కోల్‌కతా: మెస్సీ మేనియాతో ఇండియా ఊగిపోతోంది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ రాక సందర్భంగా దేశవ్యాప్తంగా అతడి ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. శనివారం ఉదయం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా చేరుకున్న మెస్సీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అతడు వస్తున్న దారి వెంబడి నిలబడి సందడి చేశారు. అతడు బస చేసి హోటల్ ముందు గుమిగూడారు. ఇక కోల్‌కతా నగరంలో ఎక్కడ చూసినా మెస్సీ అభిమానుల కోలాహలం కనిపించింది.
మధ్యాహ్నం 2 గంటలకు లియోనెల్ మెస్సీ.. (Lionel Messi ) సాల్ట్ లేక్ స్టేడియంలో సందడి చేయనున్నారు. దీంతో ఈ ఉదయం నుంచే అభిమానులు భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మెస్సీని చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ తరలివచ్చారు. నేపాల్ నుంచి కూడా కొంత మంది అభిమానులు కోల్‌కతా చేరుకోవడం విశేషం. కొత్తగా పైళ్లైన ఓ జంట తమ హనీమూన్‌ను సైతం వాయిదా వేసుకుని మెస్సీని చూసేందుకు వచ్చింది.
సాల్ట్ లేక్ స్టేడియం వద్ద కొత్త జంట ఏఎన్ఐ వార్తా సంస్థలతో మాట్లాడింది. "గత శుక్రవారం నా పెళ్లి జరిగింది. మెస్సీ వస్తున్నాడని తెలిసి హనీమూన్ ప్లాన్‌ను రద్దు చేసుకున్నాను. మెస్సీ పర్యటనే నాకు ముఖ్యం. నేను 2010 నుంచి అతడిని అనుసరిస్తున్నాన''ని నవవధువు తెలిపారు. ఆమె భర్త కూడా మెస్సీ అభిమాని కావడంతో ఇద్దరు అతడిని చూడటానికి వచ్చారు.
''ఈ మధ్యనే మాకు పెళ్లయింది. మెస్సీ ఇండియా పర్యటన కారణంగా హనీమూన్ రద్దు చేసుకున్నాం. ఎందుకంటే ముందుగా మేము మెస్సీని చూడాలనుకున్నాము. అతడిని చూడటానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. పది పండేన్నేళ్లుగా అతడిని ఫాలో అవుతున్నామ''ని కొత్త పెళ్లి కొడుకు మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నాడు.
చదవండి: 70 అడుగుల విగ్రహం.. మెస్సీ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
మెస్సీని చూడటం నా కల
మెస్సీని దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూడడం తన చిరకాల స్వప్నమని నేపాల్ (Nepal) నుంచి వచ్చిన అభిమాని చెప్పాడు. ''నేను నేపాల్ నుండి వచ్చాను. మెస్సీని చూడటం నా కలల్లో ఒకటి. మా దేశం తరపున భారతదేశానికి ధన్యవాదాలు. కేవలం మెస్సీని చూడటానికే టిక్కెట్లు కొన్నాను. నన్ను ఇక్కడికి రావడానికి అనుమతించి, నా కలను నిజం చేసిన నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు, సోదరుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మెస్సీని చూడటానికి కాలేజీ ఎగ్గొట్టి ఎంతో దూరం నుంచి కోల్‌కతాకు వచ్చాను. మెస్సీని చూడటానికి అడ్డుపడితే నా భార్యకు విడాకులు ఇచ్చేస్తాన''ని అన్నాడు.
#WATCH | West Bengal | Fans of star footballer Lionel Messi line up outside the Salt Lake stadium in Kolkata for the first leg of his G.O.A.T. Tour India 2025. pic.twitter.com/Fa1POGEje2
— ANI (@ANI) December 13, 2025


