breaking news
Lionel Messi
-
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. మెస్సీ రికార్డు బ్రేక్
సౌదీ ప్రీమియర్ లీగ్‌లో అల్ అఖ్‌దూద్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో అల్-నస్ర్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్, అల్-నస్ర్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రొనాల్డోరెండు మెరుపు గోల్స్‌తో అల్-నస్ర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఈ ఫుట్‌బాల్ స్టార్ మ్యాచ్ 31వ నిమిషంలో ఒక గోల్ చేయగా.. ఫస్ట్ హాఫ్ ఆఖరిలో మరో అద్భుతమైన గోల్ వేశాడు. అతడితో పాటు జోవో ఫెలిక్స్ కూడా ఓ గోల్ సాధించాడు. ఈ విజయంతో సౌదీ ప్రో లీగ్ చరిత్రలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన మొదటి క్లబ్‌గా అల్-నస్ర్ రికార్డు సృష్టించింది.అదేవిధంగా రొనాల్డో కూడా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 202 ఏడాదిలో రొనాల్డో 40 గోల్స్‌ను పూర్తి చేసుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక సార్లు నాలభైకి పైగా గోల్స్ సాధించిన ప్లేయర్‌గా రోనాల్డో చరిత్ర సృష్టించాడు. అతడు తన కెరీర్లో 14 వేర్వేరు సంవత్సరాల్లో 40 పైగా గోల్స్ సాధించాడు.2010 నుంచి దాదాపు ప్రతీ ఏటా రోనాల్డో నాలభైకి పైగా గోల్స్ సాధిస్తున్నాడు. ఒక్క 2019లోనే ఈ మార్క్‌ను అందుకోలేకపోయాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పేరిట ఉండేది. మెస్పీ తన కెరీర్లో ఇప్పటివరకు 13 సార్లు 40 పైగా గోల్స్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో మెస్సీని రొనాల్డో అధిగమించాడు.చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..! -
ఘోర ప్రమాదం మెస్సీ సోదరికి తీవ్ర గాయాలు, పెళ్లి వాయిదా
ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, అతని కుటుంబం కష్టకాలంలో ఉన్నారు. ఆయన సోదరి 32 ఏళ్ల మరియా సోల్ ఒక భయంకరమైన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డారు. మరియా కారు మయామి రోడ్డుపై నియంత్రణ కోల్పోయి కాంక్రీట్ గోడను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలైనాయి. దీంతో త్వరలోజరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. దీంతో మెస్సీ అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు.ఈ ప్రమాదంలో ఆమెకు రెండు వెన్నుపూసలు విరిగిపోయాయి, మడమ విరిగింది, చేయి విరిగింది, తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. అయితే ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటర్ మయామి అండర్-19 జట్టు కోచ్ జూలియన్ 'తులి' అరెల్లానోతో తన వివాహానికి మరియా సిద్ధమవుతోంది. జనవరి 3, 2026న వీరి వివాహం జరగాల్సి ఉంది. అర్జెంటీనా టీవీ జర్నలిస్ట్, ప్రెజెంటర్ ఏంజెల్ డి బ్రిటో, తాను మరియా సోల్ తల్లితో మాట్లాడానని, తన కుమార్తె ప్రమాదం నుండి బయటపడిందని తెలిపారని వెల్లడించారు.🚨🏥 María Sol (Lionel Messi’s sister) was involved in a car accident while driving in Miami and has been forced to postpone her wedding, which was scheduled for January 3, 2026.According to confirmed reports, she lost control of the vehicle and crashed into a wall. As a result… pic.twitter.com/Sae2Uy4Q1Q— FC Barcelona Fans Nation (@fcbfn_live) December 23, 2025 లియోనెల్ మెస్సీ సోదరి మరియా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న వ్యాపారవేత్త డిజైనర్. అంతర్జాతీయ రంగంలో విజయవంతమైన ఫ్యాషన్ బ్రాండ్ బికినిస్ రియో వ్యవస్థాపకురాలు. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పలువురి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించింది. -
మెస్సీ మోజులో 'మన హీరో'పై చిన్నచూపు..!
అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇటీవల (డిసెంబర్ 13-15) గోట్ టూర్ పేరిట భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ టూర్ ఆధ్యాంతం అద్భుతంగా సాగింది. మెస్సీని చూసేందుకు లక్షల సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. ఈ పర్యటనలో మెస్సీ కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించాడు. ప్రతి చోటా మెస్సీకి అనూహ్యమైన ఆదరణ లభించింది. కోల్‌కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొత్తంగా చూస్తే భారత్‌లో మెస్సీ పర్యటన విజయవంతమైంది.ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే మెస్సీ పర్యటనలో భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రీకి అవమానం జరిగిందని ఫుట్‌బాల్ ప్రేమికులు వాపోతున్నారు. ముంబైలో జరిగిన ప్రొగ్రాంలో నిర్వహకులు ఛెత్రీ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని వారంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబైలోని జరిగిన కార్యక్రమంలో నిర్వహకులు ఛెత్రీని అస్సలు పట్టించుకోలేదు.వీఐపీలంతా మెస్సీతో ఫోటోలకు ఫోజులిస్తుంటే, ఛెత్రీ మాత్రం తన వారి మధ్యే అనామకుడిలా స్టేజీ కింద నిల్చుండిపోయాడు. అంతర్జాతీయ స్థాయిలో నాలుగో టాప్ గోల్ స్కోరర్ అయిన ఛెత్రీని నిర్వహకులు మెస్సీ ఫోటో ఉన్న టీ షర్ట్ వేయించి మరింత అవమానించారు. అంతర్జాతీయ స్థాయిలో మెస్సీది, ఛెత్రీది ఇంచుమించు ఒకే స్థాయి. అయినా మెస్సీ ఏదో గొప్ప అయినట్లు అతని ఫోటోను మన హీరో ధరించిన టీ షర్ట్‌పై వేయించడం అవమానకరమని చాలామంది ఫీలవుతున్నారు.ముంబై ప్రొగ్రామ్‌లో వీఐపీలంతా స్టేజీపై అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే ఛెత్రీ స్టేజీ కింద సామాన్యుడిలా అటు ఇటూ తిరుగుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. ఈ వీడియోను చూసిన వారంతా ఛెత్రీకి అతని స్థాయి గౌరవం దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. మెస్సీ గొప్ప ఆటగాడే, అయినా మన దేశంలో ఫుట్‌బాల్ ఉనికిని కాపాడిన ఛెత్రీకి కూడా సమాంతర గౌరవం లభించాలన్నది వారి భావన. విదేశీయుల మోజులో పడి 20 ఏళ్లు భారత్‌లో ఫుట్‌బాల్ వ్యాప్తికి కృషి చేసిన మన హీరోని చిన్నచూపు చూడటం సమంజసం కాదని ప్రతి ఒక్కరి అభిప్రాయం.నిర్వహకులు, పాలకులు సరైన గౌరవాన్ని ఇవ్వకపోయినా మెస్సీ మాత్రం ఛెత్రీ పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మెస్సీ స్వయంగా ఛెత్రీని పలకరించి, హత్తుకుని, తన సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. ఈ దృశ్యం భారత ఫుట్‌బాల్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. భారత ఫుట్‌బాల్ దిగ్గజాన్ని నిర్వహకులు పట్టించుకోకపోయినా మెస్సీ మాత్రం సరైన రీతిలో గౌరవించాడని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్ల జాబితాలో ఛెత్రీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో లాంటి దిగ్గజాలు మాత్రమే ఛెత్రీ కంటే కాస్త ముందున్నారు. 2024 జూన్‌లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఛెత్రీ 151 మ్యాచ్‌ల్లో 94 గోల్స్ చేసి ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గోల్ చేసిన ఆటగాళ్లలో ముఖ్యుడిగా నిలిచాడు. -
వంతారలో మెస్సీ.. వన్య ప్రాణులతో సందడి (ఫోటోలు)
-
మెస్సీకి అనంత్ అంబానీ సర్ప్రైజ్ గిఫ్ట్, ఖరీదెంతో తెలుసా?
ఫుల్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ Goat ఇండియా టూర్' వార్తల్లో నిలుస్తోంది. స్టార్ ప్లేయర్ భారత గడ్డపై అడుగుపెట్టి ఏ నగరంలో పర్యటించినా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా మెస్సీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్థాపించిన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ ఫౌండేషన్ వన్యప్రాణుల రక్షణ, పునరావాస మరియు పరిరక్షణ కేంద్రమైన వంతారను సందర్శించారు. సందర్భంగా ఆ బిలియనీర్ వ్యాపారవేత్త మెస్సీకి అత్యంత అరుదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చారనే ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. అర్జెంటీనా దిగ్గజం మెస్సీతో భేటీ సందర్భంగా ఆ స్టార్‌కు అత్యంత విలాసవంతమైన బహుమతి అందించారు అనంత అంబానీ .మెస్సీకి 1.2 మిలియన్ డాలర్ల విలువైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. దీని విలువ సుమారు రూ. 11 కోట్లు. వంతార సందర్శన కార్యక్రమం మధ్యలో అత్యంత అరుదైన రిచర్డ్ మిల్లే టైమ్‌పీస్‌ను ధరించి కనిపించడం విశేషంగా నిలిచింది. మెస్సీ వాచ్ లేకుండా వచ్చారని, ఆ తర్వాత రిచర్డ్ మిల్లే RM 003-V2 GMT టూర్‌బిల్లాన్ 'ఏషియా ఎడిషన్' ధరించి కనిపించాడు అంటున్నారు పరిశీలకులు.స్పెషల్ ఎడిషన్‌గా వచ్చిన ఈ వాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 మాత్రమే ఉన్నాయట. బ్లాక్ అండ్ వైట్ కార్బన్ కేస్ , స్కెలిటన్ డయల్ ఉన్న ఈ స్పెషల్ వాచ్ మెస్సీ, అనంత అంబానీ మధ్య ఉన్న సన్నిహిత బంధానికి ప్రతీకగా నిలిచింది. అంతేకాదు స్పెషల్ అకేషన్‌కు గుర్తుగా విలాసవంతమైన జీవనశైలికి , ఖరీదైన వాచీలు అంటే ఇష్టపడే అనంత్ వాచ్ రిచర్డ్ మిల్లే RM 056 సఫైర్ టూర్‌బిల్లాన్‌ను ధరించారు. దీని విలువ 5 మిలియన్ డాలర్లు అంటే సుమారు 45.59 కోట్ల రూపాయలు.కాగా మెస్సీ వంతార సాంస్కృతిక, మానవతా భావాలను ప్రతిబింబంగా నిలిచింది. ఇక్కడ అనుసరించే సంప్రదాయాలకు అనుగుణంగా, సాంప్రదాయ హిందూ ఆచారాలలో పాల్గొని ఆశీర్వాదం తీసుకున్నాడు. మహా ఆరతిలో పాల్గొని అంబే మాత పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజ , శైవాభిషేకం లాంటి పూజలు, ప్రార్థనలు చేశాడు. లియోనెల్ మెస్సీ గౌరవార్థం అనంత్ రాధిక అంబానీ ఇష్టమైన సింహం పిల్లకు 'లియోనెల్' అని పేరు పెట్టడం విశేషం. ఇక్కడి సింహాలు, చిరుతలు, పులులు, ఏనుగులు, అధునాతన పశువైద్య సంరక్షణలో అభివృద్ధి చెందుతున్న సరీసృపాలతో సంభాషించాడు మెస్సీ. ముఖ్యంగా బుజ్జి ఏనుగు మాణిక్‌లాల్‌తో ఆటపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.GOAT టూర్ 2025లో భాగంగా లియోనెల్ మెస్సీ ఇండియాలో పలు నగరాల్లో పర్యటించాడు. శనివారం కోల్‌కతాలో అడుగుపెట్టి, అదే అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌ను సందర్శించాడు. ఆ మరుసటి రోజు ముంబై, వంతారా, సోమవారం ఢిల్లీ పర్యటనతో ఈ పర్యటన ముగిసింది. ఈ పర్యటన సందర్భంగా తనకు లభించిన అపారమైన ప్రేమకు లియోనెల్ మెస్సీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాలో ఒక నోట్ పోస్ట్ చేశాడు. -
వంతారాలో లియోనెల్ మెస్సీ
గ్లోబల్ ఫుట్‌బాల్ ఐకాన్.. లియోనెల్ మెస్సీ 'అనంత్ అంబానీ' స్థాపించిన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం & పరిరక్షణ కేంద్రం వంతారాను సందర్శించారు. వంతారాలో కార్యక్రమాలు సాధారణంగా సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం, ప్రకృతి & సమస్త జీవుల పట్ల గౌరవాన్ని చాటే విధంగా ప్రారంభమవుతాయి. ఈ సంప్రదాయాలను గౌరవిస్తూ మెస్సీ కూడా హిందూ ఆచారాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.మెస్సీతో పాటు ఆయన సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డీ పాల్‌కు సంప్రదాయ జానపద సంగీతం, పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. ఆ తరువాత అంబే పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజ, శివాభిషేకంతో కూడిన మహా ఆరతిలో పాల్గొని, ప్రపంచ శాంతి & ఐక్యత కోసం ప్రార్థించారు.వంతారాలో మెస్సీ .. సింహాలు, పులులు, ఏనుగులు, శాకాహార జంతువులు, సరీసృపాలు, జంతు పిల్లలను చూశారు. జంతువులకు అందిస్తున్న ఆధునిక వైద్య సదుపాయాలు, పోషణ, సంరక్షణ పద్ధతులు చూసి ఆయన ఎంతో సంతోషించారు. ప్రత్యేక వన్యప్రాణి ఆసుపత్రిలో జరుగుతున్న చికిత్సలు, శస్త్రచికిత్సలను ప్రత్యక్షంగా వీక్షించారు. అలాగే జిరాఫీలు, ఖడ్గమృగాలు, ఒకాపీలు, ఏనుగులకు ఆహారం కూడా పెట్టారు.అనాథ & బలహీన జంతు పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఫోస్టర్ కేర్ సెంటర్లో, వాటి జీవన ప్రయాణాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ & రాధిక అంబానీ కలిసి ఒక సింహపు పిల్లకు మెస్సీ గౌరవార్థంగా “లియోనెల్” అని పేరు పెట్టారు. ఈ పర్యటనలో అత్యంత గుర్తుండిపోయే సంఘటన ఏనుగుల సంరక్షణ కేంద్రంలో జరిగింది. అక్కడ ఏనుగు పిల్ల 'మణిక్లాల్'తో మెస్సీ సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. ఆట ద్వారా జంతువులతో అనుబంధాన్ని చూపిస్తూ, ఆట అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యే భాష అని నిరూపించారు. ఆ దృశ్యం అక్కడున్న అందరి మనసులను ఆకట్టుకుంది. -
West Bengal: క్రీడాశాఖ మంత్రి రాజీనామా
ఢిల్లీ: ఇటీవల అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రాక సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో చోటు చేసుకున్న విధ్వంసానికి బాధ్యత వహిస్తూ క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేయగా దాన్ని సీఎం మమతా బెనర్జీ ఆమోదించారు. ఈనెల 13వ తేదీన తేదీన బెంగాల్లో మెస్సి రాక సందర్భంగా చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. ఘటన జరిగిన రోజు క్రీడాకారులకు క్షమాపణ చెప్పిన మమత బెనర్జీ.. ఆ విధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు చేపట్టారు. ఈవెంట్ ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లను ఇప్పటికే అరెస్ట్ చేయగా, తాజాగా క్రీడామంత్రి రాజీనామాను సైతం ఆమోదించారు మమతా.లియోనెల్ మెస్సీ కార్యక్రమంలో గందరగోళం, విధ్వంసం పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డిజిపి రాజీవ్ కుమార్, బిధన్ నగర్ సిపి ముఖేష్ కుమార్, యువజన వ్యవహారాలు & క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హా లకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.కార్యక్రమం జరిగిన రోజున తన విధులు, బాధ్యతలలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిసిపి అనీష్ సర్కార్ (ఐపిఎస్) పై శాఖాపరమైన చర్యలు చేపట్టిందిప్రభుత్వం. -
కోల్‌కతాలో అలా.. ముంబైలో ఇలా..
ఎవరైనా బాగా పనిచేస్తే ప్రశంసలు దక్కడం సహజం. మీరిక్కడ చూస్తున్న ఫొటో అలాంటి సందర్భంలోదే. ముంబై పోలీసులను ఫుట్‌బాల్ అభిమానులు మెచ్చుకుంటున్న దృశ్యంలోని ఫొటోలివి. వాంఖడే స్టేడియం వద్ద ఆదివారం అరుదైన దృశ్యాలు కనిపించాయి. వందలాది మంది అభిమానులు పోలీసుల ఎదుట గుమిగూడి చప్పట్లు కొడుతూ.. 'థ్యాంక్యు' అంటూ నినదించారు. అంతమంది తమను పొగుడుతుంటే ముంబై పోలీసులు చిరునవ్వులు చిందిస్తూ చూస్తుండి పోయారు.అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లయోనల్ మెస్సీ (Lionel Messi).. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో సందడి చేశాడు. ఆయనను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేస్తూ మెస్సీ పలకరించడంతో వారంతా ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేశారు. మెస్సీతో పాటు స్టేడియంలో ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి, బాలీవుడ్ హీరోలు అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్ అదనపు ఆకర్షణగా నిలిచారు. వీరందరినీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.చప్పట్లు కొడుతూ.. థ్యాంక్స్కార్యక్రమాలన్నీ సజావుగా సాగడంతో వాంఖడే స్టేడియానికి వచ్చిన అభిమానులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేడియం నుంచి వెళుతూ ముంబై పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు. తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని మెచ్చుకున్నారు. ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారాయి. ఈ వీడియోలు చూసిన వారంతా ముంబై పోలీసులపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముంబై పోలీసు సిబ్బంది బాగా పనిచేస్తారని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.అర్థమవుతోందా?''శాంతిభద్రతల నిర్వహణ పరంగా ముంబై పోలీసు (Mumbai Police) వ్యవస్థ ఉత్తమమైనది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. వారు ప్రతిదీ సజావుగా నిర్వహిస్తార''ని ఓ నెటిజన్ ప్రశంసించారు. "నిస్సందేహంగా ఇది ఉత్తమ పోలీసు విభాగం, ఏడాది పొడవునా వారు ఇంత మంది ప్రజలను దారిలో పెడుతుంటారు. ఇది వారికి మామూలు రోజు లాంటిదేన''ని మరొకరు మెచ్చుకున్నారు. ''గౌరవం హృదయం లోపలి నుండి రావాలి. మీరు వారిని అర్థం చేసుకోవాలి'' అంటూ కోల్‌కతా పోలీసులను ఉద్దేశించి మరో నెటిజన్ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pratik Pawaskar (@pawaskarpratik)కోల్‌కతాలో ఏం జరిగింది?శనివారం కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ సేడియంలో మెస్సీ అభిమానులు (Messi Fans) విధ్వంసం సృష్టించారు. మెస్సీ కోసం ఎంతోగానే ఎదురు చూసిన అభిమానులను నిరాశకు గురిచేయడంతో వారంతా తీవ్రంగా స్పందించారు. తమ ఆరాధ్య ఫుట్‌బాలర్ పట్టుమని 10 నిమిషాలు కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రశావేశాలకు లోనయ్యారు. వాటర్ బాటిళ్లు, కుర్చీలను మైదానంలోకి విసిరేశారు, ఫ్లెక్సీలు చించేశారు. అభిమానుల వీరంగంతో సాల్ట్‌లేక్ సేడియం రణరంగంగా మారిపోయింది. అభిమానులను నియంత్రించలేక కోల్‌కతా పోలీసులు చేతులెత్తేశారు. మరోవైపు ఈవెంట్ నిర్వాహకుడు శరత్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పౌరుల ప్రవర్తన, ఈవెంట్ నిర్వహణ వైఫల్యంపై మెస్సీకి క్షమాపణలు చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కాగా, అభిమానులకు టిక్కెట్ డబ్బులు వెనక్కు ఇచ్చేస్తామని నిర్వహకుడు ప్రకటించడం గమనార్హం.చదవండి: మెస్సీ అందుకే ఇండియాలో మ్యాచ్‌లు ఆడలేదు! -
అక్షరాలా రూ.8 వేల కోట్లు!
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన లయోనల్ మెస్సీ గత మూడు రోజులుగా భారత్‌లో పర్యటిస్తున్నాడు. నాలుగు నగరాలు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో అతని ఈవెంట్లు జరిగాయి. అయితే ఒక్క చోట కూడా అతను అభిమానుల కోసం ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడలేదు కదా... కనీసం సెమీ సీరియస్ తరహా ఆటను కూడా చూపించలేదు. టీ షర్ట్, ట్రాక్‌తో ఏదో పార్క్‌లో జాగింగ్‌కు వెళుతూ తన వద్దకు వచ్చిన బంతిని అవతలి వారికి ఇచి్చనట్లుగా పాస్‌లు మాత్రమే అందించాడు! కొద్దిగానైనా అతను మైదానంలో చురుగ్గా పరుగెత్తుతూ ఆడినట్లుగా కనిపించలేదు. ఫోటో సెషన్లు, మైదానంలో అభిమానులకు చేతులు ఊపడం, కొన్ని కిక్‌లకు మాత్రమే మెస్సీ పరిమితయ్యాడు. దీనికి బలమైన కారణం ఉంది. తన ఆటకు ఆయువుపట్టులాంటి ఎడమ పాదానికి అతను బీమా చేయించుకున్నాడు. ఈ బీమా విలువ అక్షరాలా 900 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8 వేల కోట్లు)! మ్యాచ్ ఆడుతూ మైదానంలో అతని పాదానికి గాయమైతే బీమా సంస్థ బాధ్యత తీసుకుంటుంది. అయితే ఈ బీమాలో ఉన్న షరతుల ప్రకారం ఇది జాతీయ జట్టు (అర్జెంటీనా) లేదా తన క్లబ్ (ఇంటర్ మయామి) తరఫున ఆడుతున్నప్పుడు మాత్రమే ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. సరదాగానైనా సరే... మరో చోట ఎక్కడైనా ఆడుతూ పొరపాటున గాయమైతే ఇది వర్తించకపోగా, న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతాయి. భారత్‌లాంటి చోట ఏదైనా అనూహ్యం జరిగి గాయపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి మెస్సీ అలాంటి సాహసం చేయలేదు! కేవలం అలా పైపై హడావిడితో అతను పర్యటన ముగించాడు. ఒకప్పుడు బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్‌కు కూడా కెరీర్ ఆరంభంలో ఇలాంటి సమస్యే వచ్చింది. అయితే తర్వాతి రోజుల్లో కాంట్రాక్ట్ పునరుద్ధరణ చేసుకునే సమయానికి సూపర్ స్టార్‌గా మారిపోయిన అతను తనకు అనుకూలంగా ఒక క్లాజ్‌ను అందులో చేర్పించాడు. ‘లవ్ ఆఫ్ ద గేమ్’ అంటూ తాను ఎప్పుడైనా, ఎక్కడైనా తనకు నచి్చనట్లుగా ఆడతానని, ఎలాంటి షరతులు పెట్టరాదని, మామూలు మ్యాచ్‌లో గాయపడినా బీమా చెల్లించాల్సిందేనంటూ అతను ఒప్పందం చేసుకున్నాడు! -
టీమిండియా జెర్సీ, బ్యాట్, వరల్డ్ కప్ టికెట్!
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ మూడు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ టూర్లో భాగంగా నాలుగు నగరాల్లో పర్యటించిన మెస్సీ అభిమానులకు వీడ్కోలు పలుకుతూ స్వదేశం బయల్దేరాడు. చివరి రోజు సోమవారం ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో మెస్సీ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, ముంబైల తరహాలోనే ఇక్కడి షో కూడా సరదాగా సాగింది. అభిమానుల మధ్య దాదాపుగా అవే దృశ్యాలు ఇక్కడా పునరావృతమయ్యాయి. చిరునవ్వుతో తిరుగుతూ అభివాదం చేసిన అతను ఆ తర్వాత 7x7 సెలబ్రిటీ మ్యాచ్‌ను తిలకించాడు. సహచరులు స్వారెజ్, రోడ్రిగోలతో కలిసి మెస్సీ తన కిక్‌లతో కొన్ని బంతులను స్టాండ్స్‌లోకి పంపించడంతో ఫ్యాన్స్ సంబరపడ్డారు. మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ జై షా పాల్గొన్న కార్యక్రమం విశేషంగా నిలిచింది. మెస్సీ, స్వారెజ్, రోడ్రిగోల పేర్లు, నంబర్లు రాసి ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రత్యేక ‘బ్లూ’ జెర్సీలను వారికి కానుకగా ఇవ్వడంతో పాటు 2024 టి20 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుల సంతకాలతో కూడిన ప్రత్యేక బ్యాట్‌ను కూడా బహుకరించారు. భారత్‌లో జరిగే 2026 టి20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ (భారత్ x అమెరికా) టికెట్‌ను కూడా మెస్సీకి జై షా ఇచ్చారు. ప్రధానితో భేటీ లేదు... ఢిల్లీ కార్యక్రమంలో ముందుగా అనుకున్న విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలవలేదు. వీరిద్దరి భేటీ కోసం ప్రత్యేకంగా 21 నిమిషాల ప్రొటోకాల్‌ను కూడా అధికారులు సిద్ధం చేశారు. అయితే ప్రధాని జోర్డాన్ పర్యటనకు వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమం రద్దయింది. ‘మళ్లీ వస్తా’ భారత్‌లో నాకు లభించిన ప్రేమాభిమానాలకు ఎంతో కృతజు్ఞడను. ఈ పర్యటన చిన్నదే కావచ్చు కానీ నిజంగా చాలా గొప్ప అనుభవం. నన్ను ఇక్కడి వాళ్లు ఎంతో అభిమానిస్తారని వింటూ వచ్చిన మాటలు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇక్కడ ఉన్నన్ని రోజులు మాతో వ్యవహరించిన తీరు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. మీ ప్రేమను మాతో పాటు తీసుకెళుతున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇక్కడికి తిరిగి వస్తాను. అది మ్యాచ్ ఆడటానికి కావచ్చు లేదా మరో సందర్భం కావచ్చు కానీ భారత్‌లో మాత్రం మళ్లీ అడుగు పెడతా. అందరికీ కృతజ్ఞతలు. –మెస్సీ -
‘గోట్ టూర్’తో ఒరిగిందేమిటి?.. అదొక్కటే సంతృప్తి!
ఆటను మించి.. అందరి మీదా ప్రభావం చూపిన అరుదైన అథ్లెట్లలో లియోనల్ మెస్సీ ఒకడు. చిన్నతనంలో ఎదుర్కొన్న శారీరక సమస్యలను అధిగమించి.. మేటిస్థాయి ఫుట్‌బాలర్‌గా అతడి ప్రయాణం అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసులు చూరగొన్న అత్యంత అద్భుతమైన ఆటగాడు అతడు.ఓ అథ్లెట్ జీవితం ఎలా ఉంటుందో నాకూ తెలుసు. అందుకే అతడి పట్ల గౌరవ మర్యాదలు, ప్రేమ, ఆరాధానభావం కలిగిన వాళ్లను ఏరకంగానూ తప్పుబట్టను. ఇటీవలే మెస్సీ భారత పర్యటనకు వచ్చాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు నాకు బాధ కలిగించాయి. కాస్త అసౌకర్యానికి గురిచేశాయి.ఈ హంగామా అంతా ఎందుకు?.. నేనేమీ ఈ విషయంలో న్యాయనిర్ణేతగా ఉండదలచుకోలేదు. కానీ ఈ తంతుతో మనం ఏం సాధించాలనుకుంటున్నామన్న ప్రశ్న నా మదిని తొలచి వేస్తోంది. క్రీడల చుట్టూ ఉండే ఆర్థిక విషయాల గురించి నాకు అవగాహన ఉంది. వాణిజ్యపరంగా, బ్రాండ్ ప్రమోషన్ల కోసం ఇలా చేస్తారనే స్పృహ కూడా ఉంది.ఇక్కడ నేను ఏ రకంగానూ మెస్సీని తప్పుబట్టడం లేదు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అతడు దిగ్గజ స్థాయికి చేరాడు. అందుకు అతడి పట్ల ఆరాధనా భావం ఉండటం సహజమే. ఎదిగినా ఒదిగి ఉండటం కూడా గొప్ప విషయం.అయితే, అభిమానం పేరుతో చేసే పనులు కూడా ఒక్కోసారి జడ్జ్ చేయబడతాయి. సమాజంలో క్రీడా సంస్కృతిని విస్తరించే బదులు.. మనం వ్యక్తి పూజకు పరిమితం అవుతున్నాం. లెజెండ్ల ఫొటోల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం. తాము నిజాయితీగా సంపాదించుకున్న డబ్బును ఇష్టారీతిన ఖర్చు పెట్టుకునే హక్కు ప్రజలకు ఉంటుందనేది నిజం.కానీ ఎందుకో నా మనసు బాధతో మూలుగుతోంది. అతడి రాక, కార్యక్రమం విజయవంతం చేయడంలో పెట్టిన శ్రద్ధలో.. కాస్తైనా మన దేశంలోని క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పెట్టగలరా? స్వేచ్ఛగా పరిగెడుతూ ఆడుకునేందుకు ఇరుకుల్లేని మైదానాలు చిన్నారుల కోసం నిర్మించగలరా?యువతరానికి మార్గదర్శనం చేసే కోచ్‌లను నియమించగలరా? ఆటలు కూడా చదువులో భాగంగా ఉంటాయి.. రోజూవారీ జీవితంలో అవీ భాగమే అని ఉపాధ్యాయులచే చెప్పించగలరా? బాల్యం నుంచే క్రీడాకారులకు బలమైన పునాది వేయగలరా?.. ఇవన్నీ జరిగితే బాగుంటుంది.క్రీడల్లో గొప్పగా కనిపిస్తున్న దేశాలు ఒక్కరోజులోనే అదంతా సాధించలేదు. సాధారణ పిల్లాడు కలగన్న అసాధారణ కలలు నెరవేరడానికి వ్యవస్థలను సృష్టించి.. వాటిని సక్రమంగా నడిపిస్తున్నాయి. మెస్సీ వంటి ఐకాన్లు మనందరికీ ఆదర్శం. అయితే, ఇలాంటి కార్యక్రమాలతో పాటు.. క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేసేందు చొరవ, నిబద్ధత అవసరం.మెస్సీ వంటి దిగ్గజాలను గౌరవించాలంటే ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి ఉండదు. దేశంలో క్రీడాకారుడు కావాలనుకునే ప్రతి చిన్నారికి ప్రోత్సాహం ఇవ్వడమే క్రీడా సంస్కృతికి, దిగ్గజాల వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇది దోహదపడుతుంది-భారత్‌కు విశ్వక్రీడల్లో మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణం అందించిన షూటర్ అభినవ్ బింద్రా మనుసులోని ఆవేదనకు ప్రతిరూపం ఇది. అతడొక్కడే కాదు.. దేశంలోని సగటు క్రీడాభిమాని మనసును తొలచి వేస్తున్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఈ మాటలు.గోట్ టూర్లో భాగంగాఅర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ గోట్ టూర్లో భాగంగా శనివారం భారత్‌కు వచ్చాడు. ఈ ఈవెంట్ కోసం కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. అభిమానులు సైతం వేలాది రూపాయలు పోసి కొన్న టికెట్లతో మైదానాలకు వచ్చారు. అతడితో ఫొటో దిగేందుకు రూ. 10 లక్షలు అని చెప్పినా చాలా మంది ముందడుగే వేశారు.మెస్సీని తప్పుబట్టాల్సిన పనిలేదుమెస్సీ క్రేజ్‌కు ఇదొక నిదర్శనం. క్రికెట్‌ను మతంగా భావించే దేశంలోనూ ఈ స్థాయిలో అభిమానులు ఉండటం అతడిలోని క్రీడాకారుడు గర్వించదగ్గ విషయం. అభినవ్ బింద్రా చెప్పినట్లు ఈ విషయంలో ఏ రకంగానూ మెస్సీని తప్పుబట్టాల్సిన పనిలేదు.అయితే, మెస్సీ పట్ల ప్రేమను చూపిస్తున్న కొంత మందికి స్థానిక హీరో సునిల్ ఛెత్రి ఘనతల గురించి అసలు తెలిసి ఉండకపోవచ్చు. నయా జమానాలో భారత ఫుట్‌బాల్‌కు టార్చ్‌బేరర్‌లా ఉన్న భాయిచుంగ్ భుటియా గురించి కూడా అతి కొద్దిమందికే తెలిసి ఉండవచ్చు.దేశం కోసం, దేశంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెంచేందుకు ఎంతగానో కష్టపడిన ఇలాంటి హీరోలకు ఈ స్థాయిలో సన్మానం జరిగిన దాఖలాలు లేవన్నది పలువురి వాదన. మెస్సీతో పోలిస్తే వారి క్రేజ్ తక్కువే కావచ్చు.. కానీ ఆట, అందుకోసం వారు పడ్డ శ్రమ అతడి హార్డ్వర్క్కు ఏమీ తీసిపోవు. స్థానిక హీరోలు గుర్తున్నారా?మరి వారికి దక్కుతున్న ‘ప్రత్యేక గుర్తింపు’ ఏమిటి? క్రికెటర్లపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్న చాలా మంది.. ఛెత్రి లాంటి ఫుట్‌బాలర్ల గురించి, వారి కృషి గురించి కాస్తైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా?ఐపీఎల్లో ఆడే విదేశీ కుర్ర క్రికెటర్ల గురించి కూడా మనకో అవగాహన ఉంటుంది. కానీ వీరి సేవలను, వీరు ఆడే మ్యాచ్‌లను కనీసం పట్టించుకుంటామా?.. అఫ్కోర్స్ ఇష్టమైన ఆటను ఆరాధించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ మెస్సీ.. ఛెత్రి.. ఇద్దరూ ఫుట్‌బాలర్లే. అయితే, వారిపై చూపించే ప్రేమ, ఆదరణంలో తేడా ఉండటం విచారకరం. మెస్సీ రాకతో మనకు ఒరిగిందేమిటి?సరే.. మెస్సీ టూర్‌తో భారత క్రీడా వ్యవస్థకు ఏమైనా లాభం చేకూరుతుందా? లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఇదొక కమర్షియల్ టూర్ తప్ప.. దీని వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం లేదని అభినవ్ బింద్రా వంటి మేటి అథ్లెట్లు కూడా చెబుతున్నారు. ఇంతకీ మెస్సీ రాకతో మనకు ఒరిగిందేమిటి?.. డబ్బున్న వాళ్లకు.. అతడిని నేరుగా చూసే వన్స్ ఇన్ ఏ లైఫ్‌టైమ్ ఛాన్స్, ఫొటోలు దిగడం తప్ప!..అదొక్కటే సంతృప్తిఅన్నట్లు ఈ టూర్లో భాగంగా ముంబైలోని వాంఖడేలో మెస్సీ.. ఛెత్రిని ఆలింగనం చేసుకోవడం, అతడికి తన సంతకంతో కూడిన జెర్సీని ఇవ్వడం భారత సగటు ఫుట్‌బాల్ అభిమానికి సంతృప్తినిచ్చిన క్షణాల్లో ఒకటి. అదే విధంగా.. ప్రాజెక్ట్ మహాదేవ పేరిట రాష్ట్రంలో ఫుట్‌బాల్ ప్రతిభను వెలికితీస్తామని ప్రకటించడం ఇక్కడి హైలైట్లలో ఒకటి. చదవండి: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!చదవండి: Lionel Messi Net Worth 2025: నెలకు రూ. 41 కోట్లకు పైగానే.. మెస్సీ నెట్‌వర్త్ ఎంతో తెలుసా?Messi ignored everyone but hugged Sunil Chhetri. He knows the Greatest Footballer of our Nation. 🥹🐐pic.twitter.com/MqqyVmt2Gx— Selfless⁴⁵ (@SelflessCricket) December 14, 2025 -
మెస్సీ భాయ్.. మరి నీ లంగ్స్‌కు ఇన్సూరెన్స్ చేయించావా?
ఫుట్‌బాల్ రారాజు లియోనెల్ మెస్సీ భారత పర్యటన చివరి అంకానికి చేరుకుంది. గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా దేశ రాజధానిలో ఇవాళ ఈ స్టార్ ప్లేయర్ పర్యటించబోతున్నారు. అయితే ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న వేళ.. ఈ పర్యటనపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఢిల్లీ పొల్యూషన్ గ్యాస్ ఛాంబర్‌ను తలపిస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో.. విద్యాసంస్థలకు, ఆఫీసులకు ఊరట ఇచ్చే నిర్ణయాలు తీసుకుంది అక్కడి అధికార యంత్రాంగం. ఈ తీవ్ర వాయుకాలుష్యానికి దట్టమైన పొగమంచు తోడైంది. చాలా చోట్ల జీరో విజిబిలిటీతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితుల మధ్య అర్జెంటీనా ఫుట్‌బాల్ వీరుడు రావడంపై జోకులు ఇలా ఉన్నాయి.. 🤧మెస్సీ బాయ్.. ఢిల్లీకి మీకు స్వాగతం. మీ ఎడమ కాలిని 900 మిలియన్ డాలర్లకు((దాదాపు ₹7,500 కోట్లకు పైగా) ఇన్సూరెన్స్ చేయించారని విన్నా. ఇంతకీ మీ ఊపిరితిత్తులకు ఇన్సురెన్స్ చేయించారా?😬విరాట్ కోహ్లి.. మెస్సీ.. ఇది గోట్లు కలిసి చేయబోయే సందడి కోసం ఢిల్లీ ఎదురు చూస్తోంది. కానీ, ఆ దృశ్యం ఇలా ఉండొచ్చు.. అంటూ మసకగా ఉన్న ఇద్దరి ఫొటోను ఓ నెటిజన్ పోస్ట్ చేశాడుFans are waiting to see Virat Kohli and Leo Messi together in Delhi.Meanwhile, this is how the photo would probably look in Delhi air. 😭 pic.twitter.com/xvln8edSu8— Selfless⁴⁵ (@SelflessCricket) December 14, 2025😓మెస్సీ తన కెరీర్లో ఇప్పటిదాకా 896 గోల్స్ చేశారు.. ఇప్పుడు ఢిల్లీ ఏక్యూఐ(వాయు నాణ్యత) ఆ రికార్డును బద్ధలు కొడుతుందేమో! 😎మెస్సీకి పొగ తాగే అలవాటు లేదు. కానీ, ఈ ఒక్కరోజే ఆయన 20 సిగరెట్లు తాగుతారేమో!.. అంటూ ఢిల్లీ పొల్యూషన్‌ను అన్వయించి సెటైర్లు వేస్తున్నారు. కోల్‌కతా మినహాయించి హైదరాబాద్, ముంబైలో మెస్సీ పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ఫుట్‌బాల్ అభిమానుల కోలాహలం నడుమ స్టేడియంలో మెస్సీ సందడి చేశాడు. ఇక్కడి అభిమానానికి ముగ్దుడైనట్లు ప్రకటించాడు. నేటితో ఈ టూర్ ముగియనుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ ఈవెంట్‌కు ప్రధాని మోదీ సైతం హాజర కావొచ్చనే ప్రచారం వినిపించినప్పటికీ.. విదేశీ పర్యటనల నేపథ్యంలో అది జరగకపోవచ్చనే తెలుస్తోంది.లియోనెల్ మెస్సీ ఎడమ కాలికి సుమారు 900 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆయన ఎడమ కాలే ఆటలో ప్రధాన బలం. గోల్స్, ఫ్రీకిక్స్, డ్రిబ్లింగ్ అన్నీ ఎక్కువగా ఎడమ కాలుతోనే చేస్తారు. ఒకవేళ ఏదైనా గాయమై ఆట కొనసాగించలేని పరిస్థితి వస్తే.. క్లబ్‌లు, స్పాన్సర్లకు ఆర్థిక రక్షణ లభించేందుకు ఇంత భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించారు. అసలు ఈ భారీ ఇన్సూరెన్స్ కారణంగా, మెస్సీ ఇండియా టూర్ 2025లో పూర్తి మ్యాచ్ ఆడలేకపోతున్నారు. ఎందుకంటే.. ఆయనకు అనుమతి ఉన్నది కేవలం అర్జెంటీనా జాతీయ జట్టు, తన క్లబ్ (Inter Miami) తరఫున మాత్రమే పూర్తి మ్యాచ్‌లు ఆడటానికి. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు లేదా ఇతర ఈవెంట్లలో పూర్తి స్థాయిలో ఆడితే, ఇన్సూరెన్స్ నిబంధనలు ఉల్లంఘన అవుతాయి.మెస్సీ మాత్రమే కాదు.. ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు ఇతర క్రీడాకారులకు కూడా ఉన్నాయి. ఫుట్‌బాల్ హీరోలు క్రిస్టియానో రొనాల్డో తన కాళ్లకు, డేవిడ్ బెక్‌హమ్ తన ముఖానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అయితే.. మెస్సీ ఎడమ కాలు ఇన్సూరెన్స్ విలువ ప్రపంచంలోనే అత్యధికంగా భావించబడుతోంది. -
ఏఐతో.. 'మెస్సీ'మరైజ్! సెల్ఫీ రూ. 10 లక్షలు..
వెర్రి వేయి తలలు.. అంటే ఇదేనేమో?!.. దీనికి తాజా ఉదాహరణే ఇది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ భాగ్యనగరంలో గడిపింది కేవలం కొన్ని గంటలే. ఆయన పర్యటన శంషాబాద్ విమానాశ్రయం–తాజ్ ఫలక్‌నుమ–ఉప్పల్ స్టేడియం మధ్యే జరిగింది. అయినప్పటికీ మెస్సీతో వేల మంది ఫొటోలు దిగారు. కొందరైతే తాము వండిన వంటల్నీ ఆ ఆటగాడికి రుచి చూపించారు. మరికొందరు ఫుట్‌బాల్‌తో పాటు ఇతర ఆటలు సైతం మెస్సీతో ఆడించేశారు. వీటిని సంబంధించిన ఏఐ ఫొటోలు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ కల్పిత ఫొటోల హడావుడి నేపథ్యంలో నిజంగా మెస్సీతో ఫొటో దిగిన వాళ్లు తమ ప్రత్యేకతను చాటుతూ పోస్టు చేయలేని, చేసినా నమ్మలేని పరిస్థితి నెలకొంది. సామాజిక మాధ్యమాల రాకతో ప్రతి ఒక్కరూ గ్లోబల్ ప్లాట్ఫామ్లో భాగస్వాములయ్యే అవకాశం దక్కింది. దీంతో పాటు ఇటీవల అందుబాటులోకి వచ్చిన గూగుల్ జెమినీ, పర్ప్లెక్సిటీ, చాట్‌జీపీటీ వంటి మాధ్యమాల రాకతో నిజానికి, అబద్దానికి మధ్య తేడా గుర్తించడం సామాన్యులకు కష్టమైన పరిస్థితిగా మారిపోయింది. వీటిలో కొన్ని ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా, ఆనందంగానూ అనిపిస్తుంటి.. మరికొన్ని బాధను కలిగించే పోస్టులు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే పోస్టులు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. అదే అర్జంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీతో దిగిన ఫేక్ సెల్ఫీ ఫొటోలు. మెస్సీతో మేముసైతం.. మెస్సీ హైదరాబాద్ టూర్, సీఎం ఎ.రేవంత్‌రెడ్డితో ఫుట్‌బాల్ మ్యాచ్ తదితరాలకు సంబంధించి దాదాపు నెల రోజుల క్రితమే అప్డేట్ వచ్చింది. అయితే మూడు రోజుల క్రితం వరకు ఏఐ చిత్రాల హడావుడి సోషల్‌మీడియాలో కనిపించలేదు. ‘మెస్సీతో సెల్ఫీ దిగడానికి రూ.10 లక్షలు చెల్లించాలి.. అది కూడా కేవలం వంద మందికి మాత్రమే అవకాశం’ అంటూ ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ఈ ఏఐ చిత్రాల ప్రతిసృష్టి ప్రారంభమైంది. తాము మెస్సీ వద్దకు వెళ్లి, రూ.10 లక్షలు చెల్లించి ఫొటో ఎందుకు దిగాలంటూ కామెంట్స్ చేస్తున్న సిటిజనులు ఆ ఫుట్‌బాల్ దిగ్గజంతో రూపొందించిన ఏఐ చిత్రాలను తమ సోషల్‌మీడియాలో ఖాతాల్లో పోస్టు చేస్తూ మెస్సీనే వారి వద్దకు వచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిత్రంగా, విచిత్రంగా.. ఉప్పల్ స్టేడియంలో ఏ క్రికెట్ మ్యాచ్ జరిగినా కీడ్రాభిమానుల సోషల్‌మీడియా ఖాతాలన్నీ సంబంధిత ఫొటోలతో నిండిపోతాయి. స్పోర్ట్స్ టీషర్టులు, ముఖానికి రంగులతో స్టేడియం లోపల, చుట్టుపక్కల దిగిన ఫొటోలను పోస్టు చేస్తుండటం పరిపాటే. మెస్సీ టూర్ నేపథ్యంలో తెరపైకి వచ్చిన ‘సెల్ఫీ–రూ.10 లక్షల’ అంశంతో వీటితో పాటు ఏఐ చిత్రాలూ సోషల్‌మీడియా ఖాతాలను ముంచెత్తాయి. కొందరు మెస్సీని స్టేడియంలోని తమ గ్యాలరీల్లోకి వచ్చి, తమతో ఫొటోలు దిగినట్లు సృష్టిస్తున్నారు. మహిళలు, యువతులైతే మరో అడుగు ముందుకు వేశారు. ఏకంగా మెస్సీని నేరుగా తమ ఇళ్లకే తీసుకెళ్లిపోయారు. హాలు, వంటిల్లు అన్న తేడా లేకుండా కూర్చోబెట్టి బిర్యానీ, పులిహోర తినిపిస్తున్నట్లు, వండిస్తున్నట్లు కూడా ఏఐ ఫొటోలు సృష్టించి సోషల్‌మీడియాల్లో పోస్టు చేశారు. ఆడించి.. ఓడించి.. సిటీ టూర్లో భాగంగా మెస్సీ–సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్, సింగరేణి ఆర్ఆర్–9 జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. క్రీడాకారులు, ప్రముఖులు, యాంకర్లతో కలిపి ఈ మ్యాచ్‌లో మొత్తం 50 మంది కూడా పాల్గొనలేదు. అయితే సోషల్‌మీడియా వేదికగా మాత్రం మెస్సీ లక్షల మందితో ఫుట్‌బాల్, క్రికెట్, బాస్కెట్ బాల్‌తో పాటు కబడ్డీ కూడా ఆడేశాడు. ఆయన తమతో ఆయా ఆటలు ఆడినట్లు, ఆడలేక ఓడినట్లు ఏఐ చిత్రాలను సృష్టించిన నెటిజనులు సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. కొందరైతే చారి్మనార్, గోల్కొండ, ఫలక్‌నుమ ప్యాలెస్ వద్ద మెస్సీతో కలిసి హైదరాబాద్ చాయ్ తాగుతున్నట్లు, ఆయనే ఫాస్ట్‌ఫుడ్ తయారు చేస్తున్నట్లు సృష్టించారు. ఈ ఏఐ ఫొటోలను సృష్టించి వైరల్ చేసిన వారిలో సమాన్యులే కాదు.. కొందరు ప్రముఖులు, నాయకులు, యాంకర్లు సైతం ఉండటం గమనార్హం. (చదవండి: ఆ దేశంలో న్యాప్ కేఫ్‌లు ఉంటాయి!) -
ఫ్యాన్స్ ఫుట్‌బాల్ ఆడేసుకున్నారు
ఫుట్‌బాల్ దేవుడు లియోనెల్ మెస్సీని కళ్లారా చూసేందుకు కోల్‌కతాలో అభిమానుల సాహసాలు, పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. కొందరు వేలకు వేలు చెల్లించగా, ఓ అభిమాని ఏకంగా తన పెళ్లి వేడుకలను పక్కనపెట్టి స్టేడియానికి వచ్చాడు. కానీ, అంతిమంగా వారందరికీ మిగిలింది తీవ్ర నిరాశే. ’గోట్ టూర్ 2025’లో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ అడుగుపెట్టినప్పటికీ, ఆయన ముందుగానే నిష్క్రమించడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ అస్తవ్యస్థ, పేలవమైన నిర్వహణతో వేలాది మంది అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మెస్సీ కనిపించలేదు.. కార్పెట్ తీసుకుపోతున్నా! మెస్సీని దగ్గరగా చూడాలని రూ.10,000 చెల్లించిన ఓ అభిమాని, తీవ్ర నిరాశతో.. ఆవేశంతో ఊగిపోయాడు. స్టేడియం లోపలికి చొచ్చుకొచ్చి.. ఏకంగా మైదానంలోని గడ్డి కార్పెట్‌ను చుట్టి, మోసుకుపోతూ కనిపించాడు. ‘మెస్సీ ముఖం కూడా కనిపించలేదు. చాలా డబ్బు పోయింది, అందుకే ఈ కార్పెట్‌ను ఇంటికి తీసుకెళ్లి ప్రాక్టీస్ చేస్తా!’.. అని ఆగ్రహం, వ్యంగ్యం మిళితమైన స్వరంతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. నెటిజన్లు అతన్ని ’అత్యంత ప్రాక్టికల్ అభిమాని’గా అభివరి్ణంచారు. మెస్సీ కంటే ఎక్కువ సేపు స్టేడియంలో ఆ కార్పెట్ మాత్రమే ఉందంటూ మీమ్స్ వెల్లువెత్తాయి. కుండీలు మోసుకెళ్లిన మరో అభిమాని కార్పెట్ దొంగతనం జరిగిన కొద్దిసేపటికే, మెస్సీ జెర్సీ ధరించిన మరో వ్యక్తి సైతం మైదానం నుంచి రెండు పూలకుండీలను మోసుకెళ్తూ కనిపించాడు. పూలకుండీలను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా.. ‘వీటి ని మా ఆవిడకు ప్రేమగా బహుమతిగా ఇస్తాను’.. అని ఆ వ్యక్తి చెప్పాడు. అభిమానులు అందినకాడికి స్టేడియంలోని వస్తువులను దోచుకుపోయారు. మొత్తం మీద, మెస్సీని చూడాలనే ఆశ నెరవేరక, సోఫాలు పీకివేయడం, సీట్లు ధ్వంసం చేయడం, బాటిళ్లు విసరడం వరకు విధ్వంసం కొనసాగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సచిన్... సచిన్... మెస్సీ... మెస్సీ
ముంబై: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయోనల్ మెస్సీ తన ‘గోట్ టూర్’లో భాగంగా రెండో రోజు ముంబైని మురిపించాడు. భారత మాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి వాంఖెడేలో సందడి చేశాడు. మామూలుగా అయితే ఈ మైదానంలో టెండూల్కర్ ఉంటే ‘సచిన్... సచిన్...’ అనే గోలే వినిపించేది. కానీ ఆదివారం స్వరం మారింది. యువ తరం, నవతరం అంతా కలిసి తమ ఆరాధ్య క్రికెటర్‌తో పాటు అభిమాన ఫుట్‌బాలర్ పేరునూ మార్మోగించారు. దీంతో వాంఖెడే స్టేడియం ‘సచిన్... సచిన్... మెస్సీ... మెస్సీ...’ నామస్మరణతో మార్మోగిపోయింది. సచిన్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, పలువురు సెలబ్రిటీలతో స్టేడియమంతా తారతోరణం దిద్దుకుంది. వాంఖెడే పుటల్లో ఈ పూట క్రీడా ప్రపంచంలోనే అలుపెరగని దిగ్గజాలు ప్రత్యక్షంగా మైదానాన్ని, పరోక్షంగా యావత్ భారత్‌ను అలరించారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన పురిటి గడ్డపై జగద్విఖ్యాత ఫుట్‌బాలర్ లయోనల్ మెస్సీతో కలిసి సందడి చేశాడు. వాంఖెడే స్టేడియంలో దిగ్గజాల భేటీతో సరికొత్త అధ్యాయం ప్రారంభించినట్లయ్యింది. పోటెత్తిన అభిమానులతో కిక్కిరిసిపోయిన స్టేడియంలో వీరిద్దరే కేంద్ర బిందువులయ్యారు. భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి, రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సహా పుర ప్రముఖులు ఎందరున్నా... వేల కళ్లు సచిన్–మెస్సీల నుంచి చూపును తిప్పుకోలేకపోయాయి. ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులు తమ ఆరాధ్య దిగ్గజం సచిన్‌ను విఖ్యాత ఫుట్‌బాలర్‌తో కన్నుల పండుగగా చూసుకున్నారు. ఈ సందర్భంగా మహా సీఎం ఫడ్నవీస్ రాష్ట్రంలో యువ ఫుట్‌బాలర్ల ప్రతిభను సానబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ప్రాజెక్ట్ మహాదేవ’ పేరిట ఫుట్‌బాల్ ప్రతిభావంతుల్ని తయారు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. అపురూపం... పరస్పర బహుమానం అర్జెంటీనా స్టార్‌కు టెండూల్కర్ తను స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన వన్డే జెర్సీని మెస్సీకి అందివ్వగా... ప్రతిగా మెస్సీ కూడా తన సంతకంతో కూడిన ఫుట్‌బాల్‌ను సచిన్‌కు ఇచ్చాడు. అన్నట్లు ఆటలు వేరైనా... దేశాలు వేరైనా... సచిన్ జెర్సీ నంబర్, మెస్సీ జెర్సీ నంబర్ ఒక్కటే 10! అదేనండీ ‘దస్కా దమ్’’! దిగ్గజాలు పరస్పర బహుమతులు ఇస్తూ స్వీకరిస్తుంటే అభిమానులంతా ఉప్పొంగిపోయారు. ఈ అపు‘రూపం’ను తమ ఫోన్ కెమెరాల్లో పదిలంగా బందీచేసుకున్నారంతా! నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ... ‘గోట్ టూర్’లో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయోనల్ మెస్సీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈరోజు మర్యాదపూర్వకంగా కలువనున్నాడు. మూడు రోజుల ‘గోట్ టూర్’ నేడు ఢిల్లీలో ముగియనుంది. ముంబై నుంచి సోమవారం ఉదయం 10 గంటల తర్వాత మెస్సీ ఢిల్లీ చేరుకుంటాడు. నగరంలోని క్రీడాభిమానులతో ‘మీట్ అండ్ గ్రీట్’ ముగించుకొన్న తర్వాత మెస్సీ... ప్రధాని మోదీతో భేటీ అవుతాడు. ప్రధాని నివాసంలో దాదాపు 20 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య జరిగే మాటామంతీలో సాకర్ సూపర్ స్టార్ ఫుట్‌బాల్ ముచ్చట్లు పంచుకోకున్నాడు. ఆ తర్వాత భారత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ రాహుల్ నవీన్, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ ప్రఫుల్ పటేల్‌తో కూడా మెస్సీ భేటీ అవుతారని నిర్వాహకులు వెల్లడించారు. ఇలా పలువురు వీవీఐపీలను కలిసిన తర్వాత మెస్సీ మధ్యాహ్నం 3.30 గంటలకు అరుణ్ జైట్లీ స్టేడియానికి చేరుకుంటాడు. అక్కడ తన అభిమానుల్ని అలరించిన అనంతరం స్వదేశానికి పయనమవుతాడని నిర్వాహకులు వెల్లడించారు. నాకు ఇక్కడ (వాంఖెడే) మరుపేలేని మధుర జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. అందుకే మన ముంబై ఒక కలల నగరి. ఈ వేదికపై ఎంతో మంది స్వప్నాలు సాకారమయ్యాయి. 2011 నాకు బాగా గుర్తు. నా కల (వన్డే వరల్డ్‌కప్) కూడా ఇక్కడే నిజమైంది. ముఖ్యంగా మీ (అభిమానులు) మద్దతే లేకపోతే ఆ స్వర్ణానుభూతిని నేనైతే ఎప్పటికీ చూడలేను. ఇప్పుడు కూడా మెస్సీని ఇక్కడ చూస్తుంటే అలాంటి అనుభూతే కలుగుతోంది. మన యువ ఫుట్‌బాలర్లను ప్రోత్సహించిన మెస్సీకి మీ అందరి తరఫున, భారతీయుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. –సచిన్ టెండూల్కర్ -
‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!
కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయోనల్ మెస్సీ ప్రస్తుతం ‘గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నాడు. ఈ టూర్ ముఖ్య నిర్వాహకుడు శతద్రు దత్తా కాగా... తొలిరోజు కోల్‌కతాలో ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు జైలుకు తరలించారు. కొన్నిరోజులుగా సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఆడతాడంటూ ప్రముఖంగా ప్రచారం చేశారు. రూ. వేలల్లో టికెట్లను అమ్మారు. ఫుట్‌బాల్ క్రేజీ బెంగాలీ వాసులు సుమారు 80 వేల మంది వేలకువేలు వెచి్చంచి స్టేడియానికి తరలివెళ్లారు. కానీ తమ ఆరాధ్య ఫుట్‌బాలర్ మెస్సీ పట్టుమని పది నిమిషాలైనా మైదానంలో అలరించలేదు. ఆ ఉన్న కొద్దిసేపు కూడా చీమలదండు లాంటి భద్రతా వలయంతో ఏ గ్యాలరీలోని ప్రేక్షకుడు కూడా మెస్సీని చూడలేకపోయాడు. దీంతో సూపర్‌స్టార్‌ను ప్రత్యక్షంగా చూసి కన్నుల పండగ చేసుకుందామని రూ.వేలు వెచి్చంచిన అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా వేల మంది విరుచుకుపడటంతో కరతాళ ధ్వనులతో మార్మోగాల్సిన మైదానం రసాభాసగా మారింది. ఈ ఈవెంట్ నిర్వహణ వైఫల్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అభిమానుల తాకిడి, అంచనాలకు విరుద్ధంగా ఏర్పాట్లు, నిర్వహణ వైఫల్యంపై చీఫ్ ఆర్గనైజర్ శతద్రు దత్తాను శనివారమే అదుపులోకి తీసుకొని ఆదివారం జడ్జి ముందు హాజరు పరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి... ముఖ్య నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో శతద్రును జైలుకు తరలించారు. -
నెలకు రూ. 41 కోట్లకు పైగానే.. సచిన్, కోహ్లి దరిదాపుల్లో లేరు!
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మేనియాతో ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది. మెస్సీ నామస్మరణతో మహానగరం శనివారం మారుమోగ్రిపోయింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆద్యంతం చలాకీగా, సరదాగా గడిపిన మెస్సీ.. సరదా కిక్‌లతో ఫుట్‌బాల్‌ను స్టాండ్స్‌కు పంపించాడు. వాటిని అందుకుని అందుకున్న అభిమానులు ఇదేకదా అసలు ‘కిక్కు’ అంటూ మురిసిపోయారు.కాగా మెస్సీ.. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా సామాన్యులనూ ఆకర్షించిన అంశం.. వారిని ముక్కునవేలేసుకునేలా చేసిన విషయం ఏమిటంటే.. ఈ లెజెండరీ ఆటగాడితో ఫొటో దిగాలంటే ఏకంగా పది లక్షలు చెల్లించాల్సి ఉండటం. అయితే, మెస్సీ రేంజ్ గురించి తెలిసిన వాళ్లు మినమమ్ ఉంటది కదా! అని సరిపెట్టుకున్నారు. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెస్సీ సంపాదన.. 2025 నాటికి ఏడు వేల కోట్ల రూపాయలకు పైమాటే అని అంచనా!ఫుట్‌బాల్‌కే ఆదరణ ఎక్కువభారత్తో పాటు క్రికెట్ ఆడే దేశాల్లో ప్రఖ్యాతి పొందిన భారత క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ (దాదాపు రూ. 1400 కోట్లు), విరాట్ కోహ్లి (సుమారుగా వెయ్యి కోట్లు)లతో పోలిస్తే మెస్సీ సంపాదన చాలా ఎక్కువ. భారత్‌లో క్రికెట్ మతమైతే.. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌కి ఆదరణ ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఒక్కో మెట్టు ఎక్కుతూ..పుట్టుకతోనే మెస్సీ కోటీశ్వరుడేమీ కాదు. చిన్ననాటి నుంచే ఫుట్‌బాల్‌పై ఉన్న మక్కువ.. ఆటలో అంకిత భావం, నైపుణ్యాలు అతడిని ఉన్నత శిఖరాలకు చేర్చాయి. క్లబ్‌లకు ఆడుతూ పెద్ద మొత్తంలో ఆర్జించిన మెస్సీ.. ఇంటర్ మియామిలో చేరిన తొలి నాళ్లలో నెలకు మిలియన్ డాలర్లకు పైగా పొందాడు. ప్రస్తుతం ఈ క్లబ్ ద్వారా అతడు పొందే ఆదాయం నెలకు 2.67 మిలియన్ డాలర్లుగా ఉందంటే అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక బార్సిలోనా క్లబ్ ద్వారా మెస్సీ లెక్కకు మిక్కిలి ఆర్జిస్తున్నాడు.అంతేకాదు.. టాప్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేస్తూ మెస్సీ దండిగా సంపాదన కూడబెట్టాడు. ఉదాహరణకు అడిడాస్, పెప్సీ వంటి బ్రాండ్లు మెస్సీ క్రేజ్ దృష్ట్యా అతడికి ఏడాదికి రూ. 70 మిలియన్లకు పైగా ముట్టజెప్పుతున్నట్లు వివిధ వార్తా సంస్థలు నివేదించాయి.రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారాలుఇవే కాకుండా డిజిటల్ కాయిన్ల రూపంలోనూ అతడు మనీ సేవ్ చేస్తున్నాడు. ఇక ఆట, ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో పెట్టాడు. అంతేకాదు.. హోటల్ వ్యాపారాలనూ పెద్ద ఎత్తున విస్తరించాడు. ఇలా అటు క్లబ్‌లు.. ఇటు ఎండార్స్మెంట్లు, వ్యాపారాల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్న మెస్సీ... నికర ఆస్తుల విలువ ఏడు వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంది. భారత కరెన్సీలో చెప్పాలంటే.. మెస్సీ నెల ఆదాయం సుమారుగా రూ. 41.67 కోట్లు. అంటే ఏడాదికి దాదాపుగా రూ. 500 కోట్లు అన్నమాట. చదవండి: IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్ -
మెస్సీ మెస్సీ మెస్సీ.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
-
హలీం, మటన్ బిర్యానీలకు 'మెస్సీ' ఫిదా
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ మన హైదరాబాదీ వంటకాల రుచి చూశారు. హైదరాబాదీ బిర్యానీ, హలీమ్‌కు ఫిదా అయ్యారు. భారత దేశ పర్యటనలో భాగంగా శనివారం భాగ్యనగరానికి వచ్చిన మెస్సీ.. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బస చేశారు. కుటుంబంతో కలిసి వచ్చిన ఆయన ప్యాలెస్‌లోని నిజాం లగ్జరీ సూట్లో గడిపారు. ఉప్పల్‌లో ఫ్రెండ్లీ మ్యాచ్ అనంతరం రాత్రి విందులో ఆయన హైదరాబాదీ మటన్ బిర్యానీ అరగించారు. అలాగే ఆయనకు హలీమ్‌ను వడ్డించారు. ఇవేగాకుండా నిజాం వంటకాలైన మరగ్, పాయా, కబాబ్, పన్నీర్ టిక్కా, దాల్, నాన్ రోటీలు, ఖుబానీ కా మీటా, బడల్ కా మీటా, మలాయ్ కుల్ఫీ, ఇటాలియన్ ఫుడ్ కూడా మెనూలో పొందుపరిచారు. ఈ డిన్నర్లో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఫలక్‌నుమా ఫ్యాలెస్ అందాలకు మెస్సీ ముచ్చటపడ్డారు. ప్యాలెస్‌లో 101 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే నిజాం డైనింగ్ టేబుల్‌ను చూసి ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ ఆతిథ్యం మరిచిపోలేనిదని కితాబునిచ్చారు. -
మెస్సీ మాయలో...
‘మెస్సీ కిక్ కొట్టిన బంతి నా వైపే దూసుకొచ్చింది. ఒక్కసారిగా ఎంతో భావోద్వేగానికి గురయ్యాను’... ఒక పదో తరగతి పిల్లాడి ఆనందం... ‘పదేళ్ల క్రితం మెస్సీ చాంపియన్స్ లీగ్ గెలిచినప్పటి నుంచి అతని ఆటంటే చాలా ఇష్టం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటంతో నా కల నెరవేరింది’... ఒంటిపై మెస్సీ టాటూ వేసుకున్న ఒక వీరాభిమాని సంతోషమిది. మెస్సీ మైదానంలో గడిపింది గంట సమయం మాత్రమే కావచ్చు. కానీ ఫ్యాన్స్‌కు సంబంధించి అది అమూల్యమైన సమయం... అతని ప్రతీ కదలిక, వేసిన ప్రతీ అడుగు వారిలో అమిత ఉత్సాహాన్ని రేపింది. మెస్సీ కూడా ఉన్నంత సేపు చాలాసరదాగా, జాలీగా కనిపించడం ఈ మెగా ఈవెంట్ సక్సెస్‌కు సరైన సూచిక. సాక్షి, హైదరాబాద్: నగర ఫుట్‌బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన లయోనల్ మెస్సీ షో విజయవంతంగా ముగిసింది. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా రెండో నగరమైన హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్ ఎలాంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు లేకుండా సాఫీగా సాగింది. శనివారం ఉదయం కోల్‌కతాలో జరిగిన ఘటన నేపథ్యంలో హైదరాబాద్ కార్యక్రమంపై కాస్త సందేహాలు తలెత్తాయి. అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో పటిష్ట ఏర్పాట్లు చేసి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. దాంతో అటు మెస్సీ బృందంతోపాటు ఇటు అభిమానులు కూడా సంతృప్తిగా మైదానాన్ని వీడారు. రేవంత్‌కు పాస్‌లు... మెస్సీ టూర్ ఖరారైన రోజు నుంచి ప్రభుత్వం హడావిడి చేసిన మెస్సీ వర్సెస్ రేవంత్ మ్యాచ్ మాత్రం జరగలేదు కానీ... మెస్సీ, సీఎం మధ్య కొన్ని సరదా కిక్‌లు, పాస్‌లు మాత్రం నడిచాయి. మెస్సీ ఇచ్చిన పాస్‌లు చక్కగా అందుకున్న రేవంత్ రెడ్డి వాటిని మళ్లీ రిటర్న్ కూడా చేశారు. స్వారెజ్, రోడ్రిగో కూడా దీనికి జత కలిశారు. ఈ నలుగురు కలిసి ఆడుతున్న సమయంలో స్టేడియంలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విజిల్స్, కేకలతో సందడి చేశారు. చివరకు మెస్సీ కొట్టిన ఒక కిక్ రేవంత్‌ను దాటి గోల్ పోస్ట్‌లోకి వెళ్లడంతో ఈ ఆట ముగిసింది. దీనికి ముందు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సింగరేణి ఆర్ఆర్ టీమ్, అపర్ణ మెస్సీ ఆల్‌స్టార్స్ టీమ్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఇందులో సింగరేణి టీమ్ విజేతగా నిలిచింది. చిన్నారులతో సందడి... ముందుగా ఎంపిక చేసిన వర్ధమాన ఫుట్‌బాలర్లు, చిన్నారులతో కూడా మెస్సీ కొద్దిసేపు ఆడాడు. వీటి కోసం నాలుగు వేర్వేరు జోన్లను ఏర్పాటు చేయగా, ప్రతీ చోటికి వెళ్లి ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ కొంత సమయం కేటాయించాడు. మెస్సీతో కలిసి ఆడిన వారిలో అంతుపట్టలేని ఆనందం కనిపించింది. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి మనవడు కూడా సందడి చేశాడు. అతని వైపు కూడా మెస్సీ రెండు పాస్‌లు ఇవ్వడం విశేషం. స్టాండ్స్‌లోకి బంతులు... స్టేడియంలో అభిమానులను బాగా అలరించి వారంతా పూర్తిగా ఎంజాయ్ చేసింది మాత్రం మెస్సీ స్పెషల్ కిక్లతోనే. ఆ సమయంలో మాత్రం స్టేడియంలో పూర్తి స్థాయిలో హోరెత్తిపోయింది. అతను ప్రత్యేకంగా పెనాల్టీలు ఆడకపోయినా... నిర్వాహకులు ఇచ్చిన బంతులను తనదైన శైలిలో కిక్‌లతో స్టాండ్స్‌లోకి పంపించాడు. బంతిని అందుకొని అర్జెంటీనా స్టార్ కిక్కు సిద్ధమైన ప్రతీ సారి ఉప్పల్ ఊగిపోయింది. ఆ బంతులను అందుకోవడంలో స్టాండ్స్‌లో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. కానీ కొందరు అదృష్టవంతులకే ఆ అవకాశం దక్కింది! ఉల్లాసంగా...ఉత్సాహంగా... మెస్సీ మొత్తం ‘షో’లో అతను మైదానంలో గడిపిన తీరే చెప్పుకోదగ్గ విశేషం. అక్కడ ఉన్నంతసేపు అతను చాలా ఉత్సాహంగా, నవ్వుతూ గడిపాడు. ముందుగా ప్రేక్షకుల హర్షధ్వానాలతో మైదానంలోకి రావడం మొదలు చివరి వరకు అతను దీనిని కొనసాగించాడు. ఉదయం కోల్‌కతాలో రసాభాసగా మారిన ఈవెంట్లో పూర్తి అసౌకర్యంగా కనిపించిన అతను హైదరాబాద్‌లో మాత్రం అలాంటి ఛాయలు కూడా కనపడనివ్వలేదు. ఇరు జట్ల ఆటగాళ్లతో కరచాలనం, రేవంత్‌తో ఆడిన కొద్దిసేపు, ఆపై చిన్నారులతో ఆట, స్టాండ్స్‌లోకి కిక్ కొడుతూ ఉత్సాహం నింపడం, చివర్లో గ్రూప్ ఫోటోలు... ఇలా ఎక్కడైనా అతనిలో చిరునవ్వు చెక్కుచెదర్లేదు. ఎక్కడా ఎలాంటి అసహనాన్ని ప్రదర్శించలేదు. ఆఖర్లో ‘హైదరాబాద్‌కు రావడం సంతోషంగా ఉంది. మీరు ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు’ అంటూ కృతజ్ఞతలు చెప్పడం వరకు చూస్తే అతను కూడా హైదరాబాద్ టూర్‌ను బాగానే ఎంజాయ్ చేసినట్లు కనిపించాడు. ఆఖర్లో మెస్సీకి ముఖ్యమంత్రి జ్ఞాపిక అందించగా, స్వారెజ్‌కు రాహుల్ గాంధీ జ్ఞాపిక ఇచ్చారు. వీరిద్దరికీ మెస్సీ తన ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీలను అందించాడు. -
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
-
మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ (ఫోటోలు)
-
కోల్‌కతా మెస్సీ ఈవెంట్ : టికెట్ ధరలు వాపసు
కోల్‌కతా, సాక్షి: కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ లెజెండ్ లియెనెల్ మెస్సీ కార్యక్రమం గందరగోళంగా మారింది. తమ అభిమాన క్రీడాకారుడిని చూడటానికి వచ్చేందుకు నిర్వహణా లోంపతో జనం తీవ్ర నిరాశకు లోనయ్యారు. అదీ 20 నిమిషాల్లోనే లియోనెల్ మెస్సీ వేదిక నుండి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. చివరికి పోలీసుల జోక్యంతోవారిని అదుపు చేశారు. అయితే ఎంతో ఖరీదు పెట్టి టికెట్లను కొని, దూర ప్రాంతాలనుంచి వచ్చినప్పటికీ, కనీసం మెస్సీ ముఖం కూడా చూడలేకపోయామని చాలామంది అభిమానులు ఆగ్రమం వ్యక్తం చేశారు.టికెట్ డబ్బులు వాపసుమరోవైపు లియోనెల్ మెస్సీ GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేశారు. కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అంతేకాదు అభిమాలను టికెట్ రుసుమును నిర్వాహకులు వెనక్కి ఇస్తారని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ రీఫండ్ ఎలా జరుగుతుంది అనేది పరిశీలించాలన్నారు.చదవండి: రూ. 12వేలు పోసాం...కనీసం ముఖం కూడా చూడలేదు, ఫ్యాన్స్ పైర్#WATCH | Kolkata: On the Chaos at Messi's Kolkata event, Additional Director General (ADG) Law and Order Jawed Shamim says, "There is normalcy now. The second part is the investigation; the FIR has been lodged, and the chief organiser has been arrested... I'm telling you, they… pic.twitter.com/GRqz03wPvp— ANI (@ANI) December 13, 2025 దీనిపై స్పందించిన రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోల్‌కతా క్రీడాభిమానులకు ఇదొక చీకటి రోజుగా వ్యాఖ్యానించారు. నిర్వాహక లోపం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనీ, దీనికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అలాగే ముందుజాగ్రత్తలు తీసుకోని పోలీసు అధికారును సస్పెండ్ చేయాలని కూడా అన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి, దోషులను అరెస్టు చేయాలన్నారు.ఈ కార్యక్రమానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు వాపసు ఇవ్వాలని, స్టేడియం ,ఇతర బహిరంగ ప్రదేశాలకు జరిగిన నష్టానికి నిర్వాహకులపై ఛార్జీలు విధించాలని, పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని గవర్నర్ అన్నారు.ఇదీ చదవండి: 90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే! -
రూ. 12వేలు పోసాం...కనీసం ముఖం కూడా చూడలేదు, ఫ్యాన్స్ పైర్
కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని(Lionel Messi) కోల్‌కతా విజిట్ గందరగోళానికి దారితీసింది. తమ అభిమాన స్టార్ ప్లేయర్‌ను కళ్లారా చూడాలని తరలి వచ్చిన ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీని వీక్షించడానికి జనం వేలాదిగా చేరుకున్నారు. నిర్వహణ లోపంతో అభిమానులు నియంత్రణకోల్పోయి హింసకు దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫలితంగా సాల్ట్ లేక్ స్టేడియం వెళ్లిన మెస్సీ కేవంల నిమిషాల్లో అక్కడ నుంచి వెళ్లిపోవడం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. రూ12 వేలు పెట్టి టికెట్ కొనుగోలు చేస్తే కనీసం తమ అభిమాన మెస్సీ మొఖాన్ని కూడా చూడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మెస్సీ సమయాన్ని వృధా చేశారని అసహనం వ్యక్తం చేశారు. #WATCH | Kolkata, West Bengal: A fan of star footballer Lionel Messi says, "It was really disappointing, we came all the way from Darjeeling for this... We couldn't even see him properly, and that was the most disappointing thing I have ever witnessed..." https://t.co/Ce4kNu8dBH pic.twitter.com/dgBSOIMEoG— ANI (@ANI) December 13, 2025డార్జిలింగ్ నుంచి వచ్చిన మహిళా అభిమాని, తాను రూ. 12,000 కు టికెట్ కొనుగోలు చేశానని, కానీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్న టాలిస్మాన్‌ను చూడలేకపోయానని ఆరోపించారు.కాగా గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం తెల్లవారుజామున కోల్ కత్తాకు చేరుకున్నారు. మెస్సీ ఇండియాలో మూడు రోజులు పాటు, నాలుగు నగరాల్లో పర్యటించ నున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. అయితే మెస్సీ కోలక్‌తా టూర్ సందర్బంగా ఏర్పడిన గందరగోళంలో పట్టరాలి ఆగ్రహంతో అభిమానులు స్టేడియంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. గ్రౌండ్లోకి కుర్చీలు విరగ్గొట్టారు బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ఫ్యాన్స్ యత్నించారు. దీంతో జనాన్ని చెదర గొట్టడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అభిమానులు టెంట్‌ను మరియు గోల్ పోస్ట్‌ను కూడా ధ్వంసం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.మరోవైపు ఈ గందరగోళం నేపథ్యంలో GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేసినట్టు అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ వెల్లడించారు. కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. అంతేకాదు నిర్వాహకులు టికెట్ రుసుమును అభిమానులకు తిరిగి చెల్లిస్తారని కూడా హామీ ఇచ్చారు. -
సీఎం రేవంత్ జోరు కొనసాగేనా..?
మెస్సీ రాక.. మెస్సీ రాక.. ఇది గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. మెస్సీ హైదరాబాద్‌కు రానున్న తరుణంలో ఇది ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అదే సమయంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో సీఎం రేవంత్ మ్యాచ్. ఇదే కూడా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. వీరిద్దరి ఆటవిడుపు గురించి సరదాగా మాట్లాడుకుంటే..మెస్సీతో మ్యాచ్‌ను సీఎం రేవంత్ తేలిగ్గా తీసుకోవడం లేదు. అందుకే ఆయన తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌ను చేస్తూ బిజిబిజీగా గడుపుతున్నారు రేవంత్. అందుకోసం యూనివర్శిటీకి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారులతో తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నారు. మెస్సీ మొత్తంగా స్టేడియంలో ఉండే సమయం 20 నిమిషాలే. అందులో సీఎం రేవంత్‌తో ఐదు నిమిషాల పాటు మ్యాచ్ ఆడతారు. అయినప్పటికీ దీన్ని సీఎం రేవంత్ సరదాగా తీసుకోవడం లేదు. సీరియస్‌గానే తీసుకున్నట్లున్నారు. అందుకోసమే ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. ఇక్కడ స్థానిక ఫుట్‌బాల్ క్రీడాకారులకు సీఎం రేవంత్ దీటుగానే బదులిస్తూ తన కిక్‌లతో అలరిస్తున్నారు. అంతే కాకుండా తన పాస్‌లతో కూడా ఆకట్టుకుంటున్నారు రేవంత్. అదే జోరు కొనసాగేనా..?నేటి ఐదు నిమిషాల మెస్సీతో మ్యాచ్‌లో రేవంత్ జోరు కొనసాగిస్తారా..? అనేది చూడాలి. రాష్ట్ర ఫుట్‌బాల్ ప్లేయర్లను పరుగులు పెట్టించిన రేవంత్.. మెస్సీని ఎంతవరకూ ధీటుగా ఎదుర్కొంటారో చూడాలి. మెస్సీతో గేమ్ అంటే మామూలు కాదు.. ఆ విషయం రేవంత్‌కు తెలుసు. అందుకే అంత ప్రాక్టీస్ చేశారు రేవంత్,.ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం టెక్నికల్‌గా పుంజుకుని మరీ తన వార్మప్ మ్యాచ్‌లను కొనసాగించారు రేవంత్. ఒకవేళ పొరపాటను మెస్సీతో గేమ్‌లో రేవంత్ పైచేయి సాధించారంటే ఏమవుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. చాలా స్పల్ప సమయం పాటు జరిగే మ్యాచ్ కాబట్టి పెద్దగా అంచనాలు ఉండకపోవచ్చు. కానీ ఆ ఐదు నిమిషాల్లోనే రేవంత్ అద్భుతం చేసి మెస్సీని ఆశ్చర్యపరుస్తాడా? అనేది ఫుట్‌బాల్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. -
హైదరాబాద్‌కు మెస్సీ.. పూర్తి షెడ్యూల్ ఇదే
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన కొనసాగుతోంది. మరి కాసేపటిలో హైదరాబాద్‌కు మెస్సీ చేరుకోనున్నాడు. కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్త నెలకొన్ని నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియంతో పాటు మెస్సీ ప్రయాణించే మార్గాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్‌పై ఓ లుక్కేద్దాం.హైదరాబాద్‌లో మెస్సీ షెడ్యూల్కోల్కతా నుంచి మెస్సీ 4 గంటల సమయంలో హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నాడు. శంషాబాద్ విమానశ్రాయం నుంచి నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గోనున్నాడు. అనంతరం హోటల్లో విశ్రాంతి తీసుకోన్నాడు.👉ఆ తర్వాత సాయంత్రం 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటాడు.👉7:50 నిమిషాలకు ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభం కానుంది.👉8:6 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిచ్‌పైకి ఎంట్రీ ఇవ్వనున్నారు.👉8:6 నిమిషాలకు మెస్సీ ఎంట్రీ ఉండనుంది.👉8:8 నిమిషాలకు మెస్సీ సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.👉 8:10 నిమిషాలకు హార్డ్ స్టాప్ ఉండనుంది👉8:13 నిమిషాలకు పెనాల్టీ షూటౌట్👉8:15 నిమిషాలకు పిల్లలతో కలిసి మెస్సీ గ్రూపు ఫోటో దిగనున్నాడు.👉8:18 నిమిషాలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైదానంలో రానున్నారు.👉8:38 నిమిషాలకు మెస్సీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కలిసి పరేడ్ వాక్‌లో పాల్గోనున్నారు.👉రాత్రి 9 గంటల సమయంలో మెస్సీకి సన్మానం చేయనున్నారు.👉ఆ తర్వాత మెస్సీ హైదరాబాద్ నుంచి వెళ్లిపోనున్నాడు.చదవండి: IND vs SA: 'టాస్ వేయడం ఒక్కటే అతడి పనికాదు' -
కోల్ కతాలో హైటెన్షన్.. స్టేడియం తుక్కు తుక్కు
-
కోల్‌కతాలో మెస్సీ మాయ.. (ఫోటోలు)
-
సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ ఫ్యాన్స్ రచ్చ..
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన ముగిసింది. అయితే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగినప మోహన్ బగన్ మెస్సీ ఆల్ స్టార్స్ వర్సెస్ డైమండ్ హార్బర్ మెస్సీ ఆల్ స్టార్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా గందరగోళం నెలకొంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే త్వరగా వెళ్లిపోయాడని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాటర్ బాటిల్స్‌ను, కూర్చీలను మైదానంలోకి విసిరి రచ్చ రచ్చ చేశారు. ఫ్లెక్సీలు ద్వంసం చేస్తూ, బ్యారికేడ్లను దాటుకుంటూ మైదానంలో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ గందరగోళ పరిస్ధితుల నేపథ్యంలో మెస్సీ టీమ్‌ను సొరంగం గుండా బయటకు పంపించారు. మెస్సీ మైదానంలో కేవలం ఐదు నిమిషాల మాత్రమే ఉన్నాడు. అతడిని చూసేందుకు బెంగాల్ పక్కరాష్ట్రాల నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. వాస్తవానికి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాల్సి ఉండేది. కానీ మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ తీవ్రనిరాశకు గురయ్యారు. ఈవెంట్ నిర్వహకులపై అభిమానులు మండిపడుతున్నారు. అంతకుముందు శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా అవిష్కరించారు. -
14 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టిన లియోనెల్ మెస్సీ
-
70 అడుగుల విగ్రహం.. మెస్సీ తొలి రియాక్షన్ ఇదే!
మెస్సీ.. మెస్సీ.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం ది గోట్ టూర్లో భాగంగా భారత్‌కు చేరుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 2.26 గంటలకు కోల్‌కతా విమానాశ్రయంలో అడుగుపెట్టిన మెస్సీకి ఘన స్వాగతం లభించింది. తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. మెస్సీతో పాటు అతని ఇంటర్ మియామీ జట్టు సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా ఇండియా టూర్‌కు వచ్చారు. ది గోట్ రాకతో కోలకతా సాకర్ సిటీని తలపిస్తోంది. ఎక్కడ చూసిన మెస్సీ కటౌట్లే కన్పిస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ.. కోల్‌కతా లేక్ టౌన్‌లోని శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెస్సీతో పాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పాల్గోన్నారు.అయితే తన విగ్రహాం ఏర్పాటుపై మెస్సీ చాలా సంతోషంగా ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ మంత్రి, శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు సుజిత్ బోస్ తెలిపారు. "మేము ఇప్పటికే మెస్సీ మేనేజర్‌తో మాట్లాడాము. ఈ రోజు మెస్సీని కలుస్తాము. తన విగ్రహాన్ని నిర్మించేందుకు అతడు అనుమతి ఇచ్చాడు.తన విగ్రహంపై కూడా మెస్సీ సంతోషంగా ఉన్నాడు. ఇది చాలా పెద్ద విగ్రహం. 70 అడుగుల ఎత్తు ఉంది. ప్రపంచంలో మెస్సీకి ఇంత పెద్ద విగ్రహం మరొకటి లేదు. అతడి రాకతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారని" సుజిత్ బోస్ ఎఎన్ఐతో పేర్కొన్నారు.City of Joy welcomes the G.O.A.T Lionel Messi enters a packed Salt Lake Stadium #MessiInIndia #Messi𓃵 pic.twitter.com/zGdlRFQPUL— Kamit Solanki (@KamitSolanki) December 13, 2025 -
మెస్సీ వస్తున్నాడని.. హనీమూన్ రద్దు
కోల్‌కతా: మెస్సీ మేనియాతో ఇండియా ఊగిపోతోంది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ రాక సందర్భంగా దేశవ్యాప్తంగా అతడి ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. శనివారం ఉదయం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా చేరుకున్న మెస్సీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అతడు వస్తున్న దారి వెంబడి నిలబడి సందడి చేశారు. అతడు బస చేసి హోటల్ ముందు గుమిగూడారు. ఇక కోల్‌కతా నగరంలో ఎక్కడ చూసినా మెస్సీ అభిమానుల కోలాహలం కనిపించింది.మధ్యాహ్నం 2 గంటలకు లియోనెల్ మెస్సీ.. (Lionel Messi ) సాల్ట్ లేక్ స్టేడియంలో సందడి చేయనున్నారు. దీంతో ఈ ఉదయం నుంచే అభిమానులు భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మెస్సీని చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ తరలివచ్చారు. నేపాల్ నుంచి కూడా కొంత మంది అభిమానులు కోల్‌కతా చేరుకోవడం విశేషం. కొత్తగా పైళ్లైన ఓ జంట తమ హనీమూన్‌ను సైతం వాయిదా వేసుకుని మెస్సీని చూసేందుకు వచ్చింది.సాల్ట్ లేక్ స్టేడియం వద్ద కొత్త జంట ఏఎన్ఐ వార్తా సంస్థలతో మాట్లాడింది. "గత శుక్రవారం నా పెళ్లి జరిగింది. మెస్సీ వస్తున్నాడని తెలిసి హనీమూన్ ప్లాన్‌ను రద్దు చేసుకున్నాను. మెస్సీ పర్యటనే నాకు ముఖ్యం. నేను 2010 నుంచి అతడిని అనుసరిస్తున్నాన''ని నవవధువు తెలిపారు. ఆమె భర్త కూడా మెస్సీ అభిమాని కావడంతో ఇద్దరు అతడిని చూడటానికి వచ్చారు. ''ఈ మధ్యనే మాకు పెళ్లయింది. మెస్సీ ఇండియా పర్యటన కారణంగా హనీమూన్ రద్దు చేసుకున్నాం. ఎందుకంటే ముందుగా మేము మెస్సీని చూడాలనుకున్నాము. అతడిని చూడటానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. పది పండేన్నేళ్లుగా అతడిని ఫాలో అవుతున్నామ''ని కొత్త పెళ్లి కొడుకు మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. చదవండి: 70 అడుగుల విగ్రహం.. మెస్సీ ఫస్ట్ రియాక్షన్ ఇదే!మెస్సీని చూడటం నా కలమెస్సీని దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూడడం తన చిరకాల స్వప్నమని నేపాల్ (Nepal) నుంచి వచ్చిన అభిమాని చెప్పాడు. ''నేను నేపాల్ నుండి వచ్చాను. మెస్సీని చూడటం నా కలల్లో ఒకటి. మా దేశం తరపున భారతదేశానికి ధన్యవాదాలు. కేవలం మెస్సీని చూడటానికే టిక్కెట్లు కొన్నాను. నన్ను ఇక్కడికి రావడానికి అనుమతించి, నా కలను నిజం చేసిన నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు, సోదరుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మెస్సీని చూడటానికి కాలేజీ ఎగ్గొట్టి ఎంతో దూరం నుంచి కోల్‌కతాకు వచ్చాను. మెస్సీని చూడటానికి అడ్డుపడితే నా భార్యకు విడాకులు ఇచ్చేస్తాన''ని అన్నాడు. #WATCH | West Bengal | Fans of star footballer Lionel Messi line up outside the Salt Lake stadium in Kolkata for the first leg of his G.O.A.T. Tour India 2025. pic.twitter.com/Fa1POGEje2— ANI (@ANI) December 13, 2025 -
కాస్ట్లీ అభిమానం.. కాసులు కుమ్మరిస్తేనే ఆ మహాభాగ్యం!
ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీతో ఒక్క ఫొటోకి 10 లక్షలంట!.. “అంత ఖర్చా?” అని ఆశ్చర్యపోయినవాళ్లు ఎందరో.కానీ ఆ ఒక్క ఫొటో కోసం టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోయాయని తెలుసా?అటు స్టేడియం, థియేటర్ గేట్ల వద్ద పొడవైన క్యూలు సరిపోదన్నట్లు ఇటు ఆన్లైన్లో వీఐపీ ప్యాకేజీల హడావిడి.గుండెల నిండా ఉండాల్సిన అభిమానం.. ఇప్పుడు కాసులు కుమ్మరించి కొనుగోలు చేసే ట్రెండ్‌గా మార్కెట్లో దూసుకుపోతోంది..తమ అభిమాన తారలను, ఆటగాళ్లను.. గ్రౌండ్లలో, స్క్రీన్లపైనే చూడడంతో సరిపోదన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు. ప్రత్యక్షంగా కలిసి వీలైతే ఓ ఫొటో.. కుదిరితే కలిసి భోజనం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వేల నుంచి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఫుట్‌బాల్ రారాజుగా పేరున్న మెస్సీతో ఫొటో కోసం రూ.10 లక్షల దాకా ఖర్చు ఇందులో భాగమే!. అది ఎలాగంటే..🐐గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా మెస్సీ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయనతో మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ కోసం రూ.9.95 లక్షలు + జీఎస్టీ కలిపి రూ.10 లక్షల దాకా అవుతోంది. ఈ ప్యాకేజీలో మెస్సీతో షేక్ హ్యాండ్, ప్రొఫెషనల్ గ్రూప్ ఫొటో(ఆరగురు దాకా ఉండొచ్చు.. నో సెల్ఫీ.. నో సోలో ఫొటో!), ప్రైవేట్ లౌంజ్ యాక్సెస్ (ఒక గంట పాటు, ప్రత్యేక ఫుడ్ & బేవరేజెస్‌తో) అన్నీ కలిపే ఉంటాయి. ఆయన ఎలాగూ వీవీఐపీ కాబట్టి ఆయనకు ఉండే భద్రత నడుమే ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే అవి మనకూ వర్తిస్తాయన్నమాట. సాధారణంగా.. బ్రాండ్ అంబాసిడర్‌గా మెస్సీ కొన్ని సెకన్లు కనిపిస్తే చాలని కోట్లు కమ్మరిస్తుంటాయి కంపెనీలు. సో.. జస్ట్ ఫొటోకే అంత ఖర్చా?.. అని అనుకోవడానికి ఏమాత్రం లేదు. 😲మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు ఖర్చవుతున్నట్లే.. మరో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో విషయంలోనూ భారీగానే ఈ ఛార్జ్ ఉంటోంది. ఫుట్‌బాల్ స్పెషల్ ఈవెంట్స్‌లో పాస్‌తో కలిపి ఫొటో కోసం రూ. 5-7 లక్షల దాకా వసూలు చేస్తుంటారు. పాప్ సింగర్లు టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన పాస్‌తో పాటు ఫొటో కోసం రూ.40 వేల నుంచి 80 వేల మధ్య, అలాగే.. మరో పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్‌తో ఫొటో, సంతకం కోసం లక్ష దాకా ఛార్జ్ చేస్తున్నారు. కొరియాకు చెందిన బీటీఎస్ బ్రాండ్ మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ రూ.2 లక్షలకు తక్కువ కాకుండా ఉన్నాయి మరి.👉ఎంతసేపు హాలీవుడ్ రేంజేనా?.. మన దగ్గర అలాంటి తారలు లేరని అనుకుంటున్నారా?. అక్కడికే వస్తున్నాం. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, షారూఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే.. కొందరు సెలబ్రిటీల విషయంలో ఇలాంటి చార్జీలు రూ.లక్షకు తక్కువ కాకుండానే ఉన్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఒకటి ఉంది. 😇ఈ డబ్బులు సెలబ్రిటీలు వసూలు చేసేవి కావు. కార్పొరేట్ ఈవెంట్స్, బ్రాండ్ ప్రమోషన్స్, చారిటీ ఈవెంట్లలో భాగంగా ఏర్పాటు చేసే మీట్ ద గ్రీట్‌లో భాగంగా వసూలు చేస్తారు. ఇందులో వీఐపీ ఆతిథ్యం, స్పెషల్ పాస్, బ్యాక్ స్టేజ్ ఫొటోలు.. వగైరాతో బోనస్‌గా ఫొటో దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవేవీ వాళ్లు వాళ్ల జేబుల్లో వేసుకునేందుకు నిర్ణయించే చార్జీలు కావన్నమాట. (నోట్: పైన పేర్కొన్న ఛార్జీలు ఫిక్స్ చేసినవి కావు.. ఈవెంట్లను.. డిమాండ్‌ను బట్టి మారే అవకాశమూ లేకపోలేదు). ☠️ఇది ప్రత్యేక వీఐపీ అనుభవం మాత్రమే. ఛార్జీలు ఉంటాయి కాబట్టి సాధారణ ప్రేక్షకులకు ఈ అవకాశం దక్కేది చాలా తక్కువ. పైగా వీటిని నిర్వాహకులు పక్కా వెబ్సైట్ల నుంచే నిర్వహిస్తుంటారు. అదే సమయంలో ఇక్కడ స్కామ్‌లకు అవకాశం లేకపోలేదు. అందుకే అధికారిక టికెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో కోనే ప్రయత్నంలో మోసపోకూడదని చెబుతుంటారు. 🥱ఇంత చెప్పాక కూడా.. లక్షల తగలేసి ఇదేం వెర్రితలలు వేసిన అభిమానం రా అయ్యా?.. అంతెందుకు బుజ్జీ అనుకుంటున్నారా?.. ఎవరి ఇష్టం వారిది కదా!. సినీ తారలు క్యాజువల్‌గా బయట తిరిగినప్పుడు కూడా రిక్వెస్ట్ చేసి దిగొచ్చు. ఒకవేళ వాళ్లు నో చెప్పడమో.. ఫోన్లు లాక్కోవడమో.. కుదరితే నాలుగు పీకడమో చేశారాంటరా?.. అప్పుడు ఏ మహేష్‌బాబునో, వెంకీ మామనో, ఐకాన్ స్టార్ బన్నీనో, రౌడీ విజయ్దేవరకొండనో లేదంటో పరభాషల్లో రజినీకాంత్, విజయ్, విజయ్ సేతుపతినో, మమ్మూటీ, మోహన్‌లాల్ మాదిరి అభిమానుల కోసం స్పెషల్ సెషన్లు నిర్వహించి ఫ్రీగా ఫొటోలకు ఫోజులు ఇచ్చే తారలు బోలెడు మంది ఉండనే ఉన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు.. ఏఐ ఉండనే ఉందిగా! అంటారా?.. మ్.. అది మీ ఇష్టం ఇక.. చెలరేగిపోండి. -
LIVE Updates: అపర్ణ మెస్సీ టీమ్‌పై రేవంత్ టీమ్ విజయం
GOAT India Tour: దేశంలో మెస్సీ మేనియా కొనసాగుతోంది. ఎటు చూసినా ఫుట్‌బాల్ అభిమానులు మెస్సీ కోసం.. -
Lionel Messi: భారీ బందోబస్తు
ఉప్పల్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ మ్యాచ్‌కు భారీ బందోబస్తు కల్పించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 3000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. స్టేడియం బయటా లోపలా కలిపి 450 సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరాలను అమర్చి పర్యవేక్షణ కోసం మినీ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఆయన ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మాట్లాడారు. మెస్సికి జెడ్ కేటగిరీ బందోబస్తు ఉంటుందని సీపీ వెల్లడించారు. ఆయన ప్రయాణానికి ఆటంకం ఏర్పడకుండా ప్రత్యేక గ్రీన్ చానల్ రూట్‌మ్యాప్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్టేడియం వద్ద టికెట్ విక్రయాల్లేవ్.. స్టేడియం ఆవరణలో, పరిసర ప్రాంతాల్లో టికెట్లను, పాస్‌లను విక్రయించడం లేదని సీపీ స్పష్టం చేశారు. టికెట్ లేనివారు స్టేడియం వద్దకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దన్నారు. మ్యాచ్‌ను టీవీల్లో వీక్షించాలని సూచించారు. 3 గంటల ముందే అనుమతి... టికెట్లు, పాస్‌లున్న వారిని స్టేడియంలోకి 3 గంటల ముందే అనుమతించనున్నట్లు సీపీ తెలిపారు. ఆట ప్రారంభమయ్యే సమయానికి వచ్చి ఆందోళన పడవద్దని సూచించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు మెట్రో రైల్, ఆర్టీసీ సేవలను వినియోగించు కోవాలన్నారు మహిళల భద్రతకు ప్రత్యేకంగా షీటీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరీ్ణత స్థలంలోనే వాహనాలను పార్కు చేయాలని సీపీ సూచించారు. టికెట్ ఒకసారి స్కాన్ అయిందంటే.. మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విషయంలో నిర్వాహకులు అనంత్ మాట్లాడుతూ.. టికెట్ మొబైల్లో సాఫ్ట్ కాపీ రూపంలోనే ఇస్తారని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ప్రవేశం ఉంటుందన్నారు. ఒకసారి స్కాన్ అయితే మళ్లీ వినియోగించే అవకాశం ఉండదన్నారు. పాస్ హోల్డర్లు బార్ కోడ్ ఉన్న ఫిజికల్ పాసులు మాత్రమే చెల్లుబాటవుతాయన్నారు, జిరాక్స్, స్క్రీన్ షాట్లను అనుమతించబోమన్నారు. -
వేల కోట్ల సంపాదన.. అతడికి ఆ పేరెలా వచ్చిందంటే?
