breaking news
Argentina
-
మెస్సీ సేనకు ఘనస్వాగతం.. కానీ చిన్న ట్విస్ట్!
ఫిఫా ప్రపంచకప్ 2026లో రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున మెస్సీ సేన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది. ముందుగా బ్యూనస్ ఎయిర్స్‌లోని ఐజా అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బందికి మూడు ప్రత్యేక ఓపెన్‌టాప్ బస్సులను ఏర్పాటు చేశారు. Phot Credit: FIFA Twitterఈ క్రమంలో ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ బ్యూనస్ ఎయిర్స్కు చేరుకునే దారిలో అభిమానులు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనంతో రాజధాని వీధులు నిండిపోయాయి. మ్యూజిక్ చాంటింగ్స్, ర్యాప్ సాంగ్స్‌తో వీధులన్నీ హోరెత్తిపోయాయి. భారీగా తరలివచ్చిన అభిమానులను చూసిన అర్జెంటీనా ఆటగాళ్లు బస్ క్యాబిన్ డోర్లను ఓపెన్ చేసి బయటకు వచ్చి అభివాదం చేశారు. చేతిలో ఫిఫా ట్రోఫీలకు బదులు వాళ్లు సాధించిన సిల్వర్ మెడల్స్, సిల్వర్ ట్రోఫీలను చూసే అభిమానులు మురిసిపోయారు. ట్రోపీలు ఎవడికి కావాలి.. మీ ఆటతో మనసులు గెలిచారు అని అభిమానులు తమ సందేశాలు వినిపించారు.'కమాన్ అర్జెంటీనా' అని నినాదాలతో హోరెత్తించారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. Phot Credit: FIFA Twitterఅర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ జట్టుతో ప్రయాణం చేయలేదు. తన కుటుంబం కూడా తనతోనే ఉండడంతో మెస్సీ అమెరికాలోనే ఉండిపోయాడు. ఇంటర్ మియామి క్లబ్ తరఫున ఆడుతున్న మెస్సీ కొంత బ్రేక్ తర్వాత మళ్లీ ఆ క్లబ్‌తో జాయిన్ అవ్వనున్నాడు. దీంతో ఫిఫా ప్రపంచకప్ తర్వాత మెస్సీ స్వదేశానికి వస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. తమ ఆరాధ్య దైవాన్ని లైవ్‌లో చూడాలని ఆశించిన అభిమానులకు భంగపాటు ఎదురైంది. Phot Credit: FIFA Twitterఅయితే తాను రాకున్నా తాను సాధించిన సిల్వర్ బూట్‌ను మాత్రం అభిమానులకు కానుకగా జట్టుతో పాటే పంపించాడు. గోల్‌కీపర్ ఎమిలియో మార్టినేజ్ సహా నికోలస్ ఒటమెండి, మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్, అలెక్సిక్మాక్ అలిస్టర్, నికోలస్ గొంజలెజ్, సహా అర్జెంటీనా ఆటగాళ్లు తమను చూసేందుకు వచ్చిన అభిమానులను ఉద్దేశించి అభివాదం చేస్తూ కృతజ్ఞతలు చెప్పడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Phot Credit: FIFA Twitterఇక ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా ఫైనల్లో స్పెయిన్ చేతిలో 1-0తో పరాజయం చవిచూసింది. ఫెర్నాండేజ్ రెడ్‌కార్డుకు గురవ్వడంతో పది మందితోనే ఆడిన అర్జెంటీనా మ్యాచ్‌ను లాక్కొచ్చింది. ఫిఫా టోర్నీ అంతటా అర్జెంటీనా జట్టును తన భుజస్కందాలపై మోసిన మెస్సీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు. అయితే టోర్నీ ఆసాంతం అసాధారణ ఆటను కనబరిచిన మెస్సీ 8 గోల్స్‌తో సిల్వర్ బూట్‌ను సొంతం చేసుకున్నాడు. వచ్చే ఫిఫా ప్రపంచకప్ (2030)లో మెస్సీ ఆడడం అనుమానమే కాబట్టి తమ ఆరాధ్య ఆటగాడిని చివరిసారి అర్జెంటీనా జాతీయ జెర్సీలో చూడాలని ఆశించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. 🇦🇷💙 ¡GRACIAS POR TODO, SELECCIÓN!📹 @Argentina pic.twitter.com/fzzLE6k1Be— TyC Sports (@TyCSports) July 21, 2026Despite the World Cup final loss, thousands of Argentine fans were there to welcome their heroes home. Respect. 🫡 🇦🇷🩵 pic.twitter.com/Bo9UfU60nL— MC (@CrewsMat10) July 20, 2026Argentina 🩵 pic.twitter.com/gn9ZhMuDP3— Selección Argentina in English (@AFASeleccionEN) July 20, 2026Read: అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ -
స్పెయిన్ నంబర్‌వన్.. ర్యాంకింగ్స్‌లో మొరాకో, నార్వే సంచలనం
ఫిఫా ప్రపంచకప్ 2026 టైటిల్ గెలుచుకున్న స్పెయిన్ జట్టు మరోసారి నంబర్‌వన్ ర్యాంకును అందుకుంది. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఫిఫా అధికారికంగా ర్యాంకులను విడుదల చేసింది. చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ నంబర్‌వన్ స్థానానికి చేరుకోగా, రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా రెండో స్థానానికి పడిపోయింది. Photo Credit: FIFA Twitterర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, ఈసారి ఫిఫాలో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న మొరాకో, నార్వే జట్లు మాత్రం సంచలనం సృష్టించాయి. ఫిఫా చరిత్రలోనే మొరాకో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుంది. క్వార్టర్స్‌లో ఓడిన మొరాకో ఆరో స్థానంలో నిలిచింది. ఎర్లింగ్ హాలండ్ సారథ్యంలోని నార్వే కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. ఈ ఫిఫాలో క్వార్టర్స్ చేరుకొని చరిత్ర సృష్టించిన నార్వే 12 స్థానాలు ఎగబాకి 19వ స్థానం (టాప్-20)లో నిలిచింది.Photo Credit: FIFA Twitterఇక కాంస్యం గెలిచిన ఇంగ్లండ్ మూడో స్థానంలో, ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టిన పోర్చుగల్ రెండు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోగా, అదే సమయంలో బ్రెజిల్ ఐదో స్థానానికి చేరుకుంది. ఇక బెల్జింయం, నెదర్లాండ్స్, మెక్సికో వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలు దక్కించుకున్నాయి. ఫిఫా 2026లో పేలవ ప్రదర్శన కనబరిచిన మాజీ చాంపియన్ జర్మనీ మాత్రం టాప్-10లో చోటు కోల్పోయి 12వ స్థానంలో నిలవగా, క్రొయేషియా 13వ స్థానంలో ఉంది. ఇక ఈసారి ఫిఫాలో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న అనామక జట్టు కేప్‌వెర్డె 8 స్థానాలు ఎగబాకి 64వ స్థానంలో నిలిచింది. ఈ ఫిఫాలో కేప్‌వెర్డె ప్రిక్వార్టర్స్ వరకు చేరుకున్న సంగతి తెలిసిందే.చదవండి: అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ -
అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి తర్వాత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ తొలిసారి స్పందించాడు. వరుసగా రెండోసారి ఫిఫా గెలవాలనుకున్న అతడి కలలను స్పెయిన్ ఆవిరి చేయడంతో మైదానంలోనే చిన్న పిల్లాడిలా మారిపోయి వెక్కివెక్కి ఏడ్చాడు. ఇది చూసిన అభిమానులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఫైనల్ ముగిసిన ఒకరోజు తర్వాత మెస్సీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ లేఖను పంచుకున్నాడు. 'ఫలితం చూసిన తర్వాత చాలా బాధేసింది. ఈ గాయం మానడానికి సమయం పడుతుంది. కానీ ఏదైనా అంతా మంచే జరగాలనే దానికే నేను కట్టుబడి ఉంటాను.' అని మెస్సీ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు.'ప్రతీ మ్యాచ్‌లో ప్రాణం పెట్టి ఆడామనే అనుకుంటున్నాం. ఈ ఫిఫా టోర్నీలో మా దేశ ప్రజలు ప్రతీ విషయంలో మాకు అండగా నిలవడంతో వారి మద్దుతుతోనే కష్టపడ్డాం. ఫైనల్ దాకా చేరుకున్నాం. జట్టు కృషి, ప్రయత్నం కలగలిసి అర్జెంటీనాను ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలబెట్టిందని బలంగా చెప్పగలను. ఇవాళ ఓటమితో మనం సాధించిన విజయాన్ని చెప్పుకోవడం కష్టమే. కానీ వరుసగా రెండు ఫిఫా ప్రపంచకప్పుల్లో అర్జెంటీనా ఫైనల్ చేరిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి (అర్జెంటీనాతో పాటు మిగతా దేశాలు) పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నా. మనమంతా ఎప్పటికీ ఇలానే ఐక్యంగా ఉంటూ అర్జెంటీనా ఖ్యాతిని కాపాడుకుందాం. ఇక చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌కు కూడా నా ప్రత్యేక అభినందనలు' తెలుపుతూ లేఖను ముగించాడు.2026 ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాను మెస్సీనే మరోసారి అన్నీ తానై నడిపించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో (ప్రి-క్వార్టర్ ఫైనల్ వరకు) కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ గోల్డెన్ బూట్ రేసులోను దూసుకెళ్లాడు. 9 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, 4 అసిస్ట్‌లతో సిల్వర్ బూట్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో దుర్భేద్యమైన స్పెయిన్ ఫార్వార్డ్ ప్లేయర్లను అడ్డుకోవడమే సరిపోవడంతో మెస్సీ కూడా ఏం చేయలేకపోయాడు. ఒకవేళ ఈసారి అర్జెంటీనా ఫిఫా టైటిల్‌ను గెలిచి ఉంటే, ఆ మరుక్షణమే మెస్సీ ఆటకు వీడ్కోలు పలికేవాడేమో. ప్రస్తుతం తన రిటైర్మెంట్పై మౌనమే వహించినప్పటికీ 2030 ఫిఫాలో మెస్సీ ఆడడం అనుమానమే. కాబట్టి ఫుట్‌బాల్‌లో ఒక శకం దాదాపు ముగిసినట్లే. 🚨🚨📲 Leo Messi on IG: "The pain is immense, and it will take time for this wound to heal. "But I also choose to hold on to all the good things, the matches we turned around by giving everything, moments that will remain in our memories forever and the support of an entire… pic.twitter.com/3ZL4yFKhmA— All About Argentina 🛎🇦🇷 (@AlbicelesteTalk) July 20, 2026 ESTE ULTÚIMO TANGO Una de las cosas más hermosas del fútbol es tener a Lionel Andrés Messi y su participación en todos los Mundiales. Gracias por todo lo que has logrado con la selección: récords, logros y campeonatos Gracias por cada momento de alegría que compartimos con la… pic.twitter.com/6GYfKBKpnz— AR (@ionlylei) July 20, 2026Lionel Messi, Arjantin taraftarlarının tezahüratıyla duygulanıyor. pic.twitter.com/FkN2VjlUSm— Messi Anıları (@messianilari) July 19, 2026చదవండి: బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం! -
కిక్ ఎక్కించింది...
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఫుట్‌బాల్ క్రీడ మెగా ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 23వ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున తెరపడింది. 39 రోజులపాటు 48 జట్ల మధ్య 104 మ్యాచ్‌లు జరిగాయి. స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ ఏకపక్షంగా ముగిసినా... మ్యాచ్ విరామ సమయంలో జరిగిన కార్యక్రమాలు కట్టిపడేశాయి. షకీరా, మడోన్నా, బీటీఎస్, స్పీడ్, జస్టిన్ బీబెర్లాంటి స్టార్స్‌తో కార్యక్రమం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ టోర్నీలోని మ్యాచ్‌లను ఏకంగా 68,10,966 ప్రేక్షకులు మైదానంలోకి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించడం ఓ కొత్త రికార్డు. నాలుగేళ్ల తర్వాత జరిగే 24వ ప్రపంచకప్ టోర్నీకి 2030లో స్పెయిన్, పోర్చుగల్, మొరాకో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2030లో ప్రపంచకప్ టోర్నీకి 100 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో తొలి ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ఉరుగ్వే, రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా, పరాగ్వే మూడు సెంటీనరీ మ్యాచ్‌లకు వేదికగా నిలుస్తాయి. ఫలితంగా స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, ఉరుగ్వే, పరాగ్వే, అర్జెంటీనా దేశాలు 2030 ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. 2030 ప్రపంచకప్‌ను 64 దేశాలతో నిర్వహించాలని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) భావిస్తోంది. దీనిపై తుది నిర్ణయం రాబోయే రోజుల్లో తీసుకుంటారు. -
సాహోరే స్పెయిన్
అంచనాలకు మించి మెరిపించిన స్పెయిన్ జట్టు రెండోసారి జగజ్జేతగా నిలిచింది. తుది సమరంలో ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడుతూ డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆట కట్టించింది. సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఒక్కొక్కరు కాదు జట్టుగా ఆడితే ప్రపంచాన్ని జయించవచ్చని స్పెయిన్ నిరూపించింది. మొదట్లో వెనుకబడినా చివర్లో చెలరేగిపోతూ విజయాన్ని లాగేసుకుంటున్న అర్జెంటీనాకు తుది పోరులో స్పెయిన్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. నిర్ణిత 90 నిమిషాల్లో గోల్ చేయలేకపోయినా... అదనపు సమయంలో స్పెయిన్ సక్సెస్ సాధించింది. 106వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా తమ జోరును కొనసాగించి అర్జెంటీనాకు నిరాశను మిగిల్చింది. 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ విశ్వవిజేత కావడంతో ఆ దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. సోమవారం స్వదేశానికి వచ్చిన ప్రపంచకప్ వీరులకు ఆ దేశం బ్రహ్మరథం పట్టింది. తిరుగులేని ఆధిక్యం... ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట ఆరంభమైన దగ్గరి నుంచి దాదాపు మ్యాచ్ ముగిసే వరకు బంతి స్పెయిన్ నియంత్రణలోనే ఉంది. ఈజిప్‌్ట, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌ల తరహాలో అర్జెంటీనా ఆఖర్లో కోలుకుంటుందని అందరూ భావించినా... స్పెయిన్ అసలు అలాంటి అవకాశమే ఇవ్వలేదు. తుది పోరులో జట్టు సభ్యులు ఒకరికొరకు ఏకంగా 853 పాస్‌లు ఇచ్చుకున్నారంటే, ప్రత్యర్థికంటే కనీసం 400 సార్లు ఎక్కువగా బంతిని ‘టచ్’ చేశారంటేనే స్పెయిన్ ఎలా బంతిపై పట్టు నిలబెట్టుకుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ముగ్గురు ప్లేయర్లు కుబార్సి, లాపోర్ట్, రోడ్రి మధ్యనే బంతి తిరుగాడింది. ఇద్దరు డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్ కలిపి ఫైనల్లో 359 సార్లు బంతిని ‘టచ్’తో తమ మధ్యే ఉంచుకున్నారు. టోర్నీ మొత్తంలో ఒకే ఒక గోల్ ఇవ్వడం జట్టు ఆధిపత్యాన్ని సూచిస్తోంది. టీమ్ మొత్తం 20 షాట్లు ఆడగా... 12 నేరుగా లక్ష్యంవైపే వెళ్లాయి. ఫైనల్ స్కోర్ 1–0తో చూస్తే మ్యాచ్ హోరాహోరీగా సాగిందేమో అనిపిస్తుంది. కానీ ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఒక జట్టు మాత్రమే పూర్తి ఏకపక్షంగా మ్యాచ్‌లో నిలిచింది. ఏకైక గోల్ సాధించిన ఫెరాన్ టోరెస్‌తో పాటు ఈ గోల్లో అతనికి సహకరించిన పెడ్రో పొరోస్, నికో విలియమ్స్... ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన మికెల్ మెరీనో, కెపె్టన్ రోడ్రి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక గోల్‌కీపర్ యునై సైమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడు మ్యాచ్‌లలో ‘క్లీన్ షీట్’తో అతను జట్టును కాపాడిన తీరు నిజంగా సూపర్.వరుస టైటిల్స్ జోరు... రెండేళ్ల క్రితం బెర్లిన్‌లో యూరోపియన్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న స్పెయిన్ ఇప్పుడు ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 2008లో కూడా సరిగ్గా ఇదే తరహాలో యూరోప్ విజేతగా నిలిచిన రెండేళ్లకు ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. నేషన్స్ లీగ్, అండర్–23 ఒలింపిక్ స్వర్ణం, అండర్–19 యూరోపియన్ చాంపియన్‌షిప్‌లతో కలిపితే గత ఐదేళ్లలో స్పెయిన్ పురుషుల జట్టు 5 పెద్ద టోరీ్నల్లో విజేతగా నిలవడం విశేషం. వీటికి తోడు 2023లో మహిళల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కూడా సాధించిన స్పెయిన్...రెండు విభాగాల్లో ఒకే సారి ప్రపంచ కప్‌ను తమ వద్ద ఉంచుకున్న తొలి జట్టుగా నిలిచింది. దీనిని బట్టి చూస్తే ఫుట్‌బాల్‌లో స్పెయిన్ ఎంత నిలకడగా, ఘనంగా రాణిస్తుందో అర్థమవుతుంది. చేతులెత్తేసిన అర్జెంటీనా... వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయం 90 నిమిషాల వరకు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై ఒక్క షాట్ కూడా ప్రయత్నించని మొదటి జట్టుగా అర్జెంటీనా నిలిచింది! 117వ నిమిషంలో గానీ తొలి షాట్ కొట్టని జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశించగలమా! స్పెయిన్‌తో తుది పోరులో అర్జెంటీనా పరిస్థితి ఇలాగే కనిపించింది. అసలు ఇలాంటి ఆటను అభిమానులెవరూ ఊహించలేదు. మెస్సీపైనే అందరి దృష్టీ ఉండగా... ఇతర ఆటగాళ్లెవరూ జట్టు కోచ్ స్కలోని అంచనాలు నిలబెట్టలేకపోయారు. మ్యాక్ అలిస్టర్, రోడ్రిగో డి పాల్, లియాండ్రో పెరేడ్స్ ఫైనల్లో పూర్తిగా విఫలమయ్యారు. అసలు సమరంలో మెస్సీని నిలువరించడంలో స్పెయిన్ పూర్తిగా సఫలమైంది. మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాల ముందు మెస్సీ కొట్టిన కార్నర్ కిక్‌ను సబ్‌స్టిట్యూట్ గ్విలియోనా సిమోన్ క్రాస్ బార్ మీదుగా పంపించి వృథా చేయడం జట్టు పరిస్థితికి అద్దం పట్టింది. ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డుతో మైదానం నుంచి ని్రష్కమించడంతో చివర్లో 10 మందితోనే ఆడటం కూడా అర్జెంటీనా జట్టుకు చేటు చేసింది. నిజానికి స్పెయిన్ విజయం మ్యాచ్ ఆరంభంలోనే ఖాయమయ్యేది! అయితే అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్జినెజ్ అసాధారణ ప్రదర్శనతో గెలుపు ఆలస్యమైంది. ఫైనల్లో రికార్డు స్థాయిలో 12 షాట్లను అతను అడ్డుకోగలిగాడు.భవిష్యత్తు కూడా వారిదే...ఎనిమిది మ్యాచ్‌లలో ఒకే ఒక్క గోల్ ఇవ్వడం... దాదాపు లోపాలు లేని ఆట... ఇద్దరు 19 ఏళ్ల కుర్రాళ్లను సమర్థంగా వాడుకోవడంతో పాటు వారి చుట్టూ సీనియర్లతో కలిపి జట్టును సన్నద్ధం చేయడం... టోర్నీ ఆరంభానికి ముందే తాము అనుకున్న ప్రణాళికకు పూర్తి కట్టుబడి దానినే అమలు పర్చడం... స్పెయిన్‌ను రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిపాయి. ఈ జట్టు ఎలాంటి థ్రిల్లర్ సినిమాను తలపించే అనూహ్య మలుపుల తరహా ఆట ఆడలేదు. కానీ ఏం చేయాలనే దానిపై జట్టుకు చాలా స్పష్టత ఉంది. మిడ్‌ఫీల్డర్లు సత్తా చాటి దూసుకుపోగా, డిఫెండర్లు అయిన అద్భుత ఆటను ప్రదర్శించారు. ప్రతీ మ్యాచ్‌లో ఒక్కో హీరో జట్టు నుంచి వచ్చాడు. ఏడుగురు ప్లేయర్లు గోల్ స్కోరర్లు కావడం విశేషం కాగా క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), డిబ్రూయిన్ (బెల్జియం), ఎంబాపె (ఫ్రాన్స్), మెస్సీల వంటి స్టార్లను స్పెయిన్ డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. టోర్నీ మొత్తంలో కలిపి ప్రత్యర్థులకు 43 సార్లు మాత్రమే షాట్లకు అవకాశం చిక్కింది. స్పెయిన్ గెలుపు ఇక్కడితోనే ఆగిపోదు. వచ్చే దశాబ్దంలో ఫుట్‌బాల్‌ను శాసించగల సామర్థ్యం టీమ్‌లో ఉంది. 19 ఏళ్ల ఇద్దరు కుర్రాళ్లు భవిష్యత్తులో టీమ్‌ను ముందుకు తీసుకెళ్లగలరు. ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ కుబార్సి అద్భుతంగా ఆడుతుండగా... లమీన్ యామల్ విలువేమిటో ప్రపంచం ఇప్పటికే చూసింది. ఈ వయసులోనే వీరిద్దరు వరల్డ్ కప్ నెగ్గిన బృందంలో సభ్యులుగా ఉన్నారు.2026 ప్రపంచకప్ అవార్డులుగోల్డెన్ బూట్ (టోర్నీ టాప్ స్కోరర్): కిలియన్ ఎంబాపె (ఫ్రాన్స్; 10 గోల్స్). 2022 ప్రపంచకప్‌లోనూ ఎంబాపెకే గోల్డెన్ బూట్ అవార్డు లభించింది. వరుసగా రెండు ప్రపంచకప్‌లలో గోల్డెన్ బూట్ గెల్చుకున్న ఏకైక ప్లేయర్ ఎంబాపెనే. గోల్డెన్ బాల్ (టోర్నీ బెస్ట్‌ప్లేయర్): స్పెయిన్ కెప్టెన్ రోడ్రి. గోల్డెన్ గ్లౌవ్ (టోర్నీ బెస్ట్ గోల్‌కీపర్): స్పెయిన్ గోల్‌కీపర్ సిమోన్. మొత్తం ఎనిమిది మ్యాచ్‌ల్లో సిమోన్ ఒక్క గోల్ మాత్రమే సమరి్పంచుకున్నాడు. బెస్ట్ యంగ్ ప్లేయర్: కుబార్సి (స్పెయిన్). ఫెయిర్‌ప్లే అవార్డు: నెదర్లాండ్స్ – సాక్షి క్రీడా విభాగం -
స్పానియార్డ్స్ జయకేతనం
ఆటపై అంకితభావం... అవతలి జట్టుపై గెలవటానికి పక్కా వ్యూహం... తిరుగులేని క్రమశిక్షణ... అన్నిటికీ మించి జట్టు మొత్తం ఒక వ్యవస్థగా పనిచేయటం సోమవారం వేకువజామున న్యూజెర్సీ వేదికగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. సాకర్ ప్రపంచ కప్ సంరంభంలో మొదట్లో ఎవరికీ పెద్దగా అంచనాలు లేని స్పెయిన్ జట్టు అందరినీ అధిగమించి విశ్వవిజేతగా నిలిచింది. క్రీడాభిమానుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఇలాంటి ఘట్టాలు సాకర్ చరిత్రలో బహుశా అరుదుగా నమోదైవుంటాయి. అలాగని స్పెయిన్ తక్కువేం కాదు. అది తొలిసారిగా 2010లో దక్షిణాఫ్రికాలో ప్రపంచకప్ సాధించింది. అంతక్రితం సాకర్ యూరో కప్‌ను మూడుసార్లు – 1964, 2008, 2012లలో గెలుచుకుంది. ఒకరకంగా 2008 నుంచి 2012 వరకూ అది ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించిందని చెప్పాలి. కానీ అనంతరకాలంలో దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరింది. మొదట్లో స్పెయిన్‌కు విజయపరంపర అందించిన ‘టికి–టాకా’ వ్యూహం (ఆటగాళ్లు బంతిని పాస్‌లు ఇచ్చుకుంటూ తమమధ్యే ఉంచుకోవటం), గోల్ పోస్ట్ వైపు వెళ్లే చొరవ తగ్గటానికి దారితీసింది. ప్రత్యర్థులు సులభంగా అంచనావేసే స్థితి ఏర్పడింది. దిగ్గజా లనదగ్గ జావి, ఇనియెస్టా, కార్లెస్, సెర్గియో రామోస్ వంటి ఆటగాళ్లు వరసగా నిష్క్రమించినప్పుడు ఆ ఖాళీలను భర్తీ చేయటంలో బోర్డు విఫలమైంది. కొత్తగా వచ్చినవారికి అంతర్జాతీయ టోర్నీల ఒత్తిడిని తట్టుకునే అనుభవం లేకపోయింది. అయితే కాలం మారింది. లామిన్ యామాల్ వంటి యువ సంచలనం, ఫెర్రాన్ టోరెస్ వంటి సమర్థుడు చరిత్ర తిరగరాశారు. అటు అర్జెంటీనా అసామాన్యమైనది. నిన్న మొన్నటివరకూ దానివైపు తలెత్తి చూడటానికి కూడా ప్రత్యర్థులు సాహసించనంతటి అరివీరభయంకర జట్టు. మారడోనా, మెస్సీ వంటి సార్వకాలిక మహా దిగ్గజాలను ప్రపంచానికందించిన ఆ దేశం ఎప్పుడూ ఫుట్‌బాల్‌లో తిరుగులేని శక్తిగానే ఉంది. 1978, 1986, 2022లలో అర్జెంటీనా ఆటగాళ్లు మహాద్భుతాలను ప్రదర్శించి దేశాన్ని విశ్వవిజేతగా నిలిపారు. దక్షిణమెరికా ఖండంలో అత్యున్నత టోర్నమెంటు అయిన ‘కోపా అమెరికా’లో ఏకంగా 16 సార్లు ఆ టైటిల్‌ను గెలిచిన చరిత్ర అర్జెంటీనా ఆటగాళ్లది. మెస్సీది అద్భుతమైన నైపుణ్యం. చెప్పాలంటే అతనిది భావోద్వేగంతో ముడిపడివుండే మాయాజాలం. అది ఇన్నాళ్లూ రాణించింది. ప్రత్యర్థులు దరిదాపుల్లోకి రావటం కూడా అసాధ్యమనిపించే రీతిలో పనిచేసింది. కానీ భారమంతా మెస్సీపైనే పడటం ఆ జట్టుకు పెద్ద మైనస్ అయికూర్చుంది. అవతల స్పెయిన్ ఆటగాళ్లు ఉక్కు క్రమశిక్షణతో, అంకితభావంతో ఆడి మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించిన తీరు అర్జెంటీనాను కోలుకోలేని దెబ్బతీసింది. ఒలింపిక్స్ అయినా, సాకర్ వంటివైనా ప్రపంచ దేశాలమధ్య సద్భావనను పెంపొందించే సందర్భాలు. నిన్న మొన్నటివరకూ కలహాలతో చెలరేగిపోయిన దేశాల ఆటగాళ్లు ఆ యుద్ధంరేపిన గాయాలు మరిచి పరస్పరం చేతులు కలపడం గుర్తుంచుకోదగిన క్షణాలవుతాయి. ఈసారి ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికా ప్రపంచ దేశాలను అష్ట కష్టాలు పెడుతూ పగబట్టినట్టు ప్రవర్తిస్తూ వచ్చింది. ఆఖరికి సాకర్ సాగుతున్న దశలో కూడా అది ఇరాన్‌పై క్షిపణిదాడులతో చెలరేగిపోయింది. ఆ చీడను ఇరాన్ ఆటగాళ్లకూ పులిమింది. ప్రాక్టీసింగ్ మ్యాచ్‌లు ఇక్కడ కుదరదంటూ విమానాశ్రయంనుంచే వెనక్కి పంపింది. చివరకు వారు మెక్సికోలో బసచేసి, అక్కడే ప్రాక్టీస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆట ముగిసీ ముగియగానే మెక్సికో వెళ్లటానికి విమానాశ్రయానికి తరలించేది. అన్ని అవమానాలనూ దిగమింగుకుంటూనే అమెరికా క్రీడాభిమానులుసహా ప్రపంచమంత టినీ ఇరాన్ జట్టు అలరించింది. మొత్తానికి అమెరికా అగ్రరాజ్య దురహంకారానికి కొత్తగా వచ్చిచేరిన జాత్యహంకారం ఈ సాకర్‌లో కొన్ని చేదు అనుభవాలు మిగిల్చింది. పట్టనట్టున్న ఫిఫా దానికి లొంగి స్వీయ ప్రతిష్ఠను కోల్పోయింది. మైదానంలో రిఫరీదే తుది నిర్ణయంకాగా, ట్రంప్ జోక్యంతో దాన్ని మార్చటం ఫిఫా బలహీనతకు చిహ్నం. మొత్తానికి ఫుట్‌బాల్ అందం దాని దిగ్గజాలు ప్రదర్శించే క్రీడా నైపుణ్యంలో ఉంటుంది. భిన్నమైన ఆట శైలులుగల మెస్సీ, రొనాల్డో, ఎర్లింగ్ హాలండ్ వంటివారు అభిమానులకు శాశ్వతంగా మిగిలే ఆనందకర క్షణాలను అందించారు. -
బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం!
ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్ నిలవడంతో ఆ జట్టు సంబరాలు మాములుగా లేవు. 16 ఏళ్ల తర్వాత రెండోసారి ఫిఫా టైటిల్ గెలవడంతో స్పెయిన్‌లో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఇక స్పెయిన్ ఆటగాళ్ల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. అయితే ఈ ఫిఫా టోర్నీలో ఒక బుడ్డోడు మాత్రం యమా క్రేజ్ సంపాదించాడు. ఆ బుడ్డోడు ఎవరో కాదు స్పెయిన్ స్టార్ లామినె యమాల్ చిన్న తమ్ముడు కీన్. సవతి తల్లికి పుట్టినోడయినప్పటికీ కీన్‌ను యమాల్ సొంత తమ్ముడిలా, కొడుకులా భావిస్తుంటాడు. మూడేళ్ల వయసున్న కీన్ 2026 ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు తన తల్లితో కలిసి హాజరయ్యాడు. ప్రతీ మ్యాచ్‌ను స్టాండ్స్ నుంచి వీక్షించిన కీన్ తన అన్న ఆటను తెగ ఎంజాయ్ చేసేవాడు. Photo Credit: FIFA Twitterఅంతేకాదు స్పెయిన్ తాము ఆడిన ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత యమాల్ తన సోదరుడిని ఒడిలో తీసుకొని ఆడుకోవడం ఆనవాయితీగా చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా యమాల్ దీనిని కంటిన్యూ చేశాడు. తన అన్న కప్ గెలవడంతో తమ్ముడికి సంతోషం ఆగలేదు. గ్రౌండ్ అంతా తనదే అన్నట్లుగా మైదానం నలుమూలలా పరిగెడుతూ సందడి చేశాడు. Photo Credit: FIFA Twitterఈ సందర్భంగా అన్న లామినె యమాల్‌ను కూడా కాసేపు ఆట పట్టించాడు. ట్రోఫీ సెలబ్రేషన్స్ అనంతరం కప్పు తన చేతిలోకి తీసుకున్న యమాల్ తన కుటుంబం దగ్గరకు వచ్చి తమ్ముడితో కలిసి ఫొటోలుకు ఫోజివ్వడం వైరల్‌గా మారింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫిఫా పైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. Lamine Yamal ve kardeşi. pic.twitter.com/gpcwLCiKvz— Pusholder (@pusholder) July 20, 2026 Lamine Yamal celebrating with his brother 🤗 pic.twitter.com/sd8Jg8smgZ— B/R Football (@brfootball) July 19, 2026 It's Keyne's world and we're just living in it 🤣 pic.twitter.com/Qk4I9BAuX4— B/R Football (@brfootball) July 19, 2026చదవండి: దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్‌కు మరో అవమానం! -
మెస్సీ అలా.. లామినే ఇలా; చివరికి!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఓటమి బాధను తట్టుకోలేక అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ స్పెయిన్ ఆటగాళ్లతో తగాదా పెట్టుకున్నాడు. చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవ తన్నుకునేంత వరకు వెళ్లింది. అయితే ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ ఒకవైపు మెస్సీ.. మరోవైపు లామినె యమాల్ మాత్రం తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉండిపోయారు. ఓటమి షాక్ నుంచి తేరుకోని మెస్సీ మైదానంలోనే నిరాశతో కూర్చుండిపోయాడు. తనలో తాను కుమిలిపోతు కన్నీటిపర్యంతమయ్యాడు. Photo Credit: FIFA Twitterమరోపక్క యమాల్ కూడా తన పక్కనే అంత పెద్ద గొడవ జరుగుతున్నప్పటికీ తన దేశం గెలిచిందన్న సంతోషంతో అతను ప్రార్థనల్లో మునిగిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించకుండా యమాల్ తన పనిలో నిమగ్నమై ఉండడం చూస్తే అతడి ఆత్మవిశ్వాసం ఎలాంటిదో అర్థమవుతోంది. ఇంత గొడవలో కూడా మెస్సీ, యమాల్ మధ్య జరిగిన ఒక భావోద్వేగ ఘటన ఆసక్తిగా మారింది.MIENTRAS LAMINE YAMAL REZABA... 😳 pic.twitter.com/9SPl4s4Gep— Diario Olé (@DiarioOle) July 20, 2026Photo Credit: FIFA Twitterఒకరినొకరు ఆలింగనం..లామినే యమాల్ తన ప్రార్థన పూర్తి చేసుకొని లేచిన తర్వాత తన ఎదురుగా పెద్ద గొడవ జరుగుతున్న దృష్ట్యాలను చూశాడు. కానీ దానిని పట్టించుకోకుండా యమాల్ నేరుగా మెస్సీ వద్దకు వచ్చాడు. అప్పటికే నిరాశలో కూరుకుపోయిన మెస్పీని ఓదార్చి పైకి లేపాడు. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం కనిపించింది. ఇది చూసిన అభిమానులు.. 'క్యా సీన్‌హై' అనకుండా ఉండలేకపోయారు. వీరిద్దరు ఆలింగనం చేసుకున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. 'నిజమైన క్రీడా స్ఫూర్తికి మెస్సీ, యమాల్ అర్థం చెప్పారంటూ' కామెంట్లు చేశారు.అసలేం జరిగింది?ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఓటమి బాధలో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లవైపు చూస్తూ స్పెయిన్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం వారికి కంటికి ఇంపుగా అనిపించలేదు. దీంతో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ ఒక్కసారిగా స్పెయిన్ ఆటగాళ్లవైపు దూసుకొచ్చాడు. Thank you, Leo. Legends are remembered, but you will never be forgotten. 🐐https://t.co/K8dqX5Tvlo— ketansusuw ✿ (@tansuuuw) July 20, 2026ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. Read: మరో ఫిఫా ఆడకపోవచ్చు.. మెస్సీ శకం ముగిసినట్లే! -
మరో ఫిఫా ఆడకపోవచ్చు.. మెస్సీ శకం ముగిసినట్లే!
మెస్సీ ఒక ఉత్పాతం, మౌన ముని. ఎన్ని అడ్డంకులు, వివాదాలు ఎదురైనా తన ఆటతోనే సమాధానం చెప్పాడు తప్ప హద్దులు మీరిన సందర్భాలు చాలా తక్కువ. నిజానికి మెస్సీకి కోపం కూడా ఎక్కువే. కానీ దాని అవసరం ఎంతమేర ఉంటుందో అంతే చూపిస్తుంటాడు. కాబట్టే ఇవాళ ప్రపంచంలో ప్రతీ మూలన అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో ఫుట్‌బాల్ పీలే, మారడోనా సహా ఎందరో దిగ్గజ ఆటగాళ్లను అందించినప్పటికీ ఈ తరంలో మాత్రం మెస్సీనే దిగ్గజ ఆటగాడు. ఇంకా చెప్పాలంటే అతడో ఆరాధ్య దైవం.అలాంటి ఈ తరంలో ఫుట్‌బాల్ తెలిసినోడిని నిద్రలో నుంచి లేపి ఒక ఆటగాడి పేరు చెప్పమంటే మొదట వినిపించే పేరు లియోనల్ మెస్సీ. రెండు దశాబ్దాలుగా తన ఆటతో ఫుట్‌బాల్ అభిమానుల గుండెల్లో గుడి కట్టేసుకున్న మెస్సీ చూడాల్సినవన్నీ చూశాడు. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ అవార్డు, ఆరుసార్లు యూరోపియన్ గోల్డెన్ షేస్, ఎనిమిది సార్లు ఫిఫా బెస్ట్ ప్లేయర్, అలాగే 2025లో ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయర్‌గాను నిలిచాడు. తన కెరీర్లో లోటుగా ఉన్న ఫిఫా ప్రపంచకప్‌ను కూడా నాలుగేళ్ల కిందట ఖతార్‌లోనే అందుకున్నాడు. మరి ఇన్ని చూసినా ఈసారి ఫిఫాలో కూడా మెస్సీ నామజపమే ఎందుకు నడిచిందనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. అదంతా మెస్సీ మాయ.Photo Credit: FIFA Twitterమెస్సీ బరిలో ఉన్నాడంటే చాలు అభిమానులకు ఎక్కడలేని జోష్ వస్తుంది. 2026 ఫిఫా ప్రపంచకప్‌లోనూ అదే రిపీట్ అయింది. ఈసారి ఫిఫాలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాను మెస్సీనే మరోసారి అన్నీ తానై నడిపించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో (ప్రి-క్వార్టర్ ఫైనల్ వరకు) కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ గోల్డెన్ బూట్ రేసులోను దూసుకెళ్లాడు. అయితే అతడి స్పీడుకు ఈసారి ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె (10 గోల్స్, 4 అసిస్ట్‌లు) బ్రేకులు వేశాడు. అయితే క్వార్టర్స్, సెమీస్‌లో గోల్ చేయనప్పటికీ కీలక అసిస్ట్‌లు అందించి జట్టు వెన్నంటే ఉన్నాడు. కానీ కీలకమైన ఫైనల్లో మెస్సీ ఏం చేయలేకపోయాడు. దుర్బేద్యమైన స్పెయిన్ ఫార్వార్డ్ ప్లేయర్లను అడ్డుకోవడంతోనే మెస్సీకి సరిపోయింది. మ్యాచ్‌లో మెస్సీ రెండు క్రాస్‌లతో పాటు ఒక్కసారి మాత్రమే గోల్‌పోస్ట్ వైపు షాట్ ఆడినప్పటికీ స్పెయిన్ గోల్ కీపర్ ఉనైయి సిమోన్ దానిని కూడా సమర్థంగా అడ్డుకున్నాడు. మ్యాచ్‌లో స్పెయిన్ 20 సార్లు తమ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేస్తే.. అర్జెంటీనా మాత్రం రెండుసార్లు మాత్రమే ప్రయత్నం చేయడం గమనార్హం.Photo Credit: FIFA Twitterఇక మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ కన్నీటిపర్యంతమవడం వెనుక ఒక కారణముంది. ఈసారి ఫిఫా ఆరంభం నుంచి అర్జెంటీనా ఆటపై వివాదాలు నెలకొన్నప్పటికీ మెస్సీ మాత్రం తన ఆటను చాలా సందర్భాల్లో నిజాయితీగానే ఆడాడు. ఫైనల్లో కూడా తను చేయాల్సిందంతా చేశాడు. కానీ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన స్పెయిన్ ముందు అర్జెంటీనా పూర్తిగా తేలిపోవడంతో మెస్సీ కూడా చేష్టలుడిగి ఉండిపోయాడు.ఇక 1962 తర్వాత వరుసగా రెండు ఫిఫా ప్రపంచకప్‌లు గెలవాలన్న కల కూడా చెదరడం మెస్సీ కన్నీటికి మరో కారణం. 39 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీ పడుతూ ఆటను కొనసాగించిన మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ ఆడడం అనుమానమే. మంచి ఫామ్‌లో ఉన్నందున ఈసారి ఎలాగైనా అర్జెంటీనాకు రెండోసారి ఫిఫా టైటిల్‌ను అందించాలని మెస్సీ కలగన్నాడు. బరిలోకి దిగిందే తడవుగా ప్రత్యర్థులతో పోరాట సింహంలా తలపడ్డాడు. 8 గోల్స్‌తో పాటు 4 అసిస్ట్‌లు చేసిన మెస్సీ సిల్వర్ బూట్‌ను కూడా గెలుచుకున్నాడు. Photo Credit: FIFA Twitterఅవార్డులు కొత్త కానప్పటికీ ఈసారి మెస్సీ ఫిఫా టైటిల్‌ను గెలిచిన మరుక్షణమే ఆటకు వీడ్కోలు పలికేవాడేమో. ప్రస్తుతం తన రిటైర్మెంట్పై మౌనమే వహించినప్పటికీ 2030 ఫిఫాలో మెస్సీ ఆడడం డౌటే. కాబట్టి ఫుట్‌బాల్‌లో ఒక శకం దాదాపు ముగిసినట్లే. Lionel Messi, Arjantin taraftarlarının tezahüratıyla duygulanıyor. pic.twitter.com/FkN2VjlUSm— Messi Anıları (@messianilari) July 19, 2026Lionel Messi gets emotional as Argentina fans shower him with love and support 🥹 pic.twitter.com/kff4YYJBwu— Instablog9ja (@instablog9ja) July 20, 2026 ESTE ULTÚIMO TANGO Una de las cosas más hermosas del fútbol es tener a Lionel Andrés Messi y su participación en todos los Mundiales. Gracias por todo lo que has logrado con la selección: récords, logros y campeonatos Gracias por cada momento de alegría que compartimos con la… pic.twitter.com/6GYfKBKpnz— AR (@ionlylei) July 20, 2026 -
FIFA World Cup 2026 : ఫిఫా 2026 విశ్వవిజేత స్పెయిన్ (ఫొటోలు)
-
కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. ఏం జరిగింది?
ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా స్పెయిన్ అవతరించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి రెండోసారి ఫిఫా విశ్వవిజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఓటమి షాక్‌లో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లు సహనం కోల్పోయి స్పెయిన్ ఆటగాళ్లతో గొడవకు దిగారు. చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవ తన్నుకునేంత వరకు వెళ్లింది. దీంతో అప్పటివరకు రణరంగంలా కనిపించిన మైదానం యుద్ధభూమిని తలపించింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ గొడవను ఫిఫా తీవ్రంగా పరిగణించింది. ఘర్షణకు కారణమైన లియాండ్రో పరెడేస్పై రెడ్ కార్డు చూపించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో రెడ్ కార్డు అందుకున్న రెండో ఆటగాడిగా పరేడెస్ నిలిచాడు. అంతకుముందు మ్యాచ్ జరుగుతున్న సమయంలో అర్జెంటీనా స్టార్ మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ కూడా రెడ్ కార్డు అందుకున్నాడు. ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో ఆఖరి అంకం దాకా హీరోగా నిలిచిన అర్జెంటీనా ఈ ఒక్క ఘటనతో విలన్‌గా మారిపోయింది. 🚨🥊 Full scenes after final whistle.@MickyJnr__ 🎥 pic.twitter.com/ZXCvAFkHwy— Fabrizio Romano (@FabrizioRomano) July 20, 2026Read: అర్జెంటీనా గెలవదని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫలిస్తుందా? -
సైలెంట్‌గానే.. చరిత్ర సృష్టించాడు!
