నాటకమని.. అసలు అలాంటి దాడేం జరగలేదని.. శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకే ఇలాంటి ఆరోపణలకు దిగింది అని ఉక్రెయిన్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. రష్యా అధినేత నివాసంపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అదే సమయంలో అలాంటి దాడి జరగకపోయి ఉండొచ్చంటూ అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. అనూహ్యంగా.. మాస్కోతో పాటు క్రిమియాలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగాయంటూ రష్యా కొన్ని వీడియోలను రిలీజ్ చేసింది. అందులో.. క్రెమ్లిన్(రష్యా అధ్యక్ష కార్యాలయం) సమీపంలో నిర్వీర్యం చేసిన ఓ డ్రోన్‌కు ఆరు కేజీల పేలుడు పదార్థాలు అమర్చి ఉన్నాయి. దీంతో 24 గంటల్లో దాడికి సంబంధించిన ఆధారాలు చూపించాలన్న ఉక్రెయిన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చినట్లైంది. Downed UAV with a 6kg explosive charge — Russian MOD publishes VIDEO PROOF of Ukrainian attack on Putin’s residenceThe attempt was carried out on the night of December 28 to 29WATCH report by the unit who took down 41 of the 91 drones sent by Kiev https://t.co/J9Tgd8yAJx pic.twitter.com/b7Yv55OlxP— RT (@RT_com) December 31, 2025ఈ వీడియోలు వెలుగులోకి రాకముందే.. పుతిన్ ఇంటిపై జరిగిన డ్రోన్ దాడుల్ని పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ‘‘శాంతి స్థాపనకు కొనసాగుతున్న ప్రయత్నాలకు భంగం కలిగించవద్దు’’ అంటూ రష్యా-ఉక్రెయిన్లను కోరారు. ఒక్క ఫ్రాన్స్ మాత్రం సరైన ఆధారాల్లేకుండా ఉక్రెయిన్ను నిందించడానికి వీల్లేదంటూ మద్దతు ప్రకటించింది. అయితే.. తాజా దాడుల వీడియోలపై కీవ్ వర్గాలు, జెలెన్స్కీ.. అసలు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సుమారు 91 డ్రోన్లు.. నోవ్గోరోడ్ రీజియన్‌లోని పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చాయని.. అయితే మాస్కో-సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వాటిని తమ సైన్యం నేల్చకూల్చిందని రష్యా విదేశాంగ మంతరి సెర్గె లావ్రోవ్ ప్రకటించారు. అయితే.. ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ పనేనని ఆరోపిస్తున్నారాయన. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌పై దాడులను రష్యా ఆపడం లేదు. తాజాగా దక్షిణ ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంపై తాజాగా డ్రోన్లతో మాస్కో విరుచుకుపడింది. ఈ దాడిలో అనేక అపార్ట్మెంట్లు, విద్యుత్ గ్రిడ్లు ధ్వంసమయ్యాయి. ఓ శిశువు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు. శాంతి చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయని భావించేలోపే.. రష్యా ఉక్రెయిన్‌పై దీర్ఘశ్రేణి దాడుల్ని తీవ్రం చేయడం గమనార్హం. -
ఉస్మాన్ హాదీ హత్యపై నిందితుడి సంచలన వీడియో
బంగ్లాదేశ్‌లో తీవ్ర సంక్షోభం సృష్టించిన రాడికల్ నేత ఉస్మాన్ హాదీ హత్య విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మసూద్ ఈ అంశంపై కీలక సమాచారం తెలుపుతూ వీడియో విడుదల చేశాడు. ఉస్మాన్ హాదీ మృతితో తనకు ఏటువంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ నిందితుడు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మసూద్ భారత్‌లో తలదాచుకున్నట్లు బంగ్లా ఆరోపించింది. రాడికల్ విద్యార్థి లీడర్ ఉస్మాన్ హాది హత్యతో బంగ్లాదేశ్‌లో ఏ స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉస్మాన్ మృతితో ఆ దేశంలో విద్వేశజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. హిందువులే టార్గెట్‌గా దాడులు జరిగాయి. ఇవి చాలవన్నట్లు ఇటీవలే అక్కడి మీడియా కథనాలు ఉస్మాన్ హాదీ హంతకులు భారత్‌లో తలదాచుకున్నారని తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మసూద్ దుబాయ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ఈ వివరాల్ని సీఎన్ఎన్ మీడియా సంస్థ ప్రచురించింది.ఫైసల్ కరీం మసూద్ మాట్లాడుతూ" నేను ఉస్మాన్ హాదీని చంపలేదు. బంగ్లాదేశ్‌లో నేను నాకుటుంబం రాజకీయంగా తీవ్రంగా హింసించబడుతున్నాం. ఆ హింస నుంచి తప్పించుకోవడానికి నేను దుబాయ్‌కి వచ్చాను. ఉస్మాన్ హాదీతో నాకుంది కేవలం వ్యాపార సంబంధమే, నా ఐటీ సంస్థ ప్రయోజనం కోసం ఉస్మాన్ని కలిశాను. అతనికి రాజకీయ విరాళాలు కూడా ఇచ్చాను " అని మసూద్ వీడియోలో తెలిపారు.ఈ హత్య ఖచ్చితంగా జమాతే-ఈ- ఇస్లామి సృష్టేనని దీని వెనుక ఆ కార్యకర్తలు ఉండవచ్చని మసూద్ అనుమానం వ్యక్తం చేశారు. తాను భారత్‌లో తలదాచుకున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యాలని అన్నారు. జమాతి-ఈ- ఇస్లామి అనిదే బంగ్లాదేశ్‌లోని ఓ రాజకీయ పార్టీ ఇది ఇస్లామిక్ భావజాలలను ప్రోత్సహిస్తోంది.అయితే రెండురోజుల క్రితం ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధమున్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మసూద్, షేక్ ఆలంగీర్ అనే ఇద్దరు నేరస్థులు బంగ్లాదేశ్ జిల్లాలోని మైమాన్సింగ్ జిల్లా సరిహాద్దు గుండా మేఘాలయలో ప్రవేశించారని బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపించింది. అయితే ఈ ఆరోపణల్ని అప్పుడే మేఘాలయ పోలీసులు ఖండించారు. -
‘వందే భారత్ స్లీపర్’ స్పీడ్ టెస్ట్.. 180లోనూ తొణకని నీరు!
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి ఆవిష్కృతమయ్యింది. రైల్వే రంగంలో సరికొత్త విప్లవం ఉద్భవించింది. ఎంతో కాలంగా దేశంలోని ప్రయాణికులంతా ఎదురుచూస్తున్న ‘వందే భారత్ స్లీపర్’ ఎక్స్‌ప్రెస్ రైలు వందశాతం మేరకు తన సత్తా చాటింది. రాజస్థాన్‌లోని కోటా - నాగ్డా సెక్షన్ మధ్య నిర్వహించిన హై-స్పీడ్ ట్రయల్ రన్ సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పట్టాలపై పరుగులు తీసింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ అద్భుతమైన ఘట్టానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. భారతీయ సాంకేతిక పరిజ్ఞానం ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకుందో ఆ వీడియోలో వివరించారు.స్థిరత్వానికి పరీక్ష.. ‘వాటర్ టెస్ట్’ఈ నూతన ‘వందే భారత్ స్లీపర్’ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ కేవలం వేగానికి మాత్రమే పరిమితం కాలేదు. రైలు ప్రయాణంలో ఉండే స్థిరత్వాన్ని (Stability) కూడా పరీక్షించారు. 180 కిలోమీటర్ల వేగంతో రైలు దూసుకెళ్తున్న సమయంలో అదే రైలు లో ఉంచిన నీటి గ్లాసులు ఏమాత్రం కదలకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. మంత్రి షేర్ చేసిన వీడియోలో, స్పీడోమీటర్ 180 కి.మీ వేగాన్ని చూపిస్తున్నా, టేబుల్ పై ఉన్న నీటి గ్లాసుల నుండి ఒక్క చుక్క నీరు కూడా కిందకు పడలేదు. ఇది రైలులోని అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ, వైబ్రేషన్ నియంత్రణకు నిదర్శనంగా నిలిచింది. Vande Bharat Sleeper tested today by Commissioner Railway Safety. It ran at 180 kmph between Kota Nagda section. And our own water test demonstrated the technological features of this new generation train. pic.twitter.com/w0tE0Jcp2h— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 30, 2025సుదీర్ఘ ప్రయాణాల్లో సరికొత్త అనుభూతి ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లు కేవలం కూర్చునే సదుపాయం (Chair Car) మాత్రమే కలిగి ఉన్నాయి.అయితే కొత్తగా రాబోతున్నఈ స్లీపర్ వెర్షన్ వందే భారత్.. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు వరంగా మారనుంది. రాత్రిపూట ప్రయాణించే ఈ రైలు ప్రయాణికులకు విమాన స్థాయి సౌకర్యాలను ఈ రైలు అందించనుంది. రైలులో మెరుగైన కుషన్ సీట్లు, అధునాతన ఏసీ వ్యవస్థ, శబ్దం తక్కువగా ఉండేలా రూపొందించిన కోచ్‌లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయనున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.‘కవచ్’ రక్షణతో సురక్షిత ప్రయాణం ఈ రైలు విషయంలో వేగంతో పాటు భద్రతకు కూడా రైల్వే శాఖ పెద్దపీట వేసింది. ఈ స్లీపర్ రైలులో స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ‘కవచ్’ (Kavach) యాంటీ కొలిజన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ప్రమాదాలను నివారించడంలో కీలకంగా మారనుంది. దీనికితోడు అగ్నిప్రమాదాలను గుర్తించే సెన్సార్లు, ఆటోమేటిక్ డోర్లు, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడేందుకు టాక్-బ్యాక్ సదుపాయం లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. త్వరలోనే ఈ రైళ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని, ఇది భారత రైల్వే రూపురేఖలను మార్చనున్నదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: చొరబాట్లకు మమత మద్దతు: అమిత్ షా -
మోదీ ప్రభుత్వమే నన్ను కాపాడాలి
మోర్బి: రష్యా తరఫున యుద్ధంలో పాల్గొని ఉక్రెయిన్ బలగాలకు చిక్కిన గుజరాత్ వాసి తనను కాపాడాలంటూ భారత పభ్రుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఈ మేరకు అతడు తన కుటుంబసభ్యులకు ఒక వీడియో పంపించాడు. గుజరాత్‌లోని మోర్బి పట్టణానికి చెందిన సాహిల్ మహ్మద్ హుస్సేన్ మజోతి(22) రష్యాలో చదువుకునేందుకు వెళ్లాడు. అక్కడ అతడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుని, జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత రష్యా సైన్యంలో చేరి, ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లాడు. అక్కడ ఉక్రెయిన్ సేనలకు లొంగిపోయాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నిర్బంధంలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం మోర్బిలో ఉంటున్న తన తల్లి హసీనా బెన్ సెల్‌ఫోన్‌కు ఒక వీడియో పంపాడు. అందులో తను పడుతున్న కష్టాలను వివరించాడు. తనే తప్పూ చేయకున్నా రష్యా అధికారులు తనను అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో ఇరికించారని వాపోయాడు. జైలు పాలు చేసి, ఆపై మాయమాటలు చెప్పి, సైన్యంలో చేరేలా కాంటాక్ట్రు ఒప్పందంపై సంతకం చేయించారని చెప్పాడు. యుద్ధానికి వెళ్లి ఉక్రెయిన్ బలగాలకు లొంగిపోయినట్లు ఆ వీడియోలో వివరించాడు. చదువుకునేందుకు రష్యా వచ్చే భారతీయ యువకులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. తనను ఈ చెర నుంచి విడిపించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. కుటుంబంతో తిరిగి కలుసుకునే అవకాశం కల్పించాలని వేడుకున్నాడు. తన కుమారుడి నిర్బంధంపై స్థానిక రాజ్యసభ ఎంపీ కేసరీదేవసిన్హ్ ఝలాకు తెలిపామని హసీనాబెన్ తెలిపారు. మోదీ ప్రభుత్వం తన కుమారుడిని సురక్షితంగా వెనక్కి తీసుకువస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సాహిల్ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌తో మాట్లాడినట్లు ఎంపీ చెప్పారు. దేశాల మధ్య వ్యవహారం అయినందున కొంత సమయం పడుతుందని అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి సాధించామని చెప్పారు. -
రష్యా సైన్యంలో భారత విద్యార్థి బందీ.. డ్రగ్స్ కేసుతో బ్లాక్మెయిల్
మాస్కో: చదువుకునేందుకు రష్యాకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు అక్కడ నరకం కనిపిస్తోంది. గుజరాత్‌లోని మోర్బికి చెందిన సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ అనే విద్యార్థి తనకు రష్యాలో ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తనపై తప్పుడు డ్రగ్స్ కేసు మోపి, సైన్యంలో చేరకపోతే జైలుకు పంపుతామని అక్కడి పోలీసులు బ్లాక్మెయిల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.సాహిల్ మొహమ్మద్ హుస్సేన్‌కు కేవలం 15 రోజుల శిక్షణ ఇచ్చి, నేరుగా ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి తరలించడంతో మరో గత్యంతరం లేక, ప్రాణభయంతో అతను ఉక్రెయిన్ సైన్యానికి లొంగిపోయాడు. ప్రస్తుతం అక్కడ బందీగా ఉన్న సాహిల్, ఒక వీడియో సందేశం పంపి ‘నన్ను కాపాడండి మోదీ’ అంటూ కన్నీరుమున్నీరవుతున్నాడు. కాగా ఈ ఘటనతో డ్రగ్స్ మాఫియా, రష్యన్ సైన్యం మధ్య జరుగుతున్న దారుణాలు బయటపడుతున్నాయి.'झूठे ड्रग्स केस में फंसा कर रूसी सेना में शामिल कराया'गुजरात के एक युवक का वीडियो इन दिनों सोशल मीडिया पर जमकर वायरल हो रहा है. ये वीडियो रूस-यूक्रेन युद्ध के बीच वायरल हुआ है. इस वीडियो में ये शख्स लोगों से अपील कर रहा है कि वो किसी भी परिस्थिति में रूसी सेना में ना शामिल… pic.twitter.com/yDVW2Ef1ZR— NDTV India (@ndtvindia) December 21, 2025ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భారతీయ యువకులను టార్గెట్ చేస్తూ, స్కామర్లు వారిపై తప్పుడు కేసులు మోపుతున్నారని, కనీసం 700 మంది భారతీయులను ఇలాగే జైలు పాలు చేసి, సైన్యంలో చేరితేనే విడుదల చేస్తామని వేధిస్తున్నారని సాహిల్ ఆ వీడియోలో వెల్లడించాడు. ఆలివ్ గ్రీన్ జాకెట్ ధరించి ఉక్రెయిన్ కస్టడీలో ఉన్న ఈ విద్యార్థి వీడియో చూస్తుంటే అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఈ హృదయ విదారక ఘటనపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మాట్లాడుతూ రష్యన్ సైన్యంలో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రధాని మోదీ స్వయంగా పుతిన్‌తో చర్చలు జరిపారని తెలిపారు. ఇప్పటికే చాలా మందిని రక్షించామని, మిగిలిన వారిని కూడా స్వదేశానికి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. సాహిల్ తల్లి కూడా తన కొడుకు కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని ఎదురుచూస్తున్నారు.కాగా విదేశాలకు వెళ్లే యువతకు సాహిల్ ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు వైరల్ అవుతోంది. "రష్యాలో ఉద్యోగాల పేరుతో లేదా చదువు పేరుతో వస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ స్కామర్లు మిమ్మల్ని డ్రగ్స్ కేసుల్లో ఇరికించి, యుద్ధంలోకి నెట్టేస్తారు" అని అతను హెచ్చరించాడు. రష్యన్ సాయుధ దళాల్లో చేరమని వచ్చే ఎటువంటి ఆఫర్లను నమ్మవద్దని ప్రభుత్వం కూడా మరోసారి స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: అందుకే.. పట్టాలపై గజరాజుల మృత్యుఘోష! -
ఆ వీడియో చూసి.. మానవత్వం అంటే ఏమిటో చెప్పండి..!
న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) వీధి కుక్కలపట్ల అమానవీయంగా వ్యవహరిస్తోందంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘తదుపరి విచారణ సమయంలో ఒక వీడియో చూపిస్తాము, అమానవీయం ఏమిటో అప్పుడే మీరు చెబుదురుగాని అంటూ వ్యాఖ్యానించింది. దేశ రాజధాని ఢిల్లీలో కుక్క కాట్లతో చిన్నారులు రేబిస్ బారినపడుతున్నారంటూ వచి్చన కథనంపై సుమోటోగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం..నవంబర్ 7వ తేదీన విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లలో వీధికుక్కలు, ఇతర జంతువులు కనిపించరాదని, వీధికుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయించాలని దేశవ్యాప్త ఆదేశాలివ్వడం తెల్సిందే. అయితే, ఢిల్లీలోని అధికారులు అదనంగా మరికొన్ని నిబంధనలను చేర్చి, వీధి కుక్కలపై దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ గురువారం వాదించారు. అయితే, దీనిపై ఇప్పుడేమీ తాము విచారణ చేపట్టబోమని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం స్పష్టం చేసింది. జనవరి 7వ తేదీన జరిగే విచారణ సందర్భంగా తామొక వీడియో చూపిస్తామని, దాన్ని చూశాక మానవత్వం గురించి మాట్లాడుతామంటూ వ్యాఖ్యానించింది. కుక్కల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న వైఖరిపై తామూ ఒక వీడియో చూపుతామని కపిల్ సిబాల్ తెలిపారు. -
స్వామీజీ మసాజ్ వీడియో వైరల్
సాక్షి,బళ్లారి: అదో ప్రముఖ ఆధ్యాత్మికత క్షేత్రం. ఎంతో మంది భక్తులు ఆరాధించే మఠం కూడా. అయితే అక్కడ ఓ స్వామీజీ నగ్నంగా ఓ అమ్మాయితో మసాజ్ చేయించుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ధారవాడ జిల్లా కవలగేరి మఠానికి చెందిన శివానంద మఠ సరస్వతి స్వామీజీ కామ పురాణం వీడియో బయటకు వచ్చింది. ఇంత వరకు స్వామీజీ సన్యాసి అని జనం ఎంతో భక్తితో పూజించేవారు. అయితే ఆయన ఓ మహిళతో నగ్నంగా ఉంటూ మసాజ్ చేయించుకున్నారు. మసాజ్ చేయించుకున్న వీడియోను ఐదు మంది తమ దగ్గర ఉంచుకుని స్వామీజీని డబ్బు డిమాండ్ చేశారు. రూ.20 లక్షలు ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు. స్వామీజీ వారితో చర్చలు జరిపి రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకుని, చెప్పిన ప్రకారం రూ.7 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అనంతరం వీడియోను డిలీట్ చేయాలని విన్నవించారు. మిగిలిన రూ.3 లక్షలు ఇవ్వలేదని, ఐదు మందిలో ఒకరు వీడియోను బయటకు వదలడంలో స్వామీజీ మసాజ్ వీడియో వైరల్ అయింది. సన్యాసిగా ఫోజులు ఇచ్చిన స్వామీజీ కామ పురాణం వీడియో బయట పడటంతో ఒక్కసారిగా మఠం పరిసరాల్లో జనం చేరి స్వామీజీ తీరుపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాగా తనను బ్లాక్ మెయిల్ చేసి, వీడియోను వైరల్ చేసిన వారిపై స్వామి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రజినీకాంత్ బర్త్ డే.. ప్రముఖ నిర్మాణ సంస్థ స్పెషల్ వీడియో!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూలీ మూవీతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం రజినీ జైలర్-2 మూవీలో నటిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో బ్లాక్ బస్టర్ మూవీ నరసింహాను రీ రిలీజ్ చేస్తున్నారు. తలైవాకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.తాజాగా రజినీకి ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ బర్త్ డే విషెస్ చెబుతూ వీడియోను రిలీజ్ చేసింది. రజనీ సినిమాల్లోని డైలాగులతో మ్యాష్అప్ వీడియోను రూపొందించి పుట్టినరోజు శుభాకంక్షలు తెలిపింది. ఒక రేంజ్ తర్వాత మాటలు ఉండవు.. అర్థమైందా రాజా.. డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.సూపర్‌హిట్ సినిమాకు సీక్వెల్..రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన నరసింహ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 1999లో విడుదలైన ఈ సినిమా తలైవా కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీ రిలీజై ఇప్పటికి 26 ఏళ్లు అవుతున్నా సోషల్ మీడియా రీల్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మరోసారి రమ్యకృష్ణ, రజినీకాంత్ అభిమానులను అలరించనుంది. వీరిద్దరు ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తున్నారు.కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని రజినీకాంత్ ఇటీవలే ప్రకటించారు. ఈ మూవీకి నీలాంబరి అనే టైటిల్ అని ఖరారు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ కథపై చర్చలు జరుగుతున్నట్లు నరసింహ రీ రిలీజ్ ప్రచారంలో భాగంగా రజినీకాంత్ తెలిపారు. -
చైతూ- శోభిత పెళ్లి వీడియో.. లవ్లీ మూమెంట్స్ షేర్ చేసిన శోభిత! (ఫొటోలు)
-
కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై.. ఆటోతో కొత్త జీవితం
కర్ణాటక: కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి పని ఒత్తిడి తట్టుకోలేక ఆటోను నడుపుతున్నట్లు యువకుడి వీడియో బెంగళూరు వాసులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. రాకేశ్ బెంగళూరులో ఒక కార్పొరేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన పీఎఫ్ డబ్బులతో ఆటోను కొనుగోలు చేశారు. కొత్త జీవితంలో రోజు ఇబ్బంది లేకుండా ఆటోను నడిపి తన జీవిత నిర్వహణకు డబ్బులు సంపాదిస్తున్నట్లు వీడియోలో తెలిపారు. పని వదలాలని ఉన్న వారికి కొన్ని సలహాలివ్వాలని ఉన్నట్లు రాకేశ్ చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్ కార్పొరేట్ సంస్థలో గులామ్ పని చేయటానికి లేడంటూ శీర్షికను ఆటో వెనుక రాశారు. జీవితంలో డబ్బుల కంటే అనేక విషయాలు చాలా ముఖ్యమన్నారు. ఈ వీడియోను చాలా మంది చూసి అనేక మంది మంచిగా సందేశాలు పెడుతున్నారు. ‘మీ ఎంపిక తృప్తిగా ఉంటే చాలు, మంచి జరగాలి’ అని కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Rakesh Auto Driver (@rak.shot) -
కాంతార చాప్టర్-1.. రిషబ్ శెట్టి గూస్బంప్స్ వీడియో చూశారా?
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్-1. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో విక్కీ కౌశల్ ఛావాను దాటేసింది. దీంతో 2025లో అత్యధి వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి అద్భుతమైన వీడియోను పోస్ట్ చేసింది ఓటీటీ సంస్థ. ఈ మూవీలో రిషబ్ శెట్టి గులిగా మారే సీన్‌కు సంబంధించిన వీడియోను పంచుకుంది. రిషబ్ శెట్టి ఐకానిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఈ సీన్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించేలా మాత్రమే కాదు.. ఒళ్లు గగుర్పొడ్చేలా ఉంటుంది. ఈ సీన్లో గుల్షన్ దేవయ్య నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. -
‘ఫిజిక్స్‌వాలా’పై ఎఫ్ఐఆర్.. కారణం ఇదే..
న్యూఢిల్లీ: ఎడ్టెక్ కంపెనీ ‘ఫిజిక్స్‌వాలా’ చిక్కుల్లో పడింది. ఈ కంపెనీ రూపొందించిన ఒక ప్రకటన.. కశ్మీర్‌లోని పర్యావరణాన్న దెబ్బతీసేవిధంగా ఉందనే ఆరోపణలు వచ్చాయి. బారాముల్లాలోని గుల్మార్గ్ సమీపంలోని బాదర్కోట్ అడవుల గుండా ‘‘ఫిజిక్స్‌వాలా’ అధ్యాపకులు స్కార్పియో వాహనాల్లో వెళుతున్నట్లు చూపిన ఈ ప్రకటన పోలీసు దర్యాప్తుకు దారితీసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుల్మార్గ్ ఇఫ్తిఖర్ అహ్మద్ ఖాద్రీ ఫిర్యాదు మేరకు టాంగ్మార్గ్ పోలీస్ స్టేషన్లో ‘ఫిజిక్స్‌వాలా’పై ఎఫ్ఐఆర్ దాఖలైంది.రిజిస్ట్రేషన్ ప్లేట్లు లేని ఆరు నల్ల స్కార్పియో వాహనాల్లో ‘ఫిజిక్స్‌వాలా’ అధ్యాపకులు అక్రమంగా అడవిలోకి ప్రవేశిస్తున్నట్లు చూపించే ఈ యూట్యూబ్ వీడియోపై ఫిర్యాదు నమోదయ్యింది. 9 నుండి 12 తరగతుల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఫిజిక్స్‌వాలా ఈ ఫుటేజ్ ఉపయోగించింది. ఈ చర్య భారత అటవీ చట్టం 1927, అటవీ సంరక్షణ చట్టం 1980కు విఘాతం కలిగించేలా ఉంది. ‘ఫిజిక్స్‌వాలా’ పై అటవీ అధికారి చేసిన ఫిర్యాదులో ఆ వాహనాలను పచ్చని పచ్చిక బయళ్లపై నడిపి, మూలికలు, వృక్షజాలానికి నష్టం కలిగించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద.. ‘ఫిజిక్స్‌వాలా’ ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందంటూ కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం పర్యావరణ వ్యవస్థను దెబ్బతీసినందుకు పలువురు యూట్యూబర్లపై కేసు నమోదయ్యింది. వారు పచ్చిక బయళ్ల గుండా డ్రైవింగ్ చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దీంతో డిప్యూటీ కమిషనర్ బిలాల్ మోహిదిన వారిపై ఎఫ్ఐఆర్కు ఆదేశించారు. ఈ కేసులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
‘మా వాళ్లు దేశద్రోహులు’: మావోయిస్టుల సంచలన వీడియో
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు మావోయిస్టులు సంచలన వీడియో విడుదల చేశారు. దానిలో లొంగిపోయిన తమ సహచరులను నిందించారు. పార్టీని, ప్రజలను మోసం చేయడం ద్వారా మావోయిస్టుల అంతానికి కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు.ఛత్తీస్‌గఢ్‌లోని భైరామ్‌గఢ్ ఏరియాకు చెందిన ఇద్దరు క్రియాశీల నక్సలైట్లు అక్టోబర్ 26న పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. నాటి నుండి నక్సలైట్ సంస్థలలో గందరగోళం నెలకొంది. ఇదే నేపధ్యంలో పలువురు మావోయిస్టులు లొంగిపోయిన తమ సహచరులకు వ్యతిరేకంగా గోండి మాండలికంలో ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో లొంగిపోయిన నక్సలైట్లను దేశద్రోహులుగా అభివర్ణించారు. పార్టీని, ప్రజలను మోసం చేసి, ఇప్పుడు తమపై ఎదురుతిరిగి, తమ జనతా ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. बीजापुर। नक्सलियों ने सरेंडर करने वाले नक्सल नेताओं के खिलाफ वीडियो जारी कर उन्हें गद्दार बताया है। कहा- पार्टी और जनता को धोखा देकर हमें ख़त्म करने की साजिश रच रहे हैं। @DistrictBijapur #Chhattisgarh #Naxalites #naxalsurrender @vijaysharmacg pic.twitter.com/SgIgPQ4gEq— Haribhoomi (@Haribhoomi95271) November 4, 2025లొంగిపోయిన మావోయిస్టులు మిగిలిన మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని, తమ స్మారక చిహ్నాలను ధ్వంసం చేస్తున్నారని, సంస్థను రెండు వర్గాలుగా విభజిస్తూ, మావోయిస్టు భావజాలం ముగింపు గురించి మాట్లాడుతున్నారన్నారు. భైరామ్‌గఢ్ ప్రాంతంలో చురుకుగా ఉన్న నక్సలైట్ నేత కమలు పూనెం.. పోలీసుల నుంచి రూ. రెండు లక్షలు తీసుకుని లొంగిపోయాడని నక్సలైట్ల వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ ఒక ప్రెస్ నోట్లో తెలియజేసింది. పూనెం అక్టోబర్ 26న బీజాపూర్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇతను సోను,రూపేష్ బృందానికి చెందినవాడని నక్సలైట్ల పశ్చిమ బస్తర్ డివిజనల్ కమిటీ తెలిపింది.ఇది కూడా చదవండి: ‘ఇస్కాన్’పై ఉగ్ర ముద్ర.. ‘బంగ్లా’లో ఆందోళనలు -
‘కుంబ్’ వ్యర్థమా?.. మరి హాలోవిన్?’