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి అతడు ఆరాధ్య ఆటగాడు. భారత్‌లో క్రికెట్ మతంలాంటిదే అయినా.. మెస్సీకి కూడా ఇక్కడ చాలా మందే అభిమానులు ఉన్నారు.హైదరాబాద్ పర్యటన ఇలా‘ది గోట్ టూర్’లో భాగంగా మెస్సీ భారత్‌కు రానుండటంతో వారంతా అతడిని నేరుగా చూడాలని ఆశపడుతున్నారు. ఇక ముందుగా ప్రణాళికలో లేకపోయినా.. చివరి నిమిషంలో మెస్సీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఈ లెజెండరీ ప్లేయర్ స్వయంగా వెల్లడించాడు.ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చి.. అక్కడి నుంచి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు మెస్సీ చేరుకోనున్నాడు. రాత్రి ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియానికి వచ్చి ఫ్యాన్స్‌ను కలవడంతో పాటు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తిర విషయాలు మీకోసం..ఆమె గుర్తుగా ఆకాశంలోకి చూస్తూ..👶అర్జెంటీనాలోని సాంటా ఫేలో గల రొసారియోలో 1987, జూన్ 24న మెస్సీ జన్మించాడు.👶నాలుగేళ్ల వయసులోనే తన మొదటి క్లబ్ గ్రాండోలిలో జాయిన్ అయ్యాడు. అన్నట్లు అక్కడ కోచ్ మెస్సీ వాళ్ల నాన్న జోర్జ్ మెస్సీ.👶ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మెస్సీ ఎదగడంలో వాళ్ల నానమ్మ సెలియా ప్రభావం ఎక్కువ. అతడితో పాటు మ్యాచ్‌లకు హాజరవుతూ అతడిని ప్రోత్సహించేవారామె. ఆమె గుర్తుగా గోల్ సాధించిన ప్రతిసారి ఆకాశం వైపు చూపిస్తూ మెస్సీ తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు.👶ఏడేళ్ల వయసులో మెస్సీ వెనెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్లో చేరాడు.👶పదేళ్ల వయసులో మెస్సీకి హార్మోన్ డెఫిషియెన్సీ ఉన్నట్లు తేలగా.. చికిత్సతో దానిని అధిగమించాడు.వారిద్దరు.. వారికి ముగ్గురు 👩❤️💋👨తన చిన్ననాటి స్నేహితురాలు అంటోనెలా రొకజోను మెస్సీ పెళ్లి చేసుకున్నాడు. 👨👩👦👦ఈ జంటకు ముగ్గురు కుమారులు థియాగో, మెటేయో, సీరో సంతానం.🫂అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టులోని సహచరుడు సెర్గియో అగురో మెస్సీకి ప్రాణ స్నేహితుడుఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?🖤మెస్సీ ఒంటిపై పచ్చబొట్లు ఎక్కువే. అయితే, ఇవన్నీ అతడి కుటుంబ సభ్యులకు చెందినవే. భార్య కళ్లు, కుమారుల పేర్లు, వారి హస్త ముద్రలు, తన తల్లి చిత్రాన్ని టాటూలుగా వేయించుకున్నాడు మెస్సీ.💰ప్రపంచంలోని సుసంపన్న అథ్లెట్లలో మెస్సీ ఒకడు. అతడి నెట్‌వర్త్ విలువ 2025 నాటికి రూ. ఏడు వేల కోట్ల రూపాయలు అని అంచనా!🎶అన్నట్లు లియోనల్ మెస్సీకి ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?.. అతడి తల్లి ఫేవరెట్ సింగర్ లియోనల్ రిచ్చీ పేరు మీదుగా లియోనల్‌గా మెస్సీకి ఆమె నామకరణం చేశారు.చిరస్మరణీయ విజయం🌟మెస్సీ అత్యధికంగా ఎనిమిదిసార్లు బాలన్ డిఓర్ అవార్డులు గెలుచుకున్నాడు.🥇2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అర్జెంటీనా తరఫున మెస్సీ గోల్డ్ మెడల్ గెలిచాడు.⚽🏆మెస్సీ కెరీర్లో చిరస్మరణీయ విజయం.. అర్జెంటీనా సారథిగా 2022లో ఫిఫా వరల్డ్‌కప్ గెలవడం.It was 3:30AM Saturday morning people in the streets lined up, welcoming Messi as his car passes by. Thank You India.🙏🇮🇳pic.twitter.com/MtsLgvnSer— Messi Fanatic (@MessiFanatic_) December 12, 2025 -
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. సీఎం రేవంత్ రెడీ (ఫొటోలు)
-
ఇండియాలో మెస్సీ.. షెడ్యూల్ ఇదిగో
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత్ పర్యటనపై క్రీడాభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు రోజుల 'ద గోట్ టూర్'లో భాగంగా డిసెంబర్ 13న భారత గడ్డపై ఆయన అడుగుపెడతారు. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ మహా నగరాల్లో మెస్సీ పర్యటిస్తారు. పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొని, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఆడతారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలను ఆయన కలుస్తారు. కోల్‌కతాలో మొదలు పెట్టి ఢిల్లీలో ఆయన పర్యటన ముగుస్తుంది. మెస్సీతో పాటు రొడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), ఉరుగ్వే లెజండరీ స్టైకర్ లూయిస్ సువాలెజ్ కూడా ఇండియాకు వస్తున్నారు.తమ అభిమాన ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రత్యక్షంగా చూసేందుకు ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెస్సీని దూరం నుంచి చూడడమే తప్పా దగ్గరకు వెళ్లి ఫొటో తీసుకునే అవకాశం సామాన్యులకు ఉండదు. ఎందుకంటే మెస్సీతో ప్రత్యేకంగా ఫొటో దిగాలంటే దాదాపు 10 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా 100 మందికి మాత్రమే. మెస్సీ రాక కోసం తెలుగు అభిమానులు అమితాసక్తితో వేచివున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అతడు ఆడే మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ మ్యాచ్ వీక్షించాలంటే టిక్కెట్ తప్పనిసరి. వీటి ధరలు రూ.1750 నుంచి రూ.13500 వరకు ఉన్నాయి.మరోవైపు లియోనల్ మెస్సీ (Lionel Messi) షెడ్యూల్‌పై ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. అతడు ఎప్పుడు ఎక్కడికి వెళతాడనే సమాచారం కోసం ఆన్లైన్లో శోధిస్తున్నారు. వారి కోసం మెస్సీ ఫుల్ షెడ్యూల్‌ను ఇక్కడ ఇస్తున్నాం. మెస్సీ షెడ్యూల్ ఇలా...డిసెంబర్ 13, కోల్కతాఉదయం 1:30: కోల్‌కతాకు రాకఉదయం 9:30 నుండి 10:30 వరకు: అభిమానులతో ముఖాముఖిఉదయం 10:30 నుండి 11:15 వరకు: మెస్సీ విగ్రహం వర్చువల్‌గా ప్రారంభోత్సవంఉదయం 11:15 నుండి 11:25 వరకు: యువ భారతికి రాకఉదయం 11:30: షారుఖ్ ఖాన్ యువ భారతికి రాకమధ్యాహ్నం 12:00: సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ స్టేడియానికి రాకమధ్యాహ్నం 12:00 నుండి 12:30 వరకు: ఫ్రెండ్లీ మ్యాచ్, సన్మానం, సంభాషణమధ్యాహ్నం 2:00: హైదరాబాద్‌కు బయలుదేరడండిసెంబర్ 13, హైదరాబాద్సాయంత్రం 4: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాక, తాజ్ ఫలకనుమా ప్యాలెస్‌కు పయనం, మెస్సీతో మీట్ అండ్ గ్రీట్రాత్రి 7: ఉప్పల్ స్టేడియానికి రాక, అభిమానులకు పలకరింపు, ఫ్రెండ్లీ మ్యాచ్, చిన్నారులకు మెస్సీ ఫుట్‌బాల్ చిట్నాలు, సన్మానం, రాత్రికి ఫలకనుమా ప్యాలెస్‌లో బస, మర్నాడు ఉదయం ముంబైకు పయనం.చదవండి: ర్యాంప్‌పై మెస్సీ నడకడిసెంబర్ 14, ముంబైమధ్యాహ్నం 3:30: క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పాడెల్ కప్‌లో పాల్గొనడంసాయంత్రం 4:00: సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్సాయంత్రం 5:00: వాంఖడే స్టేడియంలో కార్యక్రమం, సెలబ్రిటీలతో ఛారిటీ ఫ్యాషన్ షోడిసెంబర్ 15, న్యూఢిల్లీప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశంమధ్యాహ్నం 1:30 గంటలకు: అరుణ్ జైట్లీ స్టేడియంలో కార్యక్రమం, మినర్వా అకాడమీ ఆటగాళ్లకు సన్మానం -
అప్పట్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ టీమ్.. ఓ రేంజ్!
ఫుట్‌బాల్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ లయోనల్ మెస్సీ మన భాగ్యనగరానికి వస్తున్నాడు. ఈ ప్రకటన వచ్చిన నాటి నుంచి అతడి రాకపై పలు రకాలుగా చర్చ.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీతో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. అతడి ఈవెంట్ కోసం భారీ ధరతో టికెట్లున్నా వెనక్కి తగ్గకుండా అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడిపోతున్నారు. శనివారం జరిగే ఈ షో కోసం టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో ఉప్పల్ స్టేడియం హౌస్‌ఫుల్ కావడం ఖాయం. కానీ మెస్సీ మాయ 3 గంటల్లో ముగిసిపోతుంది. ఆ తర్వాత మన వద్ద అసలైన ఫుట్‌బాల్ ఏమిటో కనిపిస్తుంది. ఒక అసాధారణ ఆటగాడిపై అభిమానం ఉండటం సరే కానీ.. మన వద్ద ఆటకు ఏమాత్రం ఆదరణ ఉందనేది ఆసక్తికరం. మెస్సీ షో కారణంగా ఇక్కడ మున్ముందు ఏదైనా మార్పు కనిపిస్తుందా అనేది చర్చనీయాంశం. ఎస్ఏ రహీమ్, నయీముద్దీన్, తులసీదాస్ బలరామ్, పీటర్ తంగరాజ్, షాహిద్ వసీమ్, మొహమ్మద్ హబీబ్, షబ్బీర్ అలీ, జుల్ఫికర్ అలీ.. ఒకరా, ఇద్దరా ఎంతో మంది హైదరాబాద్ దిగ్గజాలు భారత ఫుట్‌బాల్‌ను సుదీర్ఘ కాలం నడిపించారు. 1950వ, 1960వ దశకాల్లో భారత జట్టు మొత్తం హైదరాబాద్ ఆటగాళ్లతోనే కనిపించేది. మన సిటీ పోలీస్ టీమ్ అంటే దేశంలోని ఏ జట్టుకైనా హడల్. సంతోష్ ట్రోఫీ, డ్యురాండ్ కప్, రోవర్స్ కప్.. టోర్నీ ఏదైనా విజేత హైదరాబాద్ జట్టు మాత్రమే. ఒలింపిక్స్ క్రీడల్లో భారత అత్యుత్తమ ప్రదర్శనగా నాలుగో స్థానం 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో వచ్చింది. ఈ టీమ్‌లో ఎనిమిది మంది హైదరాబాద్ ఆటగాళ్లు ఉండటం విశేషం.మొత్తంగా 1948 నుంచి చూస్తే మన నగరం నుంచి 14 మంది ఒలింపియన్లు, 21 అంతర్జాతీయ ఫుట్‌బాలర్లు, 9 మంది కోచ్‌లు తమ ప్రతిభతో భారత ఫుట్‌బాల్‌పై చెరగని ముద్ర వేశారు. ఇదంతా ఘనమైన గతం. 1980వ దశకంలోకి వచ్చేసరికి ఆటలో ఆ కళ తప్పింది. వేర్వేరు కారణాలతో ఆటగాళ్ల ప్రదర్శన స్థాయి పడిపోతూ వచ్చింది. హైదరాబాద్ పోలీస్ టీమ్ కూడా బలహీనంగా మారిపోవడంతో ఫలితాలు రావడం ఆగిపోయాయి. ఆపై బెంగాల్, కేరళ జట్లు ఆటలో పూర్తిగా ఆధిపత్యం సాధించడం మొదలైంది. వీటికి తోడు గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాలు కూడా బలంగా దూసుకొచ్చాయి. మెలమెల్లగా హైదరాబాద్ ఫుట్‌బాల్ చివరి దశకు వచ్చేసింది. కనీసం ప్రతిభాన్వేషణ లేకపోవడం, టోరీ్నల నిర్వహణ జరగకపోవడంతో సహజంగానే ఇక్కడ ఫుట్‌బాల్ మరింతగా దిగజారిపోయింది.1962లో ఏషియన్ గేమ్స్‌లో ఎస్ఏ రహీమ్ జట్టు ఐఎస్ఎల్తో పెరిగిన ఆసక్తి.. దాదాపు రెండు దశాబ్దాల పాటు హైదరాబాద్ నగరంలో ఫుట్‌బాల్ (Football) నామ్‌కే వాస్తేగానే నడిచింది. అయితే అదృష్టవశాత్తూ కొత్త తరంలో మళ్లీ ఆటపై కాస్త ఆసక్తి పెరగడంతో పాటు అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా పలు కార్పొరేట్ స్కూల్స్ ఫుట్‌బాల్‌ను ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా టీమ్‌లు తయారు చేసి జాతీయ స్థాయి పోటీల్లో బరిలోకి దించడంతో మళ్లీ హైదరాబాద్ పేరు వినిపించడం మొదలైంది. ప్రతిష్టాత్మక ఐ–లీగ్‌లో నగరానికి చెందిన ‘శ్రీనిధి’ దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ సత్తా చాటుతూ అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ టీమ్ ఉండటం కూడా ఇక్కడి ఆటకు గుర్తింపు తెచ్చింది. ఈ టీమ్‌లో నేరుగా స్థానిక ఆటగాళ్లు లేకపోయినా హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) ఇక్కడ అందరిలో ఆసక్తిని పెంచడంలో సఫలమైంది. గచ్చిబౌలి స్టేడియంలో ఐఎస్ఎల్ మ్యాచ్‌లకు వచ్చిన ఆదరణే అందుకు నిదర్శనం. దీంతో పాటు పలు ఫుట్‌బాల్ క్లినిక్‌లు, క్యాంప్‌ల ద్వారా హెచ్ఎఫ్సీ యువ ఆటగాళ్లకు మంచి అవకాశాలు కల్పించింది. దురదృష్టవశాత్తూ ఆర్థిక పరమైన కారణాలతో ఐఎస్ఎల్కు హెచ్ఎఫ్సీ దూరమైనా.. అది ఇక్కడ ఉన్నన్నాళ్లు మంచి ప్రభావం చూపగలిగింది.1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు ప్రైవేట్ క్లబ్‌ల చొరవతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పదే పదే ఫుట్‌బాల్‌పై తన ఆసక్తిని ప్రదర్శిస్తున్నా గ్రౌండ్ లెవల్లో పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. తెలంగాణ జట్టు జూనియర్ స్థాయిలో విజయం సాధించి వచ్చి సీఎంను కలిసిన తర్వాత ఆయన ఆటను అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంను ఫుట్‌బాల్‌కు కేంద్రంగా మారుస్తామని చెప్పినా.. మైదానం ఎప్పటిలాగే సౌకర్యాల లేమితో కనిపిస్తోంది. జింఖానా మైదానంలో కూడా చాలా పరిమితంగానే ఆడేందుకు అవకాశం లభిస్తోంది. ఏళ్లుగా టోర్నీల నిర్వహణకు ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. ఇలాంటి స్థితిలో ‘శ్రీనిధి’ యాజమాన్యం ఆటకు అండగా నిలుస్తోంది. అక్కడి మైదానాల్లో ప్రాక్టీస్, టోర్నీల నిర్వహణతో పాటు కుర్రాళ్లకు అవకాశాలు కల్పిస్తూ ఫుట్‌బాల్‌ను ప్రోత్సహిస్తోంది. తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సొంత డబ్బులతోనే ఆటను రక్షించే ప్రయత్నం చేస్తుండటం సానుకూల అంశం. పాతబస్తీలోని చారిత్రాత్మక అబ్బాస్ క్లబ్, బొల్లారం క్లబ్‌లతో పాటు కొన్ని పాత క్లబ్‌లు మాత్రమే ఇంకా ఆటను బతికిస్తున్నాయి. దేశంలో ఎక్కడ టోర్నీ జరిగినా తమ జట్లను పంపి ఆయా క్లబ్‌కు ఫుట్‌బాల్‌తో తమ బంధాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం తలచుకుంటే.. గత ఏడాది సెసెప్టెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఫుట్‌బాల్‌ను ప్రోత్సహిస్తామంటూ ఇంటర్ కాంటినెంటల్ కప్‌ను నిర్వహించింది. భారత్‌తో పాటు సిరియా, మారిషస్ జట్లు ఇందులో పాల్గొన్నాయి. టోర్నీ నిర్వహణ సమయంలో కూడా ప్రభుత్వం బాగా హడావిడి, ప్రచారం చేసింది. ఆ సమయంలో కూడా ముఖ్యమంత్రికి ఈ ఆటపై ఉన్న ఆసక్తి కనిపించింది. కానీ ఒక్కసారి టోర్నీ ముగియగానే అంతా గప్‌చుప్. ఇప్పుడు మెస్సీ రాకను కూడా ప్రభుత్వం ఒక పెద్ద ప్రచార కార్యక్రమంలా చూస్తోంది. నిజాయితీగా చూస్తే ఈ ప్రైవేట్ కార్యక్రమంతో ఒరిగేదేమీ ఉండదు. మెస్సీ కూడా తన పరిమితుల్లో కొద్దిసేపు స్వల్పంగా పెనాల్టీలు ఆడి ఒక నాలుగు పాస్‌లు ఇచ్చి మమ అనిపిస్తాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ ప్రోగ్రాం మన ఫుట్‌బాల్‌ను మార్చేయదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఫుట్‌బాల్ రాతను మార్చాలనుకుంటే అది అసాధ్యమేమీ కాదు. ఆటను అభివృద్ధి చేయాలంటే ఏర్పాటు చేయాల్సిన మౌలిక సౌకర్యాలు చాలా ఉన్నాయి. ఆపై ప్రతిభను ప్రోత్సహిస్తూ టోర్నీల నిర్వహణ ఒక క్రమంలో జరగాలి. దీనికి చాలా సమయం పడుతుంది. ఒక బృహత్ లక్ష్యంతో పని చేస్తే భారత ఫుట్‌బాల్‌లో మరోసారి నాటి హైదరాబాద్ మెరుపులు కనిపిస్తాయి. -
మెస్సీ@ తాజ్ ఫలక్‌నుమా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రానున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాతబస్తీలోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్లో బస చేయనున్నారు. అక్కడ నుంచే ఆయన తన బృందంతో కలిసి ఉప్పల్ స్టేడి యానికి వెళ్లి.. సీఎం రేవంత్‌రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఆపై ప్యాలెస్‌కు తిరిగి వచ్చి, ఎంపిక చేసిన ప్రముఖులను కలుసుకుంటారని తెలిసింది. శనివారం మెస్సీ పర్యటన నేపథ్యంలోపోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 1894లో నిజాం నిర్మించిన ఫలక్‌నుమా ప్యాలెస్, 2010లో తాజ్ ఫలక్‌నుమా హోటల్‌గా మారింది. 2014 నవంబర్‌లో సల్మాన్‌ఖాన్ సోదరి అరి్పత ఖాన్ వివాహం ఇందులోనే జరిగింది. 2017 నవంబర్‌లో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు తాజ్ ఫలక్‌నుమాలోనే విందు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మెస్సీ కూడా అందులోనే బస చేయనుండటంతో ఈ ప్యాలెస్ పేరు అంతర్జాతీయ స్పోర్ట్స్ సర్కిళ్లలోనూ మారుమోగనుంది. శనివారమే హైదరాబాద్ రానున్న మెస్సీ, ఆయన టీమ్ నేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి తాజ్ ఫలక్‌నుమా హోటల్‌కు వెళ్లి బస చేస్తుంది. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ బృందం తిరిగి నేరుగా హోటల్‌కే వెళుతుందని సమాచారం. శనివారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనే బస చేసే మెస్సీ, ఆదివారం అక్కడ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి తిరుగు ప్రయాణమవుతారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఆయన పర్యటనలో మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. హైదరాబాద్, రాచకొండ కమిషనర్లు వీసీ సజ్జనార్, జి.సుదీర్బాబులతో పాటు నగర ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్‌లు మెస్సీ పర్యటనలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఓ పక్క మెస్సీతో పాటు ఆయన బృందం, మరోపక్క సీఎం రేవంత్‌రెడ్డి సహా ఇతర ప్రముఖులు స్టేడియం వద్దకు రావడానికి, తిరిగి వెళ్లడానికి రూట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఓ సవాల్‌గా తీసుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు తగిన ప్రణాళికలు రచిస్తున్నారు. పాస్‌లు, టికెట్లు ఉన్న వారిని మాత్రమే స్టేడియం పరిసరాల్లోకి అనుమతించనున్నారు. -
ర్యాంప్‌పై మెస్సీ నడక
కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయోనల్ మెస్సీ భారత్ పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇన్నాళ్లు ఫుట్‌బాల్ మైదానంలో అతని కిక్‌లు, పాస్‌లు చూసిన అభిమానులు ముంబైలో మాత్రం కొత్త మెస్సీని చూడబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆటలో అలరించిన అతను ఓ ప్రత్యేక ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడకతో ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడు. ‘జీఓఏటీ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఇండియా టూర్’లో భాగంగా మెస్సీ ఈ వారాంతంలో భారత్‌లో పర్యటించనున్నాడు. దీనికి సంబంధిన ఏర్పాట్లన్నీ ఇది వరకే పూర్తయ్యాయి. ఈ మూడు రోజుల పర్యటనలో నాలుగు ప్రధాన నగరాల్లో సెలబ్రిటీలతో కలిసి భారత అభిమానుల్ని అలరించనున్నాడు. పర్యటనలో తొలిరోజు 13న ముందుగా కోల్‌కతాలో అడుగుపెట్టే మెస్సీ అక్కడి నుంచి అదే రోజు హైదరాబాద్‌కు విచ్చేస్తాడు. ఆ మరుసటి రోజు ఆదివారం ముంబై చేరుకుంటాడు. సోమవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమాలతో అతని పర్యటన ముగుస్తుంది. ఆఖరి రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకుంటాడని నిర్వాహకులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. కోల్‌కతాలో వర్చువల్‌గా... కోల్‌కతాలో క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ అంటే చెవికోసుకుంటారు. విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అర్జెంటీనా దివంగత దిగ్గజం మారడోనా అంటే పడిచచ్చేంత అభిమానం కోల్‌కతా వాసులది. ఇప్పుడు మెస్సీ అంటే కూడా అదే స్థాయిలో ప్రాణమిస్తారు. కాబట్టి కోల్‌కతా పోలీసులు కోల్‌కతాలో మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ఏర్పాటు చేశారు. భద్రతా కారణాలరీత్యానే హోటల్ నుంచే ఈ ఆవిష్కరణ ఉంటుందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అనంతరం బిజిబిజీగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటాడు. హైదరాబాద్‌లో.... ‘గోట్’ పాన్ ఇండియా టూర్‌ను దేశం నలువైపులా కవర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తూర్పున కోల్‌కతా నుంచి దక్షిణాన హైదరాబాద్, పశి్చమాన ముంబై, ఉత్తరాన ఢిల్లీ నగరాలకు వస్తాడు. హైదరాబాద్‌లో సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతాడు. ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో ‘గోట్ కప్’లో పాల్గొంటాడు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మెస్సీతో కలిసి కిక్‌లు కొట్టనున్నారు. ప్రధానితో ఢిల్లీలో... హైదరాబాద్ నుంచి నేరుగా ఆదివారం ముంబైకి వెళ్లి అక్కడ క్లబ్ సహచరుడు స్వారెజ్, అర్జెంటీనా సహచరుడు రోడ్రిగోలతో కలిసి ఫ్యాషన్ షోలో పాల్గొంటాడు. చివరగా ఢిల్లీ చేరుకొని ప్రధాని మోదీతో భేటీ అవుతాడు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు పూర్తయ్యాక అదే రోజు రాత్రి స్వదేశానికి బయలుదేరతాడు. -
మెస్సీ ఖాతాలో మరో ట్రోఫీ
ఫ్లోరిడా: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయోనెల్ మెస్సీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. మేజర్ లీగ్ సాకర్ (ఎంఎల్ఎస్) కప్‌లో మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్ మయామి జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన తుదిపోరులో ఇంటర్ మయామి క్లబ్ 3–1 గోల్స్ తేడాతో వాంకోవర్ క్లబ్‌పై విజయం సాధించింది. ఇంటర్ మయామి జట్టు తరఫున మెస్సీ అన్నీ తానై వ్యవహరించాడు. ఫైనల్లో ఈ స్టార్ ఆటగాడు గోల్ చేయలేకపోయినా... సహచరులు గోల్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఎనిమిదో నిమిషంలో వాంకోవర్ జట్టు ఆటగాడు ఎడైర్ ఒకాంపో ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో మయామి జట్టు ముందంజ వేయగా... ఆ తర్వాత రోడ్రిగో డె పాల్ (71వ నిమిషంలో), టాడియో అల్లెండె (90+6వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు. వాంకోవర్ జట్టు తరఫున అలీ అహ్మద్ (60వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. ఈ సీజన్లో మెస్సీకిది మూడో మేజర్ లీగ్ టైటిల్ కాగా... ఓవరాల్‌గా కెరీర్లో 47వది. ‘మూడేళ్ల క్రితం ఎంఎల్ఎస్ టైటిల్ గెవాలని కలగన్నా... అది ఈ రోజు సాధ్యమైంది. సీజన్ ఆసాంతం జట్టు మొత్తం కలిసికట్టుగా ఆడింది. ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆటగాళ్లందరూ దీనికి అర్హులు’ అని మెస్సీ పేర్కొన్నాడు. ఇంటర్ మయామి క్లబ్‌కు ఇదే తొలి ఎంఎల్ఎస్ టైటిల్ కాగా... మెస్సీకి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు దక్కింది. జర్మనీ దిగ్గజ ఆటగాడు థామస్ ముల్లర్ వాంకోవర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా... చాన్నాళ్ల తర్వాత ముల్లర్‌పై మెస్సీ ఆధిపత్యం కనబర్చగలిగాడు. గతంలో పలుమార్లు ముల్లర్ కారణంగా అర్జెంటీనా జట్టు ప్రధాన టోర్నీల్లోపరాజయం పాలైంది. 2010 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్, 2014 వరల్డ్‌కప్ ఫైనల్లో ముల్లర్ సారథ్యంలోని జర్మనీ జట్టు... అర్జెంటీనాపై విజయం సాధించింది. ఇలా ఇప్పటి వరకు పలు కీలక టోర్నీల్లో మెస్సీపై ముల్లర్దే ఆధిపత్యం కాగా... ఎట్టకేలకు ఎంఎల్ఎస్ కప్‌లో మెస్సీ బదులు తీర్చుకున్నాడు. -
మెస్సీతో మ్యాచ్.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
-
ఆసక్తికర పోరుకు సీఎం రేవంత్ సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తో సీఎం రేవంత్‌రెడ్డి తలపడనున్నారు. అదేంటి... మెస్సీతో రేవంత్ తలపడటమేంటని అనుకుంటున్నారా...ఇద్దరూ కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మ్యాచ్ ఆడటమే కాదు.. ఇద్దరూ రెండు టీంలతో ప్రత్య ర్థులుగా తలపడనున్నారు. ఇందుకు ఈనెల 13న ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. మ్యాచ్ ఖరారైందని, ఆర్ఆర్–9, ఎల్ ఎం–10 టీంల మధ్య ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్ జరుగుతుంది. -
హైదరాబాద్‌కు మెస్సీ..ఫోటో దిగాలంటే రూ. 10 లక్షలు! (ఫొటోలు)
-
రూ.1750 నుంచి రూ.13,500 వరకు...
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ప్రత్యక్షంగా ఈ స్టార్ ప్లేయర్ ఆటను చూసే అవకాశం నగర అభిమానులకు కలుగుతోంది. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా డిసెంబర్ 13న మెస్సీ హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ షో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా నాలుగు దిక్కుల్లో నాలుగు నగరాలు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో అతని పర్యటన ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమాలు. ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ శతధ్రు దత్తా ఈ టూర్ మొత్తానికి నిర్వాహకుడు. నాలుగు వేదికల్లో అభిమానుల కోసం నిర్వహిస్తున్న ఈవెంట్లు కాకుండా ముంబైలో వ్యక్తిగతంగా మెస్సీని కలిసి ఫోటో దిగే అవకాశం కూడా నిర్వాహకులు కల్పిస్తున్నారు. అయితే దీని కోసం ఒక్కొక్కరు సుమారు రూ.9.95 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది! స్టేడియంలో కార్యక్రమం ఇదీ... సాయంత్రం 7 గంటలకు మొదలై దాదాపు 3 గంటల పాటు మెస్సీ ‘షో’ సాగుతుంది. ఇందులో నాలుగు అంశాలు ఉన్నాయి. ఎంపిక చేసిన సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్ మ్యాచ్... ఎంపిక చేసిన చిన్నారులతో ‘మాస్టర్ క్లాస్ విత్ యంగ్ టాలెంట్స్’... ‘పెనాల్టీ షూటౌట్’లో మెస్సీ పాల్గొంటాడు. ఆ తర్వాత మ్యూజికల్ కన్సర్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి నిర్వాహకులు టికెట్ల వివరాలను ప్రకటించారు. ఇందులో వరుసగా రూ. 1750, రూ. 2000, రూ. 3250, రూ. 5000, రూ. 7000, రూ. 8000, రూ. 13500 విలువ గల టికెట్లు ఫ్యాన్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. టికెట్లను https://www.district.in/ events/goat-india-tour-2025-lionel-messi-hyderabad-buy-tickets వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. -
మెస్సీ రాకపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 13- 15 వరకు అతడు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ సోషల్ మీడియా వేదికగా భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇండియా నుంచి లభిస్తున్న ప్రేమకు నేను ముగ్ధుడినైపోయాను. GOAT టూర్ త్వరలోనే ఆరంభం కానుంది. తొలుత కోల్‌కతా, ముంబై, ఢిల్లీలకే నా పర్యటన పరిమితం కాగా.. ఇప్పుడు హైదరాబాద్ కూడా జాబితాలో చేరింది. త్వరలోనే ఇండియాకు వస్తున్నా’’ అంటూ మెస్సీ హర్షం వ్యక్తం చేశాడు.ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్‌కు రాబోతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు, ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.మెస్సీ వంటి దిగ్గజాన్ని చూడాలని మన సిటీతో పాటు ప్రతి ఒక్క ఫుట్‌బాల్ అభిమాని కోరుకుంటారు. ఆయన మన గడ్డ మీద అడుగుపెట్టబోతున్నారు. గర్వం, సంతోషంతో నిండిన మనసుతో హైదరాబాద్ ఆయనకు ఆతిథ్యం ఇస్తుంది. మన ఆతిథ్యమే ఇక్కడి ప్రజల మనసు ఏమిటో ఆయనకు తెలియజేస్తుంది’’ అంటూ రేవంత్ రెడ్డి ఉద్వేగపూరిత ట్వీట్ చేశారు. కాగా మెస్సీ తన టూర్లో భాగంగా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఫుట్‌బాల్ క్లినిక్‌లు ప్రారంభిస్తాడు. మ్యూజిక్ కన్సర్ట్‌తో పాటు సన్మాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. -
ప్రధాని మోదీకి మెస్సీ జన్మదిన కానుక
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం (బుధవారం) సందర్భంగా క్రీడాలోకం శుభాకాంక్షలు తెలిపింది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా... అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ 2022 ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జెర్సీని బహుమతిగా పంపించాడు. రెండు మూడు రోజుల్లో మెస్సీ అందించిన జెర్సీని ప్రధానికి బహుకరించనున్నట్లు ప్రమోటర్ సతాద్రు దత్తా వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్లో మెస్సీ భారత్‌లో పర్యటించనున్నాడు. ఇందులో భాగంగా కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో అతడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. ‘మెస్సీని కలిసినప్పుడు ప్రధాని 75వ పుట్టిన రోజు రానుందని చెప్పాను. దీంతో అతడు వరల్డ్‌కప్ విన్నింగ్ జెర్సీపై తన ఆటోగ్రాఫ్ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాల్సిందిగా నాకు చెప్పాడు’ అని సతాద్రు దత్తా తెలిపారు. మెస్సీ పర్యటనలో భాగంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా–2025’ పేరిట మెస్సీ పర్యటన కోల్‌కతా నుంచి ప్రారంభం కానుంది. 2011లో చివరిసారిగా మెస్సీ భారత్‌లో పర్యటించాడు. వెనిజులాతో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు అర్జెంటీనా జట్టు అప్పట్లో కోల్‌కతాకు వచ్చింది. మరోవైపు ఈ ఏడాది నవంబర్‌లో అర్జెంటీనా జట్టు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు కేరళాలోపర్యటించనుందని... ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దురెహమాన్ వెల్లడించారు. -
సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్‌లో...
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ సొంతగడ్డకు ఘనంగా వీడ్కోలు పలికాడు. కెరీర్‌కు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ అర్జెంటీనాలో మాత్రం ఇదే తన ఆఖరి పోరని ఇది వరకే స్పష్టం చేసిన మెస్సీ సొంత అభిమానులను 2 గోల్స్‌తో మురిపించాడు. దీంతో శుక్రవారం జరిగిన దక్షిణ అమెరికా జోన్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–0తో వెనిజులాపై ఘనవిజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 39వ నిమిషంలో, ద్వితీయార్ధంలో 80వ నిమిషంలో మెస్సీ గోల్స్ కొట్టాడు. మరో గోల్‌ను మార్టినెజ్ (76వ నిమిషంలో) చేశాడు. మెస్సీ కుమారులు, కుటుంబసభ్యులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా మైదానానికి వచ్చి తిలకించారు. వచ్చే ఏడాది ప్రపంచకప్ కోసం దక్షిణ అమెరికా నుంచి తాజాగా ఉరుగ్వే, కొలంబియా, పరాగ్వే జట్లు మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాయి. అర్జెంటీనా మార్చిలోనే క్వాలిఫై అయ్యింది. -
కేరళకు మెస్సీ సేన
కొచ్చి: ప్రపంచ ఫుట్‌బాల్ చాంపియన్ అర్జెంటీనా జట్టు భారత్‌లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో భాగంగా లయోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఈ ఏడాది మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ప్రత్యర్థి జట్లు, నగరాలు ఖరారు కానప్పటికీ ఏ ఏ దేశాల్లో జరిగేవి వెల్లడించారు. ముందుగా మెస్సీ సేన అమెరికాలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6 నుంచి 14వ తేదీల మధ్యలో అర్జెంటీనా... అమెరికాలో ఈ మ్యాచ్ ఆడుతుంది. తర్వాత నవంబర్ 10 నుంచి 18వ తేదీల మధ్యలో లువాండా (అంగోలా), కేరళ (భారత్) రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో మెస్సీ జట్టు తలపడుతుంది. ఈ మేరకు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అర్జెంటీనా ఎదుర్కోబోయే జట్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అందులో పేర్కొంది. అయితే మొరాకో, కోస్టా రికో, ఆస్ట్రేలియాలతో పాటు ఆసియా మేటి జట్టు జపాన్‌లతో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఘనమైన ఆతిథ్యానికి ఏర్పాట్లు చేస్తోంది. కొన్నాళ్లుగా సాకర్ స్టార్ మెస్సీని కేరళకు తీసుకొచ్చేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమైంది. మొత్తానికి అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) షెడ్యూల్లో కేరళను చేర్చడంలో సఫలమైంది. మెస్సీ నవంబర్‌లో గనక జట్టుతో పాటు వస్తే నెల వ్యవధిలో ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మళ్లీ డిసెంబర్లో భారత్‌కు రానున్నాడు. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను ఆర్గనైజర్లు ఇటీవలే ప్రకటించారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్‌లోని సాకర్ ప్రియులకు, మెస్సీని ఆరాధించే అభిమానులకు ఇది పెద్ద పండగే. -
డిసెంబర్లో మోదీతో మెస్సీ భేటీ
కోల్‌కతా: అర్జెంటీనా సూపర్‌స్టార్ ఫుట్‌బాలర్ లయోనల్ మెస్సీ భారత పర్యటన ఖరారైంది. చాలా రోజులుగా భారత టూర్ ఉంటుందని వార్తలు వస్తుండగా... తాజాగా షెడ్యూల్‌ను ప్రకటించారు. మెస్సీ పర్యటనను ‘గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) టూర్ ఆఫ్ ఇండియా’గా నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఈవెంట్ ప్రమోటర్ శతద్రు దత్తా శుక్రవారం వెల్లడించారు. ఈ మధ్య సెలబ్రిటీలు టెన్నిస్ తరహా రాకెట్‌తో ఆడే ఆటే ‘ప్యాడెల్’. అయితే ఇది పూర్తిగా టెన్నిస్ ఆడే రాకెట్ కాదు. కాస్త భిన్నంగా ఉంటుంది. డిసెంబర్ 12 నుంచి 15 వరకు భారత్‌లోని ప్రముఖ నగరాలైన కోల్‌కతా, ముంబై, ఢిల్లీ అహ్మదాబాద్‌లలో మెస్సీ భారత అభిమానులను అలరిస్తారు. ప్రతీ నగరంలోనూ చిన్నారులు, యువ ఫుట్బాలర్లతో కలుస్తారు. మన ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నాలుగు రోజుల బిజీ పర్యటనలో ముందుగా అతను కోల్‌కతాలో అడుగు పెడతాడు. ఫుట్‌బాల్ అంటేనే శివాలుగే కోల్‌కతాలో డిసెంబర్ 12న మెస్సీ గడుపుతారు. ఈడెన్ గార్డెన్స్ లేదంటే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు గోట్ ఆట ఆడతారు. దీంతో పాటు భారత మాజీ కెపె్టన్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం, ఫుట్‌బాల్ కెపె్టన్ బైచుంగ్ భూటియాలతో కలిసి సెవెన్–ఎ–సైడ్ సాఫ్ట్‌టచ్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతారు. సాధారణ ప్రేక్షకులను కూడా ఈ సెలబ్రిటీ మ్యాచ్ చూసేందుకు అనుమతిస్తారు. రూ. 3500 నుంచి మొదలయ్యే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని నిర్వాహకుడు శతద్రు దత్తా తెలిపారు. మెస్సీ పర్యటనపై బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీకి వెల్లడించినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఈ సందర్భంగా ఆమె పోలీసు శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పక్కా ప్లాన్ చేస్తామని హామీ ఇచ్చినట్లు దత్తా చెప్పారు. 14న ముంబైలో హేమాహేమీలతో... మరుసటి రోజు డిసెంబర్ 13న మెస్సీ అహ్మదాబాద్‌కు పయనమవుతాడు. అక్కడ అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ప్రైవేట్ కార్యక్రమంలో అతను పాల్గొంటాడు. అటునుంచి 14న నేరుగా ముంబై చేరుకుంటాడు. సీసీఐ బ్రాబౌర్న్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో హేమాహేమీలతో భేటీ అవుతాడు. వాంఖెడే స్టేడియంలో ముంబై ప్యాడెల్ కప్‌లో పాల్గొంటాడు. అధికారికంగా వెల్లడించనప్పటికీ బాలీవుడ్, స్పోర్ట్స్ దిగ్గజాలు షారుక్ ఖాన్, రణ్వీర్ సింగ్, ఆమిర్ ఖాన్, టైగర్ ష్రాఫ్, లియాండర్ పేస్, సచిన్ టెండూల్కర్, ధోని, రోహిత్ శర్మలతో టెన్నిస్ తరహా రాకెట్‌తో ఆడే ప్యాడెల్ ఈవెంట్లో మెస్సీ కాసేపు ఆడనున్నాడు. మరుసటి రోజు డిసెంబర్ 15న ఢిల్లీకి పయనమవుతాడు. అక్కడ మొదట భారత ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా కలిశాక... ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగే ఢిల్లీ అంచె గోట్ కప్‌లో కింగ్ కోహ్లి, శుబ్‌మన్ గిల్‌లతో కలిసి ఆడతాడు. సరిగ్గా ధర్మశాలలో డిసెంబర్ 14న దక్షిణాఫ్రికాతో జరిగే టి20 అనంతరం ఢిల్లీలో ఈ ఈవెంట్ జరుగుతుందని ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) వర్గాలు తెలిపాయి. -
మెస్సీ మేనియా షురూ!