స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ రోడ్రి అరుదైన ఘనత సాధించాడు. ‘కంప్లీట్ ఫుట్‌బాల్’ వీరుల జాబితాలో 30 ఏళ్ల ఈ మిడ్‌ఫీల్డర్ చేరిపోయాడు. కాగా న్యూయార్క్ వేదికగా భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్లో స్పెయిన్ అర్జెంటీనాపై 1-0 గోల్ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చరిత్ర సృష్టించాడు!ఈ క్రమంలో రోడ్రి ఖాతాలో తొలిసారి వరల్డ్‌కప్ టైటిల్ చేరింది. ఇంతకు ముందు అతడు UEFA చాంపియన్స్ లీగ్, బాలన్ డి ఓర్ అవార్డులు కూడా గెలిచాడు. ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ మూడు అవార్డులను గెలిచిన పదకొండో ప్లేయర్‌గా రోడ్రి చరిత్రకెక్కాడు.ఈ జాబితాలో సర్ బాబీ చార్ల్టన్, ఫ్రాంజ్ బెకెన్బ్యూయర్, గెడ్ ముల్లర్, పవోలో రోసి, జినెదైన్ జిదానే, రివాల్డో, రొనాల్డినో, కకా, లియోనల్ మెస్సీ, డెంబెలె రోడ్రి కంటే ముందు వరుసలో ఉన్నారు.గోల్డెన్ బాల్అదే విధంగా.. బాలన్ డి ఓర్, వరల్డ్‌కప్, చాంపియన్స్ లీగ్‌లతో పాటు గోల్డెన్ బాల్ గెలిచిన నాలుగో ఆటగాడిగానూ రోడ్రి నిలిచాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో రోడ్రి గోల్ కొట్టలేకపోవచ్చు. కానీ సహచరులు గోల్ కొట్టేలా అవకాశాలు కల్పించాడు. టోర్నీ ఆసాంతం అత్యుత్తమంగా రాణించి జట్టు విజయంలో కీలకంగా మారాడు. దీంతో అతడిని గోల్డెన్ బాల్ వరించింది.ఈ అవార్డు అందుకున్న తొలి స్పెయిన్ ఆటగాడు కూడా రోడ్రి కావడం విశేషం. కాగా 2015లో జాతీయ జట్టులోకి వచ్చిన రోడ్రి.. 2022లోనే తొలిసారి వరల్డ్‌కప్ ఆడాడు. ఇక ఈసారి ఏకంగా కెప్టెన్‌గా స్పెయిన్‌కు టైటిల్ అందించాడు. పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సి వంటి సారథులు ఎక్కువగా గోల్స్ చేస్తూ వార్తల్లో ఉంటారు. అత్యుత్తమ మిడ్ ఫీల్డర్కానీ రోడ్రి ఆట మాత్రం ఇందుకు భిన్నం. ఆరు అడుగులకుపైగా ఎత్తు ఉండే అతడు.. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ బంతిని పాస్ చేయడంలో దిట్ట. సహచరులు గోల్స్ కొట్టేలా అవకాశాలు సృష్టించే రోడ్రి ప్రపంచంలోని అత్యుత్తమ మిడ్ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో రోడ్రి ఏకంగా 790 పాస్‌లు అందించాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పాస్‌లు ఇచ్చిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. అర్జెంటీనాతో ఫైనల్లో రోడ్రి 101 పాస్‌లు కంప్లీట్ చేయడం విశేషం. చదవండి: స్పెయిన్ 20.. అర్జెంటీనా0: తెర వెనుక హీరో అతడే! -
స్పెయిన్ 20.. అర్జెంటీనా 0: తెర వెనుక హీరో అతడే!
స్పెయిన్.. 2008- 2021 మధ్య ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏలడమే కాదు. ఆట తీరును కూడా మార్చివేసింది. 1988- 96 మధ్య బార్సిలోనా జట్టు ప్రాచుర్యంలోకి తెచ్చిన ‘టికీ-టాకా’ అస్త్రాన్ని పూర్తిగా వాడుకోవడంలో స్పెయిన్ సఫలమైంది.ఇందులో భాగంగా షార్ట్, క్విక్ పాసులతో పాదరసంలా కదులుతూ ఆటగాళ్లు ఎక్కువసేపు బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ.. ప్రత్యర్థిని పూర్తిగా అలసిపోయేలా చేస్తారు. ఆ తర్వాత గోల్స్ వేట మొదలుపెడతారు.చిన్న, వేగవంతమైన పాసులతో బంతిని కదిలించడం.. నిర్దిష్ట జోన్లలో నిలిచి ఎల్లప్పుడూ పాసింగ్ ఆప్షన్లు కల్పించడం, ఆటగాళ్లు త్రిభుజాకారంలో నిలిచి తక్కువ దూరంలోనే బంతిని పాస్ చేసుకోవడం ఇందులోని ముఖ్య వ్యూహాలు.ఆ తర్వాత అందుకే విఫలంయూరో 2008, ఫిఫా వరల్డ్‌కప్-2010, యూరో 2012 టైటిళ్లను స్పెయిన్ టికీ-టాకా వ్యూహంతోనే దక్కించుకుంది. తమ ప్రత్యేక శైలితో ఆట తీరును మరో స్థాయికి తీసుకువెళ్లిన స్పెయిన్.. ఆ తర్వాత ప్రత్యర్థుల చేతిలో భంగపడింది. ఎల్లప్పుడూ ఎక్కువగా పాస్లపైనే దృష్టి పెట్టి గోల్స్ కొట్టడంలో విఫలమై 2018, 2022 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి నిరాశగా వెనుదిరిగింది. ప్రత్యర్థి జట్లు తమ డిఫెన్స్‌ను మరింత బలోపేతం చేసుకుని స్పెయిన్ వ్యూహానికి ఇలా చెక్ పెట్టాయి.ఫూయెంటె రాకతో..దీంతో ఒకప్పుడు బలంగా భావించిన ‘టికీ- టాకా’ అస్త్రం.. ఆ తర్వాత ప్రత్యర్థుల అప్రమత్తతో వారి బలహీనతగా మారిపోయింది. అయితే, లూయీస్ డి లా ఫూయెంటె (Luis de la Fuente) స్పెయిన్ కోచ్‌గా వచ్చిన తర్వాత మరోసారి ఈ వ్యూహాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేశాడు. సరికొత్త హంగులతో టికీ-టాకా 2.0ను తీసుకువచ్చాడు.ఇందులో భాగంగా కేవలం బంతిని నియంత్రణలో ఉంచుకోవడమే కాకుండా.. వేగంగా ఫార్వర్డ్ చేసి గోల్స్ సాధించే శక్తివంతమైన జట్టుగా మారింది స్పెయిన్. కేవలం బంతిని పాస్ చేయడమే కాకుండా.. ప్రత్యర్థి మోహరింపుల్లోని గ్యాప్‌లను గుర్తించి అటాక్ చేయడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం లమీన్ యమాల్, విలియమ్స్ వంటి యువ ఆటగాళ్ల సేవలను వాడుకుంది.తద్వారా కేవలం బంతిని కంట్రోల్ చేయడమే కాకుండా.. కౌంటర్ అటాక్‌లు చేయడంలో సఫలమై.. తమ అమ్ములపొదిలోని టికీ-టాకా అస్త్రానికి మరింత పదునుపెట్టింది. ముఖ్యంగా సెమీ ఫైనల్లో ఫ్రాన్స్‌పై ఈ వ్యూహాన్ని సమర్థవంతంగా ఉపయోగించి అనుకున్న ఫలితాన్ని రాబట్టింది స్పెయిన్. ఆ మ్యాచ్‌లో పెడ్రో పోరో సాధించిన గోల్ ఆధునిక టికీ-టాకా వ్యూహానికి నిదర్శనం.స్పెయిన్ 20.. అర్జెంటీనా 0ఈ టోర్నీలో స్పెయిన్ మొత్తంగా పద్నాలుగు గోల్స్ సాధించగా.. ప్రత్యర్థి ఒకే ఒక గోల్ కొట్టే అవకాశం ఇచ్చింది. దీనిని బట్టి స్పెయిన్ సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక వరల్డ్‌కప్-2026 ఫైనల్లో స్పెయిన్ గోల్ కోసం ప్రయత్నించే క్రమంలో 20 షాట్లు కొట్టింది. ఇందులో 12 గోల్ పోస్ట్ దిశగా వెళ్లాయి. మొత్తంగా 817 పాస్‌లు ఇచ్చుకున్నారు ఆటగాళ్లు. అదే సమయంలో అర్జెంటీనా మాత్రం గోల్ పోస్ట్ దిశగా ఒక్క షాట్ కూడా కొట్టలేకపోయింది. రోడ్రి వరల్డ్ రికార్డుఇక మైదానంలో పక్కాగా వ్యూహాలను అమలు చేసిన స్పెయిన సారథి రోడ్రి.. ఈ సీజన్లో ఏకంగా 790 పాస్‌లు ఇచ్చాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పాస్‌లు ఇచ్చిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇక స్పెయిన్ డిఫెండర్లు క్యూబార్సి 668, లాఫోర్టే 618 పాసులు చేశారు. ఓవరాల్‌గా జట్టుగా స్పెయిన్ 4945 సార్లు బంతిని పాస్ చేసింది. తెర వెనుక హీరో అతడే!దీనిని బట్టి స్పెయిన్ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిందన్న విషయం సుస్పష్టం. ఏదేమైనా ఫూయెంటె టికా-టాకాకు పునర్వైభవం తెచ్చి జట్టు రెండోసారి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచేలా చేశాడు. తెర ముందు గోల్ కొట్టి ఫెరాన్ టోరెస్ హీరో కాగా.. తెర వెనుక తన పదునైన వ్యూహాలతో ఫూయెంటె హీరోగా నిలిచాడు.చదవండి: మెస్సీ చేయలేనిది... రొనాల్డో సాధించాడు!Spain 🤝 Mexico City #FIFAFanFestival #FIFAWorldCup pic.twitter.com/PxkGAyW6tC— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026 -
ఒక్క గోల్.. 12 ఏళ్ల తర్వాత అదే చరిత్ర!
ఫుట్‌బాల్‌లో ఒక గోల్ అంటే కేవలం స్కోర్ బోర్డుపై పెరిగే ఒక సంఖ్య కాదు.. కోట్లాది మంది అభిమానుల ఆశలు, భావోద్వేగాలను మార్చే క్షణం. ముఖ్యంగా ప్రపంచకప్ ఫైనల్ లాంటి అత్యున్నత వేదికపై ఒక్క గోల్ కూడా ఓ జట్టును చరిత్రలో నిలబెడుతుంది. కొన్ని ఫైనల్స్‌లో అయితే 90 నిమిషాల ఉత్కంఠకు తెరదించేది ఒకే ఒక్క గోల్. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. ఒకే దెబ్బతో ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న సందర్భాలు ఫిఫా చరిత్రలో అరుదుగా నమోదయ్యాయి.ఒక్క గోల్.. ఒక్క క్షణం.. కానీ ఆ క్షణమే ఓ జట్టును చరిత్రలో శాశ్వతంగా నిలబెడుతుంది. అందుకే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో 1-0 విజయాలకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే మ్యాచ్ ఫలితం 1-0తో తేలింది. ఈ ప్రతి విజయానికీ ఓ ప్రత్యేక కథ ఉంది.బ్రెహ్మే పెనాల్టీతో జర్మనీ చాంపియన్1990 ఇటలీ ప్రపంచకప్ ఫైనల్లో వెస్ట్ జర్మనీ, అర్జెంటీనా తలపడ్డాయి. అప్పటికే ఇరు జట్లు గట్టి పోరాటం సాగించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. గోల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు 85వ నిమిషంలో కీలక క్షణం వచ్చింది. జర్మనీకి లభించిన పెనాల్టీని ఆండ్రియాస్ బ్రెహ్మే గోల్‌గా మలిచాడు. ఆ ఒక్క గోల్‌తో వెస్ట్ జర్మనీ ప్రపంచకప్‌ను ముద్దాడింది.ఇనియెస్టా గోల్‌తో స్పెయిన్ కల సాకారం2010 దక్షిణాఫ్రికా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్, నెదర్లాండ్స్ జట్లు తలపడ్డాయి. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. 116వ నిమిషంలో ఆండ్రెస్ ఇనియెస్టా చేసిన అద్భుతమైన గోల్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. అదే స్పెయిన్‌కు తొలి ప్రపంచకప్ టైటిల్‌ను అందించింది. ఒక్క గోల్.. స్పెయిన్ ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణాక్షరాలుగా నిలిచిపోయింది.గోట్జే దెబ్బతో అర్జెంటీనాకు నిరాశ2014 బ్రెజిల్ ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ, అర్జెంటీనా మరోసారి ప్రపంచ వేదికపై తలపడ్డాయి. లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా టైటిల్‌పై కన్నేయగా.. జర్మనీ పటిష్ఠ రక్షణతో పోరాడింది. మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లిన తర్వాత 113వ నిమిషంలో మారియో గోట్జే చేసిన గోల్ జర్మనీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఫైనల్ ముగిసే సమయానికి స్కోర్ బోర్డుపై నిలిచింది 1-0.2026.. స్పెయిన్ మరోసారి అదే ఘనత12 ఏళ్ల తర్వాత.. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇదే తరహా ఫలితం నమోదైంది. స్పెయిన్, అర్జెంటీనా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో నిర్ణీత 90 నిమిషాల్లో గోల్స్ నమోదు కాలేదు. అదనపు సమయంలో 106వ నిమిషంలో ఫెర్రాన్ టోరెస్ చేసిన కీలక గోల్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆ ఒక్క గోల్‌తో స్పెయిన్ ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో ఫైనల్‌ను 1-0తో గెలిచిన అరుదైన జట్ల జాబితాలో స్పెయిన్ చేరింది.ఎందుకంత ప్రత్యేకం? ప్రపంచకప్ ఫైనల్లో జట్లు సాధారణంగా ఎంతో జాగ్రత్తగా ఆడతాయి. చిన్న తప్పిదం కూడా ట్రోఫీని దూరం చేయగలదనే ఒత్తిడి ఆటగాళ్లపై ఉంటుంది. అందుకే ఫైనల్స్‌లో భారీ స్కోర్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. 1-0 విజయాల్లో గెలిచిన జట్లు కేవలం దాడిలోనే కాదు.. రక్షణలోనూ తమ సామర్థ్యాన్ని నిరూపించాయి. ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకుండా.. వచ్చిన ఒక్క అవకాశాన్ని గోల్‌గా మార్చుకుని ప్రపంచ చాంపియన్లుగా నిలిచాయి. -
గోల్డెన్ బూట్ అతడికే!.. గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్ ఎందుకిస్తారో తెలుసా?
సాకర్ మెగా సంబరం ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ముగిసింది. టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ విజేతగా అవతరించింది. న్యూయార్క్ వేదికగా మెస్సీ బృందాన్ని 1-0 గోల్ తేడాతో ఓడించి రెండోసారి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.అదనపు సమయంలోని 106వ నిమిషంలో స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్ కొట్టడంతో స్పెయిన్ చాంపియన్‌గా నిలవగా.. అర్జెంటీనా హృదయం ముక్కలైంది. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ టోర్నీలో ఆసాంతం అద్భుత ప్రదర్శ కనబరిచిన స్పెయిన్ వ్యక్తిగత బహుమతుల జాబితాలోనూ సత్తా చాటింది.ఈసారి ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్‌ను ఫాన్స్ కెప్టెన్ కెలియన్ ఎంబాపె గెలుచుకోగా.. మిగతా అవార్డులను మాత్రం స్పెయిన్ ఆటగాళ్లు కైవసం చేసుకున్నారు. అయితే, గోల్డెన్ బూట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్ అవార్డుల గురించి మీకు తెలుసా?.. విజేతలను ఎలా నిర్ణయిస్తారు?.. ప్రైజ్‌మనీ ఉంటుందా?... పూర్తి వివరాలు మీకోసం గోల్డెన్ బూట్ విజేత ఎంబాపె (Kylian Mbappe- ఫ్రాన్స్)ఫిఫా ప్రపంచకప్ టోర్నీ ఎడిషన్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడికి దీనిని ప్రధానం చేస్తారు. ఈసారి ఎంబాపె పది గోల్స్ కొట్టడంతో పాటు నాలుగు అసిస్ట్‌లు అందించి గోల్డెన్ బూట్ గెలిచాడు. గత ప్రపంచకప్ అంటే 2022లోనూ ఎంబాపేకే ఈ అవార్డు దక్కింది.గోల్డెన్ బూట్ సుమారు కిలో మేర బరువు ఉంటుంది. దీనిని ఇత్తడి మిశ్రమ లోహంతో తయారు చేసి.. దానిపై మందపాటి బంగారు పొరను ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు. గణాంకాల ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు. దీనిని 1930లోనే ప్రవేశపెట్టినప్పటికీ.. 1982 నుంచి భౌతికంగా అందిస్తున్నారు. ఫ్రాన్స్ ఆటగాడు జస్ట్ ఫౌంటైన్ 1958 ప్రపంచకప్ టోర్నీలో 13 గోల్స్ కొట్టగా.. ఇప్పటికీ ఆ విషయంలో ఎవరూ అతడి దరిదాపుల్లోకి రాలేదు.గోల్డెన్ బాల్ విజేత రోడ్రి (Rodri- స్పెయిన్)ప్రపంచకప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఫిఫా టెక్నికల్ స్టడీ గ్రూప్ (FSG)ఈ అవార్డు విజేతను నిర్ణయిస్తుంది. టోర్నీలోని ప్రతీ మ్యాచ్‌ను విశ్లేషించి.. సదరు మ్యాచ్‌లలో ప్రభావం చూపిన ఆటగాడికి దీనిని అందజేస్తారు.జట్టు తరఫున గోల్స్, అసిస్ట్స్ చేయడం.. డిఫెన్స్‌తో ఆకట్టుకుకోవడం.. నాయకత్వ బృందంలో కీలకంగా వ్యవహరించడం.. ఇలా మొత్తంగా ఏ విధంగానైనా సరే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాడికి గోల్డెన్ బాల్ దక్కుతుంది. ఇక ఈ అవార్డు విజేతను నిర్ణయించే FSGలో ఫిఫా గ్లోబల్ ఫుట్‌బాల్ డెవలప్మెంట్ చీఫ్‌తో పాటు.. మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు, టెక్నికల్ డైరెక్టర్లు, సాకర్ అనలిస్టులు.. అదే విధంగా మీడియా ప్రతినిధులు కూడా భాగంగా ఉంటారు.విజేత జట్టు తరఫు ఆటగాడికేనా?అయితే, ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టు ఆటగాడికి మాత్రమే ఈ అవార్డు లభిస్తుందనుకుంటే పొరపాటు. 2014 ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా జర్మనీ చేతిలో ఓడినప్పటికీ అత్యుత్తమ ఆటగాడిగా లియోనల్ మెస్సీకి ఈ అవార్డు దక్కింది. ఇక గోల్డెన్ బాల్‌తో పాటు సిల్వర్, బ్రాంజ్ బాల్స్ విజేతలను కూడా సాంకేతిక అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు.తొలుత 1986లో దీనిని ప్రవేశపెట్టగా.. అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా గోల్డెన్ బాల్ అందుకున్నాడు. ఇక మెస్సీ ఒక్కడే 2014, 2022 టోర్నీలలో అత్యధికంగా రెండుసార్లు ఈ అవార్డు గెలిచిన ఆటగాడిగా నిలిచాడు.గోల్డెన్ గ్లోవ్ విజేత ఉనై సైమన్ (Unai Simon- స్పెయిన్)ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన గోల్కీపర్కి ఈ అవార్డు అందజేస్తారు. టోర్నీ ఆసాంతం అద్భుతమైన నైపుణ్యాలు, నిలకడైన ఆట తీరుతో ప్రభావం చూపిన ఆటగాడిని FSG ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది.అత్యుత్తమ డిఫెన్స్‌తో ప్రత్యర్థులను అడ్డుకోవడం.. వారు గోల్స్ కొట్టకుండా ఆపడం.. జట్టు విజయంపై ఎలాంటి ప్రభావం చూపారన్న ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకుని విజేతను నిర్ణయిస్తారు. ఈసారి ఏడు క్లీన్ షీట్స్‌తో సైమన్ గోల్డెన్ గ్లోవ్ గెలిచాడు. గోల్డెన్ గ్లోవ్‌ను తొలుత 1994లో బెల్జియం ప్లేయర్ మిచెల్ ప్రెడ్హోమ్ గెలుచుకున్నాడు.7 clean sheets. adidas Golden Glove winner. ⭐@adidasfootball pic.twitter.com/mME9QEIgNj— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026 ప్రైజ్‌మనీ ఇస్తారా?ఈ అవార్డులన్నీ ఆటగాళ్ల గుర్తింపునకు మాత్రమే. వారి ప్రదర్శనకు ప్రతిఫలంగా ట్రోఫీలు అందజేస్తారు. వీటికి ఫిఫా నుంచి ఎలాంటి ప్రైజ్‌మనీ ఉండదు. అయితే, స్పాన్సర్ల ద్వారా ఆటగాళ్లకు లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది. -
స్పెయిన్‌పై కాసుల వర్షం.. రూ. 420 కోట్ల ప్రైజ్‌మనీ!
ఫిఫా ప్రపంచకప్-2026 ఛాంపియన్స్‌గా స్పెయిన్ అవతరించింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి రెండోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని స్పెయిన్ ముద్దాడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది పోరులో నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు 30 నిమిషాల ఎక్స్ట్రా టైమ్ కేటాయించారు. ఈ క్రమంలో 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్ అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ప్రపంచకప్ ట్రోఫీ 2010 తర్వాత తిరిగి స్పానిష్ జట్టు సొంతమైంది.స్పెయిన్‌పై కాసుల వర్షంఇక విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు ట్రోఫీతో పాటు భారీ ప్రైజ్ మనీ దక్కింది. రోడ్రి సారథ్యంలోని స్పెయిన్‌కు దాదాపు 50 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.420 కోట్లు ) నగదు బహుమతి లభించింది. అదేవిధంగా రన్నరప్ అర్జెంటీనాకు 33 మిలియన్ డాలర్లు (సుమారు రూ.రూ.277 కోట్లు) అందింది. మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు ప్రైజ్‌మనీగా 29 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 243 కోట్లు) సొంతం చేసుకుంది. అదేవిధంగా నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు 27 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 225 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. ఫిఫా ప్రపంచ కప్ 2026లో అవార్డు విజేతలు వీరేగోల్డెన్ బూట్ - కైలియన్ ఎంబాపే (ఫ్రాన్స్)గోల్డెన్ బాల్ - రోడ్రి (స్పెయిన్)గోల్డెన్ గ్లోవ్ - ఉనై సైమన్ (స్పెయిన్)బెస్ట్ యంగ్ ప్లేయర్ - పావ్ కుబార్సి (స్పెయిన్) -
FIFA World Cup 2026: జగజ్జేత స్పెయిన్
న్యూయార్క్: ఒకవైపు పటిష్టమైన డిఫెన్స్... మరోవైపు పాదరసంలాంటి కదలికలతో అటాకింగ్... వెరసి స్పెయిన్ జట్టు రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ముగిసిన ఫైనల్లో స్పెయిన్ 1–0 గోల్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టును ఓడించింది. అదనపు సమయంలోని 106వ నిమిషంలో సబ్సిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్‌తో స్పెయిన్ జట్టు విజయం అందుకుంది. పెడ్రో పోరో కుడి వైపు నుంచి కొట్టిన క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో నికో విలియమ్స్ హెడర్ షాట్‌తో వెనక్కి పంపించాడు. అక్కడే ఉన్న ఫెరాన్ టోరెస్ అర్జెంటీనా గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. దాంతో స్పెయిన్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత అదనపు సమయంలో మిగిలిన క్షణాల్లో అర్జెంటీనాను నిలువరించి స్పెయిన్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 2010లో స్పెయిన్ తొలిసారి ప్రపంచకప్ గెలిచింది. నెదర్లాండ్స్‌తో ఆనాడు జరిగిన ఫైనల్లోనూ స్పెయిన్ అదనపు సమయంలోని రెండో అర్ధభాగంలో ఇనియెస్టా చేసిన గోల్‌తో విజయం అందుకుంది. 16 ఏళ్ల తర్వాత అలాంటి దృశ్యమే పునరావృతమైంది. అంతకుముందు నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు గోల్ చేయలేదు. 90+3వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డుకు గురయ్యాడు. దాంతో అదనపు సమయంలో 30 నిమిషాలు అర్జెంటీనా 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ సువర్ణావకాశాన్ని స్పెయిన్ సద్వినియోగం చేసుకుంది. పదే పదే దాడులు చేస్తూ 106వ నిమిషంలో ఫలితాన్ని సాధించింది. మ్యాచ్ మొత్తంలో అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియో మార్టీనెజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 12 సార్లు స్పెయిన్ ఆటగాళ్లు గోల్‌పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లను నిలువరించాడు. అయితే 13వ ప్రయత్నంలో మాత్రం మార్టీనెజ్ ఏమీ చేయలేకపోయాడు. ఫైనల్ చేరే క్రమంలో 19 గోల్స్ కొట్టిన అర్జెంటీనా తుది పోరులో పూర్తిగా నిరాశపరిచింది. స్పెయిన్ ఫార్వర్డ్ ఆటగాళ్లను అడ్డుకోవడంలోనే అర్జెంటీనాకు సరిపోయింది. -
ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్
ఫిఫా ప్రపంచకప్-2026 విజేతగా స్పెయిన్ అవతరించింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించిన స్పెయిన్.. 16 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ తుది పోరులో జట్లు కూడా నిర్ణీత 90 నిమిషాల్లో కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 30 నిమిషాలు కేటాయించారు. ఈ క్రమంలో 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఫెర్రాన్ టోర్రెస్ మెరుపు గోల్ కొట్టి తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.ఆధిక్యంలో స్పెయిన్తుది పోరులో స్పెయిన్ ఖాతా తెరిచింది. 106 నిమిషాల తర్వాత తొలి గోల్ నమోదైంది. స్పెయిన్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసినప్పటికి ఇరు జట్లు కూడా ఇంకా కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. దీంతో విజేత ఎవరో తేల్చడానికి ఎక్స్ట్రా టైమ్ 30 నిమిషాలు కేటాయించారు.ఖాతా తెరవని ఇరు జట్లుసెకెండ్ హాఫ్లోనూ 75వ నిమిషం వరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. స్పెయిన్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. డాని ఓల్మో, అలెక్స్ బేనా స్ధానాల్లో వింగర్ నికోలస్, మైకెల్ మెరినో జట్టులోకి వచ్చారు. కాగా ఈ తుది పోరులో రెండో హైడ్రేషన్ బ్రేక్ సమయం ముగిసే వరకు కూడా అర్జెంటీనా జట్టు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా కనీసం ఒక్క షాట్ కూడా నమోదు చేయలేకపోయింది.హోరాహోరీగా తలపడుతున్న స్పెయిన్న్యూజెర్సీ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా, స్సెయిన్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఇరు జట్లు ఎటాకింగ్ గేమ్ ఆడినప్పటికి ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. మ్యాచ్ ప్రారంభంలోనే స్పెయిన్ సంచలన యువ ఆటగాడు లమిన్ యమల్‌కు గోల్ కొట్టే అద్భుత అవకాశం లభించింది. అయితే అర్జెంటీనా డిఫెన్స్ సమర్ధవంతంగా అడ్డుకోవడంతో అతడు తనకు లభించిన ఛాన్స్‌ను చేజార్చుకున్నాడు. అయితే ఈ తుది పోరులో అర్జెంటీనాకు భారీ షాక్ తగిలింది.స్టార్ డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్ తీవ్రమైన గాయానికి గురై మైదానాన్ని వీడాడు. ఇక ఫస్ట్ హాఫ్ ముగిసిన అనంతరం విరామ సమయంలో గ్లోబల్ పాప్ స్టార్స్ జస్టిన్ బీబర్, షకీరా తమ సంగీత ప్రదర్శనతో స్టేడియాన్ని హోరెత్తించారు. కాగా ఈ ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. -
FIFA World Cup 2026: ఫైనల్ వేడి.. సిటీ రెడీ
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ అంకాన్ని తప్పకుండా చూసేందుకు సిటీ జనులు సిద్ధమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.30కు మొదలయ్యే అర్జెంటీనా–స్పెయిన్ జట్ల తుది సమరాన్ని వీక్షించేందుకు ఉత్సుకతతో ఉన్నారు. ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇచ్చింది ఉత్తర అమెరికా ఖండంలోని దేశాలు కావడంతో ఆయా దేశాల టైమ్ జోన్ మేరకు ఇప్పటికే తమ అలారాల సెట్టింగ్‌ను మార్చుకుని దాదాపు 40 రోజులుగా నగరంలోని ఫుట్‌బాల్ అభిమానులు మ్యాచ్‌ల మజాను ఆస్వాదించారు.ఇప్పుడు ఫైనల్ కోసం మరింత ఉత్సుకతగా ఉన్నారు. పైగా, హైదరాబాదీల అభిమాన ఆటగాడు లయోనల్ మెస్సీ సారథ్యంలో అభిమాన జట్టు అర్జెంటీనా పోటీ పడుతుంటే ఇక తెల్లవారుజాము వరకైనా మేల్కొనేందుకు సిద్ధపడ్డారు. స్పెయిన్ కంటే అర్జెంటీనానే మనవాళ్ల ఫేవరెట్ అని.. మెజారిటీ సిటీజనుల మొగ్గు అర్జెంటీనా వైపే అని హైదరాబాద్‌లోని ఫుట్‌బాల్ కోచ్‌లు, ఆటగాళ్లు పేర్కొంటున్నారు. 2022లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఫ్రాన్స్, అర్జెంటీనా తలపడగా అప్పుడూ మనవాళ్లు అర్జెంటీనాకే మద్దతు పలికిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇక గత కొన్ని మ్యాచ్‌ల ఓపెన్ స్క్రీనింగ్స్‌లో వచ్చిన స్పందన కూడా ఇదే విషయం స్పష్టం చేస్తోంది. - సాక్షి, హైదరాబాద్మెస్సీని తలచుకుంటూ... గత ఏడాది చివర్లో మెస్సీ హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంలో విశేష ప్రజాదరణ దక్కింది. అప్పట్లో కేరళ వంటి ఫుట్‌బాల్‌కు ఆదరణ విపరీతంగా ఉండే రాష్ట్రంలో కాకుండా మెస్సీ భాగ్య నగరానికి రావడం విశేషం. దీన్నిబట్టే.. ఇప్పుడు అతడు వరుసగా రెండోసారి ప్రపంచ కప్ అందుకోవాలని హైదరాబాదీలు బలంగా కోరుకుంటున్నారు.ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే, శనివారం అర్ధరాత్రి జరిగిన ఫ్రాన్స్–ఇంగ్లండ్ (మూడో స్థానం కోసం) మ్యాచ్, ఫైనల్ సందర్భంగా బార్లు, క్లబ్‌లు, మైక్రో బ్రూవరీలు రాత్రిళ్లు ఎక్కువసేపు తెరిచి ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కాగా, ఈ నిర్ణయాన్ని ఫుట్‌బాల్ ఫైనల్‌కు తాత్కాలిక సడలింపుగా మాత్రమే కాక నగర నైట్ లైఫ్నకు ఊపునిచ్చే దిశలో తొలి అడుగుగా ఆతిథ్య రంగం భావిస్తోంది. ఈ అనుమతులను సద్వినియోగం చేసుకుని పూర్తి స్థాయి రాత్రి వేళ వ్యాపారాలకు బాటలు వేసుకోవాలని ఆశిస్తోంది. అభివృద్ధిదాయక నైట్‌లైఫ్ నగరంలో సాధ్యమని నిరూపించడానికి ఇదొక సువర్ణావకాశమని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) అభిప్రాయపడుతోంది. అందుకని అవాంతరాలు లేకుండా గడిచేలా చూడాలని ఏఆర్ఏఐ హైదరాబాద్ చాప్టర్ తమ సభ్యులను కోరింది. ‘ప్రతి సంస్థ సొంత బ్రాండ్‌నే కాకుండా, హైదరాబాద్ ఆతిథ్య రంగం ప్రతిష్టను కూడా ఇనుమడింపజేయాలి’ అని చాప్టర్ హెడ్ సందీప్ బాలసుబ్రమణియన్ సూచించారు. -
అర్జెంటీనా గెలవదని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫలిస్తుందా?
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా భారీ బెట్టింగ్‌లు నమోదవుతున్నాయి. అర్జెంటీనా టైటిల్ నిలబెట్టుకుంటుందంటూ కొంతమంది పందేలు కాస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఈసారి స్పెయిన్ టైటిల్ అందుకొని 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుందంటూ భారీ బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల విలువ కూడా కోట్ల రూపాయల్లో ఉండడం గమనార్హం. ప్రపంచం మొత్తం బెట్టింగ్‌లు వేసినప్పటికీ, కెనడియన్ రాపర్ డ్రేక్ గ్రహమ్ వేసే పందెం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. గతంలో డ్రేక్ మద్దతు ఇచ్చిన జట్లు లేదా ఆటగాళ్లు ఓడిపోవడం జరిగింది. తాజాగా అర్జెంటీనా ఫిఫా టైటిల్‌ను గెలవదంటూ డ్రేక్ 1.5 అమెరికన్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 14.5 కోట్ల రూపాయలు) పందెం కాయడం సంచలనం కలిగించింది. మరి డ్రేక్ శాపం ఫలిస్తుందా అన్నది ఫైనల్ తర్వాత తేలనుంది.'డ్రేక్ శాపం' అంటే?👉డ్రేక్ శాపం అనేది ఒక క్రీడా మూఢనమ్మకం. దీని ప్రకారం, డ్రేక్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన అథ్లెట్లు, ఫైటర్లు లేదా జట్లు తరచుగా కీలకమైన మ్యాచ్‌లలో ఓడిపోవడాన్ని అభిమానులు గమనించారు.👉చాలా సందర్భాల్లో, ఆటగాళ్లు కెనడియన్ ర్యాపర్‌తో ఫోటోలు దిగిన తర్వాత ఆయా జట్లు ఓటమిని చవిచూశాయి.👉ఈ మూఢనమ్మకం కారణంగా, చాలా మంది క్రీడాభిమానులు డ్రేక్ మద్దతును అపశకునంగా భావిస్తారు.👉ఇప్పుడు అతను అర్జెంటీనాపై తన పందెం వేయడంతో, ఈ చర్య ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు ఆ జట్టు మద్దతుదారులలో ఆందోళనను రేకెత్తించింది.లెక్కచేయని అర్జెంటీనా ఫ్యాన్స్..అయితే అర్జెంటీనా అభిమానులు మాత్రం డ్రేక్ పందేన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. 2022 ఖతార్ ప్రపంచకప్‌లోనూ ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో అర్జెంటీనా ఓడిపోతుందంటూ డ్రేక్ గ్రహమ్ ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ. 10 కోట్లు) పందెం కాసి చేతులు కాల్చుకున్నాడు. డ్రేక్ శాపానికి తిరుగుండదని బీరాలు పలికాడు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. ఆ ప్రపంచకప్‌లో మెస్సీ సేన ఫిఫా టైటిల్ గెలవడంతో డ్రేక్ అంచనా తప్పి అపఖ్యాతి పాలయ్యాడు. అయితే తాజాగా ఫిఫా 2026 టోర్నీలో అర్జెంటీనా మరోసారి ఫైనల్ చేరిన క్రమంలో డ్రేక్ మరోసారి భారీ పందెం కాసినప్పటికీ ఈసారి కూడా అతడి అంచనా తప్పుతుందని అర్జెంటీనా అభిమానులు బల్లగుద్ది జోస్యం చెబుతున్నారు. ఈసారి కూడా మెస్సీ సేన డ్రేక్ మూడ నమ్మకాన్ని బద్దలుకొట్టి నాలుగోసారి ఫిఫా టైటిల్‌ను ఎగురేసుకుపోతుందని పేర్కొన్నారు.మెస్సీ సేనకు వ్యతిరేకంగా..ఆరంభం నుంచి ఈసారి ఫిఫా టోర్నీలో అర్జెంటీనా గెలవకూడదనే ప్రయత్నాలు కొనసాగుతూ వచ్చాయి. ఆరంభ పోటీల్లో అనామక జట్టు కేప్‌వెర్డె.. అర్జెంటీనాను ఓడిస్తుందంటూ ఒక ఆధ్యాత్మికవేత్త చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. కానీ రియాల్టీకి వచ్చేసరికి అర్జెంటీనా సునాయాసంగా కేప్వెర్డెను ఓడించింది. ఈసారి ఫిఫాలో విస్తృతంగా ప్రచారం జరిగిన మరో మూడనమ్మకం ఏంటంటే.. ప్రముఖ యూట్యూబర్ ఐషో స్పీడ్ తాను మద్దతు ఇచ్చిన ప్రతీ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో, అతడికి అపశకునం అనే బిరుదు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా మ్యాచ్‌కు ఐషోస్పీడ్ అర్జెంటీనా జెర్సీ ధరించి వారికి మద్దతు ఇచ్చాడు. కానీ మెస్సీ సేన ఐషో స్పీడ్ అపశకునాన్ని సైతం ఛేదించి సెమీస్‌లో అడుగుపెట్టింది. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు మెట్‌లైఫ్ స్టేడియం వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.Read: ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సీ చివరి సందేశం! -
ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సీ చివరి సందేశం!
ఫిఫా ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో స్పెయిన్ తలపడనుంది. ఈసారి ఫిఫాలో జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన మెస్సీ అన్నీ తానై అర్జెంటీనాను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు ముందు అర్జెంటీనా జట్టు, సహాయక సిబ్బందితో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను షేర్ చేసుకున్న మెస్సీ తన చివరి సందేశాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఫిఫా టోర్నీ ఆద్యంతం తనకు అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు, కోచ్, సహాయక సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక లేఖను రాసుకొచ్చాడు. ఈ ఫిఫాలో ఫైనల్ చేరే క్రమంలో కేవలం విజయాలు మాత్రమే కాకుండా జట్టు ప్రయాణం కూడా తమను గొప్పదిగా నిలబెట్టిందని మెస్సీ తెలిపాడు. 'ఇన్ని సంవత్సరాల మా ప్రయాణంలో అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే.. మేము టైటిల్స్ గెలవడమే కాదు, ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులను పొందాము. అర్జెంటీనా జట్టులోని ఆటగాళ్లతో కలిసి రోజువారి పనులను పంచుకోవడం, కలిసి పోటీ పడడం, కష్ట సమయాల్లో అండగా నిలబడడం, ఇలా ప్రతి అడుగును మనస్ఫూర్తిగా ఆస్వాదించాం. నా ప్రయాణంలో అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు, సహాయక, సాంకేతిక సిబ్బంది, అర్జెంటీనా దేశ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిఫా టైటిల్ గెలుస్తామా లేదా అన్న సంగతి పక్కనబెడితే ఇప్పటికే జట్టుగా మరిచిపోలేని, చెరిగిపోని జ్ఞాపకాలను చరిత్రగా లిఖించుకున్నాం. కమాన్ అర్జెంటీనా.’ అని భావోద్వేగంతో పేర్కొన్నాడు. అర్జెంటీనా కెప్టెన్ ఇచ్చిన సందేశం ఆ జట్టు ఒక కుటుంబంలా కలిసి నడుస్తూ ధృడమైన బంధాన్ని చాటిచెబుతుంది. స్పెయిన్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా వారసత్వం మాత్రం సురక్షితంగా ఉంటుందని మెస్సీ పరోక్షంగా పేర్కొన్నాడు.ఇక ఫిఫా ఫైనల్ మెస్సీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ మెస్సీ ఇచ్చిన తాజా సందేశం వైరల్‌గా మారింది. ఫైనల్‌కు ముందే ఇలాంటి సందేశాన్ని ఇవ్వడం వెనుక మెస్సీ తన రిటైర్మెంట్ విషయాన్ని పరోక్షంగా వెల్లడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో మెస్సీ ఏడు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో పాటు నాలుగు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 8 మ్యాచ్‌ల్లో 10 గోల్స్‌తో పాటు 4 అసిస్ట్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. భారత కాలమాన ప్రకారం అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలుకానుంది. Excited for finals but Lionel messi will play his last match for argentina pic.twitter.com/clW43BWtQV— `mr. villa (@Luccydevil07) July 19, 2026Read: సింధుదే జపాన్ ఓపెన్.. తొలి భారత షట్లర్‌గా రికార్డు -
ఫైనల్ 'కిక్'
39 రోజులు, 103 మ్యాచ్‌ల తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మెస్సీ మెరుపులతో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా? టీనేజ్ సంచలనం లమీన్ యామల్ నైపుణ్యం 2010 విశ్వవిజేత స్పెయిన్‌కు రెండోసారి ప్రపంచకప్ అందిస్తుందా? అటాకింగ్ ఆటతీరుతో ఈ ప్రపంచకప్‌ను ఊపేసిన అర్జెంటీనా ఆటగాళ్లు అదే జోరును తుది పోరులో కొనసాగిస్తారా? అడ్డుగోడలా నిలబడుతూ ప్రత్యర్థి జట్లకు గోల్ కొట్టడమే గగనంలా చేసిన స్పెయిన్ డిఫెన్స్ తుది పోరులోనూ విజయవంతం అవుతుందా? వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకొని ఇటలీ, బ్రెజిల్ సరసన అర్జెంటీనా నిలుస్తుందా? అర్జెంటీనా ఆశలను వమ్ము చేసి ప్రపంచకప్‌తో స్పెయిన్ పూర్వ వైభవం సాధిస్తుందా? వీటన్నింటికి సమాధానం నేడు అర్ధరాత్రి తర్వాత లభిస్తుంది. న్యూయార్క్: ఒక్క పరాజయం లేకుండానే అంతిమ సమరానికి అర్హత సాధించిన అర్జెంటీనా, స్పెయిన్ జట్లు ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. ఆఖరి పోరులోనూ గెలిచి టోర్నీని అజేయంగా ముగించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే 23వ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్‌పై యావత్ క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మైదానంలో ప్రత్యక్షంగా 80 వేల మంది... ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మందికి పైగా ప్రేక్షకులు టీవీల ద్వారా ఈ తుది పోరును వీక్షించనున్నారు.2022లో ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టులోని 17 మంది ప్లేయర్లు ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ ఆడుతున్నారు.ముఖ్యంగా 39 ఏళ్ల లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా ఈ టోర్నీలో అద్భుత ఆటతీరుతో అలరిస్తోంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓటమి అంచుల్లో నుంచి విజయకేతనం ఎగురవేస్తోంది. చివరి క్షణం ముగిసేవరకు తమను తక్కువ అంచనా వేయొద్దని.... అవకాశం దొరికితే ఏ క్షణంలోనైనా మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా తమలో ఉందని మెస్సీ బృందం నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ గెలుపు కిక్ తమదే కావాలని అర్జెంటీనా పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగనుంది. మరోవైపు 2010లో ఏకైకసారి ప్రపంచకప్ గెలిచిన స్పెయిన్ జట్టులోని ఆటగాళ్లెవరూ ప్రస్తుత ప్రపంచకప్‌లో లేరు. అయితే 2024లో యూరోపియన్ చాంపియన్‌షిప్ గెల్చుకున్న స్పెయిన్ జట్టులోని 16 మంది ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడుతున్నారు. స్పెయిన్ భవిష్యత్ ఆశాకిరణం, 19 ఏళ్ల యామల్పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. చివర్లో చెలరేగుతూ... ఫైనల్ చేరే క్రమంలో అర్జెంటీనా జట్టు 19 గోల్స్ సాధించింది. ప్రత్యర్థి జట్లకు 7 గోల్స్ సమ ర్పించుకుంది. అర్జెంటీనా చేసిన 19 గోల్స్‌లో 12 గోల్స్ మ్యాచ్‌లో 75 నిమిషాలు ముగిశాకే వచ్చాయి. ముందుగా నెమ్మదిగా ఆడటం... ప్రత్యర్థి జట్టు గోల్ చేశాక అర్జెంటీనా జోరు పెంచుతూ తమ సత్తా చాటుకుంటోంది. చివర్లో సబ్‌స్టిట్యూట్‌గా వస్తున్న ఆటగాళ్లు కూడా గోల్స్ చేస్తూ అర్జెంటీనాను గట్టెక్కిస్తున్నారు. మరోవైపు స్పెయిన్ జట్టు పూర్తి డిఫెన్స్ ఆటతీరుకు ప్రాధాన్యమిస్తోంది. అవకాశం దొరికినపుడు గోల్ చేసి ఆ తర్వాత ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయతీరానికి చేరుతోంది. ఈ టోర్నీలో స్పెయిన్ జట్టు 13 గోల్స్ సాధించి... ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ మాత్రమే సమ ర్పించుకుంది. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో స్పెయిన్ గోల్‌పోస్ట్‌పై ప్రత్యర్థి జట్లు 11 సార్లు మాత్రమే షాట్లు కొట్టడం గమనార్హం.విజేత జట్టుకు రూ. 481 కోట్లు ఈసారి ప్రపంచకప్ గెలిచిన జట్టుకు 5 కోట్ల డాలర్లు (రూ. 481 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించనుంది. రన్నరప్ జట్టుకు 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 317 కోట్లు) దక్కుతాయి. మూడో స్థానం పొందిన జట్టు ఖాతాలో 2 కోట్ల 90 లక్షల డాలర్లు (రూ. 279 కోట్లు) చేరుతాయి. నాలుగో స్థానం సంపాదించిన జట్టుకు 2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 259 కోట్లు) లభిస్తాయి. 5 నుంచి 8 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 182 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 9 నుంచి 16 స్థానాల మధ్య నిలిచిన జట్లకు 1 కోటీ 50 లక్షల డాలర్ల చొప్పున (రూ. 144 కోట్లు చొప్పున) లభిస్తాయి. 17 నుంచి 32 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 10 లక్షల డాలర్ల చొప్పున (రూ. 105 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 33 నుంచి 48 స్థానాల్లో నిలిచిన జట్ల ఖాతాలో 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 86 కోట్లు) లభిస్తాయి. 37 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ జట్టు వరుసగా 37 మ్యాచ్‌ల్లో పరాజయం రుచి చూడలేదు. 2024 నుంచి ఇప్పటి వరకు స్పెయిన్ 27 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో స్పెయిన్ గెలిస్తే ఇటలీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతుంది. ఇటలీ జట్టు 2018 నుంచి 2021 వరకు వరుసగా 37 మ్యాచ్‌ల్లో ఓడిపోలేదు.3 మెస్సీ బృందం ఈసారి టైటిల్ గెలిస్తే ప్రపంచకప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన మూడో జట్టుగా నిలుస్తుంది. అర్జెంటీనా ఇప్పటికి మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. బ్రెజిల్ జట్టు అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇటలీ, జర్మనీ జట్లు నాలుగుసార్లు చొప్పున సాధించాయి. 1 ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌ను 1992లో ప్రవేశపెట్టాక వరల్డ్‌కప్ టైటిల్ కోసం ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తుది పోరులో తలపడుతున్నాయి. 4 ఫైనల్లో స్పెయిన్‌పై అర్జెంటీనా గెలిస్తే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన నాలుగో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో బ్రెజిల్ (2002, 1970), ఉరుగ్వే (1930), ఇటలీ (1934) మాత్రమే ఈ ఘనత సాధించాయి.3 అర్జెంటీనా ఫైనల్లో విజయం సాధిస్తే వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన మూడో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) మాత్రమే ఈ ఘనత సాధించాయి.1 మూడు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఒక జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించిన తొలి ప్లేయర్‌గా మెస్సీ గుర్తింపు పొందనున్నాడు. 2014 ప్రపంచకప్ ఫైనల్స్‌లో మెస్సీ కెప్టెన్సీలో అర్జెంటీనా జట్టు జర్మనీ చేతిలో ఓడిపోయింది. 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలిచింది. -
ఫిఫా ఫైనల్ ఆఖరిదా?.. రిటైర్మెంట్పై మెస్సీ స్పందన!