న్యూ ఢిల్లీ/పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీరుపై బీజేపీ మండిపడింది. ఇటీవల లాలూ తన కుటుంబ సభ్యులతో కలిసి హాలోవీన్ (Halloween) పండుగను జరుపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన మహా కుంభ్ మేళాను నాడు అర్థరహితం అని అభివర్ణించిన లాలూ యాదవ్, ఇప్పుడు ఒక పాశ్చాత్య పండుగను ఆనందంగా జరుపుకోవడం ఏమిటని బీజేపీ నిలదీసింది.లాలూ యాదవ్ కుమార్తె, ఆర్జేడీ మహిళా నేత రోహిణి ఆచార్య యాదవ్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో హాలోవీన్ వేడుకల వీడియోలను పంచుకున్నారు. ‘అందరికీ హాలోవీన్ శుభాకాంక్షలు’ అని ఆమె ట్వీట్ చేశారు. ఆ వీడియోలలో లాలూ యాదవ్ తన మనవరాళ్లకు ఫోటోలు తీస్తూ కనిపించారు. ఈ వీడియో వైరల్ అయిన దరిమిలా.. లాలూ యాదవ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, బీజేపీ కిసాన్ మోర్చా (బీజేపీకేఎం) ఘాటుగా స్పందించింది. ‘బీహార్ ప్రజలారా.. మర్చిపోవద్దు. నమ్మకం, ఆధ్యాత్మికతను వ్యర్థం అన్న లాలూ యాదవ్ ఇప్పుడు ఆంగ్లేయుల పండుగ హాలోవీన్ జరుపుకుంటున్నారు. నమ్మకంపై దాడి చేసే వారికి బీహార్ ప్రజలు ఓటు వేయరు’ అని ‘ఎక్స్’లో పేర్కొంది. भूलना मत बिहार वासियों, यही लालू यादव है, जिसने आस्था और आध्यात्म के महाकुंभ को फालतू बताया था और अंग्रेजों का त्योहार Halloween मना रहा है।जो आस्था पर करेगा चोट, बिहार वासी नहीं करेंगे उसको वोट।#ShameOnLaluYadav#BiharElection2025 pic.twitter.com/u1kquCg1gg— BJP Kisan Morcha (@bjpkm4kisan) November 1, 2025ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లడంపై విలేకరులు ప్రశ్నించినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ‘కుంభ్‌కు అర్థం లేదు... అది అర్థరహితం’ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను అగౌరవపరిచేలా ఉన్నాయని బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ శర్మ అప్పట్లో విమర్శించారు.ఇది కూడా చదవండి: london: రైలులో కత్తిపోట్లు.. 9 మంది పరిస్థితి విషమం -
డిజిటల్ మ్యారేజ్!
కవాసేరి గ్రామపంచాయతీలో తమ వివాహాన్ని వీడియో కేవైసీ ద్వారా నమోదు చేసుకున్న నవ దంపతులు లావణ్య, విష్ణు వార్తల్లో నిలిచారు. కేరళలోని డిజిటల్ గవర్నెన్స్ పురోగతికి అద్దం పట్టే సంఘటన ఇది. సంప్రదాయానికి సాంకేతికత కూడా తోడైతే ఎలా ఉంటుందో చెప్పే సంఘటన.లావణ్య, విష్ణు తమ వివాహ రిజిస్ట్రేషన్‌ను ఆన్లైన్లో పూర్తి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కేరళ ప్రభుత్వం తమ కె–స్మార్ట్ ΄్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. ‘కె–స్మార్ట్’ అనేది ఇన్ఫర్మేషన్ కేరళ మిషన్(ఐకేఎం) అభివృద్ధి చేసిన ఇన్–హౌజ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఆధార్ ఆధారిత ఓటీపి, ఇమెయిల్ ద్వారా వివాహ గుర్తింపు ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.వివాహం కాగానే ఈ నవదంపతులు డిజిటల్లీ వెరిఫైడ్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సరికొత్త డిజిటల్ ప్రక్రియ దూరాన్ని తగ్గిస్తోంది. కాలాన్ని ఆదా చేస్తోంది. ఈ డిజిటల్ మ్యారేజ్ ట్రెండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకోవడం విశేషం. అత్యధిక సంఖ్యలో వీడియో కేవెసీ రిజిస్ట్రేషన్లతో త్రిస్సూర్ ముందంజలో ఉంది. ఆ తరువాత స్థానంలో మలప్పురం, తిరువనంతపురం ఉన్నాయి. -
నా లైఫ్‌లో ఇలా చేయాల్సి వస్తుందని ఊహించలేదు: రేణు దేశాయ్
హీరోయిన్ రేణు దేశాయ్ ఇటీవలే తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సమయంలో అందరూ పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరింది. దయచేసి రాత్రి 9 గంటల తర్వాత ఎక్కువ శబ్దం వచ్చే క్రాకర్స్‌ను పేల్చవద్దని కూడా ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే తాజాగా రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవల దీపావళి ఇంటర్వ్యూలో సన్యాసం తీసుకోవడంపై తాను చేసిన కామెంట్స్‌పై మాట్లాడింది. రేణు దేశాయ్ సన్యాసం తీసుకుంటారని వచ్చిన వార్తలపై ఆమె స్పందించింది. నా జీవితంలో ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని అనుకోలేదని తెలిపింది. నా లైఫ్‌లో నా పిల్లలే అన్నింటికంటే ముఖ్యమని తెలిపింది. వారి లైఫ్ సెటిల్ చేశాకే తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటానని రేణు దేశాయ్ తెలిపింది. అంతే కానీ ఇప్పటికిప్పుడు తాను సన్యాసం తీసుకుంటానని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది. దయచేసి ఇలాంటి వాటిపై కాకుండా.. మనదేశంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని మీడియావారిని కోరుతున్నట్లు వీడియో రిలీజ్ చేసింది.వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ..'ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఇటీవల దీపావళి ఇంటర్వ్యూలో యాంకర్ నెక్ట్స్ ఏంటి అని అడిగింది. దీనికి నేను సరదాగా సన్యాసం తీసుకుంటా అని చెప్పా. కానీ ఇప్పటికిప్పుడు తీసుకుంటానని ఎక్కడా చెప్పలేదు. ఇది చూసి పెద్ద సెన్సేషన్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నా ఫ్రెండ్స్, బంధువులు కాల్ చేసి ఈ విషయం గురించి అడుగుతున్నారు. అసలు రేణుకు ఏమైంది? బాగానే ఉందా? అని అడుగుతున్నారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఆద్య టెన్త్ క్లాస్‌లో ఉంది. వారి బాధ్యత నాపై ఉంది. ఇప్పుడైతే నేను సన్యాసం తీసుకోను. నా వయసు 55 నుంచి 60 వచ్చినప్పుడు ఆలోచిస్తా. నాకిప్పుడు దేవుడి కంటే నా పిల్లలే ముఖ్యం' అని క్లారిటీ ఇచ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ బాలికపై లైంగికదాడి
కొత్తపల్లి (కరీంనగర్): బాలికపై అత్యాచారం చేస్తూ.. సెల్ఫోన్లో చిత్రీకరించి ఆపై వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ఇద్దరు యువకులు ప్రేమపేరుతో నమ్మించారు. ఓ రోజు గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తేరుకున్న బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ యువకులు విశ్వతేజ (19), సన్నీ (21)లను అరెస్టు చేసి పోక్సో కింద కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
అన్ని చోట్లా నడిచినట్లు మునుగోడులో నడవనీయను: కోమటిరెడ్డి
నల్లగొండ జిల్లా: ఎక్సైజ్ పాలసీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో ఆయన మరోసారి ప్రభుత్వ ఎక్సైజ్ విధానాలను ఎత్తి చూపారు. ఎక్సైజ్ పాలసీని మార్చాల్సిందేనని.. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే బదులు.. మెరుగు పరిచేలా ప్రభుత్వం పనిచేయాలి. వైన్ షాపుల విషయంలో మునుగోడులో తన సూచనలు పాటించాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. పదవి ఉన్నా లేకున్నా ఒకటే.. అన్ని ప్రాంతాల్లో నడిచినట్లు మునుగోడులో నడవనీయనంటూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.మునుగోడులో ఎమ్మెల్యే నూతన నిబంధనలుమద్యం దుకాణాలకు ఈ నెలతో గడువు ముగియనుంది. దీంతో ప్రభుత్వం కొత్తగా టెండర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అందుకు ఈ నెల 18 వరకు గడువు ఉంది. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని మద్యం దుకాణాల టెండర్లు వేయాలనుకునే వ్యాపారులు తాను సూచిస్తున్న నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. ఈ విషయాన్ని టెండర్లు వేయకముందే చెబుతున్నానని పేర్కొంటున్నారు.అంతే కాకుండా నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలను నల్లగొండ ఎక్సైజ్ కార్యాలయానికి పంపి ఎమ్మెల్యే సూచనలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌కు పంపారు. కార్యాలయం బయట ఆ సూచనల పోస్టర్‌ను ఏర్పాటు చేయించారు. తాను చేస్తున్నది ఎవ్వరి మీదనో కోపంతో కాదని.. అలా అని తాను మద్యానికి పూర్తిగా వ్యతిరేకం కూడా కాదని అంటున్నారు. కొందరు యువకులు, నడి వయస్సు వాళ్లు కుటుంబ పోషణ మరచి ఉదయం నుంచే మద్యం తాగి అనారోగ్యం బారిన పడుతున్నారని.. అలాంటి వారిని కాపాడేందుకే తాను ఈ నిర్ణయాలు తీసుకున్నాని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నారు.ఎమ్మెల్యే చేస్తున్న సూచనలు ఇవీ..మద్యం దుకాణాలు గ్రామ శివారులో ఏర్పాటు చేయాలి.మద్యం దుకాణంలో సిట్టింగ్ ఏర్పాటు చేయకూడదుబెల్ట్షాపులకు మద్యం విక్రయించవద్దుమద్యం వ్యాపారులు సిండికేట్ కావొద్దురోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయించాలికొత్తగా టెండర్లు వేసేవారు ఈ షరతులు పాటిస్తామంటేనే టెండర్లు వేయాలని, లేదంటే టెండర్లు వేసి నష్టపోవద్దని తమ నాయకులతో సోషల్ మీడియాతో వైరల్ చేయడంతోపాటు గొడలపై పోస్టర్లు ఏర్పాటు చేయించారు. -
అవునా బొజ్జలా?
రాజకీయాల్లో కొందరు నేతలు నైతిక విలువలను వదిలేస్తున్నారు. పదవుల కోసం ఎత్తులు వదిలేసి జిత్తులకు దిగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకు సైతం దిగజారుతున్నారు. ఇదే కోవలో జనసేన మాజీ నేత కోట వినూతపై ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి పలు కుట్రలకు తెగబడినట్లు సోషల్ మీడియాలోకి వచ్చిన ఓ వీడియో వైరల్‌గా మారింది. వినూత డ్రైవర్‌గా పనిచేసి హత్యకు గురైన రాయుడు తీసుకున్నట్టుగా చెబుతున్న సెల్ఫీ వీడియో జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. కోట దంపతులను టార్గెట్ చేసుకుని బొజ్జల తనకు డబ్బులు ఎరవేసినట్లు డ్రైవర్ స్పష్టంగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అయితే నేతల నడుమ పోరులో చివరకు సదరు దళితుడు బలి కావడం విషాదంగా మిగిలింది. సాక్షి టాస్‌్కఫోర్స్ : జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కోట వినూత వద్ద డ్రైవర్‌గా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు మాట్లాడినట్టుగా వచ్చిన ఓ సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే బొజ్జల సుదీర్రెడ్డిపై పలు ఆరోపణలు వినిపించాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వినూత రహస్య సమాచారం, కొన్ని వీడియోలు సేకరించి అధిష్టానానికి చేరవేసి సు«దీర్‌రెడ్డి టికెట్ సాధించినట్లు శ్రీకాళహస్తి వాసులు చర్చించుకుంటున్నారు. బొజ్జల సు«దీర్‌రెడ్డి కారణంగా కూటమిలోని అనేక మంది నేతలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.రాష్ట్రంలో ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీలోని ముఖ్య నేతలు టికెట్లు దక్కించుకునేందుకు ఒకరిని ఒకరు వెన్నుపోట్లు పొడుచుకున్న విషయం తెలిసిందే. ప్రధానంగా శ్రీకాళహస్తి టికెట్ కోసం ఏకంగా హత్యా రాజకీయాలకు తెరతీశారనే ప్రచారం కోట వినూత డ్రైవర్ రాయుడు వీడియో ద్వారా గుప్పుమంది. శ్రీకాళహస్తి అసెంబ్లీ టికెట్ కోసం కూటమి పారీ్టలోని బొజ్జల సు«దీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య కుమారుడు, బీజేపీ నేత కోలా ఆనంద్, జనసేన నేత కోట వినూత పోటీ పడిన విషయం విధితమే. టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలే చేశారు. ఈక్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేయడంతో పాటు.. ఆయా పార్టీల అధిష్టానాలకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో మీడియా ముఖంగా వీధికెక్కారు. నాడు టీడీపీ, జనసేన నేతల మధ్యే పోటీసార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పారీ్టల సీట్ల కేటాయింపుకు సంబంధించి శ్రీకాళహస్తి టికెట్ టీడీపీ లేదా జనసేనలో ఒకరికి ఇస్తారని ముందుగానే తేలిపోయింది. దీంతో కోట వినూతను లక్ష్యంగా చేసుకుని ఆమె డ్రైవర్ని కోవర్టుగా బొజ్జల సుధీర్‌రెడ్డి ఎంపిక చేసుకున్నట్లు రాయుడి వీడియో ద్వారా బయటపడింది. ఒకరి విషయాలు ఒకరు తెలుసుకునేందుకు కూటమి నేతలు కోవర్టులను నియమించుకున్నారు. అందులో భాగంగా కోట వినూత విషయంలో బొజ్జల చాలా దూరంగా ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అందుకే డ్రైవర్ రాయుడుకి రూ.60 లక్షలు ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు వీడియో ద్వారా వెలుగు చూసింది. అలాగే అనేక మందిని పావుగా వాడుకున్నట్లు వీడియో ద్వారా వెల్లడైంది. చివరకు కోట వినూత దంపతులను యాక్సిడెంట్ ద్వారా హత్య చేసేందుకు సైతం రెండు పర్యాయాలు యతి్నంచినట్లు రాయుడు వీడియో ద్వారా బయటపెట్టాడు. రాజకీయ పోరులో దళితుడైన సీహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురవడం అప్పట్లో సంచలనంగా మారింది. రాయుడు హత్యకు దారి తీసిన కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు నిజమేనా? డ్రైవర్ రాయడు హత్య తర్వాత అరెస్ట్ అయిన కోట వినూత దంపతులు మీడియా సాక్షిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి పేరును ప్రస్తావించారు. రాయుడి హత్య వెను ఎవరి పాత్ర ఉందని మీడియా ప్రశ్నించిన సమయంలో ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి పేరును వెల్లడించడం నాడు కలకలం రేపింది. అన్ని విషయాలను త్వరలోనే బయటపెడతామని చెప్పినట్టే.. నేడు రాయుడి వీడియో వైరల్ కావటం పెద్ద దుమారమే రేపుతోంది. శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలి అధ్యక్ష పదవిని కొట్టే సాయికి కట్టబెట్టడం వెనుక ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి హస్తం ఉందని కోట వినూత లేఖ ద్వారా ఆరోపించింది. బొజ్జల సుదీర్‌రెడ్డికి టికెట్ కేటాయించడం వెనుక జనసేనలోని మరో నాయకుడు కొట్టేసాయి ఉన్నారని రాయుడు వీడియో ద్వారా తెలుస్తోంది. అదే విధంగా శ్రీకాళహస్తిలో పలువురు ప్రధాన భూమిక పోషించారని డ్రైవర్ వీడియో ద్వారా వెల్లడవుతోంది. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఇంకెన్ని వీడియోలు, వాయిస్ రికార్డులు బయటకు వస్తాయోనని కూటమి నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. -
ఫొటోలకు ప్రాణం పోసేలా వీడియో.. గ్రోక్ ఏఐ కొత్త ఫీచర్
ఎక్స్ఏఐ (xAI) రూపొందించిన గ్రోక్ఏఐ (GrokAI) యాప్‌లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టినట్లు ఎలాన్‌మస్క్ తెలిపారు. పాత, కొత్త ఫొటోలను అప్లోడ్ చేసి కేవలం 20 సెకన్లలో వాటిని వీడియోలుగా మార్చేయవచ్చని చెప్పారు. ఈ నూతన సాంకేతికత కృత్రిమ మేధ (Artificial Intelligence) ద్వారా కేవలం ఒక చిత్రాన్ని తీసుకొని దానికి కదలిక (Motion), అనుగుణమైన శబ్దం (Audio) జోడించి 20 సెకన్లలో 6 నుంచి 15 సెకన్ల నిడివి గల వాస్తవిక దృశ్యం (Photorealistic video)లాగా మార్చగలుగుతోంది. గ్రోక్ఏఐ ‘గ్రోక్ ఇమాజిన్’ (Grok Imagine) ఫీచర్ ద్వారా చారిత్రక చిత్రాలు, ఫ్యామిలీ ఫొటోలు లేదా కార్టూన్ పాత్రలను సజీవంగా మార్చవచ్చని కంపెనీ చెబుతుంది.Upload any photos from your phone or take a picture of an old photo and turn it into a video in 20 seconds with the Grok app! https://t.co/ouHoufWeqG— Elon Musk (@elonmusk) October 7, 2025బనానా ఏఐఫొటోలు అప్లోడ్ చేసి వీడియోలు మార్చే క్రమంలో గ్రోక్ఏఐ ముందున్నా, ఇదే తరహా కృత్రిమ మేధ సామర్థ్యాలను బనానా ఏఐ (Banana AI) కలిగి ఉంది. ఇది గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్ (Gemini 2.5 Flash Image) మోడల్‌కు చెందింది. బనానా ఏఐ ప్రధానంగా ఫోటోలను మెరుగుపరచడం, వాటిని మార్చడం, కొత్త చిత్రాలను సృష్టించడం (Text-to-Image) వంటి వాటికి ప్రసిద్ధి చెందింది.ప్రస్తుతం బనానా ఏఐ ఫోటో-టు-వీడియో ఫీచర్ కాకుండా ఫొటో ఎడిటింగ్ వంటి వాటిలో వినియోగదారులకు సహాయపడుతుంది. ఉదాహరణకు వినియోగదారులు తమ సాధారణ ఫొటోలను ‘రెట్రో చీరలు ధరించిన వింటేజ్ ఫొటోలు’గా మార్చడానికి దీన్ని వాడుతున్నారు. ఈ రెండు కంపెనీలు (గ్రోక్, గూగుల్) వేర్వేరు మార్గాల్లో కంటెంట్ సృష్టికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి.మానసిక స్వాంతనతమ పాత ఫొటోకు ప్రాణం పోసినప్పుడు నెజిజన్లకు అపూర్వమైన భావోద్వేగ అనుభూతి కలుగుతుంది. దశాబ్దాల నాటి కుటుంబ ఫొటోలు, గతించిపోయిన ప్రియమైన వారి చిత్రాలు వీడియోలుగా మారినప్పుడు గతాన్ని మళ్లీ అనుభూతి చెందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల సంతోషం, సంతృప్తి, లోతైన భావోద్వేగ బంధం ఏర్పడతాయి. తమ ఊహలకు రూపం ఇచ్చేందుకు, పాత కథలకు దృశ్యరూపం కల్పించేందుకు ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. ఈ సృజనాత్మకత ఒక విధమైన మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.వ్యాపార అవకాశాలుఏఐ ఆధారిత ఫోటో-టు-వీడియో టెక్నాలజీ కేవలం వ్యక్తిగత భావోద్వేగాలకే పరిమితం కాకుండా కంపెనీలకు వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. గ్రోక్ఏఐ ఈ అధునాతన ఫీచర్‌ను సాధారణంగా ‘సూపర్ గ్రోక్’ (Super Grok) వంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ల్లో అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారుల నుంచి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. అధిక నాణ్యత (High-quality), ఎక్కువ నిడివి గల వీడియోల కోసం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.కంటెంట్ క్రియేటర్ల మార్కెట్నేటి సోషల్ మీడియా యుగంలో కంటెంట్ క్రియేటర్లకు వీడియో అత్యంత ముఖ్యమైన సాధనం. ఈ ఏఐ టూల్స్ ద్వారా నిమిషాల్లో ప్రొఫెషనల్ స్థాయి వీడియోలను సృష్టించవచ్చు. దీనివల్ల సోషల్ మీడియా మార్కెటింగ్, యాడ్స్, షార్ట్ ఫిల్మ్‌ల తయారీకి అయ్యే ఖర్చు, సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ విధంగా కంటెంట్ తయారీ ప్లాట్‌ఫామ్‌లు (FlexClip వంటివి) కూడా ఏఐ ఆధారిత ఫీచర్లను తమ వ్యాపారంలో భాగం చేసుకుంటున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
నా రీల్స్ చూడటం తగ్గించండి సారూ.. ఢిల్లీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఢిల్లీ: తన రీల్స్ చూడటం ఆపండంటూ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwalపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా(Rekha Gupta) వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈవీఎంల(EVMs)పై రేఖా గుప్తా మాట్లాడుతున్నట్లుగా ఓ ఎడిటెడ్ వీడియోను సామాజిక మాధ్యమంలో నిన్న(ఆదివారం) కేజ్రీవాల్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రేఖా గుప్తా.. తన వీడియోలు, రీల్స్ చూడటం తగ్గించి.. తన సొంత పార్టీపై దృష్టి పెట్టాలంటూ కేజ్రీవాల్‌కు చురకలు అంటించారు.ఎలక్ట్రిక్ బస్ డిపోకు శంకుస్థాపన చేసిన రేఖాగుప్తా.. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. "నేను కేజ్రీవాల్‌కు ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. దయ చేసి నా వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ చూడటం తగ్గించండి’’ అంటూ హితవు పలికారు. కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలపై దృష్టి పెట్టాలి. అత్యంత ఘోరమైన వరద విపత్తును ఎదుర్కొన్న ఆ రాష్ట్రంలో బాధితులను ఆయన ఎప్పుడూ పరామర్శించలేదంటూ ఆమె విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: బీహార్‌లో మూడు దశల్లో ఎన్నికలు.. ఎప్పుడంటే?‘‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించినందుకు మీరు సిగ్గుపడాలి. మీరు 11 సంవత్సరాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఢిల్లీ అభివృద్ధిపై దృష్టి సారించి ఉంటే, ప్రజలు బాధలుపడేవారు కాదంటూ కేజ్రీవాల్‌పై రేఖాగుప్తా ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీపై కూడా ఢిల్లీ సీఎం తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ‘‘కాంగ్రెస్ గెలిస్తే అది ప్రజల తీర్పు, మేము గెలిస్తే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయా? ఈ ఫార్ములా ఎక్కడ రాసుంది? అంటూ ఆమె ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే’’ అంటూ రేఖా గుప్తా మండిపడ్డారు.दिल्ली की सीएम ये क्या कह रही हैं … pic.twitter.com/ZEf8RQVuzE— Arvind Kejriwal (@ArvindKejriwal) September 21, 2025 -
‘కలెక్టర్ అంటే ఇలా ఉండాలి’.. వీడియో వైరల్
దాతియా: కలెక్టర్ అనగానే ఎవరికైనా హుందాగా ఉండే ఒక రూపం గుర్తుకువస్తుంది. ఉన్నత పదవిలో ఉన్న అతనితో మాట్లాడాలంటే కాస్త భయమేస్తుంది. అయితే అలాంటి కలెక్టర్ చిన్నారులతో కలసిపోయి, వారు చెప్పేది శ్రద్ధగా వింటూ, వారి సందేహాలకు సమాధానాలిస్తుంటే ఎవరికైనా చూడముచ్చటేస్తుంది. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, తెగ లైక్‌లు, షేర్లు దక్కించుకుంటోంది. This should go viral. ❤️Swapnil Wankhede a 2016 batch IAS officer currently posted as Collector and District Magistrate of Datia district in Madhya Pradesh.This video of his interacting with a small orphaned girl wins hearts. 1/n pic.twitter.com/SSteJkBReG— Gabbar (@Gabbar0099) September 15, 20252016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ వాంఖడే ఒక అనాథ బాలికతో ప్రేమతో హృదయపూర్వకంగా సంభాషిస్తున్న వీడియో అందరి హృదయాలను దోచుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో వాంఖడే ఆ బాలికతో మాట్లాడుతున్నప్పుడు.. ఆమెకు కనిపించేలా వంగి ఉండటం, శ్రద్ధగా మాటలను వింటూ, ఆమె ముఖంలో చిరునవ్వులు పూయించేందుకు చేస్తున్న ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు వందలాది లైక్‌లు,షేర్లు దక్కుతున్నాయి. ఈ వీడియోను చూసివవారు వాంఖడే తీరును ప్రశంసిస్తున్నారు. మానవతా పాలన అంటే ఇదేనని ఒకరు వ్యాఖ్యానించగా, మరికొందరు ఆ చిన్నారి అభివృద్ధికి ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు. మరికొందరు కలెక్టర్ అంటే ఇలా ఉండాలని అంటున్నారు. -
జూకీపర్ను చంపి పీక్కుతిన్న సింహాలు
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో బుధవారం ఘోరం జరిగింది. అక్కడి ప్రముఖ జూలో పని చేసే వ్యక్తి(58)ని సింహాల గుంపు చంపి పీక్కుతింది. పర్యాటకులంతా చూస్తుండగానే ఇదంతా జరడం గమనార్హం. బ్యాంకాక్ పోస్ట్ కథనం ప్రకారం.. జియన్ రంగ్‌ఖరాసమీ అనే వ్యక్తి ఇరవై ఏళ్లుగా బ్యాంకాక్ సఫారీ వరల్డ్‌లో పని చేస్తున్నాడు. ఇది పేరుగాంచిన ఓపెన్ ఎయిర్ జూ. అందులో కొంతకాలంగా ఆయన సింహాల కేర్‌టేకర్(ఆహారం అందిస్తూ) విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. బుధవారం సింహాల ఎన్‌క్లోజర్‌లో ఉండగా ఏమరపాటుగా ఆయన తన వాహనం నుంచి కిందకు దిగారు. అంతే సింహాలు ఒక్కసారిగా ఆయనపై ఎగబడ్డాయి.సుమారు 15 నిమిషాలపాటు అవి ఆయనపై దాడి చేశాయి. ఆ సమయంలో కొందరు పర్యాటకులు.. వాహనాల హారన్లు కొడుతూ, గట్టి గట్టిగా అరుస్తూ వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. జూకీపర్ శరీరంలో కొంత భాగాన్ని పీక్కుతిన్నాయి. ఎలాగాలో వాటి నుంచి ఆయన్ని లాగేసి.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే దారిలోనే ఆయన ప్రాణం పోయిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై Safari World Bangkok స్పందించింది. గత 40 ఏళ్లలో ఇలాంటి దాడి జరగడం ఇదేనని తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో భధ్రతా చర్యలను కఠినంగా అమలు చేస్తామని పేర్కొంది. కింది వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు.. A zookeeper on Wed was attacked and killed by a pack of #lions at a #Bangkok #zoo, as tourists witnessed the incident and tried to intervene to save him. The shocking attack lasted about 15 minutes, with visitors attempting to intervene by honking car horns and shouting to… pic.twitter.com/8ZzsKFwXU0— Shanghai Daily (@shanghaidaily) September 11, 2025సింహాలు మనుషుల్ని తింటాయా?.. సింహాలు మనుషుల్ని వేటాడడం.. అత్యంత అరుదుగా జరుగుతుంది. సాధారణంగా అవి మనుషుల్ని ఆహారంగా పరిగణించవు. జింకలు, జీబ్రాలు, అడవి దున్నలు.. ఇలా పరిమాణంలో పెద్దగా ఉండే జంతువులు వాటి సహజ ఆహారం. గాయపడిన సింహాలు, వయసైపోయిన సింహాలు వేటాడలేని స్థితిలో మనుషులపై దాడి చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే.. అడవుల్లో జంతువుల సంఖ్య తగ్గిపోయినా ప్రత్యామ్నాయంగా పశువులు, మనుషుల మీద దాడి చేయొచ్చు. ఈ క్రమంలో.. ఒకసారి సింహం మనిషిని వేటాడితే గనుక ఆ ప్రవర్తనను కొనసాగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. కొన్నిసార్లు తన పిల్లలకూ మనుషుల్ని వేటాడడం నేర్పిస్తాయట. Tsavo Man-Eaters (1898).. కెన్యాలో రెండు సింహాలు 135 మంది రైల్వే కార్మికులను చంపినట్లు రికార్డులు ఉన్నాయి. అలాగే.. Njombe Man-Eaters (టాంజానియా) పేరిట కొన్ని సింహాలు తరతరాలుగా మనుషులపై వేటాడినట్లు ఆధారాలు ఉన్నాయి. -
సారీ అమ్మ.. నిహారిక పోస్ట్ వైరల్..!
