అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి అతడు ఆరాధ్య ఆటగాడు. భారత్‌లో క్రికెట్ మతంలాంటిదే అయినా.. మెస్సీకి కూడా ఇక్కడ చాలా మందే అభిమానులు ఉన్నారు.
హైదరాబాద్ పర్యటన ఇలా
‘ది గోట్ టూర్’లో భాగంగా మెస్సీ భారత్‌కు రానుండటంతో వారంతా అతడిని నేరుగా చూడాలని ఆశపడుతున్నారు. ఇక ముందుగా ప్రణాళికలో లేకపోయినా.. చివరి నిమిషంలో మెస్సీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఈ లెజెండరీ ప్లేయర్ స్వయంగా వెల్లడించాడు.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చి.. అక్కడి నుంచి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు మెస్సీ చేరుకోనున్నాడు. రాత్రి ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియానికి వచ్చి ఫ్యాన్స్‌ను కలవడంతో పాటు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తిర విషయాలు మీకోసం..

ఆమె గుర్తుగా ఆకాశంలోకి చూస్తూ..
👶అర్జెంటీనాలోని సాంటా ఫేలో గల రొసారియోలో 1987, జూన్ 24న మెస్సీ జన్మించాడు.
👶నాలుగేళ్ల వయసులోనే తన మొదటి క్లబ్ గ్రాండోలిలో జాయిన్ అయ్యాడు. అన్నట్లు అక్కడ కోచ్ మెస్సీ వాళ్ల నాన్న జోర్జ్ మెస్సీ.
👶ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మెస్సీ ఎదగడంలో వాళ్ల నానమ్మ సెలియా ప్రభావం ఎక్కువ. అతడితో పాటు మ్యాచ్‌లకు హాజరవుతూ అతడిని ప్రోత్సహించేవారామె. ఆమె గుర్తుగా గోల్ సాధించిన ప్రతిసారి ఆకాశం వైపు చూపిస్తూ మెస్సీ తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు.
👶ఏడేళ్ల వయసులో మెస్సీ వెనెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్‌లో చేరాడు.
👶పదేళ్ల వయసులో మెస్సీకి హార్మోన్ డెఫిషియెన్సీ ఉన్నట్లు తేలగా.. చికిత్సతో దానిని అధిగమించాడు.

వారిద్దరు.. వారికి ముగ్గురు
👩❤️💋👨తన చిన్ననాటి స్నేహితురాలు అంటోనెలా రొకజోను మెస్సీ పెళ్లి చేసుకున్నాడు.
👨👩👦👦ఈ జంటకు ముగ్గురు కుమారులు థియాగో, మెటేయో, సీరో సంతానం.
🫂అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టులోని సహచరుడు సెర్గియో అగురో మెస్సీకి ప్రాణ స్నేహితుడు

ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
🖤మెస్సీ ఒంటిపై పచ్చబొట్లు ఎక్కువే. అయితే, ఇవన్నీ అతడి కుటుంబ సభ్యులకు చెందినవే. భార్య కళ్లు, కుమారుల పేర్లు, వారి హస్త ముద్రలు, తన తల్లి చిత్రాన్ని టాటూలుగా వేయించుకున్నాడు మెస్సీ.
💰ప్రపంచంలోని సుసంపన్న అథ్లెట్లలో మెస్సీ ఒకడు. అతడి నెట్‌వర్త్ విలువ 2025 నాటికి రూ. ఏడు వేల కోట్ల రూపాయలు అని అంచనా!
🎶అన్నట్లు లియోనల్ మెస్సీకి ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?.. అతడి తల్లి ఫేవరెట్ సింగర్ లియోనల్ రిచ్చీ పేరు మీదుగా లియోనల్‌గా మెస్సీకి ఆమె నామకరణం చేశారు.

చిరస్మరణీయ విజయం
🌟మెస్సీ అత్యధికంగా ఎనిమిదిసార్లు బాలన్ డిఓర్ అవార్డులు గెలుచుకున్నాడు.
🥇2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అర్జెంటీనా తరఫున మెస్సీ గోల్డ్ మెడల్ గెలిచాడు.
⚽🏆మెస్సీ కెరీర్‌లో చిరస్మరణీయ విజయం.. అర్జెంటీనా సారథిగా 2022లో ఫిఫా వరల్డ్‌కప్ గెలవడం.