ఫిఫా ప్రపంచకప్ 2026 తర్వాత అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడా? ఆదివారం స్పెయిన్‌తో జరగనున్న ఫిఫా ఫైనల్ మెస్సీ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే లియోనల్ మెస్సీ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ ముగిసిన తర్వాత ప్రెస్‌మీట్‌కు హాజరైన మెస్సీకి తన రిటైర్మెంట్పై ఒక ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. ‘మీ జర్నీ ఒక వీడియో గేమ్‌లా ఉంది. ఫిఫా ఫైనల్ మీకు చివరిది కానుందా’ అని ప్రశ్నించారు. దీనిపై మెస్సీ స్పందిస్తూ.. ‘నేను నా చివరి మ్యాచ్‌ను గత వరల్డ్‌కప్ (ఖతార్ 2022)లోనే ఆడేశాను. అక్కడ ఫిఫా టైటిల్ గెలవడంతోనే నా కెరీర్లో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాను. ఇప్పుడు నా ఆట ముగిసిపోయింది’అని అర్ధంకాని రీతిలో జవాబివ్వడంతో రిపోర్టర్లు తలలు పట్టుకోవడం గమనార్హం. దీంతో మెస్సీ రిటైర్మెంట్పై మరోసారి గందరగోళం నెలకొంది. అయితే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత మెస్సీ ఆటకు వీడ్కోలు పలుకుతాడా లేదా అన్నది ఆదివారమే తేలనుంది. ఇదే విషయమై అర్జెంటీనా జట్టు కోచ్, మేనేజర్ లియోనల్ స్కలోనిని కూడా అడిగారు.ఆయన కూడా ‘నాకైతే ఏ సమాచారం లేదు. నిజాయితీగా చెప్పాలంటే మెస్సీ తన నిర్ణయంతో మమ్మల్ని సర్ప్రైజ్ చేయొచ్చు.. చేయకపోవచ్చు. రిటైర్మెంట్ అంశం పూర్తిగా అతడికే వదిలేశాం’ అని తెలివిగా సమాధానం చెప్పుకొచ్చారు. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026లో మెస్సీ అత్యున్నత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లోనే 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకెళ్తున్నాడు. అయితే ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె (7 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, 3 అసిస్ట్‌లు) మెస్సీతో సమానంగా ఉన్నాడు. స్పెయిన్‌తో ఫైనల్లో మెస్సీ గోల్ చేస్తే గోల్డెన్ బూట్ అతడి సొంతమవుతుంది. ఒకవేళ మెస్సీ గోల్ చేయకుంటే ఎంబాపెకు గోల్డెన్ బూట్ దక్కే అవకాశముంది. రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ ఓవరాల్‌గా 21 గోల్స్‌తో ఫిఫాలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. మెస్సీ వెనుకే ఎంబాపె (ఫ్రాన్స్, 20 గోల్స్) రెండో స్థానంలో ఉన్నాడు. 🗣️ “Your career is like a video game, you keep unlocking new levels until you reach the final”.😬🇦🇷 Leo Messi: “I already completed the game at the last World Cup in Qatar”. pic.twitter.com/CD2eZLhlv0— Fabrizio Romano (@FabrizioRomano) July 18, 2026Read: ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు! -
ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫిఫా ఫైనల్లో అడుగుపెట్టడం వల్ల భారీ క్రేజ్ నెలకొంది. అటు 16 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టిన స్పెయిన్ కూడా కప్ కొట్టాలనే కసితో ఉంది. మరి కొదమసింహాల్లా లాంటి ప్రత్యర్థుల మధ్య పోటీ జరుగుతున్న వేళ టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటకుండా ఉంటాయా చెప్పండి. ఫైనల్ మ్యాచ్‌కు ముందే టికెట్ల ధరల రూపంలో ఫిఫా రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి ఒక్క టికెట్ ధర ఏకంగా రూ.27 లక్షలు పలికింది. 96 ఏళ్ల ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం విశేషం. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన అత్యున్నత శ్రేణి (హాస్పిటాలిటీ) టికెట్ ధర ఏకంగా రూ. 27 లక్షలు పలుకుతోంది. ఈ ప్రీమియం హాస్పిటాలిటీ ప్యాకేజీలు కేవలం మ్యాచ్ వీక్షణకే పరిమితం కావు. విదేశీ వీఐపీలు, కార్పొరేట్ దిగ్గజాలను ఆకర్షించేలా స్టేడియంలో ప్రత్యేక విలాసవంతమైన లాంజ్‌లు, ఫైన్ డైనింగ్, విభిన్న లగ్జరీ సేవలను ఫిఫా అందిస్తోంది. అయితే, ఇది కేవలం వీఐపీ ప్యాకేజీ ధర మాత్రమేనని, సామాన్య అభిమానుల కోసం అందుబాటులో ఉండే సాధారణ మ్యాచ్ టికెట్ల ధరలు దీనికంటే చాలా తక్కువగా ఉంటాయని నిర్వాహకులు స్పష్టం చేశారు.అమెరికా క్రీడా చరిత్రలో 2024లో జరిగిన ‘సూపర్‌బౌల్’ చాంపియన్‌షిప్‌లో శాన్ ఫ్రాన్సిస్కో 49ఈఆర్ఎస్ వర్సెస్ కాన్సాస్ సిటీ అత్యంత ఖరీదైన మ్యాచ్‌గా నిలిచింది. అప్పట్లో దీని సగటు టికెట్ ధర రూ. 9.6 లక్షలుగా నమోదైంది. ఇప్పుడు ఫిఫా ఫైనల్ టికెట్ ధర ఆ రికార్డును దాదాపు మూడు రెట్లు అధిగమించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఇక ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 6,943 డాలర్లు (సుమారు రూ.6 లక్షలు)గా ఉంది. యావరేజ్ టికెట్ ధర 11,327 డాలర్లు (సుమారు రూ. 10 లక్షలు)గా ఉంది. అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 7,200 డాలర్లు ( సుమారు రూ. 6.93 లక్షలు)గా ఉంది. సెమీస్‌తో పోలిస్తే ఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 93 వేలు తక్కువగా ఉండడం గమనార్హం. మొత్తం మీద ఈసారి ప్రపంచవ్యాప్తంగానూ ఫిఫా ప్రపంచకప్ వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఎన్నడూ లేనంతగా ఫిఫా చరిత్రలో టీఆర్పీ రేట్లన్నీ బద్దలయ్యాయి.Read: ఫిఫా కీలక నిర్ణయం.. 96 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి! -
ఫిఫా కీలక నిర్ణయం.. 96 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి!
ఫిఫా ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా పైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిఫా టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు ఆటగాళ్లు మెడల్స్ అందుకోనున్నారు. విన్నర్ జట్టుకు లభించే ప్రైజ్‌మనీనే భారీగా ఉంటుంది. ఒక్కో ఆటగాడు భారీ మొత్తాన్ని దక్కించుకుంటారు. ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులోని ఆటగాళ్లకు 96 ఏళ్ల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఫిఫా ప్రత్యేక గిఫ్ట్ అందించనుంది. ఫిఫా 2026లో చాంపియన్‌గా నిలిచిన జట్టు ఆటగాళ్లకు ఉంగరాలు ప్రదానం చేయనున్నారు. టైటిల్ గెలిచిన జట్లకు ఉంగరాలు ఇవ్వడం నార్త్ అమెరికాలో 19వ శతాబ్దం నుంచి ఒక సంప్రదాయంగా వస్తోంది.ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఫిఫా గెలిచిన జట్టులోని ఆటగాళ్లుకు 30 ప్రత్యేక ఉంగరాలను ఇప్పటికే తయారు చేయించి ఉంచారు. నార్త్ అమెరికా సంప్రదాయం ప్రకారం గెలిచిన జట్టు గుర్తింపును ప్రతిబింబించేలా ఈ ఉంగరాలను ఆటగాళ్ల వేలికి తొడగనున్నట్లు ఫిఫా తెలిపింది. అయితే ఆ ఉంగరాల ధర ఎంత ఉంటుందనేది మాత్రం ఫిఫా వెల్లడించలేదు.1893 నుంచి రింగుల ప్రదానంనార్త్ అమెరికాలో చాంపియన్లుగా నిలిచిన జట్లు లేదా వ్యక్తులకు రింగుల ప్రదాన సంప్రదాయం అనేది 1893 నుంచి కొనసాగుతోంది. ఆ సంవత్సరంలో మాంట్రియల్ హాకీ క్లబ్‌కు డొమినియన్ హాకీ ఛాలెంజ్ కప్ లభించింది. దీనినే ఇప్పుడు స్టాన్లీ కప్ అని పిలుస్తారు. ఆ జట్టు పైభాగంలో చిన్న హాకీ స్టిక్‌లు జతచేయబడిన సాధారణ పట్టీలను కూడా తయారు చేయించుకుంది.ఇక మేజర్ లీగ్ బేస్‌బాల్ జట్లు 1920ల్లో ఛాంపియన్షిప్ రింగులను ఇవ్వడం ప్రారంభించగా.. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) ఛాంపియన్‌షిప్‌లో మాత్రం 1940 నుంచి ఆ టోర్నీలో విజేతగా నిలిచిన జట్లకు రింగులను అందిస్తూ వస్తున్నారు. 1960ల నుంచి కొనసాగుతున్న సూపర్ బౌల్ శకంలో విజేతగా నిలిచిన ఎన్ఎఫ్ఎల్ జట్లు రింగులు అందుకుంటున్నాయి. జట్లతో పాటు వివిధ క్రీడల్లో హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న దిగ్గజాలతో పాటు ప్రపంచ వేదికపై తమ దేశానికి (నార్త్ అమెరికా) ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లకు కూడా లభించే ప్రోత్సాహక ప్యాకేజీలో భాగంగా యూఎస్ ఒలింపియన్లు, పారాలింపియన్లు ఉంగరాలను అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది.చదవండి: ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా అతడే.. అర్జెంటీనాకు పీడకల! -
యామల్ ఒక్కడే కాదు.. ఈ ముగ్గురూ ఇప్పుడు మెస్సీకి ‘ప్రత్యర్థులే’!
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. న్యూజెర్సీ వేదికగా భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అర్జెంటీనా- స్పెయిన్ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ, స్పెయిన్ యువ సంచలనం లమీన్ యామల్‌పైనే నిలిచాయి.లాలపోసి జోల పాడాడునిజానికి కెరీర్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఏ ఆటగాడైనా... తన అభిమాన ప్లేయర్‌ను దగ్గర నుంచి చూడాలనో లేక అతడితో ఆటోగ్రాఫ్, ఫొటోగ్రాఫ్ తీసుకోవాలనో కోరుకుంటాడు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చిన్నప్పుడు ఆశిష్ నెహ్రా చేతుల మీదుగా అవార్డు తీసుకొని మురిసిపోగా... శ్రేయస్ అయ్యర్ బాల్‌బాయ్‌గా ఉన్నప్పుడు ఇర్ఫాన్ పఠాన్ మాటలతో స్ఫూర్తిపొందాడు. ఇలా ఎవరైనా ఊహ వచ్చాకే తమ అభిమాన ఆటగాళ్లతో అనుబంధం పెంచుకుంటారు. కానీ, స్పెయిన్ ఫుట్‌బాల్ యువ సంచలనం లమీన్ యామల్ అనుభవం మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. ఊహ తెలియక ముందే యామల్‌ను అతడి అభిమాన ప్లేయర్ ముద్దాడాడు. ఐదు నెలల వయసులోనే లాలపోసి జోల పాడాడు. ఇదేంటీ విడ్డూరం అనుకుంటున్నారా! కాదు నిజమే. అపుడు ఐదు నెలల పసికందు.. ఇపుడు ప్రత్యర్థిదాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంటున్న ఓ యువ ఆటగాడు... ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఐదు నెలల పసికందును ఎత్తుకొని ముద్దుచేశాడు. కట్ చేస్తే... ఆ ఎత్తుకున్న వ్యక్తి ప్రస్తుతం అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ కాగా... ఆ ముద్దులొలికే బాబు స్పెయిన్ స్టార్ ప్లేయర్ లమీన్ యామల్. యూనిసెఫ్, బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో 2007లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు నెలల యామల్‌కు మెస్సీ స్నానం చేయించాడు. ఆ రోజు మెస్సీ చేతుల్లో ఆడుకున్న ఆ చిన్నారి ఇప్పుడు పెరిగి పెద్ద వాడై అతడితోనే తలపడేందుకు సిద్ధమయ్యాడు. అమెరికా వేదికగా ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫైనల్లో ఈ ఇద్దరు ప్లేయర్లు అమీతుమీ తేల్చుకోనున్న నేపథ్యంలో... 19 ఏళ్ల నాటి ఫొటో సోషల్ మీడియాను ఊపేస్తోంది.అయితే ఏఐ యుగంలో ఈ ఫోటో నకిలీ అయి ఉంటుందని ప్రచారం జరగగా... యూనిసెఫ్ ప్రతినిధులు ఈ ఫొటో వెనక ఉన్న చరిత్రను తాజాగా వెల్లడించారు. 2008 యూనిసెఫ్ క్యాలెండర్ కోసం ఈ ఫొటోషూట్ నిర్వహించినట్లు తెలిపారు. హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తున్న ఈ నిజజీవిత కథ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. యామల్ ఒక్కడే కాదు..ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. యామల్ ఒక్కడే కాదు.. ఫైనల్లో మెస్సీ బృందంతో తలపడనున్న స్పెయిన్ జట్టులో మరో ముగ్గురు కూడా మెస్సీతో చిన్ననాడే ఫొటోలకు ఫోజులిచ్చారు. వారు మరెవరో కాదు.. డానీ ఒల్మో (Dani Olmo), జోవాన్ గ్రేసియా (Joan Garcia), గవీ (Gavi).బార్సిలోనా మిడ్‌ఫీల్డర్ గవీకి మెస్సీ రోల్ మోడల్. ఇప్పుడు తన ఆరాధ్య ఫుట్‌బాలర్‌కు ప్రత్యర్థిగా అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక స్పెయిన్ జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్‌గా, సెంట్రల్ మిడ్‌ఫీల్డర్‌గా డానీ పాత్ర కీలకం. బార్సిలోనాలో చాలా ఏళ్ల క్రితమే అతడు మెస్సీతో కలిసి ఫొటో దిగాడు. ఇప్పుడు తన అనుభవాన్ని డానీ.. తన రోల్ మోడల్ మెస్సీకి వ్యతిరేకంగా ఉపయోగించబోతున్నాడు. ఇక జోవాన్ గ్రేసియా స్పెయిన్ గోల్ కీపర్. చిన్నపుడు మెస్సీతో కలిసి అతడు సందడి చేశాడు. ఇప్పుడు మెస్సీ గోల్ కొట్టకుండా ఆపే అడ్డుగోడలా నిలబడేందుకు సిద్ధమయ్యాడు. ఇది విధి రాసిన కథఈ నేపథ్యంలో.. ‘ఇది విధి రాసిన కథ.. మెస్సీ చేతుల్లో నాడు ఒదిగిపోయిన చిన్నారులు నేడు.. అతడికే ప్రత్యర్థిగా మారడం నిజంగా నమ్మలేని విషయం’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా యామల్ ఫొటో నిజమే అని యూనిసెఫ్ ధ్రువీకరించగా.. మిగతా ముగ్గురితో ఉన్న ఫొటోలు మాత్రం బార్సిలోనా ఇండిపెండెంట్ న్యూస్ చానెల్ బార్కా యూనివర్సల్ ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో తెరమీదకు వచ్చాయి.చదవండి: రోహిత్, జైస్వాల్ కోసం నాడు గిల్ అలా చేశాడు! -
ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా అతడే.. అర్జెంటీనాకు పీడకల!
అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్‌కు రిఫరీగా స్లోవేనియాకు చెందిన స్లావో విన్సిచ్ ఎంపికయ్యాడు. తాజా నిర్ణయం అర్జెంటీనా అభిమానుల్లో ఆందోళనను రేకెత్తించింది. ఎందుకంటే, విన్సిచ్ గత రిఫరీ అనుభవాలు అర్జెంటీనాకు పీడకలను మిగిల్చింది. విషయంలోకి వెళితే.. 2022 ఖతార్ ప్రపంచ కప్‌లో అర్జెంటీనా, సౌదీ అరేబియా మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌కు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించారు. ఎనిమిదో నిమిషంలో అర్జెంటీనాకు విన్సిచ్ పెనాల్టీని ఇచ్చ్చాడు. ఆ పెనాల్టీని మెస్సీ గోల్‌గా మలిచాడు. అంతేకాదు విన్సిచ్ సౌదీ ఆటగాళ్లకు ఆరు యెల్లోకార్డులు చూపించాడు. అయితే, రెండో అర్ధభాగంలో అర్జెంటీనా సౌదీ అరేబియా చేతిలో 1-2 తేడాతో అనూహ్య ఓటమిని చవిచూసింది. ఫిఫాలో విన్సిచ్ రిఫరీగా వ్యవహరించిన మ్యాచ్‌ల్లో అర్జెంటీనా ఓటమి చవిచూసిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.స్పెయిన్‌తో అనుబంధం..అయితే విన్సిచ్కు స్పెయిన్‌తో మంచి అనుబంధముంది. స్పెయిన్ ఆడిన చాలా మ్యాచ్‌లకు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించాడు. 2017లో కొలంబియాతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌కు, యూరో 2020లో స్వీడన్, స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు, 2023 UEFA నేషన్స్ లీగ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించాడు. యువ ఆటగాడు లామిన్ యమాల్ జట్టులో స్థిరమైన ఆటగాడిగా మారిన తర్వాత, యూరో 2024లో ఇటలీపై స్పెయిన్ 1-0తో గెలిచిన మ్యాచ్‌తో పాటు, ఫిఫా 2026లో ఫ్రాన్స్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌కు కూడా విన్సిచ్ రిఫరీగా వ్యవహరించాడు.అపఖ్యాతిఇక ప్రస్తుత ఫిఫా ప్రపంచ కప్‌లో మూడు మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించిన విన్సిచ్, మెక్సికో-ఈక్వెడార్ మ్యాచ్‌లో ఈక్వెడార్ ఆటగాడు పియరో హింకాపీకి రెడ్ కార్డ్ చూపించి అపఖ్యాతి పాలయ్యాడు. దీంతో ఆదివారం న్యూయార్క్ వేదికగా అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో విన్సిచ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వీఏఆర్ ద్వారా ఫిఫా నిశితంగా పరిశీలించనుంది. -
అపశకునం ముద్ర.. ఫైనల్‌కు దూరంగా అర్జెంటీనా అధ్యక్షుడు!
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనుంది. ఏ టోర్నీలో అయినా తమ దేశం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంటే సదరు దేశాధ్యక్షుడు లైవ్‌లో చూడాలని ఆశించడం సహజం. కానీ అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తున్నారు. మూడ నమ్మకాల నెపంతో అర్జెంటీనా ఆడనున్న ఫిఫా పైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో కాకుండా ఇంట్లోనే టీవీలో వీక్షించాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఒక అర్జెంటీనా అధ్యక్షుడు లైవ్‌లో ఫిఫా మ్యాచ్ చూడడం వల్ల అర్జెంటీనా ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో సదరు అధ్యక్షుడిపై ‘అపశకునం’ ముద్ర వేశారు. దీంతో ఆ సెంటిమెంట్‌కు భయపడి తాజా ఫిఫా ఫైనల్‌కు జావియర్ మిలే దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇక ఫిఫా ఫైనల్‌కు జావియర్ మిలే దూరమవ్వడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది. మూడనమ్మకమా లేదా సెంటిమెంట్.. ఇలా ఏది అనుకున్నా తాను మాత్రం ఫైనల్ మ్యాచ్‌ను మాత్రం టీవీలోనే వీక్షిస్తానని అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే అధికారులకు తెగేసి చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. మెస్సీకి వీరాభిమాని అయిన అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఆడిన ఏడు మ్యాచ్‌లను తన ఇంటిలోనే వీక్షించారు. ఈ ఏడింటిలో ఒక్క ఓటమి, డ్రా కానీ చేసుకోని అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో వరుసగా రెండోసారి ఫిఫా ఫైనల్లో అడుగుపెట్టింది. మరో విశేషమేమిటంటే జావియర్ మిలే తన హెవి జాకెట్‌ను ధరించి ఈ మ్యాచ్‌లన్నింటిని వీక్షించారట. కాబట్టి ఫైనల్ మ్యాచ్‌కు కూడా అదే హెవీ జాకెట్‌ను ధరించనున్నట్లు అర్జెంటీనా అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్‌లో మూడ నమ్మకాలు కొత్తవేమి కావు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ సందర్భంగా అర్జెంటీనా అభిమానులు మూడ నమ్మకాల పేరిట కాబాలస్ (ప్రీజర్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల ఫొటోలు ఉంచడం) సహా చాలా మంది అభిమానులు అర్జెంటీనా గెలవాలంటూ తాము నమ్మే దైవాన్ని ప్రార్థించడం వైరల్‌గా మారింది.తాజాగా ఒక దేశాధ్యక్షుడే ఇవాళ మూడ నమ్మకం పేరుతో ఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో కాకుండా ఇంట్లోనే చూస్తానని చెప్పడం ఆసక్తికర విషయంగా మారిపోయింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు కావడంతో జావియర్ మిలేకు ఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆహ్వానం కూడా వచ్చింది. 'మీ స్నేహితుడు ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినోలతో కలిసి ఆదివారం ఫిఫా పైనల్ చూసేందుకు న్యూజెర్సీ వెళ్తున్నారా' అని అడిగితే.. 'లేదు అస్సుల వెళ్లను.. ఒలివోస్లోని నా ఇంటి నుంచే ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తాను' అని అర్జెంటీనా అధ్యక్షుడు బదులివ్వడం విశేషం.అధ్యక్షుడిపై అపశకునం ముద్రతమ జట్లకు దురదృష్టం వెంటాడుతుందేమోనని అర్జెంటీనా అధ్యక్షులు చాలా కాలంగా కీలకమైన ప్రపంచకప్ మ్యాచ్‌లకు హాజరయ్యే విషయంలో జాగ్రత్త వహిస్తూ వస్తున్నారు. ఈ మూఢనమ్మకం 1990 టోర్నమెంట్ నాటిది. అప్పుడు అర్జెంటీనా అధ్యక్షుడిగా ఉన్న కార్లోస్ మెనెమ్.. ఆనాటి ప్రపంచకప్‌లో కామెరూన్, అర్జెంటీనా మ్యాచ్‌కు హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టు కామెరున్ జట్టుతో పోరులో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. దీంతో అధ్యక్షుడు మెనెమ్పై “ముఫా (అపశకునం) అని ముద్ర వేశారు. అప్పటి నుంచి ఫిఫా ప్రపంచకప్ ఎక్కడ జరిగినప్పటికీ ఏ అర్జెంటీనా అధ్యక్షుడు కూడా జాతీయ జట్టు మ్యాచ్‌కు హాజరుకాకపోవడం విశేషం.చదవండి: అర్జెంటీనాతో ఫైనల్.. స్పెయిన్‌ను వణికిస్తున్న గాయం! -
సాహో అర్జెంటీనా
జగజ్జేత జట్టు ఆట ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు మరోసారి ప్రపంచానికి చూపించింది. ఓటమి అంచుల నుంచి విజయ తీరానికి చేరడం... ఎలాంటి స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడటం... ప్రత్యర్థి జట్ల ఆశలను చివరి క్షణాల్లో గల్లంతు చేయడం... ఏ లక్ష్యంతోనైతే అడుగు పెట్టామో దానిని ఎలా సాధించాలో ... తమను చూసి నేర్చుకోవాలని అర్జెంటీనా చాటి చెప్పింది. మరోవైపు ఇంగ్లండ్‌కు మూడోసారి కూడా ప్రపంచకప్ సెమీఫైనల్ పీడకలగా మారిపోయింది. ఆధిక్యంలో ఉన్నామన్న ధీమాతో... మేటి జట్లను తక్కువ అంచనా వేస్తే చివరకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని ఇంగ్లండ్‌కు మరోసారి అనుభవమైంది. అట్లాంటా: వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మూడో జట్టుగా గుర్తింపు పొందేందుకు అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు ఒక్క విజయం దూరంలో నిలిచింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ముగిసిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. అర్జెంటీనా తరఫున ఎంజో ఫెర్నాండెజ్ (85వ నిమిషంలో), సబ్‌స్టిట్యూట్ లాటారో మార్టినెజ్ (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్ జట్టుకు ఆంథోనీ గోర్డాన్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. కెప్టెన్ మెస్సీ అందించిన పాస్‌లతోనే అర్జెంటీనా రెండు గోల్స్ నమోదు చేయడం విశేషం. 85వ నిమిషం వరకు 0–1తో వెనుకబడిన అర్జెంటీనా ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి మరో అద్భుతం నమోదు చేసింది. ఈజిప్ట్ తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–2తో వెనుకబడ్డాక 13 నిమిషాల వ్యవధిలో అర్జెంటీనా మూడు గోల్స్ కొట్టి అనూహ్య విజయం అందుకున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి న్యూజెర్సీ వేదికగా జరిగే ఫైనల్లో ప్రస్తుత యూరోపియన్ చాంపియన్, 2010 ప్రపంచకప్ విజేత స్పెయిన్ జట్టును అర్జెంటీనా ‘ఢీ’కొంటుంది. తుది పోరులో అర్జెంటీనా విజయం సాధిస్తే... ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) జట్ల తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టైటిల్స్ గెలిచిన మూడో జట్టుగా నిలుస్తుంది. ప్రపంచకప్‌లో ఏడోసారి ఫైనల్‌కు చేరుకున్న అర్జెంటీనా మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా, మూడుసార్లు (1930, 1990, 2014) రన్నరప్‌గా నిలిచింది. సెమీఫైనల్ చేరుకునే క్రమంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన అర్జెంటీనా కీలక సమరంలోనూ సత్తా చాటింది. 55వ నిమిషంలో ఇంగ్లండ్‌కు గోల్ సమర్పించుకున్న అర్జెంటీనా ఆ తర్వాత అసలు సిసలు ఆటతీరును కనబరిచింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. అవకాశం దొరికినపుడల్లా ఇంగ్లండ్ గోల్‌పోస్ట్ దిశగా దూసుకెళ్లాడు. 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత ఇంగ్లండ్ మరీ రక్షణాత్మకంగా ఆడింది. ఎలాగైనా అర్జెంటీనాను గోల్ చేయనీకుండా నిలువరించాలన్న ధ్యేయంతో కనిపించింది. గోల్‌కీపర్‌తో కలిపి రక్షణశ్రేణిలో తొమ్మిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు కనిపించారు. మరోవైపు స్కోరును సమం చేయాలన్న కసితో అర్జెంటీనా దాడుల్లో పదును పెంచింది. రెండుసార్లు దాదాపు గోల్ అయినట్లే కనిపించింది. ఇంగ్లండ్ గోల్‌కీపర్ పిక్ఫర్డ్ అప్రమత్తతతో రెండుసార్లు గోల్ కాకుండా నిలువరించాడు. 69వ నిమిషంలో నికో గొంజాలెజ్ షాట్‌ను... 76వ నిమిషంలో మాక్ అలిస్టర్ షాట్‌ను పిక్ఫర్డ్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత అలిస్టిర్ కొట్టిన షాట్ ఒకటి ఇంగ్లండ్ గోల్‌పోస్ట్‌కు తగిలి వెనక్కి వచ్చింది. ఓవరాల్‌గా 55 నిమిషం నుంచి 85వ నిమిషం వరకు బంతి అర్జెంటీనా ఆధీనంలో 88 శాతం, ఇంగ్లండ్ ఆ«దీనంలో 12 శాతం ఉండటం గమనార్హం. ఎట్టకేలకు 85వ నిమిషంలో అర్జెంటీనా స్కోరు సమం చేయడంలో సఫలమైంది. మెస్సీ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియా పైభాగంలో అందుకున్న ఎంజో ఫెర్నాండెజ్ కళ్లు చెదిరే కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఆ తర్వాత 90+2 నిమిషంలో మెస్సీ అందించిన క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియా లోపల ఇద్దరు ఇంగ్లండ్ డిఫెండర్లకంటే ఎత్తుకు ఎగిరిన మార్టినెజ్ హెడర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో అర్జెంటీనా 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. స్టాపేజ్ సమయంలోని మిగిలిన సమయంలో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి అర్జెంటీనా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో ఇంగ్లండ్ కేవలం ఐదుసార్లు మాత్రమే అర్జెంటీనా గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టింది. ఈ టోర్నీలో ఆరు గోల్స్ చొప్పున కొట్టి నిలకడగా రాణించిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్ బెలింగ్‌హమ్ కీలకమైన సెమీస్‌లో ఆకట్టుకోలేకపోయారు. 1966లో చివరిసారి ఫైనల్ చేరి టైటిల్ గెలిచిన ఇంగ్లండ్ ఆ తర్వాత మూడుసార్లు (1990, 2018, 2026) సెమీఫైనల్లో ఓడిపోయింది. 19 ప్రస్తుత ప్రపంచకప్‌లో అర్జెంటీనా చేసిన గోల్స్. ఒకే ప్రపంచకప్‌లో అర్జెంటీనా సాధించిన అత్యధిక గోల్స్ ఇవే కావడం విశేషం. 1930 లో అర్జెంటీనా 18 గోల్స్ నమోదు చేసింది.6 ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా ఆడిన ఆరు సెమీఫైనల్స్‌లోనూ (1930, 1986, 1990, 2014, 2022, 2026) నెగ్గింది. అర్జెంటీనా తొలిసారి విజేతగా నిలిచిన 1978 ప్రపంచకప్ లో సెమీస్ జరగలేదు. 8 జట్లను 2 గ్రూప్‌లుగా విభ జించారు. గ్రూప్ విన్నర్స్‌గా అర్జెంటీనా, నెదర్లాండ్స్ ఫైనల్లో ఆడాయి. -
ఫైనల్స్ కు అర్జెంటీనా.. సెమీస్ లో ఇంగ్లాండ్ చిత్తు..
-
ఫిఫా వరల్డ్‌కప్.. అర్జెంటీనాకు భారీ షాక్!
ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అట్లాంటా వేదికగా చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో మెస్సీ బృందం సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర నిరాశలో మునిగిపోయింది.ఇక సెలబ్రేషన్స్ చేసుకునే సమయంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ గియోవని లో సెల్సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘ఫాక్‌ల్యాండ్స్ అర్జెంటీనా’దే అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడితో పాటు కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా మిగతా ఆటగాళ్లు ఆ బ్యానర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.చిరకాల ప్రత్యర్థులుఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్య వివాదానికి దారితీసింది. కాగా క్రికెట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ల మాదిరే ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా- ఇంగ్లండ్ మ్యాచ్‌లకూ అదే స్థాయిలో ఆదరణ ఉంటుంది. ఇందుకు ఇరుదేశాల మధ్య ఉన్న రాజకీయ వివాదాలు.. తదనుగుణంగా చెలరేగే భావోద్వేగాలు కారణం అని చెప్పవచ్చు.అసలు వివాదం ఏమిటి?అర్జెంటీనా తూర్పు తీర ప్రాంతానికి దాదాపుగా 480 కిలోమీటర్ల దూరంలో ఫాక్లాండ్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1774లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకొంది. ఇక 1832లో వీటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే, 1982లో అర్జెంటీనాలోని సైనిక ప్రభుత్వం ఫాక్లాండ్ దీవుల కోసం ఘర్షణకు దిగింది.దీంతో ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య నాడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. అయితే, ఇంగ్లండ్ ధాటికి తాళలేక ఆఖరికి అర్జెంటీనా బలగాలు లొంగిపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ ఘర్షణలో దాదాపు 649 మంది అర్జెంటీనా సైనికులు బలైపోయారు. అదే విధంగా 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.24 ఏళ్ల తర్వాత తొలిసారిఅయితే, ఫాక్లాండ్ దీవుల విషయంలో ఇప్పటికీ ఇరుదేశాల మధ్య ఒక రకంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో దాదాపు 24 ఏళ్ల తర్వాత అర్జెంటీనా- ఇంగ్లండ్ తొలిసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీ సెమీ ఫైనల్లో తలపడే అవకాశం వచ్చింది.భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీస్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా స్థాయికి తగ్గట్లు రాణించింది. అర్జెంటీనా తరఫున 85వ నిమిషంలో ఎన్జో ఫెర్నాండెజ్, అదనపు సమయం (90+2వ నిమిషం)లో మార్టినేజ్ చెరో గోల్ గొట్టారు.ఇక వీరిద్దరు గోల్స్ సాధించడంలో కెప్టెన్ మెస్సీ సహకారం అందించాడు. మరోవైపు.. ఇంగ్లండ్ తరఫున ఆంటోనీ గార్డన్ 55వ నిమిషంలోనే గోల్ కొట్టాడు. కానీ ఆ తర్వాత ఇంగ్లండ్ మళ్లీ గోల్ సాధించడంలో సఫలం కాలేకపోయింది. దీంతో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.షాక్ తప్పదా?ఈ నేపథ్యంలో ఓవైపు టైటిల్ సమరానికి మరోసారి అర్హత సాధించడం.. మరోవైపు చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను ఓడించిన సంబరంలో అర్జెంటీనా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫాక్లాండ్ దీవులు తమవే అన్నట్లుగా బ్యానర్ ప్రదర్శించారు.Argentina Team with The Falkland Islands Banner 😂😂😂! pic.twitter.com/NlSUZXXlsS— The Final Whistle (@Rufus_45) July 16, 2026అయితే, అర్జెంటీనా ఆటగాళ్లపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు (IFAB) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు గానూ.. ముందుగా బ్యానర్ ప్రదర్శించిన ఆటగాడు లేదంటే జట్టు మొత్తానికి జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.నిబంధనలు ఏం చెబుతున్నాయి?IFAB నిబంధనల ప్రకారం.. మైదానంలో పరికరాల ద్వారానైనా సరే ఆటగాళ్లు రాజకీయ, మతపరమైన విషయాలకు సంబంధించి.. అదే విధంగా వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించిన ప్రకటనలు చేయడం, ఫొటోలు ప్రదర్శించడం నిషిద్ధం.ఆటగాళ్ల లోదుస్తులపై సైతం కేవలం తయారీ లోగో మాత్రమే ఉండాలి. అది కాకుండా తమ రాజకీయ, మతపరమైన, వ్యక్తిగతమైన అభిప్రాయాలను ప్రదర్శించకూడదు. ఒకవేళ ఆటగాళ్లు ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే సదరు ఆటగాడు లేదంటే జట్టు మొత్తానికి టోర్నీ నిర్వాహకులు జరిమానా విధిస్తారు. జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ లేదంటే ఫిఫా ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది.అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్ మద్దతుఅర్జెంటీనా ఉపాధ్యక్షురాలు విక్టోరియా విలారుయెల్ మాత్రం తమ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచారు. ‘‘ఫాక్లాండ్స్ ఎప్పటికీ అర్జెంటీనావే! వాళ్లు స్టేడియంలోకి బ్యానర్ తీసుకురాకుండా నిషేధం విధించారు. కానీ ఈ భావం మా నరనరాల్లో, హృదయాల్లో నిండిపోయింది’’ అని పేర్కొన్నారు.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వైభవ్ రికార్డు బద్దలు¡Las Malvinas son Argentinas! 🇦🇷 Prohibieron llevarlas a la cancha y se olvidaron que las llevamos en la sangre y el corazón. pic.twitter.com/qB455HeqVX— Victoria Villarruel (@VickyVillarruel) July 15, 2026 -
ఫిఫా వరల్డ్‌కప్.. ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అట్లాంటా వేదికగా ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో విజయం సాధించిన అర్జెంటీనా.. స్పెయిన్‌తో తుది పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని ఇంగ్లండ్ డిఫెండర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. మెస్సీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపలేకపోయాడు. ఇంగ్లండ్ కూడా ప్రథమార్ధంలో గోల్ సాధించలేకపోయింది.దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇరు జట్లు తమ ఖాతాను తెరవలేదు. అయితే సెకెండ్ హాఫ్‌లో ఇంగ్లండ్ పట్టు బిగించింది. యువ సంచలనం ఆంథోనీ గోర్డాన్ 58 నిమిషంలో ఒక సూపర్ గోల్‌తో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం దగ్గరపడుతున్నప్పటికి అర్జెంటీనా ఇంకా గోల్ సాధించకపోవడంతో డిఫెండింగ్ ఛాంపియన్‌కు ఓటమి తప్పదని అంతా భావించారు.అర్జెంటీనా అదరహోఈ సమయంలో అర్జెంటీనా అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆట ముగియడానికి కొన్ని నిమిషాల ముందు అర్జెంటీనా ఆటగాళ్లు విశ్వరూపం ప్రదర్శించారు. 85వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ డి-బాక్స్ లాంగ్-రేంజ్ షాట్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఈ గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. అనంతరం అదనపు సమయం(90+2)లో లియోనెల్ మెస్సీ మ్యాజిక్ చేశాడు.మైదానం మధ్యలో నుంచి ఇంగ్లండ్ డిఫెన్స్‌ను తప్పించుకుంటూ మెస్సీ అందించిన ఒక అద్భుతమైన క్రాస్ పాస్‌ను.. స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ గోల్‌గా మలిచాడు. దీంతో అర్జెంటీనా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి నిమిషాల్లో ఇంగ్లండ్ మరో గోల్ సాధించకపోవడంతో మెస్సీ సేన వరుసగా రెండో సారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఆదివారం(జూలై 20) జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో అర్జెంటీనా తలపడనుంది. -
అర్జెంటీనాను ప్రపంచకప్ నుంచి బహిష్కరించండి..!
ఫిఫా ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాపై మరోసారి వివాదం చెలరేగింది. రిఫరీలు, వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) నిర్ణయాల్లో అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ, ఆ జట్టును టోర్నమెంట్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్లో ఓ పిటిషన్ వైరల్ అవుతోంది. ఈ పిటిషన్‌కు ఇప్పటికే 75 లక్షల మందికిపైగా మద్దతు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.పిటిషన్ నిర్వాహకులు ఫిఫాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అర్జెంటీనాకు అనుకూలంగా రిఫరీ నిర్ణయాలు వస్తున్నాయని, దీంతో పోటీ సమానంగా జరగడం లేదని వారు ఆరోపించారు. "విజేత ముందే నిర్ణయించబడితే మిగతా జట్లు ఎందుకు పోటీ పడాలి? అర్జెంటీనాను ప్రపంచకప్ నుంచి తప్పించి ఇతర జట్లకు న్యాయం చేయాలి" అని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ వివాదం మధ్యనే అర్జెంటీనా సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక ప్రత్యర్థిత్వం కారణంగా ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. తాజా ఆరోపణలతో ఈ పోరుకు మరింత ఉత్కంఠ ఏర్పడింది.ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ, అర్జెంటీనాపై చర్యలు తీసుకునే అంశంపై ఫిఫా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే పిటిషన్లో చేసిన ఆరోపణలకు సంబంధించి స్వతంత్రంగా నిర్ధారిత ఆధారాలు కూడా వెలుగులోకి రాలేదు. అందువల్ల ఇవి ప్రస్తుతం ఆరోపణలుగానే పరిగణించాల్సి ఉంటుంది. కాగా, భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్య రాత్రి రెండో సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లండ్‌తో తలపడనుంది. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలుపుతో స్పెయిన్ ఇదివరకే ఫైనల్‌కు చేరుకుంది. -
ఓం భీమ్ బుష్.. 'కబాలాస్'ను నమ్ముకున్న అర్జెంటీనా ఫ్యాన్స్
ఫుట్‌బాల్ అంటే కేవలం ఆట కాదు.. కోట్లాది మంది అభిమానుల భావోద్వేగం. మైదానంలో ఆటగాళ్ల ప్రతిభ, వ్యూహాలు, ఫిట్నెస్ ఎంత ముఖ్యమో.. కొంతమంది అభిమానుల నమ్మకాల్లో అదృష్టం కూడా అంతే కీలకం. ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్-2026 సెమీఫైనల్ ముందు అర్జెంటీనా అభిమానులు తమ జట్టు విజయం కోసం ఆసక్తికరమైన ‘కబాలాస్’ను ఆశ్రయిస్తున్నారు.ఇంగ్లండ్‌తో కీలక పోరుకు ముందు.. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్‌హామ్ పేర్లను కాగితాలపై రాసి ఫ్రీజర్‌లో పెట్టడం అర్జెంటీనాలో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి ఆటగాళ్లు చల్లబడిపోవాలని, మైదానంలో తమ ప్రభావం చూపలేకపోవాలని ఇలా చేస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. కొందరు అభిమానులు ఏఐ సాయంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను మంచులో బంధించినట్లుగా చిత్రాలు రూపొందించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.అసలు ‘కబాలాస్’ అంటే ఏమిటి?అర్జెంటీనా ఫుట్‌బాల్ సంస్కృతిలో ‘కబాలాస్ (Cábalas)’ అనేది చాలా కాలంగా కొనసాగుతున్న నమ్మకం. జట్టు గెలవాలంటే ఒకే టీ-షర్ట్ ధరించడం, మ్యాచ్ చూస్తున్నప్పుడు ఎప్పుడూ ఒకే చోట కూర్చోవడం, ఒకే ఆహారం తినడం వంటి అలవాట్లను అభిమానులు అదృష్ట సూచికలుగా భావిస్తారు. కొంతమంది అభిమానుల నమ్మకం ప్రకారం.. ఒకసారి చేసిన పని జట్టుకు విజయం తెచ్చిపెడితే, తదుపరి మ్యాచ్‌ల్లో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తే అదృష్టం కలిసి వస్తుందట. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా.. అర్జెంటీనా ఫుట్‌బాల్‌లో ఈ సంప్రదాయం భావోద్వేగంగా కొనసాగుతోంది.Photo Credit: FIFA Twitterకేన్, బెల్లింగ్హామ్లకు ‘ఫ్రీజర్ ట్రీట్మెంట్’ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ పోరు కావడంతో ఈసారి అర్జెంటీనా అభిమానుల కబాలాస్ మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రత్యర్థి జట్టు కీలక ఆటగాళ్లను "ఐస్‌లో పెట్టడం" ద్వారా వారి ఆటను నిలువరించవచ్చని కొందరు నమ్ముతున్నారు. హ్యారీ కేన్ ఇంగ్లండ్ ప్రధాన గోల్ ఆయుధం కాగా.. జూడ్ బెల్లింగ్‌హామ్ మిడ్‌ఫీల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకే వీరిద్దరినీ టార్గెట్‌గా చేసుకుని అభిమానులు ఈ ప్రతీకాత్మక చర్యలకు దిగారు.కోచ్‌లకూ ఉన్న నమ్మకాలుఅర్జెంటీనా ఫుట్‌బాల్‌లో ఇలాంటి నమ్మకాలు అభిమానులకే పరిమితం కాదు. మాజీ కోచ్ Carlos Bilardo కూడా ప్రత్యేక అలవాట్లు, నమ్మకాలతో ప్రసిద్ధి చెందారు. ప్రస్తుత కోచ్ Lionel Scaloni కూడా కొన్ని వ్యక్తిగత అలవాట్లను పాటిస్తారని చెబుతారు. మైదానంలోకి అడుగుపెట్టే విధానం, మ్యాచ్‌కు ముందు చేసే కొన్ని ఆచారాలు ఆయనకు అదృష్టాన్ని తెస్తాయని అభిమానులు భావిస్తుంటారు.అర్జెంటీనా-ఇంగ్లండ్.. ఆ మాత్రం ఉంటదిఅర్జెంటీనా-ఇంగ్లండ్ మ్యాచ్ అంటే కేవలం ఫుట్‌బాల్ పోటీ కాదు.. దానికి చరిత్ర, భావోద్వేగాలు కూడా జతకట్టాయి. 1986 ప్రపంచకప్‌లో Diego Maradona చేసిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ నుంచి ఈ రెండు దేశాల మధ్య పోటీ మరింత ప్రత్యేకంగా మారింది. ప్రపంచకప్ వేదికపై ఈ రెండు జట్లు ఎదురుపడితే అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతుంది. ఈసారి కూడా సెమీఫైనల్‌కు ముందు అర్జెంటీనా అభిమానులు తమ కబాలాస్పై నమ్మకం పెట్టుకున్నారు.మైదానంలో విజయం మాత్రం ఆటగాళ్ల ప్రదర్శన, వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ.. ఫుట్‌బాల్‌లో అభిమానుల విశ్వాసాలు, సంప్రదాయాలు, భావోద్వేగాలు ఎంత లోతుగా పాతుకుపోయాయో అర్జెంటీనా ఫ్యాన్స్ ‘ఫ్రీజర్ కబాలా’ మరోసారి చూపించింది.Concuerdo, las cábalas NO se comparten.En lo personal, yo soy bien supersticioso en el deporte y tengo un buen.¿Ustedes tienen? https://t.co/DLQ6MvhLBt— Iván Jacob (@ivanjacobvg) July 15, 2026 -
ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు!