-
'ఓరేయ్.. నా ముందుకొచ్చి మాట్లాడరా?'.. మంచు లక్ష్మీ ఆగ్రహం!
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి దాదాపు ఐదేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనుంది. ప్రస్తుతం ఆమె దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్రం టీజర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని తన సొంత బ్యానర్ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాకు మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి వంశీకృష్ణ మల్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్-2025 వేడులకు హాజరైంది. మంచు లక్ష్మీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అక్కడే మంచు లక్ష్మీ వేదిక వద్దకు వెళ్తుండగా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అదే సమయంలో ఓ అభిమాని అసభ్యకరంగా కామెంట్ చేయడంతో మంచు లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడరా? మీకసలు సెన్స్ లేదు రాస్కెల్స్.. అంటూ మండిపడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత చాలామంది అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చింది మంచు లక్ష్మీ.కాగా.. మంచు లక్ష్మీ నటించిన యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌లో సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, చైత్ర శుక్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ బాబు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మంచు లక్ష్మీ పవర్‌పుల్ పాత్రలో కనిపించారు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ నుంచి పదేళ్ల తర్వాత దక్ష రూపంలో మరో చిత్రం విడుదల కానుంది. 2015లో మామ మంచు అల్లుడు కంచు మూవీ ఆ బ్యానర్ నుంచి చివరిగా విడుదలైంది. View this post on Instagram A post shared by KIO TV (@kiotv27) -
భార్య అశ్లీల వీడియో ఫోన్లో పెట్టుకున్నాడని సహచరుడిని చంపేశాడు..!
కర్ణాటక: తన భార్య అశ్లీల వీడియోను సేకరించిన సహ కార్మికున్ని ఇనుప రాడ్ కొట్టి చంపాడో వలస కార్మికుడు. మంగళూరు నగరంలో సూరత్కల్లో ఈ ఘోరం జరిగింది. వివరాలు.. పశ్చిమ బెంగాల్ చెందిన ముఖేశ్ మండల్ (27) హతుడు. ఇతడు లక్ష్మణ్ అలియాస్ లఖన్ (30) భార్య అశ్లీల వీడియోను తీసుకొని తన ముబైల్ ఫోన్లో పెట్టుకున్నాడు. ఈ విషయం లక్ష్మణ్‌కు తెలిసింది. ' దీంతో జూన్ 24న రాత్రి ఇద్దరూ బాగా మద్యం తాగారు. మత్తులో ఉండగా ఇనుప రాడ్ బాది హత్య చేసి, శవాన్ని ఓ సెప్టిక్ ట్యాంకులో పడేశాడు. ఆగస్ట్ 21న మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో పోలీసులు కనుగొన్నారు. హంతకుడు లక్ష్మణ్ తమిళనాడులో దాగి ఉండగా సూరత్కల్ పోలీసులు వెతికి పట్టుకున్నారు. -
‘నన్ను చంపేస్తారేమో’.. ఎమ్మెల్యే వీడియో కలకలం
హర్యానా: యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ (ఏజీటీఎఫ్)తనని ఎన్కౌంటర్ చేస్తోందని ప్రాణ భయంతో పోలీసుల నుంచి తప్పించుకు తిరగానంటూ ఓ పార్టీ ఎమ్మెల్యే రహస్య ప్రాంతం నుంచి వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో తనని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడులకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.ఇంతకీ పోలీసుల్ని తప్పించుకున్న ఎమ్మెల్యే ఎవరు?. పోలీసులు తనని ఎన్కౌంటర్ చేస్తారేమోనని ఎందుకు భయపడ్డాడు.పంజాబ్‌లోని అధికార ఆప్‌కు చెందిన హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే హర్‌ప్రీత్‌పై జిరాక్‌పూర్‌కు చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. భార్య నుంచి విడాకులు, 2011లో తనని వివాహం చేసుకోవడం, తర్వాత ప్రైవేట్ వీడియోలు తీసి బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు హర్యానాలోని కర్నాల్ జిల్లా దబ్రి గ్రామంలోని నివాసంలో ఉన్న హర్మీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పటియాలా పోలీసు బృందం అక్కడికి చేరుకుంది.పోలీసుల రాకపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే హర్‌ప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లారు. వెళ్లే సమయంలో హరీప్రత్ గ్రామస్థులు, అతని అనుచరులు పోలీసులపైకి దాడికి పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో అజ్ఞతం నుంచి ఎమ్మెల్యే హర్‌ప్రీత్.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేసేందుకు ప్లాన్ చేశారనే సమాచారం అందింది. నన్ను ఒక్కడిని ఎన్కౌంటర్ చేసేందుకు ఎనిమిదిమంది ఎస్పీలు, ఎనిమిదిమంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్హెచ్ఓలు,ఎన్కౌంటర్ స్పెషలిస్టు బిక్రమ్ బ్రార్‌లు పట్టుకునేందుకు వచ్చారు. పోలీసులంటే నాకు అపారమైన గౌరవం ఉంది. నేను వాళ్లమీద ఎటువంటి దాడులకు పాల్పడలేదని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పాటియాలా రేంజ్ డీఐజీ కుల్దీప్ చాహల్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే హర్‌ప్రీత్‌సింగ్ కోసం ఆయన స్వగ్రామానికి వెళ్లాం. మేం వస్తున్నామనే సమాచారంతో ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే హర్‌ప్రీత్ సింగ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.పాటియాలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ఛార్జ్ ప్రదీప్ బాజ్వా ఆప్ ఎమ్మెల్యే అరెస్టును ధృవీకరించారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడులకు పాల్పడ్డారు. రాళ్లు రువ్వారు. ప్రతిఘటించేందుకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిపారు. -
రోడ్డుపై చిల్ అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి.. వైరల్ వీడియోలు
పట్నా: బీహర్‌లో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో బీహార్‌లో ప్రతిపక్షాలు ‘ఓటరు అధికార్ యాత్ర’ను చేపట్టాయి. దీనిలో పాల్గొన్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ యాత్ర ముగియగానే చిల్ అవుతూ కనిపించారు. दिल तो बच्चा ही है जी ... मस्ती टाइम @ पटना मरीन ड्राइव@iHrithik pic.twitter.com/TxelXmsSPb— Rohini Acharya (@RohiniAcharya2) September 2, 2025పట్నాలోని మెరైన్ డ్రైవ్ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద పలువురు యువకులతో పాటు తేజస్వి యాదవ్ నృత్యం చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను అతని సోదరి రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. సింగపూర్ నుండి వచ్చిన తన మేనల్లుడితో కలిసి తేజస్వి యాదవ్ మెరైన్ డ్రైవ్‌లో డ్రైవ్ చేశారు. అనంతరం అక్కడ సోషల్ మీడియా కోసం రీల్స్ చేస్తున్న యువ కళాకారుల బృందాన్ని తేజస్వి చూశారు. వారి మధ్యకు చేరి ఉత్సాహంగా నృత్యం చేశారు. వారి నుంచి ట్రెండింగ్ డ్యాన్స్ మూవ్‌లను నేర్చుకున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సిగ్నేచర్ స్టెప్లను కూడా తేజస్వి అనుకరించారు. गर्मी, बारिश और उमस के बीच कल 16 दिनों तक चली वोटर अधिकार यात्रा समाप्त हुई। रात्रि में सिंगापुर से आए भांजे ने कहा ड्राइव पर चले।रास्ते में सड़क पर कुछ युवा साथी कलाकार मिले। वो गाना गा रहे थे, रील्स बना रहे थे। आग्रह करने लगे तो हमने भी हाथ-पैर आजमाए।हम सब सहजता, सरलता और… pic.twitter.com/buNCqKnA3G— Tejashwi Yadav (@yadavtejashwi) September 2, 2025 ఒక క్లిప్‌లో తేజస్వి ఆయన తన తండ్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను గుర్తుచేసే భోజ్‌పురి పాట ‘లాలు బినా చాలు ఈ బీహార్ న హోయి’కి నృత్యం చేశారు. మరో వీడియోలో ఆయన పోలీసు అధికారులతో సంభాషించడం, యువ కళాకారులతో రోడ్డు పక్కన టీ తాగడం లాంటి దృశ్యాలు ఉన్నాయి. కాగా ఓటరు అధికార్ యాత్ర ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 1 వరకు బీహార్‌లో 16 రోజుల పాటు జరిగింది. దీనికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ నాయకత్వం వహించారు. -
టీడీపీ ఎమ్మెల్యే...కోటంరెడ్డి కొత్త డ్రామా
సాక్షి, అమరావతి: జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మెడకు చుట్టుకోవడంతో బయట పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లోని రౌడీ షీటర్లను పెంచి పోషించిందే శ్రీధర్‌రెడ్డి అనే విషయం రాజకీయ నాయకులకు, పోలీసులకు తెలిసిందే. శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వాలంటూ సిఫార్సు చేసి అడ్డంగా దొరికిపోయిన శ్రీధర్‌రెడ్డి ఆ బురద కడుక్కునేందుకు ఎవరికైనా సిఫార్సు లేఖ ఇవ్వడం సాధారణమే అంటూ తప్పించుకునే యత్నం చేశారు. తాజాగా తన హత్యకు రౌడీషీటర్లు కుట్ర చేస్తున్నారనే వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయించి కొత్త డ్రామా ఆడుతూ, వైఎస్సార్సీపీ పైకి నెట్టివేసే కొత్త కుట్రలకు తెర తీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన హత్యకు జీవిత ఖైదీ శ్రీకాంత్ సైన్యం కుట్ర పన్నారంటూ హడావుడి చేస్తుండడంతో నగర ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ ఏదో రకంగా కొత్త డ్రామాలు ఆడడం కోటంరెడ్డి అలవాటు.. ఇది ఆ కోవలోనిదే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీడియోలోని వారంతా ఎమ్మెల్యే బ్రదర్స్, రూప్‌కుమార్ అనుచరులే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక అనుచరుడు జగదీ‹Ù, కోటంరెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి అనుచరుడు మహేశ్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ ముఖ్య అనుచరుడు దార్ల వినిత్తోపాటు మరో ఇద్దరు ఉన్నారు. కోటంరెడ్డి అనుచరులే ఆయన హత్యకు ఎలా కుట్ర చేస్తారని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. ఆ రౌడీమూకల ద్వారానే నెల్లూరులో కోటంరెడ్డి సెటిల్మెంట్లు, దందాలు, రౌడీయిజాలు చేయించినట్లు ఇటీవల పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో కోటంరెడ్డి అండదండలున్నాయని వెలుగులోకి రావడం, అరుణ ఫోన్ సంభాషణల్లో నిగూఢ రహస్యాలు వెలుగులోకి వస్తుండడం, అన్నింట్లో కూడా ఎమ్మెల్యే అనుచరులు సెటిల్మెంట్ దందాలు చేసినట్లు ఉండడంతో పోలీసులు సైతం నివ్వెరపోయారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అతన్ని కాపాడేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్ర డీజీపీ కూడా నెల్లూరుకు వచ్చి పోలీసుల నుంచి ఎలాంటి లీకులు రాకూడదని ఆదేశాలిచ్చి వెళ్లారని తెలిసింది. ఈ వ్యవహారం డైవర్షన్‌లో భాగంగా రౌడీమూకలు హోటల్ గదిలో మద్యం తాగుతూ మాట్లాడుకున్న వీడియోను ముందస్తు వ్యూహంతోనే చిత్రీకరించి సోషల్ మీడియాలో లీకు చేయించారని తెలుస్తోంది. తద్వారా వైఎస్సార్సీపీకి అంట గట్టే యత్నాలను చూసి నెల్లూరు నగర వాసులు ఛీదరించుకుంటున్నారు. పెంచి పోషించిన వారే హత్య చేస్తారా? జీవిత ఖైదీ శ్రీకాంత్ ఆది నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరుడే. ఇటీవల అరుణ ఎల్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనను 50 శాతం మాత్రమే ప్రేమిస్తున్నాడని, మిగిలిన 50 శాతం ఎమ్మెల్యే కోటంరెడ్డిని ప్రేమిస్తున్నాడని వెల్లడించిన విషయం విదితమే. నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా శ్రీకాంత్‌కు సకల సౌకర్యాలు కల్పించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించిన విషయం కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. పెరోల్ రద్దయిన తర్వాత కూడా ములాఖత్ ఇవ్వకుంటే సాక్షాత్తు ఎమ్మెల్యే ఫోన్ చేసి ములాఖత్ ఇప్పించినట్లుగా జైలు శాఖ అధికారులు పోలీసులకు వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం వీడియోలో ఉన్న రౌడీమూకలు సైతం ఎమ్మెల్యే వీరవిధేయులు. ఆయన కనుసన్నల్లోనే వారు పని చేస్తున్న విషయం బహిరంగమే. ఎమ్మెల్యే కీలక అనుచరులూ వీరి ద్వారానే సెటిల్మెంట్లు చేయిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కార్పొరేటర్ భర్త సెటిల్మెంట్ చేసి రూ.కోటి విలువైన స్థలాన్ని బహుమానంగా తీసుకున్నారు. అందులోనే తన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కూడా జరిగిన హత్యాయత్నాలు, ఇటీవల వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసాన్ని ధ్వంసం చేసిన వారిలో ఈ రౌడీషీటర్లు ఉన్నారనేది జగమెరిగిన సత్యమే. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కనుసన్నల్లో పని చేసే వారే ఆయన్ను హత్యకు కుట్ర చేస్తున్నారనే ప్రచారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక పోలీసులే తేల్చాల్సి ఉంది. -
టీడీపీ ఎమ్మెల్యే... కోటంరెడ్డి కొత్త డ్రామా
-
‘ఎలక్షన్ చోరీ ఆయోగ్’
న్యూఢిల్లీ: ఓట్ల చోరీపై విపక్ష కాంగ్రెస్ పార్టీ తమ పోరాటం ఉధృతం చేస్తోంది. పోలింగ్ బూత్‌లో ఒకరి బదులు ఇంకొకరు ఓటు ఎలా వేస్తున్నారో వివరిస్తూ ఒక వీడియోను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ‘మీ ఓటు చోరీ, మీ అధికారం చోరీ, మీ గుర్తింపు చోరీ’ అనే శీర్షికతో సోషల్ మీడియాలో చేశారు. ఓటర్ల జాబితాలో గోల్‌మాల్‌పై ప్రజలంతా గొంతు విప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాలని చెప్పారు. వీడియోలో ఏముంది?కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోలో ఆసక్తిక రమైన సన్నివేశం కనిపిస్తోంది. ఇందులో ఓ కుటుంబం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆ కుటుంబానికి తారసపడతారు. మీ ఓట్లు మేమే వేశాం, ఇక మీరు వెళ్లిపోవచ్చు అని చెప్తారు. దొంగ ఓట్లు వేసిన ఆ ఇద్దరు వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల అధికారికి బొటన వేలు పైకెత్తి విజయం చిహ్నం చూపిస్తారు. ఆ అధికారి టేబుల్‌పై ‘ఎలక్షన్ చోరీ ఆయోగ్’ అనే నేమ్‌బోర్డు ప్రత్యక్షం అవుతుంది. నేడు దేశవ్యాప్తంగా ర్యాలీలు: ఓట్ల చోరీపై దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం భారీ ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. -
'జడలు ముట్టుకుంటే వాడు సర్రుమంటాడు'.. ది ప్యారడైజ్ యాక్షన్ సీక్వెన్స్ వీడియో!
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్'. దసరాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే నాని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్లో ఇంతకు ముందెన్నడు కనిపించని విధంగా రెండు జడలతో కనిపించారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. డిఫరెంట్ లుక్‌లో నాని కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ వీడియోను పంచుకున్నారు మేకర్స్. ఈ సీక్వెన్స్‌ను జైల్లో తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో నాని డిప్స్ కొడుతూ కనిపించారు. 'వాడి జడల్ని ముట్టుకుంటే వాడు సర్రుమంటాడు' అనే డైలాగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ది స్పార్క్ ఆఫ్ ప్యారడైత్ పేరుతో ఈ సీక్వెన్స్ రాప్ వీడియోను రిలీజ్ చేశారు.అయితే ఈ చిత్రంలో నాని సరసన డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుందని టాక్. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయెల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది. -
ఏఐ మాయ.. సౌత్ స్టార్స్ ఇలా అయిపోయారేంటి?
ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీని కాస్తా గట్టిగానే వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫన్ క్రియేట్ చేసేందుకు ఏఐని విపరీతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖుల ఫోటోలు, వీడియోల కంటెంట్‌ను ఎక్కువగా సృష్టిస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్స్ వారి సతీమణులతో ఉన్న ఫన్నీ వీడియోను నెట్టింట హల్చల్ చేశాయి. ఈ వీడియో ఫ్యాన్స్‌కు తెగ నవ్వులు తెప్పించింది.తాజాగా అలాంటి వీడియోనే దక్షిణాది సూపర్ స్టార్స్‌తో రూపొందించారు. హీరోలు సూర్య, అజిత్, బన్నీ, మహేశ్ బాబు, విజయ్, రామ్ చరణ్‌తో కలిసి ఫన్నీగా రూపొందించారు. ఇందులో హీరోలంతా హీరోయిన్స్‌కు ఫుడ్ తినిపిస్తూ కనిపించారు. ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియో నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. తమ స్టార్ హీరోలేంటి ఇలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి.Prabhas annaaaaaa😂🤣😁#Prabhas𓃵 pic.twitter.com/43OVHX8wYQ— G.O.A.T Prabhas (@goatPB1) August 8, 2025 -
నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన
ఒకప్పటి హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లో నిలిచింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చాలా ఆవేదనతో ఓ వీడియోని పోస్ట్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.'నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. పోలీసులకు ఫోన్ చేస్తే.. స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. రేపో, ఎల్లుండో పోలీసుల దగ్గరకు వెళ్తాను. గత నాలుగైదేళ్ల నుంచి ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నా ఇల్లంతా చిందరవందరగా అయిపోయింది. పనివాళ్లని పెట్టుకుంటే వాళ్లొచ్చి నా వస్తువుల్ని దొంగలిస్తున్నారు. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది. ఎవరైనా వచ్చి కాస్త నాకు సాయం చేయండి' అని ఏడుస్తూ తనుశ్రీ దత్తా వీడియో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పవన్ వ్యాఖ్యలు.. ట్రెండింగ్‌లో #BoycottHHVM)బిహార్‌కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ 'ఆషిక్ బనాయా అప్నే' పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో 'వీరభద్ర' అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.అయితే 2018లో మీటూ(#Metoo) ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. ఈ కేసులో పటేకర్‌కి క్లీన్ చిట్ దక్కింది. మరోవైపు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సైతం తనని ఓ సినిమా కోసం నగ్నంగా డ్యాన్స్ చేయమని అడిగాడని గతంలో ఆరోపణలు చేసింది. ఇప్పుడు మాత్రం తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మహేశ్, సుకుమార్‌ని ఫిదా చేసిన హిందీ సినిమా.. ఏంటి దీని స్పెషల్?) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) -
ట్రంప్ కసి.. ఒబామా అరెస్టు అంటూ ఏఐ వీడియో
సంచలన ఆరోపణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదని’ సందేశంతో ఆయన ఆ పోస్ట్ చేశారు. అయితే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్ అయిన నేపథ్యంతో ఉన్న ఏఐ వీడియోను తన ట్రూత్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాను ఎఫ్‌బీఐ అరెస్టు చేసినట్లుగా ఆ వీడియో ఉంది. ఒబామా చేతుల్ని వెనక్కి విరిచి మరీ అధికారులు బేడీలు వేశారు. ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు ట్రంప్. అటుపై ఒబామా కటకటాల్లో ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అంతకంటే ముందు ఈ వీడియోలో.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పలువురు నేతలు చెప్పిన సందేశాన్ని దానికి జత చేశారు. ఆ నేతల్లో ముందుగా ఉంది ఒబామానే కావడం గమనార్హం. Donald #Trump reposts AI-generated video depicting Barack #Obama being arrested.#MAGA | #USApic.twitter.com/crkL8bew9l— Shivanshi Singh (@Shivansshi) July 21, 2025 అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై సంచలన ఆరోపణలకు దిగారు. 2016లో ట్రంప్ విజయం టైంలో ఒబామా ప్రభుత్వం కుట్రలకు తెర తీసిందని.. రష్యా ఎన్నికల జోక్యంపై కల్పిత ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేయించారని, తద్వారా ట్రంప్ అధ్యక్ష పదవికి అర్హత లేదని చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారామె. ఈ క్రమంలో ఆమె అమెరికా న్యాయవిభాగానికి US Department of Justiceకి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించినట్లు సమాచారం. Treason, Tulsi & Trump! Gabbard has accused #BarackObama of 'weaponizing intelligence' against #DonaldTrunp in 2016 - I explain why timing and intention of this huge claim is being questioned 👇#EpsteinFiles #TulsiGabbard pic.twitter.com/orQbiEICNK— Shreya Upadhyaya (@ShreyaOpines) July 20, 2025 ఈ వ్యవహారంపై రిపబ్లికన్ నేతలు గబ్బార్డ్‌కు మద్దతు తెలుపుతూ.. ఆమెపై ప్రశంసలు గుప్పించారు. అయితే డెమోక్రట్లు మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరణతో కూడినవిగా, ఆధారాలు లేనివిగా అభివర్ణించారు. మరోవైపు Obama ఇంకా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే ఈ ఆరోపణలు వెల్లువెత్తిన మరుసటిరోజే ట్రంప్ ఇలా ఓ ఏఐ వీడియో తన అధికారిక ఖాతాలో పోస్ట్‌చేయడం గమనార్హం. -
బుట్టబొమ్మతో ప్రేమాయణం కొనసాగిస్తా... ఏం చేసుకుంటావో చేసుకో
హైదరాబాద్: ‘ఇన్‌స్టా రీల్స్ అమ్మాయి బుట్టబొమ్మతో ప్రేమాయణం కొనసాగిస్తా ...ఏం చేసుకుంటావో చేసుకో’అన్న భర్త మాటలతో క్షణికావేశానికి లోనైన వైద్యురాలు ప్రత్యూష ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం డాక్టర్ ప్రత్యూష అనుమానాస్పదంగా మృతి చెందినట్లు నమోదైన కేసులో విచారించిన పోలీసులు మంగళవారం ఆమె భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అత్తమామలు పుణ్యవతి–మధుసూదన్‌తోపాటు ఇన్‌స్టా రీల్స్గర్ల్ బానోతు శ్రుతిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి ఆవివరాలు వెల్లడించారు. మట్టెవాడకు చెందిన తంజాపూరి పద్మావతి కూతురు డాక్టర్ ప్రత్యూషకు (35), ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన డాక్టర్ అల్లాడి సృజన్‌కు 2017లో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు హసన్‌పర్తిలోని కాకతీయ వెంటెజ్లో ఓ విల్లా కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరితోపాటు సృజన్ తల్లిదండ్రులు పుణ్యవతి–మధుసూదన్‌లు కూడా ఇక్కడే ఉంటున్నారు. బానోతు శ్రుతితో కుటుంబంలో చిచ్చు.. ఏడాది క్రితం బుట్టబొమ్మ–17 ఇన్‌స్ర్ట్రాగాం ఐడీ పేరుతో రీల్స్ చేసే అమ్మాయి బానోతు శ్రుతితో డాక్టర్ సృజన్ దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన భార్యకు విడాకులు ఇస్తానని బెదిరించాడు. మరో వైపు శ్రుతి కూడా ఫోన్ ద్వారా ప్రత్యూషను వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. ఆది వారం కూడా ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. శ్రుతిని వదిలేది లేదని సృజన్ చెప్పడంతో ప్రత్యూష పైఅంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కాగా గొడవ విషయంలో సృజన్ తల్లిదండ్రులు కూడా కొడుకుకే మద్దతు పలికారని ఏసీపీ పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
సీఎం సార్.. దేశ రక్షణలో ఉన్నా.. నా కుటుంబాన్ని రక్షించండి!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంటే, తన భూమిని ఓ రాజకీయ నాయకుడు కబ్జా చేస్తున్నాడని, ఇందుకు అడ్డుగా ఉన్నాడని తన తండ్రిపై దాడి చేశారని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో ఓసైనికుడు పోస్టు చేసిన ఒక సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్ల అడ్డగోలు వ్యవహారాలకు ఈ వీడియో అద్దంపడుతోంది.‘ముఖ్యమంత్రికి.. నా పేరు బీఎన్ ప్రసాద్. మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, కదిరివోబనపల్లి గ్రామం. నేను పదేళ్లుగా దేశానికి సైనిక సేవలు అందిస్తున్నాను. మీరు మా గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకు ఒక ఎకరం ఇరవై సెంట్ల భూమి ఉంది. ఇందులోనే 15 సెంట్ల భూమిని రాజకీయ నాయకుడైన సుందరప్ప ఆక్రమించుకుని రీసర్వేలో నమోదు చేసుకుని అతని భార్యకు రిజిస్ట్రేషన్ చేశాడు’ అని వాపోయాడు. తన సమస్యపై దృష్టి సారించిన అధికారులు సర్వే చేసి తనకు రావాల్సిన 15 సెంట్లకు ఫెన్సింగ్ వేసినట్లు తెలిపారు. అయితే శనివారం ఉదయం తన తండ్రి బి.నారాయణప్ప పొలంలో పనిచేసేందుకు వెళ్లగా సుందరప్ప, ఆయన కుటుంబ సభ్యులు దాడిచేసినట్లు పేర్కొన్నాడు. సుందరప్పకు ‘దేశం’ అండా‘దందా’.. సుందరప్ప టీడీపీలో కీలక నాయకుడు. భార్య నారాయణమ్మ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేశారు. కుమారుడు బీరేష్ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు. చంద్రబాబు ఇంటి నిర్మాణ పనుల్లోనూ వీరు చురుగ్గా పాల్గొన్నారు. దీంతో పైస్థాయి పార్టీ నేతలతో పరిచయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పరిష్కారమైన భూ వివాదాన్ని మళ్లీ తిరగదోడుతూ సుందరప్ప దాడులకు పాల్పడుతున్నాడని సమాచారం. సుందరప్ప కుటుంబంతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని 2024 ఆగస్టులో ఇదే సైనికుడు ప్రసాద్ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. దీనిపై కుప్పం పోలీసులు అప్పట్లో విచారణ జరిపి ఆ కుటుంబం జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. కానీ ఇప్పుడు ఈ భూమికి ఎదురుగా సీఎం గృహప్రవేశం జరగటం, పలమనేరు–కృష్ణగిరి రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయనుండటంతో రియల్టీ బూమ్ ఏర్పడింది. దీంతో మళ్లీ సుందరప్ప తన భూకబ్జా కుట్రలకు పదునుపెట్టాడు. -
రీల్స్ కోసం.. బైకుపై ఎనిమిది మంది
హైదరాబాద్: ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ఎనిమిది మంది యువకులు ఓ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి రీల్స్ కోసం స్టంట్ చేశారు. జాతీయ రహదారిపై ఈ స్టంట్ కొనసాగుతుండటంతో ఈ దారి గుండా వెళ్తున్న వారు తమ సెల్ఫోన్లో బంధించి ఎక్స్ వేదికగా పోస్టు చేసి..సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 21న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది యువకులు ద్విచక్ర వాహనంపై శంషాబాద్ నుంచి ఆరాంఘర్ వైపు పయనమయ్యారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు మైనర్లతో పాటు ఐదుగురు యువకులు పయనిస్తూ రీల్స్ చేశారు. ప్రమాదభరితంగా స్టంట్లు చేశారు. ఈ దృశ్యాలను అటుగా వెళుతున్న పలువురు చిత్రీకరించి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఈ రహదారి రాత్రి సమయాల్లో బిజీగా ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో వీఐపీల రాకపోకలతో అలర్ట్‌గా ఉంటుంది. ఈ స్టంట్ విషయమై పలువురు సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను సోమవారం గుర్తించారు. ద్విచక్ర వాహనంతో పాటు ఐదుగురు యువకులను, ముగ్గురు మైనర్లను రాజేంద్రనగర్ పోలీసులకు సోమవారం సాయంత్రం అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌పై యువజంట వికృత చేష్టలు.. రూ. 53,500 జరిమానా
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో కొందరు యువతీ యువకులు రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో ఈ జంటపై చర్యలు తీసుకోవాలని పోలీసులను పలువురు కోరారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా వైరల్ అయిన ఈ ఐదు సెకన్ల క్లిప్‌లో ఒక యువకుడు బైక్ నడుపుతుండగా, ఒక యువతి పెట్రోల్ ట్యాంక్‌పై అతనికి రివర్స్ పొజిషన్లో కూర్చుని, తన కాళ్లను అతనికి వెనుకవైపుగా ఉంచింది. నిత్యం రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వేపై వారిద్దరూ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. అయితే, ఆ మహిళ చేతిలో హెల్మెట్ ఉంది. అక్కడి సీసీటీవీ కెమెరాలలో ఈ ఉదంతమంతా రికార్డయ్యింది. नोएडा पुलिस ने इस "इशकजादे" का 53500 रुपए का चालान व्हीकल एक्ट में काटकर "प्रेम पत्र" घर भिजवा दिया है !! pic.twitter.com/Dw3gqS46Z8— Sachin Gupta (@SachinGuptaUP) June 16, 2025ఈ వీడియోను గమనించిన తాము, ఆ వాహనం నంబరు ఆధారంగా బైక్‌ను గుర్తించి మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత విభాగాల కింద రూ.53,500 చలానా జారీ చేశామని నోయిడా (ట్రాఫిక్) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లకన్ సింగ్ యాదవ్ మీడియాకు పారు. ఈ సంఘటన సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం తదితర నేరాల కింద మోటార్ వాహనాల చట్టంలోని వివిధ విభాగాల కింద పోలీసులు ఆ వాహనానికి చలానా జారీ చేశారు.ఇది కూడా చదవండి: జనగణన నోటిఫికేషన్ జారీ.. లెక్కల ప్రక్రియ ఇదే.. -
స్నేహితుడి భార్యకు అశ్లీల చిత్రాలు పంపిన యువకుడు..!