కోల్‌కతా: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెపె్టన్ లియోనెల్ మెస్సీ ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించనున్నాడు. 2011లో చివరిసారిగా భారత్‌కు విచ్చేసిన మెస్సీ... రెండు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్లో కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే కోల్‌కతా నుంచి మెస్సీ పర్యటన ప్రారంభం కానుంది. అందకు తగ్గట్లే ఏర్పాట్లు సైతం జరుగుతున్నట్లు సమాచారం. అయితే భారత పర్యటనపై ఇప్పటి వరకు మెస్సీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అతి త్వరలో అది వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘మెస్సీ పర్యటన ఖరారైంది. అతడి నుంచి అధికారిక స్పందన రావడమే తరువాయి. అది సామాజిక మాధ్యమాల ద్వారా ఏ క్షణమైనా రావచ్చు’ అని నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 12న మెస్సీ కోల్‌కతాలో అడుగు పెట్టనున్నాడు. 70 అడుగుల విగ్రహం... ఫుట్‌బాల్‌ను విపరీతంగా అభిమానించే కోల్‌కతా వాసులు... మెస్సీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ రోడ్‌లోని లేక్‌టౌన్ శ్రీభూమిలో మెస్సీ 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యటనలో భాగంగా మెస్సీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాడు. ప్రపంచంలో మెస్సీకి ఇదే అతి ఎత్తయిన విగ్రహం కానుంది. డిసెంబర్ 13 మధ్యాహ్నం ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించే ‘గోట్ కాన్సెర్ట్’లో మెస్సీ పాల్గొననున్నాడు. మెస్సీ ఘనతలను వివరించేలా సాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ‘అభిమానులను తప్పుదోవ పట్టించాలనుకోవడం లేదు. గోట్ కాన్సెర్ట్‌తో పాటు ఏడుగురు ప్లేయర్లతో కూడిన ‘సెవెన్–ఎ–సైడ్’ గోట్ కప్ మ్యాచ్‌లో మెస్సీ పాల్గొననున్నాడు. ఇందులో భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ సౌరవ్ గంగూలీ, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా, ప్రముఖ నటుడు జాన్ అబ్రహం తదితరులు పాల్గొననున్నారు. ఇది మెస్సీ గౌరవార్ధం నిర్వహిస్తున్నాం. ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించే ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎగబడే అవకాశం ఉండగా... టికెట్ ధరలు సైతం ఎక్కువగానే ఉండనున్నాయి. సుమారు గంటన్నర పాటు మెస్సీ మైదానంలో ఉంటాడు. అతడిని దగ్గర నుంచి చూసేందుకు స్టేడియం నిండిపోవడం ఖాయమే’ అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మ్యాచ్ అనంతరం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెస్సీని సత్కరించే అవకాశముంది. ముంబైలో క్రికెట్ మ్యాచ్! కోల్‌కతా పర్యటన అనంతరం మెస్సీ అహ్మదాబాద్, ముంబైలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. డిసెంబర్ 14న ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరగనున్న ‘గోట్ కాన్సెర్ట్’, ‘గోట్ కప్’లో మెస్సీ పాల్గొననున్నాడు. దీని కోసం ఇప్పటికే మైదానాన్ని బుక్ చేసినట్లు సమాచారం. ముంబైలో మెస్సీ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నట్లు వార్తలు వస్తుండగా... నిర్వాహకులు మాత్రం వాటిని ఖండించారు. ‘మెస్సీ ఎలాంటి క్రికెట్ మ్యాచ్ ఆడబోవడం లేదు. భారత సెలెబ్రిటీలతో సరదాగా సాఫ్ట్‌బాల్ ఆడుతాడు’ అని వెల్లడించారు. అదే సమయంలో భారత ఫుట్‌బాల్ జట్టును సైతం మెస్సీ కలిసే అవకాశముంది. అనంతరం డిసెంబర్ 15న ఢిల్లీ చేరుకోనున్న మెస్సీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా భేటీ కానున్నాడు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతి నగరంలో మెస్సీ చిన్నారులతో ప్రత్యేకంగా గడపనున్నాడు. ఈ టూర్లో మెస్సీ కేరళకు వెళ్లడం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. అప్పుడేం జరిగిందంటే...2011 ఆగస్టు 31న మెస్సీ తొలిసారి భారత్‌లో పర్యటించాడు. వెనిజులాతో ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం కోల్‌కతాకు విచ్చేసిన మెస్సీకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అర్జెంటీనా జట్టుతో పాటు వచి్చన మెస్సీ కోసం వేలాది మంది అభిమానులు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలకగా... మ్యాచ్ జరుగుతున్నంత సేపు ‘సాల్ట్‌లేక్’ స్టేడియం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. కోల్‌కతా నగరం మొత్తం ‘మెస్సీ మేనియా’తో ఊగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత... ప్రపంచ చాంపియన్ హోదాలో మెస్సీ భారత్‌లో అడుగుపెట్టనుండటంతో... ఈ సారి మరింత మంది అభిమానులు అర్జెంటీనా స్టార్‌ను చూసేందుకు ఎగబడటం ఖాయమే. -
భారత్‌కు రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ.. ధోని, రోహిత్, కోహ్లితో క్రికెట్ మ్యాచ్
భారత ఫుట్‌బాల్ ప్రేమికులకు శుభవార్త. దిగ్గజ ఫుట్‌బాలర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ త్వరలో భారత పర్యటనకు రానున్నాడు. ఈ ఏడాది డిసెంబర్లో (13-15) కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు.మెస్సీకి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగనుంది. కోల్‌కతా పర్యటనలో మెస్సీ చిన్న పిల్లల కోసం ఫుట్‌బాల్ వర్క్ షాప్ నిర్వహింస్తాడు. ఇదే సందర్భంగా మెస్సీ చేతుల మీదుగా ఫుట్‌బాల్ క్లినిక్ లాంచ్ కానుంది. ఈడెన్ గార్డెన్స్‌లో మెస్సీ పలువురు భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.కోల్‌కతా పర్యటన అనంతరం మెస్సీ డిసెంబర్ 14న ముంబైలో పర్యటిస్తాడు. ఈ పర్యటనలో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగే ఓ ప్రైవేట్ ఈవెంట్లో (విజ్‌క్రాఫ్ట్ నిర్వహించే కార్యక్రమం) పాల్గొంటాడు. దీనికి ముందు భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలతో కలిసి సెవెన్-ఏ-సైడ్ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ముంబై పర్యటన తర్వాత మెస్సీ ఢిల్లీలో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. మెస్సీ భారత పర్యటనకు సంబంధించిన వాస్తవిక షెడ్యూల్ అధికారికంగా ఖరారు కాలేదు. మెస్సీ తొలిసారి 2011లో భారత్‌లో పర్యటించాడు. నాడు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. -
మెస్సీ కాదు!.. నేనే అత్యుత్తమ ఆటగాడిని: రొనాల్డో
దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఫుట్‌బాల్ ప్రపంచంలో మకుటం లేని మహారాజులుగా వెలుగొందుతున్నారు పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)- అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సీ(Lionel Messi). అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకునే ఈ ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈ వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప అన్న చర్చ ఎప్పుడూ ఆసక్తికరమే.ఈ విషయంపై రొనాల్డో స్వయంగా స్పందించాడు. చాలా మంది మెస్సీకే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) బిరుదు ఇచ్చేందుకు మొగ్గుచూపవచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే, తాను మాత్రం పరిపూర్ణ ఫుట్‌బాలర్‌ని అని పేర్కొన్న రొనాల్డో.. ఫుట్‌బాల్ చరిత్రలో తన కంటే గొప్ప ఆటగాడు లేడని అనడం విశేషం.నేనే ‘కంప్లీట్ ప్లేయర్’స్పానిష్ మీడియా అవుట్లెట్ లాసెక్టా టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతూ.. ‘‘నాలాగా ప్రపంచంలో పరిపూర్ణమైన ఫుట్‌బాలర్ మరెవరూ లేరని అనుకుంటా. ఇప్పటి వరకు ఉన్న ఫుట్‌బాల్ ఆటగాళ్లందరిలో నేనే ‘కంప్లీట్ ప్లేయర్’. నేను అన్ని రకాలుగా ఫుట్‌బాల్ ఆడగలను. చాలా మంది మెస్సీ, మారడోనా లేదంటే.. పీలే పేరు చెప్తారేమో!చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడినివాళ్ల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఏదేమైనా మోస్ట్ కంప్లీట్ ప్లేయర్ మాత్రం నేనే! ఫుట్‌బాల్ చరిత్రలోనే నేను అత్యుత్తమ ఆటగాడిని. నా కంటే మెరుగ్గా ఆడే ఫుట్‌బాలర్‌ను ఇంత వరకూ చూడలేదు. ఇవి నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు’’ అని పేర్కొన్నాడు.అదే విధంగా మెస్సీతో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘మెస్సీతో నాకు ఎప్పుడూ ఎలాంటి సమస్యా లేదు. గత పదిహేనేళ్లుగా మేము అవార్డులు పంచుకుంటున్నాం. మా మాధ్య ఎలాంటి గొడవలు లేవు. అంతా సవ్యంగానే ఉంది.తనకోసం నేను ఆంగ్లాన్ని తర్జుమా చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో భలే సరదాగా ఉండేవాళ్లం. ఇక ఆటగాళ్లుగా మేము ప్రత్యర్థులమే కదా. తను తన క్లబ్‌కి, నేను నా క్లబ్‌కి మద్దతుగా ఉంటాం. జాతీయ జట్ల విషయంలోనూ అంతే. అయితే, ఆటతీరు ఎలా ఉందన్న అంశంపై పరస్పరం చర్చించుకుంటూ.. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. మా మధ్య ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పోటీయే ఉంటుంది’’ అని రొనాల్డో తెలిపాడు.కాగా 2002లో పోర్చుగీస్ క్లబ్ స్పోర్టింగ్ జీపీ తరఫున ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా ఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. క్లబ్, అంతర్జాతీయ స్థాయిలో కలిపి ఓవరాల్‌గా 923 గోల్స్‌తో టాప్ గోల్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించిన రొనాల్డోకు ఫిఫా వరల్డ్‌కప్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 648 మిలియన్ల మంది ఫాలోవర్లుఅయితే, ఈ విషయంలో మెస్సీదే పైచేయి. కెప్టెన్‌గా అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన ఘనత అతడికి దక్కింది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫాలోవర్ల విషయంలోనూ రొనాల్డో- మెస్సీ మధ్య పోటీ ఉంది. అయితే, ఇందులో పోర్చుగీస్ ఆటగాడిదే ఆధిపత్యం. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు రొనాల్డోకు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి ఏకంగా 648 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. మెస్సీకి 504 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
తిరుగులేని అర్జెంటీనా
జ్యూరిక్: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) పురుషుల టీమ్ ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా జట్టు వరుసగా రెండో ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు 1867.25 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. ఈ ఏడాది అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్ టైటిల్ సాధించింది.ఇక ర్యాంకింగ్స్‌లో ఫ్రాన్స్ రెండో స్థానంలో, స్పెయిన్ మూడో స్థానంలో ఉన్నాయి. గత నవంబర్‌లో విడుదల చేసిన ర్యాంకింగ్స్ నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో తక్కువ మ్యాచ్‌లు జరగడంతో ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేవు.ఇందులో ఇంగ్లండ్, బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ, జర్మనీ వరుసగా నాలుగు నుంచి 10వ ర్యాంక్ వరకు కొనసాగుతున్నాయి.ఈ ఏడాది అన్ని జట్లకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అంగోలా జట్టు 32 స్థానాలు ఎగబాకి 85వ ర్యాంక్‌లో నిలిచింది. భారత జట్టు ఒక స్థానం మెరుగుపర్చుకొని 126వ ర్యాంక్‌లో ఉంది. తదుపరి ర్యాంకింగ్స్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేస్తారు. -
కేరళకు రానున్న మెస్సీ బృందం
తిరువనంతపురం: అంతా అనుకున్నట్లు జరిగితే... భారత క్రీడాభిమానులు, కేరళ ఫుట్‌బాల్ ప్రేమికులు ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆటగాళ్ల విన్యాసాలు ప్రత్యక్షంగా చూస్తారు. రెండు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడేందుకు... స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు వచ్చే ఏడాది కేరళకు రానుందని ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దుల్ రహమాన్ బుధవారం ప్రకటించారు. ఈ మ్యాచ్‌లను కేరళ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని... వేదికతో పాటు, ప్రత్యర్థి జట్లు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే ఖతర్, జపాన్ జట్లను ఆహ్వానించాలనే ఆలోచన ఉందని ఆయన వివరించారు. ‘ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో కూడిన ప్రపంచ నంబర్‌వన్ ఫుట్‌బాల్ జట్టు అర్జెంటీనా వచ్చే ఏడాది కేరళకు రానుంది. ఆ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. దీనిపై అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘంతో కలిసి త్వరలోనే సంయుక్త ప్రకటన విడుదల చేస్తాం’ అని రహమాన్ పేర్కొన్నారు. ఇటీవల స్పెయిన్ పర్యటన సందర్భంగా అర్జెంటీనా జాతీయ జట్టును ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. దీనికి ఆ జట్టు నుంచి సానుకూల స్పందన వచ్చిందని... త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వస్తుందని అన్నారు. మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత తదితర అంశాలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని మంత్రి చెప్పారు. అయితే తమ షెడ్యూల్ ప్రకారం అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘమే భారత పర్యటనకు సంబంధించిన తేదీలను వెల్లడించనుందని పేర్కొన్నారు. అర్జెంటీనా ఆడనున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా 50 వేల మంది అభిమానులు చూసేలా ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను నిర్వహించే శక్తి సామర్థ్యాలు కేరళ ప్రభుత్వానికి ఉన్నాయని రహమాన్ పేర్కొన్నారు. రెండు మ్యాచ్‌ల నిర్వహణకు రూ. 100 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ మొత్తాన్ని స్పాన్సర్ల ద్వారా సమకూరుస్తామని ఆయన తెలిపారు. -
WC Qualifiers: కొలంబియా సంచలనం.. అర్జెంటీనాకు షాక్
బొగోటా (కొలంబియా): ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టుకు 2026 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో షాక్ తగిలింది. 2022లో విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా... దక్షిణ అమెరికా వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో కొలంబియా చేతిలో ఓడింది. బుధవారం జరిగిన పోరులో కొలంబియా 2–1 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై గెలిచింది. కొలంబియా తరఫున యెర్సన్ మస్క్యూరా (25వ నిమిషంలో), జేమ్స్ రోడ్రిగ్జ్ (60వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... అర్జెంటీనా తరఫున నికోలస్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. అర్జెంటీనా స్టార్ స్ట్రయికర్ మెస్సీ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఈ అర్హత టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి అర్జెంటీనా 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ టోరీ్నలో తొలి 6 స్థానాల్లో నిలిచిన జట్లు 2026 ప్రపంచకప్ నకు అర్హత సాధించనున్నాయి. -
మెస్సీ, రొనాల్డో లేకుండానే.. ‘బాలన్ డోర్’ అవార్డు నామినేషన్లు
పారిస్: దిగ్గజాలు లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) లేకుండానే ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మక పురస్కారంగా భావించే ‘బాలన్ డోర్’ 2024 అవార్డీల నామినీల జాబితా తయారైంది. యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్లేయర్లకు ప్రతి ఏటా అందించే ఈ అవార్డును ఇప్పటి వరకు 37 ఏళ్ల మెస్సీ 8 సార్లు అందుకోగా... రొనాల్డో ఐదుసార్లు దక్కించుకున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 28న ‘బాలన్ డోర్’ అవార్డులను ప్రదానం చేయనుండగా... దీని కోసం కుదించిన 30 మంది ప్లేయర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో మెస్సీ, రొనాల్డోకు చోటు దక్కలేదు. ఫ్రాన్స్ స్ట్రయికర్ ఎంబాపె, ఇంగ్లండ్ స్టార్ హ్యారీ కేన్, స్పెయిన్ యువ స్ట్రయికర్ లామినె తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మెస్సీ, రొనాల్డో రేసులో లేకపోవడం 2003 తర్వాత ఇదే తొలిసారి. 2006లో మొదటిసారి ‘బాలన్ డోర్’ పురస్కారానికి నామినేట్ అయిన మెస్సీ... 2009లో తొలి అవార్డు దక్కించుకున్నాడు. మరోవైపు 2004లో మొదటిసారి నామినేట్ అయిన రొనాల్డో... ఐదుసార్లు అవార్డు అందుకున్నాడు. కాగా యూరోపియన్ లీగ్‌ల్లో ప్రదర్శన ఆధారంగానే ఈ పురస్కారాన్ని అందించడం ఆనవాయితీ. ప్రస్తుతం మెస్సీ అమెరికా లీగ్‌లలో... రొనాల్డో సౌదీ అరేబియాలోని అల్–నాసర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకే వీరిద్దరిని బాలన్ డోర్ అవార్డుకు నామినేట్ చేయలేదు. -
మెస్సీ లేకుండానే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ బరిలో ఆర్జెంటీనా
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్, 2022 ప్రపంచకప్ విజయసారథి లయోనల్ మెస్సీ గాయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు దూరమయ్యాడు. వచ్చేనెలలో రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తలపడే అర్జెంటీనా జట్టును కోచ్ లయోనల్ స్కాలొని మంగళవారం ప్రకటించారు. మొత్తం 28 మంది సభ్యులతో క్వాలిఫయింగ్ పోటీలకు అర్జెంటీనా జట్టు సిద్ధమైంది. అయితే 37 ఏళ్ల మెస్సీ కుడి కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను... సెప్టెంబర్ 5న చిలీతో, 10న కొలంబియాతో జరిగే రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రపంచకప్ చాంపియన్ అర్జెంటీనా దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ రౌండ్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన అర్జెంటీనా ఖాతాలో 15 పాయింట్లున్నాయి. -
కోపా కప్ విజేతగా అర్జెంటీనా.. లియోనెల్ మెస్సీ వరల్డ్ రికార్డు
కోపా అమెరికా కప్-2024 ఛాంపియన్స్‌గా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్లో 1-0 తేడాతో కొలంబియాను ఓడించిన అర్జెంటీనా వరుసగా రెండో సారి కోపా అమెరికా కప్ విజేతగా నిలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ స్ట్రైకర్ లౌటారో సంచలన గోల్‌తో అర్జెంటీనాను ఛాంపియన్స్‌గా నిలిపాడు. కాగా ఇది అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీకి వరుసగా మూడో అంతర్జాతీయ ట్రోఫీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా మెస్సీకి తన కెరీర్లో ఇది 45వ ట్రోఫీ. ఈ క్రమంలో మెస్సీ ఓ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్‌లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం డాని అల్వెస్(44) పేరిట ఉండేది. తాజా విజయంతో అల్వెస్ ఆల్‌టైమ్ రికార్డును మెస్సీ బ్రేక్ చేశాడు. మెస్సీ కెరీర్లో ఫిఫా వరల్డ్ కప్ టైటిల్, రెండు కోపా అమెరికా టైటిల్స్, ఫైనలిసిమా ట్రోఫీ, 39 క్లబ్ టైటిల్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం బార్సిలోనా క్లబ్ నుంచి వచ్చినవే కావడం గమనార్హం. కాగా మెస్సీకి ఇదే ఆఖరి కోపా అమెరికా ఫుట్‌బాల్ కప్. అయితే ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ గాయపడ్డాడు.దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి మెస్సీ వైదొలిగాడు. ఈ క్రమంలో డగౌట్లో మెస్సీ కన్నీటి పర్యంతమయ్యాడు. మెస్సీ మైదానంలో లేనప్పటకి తన సహచరులు మాత్రం అద్భుత విజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. 🇦🇷 Lionel Messi, most decorated player with 45 titles including one more Copa América from tonight! ✨ pic.twitter.com/SXwpgGBesh— Fabrizio Romano (@FabrizioRomano) July 15, 2024 -
కోపా అమెరికా కప్ విజేతగా అర్జెంటీనా.. మెస్సీకి గిఫ్ట్
కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీ-2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా.. 16వ సారి కోపా అమెరికా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్ ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగింది. నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 30 నిమిషాలు ఆదనపు సమయం కేటాయించారు. ఎక్స్ట్రా సమయం కూడా ముగుస్తుండడంతో ఈ మ్యాచ్ పెనాల్టీ షుట్ అవుట్‌కు దారి తీస్తుందని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో అర్జెంటీనా సబ్‌స్టిట్యూట్ స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ అద్భుతం చేశాడు. 112వ నిమిషంలో గోల్ కొట్టిన మార్టినెజ్.. తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మిగిలిన 8 నిమిషాల్లో కొలంబియా గోల్ సాధించకపోవడంతో అర్జెంటీనా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.🏆🇦🇷 ARGENTINA ARE COPA AMÉRICA CHAMPIONS!Argentina have beaten Colombia 1-0 thanks to Lautaro Martínez’s goal.🏆 Copa America 2021🏆 Finalissima 2022🏆 World Cup 2022🏆 Copa America 2024Insane job by this group of players and Lionel Scaloni. 👏🏻✨ pic.twitter.com/v0GOvHv9PS— Fabrizio Romano (@FabrizioRomano) July 15, 2024 కాగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ఇదే ఆఖరి కోపా అమెరికా కప్ కావడం గమనార్హం. దీంతో అతడికి తన సహచరులు అద్భుతమైన విజయంతో విడ్కోలు పలికారు. ఈ మ్యాచ్‌లో గాయపడిన మెస్సీ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం కన్నీరు పెట్టుకున్నాడు. అయితే ఇప్ప్పుడు తన జట్టు విజయం సాధించడంతో మెస్సీఆనందంలో మునిగి తేలుతున్నాడు. Angel di Maria unsung hero of the match Played his last game in Argentina hersey what a player #ARGvsCOL pic.twitter.com/hnu42h3ekZ— Harshit 🇮🇳 (@krharshit771) July 15, 2024 -
#Lionel Messi: వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సీ.. వీడియో వైరల్
Update: కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీ-2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా.. 16వ సారి కోపా అమెరికా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ కన్నీరు పెట్టుకున్నాడు. కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా కొలంబియాతో జరుగుతున్న ఫైనల్లో మెస్సీ గాయపడ్డాడు. మ్యాచ్ 36వ నిమిషంలో మెస్సీ చీలమండ(పాదం)కు గాయమైంది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో మైదానంలో కింద పడిపోయాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. కొంచెం కూడా ఉపశమనం లభించలేదు. అయినప్పటకి మెస్సీ మైదానాన్ని వీడకుండా తన ఆటను కొనసాగించాడు. మ్యాచ్ హాఫ్-టైమ్ తర్వాత కూడా స్కోర్లేకుండా పోవడంతో తీవ్రమైన నొప్పిని భరిస్తూనే మెస్సీ తన కంటిన్యూ చేశాడు. అయితే నొప్పి మరింత తీవ్రం కావడంతో మ్యాచ్ 66వ నిమిషంలో మెస్సీ గాయం కారణంగా మైదానం నుండి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో డగౌట్లో కూర్చోన్న మెస్సీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కెరీర్లో చివరి కోపా అమెరికా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతున్న ఈ అర్జెంటీనా స్టార్ వెక్కి వెక్కి ఏడ్చాడు. అయితే అభిమానులు మాత్రం అతడికి మద్దతుగా నిలిచారు. మెస్సీ, మెస్సీ అంటూ జేజేలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి.ప్రస్తుతం 25 నిమిషాలు ఎక్స్ట్రా సమయం కేటాయించారు. అదనపు సమయంలో 15 నిమిషాలు ముగిసినప్పటకి ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యా. ఆఖరి 10 నిమిషాల్లో గోల్స్ రాకపోతే ఈ మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూట్ అవుట్లో తేల్చే అవకాశముంది. Messi is in tears as he is subbed off due to injury 💔 pic.twitter.com/t0l3OLLuWf— FOX Soccer (@FOXSoccer) July 15, 2024 -
COPA AMERICA CUP 2024: ఫైనల్లో అర్జెంటీనా.. సెమీస్‌లో కెనడాపై విజయం
కోపా అమెరికా కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు.. కెనడాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తొలి అర్ద భాగం 23వ నిమిషంలో అల్వరెజ్.. రెండో అర్ద భాగం 51వ నిమిషంలో మెస్సీ గోల్స్ సాధించారు. రేపు జరుగబోయే రెండో సెమీఫైనల్లో ఉరుగ్వే, కొలంబియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జులై 15న జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
క్రేజ్ కా బాప్.. లియోనెల్ మెస్సీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ దిగ్గజం కీలక ప్రకటన
భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు తొమ్మిది నిమిషాల నిడివితో కూడిన వీడియో సందేశం ద్వారా గురువారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫికేషన్ పోటీలో భాగంగా కువైట్‌తో జూన్ 6న జరిగే మ్యాచ్ తన కెరీర్లో చివరిదని సునిల్ ఛెత్రి తెలిపాడు. ‘‘గత 19 ఏళ్ల కాలంలో విధి నిర్వహణ, ఒత్తిడి.. సంతోషాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలను నెమరువేసుకుంటూనే వచ్చాను. దేశం కోసం నేను ఇన్ని మ్యాచ్‌లు ఆడతానని అస్సలు ఊహించలేదు. మంచో.. చెడో.. గత రెండున్నర నెలలుగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. ఈ అనుభూతి నాకు కొత్తగా ఉంది. కువైట్‌తో ఆడే మ్యాచ్ నా చివరి మ్యాచ్ అవుతుంది’’ అని సునిల్ ఛెత్రి భావోద్వేగానికి లోనయ్యాడు.రొనాల్డో, మెస్సీ తర్వాత..1984, ఆగష్టు 3న సికింద్రాబాద్‌లో జన్మించిన సునిల్ ఛెత్రి.. ప్రఖ్యాత మోహన్ బగాన్ క్లబ్ తరఫున 2002లో తన ఫ్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు.ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2005లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా జూన్ 12న భారత జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. దాయాది జట్టుపై గోల్ కొట్టి ఖాతా తెరిచాడు. అనతికాలంలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగాడు.మొత్తంగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో సునిల్ ఛెత్రి 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఫుట్‌బాలర్లలో క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగీస్), లియోనల్ మెస్సీ(అర్జెంటీనా) తర్వాత ఛెత్రినే అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఉండటం విశేషం. అందుకున్న పురస్కారాలు👉అర్జున అవార్డు👉పద్మశ్రీ👉ఖేల్‌రత్న👉ఏఐఎఫ్ఎఫ్ వార్షిక అత్యుత్తమ ఆటగాడిగా ఏడుసార్లు అవార్డు👉మూడుసార్లు ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు👉శాఫ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీచదవండి: Sunil Chhetri Life Story In Telugu: సికింద్రాబాద్‌లో పుట్టిన ఛెత్రీ.. కుటుంబ నేపథ్యం ఇదే! కెప్టెన్ ఫెంటాస్టిక్‌గా ఘనతలు -
Ronaldo Jr: మెస్సీ అంటే ఇష్టం! బాగానే ఉన్నావా.. ముద్దిచ్చి మరీ!
క్రిస్టియానో రొనాల్డో.. పోర్చుగల్ ఫుట్‌బాల్ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్న మేటి ఆటగాడు. అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి గోల్స్.. ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక బాలన్ డి ఓర్ అవార్డులు. ఎన్నో చాంపియన్ లీగ్ మెడల్స్! మూడు దేశాల్లో క్లబ్ టైటిల్స్ గెలిచిన ఫుట్‌బాలర్..అయితే, ఒక్కసారైనా ప్రపంచకప్ గెలవాలన్న రొనాల్డో కల మాత్రం నెరవేరలేదు. సమకాలీకుడు, తనకు పోటీగా ఉన్న ఏకైక ఆటగాడు, అర్జెంటీనా లియోనల్ మెస్సీ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడుతుంటే చూస్తూ భావోద్వేగానికి గురికావడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడీ పోర్చుగల్ స్టార్. ఒకరకంగా మెస్సీతో జరిగిన పోటాపోటీలో తాను ఓడిపోయాననే బాధతోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆట పరంగా రొనాల్డో, మెస్సీల మధ్య స్నేహపూర్వక శత్రుత్వం ఉన్నా.. బయట మాత్రం వారిద్దరు గుడ్ ఫ్రెండ్స్! బాలన్ డి ఓర్ అవార్డు-2017 ఫంక్షన్ సందర్భంగా రొనాల్డో తల్లి డొలోర్స్ అవెరో ఈ విషయాన్ని వెల్లడించారు. మెస్సీ ఉన్నత వ్యక్తిత్వం కలవాడని పేర్కొంటూ.. తన మనవడు క్రిస్టియానో రొనాల్డో జూనియర్‌కు తండ్రి ఆట కంటే మెస్సీ ఆట అంటేనే ఎక్కువ ఇష్టం అని తెలిపారు. అందుకు తగ్గట్లుగానే జూనియర్ రొనాల్డో ఆ వేదికపై మెస్సీని చూడగానే ఆనందంతో పొంగిపోయాడు. అయితే, అక్కడున్నది నిజంగా మెస్సీ కాదనే భావనలో ఉన్న జూనియర్ తన తండ్రి చెప్పినా ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు. రొనాల్డో తన కుమారుడికి మెస్సీని చూపిస్తూ.. ‘‘అక్కడున్నది ఎవరు? అక్కడ సూట్ వేసుకుని నిల్చుని ఉన్న వ్యక్తి ఎవరు?’’ అని ప్రశ్నించాడు. అంతలోనే మెస్సీ వచ్చి జూనియర్ రొనాల్డోను హగ్ చేసుకుని.. ముద్దు కూడా పెట్టి.. ‘‘నువ్వ బాగానే ఉన్నావు కదా?’’ అని ఆప్యాయంగా పలకరించాడు. When Cristiano Jr. meets Lionel Messi. pic.twitter.com/ydixmN2SyK — Historic Vids (@historyinmemes) March 3, 2024 తాను చూస్తున్నది నిజమని అప్పటికీ నమ్మలేకపోయిన జూనియర్ రొనాల్డోను తండ్రి మళ్లీ దగ్గరకు తీసుకోగా.. మెస్సీ సైతం చిరునవ్వులు చిందించాడు. ఈ ఘటన జరిగినపుడు జూనియర్ రొనాల్డోకు సుమారుగా ఆరేళ్ల వయసు ఉంటుంది. ఇక తండ్రిని కాదని.. మెస్సీనే తన రోల్‌మోడల్ అని చెప్పిన ఆ పిల్లాడు ఇప్పుడు ఓ జట్టును చాంపియన్‌గా నిలిపే స్థాయికి చేరాడు. అండర్ 13 లీగ్ ట్రోఫీలో అల్ నసర్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ట్రోఫీని ముద్దాడాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో- మెస్సీ అనుబంధం... జూనియర్ రొనాల్డో టైటిల్ విన్నింగ్ మూమెంట్స్‌కు సంబంధించిన క్షణాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మీరూ ఓ లుక్కేయండి! View this post on Instagram A post shared by 433 (@433) -
మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకర ప్రవర్తన.. రొనాల్డోపై నిషేధం
స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు భారీ షాక్ తగిలింది. మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను ఇతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడింది. వివరాల్లోకి వెళితే.. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ అయిన రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ అయిన అల్ నస్ర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్థానికంగా జరిగే ప్రో లీగ్‌లో భాగంగా అల్ నస్ర్.. రియాద్ క్లబ్ అయిన అల్ షబాబ్‌తో తలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగా రొనాల్డో.. మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. 🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨 تصرف كارثي جديد من كريستيانو رونالدو ضد جمهور الشباب بعد نهاية اللقاء! 😳😳😳😳😳 pic.twitter.com/Tzt632I20p — نواف الآسيوي 🇸🇦 (@football_ll55) February 25, 2024 మెస్సీ అభిమానులను టార్గెట్ చేస్తూ జుగుప్సాకరమైన సంజ్ఞలు చేశాడు. రొనాల్డో ప్రవర్తనను సీరియస్‌గా తీసుకున్న లీగ్ నిర్వహకులు అతనిపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. అలాగే జరిమానా కింద 20000 సౌదీ రియాల్స్ కట్టాల్సిందిగా ఆదేశించారు. రొనాల్డో వికృత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ ఉదంతంపై రొనాల్డో తాజాగా స్పందించాడు. యూరప్ దేశాల్లో ఇది కామనేనని సమర్ధించుకున్నాడు. కాగా, అల్ నస్ర్ క్లబ్ రెండున్నర సంవత్సరాల కాలానికి గాను రొనాల్డోతో రూ. 4400 కోట్ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. -
మెస్సీ జట్టుకు షాకిచ్చిన రొనాల్డో టీమ్
ఇద్దరు ఫుట్‌బాల్ దిగ్గజాలు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లబ్‌ల మధ్య నిన్న ఫెండ్లీ మ్యాచ్ జరిగింది. రియాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ, పోర్చుగల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంటర్ మయామీ (అమెరికా), అల్ నస్ర్ (సౌదీ అరేబియా) జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రొనాల్డో జట్టు అల్ నస్ర్.. మెస్సీ జట్టు ఇంటర్ మయామీపై 6-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. Messi at full time pic.twitter.com/zvsmiuJqir — Messi Media (@LeoMessiMedia) February 1, 2024 The reaction of Ronaldo and Messi after Al Nassr third goal. https://t.co/DAhcNfTd7Z — CristianoXtra (@CristianoXtra_) February 1, 2024 గాయం కారణంగా క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్ మొత్తంలో పాల్గొనలేదు. మెస్సీ మాత్రం కాసేపు అభిమానులను అలరించాడు. సమయ పరిమితి నిబంధన కారణంగా మెస్సీ గేమ్ చివర్లో కొద్ది నిమిషాలు మైదానంలో కనిపించాడు. రొనాల్డో, మెస్సీ ఆడకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు ఈ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించాడు. Puskas award 🏅 Goal of the year already🎖️ "Aymeric Laporte " 👑#InterMiami #AlNassr#Ronaldo #Messi #Goal pic.twitter.com/XFW1DJwd5p — Mehran Sofi (@sadistic3232) February 1, 2024 రొనాల్డో స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రొనాల్డో, మెస్సీ ముఖాల్లోని హావభావాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తమ ఆరాథ్య ఆటగాళ్లు మ్యాచ్ ఆడకపోయినా ఈ మ్యాచ్‌ను కొన్ని కోట్ల మంది తిలకించారు. ఈ మ్యాచ్‌లో అల్ నస్ర్ ఆటగాడు, బ్రెజిల్‌కు చెందిన టలిస్క హ్యాట్రిక్ గోల్స్ సాధించగా.. టెల్లెస్, ఆక్టేవియో, లాపోర్టే తలో గోల్ కొట్టారు. Turki Sheikh reminding Lionel Messi his team is losing 6-0 to Cristiano Ronaldo's Al-Nassr. Unbelievable reaction 🤯🤯🤯 #AlNassrvsInterMiamiCF pic.twitter.com/Zy3lw33piq — Farid Khan (@_FaridKhan) February 2, 2024 -
‘ఫిఫా’ అత్యుత్తమ ప్లేయర్‌గా మెస్సీ.. రికార్డు స్థాయిలో మూడోసారి
అర్జెంటీనా సూపర్‌స్టార్ మెస్సీ 2023 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ‘ఫిఫా బెస్ట్ ప్లేయర్’గా నిలిచాడు. మెస్సీకి నార్వే ఫార్వర్డ్ ఎర్లింగ్ హాలాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరు 48 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినప్పటికీ కెప్టెన్ల ప్యానెల్ నుంచి ఎర్లింగ్ కంటే మెస్సీకే ఎక్కువ ఓట్లు రావడంతో ‘ఫిఫా’ మెస్సీనే ఎంపిక చేసింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయిలో మూడోసారి (2019, 2022, 2023) గెలుచుకున్నాడు. మెస్సీ గతేడాది బాలన్ డి ఓర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును కూడా మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు కైవసం చేసుకున్నాడు. మెస్సీ ఫిఫా’ అత్యుత్తమ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న అనంతరం మరో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. రొనాల్డో 2023 ఫిఫా అత్యుత్తమ ప్లేయర్ అవార్డు రేసులో లేకపోవడం విశేషం. కాగా, లీగ్‌లతో బిజీగా ఉండటంతో మెస్సీ అవార్డు ప్రధానోత్సవ వేడుకకు హాజరుకాలేదు. -
మెస్సీని ఓడించి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న కోహ్లి
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి ప్రతిష్టాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కైవసం చేసుకున్నాడు. ప్యూబిటీ అనేది ప్రపంచంలోని అతిపెద్ద ఇన్స్టాగ్రామ్ పేజీలలో (35 మిలియన్ల ఫాలోవర్స్) ఒకటి. ఈ అవార్డు కోసం హోరాహోరీగా సాగిన పోరులో కోహ్లి.. ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీని 78-22 శాతం ఓట్లతో ఓడించాడు. మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నప్పటికీ కోహ్లి క్రేజ్ ముందు అతను నిలబడలేకపోయాడు. It's Kohli vs Messi in the final voting for the "Athlete of the year" award in one of the biggest sports pages on Instagram - Pubity Sport. pic.twitter.com/gcyLSPbywA — Johns. (@CricCrazyJohns) December 30, 2023 ప్రపంచం మొత్తం మెస్సీ మేనియా నడుస్తున్నప్పటికీ క్రికెట్ అభిమానులు మాత్రం ఏకపక్షంగా కోహ్లికి ఓట్లు వేసి గెలిపించారు. ఈ అవార్డు కోసం కోహ్లి, మెస్సీతో పాటు నోవాక్ జకోవిచ్, పాట్ కమిన్స్, లెబ్రాన్ జేమ్స్, ఎర్లింగ్ హాలాండ్, క్రిస్టియానో రొనాల్డో, మాక్స్ వెర్స్టాపెన్, మైఖేల్ జోర్డాన్ తదితరులు పోటీపడ్డారు. కాగా, 2023లో వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల మధ్య ఈ పోటీని నిర్వహించగా.. ఫైనల్ రౌండ్ పోరు కోహ్లి, మెస్సీ మధ్య సాగింది. కోహ్లి ఈ ఏడాది ఆధ్యాంతం పరుగుల వరద పారించి పలు ప్రపంచ రికార్డులు కొల్లగొట్టగా.. మెస్సీ ఏడాది పొడువునా గోల్స్ వర్షం కురిపించడంతో పాటు తన జట్టుకు పలు అపురూపమైన విజయాలు అందించాడు. -
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో మెస్సీ, కోహ్లి
క్రీడారంగానికి సంబంధించిన ఓ ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఇద్దరు దిగ్గజాలు పోటీపడుతున్నారు. ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కోసం క్రికెట్ GOAT విరాట్ కోహ్లి.. ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీతో అమీతుమీకి సిద్దమయ్యాడు. ఈ అవార్డు కోసం కోహ్లి-మెస్సీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ఇద్దరూ ఈ ఏడాది తమతమ క్రీడా విభాగాల్లో అత్యుత్తమంగా రాణించి అవార్డు రేసులో నిలిచారు. కోహ్లి ఈ ఏడాది ఆధ్యాంతం పరుగుల వరద పారించగా.. మెస్సీ ఏడాది పొడువునా గోల్స్ వర్షం కురిపించాడు. Virat Kohli Vs Lionel Messi Final for 'Pubity Athlete of the Year' award. pic.twitter.com/w4zm4MJmt3— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2023 ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కోసం కోహ్లీ, మెస్సీతో పాటు వివిధ క్రీడలకు చెందిన వందల మంది స్టార్ క్రీడాకారులు పోటీ పడగా.. చివరిగా రేసులో ఈ ఇద్దరే మిగిలారు. మెస్సీ, కోహ్లితో పాటు ఈ అవార్డు కోసం మరో దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో, బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ, బాస్కెట్‌బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్ పోటీపడ్డారు. త్వరలో మెస్సీ, కోహ్లిలలో ఒకరిని ఓటింగ్ ద్వారా విజేతగా ప్రకటిస్తారు. -
అది మెస్సీ క్రేజ్.. జెర్సీల విలువ 64 కోట్ల పై మాటే..!
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవ్యాప్తంగా ఈ స్టార్ ఫుట్‌బాలర్‌కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మెస్సీ ప్రపంచంలో ఏ మూలలో ఫుట్‌బాల్ ఆడినా ఇసకేస్తే రాలనంత మంది జనాలు స్టేడియాలకు తరలి వస్తారు. అతను ధరించే బ్రాండ్లు, అతని ఎండార్స్మెంట్ల రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. తాజాగా మెస్సీ ధరించిన జెర్సీలను ఆన్లైన్లో వేలానికి పెట్టగా కళ్లు బైర్లు కమ్మే మొత్తానికి అవి అమ్ముడుపోయాయి. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను న్యూయార్క్‌లో ఆన్లైన్ వేలానికి పెట్టగా.. ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 78 లక్షల డాలర్లకు (రూ. 64 కోట్ల 86 లక్షలు) ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో ఓ వ్యక్తి ధరించిన జెర్సీలు అమ్ముడుపోవడం క్రీడల చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యుంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి, మూడోసారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో మెస్సీ రెండు గోల్స్ సాధించి అర్జెంటీనాను ఒంటిచేత్తో గెలిపించాడు. -
FIFA World Cup 2026 Qualifiers: ఐదుసార్లు విశ్వవిజేతకు షాక్.. తొలిసారి..!
రియో డి జనీరో: ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టుకు పరాజయం ఎదురైంది. మెస్సీ సారథ్యంలోని ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా 1–0 గోల్ తేడాతో బ్రెజిల్ జట్టును ఓడించింది. ఆట 63వ నిమిషంలో నికోలస్ ఒటామెండి హెడర్ షాట్‌తో గోల్ సాధించి అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్వదేశంలో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. -
Lionel Mess: ఎనిమిదోసారి బాలన్ డి'ఓర్ నెగ్గిన మెస్సీ.. (ఫొటోలు)
-
రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న మెస్సీ
దిగ్గజ ఫుట్‌బాలర్, ఇంటర్ మయామీ స్టార్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ (36) మరోసారి ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్నాడు. 2023 సంవత్సరానికి గాను మెస్సీని ఈ అవార్డు వరించింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయి ఎనిమిదోసారి కైవసం చేసుకోవడం విశేషం. మెస్సీ తర్వాత ఈ అవార్డును అత్యధికంగా క్రిస్టియానో రొనాల్డో (5) దక్కించుకున్నాడు. The moment when 🐐 was announced as the #BallonDor winner. - Lionel Messi, the icon!pic.twitter.com/QNZOmBgeMe — Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2023 2009లో తొలిసారి బాలన్ డి'ఓర్ సొంతం చేసుకున్న లియో.. 2010, 2011, 2012, 2015, 2019, 2021, 2023 సంవత్సరాల్లో ఈ అవార్డును చేజిక్కించుకున్నాడు. ఈ ఏడాది బాలన్ డి'ఓర్ కోసం నార్వే ఆటగాడు, మాంచెస్టర్ సిటీ స్ట్రయికర్ ఎర్లింగ్ హాలాండ్ మెస్సీతో పోటీపడ్డాడు. అయినా అవార్డు దిగ్గజ ఫుట్బాలర్నే వరించింది. పారిస్ వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో మరో దిగ్గజ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్ మెస్సీకి అవార్డు అందించాడు. కాగా, లియో గతేడాది అర్జెంటీనాకు వరల్డ్‌కప్ అందించిన విషయం తెలిసిందే. మహిళల విభాగంలో ఎయిటనా బొన్మాటి.. మహిళల విభాగంలో బాలన్ డి'ఓర్ అవార్డును స్పెయిన్ ఫుట్‌బాలర్, బార్సిలోనా సెంట్రల్ మిడ్ ఫీల్డర్ ఎయిటనా బొన్మాటి దక్కించుకుంది. ఎయిటనా ఈ అవార్డుకు తొలిసారి ఎంపికైంది. ఎయిటనా 2023 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచిన స్పెయిన్ జట్టులో సభ్యురాలు. -
కొనసాగుతున్న మెస్సీ మేనియా.. కళ్లు చెదిరే గోల్ చేసిన ఫుట్‌బాల్ దిగ్గజం
పీఎస్జీని వీడి డేవిడ్ బెక్‌హమ్ ఇంటర్ మయామీ క్లబ్లో చేరిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ.. ఈ అమెరికన్ క్లబ్ తరఫున తన గోల్స్ పరంపరను కొనసాగిస్తున్నాడు. లీగ్స్ కప్‌లో భాగంగా ఫిలడెల్ఫియా యూనియన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ ఓ కళ్లు చెదిరే గోల్‌తో మెరిశాడు. What can't he do?! 🐐 Make it NINE goals in six games for Leo Messi. pic.twitter.com/HLf3zBFTmV — Major League Soccer (@MLS) August 15, 2023 మ్యాచ్ 20వ నిమిషంలో పెనాల్టీ ఏరియా బయట 36 గజాల దూరం నుంచి మెస్సీ చేసిన గోల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్‌లో మయామీ ఆటగాళ్లు మార్టినెజ్, జోర్డీ అల్బా, డేవిడ్ రూయిజ్ కూడా గోల్స్ చేసినప్పటికీ.. మెస్సీ చేసిన గోలే మ్యాచ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. మెస్సీ కెరీర్లో ఇది సెకండ్ లాంగెస్ట్ గోల్ కావడం విశేషం. ఈ గోల్‌తో మెస్సీ ఇంటర్ మియామీ తరఫున తన గోల్స్ సంఖ్యను 9కి పెంచుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. మెస్సీ, మార్టినెజ్, జోర్డీ, రూయిజ్ గోల్స్ చేయడంతో మయామీ.. ఫిలడెల్ఫియాపై 4-1 గోల్స్ తేడాతో గెలుపొంది, లీగ్స్ కప్ ఫైనల్స్‌కు చేరింది. ఫిలడెల్ఫియా తరఫున అలెజాండ్రో బెడోయా ఏకైక గోల్ చేశాడు. కాగా, మెస్సీ ఇంటర్ మయామీ తరఫున బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ గోల్ చేశాడు. మాయమీ తరఫున ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మెస్సీ మొత్తం 9 గోల్స్ చేశాడు. తద్వారా మయామీ తరఫున ఆరు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. మెస్సీకి ముందు గొంజాలో హిగ్వేన్ (29), లియోనార్డో కంపానా (16) ఉన్నారు. -
కోహ్లి రేంజ్ వేరు.. ఒక్కో పోస్టుకు ఏకంగా రూ. 11.45 కోట్లు! ఇక రొనాల్డో, మెస్సీ..
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి.. ఆటలోనే కాదు సోషల్ మీడియాలోనూ రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 76 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ రేంజ్ ఆదాయం అందరు సెలబ్రిటీల మాదిరే.. ఫ్యాన్స్‌తో అనుసంధానమయ్యేందుకు వీలుగా కింగ్.. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నాడు. మరి మిగతా వాళ్లకంటే వందల రెట్లలో ఫాలోవర్లు కలిగి ఉన్న కోహ్లికి ఈ మీడియాల ద్వారా కూడా వచ్చే ఆదాయం కూడా అదే రేంజ్లో ఉంది. వ్యక్తిగత పోస్టులతో పాటు వ్యక్తిగత అప్డేట్లతో అభిమానులను అలరించే ఈ స్టార్ బ్యాటర్‌కు యాడ్స్ ద్వారా ఒక్కో పోస్టుకు సమకూరుతున్న మొత్తం తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే! రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో అతడు షేర్ చేసే ఒక్కో పోస్టుకు పదకొండున్నర కోట్ల మేర ఆదాయం లభిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిజంగా షాకింగ్‌గా ఉంది ఈ విషయం గురించి హోపర్ హెచ్‌క్యూ కో- ఫౌండర్ మైక్ బండార్ మాట్లాడుతూ.. ‘‘ఏడాదికేడాది ఈ రేంజ్లో ఒక్కో పోస్టుకు ఆదాయం పెరుగుతూ ఉండటం షాకింగ్‌గా ఉంది. ముఖ్యంగా స్పోర్ట్స్ స్టార్స్ మిగతా వాళ్లకు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. రొనాల్డో, మెస్సీలు మాత్రమే కాదు.. సామాన్యులను కూడా కోటీశ్వరులను చేసేందుకు సోషల్ మీడియా ఉపయోపడటం విశేషం’’అని పేర్కొన్నారు. ఇక రొనాల్డో, మెస్సీ కాగా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టా ద్వారా ఒక పోస్టుకు అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తుల జాబితాలో కోహ్లి 20వ స్థానం(ఇండియాలో నంబర్ 1)లో ఉన్నాడు. ఇక ఫుట్‌బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ వరుసగా ఒక్కో పోస్టుకు రూ. 26.75 కోట్లు, 21.49 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ టాప్-2లో కొనసాగుతున్నారు. చదవండి: అయ్యో.. అంబటి రాయుడులాగే అతడి కెరీర్ కూడా అర్ధంతరంగానే! తిరిగి వస్తే అంతే! -
ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే..
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇంటర్ మియామి క్లబ్లో మంచి ముహూర్తంలో జాయిన్ అయినట్లున్నాడు. ఇప్పటివరకు ఇంటర్ మియామి క్లబ్ తరపున ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ మెస్సీ గోల్స్‌తో మెరిశాడు. అందులో రెండు మ్యాచ్‌ల్లో డబుల్ గోల్స్ కొట్టి అభిమానులను అలరించాడు. తాజాగా గురువారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) ఓర్లాండో సిటీ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్ మియామి 3-1తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఉరుములు, మెరుపుల కారణంగా మ్యాచ్ 95 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే మ్యాచ్ ఆలస్యమైనప్పటికి మెస్సీ మాత్రం గోల్ కొట్టడంలో పెద్దగా టైం తీసుకోలేదు. ఆట 7వ నిమిషంలోనే మెస్సీ తన జట్టుకు తొలి గోల్ అందించాడు. అయితే ఓర్లాండో సిటీ ఆట 11వ నిమిషంలో గోల్ కొట్టి సోర్కును సమం చేసింది. అక్కడి నుంచి తొలి హాఫ్ ముగిసేవరకు మరో గోల్ నమోదు కాలేదు. రెండో హాఫ్ మొదలైన కాసేపటికి ఆట 51వ నిమిషంలో జోసెఫ్ మార్టినేజ్ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. ఇక ఆట 72వ నిమిషంలో మెస్సీ మరో గోల్ కొట్టి జట్టును 3-1తో స్పష్టమైన ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఓర్లాండో మరో గోల్ కొట్టలేకపోవడంతో ఇంటర్ మియామి విజయాన్ని నమోదు చేసింది. కాగా మెస్సీ రెండు గోల్స్ కొట్టిన సందర్భంలో మ్యాచ్‌కు హాజరైన అతని భార్య ఆంటోనెలా రోకుజో స్టాండ్స్‌లో సెలబ్రేట్ చేసుకోవడం వైరల్‌గా మారింది. జెర్సీ అమ్మకాల్లో దిగ్గజాలను అధిగమించిన మెస్సీ.. కాగా మెస్సీ మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గోల్స్‌తో రికార్డులు కొట్టడమే కాదు తాజాగా మెస్సీకి చెందిన జెర్సీ అమ్మకాల్లోనూ రికార్డులను కొల్లగొట్టాడు. 24 గంటల వ్యవధిలో మెస్సీ ఇంటర్ మియామి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో జెర్సీ అమ్మకాల విషయంలో క్రిస్టియానో రొనాల్డో, టామ్ బ్రాడీ, ఎన్బీఏ దిగ్గజం లెబ్రన్ జేమ్స్‌లను మెస్సీ అధిగమించాడు. 2021లో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ తరపున, 2020లో టాంపా బే బుక్కానీర్స్లో టామ్ బ్రాడీ జాయిన్ అయిన సమయంలో.. 2018 లో ఎల్ఏ లేకర్స్ తరపున లెబ్రన్ జేమ్స్ జాయిన్ అయినప్పుడు వారి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. MESSI X ROBERT TAYLOR BANGERS ONLY 🤯🤯 Taylor puts Messi in with the chip to give us the early lead over Orlando City.#MIAvORL | 📺#MLSSeasonPass on @AppleTV pic.twitter.com/kvb8Lmcccj — Inter Miami CF (@InterMiamiCF) August 3, 2023 చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ 100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్ -
'రొనాల్డో, ఫెదరర్‌లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఐపీఎల్లో ఆర్సీబీకి పదేళ్ల పాటు కలిసి ఆడారు. ఆర్సీబీ టైటిల్ కొట్టడంలో విఫలమైనప్పటికి ఈ జోడి మాత్రం తమ ఆటతో అభిమానులను అలరించారు. డివిలియర్స్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినా ఆర్సీబీని మాత్రం వదల్లేదు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన ప్రతీసారి ఆర్సీబీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక సందేశాన్ని విడుదల చేయడం మిస్టర్ 360కి అలవాటు. పదేళ్ల పాటు ఒకే జట్టుకు కలిసి ఆడిన కోహ్లి, డివిలియర్స్‌లు మంచి మిత్రులన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన రెండో టెస్టులో(కోహ్లికి 500వ అంతర్జాతీయ మ్యాచ్) సెంచరీతో మెరిసిన కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ప్రపంచంలోని గొప్ప క్రీడాకారుల్లో ఒకడని అతను అన్నాడు. గెలవాలనే కసి.. ప్రతిసారి స్కోర్ చేయాలనే ఆకలి గొప్ప ఆటగాళ్లలో కనిపించే లక్షణాలని.. అవన్నీ విరాట్‌లో పుష్కలంగా ఉన్నాయని డివిలియర్స్ తెలిపాడు. ''గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్, ఫుట్‌బాల్ లెజెండ్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్.. వీళ్లంతా గెలవాలనే కసితో ఆడతారు. వీళ్లలో పోరాట స్ఫూర్తి అమోఘం. పోటీ ఏదైనా ప్రతిసారి చాంపియన్ అవ్వాలనుకుంటారు. విరాట్ కోహ్లీ కూడా అచ్చం వీళ్లలానే ప్రవర్తిస్తాడు. అంతేకాదు అతడి హృదయం చాలా అందమైనది'' అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. పదేళ్లు ఒకే జట్టుకు మిస్టర్ 360 క్రికెటర్‌గా డివిలియర్స్ అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించాడు. చదవండి: ICC T20 WC 2024: టి20 ప్రపంచకప్ 2024కు పపువా న్యూ గినియా అర్హత Kuldeep Yadav: సంచలన స్పెల్! కానీ నీకే ఎందుకిలా? కుల్దీప్ యాదవ్ కామెంట్స్ వైరల్ -
మెస్సీ అదరగొట్టినా.. తీవ్ర నిరాశలో అభిమానులు!
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరపున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మెస్సీ అదనపు సమయంలో వచ్చిన ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. ఇది మరువకముందే మరోసారి ఇంటర్ మియామి క్లబ్ తరపున అదరగొట్టాడు. బుధవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) అట్లాంటా యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్ మియామి క్లబ్ 4-0తో ఘన విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో సింగిల్ గోల్‌తో మెరిసిన మెస్సీ ఈసారి మాత్రం డబుల్ గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆట ఎనిమిదో నిమిషంలో సెర్జియో బస్క్వెట్స్ నుంచి పాస్ అందుకున్న మెస్సీ బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించి ఇంటర్ మియామి క్లబ్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 22వ నిమిషంలో మరో గోల్‌తో మెరిసిన మెస్సీ మ్యాచ్‌లో రెండో గోల్ నమోదు చేశాడు. ఇక ఆట 53వ నిమిషంలో రాబర్ట్ టేలర్‌కు మెస్సీ అసిస్ట్ అందించగా.. అది గోల్‌గా వెళ్లడంతో ఇంటర్ మియామి 3-0తో భారీ ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఇక 84వ నిమిషంలో క్రిస్టోఫర్ మెక్వే గోల్ కొట్టడంతో 4-0తో ఇంటర్ మియామి స్పష్టమైన విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ చివర్లో 12 నిమిషాలు ఉందనగా ఇంటర్ మియామి క్లబ్ మెస్సీని వెనక్కి పిలిచింది. మొత్తం గేమ్ ఆడించడానికి రిస్క్ తీసుకోలేమని తెలిపింది. దీంతో మెస్సీ మైదానం నుంచి వెళ్లిపోయే సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. అయితే కేవలం మెస్సీ ఆటను చూడడానికే తాము వచ్చామని.. అతను ఆడకపోతే మేం ఇక్కడ ఉండడం వ్యర్థమంటూ.. మెస్సీ మైదానం వీడగానే చాలా మంది అభిమానులు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది గమనించిన మెస్సీ మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్‌ను ఉద్దేశించి.. ''నాకోసం మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు.. కానీ ఇలా మ్యాచ్ మధ్యలో మీరు వెళ్లిపోవడం నాకు నచ్చలేదు.. ఇలాంటివి వద్దు.. మీ అభిమానానికి థాంక్స్'' అంటూ పేర్కొన్నాడు. من مغادرة الجماهير بعد خروج الأسطورة ميسي🏟️ pic.twitter.com/RdW11m84Iu — Messi Xtra (@M30Xtra) July 26, 2023 That Busquets > Messi link up play 😍 Lionel Messi makes it two goals in two gamespic.twitter.com/MYRNwukH0N — 101 Great Goals (@101greatgoals) July 25, 2023 LIONEL MESSI WITH HIS SECOND GOAL OF THE MATCH FOR INTER MIAMI! Via MLS.pic.twitter.com/itYUdcED4h — Roy Nemer (@RoyNemer) July 26, 2023 చదవండి: FIFA World Cup: ప్రపంచకప్‌లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా.. Asian Games 2023: హర్మన్‌పై వేటు.. ఆసియా గేమ్స్‌లో జట్టును నడిపించేది ఎవరు? -
'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరపున తొలి గోల్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. 75 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించిన మెస్సీ అరంగేట్రం మ్యాచ్‌లో ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతేకాదు అదనపు సమయంలో ఇంటర్ మియామి క్లబ్‌కు గోల్ అందించి 2-1 తేడాతో గెలవడంలో కీలకపాత్ర వహించాడు. కాగా మెస్సీకి ఇది 808వ గోల్ కావడం విశేషం. ఇక ఆల్‌టైమ్ గ్రెటెస్ట్ ప్లేయర్లను G.O.A.Tగా అభివర్ణిస్తుంటారు. ఈ సందర్భంగా మెస్సీపై అభిమానంతో GOAT అనే పదాన్ని చిప్స్(తినేవి) తయారు చేసే లేస్(Lays Chips) కంపెనీ మెస్సీ గోల్‌ను వినూత్నరీతిలో సెలబ్రేట్ చేసింది. మెస్సీ తన కెరీర్లో 808వ గోల్ చేసిన తర్వాత అవే 808 మేకలతో మెస్సీ రూపం వచ్చేలో ఓ అద్భుతమైన ఫొటోను క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న 808 మేకలతో మెస్సీ రూపాన్ని క్రియేట్ చేసింది. మెస్సీకి ట్రిబ్యూట్ అందిస్తూనే లేస్ తన చిప్స్ యాడ్‌ను రూపొందించింది. ఇందులో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T)కు అర్థం వచ్చేలా.. మేకలతో ట్రిబ్యూట్ ఇవ్వడం విశేషం. ఈ వీడియోలో 808 మేకలను సరిగ్గా మెస్సీ ముఖం వచ్చేలా నిల్చోబెట్టారు. పైన యాంగిల్ నుంచి చూస్తే మెస్సీ ముఖం స్పష్టంగా కనిస్తోంది. +1 🐐 for the 808th goal for the G.O.A.T #Messi #GoatsForGoals pic.twitter.com/LUviACWR4p — LAY'S (@LAYS) July 22, 2023 చదవండి: Cricketer Minnu Mani: భారత క్రికెటర్‌కు అరుదైన గౌరవం.. కోహ్లి టాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. -
ఒక్క మ్యాచ్ ఆడగానే కెప్టెన్‌ను చేసేశారు.. ఇంటర్ మియామి సారధిగా మెస్సీ
ఏడుసార్లు బాలన్ డి'ఓర్ విజేత, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ ఇంటర్ మియామీ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నెల ప్రారంభంలో పీఎస్జీ నుంచి ఇంటర్ మియామికి మారిన మెస్సీ, మెక్సికన్ క్లబ్ క్రూజ్ అజుల్‌తో జరిగిన మ్యాచ్‌తో మియామి తరఫున అరంగేట్రం చేశాడు. కేవలం ఒక్క మ్యాచ్ ఆడగానే మెస్సీని కెప్టెన్‌ను చేసేశారు మియామి క్లబ్ నిర్వహకులు. ఈ విషయాన్ని మియామి క్లబ్ మేనేజర్ టాటా మార్టినో సోమవారం ప్రకటించారు. మెస్సీ మియామికి ఆడిన తొలి మ్యాచ్‌లోనే గోల్ కొట్టాడు. క్రూజ్ అజుల్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ 25 గజాల దూరం నుండి ఫ్రీకిక్ గోల్ కొట్టి, తన జట్టును 2-1తో గెలిపించాడు. 54వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన మెస్సీ ఈ గోల్ కొట్టాడు. కాగా, మెస్సీ.. అమెరికన్ ప్రొఫెషనల్ సాకర్ క్లబ్ అయిన ఇంటర్ మయామి క్లబ్‌తో 2025 సీజన్ పూర్తయ్యే వరకు ఆడేందుకు ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ సీజన్‌కు రూ. 492 కోట్లు (60 మిలియన్ డాలర్లు) అని క్లబ్ వర్గాలు వెల్లడించాయి. మియామి ఆఫర్‌కు ముందు మెస్సీకి సౌదీ క్లబ్ అల్ హిలాల్, బార్సిలోనా క్లబ్‌ల నుంచి భారీ మొత్తంలో ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించాడు. మెస్సీకి మియామి క్లబ్‌పై ఉన్న ఆసక్తిని చూసి యాజమాన్యం కేవలం ఒక్క మ్యాచ్ ఆడగానే కెప్టెన్సీ కట్టబెట్టింది. బుధవారం (జులై 26) నుంచి ప్రారంభంకాబోయే లీగ్స్ కప్‌లో మెస్సీ మియామి నూతన సారధిగా బాధ్యతలు చేపడతాడు. ఈ లీగ్‌లో మియామి తమ తొలి మ్యాచ్‌లో ఆట్లాంటా యునైటెడ్‌తో తలపడుతుంది. -
Lionel Messi: మెస్సీనా మజాకా..గోల్స్ కొట్టడంలో నీ తర్వాతే ఎవరైనా (ఫొటోలు)
-
మెస్సీనా మజాకా.. క్లబ్‌లు మారినా గోల్స్ మాత్రం ఆగడం లేదుగా
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఏ క్లబ్‌కు ఆడినా తన జోరును చూపిస్తూనే ఉన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ నుంచి క్లబ్ మ్యాచ్ దాకా గోల్స్ కొడుతూనే ఉన్నాడు. ఇటీవలే పీఎస్జీ నుంచి ఇంటర్ మియామి(Inter Miami FC)కి రికార్డు ధరకు వెళ్లిన మెస్సీ క్లబ్ తరపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. లీగ్స్ కప్ ప్లేలో భాగంగా డీఆర్వీ పీఎన్కే స్టేడియం వేదికగా శనివారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) ఇంటర్ మియామి, క్రజ్ అజుల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మెస్సీ గోల్‌తో మెరిశాడు. మ్యాచ్ అదనపు సమయం(ఆట 94వ నిమిషం)లో లభించిన ఫ్రీకిక్‌ను సద్వినియోగం చేసుకున్న మెస్సీ బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఇంటర్ మియామి జట్టు క్రజ్ అజుల్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. కాగా మ్యాచ్‌కు 22వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మెస్సీని చూడడానికే వచ్చిన అభిమానులకు ఆట ముగిసే సమయానికి నిరాశే మిగిలింది. మెస్సీ గోల్ చూడకుండానే వెళ్లిపోతామేమోనని ఫీలయ్యారు. కానీ 94వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను మెస్సీ గోల్‌గా మలచడంతో స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఒక క్లబ్ తరపున అరేంగేట్రం మ్యాచ్‌లో ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచిన తొలి ఆటగాడిగా మెస్సీ రికార్డులకెక్కాడు. అమెరికన్ ప్రొఫెషనల్ సాకర్ క్లబ్ అయిన ఇంటర్ మయామి క్లబ్‌తో 2025 సీజన్ పూర్తయ్యే వరకు ఆడేందుకు మెస్సీ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ సీజన్‌కు రూ. 492 కోట్లు (60 మిలియన్ డాలర్లు) అని క్లబ్ వర్గాలు వెల్లడించాయి. LIONEL ANDRÉS MESSI IS NOT HUMAN. pic.twitter.com/2mBDI41mLy — Major League Soccer (@MLS) July 22, 2023 చదవండి: దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్‌గా #Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది వేరే బంతిని -
సీజన్‌కు రూ.492 కోట్ల చొప్పున.. మియామి క్లబ్‌కు మెస్సీ
ఫోర్ట్ లాడెర్డేల్ (ఫ్లోరిడా): అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ కొత్త గూటికి చేరాడు. అమెరికన్ ప్రొఫెషనల్ సాకర్ క్లబ్ అయిన ‘ఇంటర్ మయామి’ జట్టుతో ఆడేందుకు సోమవారం ఇక్కడికి వచ్చాడు. ఈ క్లబ్‌కు చెందిన స్టేడియంలో అతను ‘10 నంబర్ జెర్సీ’తో ప్రవేశించగానే క్లబ్ సహ యజమాని, ఇంగ్లండ్ సాకర్ స్టార్, మాజీ కెప్టెన్ బెక్‌హామ్ ఆలింగనం చేసుకొని అభిమానుల హర్షధ్వానాల మధ్య స్వాగతం పలికాడు. 2025 సీజన్ పూర్తయ్యే వరకు ఇంటర్ మయామితో ఆడేందుకు మెస్సీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ సీజన్‌కు రూ. 492 కోట్లు (60 మిలియన్ డాలర్లు) అని క్లబ్ వర్గాలు వెల్లడించాయి. View this post on Instagram A post shared by ESPN FC (@espnfc) చదవండి: Asian Games 2023: ఆసియా క్రీడల్లో ఆడనివ్వండి -
లియోకి ఎందుకంత క్రేజ్?