ఫిఫా ప్రపంచకప్‌లో 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ ఫైనల్లో అడుగుపెట్టింది. 2010లో చివరిసారి ఫిఫా ఫైనల్ చేరిన స్పెయిన్ ఆనాడు టోర్నీలో చాంపియన్‌గా అవతరించింది. మళ్లీ ఇన్నేళ్లకు స్పెయిన్‌కు ఫైనల్ ఆడే అవకాశం రావడం విశేషం. ఫ్రాన్స్‌తో సెమీస్‌కు ముందు స్పెయిన్ స్టార్ లామినే యమాల్ ఎంబాపెతో పాటు ఆ జట్టుకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. 'భయపడేది మేము కాదు.. వాళ్లే మాకు భయపడతారు' అని యమాల్ అన్నట్లు ఫ్రాన్స్ కీలక సెమీస్‌లో అనవసర ఒత్తిడికి లోనయ్యి స్పెయిన్ చేతిలో పరాజయం చవిచూసింది. లామినే యమాల్.. ఎంబాపెకు చెప్పి మరీ దెబ్బతీశాడు. ఫ్రాన్స్‌తో మ్యాచ్‌లో గోల్ చేయనప్పటికీ యమాల్ తన సహచర ఆటగాళ్లు గోల్ చేయడంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. సోమవారం 19వ పుట్టినరోజు జరుపుకున్న లామినే యమాల్‌కు ఫ్రాన్స్‌పై విజయంతో స్పెయిన్‌ను ఫైనల్ చేర్చి తన సహచరులు అతడికి బర్త్‌డే కానుకగా అందించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లామినే యమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఫిఫా వంటి ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో మెస్సీకి ఎదురుపడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలాంటిది ఈసారి ఫైనల్లో మెస్సీ ఎదురుపడితే ఆ మజానే వేరు. దాని కోసమే ఎదురుచూస్తున్నా. అది జరుగుతుందని ఆశిస్తున్నా' అని కామెంట్ చేశాడు.ఇది విన్న స్పెయిన్ అభిమానులు.. ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు అని కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ 2-0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒజర్బయాల్ (22వ నిమిషం), పెడ్రో పొర్రో (58వ నిమిషం) చెరో గోల్ సాధించారు. ఈసారి ఫిఫాలో ఫ్రాన్స్ ఒక్క గోల్ చేయకపోవడం ఇదే తొలిసారి. తాము ఆడిన ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన ఫ్రాన్స్ సెమీస్‌లో స్పెయిన్‌పై మాత్రం గోల్ చేయడంలో విఫలమైంది. 🚨 Lamine Yamal: “Facing Leo Messi in a World Cup final would be fantastic. I hope so!”, told DAZN. pic.twitter.com/xWsAJ2zv9d— Fabrizio Romano (@FabrizioRomano) July 14, 2026LAMINE YAMAL SHOWS OFF HIS DIAMOND CHAIN 💎💸On his birthday, the Spain star arrived at the press conference wearing this dazzling chain ahead of tomorrow’s World Cup semifinal 🔥😱#LamineYamal #Spain #WorldCup2026 #Football #PressConference pic.twitter.com/V12ZXgb87Q— MARCA in English 🇺🇸 (@MARCAinENGLISH) July 13, 2026 -
ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్‌తో బరిలోకి అర్జెంటీనా!
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జూన్ 16న అట్లాంటా వేదికగా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. అయితే ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రత్యేక జెర్సీ కిట్‌తో బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేవీ బ్లూ జెర్సీతోనే అర్జెంటీనా ఫిఫా చరిత్రలో రెండు అద్భుతాలకు నాంది పలికిందిఇంగ్లండ్పై మానసికంగా పైచేయి సాధించాలనే ఉద్దేశంతో సెమీస్ రోజున అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీని ధరించనున్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే అర్జెంటీనా ఫిఫా నుంచి అనుమతి కూడా పొందింది. ప్రతీ ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఒక మ్యాచ్‌ను నేవీ బ్లూ జెర్సీతో ఆడడం ఆనవాయితీగా చేసుకుంది. ఈ ఫిఫాలో ఇప్పటికే జోర్డాన్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీతో బరిలోకి దిగారు. Photo Credit: FIFA Twitterఇంగ్లండ్‌తో సెమీస్ సందర్భంగా తమకు రెండోసారి నేవీ బ్లూ జెర్సీ ధరించే అవకాశం ఇవ్వాలని అర్జెంటీనా ఫిఫాను అభ్యర్థించింది. తాజాగా ఫిఫా నుంచి అనుమతి రావడంతో అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీకి లైన్ క్లియర్ అయింది. సెమీస్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీ, నల్లరంగు షార్ట్‌ను ధరించనుండగా.. ఇంగ్లండ్ వైట్ అండ్ వైట్‌లో బరిలోకి దిగనుంది.జెర్సీ వెనుక పెద్ద కథే..అర్జెంటీనా ప్రతి ఫిఫాలో నేవీ బ్లూ జెర్సీతో ఒక మ్యాచ్ ఆడడం వెనుక పెద్ద కథే దాగుంది. 1986 ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ తలపడ్డాయి. అప్పట్లో ఇద్దరి జెర్సీ రంగు దాదాపు ఒకే విధంగా ఉండడంతో జట్ల మధ్య తేడా ఉండాలని అర్జెంటీనా నేవీ బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మెక్సికో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లోనే మారడోనా 'హ్యాండ్ ఆఫ్ గాడ్' తో పాటు 'గోల్ ఆఫ్ ది సెంచరీ' నమోదు చేశాడు.Photo Credit: FIFA Twitterఆ మ్యాచ్‌కు గుర్తుగా తాజా ఫిఫాలో సెమీస్‌లో మరోసారి ఇంగ్లండ్‌తో తలపడుతున్న వేళ అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీతో ఆడాలని నిర్ణయించుకుంది. ఇది మానసికంగా ఇంగ్లండ్‌పై తమకు విజయం సాధించినట్లవుతుందని అర్జెంటీనా అభిప్రాయపడుతుంది. 1986 ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో రెండుసార్లు అర్జెంటీనా, ఇంగ్లండ్‌లు తలపడ్డాయి. ఈ రెండుసార్లు కూడా అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీతోనే బరిలోకి దిగడం విశేషం. 1998 ఫిఫాలో పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-3తో ఇంగ్లండ్‌పై విజయాన్ని అందుకుంది. ఇక 2002 ఫిఫాలో డేవిడ్ బెక్‌హమ్ మెరుపులతో ఇంగ్లండ్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరుజట్లు నాకౌట్ మ్యాచ్‌లో తలపడనుండడంతో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.Photo Credit: FIFA Twitterహ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్'హ్యాండ్ ఆఫ్ గాడ్' అనేది 1986 ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్-ఫైనల్లో అర్జెంటీనా ఆటగాడు డియెగో మారడోనా ఇంగ్లాండ్‌పై చేసిన వివాదాస్పద గోల్. అతను ఇంగ్లాండ్ గోల్ కీపర్ కంటే ఎత్తున ఎగిరి, బంతిని తన ఎడమ చేతితో గోల్ పోస్ట్‌లోకి నెట్టాడు. రిఫరీలు దీన్ని గమనించకపోవడంతో గోల్ చెల్లుబాటయింది. ఆ తర్వాత మారడోనా కొట్టిన గోల్‌ను హ్యాండ్ ఆఫ్ గాడ్‌గా అభివర్ణించారు.Photo Credit: FIFA Twitterగోల్ ఆఫ్ ది సెంచరీఫుట్బాల్ చరిత్రలో అత్యుత్తమమైన గోల్‌గా పేరొందిన "గోల్ ఆఫ్ ది సెంచరీ"ని 1986 జూన్ 22న అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా సాధించాడు. మెక్సికోలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, మారడోనా దాదాపు 60 మీటర్ల దూరం నుంచి ఐదుగురు ఇంగ్లాండ్ ఆటగాళ్లను దాటుకుంటూ వెళ్లి ఈ అద్భుతమైన గోల్ చేయడం చరిత్రలో నిలిచిపోయింది. అందుకే దీనిని గోల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణించారు.చదవండి: చెన్నై వేదికగా తొలి మ్యాచ్.. బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల -
సెమీస్ సమరం.. ఎవరి బలమెంత?
ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈసారి గ్రూప్ దశలో 48 జట్లు పాల్గొన్నాయి. రౌండ్ ఆఫ్ 32, ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో వడపోత తర్వాత నాలుగు జట్లు మిగిలాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అర్జెంటీనా దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టగా, 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా వరుసగా మూడోసారి (2018, 2022, 2026) సెమీస్‌కు దూసుకొచ్చింది. ఇక 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ (2010 విజేత) సెమీస్‌లో అడుగుపెడితే, అటు మాజీ చాంపియన్ ఇంగ్లండ్ కూడా తన దూకుడైన ఆటతీరుతో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇప్పటిదాకా తమకు ఎదురైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ వచ్చిన ఈ నాలుగు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో సెమీస్‌లో తలపడనున్నాయి. గత ఫిఫా ప్రపంచకప్ లాగే ఈసారి ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ పోరును చూస్తామా లేక స్పెయిన్, ఇంగ్లండ్ ఆట చూస్తామా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో సెమీస్‌లో ఎవరితో ఎవరు తలపడనున్నారనేది ఒకసారి పరిశీలిద్దాం. ఒస్మోన్ డెంబ్లీ, ఫ్రాన్స్ (Phot Credit: FIFA Twitter)జట్ల బలాబలాలు👉ఫ్రాన్స్ తరఫున ఎంబాపె అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఈసారి ఫిఫాలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, మూడు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఎంబాపె తర్వాత ఒస్మోన్ డెంబ్లీ కూడా ఫ్రాన్స్‌కు బలమైన ఆటగాడు. ఫార్వార్డ్ ప్లేయర్ అయిన డెంబ్లీ ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్, రెండు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు.👉ఇక స్పెయిన్ తరఫున కెప్టెన్ రొడ్రితో పాటు యామినే లమాల్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. వీరిద్దరితో పాటు మైకెల్ ఒయర్జబాల్ (ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్), గోల్ కీపర్ ఉనైయి సిమోన్లు కూడా తమదైన ఆటతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.మైకెల్ ఒయర్జబాల్, స్పెయిన్ (Phot Credit: FIFA Twitter)👉ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హ్యారీకేన్ ఈసారి ఎలాగైనా ఫిఫా ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తరఫున ఈసారి ఫిఫాలో ఆరు మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ చేసి ఆ జట్టు తరఫున గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు. హ్యారికేన్కు తోడుగా జూడ్ బెల్లింగ్హమ్ కూడా కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. బెల్లింగ్హమ్ కూడా ఆరు గోల్స్ చేసి హ్యారికేన్తో సమానంగా ఉన్నాడు.👉డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాకు కర్త, కర్మ, క్రియ.. లియోనల్ మెస్సీ. మెస్సీ ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. మెస్సీతో పాటు ఎమిలో మార్టినేజ్, జులియన్ అల్వరెజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్‌లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.జూడ్ బెల్లింగ్హమ్, ఇంగ్లండ్ (Phot Credit: FIFA Twitter)తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ఫ్రాన్స్, స్పెయిన్ జట్ల మధ్య తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం జులై 15న (బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు) జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 38 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా.. స్పెయిన్‌దే పైచేయి. 38 మ్యాచ్‌ల్లో స్పెయిన్ 18 గెలవగా.. ఫ్రాన్స్ 13 గెలిచింది. 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే ఫిఫా ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు కేవలం ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2016 ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్ 3-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది.అలెక్సిస్ మాక్ అలిస్టర్, అర్జెంటీనా (Phot Credit: FIFA Twitter)రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్ఫిఫాలో రెండో సెమీ-ఫైనల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జులై 16 (భారత కాలమాన ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 గంటలు) అట్లాంటా వేదికగా జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐదు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడగా.. వీటిలో ఇంగ్లండ్ మూడు, అర్జెంటీనా రెండు గెలిచాయి. 40 ఏళ్ల క్రితం (1986 ఫిఫా) ఇరుజట్ల మధ్య జరిగిన సెమీస్‌లో అర్జెంటీనా పైచేయి సాధించింది.సెమీఫైనల్ షెడ్యూల్:👉తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్, బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అర్లింగ్టన్, టెక్సస్👉రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్, గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అట్లాంటాSemi-final match-ups 👀#FIFAWorldCup pic.twitter.com/2WWvIw4E06— FIFA World Cup (@FIFAWorldCup) July 12, 2026చదవండి: శతకంతో ప్రపంచ రికార్డు.. తొలి మహిళా క్రికెటర్‌గా యస్తిక భాటియా -
‘అంతా ఫిక్సింగ్.. వాళ్లను గెలిపించడం కోసమే ఇదంతా’
ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్, రెండో సెమీస్‌లో అర్జెంటీనాతో ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ ఫార్వార్డ్ ప్లేయర్ మొస్తాఫా జీకో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిఫా టోర్నీ ముందే ఫిక్స్ అయిందని, అర్జెంటీనాను గెలిపించడం కోసమే టోర్నీ నిర్వహిస్తున్నట్లుగా తనకు అనిపిస్తోందని పేర్కొన్నాడు. అర్జెంటీనాతో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్ 2-3 తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించి మెస్సీపై కూడా జీకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బహుశా మెస్సీ గొప్ప ఆటగాడే కావొచ్చు, కానీ తాను ప్రధానంగా పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నుంచి స్ఫూర్తి పొందుతానని పేర్కొన్నాడు.ఇక ప్రిక్వార్టర్స్‌లో ఓటమి అనంతరం ఈజిప్ట్ జట్టు అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. మ్యాచ్ మొత్తం రిఫరీ అంపైరింగ్‌ను నిష్పక్షపాతంగా నిర్వహించలేదని, తమ జట్టుకు అన్యాయం జరిగిందని జీకో ఆరోపించాడు. తాము మెరుగైన ప్రదర్శన చేశామని, కానీ విజయం అనేది తమ చేతుల్లో లేదన్నాడు. టోర్నీ మొత్తం ముందే ఫిక్స్ అయిందని, రిఫరీ చేతుల మీదుగా ఫిక్సింగ్ నడుస్తోందని తెలిపాడు. అర్జెంటీనా కోసమే ఫిఫా నిర్వహిస్తున్నట్లు అందరికీ స్పష్టంగా అర్థమవుతోందని జీకో పేర్కొన్నాడు. 😂🏆 The Swiss players looked completely stunned, almost as if they were saying:"Just hand the trophy to Argentina already!" 🤣The reactions on their faces said it all — a mix of disbelief, frustration, and pure shock. Football always delivers these priceless moments! 😅⚽…— KUMAR (@MyCric101) July 13, 2026చదవండి: ‘మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్! -
అర్జెంటీనా... అదే దూకుడు
కాన్సస్ సిటీ: ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా చేరువైంది. లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం జరిగిన చివరిదైన నాలుగో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3–1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్ జట్టును ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1–1తో సమంగా నిలువడంతో... విజేతను నిర్ణయించేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో అర్జెంటీనా రెండు గోల్స్ సాధించి ప్రపంచకప్ చరిత్రలో ఏడోసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలిస్టర్ (10వ నిమిషంలో), జూలియన్ అల్వారెజ్ (112వ నిమిషంలో), లౌటారో మార్టినెజ్ (120+1వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. స్విట్జర్లాండ్ జట్టుకు డాన్ ఎండోయో (67వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 72వ నిమిషంలో స్విట్జర్లాండ్ ప్లేయర్ బ్రీల్ ఎంబోలో ‘రెడ్ కార్డు’కు గురయ్యాడు. దాంతో మిగిలిన మ్యాచ్ మొత్తం స్విట్జర్లాండ్ పదిమంది ఆటగాళ్లతోనే ఆడింది. ఈ టోర్నీలో మొదటి ఐదు మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన మెస్సీ ఈ మ్యాచ్‌లో మాత్రం గోల్ చేయలేదు. అయితే అలెక్సిస్ తొలి గోల్ చేసేందుకు మెస్సీ సహాయపడ్డాడు. గత మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అర్జెంటీనా ఏమాత్రం ఆందోళన చెందకుండా విజయమే లక్ష్యంగా చివరి క్షణం వరకు పోరాడింది. ఈ పోరాట ఫలితమే అర్జెంటీనా జట్టుకు సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసింది. స్విట్జర్లాండ్‌తో పోరులో అర్జెంటీనా 22 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేసి ఏడుసార్లు గోల్ లక్ష్యంగా షాట్లు కొట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో అర్జెంటీనా తలపడుతుంది. గతంలో సెమీఫైనల్ చేరుకున్న ఆరు పర్యాయాలు (1930, 1978, 1986, 1990, 2014, 2022) అర్జెంటీనా జట్టు ఫైనల్లోకి ప్రవేశించడంతోపాటు మూడుసార్లు విజేతగానూ నిలిచింది. ఏడోసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. 12 ప్రపంచకప్‌లో వరుసగా 12 మ్యాచ్‌ల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన తొలి జట్టుగా అర్జెంటీనా రికార్డు నెలకొల్పింది. 72 ఏళ్లుగా ఉరుగ్వే (1930 నుంచి 1954 వరకు; వరుసగా 11 మ్యాచ్‌ల్లో ) పేరిట ఉన్న రికార్డును అర్జెంటీనా బద్దలు కొట్టింది.4 అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య 1992లో వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక... తొలిసారి ప్రపంచకప్‌లో టాప్–4 జట్లు సెమీఫైనల్ చేరాయి. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఫ్రాన్స్ తొలి స్థానంలో, స్పెయిన్ రెండో స్థానంలో, అర్జెంటీనా మూడో స్థానంలో, ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి.బెలింగ్‌హమ్ ‘డబుల్’ ధమాకా...నార్వేను ఓడించి సెమీస్‌లోకి ఇంగ్లండ్ మయామి స్టేడియంలో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో నార్వే జట్టును ఓడించి ప్రపంచకప్‌లో నాలుగోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేత ఎవరో తేలేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో ఇంగ్లండ్ ఒక గోల్ సాధించి విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నమోదు చేసిన రెండు గోల్స్ జూడ్ బెలింగ్‌హమ్ (45+2వ నిమిషంలో, 93వ నిమిషంలో) సాధించడం విశేషం. నార్వే జట్టుకు ఆండ్రీస్ షాజెల్డర్ప్ (36వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 56వ నిమిషంలో నార్వే ప్లేయర్ టార్బన్ హెగెమ్ చేసిన గోల్‌ను రిఫరీ వీడియో రీప్లే సమీక్షించాక నిరాకరించారు. ‘డి’ ఏరియాలో నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఫౌల్ చేయడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీలో ఏడు గోల్స్‌తో అదరగొట్టిన నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఎర్లింగ్ను ఇంగ్లండ్ ప్లేయర్లు వ్యూహత్మంగా కట్టడి చేశారు. ఫలితంగా ఎర్లింగ్ కేవలం రెండుసార్లు మాత్రమే ఇంగ్లండ్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టాడు. దాంతో నిర్ణీత సమయం ముగిశాక నార్వే కోచ్ ఎర్లింగ్ను వెనక్కి పిలిచి అతని స్థానంలో లార్సన్ను సబ్‌స్టిట్యూట్‌గా ఆడించారు. 1966లో ఏకైకసారి ఇంగ్లండ్ ప్రపంచకప్ సాధించగా... 1990 సెమీఫైనల్లో జర్మనీ చేతిలో... 2018 సెమీఫైనల్లో క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. -
‘మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్!
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి ఆగ్రహం ప్రదర్శించాడు. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా తన చిరునవ్వుతోనే సమాధానం చెప్పే మెస్సీ తొలిసారి కంట్రోల్ తప్పాడు. స్విట్జర్లాండ్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ‘మర్యాదగా మాట్లాడండి’ అంటూ మ్యాచ్ రిఫరీకి మెస్సీ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. స్విట్జర్లాండ్ ఫ్రీ కిక్కు సిద్ధమవుతున్న సమయంలో అర్జెంటీనా ఆటగాళ్లు డిఫెన్సివ్ వాల్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మెస్సీని నిబంధనల ప్రకారం కొంత వెనక్కి వెళ్లాలని పోర్చుగల్ రిఫరీ జోవో పిన్హీరో సూచించారు. అయితే రిఫరీ మాట్లాడిన తీరు నచ్చకపోవడంతో మెస్సీ అసహనం వ్యక్తం చేశాడు. ‘నాతో మర్యాదగా మాట్లాడండి. నన్ను అగౌరవపరచొద్దు. నేను మీతో గౌరవంగా మాట్లాడాను.. మీరు కూడా అలాగే మాట్లాడండి’ అంటూ మెస్సీ రిఫరీకి చెబుతున్నట్లు మైక్‌లో రికార్డయ్యాయి. ఈ ఫిఫాలో ప్రతీ మ్యాచ్‌లోనూ కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో మాత్రం గోల్ సాధించలేదు. అయితే ఒక అసిస్ట్‌తో మెస్సీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ విషయానికొస్తే స్విట్జర్లాండ్‌పై విజయంతో అర్జెంటీనా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్‌పై విజయం సాధించింది. ఆట అదనపు సమయంలో రెండు గోల్స్ చేసిన అర్జెంటీనా స్విట్జర్లాండ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలిస్టర్ (10వ నిమిషం), జులియన్ అల్వరెజ్ (112వ నిమిషం), లుటారో మార్టినేజ్ (121వ నిమిషం) అదనపు సమయంలో గోల్ చేశాడు. స్విట్జర్లాండ్ తరఫున డాన్ నోయే (67వ నిమిషంలో) గోల్ కొట్టాడు. “HABLÁ BIEN, NO FALTES EL RESPETO. A MÍ HÁBLAME BIEN”.Lionel #Messi, al árbitro portugués. 🤬🇦🇷 pic.twitter.com/fxMHSPMvLe— treintaytres (@GRUPOTRESTRES) July 12, 2026చదవండి: అర్జెంటీనా దిగ్గజం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన -
అర్జెంటీనా దిగ్గజం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్ (89) భారత కాలమన ప్రకారం ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఫుట్‌బాల్‌లో ఎల్లో, రెడ్ కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టడంలో ఆంటోనియో రాటిన్ కీలక పాత్ర పోషించారు. ఆదివారం ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపె ట్టింది. ఆంటోనియో మృతి పట్ల అర్జెంటీనా జట్టు సంఘీభావం ప్రకటించి ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. స్విస్‌తో మ్యాచ్‌కు అర్జెంటీనా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు.రెడ్, యెల్లో కార్డులకు ఆద్యుడు1966లో ఇంగ్లండ్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఆంటోనియో రాటిన్‌ను జర్మన్ రెఫరీ రుడాల్ఫ్ క్రీట్‌లీన్ బలవంతంగా మైదానం నుంచి బయటకు పంపడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో కార్డుల విధానం లేకపోవడంతో ఆంటోనియో మైదానం వీడకుండా తనకు అన్యాయం చేశారంటూ మైదానంలోనే కూర్చొని నిరసనకు దిగారు. ఈ సంఘటన ఫుట్‌బాల్ చరిత్రలో ఒక మలుపు తీసుకువచ్చింది. బ్రిటన్ రాణి కోసం ప్రత్యేకంగా పరిచిన రెడ్ కార్పెట్‌పై కూర్చొని నిరసన తెలపడంతో పెద్ద చర్చకు దారితీసింది.దెబ్బకు దిగొచ్చిన ఫిఫాదీంతో మరుసటి (1970) ప్రపంచకప్ నుంచి రెడ్, ఎల్లో కార్డుల విధానాన్ని ఫిఫా అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఆటగాళ్లకు రెఫరీ నిర్ణయాలు స్పష్టంగా తెలియజేయబడటానికి మార్గం సుగమం అయ్యింది. ఇక రాటిన్ తన కెరీర్‌ను 'బోకా జూనియర్స్' క్లబ్‌కు అంకితం చేశారు, అక్కడ 1956 నుంచి 1970 వరకు 382 మ్యాచ్‌లు ఆడి, నాలుగు లీగ్ టైటిళ్లను గెలుచుకున్నారు. 1962, 1966 ప్రపంచకప్పుల్లో అర్జెంటీనా తరఫున ప్రాతినిధ్యం వహించారు.ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత ఆంటోనియో రాటిన్ కోచ్‌గా, రాజకీయ నాయకుడిగా కూడా ఆయన తన ప్రతిభను ప్రదర్శించారు. మైదానంలో తన అంకితభావం, దేశం పట్ల గర్వంతో ఆడిన గొప్ప ఆటగాడిగా ఫుట్‌బాల్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన మృతితో, ఫుట్‌బాల్ ప్రపంచం ఒక గొప్ప ఆటగాడిని కోల్పోయింది. రాటిన్ క్రీడా ప్రస్థానం, ఆయన చేసిన మార్పులు, ఫుట్‌బాల్‌కు ఆయన అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయనడంలో సందేహం లేదు. 🇦🇷 Argentina wearing black armbands vs Switzerland today Rest in peace, Antonio Rattín The Albiceleste are honouring the Boca Juniors and Argentina legend, who passed away yesterday at 89.Captain of the 1966 World Cup team, his famous sending-off vs England helped inspire… pic.twitter.com/DAbbwUI0qc— Sports Freak (@OfficialSfreak) July 12, 2026 A los 89 años falleció Antonio Rattin símbolo del fútbol argentino y de Boca. Un 5 con garra, capitán de la Selección en el Mundial 66 donde lo expulsaron vs Inglaterra en Wembley y al retirarse estrujo el banderin del corner con la bandera británica. Respetado x rivales. QEPD pic.twitter.com/yQpmU34Aex— Archivo Dany Páez⚪️🔴⚪️ (@DanyPaez1975) July 11, 2026 Falleció Antonio Rattín a los 89 años ⚫👉 Recordamos el día que humilló a los ingleses: estrujó la bandera británica y se sentó en la alfombra real en las semifinales del mundial de 1966 ⚽ pic.twitter.com/w5RHTRyaYX— El Destape (@eldestapeweb) July 11, 2026Read: చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు -
స్విట్జర్లాండ్ ప్లేయర్ హైడ్రామా.. మరో వివాదంలో అర్జెంటీనా!
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా మరోసారి వివాదంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రిఫరీ తప్పుడు నిర్ణయాలతో అర్జెంటీనా విజయాలు సాధిస్తుందని ప్రత్యర్థి జట్లు ఆరోపణలు గుప్పించాయి. తాజాగా క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గురయ్యి మైదానం నుంచి బహిష్కరణకు గురి కావడం అర్జెంటీనాను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. నిజానికి ఇక్కడ స్విట్జర్లాండ్ ప్లేయర్ బ్రీల్ ఎంబోలో నటనను అద్భుతంగా పండించాడు. కానీ డ్రామా పండకపోవడంతో పాటు తప్పిదానికి మూల్యంగా రెడ్‌కార్డ్‌కు గురవ్వడంతో స్విట్జర్లాండ్ 10 మందికే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది.ఎంబోలోకు రెడ్‌కార్డ్ ఎందుకంటే?విషయంలోకి వెళితే.. ఆట రెండవ అర్ధభాగంలో స్విట్జర్లాండ్‌కు చెందిన బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గురయ్యాడు. ఎంబోలోపై అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పరేడెస్ అనాలోచిత ఫౌల్ చేసిన కారణంగా మొదట అతడికి యెల్లో కార్డ్ చూపించాడు. అయితే, వీఏఆర్ బృందం జోక్యం చేసుకుని, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్‌కు యెల్లో కార్డు ఇవ్వడం అన్యాయమని, దానిని రద్దు చేయాలని సూచించింది. దీంతో రిఫరీ జోవో పిన్హీరో మైదానం డగౌడ్‌లో ఉన్న మానిటర్‌లోని ఫుటేజీని సమీక్షించారు. ఫుటేజీలో పరేడెస్ ఎలాంటి తప్పిదం చేయలేదని, పరేడెస్ రాకముందే ఎంబోలో కిందపడినట్లుగా నటించినట్లు తేలింది. దీంతో పరేడెస్ యెల్లో కార్డ్ రద్దు చేసిన రిఫరీ ఆ తర్వాత ఎంబోలోకు రెడ్ కార్డ్ చూపించాడు. ఆటలో అంతకముందే ఒక ఫౌల్ చేసిన కారణంగా ఎంబోలో యెల్లో కార్డుకు గురయ్యాడు. తాజాగా తనను కిందపడేశాడంటూ ఆరోపించడం, ఆ తర్వాత ఫుటేజీలో అదంతా నటన అని తేలడంతో ఎంబోలోకు రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు. ఈ సమయంలో మైదానంలో ఒక్కసారిగా హైడ్రామా చోటుచేసుకుంది. రిఫరీ నిర్ణయాన్ని తప్పుబ్టటిన స్విస్ జట్టు నిరసనకు దిగింది. అయితే అదే సమయంలో ఎంబోలో తాను తప్పు చేశానని అంగీకరించడంతో, మ్యాచ్ రిఫరీ అనవసరంగా సీన్ చేయొద్దని, మైదానం నుంచి బయటకు వెళ్లాలని హెచ్చరించాడు. దీంతో చేసేదేం లేక ఎంబోలో ఏడుస్తూ మైదానం వీడాడు. ఈసారి ఫిఫా మొదలైనప్పటి నుంచి వీఏఆర్ సమీక్షలపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. IFAB (అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డ్) ఆట నియమాల ప్రకారం, అనుకరణ అనేది ఖచ్చితంగా క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన ప్రవర్తన వర్గంలోకి వస్తుంది. మ్యాచ్ అధికారులను మోసం చేయడానికి ప్రయత్నించినట్లు రుజువైతే, ఆటగాడికి తప్పనిసరిగా హెచ్చరిక (పసుపు కార్డు) ఇవ్వాలని నియమావళి నిర్దేశిస్తుంది. Breel Embolo crying after receiving the RED CARD in Argentina vs Switzerland FIFA World Cup Quarterfinal game pic.twitter.com/1vpcl43Xod— Daily Foot Vibes (@dailyfootvibes) July 12, 2026Read: చిత్తుగా ఓడిన స్విట్జర్లాండ్.. సెమీఫైనల్లో అర్జెంటీనా -
చిత్తుగా ఓడిన స్విట్జర్లాండ్.. సెమీఫైనల్లో అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్‌పై ఘన విజయాన్ని సాధించింది. నిర్ణీత సమయంలో ఒక గోల్ చేసిన అర్జెంటీనా ఆట అదనపు సమయంలో మరో రెండు గోల్స్ చేసి స్విట్జర్లాండ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలిస్టర్ (10వ నిమిషం), జులియన్ అల్వరెజ్ (112వ నిమిషం), లుటారో మార్టినేజ్ (121వ నిమిషం) ఆట అదనపు సమయంలో గోల్ చేశాడు. స్విట్జర్లాండ్ తరఫున డాన్ నోయే (67వ నిమిషంలో) గోల్ కొట్టాడు. ఇక ఆట 72వ నిమిషంలో బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గురయ్యాడు. దీంతో స్విట్జర్లాండ్ 10 మంది ఆటగాళ్లతోనే మిగతా మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.ఉత్కంఠభరితంగా సాగిన పోరులో తొలి హాఫ్‌లో ఆట ప్రారంభమైన కాసేపటికే అర్జెంటీనా గోల్ చేసింది. మెస్సీ నుంచి పాస్ అందుకున్న అలిస్టర్ బంతిని నేరుగా గోల్ పోస్ట్‌లోకి పంపించి 1-0తో అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తొలి అర్ధభాగంలో విఫలమైన స్విట్జర్లాండ్ రెండో హాఫ్‌లో మాత్రం ఫుంజుకొని అర్జెంటీనాకు గట్టి పోటీనిచ్చింది.ఈ నేపథ్యంలోనే 67వ నిమిషంలో డాన్ నోయె గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత నిర్ణీత సమయంతో పాటు స్టాపేజీ టైంలోనూ ఇరుజట్లు మరో గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. ఎక్స్ట్రా టైమ్‌లో అర్జెంటీనా తరఫున జులియన్ అల్వరెజ్ 112వ నిమిషంలో మెరిసి అర్జెంటీనాకు రెండో గోల్ అందించాడు. మరో నాలుగు నిమిషాల్లో ఎక్స్ట్రా టైమ్ ముగుస్తుందనగా, 121వ నిమిషంలో లుటారో మార్టినేజ్ గోల్ చేసి ఆధిక్యాన్ని మూడుకు పెంచాడు. 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనా సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. మరో సెమీస్‌లో స్పెయిన్‌తో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. అన్నీ కుదిరితే 2022 ఫిఫా ఫైనల్ మరోసారి రిపీటయ్యే అవకాశముంది. 2022 ఫిఫా ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూటౌట్లో మట్టికరిపించిన అర్జెంటీనా మూడోసారి ఫిఫా టైటిల్‌ను గెలుచుకుంది. I want this Julian Alvarez in this World Cup 😃🙏🏻pic.twitter.com/IwHW5ORAyL— Messi¹⁰ (@LaPulgaZone) July 11, 2026 Breel Embolo crying after receiving the RED CARD in Argentina vs Switzerland FIFA World Cup Quarterfinal game pic.twitter.com/1vpcl43Xod— Daily Foot Vibes (@dailyfootvibes) July 12, 2026చదవండి: 25 ఏళ్లకే స్టార్ ఫుట్‌బాలర్ కన్నుమూత -
ఫిక్సింగ్ ఆరోపణలు.. కప్పు గెలవొద్దనే ఇలాంటి కుట్రలు!
ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రేపు జరగనున్న క్వార్టర్ ఫైనల్లో మెస్సీ సేన స్విట్జర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. స్విట్జర్లాండ్‌పై విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లాలని అర్జెంటీనా జట్టు భావిస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే క్వార్టర్స్‌లో రిఫరీ సానుకూల నిర్ణయాలతో తమను చీట్ చేసి గెలిచిందని ఈజిప్ట్ ఫిఫాకు ఫిర్యాదు చేసింది. ఇది ఫిక్సింగ్ కిందకు వస్తుందని, దీనిపై విచారణ చేపట్టాలని కూడా ఈజిప్ట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఫిఫాను కోరింది. ఈ నేపథ్యంలోనే అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కలోని తమ జట్టుపై వస్తున్న ఆరోపణలపై తొలిసారి స్పందించాడు. ఇప్పటిదాకా బయటే వినిపించిన ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు ఆటగాళ్ల దాకా కూడా వచ్చాయని తెలిపాడు. అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ గెలవకూడదనే ఉద్దేశంతోనే కొందరు గిట్టనివాళ్లు చేస్తున్న తప్పుడు ఆరోపణలను తాము పట్టించుకోమని కుండబద్దలు కొట్టాడు. లియోనల్ స్కలోని మాట్లాడుతూ.. ‘అర్జెంటీనా గెలవకూడదని కోరుకోవడం ఇదేమి కొత్త కాదు. 1986 ఫిఫా ప్రపంచకప్ సమయంలోనూ అర్జెంటీనాపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. కానీ అప్పటి మారడోనా బృందం ఇలాంటి వాటిని బేఖాతరు చేయకుండా ఒక చాంపియన్ ఆటను ప్రదర్శించి రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఈజిప్ట్ ఆరోపిస్తున్నట్లుగా రెండో అర్ధభాగంలో వాళ్లు కొట్టిన గోల్‌ను రద్దు చేయడానికి ముందే వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) ఫుటేజీని క్లియర్‌గా పరిశీలించారు. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే నిర్దేశించిన నియమాలను మాత్రమే వీఏఆర్ బృందం పాటిస్తోందని' లియోనల్ స్కలోని పేర్కొన్నాడు. ఇక ఫిఫా 2026లో అర్జెంటీనా చాంపియన్ ఆటతీరును ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 8 గోల్స్, ఒక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.చదవండి: కోహ్లి రహస్య సంభాషణ బట్టబయలు! -
సెమీఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
మయామి: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ తుది అంకానికి చేరువైంది. రెండు సెమీఫైనల్ బెర్త్‌ల కోసం నార్వే జట్టుతో ఇంగ్లండ్; స్విట్జర్లాండ్ జట్టుతో అర్జెంటీనా తలపడనున్నాయి. నార్వే, స్విట్జర్లాండ్ జట్లు ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా సెమీఫైనల్ చేరుకోలేకపోయాయి. మరోవైపు ఇంగ్లండ్ 1966లో... అర్జెంటీనా 1978లో, 1986లో, 2022లో ప్రపంచకప్ టైటిల్స్ సాధించాయి. ఈ టోర్నీలో నార్వే అసాధారణ ప్రదర్శన కనబరుస్తూ తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ముఖ్యంగా నార్వే ఫార్వర్డ్ ఎర్లింగ్ హాలాండ్ కళ్లు చెదిరే ఆటతీరుతో అలరిస్తున్నాడు. 4 మ్యాచ్‌ల్లో ఎర్లింగ్ 7 గోల్స్ చేసి నార్వే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్ బెలింగ్‌హమ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. హ్యారీ కేన్ 6 గోల్స్, బెలింగ్‌హమ్ 4 గోల్స్ సాధించారు. ఇక డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు అజేయంగా నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. అర్జెంటీనాపై స్విట్జర్లాండ్‌పై ఆరంభం నుంచే ఒత్తిడి పెంచి మ్యాచ్‌ను పెనాల్టీ షూటౌట్ వరకు రప్పించ గలిగితే తుది ఫలితం ఎలాగైనా ఉండవచ్చు. -
‘రిఫరీ చీటింగ్‌తోనే అర్జెంటీనాకు విజయం’
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. అయితే మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఈజిప్ట్ మాత్రం అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించింది. ఒక దశలో 2-0తో ఆధిక్యంలో నిలిచిన ఈజిప్ట్ అర్జెంటీనాను ఓడించినంత పని చేసింది. అయితే చివరి నిమిషాల్లో మూడు గోల్స్ కొట్టిన అర్జెంటీనా విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఈజిప్ట్ జట్టు రిఫరీపై ఫిఫాకు ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు రిఫరీ అర్జెంటీనాకు అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారని, అతడిని వెంటనే తొలగించాలని ఫిఫాకు రాసిన ఫిర్యాదు లేఖలో పేర్కొంది.వీఏఆర్ సమీక్ష తర్వాత గోల్‌ను తిరస్కరించడమే గాక, అర్జెంటీనా విజయానికి దారి తీసిన చివరి గోల్ పెనాల్టీ అప్పీల్‌ను సమీక్షించకపోవడం సహా చాలా నిర్ణయాలు ఈజిప్ట్‌కు వ్యతిరేకంగా రావడంపై ఆ జట్టు శిబిరం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈజిప్ట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హనీ అబో రిడా.. ఫ్రెంచ్ రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్, మిగిలిన బృందంపై ఫిఫాకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తప్పుడు నిర్ణయాలతో ఈజిప్ట్ విజయాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం కిందకు వస్తుందని తెలిపిన హనీ అబో, విచారణ చేపట్టాలని కోరారు. ఫ్రెంచ్ రిఫరీ బృందాన్ని మిగిలిన టోర్నీ మ్యాచ్‌ల్లో పాల్గొనకుండా తొలగించాలని హనీ అబో ఫిఫాను అభ్యర్థించారు. మ్యాచ్ విషయానికొస్తే.. రౌండ్ ఆఫ్ 16లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను మట్టికరిపించింది. అర్జెంటీనా తరఫున క్రిస్టియన్ రోమెరో (79వ నిమిషం), లియోనల్ మెస్సీ (83వ నిమిషం), యెంజో ఫెర్నాండేజ్ (90+3వ నిమిషం) ఆట ఆఖరి నిమిషంలో మూడు గోల్స్ కొట్టారు. మరోవైపు ఈజిప్ట్ తరఫున యాసర్ ఇబ్రహీం (15వ నిమిషం), మొస్తాఫా జికో (67వ నిమిషం) గోల్స్ సాధించారు. ఇక క్వార్టర్ ఫైనల్లో మెస్సీ బృందం జూలై 12న ఉదయం 6.30 గంటలకు స్విట్జర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.#Missi asks Egypt's coach: «What's wrong with you?» pic.twitter.com/yQ6tml5Prw— WardaNews (@warda_news1) July 7, 2026#Missi asks Egypt's coach: «What's wrong with you?» pic.twitter.com/yQ6tml5Prw— WardaNews (@warda_news1) July 7, 2026Read: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. గాయంతో కీలక ప్లేయర్ దూరం! -
ఎనిమిది జట్ల సయ్యాట.. ఫిఫా క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదే
ఫిఫా ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్ దశకు చేరింది. ఇక్కడి నుంచి మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా మారనున్నాయి. లీగ్ దశలో 48 జట్లు పోటీపడితే అందులో నుంచి 32 జట్లు రౌండ్ ఆఫ్ 32కు చేరాయి. అక్కడి నుంచి 16 జట్లు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్లో 8 జట్లు (అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే, బెల్జియం, ఇంగ్లండ్, మొరాకో, స్విట్జర్లాండ్) అమీతుమీకి సిద్ధమ వుతున్నాయి. ఎంబాపె (ఫ్రాన్స్), మెస్సీ (అర్జెంటీనా)ఈ ఫిఫాలో భారీ అంచనాలు పెట్టుకున్న పెద్ద జట్లలో చాలా వరకు నిష్క్రమించడం గమనార్హం. జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్స్, క్రొయేషియా లాంటి జట్లు ప్రిక్వార్టర్స్‌లోనే తమ ఆటను ముగించాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా తమ స్థాయికి తగ్గట్లే వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ 5 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, ఒక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు యువ సంచలనం కైలియన్ ఎంబాపె 5 మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్‌తో మెస్సీని అనుసరిస్తున్నాడు. ఎర్లింగ్ హాలండ్ (నార్వే), లామినే యమాల్ (స్పెయిన్)అన్నీ కుదిరితే 2022 ఫిఫాలో ఫైనల్లో తలపడిన అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు ఈసారి సెమీస్ లేదా మరోసారి ఫైనల్లో తలపడే అవకాశముంది. మరోవైపు మాజీ చాంపియన్లు స్పెయిన్, ఇంగ్లండ్‌తో పాటు బెల్జియం తమ స్థాయి ఆటతీరుతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. ఇక ఎవరూ ఊహించని రీతిలో మొరాకో నార్వే, స్విట్జర్లాండ్ కూడా ప్రిక్వార్టర్స్‌లో అదరగొట్టి క్వార్టర్స్‌లో ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో క్వార్టర్ ఫైనల్ దశలో ఏ జట్టు ఎవరితో తలపడనుంది, ఏ సమయానికి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం.లుకాకు (బెల్జియం), హ్యారీకేన్ (ఇంగ్లండ్)క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్:👉ఫ్రాన్స్ వర్సెస్ మొరాకో, జూలై 10, తెల్లవారుజామున 1.30 గంటలకు, వేదిక: బోస్టన్👉స్పెయిన్ వర్సెస్ బెల్జియం, జూలై 11, అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: లాస్ ఏంజెలెస్👉నార్వే వర్సెస్ ఇంగ్లండ్, జూలై 12, తెల్లవారుజామున 2.30 గంటలకు, వేదిక: మియామి స్టేడియం👉అర్జెంటీనా వర్సెస్ స్విట్జర్లాండ్, జూలై 12, ఉదయం 6.30 గంటలకు, వేదిక: కాన్సాస్ సిటీక్వార్టర్ ఫైనల్లో గెలిచిన నాలుగు జట్లు జూలై 15, 16వ తేదీల్లో జరగనున్న సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఇక ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్ జూలై 19 (ఆదివారం) తెల్లవారుజామున 2.30 గంటలకు జరగనుంది.Read: టీమిండియాకు ఆర్చర్ చురకలు.. ‘వైభవ్‌కు ఇదే నా సవాల్’ -
మెస్సి మ్యాజిక్.. వరుస విజయలతో అర్జెంటీనా జోరు..