అన్నానగర్(తమిళనాడు): దిండుగల్‌కు చెందిన 23 ఏళ్ల యువతి పేరుతో అశ్లీల చిత్రాలను ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రచారం చేశారు. ఇది చూసిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు దిగ్భ్రాంతి చెందారు. ఆ యువతి పేరుతో నకిలీ ఖాతా సృష్టించి, దాని ద్వారా అశ్లీల చిత్రాలను విడుదల చేసినట్లు వెల్లడైంది. ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అశ్లీల చిత్రాలను షేర్ చేసిన వ్యక్తి విరుదునగర్ జిల్లా కరియాపట్టికి చెందిన విమల్(31) అని తేలింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ జరపగా, షాకింగ్ సమాచారం బయటపడింది. విమల్ ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతను దిండుగల్ లో ఒక స్నేహితుడితో ఉంటున్నాడు. అతను తన స్నేహితుడిని సిమ్ కార్డ్ కొనమని అడిగాడు. అతని స్నేహితుడు తన పేరు మీద సిమ్ కార్డ్ కొన్నాడు. దీని ద్వారా విమల్ దిండిగల్‌కు చెందిన ఒక యువతి పేరుతో నకిలీ ఖాతాను ప్రారంభించి, ఇన్‌స్ట్రాగామ్‌లో వివిధ చిత్రాలను షేర్ చేశాడు. ఈ సమాచారం వెలుగులోకి రాగానే, షాక్ అయిన మహిళ అతనిని వివరాలు అడిగింది. ఈలోగా చదువు పూర్తి చేసుకున్న తర్వాత, విమల్ తన స్వస్థలం విరుదునగర్‌కు వెళ్లాడు. నకిలీ ఖాతా వివరాలు వెలుగులోకి రావడంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఆమె తన వద్ద ఉన్న వివిధ చిత్రాలు, వీడియోలను తొలగించింది. పోలీసులు విమల్‌ను అరెస్టు చేసినప్పుడు, వారు అతని సెల్‌ఫోన్‌ను శోధించారు. సిమ్ కార్డు కొనుగోలు చేసిన స్నేహితుడి భార్యకు విమల్ అశ్లీల చిత్రాలను పంపినట్లు చూసి వారు షాక్ అయ్యారు. విమల్‌కు 2 వారాల క్రితమే వివాహం జరిగింది. అతన్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
నదిని దాటాలంటే.. ప్రాణాలతో చెలగాటమే..
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. జనజీవనం అతలాకుతలమవుతోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో జనం తమ ప్రాణాలను పణంగా పెట్టి, నదులను దాటుకుంటూ ఆవలివైపునకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలోని వరద పరిస్థితులను తెలియజేస్తూ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు.ArunachalPradesh receives heaviest Monsoon rains in the world. Got this video of a man crossing traditional hanging bridge in Anjaw district, Arunachal Pradesh near tri-junction of India, China & Myanmar border. Please remain careful & safe. Govt will provide necessary support. pic.twitter.com/GZ9ypeOzZj— Kiren Rijiju (@KirenRijiju) June 1, 2025దానిలో ఒక నది ఉవ్వెత్తున ఉప్పొంగుతుండగా, ఒక వ్యక్తి తాడు పట్టుకుని ఎంతో కష్టం మీద వంతెన దాటున్న దృశ్యం కనిపిస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఏర్పడుతున్న వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలలోని పరిస్థితులను ఈ వీడియో(Video) కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అక్కడ ఉంటున్నవారు ఎంత దుర్భర స్థితిలో ఉంటున్నారో తెలియజేస్తుంది. ఈ వీడియోను భారత్, చైనా, మయన్మార్ సరిహద్దుల్లోని ట్రై-జంక్షన్ సమీపంలోని అంజావ్ జిల్లాలో చిత్రీకరించారు. ఈ వంతెనను వెదురు, చెక్కలు, తాళ్లతో నిర్మించినట్లు కనిపిస్తోంది. ఈ వంతెనలో అక్కడక్కడా కొంతభాగం భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయినట్లు లేదా మునిగిపోయినట్లు కనిపిస్తోంది. వీడియోలో వంతెనపై ఒకవైపు తాళ్లను పట్టుకున్న వెళుతున్న వ్యక్తి కనిపిసుండగా, కింద ఉప్పొంగి ప్రవహిస్తున్న నది ఏ క్షణంలోనైనా వంతెనను తుడిచిపెట్టేస్తుందనేలా ఉంది. గడచిన 48 గంటల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందారు. ముఖ్యమంత్రి పెమా ఖండు బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయనే అంచనాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనవసరమైన ప్రయాణాలను చేయవద్దని కోరారు. ఇది కూడా చదవండి: బీహార్‌లో మరో దారుణం.. తొమ్మిదేళ్ల దళిత బాలిక విలవిల -
దడ పుట్టించిన దుమ్ము తుఫాను.. గాలిలో విమానం చక్కర్లు
న్యూఢిల్లీ: గాలిలో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి విచిత్ర పరిస్థితి ఎదురయ్యింది. విపరీతమైన దుమ్ము తుఫాను(Dust storm) కారణంగా రాయ్‌పూర్ - ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. వాతావరణం మెరుగుపడే వరకు ఇండిగో విమానం 6ఈ 6313 కొంతసేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఈ ఉదంతాన్ని ఒక ప్రయాణికుడు వీడియోలో రికార్డు చేశారు.ఆదివారం సాయంత్రం ఢిల్లీలో నెలకొన్న తీవ్రమైన దుమ్ము తుఫాను కారణంగా రాయ్‌పూర్-ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్‌ను నిలిపివేయవలసి వచ్చింది. ఢిల్లీ-ఎన్సీఆర్(Delhi-NCR)లో చోటు చేసుకున్న ఈదురుగాలులు, దుమ్ము తుఫాను మధ్య పైలట్ ల్యాండింగ్‌ను నిలిపివేసి పరిస్థితులు మెరుగుపడే వరకు గాలిలో విమానాన్ని వృత్తాకారంలో తప్పుతూ వచ్చారు. ఈ సమయంలో ఒక ప్రయాణీకుడు రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం గాలిలో చక్కర్లు కొడుతున్నప్పుడు చుట్టూ అల్లకల్లోలంగా ఉన్న దృశ్యం వీడియోలో కనిపించింది. #WATCH | An IndiGo flight number 6E 6313 from Raipur to Delhi experienced turbulence due to a duststorm, prompting the pilot to climb up again when the aircraft was about to touch down at Delhi airport. The aircraft landed safely at Delhi airport after making many circuits in the… pic.twitter.com/TtDUwIH79b— ANI (@ANI) June 1, 2025ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ల్యాండ్ చేయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. పైలట్ తెలిపిన వివరాల ప్రకారం ఆ సమయంలో గాలి వేగం గంటకు 80 కి.మీ మేరకు ఉంది. కాగా(సోమవారం)తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్సీఆర్ అంతటా బలమైన గాలులు వీచాయి. కాగా మే చివరి మూడు రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు కురిసి, స్థానికులకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఇది కూడా చదవండి: అమెరికాలో ‘పాలస్తీనా టెన్షన్’.. బాంబు దాడి కలకలం -
నాతో గడుపు.. సర్టిఫికెట్ ఇప్పిస్తా!
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: అధికార మదంతో ఊగిపోతున్న కూటమి నేతలు(Kutami Leaders).. ఇప్పుడు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. తన భర్త డెత్ సర్టిఫికెట్ కోసం అర్జి పెట్టుకున్న ఓ మహిళను బీజేపీ నేత ఒకరు లైంగికంగా వేధిస్తున్న ఉదంతం విసన్నపేటలో వెలుగు చూసింది. విసన్నపేట(Vissannapeta) పట్టణంలో టీ దుకాణంలో పని చేసే ఆదిలక్ష్మీ.. బీజేపీ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అబ్బినేని బాబుపై సంచలన ఆరోపణలకు దిగింది. ఆయన తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ వీడియో ద్వారా ఆమె వివరాలను వెల్లడించారు .బాధితురాలి భర్త కొద్ది రోజుల మరణించాడు. అయితే డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అబ్బినేని బాబు ఆమె వద్దకు వచ్చి ఆరా తీశాడు. తనతో కొంత టైం గడిపితే డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆమె గట్టిగా తిట్టి పంపించేసింది. ఆటైంలో అబ్బినేని బాబు తాను చెప్పినట్లు వినకపోతే డెత్ సర్టిఫికెట్ ఎలా వస్తుందో చూస్తానంటూ బెదిరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలిసి అబ్బినేని తప్పతాగి వచ్చి ఆమెపై బెదిరింపులకు దిగారు. ‘‘నేను ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అంతటోడిని అని, ఎవరికీ భయపడను’’ అని మళ్లీ బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె తనకు న్యాయం జరగాలంటూ వీడియో ద్వారా అభ్యర్థించారు.ఇదీ చదవండి; చంద్రబాబు కోవర్టు రాజకీయం -
మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియోపై గుసగుసలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో తెలుగు దేశం పార్టీని స్థాపించి.. ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత పార్టీ చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లింది.. ఎన్టీఆర్ ఎంతగా క్షోభ పడింది తెలుగు వాళ్లకు తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీ మహానాడు వేళ.. అందునా ఆయన జయంతినాడు వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.టెక్నాలజీ అంటూ పదే పదే స్టేట్మెంట్లు ఇచ్చే చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు.. మహానాడులో ఏఐతో గొప్పల కోసం తిప్పలు పడడం నవ్వులు పూయిస్తోంది. ఎన్టీఆర్ స్వయంగా మహానాడుకు వచ్చి ఆ తండ్రీకొడుకులను పొగిడితే ఎలా ఉంటుందో అంటూ ఓ ఏఐ (NTR AI Video) వీడియోను మహానాడు వేదికపై ప్రదర్శించారు. చంద్రబాబు పీ4, అమరావతి ద్వారా రాష్ట్రాన్నే మార్చేస్తాడని.. యువగళంతో తన మనవడు లోకేశ్ కొత్త ఊపు తెచ్చాడంటూ ఏఐ ఎన్టీఆర్‌తో పొగడ్తలు గుప్పించుకున్నారు. ఆ టైంలో అక్కడే ఉన్న కార్యకర్తల్లో కొందరు.. ఆయన బతికి ఉంటే ఏం మాట్లాడే వారో? అంటూ నవ్వుకుంటూ గుసగుసలాడుకోవడం కనిపించింది. మరోవైపు.. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి, చంద్రబాబు, లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు pic.twitter.com/if9KqwNHhM— Telugu Scribe (@TeluguScribe) May 28, 2025Video Credits: Telugu Scribeతనను చంద్రబాబు సీఎం గద్దెనుంచి దింపి.. టీడీపీని లాక్కున్న తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబు నిజస్వరూపం గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ క్రమంలో తాజా ఏఐ వీడియోపై సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన ఆత్మను అమ్ముకున్నాడని, ఔరంగజేబు వారసుడని, తన కంటే పెద్ద నటుడంటూ నాడు ఎన్టీఆర్ చెప్పిన మాటలను కొందరు సోషల్ పోస్ట్ చేస్తున్నారు. ఇదేం ఆనందం చంద్రబాబు, లోకేష్? అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. Video Credits: vasanth_gollapalliఇదీ చదవండి: Mahanadu-కనీసం భోజనాల దాకా అయినా ఆగండయ్యా! -
ట్రంప్ పేరుతో నకిలీ యాప్
బెంగళూరు: సైబర్ నేగరాళ్లు చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కూడా వదల్లేదు. ఆయన పేరుతో యాప్‌ను రూపొందించి.. 150 మందిని మోసం రూ.కోటి వసూలు చేశారు. ‘ట్రంప్ హోటల్ రెంటల్’పేరుతో యాప్ క్రియెట్ చేసిన స్కామర్లు.. ఇందులో పెట్టుబడులు పెడితే డబ్బు రెట్టింపవుతుందని నమ్మబలికారు. యాప్ చట్టబద్ధమైనదిగా చూపించడానికి ఏఐ జనరేటెడ్ ట్రంప్ వీడియోను ప్రసారం చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి బహుమతులు కూడా ఆశ చూపారు. అంతేకాదు.. ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీంతో నమ్మిన బెంగళూరు, తమకూరు, మంగళూరు, హవేరి వరకు ప్రజలు యాప్‌లో ఉన్న నంబర్‌కు కాల్ చేసి డబ్బు ఇచ్చారు. 150 మంది కోటికి పైగా పెట్టుబడి పెట్టారు. వీరికి నమ్మకం కలిగించేందుకు స్కామర్లు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేవారు. కొన్ని రోజులపాటు చిన్నచిన్న బహుమతులు కూడా అందజేశారు. ఆ తరువాత షేర్లు రోజురోజుకూ పెరుగుతున్నట్టుగా డిజిట్స్ మారుస్తూ వారిని మాయ చేశారు. ఆ తరువాత కొంతకాలానికి యాప్‌లో ఉన్న నంబర్‌కు కాల్ చేస్తే స్పందన లేదు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. ఒక్క హవేరీలోనే 15 మందికి పైగా మోసపోయారని పోలీసు అధికారులు వెల్లడించారు. -
అతను.. మాజీ సైనికుడు
విశాఖ సిటీ/మధురవాడ: సోషల్ మీడియాలో వైరల్ అయిన అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. విచారించగా అతడు ఆర్మీలో ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో 24 గంటల టెన్షన్‌కు తెరపడింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం పెద్ద గడ్డంతో సూట్ ధరించిన సుమారు 40 ఏళ్ల వ్యక్తి సిరిపురంలోని పలు ప్రాంతాల్లో ఫొటోలు తీశాడు. అతడు అనుమానాస్పదంగా తిరుగు తూ ఫొటోలు తీస్తుండడాన్ని అక్కడున్న స్థానికులు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. పాకిస్తాన్‌తో యుద్ధ నేపథ్యంలో ఆ వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి. అనుమానాస్పదంగా తిరుగుతూ ఫొటోలు తీస్తుండడంతో ప్రమాదకరమైన వ్యక్తిగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై సీపీ శంఖబ్రత బాగ్చి అతన్ని పట్టుకోవాలని ఆదేశించారు. ఆ వ్యక్తి కోసం నగరంలో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో గాలింపు చేపట్టారు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి కార్òÙడ్ జంక్షన్ వద్ద బస్సులో వెళ్తున్నట్లు పీఎంపాలెం సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది గుర్తించారు. అతన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేయగా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పక్కి గ్రామానికి చెందిన పెంకి ప్రవీణ్‌కుమార్‌గా తెలుసుకున్నారు. అతడు 2023లో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాడు. అతని తల్లిదండ్రులు, అన్నదమ్ములతో ఫోన్లో మాట్లాడారు. ఆ వ్యక్తి ఆర్మీ నుంచి రిటైర్ అయిన తరువాత కొంత కాలంగా మానసిక, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం అతడిపై ఎటువంటి నేరపూరితమైన, చెడు నడత ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో అతని బంధువులకు ఇచ్చి పంపించారు. సోషల్ మీడియా వెర్రి వెతలు. విశాఖలో అజ్ఞాత వ్యక్తి ఫోటోలు తీస్తూ అనుమానాస్పదంగా వున్నారంటూ వైరల్. పోలీసులు ఆరా తీయగా బొబ్బిలికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిగా గుర్తింపు.#AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews pic.twitter.com/VRhnK4IZo7— Vizag News Man (@VizagNewsman) May 10, 2025 -
'తొలి యూట్యూబ్ వీడియో' ..! ఇప్పటికీ 300 మిలియన్లకు పైగా వ్యూస్
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రారాజుగా నీరాజనాలు అందుకుంటోంది 'యుట్యూబ్'..!. దీని పుణ్యమా అని నేటితరం ఏదైనా అవలీలగా చిటికెలో నేర్చేసుకుంటోంది. ఏ చిన్న సందేహం వచ్చినా..యూట్యూబ్ సాయంతో చకచక తెలుసుకుంటున్నారు. అది కుకింగ్, చదువు, ఇతరత్రా ఏదైనా..క్షణాల్లో తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. అంతేగాదు ఈ యూట్యూబ్ సాయంతో ఎంతో మంది ఓవర్‌నైట్ స్టార్లుగా మారారు. పైగా ఎంతోమందికి జీవనోపాధిని అందించింది కూడా. అలాంటి యూట్యూబ్ ఫ్లాట్ ఫాంలో అప్లోడ్ అయినా తొలి వీడియో ఏదో తెలుసా..అది నేటికి నిశ్శబ్దంగా ఇంటర్నెట్ చరిత్రను సృష్టిస్తోంది. యూట్యూబ్‌ను ఫిబ్రవరి 14, 2005న జావేద్ కరీం, చాడ్ హర్లీ, స్టీవ్ చెన్, పేపాల్ తదితర వ్యక్తులు స్థాపించారు. ఇది ప్రస్తుతం గూగుల్ యాజమాన్యంలో ఉంది. అలా మొదలైనా యూట్యూబ్ ప్రస్థానం..ఎంతోమంది యంగ్ టాలెంట్‌ని వెలికితీసి పరిచయం చేసింది..వారి స్కిల్ ప్రపంచమే తెలుసుకునేందుకు వేదికగా మారింది. అంతేగాదు దీని సాయంతో కొందరూ కంటెంట్ క్రియేటర్లుగా మారి ప్రభంజనం సృష్టిస్తున్నారు కూడా. అలాంటి యూట్యూబ్ ఫ్లాట్ ఫాంపై అప్లోడ్ అయినా తొలి వీడియో ఏదో తెలుసా..!. ఇప్పటికీ అది మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతూ నెట్టింట చరిత్ర సృష్టిస్తోంది. పైగా అది జస్ట్ 19 సెకన్ల వీడియో. ఏప్రిల్ 23, 2005న, YouTube సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం శాన్ డియాగో ఓ జూ వద్ద నిలబడి చేసిన చిన్న వీడియో అది. సుమారు 20 ఏళ్ల క్రితం జావేద్ ఏనుగుల ముందు నిలబడి..వాటి గురించి మాములుగా చెబుతున్న సాధారణ వీడియో. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా..కనీసం వెనుక ఏవిధమైన సంగీత నేపథ్యం లేని సాదాసీదా వీడియో క్లిప్ అది. కానీ ఆ వీడియోకి గత కొన్నేళ్లుగా వస్తున్నా..వ్యూస్, లైక్‌లు చూస్తే మతిపోతుంది. ఇప్పటికీ ఆ ఈవీడియోకి 335 మిలియన్లకు పైగా వ్యూస్, 17 మిలియన్లకు పైగా లైక్‌లు ఉండటం విశేషం. మరో గమ్మత్తైన విశేషం ఏంటంటే.. కరీమ్ య్యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ అయినా ఏకైక వీడియో అదే కావడం. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి మరీ..!. (చదవండి: 24 ఏళ్లకే కంపెనీ రన్ చేశాడు ..28కే రిటైర్మెంట్! ఏకంగా రూ. 106 కోట్లు..) -
ఐదేళ్లుగా అదే పని.. మహిళలు స్నానం చేస్తుండగా..
వెంగళరావునగర్(హైదరాబాద్): మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిని మధురానగర్ అసోసియేషన్ నేతలు పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం... మధురానగర్‌కాలనీ కమ్యూనిటీహాల్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం విధులు నిర్వర్తిస్తోంది. వారి కుమార్తె సమీపంలోని చీరల దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పని చేస్తోంది. ఆమె సోమవారం ఉదయం విధులకు వెళ్లడానికి స్నానం చేస్తూ సబ్బు కోసం వెతికింది. అయితే ఆమెకు అక్కడ మొబైల్ ఫోన్ చేతిని తాకింది. భయపడి దుస్తులు ధరించి బయటకు వచ్చి చూడగా కమ్యూనిటీహాల్లో ఎలక్ట్రిషియన్‌గా విధులు నిర్వర్తించే వై.మరియాలి కుమార్ స్నానం గది కిటికీ పక్కన దాక్కుని ఉన్నాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయగా అతడు వచ్చి మరియాలి కుమార్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఫోన్‌తో సహా అతను పారిపోయాడు. విషయాన్ని బాధితురాలు సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రతాప్‌రెడ్డి తదితరులకు తెలియజేసింది. సంఘం నేతలు పోలీసులకు ఫోన్ చేసి ఎలక్ట్రిషియన్‌ను పట్టుకుని విషయాన్ని సేకరించారు. ఐదేళ్లుగా మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీస్తున్నట్లుగా అంగీకరించాడు. తాను తీసిన వీడియోలు, ఫొటోలు అన్నీ తొలగించినట్టుగా తెలియజేశాడు. అనంతరం నిందితుడిని కాలనీ నేతలు మధురానగర్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
కర్ణాటక: గతంలో తెరవెనుక జరిగే రొమాన్స్ నేడు వీధుల్లోకి వచ్చింది. మెట్రో రైల్వేస్టేషన్లో ఓ జంట పట్టపగలే అందరి ముందు ప్రేమ కలాపాల్లో మునిగిపోయిన వీడియో భారీ వైరల్‌గా మారింది.ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని మెజెస్టిక్ మెట్రోస్టేషన్ ఒకటో ప్లాట్‌ఫాంలో ఓ జంట, చుట్టుపక్కల ప్రయాణికులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యం ఎవరో మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ప్రేమికులు ప్రేమకలాపం చోటు చేసుకున్నది మెజెస్టిక్ మెట్రోస్టేషనా లేక మాదావర స్టేషన్‌లోనా అనే స్పష్టత లేనప్పటికీ అందరి ముందు ఇలా ప్రవర్తించడంపై ఆ జంటపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక నిమిషం 30 సెకండ్ల నిడివి ఉన్న ప్రేమికుల రొమాన్స్ వీడియోపై వేలాదిమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దృశ్యాలు విదేశాల్లో మాత్రమే చూడవచ్చు. ఇటీవల రోజుల్లో ఇక్కడ కూడా ఇలాంటి ప్రవృత్తి పెచ్చుమీరడం మంచిది కాదని సోషల్ మీడియాలో నెటిజన్ ఒకరు తెలిపారు. -
Delhi Metro: మరో వీడియో వైరల్.. ఈసారి మద్యం వంతు..