-
#LionelMessi: 'కేజీఎఫ్' బ్యాక్‌గ్రౌండ్.. రోమాలు నిక్కబొడిచేలా..
5 అడుగుల 9 అంగుళాలు.. మొహంపై చెరగని చిరునవ్వు.. 18 ఏళ్లుగా తన ఆటతో అభిమానులను అలరిస్తూనే వస్తున్నాడు.. మారడోనా తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ అభిమానులకు ఆరాధ్య దైవంగా మారిపోయాడు.. ఈ తరంలో ఫుట్‌బాల్‌లో క్రిస్టియానో రొనాల్డోతో పోటీ పడుతున్న అతను ఒక మెట్టుపైనే ఉన్నాడు.అతనే అర్జెంటీనా గ్రేట్ లియోనల్ మెస్సీ. లియోనల్ మెస్సీ.. ఫుట్‌బాల్ కెరీర్లో చూడాల్సినవన్నీ చూశాడు. పసిఫిక్ దేశాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే కోపా అమెరికా కప్‌ను 2021లో అర్జెంటీనాకు అందించాడు. ఇక ఇంతకాలం వెలితిగా ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ను కూడా గతేడాది ఒడిసిపట్టాడు. వరల్డ్‌కప్ సాధించిన తర్వాత ఆటకు గుడ్‌బై చెప్తాడని అంతా భావించారు. కానీ మెస్సీ అలా చేయలేదు. తనలో శక్తి ఉన్నంతవరకు ఆడతానని.. ఇక ఆడలేను అన్నప్పుడు రిటైర్ అవుతానని మెస్సీ స్వయంగా పేర్కొన్నాడు. ఆల్‌టైమ్ గ్రేట్‌గా అభివర్ణిస్తున్న లియోనల్ మెస్సీ ఇవాళ(జూన్ 24న) 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మరి కెరీర్లో ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగిన శిఖరంలా కనిపించే మెస్సీకి గుండె లోతుల్లోనుంచి చెబుతున్న ఒక్క మాట.. Happy Birthday Lionel Messi.. విచిత్రమైన డెబ్యూ.. ఏ ఆటగాడైనా తన అరంగేట్రంలో అదరగొట్టాలని భావించడం సహజం. కానీ మెస్సీ విషయంలో కాస్త భిన్నం. 2005లో అర్జెంటీనా తరపున హంగేరీతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేశాడు. అది కూడా ఒక సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా. అయితే తొలి మ్యాచ్‌లోనే మెస్సీకి వింత అనుభవం ఎదురైంది. హంగేరీ ఆటగాడు మెస్సీ జెర్సీని పట్టుకొని లాగడంతో .. మెస్సీ మోచేతి సదరు ఆటగాడికి బలంగా తాకింది. దీంతో రిఫరీ మెస్సీకి రెడ్‌కార్డ్ చూపించాడు. కేవలం 47 సెకన్ల పాటు మాత్రమే గ్రౌండ్లో ఉన్న మెస్సీ అనూహ్య రీతిలో మైదానం వీడాల్సి వచ్చింది. అంతుచిక్కని వ్యాధి.. మెస్సీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మెస్సీ జీవితంలో ఫుట్‌బాల్ ఆటగాడు కాలేడని వైద్యులు ప్రకటించారు. అయితే మెస్సీకి చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు 900 డాలర్లు ఖర్చు అయ్యేది. మెస్సీ కుటుంబానికి ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో మెస్సీ చికిత్సకు కష్టంగా మారింది. దీంతో మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధం కారణంగా బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ రంగంలోకి దిగింది. మెస్సీ కుటుంబానికి అండగా నిలబడిన బార్సిలోనా మెస్సీతో పాటు కుటుంబాన్ని మొత్తం స్పెయిన్‌కు తరలించి మెస్సీకి చికిత్స చేయించడం విశేషం. అలా 11 ఏళ్ల వయసులోనే మెస్సీ బార్సిలోనాకు రుణపడిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆల్‌టైమ్ గ్రేట్‌గా గుర్తింపు.. 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన లియోనల్ మెస్సీ అర్జెంటీనా తరపున 175 మ్యాచ్‌ల్లో 103 గోల్స్ చేశాడు. అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా.. ఫుట్‌బాల్ ప్రపంచంలో రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. తన కెరీర్లో ఎక్కువగా బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్.. పారిస్ సెయింట్ జెర్మన్ క్లబ్ తరపున 75 మ్యాచ్‌ల్లో 32 గోల్స్.. ఓవరాల్‌గా అంతర్జాతీయ, ప్రైవేటు ఫుట్‌బాల్ క్లబ్స్ కలిపి 1028 మ్యాచ్‌లాడి 807 గోల్స్‌తో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. Happy Birthday Thalaivaaa😘🐐❤️#LeoMessi #Messi𓃵 #Messi #LionelMessi #HappyBirthdayMessi pic.twitter.com/NY7CR1WQrD — Chikadhee 🇦🇷 ™ (@Chickadhi) June 23, 2023 Happy 36th birthday GOAT 🐐#LionelAndresMessi. Happy Birthday Leo 🦁 Hoping for another Ballon d'Or in October. 🤗🤗#Messi #Leo #Messi36 #Messi𓃵 #MessiBirthday #LionelMessi pic.twitter.com/pSwzXxD0Hs — Fukkard (@Fukkard) June 24, 2023 #GOAT𓃵 #Messi𓃵 📸🙌🏻🐐🎂 pic.twitter.com/chrslX3wvd — sameer ᴩᴀᴛʜᴀɴ 👑🦁 (@sameerp07528955) June 24, 2023 -
హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. టాప్-4లో సునీల్ ఛెత్రి
భారత ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ గోల్స్ పరంగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత జట్టు తరఫున 138వ మ్యాచ్ ఆడిన సునీల్ ఛెత్రి 90 గోల్స్ చేశాడు. ఇక టాప్–3లో క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–123 గోల్స్), అలీ దాయి (ఇరాన్–109 గోల్స్), మెస్సీ (అర్జెంటీనా–103 గోల్స్) ఉన్నారు.2005లో జూన్ 12న భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన 38 ఏళ్ల సునీల్ ఛెత్రి తొలి గోల్ కూడా పాకిస్తాన్ జట్టుపైనే రావడం విశేషం. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో భారత్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి (10వ, 16వ, 74వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించగా... మరో గోల్‌ను ఉదాంత సింగ్ (81వ ని.లో) అందించాడు. 1952 తర్వాత భారత ఫుట్‌బాల్ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వకపోవడం ఇదే ప్రథమం. శనివారం తమ తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ ఆడుతుంది. IND vs PAK sees RED in the first half 🤯 India vs Pakistan is never fully complete without the fireworks and heated emotions 💥#INDvPAKonFanCode #SAFFChampionship2023 pic.twitter.com/xJLZTmcrp5 — FanCode (@FanCode) June 21, 2023 A perfectly placed Penalty by Sunil Chhetri and he gets his hattrick😍😍 pic.twitter.com/i2knCtsiH8 — Shanu 🇦🇷 (@secureboy23) June 21, 2023 -
మెస్సీని మిస్సయ్యాం!.. అర్జెంటీనా వస్తానంటే భారత్ వద్దన్నది
లియోనల్ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. అతను ఒక మ్యాచ్ ఆడితే కోట్లలో వీక్షిస్తారు. అలాంటి మెస్సీ మన దేశానికి వచ్చి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతానంటే భారత్ వద్దనడం ఆశ్చర్యం కలిగించింది. అర్జెంటీనా ప్రస్తుతం ఫుటబాల్లో చాంపియన్ అన్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ సేన ఫ్రాన్స్‌పై ఫూటౌట్లో 4-2తో విజయం సాధించి మూడోసారి వరల్డ్‌కప్ గెలుచుకుంది. అన్నీ తానై నడిపించిన మెస్సీ అర్జెంటీనాకు కప్ అందించి 36 సంవత్సరాల నిరీక్షణకు తెరదించాడు. ఇలాంటి మేటి చాంపియన్ టీమ్ వచ్చి ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడతామంటే ఫుట్‌బాల్ అభివృద్ధి కోరే ఏ దేశమైనా ఎగిరి గంతేస్తుంది. ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తుంది. కానీ జనాభాలో చైనాను మించిన భారత్ మాత్రం తమ ఫుట్‌బాల్ అబిమానులకు నిరాశ కలిగించే నిర్ణయంతో అర్జెంటీనా వస్తనంటే వద్దన్నది. అర్జెంటీనా జట్టు అయినా.. ఆ జట్టు ఆటగాళ్లయినా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్. అలాంటి జట్టు అప్పియరెన్స్ ఫీజుగా 50 లక్షల డాలర్లు(రూ.40 కోట్లు) ఇస్తే చాలు అందుబాటులో ఉన్న జూన్ 12 నుంచి 20వ తేదీల్లో భారత్ వేదికపై ఒక మ్యాచ్ ఆడి వెళతామంది. కానీ అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF) అంత మొత్తం ఇవ్వలేం అనేసరికి మెస్సీ టీమ్ జూన్ 15న బీజింగ్‌లో ఆస్ట్రేలియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది. మనకంటే చిన్నదేశం ఇండోనేషియా వాళ్లు అడిగినంత ఫీజులో ఏ లోటు లేకుండా చెల్లించి జకార్తాలో 19న అర్జెంటీనాతో మ్యాచ్ ఆడి తమ కోరికను నెరవేర్చుకుంది. అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న మన భారత్ మాత్రం రూ. 40 కోట్లు ఇచ్చుకోలేక అర్జెంటీనాతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించడం విస్మయం కలిగించే అంశం. చదవండి: #LionelMessi: ఆపడం ఎవరి తరం.. కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ -
#LionelMessi: ఆపడం ఎవరి తరం.. కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మంచి దూకుడు మీద ఉన్నాడు. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ గెలిచినప్పటి నుంచి మెస్సీలో ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు. పైగ రోజురోజుకు మెస్సీ క్రేజ్ పెరుగుతూనే ఉంది. అతని జోరు.. ఫిట్నెస్ చూస్తుంటే మరో ఫిఫా వరల్డ్‌కప్ ఆడేలా కనపిస్తున్నాడు. తాజాగా గురువారం బీజింగ్ వేదికగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్‌లో మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ నమోదు చేశాడు. ఆట మొదలైన నిమిషం 19 సెకన్ల వ్యవధిలోనే మెస్సీ అర్జెంటీనాకు గోల్ అందించాడు. మెస్సీ కెరీర్లో ఇదే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గత ఏడు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా తరపున మెస్సీకి ఇది ఏడో గోల్ కాగా.. ఓవరాల్‌గా ఈ ఏడాది 13 మ్యాచ్‌ల్లో 17 గోల్స్ చేసిన మెస్సీ.. 5 అసిస్ట్‌లు అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అర్జెంటీనా ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే మెస్సీ గోల్ అందించగా.. ఆట 68వ నిమిషంలో జెర్మన్ పెజెల్లా జట్టుకు రెండో గోల్ అందించాడు. Leo Messi. After one minute. Of course ☄️ (via @CBSSportsGolazo)pic.twitter.com/r5UknzrZvB — B/R Football (@brfootball) June 15, 2023 చదవండి: ఐపీఎల్ బంధం ముగిసే.. మేజర్ లీగ్ క్రికెట్లో మొదలు -
Paris Saint-Germain: వరుసగా స్టార్ ఆటగాళ్లు గుడ్‌బై.. పీఎస్జీ క్లబ్లో ఏం జరుగుతోంది?
ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఫ్రాన్స్‌కు చెందిన పారిస్ సెయింట్ జెర్మన్ క్లబ్ ఒకటి. రియల్ మాడ్రిడ్, ఎఫ్‌సీ బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ తర్వాత అత్యంత క్రేజు సంపాదించుకున్న క్లబ్‌లలో సెయింట్ జెర్మన్ క్లబ్ అగ్రస్ధానంలో ఉంటుంది. ఈ క్లబ్ తరపున ఆడాలని ప్రతీ ఆటగాడు కలలు కంటాడు. అయితే దాదాపు 52 ఏళ్ల చరిత్ర కలిగిన పారిస్ సెయింట్ జెర్మన్ (పీఎస్జీ) క్లబ్లో ప్రస్తుతం ఏదో జరుగుతోంది. వరసగా స్టార్ ఆటగాళ్లు ఈ చారిత్రత్మక క్లబ్‌ను వీడుతున్నారు. ఇప్పటికే పీఎస్జీ క్లబ్‌కు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ, సెర్జియో రామోస్ గుడ్‌బై చెప్పగా.. తాజాగా ఫ్రాన్స్ యువ సంచలనం కైలియన్ ఎంబాపే కూడా పీఎస్జీతో తన బంధాన్ని తెంచుకున్నాడు. పీఎస్జీతో తన కాంట్రాక్ట్‌ను పొడిగించడం లేదని ఎంబాపే ప్రకటించాడు. ఇక క్లబ్ నుంచి బయటకు వచ్చిన ఎంబాపే కీలక వాఖ్యలు చేశాడు. ఫ్రాన్స్‌లో మెస్సీకీ తగినంత గౌరవం దక్కలేదని, అందుకే అతడు తన కాంట్రాక్ట్‌ను పొడిగించలేదని ఎంబాపే తెలిపాడు. ఎంబాపే చేసిన వాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇక పీఎస్జీ క్లబ్ నుంచి బయటకు వచ్చిన మెస్సీ అమెరికాకు చెందిన మియామి క్లబ్ తరపున ఆడేందుకు ఆసక్తిచూపుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎంబాపే రియల్ మాడ్రిడ్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకోనేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా మెస్సీ తప్పుకోవడంతో పీఎస్జీ క్లబ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య భారీగా తగ్గింది. 10 లక్షల మంది ఫాలోవర్లు ఆ క్లబ్‌ను వీడారు. మెస్సీ ఉన్నప్పుడు పీఎస్జీ క్లబ్ ఫాలోవర్ల సంఖ్య 69.9 మిలియన్లు(6.9 కోట్లు). ప్రస్తుతం ఆ సంఖ్య 68.5 మిలియన్(6.8కోట్లు)కి చేరింది. చదవండి: IND vs WI: విండీస్ టూర్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న ప్లేయర్లెవరు? జైశ్వాల్‌తో సహా -
చైనాలో మెస్సీకి చేదు అనుభవం.. కారణం?
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి చైనాలో చేదు అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్ విషయంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు మెస్సీని అడ్డుకోవడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. ఈ గురువారం(జూన్ 15న) బీజింగ్ వేదికగా ఆస్ట్రేలియాతో అర్జెంటీనా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం జూన్ 10న మెస్సీ చైనాలోని బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టాడు. అయితే పాస్‌పోర్ట్ చెక్ చేసిన పోలీసులు మెస్సీని అడ్డుకున్నారు. మెస్సీకి చైనా వీసా లేదని, అప్లై కూడా చేసుకోలేదని వివరించారు. అయితే తన దగ్గరున్న స్పానిష్, అర్జెంటీనా పాస్‌పోర్టును అందజేసిన మెస్సీ.. తైవాన్లాగే చైనాలో కూడా తనకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని భావించానని తెలిపాడు. కానీ చైనాలోకి రావాలంటే వీసా ఉండాల్సిందేనని, వెంటనే అప్లై చేసుకోవాలని.. తైవాన్ రూల్ వర్తించదని పోలీసులు వెల్లడించారు. అయితే అధికారులు చొరవ తీసుకొని అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కింద వీసా అందించి సమస్యను పరిష్కరించారు. దీంతో పోలీసులకు మెస్సీ కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జూన్ 15న ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం జట్టుతో కలిసి ఇండోనేషియా వెళ్లనున్న మెస్సీ జూన్ 19న ఇండోనేషియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. ఇక గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌తో గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్నాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనా మూడోసారి వరల్డ్‌కప్ గెలవడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. -
రొనాల్డో బాటలోనే మెస్సీ.. కళ్లు చెదిరే మొత్తంతో ఒప్పందం.. ఇక..
పారిస్: గత ఏడాది అంతర్జాతీయ క్రీడా వేదికపై తమదైన ముద్ర వేసిన ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), మహిళా అథ్లెట్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ (జమైకా)లకు ప్రతిష్టాత్మక లారియస్ గ్లోబల్ స్పోర్ట్స్ అవార్డులు లభించాయి. 2022 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా మెస్సీ... మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా షెల్లీ ఎంపికయ్యారు. మెస్సీ సారథ్యంలో గత ఏడాది అర్జెంటీనా జట్టు 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిల్‌ను మూడోసారి సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మెస్సీ ఏడు గోల్స్ చేయడంతోపాటు సహచరులు మూడు గోల్స్ చేయడానికి సహాయపడ్డాడు. ఈ మెగా ఈవెంట్లో ఉత్తమ ప్లేయర్‌గా నిలిచి ‘గోల్డెన్ బాల్’ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నాడు. లారియస్ అవార్డు రావడం మెస్సీకిది రెండోసారి. 2020లోనూ మెస్సీకి ఈ పురస్కారం దక్కింది. మరోవైపు షెల్లీ ఆన్ ఫ్రేజర్ 100 మీటర్ల విభాగంలో ఐదోసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఓవరాల్‌గా షెల్లీ మూడు ఒలింపిక్స్ పసిడి పతకాలను, పది ప్రపంచ చాంపియన్‌షిప్ బంగారు పతకాలను గెల్చుకుంది. స్పెయిన్ టెన్నిస్ యువతార కార్లోస్ అల్కరాజ్కు ‘బ్రేక్‌త్రూ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. గత ఏడాది అల్కరాజ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలువడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. 1999 నుంచి లారియస్ గ్లోబల్ స్పోర్ట్స్ అవార్డులను అందజేస్తున్నారు. సౌదీ లీగ్‌లో మెస్సీ! పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో బాటలోనే మెస్సీ నడవనున్నాడు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) క్లబ్‌కు ఆడుతున్న మెస్సీ ఈ సీజన్ తర్వాత పీఎస్జీని వీడి రొనాల్డో ఆడుతున్న సౌదీ అరేబియా లీగ్‌లో అడుగు పెట్టనున్నాడు. ఇప్పటికే సౌదీ అరేబియా లీగ్‌లోని ఒక క్లబ్ మెస్సీతో కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకుందని సమాచారం. ఇది కూడా చదవండి: పతకానికి అడుగు దూరంలో.. తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇద్దరు భారత బాక్సర్లు నిశాంత్ దేవ్ (71 కేజీలు), దీపక్ భోరియా (51 కేజీలు) పతకం ఖరారు చేసుకోవడానికి మరో విజయం దూరంలో ఉన్నారు. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో దీపక్ 5–0తో జాంగ్ జియామావో (చైనా)పై గెలుపొందగా... నిశాంత్ దేవ్ పంచ్‌ల ధాటికి అతని ప్రత్యర్థి ఫొకాహా నిదాల్ (పాలస్తీనా) చేతులెత్తేశాడు. నిశాంత్ పంచ్ పవర్‌కు తొలి రౌండ్లోనే ఫొకాహా రింగ్‌లో రెండుసార్లు కూలబడ్డాడు. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి నిశాంత్‌ను విజేతగా ప్రకటించాడు. మరోవైపు భారత్‌కే చెందిన సచిన్ సివాచ్ (54 కేజీలు), ఆకాశ్ సాంగ్వాన్ (67 కేజీలు)ల పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. సచిన్ 0–5తో సాబిర్ ఖాన్ (కజకిస్తాన్) చేతిలో, ఆకాశ్ 0–5తో దులాత్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
భళా అర్జెంటీనా.. ఆరేళ్ల తర్వాత అగ్రస్థానం
ఫిఫా ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా ఆరేళ్ల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని అధిరోహించింది. ఇటీవలే పనామా, కురాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లలో విజయాలు అందుకున్న అర్జెంటీనా 1840. 93 పాయింట్లతో నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో మెస్సీ సేన ఆరేళ్ల తర్వాత అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక గతేడాది డిసెంబర్లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షటౌట్లో 4-2తో ఓడించి మూడోసారి విజేతగా నిలిచింది. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ తన కోరికను నెరవేర్చుకోవడంతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్ 1838.45 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. యుఇఎఫ్ఎ యూరో క్వాలిఫైయింగ్‌లో భాగంగా ఫ్రాన్స్.. నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లను ఓడించి ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఇక ఏడాది కాలంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న బ్రెజిల్.. ఫిఫా వరల్డ్‌కప్‌లో మొరాకో చేతిలో 2-1తో ఓడింది. ఆ తర్వాత బ్రెజిల్ ఆశించినంతగా ఆడలేక 1834.21 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక బెల్జియం 1792. 53 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 1792.43 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ 1731. 23 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. యూరోప్ దేశాలైన క్రొయేషియా, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ ఆరు నుంచి పది స్థానాల్లో నిలిచాయి. 🇦🇷🏆 World champions ✅ 🇦🇷🥇 Top of the #FIFARanking ✅ — FIFA World Cup (@FIFAWorldCup) April 6, 2023 -
హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మంగళవారం మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అర్జెంటీనా తరపున వందో అంతర్జాతీయ గోల్ సాధించాడు. కురాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా 7-0తో రికార్డు విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. ఆట 20, 33, 37వ నిమిషాల్లో మెస్సీ గోల్స్ చేసి హ్యాట్రిక్‌తో పాటు వందో గోల్స్ సాధించాడు. ప్రస్తుతం మెస్సీ ఖాతాలో 102 గోల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ(174 మ్యాచ్‌ల్లో 102 గోల్స్) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్‌ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెస్సీ మూడు గోల్స్ చేయగా.. నికోలస్ గొంజాలెజ్(ఆట 23వ నిమిషం), ఎంజో ఫెర్నాండేజ్(ఆట 35వ నిమిషం), ఏంజెల్ డి మారియా(ఆట 78వ నిమిషం), గొంజాలో మాంటెల్(ఆట 87వ నిమిషం)లో గోల్స్ చేయడంతో అర్జెంటీనా 7-0 తేడాతో కురాకోను చిత్తుగా ఓడించింది. కాగా మెస్సీకి అర్జెంటీనా తరపున ఇది ఏడో అంతర్జాతీయ హ్యాట్రిక్ గోల్స్ కావడం విశేషం. MESSI WHAT A CRAZY HALF, ENJOY THE GOALS!!!! 🐐🐐🐐 pic.twitter.com/f9nwKcoUeS — mx ⭐️⭐️⭐️ (@MessiMX30iiii) March 29, 2023 -
Lionel Messi: 'వొడువని ముచ్చట'.. అరుదైన గౌరవం
మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్‌కప్ సాధించి ఇప్పటికి మూడు నెలలు కావొస్తుంది. కానీ ఇంకా అది ఒడవని ముచ్చటలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే మూడు నెలలైనా ఇంకా మెస్సీ నామస్మరణ మారుమోగుతూనే ఉంది. వరల్డ్‌కప్ సాధించినప్పటి నుంచి మెస్సీకి ఏదో ఒక చోట గౌరవ సత్కారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ కౌన్సిల్ మెస్సీకి అరుదైన గౌరవంతో సత్కరించింది. సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ హెడ్‌క్వార్టర్స్ అయిన కాన్‌మిబోల్‌లోని మ్యూజియంలో అతని మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందించినందుకు గానూ ఈ గౌరవం ఇచ్చినట్లు గవర్నింగ్ కౌన్సిల్ పేర్కొంది. కాగా ఫుట్‌బాల్‌లో దిగ్గజాలుగా పేరు పొందిన డీగో మారడోనా, పీలే తర్వాత కాన్‌మిబోల్ మ్యూజియంలో ఈ గౌరవం అందుకున్న మూడో ఆటగాడిగా మెస్సీ రికార్డుకెక్కాడు. ఇక గతేడాది డిసెంబర్లో ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించిన అర్జెంటీనా 36 ఏళ్ల తర్వాత మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. టోర్నీ ఆద్యంతం అంతా తానై నడిపించిన మెస్సీ ఏడు గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇటీవలే బ్యూనస్ ఎయిర్స్లో పనామాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 2-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్ చేశాడు. ఇది మెస్సీకి 800వ గోల్ కావడం విశేషం. ఇక అర్జెంటీనా తరపున 99వ గోల్స్ సాధించిన మెస్సీ వందో గోల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. Statue for the best player in history. #Messi 🐐🇦🇷pic.twitter.com/BrW2XqShh8 — Leo #Messi 🐐 (@LeoCuccittini_) March 27, 2023 చదవండి: దుమ్మురేపిన రొనాల్డో.. పోర్చుగల్ ఖాతాలో రెండో విజయం -
రొనాల్డో ప్రపంచ రికార్డు.. మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా?
ప్రస్తుత ఫుట్‌బాల్ తరంలో లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపించినా మెస్సీ ఒక మెట్టు పైన ఉంటాడు. అందుకు కారణం గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను విజేతగా నిలపడమే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ అత్యధిక గోల్స్ చేసి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు మూడోసారి టైటిల్ అందించాడు. ఈ దెబ్బతో రొనాల్డో కాస్త వెనుకబడినట్లుగా అనిపించాడు. అయితే వ్యక్తిగతంగా చూస్తే మాత్రం ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. ఒక రికార్డు రొనాల్డో బద్దలు కొట్టాడంటే వెంటనే మెస్సీ తన పేరిట ఒక రికార్డును లిఖించుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా రొనాల్డో దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే నీ వెనుకే నేను వస్తా అంటూ మెస్సీ కూడా తన కెరీర్లో 800వ గోల్ సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు. బ్రూనస్ ఎయిర్స్ వేదికగా గురువారం అర్జెంటీనా, పనామాల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ సేన 2-0 తేడాతో విజయం సాధించింది. ఆట 89వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన ఫ్రీకిక్‌ను మెస్సీ తనదైన శైలిలో గోల్‌గా మలిచాడు. దీంతో తన కెరీర్లో 800వ గోల్ పూర్తి చేసుకున్న మెస్సీ అర్జెంటీనా తరపున 99వ గోల్ సాధించాడు. వంద గోల్స్ మార్క్‌ను చేరుకోవడానికి మెస్సీ ఇక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక క్లబ్స్ తరపున 701 గోల్స్ చేసిన మెస్సీ ఓవరాల్‌గా 800 గోల్స్‌తో కొనసాగుతున్నాడు. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచిన జట్టుతోనే అర్జెంటీనా బరిలోకి దిగడం విశేషం. Lionel Messi with an incredible free-kick 🇦🇷 We are witnessing greatness once again 🐐 pic.twitter.com/QBPUO7B9LY — SPORTbible (@sportbible) March 24, 2023 చదవండి: ఫుట్‌బాల్‌లో సంచలనం.. చారిత్రాత్మక గోల్ -
మెస్సీకి చేదు అనుభవం..
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఒకేసారి అభిమానులు మీద పడడంతో ఆయన కాస్త ఉక్కిరిబిక్కిరికి గురయ్యాడు. అయితే ఆ తర్వాత బౌన్సర్స్ వారిని చెదరగొట్టడంతో మెస్సీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయంలోకి వెళితే.. సోమవారం రాత్రి మెస్సీ భార్య, పిల్లలతో కలిసి అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని డాన్ జూలియో రెస్టారెంట్‌కు వచ్చాడు. తనకిష్టమైన ఫుడ్‌ను తిని అక్కడి నుంచి బయలుదేరాలనుకున్నాడు. అయితే అప్పటికే మెస్సీ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు రెస్టారెంట్ బయట గూమిగూడారు. రెస్టారెంట్ నుంచి కారిడార్లోకి వచ్చిన మెస్సీ వారికి అభివాదం చేశాడు. ఈలోగా బయటకు వచ్చిన మెస్సీని అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీంతో ఉక్కిరిబిక్కిరికి గురైన మెస్సీ భయపడి రెస్టారెంట్ లోపలికి వచ్చేశాడు. ఆ తర్వాత లోకల్ పోలీసులు అక్కడికి చేరుకొని అభిమానులను చెదరగొట్టారు. ఆ తర్వాత పోలీసుల సాయంతో మెస్సీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) వరుస ఓటములు చవిచూస్తుంది. తాజాగా పార్క్ డెస్-ప్రిన్సెస్ టోర్నీలో రెనెస్తో మ్యాచ్‌లో 2-0తో ఓటమి పాలయ్యింది. దీనికి తోడు పీఎస్జీ మేనేజర్‌తో మెస్సీకి గొడవలు ఉన్నాయంటూ.. త్వరలోనే మెస్సీ పారిస్ సెయింట్ జెర్మెన్ క్లబ్‌ను వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Lionel Messi leaving the restaurant. Rock star. Via @M30Xtra.pic.twitter.com/sxHStBX1kQ — Roy Nemer (@RoyNemer) March 21, 2023 చదవండి: కఠిన ప్రశ్న.. పుజారాను నమ్ముకుంటే అంతే! ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీమ్ నూతన కెప్టెన్‌గా ఎంబాపె -
క్లబ్ మేనేజర్‌తో గొడవ.. పీఎస్జీని వీడనున్నాడా?
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ త్వరలోనే పారిస్ సెయింట్ జెర్మెన్(PSG Club) వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీఎస్జీ క్లబ్ మేనేజర్ క్రిస్టొఫీ గాల్టియర్‌తో గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. మేనేజర్‌తో గొడవ కారణంగా మెస్సీ పీఎస్జీ క్లబ్ కొనసాగేందుకు ఇష్టంగా లేడని.. త్వరలోనే తెగదెంపులు చేసుకునే అవకాశం ఉందని డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. శనివారం పీఎస్జీ క్లబ్ నిర్వహించిన ట్రెయినింగ్ సెషన్‌కు మెస్సీ హాజరుకాలేదని.. గాల్టియర్‌తో పొసగకనే మెస్సీ తన హాటల్ రూంకే పరిమితమయ్యాడని తెలిపింది. మేనేజర్‌తో మెస్సీకి పొసగడం లేదన్న వార్తలు నిజమేనని మెస్సీ తండ్రి పేర్కొనడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లయింది. కాగా మెస్సీ 2021లో పీఎస్జీతో రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఏడాది జూన్‌తో మెస్సీకి పీఎస్జీతో కాంట్రాక్ట్ ముగియనుంది. మేనేజర్‌తో గొడవ కారణంగా మెస్సీ తన కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేసుకుంటాడా లేక బయటికి వస్తాడా అనేది ఆసక్తికంగా మారింది. అంతకముందు 2004 నుంచి 2021 వరకు 17 ఏళ్ల పాటు మెస్సీ స్పానిష్ క్లబ్ బార్సిలోనాకు ఆడాడు. ఒకవేళ పీఎస్జీ నుంచి బయటికి వస్తే మెస్సీ కచ్చితంగా మళ్లీ బార్సిలోనా గూటికే చేరే అవకాశం ఉంది. అయితే మెస్సీ పీఎస్జీ వీడనున్నట్లు వస్తున్న వార్తలకు మరో కారణం ఉంది. ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపెతో మెస్సీ రిలేషన్ అంతగా బాగా లేదని.. ఇద్దరు స్టార్స్ ఒకేచోట ఇమడలేకపోతున్నారంటూ సమాచారం. ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్ తర్వాత వీరిద్దరి మధ్య రిలేషిన్షిప్ దెబ్బ తిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే పీఎస్జీలోకి వచ్చిన తర్వాత మెస్సీ ప్రయాణం అనుకున్నంత గొప్పగా ఏమి సాగడం లేదు. దీంతో అతను బయటికి రావడానికి ఇది కూడా ఒక కారణమని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. I'm sorry but Messi is definitely bigger than PSG https://t.co/wASmdHD9hz — Liam (@ThatWasMessi) March 18, 2023 చదవండి: ప్రపంచ పొట్టి బాడీబిల్డర్ వివాహం.. వీడియో వైరల్ వయసు పెరిగినా వన్నె తగ్గలేదు.. -
మెస్సీని మెచ్చుకుంటూనే అవమానించాడు
యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్‌లో మెస్సీ సారధ్యంలోని పీఎస్జీ కథ ముగిసింది. గురువారం తెల్లవారుజామున డిఫెండింగ్ ఛాంపియన్ బెయర్న్ మ్యునిచ్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో పీఎస్జీ 2-0 తేడాతో ఓటమి పాలై నాకౌట్ అయింది. బెయర్న్ మ్యునిచ్ తరపున ఎరిక్ మాక్సిమ్ మోటింగ్(61వ నిమిషం), సెర్గి గ్నార్బీ(89వ నిమిషం)లో గోల్స్ చేశారు. కాగా బెయర్న్ మ్యునిచ్ యూఈఎఫ్ఏ లీగ్‌లో క్వార్టర్స్ చేయడం ఇది పదమూడోసారి కావడం విశేషం. కాగా 2020లో ఇదే బెయర్న్ మ్యునిజ్.. అప్పటి పీఎస్జీని ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం బెయర్న్ మ్యునిచ్ కెప్టెన్.. జర్మనీ స్టార్ ఫుట్‌బాలర్ థామస్ ముల్లర్ మెస్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెస్సీని ఒకవైపు మెచ్చుకుంటేనే మరోవైపు అవమానించాడు. ''మెస్సీ ఒక రియలిస్టిక్ ఆటగాడు.. మ్యాచ్ గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అర్జెంటీనా స్టార్‌గా అతను ఎన్నో ఘనతలు సాధించాడు. అతనంటే నాకు గౌరవం.. కానీ పారిస్ జెయింట్స్ లాంటి ఫుట్‌బాల్ క్లబ్స్ తరపున మాత్రం మెస్సీ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. క్లబ్స్‌లో తన రియలిస్టిక్ ఆటను చూడలేకపోతున్నాం. దేశం తరపున మాత్రమే మెస్సీ కెప్టెన్‌గా పనికొస్తాడు.. క్లబ్స్ తరపున కెప్టెన్‌గా పనికిరాడు. ఈ ఒక్క విషయంలో క్రిస్టియానో రొనాల్డోతో మెస్సీని పోల్చవచ్చని.. మెస్సీ లాగే రొనాల్డో కూడా ఇటీవలే కాలంలో కెప్టెన్‌గా విఫలమవుతున్నాడనే విషయం గుర్తుపెట్టుకోవాలి.'' అంటూ తెలిపాడు. Thomas Müller: "Against Messi, things always go well at all levels in terms of results. At club level, Cristiano Ronaldo was our problem when he was at Real Madrid. But I have the greatest respect for Messi's World Cup performance" [@georg_holzner] pic.twitter.com/duZ94DgZxw — Bayern & Germany (@iMiaSanMia) March 9, 2023 చదవండి: మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి -
మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి
అర్జెంటీనా లియోనల్ మెస్సీని ఒక అభిమాని భయపెట్టాడు. ప్రస్తుతం మెస్సీ పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) తరపున యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్(UEFA)లో ఆడుతున్నాడు. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా బెయర్న్ మ్యునిచ్‌తో మ్యాచ్ జరిగింది. కాగా లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరు ఊహించని రీతిలో గ్రౌండ్లోకి దూసుకొచ్చిన ఒక వ్యక్తి మెస్సీని పట్టుకోబోయాడు. అయితే మెస్సీ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ వ్యక్తి పట్టు తప్పి కింద పడిపోయాడు. ఇది గమనించిన సిబ్బంది రంగప్రవేశం చేసి అతన్ని బయటకు తీసుకెళ్లారు. కానీ అజ్ఞాతవ్యక్తి చర్య మెస్సీని భయపెట్టినట్లుగా అతని ఎక్స్ప్రెషన్ ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్‌లో బెయర్న్ మ్యునిచ్ 2-0 తేడాతో పీఎస్జీ జట్టుపై విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఎరిక్ మాక్సిమ్ మోటింగ్(61వ నిమిషం), సెర్గి గ్నార్బీ(89వ నిమిషం)లో గోల్స్ చేశారు. కాగా బెయర్న్ మ్యునిచ్ యూఈఎఫ్ఏలో క్వార్టర్స్ చేయడం ఇది పదమూడోసారి కావడం విశేషం. A pitch invader tried to slide tackle Messi after the game yesterday 😳 But Messi just side-stepped the tackle and kept walking on 😂 This man used to dribble past Ramos, Pepe, Vidic and Van Dijk. What was the fan thinking 😭😭💀pic.twitter.com/FsBySjTJBO — IG: TheFootballRealm (@theftblrealm) March 9, 2023 చదవండి: PSL 2023: ఫఖర్ జమాన్ వీరవిహారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ జోరు -
'నీకోసం ఎదురుచూస్తున్నాం'.. మెస్సీకి బెదిరింపులు
గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ జట్టు కప్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. గురువారం ఫిఫా వరల్డ్‌కప్ సాధించిన అర్జెంటీనా జట్టుతో పాటు సపోర్ట్ స్టాఫ్‌కు కలిపి మొత్తంగా 35 గోల్డ్ ఐఫోన్స్ ఆర్డర్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ దెబ్బకు మెస్సీపై ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. అంతేకాదు ఫిఫా వరల్డ్‌కప్ అందుకున్నప్పటి నుంచి మెస్సీ ఖాతాలో అవార్డులు వచ్చి చేరుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్‌కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. మెస్సీని లక్ష్యంగా చేసుకొని గుర్తుతెలియని దుండగులు బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అర్జెంటీనాలోని రోసారియో నగరంలో మెస్సీ భార్య కుటుంబానికి చెందిన ఒక సూపర్ మార్కెట్‌పై అర్థరాత్రి వేళ కాల్పులు జరిపారు. 14 రౌండ్ల బులెట్లు పేల్చినట్లు సమాచారం. అనంతరం ''మెస్సీ.. నీకోసం ఎదురుచూస్తున్నాం'' అని నేలపై రాసి వెళ్లారు. రోసారియో నగర మేయర్ పాబ్లో జావ్కిన్ ఒక మాదకద్రవ్యాల డీలర్. అతను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోలేడు అని కూడా పేర్కొన్నారు. దీనిపై నగర్ మేయర్ జావ్కిన్ స్పందించాడు. దాడి జరిగింది నిజమేనని ఆయన ధ్రువీకరించారు. స్థానికంగా గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు భావిస్తున్నామన్నారు. ప్రపంచానికి మెస్సీపై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే కొంతమంది దుండగులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మెస్సీ పేరు వాడుకుంటే పాపులర్ కావొచ్చన్న ఉద్దేశంతో ఇలా చేసి ఉండొచ్చన్నారు. కొంతకాలంగా ఇలాంటి దాడులు వరుసగా జరుగతున్నాయన్నారు. పోలీసులు సైతం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ఇలాంటివి చేస్తున్నారన్నారు. కాగా రొసారియో నగరం మెస్సీ స్వస్థలం. అయితే కొన్నేళ్లుగా రొసారియో నగరం మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. 2022లో రొసారియో నగరంలో 287 హత్యలు జరగడం సంచలనం రేపింది. చదవండి: మెస్సీనా మజాకా.. జట్టు కోసం గోల్డ్-ఐఫోన్స్ మళ్లీ ఓడిన ఎంబాపె.. మెస్సీదే పైచేయి -
మెస్సీనా మజాకా.. జట్టు కోసం గోల్డ్-ఐఫోన్స్
మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్‌కప్ సాధించి దాదాపు మూడు నెలలు కావొస్తుంది. అయితే ఇప్పటికి ఫుట్‌బాల్ అభిమానులు మెస్సీ మాయ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అన్నీ తానై నడిపించిన మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ అందుకోవాలనే తన కలతో పాటు 36 ఏళ్ల అర్జెంటీనా నిరీక్షణకు తెరదించాడు. అందుకే ఫిఫా చరిత్రలోనే అర్జెంటీనా, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా నిలిచిపోయింది. ఫైనల్లో గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డు సొంతం చేసుకున్న మెస్సీ ఇప్పటికే ఫిఫా మెన్స్ అత్యుత్తమ ఆటగాడిగా అవార్డు కూడా అందుకున్నాడు. తాజాగా మెస్సీ చేసిన ఒక పని అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదేంటో తెలుసా.. ఫిఫా వరల్డ్‌కప్ అందుకున్న అర్జెంటీనా టీమ్, స్టాఫ్ కోసం మెస్సీ రూ. 1.73 కోట్ల విలువైన 35 గోల్డ్ ఐఫోన్లను ఆర్డర్ చేయడం విశేషం. స్పెషల్‌గా తయారయిన ఈ గోల్డ్ ఐఫోన్లపై ఆటగాడి పేర్లు, జెర్సీ నెంబర్లు, అర్జెంటీనా లోగోను ముద్రించారు. ఈ ఐఫోన్లు వారాంతంలో మెస్సీ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాయని సమాచారం. ఫిఫా వరల్డ్ కప్ అర్జెంటీనా సొంతం కావడంతో ఈ వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆటగాళ్లకు ప్రత్యేకమైన బహుమతులు అందించాలని మెస్సీ భావిస్తున్నాడు. ఎంటర్ప్రెన్యూర్ బన్ లైన్స్‌తో కలిసి మెస్సీ డివైజ్‌ల డిజైన్‌ను రూపొందించినట్లు ది సన్ పత్రిక కథనం ప్రచురించింది. టీం సభ్యులకు, సపోర్ట్ స్టాఫ్‌కు మెస్సీ గోల్డ్ ఐఫోన్‌గా ఐఫోన్-14ను ఎంచుకున్నారు. ఫోన్ డిజైన్‌తో పాటు ఐఫోన్లను మెస్సీ రిసీవ్ చేసుకున్న ఫొటోను ఐ-డిజైన్ గోల్డ్ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతా వెల్లడించింది. ఫిఫా వరల్డ్‌కప్ గెలుపొందిన మెస్సీ బృందంతో పాటు స్టాఫ్ కోసం 35 గోల్డ్ ఐఫోన్లను డెలివరీ చేయడం గౌరవంగా భావిస్తున్నామని క్యాప్షన్ జత చేసింది. ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన అర్జెంటీనా జట్టు: ఎమి మార్టినెజ్, ఫ్రాంకో అర్మానీ, గెరోనిమో రుల్లి, మార్కోస్ అకునా, జువాన్ ఫోయ్త్, లిసాండ్రో మార్టినెజ్, నికోలస్ టాగ్లియాఫికో, క్రిస్టియన్ రొమెరో, నికోలస్ ఒటామెండి, నహుయెల్ మోలినా, గొంజాలో మోంటియెల్, లెగో జర్మన్ పర్జెల్, ఆంరో జర్మన్ పర్జెల్, రోడ్రి పెజ్జెల్లా, డి పాల్, అలెక్సిస్ మాక్ అలిస్టర్, ఎంజో ఫెర్నాండెజ్, ఎక్సిక్వియెల్ పలాసియోస్, గైడో రోడ్రిగ్జ్, లియోనెల్ మెస్సీ, లౌటరో మార్టినెజ్, పాలో డైబాలా, ఏంజెల్ కొరియా, జూలియన్ అల్వారెజ్, థియాగో అల్మడ, అలెజాండ్రో గోమెజ్ View this post on Instagram A post shared by 𝗜𝗗𝗘𝗦𝗜𝗚𝗡 𝗚𝗢𝗟𝗗 (@idesigngold) View this post on Instagram A post shared by 𝘽𝙚𝙣𝙟𝙖𝙢𝙞𝙣 𝙇𝙮𝙤𝙣𝙨 (@benlyons1111) చదవండి: అదే రెండున్నర రోజులు.. సీన్ మాత్రం రివర్స్! స్టన్నింగ్ క్యాచ్.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ -
మెస్సీనే మేటి...