-
ఆఖరి నిమిషాల్లో మూడు గోల్స్.. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను మట్టికరిపించింది. అర్జెంటీనా తరఫున క్రిస్టియన్ రోమెరో (79వ నిమిషం), లియోనల్ మెస్సీ (83వ నిమిషం), యెంజో ఫెర్నాండేజ్ (90+3వ నిమిషం) ఆట ఆఖరి నిమిషంలో మూడు గోల్స్ కొట్టారు. మరోవైపు ఈజిప్ట్ తరఫున యాసర్ ఇబ్రహీం (15వ నిమిషం), మొస్తాఫా జికో (67వ నిమిషం) గోల్స్ సాధించారు. ఇక మెస్సీకి ఈ ఫిఫాలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఇది 8వ గోల్ కావడం విశేషం. ప్రస్తుతం ఎంబాపెను దాటిన మెస్సీ 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అర్జెంటీనాకు ఈజిప్ట్ చుక్కలుఇక మ్యాచ్‌లో అర్జెంటీనాకు ఈజిప్ట్ ముచ్చెమటలు పట్టించింది. తొలి హాఫ్ ముగిసేసరికి ఈజిప్ట్ ఒక గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్లోనూ 67వ నిమిషంలో ముస్తాఫా జీకో రెండో గోల్ కొట్టడంతో ఈజిప్ట్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక మ్యాచ్‌లో అర్జెంటీనా ఓడిపోతుందా? విజయం ఈజిప్ట్దేనా అనే అనుమానాలు రేకెత్తాయి.ఆఖర్లో హైడ్రామా అర్జెంటీనా మ్యాచ్ ఓడిపోతుందా అన్న సమయంలో అసలు డ్రామా మొదలైంది. మరో 15 నిమిషాల్లో ఫుల్‌టైమ్ ముగుస్తుందనగా, అర్జెంటీనా స్ట్రైకర్ క్రిస్టియన్ రొమెరో తొలి గోల్‌తో మెరిశాడు. రైట్ కార్నర్ నుంచి మెస్సీ అందించిన బంతిని బులెట్ హెడర్‌తో క్రిస్టియన్ రొమెరో నేరుగా గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. ఇక 83వ నిమిషంలో మెస్సీ బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి తరలించి స్కోరును 2-2తో సమం చేశాడు. 90 నిమిషాలు ముగియడంతో ఇంజ్యూరీ టైమ్ మొదలైంది. 90+3వ నిమిషంలో ఈసారి యెంజో ఫెర్నాండేజ్ హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించడంతో 3-2తో అర్జెంటీనా ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత ఈజిప్ట్ పలుమార్లు గోల్‌పోస్ట్‌పై దాడులు చేసినప్పటికీ లాభం లేకపోయింది.🚨 GOAL ARGENTINA!LIONEL MESSI EQUALIZES IN THE 83RD MINUTE! 🇦🇷⚽ pic.twitter.com/U0jkSMkgsT— FIFA World Cup 2026 (@FIFAWC26Updates) July 7, 2026 THIS IS WHAT IT MEANS! 💙🥺pic.twitter.com/tvg4ujENTt— BarçaTimes (@BarcaTimes) July 7, 2026 -
అర్జెంటీనా 'అదరహో'...
మయమీ: మూడు సార్లు ప్రపంచ కప్ విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఒక వైపు...తొలిసారి వరల్డ్ కప్‌లో ఆడుతున్న పసికూన మరో వైపు...ఫలితం ఎలా ఉంటుందో అందరూ అంచనా వేసుకోవచ్చు. కానీ ఆ దిగ్గజం ముందు ఈ కొత్త టీమ్ అంత సులువుగా తలొగ్గలేదు. ఓడినా అసాధారణ ఆటతో చివరి వరకు పోరాడింది. కాస్త అదృష్టం కలిసిరాక చివరకు నిరాశతో నిష్క్రమించాల్సి వచ్చింది. దిగ్గజం లయోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా గెలుపు కోసం 120 నిమిషాల పాటు ప్రతీ సెకన్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఎన్నో గోల్ ప్రయత్నాలు విఫలం కాగా, చివరకు చచ్చీచెడి పైచేయి సాధించింది. అర్జెంటీనా, కొత్త జట్టు కేప్ వెర్డే మధ్య జరిగిన ‘ఫిఫా’ వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ గురించి సంక్షిప్త వివరణ ఇది. శనివారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3–2 గోల్స్ తేడాతో కేప్ వెర్డేను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అర్జెంటీనా తరఫున లయోనల్ మెస్సీ (29వ నిమిషం), లిజాండ్రో మార్టినెజ్ (92వ ని.) గోల్స్ కొట్టగా... కేప్ వెర్డె ఆటగాళ్లలో డెరాయ్ డ్యుయార్టె (59వ ని.), సిడ్నీ లోపెజ్ కాబ్రాల్ (103వ ని.) చెరో గోల్ కొట్టారు.అయితే 111వ నిమిషంలో కేప్ వెర్డె ఆటగాడు డైనీ బోర్జెస్ చేసిన సెల్ఫ్ గోల్‌తో అర్జెంటీనా గట్టెక్కగా, కేప్ వెర్డె దురదృష్టవశాత్తూ పరాజయం పాలైంది. చాలా సమయం పాటు గోల్ కీపర్ వోజిన్హాను దాటడం అర్జెంటీనా వల్ల కాలేదు. మొత్తంగా మ్యాచ్‌లో అతను 10 గోల్స్‌ను నిలువరించగా... వాటిలో ఐదు మెస్సీ కొట్టినవే కావడం విశేషం. సుమారు ఐదు లక్షల జనాభా ఉన్న కేప్ వెర్డె తొలి సారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించడంతో పాటు నాకౌట్‌కు చేరి సగర్వంగా టోర్నీని ముగించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈజిప్‌్టతో అర్జెంటీనా తలపడుతుంది. ఆద్యంతం అద్భుతంగా... అర్జెంటీనా స్థాయిని బట్టి చూస్తే ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్ కేప్ వెర్డె అద్భుత ప్రదర్శనతో హోరాహోరీగా జరిగింది. అర్జెంటీనా దూకుడు కనబర్చిన ప్రతీసారి కేప్ వెర్డె అంతే దీటుగా ఎదురుదాడి చేసింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లనూ డ్రాగా ముగించి ఓటమి లేకుండా ముందంజ వేసిన వెర్డె నాకౌట్ పోరులోనూ సత్తా చాటింది. ఎట్టకేలకు 29వ నిమిషంలో అర్జెంటీనా బోణీ చేసింది. లిజాండ్రో మార్టినెజ్ ఇచ్చిన లాఫ్టెడ్ పాస్‌ను అందుకున్న మెస్సీ పూర్తి నియంత్రణతో దూసుకుపోయి తొలి గోల్ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో మెస్సీకిది 7వ గోల్ కావడం విశేషం. అయితే రెండో అర్ధభాగం మొదలు కాగానే కేప్ వెర్డె దూకుడు పెంచింది. దాని ఫలితం తొమ్మిది నిమిషాల్లోనే వచ్చింది. డ్యుయార్టెను నిలువరించడం అర్జెంటీనా కీపర్ మార్టినెజ్ వల్ల కాలేదు. 73వ నిమిషంలో ఫ్రీ కిక్ లభించగా మెస్సీ కొట్టిన షాట్‌ను వెర్డె కీపర్ వోజిన్హా అద్భుతంగా అడ్డుకున్నాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో మ్యాచ్ అదనపు సమయంలోకి వెళ్లింది. ఆట ఆరంభమైన రెండు నిమిషాలకే డిఫెండర్లంతా ఒక వైపు ఉండిపోగా, లిజాండ్రో చాకచక్యంగా బంతిని అందుకొని సునాయాసంగా పోస్ట్‌లోకి కొట్టాడు. అయితే ఆ తర్వాత కేప్ వెర్డె తగిన జవాబిచ్చింది. ‘గోల్ ఆఫ్ ద టోర్నమెంట్’ అనదగ్గ రీతిలో కాబ్రాల్ స్కోరు చేయడం విశేషం. పెనాల్టీ బాక్స్ చివర్లో కుడి వైపు కార్నర్‌కు అతను కొట్టిన గోల్‌తో అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆట చివరకు వస్తుండగా అర్జెంటీనా పోరాడుతున్నా... కేప్ వెర్డె పట్టు వదల్లేదు. అయితే ఆ జట్టును అనూహ్యంగా దురదృష్టం వెంటాడింది. మెస్సీ కిక్‌ను క్రిస్టియాన్ రొమెరో హెడర్‌తో నియంత్రించే ప్రయత్నం చేయగా... వెర్డె ఆటగాడు బోర్జెస్ చేతికి తగిలిన బంతి పోస్ట్‌లోకి పడింది. ఆ తర్వాత జట్టు ఎంత ప్రయత్నించినా స్కోరును సమం చేయలేకపోయింది.క్వార్టర్ ఫైనల్లో మొరాకో హూస్టన్: ఆఫ్రికా జట్టు మొరాకో వరల్డ్ కప్‌లో వరుసగా రెండో సారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. 2022 టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచిన టీమ్ ఈ సారి కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో మొరాకో 3–0 గోల్స్ తేడాతో సహ ఆతిథ్య జట్టు కెనడాపై విజయం సాధించింది. మొరాకో తరఫున అజ్దిన్ ఒనాహీ (50వ నిమిషం, 82వ నిమిషం) రెండు గోల్స్ కొట్టగా... సూఫియాన్ రహీమి (90+8వ నిమిషం) ఒక గోల్ సాధించాడు. కెనడా తొమ్మిది సార్లు గోల్ అవకాశాలు సృష్టించుకున్నా... మొరాకో గోల్ కీపర్ యాసీన్ బోనో వాటిని సమర్థంగా అడ్డుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో కొలంబియా లీగ్ దశలో అజేయంగా నిలిచి గ్రూప్‌లో అగ్రస్థానంతో ముందంజ వేసిన కొలంబియా నాకౌట్ మ్యాచ్‌లోనూ అదే జోరున కొనసాగించింది. శనివారం మ్యాచ్‌లో కొలంబియా 1–0 గోల్ తేడాతో ఘనా జట్టును ఓడించింది. కొలంబియా తరఫున జాన్ అరియాస్ (14వ నిమిషం) ఏకైక గోల్ సాధించాడు. ఆ తర్వాత ఇరు జట్లు పలు ప్రయత్నాలు చేసినా మరో గోల్ నమోదు కాలేదు. ఘనా గోల్ కీపర్ లారెన్స్ జిగి ప్రత్యర్థి ఎనిమిది గోల్ ప్రయత్నాలను సమర్థంగా నిలువరించడం విశేషం. 56వ నిమిషంలో కొలంబియా ఆటగాడు లూయీస్ డియాజ్ బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టినా రిఫరీ దానిని ‘ఆఫ్‌సైడ్’గా తీర్మానించి గోల్ ఇవ్వలేదు. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌ను కొలంబియా ఎదుర్కొంటుంది. ‘షూటౌట్’లో ఈజిప్ట్ ముందంజ...ఖతర్‌లో జరిగిన గత ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోయిన ఈజిప్ట్ ఈ సారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. నాకౌట్ మ్యాచ్‌లో ఈజిప్ట్ పెనాల్టీ షూటౌట్లో 4–2 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఈజిప్ట్ తరఫున ఇమామ్ అషూర్ (13వ నిమిషం) గోల్ సాధించాడు. ఆ తర్వాత ఈజిప్ట్ ఆటగాడు మొహమ్మద్ హనీ (55వ ని.) అనూహ్యంగా ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణీత సమయం తర్వాత అదనపు సమయంలో కూడా పరస్థితి మారలేదు. దాంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. ఈజిప్ట్ తరఫున మహమూద్ సాబెర్, రామీ రాబియా, మొహమ్మద్ సలా, హొసామ్ అబ్దెల్ గోల్ చేయగా... ఆ్రస్టేలియా ఆటగాళ్లలో జాక్సన్ ఇర్విన్, అవేర్ మాబిల్ మాత్రమే సఫలమయ్యారు. ప్రపంచ కప్‌లో మూడు సార్లు నాకౌట్ మ్యాచ్ ఆడిన ఆ్రస్టేలియా ప్రతీ సారి ఓటమిపాలైంది. -
హోరాహోరీ పోరులో ఆర్జెంటినా గెలుపు
-
మెస్సీ మరో చరిత్ర
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మరో చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా కేప్ వెర్డేతో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో గోల్ చేయడం ద్వారా.. వరుసగా 8 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్ చేసిన తొలి ఫుట్‌బాలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా మెస్సీకి ఇది 20వ ఫిఫా వరల్డ్ కప్ గోల్. ఈ గోల్‌తో అతడు ఫిఫా ప్రపంచకప్ లీడింగ్ గోల్ స్కోరర్‌గా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ గోల్‌తో మెస్సీ గోల్డెన్ బూట్ అవకాశాలను కూడా మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ గోల్ ప్రస్తుత ప్రపంచకప్ ఎడిషన్‌లో మెస్సీకి 7వది. గోల్డెన్ బూట్ రేసులో ఫ్రాన్స్ ఆటగాడు కైలియన్ ఎంబపే 6 గోల్స్‌తో మెస్సీ వెనువెంటనే ఉన్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అర్జెంటీనా 3-2 గోల్స్ తేడాతో కేప్ వెర్డేపై గెలుపొంది, రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో కేప్ వెర్డే ఓడినా, వీరోచితంగా పోరాడి అందరి మనసులు గెలుచుకుంది. చివరి వరకు ఆ జట్టు ఓటమి ఒప్పుకోకుండా పోరాడిన తీరు ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలి గోల్ మెస్సీదే. 29వ నిమిషంలో అతడు ఈ గోల్ సాధించాడు.59వ నిమిషంలో కేప్ వెర్డే ఆటగాడు డెరోయ్ డువార్టే గోల్‌తో స్కోర్‌ను 1-1 చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ పోరుగా మారి ఉత్కంఠను పెంచింది.అర్జెంటీనా తరఫున మెస్సీ, మార్టినెజ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కేప్ వెర్డే గోల్‌కీపర్ వోజిన్హా అద్భుత సేవ్‌లతో అడ్డుకున్నాడు. నిర్ణీత 90 నిమిషాల్లో విజేత తేలకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అక్కడే అసలైన డ్రామా మొదలైంది.అదనపు సమయం ప్రారంభమైన వెంటనే 93వ నిమిషంలో లిసాండ్రో మార్టినెజ్ గోల్‌తో అర్జెంటీనా మళ్లీ ముందంజలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం వారికి ఎంతోసేపు నిలవలేదు. 103వ నిమిషంలో లారోస్ కాబ్రాల్ (కేప్ వెర్డే) అద్భుతమైన గోల్‌తో స్కోర్‌ను సమం చేశాడు.ఈ ఉత్కంఠ అక్కడితో ఆగలేదు. 111వ నిమిషంలో క్రిస్టియన్ రొమెరో హెడర్ కేప్ వెర్డే ఆటగాడు డినే (ఓన్ గోల్) ద్వారా అర్జెంటీనాను మళ్లీ ఆధిక్యంలో తీసుకెళ్లింది. ఆతర్వాత కేప్ వెర్డే వరుస ఎటాక్స్ చేసినా.. ఎమిలియానో మార్టినెజ్ అద్భుత సేవ్‌లతో అడ్డుకున్నాడు. చివరికి 3-2 తేడాతో అర్జెంటీనా విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లోకి అడుగుపెట్టింది.ఈ మ్యాచ్‌లో గెలుపు డిఫెండింగ్ ఛాంపియన్‌దే అయినా అల్ప జనాభా ఉన్న కేప్ వెర్డే చూపిన పోరాటం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకుంది. ఆఫ్రికా పడమటి తీరానికి దూరంగా సముద్రంలో ఉన్న చిన్న దీవుల దేశం కేప్ వెర్డే. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఈ జట్టు చూపిన పోరాటం ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది. -
నరాలు తెగే ఉత్కంఠ.. అదిరిపోయే హైడ్రామాలో అర్జెంటీనా గెలుపు
ఫిఫా వరల్డ్ కప్ వేదికగా జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఊహించని ఉత్కంఠ నెలకొంది. డిఫెండింగ్ చాంపియన్స్ అర్జెంటీనా.. కేప్ వెర్డే లాంటి జట్టుతో చివరిదాకా పోరాడాల్సి వచ్చింది. ఒక దశలో మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందోనని ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూశారు. హోరాహోరీ పోరులో.. చివరకు 3-2 తేడాతో అర్జెంటీనా కాబో వెర్డె (Cabo Verdy)ను ఓడించి రౌండ్ ఆఫ్-16లో అడుగుపెట్టింది.ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా.. మియామి హార్డ్‌రాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఫ్యాన్స్‌కు ఆద్యంతం ఉత్కంఠను పంచింది. ప్రారంభంలో అర్జెంటీనా ఆధిపత్యం చాటింది. అయితే ఒక్క గోల్ పడకుండా కాబో వెర్డె రక్షణ గోడలా నిలబడి అడ్డుకుంది. ఈ క్రమంలో 29వ నిమిషంలో మెస్సీ Lionel Messi అద్భుతమైన టచ్‌తో గోల్ చేసి అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తొలి అర్ధభాగం 1-0తో ముగిసింది.రెండో అర్ధభాగంలో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వెనక్కి తగ్గని కాబో వెర్డె ఫాస్టెస్ట్ కౌంటర్ అటాక్స్‌తో అర్జెంటీనాను ఒత్తిడిలోకి నెట్టింది. ఆట 59వ నిమిషంలో డెరోయ్ డువార్టే గోల్‌తో స్కోర్‌ను 1-1 చేసింది. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ పోరుగా మారి ఉత్కంఠను పెంచింది.అర్జెంటీనా తరఫున మెస్సీ, లౌటారో మార్టినెజ్ ప్రయత్నాలు చేసినా.. కాబో వెర్డె గోల్‌కీపర్ వోజిన్హా అద్భుత సేవ్‌లతో నిలబడ్డాడు. నిర్ణీత 90 నిమిషాల్లో విజేత తేలకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అక్కడే అసలైన డ్రామా మొదలైంది.అదనపు సమయం ప్రారంభమైన వెంటనే 93వ నిమిషంలో లిసాండ్రో మార్టినెజ్ గోల్‌తో అర్జెంటీనా మళ్లీ ముందంజలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 103వ నిమిషంలో లారోస్ కాబ్రాల్ అద్భుతమైన షాట్‌తో కాబో వెర్డెను మళ్లీ సమం చేశాడు.#CapeVerde you kept the fight on man, Africa is proud of you! ♥️#FWC2026 pic.twitter.com/ZELWOuefa4— #MadlangaCommission not to end🕯🕯🕯 (@Dumplings_More) July 4, 2026కానీ ఈ ఉత్కంఠ అక్కడితో ఆగలేదు. 111వ నిమిషంలో క్రిస్టియన్ రొమెరో ‘హెడర్ గోల్’తో(మెస్సీ ఇచ్చిన కార్నర్‌ను రొమెరో తలతో గోల్‌గా మార్చాడు) అర్జెంటీనా మరోసారి ఆధిక్యం సాధించింది. చివరి నిమిషాల్లో కాబో వెర్డె వరుస ఎటాక్స్ చేసినా.. ఎమిలియానో మార్టినెజ్ అద్భుత సేవ్‌లతో గోడలా నిలబడ్డాడు. చివరికి 3-2 తేడాతో అర్జెంటీనా విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లోకి అడుగుపెట్టింది. అయితే.. గెలుపు డిఫెండింగ్ ఛాంపియన్‌దే అయినా అల్ప జనాభా ఉన్న చిన్న దేశమైనా కాబో వెర్డె చూపిన పోరాటం ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆకట్టుకుంది. ఆఫ్రికా పడమటి తీరానికి దూరంగా సముద్రంలో ఉన్న చిన్న దీవుల దేశం కాబో వెర్డె.. ఫిఫా గ్రూప్ దశ నుండి నాకౌట్ వరకు ఇచ్చిన పోరాటం, పెద్ద జట్లను ఒత్తిడిలోకి నెట్టిన తీరు, సాకర్ సమరంలో గుర్తుండిపోయే “అండర్డాగ్ స్టోరీ”గా నిలిచింది. -
అర్జెంటీనా... అదే జోరు
డాలస్: డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడిన అర్జెంటీనా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ లీగ్ దశను అజేయంగా ముగించింది. జోర్డాన్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘జె’ చివరి లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–1తో గెలిచింది. అర్జెంటీనా తరఫున జియోవాని సెల్సో (19వ నిమిషంలో), లౌటారో మార్టినెజ్ (31వ నిమిషంలో), లియోనెల్ మెస్సీ (80వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. జోర్డాన్ తరఫున మూసా అల్తమారి (55వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన అర్జెంటీనా తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘జె’ టాపర్‌గా నిలిచింది. ఈ టోర్నీలో మెక్సికో, ఫ్రాన్స్ తర్వాత గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన మూడో జట్టుగా అర్జెంటీనా ఘనత వహించింది. అంతేకాకుండా అర్జెంటీనా ఐదోసారి ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఆడిన మ్యాచ్‌ల్లో నెగ్గింది. బ్రెజిల్, జర్మనీ జట్ల తర్వాత ప్రపంచకప్‌లో 50 విజయాలు సాధించిన మూడో జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. శనివారం జరిగే నాకౌట్ దశ మ్యాచ్‌లో కేప్ వెర్డె జట్టుతో అర్జెంటీనా తలపడుతుంది. నాకౌట్ బెర్త్ ముందే ఖరారు కావడంతో జోర్డాన్‌తో మ్యాచ్‌లో కెపె్టన్ మెస్సీ 60వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. 80వ నిమిషంలో గోల్ సాధించాడు. తద్వారా వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్ కొట్టిన ఏకైక ప్లేయర్‌గా మెస్సీ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ప్రపంచకప్ చరిత్రలో మెస్సీకిది 19వ గోల్ కావడం విశేషం.పోర్చుగల్, కాంగో కూడా...గ్రూప్ ‘కె’ నుంచి క్రిస్టియానో రొనాల్లో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు... 52 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన కాంగో జట్టు కూడా నాకౌట్ బెర్త్‌లు సాధించి ముందంజ వేశాయి. వరుసగా రెండు విజయాలు సాధించి ఇప్పటికే నాకౌట్ దశకు చేరిన కొలంబియా జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌ను పోర్చుగల్ 0–0తో ‘డ్రా’గా ముగించింది. మరో మ్యాచ్‌లో కాంగో జట్టు 3–1తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచింది. గ్రూప్ ‘కె’లో 7 పాయింట్లతో కొలంబియా తొలి స్థానంలో, 5 పాయింట్లతో పోర్చుగల్ రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు చేరుకున్నాయి. ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఒకటిగా కాంగో జట్టు నాకౌట్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఈసారి ప్రపంచకప్‌లలో ఆఫ్రికా నుంచి 10 దేశాలు పాల్గొనగా... ఏకంగా 8 దేశాలు నాకౌట్ దశకు అర్హత పొందడం విశేషం.‘డ్రా’తో ఆస్ట్రియా, అల్జీరియా ముందుకు...గ్రూప్ ‘జె’లో భాగంగా అల్జీరియా, ఆ్రస్టియా మధ్య జరిగిన మ్యాచ్ 3–3తో ‘డ్రా’గా ముగిసింది. ఈ ఫలితంతో ఆస్ట్రియా, అల్జీరియా నాలుగు పాయింట్లతో సమంగా నిలిచాయి. గోల్స్ అంతరంతో ఆస్ట్రియా గ్రూప్ ‘జె’లో రెండో స్థానంతో నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అల్జీరియా ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఒకటిగా నాకౌట్ బెర్త్‌ను సంపాదించింది. గత రెండు ప్రపంచకప్‌లలో సెమీఫైనల్‌కు చేరిన క్రొయేషియా జట్టు... నాకౌట్ బెర్త్ పొందాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటుకుంది. ఘనా జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎల్’ మ్యాచ్‌లో క్రొయేషియా 2–1తో విజయం సాధించింది. గ్రూప్ ‘ఎల్’లోని మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ 2–0తో పనామా జట్టును ఓడించింది. గ్రూప్ ‘ఎల్లో ఇంగ్లండ్ 7 పాయింట్లతో అగ్రస్థానంలో, క్రొయేషియా 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు చేరుకున్నాయి. ఘనా జట్టు ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఒకటిగా నాకౌట్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. -
ఓటమి ఎరుగని అర్జెంటీనా.. మెస్సీ ప్రపంచ రికార్డు
ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా లీగ్ దశను ఓటమన్నదే లేకుండా అజేయంగా ముగించింది. గ్రూప్-జెలో భాగంగా జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-1 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అర్జెంటీనా తరఫున గివాని సెల్సో (19వ నిమిషం), లుటారో మార్టినేజ్ (31వ నిమిషం), లియోనల్ మెస్సీ (80వ నిమిషం)లో గోల్స్ సాధించగా, జోర్డాన్ తరఫున ముసా అల్ తమారీ (55వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన అర్జెంటీనా 9 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నాకౌట్‌కు అర్హత సాధించింది. అర్జెంటీనాతో పాటు ఆస్ట్రియా, అల్జీరియా కూడా తదుపరి రౌండ్‌కు చేరుకోగా, ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన జోర్డాన్ ఇంటిబాట పట్టింది. ఇక నాకౌట్లో మెస్సీ సేన తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌లో రౌండ్ ఆఫ్ 32కు చేరిన కేప్ వెర్డెతో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ద్వారా లియోనల్ మెస్సీ మరో రికార్డు సాధించాడు. జోర్డాన్‌తో మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా మెస్సీ వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ప్రపంచకప్‌లో మెస్సీకి ఇది ఆరో గోల్ కావడం విశేషం. ఆరు గోల్స్‌తో మెస్సీ గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఫ్రాన్స్ సంచలనం ఎంబాపె 4 గోల్స్‌తో అతడిని అనుసరిస్తున్నాడు. తాజా గోల్‌తో మెస్సీ ఫిఫా గోల్స్ సంఖ్య 19కి చేరుకుంది. ఆట 60వ నిమిషంలో మైదానంలోకి అడుగుపెట్టిన మెస్సీ 83వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. జోర్డాన్ జట్టుతో పాటు గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ మెస్సీ కొట్టిన గోల్ హైలైట్‌గా నిలిచింది. మెస్సీ కొట్టిన గోల్‌ను చూసి జోర్డాన్ గోల్‌కీపర్ ఆశ్చర్యపోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Messi free kick from that angle is nuts. Alien. pic.twitter.com/8g333O2h8M— Geronimo Morgans (@GeronimoMorgans) June 28, 2026💥🇦🇷 Lionel Messi breaks another record as he becomes the FIRST PLAYER EVER to score in 7 consecutive World Cup games.Perfect free kick. 🎨 pic.twitter.com/vgWxKSV6CW— Fabrizio Romano (@FabrizioRomano) June 28, 2026చదవండి: భూకంప విలయం.. కన్నపేగు కోసం ఫుట్‌బాలర్ భార్య ప్రాణత్యాగం -
ప్రపంచ రికార్డుకు అడుగుదూరంలో మెస్సీ!
ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా రెండో విజయంపై కన్నేసింది. గ్రూప్-జెలో ఇవాళ రాత్రి ఆస్ట్రియాతో అర్జెంటీనా తలపడుతోంది. ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. అల్జీరియాతో జరిగిన మ్యాచ్ మెస్సీకి 200వది కావడం గమనార్హం. తన 200వ మ్యాచ్‌ను అద్భుతంగా మలుచుకున్నాడు. అల్జీరియాతో మ్యాచ్‌లో పలు రికార్డు లను బద్దలు కొట్టిన మెస్సీ ఆస్ట్రియాతో మ్యాచ్‌లోనూ పలు రికార్డులు సవరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఒకసారి వాటిని పరిశీలించి చూద్దాం.👉38 ఏళ్ల మెస్సీ వరుసగా ఐదు ఫిఫా ప్రపంచకప్పుల్లో గోల్ చేశాడు. రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ఆడుతున్న మెస్సీ మరొక గోల్ చేస్తే, వరుసగా ఆరు ప్రపంచకప్పుల్లో గోల్స్ చేసిన ఆటగాళ్ల సరసన చేరనున్నాడు. గతంలో ఫ్రాన్స్‌కు చెందిన జస్ట్ ఫోంటైన్, బ్రెజిల్‌కు చెందిన జైర్జిన్హో సంయుక్తంగా ఆరు ప్రపంచకప్పుల్లో ఆరు గోల్స్ చేశారు. ఆల్ టైమ్ రికార్డు అందుకోవడానికి మెస్సీ మరొక గోల్ చేస్తే సరిపోతుంది.👉ఆస్ట్రియాతో మ్యాచ్‌లో మెస్సీ గోల్ కొడితే ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం మెస్సీ 16 గోల్స్‌తో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోస్‌తో కలిసి తొలి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రియాతో మ్యాచ్‌లో ఒక్క గోల్ చేసినా మెస్సీ ప్రపంచ రికార్డు సాధించినట్లే.👉ఆస్ట్రియాపై అర్జెంటీనా విజయం సాధిస్తే మెస్సీకి మరో చారిత్రాత్మకం కానుంది. ఇప్పటివరకు 16 ఫిఫా మ్యాచ్‌లు గెలిచిన మెస్సీ, ఇవాళ ఆస్ట్రియాపై గెలుపుతో 17 విజయాలతో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోస్ రికార్డు సమం చేసే అవకాశముంది.👉అల్జీరియాతో మ్యాచ్‌లో మెస్సీ 38 సంవత్సరాల 357 రోజుల వయస్సులో, అతను 2018 టోర్నమెంట్లో క్రిస్టియానో రొనాల్డో నెలకొల్పిన మునుపటి రికార్డును అధిగమించి, ప్రపంచ కప్ హ్యాట్రిక్ సాధించిన అత్యంత వయస్సు గల ఆటగాడిగా నిలిచాడు. అతను ప్రపంచ కప్‌లో కలిపి చేసిన గోల్స్ మరియు అసిస్ట్‌ల రికార్డును కూడా 24కు (16 గోల్స్, ఎనిమిది అసిస్ట్‌లు) పెంచుకున్నాడు. ఇక అర్జెంటీనా కెప్టెన్ ఇప్పటికే అత్యధిక ప్రపంచ కప్ ప్రదర్శనలు (27), అత్యధిక నిమిషాలు ఆడిన (2,394), అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (12) ,అత్యధిక విజయవంతమైన డ్రిబుల్స్ (125) రికార్డులను కలిగి ఉన్నాడు.👉అయితే ఆస్ట్రియా జట్టును తక్కువ అంచనా వేసేందుకు లేదు. ఈసారి ఫిఫాలో ఆస్ట్రియా తమ తొలి మ్యాచ్‌లో జోర్డాన్‌ను 3-1తో మట్టికరిపించింది. అంతేకాదు గత 12 మ్యాచ్‌ల్లో ఆస్ట్రియా 10 విజయాలు, ఒక డ్రా సాధించి ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. దీంతో అర్జెంటీనా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరముంది.Read: హర్మన్ సేనకు మిథాలీరాజ్ కీలక సూచన -
మెస్సీపై ఫిఫాకు ఫిర్యాదు.. అర్జెంటీనా చీట్ చేసిందా?
ఫిఫా ప్రపంచకప్‌లో అల్జీరియాపై విజయంతో జోష్ మీదున్న అర్జెంటీనాకు ఊహించని షాక్ ఎదురైంది. రిఫరీ పూర్ అంపైరింగ్ కారణంగా తాము మ్యాచ్ ఓడిపోయామంటూ అల్జీరియా ఫిఫాకు ఫిర్యాదు చేసింది. ఈ మ్యాచ్‌లోనే లియోనల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే మెస్సీ మ్యాచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని కూడా అల్జీరియా తన ఫిర్యాదులో పేర్కొంది. తమ జట్టు ఆటగాడిని ఉద్దేశపూర్వకంగానే కిందపడేసినప్పటికీ మెస్సీకి రిఫరీ రెడ్‌కార్డ్ జారీ చేయకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని అల్జీరియా పేర్కొంది.రాయిటర్స్ కథనం ప్రకారం మ్యాచ్ సరైన రీతిలో జరగలేదంటూ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలను హైలైట్ చేస్తూ ఫిఫా రిఫరీయింగ్ కమిషన్‌కు ఫిర్యాదు లేఖను అందించింది. లేఖలో పేర్కొన్న ప్రకారం.. ‘ఆట మొదటి అర్ధభాగంలో అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ ఉద్దేశపూర్వకంగానే అల్జీరియా కెప్టెన్ ఐస్సా మాండీ పిక్కపై కాలు వేసి అతడి పడిపోయేటట్లుగా చేయడం కనిపించింది. ఆ తర్వాత వెనక నుంచి మెస్సీ తన కాలి బూటుతో మాండీని తన్నినట్లు కూడా తెలుస్తోంది. మెస్సీకి రెడ్‌కార్డ్ ఇచ్చి మైదానం నుంచి బయటికి పంపాలని తాము డిమాండ్ చేసినప్పటికీ, మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన పోలండ్‌కు చెందిన సైమన్ మార్సినియాక్ మెస్సీపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. ఇక రెండో అర్ధభాగంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్మాక్ అల్లిస్టర్ తమ జట్టు ఆటగాడు ఇబ్రహీం మజాపై మోచేతితో దాడి చేసినట్లు అల్జీరియా లేఖలో ఆరోపించింది. ఈ దాడి పట్ల కూడా రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించింది. మ్యాచ్ మొత్తంలో రిఫరీ అర్జెంటీనాకు సానుకూలంగా ఉన్నారని, ఆయన తప్పిదాల వల్లే ఇవాళ అర్జెంటీనా మ్యాచ్‌లో విజయం సాధించింది. వెంటనే మెస్సీతో పాటు రిఫరీపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం.’ అని ఫిర్యాదులో పేర్కొంది. అయితే అర్జెంటీనా, అల్జీరియా మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన సైమన్ మార్సినియాక్ 2022 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా రిఫరీగా వ్యవహరించడం గమనార్హం. ఆనాటి ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో ఫ్రాన్స్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచింది. చదవండి: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ స్పందన! -
వివాదంలో మెస్సీ.. భగ్గుమన్న అభిమానులు!
పిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా శుభారంభం చేసింది. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా 3-0తో అల్జీరియాను చిత్తు చేసింది. మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే అల్జీరియాతో మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ చర్య వివాదానికి దారి తీసింది. మెస్సీ ఫౌల్ చేసినట్లు నిర్థారణ అయినప్పటికీ మ్యాచ్ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. విషయంలోకి వెళితే.. తొలి గోల్ కొట్టిన తర్వాత మెస్సీ అల్జీరియా ప్లేయర్‌ను అడ్డుకునే క్రమంలో వెనుక నుంచి స్టడ్స్-అప్ ఛాలెంజ్ చేశాడు. దీంతో ఆ ప్లేయర్ నొప్పితో నేలపై పడిపోయాడు. ఇది ఫుట్‌బాల్‌లో నిబంధనలకు విరుద్ధం. ఈ చర్య పట్ల మెస్సీకి రిఫరీ రెడ్ కార్డు చూపించాలి. మెస్సీ ఫౌల్ చేసినట్లు రిప్లేలో స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ మ్యాచ్ రిఫరీ సైమన్ మార్సీనియాక్ మెస్సీకి రెడ్ లేదా ఎల్లో కార్డు జారీ చేయాలి. దీంతో రిఫరీ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. ‘మెస్సీ అయితే రూల్స్ మారిపోతాయా?’ అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మెస్సీకి సంబంధించిన వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అల్జీరియాతో ఆడుతున్న మ్యాచ్ మెస్సీకి 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. కెప్టెన్ లియోనల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ (ఆట 17వ, 60వ, 76వ నిమిషం)తో మెరిశాడు. తద్వారా ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీ దిగ్గజం మిరాస్లోవ్ క్లోస్‌తో కలిసి మెస్సీ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంతో అర్జెంటీనా మూడు పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రికార్డు స్థాయిలో మెస్సీ ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న సంగతి తెలిసిందే. Messi just got away with an absolutely DISGUSTING challenge to an Algeria defenders leg.Red card or not?pic.twitter.com/2ZU2B5j4oH— Banter FC (@FCBanter_) June 17, 2026Read: అల్జీరియాపై గెలుపు.. కంటతడి పెట్టిన మెస్సీ! -
అల్జీరియాపై గెలుపు.. కంటతడి పెట్టిన మెస్సీ!
ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-జెలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో అల్జీరియాను చిత్తుగా ఓడించింది. కెప్టెన్‌గా జట్టును నడిపించడమే గాక హ్యాట్రిక్ గోల్స్‌తో ఒంటిచేత్తో అర్జెంటీనాకు విజయాన్ని అందించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే తొలి గోల్ కొట్టిన సమయంలో మెస్సీ ఎమోషనల్ అవ్వడం కెమెరా కంటికి చిక్కింది. ఇది చూసిన అతడి అభిమానులు మెస్సీ ఎందుకు ఏడ్చాడో అర్థంగాక ఆందోళన చెందారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ తన కంటతడికి కారణం వివరించాడు. అల్జీరియాతో మ్యాచ్‌కు ముందు తాను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని, గోల్ కొట్టిన సంతోషంలో ఒక్కసారిగా ఏడుపు వచ్చేసిందని తెలిపాడు. అయితే తన భావోద్వేగంతో మ్యాచ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నాడు. మెస్సీ మాట్లాడుతూ.. ‘నా కంటతడికి మ్యాచ్‌తో సంబంధం లేదు. అయితే దీనికి ముందు కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా. మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. ఫిఫా ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ గోల్స్‌తో మెరుస్తానని ఊహించలేదు. మ్యాచ్ సమయంలో నా సహచరులు అండగా నిలిచారు. సరైన సమయంలో పాస్‌లు అందించి గోల్స్ చేయడంలో సహకరించారు. ఈ విజయం నా ఒక్కడిది ఎంతమాత్రం కాదు. జట్టు అంతా కలిసి ఆడాం. రాబోయే మ్యాచ్‌ల్లోనే ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలని ఆశిస్తున్నా. రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోను. ఇవాళ నాది రికార్డు కావొచ్చు.. కానీ రేపు అన్న రోజు నా రికార్డును వేరేవాళ్లు బద్దలు కొడుతారు. మాకు అన్ని వేళల అండగా నిలుస్తూ వస్తోన్న కోచ్ లియోనల్ స్కలోనికి ప్రత్యేక కృతజ్ఞతలు' అని చెప్పుకొచ్చాడు.ఇక ఫిఫా ప్రపంచకప్పుల్లో మెస్సీకి ఇది 16వ గోల్ కావడం విశేషం. తద్వారా ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరో గోల్ కొడితే మెస్సీ క్లోజ్‌ను దాటి టాప్ స్థానాన్ని కైవసం చేసుకోనున్నాడు. తర్వాతి మ్యాచ్‌లోనే ఆ అద్భుతాన్ని చూసే అవకాశం మనకు కలగనుంది.Leo Messi crying after his goal 🥹🥹pic.twitter.com/s4vZvOWIsx— All About Argentina 🛎🇦🇷 (@AlbicelesteTalk) June 17, 2026 Leo Messi: "I can't ask for anything more, God gave me too much, now everything is just to enjoy. "I'm just happy to being considered as one of the best in football history, I'm just grateful to be considered among many great players..." pic.twitter.com/B6flzm2fTX— All About Argentina 🛎🇦🇷 (@AlbicelesteTalk) June 17, 2026Read: మెస్సీ ఖాతాలో అత్యధిక గోల్స్.. గంటల వ్యవధిలో ఎంబాపెకు చెక్! -
మెస్సీ ఖాతాలో అత్యధిక గోల్స్.. గంటల వ్యవధిలో ఎంబాపెకు చెక్!
అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీకి రికార్డులు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న మెస్సీకి ఒక్క రికార్డు మాత్రం చాన్నాళ్లుగా ఊరిస్తూ వచ్చింది. ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో తన పేరును అగ్రస్థానంలో చూసుకోవాలని మెస్సీ తహతహలాడాడు. ఆరోజు రానే వచ్చింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ అల్జీరియాతో ఆరంభ మ్యాచ్‌లోనే ఆ రికార్డును అందుకున్నాడు. అల్జీరియాతో మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసి ఒక రాత్రిలోనే తనకంటే ఎక్కువ గోల్స్‌తో ఉన్న ఎంబాపె, ముల్లర్, రొనాల్డోలను దాటుకొని ఇవాళ జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోజ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు లియోనల్ మెస్సీ.పిఫా ప్రపంచకప్ 2026లో మెస్సీ తన ఆటను మొదలెట్టేశాడు. అల్జీరియా చిన్న జట్టు అయినప్పటికీ గత ఫిఫాలో సౌదీ అరేబియా చేతిలో ఎదురైన పరాభవాన్ని మదిలో పెట్టుకున్న మెస్సీ ఈసారి ఆ తప్పు చేయొద్దని భావించాడు. అందుకే ఆరంభం నుంచే ప్రత్యర్థి గోల్‌పోస్టుపై అదే పనిగా దాడులు చేశాడు. ఈ క్రమంలోనే మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టి అరుదైన రికార్డు సాధించాడు. ఫిఫా ప్రపంచకప్పుల్లో మెస్సీకి ఇది 16వ గోల్ కావడం విశేషం. తద్వారా ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరో గోల్ కొడితే మెస్సీ క్లోజ్‌ను దాటి టాప్ స్థానాన్ని కైవసం చేసుకోనున్నాడు. తర్వాతి మ్యాచ్‌లోనే ఆ అద్భుతాన్ని చూసే అవకాశం మనకు కలగనుంది.ఫిఫాలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలియోనల్ మెస్సీ* (అర్జెంటీనా)-16 గోల్స్మిరోస్లావ్ క్లోజ్ (జర్మనీ)- 16 గోల్స్రొనాల్డో (బ్రెజిల్)- 15 గోల్స్ఎంబాపె* (ఫ్రాన్స్)-14 గోల్స్గెర్డ్ ముల్లర్ (జర్మనీ)- 14 గోల్స్జస్ట్ ఫొంటేయిన్ (ఫ్రాన్స్)- 13 గోల్స్పీలే (బ్రెజిల్)- 12 గోల్స్సాండోర్ కోస్కిస్* (హంగేరి)- 11 గోల్స్జర్జెన్ క్లిన్స్మన్ (జర్మనీ)- 11 గోల్స్ -
చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ (ఫోటోలు)
-
మెస్సీ హ్యాట్రిక్ గోల్స్.. అర్జెంటీనా రికార్డు విజయం
డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ 2026ను ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-జెలో భాగంగా బుధవారం అర్జెంటీనా జట్టు 3-0తో అల్జీరియాను చిత్తు చేసింది. 200వ మ్యాచ్ ఆడుతున్న అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ (ఆట 17వ, 60వ, 76వ నిమిషం)తో మెరిశాడు. తద్వారా ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీ దిగ్గజం మిరాస్లోవ్ క్లోజ్‌తో కలిసి మెస్సీ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంతో అర్జెంటీనా మూడు పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీకి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. మ్యాచ్ ఆరంభం నుంచే హైపర్ యాక్టివ్‌గా కనిపించిన మెస్సీ 38 ఏళ్ల వయసులోనూ మైదానంలో పాదరసంలా పరిగెత్తాడు. 17వ నిమిషంలో ఆఫ్‌సైడ్ దిశగా వచ్చిన బంతిని మెస్సీ నేరుగా గోల్ పోస్ట్‌లోకి తరలించడంతో అర్జెంటీనా ఖాతా తెరిచింది. ఆ తర్వాత ఆట 60వ నిమిషంలో మెస్సీ మరోసారి మెరిశాడు. ఈసారి రైట్ కార్నర్ నుంచి బంతిని గోల్ పోస్ట్‌లోకి తరలించి అర్జెంటీనా ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. అయితే ఆట 69వ నిమిషంలో అల్జీరియా గోల్ కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకుంది. బంతిని అందుకున్న హౌసమ్ ఆర్ ఎడ్జ్ ఆఫ్ ఏరియా దిశగా బంతిని తలరించాడు. కానీ అర్జెంటీనా గోల్ కీపర్ బంతిని సమర్థంగా అడ్డుకోవడంతో బంతి గోల్‌పోస్ట్ పక్క నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత 76వ నిమిషంలో మరో గోల్ కొట్టిన మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు సృష్టించాడు. మరోవైపు అల్జీరియా మాత్రం అర్జెంటీనా ముందు ఏమాత్రం నిలవలేకపోయింది. -
200వ మ్యాచ్‌లో గోల్.. చరిత్ర సృష్టించిన మెస్సీ
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మోస్సీ గోల్స్ వేటను ప్రారంభించాడు. బుధవారం గ్రూప్-జెలో అల్జీరియాతో ఆడుతున్న మ్యాచ్‌లో మెస్సీ తొలి గోల్‌తో మెరిశాడు. తొలి హాఫ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0తో అల్జీరియాపై ఆధిక్యంలో నిలిచింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీకి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. మ్యాచ్ ఆరంభం నుంచే హైపర్ యాక్టివ్‌గా కనిపించిన మెస్సీ 38 ఏళ్ల వయసులోనూ మైదానంలో పాదరసంలా పరిగెత్తాడు. 17వ నిమిషంలో ఆఫ్‌సైడ్ దిశగా వచ్చిన బంతిని మెస్సీ నేరుగా గోల్ పోస్ట్‌లోకి తరలించడంతో అర్జెంటీనా ఖాతా తెరిచింది. ఈ నేపథ్యంలో మెస్సీ ఒక అరుదైన రికార్డు సాధించాడు. గోల్ కొడుతున్న మెస్సీఫుట్బాల్ చరిత్రలో ఐదు వేర్వేరు ఫిఫా ప్రపంచకప్పుల్లో గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. ఇంతకముందు క్రిస్టియానో రొనాల్డో ఈ ఘనత సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ.. ఎంబాపె, గెరాల్డ్ ముల్లర్లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో (15 గోల్స్) రెండో స్థానంలో ఉండగా, జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోస్ (16 గోల్స్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. -
రేపు అర్జెంటీనా మ్యాచ్.. కేరళలో మెస్సీ మేనియా!