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రో(Delhi Metro)కు చెందిన మరో వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోలో మెట్రోలో కూర్చున్న ఒక ప్రయాణికులు ఒక చేతితో మద్యం గ్లాసు పట్టుకుని తాగుతూ, మరో చేతితో ఉడికించిన గుడ్డును తింటున్నాడు. తనను ఎవరైనా గమనిస్తున్నారా అని అటునిటు చూస్తూ మద్యం సిప్ చేస్తున్నాడు. దీనిని గమించిన ఒక ప్రయాణికుడు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించారు.Eggs & "Alcohol" in the Metro? That’s not breakfast - that’s a Breach !!Break the rules, Face the consequences, Rules aren’t suggestions: They’re the law.#DPUpdates pic.twitter.com/CP2P5fDFiW— Delhi Police (@DelhiPolice) April 9, 2025ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియా(Social media) ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేస్తూ ‘మెట్రోలో గుడ్లు, మద్యం తీసుకోవడం అనేది అల్పాహారమేమీ కాదు. ఇది నియమాల ఉల్లంఘన. ఇలా చేసినందుకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. అయితే మెట్రోలో కనిపించిన ఆ వ్యక్తి పోలీసులకు క్షమాపణలు చెబుతూ ‘ఆ వీడియోలో నేను గుడ్డు తింటూ, మద్యం తాగుతున్నట్లు కనిపించాను. కానీ అది మద్యం కాదు, అప్పీ ఫిజ్ (Appy Fizz)’ అని వివరణ ఇచ్చాడు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)ఈ ఘటనపై స్పందిస్తూ మెట్రోలో మద్యం సేవించడం నిబంధనలకు విరుద్ధమని, ప్రయాణికులు బాధ్యతాయుతంగా మెలగాలని సూచించింది. డీఎంఆర్సీ(DMRC) ఒక అధికారిక ప్రకటనలో ‘ఈ వీడియో ఉద్దేశపూర్వకంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. మద్యం సేవించడం లాంటి వ్యవహారాలు మెట్రో నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది’ అని పేర్కొంది. అలాంటి ఘటనలను ఎవరైనా చూస్తే, వెంటనే మెట్రో సిబ్బందికి లేదా సీఐఎస్ఎఫ్ అధికారులకు తెలియజేయాలని కోరింది. కాగా ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. కొందరు ఆ వ్యక్తి చర్యను తప్పుపట్టగా, మరికొందరు అతని వివరణ హాస్యాస్పదమని కామెంట్ చేశారు.ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ ఆరోపణలపై చైనా ఆగ్రహం -
ఏకంగా పోలీసు వాహనంతోనే రీల్!
సోషల్ మీడియాలో రీల్స్ మోజులో విచక్షణ మర్చిపోతున్నారు. కంటెంట్ కోసం, వ్యూస్ కోసం వాళ్లు సృష్టించా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఒక పిచ్చి పనికి లక్షల కొద్దీ వ్యూస్ రావడంతో ఇక అందరూ అదే బాటపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ ఈ రీల్స్ పురాణం చాలా పెద్దదే. తాజాగా నాగర్‌కర్నూల్‌కు చెందిన ఇద్దరు యువకులు పోస్ట్ చేసిన రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్‌తోనే రీల్స్ చేశారా యువకులు. ఇద్దరు యువకులు పోలీసు వాహనం నడుపుతూ.. రీల్స్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు వివాదా స్పద మయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఈగలపెంటలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. జిల్లాలోని ఈగలపెంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇన్నోవా టీఎస్ 09 పీఏ 4622 వాహనాన్ని మంగళవారం ఇద్దరు యువకులు నడుపుతూ రీల్స్ చేశారు. ఈగలపెంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ అధికారి బంధువులే.. దోమలపెంట సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన రీల్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. -
'ఇది నీకు సిగ్గుచేటు'.. బిల్‌గేట్స్ ఎదుటే నిరసన (వీడియో)
శుక్రవారం జరిగిన 50వ మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇజ్రాయిల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందిస్తుండటాన్ని వారు వ్యతిరేకించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ 'ముస్తఫా సులేమాన్' ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో ఈ పరిణామ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ముస్తఫా సులేమాన్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగి ఇబ్తిహాల్ అబౌసాద్ వేదిక వద్దకు వచ్చి ఆయన వ్యాఖ్యలకు అంతరాయం కలిగించారు. ముస్తఫా.. ఇది నీకు సిగ్గుచేటు. ఏఐను మంచి కోసం ఉపయోగిస్తున్నామని మీరు చెబుతున్నారు. కానీ గాజా ఘర్షణ సమయంలో ఇజ్రాయెల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందించి.. 50వేల మంది మరణానికి కారణమైంది. మైక్రోసాఫ్ట్ మారణహోమానికి సహాయం చేసిందని అన్నారు.నేను మీ మాటలు వింటున్నాను, థాంక్యూ అంటూ.. ఆమె మాటలకు ముస్తఫా స్పందించారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, సీఈఓ సత్య నాదెళ్ల, మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం మూడేళ్లు: హృదయాన్ని కదిలించే పోస్ట్ఇబ్తిహాల్ అబౌసాద్ నిరసన తెలిపిన తరువాత.. మరో ఉద్యోగి వానియా అగర్వాల్ కూడా నీరసం తెలిపారు. మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో వీరు నిరసన తెలిపినందుకు వారు తమ వర్క్ అకౌంట్ యాక్సెస్ కోల్పోయినట్లు సమాచారం. బహుశా వారిని ఉద్యోగంలో నుంచి తొలగించి ఉండొచ్చని తెలుస్తోంది.An employee disrupted Microsoft’s 50th anniversary event to protest its use of AI.“Shame on you,” said Microsoft worker Ibtihal Aboussad, speaking directly to Microsoft AI CEO Mustafa Suleyman. “You are a war profiteer. Stop using AI for genocide. Stop using AI for genocide in… pic.twitter.com/cfub3OJuRv— PALESTINE ONLINE 🇵🇸 (@OnlinePalEng) April 4, 2025 -
Myanmar: భూ ప్రకంపనల వైరల్ వీడియోలు
నేపిడా/బ్యాంకాక్: మయన్మార్(Myanmar)ను భూకంపం కుదిపేసింది. వందలాది భవనాలు నేల మట్టమయ్యాయి. మరణాల సంఖ్య లెక్కకు అందనంతగా ఉంది. ఇక నిరాశ్రయులైనవారి సంఖ్య చెప్పలేనంతగా ఉంది. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Dashcam footage of the powerful 7.7 magnitude earthquake in Myanmar Mandalay city#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/jzuRilDMsr— Culture War Report (@CultureWar2020) March 29, 2025మయన్మార్, థాయిలాండ్‌లలో సంభవించిన భూకంపానికి సంబంధించిన ఈ వీడియోలో ఆకాశహర్మ్యాలు ఊగడాన్ని చూడవచ్చు. రోడ్లపై వాహనాలు కదలడాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియో వణుకుపుట్టించేదిగా ఉంది.High-rise condo in Thailand with a pool on the 37th floor#Myanmar #Burma #Thailand pic.twitter.com/9tHDxZ7B4M— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియోలో ఆకాశహర్మ్యంలో నిర్మించిన స్విమ్మింగ్ ఫూల్లో అలలు ఏర్పడి, అవి ఎగసిపడటాన్ని చూడవచ్చు. దీనిని చూస్తే చాలు.. భూకంప తీవ్రతను అంచనా వేయవచ్చు.🧵 Extreme shaking going on in Myanmar during the 7.7 Earthquake#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/4jGeCgZJXc— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియోలో ఇంటిలో ఏర్పడిన భూకంప ప్రభావాన్ని చూడవచ్చు. చిన్న చెట్టును ఊపినప్పుడు అది ఎలా ఊగిపోతుందో ఆ విధంగా ఈ ఇల్లు భూకంప తీవ్రతకు ఊగిపోయింది.People trapped on the 78th floor Skywalk at Mahanakhon Building, Bangkok, during the 7.7 earthquake#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/j7WQYai24w— Culture War Report (@CultureWar2020) March 29, 2025స్కై వాక్ చేయడానికి 78వ అంతస్తుకు చేరుకున్న జనం భవనం కంపించడంతో ఎంతగా భయపడ్డారో ఈ వీడియోలో చూడవచ్చు. అక్కడున్న వస్తువులు జారిపోతుండటాన్ని గమనించవచ్చు.🧵 Mother Nature is Mind blowing The Earth was torn open today in Myittha, Mandalay Region, following the powerful 7.7 earthquake in Myanmar#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/tORlQD019c— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. భూమి పూర్తిగా చీలిపోయి, చాలా లోతైన పగుళ్లు ఏర్పడటాన్ని చూడవచ్చు.Narrowly escape! In #Bangkok, Thailand, a worker was cleaning the exterior walls while the building shook violently due to the #Myanmar earthquake, nearly hit by the falling glasses.#Myanmarquake #earthquakemyanmar pic.twitter.com/mDSB8MgiX4— Shanghai Daily (@shanghaidaily) March 29, 2025ఈ వీడియోలో భూకంపం తర్వాత ఆకాశహర్మ్యం పైకప్పుపై నుంచి నీరు జలపాతంలా పడటం కనిపిస్తుంది. భూకంపం సంభవించిన సమయంలో భవనాన్ని శుభ్రం చేస్తున్న వ్యక్తి ఎంతో భయపడుతూ కనిపిస్తున్నాడు.Devastating 7.7 Earthquake causes water to rise up from the ground in Myanmar pic.twitter.com/VFfT8qMLmU— TaraBull (@TaraBull808) March 29, 2025ఈ వీడియోలో భూమికి పగుళ్లు ఏర్పడిన దరిమిలా భూమి నుండి పంపు ద్వారా నీరు దానికదే ఉబికి రావడాన్ని గమనించవచ్చు.Nurses at a maternity center in Ruili, southwest China's Yunnan Province, did all they could to protect newborns when a deadly earthquake struck Myanmar, sending strong tremors across the border into Yunnan. #quake #heroes #China pic.twitter.com/KKhkxiDrKm— China Xinhua News (@XHNews) March 29, 2025ఈ వీడియో నైరుతి చైనాలోని ఒక ఆస్పత్రికి సంబంధించినది. భూకంపం సమయంలో నవజాత శిశువులను రక్షించడానికి నర్సులు పడుతున్న పాట్లను గమనించవచ్చు.ఇది కూడా చదవండి: ‘ప్రయాగ్‌రాజ్’కు పోటీగా నాసిక్ కుంభమేళా -
‘నీ ఇష్టమొచ్చింది చేసుకో’.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్ వీడియో
తెహ్రాన్ : ఇరాన్ ఎనభై ఐదు సెకన్ల నిడివిగల వీడియోతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రెచ్చగొట్టింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లో అణు ఒప్పందం చేసుకోబోమని పరోక్షంగా సంకేతాలిచ్చింది.ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు లేఖ రాశారు. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూనే ఆ దేశం చర్చలకు రావాలని ఆహ్వానించారు. అందుకు సుమారు రెండు నెలల డెడ్‌లైన్ విధిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై ఇరాన్ అధ్యక్షుడు స్పందిస్తూ.. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధం లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు.అయితే, ట్రంప్ విధించిన అణు ఒప్పందం డెడ్ లైన్ గడువు సమీపిస్తున్న తరుణంలో తన సైనిక విభాగం బలంగా ఉందని చెబుతూ ఇరాన్ ఎనభై ఐదు సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మిస్సైల్ సిటీ పేరుతో క్షిపణులను ఏర్పాటు చేసిన తన మూడవ అండర్‌గ్రౌండ్ ప్రదేశాల్ని క్యాప్చర్ చేసింది. అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌లో ఏర్పాటు చేసిన మిస్సైల్ సిటీలో భారీ అణు ఆయుధాల్ని మనం చూడొచ్చు. Iran is responding to external threats by releasing a new video showcasing one of its underground missile tunnel systems, packed with missile engines, mobile launchers, and a range of advanced weaponry. The footage prominently features the Paveh cruise missile, the Ghadr-380… pic.twitter.com/ILsdlrPtQy— Basha باشا (@BashaReport) March 25, 2025ఇక ఇరానియన్ రాష్ట్రీయ మీడియా ప్రసారం చేసిన 85 సెకన్ల వీడియోలో ఇరాన్ సైనిక సారథి మేజర్ జనరల్ మొహమ్మద్ హోసేన్ బాగెరీ, ఐఆర్సీజీ ఏరోస్పేస్ ఫోర్స్ చీఫ్ అమీర్ అలీ హాజిజాదెహోలు ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఆ క్షిపణుల్ని చూపిస్తున్నారు.ఇరాన్ మిస్సైల్ సిటీలో ఖైబర్ షెకాన్, ఘదర్-హెచ్,సెజిల్, పావే ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. ఈ అణు ఆయుధాల్ని ఇరాన్ ఇటీవల ఇజ్రాయిల్‌పై దాడి చేసేందుకు ఉపయోగించినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. -
‘డాన్స్ కోసం పుట్టి.. ప్రొఫెసర్ అయ్యారు’
బెంగళూరు: ఏదైనా కళాశాలో పంక్షన్ జరుగుతున్నప్పుడు విద్యార్థులు నృత్యం చేస్తుంటే, ఉపాధ్యాయులు వారిని ఉత్సహపరచడాన్ని, ఆనందించడాన్ని చూస్తుంటాం. అయితే దీనికి భిన్నమైన దృశ్యం బెంగళూరులో కనిపించింది. ఇక్కడి ఒక కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ విద్యార్థుల సమక్షంలో హిప్-హాప్ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. ఆ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఆ ప్రొఫెసర్‌ను ఉత్సాహపరుస్తుండగా, అతను డాన్స్ ఇరగదీయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు.గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ(Global Academy of Technology) (గాట్) విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ప్రొఫెసర్ పుష్ప రాజ్.. ప్లే అవుతున్న మ్యూజిక్కు అనుగుణంగా నృత్యం చేయడాన్ని చూడవచ్చు. మైఖేల్ జాక్సన్ తరహాలో నృత్యం చేశారు. కళాశాల కారిడార్‌లో ప్రొఫెసర్ నృత్యం చేస్తుండగా, విద్యార్థులు ఆనందంతో కేకలు వేశారు. కళాశాలలోని విద్యార్థులంతా అతని నృత్యాన్ని వీక్షించారు. ఈ వీడియో ఇప్పటికే 24 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుంది.ఈ వీడియోను చూసిన యూజర్స్ సోషల్ మీడియా(Social media)లో రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక యూజర్ ‘నృత్యకారునిగా పుట్టారు.. లెక్చరర్‌గా బలవంతంగా మారారు’ అని రాయగా, మరొకరు ‘అతను నా గురువు కాకుంటే, నాకు ఇష్టమైన హీరో అయ్యేవారు’ అని రాశారు. మరొకరు ‘అతను తనకు నచ్చని వృత్తిలో కొనసాగుతున్నారు’ అని రాశారు. మొరొకరు *అతను మాస్టర్ జీ కాదు..డ్యాన్స్ మాస్టర్ జీ’ అని రాశారు. View this post on Instagram A post shared by 🎥🚀 (@gatalbum)ఇది కూడా చదవండి: New Delhi: తృటిలో తప్పిన తొక్కిసలాట -
బీట్స్‌తో అదరగొట్టేసిన బుడ్డోళ్లు : 3 కోట్ల వ్యూస్, ఓ లుక్కేసుకోండి మరి!
‘బాల్యం బంగారు నిధి’ ఇది అందరం ఒప్పుకునే మాట. బాల్య స్మృతులు ఎవరికైనా చెప్పలేనంత ఉల్లాసాన్ని ఇస్తాయి. బాల్యం అనగానే అందమైన అనుభూతులు, అనుభవాలు ఒక్కసారిగా మనల్ని చుట్టుముడతాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించిన జ్ఞ్యాపకాలు ఒక్కసారిగా నిద్ర లేస్తాయి. చిన్నపుడు మనం చేసిన అల్లరి, చిలిపి చిలిపి చేష్టలు గుర్తొస్తాయి. బ్లాక్ బోర్డుపై రాసిన రాతలు, స్కూలు బెంచ్‌పై చెక్కుకున్నపేర్లు, అదేదో సినిమాలో అన్నట్టు నచ్చిన అమ్మాయిపై పేపర్ బాల్ విసరడం, అది మాస్టార్‌కు తగిలి, వీపు పగలడం ఇలా.. ఎన్నో..ఎన్నో గుర్తుకు వస్తాయి కదా. ఇపుడు మీరు చదవబోయే కథనం కూడా అలాంటి ఎన్నో అనుభవాలను గుర్తు చేస్తుంది. పుణేకు చెందిన విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.ప్రాజెక్ట్ అస్మి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఇది 3 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కమెంట్లు వెల్లువెత్తాయి. పూణేలోని ఒక పాఠశాల చెందిన బ్యాచ్ జామెట్రీ బాక్స్, బెంచె మీద వాయిస్తూ అద్భుతమైన సంగీతాన్ని సృష్టించారు. వాటర్ బాటిల్‌ను మాత్రమే ఉపయోగించి డ్రమ్ బీట్స్‌తో అదరగొట్టేశారు. ఒకరి తరువాత ఒకరు తమ టాలెంట్‌తో రెచ్చిపోయారు. దీంతో తరగతి గది ఒక చిన్న కచేరీ వేదికగా మారిపోయింది. దీంతో టీచర్లు కూడా అలా మైమరిచిపోయారు. చుట్టూ ఉన్న పిల్లలు, స్నేహితులు చప్పట్ల మోత మోగించారు. చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా? View this post on Instagram A post shared by Project Asmi (@projectasmi_pune)అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి విద్యార్థులు ఉత్పత్తి చేసే బీట్లు , రిథమ్‌లు భలే ఉంటాయి. వారి క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం. కల్మషం లేని లేత వయసులో వారి ప్రతిభను ,సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప ప్రతిభావంతులుగా మారతారు. మరి ఈ బాల శివమణిలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందో వేచి చూద్దాం. -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు అగ్రతారలు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇటీవలే రెండో టీజర్ విడుదల చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ మూవీ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఇందులో మంచు విష్ణు పలు అంశాలపై టీమ్‌తో చర్చిస్తూ కనిపించారు. ఈ సినిమా తెర వెనుక సంగతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The making of Kannappa#kannappa pic.twitter.com/hZCBKbjjYK— Vishnu Manchu (@iVishnuManchu) March 9, 2025 -
మరణశయ్యపై తల్లి.. కూతురి దుర్మార్గంపై కోర్టు కన్నెర్ర
కన్నతల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ కూతురేమో దుర్మార్గంగా ఆలోచించింది. ఆస్తి కోసం బలవంతంగా ఆమెతో వీలునామాపై సంతకం చేయించుకుంది. అయితే సాక్ష్యంగా ఉంటుందని ఆ కూతురు తీయించుకున్న వీడియోనే.. ఈ బండారం మొత్తాన్ని బయట పెట్టింది. దీంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది . యూకేలో ఓ వ్యక్తి మూడేళ్లపాటు చేసిన న్యాయ పోరాటం.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. సోదరుడిని మోసం చేసి ఆస్తి కొట్టేయాలని భావించిన ఓ మహిళకు పెద్ద షాకే తగిలింది. అతనికి 7 లక్షల పౌండ్ల విలువైన(మన కరెన్సీలో రూ.7 కోట్ల 86 లక్షల దాకా) విలువైన ఆస్తిపాస్తుల్లో సగం సోదరుడికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.కేసు ఇదే..మార్గరేట్ బేవర్స్టాక్(76) అనే మహిళ 2021 మార్చిలో కన్నుమూసింది. చనిపోయే టైంలో ఆమె తన ఆస్తి మొత్తం కూతురు లీసా పేరిట రాసింది. కొడుకు జాన్‌కు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అయితే మతిమరుపు జబ్బుతో బాధపడుతున్న తన తల్లి.. సోదరికి మాత్రమే ఆస్తి ఎలా రాయగలిగిందని అతనికి అనుమానం వచ్చింది. ఆస్తిలో వాటా కోరుతూ.. సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టులో పిటిషన్ వేశాడు.తన తల్లి 2014 నుంచే మతిమరుపు వ్యాధితో బాధపడుతోందని, ఆ వీలునామాపై అనుమానాలు ఉన్నాయని వాదించాడతను. అయితే తల్లి తన పేరిట రాసిన వీలుకు సంబంధించిన వీడియోను లీసా కోర్టులో ప్రవేశపెట్టింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి జేన్ ఇవాన్స్.. లీసాను గద్దించారు. అది బలవంతంగా చేయించుకున్నదేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆమె అతి కష్టంగా మాట్లాడుతోంది. పైగా పెన్నును ఆమెతో బలవంతంగా పెట్టించుకున్నట్లు కనిపిస్తోంది. వీలు కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన కాపీలా ఉంది అని జడ్జి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.జడ్జి కన్నెర్ర చేయడంతో లీసా నిజం ఒప్పుకుంది. అది ఆమె చనిపోతున్న సమయంలో తీసిందని తెలిపింది. తల్లికి ఉన్న ఆ జబ్బును ఆసరా చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని ప్రయత్నించినట్లు చెప్పింది. సాక్ష్యంగా ఉండాలని ఆ టైంలో వీడియో కూడా తీయించుకున్నట్లు తెలిపింది. దీంతో ఆస్తిలో సగం వాటా.. సోదరుడు జాన్‌కు అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. జాన్‌కు అయిన కోర్టు ఖర్చులను కూడా లీసానే భరించాలని ఆదేశించింది. -
అమెరికాలో కాల్పుల కలకలం.. వీడియో వైరల్
లూసియానా: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. లూసియానా(Louisiana)లోని ఫ్రాంక్లిన్టన్లో జరిగిన మార్డి గ్రాస్ పరేడ్‌లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల తర్వాత పరేడ్‌లో చోటుచేసుకున్న గందరగోళం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ బ్రేకింగ్ న్యూస్(Breaking News) ప్రత్యక్షమయ్యింది. BREAKING🚨: Several individuals were injured in a shooting that took place during a parade in Franklinton, Louisiana, a small town located in Washington Parish. The incident disrupted what was intended to be a festive community event.— Officer Lew (@officer_Lew) March 3, 2025 ఇది కూడా చదవండి: 9,000 హార్స్పవర్ రైలు ఇంజిన్ సిద్ధం.. ఎంత మాల్ లాగుతుందంటే.. -
మా గోడు వినండి..భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్త కథ
లక్నో: కట్టుకున్న భార్య (wife) రాచిరంపాన పెడుతోందంటూ జీవితాల్ని అర్థాంతరంగా జీవితాల్ని ముగుస్తున్న భర్తల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే బెంగళూరులో అతుల్ సుభాష్, కర్ణాటకలో ఓ కానిస్టేబుల్ తిప్పన్న.. రాజస్థాన్‌లో ఓ డాక్టర్ అజయ్.. ఇలా రోజుకొక ఉదంతం వెలుగులోకి వస్తోంది. ఇదిలా ఉండగానే.. ఉత్తరప్రదేశ్‌లో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ (tcs)లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న 25ఏళ్ల మానవ్ శర్మ(manav sharma) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 24న తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అయితే,మరణానికి ముందు మానవ్ శర్మ ఆవేదనతో కూడిన ఆరు నిమిషాల 50 సెకన్ల నిడివిగల ఓ వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో తన వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఇదే విషయంలో తనకు, తన భార్యకు గొడవలు జరిగేవని అన్నారు. అయినా తనలో మార్పు రాలేదన్నారు. మగాళ్లకు రక్షణే లేదామానవ్ శర్మ ఏడుస్తూ.. దేశంలో మహిళలను రక్షించేలా చట్టాలు ఉన్నట్లు.. పురుషులను రక్షించేలా చట్టాలు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. పురుషుల గురించి ఆలోచించండి’ అని న్యాయస్థానాల్ని వేడుకున్నాడు. పురుషులకు రక్షణ కల్పించకపోతే.. వారు అంతమవుతారని హెచ్చరించారు. కోడలి నిర్వాకం వల్లే ఈ సందర్భంగా తన మణికట్టుపై కత్తికోసుకున్న గుర్తులను చూపిస్తూ అంతకుముందు తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు శర్మ వెల్లడించాడు. నా మరణానంతరం నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని అర్జిస్తూ వీడియోను ముగించాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న శర్మ తండ్రి సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మరణానికి తన కోడలు కారణమని ఆరోపించారు.అన్నీ అవాస్తవాలేమానవ్ శర్మ ఆత్మహత్యపై ఆయన సతీమణి ఖండించారు. నా భర్త మద్యానికి బానిసయ్యారు. అతిగా మద్యం సేవించి పలుమార్లు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. మూడు సార్లు నేనే రక్షించా. మద్యం సేవించిన తరువాత నాపై దాడి చేసేవారు. ఇదే విషయాన్ని తన అత్తమామల దగ్గర ప్రస్తావించినా వారు పట్టించుకోలేదు.అవన్నీ పెళ్లికి ముందే.. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసంవివాహేతర సంబంధంపై మీడియా ఆమెను ప్రశ్నించగా..అవన్నీ పెళ్లికి ముందే. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసం’అని అన్నారు. ఈ సందర్భంగా వాట్సాప్ చాట్‌ను బహిర్ఘతం చేశారు. ఆ చాట్‌లో దీదీ, దయచేసి ఏదో ఒకటి చేయండి. తనను తాను చంపుకుంటాడు అని తన భర్త సోదరికి(వదిన) మెసేజ్ చేసింది. బదులుగా అతన్ని ఒంటరిగా ఉండనివ్వండి. నిద్రపోండి’ అని బదులిచ్చినట్లు గమనించవచ్చు.ఇప్పటి వరకూ జరగని అరెస్టులుమానవ్ శర్మ ఆత్మహత్యపై ఆగ్రా ఏఎస్పీ వినయక్ గోపాల్ మాట్లాడారు. ‘మాకు ఆగ్రాలోని మిలటరీ హాస్పిటల్లో మానవ్ మృతదేహం ఉందనే సమాచారం వచ్చింది. మానవ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. అతని ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. బాధితుడు రికార్డ్ చేసిన వీడియోను గుర్తించాం. అందులో తన భార్యతో విభేదాలు, ఇతర సమస్యల కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు గుర్తించామని’ చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్
-