పారిస్: తన అద్భుత ప్రతిభతో 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అర్జెంటీనా జట్టును మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా నిలబెట్టిన లియోనెల్ మెస్సీ 2022 ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్‌గా ఎంపికయ్యాడు. గత ఏడాది ఖతర్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్ ఫైనల్లో కెప్టెన్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో ఫ్రాన్స్‌ను ఓడించి 1986 తర్వాత మళ్లీ జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీలో మెస్సీ ఏడు గోల్స్ చేశాడు. ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్ అవార్డు కోసం మెస్సీ, కిలియాన్ ఎంబాపె (ఫ్రాన్స్), కరీమ్ బెంజెమా (ఫ్రాన్స్) పోటీపడ్డారు. జాతీయ జట్ల కెప్టెన్లు, కోచ్‌లు, ఎంపిక చేసిన జర్నలిస్ట్‌లు, ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్యలో సభ్యత్వం ఉన్న 211 దేశాల ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటింగ్‌లో మెస్సీకి 52 పాయింట్లు రాగా... ఎంబాపెకు 44 పాయింట్లు, కరీమ్ బెంజెమాకు 34 పాయింట్లు వచ్చాయి. గత 14 ఏళ్లలో మెస్సీ ఏడోసారి ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్ అవార్డు గెల్చుకోవడం విశేషం. ఉత్తమ కోచ్‌గా అర్జెంటీనాకు ప్రపంచ టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించిన లియోనెల్ స్కలోని ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో ప్రపంచ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు స్పెయిన్‌కు చెందిన అలెక్సియా పుటెలాస్‌కు లభించింది. -
FIFA Football Awards : కన్నులపండువగా ఫిఫా అవార్డ్స్ వేడుక (ఫొటోలు)
-
మళ్లీ ఓడిన ఎంబాపె.. మెస్సీదే పైచేయి
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డును కొల్లగొట్టాడు. భారత కాలామాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్(FIFA) నిర్వహించిన బెస్ట్ ఫిఫా ఫుట్‌బాల్ అవార్డ్స్‌లో మెస్సీ ఈ అవార్డు అందుకున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను మెస్సీ విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. 36 సంవత్సరాల అర్జెంటీనా అభిమానుల నిరీక్షణకు తెరదించిన మెస్సీ వరల్డ్‌కప్ అందుకోవాలన్న తన చిరకాల కోరికను కూడా నెరవేర్చుకున్నాడు. ఇక గతేడాది జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ కొదమసింహాల్లా తలపడ్డాయి. మెస్సీ రెండు గోల్స్‌తో మెరవగా.. ఎంబాపె ఏకంగా హ్యాట్రిక్ గోల్స్‌తో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ 3-3తో డ్రా కావడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. ఇక పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. మ్యాచ్ ఓడినా ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న మెస్సీ తాజాగా ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం మెస్సీతో పాటు ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్స్ కైలియన్ ఎంబాపె, కరీమ్ బెంజెమాలు పోటీ పడ్డారు. అయితే మెస్సీని దాటి అవార్డు అందుకోవడంలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. 2021 ఆగస్టు 8 నుంచి 18 డిసెంబర్ 2022 వరకు మెన్స్ ఫుట్‌బాల్‌లో ఔట్‌స్టాండింగ్ ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్ల జాబితాను ఎంపిక చేశారు. ఈ జాబితాలో మెస్సీ 52 పాయింట్లతో టాప్ ర్యాంక్ కైవసం చేసుకోగా.. కైలియన్ ఎంబాపె 44 పాయింట్లతో రెండో స్థానం, కరీమ్ బెంజెమా 34 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. కాగా మెస్సీ ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఇంతకముందు వరుసగా 2009, 2010, 2011, 2012, 2015, 2019.. తాజాగా 2023లో మరోసారి అవార్డును గెలుచుకున్నాడు. ఉత్తమ FIFA ఉమెన్స్ ప్లేయర్ విజేత: అలెక్సియా పుటెల్లాస్ ఉత్తమ FIFA పురుషుల కోచ్ విజేత: లియోనెల్ స్కలోని ఉత్తమ FIFA మహిళా కోచ్ విజేత: సరీనా విగ్మాన్ ఉత్తమ FIFA పురుషుల గోల్ కీపర్ విజేత: ఎమిలియానో మార్టినెజ్ ఉత్తమ FIFA మహిళా గోల్ కీపర్ విజేత: మేరీ ఇయర్ప్స్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) MESSI IS THE WINNER OF THE BEST AWARD ❤️🐐 pic.twitter.com/4pJhMoVCI6 — Messi Media (@LeoMessiMedia) February 27, 2023 -
ప్రధాని మోదీకి మెస్సీ జెర్సీ కానుకగా..
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ జెర్సీ గిఫ్ట్‌గా రావడం ఆసక్తి కలిగించింది. అర్జెంటీనాకు చెందిన వైపీఎఫ్ అనే పెట్రోలియన్ అండ్ గ్యాస్ కార్పోరేషన్ సంస్థ బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వారోత్సవాలకు హాజరయ్యింది. సంస్థ అధ్యక్షుడు పాబ్లో గొంజాలెజ్ ప్రధాని మోదీకి మంగళవారం మెస్సీ జెర్సీని అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్‌ను షూటౌట్లో 4-2తో మట్టికరిపించి జగజ్జేతగా అవతరించింది. మారడోనా తర్వాత దిగ్గజ ఆటగాడిగా పేరు పొందిన మెస్సీ ఫిపా వరల్డ్‌కప్‌ను అందుకోవాలన్న తన కలను సాకారం చేసుకోవడంతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు మెస్సీ ఘనతను పొగడ్తలతో ముంచెత్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెస్సీని ప్రశంసించిన జాబితాలో ఉన్నారు. -
మాయ చేసే మెస్సీనే బోల్తా కొట్టించాడు..
ఫుట్‌బాల్‌లో లియోనల్ మెస్సీది ప్రత్యేక స్థానం. మైదానంలో తన ఆటతో అభిమానులను మాయ చేయగల సత్తా అతని సొంతం. గతేడాది ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపించిన మెస్సీ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. మారడోనా తర్వాత దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందిన మెస్సీ ఎట్టకేలకు తన ఫిఫా వరల్డ్‌కప్ కలను సాకారం చేసుకున్నాడు. అలాంటి మెస్సీనే తెలివిగా బోల్తా కొట్టించాడు మెజీషియన్. కార్డ్ ట్రిక్ ప్లేతో తన మ్యాజిక్‌ను చూపించి మెస్సీనే మెస్మరైజ్ చేశాడు. విషయంలోకి వెళితే.. ప్రస్తుతం మెస్సీ పారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్జీ) క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి పీఎస్జీ ప్లేయర్స్‌కు పారిస్‌లో ఒక పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి మెస్సీ సహా ఇతర పీఎస్జీ ప్లేయర్లు హాజరయ్యారు. ఇదే పార్టీకి జూలిస్ డెయిన్ అనే మెజీషియన్ కూడా వచ్చాడు. మెస్సీ దగ్గరికి వచ్చి కార్డ్ ట్రిక్ ప్లే మ్యాజిక్ షో చూపిస్తానన్నాడు. మెస్సీని ఒక కార్డు సెలెక్ట్ చేసుకోవాలని.. కానీ అది ఏ కార్డు అనేది తనకు చూపించొద్దన్నాడు. అలా మెస్సీ ఏస్(A) కార్డును సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన మ్యాజిక్ ట్రిక్‌తో మెస్సీ ఏంచుకున్న కార్డును మెజీషియన్ కరెక్టుగా చూపించడంతో పాటు అర్థం కాని భాషలో మాట్లాడాడు. ఆ సమయంలో మెస్సీ భార్య ఆంటోనెల్లా కూడా అక్కడే ఉంది. ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో తెలియక మెజీషియన్ పడుతున్న కష్టాన్ని చూసి మెస్సీ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ అందించిన తర్వాత ఆటకు రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరికొన్ని రోజులు తన ఆటను కొనసాగిస్తానని మెస్సీ మనసులో మాటను చెప్పాడు. కానీ గత రెండురోజులుగా మెస్సీ త్వరలోనే రిటైర్ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా మెస్సీ కూడా అర్జెంటీనా జెర్సీని పట్టుకొని.. 'ఇక ముగిసింది' అన్నట్లుగా హింట్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. 35 ఏళ్ల మెస్సీ.. లీగ్-1లో భాగంగా మోంట్పిల్లీర్తో మ్యాచ్‌లో గోల్ చేయగా.. 3-1తో పీఎస్జీ విజయం సాధించింది. View this post on Instagram A post shared by Julius Dein (@juliusdein) చదవండి: వాళ్లిద్దరు నిజంగా కలిశారా..? గిల్‌పై ఇషాన్ కిషన్ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్ -
Lionel Messi: రొనాల్డో అరుదైన రికార్డు బద్దలు కొట్టిన మెస్సీ.. ఏకంగా..
Lionel Messi- Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో- లియోనల్ మెస్సీ.. ఈ ఇద్దరు ఫుట్‌బాల్ దిగ్గజాల మధ్య రికార్డుల పోటీ నువ్వా- నేనా అన్నట్లుగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దకాలంగా సాకర్ ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్న ఈ ఇద్దరు లెజెండ్స్‌లో.. మెస్సీ ఫిఫా ప్రపంచకప్-2022 ట్రోఫీని ముద్దాడి ఓ మెట్టు పైన నిలిచాడు. మరోవైపు.. పోర్చుగల్ స్టార్ రొనాల్టోకు మాత్రం వరల్డ్‌కప్ టైటిల్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఖతర్ టోర్నీలో అర్జెంటీనా సూపర్‌స్టార్ మెస్సీ అద్భుతాలు చేయగా.. రొనాల్డో మాత్రం అవమానకర రీతిలో ఈవెంట్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. రొనాల్డో రికార్డు బద్దలు ఈ క్రమంలో రొనాల్డోకు సాధ్యం కాని పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న లియోనల్ మెస్సీ.. ఈ పోర్చుగల్ స్టార్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. టాప్-5 యూరోపియన్ లీగ్‌లలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా 697 గోల్స్‌తో రొనాల్డోను అధిగమించాడు మెస్సీ. ఫ్రెంచ్ లీగ్‌లో భాగంగా పారిస్ సెయింట్ జర్మనీ(పీఎస్జీ), మాంట్పిల్లర్ మ్యాచ్ సందర్భంగా మెస్సీ ఈ ఫీట్ నమోదు చేశాడు. పీఎస్జీకి ప్రాతినిథ్యం వహించిన ఈ అర్జెంటీనా లెజెండ్.. ఈ మ్యాచ్‌లో గోల్ ద్వారా రొనాల్డోను వెనక్కినెట్టాడు. క్లబ్ కెరీర్లో మొత్తంగా 697 గోల్స్ చేసి టాప్‌లో నిలిచాడు. ఇక ఇందులో ఈ సీజన్లో పీఎస్జీ తరఫున చేసిన గోల్స్ 13. మరోవైపు.. రొనాల్డో ఇప్పటి వరకు రియల్ మాడ్రిడ్ తరఫున 450, మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 145, జువెంటస్ తరఫున 101 గోల్స్‌తో కలిపి మొత్తంగా 696 గోల్స్ సాధించాడు. ఇదిలా ఉంటే.. మాంట్పిల్లర్తో మ్యాచ్‌కు ముందు మెస్సీ మాట్లాడుతూ తన రిటైర్మెంట్పై సంకేతాలు ఇచ్చాడు. కోరుకున్నవన్నీ దక్కాయి.. ఇకపై ‘‘జాతీయ జట్టు తరఫున నేనైతే సాధించాలని అనుకున్నానో ఆ కల నెరవేరింది. వ్యక్తిగతంగా.. వృత్తిగతంగా నేను కోరుకున్నవన్నీ నాకు లభించాయి. శిఖరాగ్రంలో ఉన్నపుడే కెరీర్‌ను ముగించడమే మిగిలి ఉంది. నేను ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టినపుడు ఇక్కడి దాకా వస్తానని అస్సలు ఊహించలేదు. కెరీర్లో అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాను. ప్రస్తుతం నా జీవితంలో ఎలాంటి అసంతృప్తి లేదు. మేము 2021లో కోపా అమెరికా, 2022లో వరల్డ్‌కప్ గెలిచాము. ఇంతకంటే సాధించాల్సిందేమీ లేదు’’అని మెస్సీ అర్బన్ప్లేతో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అల్ నసర్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు. చదవండి: Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్ రావాల్సిందే! IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’ What a Goal by the World Champion Lionel Messi. 🔥🐐 pic.twitter.com/yPJmqUgZda — x3a6y 🇦🇪 (@x3a6y) February 1, 2023 -
'అలా ప్రవర్తించడం తప్పే.. నేను చేసింది నాకే నచ్చలేదు'
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన కెరీర్లో లోటుగా ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ను గతేడాది అందుకున్న సంగతి తెలిసిందే. నాలుగుసార్లు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందుకోవడంలో విఫలమైన మెస్సీ ఐదో ప్రయత్నంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. జట్టును అంతా తానై నడిపించిన మెస్సీ.. కీలకమైన ఫైనల్లో ఫ్రాన్స్‌పై షూటౌట్ ద్వారా విజేతగా నిలిపాడు. ఫైనల్లో మూడు గోల్స్ చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన మెస్సీ టోర్నీలో మొత్తంగా ఏడు గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డును గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ ముగిసిన 45రోజులు కావొస్తున్న వేళ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌లో జరిగిన ఒక సంఘటనపై స్పందించాడు. అదేంటంటే.. నెదర్లాండ్స్‌తో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ సందర్భంగా డచ్ బాస్ లూయిస్ వాన్గాల్తో పాటు స్ట్రైకర్ వౌట్ వెగ్రోస్ట్లను హేళన చేస్తున్నట్లుగా తన రెండు చేతులను చెవుల మధ్య పెట్టి కోపంగా చూస్తూ ఫోజివ్వడం సంచలనం కలిగించింది. సౌమ్య హృదయడనుకున్న మెస్సీ నుంచి ఇలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుందని ఎవరు ఊహించలేదు. అందుకే మెస్సీని కొంతమంది తప్పుబట్టారు. అప్పుడే దీనిపై స్పందించిన మెస్సీ..''గేమ్‌లో భాగంగా కంట్రోల్ తప్పాను.. ఆ సమయంలో అలా వచ్చేసింది'' అంటూ వివరణ ఇచ్చాడు. తాజాగా మరోసారి ఇదే అంశంపై స్పందిస్తూ మరింత క్లారిటీ ఇచ్చాడు. ''నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అలా ప్రవర్తించడం తప్పే. నేను చేసింది నాకే నచ్చలేదు. అయితే దానిని మనసులో పెట్టుకొని ముందుకెళ్లడం నాకు సాధ్యం కాదు. అందుకే ఆరోజే ఏదో అనుకోకుండా జరిగిందని వివరణ ఇచ్చకున్నాడు. మ్యాచ్ అన్నాకా హైటెన్షన్ ఉండడం సహాజం. ఆ టెన్షన్లో ఒక్కోసారి మనం సహనం కోల్పోతాం. నాకు కూడా అదే జరిగింది. ఇక నేను అందుకున్న ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని దిగ్గజం మారడోనా చెంతకు చేర్చాను'' అంటూ వెల్లడించాడు. Lionel Messi on his celebration vs. Netherlands: "It came out naturally. My team mates told me what van Gaal said before the match. I don't like to leave that image, but it just came out. There was a lot of nervousness." Via @urbanaplayfm. 🇦🇷 pic.twitter.com/DT2w3sAo1D — Roy Nemer (@RoyNemer) January 30, 2023 చదవండి: విషాదం: ప్రపంచ ఛాంపియన్.. మంచు కింద సజీవ సమాధి -
క్రిస్టియానో రొనాల్డోకు అవమానం..
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు సొంత అభిమానుల మధ్య అవమానం ఎదురైంది. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అల్ నసర్‌తో భారీ విలువకు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అల్ నసర్ తరపున రొనాల్డో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో పారిస్ సెయింట్స్ జర్మన్(పీఎస్జీ)తో ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఉంది. ఆ మ్యాచ్‌లో మెస్సీని డామినేట్ చేసిన రొనాల్డో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కానీ మ్యాచ్‌లో మాత్రం రొనాల్డో అల్ నసర్ ఓడిపోయింది. తాజాగా రొనాల్డో జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. సౌదీ సూపర్‌కప్‌లో భాగంగా గురువారం అర్థరాత్రి రియాద్ వేదికగా అల్ ఇత్తిహద్, అల్ నసర్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అల్ ఇత్తిహద్ 3-1 తేడాతో అల్ నసర్ జట్టును చిత్తు చేసింది. 90 నిమిషాల పాటు ఆడిన రొనాల్డో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. కాగా లీగ్‌లో ఇది రెండో ఓటమి కావడంతో సౌదీ సూపర్ కప్ నుంచి అల్ నసర్ జట్టు నిష్క్రమించింది. కాగా రొనాల్డో వచ్చిన తర్వాత అల్ నసర్ కు ఇదే మేజర్ కప్. కానీ కప్ కొట్టకుండానే ఇంటిబాట పట్టింది. ఇక మ్యాచ్‌లో తన ఆటతో నిరాశపరిచిన రొనాల్డోను అభిమానులు అవమానించారు. మ్యాచ్ ముగిశాకా పెవిలియన్‌కు వస్తున్న సమయంలో రొనాల్డోనూ చూస్తూ మెస్సీ.. మెస్సీ అంటూ పెద్ద గొంతుతో అరిచారు. ఇది గమనించిన రొనాల్డో ఏలా స్పందించాలో తెలియక సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రొనాల్డో నేతృత్వంలోని అల్ నసర్ క్లబ్ అల్ ఫెచ్కు ప్రయాణం కానుంది. ఫిబ్రవరి మూడు నుంచి ప్రారంభం కానున్న సౌదీ ప్రో లీగ్‌లో ఆడనుంది. حسرة النجم العالمي ( كرستيانو رونالدو ) بعد الخسارة من #الاتحاد #الاتحاد_النصر pic.twitter.com/zp0g8Uey7l — علاء سعيد (@alaa_saeed88) January 26, 2023 చదవండి: జడేజా రాణించినా.. జట్టు మాత్రం ఓటమి '22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు' -
ఒక్క చూపు సోషల్ మీడియాను షేక్ చేసింది..
లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్‌లో ఎవరికి వారే సాటి. అయితే మెస్సీ ఇటీవలే అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్ అందించి రొనాల్డో కంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు. మరో వరల్డ్‌కప్ జరిగేందుకు నాలుగేళ్ల సమయం ఉంది. వచ్చే వరల్డ్‌కప్‌లో ఈ ఇద్దరు ఆడుతారా లేదా అనేది ఆసక్తికరమే. ఈ విషయం పక్కనబెడితే.. మెస్సీ, రొనాల్డోలు ఒకే ఫుట్‌బాల్ క్లబ్‌కు ఆడిన సందర్భాలకంటే ప్రత్యర్థులుగా తలపడిన సందర్భమే ప్రేక్షకులకు ఎక్కువ మజాను అందిస్తుంది. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా మరోసారి తలపడ్డారు. దీనికి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ వేదికైంది. ఇటీవలే వివాదాస్పద రీతిలో మాంచెస్టర్ యునైటెడ్‌ను వీడిన క్రిస్టియానో రొనాల్డో.. సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అయిన అల్-నసర్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇక మెస్సీ, నెయ్మర్, కైలియన్ ఎంబాపెలు పారిస్ సెయింట్స్ జర్మన్(పీఎస్జీ)కి ఆడుతున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఫహద్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో మెస్సీ నేతృత్వంలోని ఆల్‌స్టార్స్ ఎలెవన్ జట్టు 5-4తో గెలుపొందింది. కాగా మ్యాచ్ మధ్యలో మెస్సీ రొనాల్డోవైపు ఒక లుక్ ఇచ్చాడు. కానీ రొనాల్డో మాత్రం మెస్సీని పట్టించుకోనట్లుగానే వ్యవహరించాడు. ఆ సమయంలో మెస్సీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెస్సీ ఇచ్చిన ఒక్క చూపు సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఇదంతా కేవలం కామెడీ కోసం మాత్రమే అని తర్వాత అర్థమైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకున్న వీడియో బయటికి వచ్చింది.ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం రొనాల్డో సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టాడు. ''కొంత మంది పాత స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా అనిపించింది.'' అంటూ కామెంట్ చేశాడు. Love someone who looks at you like Messi looks at Cristiano Ronaldo 🥂#CR7𓃵 pic.twitter.com/d4Z5Q5hZAq — Sarah (@_m__sara) January 19, 2023 చదవండి: 24 ఏళ్లపాటు కోమాలోనే.. కన్నుమూసిన సైక్లిస్ట్ బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్ నుంచి 97 కోట్లు మాయం -
Rip ‘King’: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం..
Brazil Legend Pele: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే(82) ఇకలేరు. అభిమానులను విషాదంలోకి నెట్టి తాను దివికేగారు. ‘‘నాకేం కాలేదని.. త్వరలోనే తిరిగి వస్తా’’నంటూ కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రకటించిన పీలే.. గురువారం అర్ధరాత్రి తర్వాత కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్ద పేగు కాన్సర్‌కు బలైపోయిన ఈ లెజెండ్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫుట్‌బాల్ స్టార్ల నివాళులు ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్-2022 విజేత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా రన్నరప్ ఫ్రాన్స్ సారథి కైలియన్ ఎంబాపే, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేమార్ తదితరులు పీలేను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దిగ్గజ ఆటగాడితో తమ జ్ఞాపకాలు పంచుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘‘పీలే ఆత్మకు శాంతి కలగాలి’’ అని మెస్సీ పీలేతో దిగిన ఫొటోలను పంచుకున్నాడు. నేమార్ ఎమోషనల్ నోట్ ‘‘పీలే రాకముందు.. 10 అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే అన్న ఈ వాక్యాన్ని ఎక్కడో చదివాను. ఇదెంతో అందమైనదే అయినా.. అసంపూర్ణమైనదని నేను భావిస్తా. నిజానికి పీలే రాక మునుపు ఫుట్‌బాల్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే. ఆయన వచ్చిన తర్వాత ఈ క్రీడను ఓ కళగా మార్చారు. ఎంతో మంది నిస్సహాయులకు.. ముఖ్యంగా నల్లజాతీయుల గొంతుకగా మారారు. బ్రెజిల్ దిక్సూచిలా పనిచేశారు. ఆయన నేతృత్వంలో సాకర్, బ్రెజిల్ ఒక్కటిగా వెలుగొందాయి. ఇంతటి గొప్ప సేవలు అందించిన కింగ్‌కు ధన్యవాదాలు! ఆయన భౌతికంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవచ్చు. కానీ ఆయన చేసిన అద్భుతాల తాలుకు జ్ఞాపకాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. పీలే చిరస్మరణీయుడు’’ అంటూ నేమార్ ఉద్వేగపూరిత నోట్ రాశాడు. కిరీటం ధరించిన పీలే ఫొటోను షేర్ చేస్తూ ‘కింగ్’ పట్ల అభిమానం చాటుకున్నాడు. ఎంబాపే, రొనాల్డో ఉద్వేగం ఫుట్‌బాల్ రారాజు భౌతికంగా దూరమయ్యాడు అంతే! ఆయన సాధించిన విజయాలు మాత్రం ఎల్లప్పటికీ శాశ్వతం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి కింగ్ అని ఎంబాపే ట్వీట్ చేశాడు. ఇక పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కోట్లాది మందికి పీలే స్ఫూర్తిదాయకమని, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. పీలే లేరన్న విషయాన్ని ఫుట్‌బాల్ లోకం జీర్ణించుకోలేకపోతోందని, ఆయన కుటుంబానికి ప్రగాభ సానుభూతి తెలియజేశాడు. అల్విదా కింగ్ ఫుట్‌బాల్ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చే ఆటగాళ్లలో పీలే ముందు వరుసలో ఉంటారనడంలో అతిశయోక్తి కాదు. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించారు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్ ముఖచిత్రంగా మారారు. అంతా స్టార్ ప్లేయర్లు ఉన్న జట్టులో.. 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో ఆడిన ఆయన.. మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారు. దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందారు. కాగా కెరీర్ మొత్తంలో నాలుగు ఫిఫా ప్రపంచకప్‌లు ఆడిన పీలే మొత్తం 12 గోల్స్ సాధించారు. 10 నంబర్ జెర్సీ ధరించే ఆయన.. ఆ సంఖ్యకు వన్నె తెచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by NJ 🇧🇷 (@neymarjr) View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) The king of football has left us but his legacy will never be forgotten. RIP KING 💔👑… pic.twitter.com/F55PrcM2Ud — Kylian Mbappé (@KMbappe) December 29, 2022 View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) -
Lionel Messi: తగిన గౌరవం.. రూమ్‌నే మ్యూజియంగా
ఫిఫా వరల్డ్‌కప్ కోసం ఖతార్‌లో మెస్సీ బస చేసిన హోటల్ రూమ్‌ను ఓ మ్యూజియంగా మార్చాలని ఖతార్ యూనివర్సిటీ నిర్ణయించడం ఆసక్తి రేపింది. దోహాలో మెస్సీతోపాటు అర్జెంటీనా స్ట్రైకర్ సెర్గియో ఆగెరో ఒకే హోటల్ రూమ్‌లో ఉన్నారు. మెస్సీ గౌరవానికి సూచకంగా ఇక నుంచి ఆ రూమ్‌ను ఎవరికీ ఇవ్వకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో మెస్సీకి సంబంధించిన వస్తువులతో ఓ చిన్న మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఒక న్యూస్ ఏజెన్సీకి వెల్లడించారు. ఈ మ్యూజియాన్ని విద్యార్థులు, టూరిస్టులు సందర్శించే అవకాశం కల్పించారు. "అర్జెంటీనా టీమ్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ బస చేసిన హోటల్ రూమ్‌ను అలాగే ఉంచుతాం. ఈ రూమ్‌కు కేవలం సందర్శకులకు మాత్రమే అవకాశం కల్పిస్తాం. ఆ హోటల్ రూమ్ ఇక భవిష్యత్తులో మరెవరికీ కేటాయించం. మెస్సీకి చెందిన వస్తువులు విద్యార్థులు, భవిష్యత్తు తరాలకు ఓ పాఠంగా నిలుస్తాయి. అతడు వరల్డ్‌కప్ సందర్భంగా సాధించిన ఘనతలేంటో వారికి తెలుస్తాయి" అని ఖతార్ యూనివర్సిటీ డైరెక్టర్ హిత్మి అల్ హిత్మి చెప్పారు. ఖతర్ వేదికగా జరిగిన ఫిపా వరల్డ్‌కప్ ముగిసి దాదాపు పది రోజులు కావొస్తోంది. డిసెంబర్ 18న జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన 17 ఏళ్ల కలను నెరవేర్చుకోవడంతో పాటు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను అందించాడు. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మెస్సీకి చివరిదని అంతా భావించారు. అయితే అర్జెంటీనా విజేతగా నిలిచిన తర్వాత మనుసు మార్చుకున్న మెస్సీ కొంతకాలం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అయితే అర్జెంటీనా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. మెస్సీ సేనకు ఘనస్వాగతం లభించింది. ఒపెన్ టాప్ బస్సులో రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లో తిరగాలని ప్రయత్నించినప్పటికి ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో ఆటగాళ్లను ప్రత్యేక హెలికాప్టర్లో తమ స్వస్థలాలకు తరలించారు. మారడోనా లిగసీని కంటిన్యూ చేస్తూ మళ్లీ 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు కప్ అందించిన మెస్సీ హీరోగా మారిపోయాడు. Here's a quick tour of La Albiceleste's base camp at Qatar University! The room where the Argentinian captain, Lionel Messi, stayed in during the World Cup will also be turned into a mini museum soon!#Qatar #ARG #Argentina #Qatar2022 #FIFAWorldCup #LaAlbiceleste #LionelMessi pic.twitter.com/0UsdkBvcdX — The Peninsula Qatar (@PeninsulaQatar) December 27, 2022 చదవండి: పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు -
పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు
ఖతర్ వేదికగా ఫిపా వరల్డ్‌కప్ ముగిసి దాదాపు పది రోజులు కావొస్తోంది. డిసెంబర్ 18న జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన 17 ఏళ్ల కలను నెరవేర్చుకోవడంతో పాటు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను అందించాడు. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మెస్సీకి చివరిదని అంతా భావించారు. అయితే అర్జెంటీనా విజేతగా నిలిచిన తర్వాత మనుసు మార్చుకున్న మెస్సీ కొంతకాలం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అయితే అర్జెంటీనా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. మెస్సీ సేనకు ఘనస్వాగతం లభించింది. ఒపెన్ టాప్ బస్సులో రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లో తిరగాలని ప్రయత్నించినప్పటికి ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో ఆటగాళ్లను ప్రత్యేక హెలికాప్టర్లో తమ స్వస్థలాలకు తరలించారు. మారడోనా లిగసీని కంటిన్యూ చేస్తూ మళ్లీ 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు కప్ అందించిన మెస్సీ హీరోగా మారిపోయాడు. అయితే పది రోజులయినా అతనిపై మోజు తగ్గలేదునుకుంటా అభిమానులకు. తాజాగా మెస్సీ తన కోడలు 15వ పుట్టినరోజు వేడుకలకని తన హోమ్టౌన్ నుంచి బయలుదేరాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మెస్సీని చుట్టుముట్టారు. దాదాపు అరగంట పాటు మెస్సీ కారును చుట్టుముట్టిన అభిమానులు అతనితో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే మెస్సీ కూడా వారితో దురుసుగా ప్రవర్తించకుండా కూల్‌గా సర్దిచెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మెస్సీ పారిస్ సెయింట్ జెర్మెన్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే వారం పీఎస్జీ క్లబ్లో మెస్సీ జాయిన్ అయ్యే అవకాశం ఉందని పీఎస్జీ హెడ్‌కోచ్ క్రిస్టోప్ గాల్టియర్ పేర్కొన్నాడు. ఫిపా వరల్డ్‌కప్ ఫైనల్ సందర్భంగా అర్జెంటీనాకు వణికించిన ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె సహా బ్రెజిల్ స్టార్ నెయ్మర్ కూడా పీఎస్జీలో ఉన్నారు. El que anda tranquilo por Rosario es Lionel Messi 😅 NUESTRO CAMPEÓN DEL MUNDO 😍🇦🇷🏆 pic.twitter.com/jJuC2ToeZ1 — TNT Sports Argentina (@TNTSportsAR) December 28, 2022 చదవండి: ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక -
ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవలే ఫిఫా వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ఆ అభిమానం మరింత రెట్టింపైంది. ఖతర్ వేదికగా జరిగిన సాకర్ సమరంలో ఎలాగైనా మెస్సీ కప్ గెలవాలని అర్జెంటీనా అభిమానులే కాదు విశ్వవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ బలంగా కోరుకున్నారు. అందుకు తగ్గట్టే మెస్సీ తన కలను నెరవేర్చుకోవడమే గాక అర్జెంటీనాకు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను అందించాడు. మరి అలాంటి మెస్సీని ఆరాధించని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. తాజాగా ఆ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని కూడా ఉన్నాడు.క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ తనకెంతో ఇష్టమైన ఆట అంటూ ధోని గతంలోనూ చాలాసార్లు చెప్పాడు. క్రికెటర్ కాకపోయుంటే గోల్‌కీపర్ అయ్యేవాడినని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ధోని. ఇక తండ్రిలాగే జీవాకు ఫుట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ ఆటను తండ్రితో కలిసి చూస్తుంటుంది. ఈ క్రమంలోనే మెస్సీపై అభిమానం పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే మెస్సీ.. తన అభిమాని అయిన ధోని కూతురు జీవా ధోనికి గిఫ్ట్ పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జీవాకు పంపించాడు. అభిమాన ఆటగాడి నుంచి అందిన కానుకను చూసుకుంటూ జీవా ధోని మురిసిపోయింది. ఆ జెర్సీ వేసుకుని తీసుకున్న ఫొటోను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఈ ఫొటోలో జెర్సీపై..'' పారా జివా(జీవా కోసం)'' అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది. View this post on Instagram A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) చదవండి: అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు.. -
మెస్సీ 'నల్లకోటు' వెనక్కి ఇవ్వాలంటూ రూ. 8.2 కోట్ల ఆఫర్
ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా నెగ్గిన సంగతి తెలిసిందే. జట్టును అన్నీ తానై నడిపించిన మెస్సీ ట్రోఫీ గెలవడంతో పాటు తన 17 ఏళ్ల కలను కూడా నెరవేర్చుకున్నాడు. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ ఏడు గోల్స్ చేయడమే గాక బెస్ట్ ఫుట్‌బాలర్‌గా గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఫిఫా టైటిల్ అందుకునే క్రమంలో మెస్సీ ఒక నల్లకోటు ధరించి వచ్చాడు. ఆ నల్లకోటును అరబ్ దేశాల్లో 'బిష్త్' అని పిలుస్తారు. ఎవరైనా గొప్ప పని సాధిస్తే కృతజ్ఞతగా వారిని గౌరవిస్తూ బిస్ట్ను అందిస్తారు. ఈ నేపథ్యంలోనే మెస్సీ ధరించిన బిష్త్(నల్లకోటు)ను ఖతర్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ అందించారు. ట్రోఫీ అందుకోవడానికి ముందు మెస్సీకి ఆ నల్లని కోటు తొడిగారు. ఆ నల్లని కోటు ధర అక్షరాలా 10 లక్షల డాలర్లు. మరి అంత విలువైన కోటును మెస్సీ బహుకరించింది మాత్రం ఒమన్‌కు చెందిన అహ్మద్ అల్ బర్వానీ అనే పార్లమెంట్ సభ్యుడు. తాజాగా మెస్సీ ధరించిన బిస్ట్ వెనక్కి ఇవ్వాలంటూ మరొక ట్వీట్ చేశాడు అహ్మద్ అల్ బర్వానీ. ఆ ట్వీట్లో ఏముందంటే.. ''ఖతర్ సుల్తాన్ తరఫున వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గినందుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. బంగారం, నలుపు రంగులో ఉన్న అరబిక్ బిష్త్ శౌర్యానికి, తెలివితేటలకు ప్రతీక. అయితే మెస్సీ ఇప్పుడు దానిని తిరిగి ఇస్తే అతనికి నేను మిలియన్ డాలర్(రూ. 8.2 కోట్లు) ఆఫర్‌గా ఇస్తాను. ఎందుకంటే బిష్త్ అనేది మా సంప్రదాయానికి ప్రతీక. మెస్సీ సాధించిన గొప్పతనానికి గుర్తుగా ఆ బిష్త్‌ను తొడిగాం. మా దేశంలో ఉంటేనే ఆ బిష్త్‌కు గౌరవం ఉంటుంది. అందుకే మెస్సీ బిష్త్ తిరిగి ఇచ్చేయాలనే ఈ ఆఫర్ ఇస్తున్నా అంటూ తెలిపాడు. మొత్తానికి లియోనల్ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ అందుకోవడం ఏమోగానీ ఎటునుంచి చూసినా అతనికి డబ్బులు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. నిజంగా మెస్సీ అదృష్టవంతుడు. ఇప్పుడు తాను ధరించిన బిష్త్(నల్లకోటు)కు కూడా అంత ధర ఆఫర్ చేయడం మాములు విషయం కాదనే చెప్పొచ్చు. صديقي ميسي.. من #سلطنة_عمان أبارك لكم فوزكم بـ #كأس_العالم_قطر_2022 أبهرني الأمير @TamimBinHamad وهو يُلبسك #البشت_العربي ،رمز الشهامة والحكمة.#ميسي أعرض عليك مليون دولار أميركي نظير أن تعطيني ذلك #البشت#Messi𓃵 I'm offering you a million $ to give me that bisht@TeamMessi pic.twitter.com/45BlVdl6Fh — أحـمَـد الـبـَروانـي (@AhmedSAlbarwani) December 20, 2022 చదవండి: మెస్సీ ధరించిన నల్లకోటు ధర ఎంతంటే? -
మెస్సీ ధరించిన నల్లకోటు ధర ఎంతంటే?
ఫిఫా వరల్డ్ కప్ ముగిసి వారం కావొస్తున్నా.. ఆ కిక్ నుంచి మాత్రం ఫుట్‌బాల్ అభిమానులు బయటపడలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ. జట్టును అన్నీ తానై నడిపించడమే గాక కీలకమైన ఫైనల్లో రెండు గోల్స్ చేసి అర్జెంటీనాను మూడోసారి విశ్వవిజేతగా నిలబెట్టాడు. పనిలో పనిగా ఫిఫా టైటిల్ అందుకోవాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. ఆ క్షణం నుంచి మెస్సీ మాయలో పడిపోయిన అభిమానులు అతని జపమే చేస్తున్నారు. ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన మెస్సీకి ఘనస్వాగతం లభించింది. ఇసుక వేస్తే రాలనంతో జనంతో రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వీధులు నిండిపోయాయి. ముందుకు కదల్లేని పరిస్థితిలో మెస్సీ బృంధాన్ని హెలికాప్టర్ సాయంతో వారి స్వస్థలాలకు తరలించాల్సి వచ్చింది. అలా మెస్సీకి తన స్వస్థలంలోనూ జనం నీరాజనం పట్టారు. ఇక ఫైనల్లో విజయం తర్వాత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ నల్లకోటు ధరించి ఫిఫా టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. మెస్సీ ధరించిన నల్లకోటు సెలబ్రేషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ కోటు ధర తెలిస్తే షాక్ తినడం గ్యారంటీ. అంతలా ఆ కోటులో ఏముందనుకుంటున్నారా. బంగారు వర్ణంతో తయారు చేయడమే ఆ కోటు స్పెషాలిటీ. ట్రోఫీ అందుకునే ముందు ఖతర్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ మెస్సీకి ఆ నల్లని కోటు తొడిగారు. ఆ నల్లని కోటు ధర అక్షరాలా 10 లక్షల డాలర్లు. మరి అంత విలువైన కోటును మెస్సీకి ఎవరు బహూకరించారో తెలుసా.. ఒమన్‌కు చెందిన అహ్మద్ అల్ బర్వానీ అనే పార్లమెంట్ సభ్యుడు. ''ఖతర్ సుల్తాన్ తరఫున వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గినందుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. బంగారం, నలుపు రంగులో ఉన్న అరబిక్ బిష్త్ శౌర్యానికి, తెలివితేటలకు ప్రతీక. అందుకు నీకు 10 లక్షల డాలర్లు ఇస్తున్నాను'' అంటూ అహ్మద్ ట్వీట్ చేశాడు. అరబ్ దేశాల్లో మగవాళ్లు పెళ్లిళ్లు, మతపరమైన పండుగల వేళ అలాంటి కోటు వేసుకుంటారు. ఇక హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది. దాంతో, 32 ఏళ్ల తర్వాత అర్జెంటీనా మళ్లీ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. 2014 ఫైనల్లో మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా జర్మనీపై ఓడిపోవడంతో కప్ చేజారింది. కానీ ఈ సారి మాత్రం ఆ చాన్స్‌ను మిస్ చేసుకోని మెస్సీ ఫిఫా టైటిల్‌ను ఒడిసిపట్టాడు. చదవండి: 'మానసిక వేదనకు గురయ్యా'.. సొంత బోర్డుపై ఆగ్రహం మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? -
Lionel Messi: అర్జెంటీనా బ్యాంక్ సంచలన నిర్ణయం..?
అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. 36 ఏళ్ల తర్వాత తమ దేశానికి ఫుట్‌బాల్ ప్రపంచకప్ అందించిన లియోనల్ మెస్సీ (అర్జెంటీనా కెప్టెన్) ఫోటోను తమ దేశ 1000 పెసో (అర్జెంటీనా కరెన్సీ) నోట్లపై ముద్రించేందుకు ప్రపోజల్ పంపిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రముఖ దినపత్రిక (ఎల్ ఫినాన్సియరో) ఓ ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించింది. ఫిఫా వరల్డ్‌కప్ 2022 విజయానికి గుర్తుగా అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫ్రాన్స్‌తో ఫైనల్ మ్యాచ్‌కు ముందే బ్యాంక్ అధికారులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టినట్లు వివరించింది. అయితే, ఈ ప్రచారం అవాస్తవమని ఆ దేశ ఇతర దినపత్రికలు కొట్టిపారేశాయి. కాగా, అర్జెంటీనా 1978లో తొలిసారి వరల్డ్‌కప్ గెలిచినప్పుడు ఆ దేశ ప్రభుత్వం నాటి ఫుట్‌బాల్ ఆటగాళ్లతో కూడిన కొన్ని స్మారక నాణేలను విడుదల చేసింది. తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అర్జెంటీనా ప్రతిపాదనతో మెస్సీ ఫోటోను కూడా ఆ దేశ కరెన్సీపై ముద్రించాలని విశ్వవ్యాప్తంగా ఉన్న మెస్సీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కాగా, డిసెంబర్ 18న ఫ్రాన్స్‌తో జరిగిన ఫిఫా ప్రపంచకప్-2022 ఫైనల్లో అర్జెంటీనా.. ఫ్రాన్స్‌పై 4-2 గోల్స్ తేడాతో జయకేతనం ఎగురవేసి, మూడోసారి జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మెస్సీ 2 గోల్స్ చేసి అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
Lionel Messi: తగ్గేదేలే.. మరో ‘ప్రపంచ రికార్డు’ బద్దలు కొట్టిన మెస్సీ!
FIFA World Cup 2022- Lionel Messi: ఒక్క అడుగు.. ఆ ఒకే ఒక్క అడుగు పడితే.. ఆ క్రీడాకారుడి జీవితం పరిపూర్ణమైనట్లే! తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరినట్లే! దేశాలకు అతీతంగా ప్రపంచమంతా అతడి గెలుపును కాంక్షించింది.. అందరి ఆశలు ఫలించాయి.. ఎట్టకేలకు ఫైనల్లో తమ జట్టును విజేతగా నిలిపి అతడు ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాడు! ఈ అపురూప దృశ్యాలను ఇన్‌స్టాలో పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘ఎన్నో ఏళ్లుగా నేను కంటున్న కల నెరవేరింది.. ఈ గెలుపు కోసం నేనెంతగానో తపించి పోయాను.. ఇప్పటికీ దీనిని నేను నమ్మలేకపోతున్నాను.. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, ప్రతి ఒక్క అభిమానికి పేరుపేరునా ధన్యవాదాలు. నేను ఇది సాధించగలనని నమ్మిన వాళ్లకు థాంక్స్. అర్జెంటీనా వాళ్లు ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ ఉండదని మరోసారి నిరూపితమైంది. జట్టు సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది. అర్జెంటీనా కల ఇలా నెరవేరింది’’ అని ఉద్వేగపూరిత నోట్ రాశాడు. కోట్లాది మంది ఈ పోస్టును లైక్ చేశారు. ఇప్పటి వరకు 68.8 మిలియన్లకు పైగా లైకులు కొట్టారు. 1.8 మిలియన్లకు పైగా కామెంట్లు వచ్చాయి. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ది ఎగ్ రికార్డు బద్దలు ఈ క్రమంలో అతడి ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ‘ది ఎగ్’ పేరిట ఉన్న ఉన్న రికార్డును బద్దలు కొడుతూ.. అతడు చేసిన పోస్టు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైకులు పొందిన పోస్ట్‌గా నిలిచింది. అవును.. ఫుట్‌బాల్ స్టార్, రికార్డుల రారాజు లియోనల్ మెస్సీనే ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. 2019 జనవరి 4న పోస్ట్ చేసిన ‘ది ఎగ్’కు ఇన్‌స్టాలో ఇప్పటి వరకు 56 మిలియన్ లైకులు రాగా.. మెస్సీ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో మరోసారి అతడి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మెస్సీ మాయ.. ప్రపంచమంతా సంబరం ఫిఫా ప్రపంచకప్- 2022ను మెస్సీ వరల్డ్‌కప్‌గా భావించిన తరుణంలో ఫ్రాన్స్‌తో ఆఖరి పోరులో అతడు మరోసారి తన మ్యాజిక్‌తో మెరిసిన విషయం తెలిసిందే. ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అర్జెంటీనాకు మూడో వరల్డ్‌కప్‌ను అందించాడు. ఈ ఈవెంట్లో మొత్తంగా ఏడు గోల్స్‌తో పాటు మూడు అసిస్ట్‌లు చేసిన మెస్సీ గోల్డెన్ బాల్ అవార్డును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా మెస్సీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఇక అతడి స్వదేశం అర్జెంటీనాలో సంబరాలు అంబరాన్నంటాయి. సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. చదవండి: Ajinkya Rahane: డబుల్ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ.. Lionel Messi: వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) -
అభిమాన సంద్రం మధ్య... అర్జెంటీనా జట్టు సంబరాలు
బ్యూనస్ ఎయిర్స్: ‘థ్యాంక్యూ చాంపియన్స్’... అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో మంగళవారం ప్రతీ రోడ్డుపై, ప్రతీ వీధిలో కనిపించిన బ్యానర్లు ఇవి. విశ్వవిజేతగా నిలిచిన తర్వాత స్వదేశం తిరిగొచ్చిన ప్రపంచకప్ హీరోలు అక్కడి ఫ్యాన్స్ వీరాభిమానంలో తడిసి ముద్దయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు విమానం దిగినప్పటి నుంచి రోజంతా ఆటగాళ్లు, అభిమానుల సంబరాలకు విరామం లేకుండా పోయింది. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా వరల్డ్‌కప్ గెలుచుకున్న ఘనతను దేశంలో ప్రతీ ఒక్కరూ వేడుకగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం ఆ దేశంలో జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. దాంతో సంబరాల ఆనందం రెట్టింపైంది. ఓపెన్ టాప్ బస్సులో ఆటగాళ్లంతా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి మొత్తం ట్రోఫీని మెస్సీ తన చేతుల్లో ఉంచుకొని ప్రదర్శిస్తుండగా, సహచరులు నృత్యాలతో ఉత్సాహపరిచారు. భారీ సంఖ్య లో ఉన్న అభిమానుల మధ్య నుంచి ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టు అధికారిక గీతంగా మారిపోయిన ముకాకోస్... ముకాకోస్ను ఆలాపిస్తూ ఫ్యాన్స్ మరింత జోష్ నింపారు. ముందుగా విమానాశ్ర యం వద్ద, ఆ తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య అధికారిక కార్యాలయం వద్ద, ఆపై లక్షలాది జనం మధ్య ప్రతిష్టాత్మక ‘ఒబెలిస్క్ స్క్వేర్’ వద్ద అంబరాన్నంటేలా ఈ సంబరాలు కొనసాగాయి. చదవండి: Lionel Messi: వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకున్న మెస్సీ.. వైరల్ ఫోటో -
వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకున్న మెస్సీ.. వైరల్ ఫోటో
ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలవాలన్న తన చిరకాల కోరికను ఆఖరి ప్రయత్నంలో నెరవేర్చుకోవడంతో పాటు అర్జెంటీనాను మూడోసారి జగజ్జేతగా నిలిపిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT), అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఫిఫా వరల్డ్‌కప్-2022 గెలిచాక ఖతార్ నుంచి జట్టుతో పాటు స్వదేశానికి చేరుకున్న మెస్సీ.. తన 17 ఏళ్ల కెరీర్లో వరల్డ్‌కప్ గెలుపుకున్న ప్రాధాన్యత ఏంటో ప్రపంచానికి మరోసారి రుజువు చేశాడు. వరల్డ్‌కప్ గెలిచి రెండు రోజు పూర్తయ్యాక కూడా ఆ మూడ్‌లోనుంచి ఇంకా బయటికి రాని మెస్సీ.. పడుకున్నప్పుడు కూడా ట్రోఫీని తన పక్కలోనే పెట్టుకుని వరల్డ్‌కప్ టైటిల్‌పై తనకున్న మమకారాన్ని చాటుకున్నాడు. మెస్సీ.. వరల్డ్‌కప్ ట్రోఫీపై చేయి వేసుకుని పడుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ ఫోటోను మెస్సీ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పిక్‌ను చూసిన మెస్సీ అభిమానులు.. తమ ఆరాధ్య ఫుట్‌బాలర్ వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకోవడాన్ని చూసి మురిసిపోతున్నారు. దిగ్గజ ఆటగాడికి ఆట పట్ల ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. మెస్సీ.. వరల్డ్‌కప్ ట్రోఫీని తన బిడ్డల కంటే అధికంగా ప్రేమిస్తున్నాడనడానికి ఇది నిదర్శమని అంటున్నారు. ఈ పోస్ట్ 3 కోట్లకు పైగా లైక్స్ సాధించడం విశేషం. కాగా, డిసెంబర్ 18న జరిగిన ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్లో అర్జెంటీనా 4-2 గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మెస్సీ 2 గోల్స్ చేయడంతో పాటు మరో గోల్స్ సాధించడంలో డి మారియాకు తోడ్పడ్డారు. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం మెస్సీ ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్ వరల్డ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్‌కు రికార్డు స్థాయిలో 6 కోట్లకు పైగా లైక్స్ వచ్చాయి. గతంలో ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్ వచ్చిన రికార్డు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉండేది. తాజాగా మెస్సీ.. రొనాల్డో రికార్డును బద్దలు కొట్టాడు. -
మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా?
ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో చిత్తు చేసిన అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి వరల్డ్‌కప్‌ను ఎగురేసుకుపోయింది. అర్జెంటీనా కప్పు కొట్టగానే స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో ఊగిపోయింది. అయితే ఈ గ్యాప్‌లోనే ఒక యువతి నగ్న ప్రదర్శన చేయడం హల్చల్గా మారింది. అయితే మెస్సీ మాయలో దీనిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ లేకుంటే పెద్ద వివాదం అయ్యుండేది. విషయంలోకి వెళితే.. ఫ్రాన్స్‌పై విజయం సాధించాకా అర్జెంటీనా అభిమానులు దేశ జెండాలతో సంబరాలు చేసుకున్నారు. ఇంతలో ఒక అర్జెంటీనా అభిమానుల గుంపులో ఒక యువతి టాప్‌లెస్‌గా దర్శనమిచ్చింది. జెండాల మధ్యలో నిలబడిన యువతి చాతి భాగం కనిపించేలా నగ్న ప్రదర్శన చేసింది. ఆమె చర్యతో ఆశ్చర్యపోయిన మిగతావారు.. ఇక్కడే ఉంటే ఆమె ప్రాణాలకు ప్రమాదమని.. ఎస్కార్ట్ సాయంతో అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఫైనల్ ముగిసిన ఒకరోజు తర్వాత ఈ ఫోటోలు బయటికి రావడంతో పెద్దగా దుమారం జరగలేదు. అయితే యువతి చర్యను తప్పుబట్టిన ఖతర్ అధికారులు ఆమె ఎక్కడ ఉన్నా నోటీసులు ఇస్తామని.. దానికి బదులు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. మెస్సీ బృందం గెలిచిన సంతోషంలో పొరపాటున అలా చేసిందో లేక కావాలనో తెలియదు కానీ తన అందాల ప్రదర్శనతో ఆమె పక్కన నిల్చున్న వారి మతులు మాత్రం పోగొట్టింది. చదవండి: వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె -
వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ సాధించానన్న ఆనందంలో మునిగి తేలుతున్నాడు. మెస్సీ సంతోషం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో గెలిచిన అర్జెంటీనా టైటిల్ విజేతగా నిలిచింది. 16 ఏళ్ల నిరీక్షణ.. 36 ఏళ్ల అర్జెంటీనా కలను తీర్చాడు కాబట్టే మెస్సీ అంత సంతోషంగా ఉన్నాడు. ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా తర్వాత ఆ లిగసీని కంటిన్యూ చేస్తూ ఎట్టకేలకు అర్జెంటీనాకు మూడో వరల్డ్‌కప్‌ను అందించాడు. ఈ వరల్డ్‌కప్‌లో అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌తో పాటు మూడు అసిస్ట్‌లు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా గోల్డెన్ బాల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలోనే మెస్సీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సీ 400 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించించాడు. దీంతో క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీగా మెస్సీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక రొనాల్డో 517 మిలియన్ ఫాలోవర్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. అంతేకాదు 500 మిలియన్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన తొలి వ్యక్తిగా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొత్త చరిత్ర సృష్టించాడు. View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) చదవండి: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె నిరీక్షణ ముగిసింది.. మెస్సీ సాధించాడు -
అర్జెంటీనా సారథి మెస్సీ అందమైన కుటుంబం (ఫొటోలు)
-
వామ్మో.. లియోనల్ మెస్సీ ఆస్తుల చిట్టా వింటే ఆశ్చర్యపోవాల్సిందే!
మూడున్నర దశాబ్ధాల అర్జెంటీనా నిరీక్షణ ఫలించింది. ఆదివారం అంత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 4-2 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. జగజ్జేతగా మెస్సీ బృందం నిలిచింది. అలాంటి ఫుట్‌బాల్ మైదానంలో మెస్సీ కొదమ సింహంలా పోటీ పడుతుంటే స్టేడియంలో ప్రేక్షకులే కాదు, ప్రపంచం మొత్తాన్ని ఉగిపోయేలా చేసింది. అలాంటి ఫుట్‌బాల్ లెజెండ్‌లో వే(ఆ)టగాడే కాదు ఓ మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు. ఫోర్బ్స్ కథనం ప్రకారం.. ►మెస్సీ గతేడాది ఆశ్చర్యంగా 75 మిలియన్లు సంపాదించాడు. ఈ సంపాదన భూమ్మిద ఉన్న ఇతర ఆటగాళ్ల కంటే ఎక్కువ ►ఫుట్ బాల్ టీమ్ పారిస్ సెయింట్-జర్మైన్ ఎఫ్‌సీ ఇచ్చే జీతం మాత్రమే సంవత్సరానికి 35 మిలియన్లు. అంటే మెస్సీ వారానికి 738,000 డాలర్లు , రోజుకు 105,000 , గంటకు 8,790 సంపాదిస్తారు. ►గత వేసవిలో అర్జెంటీనా ఫ్రెంచ్ జట్టు కోసం సైన్ చేసిన మెస్సీ ఏకంగా 25 మిలియన్లు సంపాదించారు. రోజర్ ఫెదర్తో సమానంగా ►గతేడాది మెస్సీ ఆఫ్ ఫీల్డ్ సంపాదన 55 మిలియన్లు ఉండగా..టెన్నిస్ ఐకాన్ రోజర్ ఫెదరర్, ఎన్బీఏ సూపర్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ మాత్రమే ఎక్కువ సంపాదించిన వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ►క్రిప్టోకరెన్సీ ఫ్యాన్ టోకెన్ ప్లాట్‌ఫారమ్ సోషియోస్తో సంవత్సరానికి 20 మిలియన్ల భాగస్వామ్యంతో పాటు, 35 ఏళ్ల ఎండార్స్మెంట్ పోర్ట్‌ఫోలియోలో అడిడాస్, బడ్వైజర్,పెప్సికోతో ఒప్పందాలు ఉన్నాయి. ►గత జూన్‌లో, హార్డ్ రాక్ ఇంటర్నేషనల్ మొట్టమొదటి అథ్లెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా అవతరించాడు. 1 బిలియన్ కంటే ఎక్కువే ఫోర్బ్స్ ప్రకారం, మెస్సీ ఆటగాడిగా, ఇతర బిజినెస్‌లలో రాణిస్తూ 1.15 బిలియన్ల కంటే ఎక్కువ సంపాదించారు. ప్రస్తుతం లెబ్రాన్ జేమ్స్, క్రిస్టియానో రొనాల్డో, టైగర్ వుడ్స్ మాత్రమే సంపాదనలో ముందంజలో ఉన్నారు. పైన పేర్కొన్న వారి కంటే రోజర్ ఫెదరర్, ఫ్లాయిడ్ మేవెదర్ మాత్రమే కెరీర్ సంపాదనలో 1 బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపాదించారు. కార్లంటే మహా ఇష్టం మెస్సీ సంపాదనలో సగ భాగం కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు మెస్సీ వద్ద 2 మిలియన్ల ధర పలికే పగని జోండా ట్రైకలర్, ఫెరారీ ఎఫ్4 30 స్పైడర్, డాడ్జ్ ఛార్జర్ ఎస్ఆర్టీ8, మసెరటి గ్రాన్ టురిస్మో వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. 2016 అర్జెంటీనాలో 37 మిలియన్లకు 1957 ఫెరారీ 335 స్పోర్ట్ స్పైడర్ స్కాగ్లియెట్టి అనే ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు పుకారు వచ్చింది. అయితే, ఇదే నా కొత్త కారు అంటూ బొమ్మ కారును పట్టుకొని ఆ పుకార్లకు చెక్ పెట్టారు. విలాసవంత మైన భవనాలు మెస్సీ ఆస్తులలో అత్యంత విలాసవంతమైనది బార్సిలోనా శివార్లలో 7 మిలియన్ల భవనం. నో-ఫ్లై జోన్ సబర్బ్‌లో ఉన్న భవనంలో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ జిమ్, థియేటర్, స్పా ఉన్నాయి. ఫుట్‌బాల్ పిచ్ కూడా మెస్సీకి ఇంద్ర భవనాన్ని తలపించాలే ఎకో-హౌస్ ఉంది. అర్జెంటీనాలోని తన సొంత పట్టణం రోసారియోలో ఒక భవనం, ఫ్లోరిడాలోని సెయింట్ ఐల్స్ బీచ్‌లోని ఒక విలాసవంతమైన కండోమినియంలు ఉన్నాయి. ఇందుకోసం గతేడాది 7.3 మిలియన్లు చెల్లించాడు. 2017 నుండి మెజెస్టిక్ హోటల్ గ్రూప్ నిర్వహించే ఇబిజా, మజోర్కా, బార్సిలోనాలో రిసార్ట్‌లతో పాటు , ఎంఐఎం పేరుతో ఉన్న హోటల్ చైన్లు సైతం మెస్సీకి చెందినవే. 2021లో మెస్సీ వింటర్ సీజన్లో విడిది కోసం అరన్ వ్యాలీలో పైరినీస్ నడిబొడ్డున రిసార్ట్‌ను ప్రారంభించారు. ఫోర్బ్స్ ప్రకారం..ఫోర్ స్టార్ హోటల్లో 141 గదులు ఉన్నాయి. స్పా, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్, మౌంటెన్ గైడ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. బాల్కనీ పెద్దగా ఉందని మెస్సీ 2017లో 35 మిలియన్లు పెట్టి ఓ భవనాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ భవనంలో బాల్కనీ పెద్దగా ఉందని.. మొత్తాన్ని కూల్చేయించారు. కారణంగా బాల్కనీలను తీసివేయడానికి, తగ్గించడానికి ఏదైనా ప్రయత్నం చేసినా హోటల్ కూలిపోయే అవకాశం ఉంది. అందుకే ఆ సమస్యకు పరిష్కారం చూపించలేక మొత్తం పడగొట్టాల్సి వచ్చింది 15 మిలియన్ల ప్రైవేట్ జెట్ మెస్సీకి గల్ఫ్‌స్ట్రీమ్ వీ అనే ప్రైవేట్ ఉంది. అందులో రెండు కిచెన్లు, బాత్రూమ్లు ఉన్నాయి. గరిష్టంగా పదహారు మంది ప్రయాణికులు సేద తీరే సౌకర్యాలు ఉన్నాయి. దానంలో కలియుగ కర్ణుడు 2007లో యునిసెఫ్ భాగస్వామ్యంతో లియోనెల్ మెస్సీ ఫౌండేషన్ ప్రారంభమైంది.ఆ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బలహీనంగా ఉన్న పిల్లలకు సహాయం చేస్తుంది. యునిసెఫ్ ప్రకారం..2017లో మెస్సీ సిరియాలో 1,600 మంది అనాథ పిల్లలకు తరగతి గదులను నిర్మించడంలో ఫౌండేషన్‌కు సహాయం చేయడానికి తన సొంత డబ్బును విరాళంగా ఇచ్చారు. 2019లో కెన్యా పౌరులకు ఆహారం, నీటిని అందించడానికి ఫౌండేషన్ $218,000 విరాళంగా అందించింది. చివరిగా కండోమినియం అంటే? అమ్మకం కోసం ఒక పెద్ద ఆస్తిని ఒకే యూనిట్లుగా విభజించినప్పుడు దానిని కండోమినియం కాంప్లెక్స్‌గా సూచిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సముద్రమంత అభిమానం.. కడలి అంచుల్లో మెస్సీ కటౌట్
ఫుట్‌బాల్ లెజెండ్, గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్ (GOAT), అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీపై అభిమానం ఎల్లలు దాటుతోంది. విశ్వం నలుమూలల్లో ఉన్న ఫుట్‌బాల్ ఫ్యాన్స్ మెస్సీ నామస్మరణతో భూమ్యాకాశాలను మార్మోగిస్తున్నారు. మెస్సీ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అయితే భూమి, ఆకాశాలతో పాటు నడి సంద్రంలోనూ తమ ఆరాధ్య ఫుట్‌బాలర్‌పై అభిమానాన్ని చాటుకుంటున్నారు. కేరళకు చెందిన మెస్సీ వీరాభిమానులు.. ఫిఫా వరల్డ్‌కప్-2022లో అర్జెంటీనా ఫైనల్‌కు చేరితే మెస్సీ కటౌట్‌ను సముద్ర గర్భంలో ప్రతిష్టింపజేస్తామని శపథం చేసి, ఆ ప్రకారమే చేశారు. మెస్సీకి చెందిన భారీ కటౌట్‌ను వారు పడవలో తీసుకెళ్లి అరేబియా సముద్రంలో 100 అడుగుల లోతులో దిబ్బల మధ్య ప్రతిష్టింపజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. View this post on Instagram A post shared by Mohammed Swadikh (@lakshadweep_vlogger_) కాగా, సెమీస్‌లో క్రొయేషియాపై 3-0 గోల్స్ తేడాతో జయకేతనం ఎగురవేసి దర్జాగా ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా.. నిన్న (డిసెంబర్ 18) జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను 4-2 గోల్స్ తేడాతో ఓడించి జగజ్జేతగా ఆవిర్భవించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో నిర్ణీత సమయంతో పాటు 30 నిమిషాల అదనపు సమయం తర్వాత కూడా ఫలితం తేలకపోవడంతో (3-3) మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. షూటౌట్లో మెస్సీ సేన 4 గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ 2 గోల్స్‌కే పరిమితం కావడంతో అర్జెంటీనా మూడోసారి వరల్డ్ ఛాంపియన్‌గా (1978, 1986, 2022) అవతరించింది. నిర్ణీత సమయంలో ఆర్జెంటీనా తరఫున మెస్సీ 2 గోల్స్, ఏంజెల్ డి మారియ ఒక గోల్ సాధించగా.. ఫ్రాన్స్ తరఫున కైలియన్ ఎంబపే హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. -
మెస్సీ, సచిన్.. నమ్మశక్యం కాని రీతిలో ఒకేలా..!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్ లియోనల్ మెస్సీ వరల్డ్‌కప్ జర్నీ నమ్మశక్యం కాని రీతిలో ఒకేలా కొనసాగడం క్రీడాభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ కెరీర్లో తొలి వరల్డ్‌కప్ సాధించే క్రమంలో చాలా విషయాల్లో దగ్గరి పోలికలు (దాదాపు ఒకేలా) కలిగి ఉన్నారు. Sports has paid its due to the GOATS 🐐#CricketTwitter #fifaworldcup2022 pic.twitter.com/vQJ3AguTf3 — Sportskeeda (@Sportskeeda) December 18, 2022 10 నంబర్ జెర్సీ ధరించే ఈ ఇద్దరు లెజెండ్స్.. తమ కెరీర్లో చివరి వరల్డ్‌కప్ ఆడుతున్నామని ముందే ప్రకటించి మరీ తమ జట్లను జగజ్జేతలుగా నిలిపారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)గా కీర్తించబడే సచిన్, మెస్సీ వారివారి వరల్డ్‌కప్ జర్నీలో 8 ఏళ్ల క్రితం చివరిసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. #OnThisDay In 23/3/2003 Australia Defeated India in WC final 💔 Sachin Tendulkar Received M.O.S Award for his 673 runs & 2 wickets In 2003WC Most runs in a WC tournament 673 - Sachin (2003)* 659 - Hayden (2007) 648 - Rohit (2019) 647 - Warner (2019) pic.twitter.com/7kj56s1Rod — 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) March 23, 2022 సచిన్ ప్రాతినిధ్యం వహించిన టీమిండియా 2003 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ దాకా చేరి, తుది సమరంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సరిగ్గా 8 సంవత్సరాల తర్వాత టీమిండియా 2011లో వన్డే వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. మెస్సీ విషయంలో ఇలానే జరిగింది. One of my most distinct memories from reporting on the 2014 World Cup was Messi’s dejected face staring at the trophy after losing the final to Germany. Good to see him finally be able to lift it at his last tournament pic.twitter.com/8tLoDyTQOp — Citizen of Paldea (@westcoastrepz) December 18, 2022 2014 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో మెస్సీ ప్రాతినిధ్యం వహించిన అర్జెంటీనా.. జర్మనీ చేతిలో ఓటమిపాలై ఛాంపియన్‌షిప్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది. అయితే సరిగ్గా 8 ఏళ్ల తర్వాత సచిన్ విషయంలో జరిగినట్టే మెస్సీ విషయంలోనూ జరిగింది. 2022 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జగజ్జేతగా అవతరించింది. June 25, 1983: The iconic image of Kapil Dev holding the World Cup Trophy at Lord’s is a watershed moment in Indian cricket history. It changed cricket in India. This win inspired the next generation to achieve the impossible & dream BIG pic.twitter.com/hoyEobpuwL — Mohammad Kaif (@MohammadKaif) June 25, 2020 #WorldCupFinal with Argentina playing are so exhilarating because - they are vulnerable! Remember 1986... pic.twitter.com/Vy6dJ5zyc3 — Dibyendu Nandi (@ydnad0) December 19, 2022 యాదృచ్చికంగా ఈ ఇద్దరు ప్రాతినిధ్యం వహించే జట్లు చివరిసారిగా వరల్డ్‌కప్‌ను 1980ల్లోనే నెగ్గాయి. లెజెండ్ కపిల్ దేవ్ సారధ్యంలో భారత్ 1983లో వన్డే వరల్డ్‌కప్ కైవసం చేసుకోగా.. 80వ దశకంలోనే (1986లో) ఫుట్‌బాల్ మాంత్రికుడు డీగో మారడోనా నేతృత్వంలో అర్జెంటీనా వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. 30 Mar 2011 - India beat their arch-rivals Pakistan in semifinal of 2011 WC. Sachin Tendulkar's 85 proved to be a match-winning knock for India. He was awarded player of the match for 3rd time against Pakistan in World Cup tournament. He is always Man of big tournaments 🙏🙏 pic.twitter.com/O8d6WtQjHO — Sachinist (@Sachinist) March 30, 2021 ఇవే కాక సచిన్, మెస్సీ తమతమ వరల్డ్‌కప్ జర్నీలను సంబంధించి మరిన్ని విషయాల్లో పోలికలు కలిగి ఉన్నారు. సచిన్ 2011 వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు (9 మ్యాచ్‌ల్లో 482 పరుగులు) చేసిన భారత ఆటగాడిగా నిలువగా.. మెస్సీ 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ (7 గోల్స్) సాధించిన అర్జెంటీనా ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. Messi wins man of the match against Croatia. (Yeah he's won it again... 4th this World Cup, he's insane.) pic.twitter.com/1suL2E1K9X — K.Shah (@kshitijshah23) December 13, 2022 అలాగే ఈ ఇద్దరు దిగ్గజాలు తమ ప్రపంచకప్ ప్రయాణంలో సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. సచిన్.. పాకిస్తాన్‌తో జరిగిన సెమీస్‌లో 85 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ఈ అవార్డుకు ఎంపిక కాగా.. క్రొయేషియాతో జరిగిన సెమీస్‌లో మెస్సీ ఒక గోల్ సాధించడంతో పాటు మరో రెండు గోల్స్ కొట్టడంలో జూలియన్ అల్వారెజ్‌కు సహకరించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. Leo Messi. The living legend just secured his legacy. 1,003 games. 793 goals. 7 Ballon d’Or wins. 1 World Cup. Messi just completed the set. If you’re still debating who TBE is, it’s time to rest your case. He is him. Game over. pic.twitter.com/Lsfvep2bef — VERSUS (@vsrsus) December 18, 2022 వీటితో పాటు తమ చిరకాల కోరిక నెరవేరిన అనంతరం ఈ ఇద్దరు దిగ్గజాలను సహచర సభ్యులు యాదృచ్చికంగా ఒకేలా సత్కరించారు. ప్రపంచకప్ నెగ్గిన అనంతరం ఈ ఇద్దరిని సహచరులు భుజాలపై ఎక్కించుకుని స్టేడియం మొత్తం ఊరేగించారు. Sachin Tendulkar top-scored for 🇮🇳 with 482 runs in their victorious 2011 @cricketworldcup campaign 🏆 Vote to help his ‘Carried on the shoulders of a nation’ moment enter the final round of Laureus Sporting Moment: https://t.co/tqBHY3AyDB#OneFamily @sachin_rt pic.twitter.com/nD3OGSDuF2 — Mumbai Indians (@mipaltan) February 1, 2020 Parallels between FIFA WC 2022 and Cricket World Cup 2011. GOATs (?) of respective sports without the World Cup trying to win it in the last try and doing it. They both lost in the final 8 years before. 2003 vs Australia for Sachin & 2014 vs Germany for Messi pic.twitter.com/yJ4oqf8ceq — NYY (@adi_nyy) December 18, 2022 -
ఎట్టకేలకు సాధించాం! మెస్సీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పోస్ట్ వైరల్
FIFA WC 2022 Winner Lionel Messi Comments: ‘‘ఈ టైటిల్‌తో నా కెరీర్ ముగించాలని ఆశపడ్డాను. ఇంతకు మించి నేను కోరుకునేది ఏదీ లేదు. ఇలా ట్రోఫీ సాధించి కెరీర్‌కు వీడ్కోలు పలకడం చాలా బాగుంటుంది కదా! దీని తర్వాత సాధించాల్సింది ఇంకేముంది? కోపా అమెరికా.. ఇప్పుడు వరల్డ్‌కప్.. కెరీర్ చరమాంకంలో నాకు లభించాయి. సాకర్ అంటే నాకు పిచ్చి ప్రేమ. జాతీయ జట్టుకు ఆడటాన్ని నేను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తాను. వరల్డ్ చాంపియన్‌గా మరో రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా’’ అంటూ అర్జెంటీనా స్టార్, ప్రపంచకప్ విజేత లియోనల్ మెస్సీ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను ఇప్పుడే రిటైర్ కాబోవడం లేదని స్పష్టం చేశాడు. కాగా ఖతర్ వేదికగా ఆదివారం జరిగిన ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో మేజర్ టైటిల్‌తో కెరీర్ ముగించాలనుకున్న మెస్సీ ఆశ నెరవేరినట్లయింది. అయితే, తమ జట్టు ఫైనల్ చేరిన సందర్భంగా అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ ఆడబోతున్నానని మెస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, తాజా వ్యాఖ్యలతో తాను మరికొంత కాలం ఆడతానని అతడు స్పష్టం చేశాడు. ఈ మేరకు ఫైనల్లో గెలిచిన అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు కోసం నేను ఎంతగా ఎదురుచూశానో నాకే తెలుసు. ఆ దేవుడు ఏదో ఒకనాడు నాకు ఈ బహుమతి ఇస్తాడని కూడా తెలుసు. ఇక్కడిదాకా చేరుకోవడానికి చాలా కాలం పట్టింది. మేమెంతగానో కష్టపడ్డాం. కఠిన శ్రమకోర్చాం. ఎట్టకేలకు సాధించాం. వరల్డ్ చాంపియన్‌గా మరిన్ని మ్యాచ్‌లు ఆడతా’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా ఇన్‌స్టా వేదికగా ఫొటోలు పంచుకుంటూ ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ మెస్సీ భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. చదవండి: Messi- Ronaldo: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’! మరి రొనాల్డో సంగతి? ఆరోజు ‘అవమానకర’ రీతిలో.. Rohit Sharma: ‘సెంచరీ వీరుడు గిల్ బెంచ్‌కే పరిమితం! రెండో టెస్టులో ఓపెనర్లుగా వాళ్లిద్దరే!’ View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’! రొనాల్డో సంగతి? అవమానకర రీతిలో..
Lionel Messi- Cristiano Ronaldo: ఏడుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా ‘బాలన్ డీర్’ అవార్డు... ప్రతిష్టాత్మక క్లబ్ బార్సిలోనా తరఫున ఏకంగా 35 టైటిల్స్‌లో భాగం... ఏ లీగ్‌లోకి వెళ్లినా అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఘనత... లెక్కలేనన్ని రికార్డులు, అపార ధనార్జన... అపరిమిత సంఖ్యలో అతని నామం జపించే అభిమానులు... మెస్సీ గురించి ఇది ఒక చిన్న ఉపోద్ఘాతం మాత్రమే. ఫుట్‌బాల్ మైదానంలో అతను చూపించిన మాయకు ప్రపంచం దాసోహమంది... ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా గొప్పగా కీర్తించింది... కానీ...కానీ... అదొక్కటి మాత్రం లోటుగా ఉండిపోయింది. మెస్సీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వరల్డ్ కప్ మాత్రం గెలవలేదే అనే ఒక భావన... 2006లో అడుగు పెట్టిన నాటి నుంచి 2018 వరకు నాలుగు టోర్నీలు ముగిసిపోయాయి. కానీ ట్రోఫీ కోరిక మాత్రం తీరలేదు. 2014లో అతి చేరువగా ఫైనల్‌కు వచ్చినా, పేలవ ఆటతో పరాభవమే ఎదురైంది. రొనాల్డోతో ప్రతీసారి పోలిక వరల్డ్ కప్ లేకపోయినంత మాత్రాన అతని గొప్పతనం తగ్గదు... కానీ అది కూడా ఉంటే బాగుంటుందనే ఒక భావన సగటు ఫ్యాన్స్‌లో బలంగా నాటుకుపోయింది. అతని సమకాలీకుడు, సమఉజ్జీ క్రిస్టియానో రొనాల్డోతో ప్రతీసారి ఆటలో పోలిక... కానీ ఇప్పుడు మెస్సీ వరల్డ్ కప్ విన్నర్ కూడా... ఈ విజయంతో అతను రొనాల్డోను అధిగమించేశాడు... అర్జెంటీనా ఫుట్‌బాల్ అంటే మారడోనానే పర్యాయపదం... 1986లో అతను ఒంటి చేత్తో (కాలితో) తమ టీమ్‌ను విశ్వవిజేతగా నిలిపిన క్షణం ఆ దేశపు అభిమానులు మరచిపోలేదు. అంతటివాడు అనిపించుకోవాలంటే వరల్డ్ కప్ గెలవాల్సిందే అన్నట్లుగా ఆ దేశం మెస్సీకి ఒక అలిఖిత ఆదేశం ఇచ్చేసింది! ఎట్టకేలకు అతను ఆ సవాల్‌ను స్వీకరించాడు... తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో పరాజయం ఎదురైన తర్వాత తమను లెక్కలోంచే తీసేసిన జట్లకు సరైన రీతిలో సమాధానమిచ్చాడు. మైదానం అంతటా, అన్నింటా తానై అటు గోల్స్ చేస్తూ, అటు గోల్స్ చేసేందుకు సహకరిస్తూ టీమ్‌ను నడిపించాడు. ప్రపంచ కప్ చరిత్రలో గ్రూప్ దశలో, ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్లో, సెమీస్‌లో, ఫైనల్లో గోల్ చేసిన ఏకైక ఆటగాడు కావడంతో పాటు జట్టును శిఖరాన నిలిపాడు. శాశ్వత కీర్తిని అందుకుంటూ అర్జెంటీనా ప్రజలకు అభివాదం చేశాడు. చివరగా...మెస్సీ భావోద్వేగాలు చూస్తుంటే సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజం కూడా తన కెరీర్లో అన్నీ సాధించిన తర్వాత లోటుగా ఉన్న క్రికెట్ ప్రపంచకప్‌ను ఆరో ప్రయత్నంలో అందుకోవడం, అతడిని సహచరులు భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిరిగిన ఘటన మీ కళ్ల ముందు నిలిచిందా! -సాక్షి, క్రీడా విభాగం. మరి రొనాల్డో సంగతి?! గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT).. ప్రస్తుత తరంలో మేటి ఫుట్‌బాల్ ఆటగాడు ఎవరు అంటే.. ఠక్కున గుర్తుకు వచ్చే రెండు పేర్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. అన్నిటిలోనూ పోటాపోటీ.. అయితే, మెస్సీ ఖాతాలో ఇప్పుడు వరల్డ్‌కప్ టైటిల్ ఉంది. 37 ఏళ్ల రొనాల్డోకు ఇక ప్రపంచకప్ ట్రోఫీ గెలిచే అవకాశమే లేదు. నిజానికి, ఖతర్ ఈవెంట్లో మొదటి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా వంటి చిన్న జట్టు చేతిలో ఓటమి పాలైనా ఏమాత్రం కుంగిపోక.. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ జట్టును ఫైనల్ వరకు తీసుకువచ్చాడు మెస్సీ. నాయకుడిగా, ఆటగాడిగా తన అపార అనుభవాన్ని ఉపయోగించుకుంటూ జట్టును ఆఖరి మెట్టు వరకు తీసుకువచ్చాడు. ఉత్కంఠభరిత ఫైనల్లోనూ చిరునవ్వు చెదరనీయక ఎట్టకేలకు ట్రోఫీ ముద్దాడి విజయదరహాసం చేశాడు. కానీ రొనాల్డోకు ఈ మెగా టోర్నీకి ముందే ఎదురుదెబ్బలు తగిలాయి. యునైటెడ్ మాంచెస్టర్‌తో బంధం తెగిపోవడం సహా కీలక ప్రి క్వార్టర్స్‌లో జట్టులో చోటు కోల్పోవడం వంటి పరిణామాలు జరిగాయి. పోర్చుగల్ సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ అతడు ఆలస్యంగా బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో ప్రవర్తన వల్లే కోచ్ అతడిని కావాలనే పక్కనపెట్టాడనే వార్తలు వినిపించాయి. ఏదేమైనా మెస్సీ తన హుందాతనంతో ఘనంగా ప్రపంచకప్ టోర్నీకి వీడ్కోలు పలికితే.. రొనాల్డో మాత్రం అవమానకర రీతిలో నిష్క్రమించినట్లయింది. దీంతో ఇద్దరూ సమఉజ్జీలే అయినా మెస్సీ.. రొనాల్డో కంటే ఓ మెట్టు పైకి చేరాడంటూ ఫుట్‌బాల్ అభిమానులు అంటున్నారు. చదవండి: Mbappe- Messi: మెస్సీ విజయానికి అర్హుడే! కానీ నువ్వు ఓటమికి అర్హుడివి కాదు! గర్వపడేలా చేశావు.. Rohit Sharma: ‘సెంచరీ వీరుడు గిల్ బెంచ్‌కే పరిమితం! రెండో టెస్టులో ఓపెనర్లుగా వాళ్లిద్దరే!’ Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మెస్సీ హీరోనే.. నువ్వేమీ తక్కువ కాదు! గర్వపడేలా చేశావు! బాధపడకు..
Kylian mbappe Beats Messi Win Award: ‘‘మెస్సీ ఈ విజయానికి నూటికి నూరుపాళ్లు అర్హుడే.. అయితే, ఎంబాపే మాత్రం ఓటమికి అర్హుడు కాదు’’... ఆదివారం నాటి ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం చూసిన సగటు అభిమాని కనీసం ఒక్కసారైనా మనసులో ఈ మాట అనుకుని ఉంటాడనడంలో సందేహం లేదు. మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన ఫ్రాన్స్.. విజయం అంచుల దాకా వెళ్లే వరకు అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించిందంటే అదంతా కెప్టెన్ కైలియన్ ఎంబాపే చలవే! అప్పటి దాకా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఎంబాపె.. రెండో అర్ధ భాగంలో ఒక్కసారిగా విజృంభించాడు. 97 సెకన్ల వ్యవధిలో చకచకా రెండు గోల్స్ చేసి అర్జెంటీనాకు షాక్ ఇచ్చి... అభిమానుల గుండె వేగం పెంచాడు. ఈ క్రమంలో స్కోరు సమం(2-2) చేసిన ఫ్రాన్స్ జోరు పెరిగింది. అర్జెంటీనా గోల్‌పోస్ట్‌ను పదే పదే అటాక్ చేసింది. హోరాహోరీ పోరు.. దీంతో నిర్ణీత సమయం ముగిసేలోపు ఇరు జట్ల స్కోరు సమంగా ఉండటంతో అదనపు సమయం కేటాయించారు. అప్పటికే గోల్‌తో మెరిసిన మెస్సీ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేశాడు.. గోల్ కొట్టి అర్జెంటీనాను ముందుకు తీసుకువెళ్లాడు. తన చిరకాల కలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేశాడు. కానీ, ఓటమిని అంగీకరించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని ఎంబాపె తమకు దక్కిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి ప్రేక్షకులు ఉత్కంఠతో మునివేళ్ల మీద నిల్చునేలా చేశాడు. అదనపు సమయం ముగిసే సరికి కూడా 3-3తో అర్జెంటీనా- ఫ్రాన్స్ సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. అయితే, షూటౌట్లో అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో పెనాల్టీ తీసుకున్న గొంజాలో మోంటీల్ విజయవంతంగా గోల్ కొట్టడంతో ఎంబాపె బృందం ఆశలు ఆవిరయ్యాయి. ఫ్రాన్స్‌ను 4-2తో ఓడించి మెస్సీ సేన వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. అంచనాలు తలకిందులు చేసి ఇక ఈ మ్యాచ్‌లో గెలుపుతో ప్రపంచకప్ సాధించాలన్న 35 ఏళ్ల మెస్సీ ఆశయం నెరవేరగా.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్‌ను మరోసారి విజేతగా నిలపాలన్న 23 ఏళ్ల ఎంబాపె కల చెదిరిపోయింది. నిజానికి ఆరంభంలోనే పట్టు సాధించిన అర్జెంటీనా సులువుగా విజయం సాధిస్తుందని అంతా భావించినా.. ఆ అంచనాలు తలకిందులు చేశాడు ఎంబాపె. మెస్సీని వెనక్కినెట్టి... ఏదేమైనా తాను అనుకున్న ఫలితం రాబట్టలేకపోయినా ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ మెరిసిన ఎంబాపె.. మెస్సీతో పాటు తానూ హీరోనే అనిపించుకున్నాడు. ఈ ఎడిషన్‌లో 8 గోల్స్ చేసి మెస్సీని దాటుకుని గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే.. ఫైనల్ మ్యాచ్‌ను చిరస్థాయిగా నిలిచిపోయేలా తన ఆట తీరుతో అలరించిన ఎంబాపె ఆట తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు సాకర్ అభిమానులు. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) మెస్సీనే.. అయినా నువ్వేమీ తక్కువ కాదు ఎంబాపె. మెస్సీ ట్రోఫీ గెలిచి మా హృదయాలు పులకింపజేశాడు.. నువ్వు కూడా నీ పోరాటపటిమతో మా మనసులు గెలిచావు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అతడిని అభినందిస్తున్నారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత దిగాలుగా కూర్చున్న ఎంబాపె వద్దకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ వచ్చి అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు.. ‘‘బాధపడకు మిత్రమా.. మెస్సీ ఒక్కడే కాదు నువ్వు కూడా విజేతవే!’’ అంటూ ఎంబాపెకు విషెస్ తెలియజేస్తున్నారు. చదవండి: FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు KL Rahul: అంత సులువేమీ కాదు.. కష్టపడ్డాం.. గెలిచాం! కాస్త రిలాక్సైన తర్వాతే.. Won our hearts #mbappe 💙🐐 pic.twitter.com/I1SAhvFPvH — Eddy Kenzo (@eddykenzoficial) December 19, 2022 What. A. Player. #mbappe pic.twitter.com/gavhNfdKrB — Piers Morgan (@piersmorgan) December 18, 2022 Mbappé is next Ronaldo, Messi whoever you support now. Only a few people support you in the journey. But when you get success they all will cheer you up. #ArgentinaVsFrance #Mbappe #WorldCupFinal pic.twitter.com/hhVjk9GuNz — Navin Depan (@DepanNavin) December 19, 2022 #EmmanuelMacron @KMbappe #Mbappe Well played and Congratulations for Golden Boot. French President @EmmanuelMacron consoled Mbappe, this shows how this country and president support and love their team. pic.twitter.com/iFlvwk4BhG — Neo007 (@neo007navin) December 18, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు
FIFA World Cup Qatar 2022: దాదాపు నెల రోజులుగా ఖతర్ వేదికగా సాగిన సాకర్ సమరం ముగిసింది. ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించిన అర్జెంటీనా జగజ్జేతగా నిలిచింది. స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ సారథ్యంలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్-2022 అవార్డులు, విజేత, రన్నరప్, లీగ్ దశలో నిష్క్రమించిన జట్లకు దక్కిన ప్రైజ్‌మనీ సహా ఇతర విశేషాలు తెలుసుకుందాం! వరల్డ్‌కప్–2022 అవార్డులు గోల్డెన్ బాల్ (బెస్ట్ ప్లేయర్) లియోనల్ మెస్సీ (7 గోల్స్)- అర్జెంటీనా గోల్డెన్ బూట్ (టాప్ స్కోరర్) కైలియన్ ఎంబాపె- 8 గోల్స్- ఫ్రాన్స్ గోల్డెన్ గ్లౌవ్ (బెస్ట్ గోల్‌కీపర్) మార్టినెజ్ (అర్జెంటీనా; 34 సార్లు గోల్స్ నిలువరించాడు) బెస్ట్ యంగ్ ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ (అర్జెంటీనా) మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ లియోనల్ మెస్సీ ఫెయిర్ ప్లే అవార్డు ఇంగ్లండ్ ప్రపంచకప్ విశేషాలు ►172- ప్రపంచకప్‌లో నమోదైన మొత్తం గోల్స్. ఒకే టోర్నీలో ఇవే అత్యధికం. 1998, 2014 ప్రపంచకప్‌లలో 171 గోల్స్ చొప్పున నమోదయ్యాయి. ►64- జరిగిన మ్యాచ్‌లు ►217-ఎల్లో కార్డులు ►3- రెడ్ కార్డులు ►16- టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టు (ఫ్రాన్స్) ►8- ఒకే మ్యాచ్‌లో నమోదైన అత్యధిక గోల్స్ (ఇంగ్లండ్ 6, ఇరాన్ 2) ►2- టోర్నీలో నమోదైన సెల్ఫ్ గోల్స్ ►2- టోర్నీలో నమోదైన ‘హ్యాట్రిక్’లు (ఎంబాపె, గొంకాలో రామోస్) ఎవరికెంత వచ్చాయంటే... ►విజేత: అర్జెంటీనా - 4 కోట్ల 20 లక్షల డాలర్లు (రూ. 347 కోట్లు) ►రన్నరప్: ఫ్రాన్స్ -3 కోట్ల డాలర్లు (రూ. 248 కోట్లు) ►మూడో స్థానం: క్రొయేషియా -2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 223 కోట్లు) ►నాలుగో స్థానం: మొరాకో -2 కోట్ల 50 లక్షల డాలర్లు (రూ. 206 కోట్లు) ►క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (4) -కోటీ 70 లక్షల డాలర్ల చొప్పున (రూ. 140 కోట్ల చొప్పున) ►ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (8) -కోటీ 30 లక్షల డాలర్ల చొప్పున (రూ. 107 కోట్ల చొప్పున) ►గ్రూప్ లీగ్ దశలో నిష్క్రమించిన జట్లకు (16) -90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 74 కోట్ల చొప్పున) చదవండి: FIFA WC 2022: వారెవ్వా అర్జెంటీనా.. మూడోసారి, మూడో స్థానం, మూడో జట్టు.. పాపం ఫ్రాన్స్! Lionel Messi: మెస్సీ నామసర్మణతో మారుమ్రోగిన అర్జెంటీనా.. కోల్‌కతాలోనూ సంబరాలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వారెవ్వా అర్జెంటీనా.. మూడోసారి, మూడో స్థానం, మూడో జట్టు.. పాపం ఫ్రాన్స్!
FIFA WC Qatar 2022 World Champions Argentina: ఫిఫా ప్రపంచకప్ గెలవాలన్న అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు ఆదివారం(డిసెంబరు 18) తెరపడింది. ఖతర్ వేదికగా ఫ్రాన్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో మెస్సీ బృందం విజయం సాధించడంతో కల సాకారమైంది. మేటి ఆటగాడు మెస్సీకి ఘనమైన వీడ్కోలు లభించడంతో పాటు మూడోసారి ట్రోఫీని గెలిచిన ఘనతను అర్జెంటీనా తన ఖాతాలో వేసుకుంది. కాగా అదనపు సమయంలోనూ 3-3తో ఇరు జట్లు సమంగా ఉన్న వేళ.. పెనాల్టీ షూటౌట్ ద్వారా వరల్డ్‌కప్-2022 ఫైనల్ ఫలితం తేలిన విషయం తెలిసిందే. 4-2తో అర్జెంటీనా పైచేయి సాధించి విశ్వ విజేతగా అవతరించింది. మరి ఈ మ్యాచ్ ద్వారా అర్జెంటీనా సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి! మూడోసారి ►ప్రపంచకప్ ఫుట్‌బాల్ టైటిల్ సాధించడం అర్జెంటీనాకిది మూడోసారి. గతంలో ఆ జట్టు 1978, 1986లలో సాధించింది. మూడో స్థానం ►ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు గెలిచిన జట్ల జాబితాలో అర్జెంటీనా మూడో స్థానానికి చేరుకుంది. బ్రెజిల్ (5 సార్లు) టాప్ ర్యాంక్‌లో, జర్మనీ (4 సార్లు), ఇటలీ (4 సార్లు) సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. మూడో జట్టు ►‘షూటౌట్’ ద్వారా ప్రపంచకప్ నెగ్గిన మూడో జట్టు అర్జెంటీనా. గతంలో బ్రెజిల్ (1994లో), ఇటలీ (2006లో) ఈ ఘనత సాధించాయి. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌లో ‘షూటౌట్’లలో మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. పాపం ఫ్రాన్స్ ►డిఫెండింగ్ చాంపియన్ తదుపరి టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం ఇది మూడోసారి. గతంలో అర్జెంటీనా (1990లో), బ్రెజిల్ (1998లో) జట్లకు ఇలాంటి ఫలితమే ఎదురైంది. ఇప్పుడు ఫ్రాన్స్ వంతు! చదవండి: Lionel Messi: మెస్సీ నామసర్మణతో మారుమ్రోగిన అర్జెంటీనా.. కోల్‌కతాలోనూ సంబరాలు IND VS BAN 1st Test: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు Make way for the 👑 #FIFAWorldCup #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) December 19, 2022 -
FIFA WC: మెస్సీ నామసర్మణతో మారుమ్రోగిన వీధులు.. కోల్‌కతాలోనూ సంబరాలు
FIFA WC 2022 World Champions Argentina- Lionel Messi: ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్... కీలక సమయంలో స్ట్రైకర్ ఎంబాపె గోల్స్ కొట్టడం ఫ్రాన్స్ అభిమానులకు కన్నుల పండువగా ఉన్నా.. మెస్సీ నామస్మరణలో మునిగిపోయిన మిగతా ప్రపంచానికి మాత్రం మింగుడుపడలేదు. ప్రపంచంలోనే మేటి ఆటగాడిగా పేరొందిన లియోనల్ మెస్సీకి అంత సులువుగా గెలుపు అందనిస్తానా అన్న చందంగా.. అదనపు సమయంలోనూ అతడు కొట్టిన గోల్ ఫ్యాన్స్ గుండెదడ పెంచింది. అయితే, అందరూ కోరుకున్నట్టుగా ఎట్టకేలకు పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా పైచేయి సాధించింది. 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత ట్రోఫీని అందుకోవడమే గాకుండా మెస్సీ కీర్తికిరీటంలో ప్రపంచకప్ అనే కలికితురాయిని చేర్చింది. దీంతో మెస్సీ అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మెస్సీ ట్రోఫీని ముద్దాడిన క్షణాలు చూసి వారందరి కళ్లు చెమర్చాయి. కలను సాకారం చేసుకున్న ఈ దిగ్గజ ఆటగాడి భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఆనంద భాష్పాలు రాలుస్తూ.. కేరింతలు కొడుతూ అతడి విజయాన్ని ఆస్వాదించారు. కేవలం అర్జెంటీనాలోనే మాత్రమే కాదు.. మెస్సీని అభిమానించే ప్రతీ దేశంలోనూ సంబరాలు అంబరాన్నంటాయి. స్వర్గంలో ఉన్నట్లుంది అంటూ మెస్సీ స్వదేశంలో విజయాన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఫుట్‌బాల్ క్రీడను అభిమానించే భారత్‌లోని పశ్చిమ బెంగాల్లోనూ క్రాకర్లు పేలుస్తూ, మెస్సీ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. కోల్‌కతా వీధుల్లో డాన్సుల చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెస్సీ నామసర్మణతో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోతున్నాయి. దీంతో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. చదవండి: FIFA World Cup Qatar 2022: అర్జెంటీనా గర్జన.. జగజ్జేతగా మెస్సీ బృందం ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి #Argentina fans in one part of the city are celebrating with Jumma Chumma De De! #Kolkata’s colour scheme is anyways similar to #Argentina! #Messi𓃵 #Messi #LionelMessi𓃵 #LionelMessi #FIFAWorldCup #WorldCup pic.twitter.com/kMLXRgg9ZD — Saurabh Gupta(Micky) (@MickyGupta84) December 18, 2022 Make way for the 👑 #FIFAWorldCup #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) December 19, 2022 -
మెస్సీ కల నెరవేరింది.. అభిమానుల కళ్లు చెమర్చాయి (ఫొటోలు)
-
ప్రపంచకప్ గెలిచి అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికిన మెస్సీ
-
అర్జెంటీనా గర్జన.. జగజ్జేతగా మెస్సీ బృందం
ఏమా ఆట... ఎంతటి అద్భుత ప్రదర్శన... ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు... ప్రపంచకప్ ఫైనల్ అంటే ఇలా ఉంటుంది... కాదు, కాదు.. ఇంత గొప్పగా, ఇలాగే ఉంటుంది అనిపించేలా సాగిన ఆట... మైదానంలో ఆటగాళ్లు కొదమసింహాల్లా పోటీపడుతుంటే... స్టేడియంలో 90 వేల మంది ప్రేక్షకులే కాదు, ప్రపంచం మొత్తం ఊగిపోయింది... ఫైనల్లో ఆడుతున్న జట్లు మాత్రమే కాదు... ఏ జట్టుతో సంబంధం లేకపోయినా, రెప్పార్పకుండా చూసిన వీరాభిమానుల సంఖ్యకు లెక్కే లేదు... ఆట ఆరంభంలో అర్జెంటీనా దూకుడు చూస్తే మ్యాచ్ ఏకపక్షమే అనిపించింది... ఒకసారి కాదు, రెండుసార్లు కాదు... పదే పదే అటాక్ మంత్రంగా ఆ జట్టు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది... రెండు గోల్స్ ఆధిక్యం సాధించాక మెస్సీ మాయలో ఊగిపోతున్న అర్జెంటీనా అభిమానులు సంబరాలు షురూ చేసేశారు... తొలి అర్ధ భాగం చూస్తే అసలు ఫ్రాన్స్ ఫైనల్ చేరిన జట్టేనా అనిపించింది... స్టార్ ఆటగాళ్ల జాడే కనిపించలేదు. రెండో అర్ధభాగంలో కూడా కూడా అర్జెంటీనా తగ్గలేదు... మొత్తం 67 నిమిషాల ఆట సాగినా... ఒక్క షాట్ కూడా గోల్ పోస్ట్‌పై కొట్టలేకపోయింది. అప్పుడొచ్చాడు ఎంబాపె... అప్పటి వరకు కనీసం పాస్‌లు కూడా అందుకోలేకపోయిన ఈ సంచలన ఆటగాడు తనేంటో చూపించాడు... 97 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్ చేసేసి అర్జెంటీనాను ఒక్కసారిగా అచేతనంగా మార్చాడు. ఆపై తమదే ఆట అన్నట్లుగా ఫ్రాన్స్ దూసుకుపోగా, మెస్సీ సేన నిస్సహాయంగా కనిపించింది... స్కోరు సమం చేయడం సంగతేమో కానీ డిఫెన్స్‌తో తమ గోల్‌పోస్ట్‌ను కాపాడుకోవడమే అర్జెంటీనాకు కనాకష్టంగా మారింది. నిర్ణీత సమయం ముగిసింది... ఇంజ్యూరీ టైమ్ కూడా అయిపోయింది. స్కోర్లు సమంగానే ఉన్నాయి. అప్పుడు అదనపు సమయం తప్పలేదు. మళ్లీ మెస్సీపైనే గెలుపు భారం పడింది... తన కోసం, తన దేశం కోసం అన్నట్లుగా ఒక్కసారిగా శక్తి పుంజుకున్న మెస్సీ మరో గోల్‌తో ముందంజలో నిలిపి విజయధ్వానం చేశాడు... అయితే అది కొద్ది క్షణాలకే పరిమితమైంది... ఎంబాపె మళ్లీ మ్యాజిక్ ప్రదర్శించడంతో స్కోరు మళ్లీ సమమైంది. దాంతో ఫలితం పెనాల్టీ ‘షూటౌట్’కు వెళ్లింది. ‘అర్జెంటీనా జట్టు గెలవాలని ప్రపంచం మొత్తం కోరుకుంటోంది. మా దేశంలో కూడా అలాంటివారు ఉన్నారు’... ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్ కోచ్ డెషాంప్స్ చేసిన వ్యాఖ్య ఇది. సగటు ఫుట్‌బాల్ అభిమాని దృష్టిలో ఇది నిజంగా నిజం... అందుకు ఒకే ఒక్క కారణం లయోనల్ మెస్సీ... ప్రపంచవ్యాప్తంగా అతడిని అభిమానించే వారెందరో అతను వరల్డ్‌కప్‌ను అందుకోవాలని కోరుకున్నారు. వారంతా ఫైనల్ రోజు అర్జెంటీనా అభిమానులుగా మారిపోయారు... అందుకే మెస్సీ కొట్టిన ప్రతీ గోల్ వారిని ఆనందంతో ముంచెత్తితే... ఎంబాపె ఆట చూస్తుంటే ఎక్కడో గుండెల్లో అలజడి... ఎక్కడ అతను మ్యాచ్‌ను లాగేసుకుంటాడేమోనని ఆందోళన... కానీ అందరి కల నెరవేరింది... ఐదో ప్రపంచకప్ ప్రయత్నంలో మెస్సీ తన టీమ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఆ ఒక్క లోటును అధిగమించి ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచాడు. సంవత్సరం క్రితం దివికేగిన డీగో మారడోనా పైనుంచి ఆశీర్వదించినట్లుగా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా చాంపియన్‌గా మారింది. దోహా: గొంజాలో మోంటీల్... కొన్ని క్షణాల ముందు అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలో ఉండి గెలుపు ఖాయమనుకుంటున్న దశలో అప్రయత్నంగానే మోచేతికి బంతికి తగిలించాడు... దాంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ కిక్ దక్కి స్కోరు సమమైంది. సబ్‌స్టిట్యూట్‌గా కొన్ని నిమిషాల క్రితమే మైదానంలోకి దిగి ఒక్క పొరపాటుతో విలన్‌గా మారిపోయాడు... కానీ మరికొన్ని నిమిషాల తర్వాత అతనే హీరోగా నిలిచాడు. షూటౌట్లో అర్జెంటీనా ఓడి ఉంటే తన తప్పిదపు భారాన్ని అతను జీవితకాలం మోయాల్సి వచ్చేదేమో... షూటౌట్లో అర్జెంటీనా 3–2తో ఉండగా మోంటీల్ పెనాల్టీ తీసుకున్నాడు... అతను కొట్టిన కిక్ ఫ్రాన్స్ గోల్ కీపర్ లోరిస్‌ను దాటి నెట్లో పడింది! అంతే... అర్జెంటీనా బృందం విజయ గర్జన చేసింది... కన్నీళ్లతో మోంటీల్ భావోద్వేగభరితమయ్యాడు. ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా 4–2 (షూటౌట్లో) తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం కలిపి ఇరు జట్లు 3–3తో సమంగా నిలవగా, షూటౌట్లో ఫలితం తేలింది. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ (23వ నిమిషం, 108వ నిమిషం), మరియా (36వ నిమిషం) గోల్స్ చేయగా... ఫ్రాన్స్ తరఫున ఎంబాపె ఒక్కడే (80వ నిమిషం, 81వ నిమిషం, 118వ నిమిషం) మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ నమోదు చేశాడు. హోరాహోరీ... విజిల్ మోగిన దగ్గరి నుంచి అర్జెంటీనా ఆధిపత్యమే సాగింది. వరుసగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై జట్టు దాడులు చేస్తూ పోయింది. అదే జోరులో ఫలితం రాబట్టింది. పెనాల్టీ ఏరియాలో ఫ్రాన్స్ వింగర్ ఉస్మాన్ డెంబెలెను దాటి అర్జెంటీనా ఆటగాడు డి మరియా బంతితో దూసుకుపోయాడు. అతడిని నిలువరించే క్రమంలో ఉస్మాన్ వెనకనుంచి మరియాను తోసేశాడు. దాంతో మరో మాట లేకుండా రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ ప్రకటించాడు. మెస్సీ ప్రశాంతంగా ఎడమ కాలితో కుడి వైపు చివరకు కిక్ కొట్టగా, మరోవైపు దూకిన గోల్ కీపర్ హ్యూగో లోరిస్ బంతిని ఆపడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఆ తర్వాత మెస్సీ, అల్వారెజ్ అద్భుత సమన్వయంతో పాస్‌లు ఇచ్చుకుంటూ దూసుకుపోయారు. బంతి అలిస్టర్‌కు చేరగా, అతడి నుంచి పాస్ అందుకున్న మరియా అద్భుత గోల్‌గా మలిచాడు. తొలి అర్ధభాగంలో అసలు ఫ్రాన్స్ ఆటగాళ్లు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. పాస్‌లు సరిగా అందుకోలేకపోగా, కదలికల్లో కూడా వేగం లోపించింది. రెండో అర్ధభాగంలో కూడా అర్జెంటీనా ఆట చూస్తే తామే వెనుకబడి ఉన్నామా అన్నట్లు అనిపించింది. మళ్లీ మళ్లీ అదే దూకుడుతో వారు ప్రత్యర్థిపై చెలరేగారు. అయితే నికోల్స్ పొరపాటుతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ దక్కింది. దీనిని గోల్‌గా మలచిన ఎంబాపె తర్వాతి నిమిషంలో అద్భుత ఆటతో ఫీల్డ్ గోల్ నమోదు చేశాడు. మెస్సీ సేన బేలగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత మాత్రం అర్జెంటీనా కాస్త తేరుకుంది. దాంతో అదనపు సమయం మొత్తం పోటాపోటీగా సాగింది. మెస్సీ, ఎంబాపె ఇద్దరూ తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తూ చెరో గోల్‌తో మళ్లీ మ్యాచ్‌లో జీవం పోశారు. చివరకు పెనాల్టీ షూటౌట్ విశ్వవిజేతను తేల్చింది. –సాక్షి క్రీడా విభాగం -
36 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెస్సీకి ఘనంగా వీడ్కోలు!
ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి మూడోసారి ఫిఫా టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక అర్జెంటీనాకు తొలి రెండు వరల్డ్‌కప్‌లు సాధించడానికి కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే పడితే.. మూడో టైటిల్ సాధించడానికి మాత్రం 36 సంవత్సరాల ఎదురుచూపులు తప్పలేదు. అర్జెంటీనా 1978లో తొలిసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను సాధించింది. అప్పట్లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఫైనల్లో 3-1 తేడాతో నెగ్గిన అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. తొలి వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా నెగ్గడంలో మారియో కెంపెస్ది కీలకపాత్ర. ఇక 1986లో అర్జెంటీనా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గిన సమయంలో డీగో మారడోనా అన్నీ తానై జట్టును నడిపించాడు. జర్మనీతో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఓడించి రెండోసారి విజేతగా అవతరించింది. ఇక మారడోనా తర్వాత అంతటి పేరును సంపాదించిన మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను సాధించింది. 2022లో ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని అందుకుంది. ఈతరం గొప్ప ఆటగాళ్లలో టాప్ పొజీషన్లో ఉన్న మెస్సీ తన కెరీర్లో ఎన్నో టైటిల్స్ సాధించినప్పటికి ఫిఫా వరల్డ్‌కప్ లేదన్న లోటు అలాగే మిగిలిపోయింది. తాజాగా మెస్సీ తన కలను నెరవేర్చుకున్నాడు. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ.. అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ ఆడడం.. తన చివరి మ్యాచ్‌లోనే ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ కొట్టడం అతనికి ఘనమైన వీడ్కోలు అని చెప్పొచ్చు. ఇక ఫుట్‌బాల్ బతికున్నంతవరకు మెస్సీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. The third nation to win a #FIFAWorldCup Final on penalties 🔥 Watch the 🤯 penalty shoot-out from #FRAARG 📽️#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/OwAIjHdqi7 — JioCinema (@JioCinema) December 18, 2022 -
నిరీక్షణ ముగిసింది.. మెస్సీ సాధించాడు
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ నిరీక్షణ ఫలించింది. మారడోనా లిగసీని ఈతరంలో కంటిన్యూ చేస్తూ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన మెస్సీ కెరీర్లో ఎన్నో టైటిల్స్, అవార్డులు కొల్లగొట్టాడు. అయినా కానీ ఫిఫా వరల్డ్‌కప్ కొట్టలేదన్న లోటు మాత్రం అలానే ఉండిపోయింది. 2014లో ఫిఫా వరల్డ్‌కప్ మెస్సీ చేతిలోకి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అయితే ఈసారి మాత్రం మెస్సీనే వరించింది. ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ అని ప్రకటించిన మెస్సీ టైటిల్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. మారడోనా తర్వాత తనను ఎందుకంత ఆరాధిస్తారనేది మెస్సీ మరోసారి నిరూపించాడు. ఇక మెస్సీ గెలవడం కోసమే ఈసారి ఫిపా వరల్డ్‌కప్ జరిగిందా అన్న అనుమానం రాకమానదు. సౌదీ అరేబియాతో ఓటమి అర్జెంటీనాను పూర్తిగా మార్చివేసింది. ఆ ఓటమితో కుంగిపోని మెస్సీ అన్నీ తానై జట్టును నడిపించాడు. అక్కడి నుంచి మొదలైన మెస్సీ మాయాజాలం ఫైనల్ వరకు అజరామరంగా కొనసాగింది. జట్టు తరపున అత్యధిక గోల్స్ కొట్టడమే కాదు అత్యధిక అసిస్ట్‌లు చేసి విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇక 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన మెస్సీ 17 ఏళ్ల తర్వాత తన ఫిఫా వరల్డ్‌కప్ అందుకోవాలన్న కలను నిజం చేసుకున్నాడు. అంతేకాదు డీగో మారడోనా తర్వాత అర్జెంటీనాకు కప్‌ను అందించి మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఫలితంగా తన వరల్డ్‌కప్ కలతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. ఇక ఇప్పుడు మెస్సీ ఒక చరిత్ర. ఇన్నాళ్లు అర్జెంటీనా సూపర్‌స్టార్‌గా అభివర్ణించిన మెస్సీని ఇకపై దిగ్గజం అని పిలవాల్సిందే.. కాదు కాదు అలా పిలిపించుకోవడానికి అన్ని అర్హతలు సాధించాడు. ఈ తరానికి మెస్సీనే గోట్(GOAT) అని ఒప్పుకోవాల్సిందే. మెస్సీతో రొనాల్డోను పోల్చడం ఇకపై ఆపేస్తారేమో చూడాలి. ఇక ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం అందుకుంది. నిర్ణీత, అదనపు సమయం ముగిసేలోగా ఇరుజట్లు 3-3తో సమంగా ఉండడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్లో మెస్సీ సేన నాలుగు గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ రెండో గోల్స్‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఫిఫా వరల్డ్‌కప్ 2022 విజేతగా అర్జెంటీనా అవతరించింది.2014లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన మెస్సీ సేన ఈసారి మాత్రం కప్పును ఒడిసిపట్టుకుంది. 🏆🏆🏆 The greatest coronation in the history of the #WorldsGreatestShow 💯#Messi guides @Argentina to their third #FIFAWorldCup title 🐐#ARGFRA #ArgentinavsFrance #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Tb6KfWndXa — JioCinema (@JioCinema) December 18, 2022 🎶 𝙈𝙐𝘾𝙃𝘼𝘼𝘼𝘾𝙃𝙊𝙊𝙊𝙎 🎶 pic.twitter.com/TVVt04TVMW — FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022 Lionel Messi with his mum after the game 🥰pic.twitter.com/mvIKQRYfXt — SPORTbible (@sportbible) December 18, 2022 The third nation to win a #FIFAWorldCup Final on penalties 🔥 Watch the 🤯 penalty shoot-out from #FRAARG 📽️#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/OwAIjHdqi7 — JioCinema (@JioCinema) December 18, 2022 -
FIFA WC 2022: ఛాంపియన్స్‌గా అర్జెంటీనా.. 36 ఏళ్ల తర్వాత
వారెవ్వా ఏమి మ్యాచ్.. రెండు సింహాలు తలపడితే ఎవరిది పైచేయి అని చెప్పడం కష్టం. అచ్చం అలాంటిదే ఖతర్ వేదికగ జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో చోటుచేసుకుంది. మ్యాచ్‌లో క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మ్యాచ్‌లో మెస్సీ సేన గోల్ కొట్టిన ప్రతీసారి తానున్నానంటూ ఎంబాపె దూసుకొచ్చాడు. ఒకరకంగా అర్జెంటీనాకు ఎంబాపె కొరకరాని కొయ్యగా తయరయ్యాడని చెప్పొచ్చు. ఆట 78వ నిమిషం వరకు కూడా మ్యాచ్ అర్జెంటీనా వైపే ఉంది. కానీ ఇక్కడే మ్యాచ్ అనూహ్య మలుపు తీసుకుంది. ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె ఆట 80వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత 81వ నిమిషంలో మరో గోల్ కొట్టడంతో ఒక్కసారిగా ఫ్రాన్స్ 2-2తో స్కోరును సమం చేసింది. నిర్ణీత సమయం ముగియడం.. ఆ తర్వాత మరో 30 నిమిషాల పాటు అదనపు సమయం కేటాయించారు. ఈసారి కూడా 3-3తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్లో మెస్సీ సేన నాలుగు గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ రెండో గోల్స్‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఫిఫా వరల్డ్‌కప్ 2022 విజేతగా అర్జెంటీనా అవతరించింది. ఇక అర్జెంటీనా ఫిఫా ఛాంపియన్స్ కావడం ఇది మూడోసారి. ఇంతకముందు 1978, 1986లో విజేతగా నిలిచిన అర్జెంటీనా మళ్లీ 36 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా విజయం సాధించింది. Only the SECOND player ever to score hat-trick in a #FIFAWorldCup Final 👑 Will @KMbappe lead @FrenchTeam to successive 🏆?🤯 Watch the penalty shootout, LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/iu1FuY3bxA — JioCinema (@JioCinema) December 18, 2022 -
మెస్సీ మాయ.. అర్జెంటీనాదే వరల్డ్‌కప్
Updates.. ► మెస్సీ మాయ.. అర్జెంటీనాదే వరల్డ్‌కప్ వారెవ్వా ఏమి మ్యాచ్.. క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మెస్సీ గోల్ కొట్టిన ప్రతీసారి తానున్నానంటూ ఎంబాపె దూసుకొచ్చాడు. నిర్ణీత సమయం ముగిసింది.. అదనపు సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. అయితే ఆ తర్వాత మరో 30 నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. ఈసారి కూడా 3-3తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్లో మెస్సీ సేన నాలుగు గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ రెండో గోల్స్‌కు మాత్రమే కొట్టగలిగింది. దీంతో అర్జెంటీనా విశ్వవిజేతగా అవతరించింది. The third nation to win a #FIFAWorldCup Final on penalties 🔥 Watch the 🤯 penalty shoot-out from #FRAARG 📽️#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/OwAIjHdqi7 — JioCinema (@JioCinema) December 18, 2022 #FIFAWorldCupFinal | Argentina celebrates after #FIFAWorldCup win 🔗 https://t.co/s26S2Q2R9Q Watch 🇦🇷 🆚 🇫🇷 LIVE on #JioCinema & @Sports18 📺📲#ArgentinaVsFrance #ARGFRA #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/RHqWLAS2sH — Moneycontrol (@moneycontrolcom) December 18, 2022 ► ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ క్షణక్షణానికి చేతులు మారుతుంది. ఆట అదనపు సమయం 108 వ నిమిషంలో మెస్సీ గోల్ కొట్టి అర్జెంటీనాను ఆధిక్యంలోకి తెచ్చాడు. అయితే కొద్దిసేపటికే ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ కిక్‌ను ఎంబాపె మరోసారి సద్వినియోగం చేసుకున్నాడు. ఆట 118 వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను ఎంబాపె గోల్‌గా మలిచాడు. దీంతో ఇరుజట్ల స్కోర్లు మరోసారి సమం అయ్యాయి. ► అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ ఉత్కంఠగా కొనసాగుతుంది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ ఎలాంటి గోల్స్ నమోదు కాలేదు. అయితే మరోసారి 30 నిమిషాలు అదనపు సమయం ఇచ్చారు. అందులోనూ ఫలితం రాకపోతే అప్పుడు పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేల్చనున్నారు. ► ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె నిమిషం వ్యవధిలో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆట 80వ నిమిషంలో తొలుత పెనాల్టీని గోల్‌గా మలిచిన ఎంబాపె.. మలి నిమిషం సహచర ఆటగాడు ఇచ్చిన పాస్‌ను చక్కగా వినియోగించుకున్న ఎంబాపె సూపర్ గోల్‌తో మెరిశాడు. దీంతో 2-2తో మ్యాచ్‌ను సమం చేసింది. ఫిఫా వరల్డ్‌కప్ కొట్టడానికి అర్జెంటీనా అడుగు దూరంలో ఉంది. తొలి అర్థభాగం ముగిసేసరికి ఫ్రాన్స్‌పై స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన మెస్సీ బృందం 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపిస్తున్న మెస్సీ కీలకమైన ఫైనల్లో మరోసారి గోల్‌తో మెరిశాడు. ఆట 23వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన పెనాల్టీ కిక్‌ను మెస్సీ సద్వినియోగం చేసుకున్నాడు. ఫ్రాన్స్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ సూపర్ గోల్‌తో మెరిసి ఈ వరల్డ్‌కప్‌లో తన గోల్స్ సంఖ్యను ఆరుకు పెంచుకున్నాడు. ఇక ఆట 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా మరో గోల్‌తో మెరవడంతో అర్జెంటీనా ఖాతాలో రెండో గోల్ వచ్చి చేరింది. ఇక రెండో అర్థభాగంలో ఫ్రాన్స్‌ను నిలువరిస్తే చాలు అర్జెంటీనాతో పాటు మెస్సీ కల నెరవేరినట్లే. Lusail witnesses the @Oficial7DiMaria MANIA 💥 The man for the BIG OCCASION with a splendid finish ⭐ Keep watching the #FIFAWorldCup Final ➡ LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #ArgentinaVsFrance #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/1S9SNBnsjq — JioCinema (@JioCinema) December 18, 2022 BIG BIG step towards the 🏆 dream 🙌🏻#Messi scores his 6️⃣th goal of #Qatar2022 & no better time than this 🔥 Can the @FrenchTeam strike back? Find out LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Io6fyc2uRm — JioCinema (@JioCinema) December 18, 2022 -
పెనాల్టీ కిక్ సందర్భంగా మెస్సీ ఎమోషనల్
ఖతర్ వేదికగా అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి అర్థభాగంలోనే రెండు గోల్స్ సాధించిన అర్జెంటీనా ఫ్రాన్స్‌పై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఈ వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపిస్తున్న మెస్సీ కీలకమైన ఫైనల్లో మరోసారి గోల్‌తో మెరిశాడు. ఆట 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా మరో గోల్‌తో మెరవడంతో తొలి అర్థభాగం ముగిసేసరికి అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక పెనాల్టీలు కొట్టడంలో తనకు తానే సాటి అని మెస్సీ మరోసారి నిరూపించుకున్నాడు. ఆట 23వ నిమిషంలో ఫ్రాన్స్ గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ మెస్సీ కొట్టిన పెనాల్టీ అద్భుతమనే చెప్పాలి. అయితే పెనాల్టీ కొట్టడానికి ముందు మెస్సీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. మెస్సీ ఎందుకు ఎమోషనల్ అయ్యాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫిపా వరల్డ్‌కప్ ఫైనల్ అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ అని మెస్సీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఓడితే కప్ లేకుండానే మెస్సీ కెరీర్ ముగుస్తుంది. అందుకే పెనాల్టీ కొట్టడానికి ముందు అంత ఎమోషనల్ అయ్యాడు. ఇక పెనాల్టీని గోల్‌గా మలిచిన తర్వాత మెస్సీ సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. ఇక అర్జెంటీనాకు గోల్ వచ్చిన తర్వాత స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. BIG BIG step towards the 🏆 dream 🙌🏻#Messi scores his 6️⃣th goal of #Qatar2022 & no better time than this 🔥 Can the @FrenchTeam strike back? Find out LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Io6fyc2uRm — JioCinema (@JioCinema) December 18, 2022 -
టైటిల్‌కు అడుగుదూరం.. మెస్సీని ఊరిస్తున్న ఆరు రికార్డులు
లియోనల్ మెస్సీ.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే పేరు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరినప్పటి నుంచి మెస్సీ జపం మరింత ఎక్కువైంది. ఈసారి ఫైనల్ మ్యాచ్ కేవలం మెస్సీ కోసమే చూస్తున్నవారు కోట్లలో ఉన్నారు. తన ఆటతీరుతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న మెస్సీకి ఇదే చివరి వరల్డ్‌కప్ కానుంది. అంతేకాదు ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. మెస్సీకి అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ కానుంది. అందుకే అభిమానులు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఫైనల్ చేరిన మరో జట్టు ఫ్రాన్స్ అభిమానుల్లో మెజారిటి మెస్సీ సేన వరల్డ్‌కప్ గెలవాలని బలంగా కోరుకుంటుండడం విశేషం. మరి మెస్సీ అందరి అంచనాలను అందుకొని అర్జెంటీనాకు కప్ అందించి తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మరోవైపు ఫ్రాన్స్ కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బలంగా కనిపిస్తుంది. కైలియన్ ఎంబాపె ఆ జట్టుకు పెద్ద బలం. వరుసగా రెండో ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గి బ్రెజిల్, ఇటలీ సరసన నిలవాలని ఫ్రాన్స్ భావిస్తోంది. ఇదిలా ఉంటే టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న మెస్సీని ఆరు రికార్డులు ఊరిస్తున్నాయి. తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్న మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఐదు గోల్స్ చేశాడు. ప్రీ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ మెస్సీకి 1000వ మ్యాచ్. తాజాఆ ఫైనల్ మ్యాచ్ ఆడితే ఒక రికార్డు.. గోల్ కొడితే మరొక రికార్డు.. ఇలా అన్ని రికార్డులు ఒక్క మ్యాచ్‌తోనే ముడిపడి ఉన్నాయి. మరి మెస్సీని ఊరిస్తున్న ఆ ఆరు రికార్డులు ఏంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం. వరల్డ్‌కప్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా.. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో మెస్సీ ఒక ఆటగాడిగా ఇప్పటివరకు 16 విజయాలు అందుకున్నాడు. ఒకవేళ ఫైనల్లో అర్జెంటీనా నెగ్గితే మెస్సీ ఖాతాలో 17వ విజయం అవుతుంది. ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్న ఆటగాడిగా మెస్సీ.. జర్మనీ లెజెండరీ ప్లేయర్ మిరాస్లోవ్ క్లోస్ సరసన నిలవనున్నాడు. మిరాస్లోవ్ క్లోస్ తన కెరీర్లో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 17 విజయాలు అందుకున్నాడు. అత్యధిక మ్యాచ్‌ల్లో పాల్గొన్న ఆటగాడిగా.. ఫ్రాన్స్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్ మెస్సీకి ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 26వ మ్యాచ్ కానుంది. ఈ నేపథ్యంలో జర్మనీ ఆటగాడు లోథర్ మాథ్యూస్ రికార్డును మెస్సీ బద్దలు కొట్టనున్నాడు. లోథర్ మాథ్యూస్ ఫిఫా వరల్డ్‌కప్స్‌లో జర్మనీ తరపున 25 మ్యాచ్‌లు ఆడాడు. తాజాగా ఫ్రాన్స్‌తో ఫైనల్ మ్యాచ్ ద్వారా మెస్సీ.. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నాడు. వరల్డ్‌కప్‌లో అత్యధిక నిమిషాలు ఆడిన ఆటగాడిగా.. ఫిఫా వరల్డ్‌కప్స్ చరిత్రలో అత్యధిక నిమిషాలు మ్యాచ్‌లో గడిపిన ఆటగాడిగా ఇటలీ దిగ్గజం పాలో మల్దినీ తొలి స్థానంలో ఉన్నాడు. పాలో మల్దిని 2217 నిమిషాల పాటు మైదానంలో గడిపాడు. ఇక మెస్సీ ఇప్పటివరకు 2197 నిమిషాలతో రెండో స్థానంలో ఉన్నాడు మెస్సీకి, పాలో మల్దినీకి మధ్య వ్యత్యాసం కేవలం 23 నిమిషాలు మాత్రమే ఉంది. తాజాగా ఫ్రాన్స్‌తో జరగనున్న ఫైనల్లో మెస్సీ ఈ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. అత్యధిక అసిస్ట్‌లు చేసిన ఆటగాడిగా.. మెస్సీ ఇప్పటివరకు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో తొమ్మిది అసిస్ట్‌లు చేశాడు. ప్రస్తుతం బ్రెజిల్ దిగ్గజం పీలే పది అసిస్ట్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఒకవేళ ఫ్రాన్స్‌తో ఫైనల్లో మెస్సీ ఇతర ఆటగాళ్లు గోల్స్ చేయడంలో రెండు అసిస్ట్ ఇవ్వగలిగితే పీలే రికార్డు బ్రేక్ చేసి తాను మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. మల్టిపుల్ గోల్డెన్ బాల్ అవార్డ్స్.. 2014 ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ తొలిసారి గోల్డెన్ బాల్ అవార్డు గెలుచుకున్నాడు. ఒక వరల్డ్‌కప్‌లో బెస్ట్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఆటగాడికి గోల్డెన్ బాల్ అవార్డు అందిస్తారు. ఈసారి వరల్డ్‌కప్‌లోనూ మెస్సీ సూపర్ ఫామ్‌లో ఉండడం అతనికి గోల్డెన్ బాల్ దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మెస్సీ గోల్డెన్ బాల్ గెలుచుకుంటే.. ఫిఫా టోర్నీ చరిత్రలో రెండుసార్లు గోల్డెన్ బాల్ గెలుచుకున్న తొలి ప్లేయర్‌గా మెస్సీ చరిత్ర సృష్టించనున్నాడు. అయితే ఈ అవార్డు కోసం మెస్సీతో ఫ్రాన్స్ సూపర్‌స్టార్ ఎంబాపె పోటీలో ఉన్నాడు. ఏకకాలంలో గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్ అందుకునే అవకాశం.. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక గోల్ చేసిన ఆటగాడికి ఇచ్చే అవార్డు గోల్డెన్ బూట్. ఈసారి ఈ అవార్డుకు మెస్సీతో పాటు ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె కూడా పోటీ పడుతున్నాడు. ఇద్దరు చెరో ఐదు గోల్స్‌తో ఉన్నారు. ఇక ఫైనల్లో వీరిద్దరిలో ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వారికే గోల్డెన్ బూట్ దక్కుతుంది. ఇక ఏకకాలంలో గోల్డెన్ బూట్‌తో పాటు గోల్డెన్ బాల్ అవార్డు దక్కించుకునే అవకాశం మెస్సీతో పాటు ఎంబాపెకు ఉంది. మెస్సీ లేదా ఎంబాపెలలో ఎవరు దక్కించుకున్నా ఫిఫా చరిత్రలో ఎనిమిదో ఆటగాడిగా చరిత్రకెక్కనున్నారు. ఇంతకముందు లియోనిదాస్ సిల్వా(1938), గారించా(1962), రొనాల్డో(1998), పాలో రోసి(1982), సాల్వటోర్ సిలాచి(1990), మారియో కెంప్(1978) ఏకకాలంలో గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్ అవార్డును కొల్లగొట్టారు. అత్యధిక గోల్స్ కాంట్రిబ్యూషన్స్.. మెస్సీ ఇంతవరకు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 20 గోల్స్ కాంట్రిబ్యూషన్లో పాల్గొన్నాడు. ఇందులో పదకొండు గోల్స్‌తో పాటు తొమ్మిది అసిస్ట్‌లు ఉన్నాయి. బ్రెజిల్ దిగ్గజం పీలే 22 గోల్స్ కాంట్రిబ్యూషన్తో(12 గోల్స్, 10 అసిస్ట్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇవాళ ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్ ద్వారా మెస్సీ.. పీలే రికార్డును సమం చేయడమో లేక బద్దలు కొట్టే అవకాశం ఉంది. చదవండి: FIFA WC Final: ప్రైజ్‌మనీ.. విన్నర్‌కు ఎంత ; రన్నరప్‌కు ఎంత? చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం -
FIFA WC Final: ప్రైజ్‌మనీ.. విన్నర్‌కు ఎంత ; రన్నరప్‌కు ఎంత?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో.. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా అమితుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండోసారి వరల్డ్‌కప్ సాధించి ఇటలీ, బ్రెజిల్ సరసన నిలవాలని ఫ్రాన్స్ అనుకుంటే.. అర్జెంటీనా మాత్రం మెస్సీ కోసమైన టైటిల్ గెలవాల్సిన అవసరం ఉంది. అన్నీ తానై జట్టును నడిపిస్తున్న మెస్సీనే జట్టుకు పెద్ద బలం. ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. మెస్సీకి అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ కానున్న సంగతి తెలిసిందే. అందుకే ఫైనల్లో గెలిచి మెస్సీకి కప్ అందించి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని అర్జెంటీనా కోరుకుంటుంది. ఈ సంగతి పక్కనబెడితే.. ఫిఫా ఛాంపియన్స్‌గా నిలిచే జట్టు ఎంత ప్రైజ్‌మనీ అందుకుంటుంది.. అదే విధంగా రన్నరప్‌గా నిలిచే జట్టు ఎంత సొంతం చేసుకుంటుదనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మూడోస్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో మొరాకోపై గెలిచిన క్రొయేషియా రూ. 225 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. ఇక నాలుగో స్థానంలో నిలిచిన మొరాకో జట్టు రూ.206 కోట్లు అందుకుంది. మూడో ప్లేస్‌లో ఉన్న జట్టుకే పెద్ద మొత్తం వచ్చిందంటే.. ఇక తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లకు కళ్లు చెదిరే మొత్తం లభించడం గ్యారంటీ. ఇక ఫిఫా వరల్డ్‌కప్ 2022 టైటిల్ విజేత రూ.368 కోట్ల ప్రైజ్‌మనీ కొల్లగొట్టనుంది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ. 249 కోట్లు సొంతం చేసుకోనుంది. ఇక క్వార్టర్పైనల్స్లో వెనుదిరిగిన బ్రెజిల్,నెదర్లాండ్స్, పోర్చుగల్, ఇంగ్లండ్‌లకు రూ.141 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. రౌండ్ ఆఫ్ 16లో వెనుదిరిగిన అమెరికా, జపాన్, స్పెయిన్, సెనెగల్, పోలాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, సౌత్ కొరియాలకు రూ.107 కోట్ల ప్రైజ్‌మనీ అందనుంది. ఇక లీగ్ దశలో వెనుదిరిగిన జట్లకు రూ. 75 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకోనున్నాయి. చదవండి: చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం 'మెస్సీ కల నెరవేరాలి.. అప్పుడే మనస్పూర్తిగా నవ్వగలను' -
నేడే ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్.. అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనున్న ఫ్రాన్స్
దోహా: ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచకప్ అందినట్టే అంది చేజారిన క్షణం ఇప్పటికీ అర్జెంటీనా కెప్టెన్ లయనెల్ మెస్సీకి గుర్తుండే ఉంటుంది. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం మళ్లీ మెస్సీ ముంగిట వచ్చింది. ఈరోజు జరిగే ప్రపంచకప్ ఫైనల్ తన అంతర్జాతీయ కెరీర్లో అర్జెంటీనా తరఫున చివరి మ్యాచ్ కాబోతుందని ఇప్పటికే ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ ఈ తుది సమరాన్ని చిరస్మరణీయం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. పేరుకు అర్జెంటీనా–ఫ్రాన్స్ జట్ల మధ్య సాకర్ ప్రపంచకప్ ఫైనల్ అంటున్నా... దీనిని మెస్సీ, ఫ్రాన్స్ మధ్య పోరుగానే అభివర్ణించాల్సి ఉంటుంది. తటస్థ అభిమానులందరూ అర్జెంటీనా గెలిచి మెస్సీ తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా... అత్యంత పటిష్టంగా ఉన్న ఫ్రాన్స్ మెస్సీ కల కలగానే మిగిలిపోవాలనే లక్ష్యంతో పోరాటం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అంతా తానై... టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనాకు తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. దాంతో మెస్సీపైనే కాకుండా అర్జెంటీనా జట్టు సత్తాపై అందరికీ సందేహం కలిగింది. అయితే కెప్టెన్‌గా మెస్సీ రెండో మ్యాచ్ నుంచి అంతా తానై జట్టును ముందుండి నడిపించాడు. మెరుపు కదలికలతో ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ఐదు గోల్స్ చేయడంతోపాటు సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. ముఖ్యంగా క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో మెస్సీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో మెస్సీ మ్యాజిక్‌తోనే అర్జెంటీనా మూడో గోల్ చేయగలిగింది. క్రొయేషియా డిఫెండర్ గ్వార్డియోల్ ఎంత వెంటపడ్డా మెస్సీ తన పాదరసంలాంటి కదలికలతో అతడిని తప్పిస్తూ సహచరుడు అల్వారెజ్‌కు అందించిన పాస్, క్షణాల్లో నమోదైన గోల్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. అయితే ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్‌ను అర్జెంటీనా కెప్టెన్ మెస్సీతోపాటు అతడి సహచరులు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఆడినా తమ నుంచి ట్రోఫీ మరోసారి చేజారిపోతుందని అర్జెంటీనాకు తెలుసు. మెస్సీతోపాటు ఈ టోర్నీలో నాలుగు గోల్స్ చేసిన అల్వారెజ్, ఎంజెల్ డి మారియా, రోడ్రిగో డి పాల్, ఎంజో ఫెర్నాండెజ్, గోల్‌కీపర్ మార్టినెజ్ రాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ఆద్యంతం పకడ్బందీగా ఆడి ట్రోఫీని అందుకుంటుందా లేక ఆఖరి మెట్టుపై తడబడి నాలుగోసారి ట్రోఫీని చేజార్చుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎంబాపె ఒక్కడే కాదు... అర్జెంటీనా విజయావకాశాలు మెస్సీ ఆటపై ఆధారపడి ఉండగా... ఫ్రాన్స్ మాత్రం ఒకరిద్దరిపై ఆధారపడకుండా సమష్టి ఆటతో ఫైనల్‌కు చేరుకుంది. 23 ఏళ్ల కిలియాన్ ఎంబాపె ఐదు గోల్స్‌తో అదరగొట్టగా... 36 ఏళ్ల ఒలివియర్ జిరూడ్ నాలుగు గోల్స్‌తో మెరిపించాడు. థియో హెర్నాండెజ్, చువమెని, రాన్‌డల్, రాబియోట్ ఒక్కో గోల్ చేయగా... గ్రీజ్మన్ గోల్స్ చేయకున్నా సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. గోల్‌కీపర్, కెప్టెన్ హుగో లోరిస్ ఏకంగా 53 సార్లు గోల్స్ కాకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. 1998లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న దీదీర్ డెషాంప్స్... కోచ్‌గా మారి 2018లో ఫ్రాన్స్‌కు రెండోసారి ప్రపంచ కప్‌ను అందించాడు. ఈ నేపథ్యంలో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న ఫ్రాన్స్ జట్టుకు మరోసారి గెలవాలంటే ఎలా ఆడాలో తెలుసు కాబట్టి నేటి ఆఖరి సమరం రంజుగా సాగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. 6: అర్జెంటీనాకిది ఆరో ప్రపంచకప్ ఫైనల్. 1978, 1986లలో విజేతగా నిలిచిన అర్జెంటీనా 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. నేటి ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోతే అత్యధిక సార్లు ఫైనల్లో ఓడిపోయిన జట్టుగా జర్మనీ (4 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 4: ఫ్రాన్స్ జట్టుకిది నాలుగో ప్రపంచకప్ ఫైనల్. 1998, 2018లలో టైటిల్ నెగ్గిన ఫ్రాన్స్ 2006లో రన్నరప్‌గా నిలిచింది. 3: నేటి ఫైనల్లో ఫ్రాన్స్ గెలిస్తే ఇటలీ (1930, 1934), బ్రెజిల్ (1958, 1962) జట్ల తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మూడోజట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. 4: ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్, అర్జెంటీనా జట్ల మధ్య జరగనున్న నాలుగో మ్యాచ్ ఇది. 1930లో అర్జెంటీనా 1–0తో... 1978లో అర్జెంటీనా 2–1తో ఫ్రాన్స్‌పై గెలిచింది. 2018 ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 4–3తో అర్జెంటీనాను ఓడించింది. 10: దక్షిణ అమెరికా జట్లతో జరిగిన గత 10 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ ఓడిపోలేదు. ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. చివరిసారి దక్షిణ అమెరికా జట్టు చేతిలో ఫ్రాన్స్ ఓడిపోవడం 1978లో (అర్జెంటీనా చేతిలో 1–2తో) జరిగింది. 11: దక్షిణ అమెరికా, యూరోప్ ఖండాలకు చెందిన దేశాల మధ్య జరగనున్న 11వ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఇది. ఏడుసార్లు దక్షిణ అమెరికా జట్లకు టైటిల్ లభించగా... మూడుసార్లు యూరోప్ జట్ల ఖాతాలో టైటిల్ చేరింది. -
'మెస్సీ కల నెరవేరాలి.. అప్పుడే మనస్పూర్తిగా నవ్వగలను'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్ 18న(ఆదివారం) అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య తుది సమరం జరగనుంది. టైటిల్ సాధించి మెస్సీ తన కలను నెరవేర్చుకుంటాడా లేక డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి వరల్డ్‌కప్‌ను నిలబెట్టుకుంటుందా అనేది చూడాలి. ఇక అర్జెంటీనా జట్టును మెస్సీ అన్ని తానై నడిపిస్తున్నాడు. కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్న మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఐదుగోల్స్ కొట్టి గోల్డెన్ బైట్ అవార్డు రేసులో ఉన్నాడు. అయితే మెస్సీ ఇంత సక్సెస్ కావడం వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు అదెవరో తెలుసా.. లియోనల్ స్కలోని. అర్జెంటీనా కోచ్‌గా లియోనల్ స్కలోని జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు. కోచ్‌గా మంచి ఆఫర్స్ వచ్చినప్పటికి మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా ఎలాగైనా ఫిఫా వరల్డ్‌కప్ కొట్టాలని ఆశపడుతున్నాడు. స్కలోని తన కలను నెరవేర్చుకునే పనిలోనే ఉన్నాడు. ఇక ఫ్రాన్స్‌తో జరిగే ఆఖరి సమరంలో గెలిచి అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలవాలని కోరుకుంటున్నాడు. గతేడాది మెస్సీ సేన కోపా అమెరికా కప్ కొట్టడంలోనూ లియోనల్ స్కలోనీ కీలకపాత్ర పోషించాడు. అయితే స్కలోని గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపడింది. అదేంటంటే.. అర్జెంటీనా ఒక్కో అడుగు వేస్తూ ఫైనల్‌కు చేరుకున్న సందర్భంలో స్కలోని ఒక్కసారి కూడా నవ్వలేదట. ఇక క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో మెస్సీ ఆటకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక గోల్ కొట్టడమే గాక.. మూడు అసిస్ట్‌లు అందించి మరో రెండు గోల్స్ కొట్టడంలో మెస్సీదే కీలకపాత్ర. మెస్సీ అంటే ఎంతో అభిమానం చూపించే స్కలోని.. అతను అంత బాగా ఆడుతున్నా ఒక్కసారి కూడా నవ్వలేదు. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత మెస్సీని హగ్ చేసుకొని స్కలోని ఏడ్చేశాడు. అయితే స్కలోని నవ్వకపోవడం వెనుక ఒక కారణం ఉంది. అర్జెంటీనా టైటిల్ కొట్టే వరకు తాను నవ్వలేనని లియోనల్ స్కలోని పేర్కొన్నాడు. తాను నవ్వితే అర్జెంటీనా ఎక్కడా ఓడిపోయి ఇంటికి వస్తుందేమోనని భయపడ్డాడు. మెస్సీ బృందం కప్ అందుకోవాలనే కోరిక నెరవేరిన తర్వాతే తాను మనస్పూర్తిగా నవ్వగలను అంటూ స్కలోని తన మనసులోని మాటను బయటపెట్టాడు. చదవండి: దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే! -
FIFA: ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. ట్రెండింగ్‌లో ఎస్బీఐ పాస్‌బుక్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. డిసెంబర్ 18న అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరగనున్నఫైనల్తో మెగా టోర్నీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ అభిమానుల కళ్లన్నీ అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీపైనే నెలకొన్నాయి. తన కెరీర్లో అత్యున్నత ఫామ్‌లో ఉన్న మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ తన దేశం తరపున చివరి మ్యాచ్ అని ఇప్పటికే ప్రకటించాడు. అంతేకాదు ఈసారి వరల్డ్‌కప్‌లో ఐదు గోల్స్ కొట్టడమే గాక సూపర్ అసిస్ట్స్తోనూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మారడోనా తర్వాత ఆ లిగసీని కంటిన్యూ చేస్తున్న మెస్సీ ఎలాగైన ఫిఫా వరల్డకప్ కొట్టాలని కోరుకుందాం. అయితే అర్జెంటీనా ఫైనల్ చేరిన క్రమంలో భారత్‌కు చెందిన ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)కు చెందిన పాస్‌బుక్ ట్విట్టర్ ట్రెండింగ్ లిస్టులో నిలిచింది. అదేంటి అర్జెంటీనాతో ఎస్బీఐ పాక్బుక్కు సంబంధం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. ట్రెండింగ్‌లో నిలవడానికి కారణం ఏంటంటే అర్జెంటీనా, ఎస్బీఐ పాస్ బుక్ రంగు ఒకటి కావడమే. అర్జెంటీనా జెర్సీ లైట్ బ్లూ, వైట్ కలర్స్‌తో నిలువు చెక్స్‌తో ఉంటుంది. ఇక ఎస్బీఐ పాస్‌బుక్ అవే కలర్స్‌తో అడ్డంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని భారత్‌కు చెందిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎస్బీఐ పాస్‌బుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి #Win Argentina హ్యాష్‌టాగ్‌ను జత చేశారు. ఇక ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్బీఐ పాస్‌బుక్ ఫొటోలు ట్విటర్లో వైరల్‌గా మారింది. SBI's lunch time = Argentina's Whole Match https://t.co/u2kt12FyRX — Harshad (@_anxious_one) December 15, 2022 Reason why Indians support Argentina Indians feel if Argentina loose they will loose all their money 😉#India #FIFAWorldCup #GOAT𓃵 #FIFAWorldCupQatar2022 #Argentina #WorldCup2022 #WorldCup #finale #mumbai #Delhi #Kerala #TamilNadu #Karnataka #Bengaluru #SBI #Bank pic.twitter.com/CTi7TW5X3Y — We want United India 🇮🇳 (@_IndiaIndia) December 15, 2022 State Bank of India (SBI) is also supporting Argentina 😆#FIFA #FIFAWorldCupQatar2022 #FIFAWorldCup2022 #ArgentinaVsFrance #Argentina @TheOfficialSBI pic.twitter.com/4gRYXItziq — Maghfoor Ahmad (@maghfoormalkana) December 15, 2022 చదవండి: Lionel Messi: దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు -
దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ కలను నెరవేర్చుకుంటాడా?.. ఇప్పుడు సగటు ఫిఫా అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న. వీటన్నింటికి సమాధానం మరో రెండు రోజుల్లో దొరుకుతుంది. అప్పటివరకు ఓపికగా ఎదురుచూడాల్సిందే. డిసెంబర్ 18న ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ జరగనుంది. దాదాపు నెలరోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న సాకర్ సమరానికి ఈ మ్యాచ్‌తో తెరపడనుంది. మరి మెస్సీ టైటిల్ కొట్టాలన్న తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి. అయితే ఇదే ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ ముంగిట మరో అరుదైన రికార్డు ఎదురుచూస్తుంది. ఈ వరల్డ్‌కప్‌లో మెస్సీ ఇప్పటివరకు ఐదు గోల్స్ కొట్టాడు. ఎక్కువ గోల్స్ ఎవరికి కొడితే వారికి గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు రేసులో మెస్సీతో పాటు కైలియన్ ఎంబాపె పోటీ పడుతున్నాడు. అయితే మెస్సీకి మాత్రమే సాధ్యమయ్యే మరో రికార్డు ఎదురుచూస్తుంది. అదేంటంటే వరల్డ్‌కప్‌లో ఎక్కువ గోల్స్ కొట్టడంతో పాటు ఎక్కువ అసిస్ట్‌లు ఇచ్చిన ఆటగాడిగా నిలిచే అవకాశం మెస్సీ ముంగిట ఉంది. ఒకవేళ ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్లో గోల్స్‌తో పాటు అసిస్ట్ చేస్తే మాత్రం అత్యధిక గోల్స్‌తో పాటు అత్యధిక అసిస్ట్‌లు చేసిన తొలి ఆటగాడిగా మెస్సీ చరిత్ర సృష్టించనున్నాడు. ఇప్పటివరకు మెస్సీ ఆరు మ్యాచ్‌లు కలిపి 570 నిమిషాలు ఆడి మూడు అసిస్ట్‌లు చేశాడు. ఈ జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నప్పటికి అతని కంటే ముందున్న వారిలో ఫ్రాన్స్ స్టార్ ఆంటోని గ్రీజ్‌మెన్(467 నిమిషాలు, ఆరు మ్యాచ్‌లు, మూడు అసిస్ట్‌లు) మాత్రమే పోటీలో ఉన్నాడు. అయితే అతను ఒక్క గోల్ కూడా చేయలేదు. ఒకవేళ మెస్సీ ఒక్క అసిస్ట్ ఎక్కువగా చేస్తే మాత్రం.. అటు ఒక ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్, అత్యధిక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ గెలిచిన తొలి ఆటగాడిగా మెస్సీ చరిత్రలో నిలిచిపోతాడు. ఇంతకముందు 2010లో జర్మనీ ఫుట్‌బాల్ స్టార్ థామస్ ముల్లర్‌కు ఈ అవకాశం వచ్చింది. అత్యధిక గోల్స్‌తో ముల్లర్ గోల్డెన్ బూట్ అవార్డు దక్కించుకున్నాడు. కానీ అసిస్ట్స్ విషయంలో మాత్రం కాకా(బ్రెజిల్ స్టార్) వెనకాలే ఉండిపోయాడు. ఇక అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఐదు గోల్స్‌తో పాటు ఐదు అసిస్ట్స్ చేసి టాపర్‌గా ఉన్నప్పటికి.. అప్పటి ఇంగ్లండ్ స్ట్రైకర్ గారి లినేకర్ ఆరు గోల్స్‌తో గోల్డెన్ బూట్ అవార్డు కొల్లగొట్టాడు. చదవండి: FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే! -
ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు బిగ్ షాక్.. మెస్సీకి గాయం!
ఫిఫా ప్రపంచకప్-2022 తుది సమరానికి మరో 48 గంటల్లో తేరలేవనుంది. ఖాతార్ వేదికగా ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే కీలకమైన ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఫ్రాన్స్‌తో ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెమీఫైనల్లో క్రొయేషియాతో మ్యాచ్ సందర్భంగా మెస్సీ తొడ కండరాల గాయంతో బాధపడినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు గురువారం జరిగిన తమ జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా మెస్సీ మాత్రమే కాకుండా స్టార్ ఆటగాడు పాపు గోమెజ్ కూడా చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్‌కు అతడి అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది. కాగా ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ మెస్సీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. ఫైనల్లో గెలిచి ఫిఫా వరల్డ్‌కప్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ముగించాలని భావిస్తున్నాడు. చదవండి: Lionel Messi: మెస్సీతో ఇంటర్య్వూ; ఫిఫా ఫైనల్.. చివరి మ్యాచ్ అని తట్టుకోలేక -
మెస్సీతో ఇంటర్య్వూ; ఫిఫా ఫైనల్.. చివరి మ్యాచ్ అని తట్టుకోలేక
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన దేశం తరపున ఆఖరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ మెస్సీకి ఆఖరిది కానుంది. ఈ విషయాన్ని సెమీస్‌లో క్రొయేషియాపై విజయం అనంతరం మెస్సీనే స్వయంగా ప్రకటించాడు. మెస్సీ నిర్ణయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆరాధ్య దైవం ఆఖరి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఎలాగైనా ఫైనల్లో గెలిచి ఫిఫా వరల్డ్‌కప్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ముగిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం అర్జెంటీనా సహా ఫిఫా అభిమానులు మెస్సీ టైటిల్ గెలవాలని పూజలు చేస్తున్నారు. మరి మెస్సీ టైటిల్ కొట్టి తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది.ఈ విషయం పక్కనబెడితే.. క్రొయేషియాతో మ్యాచ్ అనంతరం మెస్సీని ఇంటర్య్వూ చేసిన అర్జెంటీనాకు చెందిన మహిళ రిపోర్టర్ కన్నీటిపర్యంతం అయింది. రిపోర్టర్ ఎమోషన్‌కు చలించిపోయిన మెస్సీ చిరునవ్వుతో ఆమెను ఓదార్చాడు. మ్యాచ్ విజయం అనంతరం మెస్సీని ఇంటర్య్వూ చేసింది. ''నా దృష్టిలో ఇది ప్రశ్న కాదు.. అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ ఆదివారం(డిసెంబర్ 18న) ఫైనల్ ఆడబోతున్నాం. ఒక అర్జెంటీనా వ్యక్తిగా కప్పు మనమే గెలవాలని అందరితో పాటు నేను కోరుకుంటన్నా. కానీ దేశం తరపున మీకు ఇది చివరి మ్యాచ్ అని తెలిసినప్పటి నుంచి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. రిజల్ట్‌తో మాకు సంబంధం లేదు. అది ఎలా అయినా రానీ మీరు మాత్రం మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అర్జెంటీనాలో చిన్న పిల్లాడిని అడిగినా మెస్సీ గురించి ఎంతో గొప్పగా చెప్తుంటారు. అలాంటిది మన జట్టు ఇవాళ ఫైనల్‌కు అడుగుపెట్టడంలో మీది కీలకపాత్ర కావడం మాకు సంతోషకరం. ఇప్పటికి ఇది నిజమా.. కలా అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఫుట్‌బాల్‌కు మీరు చేసిన సేవలు ఎన్నటికి మరువం. మారడోనా లీగసీని కంటిన్యూ చేస్తూ ఫుట్‌బాల్‌లో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించారు. మిమ్మల్ని బీట్ చేయడం ఎవరి తరం కాదు. మాలాంటి వాళ్లకు మెస్సీ ఒక స్పూర్తి.. ఒక అర్జెంటీనా మహిళను అయినందుకు గర్వపడుతున్నా థాంక్యూ మెస్సీ'' అంటూ ఎమోషనల్ అయింది. ఇదంతా ఓపికతో విన్న మెస్సీ చిరునవ్వుతో మెరిశాడు. అనంతరం రిపోర్టర్‌ను దగ్గరికి తీసుకొని ఆమెను ఓదార్చాడు. మీతో సహా అర్జెంటీనా ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తా. ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం. ఈసారి వరల్డ్‌కప్‌లో మా జర్నీ అంత ఈజీగా సాగలేదు. క్లిష్ట పరిస్థితులను దాటుకొని ఫైనల్‌కు చేరుకున్నాం. మరొక అడుగు పూర్తి చేస్తే సక్సెస్ అయినట్లే. మీ అభిమానానికి థాంక్స్ అంటూ పేర్కొన్నాడు. ఇక మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ అనంతరం అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. 2005 నుంచి అర్జెంటీనా సీనియర్ జట్టుకు ఆడుతున్న మెస్సీ 171 మ్యాచ్‌లు ఆడి 96 గోల్స్ సాధించాడు.ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. బటిస్టుటా (10 గోల్స్) పేరిట ఉన్న రికార్డును మెస్సీ (11 గోల్స్) సవరించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో మెస్సీ సంయుక్తంగా ఆరో స్థానానికి చేరుకున్నాడు. మిరోస్లావ్ క్లోజ్ (16), రొనాల్డో నజారియో (15), గెర్డ్ ముల్లర్ (14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 😭 pic.twitter.com/iYhhMAWSwB — Emma 📊 (@emmaiarussi) December 13, 2022 చదవండి: FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు Kylian Mbappe: 'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు'