ఫిఫా ప్రపంచకప్-2026లో బుధవారం డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. గ్రూప్-ఐలో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌లో అల్జీరియాతో తలపడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రేపు ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. మెస్సీ ఆఖరి ఫిఫా అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతడి ఆట కోసం ప్రపంచం మొత్తం వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. భారత్‌లో కూడా మెస్సీకి వీరాభిమానులు ఉన్నారు. కేరళలో మెస్సీ అంటే పడిచచ్చిపోయేవాళ్లు లెక్కలేనంత మంది ఉంటారు. అసలే ఫిఫా ప్రపంచకప్, ఆపై డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో అర్జెంటీనా బరిలోకి దిగుతుండడంతో కేరళలో ఫిఫా కళ వచ్చేసింది. ముఖ్యంగా కేరళలోని పుల్లవూర్ గ్రామంలో మెస్సీ మేనియా మాములుగా లేదు. ఆ ఊర్లో ఎక్కడ చూసినా ఫుట్‌బాల్ ఆటగాళ్ల కటౌట్లే కనిపిస్తాయి. ఇక్కడ మెస్సీ అభిమానులే కాదు రొనాల్డో, నెయ్మర్, ఎంబాపె, సాలా, లామినే యమాల్ వంటి ఆటగాళ్లకు కూడా విపరీతమైన ఆదరణ ఉంది. అక్కడి ఇళ్లకు కూడా ప్రజలు తమకిష్టమైన జట్ల రంగులను పెయింటింగ్ వేసుకోవడం విశేషం. ఇక రేపు అర్జెంటీనా మ్యాచ్ ఉండడంతో ఆ జట్టు అభిమానులు పుల్లవూరు గ్రామంలో ఉన్న నది మధ్యలో ప్లోటింగ్ బోర్డుపై అర్జెంటీనా జట్టు మొత్తాన్ని కటౌట్ల రూపంలో ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తం మీద ఫిఫా ప్రపంచకప్ మేనియా ఇప్పుడు భారత్‌లో కూడా టాప్ గేర్‌కు చేరుకున్నట్లయింది. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్‌ను షూటౌట్లో ఓడించి మూడోసారి ఫిఫా టైటిల్‌ను కైవసం చేసుకుంది.Frome Viral Kerala #Argentina pic.twitter.com/PLUUUWK9Fc— FIFAHighlightsTV (@Worldcupcatcher) June 13, 2026అసలు సమరం మొదలు..మరో విషయమేంటంటే.. బుధవారం ఒక్కరోజే ముగ్గురు బిగ్‌స్టార్స్ మ్యాచ్‌లు ఆడనుండడంతో ఫిఫాలో అసలు సమరం మొదలుకానుంది. బుధవారం తెల్లవారుజామున ఫ్రాన్స్, సెనెగల్ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత ఉదయం 6.30 గంటలకు మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా అల్జీరియాతో తలపడనుంది. ఇక అదే రోజు రాత్రి 10.30 గంటలకు పోర్చుగల్ కాంగో రిపబ్లిక్‌తో తలపడనుంది. ఇలా త్రిమూర్తులు ఒకేరోజు మ్యాచ్ ఆడనుండడంతో అభిమానుల్లో ఎనలేని జోష్ వచ్చింది.చదవండి: కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్! -
FIFA WC 2026: మెస్సీ వర్సెస్ రొనాల్డో పోరు ఎప్పుడంటే!
ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. నెలరోజులకు పైగా సాగనున్న సాకర్ సంగ్రామంలో ఎన్ని అద్భుతాలు చోటు చేసుకున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల కళ్లన్నీ ఇద్దరి దిగ్గజాలపైనే ఉంటాయి. ఆ ఇద్దరు బరిలోకి దిగారంటే ప్రపంచం మొత్తం కన్నార్పకుండా చూస్తోంది. మరి అలాంటి ఇద్దరు దిగ్గజాలు ఫిఫా వంటి మేటి టోర్నీలో ప్రత్యర్థులుగా ఎదురుపడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. ఆ ఇద్దరిలో ఒకరు అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ అయితే..మరొకరు పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో. రెండు దశాబ్దాలుగా ఫుట్‌బాల్‌ను ఏలుతున్న ఈ ఇద్దరికి ఇది ఆరో ప్రపంచకప్ కావడం విశేషం. ఈసారి జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ మెస్సీకి, రొనాల్డోకు చివరిదని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఫుట్‌బాల్ క్లబ్స్ తరఫున ఎన్నోసార్లు ఎదురుపడినప్పటికీ, ఫిఫా ప్రపంచకప్‌లో మాత్రం తమ జాతీయ జట్ల తరఫున ఈ ఇద్దరు ఎదురుపడలేదంటే నమ్ముతారా? కానీ ఇది అక్షరాల నిజం.అయితే 2026 ప్రపంచకప్‌లో మాత్రం ఇది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు గ్రూప్-జెలో అల్జీరి యా, ఆస్ట్రియా, జోర్డాన్లతో కలిసి ఉంది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జూన్ 16న అల్జీరియాతో, జూన్ 22న ఆస్ట్రియాతో, జూన్ 27న జోర్డాన్‌తో గ్రూప్ మ్యాచ్‌లు ఆడనుంది. అర్జెంటీనా గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే జూలై 4న జరిగే రౌండ్ ఆఫ్ 32లో గ్రూప్-హెచ్ రన్నరప్‌తో తలపడుతుంది.ఈసారైనా?మరోవైపు క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ గ్రూప్-కేలో ఉంది. ఇదే గ్రూప్‌లో పోర్చుగల్‌తో పాటు కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియా కూడా ఉన్నాయి. పోర్చుగల్ జూన్ 17న కాంగోతో, జూన్ 23న ఉజ్బెకిస్తాన్‌తో, జూన్ 27న కొలంబియాతో తలపడనుంది. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 32లో మరో గ్రూప్ నుంచి వచ్చిన జట్టుతో ఆడుతుంది.అన్నీ కుదిరితే క్వార్టర్స్‌లోనే..ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ, రొనాల్డోలు ఎదురుపడాలంటే అర్జెంటీనా, పోర్చుగల్ రెండూ తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలవడంతో పాటు రౌండ్ ఆఫ్ 32, రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లను కూడా గెలవాలి. అలా జరిగితేనే క్వార్టర్ ఫైనల్లో ఈ దిగ్గజాలు ప్రత్యక్ష పోరుకు దిగే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ దిగ్గజాలు ఎదురుపడితే చూడాలని వేచి చూస్తున్న అభిమానుల కల కూడా నెరవేరనుంది. ఇది నిజమైతే మాత్రం ఫిఫా చరిత్రలోనే అద్భుత ఘట్టంగా నిలిచిపోనుండడంతో పాటు టీఆర్పీ రేట్ కూడా పగిలిపోవడం ఖాయం.ఇద్దరూ ఇద్దరే!ఆట పరంగా చూసుకుంటే ఈ ఇద్దరిని ఒకరితో ఒకరిని పోల్చలేం. ఇద్దరు దిగ్గజాలు అభిమానుల గుండెల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ముద్రించుకున్నారు. అయితే 2022లో కోపా అమెరికా కప్‌తో పాటు ఫిఫా ప్రపంచకప్ కైవసం చేసుకున్న అర్జెంటీనాకు మెస్సీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ విషయంలో మాత్రం రొనాల్డోతో పోలిస్తే మెస్సీ ఒక మెట్టు పైనే ఉంటాడు.రికార్డుల్లో మెస్సీదే పైచేయిరికార్డులు పరిశీలించి చూస్తే.. రొనాల్డోపై మెస్సీదే పైచేయి. ఇప్పటికే ప్రపంచకప్‌లో మెస్సీ 26 మ్యాచ్‌లు (అత్యధిక మ్యాచ్‌లు), అత్యధిక నిమిషాలు (2,314) ఆడిన ఆటగాడిగా నిలిచాడు. అర్జెంటీనా తరఫున మెస్సీ ప్రపంచకప్‌లో అత్యధికంగా 13 గోల్స్ సాధించాడు. ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన మిరోస్లావ్ క్లోజే (16) రికార్డును అధిగమించడానికి మెస్సీకి మరో మూడు గోల్స్ మాత్రమే అవసరం. మరోవైపు రొనాల్డో తాను ఆడిన ఆరు ఫిఫా ప్రపంచకప్‌లు కలిపి 8 గోల్స్ మాత్రమే సాధించాడు. మెస్సీ రికార్డును అధిగమించాలంటే అతడు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అయితే పోర్చుగల్ టోర్నీలో ఎక్కువ దూరం ప్రయాణిస్తే మాత్రం అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక నిమిషాలు ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం రొనాల్డోకు ఉంది. మెస్సీ, రొనాల్డోలు తలపడితే చూడాలని మన భారతీయులు కూడా వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. మైదానంలో కొదమ సింహాల్లా తలపడే ఈ ఇద్దరి విన్యాసాలను వీక్షించాలంటే అన్నీ సక్రమంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం.చదవండి: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. కోహ్లీ విషయంలో కీలక ప్రకటన! -
మెస్సీ విజృంభణ.. అర్జెంటీనా ఘన విజయం
ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ముందు డిపెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ చివరి వార్మప్ మ్యాచ్‌లో అదరగొట్టింది. అలబామా వేదికగా ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది. తన చివరి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ వార్మమ్ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. మే 24న ఇంటర్ మియామి తరఫున ఆడుతూ కండరాల గాయానికి గురైన మెస్సీ పూర్తిగా కోలుకున్నాడు. ఐస్‌లాండ్‌తో మ్యాచ్‌లో పూర్తి స్థాయి ఫిట్నెస్తో కనిపించిన మెస్సీ కేవలం 20 నిమిషాల పాటే గ్రౌండ్లో ఉన్నాడు. కానీ తాను ఆడిన 20 నిమిషాల్లోనే రెండు కీలక పాస్‌లు సహా ఒక గోల్ చేయడం విశేషం. ఆట విషయానికొస్తే తొలి హాఫ్ ముగుస్తుందనగా మైదానంలో అడుగుపెట్టిన మెస్సీ అందించిన కీలక పాస్‌తో లారో మార్టినేజ్ గోల్‌పోస్ట్‌లోకి బంతిని తరలించాడు. దీంతో తొలి హాఫ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరో 10 నిమిషాల్లో రెండో హాఫ్ ముగుస్తుందనగా మళ్లీ మైదానంలోకి వచ్చిన మెస్సీ ఈసారి తానే స్వయంగా గోల్ చేశాడు. మార్టినేజ్ అందించిన పాస్‌ను ఎలాంటి తప్పు చేయకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి మెస్సీ తన కెరీర్లో 117వ గోల్ సాధించాడు. దీంతో అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత అర్జెంటీనా మూడో గోల్ కొట్టడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. మెస్సీ ఇచ్చిన పాస్‌ను అందుకున్న రోడ్రిగో డి పాల్ దానిని థియాగో అల్మాడాకు పాస్ చేయగా, అతడు బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. దీంతో అర్జెంటీనా 3-0తో ఐస్లాండ్పై విజయం సాధించింది. ఈ విజయంతో వార్మప్ మ్యాచ్‌లను ముగించిన మెస్సీ సేన ఫిఫా ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌ను జూన్ 16న అల్జీరియాతో ఆడనుంది. గ్రూప్-జెలో ఉన్న అర్జెంటీనా ఆ తర్వాత ఆస్ట్రియా, జోర్డాన్‌లను ఎదుర్కోనుంది.చదవండి: గెలిచామన్న గర్వం.. రెచ్చిపోయిన బంగ్లా బౌలర్! -
సెల్‌ఫోన్ కోసం 262 అడుగుల ఎత్తులో..
పట్టు తప్పిందా ఇక అంతే!. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అందుకే ఆ యువకుడి సాహసం.. అక్కడున్నవాళ్లను షాక్‌కు గురి చేసింది. ఉత్కంఠతో చివరి నిమిషం దాకా ఏం జరుగుతుందా? అని ఊపిరి బిగబట్టేలా చేసింది. పోనీ అదంతా ఎందుకు చేశాడా? అని కారణం తెలిశాక.. కంగుతినడం అక్కడున్నవాళ్ల వంతు అయ్యింది. ఒక సాధారణ పర్యాటక విహారం క్షణాల్లోనే ఉత్కంఠభరిత ఘటనగా మారింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇగ్వాజు జలపాతం (Iguazu Falls) వద్ద ఓ టూరిస్ట్ ప్రాణాలను లెక్కచేయకుండా వేగంగా ప్రవహిస్తున్న నీటిలోకి దూకాడు. కాసేపు అలాగే గనుక ఉండి ఉంటే.. ప్రవాహం ధాటికి కచ్చితంగా వందల అడుగుల కిందకి పడిపోయేవాడే!. ఈ సంఘటన బ్రెజిల్ వైపు ఉన్న జలపాతం ప్రాంతంలో శనివారం (జూన్ 6) చోటుచేసుకుంది.ఇగ్వాజు జలపాతం అర్జెంటీనా–బ్రెజిల్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద జలపాత వ్యవస్థల్లో ఒకటి. సుమారు 262 అడుగుల లోతు ఉంటుందది. రెండు దేశాల మధ్య ప్రాంతం కావడంతో పర్యాటకులు ఇక్కడికి పోటెత్తుతుంటారు. అదే సమయంలో ఇక్కడి భద్రతా చర్యలు అంతంత మాత్రంగానే ఉండడం తరచూ వార్తల్లో వినిపిస్తుంటుంది. "Loco total"Porque un turista que estaba visitando las Cataratas de Iguazú se tiro al agua para recuperar su teléfono celular, lo recuperó, se subió a la pasarela y siguió recorriendo el lugar. pic.twitter.com/pWpmgsMLVV— Tendencias en Argentina (@porqueTTarg) June 8, 2026అలా.. ఓ పర్యాటకుడు ఈ వాటర్‌ఫాల్ అంచుల్లో దిగడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉన్నట్లుడి.. ఓ టూరిస్ట్ రాళ్లపై నుంచి దూకి ప్రవాహంలోకి వెళ్లి ఏదో వెతకబోయాడు. జలపాతం ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. బలమైన నీటి ప్రవాహం, జారిపోయే రాళ్లు, కేవలం కొద్ది అడుగుల దూరంలోనే ప్రాణాంతకమైన ఎత్తు ఉండటంతో ఈ ప్రాంతాన్ని అధికారులు కఠినంగా నియంత్రిస్తారు. అయినప్పటికీ ఆ వ్యక్తి చేసిన చర్య అక్కడున్న పర్యాటకులను తీవ్రంగా షాక్‌కు గురిచేసింది. కాసేపు ఏదో వెతికి.. ఆలస్యం చేయకుండా వెంటనే బయటకు వచ్చేశాడు. అతగాడి చేష్టలను ఇతర పర్యాటకులు వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. అయితే చావు నోట్లో తలపెట్టి రావడానికి సెల్‌ఫోన్ కారణమంట!. చేజారి అది పడిపోయిందని.. అందుకే అతను అలా సాహసం చేశాడని తెలుస్తోంది. మరి సెల్‌పోన్ దొరికిందా? లేదా? అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. Se tiró en la Garganta del Diablo para recuperar su celularUn hecho insólito generó indignación en las Cataratas del Iguazú, del lado brasileño.Un hombre se arrojó desde la pasarela del circuito Garganta del Diablo para buscar su celular tras caerse, sin poder regresar por… pic.twitter.com/7G4tGj7aRR— mavica (@mavica7) June 8, 2026అదృష్టవశాత్తూ అతనికేం కాలేదు. సురక్షితంగా బయటకు వచ్చాడు. అయితే ఈ సంఘటన భద్రతా నియమాలపై మరోసారి చర్చకు దారితీసింది.ఇది మొదటిసారి జరిగిన ఘటన కాదని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఓ పర్యాటకుడు తన టోపీ కోసం ఇలాగే చేశాడు. ఆ టైంలో అధికారులు సకాలంలో స్పందించడంతో బతికి బట్టకట్టాడు. -
విమానంలో లగేజీ గొడవ, పోలీసు చేయి కొరికేసింది
విమాన ప్రయాణాల్లో ప్రయాణికులకు చాలా టెన్షన్ ఉంటుంది. విమానంలో ఎలాంటి వస్తువులు తీసుకెళ్లవచ్చు అనే సందేహాలు మొదలు, సయానికి సెక్యూరిటీ చెకప్ ముగించుకుని గేట్లోకి వెళ్లడం, లగేజీ నిర్దేశించిన బరువులో ఉందా లేదా చూసుకోవడం దాకా చాలా తతంగమే ఉంటుంది. ముఖ్యంగా పరిమితి కంటే లగేజీ బరువు కాస్త ఎక్కువైనా ప్యాసెంజర్లకు చుక్కలే. అదనపు చార్జీల (Excess baggage fee) మోత మోగుతుంది. ఇక్కడే చాలా వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఇటీవల అర్జెంటీనాలోని ఒక విమానాశ్రయంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఎక్స్ట్రా లగేజీ ఫీజుకు సంబంధించిన హైడ్రామా ఊహించని రేంజ్‌కి చేరింది.అసలేం జరిగింది?‘మిర్రర్ యూకే’ కథనం ప్రకారం.. అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరెస్ (Buenos Aires) లో గ ‘జార్జ్ న్యూబెరీ ఎయిర్‌పార్క్’ లో జెట్‌స్మార్ట్ (JetSmart) విమానంలో ఈ సంఘటన జరిగింది. కొర్డోబాకు వెళ్లాల్సిన ఆ విమానం ఎక్కేందుకు ఒక మహిళా ప్రయాణికురాలు వచ్చింది. అయితే, ఆమె పరిమితికి మించి క్యాబిన్ లగేజీని తీసుకురావడంతో, దానికి అదనపు రుసుము చెల్లించాలని ఎయిర్పోర్ట్ సిబ్బంది కోరారు. దానికి ఆమె నిరాకరించడంతో బోర్డింగ్ గేట్ వద్ద వివాదం మొదలైంది.గేట్ వద్ద గొడవ జరుగుతున్నప్పటికీ, ఆమె సిబ్బంది కళ్లుగప్పి ‘ఫ్లైట్ JA 3104’ లోపలికి వెళ్ళిపోయింది. ప్రామాణిక బోర్డింగ్ నియమాలను ఉల్లంఘించి ఆమె విమానం ఎక్కేసిందని గ్రహించిన సిబ్బంది, వెంటనే భద్రతా సిబ్బందిని ఎలర్ట్ చేశారు.నిజానికి బోర్డింగ్ గేట్ వద్దే ముగిసిపోవాల్సిన ఈ గొడవ, ఆమె విమానం లోపలికి వెళ్లడంతో మరింత వివాదాస్పందగా మారింది. అప్పటికే ప్రయాణికులంతా తమ సీట్లలో కూర్చుని, విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. ఆ సమయంలో పోలీసులు విమానంలోకి ప్రవేశించి, ఆమెను కిందకు దించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ఆ మహిళ ఒక్కసారిగా ఒక మహిళా పోలీస్ అధికారిణి కుడి చేతిపై గట్టిగా కొరికింది. ఈ ఊహించని ఘటనతో విమానంలోని ప్రయాణికులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడుతీవ్ర ఘర్షణ తర్వాత ఎయిర్పోర్ట్ పోలీసుల ఎట్టకేలకు ఆమెను నియంత్రించి, విమానం నుండి కిందకు దించేశారు. దీనిపై అర్జెంటీనా 'నేషనల్ క్రిమినల్ అండ్ కరక్షనల్ ఫెడరల్ కోర్ట్ నెం. 3' ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. గాయపడిన మహిళా అధికారిణి, షిఫ్ట్ సూపర్వైజర్, జెట్‌స్మార్ట్ విమాన సిబ్బంది నుండి దర్యాప్తు అధికారులు స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ప్రస్తుతం కోర్టు ఈ కేసును పరిశీలిస్తోంది.ఇదీ చదవండి: సీజేపీ ధర్నాలో ఆసక్తికర డిమాండ్, విద్యామంత్రిగా ఆయన? -
ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్.. విలువెంతో తెలుసా?
ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న ఫిఫా ప్రపంచకప్-2026 మరో వారం రోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే ఫిఫా ప్రపంచకప్ ఆడేందుకు అన్ని జట్లు సిద్ధమయ్యాయి. భారత్‌లో క్రికెట్‌కు ఎంత ఆదరణ ఉంటుందో.. పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా యూరోప్, అమెరికా, లాటిన్ దేశాల్లో ఫుట్‌బాల్‌ను విపరీతంగా ఆదరిస్తుంటారు.అందుకే ఫిఫా ప్రపంచకప్‌కు ఎనలేని క్రేజ్ ఉంటుంది. 2022 ఫిఫా ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుండగా.. గతంలో ఫిఫా విజేతలుగా నిలిచిన ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్, ఇంగ్లండ్, స్పెయిన్లు మరోసారి ఫిఫా కప్ సొంతం చేసుకోవాలని భావిస్తుండగా, ప్రతీసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ అంచనాలు అందుకోవడంలో విఫలమవుతూ వస్తోన్న పోర్చుగల్ ఈసారి కూడా టాప్ కంటెండర్‌గా పోటీలో ఉంది. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచకప్‌లో 48 దేశాలు పాల్గొంటున్నాయి. మొత్తం 108 మ్యాచ్‌లు జరగనున్న టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. విజేతగా నిలిచే జట్టుకు అందించే ట్రోఫీ విలువను సరిగ్గా అంచనా వేయలేము. అయితే ఇందులో ఉపయోగించే మెటల్స్ ఆధారంగా లెక్కిస్తే ప్రస్తుతం దీని విలువ సుమారు 2.5 లక్షల అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 2,380 కోట్ల పైమాటే.ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం, ట్రోఫీ తయారీలో అవసరమైన అత్యున్నత స్థాయి నైపుణ్యం కారణంగా దీని విలువ మరింత పెరిగింది. అయితే వాస్తవానికి ఈ ట్రోఫీ విలువ దాని తయారీ ఖర్చుతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ. ఒకవేళ ఈ ట్రోఫీని నేడు వేలానికి ఉంచితే దీని ధర 20 మిలియన్ డాలర్లకు పైగా పలికే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత కరెన్సీలో ఇది రూ.170 కోట్లతో సమానం. అయితే గెలిచిన జట్టుకు అందించే ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ దేనితో తయారు చేస్తారు, ఎన్ని క్యారెట్ల బంగారాన్ని వాడుతారు? జట్టుకు అందించే ట్రోఫీ నిజమైనదా లేదా రెప్లికా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.18 క్యారెట్ల బంగారం..ఫిఫా ట్రోపీ 37 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసే ట్రోపీ ఆరు కిలోల బరువును కలిగి ఉంటుంది. ట్రోఫీ డిజైన్ లో ఇద్దరు వ్యక్తులు భూమిని పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా కనిపిస్తారు. ఫుట్‌బాల్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే క్రీడ అనే సందేశాన్ని ఈ రూపకల్పన ప్రతిబింబిస్తుంది. అయితే చాలామంది అనుకునేలా ఈ ట్రోఫీ పూర్తిగా బంగారంతో తయారై ఉండదు. ట్రోఫీ లోపలి భాగం ఖాళీగా ఉంటుంది. ఒకవేళ పూర్తిగా బంగారంతో తయారు చేస్తే అది చాలా బరువుగా మారి ఆటగాళ్లు ఎత్తడం కష్టమవుతుంది. ట్రోఫీ అడుగు భాగంలో రెండు పొరల మలకైట్ అనే ఆకుపచ్చ రంగు ఖనిజాన్ని ఉపయోగించారు.బ్రెజిల్ ఖాతాలో పాతట్రోఫీ..ఈ ట్రోఫీని ఇటలీకి చెందిన శిల్పి సిల్వియో గజ్జనిగా రూపొందించారు. 1970లో ఫిఫా నిర్వహించిన అంతర్జాతీయ డిజైన్ పోటీలో ఆయన రూపకల్పన ఎంపికైంది. అంతకుముందు ఉపయోగించిన జూల్స్ రిమెట్ ట్రోఫీని 1970లో బ్రెజిల్ మూడోసారి వరల్డ్ కప్ గెలుచుకోవడంతో శాశ్వతంగా ఆ దేశానికి అప్పగించారు. దీంతో కొత్త ట్రోఫీని రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వరల్డ్ కప్ ట్రోఫీని తొలిసారిగా 1974లో పశ్చిమ జర్మనీ గెలుచుకుంది.విజేతలకు ఇచ్చేది నకిలీదేఫిఫా ప్రపంచకప్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఫైనల్ గెలిచిన జట్టుకు అసలు ట్రోఫీని శాశ్వతంగా ఇవ్వరు. ఫైనల్ ముగిసిన వెంటనే అసలు ట్రోఫీని ఫిఫా స్విట్జర్లాండ్‌లోని తమ ప్రధాన కార్యాలయం జ్యూరిచ్‌కు తిరిగి తీసుకెళ్తుంది. దాని బదులుగా విజేత దేశానికి బంగారు పూత పూసిన కాంస్యంతో తయారు చేసిన ప్రత్యేక రిప్లికా ట్రోఫీని అందజేస్తారు. దీంతో అసలు ట్రోఫీ ఎప్పటికీ ఫిఫా ఆధీనంలోనే ఉంటుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత విలువైన గుర్తింపుగా నిలిచిన ఈ ట్రోఫీపై ప్రతి నాలుగేళ్లకోసారి ప్రపంచ దేశాలు కన్నేస్తుంటాయి.చదవండి: ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్‌లీడర్స్‌తో క్రికెటర్ల బంధం! -
‘కిక్’ఎక్కించే సమరం
వేసవిలో వినోదం అందించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ ముగిసింది. ఇక వర్షాకాలంలో ‘కిక్’ ఎక్కించేందుకు మరో క్రీడా సమరం ముస్తాబైంది. విశ్వవ్యాప్త క్రీడాభిమానులను ఉర్రూతలూగించేందుకు ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ వచ్చేస్తోంది. మరో ఎనిమిది రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌కు తెర లేవనుంది. క్వాలిఫయింగ్‌లో 200కు పైగా దేశాలు పోటీపడితే... చివరకు 45 దేశాలు తమ అత్యుత్తమ ఆటతీరుతో ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లు నేరుగా అర్హత పొందాయి. ఓవరాల్‌గా 48 దేశాలు 39 రోజులపాటు విశ్వకిరీటం కోసం పోరాడనున్నాయి. జూన్ 11న మెక్సికో సిటీ స్టేడియంలో మెక్సికో, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలవుతుంది. జూలై 19న న్యూయార్క్ స్టేడియంలో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. – సాక్షి క్రీడా విభాగంసూపర్ స్టార్ మెస్సీ సారథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా టైటిల్ నిలబెట్టుకుంటుందా? క్రిస్టియానో రొనాల్డోకు అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌ను పోర్చుగల్ అందిస్తుందా? నెమార్ తన మ్యాజిక్‌తో బ్రెజిల్‌కు పూర్వ వైభవం లభిస్తుందా? ఐదోసారి ప్రపంచకప్‌ను ముద్దాడి బ్రెజిల్ సరసన జర్మనీ నిలుస్తుందా? బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఉరుగ్వే, ఇంగ్లండ్, స్పెయిన్ కాకుండా కొత్త చాంపియన్‌ను ఈసారైనా చూస్తామా? వీటన్నింటికీ సమాధానం జూలై 19వ తేదీన లభిస్తుంది. తొలిసారి మూడు దేశాల్లో... ఇప్పటి వరకు 22 సార్లు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరిగింది. 1930లో ఉరుగ్వే తొలి ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946లలో ప్రపంచకప్‌ను నిర్వహించలేదు. 1998 వరకు జరిగిన ప్రపంచకప్ టోర్నీలకు ఒక దేశం వేదికగా జరిగాయి. 2002లో తొలిసారి దక్షిణ కొరియా–జపాన్ దేశాలు సంయుక్తంగా ప్రపంచకప్‌ను నిర్వహించాయి. 2026 ప్రపంచకప్ టోర్నీకి మొదటిసారి (అమెరికా, మెక్సికో, కెనడా) మూడు దేశాలు కలిసి ఆతిథ్యమిస్తున్నాయి. 2030 ప్రపంచకప్ కూడా మూడు దేశాల్లో (మొరాకో, పోర్చుగల్, స్పెయిన్) జరగనుంది. ఇక 2034 ప్రపంచకప్ టోర్నీ ఆతిథ్య హక్కులు సౌదీ అరేబియాకు లభించాయి. మెక్సికో మూడోసారి... ప్రపంచకప్‌ను అత్యధికంగా మూడుసార్లు నిర్వహించిన దేశంగా మెక్సికో రికార్డు నెలకొల్పనుంది. గతంలో మెక్సికోలో 1970, 1986 ప్రపంచకప్ టోర్నీలు జరిగాయి. బ్రెజిల్ (1950, 2014), ఫ్రాన్స్ (1938, 1998), జర్మనీ (1974, 2006), ఇటలీ (1934, 1990) రెండుసార్లు చొప్పున ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించగా... తాజాగా ఈ జాబితాలో అమెరికా (1996, 2026) కూడా చేరనుంది. బ్రెజిల్ మాత్రమే... ఇప్పటి వరకు జరిగిన ప్రతి ప్రపంచకప్‌లోనూ ఆడిన ఏకైక జట్టుగా బ్రెజిల్ గుర్తింపు పొందింది. 2026 ప్రపంచకప్‌తో కలిపి బ్రెజిల్ వరుసగా 23వసారి ఈ మెగా ఈవెంట్లో ఆడనుంది. రెండో స్థానంలో జర్మనీ (21 సార్లు), మూడో స్థానంలో అర్జెంటీనా (19 సార్లు), నాలుగో స్థానంలో ఇటలీ, మెక్సికో (18 సార్లు చొప్పున), ఐదో స్థానంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్పెయిన్ (17 సార్లు చొప్పున), ఆరో స్థానంలో బెల్జియం, ఉరుగ్వే (15 సార్లు చొప్పున) ఉన్నాయి. 48 జట్లతో... మొదటి ప్రపంచకప్‌లో 13 దేశాలు పాల్గొన్నాయి. 1978 వరకు 16 జట్లతో నిర్వహించారు. 1982 నుంచి 1994 ప్రపంచకప్‌లను 24 జట్లకు అవకాశం ఇచ్చారు. 1998 నుంచి 2022 వరకు 32 దేశాలు ప్రపంచకప్ కోసం పోటీపడ్డాయి. తాజా ప్రపంచకప్‌లో ఏకంగా 48 జట్లు బరిలో ఉండనున్నాయి. 39 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 104 మ్యాచ్‌లు జరుగుతాయి. అమెరికా అత్యధికంగా 78 మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తుంది. మెక్సికో, కెనడా దేశాల్లో 13 మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి. మ్యాచ్‌లు అమెరికాలోని 11 నగరాల్లో, మెక్సికోలోని 3 నగరాల్లో, కెనడాలోని 2 నగరాల్లో జరుగుతాయి. నాకౌట్ దశకు 32 జట్లు జట్ల సంఖ్య పెరగడంతో ఈసారి ఫార్మాట్ కూడా మారింది. మొత్తం 48 జట్లను 12 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. లీగ్ దశ ముగిశాక 12 గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతోపాటు మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది ఉత్తమ జట్లు నాకౌట్ దశకు (32 జట్లు) అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ప్రిక్వార్టర్ ఫైనల్స్ (16 జట్లు), క్వార్టర్ ఫైనల్స్ (8 జట్లు), సెమీఫైనల్స్ (4 జట్లు), ఫైనల్ (2 జట్లు) జరుగుతాయి. నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ వరుసగా మూడోసారి ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందడంలో విఫలం కాగా... కెప్ వెర్డె, కురసావ్, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ జట్లు తొలిసారి ప్రపంచకప్‌లో అరంగేట్రం చేయనున్నాయి. నిద్ర మానేసి... ప్రపంచకప్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 9:30, 10:30 నుంచి; అర్ధరాత్రి గం. 12:30 నుంచి, గం. 1:30 నుంచి; తెల్లవారుజాము గం. 3:30 నుంచి, 4:30 నుంచి; ఉదయం గం. 6:30 నుంచి, గం. 7:30 నుంచి, గం. 9:30 నుంచి జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో అభిమానులు ప్రపంచకప్ మ్యాచ్‌లు తిలకించాలంటే రాత్రంతా నిద్ర మానేయాల్సి ఉంటుంది. భారత్‌లో మ్యాచ్‌లను ‘జీ’ స్పోర్ట్స్ చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయున్నాయి. -
మెస్సీ ఆడడంపై క్లారిటీ.. అర్జెంటీనా జట్టు ప్రకటన
జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ టోర్నీ కోసం అర్జెంటీనా శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. 2022లో ఫిఫా చాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనాను మళ్లీ మెస్సీనే నడిపించనున్నాడు. 26 మంది సభ్యులతో కూడిన బృందాన్ని అర్జెంటీనా జట్టు కోచ్ లియోనిల్ స్కలోని ప్రకటించారు. ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరఫున మ్యాచ్ ఆడుతూ మెస్సీ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా అతడు ఫిఫా వరల్డ్‌కప్‌కు దూరమవనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తెరదించుతూ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆడనున్నట్లు, జట్టుకు సారథిగా అతనే వ్యవహరించనున్నట్లు స్కలోని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మెస్సీ రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడనున్నాడు. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ అవార్డు గెలిచిన మెస్సీకే సారధ్య బాధ్యతలను అప్పగించారు. ఖతార్‌లో నాలుగేళ్ల క్రితం జరిగిన వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా టైటిల్‌ను గెలిచిన విషయం తెలిసిందే. అయితే అర్జెంటీనా జట్టులో రియల్ మాడ్రిడ్ ప్లేయర్ ఫ్రాంకో మస్తానటునో పేరు మాత్రం జట్టులో కనిపించలేదు. జూన్ 11న మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. గ్రూప్ జెలో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌ను కన్సాస్ సిటీ వేదికగా జూన్ 17న అల్జీరియాతో ఆడనుంది. అర్జెంటీనాతో పాటు అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లు గ్రూప్-జెలో ఉన్నాయి. అర్జెంటీనా జట్టు:గోల్‌కీపర్స్: ఎమిలియానో మార్టినేజ్, జిరోనిమా రుల్లి, జువాన్ ముసోడిఫెండర్స్: గొంజాలో మాంటిల్, నాహుల్ మోలినా, లిసాండ్రో మార్టినేట్, నికోలస్ ఒటమెండి, లియోనార్డో బార్లేడి, క్రిస్టియానా రొమారియో, ఫకుండా మెదీనా, నికోలస్ తగ్లియాఫికోమిడ్ఫీల్డర్లు: లియాండ్రో పరేడ్స్, రోడ్రిగో డీ పాల్, ఎక్స్కుయల్ పాలేసియస్, ఎంజో ఫెర్నాండేజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్, జియోవాని లో సెల్సో, వాలెంటినా బార్కోస్ట్రైకర్లు: లియోనిల్ మెస్సి (కెప్టెన్) , నికోలస్ పాజ్, థియాగో అల్మడా, నికోలస్ గొంజాలెజ్, జులియన్ అల్వరేజ్, గులియానో సిమోని, లౌతారో మార్టినేజ్, జోస్ మాన్యువెల్ లోపేజ్చదవండి: ‘అఫ్రిదితో పోలిక.. ఇది అవమానించడమే!’ -
మెస్సీకి గాయం.. ఫిఫా ప్రపంచకప్‌కు దూరం!
మరో పదిహేను రోజుల్లో సాకర్ సంగ్రామం (ఫిఫా వరల్డ్‌కప్-2026) మొదలవనున్న నేపథ్యంలో అర్జెంటీనాకు షాక్ తగిలేలా ఉంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ గాయం బారీన పడ్డాడు. ప్రస్తుతం ఇంటర్ మియామి క్లబ్ తరఫున ఆడుతున్న మెస్సీ మేజర్ సాకర్ లీగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఆదివారం రాత్రి ఫిలడెల్ఫియా యూనియన్‌తో ఇంటర్ మియామి తలపడింది. మ్యాచ్‌లో 73వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మెస్సీ బంతిని కొట్టే క్రమంలో ఎడమ కాలికి గాయమైంది. అయితే మైదానం వీడే సమయంలో నార్మల్‌గానే కనిపించినప్పటికీ, డగౌట్లో కూర్చున్న సమయంలో తీవ్ర ఇబ్బందిగా మెస్సీ కనిపించాడు. మెస్సీ గాయంతో బాధపడుతున్నాడని, గాయం తీవ్రత కాస్త ఎక్కువగానే ఉందని ఇంటర్ మియామి కోచ్ గులెరెమో హొయెస్ పేర్కొన్నాడు. మరో 15 రోజుల్లో ఫిఫా ప్రపంచకప్ మొదలుకానున్న నేపథ్యంలో మెస్సీ సాకర్ సంగ్రామంలో ఆడుతాడా లేదా అనేది అనుమానంగా మారింది. మెస్సీ గాయంపై అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు స్పందించనప్పటికీ, అతడి గాయంపై ఆందోళనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 11న మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.గ్రూప్ జెలో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌ను జూన్ 17న అల్జీరియాతో ఆడనుంది. అర్జెంటీనాతో పాటు అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లు గ్రూప్-జెలో ఉన్నాయి. ఇక ఫిలడెల్ఫియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్ మియామి 0-6తో విజయాన్ని అందుకుంది.చదవండి: కెప్టెన్సీ విమర్శలపై రహానే ఘాటు వ్యాఖ్యలు -
2–2తో సమం
బ్యూనస్ ఎయిర్స్: ప్రపంచకప్, ఆసియా క్రీడలకు సన్నాహాల్లో భాగంగా అర్జెంటీనాలో పర్యటించిన భారత మహిళల హాకీ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–2తో సమంగా ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత జట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను ‘డ్రా’ చేసుకుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు 2–4తో ఓడిపోయింది. భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్, అన్ను ఒక్కో గోల్ చేశారు. రెండో మ్యాచ్‌ను టీమిండియా 1–2తో చేజార్చుకుంది. భారత్ తరఫున ఇషిక ఏకైక గోల్ చేసింది. మూడో మ్యాచ్‌లో భారత బృందం 2–1తో గెలిచింది. భారత జట్టుకు నవ్‌నీత్ కౌర్, నేహా ఒక్కో గోల్ అందించారు. చివరిదైన నాలుగో మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్’లో 3–2తో నెగ్గింది. -
భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ల రీఎంట్రీ
ఏప్రిల్ 13–17 వరకు అర్జెంటీనాలో జరుగబోయే నాలుగు మ్యాచ్‌ల సిరీస్ కోసం 24 మంది సభ్యుల భారత మహిళల హాకీ జట్టును హాకీ ఇండియా ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. స్టార్ ప్లేయర్లు సవితా పూనియా (గోల్ కీపర్), దీపిక (ఫార్వర్డ్) ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చారు. సలీమా టేటే కెప్టెన్‌గా కొనసాగుతారు. జ్యోతి, ముంతాజ్ ఖాన్ జట్టులోకి తిరిగి వచ్చారు. రుతుజా, ఇషికా, సాక్షి రాణా వంటి యువ ప్లేయర్లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. సవితతో పాటు మరో గోల్ కీపర్‌గా బిచు దేవి ఎంపికయ్యారు.డిఫెండర్లుగా నిక్కీ ప్రధాన్, ఇషికా చౌధరి, సుశీలా చాను, మనీషా చౌహాన్, లల్తంత్లుయాంగి, జ్యోతి, ఉదితా చోటు దక్కించుకున్నారు. మిడ్‌ఫీల్డర్లుగా వైష్ణవి విఠల్ ఫల్కే, సాక్షి రాణా, సునెలితా టోప్పో, సలీమా టేటే, నేహా, దీపికా సోరెంగ్, రుతుజా దాదాసో పిసాల్, ఇషికా .. ఫార్వర్డ్ ప్లేయర్లుగా బల్జీత్ కౌర్, నవనీత్ కౌర్, దీపికా, అన్ను, బ్యూటీ దుంగ్దుంగ్, లాల్రెమ్సియామి, ముంతాజ్ ఖాన్ వ్యవహరించనున్నారు.ఈ సిరీస్ భారత జట్టుకు హాకీ వరల్డ్ కప్ 2026, ఆసియా గేమ్స్‌కు ముందు కీలకమైందిగా పరిగణించబడుతుంది. అర్జెంటీనా వంటి బలమైన జట్టుతో ఆడటం యువ ప్లేయర్లకు విలువైన అనుభవంగా నిలువనుంది. -
‘మెస్సీ బృందం మమ్మల్ని మోసం చేసింది’
అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ బృందం తమను మోసం చేసిందని కేరళ క్రీడామంత్రి అబ్దురహిమన్ ఆరోపించారు. కేరళలో పర్యటించి మ్యాచ్ ఆడేందుకు మెస్సీ, అర్జెంటీనా టీమ్‌కు స్పాన్సర్ల ద్వారా రూ. 250 కోట్లు ఇచ్చినట్టు చెప్పాడు. అయితే, డబ్బులు తీసుకొన్న తర్వాత హామీని నిలబెట్టుకోలేదన్నాడు. మరో ఐదు దేశాలను కూడా ఇలాగే మోసగించిన విషయం తమ విచారణలో తెలిసిందన్నాడు. ‘డబ్బు తీసుకొంటారు.. కానీ, ఆడటానికి రారు. అర్జెంటీనా జట్టుపై కేసు వేయాల్సిన పరిస్థితి. వారు తప్పకుండా నష్టపరిహారం చెల్లించాల’ని అబ్దురహిమన్ డిమాండ్ చేశాడు. గత డిసెంబర్లో మెస్సీ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా, హైదరాబాద్‌లో మెస్సీ బృందం ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడింది.కాగా ఈ ఏడాది జూన్ 11 నుంచి ఫిఫా ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఫిఫా 48 జట్లతో కూడిన వివరాలను, మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. కాగా రెండురోజుల క్రితం ఫిఫా ప్రపంచకప్ కోసం అర్జెంటీనా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతు న్న సంగతి తెలిసిందే. సొంతగడ్డపై జాంబియాతో ఆడిన మ్యాచ్ మెస్సీకి చివరిదనే ప్రచారం జరిగిన వేళ.. మైదానంలోనే మెస్సీ కంటతడి పెట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఫిఫా ప్రపంచకప్‌కు ఇప్పటికే అర్హత సాధించిన అర్జెంటీనా గ్రూప్-జేలో ఉంది. ఇదే గ్రూప్‌లో ఉన్న అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లతో అర్జెంటీనా మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.చదవండి: ‘ఎందుకంత ద్వేషం.. నేను ఆడడం ఇష్టం లేదా?’ -
కంటతడి పెట్టిన లియోనల్ మెస్సీ!