వంశీపై అక్రమ కేసు.. వీడియో బయటపెట్టిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వల్లభనేని వంశీపై పెట్టిన అక్రమ కేసులో వీడియోను వైఎస్సార్సీపీ బయట పెట్టింది. షాపింగ్ చేస్తున్న సత్యవర్థన్ వీడియోను ఆ పార్టీ విడుదల చేసింది. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేసింది. ‘‘తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని.. న్యాయ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది’’ అని వైఎస్సార్సీపీ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది.‘‘ఈ వీడియోలో బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్. వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారంటూ పోలీసులు చెప్తున్న వ్యక్తి ఇతనే. మరి ఈ వీడియోను చూస్తే సత్యవర్థన్ కిడ్నాప్‌నకు గురైనట్టుగా ఉందా?’’ అని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.‘‘పోలీసులు ఆరోపిస్తున్న ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్లో ఒక బట్టల దుకాణంలో స్వేచ్చగా షాపింగ్ చేసుకుంటున్న సత్యవర్థన్ వీడియో ఇది. కిడ్నాప్ చేసి, నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు?. ఇలా స్వేచ్ఛగా షాపింగ్ ఎలా చేస్తారు?. దీని అర్థం పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. వారి కుటుంబ సభ్యులను భయపెట్టి, బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఈ వీడియో సాక్షిగా బయటపడింది’’ అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.💣 Truth Bomb 💣సత్యమేవ జయతేతీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న @ncbn సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది.ఈ వీడియోలో బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్. వల్లభనేని వంశీ కిడ్నాప్… pic.twitter.com/pAa5VMknV9— YSR Congress Party (@YSRCParty) February 26, 2025ఇదీ చదవండి: లోకేష్.. ఇవిగో ఆధారాలు..! -
‘ఏఐ ఏమైనా చేయగలదు’: సత్య నాదెళ్ల వీడియోకి మస్క్ రిప్లై
ఏఐని ఎక్కువగా విశ్వసించే ఎలాన్ మస్క్ (Elon Musk).. ఈసారి వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై విశ్వాసం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వీడియోను టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ రీషేర్ చేస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని మరింత నొక్కిచెప్పారు. "కృత్రిమ మేధ ప్రతిదాన్ని మెరుగుపరుస్తుంది" అని పేర్కొన్నారు.రైతులు తక్కువ వనరుల వినియోగంతో ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు ఎలా సహాయపడతాయో ఈ వీడియో చూపిస్తుంది. కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందిన భారతదేశంలోని బారామతి సహకార సంఘానికి చెందిన ఒక రైతు ఉదాహరణను సత్య నాదెళ్ల ఉదహరించారు.తక్కువ భూమి ఉన్న రైతులు పంట దిగుబడిలో గణనీయమైన మెరుగుదలను చూశారని, రసాయనాల వాడకం తగ్గిందని, నీటి నిర్వహణ మెరుగైందని చెప్పుకొచ్చారు. జియోస్పేషియల్ డేటా, డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి ఉష్ణోగ్రత డేటా, రియల్ టైమ్ సాయిల్ అనాలిసిస్ ద్వారా ఈ సమాచారం మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనుసంధానం చేస్తుందని తెలిపారు. రైతులు వారి స్థానిక భాషలో ఈ సమాచారాన్ని పొందవచ్చు.రియల్ టైమ్ అగ్రికల్చర్ డేటాతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిళితం చేయడం ద్వారా రైతులు మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఇది సుస్థిర వ్యవసాయ పద్ధతులకు దారితీస్తుందని, సామర్థ్యాన్ని పెంచుతుందని వివరించారు.ఆ వీడియో ఇదే.. మీరూ చూసేయండి..A fantastic example of AI's impact on agriculture. pic.twitter.com/nY9o8hHmKJ— Satya Nadella (@satyanadella) February 24, 2025 -
దయచేసి ప్రయాగ్‌రాజ్ రావొద్దు.. నెట్టింట పోస్టులు
ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళా ముగింపు వేళ ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ సంగమం వద్ద భక్తుల రద్దీ మరింత పెరిగింది. మహా శివరాత్రి పర్వదినాన పుణ్య స్నానాల కోసం ఇంకా కోట్ల మంది ఆధ్యాత్మిక నగరం(Devotional City Prayagraj) వైపు అడుగులేస్తున్నారు. ఈ తరుణంలో నగరవాసుల ప్రజల తరఫున ఓ విజ్ఞప్తి.. అక్కడ నెలకొన్న అధ్వాన్న పరిస్థితులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.‘‘మీకు దణ్ణం పెడతాం.. దయ చేసి ప్రయాగ్‌రాజ్ రావొద్దూ..’’ అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పోటెత్తుతున్న భక్తజనంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, అలాగే నగర సందర్శన పేరిట కొందరు ఇప్పటికే ఇక్కడి పరిస్థితిని అధ్వాన్నంగా మార్చేశారని వాపోతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.‘నేను ఎక్కడినుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ప్రయాగ్‌రాజ్ పూర్తిగా విధ్వంసకర దశకు చేరుకుంది. గత సంవత్సరమేమో కుంభమేళా ఏర్పాట్లకు సరిపోయింది. ఇక్కడి రోడ్లన్నీ తవ్వేశారు. ఫ్లై ఓవర్లు వేశారు. అయితే ప్రస్తుతం మహాకుంభమేళా చివరి అమృత స్నానం కూడా ముగిసింది. అయినా జనం తగ్గకుండా రోజురోజుకు పెరుగుతున్నారు ఎందుకో తెలియడం లేదు. ఇక్కడికి రావడం ఇక ఆపండి. భారీ జనసందోహాన్ని భరించే శక్తి ప్రయాగ్‌రాజ్(Pyagraj)కు ఎంత మాత్రం లేదు. నగరంలోని చిన్న చిన్న సందులు కూడా ట్రాఫిక్‌తో నిండిపోయాయి. జనాలకు సివిక్ సెన్స్ లేకుండా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ ఉమ్మేస్తున్నారు. మలమూత్ర విసర్జన చేస్తున్నారు’ అని మండిపడ్డాడు.మహా కుంభమేళా నేపథ్యంలో ఆధునీకరణ పేరిట వేల కోట్ల రూపాయలు కేటాయించింది యూపీ ప్రభుత్వం. కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లతో పాటు రకరకాల హంగుల నగరాన్ని ముస్తాబు చేసింది. అంతేకాకుండా.. భారీగా జనం వస్తారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టింది. అయితే.. మహా కుంభమేళా(Maha Kumbh Mela) ఆరంభం అయ్యాక ఆ పరిస్థితి దారుణంగా మారింది.అందంగా అలంకరించిన నగరాన్ని.. భక్తుల్లో కొందరు అధ్వాన్నంగా తయారు చేశారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. పాదాచారులు ఎక్కడపడితే అక్కడ చెత్తపడేయడం, మూత్రమలవిసర్జన చేసేయడంతో పరిస్థితి దారుణంగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగినా ఆ పరిస్థితి మార్పు రాలేదని చెబుతున్నారు. మరోవైపు.. దారులన్నీ జనం, వాహనాలతో నిండిపోయాయి. ఆఖరికి.. ఇరుకు సందులను కూడా వదలకుండా ట్రాఫిక్‌తో నింపేస్తున్నారు.ఇక.. ప్రైవేట్ వాహనాల దోపిడీ దందా, రోడ్లపై ఇష్టానుసారం సంచరించం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంటున్నారు మరికొందరు. కుంభమేళా ముగుస్తుందనగా.. రద్దీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎందుకు?. గంగానదీ.. త్రివేణి సంగమం ఎక్కడికి పోదు కదా.. తీరికగా వచ్చి పుణ్యస్నానాలు చేసుకోవచ్చు కదా అంటూ కొందరు.. ఇంకోసారి ప్రయాగ్‌రాజ్ వైపు రావొద్దంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. -
సెలక్షన్స్‌పై ‘వీడియో’ కన్ను
న్యూఢిల్లీ: క్రీడాకారులు, జట్ల సెలక్షన్ ట్రయల్స్‌పై పదేపదే వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కేంద్ర క్రీడా శాఖ సిద్ధమైంది. దీనికి శాశ్వత పరిష్కారంగా ఇక మీదట జరిగే ఎంపిక ప్రక్రియనంతా వీడియో రూపంలో తీయనుంది. తద్వారా అర్హులైన ప్రతిభావంతులకే బెర్త్‌లు లభించేలా చూడనుంది. ప్రతి ఒక్కరి సెలక్షన్ ప్రదర్శన వీడియోలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి విమర్శలకు తావుండదు. ‘ఇకపై అన్ని సెలక్షన్ ట్రయల్స్‌పై వీడియో నిఘా పెడతాం.పారదర్శకత, న్యాయబద్ధమైన ఎంపికలకు ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. దీనివల్ల క్రీడాకారులకు మేలు జరుగుతుంది. ప్రదర్శనే ఎంపికకు గీటురాయి అవుతుంది. మెరిట్ కనబరిచిన వారే భారత జట్లకు ఎంపికవుతారు. ఇందులో క్రీడా సమాఖ్యలు ఇష్టారీతిన వ్యహరించేందుకు వీలుండదు. క్రీడా శాఖ అధికారులు, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులు పర్యవేక్షకులుగా హాజరవుతారు. ఇకపై ప్రతీ క్రీడాంశంలో దీన్ని అమలు చేస్తాం’ అని క్రీడా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. షూటింగ్, రెజ్లింగ్‌లలో జరిగే సెలక్షన్ ట్రయల్స్ ప్రతీసారి విమర్శలపాలవుతోంది. రెజ్లింగ్ సమాఖ్య అయితే పతకాల కంటే కూడా ఈ తరహా వివాదాలు, విమర్శలతోనే వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే! భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) వ్యవహారాల వల్ల అర్హత ఉండి, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. ఈ సీజన్లో తొలి రెండు ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లకు భారత రెజ్లర్లు దూరమయ్యారు. దీనిపై క్రీడాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే ఈ శాఖ గుర్తింపు ఉన్న జాతీయ సమాఖ్యలకు ఢిల్లీలోని స్టేడియాల్లో ఆఫీస్ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టారు. దీనివల్ల ఢిల్లీకి వచ్చిన లేదంటే ఢిల్లీ నుంచి అంతర్జాతీయ టోర్నీలకు బయలుదేరే ఆటగాళ్లకు ఆయా సమాఖ్యలు సమన్వయంతో సేవలందించేందుకు వీలవుతుంది. గతంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రీడా సమాఖ్యల కార్యాలయాలు ఉండేవి. కానీ 2010 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం కోసం ఆ స్టేడియాన్ని నవీకరించడంతో సమాఖ్యల ఆఫీసుల్ని అక్కడి నుంచి తరలించారు. -
Delhi: కొత్త సీఎం రేఖా గుప్తా కుమారుని వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తా(Rekha Gupta) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. తాజాగా ఆమె కుమారుడు నికుంజ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఒక మహిళకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడం ఆనందించాల్సిన విషయం. #WATCH | Delhi CM-designate Rekha Gupta's son, Nikunj says, "It is good that a woman has been given the opportunity to be the CM. We are confident that she will be able to shoulder her responsibility very well. Her 30-year-long hard work has proved to be successful. She has… pic.twitter.com/UXesCIMM8g— ANI (@ANI) February 20, 2025 ఆమె ఈ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించగలదని నేను నమ్ముతున్నాను. ఆమె 30 ఏళ్ల కష్టానికి తగిన ఫలితం లభించింది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమెకు ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి మోదీ(Prime Minister Modi)కి, పార్టీకి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. రేఖా గుప్తా అత్త మీరా గుప్తా తన కోడలికి అభినందనలు తెలిపారు. #WATCH | Delhi CM-designate Rekha Gupta's mother-in-law Meera Gupta says, "...Work well."When asked if she sends her best wishes to the CM-designate, she says, "Yes, certainly..." pic.twitter.com/vTaT3RWgZq— ANI (@ANI) February 20, 2025 ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తా క్యాబినెట్ మంత్రులలో ఎవరి విద్యార్హతలేమిటి? -
వలసదారులకు సంకెళ్లు.. వైట్‌హౌజ్ వివాదాస్పద వీడియో
వాషింగ్టన్: అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి అవమానకరంగా పంపిస్తున్నారని భారత్‌తో సహా ఇతర దేశాల్లో అమెరికాపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో విమర్శలు గుప్పిస్తోంది. అమెరికా ఇప్పటివరకు భారత్‌కు పంపించిన వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి అవమానకర రీతిలో తీసుకువచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.ఈ ఆరోపణలకు ఊతమిచ్చేలా వైట్‌హౌజ్ తాజాగా ఓ వివాదాస్పద 41 నిమిషాల నిడివి గల వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. అక్రమ వలసదారులను విమానం ఎక్కించేముందు వారికి సంకెళ్లు వేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అలాగే వారికి వేయడానికిగాను గొలుసులను పోలీసులు సిద్ధం చేస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. అయితే విమానం ఎక్కుతున్న అక్రమ వలదారుల ముఖాలు మాత్రం వీడియోలో కనిపించలేదు. ASMR: Illegal Alien Deportation Flight 🔊 pic.twitter.com/O6L1iYt9b4— The White House (@WhiteHouse) February 18, 2025కాగా, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకు సంకెళ్లు వేసి తరలిస్తున్న అంశంలో ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ కూడా ఏమీ చేయలేకపోయారని కాంగ్రెస్ మండిపడుతోంది. ఇంతకుముందు ఇదే విషయమై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందిస్తూ మహిళలకు, పిల్లలకు సంకెళ్లు వేయడం లేదని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. -
మరో వీడియో విడుదల చేసిన కిరణ్ రాయల్ బాధితురాలు
సాక్షి, తిరుపతి: కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి మరో వీడియో విడుదల చేశారు. ‘‘నేను జైపూర్ నుంచి తిరుపతికి క్షేమంగా వస్తానన్న నమ్మకం లేదు.. నా పిల్లలకు ఏమైనా జరిగితే కిరణ్ రాయలే కారణం’’ అంటూ ఆమె సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ‘‘నేను తిరుపతిలో కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేశా. ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారంలో ఉన్నవాళ్లకే పోలీసులు అండగా ఉంటారా?’’ అని లక్ష్మి ప్రశ్నించారు.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అభ్యర్థించినా నాకు న్యాయం జరగలేదు. నేను తిరుపతికి వచ్చిన వెంటనే మరో వ్యక్తి ఉన్నాడు ఆ వీడియోను కూడా రిలీజ్ చేస్తాను’’ అని లక్ష్మి పేర్కొన్నారు. కాగా, కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ గత కొద్దిరోజులుగా న్యాయ పోరాటం చేస్తోన్న బాధితురాలు లక్ష్మిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆమెకు జైపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఇదీ చదవండి: జనసేన కిరణ్ రాయల్‌కు షాక్కాగా, తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ మొదటిసారిగా లక్ష్మి విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో కూడా సంచలనంగా మారింది.సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇవాళ బెయిల్ వచ్చిన తర్వాత లక్ష్మి మరో వీడియో విడుదల చేశారు.ఇదీ చదవండి: జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. వీడియో వైరల్ -
‘అద్భుత స్వాగతం’.. పారిస్ నుంచి ప్రధాని మోదీ వీడియో
పారిస్: ప్రధాని నరేంద్ర మోదీ ఐదురోజుల విదేశీ పర్యటన సందర్భంగా సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని మోదీని కౌగిలించుకుని స్వాగతించారు. తన ప్రాన్స్ పర్యటనకు సంబంధించి ప్రధాని మోదీ తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఒక పోస్టు చేశారు. Here are highlights from the memorable welcome in Paris yesterday. pic.twitter.com/lgsWBlZqCl— Narendra Modi (@narendramodi) February 11, 2025‘తన స్నేహితుడు, అధ్యక్షుడు మాక్రాన్‌ను పారిస్‌లో కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’ అని మోదీ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మాక్రాన్ పారిస్‌లో అందించిన విందులో ప్రధాని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు. ప్రధాని మోదీ మంగళవారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ‘సోమవారం పారిస్‌లో జరిగిన చిరస్మరణీయ స్వాగతానికి సంబంధించిన వీడియో’ అని దానిలో రాశారు.Un chaleureux accueil à Paris !Le froid n'a pas découragé la communauté indienne de venir montrer son affection ce soir. Je suis reconnaissant à notre diaspora, et fier de ses accomplissements ! pic.twitter.com/rQSsI5njfN— Narendra Modi (@narendramodi) February 10, 2025మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌లో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో చర్చలు జరిపారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక పోస్ట్‌లో తెలిపింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్లో‘పారిస్‌లో అద్భుతమైన స్వాగతం లభించింది. వాతావరణం ఎంతో చల్లగా ఉన్నప్పటికీ, ఇక్కడి భారతీయులు ఆప్యాయతను చూపించారు. అందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. వారు సాధించిన విజయాలకు గర్విస్తున్నాను. ప్రపంచ నేతలు, ప్రపంచ సాంకేతిక సీఈఓల ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు సహ అధ్యక్షత వహించడానికి ఎదురు చూస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: స్టేషన్లో రద్దీ.. ఏసీ కోచ్ అద్దాలు బద్దలు కొట్టి.. -
జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. వీడియో వైరల్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్‌రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పిందంటే.. ‘నా పేరు లక్ష్మి. నేను ఒకర్ని నమ్మి మోసపోయాను. అప్పులు చేసి రూ.1.20 కోట్లు ఇచ్చాను. డబ్బులు అడిగితే పిల్లల్ని చంపుతానని బెదిరించి.. ఇంకా ఎన్నో చేసి నాతో వీడియో రికార్డు చేయించుకున్నారు.కేవలం రూ.30 లక్షలకు బాండ్లు, చెక్కులు రాయించాడు. నా వద్ద అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. పిల్లలు అడుగుతున్నారు. వారికి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇంక నేను బతకలేను. కిరణ్ రాయల్ వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు మా పిల్లలకు చెందుతాయని ఆశిస్తున్నాను’ అంటూ మహిళ వాపోయింది. శనివారం ఆ వీడియో బయటకు రాగా.. వెంటనే స్పందించిన కిరణ్ రాయల్ ఆమెకు ఫోన్‌చేసి నానా బూతులు తిడుతూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగినట్టు ఆ మహిళ కిరణ్‌రాయల్ వాయిస్ రికార్డును విడుదల చేశారు. వీడియో వైరల్ అయ్యాక కిరణ్‌రాయల్ మీడియా సమావేశం నిర్వహించి.. ఆమె కిలాడి లేడీ అని, బెట్టింగ్‌ల కారణంగా అప్పుల పాలైందని, ఆ కుటుంబాన్ని తానే రక్షించానని చెప్పుకొచ్చారు.బాధితురాలు ఏమంటోందంటే..తిరుపతి మండలం చిగురువాడకు చెందిన లక్ష్మి ప్రస్తుతం తిరుపతి ఎంఆర్ పల్లిలో నివాసం ఉంటోంది. చిగురువాడలో ఉండే సమయంలో కిరణ్‌రాయల్ తన నివాసం పక్కనే వచ్చి చేరాడని లక్ష్మి చెబుతోంది. తనతో ఉన్న పరిచయం మేరకు డబ్బులు అడిగేవాడని.. కిరణ్ రాయల్ వాడుతున్న కారు, ఇంటికి కూడా తాను అప్పులు చేసి కొంత, ఎకరం భూమిని అమ్మి మరికొంత డబ్బులు ఇచ్చినట్టు తెలిపింది. మొత్తంగా రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చినట్టు వివరించింది. ఈ విషయం తెలియడంతో భర్త, కుటుంబీకులు నిలదీయగా.. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు లక్ష్మి వెల్లడించింది.భర్త మరణించాక పిల్లల చదువులు, కుటుంబ పోషణకు డబ్బులు అడిగినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన డబ్బుకు రెండింతలు ఇస్తానని.. మూడు నెలలు ఆగమని ఒప్పించినట్టు తెలిపింది. ఆ తరువాత డబ్బు అడుగుతుంటే.. రూ.30 లక్షలకు బాండు పేపర్లు, చెక్కులు ఇచ్చారని చెప్పింది. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు తీవ్రం కావడం, కుటుంబంలో తీవ్ర ఇబ్బందులు రావటంతో కిరణ్ రాయల్కి ఫోన్‌చేసి గట్టిగా మాట్లాడినట్టు తెలిపింది. అయినా అతడి బెదిరింపులు తారస్థాయికి చేరటంతో వీడియో రిలీజ్చేసి ఆత్మహత్యకు యత్నించినట్టు వివరించింది.బూతులు తిడుతూ..వీడియో వైరల్ కావడంతో జనసేన నేత కిరణ్‌రాయల్ మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మి కిలాడి లేడీ అని, ఆమెపై జైపూర్, విశాఖ, బెంగళూరులో కేసులు ఉన్నాయని ఆరోపించారు. బెట్టింగ్‌లు, రకరకాల వ్యవసనాలతో ఆమె అప్పులు పాలైందని, ఆ కారణంగానే లక్ష్మిని తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేస్తే తానే విడిపించానని చెప్పారు. కాగా.. వీడియో వైరల్ అయిన వెంటనే.. కిరణ్ రాయల్ లక్ష్మికి ఫోన్‌చేసి నానాబూతులు తిడుతూ.. చంపేస్తానని, ఆ తరువాత నెలలో బయటకు వస్తానంటూ తీవ్రస్థాయిలో బెదిరించిన వాయిస్‌ను లక్ష్మి మీడియా ముందు వినిపించారు.తన కార్యాలయానికి వచ్చి బెదిరించి వెళ్లిన వీడియోలను కూడా మీడియాకు చూపించారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వారం కాదని, తనకు శత్రువులు లేరని, ఏదైనా జరిగితే కిరణ్‌రాయల్ వల్లే అని లక్ష్మి మీడియా ముందు వెల్లడించారు. కిరణ్ రాయల్ అరాచకాలకు సంబంధించిన ప్రతి దానికి ఆధారాలు తన వద్ద ఉన్నాయని వివరించారు. కిరణ్‌రాయల్ తనకు ఫోన్‌చేసి మాట్లాడిన మాటలకు సంబంధించి 10 వాయిస్ రికార్డులను లక్ష్మి విడుదల చేశారు. ఆ వాయిస్‌లో పత్రికలో రాయలేని విధంగా బూతులు మాట్లాడుతూ.. చంపేస్తానంటూ బెదిరించిన రికార్డులు ఉన్నాయి. -
Delhi Election 2025: కేజ్రీవాల్ ఇంటికి ‘బేబీ మఫ్లర్ మ్యాన్’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢ్లిలీలోని మొత్తం 70 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు((శనివారం) జరుగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం చూసుకుంటే బీజేపీ ముందంజలో ఉంది. #WATCH | Delhi: A young supporter of AAP National Convenor Arvind Kejriwal, Avyan Tomar reached the residence of Arvind Kejriwal dressed up as him to show support. pic.twitter.com/dF7Vevy6En— ANI (@ANI) February 8, 2025 ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి 'బేబీ మఫ్లర్ మ్యాన్' వచ్చాడు. ఇతని పేరు అవ్యాన్ తోమర్. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆయన ధరించిన లాంటి దుస్తులు ధరించి వచ్చాడు. కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న అవ్యాన్ తోమర్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్నికల ఫలితాల రోజున ఇక్కడికి వస్తుంటామని, ఆమ్ ఆద్మీ పార్టీనే మా కుమారునిని ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ అనే పేరు పెట్టిందని తెలిపారు. #WATCH | Delhi: Avyan Tomar's father, Rahul Tomar says, "... We always come here on result days... The party has also given him the name of 'Baby Muffler Man'..." pic.twitter.com/cMdDc3sGWf— ANI (@ANI) February 8, 2025 -
మీరందరూ తప్పకుండా ఇలా చేయాలనేదే నా కోరిక: సమంతా
ఉదయం ధ్యానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. రోజంతా గడపడానికి కావల్సిన శక్తి, శాంతి లభిస్తుంది.ధ్యానం అనేది శరీరం మనస్సును ఏకీకృతం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఏకాగ్రత, విశ్రాంతిని అందిస్తుంది.భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా, స్థిరమైన ఆలోచనలను అందిస్తుంది. చాలామందికి, ఇదొక ఆధ్యాత్మిక అనుభవం. ఈవిషయాన్ని స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో వివరించింది.ప్రతిరోజూ కేవలం 15 నిమిషాల ధ్యానం ఆరోగ్యానికి చాలామందని సూచించింది. నిశ్శబ్దంగా కూర్చని, శ్వాసమీద ధ్యాస పెడితే ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ధ్యానంతన జీవితంలో చాలా బాగా పనిచేసిందని తెలిపింది. ఒక ప్రశాతమైన ప్రవాహంలోకి పయనించడానికి ధ్యానానికి మించింది లేదని పేర్కొంది. ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా, తనలోని ఆ నిశ్శబ్ద ప్రదేశం ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మీరు మెడిటేషన్‌ను ఎన్నుకుంటే అన్ని గందగగోళాలనుంచి శాంతి లభిస్తుందని తెలిపింది. మీ మనస్సులోని ఆలోచనల గురించి చింతించకండి. వాటిని పక్కన పెట్టడమే ఉపాయం. మీరందరూ ప్రయత్నించాలని నేను కోరుకునేది ఏదైనా ఉంటే, అది ఇదే అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)ధ్యానం వలన లాభాలు ,ఎపుడు ప్రారంభించాలి.ధ్యానం ఉదయం, సాయంత్రం, నిర్ణీత సమయంలో ఆచరిస్తే మంచిది. వాస్తవానకి ధ్యానం చేయడానికి "చెడు" సమయం అంటూ ఏమీ ఉండదు. నిబద్ధతతో, పట్టుదలగా చేయడమే ముఖ్యం. రిలాక్స్‌గా , సౌకర్యవంతంగా ఉన్న వాతావరణంలో ధ్యానాన్ని ఆచరించాలి. అయితే ఉదయం ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మెండు అని చెబుతారు. ఒక పది లేదా పదహేను నిమిషాలు పాటు మనతో మనం కనెక్ట్ అయ్యే అవకాశం.కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన సర్టిఫైడ్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్ ఇంటిగ్రేటివ్ వెల్నెస్ ఎక్స్పర్ట్ అభిప్రాయం ప్రకారం ఉదయం ధ్యానం చేయడం వల్ల రోజంతా ఆ సానుకూల ప్రభావం కొనసాగుతుంది. ప్రశాంతంగా, విషయాలమీద మనస్సును కేంద్రీకరించేలా, ఒత్తిడిని, భావోద్వేగాల్ని అదుపు చేసుకోవడంలో సాయడపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన రోజుల్లో అయితే ఆందోళనను తగ్గిస్తుంది. ఓరిమి పెరుగుతుంది. 8 వారాల పాటు రోజుకు13 నిమిషాలు ధ్యానం చేసేవారిలో సానుకూల మార్పులు కనిపించినట్టు అధ్యయనం తేలింది.ఇదీ చదవండి: అతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో!ధ్యానం, రకాలుశ్రద్ధ ధ్యానంఆధ్యాత్మిక ధ్యానందృష్టి ధ్యానంమంత్ర ధ్యానంఅతీంద్రియ ధ్యానంలవింక్ కైండ్‌నెస్ ధ్యానంవిజువలైజేషన్; వాకింగ్ ధ్యానం, శ్వాసమీద ధ్యాస ఇలా పలు రకాలున్నాయి. -
భీమిలిలో దారుణం.. బాలిక వీడియో చిత్రీకరించి..
