తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూలీ మూవీతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం రజినీ జైలర్-2 మూవీలో నటిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో బ్లాక్ బస్టర్ మూవీ నరసింహాను రీ రిలీజ్ చేస్తున్నారు. తలైవాకు కోలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
తాజాగా రజినీకి ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ బర్త్ డే విషెస్ చెబుతూ వీడియోను రిలీజ్ చేసింది. రజనీ సినిమాల్లోని డైలాగులతో మ్యాష్‌అప్ వీడియోను రూపొందించి పుట్టినరోజు శుభాకంక్షలు తెలిపింది. ఒక రేంజ్ తర్వాత మాటలు ఉండవు.. అర్థమైందా రాజా.. డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
సూపర్‌హిట్ సినిమాకు సీక్వెల్..
రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన నరసింహ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 1999లో విడుదలైన ఈ సినిమా తలైవా కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీ రిలీజై ఇప్పటికి 26 ఏళ్లు అవుతున్నా సోషల్ మీడియా రీల్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మరోసారి రమ్యకృష్ణ, రజినీకాంత్ అభిమానులను అలరించనుంది. వీరిద్దరు ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తున్నారు.
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని రజినీకాంత్ ఇటీవలే ప్రకటించారు. ఈ మూవీకి నీలాంబరి అనే టైటిల్ అని ఖరారు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ కథపై చర్చలు జరుగుతున్నట్లు నరసింహ రీ రిలీజ్ ప్రచారంలో భాగంగా రజినీకాంత్ తెలిపారు.