లియోనల్ మెస్సీ.. పరిచయం అక్కర్లేని పేరు. ఈతరం ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఆల్ టైమ్ గ్రేట్‌గా ఈ అర్జెంటీనా స్టార్‌ను అభివర్ణిస్తుంటారు. ఆయన అభిమాన బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం మెస్సీ వయస్సు 38 ఏళ్లు కావడంతో అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్‌లో మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్ 2026 మెస్సీ ఆఖరి టోర్నీ అని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడడంతో మెస్సీ ఉద్వేగానికి గురయ్యాడు. విషయంలోకి వెళితే మంగళవారం రాత్రి బ్యూనస్ఎయిర్స్ వేదికగా అర్జెంటీనా, జాంబియా మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఒక గోల్ కొట్టడంతో పాటు మరొక గోల్ కొట్టడంలో అసిస్ట్ చేశాడు. మ్యాచ్‌లో అర్జెంటీనా 5-0తో జాంబియాను చిత్తుగా ఓడించింది. తొలి హాఫ్ ముగియడానికి ముందు కెరీర్లో 116వ గోల్ సాధించిన మెస్సీ అంతకముందు మ్యాచ్ ఆరంభంలో జులియన్ అల్వారెజ్‌కు పాస్ అందించాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత తన సహచరులతో కలిసి మైదానంలో నిలబడిన సమయంలో స్టాండ్స్‌లోని ప్రేక్షకులు ‘మెస్సీ.. మెస్సీ’ అంటూ అరవడం మొదలెట్టారు. ఇది చూసిన మెస్సీ కళ్లలో దుఃఖం ఆగలేదు. వెంటనే తలను కిందకు దించి కంటి నుంచి వచ్చిన నీరును తుడుచుకోవడం కెమెరాలకు చిక్కింది. అర్జెంటీనా తరఫున తన హోంగ్రౌండ్లో చివరి మ్యాచ్ ఆడడాన్ని జీర్ణించుకోలేకే మెస్సీ కంటతడి పెట్టినట్లు అభిమానులు కామెంట్ చేశారు. ఇక ఫిఫా ప్రపంచకప్‌కు ఇప్పటికే అర్హత సాధించిన అర్జెంటీనా గ్రూప్-జేలో ఉంది. ఇదే గ్రూప్‌లో ఉన్న అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లతో అర్జెంటీనా మ్యాచ్‌లు ఆడనుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న అర్జెంటీనాకు గ్రూప్ దశలో సులువైన డ్రానే లభించింది. ప్రపంచకప్‌కు సన్నాహకంగా అర్జెంటీనా వరుస ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడుతూ వస్తోంది. ఇప్పటికే మారిటానియా, జాంబియాలతో మ్యాచ్‌లు ముగించుకున్న అర్జెంటీనా తమ తదుపరి మ్యాచ్‌ను సెర్బియాతో ఆడనుంది.2022లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్ సాధించడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్‌లో నాయకుడిగా, ఆటగాడిగా జట్టును నడిపించిన మెస్సీ ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో రెండు గోల్స్ కొట్టడమే గాక, టోర్నీ మొత్తంగా ఏడు గోల్స్ కొట్టి ‘గోల్డెన్ బాల్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన మెస్సీ ఆ జట్టు దిగ్గజ కెప్టెన్లు డానియెల్ పసరెల్లా, డీగో మారడోనా సరసన చోటు దక్కించుకున్నాడు. LIONEL MESSI GOAL FOR ARGENTINA 🐐🇦🇷 pic.twitter.com/9jxqpLWeSc— Ayuba | Football News (@ayubafootball) April 1, 20262005లో అర్జెంటీనా జాతీయ జట్టులోకి వచ్చిన మెస్సీ ఇప్పటివరకు 198 మ్యాచ్‌ల్లో 116 గోల్స్ సాధించాడు. చివరగా మెస్సీ సారథ్యంలో 2024లో మినీ ప్రపంచకప్‌గా పిలుచుకునే కోపా అమెరికా కప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. తాజాగా మరోసారి కోచ్ లియోనెల్ స్కలోని మార్గదర్శకత్వంలో మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రపంచ కప్‌లో మెస్సికి ఆడాలనే ఉన్నప్పటికీ కోచ్, బోర్డు తీసుకునే నిర్ణయంపై సందిగ్ధం నెలకొంది. ఇక ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఫిఫా వరల్డ్‌కప్ జరగనుంది.🚨💣 Deeply emotional scenes unfolding in Argentina 🇦🇷🥹Lionel Messi is currently playing what is expected to be his LAST match with the national team on Argentine soil.The final chapter at home for the greatest of all time before the 2026 World Cup. This one really hurts.… pic.twitter.com/yW8WaYYxyi— Topskills Sports UK (@topskillsportuk) April 1, 2026చదవండి: ‘స్నేహితుల్లేరు.. మా నాన్న ఫేవరెట్ క్రికెటర్ కాదు’ -
భారత్‌కు అండగా మరో దేశం.. పెద్ద కష్టం తీరినట్టే?
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అనేక దేశాలు ఇంధన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధి మూత పడటంతో పెను సంక్షోభం ఏర్పడింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంధన రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. దీంతో, చమురు సరఫరా పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రభావం భారత్‌పై కూడా తీవ్రంగా పడింది.కాగా, భారత్ తన అవసరాల కోసం దాదాపు 90 శాతం గల్ఫ్ దేశాల నుంచే ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా భారత్‌కు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి మూత పడటంతో సమస్య తలెత్తింది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ మిత్రదేశమైన అర్జెంటీనా భారత్‌కు భారీ ఆఫర్ ఇచ్చింది. 2024 కంటే ముందు అర్జెంటీనా నుంచి భారత్‌కు గ్యాస్ సరఫరా అస్సలు ఉండేది కాదు. కానీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో 2025లో 22,000 టన్నుల దిగుమతులు జరగగా, 2026 తొలి మూడు నెలల్లోనే అది ఏకంగా 50,000 టన్నులకు చేరడం గమనార్హం. మార్చి 5న అదనంగా 11,000 టన్నులు గ్యాస్‌తో భారత్ చేరుకుంది.అయితే, అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండం చివరిలో ఉంది. భారత్, అర్జెంటీనా మధ్య దూరం సుమారు 20,000 కిలోమీటర్లు. అక్కడి నుంచి భారత్‌కు రవాణా చేయడం పెను సవాలుతో కూడుకుంది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అత్యంత పొడవైన నౌకా మార్గం ఇది. రవాణా ఖర్చులు భారమైనప్పటికీ, దేశంలో గ్యాస్ కొరత రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా రాయబారి మారియానో అగస్టిన్ కౌసినో ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ దేశంలో అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని, భారత్‌కు దీర్ఘకాలం పాటు సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రస్తుతం భారత్ అర్జెంటీనాకు 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గ్యాస్‌తో పాటు సోయాబీన్ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, పప్పుధాన్యాలను కూడా మనం అక్కడి నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము. -
అర్జెంటీనా శిఖరంపై.. హైదరాబాదీ సింహనాదం
ప్రపంచంలో అత్యంత కఠినమైన పర్వతారోహణలో ఒకటైన ఆకోంకాగువా శిఖరాన్ని భారతీయ సాహసికుడు, నగరానికి చెందిన కళాలి జై సింహ గౌడ్ అధిరోహించారు. ఆసియా ఖండం వెలుపల అత్యంత ఎత్తైన పర్వతంగా అర్జెంటీనాలోని ఈ ఆకోంకాగువా (6,961 మీటర్లు) గుర్తింపు పొందింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ పరిస్థితుల్లో నడుమ ఈ శిఖరాన్ని అధిరోహించడం పర్వతారోహకులకు అతిపెద్ద సవాల్. ‘ఇన్ మ్యాన్ చాలెంజ్’ పూర్తి చేసిన సాహసికుడిగా ఇప్పటికే గుర్తింపు పొందిన జై సింహ గౌడ్, శారీరక బలంతో పాటు మనోధైర్యం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఈ ఘనత సాధించారు. అత్యంత కఠిన శిక్షణతో లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రపంచంలోని ఖండాల్లో ఎత్తైన శిఖరాల అధిరోహణ, మహాసముద్రాల్లో ఈత, విపత్కర పరిస్థితుల్లో ఫుల్ మారథాన్లు పూర్తి చేసిన అనుభవం ఉన్న ఆయన.. ‘మేక్ ఫిట్ ఇండియా’లో భాగంగా ఫిట్‌నెస్‌పై ప్రజలకు అవగాహన కలి్పంచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. -
నెలకు రూ. 41 కోట్లకు పైగానే.. సచిన్, కోహ్లి దరిదాపుల్లో లేరు!
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మేనియాతో ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది. మెస్సీ నామస్మరణతో మహానగరం శనివారం మారుమోగ్రిపోయింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆద్యంతం చలాకీగా, సరదాగా గడిపిన మెస్సీ.. సరదా కిక్‌లతో ఫుట్‌బాల్‌ను స్టాండ్స్‌కు పంపించాడు. వాటిని అందుకుని అందుకున్న అభిమానులు ఇదేకదా అసలు ‘కిక్కు’ అంటూ మురిసిపోయారు.కాగా మెస్సీ.. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా సామాన్యులనూ ఆకర్షించిన అంశం.. వారిని ముక్కునవేలేసుకునేలా చేసిన విషయం ఏమిటంటే.. ఈ లెజెండరీ ఆటగాడితో ఫొటో దిగాలంటే ఏకంగా పది లక్షలు చెల్లించాల్సి ఉండటం. అయితే, మెస్సీ రేంజ్ గురించి తెలిసిన వాళ్లు మినమమ్ ఉంటది కదా! అని సరిపెట్టుకున్నారు. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెస్సీ సంపాదన.. 2025 నాటికి ఏడు వేల కోట్ల రూపాయలకు పైమాటే అని అంచనా!ఫుట్‌బాల్‌కే ఆదరణ ఎక్కువభారత్తో పాటు క్రికెట్ ఆడే దేశాల్లో ప్రఖ్యాతి పొందిన భారత క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ (దాదాపు రూ. 1400 కోట్లు), విరాట్ కోహ్లి (సుమారుగా వెయ్యి కోట్లు)లతో పోలిస్తే మెస్సీ సంపాదన చాలా ఎక్కువ. భారత్‌లో క్రికెట్ మతమైతే.. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌కి ఆదరణ ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఒక్కో మెట్టు ఎక్కుతూ..పుట్టుకతోనే మెస్సీ కోటీశ్వరుడేమీ కాదు. చిన్ననాటి నుంచే ఫుట్‌బాల్‌పై ఉన్న మక్కువ.. ఆటలో అంకిత భావం, నైపుణ్యాలు అతడిని ఉన్నత శిఖరాలకు చేర్చాయి. క్లబ్‌లకు ఆడుతూ పెద్ద మొత్తంలో ఆర్జించిన మెస్సీ.. ఇంటర్ మియామిలో చేరిన తొలి నాళ్లలో నెలకు మిలియన్ డాలర్లకు పైగా పొందాడు. ప్రస్తుతం ఈ క్లబ్ ద్వారా అతడు పొందే ఆదాయం నెలకు 2.67 మిలియన్ డాలర్లుగా ఉందంటే అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక బార్సిలోనా క్లబ్ ద్వారా మెస్సీ లెక్కకు మిక్కిలి ఆర్జిస్తున్నాడు.అంతేకాదు.. టాప్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేస్తూ మెస్సీ దండిగా సంపాదన కూడబెట్టాడు. ఉదాహరణకు అడిడాస్, పెప్సీ వంటి బ్రాండ్లు మెస్సీ క్రేజ్ దృష్ట్యా అతడికి ఏడాదికి రూ. 70 మిలియన్లకు పైగా ముట్టజెప్పుతున్నట్లు వివిధ వార్తా సంస్థలు నివేదించాయి.రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారాలుఇవే కాకుండా డిజిటల్ కాయిన్ల రూపంలోనూ అతడు మనీ సేవ్ చేస్తున్నాడు. ఇక ఆట, ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో పెట్టాడు. అంతేకాదు.. హోటల్ వ్యాపారాలనూ పెద్ద ఎత్తున విస్తరించాడు. ఇలా అటు క్లబ్‌లు.. ఇటు ఎండార్స్మెంట్లు, వ్యాపారాల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్న మెస్సీ... నికర ఆస్తుల విలువ ఏడు వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంది. భారత కరెన్సీలో చెప్పాలంటే.. మెస్సీ నెల ఆదాయం సుమారుగా రూ. 41.67 కోట్లు. అంటే ఏడాదికి దాదాపుగా రూ. 500 కోట్లు అన్నమాట. చదవండి: IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్ -
వేల కోట్ల సంపాదన.. అతడికి ఆ పేరెలా వచ్చిందంటే?
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి అతడు ఆరాధ్య ఆటగాడు. భారత్‌లో క్రికెట్ మతంలాంటిదే అయినా.. మెస్సీకి కూడా ఇక్కడ చాలా మందే అభిమానులు ఉన్నారు.హైదరాబాద్ పర్యటన ఇలా‘ది గోట్ టూర్’లో భాగంగా మెస్సీ భారత్‌కు రానుండటంతో వారంతా అతడిని నేరుగా చూడాలని ఆశపడుతున్నారు. ఇక ముందుగా ప్రణాళికలో లేకపోయినా.. చివరి నిమిషంలో మెస్సీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఈ లెజెండరీ ప్లేయర్ స్వయంగా వెల్లడించాడు.ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చి.. అక్కడి నుంచి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు మెస్సీ చేరుకోనున్నాడు. రాత్రి ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియానికి వచ్చి ఫ్యాన్స్‌ను కలవడంతో పాటు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తిర విషయాలు మీకోసం..ఆమె గుర్తుగా ఆకాశంలోకి చూస్తూ..👶అర్జెంటీనాలోని సాంటా ఫేలో గల రొసారియోలో 1987, జూన్ 24న మెస్సీ జన్మించాడు.👶నాలుగేళ్ల వయసులోనే తన మొదటి క్లబ్ గ్రాండోలిలో జాయిన్ అయ్యాడు. అన్నట్లు అక్కడ కోచ్ మెస్సీ వాళ్ల నాన్న జోర్జ్ మెస్సీ.👶ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మెస్సీ ఎదగడంలో వాళ్ల నానమ్మ సెలియా ప్రభావం ఎక్కువ. అతడితో పాటు మ్యాచ్‌లకు హాజరవుతూ అతడిని ప్రోత్సహించేవారామె. ఆమె గుర్తుగా గోల్ సాధించిన ప్రతిసారి ఆకాశం వైపు చూపిస్తూ మెస్సీ తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు.👶ఏడేళ్ల వయసులో మెస్సీ వెనెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్లో చేరాడు.👶పదేళ్ల వయసులో మెస్సీకి హార్మోన్ డెఫిషియెన్సీ ఉన్నట్లు తేలగా.. చికిత్సతో దానిని అధిగమించాడు.వారిద్దరు.. వారికి ముగ్గురు 👩❤️💋👨తన చిన్ననాటి స్నేహితురాలు అంటోనెలా రొకజోను మెస్సీ పెళ్లి చేసుకున్నాడు. 👨👩👦👦ఈ జంటకు ముగ్గురు కుమారులు థియాగో, మెటేయో, సీరో సంతానం.🫂అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టులోని సహచరుడు సెర్గియో అగురో మెస్సీకి ప్రాణ స్నేహితుడుఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?🖤మెస్సీ ఒంటిపై పచ్చబొట్లు ఎక్కువే. అయితే, ఇవన్నీ అతడి కుటుంబ సభ్యులకు చెందినవే. భార్య కళ్లు, కుమారుల పేర్లు, వారి హస్త ముద్రలు, తన తల్లి చిత్రాన్ని టాటూలుగా వేయించుకున్నాడు మెస్సీ.💰ప్రపంచంలోని సుసంపన్న అథ్లెట్లలో మెస్సీ ఒకడు. అతడి నెట్‌వర్త్ విలువ 2025 నాటికి రూ. ఏడు వేల కోట్ల రూపాయలు అని అంచనా!🎶అన్నట్లు లియోనల్ మెస్సీకి ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?.. అతడి తల్లి ఫేవరెట్ సింగర్ లియోనల్ రిచ్చీ పేరు మీదుగా లియోనల్‌గా మెస్సీకి ఆమె నామకరణం చేశారు.చిరస్మరణీయ విజయం🌟మెస్సీ అత్యధికంగా ఎనిమిదిసార్లు బాలన్ డిఓర్ అవార్డులు గెలుచుకున్నాడు.🥇2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అర్జెంటీనా తరఫున మెస్సీ గోల్డ్ మెడల్ గెలిచాడు.⚽🏆మెస్సీ కెరీర్లో చిరస్మరణీయ విజయం.. అర్జెంటీనా సారథిగా 2022లో ఫిఫా వరల్డ్‌కప్ గెలవడం.It was 3:30AM Saturday morning people in the streets lined up, welcoming Messi as his car passes by. Thank You India.🙏🇮🇳pic.twitter.com/MtsLgvnSer— Messi Fanatic (@MessiFanatic_) December 12, 2025 -
యువ భారత్‌కు కాంస్యం
చెన్నై: సొంతగడ్డపై జరిగిన పురుషుల జూనియర్ అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని యువ భారత జట్టు 4–2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున అంకిత్ పాల్ (49వ నిమిషంలో), మన్మీత్ సింగ్ (52వ నిమిషంలో), శార్దానంద్ తివారి (57వ నిమిషంలో), అన్మోల్ ఎక్కా (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. అర్జెంటీనా జట్టుకు నికోలస్ రోడ్రిగెజ్ (3వ నిమిషంలో), సాంటియాగో ఫెర్నాండెజ్ (44వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఒకదశలో 0–2తో వెనుకబడి ఓటమి వైపు పయనిస్తున్న యువ భారత జట్టు చివరి 11 నిమిషాల్లో ఒక్కసారిగా విజృంభించింది. ఏకంగా నాలుగు గోల్స్ చేసి అద్భుత విజయాన్ని సాధించింది. భారత్ చేసిన నాలుగు గోల్స్‌లో మూడు పెనాల్టీ కార్నర్ల ద్వారా, ఒకటి పెనాల్టీ స్ట్రోక్ ద్వారా రావడం విశేషం. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఏడు పెనాల్టీ కార్నర్లు, ఒక పెనాల్టీ స్ట్రోక్... అర్జెంటీనా జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ లభించాయి. 46 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత జట్టు కాంస్య పతకం సాధించడం ఇదే తొలిసారి. 2001లో, 2016లో విజేతగా... 1997లో రన్నరప్‌గా నిలిచిన భారత్ 2005, 2021, 2023లలో కాంస్య పతక మ్యాచ్‌ల్లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. నాలుగో ప్రయత్నంలో భారత జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో నెగ్గడం విశేషం.ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు కాంస్య పతకం సాధించిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 5 లక్షలు... కోచింగ్ బృందంలోని వారికి రూ. 2 లక్షల 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది. జర్మనీ 8వ సారి... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. ‘షూటౌట్’కు దారితీసిన ఫైనల్లో జర్మనీ 3–2 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టును ఓడించి ఎనిమిదోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. గతంలో జర్మనీ 1982, 1985, 1989, 1993, 2009, 2013, 2023లలో కూడా విజేతగా నిలిచింది. -
హైదరాబాద్‌కు మెస్సీ..ఫోటో దిగాలంటే రూ. 10 లక్షలు! (ఫొటోలు)
-
మెస్సీ రాకపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 13- 15 వరకు అతడు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ సోషల్ మీడియా వేదికగా భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇండియా నుంచి లభిస్తున్న ప్రేమకు నేను ముగ్ధుడినైపోయాను. GOAT టూర్ త్వరలోనే ఆరంభం కానుంది. తొలుత కోల్‌కతా, ముంబై, ఢిల్లీలకే నా పర్యటన పరిమితం కాగా.. ఇప్పుడు హైదరాబాద్ కూడా జాబితాలో చేరింది. త్వరలోనే ఇండియాకు వస్తున్నా’’ అంటూ మెస్సీ హర్షం వ్యక్తం చేశాడు.ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్‌కు రాబోతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు, ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.మెస్సీ వంటి దిగ్గజాన్ని చూడాలని మన సిటీతో పాటు ప్రతి ఒక్క ఫుట్‌బాల్ అభిమాని కోరుకుంటారు. ఆయన మన గడ్డ మీద అడుగుపెట్టబోతున్నారు. గర్వం, సంతోషంతో నిండిన మనసుతో హైదరాబాద్ ఆయనకు ఆతిథ్యం ఇస్తుంది. మన ఆతిథ్యమే ఇక్కడి ప్రజల మనసు ఏమిటో ఆయనకు తెలియజేస్తుంది’’ అంటూ రేవంత్ రెడ్డి ఉద్వేగపూరిత ట్వీట్ చేశారు. కాగా మెస్సీ తన టూర్లో భాగంగా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఫుట్‌బాల్ క్లినిక్‌లు ప్రారంభిస్తాడు. మ్యూజిక్ కన్సర్ట్‌తో పాటు సన్మాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. -
అర్జెంటీనాలో దారుణం.. లైవ్ స్ట్రీమ్‌లో యువతుల హత్య
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా లైవ్‌లో ముగ్గురు యువతులను దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలని, ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారు.వివరాల ప్రకారం.. అర్జెంటీనాకు చెందిన లారా, బ్రెండా, మెరానా అనే ముగ్గురు యువతులను డ్రగ్స్ ముఠా అత్యంత దారుణంగా హత్య చేశారు. సెప్టెంబర్ 19వ తేదీన ముగ్గురు యువతులు ఒక పార్టీకి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు సభ్యుల డ్రగ్స్ ముఠా వారిని కిడ్నాప్ చేసింది. అనంతరం, వారిని వేధింపులకు గురిచేస్తూ నిందితులు సోషల్ మీడియా ఇన్స్‌స్టాగ్రామ్ లైవ్‌లో హత్య చేశారు. ఈ సందర్భంగా నిందితులు.. తమ వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నా.. దొంగలించినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి అనే వ్యాఖ్యలు వినిపించినట్టు స్థానిక మీడియా తెలిపింది.De Plaza de Mayo a Congreso resonó fuerte el grito de NI UNA MENOS. Cientos de mujeres, familias, organizaciones y sindicatos colmaron las calles para exigir justicia por Morena Vardi, Brenda del Castillo y Lara Gutiérrez. pic.twitter.com/fc4i2slf2d— Shok Argentina (@shokargentina) September 28, 2025ఇక, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలించారు. ఐదుగురు నిందితుల్లో ఒకరిని బొలీవియన్ సరిహద్దు నగరం విల్లాజోన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పెరువియన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అతడి ఫొటోను విడుదల చేశారు.🚨Confirmaron oficialmente que los tres cuerpos hallados en Florencio Varela son los de Brenda Castillo (20), Morena Verri (20) y Lara Morena Gutiérrez (15)Una cámara de seguridad las registró subiendo a una camioneta Chevrolet Tracker con patente adulterada, en La Tablada.… pic.twitter.com/Pba9OOhB3M— Hechos y Derecho (@Hechosanderecho) September 24, 2025మరోవైపు.. యువతుల హత్యపై అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. బాధితులకు న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజల రోడ్లకు మీదకు వచ్చారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదనతో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని పార్లమెంట్ వరకు ర్యాలీ తీశారు. -
సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్‌లో...
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ సొంతగడ్డకు ఘనంగా వీడ్కోలు పలికాడు. కెరీర్‌కు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ అర్జెంటీనాలో మాత్రం ఇదే తన ఆఖరి పోరని ఇది వరకే స్పష్టం చేసిన మెస్సీ సొంత అభిమానులను 2 గోల్స్‌తో మురిపించాడు. దీంతో శుక్రవారం జరిగిన దక్షిణ అమెరికా జోన్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–0తో వెనిజులాపై ఘనవిజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 39వ నిమిషంలో, ద్వితీయార్ధంలో 80వ నిమిషంలో మెస్సీ గోల్స్ కొట్టాడు. మరో గోల్‌ను మార్టినెజ్ (76వ నిమిషంలో) చేశాడు. మెస్సీ కుమారులు, కుటుంబసభ్యులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా మైదానానికి వచ్చి తిలకించారు. వచ్చే ఏడాది ప్రపంచకప్ కోసం దక్షిణ అమెరికా నుంచి తాజాగా ఉరుగ్వే, కొలంబియా, పరాగ్వే జట్లు మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాయి. అర్జెంటీనా మార్చిలోనే క్వాలిఫై అయ్యింది. -
మెస్సీ మేనియా షురూ!
కోల్‌కతా: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెపె్టన్ లియోనెల్ మెస్సీ ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించనున్నాడు. 2011లో చివరిసారిగా భారత్‌కు విచ్చేసిన మెస్సీ... రెండు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్లో కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే కోల్‌కతా నుంచి మెస్సీ పర్యటన ప్రారంభం కానుంది. అందకు తగ్గట్లే ఏర్పాట్లు సైతం జరుగుతున్నట్లు సమాచారం. అయితే భారత పర్యటనపై ఇప్పటి వరకు మెస్సీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అతి త్వరలో అది వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘మెస్సీ పర్యటన ఖరారైంది. అతడి నుంచి అధికారిక స్పందన రావడమే తరువాయి. అది సామాజిక మాధ్యమాల ద్వారా ఏ క్షణమైనా రావచ్చు’ అని నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 12న మెస్సీ కోల్‌కతాలో అడుగు పెట్టనున్నాడు. 70 అడుగుల విగ్రహం... ఫుట్‌బాల్‌ను విపరీతంగా అభిమానించే కోల్‌కతా వాసులు... మెస్సీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ రోడ్‌లోని లేక్‌టౌన్ శ్రీభూమిలో మెస్సీ 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యటనలో భాగంగా మెస్సీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాడు. ప్రపంచంలో మెస్సీకి ఇదే అతి ఎత్తయిన విగ్రహం కానుంది. డిసెంబర్ 13 మధ్యాహ్నం ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించే ‘గోట్ కాన్సెర్ట్’లో మెస్సీ పాల్గొననున్నాడు. మెస్సీ ఘనతలను వివరించేలా సాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ‘అభిమానులను తప్పుదోవ పట్టించాలనుకోవడం లేదు. గోట్ కాన్సెర్ట్‌తో పాటు ఏడుగురు ప్లేయర్లతో కూడిన ‘సెవెన్–ఎ–సైడ్’ గోట్ కప్ మ్యాచ్‌లో మెస్సీ పాల్గొననున్నాడు. ఇందులో భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ సౌరవ్ గంగూలీ, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా, ప్రముఖ నటుడు జాన్ అబ్రహం తదితరులు పాల్గొననున్నారు. ఇది మెస్సీ గౌరవార్ధం నిర్వహిస్తున్నాం. ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించే ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎగబడే అవకాశం ఉండగా... టికెట్ ధరలు సైతం ఎక్కువగానే ఉండనున్నాయి. సుమారు గంటన్నర పాటు మెస్సీ మైదానంలో ఉంటాడు. అతడిని దగ్గర నుంచి చూసేందుకు స్టేడియం నిండిపోవడం ఖాయమే’ అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మ్యాచ్ అనంతరం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెస్సీని సత్కరించే అవకాశముంది. ముంబైలో క్రికెట్ మ్యాచ్! కోల్‌కతా పర్యటన అనంతరం మెస్సీ అహ్మదాబాద్, ముంబైలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. డిసెంబర్ 14న ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరగనున్న ‘గోట్ కాన్సెర్ట్’, ‘గోట్ కప్’లో మెస్సీ పాల్గొననున్నాడు. దీని కోసం ఇప్పటికే మైదానాన్ని బుక్ చేసినట్లు సమాచారం. ముంబైలో మెస్సీ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నట్లు వార్తలు వస్తుండగా... నిర్వాహకులు మాత్రం వాటిని ఖండించారు. ‘మెస్సీ ఎలాంటి క్రికెట్ మ్యాచ్ ఆడబోవడం లేదు. భారత సెలెబ్రిటీలతో సరదాగా సాఫ్ట్‌బాల్ ఆడుతాడు’ అని వెల్లడించారు. అదే సమయంలో భారత ఫుట్‌బాల్ జట్టును సైతం మెస్సీ కలిసే అవకాశముంది. అనంతరం డిసెంబర్ 15న ఢిల్లీ చేరుకోనున్న మెస్సీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా భేటీ కానున్నాడు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతి నగరంలో మెస్సీ చిన్నారులతో ప్రత్యేకంగా గడపనున్నాడు. ఈ టూర్లో మెస్సీ కేరళకు వెళ్లడం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. అప్పుడేం జరిగిందంటే...2011 ఆగస్టు 31న మెస్సీ తొలిసారి భారత్‌లో పర్యటించాడు. వెనిజులాతో ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం కోల్‌కతాకు విచ్చేసిన మెస్సీకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అర్జెంటీనా జట్టుతో పాటు వచి్చన మెస్సీ కోసం వేలాది మంది అభిమానులు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలకగా... మ్యాచ్ జరుగుతున్నంత సేపు ‘సాల్ట్‌లేక్’ స్టేడియం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. కోల్‌కతా నగరం మొత్తం ‘మెస్సీ మేనియా’తో ఊగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత... ప్రపంచ చాంపియన్ హోదాలో మెస్సీ భారత్‌లో అడుగుపెట్టనుండటంతో... ఈ సారి మరింత మంది అభిమానులు అర్జెంటీనా స్టార్‌ను చూసేందుకు ఎగబడటం ఖాయమే. -
భారత్‌కు రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ.. ధోని, రోహిత్, కోహ్లితో క్రికెట్ మ్యాచ్
భారత ఫుట్‌బాల్ ప్రేమికులకు శుభవార్త. దిగ్గజ ఫుట్‌బాలర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ త్వరలో భారత పర్యటనకు రానున్నాడు. ఈ ఏడాది డిసెంబర్లో (13-15) కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు.మెస్సీకి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగనుంది. కోల్‌కతా పర్యటనలో మెస్సీ చిన్న పిల్లల కోసం ఫుట్‌బాల్ వర్క్ షాప్ నిర్వహింస్తాడు. ఇదే సందర్భంగా మెస్సీ చేతుల మీదుగా ఫుట్‌బాల్ క్లినిక్ లాంచ్ కానుంది. ఈడెన్ గార్డెన్స్‌లో మెస్సీ పలువురు భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.కోల్‌కతా పర్యటన అనంతరం మెస్సీ డిసెంబర్ 14న ముంబైలో పర్యటిస్తాడు. ఈ పర్యటనలో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగే ఓ ప్రైవేట్ ఈవెంట్లో (విజ్‌క్రాఫ్ట్ నిర్వహించే కార్యక్రమం) పాల్గొంటాడు. దీనికి ముందు భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలతో కలిసి సెవెన్-ఏ-సైడ్ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ముంబై పర్యటన తర్వాత మెస్సీ ఢిల్లీలో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. మెస్సీ భారత పర్యటనకు సంబంధించిన వాస్తవిక షెడ్యూల్ అధికారికంగా ఖరారు కాలేదు. మెస్సీ తొలిసారి 2011లో భారత్‌లో పర్యటించాడు. నాడు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. -
మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి
పధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసింది. అందులో భాగంగా ఈ రోజు (శనివారం) ఉదయం అర్జెంటినాకు చేరుకున్నారు. ఆయనకు బ్యూనస్ ఎయర్‌లోని భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో విజయగుప్తా అనే భారత సంతతి వ్యక్తి మోదీని కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. తాను ప్రధాని మోదీకి హలో చెప్పేందుకే 400 కి.మీ ప్రయాణించి మరి వచ్చానని అన్నారు. ఆయనకు జస్ట్ హలో చెప్పాలనుకున్నా..కానీ నాకు మోదీకే కరచలనం(షేక్‌హ్యాండ్) ఇచ్చే అవకాశం లభించిందంటూ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఇదిలా ఉండగా మోదీ ఒక ట్వీట్లో అర్జెంటీనా పర్యటన గురించి పంచుకున్నారు. "నేను ఈరోజు అర్జెంటీనాతో సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించే ద్వైపాక్షిక పర్యటన కోసం బ్యూనస్ ఎయిర్స్లో అడుగుపెట్టాను. ప్రస్తుతం అర్జెంటినా అధ్యక్షుడు జేవియర్ మిలీని కలిసి చర్చలు జరిపేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను" అని ట్వీట్ చేశారు.అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఈ 57 ఏళ్లలో భారత ప్రధాని అర్జెంటీనాలో చేసిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే అని ట్వీట్ చేశారు. కాగా, మోదీ బ్యూనస్ ఎయిర్స్‌లోని హోటల్‌కు చేరుకోగానే 'భారత్ మాతా కీ జై', 'జై శ్రీ రామ్' అనే నినాదాలతో ఘన స్వాగతం పలికారు ప్రవాస భారతీయులు. ఆయన ఇప్పటికే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలను సందర్శించారు. ఇక ఈ అర్జెంటీనా పర్యటన తదనంతరం బ్రెజిల్, నమీబియాలను సందర్శించనున్నారు.#WATCH | Buenos Aires, Argentina: Vijay Kumar Gupta, a member of the Indian diaspora, says, "I have come here from Rosario, which is 400 kilometres from here, just to say hello to Prime Minister Narendra Modi. I got the opportunity to shake hands with him..." https://t.co/7yZBOqwXFT pic.twitter.com/jS0uoHPGUn— ANI (@ANI) July 5, 2025 (చదవండి: ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం) -
అర్జెంటీనా చేరిన ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జేవియర్ మిలేతో భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ భారత్-అర్జెంటీనాల సంబంధాలను బలోపేతం చేసే దిశగా తన వంతు ప్రయత్నాలను సాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ఈరోజు (శనివారం) ఉదయం ఆయన అర్జెంటీనాకు చేరుకున్నారు. నేడు ఆయన అధ్యక్షుడు జేవియర్ మిలేతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్నారు. అర్జెంటీనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ రోజు సాయంత్రం ప్రధాని మోదీ అర్జెంటీనా నేషనల్ హీరో జనరల్ జోస్ డి శాన్ మార్టిన్ విగ్రహం వద్ద ఆయనకు నివాళులర్పించనున్నారు. అనంతరం అధ్యక్షుడు మిలే అందించే ఆతిథ్యం అందుకోనున్నారు. నగరంలోని ఐకానిక్ క్లబ్ బోకా జూనియర్స్ ఫుట్‌బాల్ స్టేడియంను కూడా ప్రధాని సందర్శించనున్నారు. అర్జెంటీనాలో ప్రధాని పర్యటన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, పరస్పర సహకారానికి కొత్త మార్గాలను తెరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. Landed in Buenos Aires for a bilateral visit which will focus on augmenting relations with Argentina. I’m eager to be meeting President Javier Milei and holding detailed talks with him.@JMilei pic.twitter.com/ucdbQhgsUj— Narendra Modi (@narendramodi) July 5, 2025ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలు.. వాణిజ్యం,పెట్టుబడి, ఆరోగ్యం, ఔషధాలు, రక్షణ, మౌలిక సదుపాయాలు, మైనింగ్, వ్యవసాయం, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ,డిజిటల్ ఆవిష్కరణ, విపత్తు నిర్వహణ తదితర విభిన్న రంగాలపై దృష్టి సారించనున్నాయి. అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అర్జెంటీనాకు చేరుకున్నారు. గతంలో ఈ ఇద్దరు నేతలు 2024లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో కలుసుకున్నారు. ఈ ఐదు దేశాల పర్యటనకు ముందు, ప్రధాని మోదీ.. అర్జెంటీనాను లాటిన్ అమెరికాలో కీలక ఆర్థిక భాగస్వామిగా, జీ20 సమూహంలో సన్నిహిత సహకారిగా అభివర్ణించారు. ప్రధాని ఈ అర్జెంటీనా పర్యటన అనంతరం 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ అబద్ధం.. అజార్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నడంటూ.. -
భారత్‌కు మరో పరాజయం
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు... మూడో మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో కూడా ఓడింది. యూరప్ అంచె పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన పోరులో టీమిండియా 3–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. గత రెండు మ్యాచ్‌ల్లో పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో విఫలమైన భారత్... ఈసారి పేలవ డిఫెన్స్‌తో మూల్యం చెల్లించుకుంది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (12వ, 33వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... అభిõÙక్ (42వ నిమిషంలో) ఒక గోల్ కొట్టాడు. అర్జెంటీనా తరఫున మాటియాస్ రే (3వ నిమిషంలో), లూకాస్ మార్టినేజ్ (17వ నిమిషంలో), శాంటియాగో టరాజొనా (34వ నిమిషంలో), లూకాస్ మెండెజ్ (46వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. భారత డిఫెండర్ల తప్పిదంతో ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే కెప్టెన్ మాటియాస్ రే అర్జెంటీనా ఖాతా తెరిచాడు. హర్మన్‌ప్రీత్ గోల్‌తో టీమిండియా స్కోరు సమం చేసినా... మన రక్షణ పంక్తి పదే పదే తప్పిదాలకు పాల్పడటంతో అర్జెంటీనా దూకుడు పెంచగలిగింది. ఆఖర్లో పెనాల్టీ కార్నర్ రూపంలో స్కోరు సమం చేసే అవకాశం వచి్చనా... మనవాళ్లు దాన్ని గోల్‌గా మలచలేకపోయారు. గురువారం మరోసారి అర్జెంటీనాతో భారత్ తలపడనుంది. భారత్‌కు రెండో విజయంఆంట్వర్ప్ (బెల్జియం): యూరోప్ పర్యటనలో భారత జూనియర్ మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య బెల్జియంపై విజయం సాధించిన భారత అమ్మాయిలు... బుధవారం రెండో మ్యాచ్‌లో 2–1 గోల్స్ తేడాతో మరో సారి బెల్జియంపై గెలుపొందారు. భారత్ తరఫున లాల్థాట్లుయాంగి (35వ నిమిషంలో), గీతా యాదవ్ (50వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. బెల్జియం తరఫున్ వాన్ హెల్మోంట్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది. ఈ పర్యటనలో గురువారం భారత్ జట్టు చివరి మ్యాచ్ ఆడనుంది. -
యువ భారత్ ‘హ్యాట్రిక్’
రొసారియో (అర్జెంటీనా): నాలుగు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన యువ భారత్... ఆతిథ్య అర్జెంటీనాతో జరిగిన హోరాహోరీ పోరులో షూటౌట్లో విజయం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 1–1 గోల్స్‌తో సమం కాగా... అనంతరం విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన షూటౌట్లో భారత్ 2–0తో గెలుపొందింది. మ్యాచ్‌లో భారత్ తరఫున కనిక (44వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా... అర్జెంటీనా తరఫున మిలాగ్రోస్ డెల్ వాలె (10వ నిమిషంలో) ఒక గోల్ చేసింది. అర్జెంటీనా జట్టు తొలి క్వార్టర్‌లోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా... మూడో క్వార్టర్లో కనిక గోల్‌తో భారత్ స్కోర్లు సమం చేయగలిగింది. షూటౌట్లో భారత్ తరఫున లాల్రిన్పుయి, లాల్థన్ట్లుంగి విజయవంతం అయ్యారు. యువ భారత జట్టు కెప్టెన్ నిధి గోల్‌కీపర్‌గా అర్జెంటీనా ప్లేయర్ల దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడంతో భారర్లీ టోర్నమెంట్లో వరుసగా మూడో విజయం నమోదు చేసుకుంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం చిలీతో భారత్ తలపడుతుంది. -
నిధి నాయకత్వంలో...
బెంగళూరు: ఈ ఏడాది డిసెంబర్లో జరిగే మహిళల జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా భారత జట్టు ఈ నెలలో నాలుగు దేశాల టోర్నీలో పోటీపడనుంది. అర్జెంటీనాలోని రొసారియా నగరంలో ఈనెల 25 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వే జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో ఆడనున్న భారత జట్టును శనివారం హాకీ ఇండియా ప్రకటించింది. 24 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు గోల్‌కీపర్ నిధి నాయకత్వం వహిస్తుంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను మే 25న చిలీతో ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా వరుసగా ఉరుగ్వేతో (మే 26న), అర్జెంటీనాతో (మే 28న), చిలీతో (మే 30న), ఉరుగ్వేతో (జూన్ 1న), అర్జెంటీనాతో (జూన్ 2న) తలపడతుంది. ‘ఈ టోర్నీ ద్వారా మా అత్యుత్తమ క్రీడాకారిణులు ఎవరో గుర్తిస్తాము. మరో ఆరు నెలల్లో జూనియర్ ప్రపంచకప్ జరగనుంది. తాజా టోర్నీ మన అమ్మాయలకు అంతర్జాతీయ అనుభవం కలిపిస్తుంది’ అని భారత జూనియర్ జట్టు కోచ్ తుషార్ ఖాండ్కర్ తెలిపారు. భారత జూనియర్ మహిళల హాకీ జట్టు: నిధి (కెప్టెన్, గోల్‌కీపర్), ఏంజిల్ హర్షరాణి మింజ్ (గోల్‌కీపర్), మమితా ఓరమ్, లాల్తట్లుయాంగి, మనీషా, పూజా సాహూ, పార్వతి టొప్నో, నందిని, సాక్షి శుక్లా (డిఫెండర్లు), ప్రియాంక యాదవ్, అనీషా సాహూ, రజని కెర్కెట్టా, బినిమా ధన్, ఖైడెమ్ షిలీమా చాను, సంజన హోరో, సుప్రియా కుజుర్, ప్రియాంక డోగ్రా (మిడ్ ఫీల్డర్లు), హీనా బానో, సోనమ్, సుఖ్వీర్ కౌర్, గీతా యాదవ్, లాల్రిన్పుయ్, కనిక సివాచ్, కర్మన్ప్రీత్ కౌర్ (ఫార్వర్డ్లు). స్టాండ్‌బై: విద్యశ్రీ, హుదా ఖాన్, ముని్మని దాస్, సెలెస్టినా హోరో. -
అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
బ్యూనోస్ ఎయిర్స్: అర్జెంటీనాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనాలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4గా నమోదైంది. దాంతో చిలీ, అర్జెంటీనా, దక్షిణ అమెరికా తీరాలను భూకంపం కుదిపేసింది. మరో రెండు భూప్రకంపనలు కూడా నమోదయ్యాయి. ఫలితంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.దక్షిణ అర్జెంటీనాలోని ఉషుయాకు దక్షిణంగా 219 కి.మీ దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్ వద్ద ఉదయం 9 సమయంలో ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. చిలీ తీరంలోని కొన్ని ప్రాంతాలను సాధారణ అలల స్థాయి కంటే 3 నుండి 10 అడుగుల ఎత్తులో అలలు తాకవచ్చని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఒక మీటర్ ఎత్తు వరకు చిన్న అలలు కూడా అంటార్కిటికా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపే అవకాశం ఉందని పేర్కొంది. -
అటు అర్జెంటీనా ఇటు ఇరాన్
బ్యూనస్ ఎయిర్స్: తమ కెప్టెన్... దిగ్గజ ప్లేయర్ లయోనల్ మెస్సీ లేకపోయినా... అర్జెంటీనా జోరు తగ్గించలేదు. ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టును అలవోకగా ఓడించిన అర్జెంటీనా దర్జాగా ప్రపంచకప్ టోర్నమెంట్‌కు 19వసారి అర్హత సాధించింది. దక్షిణ అమెరికా జోన్ నుంచి ప్రపంచకప్ టోర్నీకి ఆరు జట్లకు నేరుగా అర్హత పొందే అవకాశం ఉంది. తొలి బెర్త్‌ను డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు సొంతం చేసుకుంది. వాస్తవానికి బ్రెజిల్ జట్టుతో మ్యాచ్‌కు ముందే అర్జెంటీనాకు వరల్డ్‌కప్ బెర్త్ ఖరారైంది. ఉరుగ్వే జట్టుతో మ్యాచ్‌ను బొలీవియా జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకోవడంతో అర్జెంటీనాకు ప్రపంచకప్ బెర్త్ లభించింది. ఫలితంతో సంబంధం లేకుండా వరల్డ్‌కప్ బెర్త్ దక్కడంతో... బ్రెజిల్‌తో జరిగిన పోరులో అర్జెంటీనా అదరగొట్టింది. మెస్సీ గైర్హాజరీలో నికోలస్ ఒటామెండీ సారథ్యంలో బరిలోకి దిగిన అర్జెంటీనా 4–1 గోల్స్ తేడాతో బ్రెజిల్‌ను చిత్తుగా ఓడించింది. అర్జెంటీనా తరఫున జూలియన్ అల్వారెజ్ (4వ నిమిషంలో), ఎంజో ఫెర్నాండెజ్ (12వ నిమిషంలో), అలెక్సిస్ మాక్ అలిస్టర్ (37వ నిమిషంలో), గిలియానో సిమోన్ (71వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బ్రెజిల్ జట్టుకు మాథ్యూస్ కున్హా (26వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. దక్షిణ అమెరికా జోన్ నుంచి మొత్తం 10 జట్లు (అర్జెంటీనా, ఈక్వెడార్, ఉరుగ్వే, బ్రెజిల్, పరాగ్వే, కొలంబియా, వెనిజులా, బొలీవియా, పెరూ, చిలీ) డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది.ఇప్పటి వరకు 14 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అర్జెంటీనా 31 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో ఐదు బెర్త్‌లు ఖరారు కావాల్సి ఉన్నాయి. ఏడో స్థానంలో నిలిచిన జట్టుకు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్ ద్వారా ప్రపంచకప్‌కు అర్హత పొందే అవకాశం లభిస్తుంది. ఇరాన్ వరుసగా నాలుగోసారి... మరోవైపు ఆసియా జోన్ నుంచి ఇరాన్ జట్టు వరుసగా నాలుగోసారి ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఉజ్బెకిస్తాన్ జట్టుతో జరిగిన మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ను ఇరాన్ జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. 1978లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన ఇరాన్ ఆ తర్వాత 1998లో రెండోసారి ఈ మెగా ఈవెంట్లో పోటీపడింది. 2006లో మూడోసారి ప్రపంచకప్‌లో ఆడిన ఇరాన్ 2010లో జరిగిన ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. 2014లో నాలుగోసారి వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన ఇరాన్ ఆ తర్వాత 2018లో, 2022లోనూ పోటీపడింది. ఈసారి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఓవరాల్‌గా ఏడోసారి ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 2026 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలిసారి 48 జట్లు ప్రపంచకప్‌లో ఆడనున్నాయి. ఆసియా నుంచి 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్ టోర్నీ ద్వారా మరో జట్టుకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మూడు (అమెరికా, కెనడా, మెక్సికో) ఆతిథ్య దేశాలతోపాటు జపాన్, ఇరాన్, న్యూజిలాండ్, అర్జెంటీనా జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత పొందాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీతో క్వాలిఫయింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.19 ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటి వరకు అర్జెంటీనా 19 సార్లు అర్హత సాధించింది. మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. మరో మూడుసార్లు (1930, 1990, 2014) ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఐదుసార్లు క్వార్టర్ ఫైనల్లో... నాలుగుసార్లు గ్రూప్ దశలో... మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. -
మెస్సీ సారథ్యంలో...