సాక్షి, విశాఖపట్నం: భీమిలిలో దారుణం జరిగింది. బాలిక న్యూడ్ వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్న కామాంధుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. బాలిక దుస్తులు మార్చుకుంటుండగా గాజువాకకు చెందిన సమీప బంధువు జానకిరామ్ (53).. నగ్న వీడియోలు తీసి తల్లిని బెదిరించాడు. కుమార్తె నగ్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసిన జానకిరామ్.. వివాహిత నుండి పలుమార్లు లక్షల్లో వసూలు చేశాడు. దీంతో భీమిలి పోలీసులను బాధిత మహిళ ఆశ్రయించింది. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.చిట్టివలసలో తల్లి, కూతురు ఆత్మహత్యమరో ఘటనలో భీమిలిజోన్ చిట్టివలసలో తల్లి, ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ మృతి చెందిన తల్లి, ఒక కుమార్తె మృతి చెందారు. భర్త రామకృష్ణ దివీస్ ఉద్యోగి. భర్తతో మనస్పర్థల కారణంగా ఇద్దరి పిల్లలకు పురుగుల మందు తాగించిన తల్లి.. తాను తాగింది. తల్లి మాధవి(25), కూతురు రితిక్ష (2) మృతి చెందారు. మరో కుమార్తె ఇషిత (5) హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. -
ఇజ్రాయెల్ టీనేజర్ బందీ వీడియో...విడుదల చేసిన హమాస్
జెరూసలేం: ఏడాదికి పైగా బందీగా ఉన్న 19 ఏళ్ల ఇజ్రాయెల్ సైనికురాలి వీడియోను హమాస్ విడుదల చేసింది. మూడున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో అల్బాగ్ హిబ్రూ భాషలో మాట్లాడారు. తనను 450 రోజులకు పైగా నిర్బంధించారని, ఇజ్రాయెల్తనను, ఇతర బందీలను మరిచిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన వయసు 19 ఏళ్లని, కానీ ఇప్పుడు జీవితం మొత్తం తన కళ్లముందుందని చెప్పారు. వీడియో తమ గుండెను ముక్కలు చేసిందని అల్బాగ్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. కూతురు వీడియో చూసిన అనంతరం వారు ఓ వీడియో ప్రకటన చేశారు. తమ కూతురు తీవ్ర మానసిక క్షోభను అనుభవించినట్లు కనిపిస్తోందన్నారు. ఆమె క్షేమంగా విడుదలయ్యేలా చూడాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు విజ్ఞప్తి చేశారు. బందీల కుటుంబాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అల్బాగ్ కుటుంబ ప్రకటనపై ప్రధాని స్పందించారు. బం«దీలను స్వదేశానికి రప్పించేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు. బందీలకు హాని తలపెట్టే సాహసం చేసే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కుటుంబం అనుమతితో... సాధారణంగా కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా హమాస్ విడుదల చేసే బందీల ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ మీడియా ప్రచురించదు. వీడియోను విడుదల చేయడానికి అల్ బాగ్ కుటుంబం తొలుత నిరాకరించినా.. తరువాత అంగీకరించింది. బందీల ఫొటోలు, వీడియోలను హమాస్ ప్రచురించడాన్ని ఇజ్రాయెల్ గతంలో ఖండించింది. "Liri, if you're hearing us, tell the others that all the families are moving heaven and earth. We will fight until all hostages are returned"Eli and Shira Albag , Liri Albag's Parents, called the Prime Minister and Defense Minister, after watching her video from captivity,… pic.twitter.com/Y9xAh47W7O— Bring Them Home Now (@bringhomenow) January 4, 2025హమాస్ చెరలో 96 మంది.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి సమయంలో 250 మందిని బందీలుగా గాజాకు తరలించారు. వారిలో కొందరిని రక్షించారు. 34 మంది మరణించారు. ప్రస్తుతం హమాస్ చెరలో 96 మంది మిగిలారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్)లో నిఘా సైనికురాలిగా ఉన్న లిరీ అల్బాగ్ను గాజా సరిహద్దులోని నహల్ ఓజ్ సైనిక స్థావరంలో ఉండగా హమాస్ ఉగ్రవాదులు పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సైతం బంధించారు. వీరిలో ఒకరిని రక్షించగా, మరొకరు హత్యకు గురయ్యారు. అల్బాగ్తోపాటు నలుగురు బందీలుగా మిగిలారు. చర్చల నేపథ్యంలో వీడియో.. ఖతార్‌లో ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు కాల్పుల విరమణ చర్చలు పునఃప్రారంభమయ్యాయి. చర్చల్లో మధ్యవర్తులుగా ఖతార్, ఈజిప్‌్ట, అమెరికాలు ఉన్నాయి. ఒప్పందం కోసం నెలల తరబడిగా చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. తాజాగా శుక్రవారం నుంచి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 70 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో హమాస్ లిరీ వీడియోను విడుదల చేసింది. ఇదీ చదవండి: గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు -
ఎంటర్టైన్మెంట్ ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్: ప్రభాస్
డ్రగ్స్ నిర్మూలనకు టాలీవుడ్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ తన స్వరం కలిపారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. లైఫ్‌లో మనకు బోలెడన్నీ ఎంజాయ్ మెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయని ప్రభాస్ అన్నారు. మనల్ని ప్రేమించే వారు, మనకోసం బతికే మనవాళ్లు ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? అని ప్రభాస్ ప్రశ్నించారు. సే నో టూ డ్రగ్స్ అంటూ అభిమానులను, సినీ ప్రియులను ప్రభాస్ కోరారు. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే 8712671111 నెంబర్‌కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్తుకు బానిసలైనవాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వీడియోలో ప్రభాస్ మాట్లాడారు. -
పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియో
సూపర్ స్టార్ 'రజనీ కాంత్' రోబో సినిమా వచ్చిన తరువాత.. బహుశా రోబోలు ఇలాగే ఉంటాయేమో అని చాలామంది భావించారు. అయితే ఇటీవల టెస్లా రూపొందించిన నడిచే రోబోకు సంబందించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పుడు చైనా కంపెనీ ఏకంగా పరుగెత్తే రోబోను తయారు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.చైనీస్ కంపెనీ ‘రోబో ఎరా’ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసింది. ‘స్టార్1’ పేరుతో రూపొందించిన ఈ రోబో శరవేగంగా పరుగులు తీయగలదు. ఇది గంటకు 8 మైళ్లు (12.98 కి.మీ.) వేగంతో పరుగెడుతోంది. ఈ రోబోకు హైటార్క్ మోటార్లు, ఏఐ సెన్సార్లు అమర్చడం వల్ల.. ఇది ఎలాంటి ఎగుడు దిగుడు దారుల్లోనైనా అదే వేగంతో పరుగెతూనే దాటేస్తుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు‘రోబో ఎరా’ చూడటానికి సగటు మనిషి పరిమాణంలోనే 5.6 అడుగుల ఎత్తు, 64.86 కేజీల బరువుతో ఉంటుంది. ఇలాంటి పరుగుల రోబోలను ‘టెస్లా’ కంపెనీ ‘ఆప్టిమస్’ పేరుతోను, ‘బోస్టన్ డైనమిక్స్’ కంపెనీ ‘అట్లాస్’ పేరుతోను రూపొందించాయి. అయితే, ‘రోబో ఎరా’ తాజాగా రూపొందించిన ‘స్టార్ 1’ వాటి కంటే వేగంగా పరుగులు తీయగలగడంతో, అత్యంత వేగవంతమైన రోబోగా రికార్డు సాధించింది. -
Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు చూశారా?
-
26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా జరిగింది!
ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ (Elon Musk) తన ఎక్స్ ఖాతాలో ఓ పాత వీడియోను షేర్ చేశారు. ఇందులో ఇంటర్నెట్ అనేది.. మీడియాలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని పేర్కొన్నారు. 1998లో చెప్పిన ఆ మాటలే నేడు నిజమయ్యాయి.26 సంవత్సరాల క్రితం 1998లో 'మస్క్'ను ఒక ఇంటర్వ్యూయర్ ఇంటర్నెట్ భవిష్యత్తు గురించి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ''ఇంటర్నెట్ అన్ని మీడియాల సూపర్‌సెట్ అని నేను భావిస్తున్నాను" అని మస్క్ పేర్కొంటూ.. మీడియాకు ఇంధనం ఇంటర్నెట్ అని వివరించారు.ఇంటర్నెట్.. వినియోగదారులు తాము చూడాలనుకుంటున్న వాటిని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇది తప్పకుండా సాంప్రదాయ మీడియాలను విప్లవాత్మకంగా మారుస్తుందని మస్క్ స్పష్టం చేశారు. అప్పుడు నేను చెప్పిన మాటలకు చాలామంది నన్ను వెర్రివాడిగా భావించారని మస్క్ లేటెస్ట్ ట్వీట్లో పేర్కొన్నారు.స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్ట్ఇలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించాలని లక్ష్యంతో స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్ట్ ప్రారభించారు. అపరిమిత డేటా మాత్రమే కాకుండా.. రిమోట్ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సర్వీస్ అందించడమే దీని లక్ష్యం. భారత్‌లో.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. ఇది రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా మారుతుంది.ఇదీ చదవండి: తండ్రి బిలియనీర్.. భార్య మిస్ ఇండియా.. అతడెవరో తెలుసా?ఏఐపై మస్క్ వ్యాఖ్యలుఇంటర్నెట్ గురించి మాత్రమే కాకుండా కృత్రిమ మేధస్సు (AI) గురించి కూడా మస్క్ గతంలోనే వ్యాఖ్యానించారు. ఏఐ ఉద్యోగాలను తొలగిస్తుందని అంచనా వేశారు. భవిష్యత్తులో బహుశా ఎవరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చని అన్నారు. ఏఐ, రోబోలు ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు.. సేవలను అందజేస్తాయని ఆయన విశ్వసించారు.The crazy thing is that they thought I was crazy for stating this super obvious predictionpic.twitter.com/OK0akTRj3E— Elon Musk (@elonmusk) December 10, 2024 -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ.. వీడియో షేర్ చేసిన చెర్రీ!
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. మేకర్స్ వరుస అప్డేట్స్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందించారు.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను రామ్ చరణ్ పంచుకున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. చిత్రబృందంతో షూటింగ్లో పాల్గొన్న క్షణాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవలే 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్ పాటలు ప్రేక్షకులను మెప్పించగా.. టీజర్‌కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు.#Gamechanger #JaanaHairaanSa @shankarshanmugh @advani_kiara @BoscoMartis @DOP_Tirru @MusicThaman @AalimHakim @ManishMalhotra pic.twitter.com/Ei3mMAgPHF— Ram Charan (@AlwaysRamCharan) December 10, 2024 -
అలిపిరి టోల్ గేట్ దగ్గర పుష్ప-2 సాంగ్‌కు యువతి రీల్..
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట ఐటమ్ సాంగ్‌కు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు.. తాజాగా, అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్ప 2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్‌కు డాన్స్ చేసింది ఓ యువతి.. అలిపిరి టోలేట్ ముందు డాన్స్ చేసిన ఆ వీడియోను యువతి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో.ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.. ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, గతంలోను కోండపై సినీ నటి నయనతార ఫొటో షూట్, దర్శనం క్యూ లైన్లో చెన్నై యువకులు రీల్స్ చేయడం.. మొన్న అలిపిరి మెట్ల వద్ద పులి అంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి రీల్ చేయడం.. ఇలా.. వరుస ఘటనలు జరుగుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు.. pic.twitter.com/PLmEypMVys— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, విషయం తెలుసుకున్న యువతి.. శ్రీవారి భక్తులు తనను క్షమించాలంటూ మరో వీడియో విడుదల చేయడం గమనార్హం. https://t.co/DrCk8b8lOm pic.twitter.com/eYdYE9U2RZ— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024 -
‘ఇక్కడ రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం.. మమ్మల్ని కాపాడండి’
టెల్అవీవ్: ఇజ్రాయెల్,హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొలిక్కిరావడం ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్ యువకుడు ఎడాన్ అలెగ్జాండర్ వీడియోను హమాస్ తాజాగా విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తమ విడుదలకు ప్రయత్నించాలని బందీగా ఉన్న యువకుడు వీడియోలో ఏడుస్తూ మొర పెట్టుకున్నారు. తామంతా ఇక్కడ రోజుకు వెయ్యిసార్లు చస్తున్నామని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా,ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకే హమాస్ మిలిటరీ విభాగం అల్ కస్సామ్ బ్రిగేడ్ ఈ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం. Well, atleast he looks healthy an clean. Idan Alexander, held hostage because of Netanyahu #Israel pic.twitter.com/J42O2yGsRg— Steven Markussen (@DALAX) November 30, 2024ఈ వీడియోపై ఎడాన్ తల్లి యేల్ స్పందించారు. తన కుమారుడి వీడియో తనను కలవరపరిచిందని, హమాస్ వద్ద ఉన్న బందీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇది తెలియజేస్తోందన్నారు. ఈ వీడియోపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు కార్యాలయం స్పందించింది. ఇలాంటి హమాస్ వ్యూహాలు ఇజ్రాయెల్ లక్ష్యాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. హమాస్ వద్ద ఉన్న బందీలను కచ్చితంగా తిరిగి తీసుకొస్తామని తెలిపింది. గత ఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని తమతోపాటు పాలస్తీనాలోని గాజాకు తీసుకెళ్లింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 43వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. -
థ్యాంక్స్ గివింగ్ : వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పెషల్ మీల్
అంతరిక్షంలో థాంక్స్ గివింగ్ జరుపుకునేందుకు భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సిద్ధమయ్యారు. ఒక ప్రత్యేక మీల్‌తో థ్యాంక్స్ గివింగ్ సందర్భాన్ని జరుపుకోనున్నారు. ఈ మేరకు బుధవారం సునీతా విలియమ్స్ సందేశంతో కూడిన ఒక వీడియోను నాసా విడుదల చేసింది.“ఇక్కడ ఉన్న మా సిబ్బంది భూమిపై ఉన్న మా స్నేహితులు,కుటుంబ సభ్యులందరికీ అలాగే మాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ హ్యాపీ థాంక్స్ గివింగ్ చెప్పాలనుకుంటున్నారు” అని విలియమ్స్ తన వీడియో సందేశంలో తెలిపారు. ఈ సందర్భంగా నాసా తమకు బటర్నట్ స్క్వాష్, యాపిల్స్, సార్డినెస్ (చేపలు), స్మోక్డ్ టర్కీ(బేక్చేసిన చికెన్) వంటి ఆహార పదార్థాలను అందించిందని వ్యోమగాములు పంచుకున్నారు. ప్రతీ ఏడాది నవంబరు నాలుగో గురువారం అమెరికాలో థాంక్స్ గివింగ్ జరుపుకుంటారు."We have much to be thankful for."From the @Space_Station, our crew of @NASA_Astronauts share their #Thanksgiving greetings—and show off the menu for their holiday meal. pic.twitter.com/j8YUVy6Lzf— NASA (@NASA) November 27, 2024 కాగా 8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్‌లైనర్ రాకెట్‌లోని ప్రొపల్షన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అక్టోబరులో దీపావళిని కూడా అంతరిక్షంలోనే జరుపుకున్నారు సునీత. వారిద్దరినీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకువచ్చేందుకు నాసా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
'ఇటు రావే నా గాజు బొమ్మ'.. ఆ పాటతో తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక!
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న నందమూరి హీరో తారకరత్న. అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇటీవల ఆయన పెద్దకూతురు నిష్కా తారకరత్న హాఫ్ శారీ వేడుక ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలుస వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అచ్చం నాన్న పోలికే అంటూ సంతోషం వ్యక్తం చేశారు.తాజాగా ఈ వేడుకకు సంబంధించిన మరో వీడియోను అలేఖ్య తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. 'ఇటు రావే నా గాజు బొమ్మ' అనే సాంగ్‌ను ఈ వీడియోకు జతచేశారు. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రంలోని ఈ పాట తండ్రీ, కూతుళ్ల మధ్య ప్రేమను తెలిపేలా ఉంది. తన కూతురి కోసం ఒక తండ్రి పడే తపనను ఈ ఒక్క పాటలో చూపించారు. తన ముద్దుల కూతురిని తలచుకుని అలేఖ్య ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కుమార్తెను ముద్దాడింది.తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుకకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. తారకరత్న నివాసంలో జరిగిన ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.తారకరత్న జర్నీకాగా.. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న అకాల మరణం చెందారు. గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
హమాస్ చీఫ్ బంకర్ చూస్తే షాక్ అవాల్సిందే.. భారీగా డబ్బు..
హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో మృతి చెందారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్ ఉన్న ఈ బంకర్లో వంటగది సామాగ్రి, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ పంపిణీ చేసిన సహాయక సమాగ్రి, మిలియన్ డాలర్ల భారీ నగదు, పెర్ఫ్యూమ్, వ్యక్తిగత షవర్ ఉన్నాయి. ఈ వీడియో ఫిబ్రవరి నెలకు సంబంధించినదిగా తెలుస్తోంది.ఇక.. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడికి సిన్వార్ సూత్రధారి. ఆయన రఫాకు పారిపోయే ముందు ఈ బంకర్లోనే కొన్నిరోజులు గడిపినట్లు తెలుసోంది. ఇస్మైల్ హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్ సైన్యం సిన్వార్‌ను అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అక్టోబర్ 16న జరిపని దాడుల్లో సిన్వార్ మృతి చెందారు.Hamas' eliminated leader Yahya Sinwar was hiding in this underground tunnel months ago:Surrounded by UNRWA bags of humanitarian aid, weapons and millions of dollars in cash.He hid like a coward underground, using the civilians of Gaza as human shields. pic.twitter.com/0ylVjTCv7H— Israel ישראל (@Israel) October 20, 2024 ‘‘హమాస్ నుంచి తొలగించబడిన నేత యాహ్యా సిన్వార్ కొన్ని నెలల క్రితం ఈ భూగర్భ సొరంగంలో దాక్కున్నారు. మానవతా సహాయం, ఆయుధాలు, మిలియన్ల డాలర్ల నగదుతో ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) బ్యాగులు ఉన్నాయి. ఆయన గాజా పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని, పిరికివాడిలా భూగర్భంలో దాక్కున్నారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఎక్స్‌లో వీడియోను విడుదల చేసింది.Hamas leader Yahya Sinwar’s wife reportedly spotted with $32,000 Birkin bag as she went into hiding https://t.co/Dwqf0h7nTQ pic.twitter.com/JHZ5eMrYiZ— New York Post (@nypost) October 20, 2024 ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 7 దాడికి ఒక రోజు ముందు యాహ్యా సిన్వార్ బంకర్ గుండా వెళుతున్నట్లు చూపించే వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఫుటేజీలో.. హమాస్ నాయకుడు సిన్వార్ తన కుటుంబంతో కలిసి బ్యాగులు, సామాగ్రిని చేతిలో పట్టుకుని నడుస్తున్నట్లు దృష్యాలు కనిపించాయి. సిన్వార్ భార్య సొరంగంలోకి పారిపోతున్నప్పుడు 32వేల అమెరికన్ డాలర్ల(సుమారు రూ. 27 లక్షలు) విలువైన ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ని తీసుకువెళ్లిన దృష్యం కనిపించింది.చదవండి: అక్టోబర్‌లో దాడులకు ముందు సిన్వర్ ఇలా.. -
HYD: మియాపూర్‌లో చిరుత.. భయాందోళనలో స్థానికులు
సాక్షి,హైదరాబాద్: అడవుల్లో ఉండే చిరుత భాగ్యనగరంలోకి ఎంటరైంది. శుక్రవారం(అక్టోబర్ 18)మియాపూర్ లో చిరుత సంచరించడం సంచలనం రేపింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక భాగంలో చిరతు సంచరించింది. స్థానికుల సమాచారంతో చిరుత సంచరించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చిరుత కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిరుత సంచరిస్తున్న వీడియోను స్థానికులు ఫోన్లో బందించారు. -
దసరా పండుగ ఉత్సవాల్లో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం
సాక్షి,సూర్యాపేట : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం, బేతవోలులో జరిగిన దసరా ఉత్సవాల్లో వీరకుమార్ అనే ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చిన కానిస్టేబుల్ వీరకుమార్ ఆలయంలో మాజీ సర్పంచ్ నాగయ్యను కాలితో తన్ని దాడికి దిగాడు. అడ్డుకునేందుకు వచ్చిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లుపై కూడా దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదే సమయంలో అక్కడే ఉన్న కోదాడ పట్టణ సీఐ రాము ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశాడు.మాజీ సర్పంచ్ నాగయ్య ఆలయం భయట మూత్ర విసర్జన చేస్తుండగా.. కొందరు వీడియోలు తీసి వాట్సప్‌లో షేర్ చేయడంతో గొడవ తలెత్తింది. ఇదికాస్తా ఘర్షణకు దారితీయడంతో నలుగురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడ్డ ఏఆర్ కానిస్టేబుల్ వీరకుమార్పై చిలుకూరు పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్ ఎస్సై రజితారెడ్డి తెలిపారు -
రతన్ టాటా మళ్లీ బతికొస్తే..!
రతన టాటాను ఒక పారిశ్రామికవేత్తగా కంటే కూడా ఒక గొప్ప మానవతావాదిగా, అనుక్షణం దేశ శ్రేయస్సు కోసం కాంక్షించిన వ్యక్తిగా అందరూ గుర్తుంచుకుంటారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ లోకాన్ని విడిచి మనందరికీ దూరమయ్యారు. ఆయన మళ్లీ బతికొస్తే బావుండు అని అనుకోనివారుండరు.అలా భావించిన ఒక వ్యక్తి రతన్ టాటాపై ఏఐ సహాయంతో ఓ అద్భుతమైన వీడియో రూపొందించారు. తన సారథ్యంలోని టాటా గ్రూపు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో దేశ ప్రజల శ్రేయస్సు గురించే రతన్ టాటా ఆలోచించేవారు. అలా ఆయన అభివృద్ధి చేసిన పలు వ్యాపారాలను గుర్తు చేస్తున్నట్టుగా రతన్ టాటా ఈ వీడియోలో కనిపించారు.రతన్ టాటా దూరమయ్యారని దేశమంతా బాధాతప్తులైన వేళ టాటా మళ్లీ బతికొచ్చి ‘చింతించకండి.. నేను లేకపోయినా నా జ్ఞాపకాలు మీతోనే ఉంటాయి‘ అని అంటున్న విధంగా రూపొందించిన ఈ ఏఐ వీడియో సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.Best use of ‘AI’ ❤️ pic.twitter.com/FLreHPZr0I— Yash Gowda (@yash_gowdaa) October 11, 2024 -
ఇది మెట్రోనా లేక నవరాత్రుల మండపమా?
కోల్‌కతా: ప్రతీయేటా నవరాత్రులలో కోల్‌కతాలో దుర్గాపూజా మండపాలను అద్బుతంగా తీర్చిదిద్దుతుంటారు. భక్తులు వీటిని చూసి మైమరచిపోతుంటారు. ఇటువంటి మండపాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. అయితే వీటికి భిన్నమైన ఒక మండపం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో తొలుత అండర్ వాటర్ మెట్రో లోపల ఓ వ్యక్తి వీడియో తీస్తున్నట్లు కనిపిస్తుంది. తరువాత అద్భుత దృశ్యం కనిపిస్తుంది. నిజానికి ఇది మెట్రో కాదు. నీటి అడుగున మెట్రో థీమ్‌తో రూపొందించిన దుర్గాపూజా మండపం. వీడియో చివరిలో దుర్గమ్మవారి విగ్రహం కనిపిస్తుంది . పలువురు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోను చూసినవారంతా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దీనిని షేర్ చేస్తున్నారు. ఈ వీడియో @ChapraZila అనే పేజీ నుండి పోస్ట్ అయ్యింది. దాని క్యాప్షన్‌గా 'కోల్‌కతాలోని మెట్రో మార్గంలో నిర్మించిన దుర్గామాత మండపం’ అని రాసివుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 36 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. कोलकाता में मेट्रो की तर्ज पर बना मां दुर्गा का पंडाल 👏❤️ pic.twitter.com/YFYb3D2xAF— छपरा जिला 🇮🇳 (@ChapraZila) October 8, 2024ఇది కూడా చదవండి: బూటకపు ఎన్కౌంటర్.. డీఎస్పీకి జీవితఖైదు -
గుండెపోటుతో యూట్యూబర్ కన్నుమూత
సీతాపూర్: దేశంలో దేవీనవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. యూపీలోని సీతాపూర్‌లో నవరాత్రుల వేళ విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి జాగరణలో కార్యక్రమంలో పాల్గొన్న ఒక యూట్యూబర్ ఆనందంగా నృత్యం చేస్తూ, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.యూపీలోని సీతాపూర్‌లో నవరాత్రి కార్యక్రమాలను చిత్రీకరించేందుకు వచ్చిన వికాస్ అనే యూట్యూబర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. వికాస్ కుప్పకూలగానే అక్కడ ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. వికాస్ స్నేహితులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, గుండెపోటుతో మృతిచెందాడని ధృవీకరించారు. వికాస్ మృతికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిలో వికాస్ హఠాత్తుగా కిందపడిపోవడం, తరువాత అతని స్నేహితులు అతనిని ఆస్పత్రికి తరలించడం కనిపిస్తుంది. వికాస్ షార్ట్ వీడియోలు తీస్తూ ఫేమస్ అయ్యాడు. ఫాలోవర్ల సంఖ్య కూడా అధికంగానే ఉంది. దుర్గా జాగృతి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్నేహితులతో పాటు వచ్చిన వికాస్ డీజే ట్యూన్స్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ అక్కడే కుప్పుకూలిపోయాడు. వెంటనే అతని స్నేహితులు అతనిని దగ్గరలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వికాస్ చనిపోయినట్లు నిర్ధారించారు. వికాస్ మృతిపై పోలీసులకు తెలియజేయకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు -
కాంగ్రెస్ మహిళా నేతకు వేధింపులు.. వీడియోతో బయటపెట్టిన బీజేపీ
కాంగ్రెస్‌ను మహిళ వ్యతిరేక పార్టీ అంటూ బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. అందరూ చూస్తుండగానే స్టేజ్ మీ ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ కాంగ్రెస్‌పై. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది కాషాయపార్టీ. హర్యానా కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, ఇతర నేతల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని మండిపడింది.ఇంతకీ ఏం జరిగిందంటే.. కాంగ్రెస్ నేత దీపిందర్ సింగ్, ఇతర నేతలు ఉన్న వేదికపై ఉన్నప్పుడే ఓ మహిళ వేధింపులు ఎదుర్కొన్నట్లు కొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా దీపేందర్ హుడా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఇలాంటి వారి అసభ్య ప్రవర్తన కారణంగా ఎంతోమంది మహిళా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారని ఆరోపించారు. చాలా అవమానకరమైన వీడియో బయటపడింది. కొన్ని దృశ్యాలు సిగ్గుపడేలా ఉన్నాయి. ఇది మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని కాగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా ధృవీకరించారు. పట్టపగలు, దీపేందర్ హుడా సమక్షంలో వేదికపై ఒక మహిళా నేతకు పార్టీకి చెందిన వ్యక్తి నుంచే వేధింపులు ఎదురయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లోనే మహిళలకు భద్రత లేకపోతే.. ఇక రాష్ట్రంలోని మహిళలు ఎలా భద్రంగా ఉంటారు?.. ఇది మహిళా వ్యతిరేక పార్టీ. ఈ హుడా మద్దతుదారులపై ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చర్యలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు.Most shocking 😮 A woman congress leader was molested in stage in presence of Deependra Hooda by congress leaders Confirmed by news reports and even Kumari Selja If women are not safe in Congress meetings in full public view during the daytime - can they be safe if Congress… pic.twitter.com/yIw46gl91t— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) October 5, 2024మరోవైపు మహిళలు, పేదలు, దళితులను గౌరవించకపోవడం కాంగ్రెస్ సంస్కృతి, డీఎన్ఏలో ఉందనంటూ హర్యానా ముఖ్యమంత్రి నయాబ్‌సింగ్ సైనీ విమర్శించారు. ఈ విషయంలో మాకు ఫిర్యాదు వస్తే.. చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టద్దని చెప్పారు.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కుమారి సెల్జా సైతం ఈ ఘటనను ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘బాధితురాలితో నేను మాట్లాడాను. తనపై వేధింపులు జరిగాయని ఆమె తెలిపింది. రాజకీయాల్లో ఎదిగేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తోన్న ఓ మహిళకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం తీవ్రంగా ఖండించదగినది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మెట్రోలో వర్షం.. కంగుతిన్న ప్రయాణికులు
ముంబై: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనం పలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో మహారాష్ట్రలోని ముంబైలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది.ప్రయాణీకులతో నిండిన ముంబై మెట్రోలోని ఒక కోచ్‌లో అకస్మాత్తుగా వర్షం పడింది. ప్రయాణికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.కోచ్‌లో ఉన్న ఏసీ వెంట్ నుంచి అకస్మాత్తుగా నీరు బయటకు రావడాన్ని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ దృశ్యాన్ని అక్కడున్న పలువురు తమ కెమెరాల్లో బంధించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక వైరల్ వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు ఇదే రేంజ్లో ముంబై మెట్రో వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన కొందరు.. ‘మెట్రోలో ప్రయాణించేందుకు వారు టికెట్ తీసుకున్నారని, అయితే ఇప్పుడు వారంతా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నట్లుందని కామెంట్ చేశారు. ఈ ఘటనపై కొందరు సరదాగా కామెంట్ చేస్తుండగా, మరికొందరు మెట్రో పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటున్నారు. మెట్రో యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించాలని పలువురు యూజర్లు కోరుతున్నారు. Life in a metro ❌Rain in a metro ✅#Mumbai #MumbaiRain pic.twitter.com/B2m90FsbuW— Miss Ordinaari (@shivangisahu05) September 24, 2024ఇది కూడా చదవండి: నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు -
న్యూస్ చదువుతుండగా లెబనాన్ జర్నలిస్ట్‌పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి
బీరూట్ : లెబనాన్ దేశంలో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తోంది. ఈ దాడితో రెండ్రోజుల వ్యవధిలో సుమారు 550 మందికి పైగా మరణించారని, 1,800 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.ఈ తరుణంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేక కథనాల్ని ప్రసారం చేస్తున్నారనే నెపంతో లెబనాన్ టీవీ ఛానెల్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం రాకెట్ దాడి చేసింది.ఆ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా దళాల మధ్య వైమానిక దాడులపై మిరయా ఇంటర్నేషనల్ నెట్వర్క్ టీవీ ఛానల్ న్యూస్ రూమ్‌లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. లైవ్ టెలికాస్ట్‌పై అప్పటికే సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ.. న్యూస్ రూమ్‌లో న్యూస్ ప్రసారం చేస్తున్న మిరయా ఇంటర్నేషనల్ నెట్వర్క్ టీవీ ఛానల్ ఎడిటర్–ఇన్–చీఫ్ జర్నలిస్ట్ ఫాది బౌడియాపై రాకెట్ దాడి చేసింది. ఫాది బౌడియా ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన వెనుక నుంచి రాకెట్ దూసుకొచ్చింది. ఈ దాడిలో బౌడియాకు తీవ్ర గాయాలయ్యాయి. ఫుటేజీలో, బౌడియా పేలుడు తీవ్రతతో అరుస్తూ.. హాహాకారాలు వ్యక్తం చేస్తూ ప్రాణ భయంతో భీతిల్లిపోయారు. ఏమి జరుగుతుందో తెలియక భయాందోళన చెందారు. పేలుడు కారణంగా అతనికి గాయాలైనట్లు నివేదికలు ధృవీకరించాయి.A video shows journalist Fadi Boudiya being thrown off balance while he was live on air in Lebanon. Boudiya is the editor-in-chief of Miraya International Network and has reportedly been injured in the attack.Video Credit: @eye.on.palestine#thecurrent #lebanon pic.twitter.com/YdHQNoyxk9— The Current (@TheCurrentPK) September 24, 2024చదవండి : హిబ్జుల్లా కమాండర్ హతం -
నిద్రలో నడుస్తూ అడవిలోకి...!
