ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శనివారం(13 డిసెంబర్) ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తలపడనున్నారు. దేశం మొత్తం ఆ క్షణాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇందుకోసం ఆయన చాన్నాళ్లుగా కఠోర సాధనే చేస్తున్నారు.
‘‘ఫుట్ బాల్ నాకు ఇష్టమైన ఆట. టీం స్పిరిట్ ను ప్రదర్శించాల్సిన క్రీడ. తెలంగాణ టీంకు లీడర్ గా నాలుగు కోట్ల ప్రజలను గెలిపించాలన్న తపన నిత్యం నాలో ఉంటుంది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ కంకోల్ లోని వోక్సెన్ యూనివర్సిటీ (Woxsen University) సందర్శన సందర్భంగా అక్కడ విద్యార్థులతో ఇలా ఫుట్ బాల్ మైదానంలో కాసేపు ప్రాక్టీస్ చేశాను’’ అంటూ స్వయంగా ఆ ఫొటోలను సీఎం రేవంత్ షేర్ చేసుకున్నారు.