అమెరికాలో లూసియానా రాష్ట్రంలోని వెబ్‌స్టర్ పారిస్‌కు చెందిన ఓ పాపకు నిద్రలో నడిచే అలవాటుంది. శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న బాలిక మరునాడు ఉదయం ఇంట్లో కనిపించలేదు. నిద్రలో నడుస్తూ కాస్త దూరం ఎటైనా వెళ్లిందేమోనని తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో మర్నాడు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి చుక్కపక్కల సీసీటీవీ కెమెరాలన్నింటినీ జల్లెడ పట్టారు. కనీసం బూట్లు లేకుండా బాలిక సమీపంలోని అడవుల్లోకి నడిచి వెళ్తూ ఓ కెమెరాకు చిక్కింది. వెంటనే గాలింపు చేపట్టారు. చిన్నారి నడిచి వెళ్లిన ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ట్రాకింగ్ డాగ్స్, డ్రోన్లతో పాటు చివరికి హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. విషయం తెలిసి వందలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వెదుకులాటకు దిగారు. పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. చివరకు రాత్రి 11 గంటల వేళ రోడ్డుకు సమీపంలో అడవిలో చిన్నారిని ఓ డ్రోన్ థర్మల్ ఇమేజింగ్ ద్వారా కనిపెట్టింది. అప్పటికి ఒక రోజు గడిచినా చిన్నారి ఇంకా గాఢనిద్రలోనే ఉండటం విశేషం! పోలీసులు, తల్లిదండ్రుల పిలుపులతో ఉలిక్కిపడి లేచింది. నెమ్మదిగా ఏడుపందుకుంది. తల్లిదండ్రులు ఊరడించడంతో మెల్లిగా తేరుకుంది. ఈ దృశ్యాలు అందరినీ కదిలించాయి. ‘అడవిలో, వణికించే చలిలో ఆ చిన్న పాప ప్రశాంతంగా నిద్రపోతూ దొరికిన క్షణాలు హృదయాలను కదిలించాయి. సాంకేతిక పరిజ్ఞానం ఇలా సామాజిక ప్రయోజనానికి ఉపయోగపడటం నిజంగా బాగుంది’ అంటూ నెటిజన్లు సంబరపడుతున్నారు. -
తిరగలి పట్టిన మాజీ సీఎం రబ్రీదేవి
పట్నా: బీహార్‌లో ఆసక్తికర రాజకీయాలు నడుస్తుంటాయి. ముఖ్యంగా ఆర్జేడీ నేత లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తన తల్లి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రబ్రీదేవి సాధారణ బీహారీ మహిళగా కనిపిస్తున్నారు. గోధుమలను తిరగలి పడుతూ, వాటిని జల్లెడ పడుతూ, శుభ్రం చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తేజస్వి యాదవ్ ‘జీవితాన్ని నడిపించేది తల్లి.. ఆశ, నమ్మకం, ప్రేమలకు ప్రతిబింబం తల్లి’ అని రాశారు.ఈ వీడియోను చూసిన రవి ఆనంద్ అనే యూజర్.. ‘కుటుంబం, అధికారం రెండింటినీ ఎలా నడపవచ్చో ప్రపంచానికి చాటిచెప్పిన తల్లి ఆమె’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు బీహార్ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను ఏకకాలంలో చూపించారని’ రాశారు. जीवन का संबल है माँ! जीवन का आस-विश्वास, सार-प्यार, प्रतिमान और आर्शीवचन है माँ! #motherslove #mothers #trending pic.twitter.com/j7fYUwfvOE— Tejashwi Yadav (@yadavtejashwi) September 22, 2024ఇది కూడా చదవండి: ‘అహ్మద్‌కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్‌పై పోలీసులకు ఫిర్యాదు -
మహిళా పీఈటీ అకృత్యం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): క్రమశిక్షణ పేరుతో వ్యాయామ ఉపాధ్యాయురాలు (పీఈటీ) విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. తమను పీఈటీ జ్యోత్స్న బారి నుంచి రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటలకు పాఠశాల గోడదూకి సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న పీఈటీని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థినులు మీడియాకు తమగోడు వెళ్లబోసుకుంటూ.. ఐదేళ్లుగా గిరిజన గురుకులంలో పీఈటీగా పనిచేస్తున్న జ్యోత్స్న బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని ఇక్కడే కొనసాగుతోందన్నా రు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. విద్యార్థినులను బూతులు తిడుతూ దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఇద్దరు బాలికలకు నెలసరి రావడంతో బాత్రూమ్లలో స్నానం చేస్తుండగా ప్రార్థన సమయంలో ఎందుకు స్నానాలు చేస్తున్నారని ఆగ్రహంతో బాత్రూమ్ల తలుపులు పగులగొట్టి స్నానం చేస్తుండగా తన ఫోన్లో వీడియో తీయడంతోపాటు కర్ర తో చితకబాదారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న సిరిసిల్ల రూ రల్ సీఐ మొగిలి, తంగళ్లపల్లి ఎస్సై డి.సుధాకర్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేయగా.. బాలికలు మరోసారి పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని బాలికలకు మద్దతుగా నిలిచారు. రంగంలోకి కలెక్టర్.. పీఈటీ సస్పెన్షన్ గిరిజన బాలికల ఆందోళన గురించి తెలుసుకున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌తో మాట్లాడి అప్పటికప్పుడు పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తొలగించారు. పీఈటీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీఐ మొగిలిని ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ పద్మను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పీఈటీ జ్యోత్స్నపై కేసు నమోదైంది. కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారితప్పడంతో దేహశుద్ధి చేసిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఓ జెడ్పీ హైస్కూల్లో కొంతకాలంగా ఇద్దరు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వారు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి హెచ్చరించి వదిలిపెట్టారు. మరో ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరు కావడంతో దాడి నుంచి తప్పించుకోగలిగాడు. ఈ విషయమై హెచ్ఎంను వివరణ కోరగా, ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని విద్యార్థినులు తన దృష్టికి తీసుకురావడంతో మందలించానని, అయినా వారు ప్రవర్తన మార్చుకోకపోవడంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లిందన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. -
‘రాహుల్ గాంధీ.. మీకూ మీ నాన్నమ్మ గతే పడుతుంది’
న్యూఢిల్లీ: సిక్కులకు సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. భారతదేశంలో సిక్కులకు మత స్వేచ్ఛ లేదని రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో బీజేపీలోని సిక్కు నేతలు ఢిల్లీలో నిరసన తెలిపారు. ఈ నేపద్యంలో కాంగ్రెస్ తాజాగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే తర్విందర్ సింగ్ మార్వకు చెందిన వీడియోను షేర్ చేసింది. దానిలో తర్విందర్.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఎదురైన విధి రాహుల్‌కు కూడా ఎదురవుతుందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ వీడియోను షేర్ చేస్తూ, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీని కోరింది.. అలాగే.. ఢిల్లీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, తర్విందర్ సింగ్ మార్వా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘రాహుల్ గాంధీ.. ఆగండి.. లేకపోతే భవిష్యత్తులో మీ నాన్నమ్మకు పట్టిన గతే మీకూ పడుతుందని’ అన్నారని, ఈ బీజేపీ నేత బహిరంగంగా చంపేస్తానని బెదిరించారని, మీ పార్టీలోని ద్వేషం కారణంగానే ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయని’ ప్రధాని మోదీకి కాంగ్రెస్ విన్నవించింది. కాగా అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘భారత్‌లోని సిక్కులు.. తమకు తలపాగా, కంకణం ధరించడానికి అనుమతి ఉంటుందో ఉండదోననే ఆందోళనలో ఉన్నారు. ఇది ఒక సిక్కులకే కాదు, అన్ని మతాల ప్రజలకు సంబంధించినది’ అని వ్యాఖ్యానించారు. కాగా ఢిల్లీ బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా రెండేళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. 2022 జూలైలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. दिल्ली BJP का नेता और पूर्व विधायक, तरविंदर सिंह मारवाह ने आज प्रदर्शन के दौरान कहा: “राहुल गांधी बाज आ जा, नहीं तो आने वाले टाइम में तेरा भी वही हाल होगा जो तेरी दादी का हुआ”BJP का ये नेता खुलेआम देश के नेता प्रतिपक्ष की हत्या की धमकी दे रहा है.@narendramodi जी, अपने… pic.twitter.com/tGisA5dfNu— Congress (@INCIndia) September 11, 2024ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ప్రచారానికి వాల్మీకి స్కామ్ డబ్బు -
గెలిపిస్తే టిక్‌టాక్‌ను కాపాడుతా: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే చైనాకు చెందిన సోషల్ మీడియా వేదిక ‘టిక్‌టాక్’ను కాపాడుతానని అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో టిక్‌టాక్‌కు తాను రక్షకుడిని అవుతానని ఉద్ఘాటించారు. టిక్‌టాక్ కావాలని కోరుకునేవారంతా అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. అమెరికాలో తన ప్రత్యర్థి వర్గం టిక్‌టాక్‌ను మూసివేయడానికి కుట్ర పన్నుతోందని పరోక్షంగా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆరోపణలు గుప్పించారు. టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయిండానికి దాని మాతృ సంస్థపై ఒత్తిడి పెంచేలా లేదా అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించేలా జో బైడెన్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ బిల్లుపై సంతకం చేసింది. నిజానికి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లో టిక్‌టాక్‌పై నిషేధం విధించడం గమనార్హం. -
రీల్స్ పిచ్చి: పాము కాటుకు యువకుడు బలి
సాక్షి,కామారెడ్డిజిల్లా: సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వాలన్న కోరిక మరో ప్రాణాన్ని బలిగొన్నది. సాహసం చేసి పేరుతెచ్చుకునే మాట అటుంచితే యుక్త వయస్సులోనే ఆయుష్షు పూర్తయిపోయింది. కామారెడ్డి జిల్లా దేశాయిపేటలో శుక్రవారం(సెప్టెంబర్6) విషాద ఘటన జరిగింది. సోషల్‌మీడియాలో వైరల్ అయ్యేందుకు శివరాజు అనే యువకుడు ఏకంగా విష సర్పాన్నే నోటితో కరిచి పట్టుకున్నాడు. ఈ దృశ్యాలను వీడియో తీయాల్సిందిగా స్నేహితులకు చెప్పాడు. ఇంకేముంది షరామామూలుగానే పాము తన సహజ స్వభావంతో యువకున్ని కాటు వేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శివరాజును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివరాజు తుద్విశ్వాస విడిచాడు. యువకుడు అకారణంగా చనిపోవడంపై కుటుంబసభ్యులు కనీరుమున్నీరవుతున్నారు. పాముకాటుతో మృతిచెందిన శివరాజు ఇటీవల పాములు పట్టడంలో శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది. -
‘హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై మొసలి’
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎప్పుడు ఎలాంటి విచిత్రాలు కనిపిస్తాయో ఎవరూ చెప్పలేరు. కడుపుబ్బా నవ్వించే వీడియోలతో పాటు కంగుతినిపించే వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంటాయి. ఇదేకోవకు చెందిన ఒక వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.గుజరాత్‌కు చెందిన ఈ వీడియో ఒక పట్టాన నమ్మేలా లేదు. ఈ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చ్యపోతున్నారు. భారీ వర్షాలకు నదిలో నుంచి మొసళ్లు బయటకు రావడాన్ని చూసిన జనం.. అలాంటి మొసలి స్కూటర్‌పై వెళ్లడాన్ని చూసి కంగుతింటున్నారు. ఈ వీడియోలో ఇద్దరు యువకులు స్కూటర్‌పై వెళుతుండటాన్ని చూడవచ్చు. వారి మధ్య ఓ మొసలి కూడా ఉంది. ఒకరు స్కూటర్ నడుపుతుండగా, మరొకరు ఆ భారీ మొసలిని ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు. కుక్కలను, పిల్లులను ఇలా స్కూటర్‌పై ఎక్కించుకుని తీసుకుని వెళ్లడాన్ని ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం. కానీ ఇలా మొసలిని బండిపై తీసుకువెళ్లడాన్ని ఎప్పుడూ చూడలేదని ఈ వీడియో చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వీడియోను @gharkekalesh అనే ఖాతా ద్వారా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో ‘వడోదరలోని విశ్వామిత్ర నది నుంచి బయటకు వచ్చిన ఒక మొసలిని ఇద్దరు యువకులు స్కూటర్‌పై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి తీసుకెళ్లారు’ అని రాసివుంది. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ మొసలిని నీటిలో నుంచి బయటకు తీసి, దాని నోటిని తాడుతో కట్టేస్తే అది బలహీనపడిపోతుంది’ అని రాశారు. మరొక యూజర్ ‘సోదరుని ధైర్యానికి వందనం’ అని రాయగా, ఇంకొకరు ‘హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై మొసలి ఎలా వెళుతుంది? అని రాశారు. Two young men took a crocodile found in Vishwamitra river in Vadodara to the forest department office on a scooter🫡pic.twitter.com/IHp80V9ivP— Ghar Ke Kalesh (@gharkekalesh) September 1, 2024 -
శ్రీనగర్‌లో దేశభక్తి పరవళ్లు... వైరల్ వీడియో
భారతదేశం నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ తరుణంలో జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఒక వీడియో దేశభక్తిని పరవళ్లు తొక్కిస్తోంది. దీనిని చూసిన భారతీయుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది.ఈ వీడియోలో శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ దగ్గర ఓ యువకుడు జెండాను గాలిలో ఊపుతూ కనిపిస్తున్నాడు. ఆ యువకుడు ఖాకీ ప్యాంటు ధరించి, శరీరం పైభాగంలో త్రివర్ణాలను పెయింట్ చేయించుకున్నాడు. ఆ యువకుడి కడుపుపై అశోకచక్రం, ఛాతీపై భారత్ అని రాసి ఉంది. అతను భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేయడాన్ని వీడియోలో చూడవచ్చు.2019లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ముగిసింది. ఈ ఆర్టికల్‌ను తొలగించిన ఐదేళ్ల తర్వాత, కశ్మీర్లో శాంతి నెలకొంది. ఇక్కడి ప్రజలు ప్రధాన స్రవంతిలో చేరారు. భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జమ్ముకశ్మీర్ అత్యంత వేడుకగా చేసుకుంటోంది. #WATCH | #IndependenceDay2024 | Lal Chowk in Jammu & Kashmir's Srinagar is all decked up as India celebrates its 78th Independence Day. pic.twitter.com/SVmzg7iqdX— ANI (@ANI) August 15, 2024 -
Bihar: వెలుగులోకి తొక్కిసలాట వీడియో
బీహార్‌లోని జెహనాబాద్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతిచెందారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఫుటేజీలో ఆలయం చుట్టూ భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఇరుకైన మార్గంలో తోపులాట జరగడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. అలాగే పలువులు భయాందోళనలతో పరుగులు తీయడం కూడా వీడియోలో కనిపిస్తుంది.శ్రావణమాసంలో శివలింగాన్ని అభిషేకించేందుకు ఆలయానికి సుమారు 60 వేల మంది భక్తులు చేరుకున్నారు. పూల విక్రయదారునితో కొందరు భక్తులకు గొడవ జరిగిన దరిమిలా అక్కడి వాలంటీర్లు లాఠీచార్జి చేయడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.ఈ కేసులో ఒక పూల విక్రయదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ఘటనలో ప్రమేయమున్న మరో ముగ్గురు పూల విక్రయదారుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారన్నారు. కాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతులు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. जहानाबाद: सिद्धेश्वर नाथ मंदिर में भगदड़ का VIDEO आया सामनेबिहार के जहानाबाद में बाबा सिदेश्वरनाथ मंदिर के भगदड़ का वीडियो आया सामने आया है, जहां अचानक मची भगदड़ की चपेट में आकर 7 लोगों की मौत हो गई थी.#bihar | #jehanabad | #jehanabadstampede | #video pic.twitter.com/dTB9wukSkP— NDTV India (@ndtvindia) August 13, 2024 -
రోబోతో టేబుల్ టెన్నిస్.. ఫిదా చేస్తున్న వీడియో
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీని వాడేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టేబుల్ టెన్నిస్ ఆడే రోబోట్ వెలుగులోకి వచ్చింది. ఇది టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తోంది. వేగం, సామర్థ్యంలో ఈ రోబోట్.. మనుషులను కూడా మించిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో గమనిస్తే.. టేబుల్ టెన్నిస్ ఆడే రోబో మానవ పోటీదారులు గట్టి పోటీ ఇస్తోంది. సొంతంగా బాల్ పట్టుకోలేదు, సర్వ్ కూడా చేయలేదు. కానీ టేబుల్ టెన్నిస్ ఆడవాళ్లను మాత్రం అవలీలగా ఓడించేస్తోంది. ఈ రోబోట్ మొత్తం 29 మ్యాచ్‌ల సమయంలో 13 మందిని ఓడించి 45 శాతం విజయాన్ని సొంతం చేసుకుంది. కొంతమంది ఆటగాళ్లతో రోబోట్ కూడా ఓడిపోయింది. -
విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం
సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం వెలుగుచూసింది. అమ్మవారి అంతరాలయ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై అధికారులు స్పందించారు. రెండురోజుల క్రితం అంతరాలయాన్ని భక్తురాలు వీడియో తీసింది.తాను తీసిన విజువల్స్ సోషల్ మీడియాలో పెట్టడంతో భద్రతాపై అనుమానాలు వ్యక్తమవుతున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ పరువుకు భంగం కలిగించేవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు.. ఘటనపై పోలీస్ శాఖకి ఫిర్యాదు చేశారు. -
మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియో వైరల్.. కేసు నమోదు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియోపై కేసు నమోదైంది. గత నెల 26న మేడిగడ్డ బ్యారేజ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్, పార్టీ ముఖ్య నాయకులు సందర్శించారు.ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు.. డ్రోన్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇరిగేషన్ ఏఈఈ ఫిర్యాదుతో మహదేవ్పూర్ పీఎస్‌లో కేసు నమోదైంది.. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
వీడియో లీక్‌పై స్పందించిన ఊర్వశి రౌతేలా
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా బాత్రూమ్ వీడియో లీక్ అయిందంటూ ఒక క్లిప్పింగ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఆమె తన మేనేజర్‌తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా లీక్ అయింది. ఆ వీడియో ఎలా బయటకొచ్చిందంటూ ఊర్వశి మాట్లాడిన మాటలు ఆన్‌లైన్‌లోకి రావడంతో ఈ టాపిక్ పెద్ద దుమారమే రేపింది. వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన డ్యాన్స్ వేసిన ఈ బ్యూటికి తెలుగులో కూడా పాపులారటీ ఉంది. ఆయితే, ఆమె పర్సనల్ వీడియో అంటూ వైరల్ అయిన క్లిప్పింగ్ గురించి ఊర్వశి తాజాగా రియాక్ట్ అయింది.అందరూ అనుకునేలా ఆ వీడియో లీక్ అవడం నిజమేనని ఊర్వశి రౌతేలా ఇలా చెప్పుకొచ్చింది. 'నేను బాలీవుడ్లో గుస్పేటియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో భాగంగా ఓ సీన్ కోసం అలా నటించాను. కానీ, అది ఇటీవల నెట్టింట లీక్ కావడంతో నేను చాలా బాధపడ్డాను. కనీసం సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు.. అప్పుడు ఇలా వీడియోలు, ఫోటోలు లీక్ కావడం విచిత్రంగా ఉంది. అయితే, నేను అందరికీ చెప్పేది ఒక్కటే.. ఆ వీడియో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదు. మరోకరికి ఇలాంటి సంఘటన ఎదురుకాకూడదని ఆశిస్తున్నాను.' అని ఊర్వశి చెప్పుకొచ్చింది.ఈ విషయంపై ఊర్వశి రౌతేలాపై నెటిజన్లు మండి పడుతున్నారు. వీడియో లీక్ అయింది సరే.. మేనేజర్‌తో మాట్లాడిన కాల్ ఎలా లీక్ అయిందంటూ వారు ఫైర్ అవుతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని వారు చెప్పుకొస్తున్నారు. బాత్రూమ్ వీడియో లీక్ చేసుకుంటూ సినిమా ప్రమోషన్ చేసుకునే స్థాయికి చేరావా..? అంటూ ఊర్వశి రౌతేలాను తిట్టిపోస్తున్నారు. ఆమె నటించిన గుస్పేటియా చిత్రం ఆగష్టు 9న విడుదల కానుంది. అక్షయ్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించగా.. సూషి గణేషన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో బాలకృష్ణ నటిస్తోన్న 109 చిత్రంలో కూడా ఊర్వశి నటిస్తుంది. -
మైక్రోసాఫ్ట్ బగ్ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!
న్యూయార్క్: అమెరికా గగనతలంలో ప్రతి రోజు విమానాల ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ ట్రాఫిక్ ఒక్కసారిగా తగ్గిపోతే ఎలాఉంటుందో శుక్రవారం(జులై 19) అర్థమైంది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో బగ్ సమస్య తలెత్తి అమెరికాలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీలైన అమెరికన్ ఎయిర్‌లైన్స్,డెల్టా,యునైటెడ్ సంస్థల విమానాలు ఎక్కడికక్కడే ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోయాయి. దీంతో అగ్రదేశ గగనతలంలో విమానాల ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ సాధారణ సమయంలో విమానాల రద్దీ ఎలా ఉంటుంది.. శుక్రవారం విమానాల రద్దీ తగ్గిన తర్వాత ఎలా ఉందనే 12 గంటల ఆసక్తికర టైమ్‌లాప్స్ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విమానాల ట్రాఫిక్ టైమ్‌లాప్స్ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. 12-hour timelapse of American Airlines, Delta, and United plane traffic after what was likely the biggest IT outage in history forced a nationwide ground stop of the three airlines. pic.twitter.com/wwcQeiEtVe— Colin McCarthy (@US_Stormwatch) July 19, 2024 -
వైఎస్ఆర్ స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ!
సాక్షి,న్యూఢిల్లీ: వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అసలు సిసలైన ప్రజా నాయకుడని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కొనియాడారు. వైఎస్ఆర్ నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. తాను దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్రే స్ఫూర్తి అని తెలిపారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సోమవారం(జులై 8) నివాళి అర్పించిన రాహుల్‌గాంధీ ప్రత్యేాక వీడియో విడుదల చేశారు. ప్రజల కోసమే జీవించిన నాయకుడు రాజశేఖర్‌రెడ్డి అని కీర్తించారు. ఆయన బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావన్నారు. My humble tributes to former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his 75th birth anniversary.A true leader of the masses, his grit, dedication, and commitment to the upliftment and empowerment of the people of Andhra Pradesh and India has been a guiding… pic.twitter.com/iuGVsmsW8g— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2024