బ్యూనస్ఎయిర్స్: దక్షిణ అమెరికా జోన్ ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో 13వ రౌండ్ మ్యాచ్‌ల కోసం 33 మంది ఆటగాళ్లతో అర్జెంటీనా ప్రాథమిక జాబితాను ప్రకటించింది. స్టార్ ప్లేయర్ లయనెల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా బరిలోకి దిగుతుంది. ఈనెల 21న మాంటెవీడియోలో ఉరుగ్వే జట్టుతో... ఈనెల 25న బ్యూనస్ ఎయిర్స్లో బ్రెజిల్ జట్టుతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా తలపడుతుంది. 2026 ప్రపంచకప్ టోర్నికి కెనడా, మెక్సికో, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2026 జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరిగే ఈ మెగా టోర్నిలో తొలిసారి 48 జట్లు పోటీపడుతున్నాయి. దక్షిణ అమెరికా జోన్లో 10 దేశాలు క్వాలిఫయింగ్‌లో బరిలో ఉన్నాయి. ఇప్పటికే 12 రౌండ్లు ముగిశాయి. నిర్ణిత 18 రౌండ్ల తర్వాత టాప్–6లో నిలిచిన జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం అర్జెంటీనా, ఉరుగ్వే, ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్, పరాగ్వే జట్లు టాప్–6లో ఉన్నాయి. ఏడో స్థానంలో నిలిచిన జట్టు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్ ఆడుతుంది. ఖతర్ ఆతిథ్యమిచ్చిన 2022 ప్రపంచకప్‌లో మెస్సీ కెపె్టన్సీలో అర్జెంటీనా జట్టు 1986 తర్వాత మళ్లీ జగజ్జేతగా నిలిచింది. -
రక్తపుటేరు
అర్జెంటీనాలో ఓ కాలువ ఏకంగా ఎరుపు రంగులోకి మారింది. రాజధాని బ్యూనస్ ఎయిర్ష్ సమీపంలో ఉన్న అవెల్లెనెడా మున్సిపాలిటీలోని సరండ్ కాల్వ ఒక్కసారిగా రంగు మారడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందంటే అర్జెంటీనా, ఉరుగ్వే మధ్య రియో డి లా ప్లాటాలోకి ప్రవహించే జలమార్గంలో స్థానిక తోలు, వస్త్ర పరిశ్రమలు విపరీతంగా రంగులు, రసాయన వ్యర్థాలను వదులుతున్నాయి. దాంతో కాల్వ ఎప్పుడూ పసుపు రంగులో కనిపిస్తూ యాసిడ్ వాసనలు వస్తుంటుంది. అలాంటిది గురువారం అవెల్లెనెడా వాసులు నిద్రలేచే సరికి అది ఉన్నట్టుండి రక్త వర్ణంలోకి మారి భయంకరంగా కనిపించడమే గాక తీవ్ర దుర్గంధం వెదజల్లింది. ఆ విపరీతమైన దుర్వాసనకే ఉలిక్కిపడి లేచామని చాలామంది వాపోయారు. కాలుష్యంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారంటున్నారు. అర్జెంటీనా పర్యావరణ శాఖ దీనిపై స్పందించింది. రంగు మార్పుకు కారణాలను గుర్తించడానికి కాల్వ నుంచి నీటి నమూనాలను సేకరించింది. సమీప ఫ్యాక్టరీ నుంచి రంగు లీకవడం వల్లే కాల్వ నీళ్లు ఎర్నగా మారాయని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచంలో తొలి జన్యుమార్పిడి అశ్వం
బ్యూనస్ ఎయిర్స్: ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన గుర్రాన్ని అర్జెంటీనాలో సృష్టించారు. అర్జెంటీనాలో ఎన్నో అవార్డ్లు గెల్చుకున్న ఆడ పోలో ప్యూరేఝా అనే గుర్రం నుంచి తీసుకున్న జన్యువులకు కొద్దిపాటి మార్పులు చేసి ఈ కొత్త అశ్వాలను సృష్టించారు. శాస్త్రవేత్తలు క్రిస్పర్–క్యాస్9 విధానాన్ని అవలంభించి పుట్టబోయే గుర్రం మరింత వేగంగా పరిగెత్తేందుకు ఉపకరించేలా ఫ్యూరేఝా జన్యువుల్లో మార్పులు చేశారు. గత ఏడాది అక్టోబర్, నవంబర్‌లో ఇలా ఐదు అశ్వాలు జన్మించినా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.గుర్రాలపై పరుగెత్తుతూ ఆడే పోలో ఆటలో వినియోగించే అశ్వాల జాతికి చెందిన ఈ పోలో ప్యూరేఝా ఇప్పటికే ‘‘అర్జెంటీనా అసోసియేషన్ ఆఫ్ పోలో హార్స్ బ్రీడర్స్ హాల్ ఆఫ్ ఫేమ్’’లో చోటు దక్కించుకుంది. ఇది 1998 అర్జెంటీనా ఓపెన్‌లో ఉత్తమ గుర్రంగా అవార్డ్ గెలుపొందింది. మరింత మేలైన జాతి గుర్రాల సృష్టే లక్ష్యంగా అర్జెంటీనాకు చెందిన దిగ్గజ ‘‘కెయిరాన్ ఎస్ఏ’’బయోటెక్నాలజీ సంస్థ ఈ కొత్త గుర్రాలను సృష్టించింది. కెయిరాన్ సంస్థ గతంలోనూ క్లోనింగ్ చేసిన ఘనత సాధించింది. మూలకణాలనూ వినియోగించింది. ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుమార్పిడి పిండాలనూ సృష్టించింది. -
తిరుగులేని అర్జెంటీనా
జ్యూరిక్: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) పురుషుల టీమ్ ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా జట్టు వరుసగా రెండో ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు 1867.25 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. ఈ ఏడాది అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్ టైటిల్ సాధించింది.ఇక ర్యాంకింగ్స్‌లో ఫ్రాన్స్ రెండో స్థానంలో, స్పెయిన్ మూడో స్థానంలో ఉన్నాయి. గత నవంబర్‌లో విడుదల చేసిన ర్యాంకింగ్స్ నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో తక్కువ మ్యాచ్‌లు జరగడంతో ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేవు.ఇందులో ఇంగ్లండ్, బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ, జర్మనీ వరుసగా నాలుగు నుంచి 10వ ర్యాంక్ వరకు కొనసాగుతున్నాయి.ఈ ఏడాది అన్ని జట్లకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అంగోలా జట్టు 32 స్థానాలు ఎగబాకి 85వ ర్యాంక్‌లో నిలిచింది. భారత జట్టు ఒక స్థానం మెరుగుపర్చుకొని 126వ ర్యాంక్‌లో ఉంది. తదుపరి ర్యాంకింగ్స్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేస్తారు. -
అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత.. డబుల్ హ్యాట్రిక్
అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ సబ్ రీజియనల్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా కేమెన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా పేస్ బౌలర్ హెర్నన్ ఫెన్నెల్ ఈ ఫీట్ సాధించాడు. ఫెన్నెల్.. కేమెన్ ఐలాండ్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన ఆరో బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.ఫెన్నెల్‌కు ముందు రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్) vs ఐర్లాండ్, 2019లసిత్ మలింగ (శ్రీలంక) vs న్యూజిలాండ్, 2019కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్) vs నెదర్లాండ్స్, 2021జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) vs ఇంగ్లాండ్, 2022వసీమ్ యాకూబ్ర్ (లెసోతో) vs మాలి, 2024 ఈ ఘనత సాధించారు.కేమెన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ సహా మొత్తం ఐదు వికెట్లు (5/14) తీశాడు. ట్రాయ్ టేలర్, అలిస్టర్ ఐఫిల్, రొనాల్డ్ ఈబ్యాంక్స్, అలెస్సాండ్రో మోరిస్ ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ బాధితులు.అంతర్జాతీయ టీ20ల్లో ఫెన్నెల్‌కు ఇది రెండో హ్యాట్రిక్ కావడం మరో విశేషం. 36 ఏళ్ల ఫెన్నెల్ 2021లో పనామాతో జరిగిన మ్యాచ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఫెన్నెల్.. అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్‌లు నమోదు చేసిన ఆరో బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.ఫెన్నెల్‌కు ముందు మాల్టాకు చెందిన వసీం అబ్బాస్,ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్సెర్బియాకు చెందిన మార్క్ పావ్లోవిక్న్యూజిలాండ్కు చెందిన టిమ్ సౌథీశ్రీలంకకు చెందిన లసిత్ మలింగ అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. -
యువ సంగీత కెరటం లియాం పెనీ హఠాన్మరణం
బ్యూనస్ ఎయిర్(అర్జెంటీనా): బ్రిటన్ సంగీత సంచలనం, పాప్ గాయకుడు, గేయ రచయిత 31 ఏళ్ల లియాం పెనీ కన్నుమూశారు. బుధవారం సాయంత్రం అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్ సిటీలోని ఒక విలాసవంత హోటల్ మూడో అంతస్థు బాల్కనీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మద్యం, మత్తుపదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల హోటల్ గది అంతా చిందరవందర చేసి కిందపడి చనిపోయారని వార్తలొచ్చాయి. పోస్ట్‌మార్టమ్ నివేదిక తర్వాతే మరణానికి కారణాలు తెలిసే వీలుంది. ఆయన బస చేసిన కాసాసర్ హోటల్ గదిలో మద్యంతోపాటు బెంజోడైజీపైన్ అనే ఔషధంను కనుగొన్నారు. బెంజోడైజీపైన్ను ఉద్రేకాన్ని తగ్గించేందుకు, మూర్ఛ, నరాల సంబంధ చికిత్సల్లో వాడతారు. పెనీ తన గది బాల్కనీ నుంచి దూకి ఉంటారని నగర భద్రతా మంత్రి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పాబ్లో పోలీసీచియో మీడియాతో చెప్పారు. 14 ఏళ్లకే సంచలనం 2010లో బ్రిటన్ ప్రఖ్యాత టాలెంట్ రియాలిటీ షో ‘ది ఎక్స్ ఫ్యాక్టర్’లో 14 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టి అద్భుతంగా పాటి అందరి మనసుల్ని గెల్చుకున్నాడు. మరో నలుగురితో కలిసి ‘వన్ డైరెక్షన్’పేరిట బాయ్బ్యాండ్ను నెలకొల్పాడు. ఈ బ్యాండ్ నుంచి వెలువడిన పాటలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. 7 కోట్ల ‘రికార్డ్’లు అమ్ముడుపోయాయి. 2016లో బ్యాండ్ నుంచి విడిపోయాక సోలోగా కెరీర్‌ను మొదలుపెట్టి సంచలనాలు సృష్టించారు. ఈయన చేసిన సంగీత విభావరిలు సైతం పెద్ద హిట్ అయ్యా యి. సొంత ఆల్బమ్స్ లక్షల్లో అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో వీటిని దాదాపు 390 కోట్ల సార్లు చూశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే మద్యపానంతో ఇబ్బంది పడుతున్నట్లు గతంలో పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. గత ఏడాది మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఒక ‘టియర్‌డ్రాప్స్’ పాట అందర్నీ నిరాశపరిచింది. -
మెస్సీ మ్యాజిక్...
బ్యూనస్ ఎయిర్స్: డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు 2026 ప్రపంచకప్ దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఏడో విజయం నమోదు చేసింది. బొలీవియా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 6–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. చీలమండ గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. మొత్తం 90 నిమిషాలు ఆడిన 37 ఏళ్ల మెస్సీ తన అద్భుతమైన ఆటతీరుతో అభిమానులను అలరించాడు.మూడు గోల్స్‌తో మెరిసిన మెస్సీ (19వ, 84వ, 86వ నిమిషాల్లో) సహచరులు లా మారి్టనెజ్ (43వ నిమిషంలో), జూలియన్ అల్వారెజ్ (45+3వ నిమిషంలో) గోల్స్ చేసేందుకు సహాయపడ్డాడు. మెస్సీ అందించిన పాస్‌లతో మారి్టనెజ్, అల్వారెజ్ గోల్స్ సాధించారు. అర్జెంటీనా తరఫున అల్మాదా (69వ నిమిషంలో) మరో గోల్ చేశాడు. మరో మ్యాచ్‌లో మాజీ విశ్వవిజేత బ్రెజిల్ 4–0 గోల్స్‌తో పెరూ జట్టును ఓడించింది. ఉరుగ్వే–ఈక్వెడార్ మ్యాచ్ 0–0తో ‘డ్రా’కాగా... పరాగ్వే 2–1తో వెనిజులాపై, కొలంబియా 4–0తో చిలీ జట్టుపై విజయం సాధించాయి. దక్షిణ అమెరికాకు చెందిన 10 దేశాలు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీపడుతున్న ఈ టోరీ్నలో అన్ని జట్లు 10 మ్యాచ్‌ల చొప్పున ఆడాయి. నిరీ్ణత 18 మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్–6లో నిలిచిన జట్లు 2026 ప్రపంచకప్ టోరీ్నకి నేరుగా అర్హత సాధిస్తాయి. 2026 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోరీ్నకి కెనడా, అమెరికా, మెక్సికో దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్నాయి. -
WC Qualifiers: కొలంబియా సంచలనం.. అర్జెంటీనాకు షాక్
బొగోటా (కొలంబియా): ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టుకు 2026 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో షాక్ తగిలింది. 2022లో విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా... దక్షిణ అమెరికా వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో కొలంబియా చేతిలో ఓడింది. బుధవారం జరిగిన పోరులో కొలంబియా 2–1 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై గెలిచింది. కొలంబియా తరఫున యెర్సన్ మస్క్యూరా (25వ నిమిషంలో), జేమ్స్ రోడ్రిగ్జ్ (60వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... అర్జెంటీనా తరఫున నికోలస్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. అర్జెంటీనా స్టార్ స్ట్రయికర్ మెస్సీ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఈ అర్హత టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి అర్జెంటీనా 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ టోరీ్నలో తొలి 6 స్థానాల్లో నిలిచిన జట్లు 2026 ప్రపంచకప్ నకు అర్హత సాధించనున్నాయి. -
మెస్సీ లేకుండానే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ బరిలో ఆర్జెంటీనా
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్, 2022 ప్రపంచకప్ విజయసారథి లయోనల్ మెస్సీ గాయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు దూరమయ్యాడు. వచ్చేనెలలో రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తలపడే అర్జెంటీనా జట్టును కోచ్ లయోనల్ స్కాలొని మంగళవారం ప్రకటించారు. మొత్తం 28 మంది సభ్యులతో క్వాలిఫయింగ్ పోటీలకు అర్జెంటీనా జట్టు సిద్ధమైంది. అయితే 37 ఏళ్ల మెస్సీ కుడి కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను... సెప్టెంబర్ 5న చిలీతో, 10న కొలంబియాతో జరిగే రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రపంచకప్ చాంపియన్ అర్జెంటీనా దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ రౌండ్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన అర్జెంటీనా ఖాతాలో 15 పాయింట్లున్నాయి. -
50 శాతం వడ్డీ ఉన్న దేశం (ఫొటోలు)
-
‘డ్రా’తో గట్టెక్కిన భారత్
పారిస్: ఓటమి అంచుల్లో నుంచి భారత పురుషుల హాకీ జట్టు గట్టెక్కి ‘డ్రా’తో ఊపిరి పీల్చుకుంది. సోమవారం జరిగిన పూల్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో మాజీ ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట 22వ నిమిషంలో లుకాస్ మార్టినెజ్ గోల్‌తో అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 36వ నిమిషంలో తమ ఆధిక్యాన్ని 2–0కు పెంచుకునే అవకాశం అర్జెంటీనాకు వచ్చిం ది. కానీ పెనాల్టీ స్ట్రోక్‌ను మైసో కసెల్లా వృథా చేశాడు. స్కోరును సమం చేసేందుకు భారత్ శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. నిలకడగా పెనాల్టీ కార్నర్లు సంపాదించింది. కానీ వాటిని లక్ష్యానికి చేర్చడంలో విఫలమైంది. అయితే మరో నిమిషంలో ముగుస్తుందనగా భారత్‌కు 59వ నిమిషంలో తొమ్మిదో పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ పెనాల్టీ కార్నర్‌ను కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి స్కోరును సమం చేయడంతోపాటు భారత జట్టును ఓటమి నుంచి కాపాడాడు. నేడు జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో భారత్ ఆడుతుంది. నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్హాకీ పురుషుల పూల్ ‘బి’ మ్యాచ్: భారత్ X ఐర్లాండ్ (సాయంత్రం గం. 4:45 నుంచి). ఆర్చరీ మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: అంకిత భకత్ X వియోలెటా (పోలాండ్) (సాయంత్రం గం. 5:15 నుంచి), భజన్ కౌర్ X సిఫా (ఇండోనేసియా) (సాయంత్రం గం. 5:30 నుంచి). పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: బొమ్మదేవర ధీరజ్ X ఆడమ్ లీ (చెక్ రిపబ్లిక్) (రాత్రి గం. 10:45 నుంచి). బాక్సింగ్ పురుషుల 51 కేజీల ప్రిక్వార్టర్స్: అమిత్ పంఘాల్ X పాట్రిక్ చిన్యెంబా (జింబాబ్వే) (రాత్రి గం. 7:15 నుంచి). మహిళల 57 కేజీల మ్యాచ్: జైస్మిన్ లంబోరియా X నెస్థీ పెటెసియా (ఫిలిప్పీన్స్) (రాత్రి గం. 9:25 నుంచి). మహిళల 54 కేజీల ప్రిక్వార్టర్స్: ప్రీతి పవార్ X యెని మెర్సెలా (కొలంబియా) (అర్ధరాత్రి గం. 1.20 నుంచి). బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ మ్యాచ్: సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి X అలి్ఫయన్ ఫజర్–మహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) (సాయంత్రం గం. 5:30 నుంచి). మహిళల డబుల్స్ గ్రూప్ మ్యాచ్: అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో X సెట్యానా మాపసా–ఏంజెలా యూ (ఆ్రస్టేలియా) (సాయంత్రం గం. 6:20 నుంచి). షూటింగ్ ట్రాప్ పురుషుల క్వాలిఫికేషన్: పృథీ్వరాజ్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). ట్రాప్ మహిళల క్వాలిఫికేషన్: శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరు: భారత్ (మనూ భాకర్–సరబ్జోత్ సింగ్) ్ఠ దక్షిణ కొరియా (జిన్ ఓయె–లీ వన్హో) (మధ్యాహ్నం గం. 1:00 నుంచి). -
అర్జెంటీనాకు షాక్
సెయింట్ ఎటిన్ (ఫ్రాన్స్): పారిస్ ఒలింపిక్స్ అధికారికంగా శుక్రవారం మొదలు కావాల్సినా... ఫుట్‌బాల్, రగ్బీ సెవెన్స్ క్రీడాంశాల్లో బుధవారం పోటీలు ప్రారంభమయ్యాయి. పురుషుల ఫుట్‌బాల్ ఈవెంట్ సంచలనంతో ఆరంభమైంది. రెండుసార్లు స్వర్ణ పతక విజేత అర్జెంటీనా తొలి లీగ్ మ్యాచ్‌లో 1–2తో మొరాకో చేతిలో ఓడిపోయింది. ఇంజ్యూరీ టైమ్‌లో అర్జెంటీనా చేసిన గోల్‌ను ముందుగా రిఫరీ అనుమతించడంతో స్కోరు 2–2 తో సమమైంది. అయితే రిఫరీ నిర్ణయంతో ఆగ్రహించిన అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరేశారు. దాంతో రెండు గంటలపాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి వచ్చాక ఆటను కొనసాగించారు. అర్జెంటీనా రెండో గోల్‌ను టీవీ రీప్లేలో పరిశీలించి ఆఫ్ సైడ్‌గా పరిగణించి గోల్ ఇవ్వలేదు. దాంతో మొరాకో 2–1తో గెలిచింది. -
కోపా కప్ విజేతగా అర్జెంటీనా.. లియోనెల్ మెస్సీ వరల్డ్ రికార్డు
కోపా అమెరికా కప్-2024 ఛాంపియన్స్‌గా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్లో 1-0 తేడాతో కొలంబియాను ఓడించిన అర్జెంటీనా వరుసగా రెండో సారి కోపా అమెరికా కప్ విజేతగా నిలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ స్ట్రైకర్ లౌటారో సంచలన గోల్‌తో అర్జెంటీనాను ఛాంపియన్స్‌గా నిలిపాడు. కాగా ఇది అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీకి వరుసగా మూడో అంతర్జాతీయ ట్రోఫీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా మెస్సీకి తన కెరీర్లో ఇది 45వ ట్రోఫీ. ఈ క్రమంలో మెస్సీ ఓ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్‌లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం డాని అల్వెస్(44) పేరిట ఉండేది. తాజా విజయంతో అల్వెస్ ఆల్‌టైమ్ రికార్డును మెస్సీ బ్రేక్ చేశాడు. మెస్సీ కెరీర్లో ఫిఫా వరల్డ్ కప్ టైటిల్, రెండు కోపా అమెరికా టైటిల్స్, ఫైనలిసిమా ట్రోఫీ, 39 క్లబ్ టైటిల్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం బార్సిలోనా క్లబ్ నుంచి వచ్చినవే కావడం గమనార్హం. కాగా మెస్సీకి ఇదే ఆఖరి కోపా అమెరికా ఫుట్‌బాల్ కప్. అయితే ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ గాయపడ్డాడు.దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి మెస్సీ వైదొలిగాడు. ఈ క్రమంలో డగౌట్లో మెస్సీ కన్నీటి పర్యంతమయ్యాడు. మెస్సీ మైదానంలో లేనప్పటకి తన సహచరులు మాత్రం అద్భుత విజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. 🇦🇷 Lionel Messi, most decorated player with 45 titles including one more Copa América from tonight! ✨ pic.twitter.com/SXwpgGBesh— Fabrizio Romano (@FabrizioRomano) July 15, 2024 -
కోపా అమెరికా కప్ విజేతగా అర్జెంటీనా.. మెస్సీకి గిఫ్ట్
కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీ-2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా.. 16వ సారి కోపా అమెరికా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్ ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగింది. నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 30 నిమిషాలు ఆదనపు సమయం కేటాయించారు. ఎక్స్ట్రా సమయం కూడా ముగుస్తుండడంతో ఈ మ్యాచ్ పెనాల్టీ షుట్ అవుట్‌కు దారి తీస్తుందని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో అర్జెంటీనా సబ్‌స్టిట్యూట్ స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ అద్భుతం చేశాడు. 112వ నిమిషంలో గోల్ కొట్టిన మార్టినెజ్.. తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మిగిలిన 8 నిమిషాల్లో కొలంబియా గోల్ సాధించకపోవడంతో అర్జెంటీనా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.🏆🇦🇷 ARGENTINA ARE COPA AMÉRICA CHAMPIONS!Argentina have beaten Colombia 1-0 thanks to Lautaro Martínez’s goal.🏆 Copa America 2021🏆 Finalissima 2022🏆 World Cup 2022🏆 Copa America 2024Insane job by this group of players and Lionel Scaloni. 👏🏻✨ pic.twitter.com/v0GOvHv9PS— Fabrizio Romano (@FabrizioRomano) July 15, 2024 కాగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ఇదే ఆఖరి కోపా అమెరికా కప్ కావడం గమనార్హం. దీంతో అతడికి తన సహచరులు అద్భుతమైన విజయంతో విడ్కోలు పలికారు. ఈ మ్యాచ్‌లో గాయపడిన మెస్సీ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం కన్నీరు పెట్టుకున్నాడు. అయితే ఇప్ప్పుడు తన జట్టు విజయం సాధించడంతో మెస్సీఆనందంలో మునిగి తేలుతున్నాడు. Angel di Maria unsung hero of the match Played his last game in Argentina hersey what a player #ARGvsCOL pic.twitter.com/hnu42h3ekZ— Harshit 🇮🇳 (@krharshit771) July 15, 2024 -
#Lionel Messi: వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సీ.. వీడియో వైరల్
Update: కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీ-2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా.. 16వ సారి కోపా అమెరికా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ కన్నీరు పెట్టుకున్నాడు. కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా కొలంబియాతో జరుగుతున్న ఫైనల్లో మెస్సీ గాయపడ్డాడు. మ్యాచ్ 36వ నిమిషంలో మెస్సీ చీలమండ(పాదం)కు గాయమైంది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో మైదానంలో కింద పడిపోయాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. కొంచెం కూడా ఉపశమనం లభించలేదు. అయినప్పటకి మెస్సీ మైదానాన్ని వీడకుండా తన ఆటను కొనసాగించాడు. మ్యాచ్ హాఫ్-టైమ్ తర్వాత కూడా స్కోర్లేకుండా పోవడంతో తీవ్రమైన నొప్పిని భరిస్తూనే మెస్సీ తన కంటిన్యూ చేశాడు. అయితే నొప్పి మరింత తీవ్రం కావడంతో మ్యాచ్ 66వ నిమిషంలో మెస్సీ గాయం కారణంగా మైదానం నుండి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో డగౌట్లో కూర్చోన్న మెస్సీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కెరీర్లో చివరి కోపా అమెరికా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతున్న ఈ అర్జెంటీనా స్టార్ వెక్కి వెక్కి ఏడ్చాడు. అయితే అభిమానులు మాత్రం అతడికి మద్దతుగా నిలిచారు. మెస్సీ, మెస్సీ అంటూ జేజేలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి.ప్రస్తుతం 25 నిమిషాలు ఎక్స్ట్రా సమయం కేటాయించారు. అదనపు సమయంలో 15 నిమిషాలు ముగిసినప్పటకి ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యా. ఆఖరి 10 నిమిషాల్లో గోల్స్ రాకపోతే ఈ మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూట్ అవుట్లో తేల్చే అవకాశముంది. Messi is in tears as he is subbed off due to injury 💔 pic.twitter.com/t0l3OLLuWf— FOX Soccer (@FOXSoccer) July 15, 2024 -
ఫుట్‌బాల్ జోష్
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను గంటల వ్యవధిలో రెండు ఆసక్తికర సమరాలు అలరించబోతున్నాయి. జర్మనీలోని బెర్లిన్ వేదికగా జరిగే యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్, స్పెయిన్ తలపడనున్నాయి. స్పెయిన్ గతంలో మూడు సార్లు విజేతగా నిలవగా...ఇంగ్లండ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. మరో వైపు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగే కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనాను కొలంబియా ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో అర్జెంటీనా ఏకంగా 15 సార్లు టైటిల్ నెగ్గగా...కొలంబియా ఒక సారి ట్రోఫీని సొంతం చేసుకుంది. -
హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అర్జెంటీనా
అర్జెంటీనా తాజాగా హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాటు దాని ఆర్థిక మూలాలను జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో తమ దేశ సంబంధాలను బలోపేతం చేసేదిశగా యోచిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మెయిలీ ఈ విధమైన ప్రకటన చేశారు.గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో పాలస్తీనా గ్రూపు జరిపిన దాడిని అర్జెంటీనా ఖండించింది. ఇజ్రాయెల్ 76 ఏళ్ల చరిత్రలో ఈ దాడి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఆర్జెంటీనా దేశంలోని యూదులు ఉంటున్న ప్రాంతాలపై హమాస్ ఉగ్రదాడులు చేసిందని, ఈ సంస్థకు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని అర్జెంటీనా ఆరోపించింది.ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తరచూ హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. గాజాలో జరిగిన ఈ దాడుల్లో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. హమాస్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఇక్కడి ప్రజలను ఊచకోత కోస్తున్నది ఆరోపించారు. తూర్పు గాజా నగరంలోని వేలాది మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ దళాలు పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకు తరిమికొట్టాయని, అయితే వారు అక్కడికి రాగానే వారిపై కాల్పులు జరిపారని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ అల్ తౌబ్తా పేర్కొన్నారు.పాలస్తీనియన్లంతా గాజా సిటీని ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని ఇటీవల ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశించింది. ఇజ్రాయెల్ దళాలు గాజా నగరంలో హెచ్చరికల కరపత్రాలను జారవిడిచాయి. అక్కడి ప్రజలంతా దక్షిణం వైపుకు వెళ్లాలని దానిలో కోరాయి. -
Copa America: సంచలన విజయం.. ఫైనల్లో కొలంబియా
కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో కొలంబియా సంచలనం సృష్టించింది. సెమీ ఫైనల్లో ఉరుగ్వేను 1-0తో ఓడించింది. తద్వారా ఇరవై మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరింది.పోటాపోటీగా సాగిన ఆట 39వ నిమిషంలో జెఫర్సన్ లెర్మా గోల్ కొట్టి కొలంబియా గెలుపును ఖరారు చేశాడు. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. గాల్లోకి పంచ్‌లు విసురుతూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.అయితే, ఓటమిని జీర్ణించుకోలేని ఉరుగ్వే ఆటగాళ్లు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఉరుగ్వే స్ట్రైకర్ నూనెజ్ సహా మరికొందరు ఆటగాళ్లు.. ప్రేక్షకులు ఉన్న స్టాండ్‌లోకి దూసుకొచ్చి కొలంబియా మద్దతుదారులపై పిడిగుద్దులు కురిపించాడు.దీంతో మ్యాచ్‌కు వేదికైన బ్యాంక్ ఆఫ్ అమెరికా స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాహకులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో 28 విజయాలతో అజేయంగా నిలిచిన కొలంబియా ఫైనల్లో అర్జెంటీనాతో తలపడనుంది. మియామీ వేదికగా ఇరు జట్లు ఆదివారం టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. కాగా 2001లో కొలంబియా తొలిసారి ఈ టోర్నమెంట్లోట్రోఫీ గెలిచింది.30వసారి టైటిల్ పోరుకు అర్హత కాగా వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు 30వసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో లయనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో కెనడా జట్టుపై గెలిచింది.ఆట 22వ నిమిషంలో జూలియన్ అల్వారెజ్ గోల్‌తో అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట 51వ నిమిషంలో మెస్సీ గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అర్జెంటీనా విజయాన్ని ఖరారు చేసుకుంది. అర్జెంటీనా తరఫున మెస్సీకిది 109వ గోల్ కావడం విశేషం. ఇక మెస్సీ 38 వేర్వేరు దేశాలపై గోల్స్ చేశాడు.అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టు తరఫున క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 130 గోల్స్) తర్వాత అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా మెస్సీ ఘనత సాధించాడు.After defeat to Colombia, Uruguayan players entered the stands at Bank of America Stadium and began to throw punches. Liverpool forward Darwin Nunez amongst those at the forefront. pic.twitter.com/VE3unKObSa— Kyle Bonn (@the_bonnfire) July 11, 2024 -
COPA AMERICA CUP 2024: ఫైనల్లో అర్జెంటీనా.. సెమీస్‌లో కెనడాపై విజయం
కోపా అమెరికా కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు.. కెనడాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తొలి అర్ద భాగం 23వ నిమిషంలో అల్వరెజ్.. రెండో అర్ద భాగం 51వ నిమిషంలో మెస్సీ గోల్స్ సాధించారు. రేపు జరుగబోయే రెండో సెమీఫైనల్లో ఉరుగ్వే, కొలంబియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జులై 15న జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
Copa America Cup: అర్జెంటీనా బోణీ.. మెస్సీ అరుదైన రికార్డు
అట్లాంటా: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో కెనడా జట్టును ఓడించింది.అర్జెంటీనా తరఫున జూలియన్ అల్వారెజ్ (49వ ని.లో), లాటారో మార్టినెజ్ (88వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మెస్సీ అందించిన పాస్‌లతో ఈ రెండు గోల్స్ నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా మెస్సీ వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న కోపా అమెరికా కప్‌లో అత్యధికంగా 35 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.ఇప్పటి వరకు ఈ రికార్డు చిలీకి చెందిన సెర్జియో లివింగ్‌స్టోన్ (1941 నుంచి 1953 వరకు; 34 మ్యాచ్‌లు) పేరిట ఉంది. ఈనెల 26న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ చిలీతో అర్జెంటీనా ఆడుతుంది. View this post on Instagram A post shared by CONMEBOL Copa América™ USA 2024 (@copaamericaeng) -
మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల వృద్ధురాలు..!
అందాల పోటీల్లో ఎందరో అతిరథ బ్యూటీలు పాల్గొని సత్తా చాటారు. విజేతలుగా గెలిచిన అందాల భామలు అసలైన అందానికి నిర్వచనం ఏంటో తమదైన శైలిలో వివరించి అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేశారు. ఐతే ఈ పోటీల్లో పాల్గొనడానికి వయసు పరిమితి ఉండేది. అయితే ఓ నిర్ధిష్ట వయసు తర్వాత మఖ్యంగా మహిళలు తరుచుగా నిర్లక్ష్యానికి అవహేళనకు గురవ్వుతుంటారు. చెప్పాలంటే తల్లిగా మారే పరిణామ క్రమంలో వృధ్యాప్యానికి త్వరితగతిన చేరువయ్యేది మహిళలే. దీంతో వారికి గుర్తింపు ఉండదు సమాజంలో. ఆ తరహా ఆలోచనను మార్చి అందానికి అసలైన నిర్వచనం ఇచ్చేలా ఏకంగా 60 ఏళ్ల వయసులో అందాల పోటీల్లో పాల్గొని చరిత్ర సృష్టించనుంది వృద్ధురాలు. ఇంతకీ ఎవరామె అంటే..అర్జెంటినాలో మేలో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 అందాల పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో న్యాయవాది అయిన 60 ఏళ్ల అలెజాండ్రా మారిసో రోడ్రిగ్జ్ పాల్గొని చరిత్ర సృష్టించనుంది. ఆమె గనుక ఈ అర్జెంటినా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 టైటిల్ గెలుచుకుంటే 60 ఏళ్ల వయసులో టైటిల్‌ని గెలుచుకున్న తొలి సీనియర్ సిటిజన్‌గా అలెజాండ్రా రికార్డులకెక్కడమే గాక సెప్టెంబర్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న తొలి సీనియర్ సిటిజన్‌గా కూడా చరిత్ర సృష్టిస్తోంది.స. ప్రసుత్తం ఆమె మేలో జరగనున్న అర్జెంటినా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 పోటీలకు సన్నద్ధమవుతుంది. ఈ టైటిల్‌ని గెలుచుకుంటే అలెజాండ్రా సెప్టెంబర్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో అర్జెంటీనా తరుఫునా ప్రాతినిధ్యం వహించనుంది. ఆమె యువ పోటీదారులకు గట్టి పోటీ ఇచ్చేలా అద్భుతమైన దేహధారుడ్యంతోత్తా చాటనుంది. అంతేగాదు అందాల ప్రపంచంలో ఉన్న మూస పద్ధతులను తిప్పికొట్టి అందానికి వయసుతో సంబంధం ఉండదని ప్రూవ్ చేయనుంది. ఆరోగ్యకరమైన జీవన శైలితో వయసుని కనిపించకుండా చేయగలిగే ప్రతి స్త్రీ గొప్ప అందగత్తేనని చెబుతోంది. ఇక అలెజాండ్రా ఆరోగ్యకరమైన అలవాట్ల తోపాటు కఠిన వ్యాయామ నియమావళిని అనుసరిస్తానని తెలిపింది. అవే తనకు ఈ అందాల పోటీల్లో సహకరిస్తాయని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది అలెజాండ్రా. అలాగే 18 ఏళ్ల వయసులో ఉన్నట్లు దేహ సౌందర్యం ప్రతిమహిళకు వయసు రీత్యా విభిన్నంగా ఉండొచ్చు గానీ అందంగానే ఉంటారని అంటోంది. ఇక్కడ వయసుని అందానికి కొలమానంగా చూడకూడదని నొక్కి చెబుతోంది. అంతేగాదు సమాజానికి మహిళల అందాన్ని తక్కువ చేసి చూసే అవకాశం ఇవ్వకుండా తమపై శ్రద్ధ వహించేలా సమతుల్యమైన ఆహారపు అలవాట్లపై మహిళలంతా దృష్టి పెట్టాలని చెబుతోంది అలెజాండ్రా.(చదవండి: ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన ప్రాచీ: ఉచితంగా ట్రీట్ చేస్తామన్న వైద్యులు -
ఉద్యోగవర్గాల్లో కలకలం..70,000 మంది సిబ్బంది తొలగింపు
-
సంచలనం.. 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు
Layoffs in Argentina: ప్రైవేట్ కంపెనీల్లో గత కొన్ని నెలలుగా లేఆఫ్‌ల గురించి వింటున్నాం. ముఖ్యంగా ఐటీ సంస్థలు లేఆఫ్‌ల పేరుతో వేలాది సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం సంచలంగా మారింది. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే నెలల్లో 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి దూకుడు వ్యూహాన్ని ప్రదర్శించారు. ఈ తొలగింపులు అర్జెంటీనాలోని 35 లక్షల మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పోలిస్తే తక్కవే అయినప్పటికీ కార్మిక సంఘాల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదరుకావచ్చిన భావిస్తున్నారు. అర్జెంటీనా దేశంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందం మార్చి 31తో ముగియనుంది. గతేడాదే కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. అన్యాయమైన తొలగింపులను సహించబోమని యూనియన్ నాయకులు హెచ్చరించారు. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. BREAKING: Bloomberg reports that Argentina's President Javier Milei is planning to fire 70,000 government workers — The Spectator Index (@spectatorindex) March 27, 2024 -
ఆ ఊళ్లో అతనొక్కడే!.. ఇంకెవరూ ఉండరు!
ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే పిచ్చెక్కిపోతుంది. బాబోయ్! అనిపిస్తుంది. అలాంటిది ఎవ్వరూ ఉండని ఊరిలో ఒక్కడే ఉండటమా?. ఆ ఊహ కూడా ఇష్టపడం. కానీ ఇక్కడొక వృద్ధుడు ఒక్కడే ఒంటిరిగా నివశిస్తున్నాడు. ఈ విషయం గుప్పుమనడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. పైగా అతడిపై పలు కథనాలు వెలువడటంతో నెట్టింట అతడి కథ హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరంటే.. ఎవరూ లేని ఆ ఊళ్లో అతనొక్కడే ఉంటున్నాడు. పాతికేళ్లుగా నీటమునిగిన ఆ ఊరు, తర్వాత అనావృష్టి పరిస్థితుల్లో శిథిలావస్థలో బయటపడింది. అప్పటి నుంచి ఈ పెద్దాయన ఒక్కడే ఒంటరిగా ఆ ఊళ్లో ఉంటున్నాడు. నీటమునిగి నరసంచారానికి దూరమైన ఆ ఊరి పేరు ఎపిక్యూయెన్. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిరిస్ ప్రావిన్స్ పరిధిలోని ఊరది. ఒకప్పుడు ఆ ఊరు పర్యాటకులను విశేషంగా ఆకర్షించేది. అప్పట్లో ఆ ఊళ్లో దాదాపు రెండువేల మంది ఉండేవారు. ఏటా ఐదువేల మందికి పైగా పర్యాటకులు వచ్చి వెళుతుండేవారు. దురదృష్టవశాత్తు ఆ ఊరికి చేరువలో ఉన్న డ్యామ్ 1985లో వచ్చిన వరదల కారణంగా ధ్వంసమైంది. ఊళ్లోకి నీరు చేరడంతో, ఊరు కనిపించకుండా పోయింది. పాతికేళ్లుగా ఈ ఊరు నీటి అడుగునే ఉంది. ఆ తర్వాత ఇక్కడ అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. నీరంతా ఆవిరైపోవడంతో 2009లో శిథిలావస్థలో ఉన్న ఊరు బయటపడింది. ఇదే ఊరికి చెందిన పాబ్లో నోవాక్ అనే ఈ పెద్దాయన తన ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడకు చేరుకున్నాడు. ఊళ్లో ఎవరూ లేకపోయినా, అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ వస్తున్నాడు. తొంబైమూడేళ్ల పాబ్లో నోవాక్ ఒంటరిగా బతుకుతున్న సంగతి ఇటీవల మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ‘ప్రపంచంలోని అత్యంత ఒంటరి మనిషి’గా అభివర్ణిస్తూ సీఎన్ఎన్ చానల్ ఇతడిపై ఒక కథనాన్ని ప్రసారం చేయడంతో మిగిలిన చానెళ్లు, పత్రికల్లోనూ ఇతడిపై కథనాలు వెలువడ్డాయి. (చదవండి: కితకితలు పెట్టగానే నవ్వు తన్నుకుంటూ ఎలా వస్తుందో తెలుసా! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..) -
చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా!
వాహనాలకు పెట్రోల్, డీజిల్ లాగే ఏ పరికరం పనిచేయాలన్నా ఎంతో కొంత ఇంధనం కావాలి. ఇన్నాళ్లూ కరెంటు ఆ అవసరాన్ని తీరుస్తోంది. అయితే ఎప్పుడూ అది అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకెళ్లడమూ సాధ్యం కాదు. అందుకే బ్యాటరీల రూపంలో ఇంధనాన్ని నిల్వ చేయాలని చాలామంది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ బ్యాటరీలు కూడా కొంతకాలం క్రితం వరకూ పెద్దసైజులో చాలా బరువుగా ఉండేవి. వాటిని తేలికగా ఉండేలా చేయడమే కాకుండా స్మార్ట్ ఫోన్ నుంచి విద్యుత్ వాహనాల వరకూ విప్లవాత్మకమైన మార్పులకు ‘లిథియం’ అయాన్ బ్యాటరీలు నాంది పలికాయి. ఇప్పుడు ప్రపంచమంతా భూతాపాన్ని తగ్గించే దిశగా చేస్తున్న కృషిలో హరిత ఇంధనమూ అవసరం. ఈ బ్యాటరీలు అందులోనూ కీలకపాత్ర పోషించనున్నాయి. అయితే లిథియం అవసరాన్ని ముందుగానే గ్రహించిన చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిథియాన్ని మైనింగ్ చేసేందుకు వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ వ్యవహారాన్ని గమనించిన భారత్ గతంలోనే లిథియం కోసం అన్వేషణ ప్రారంభించింది. భవిష్యత్తులో చైనాతో పోలిస్తే లిథియంను సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో జమ్మూ-కశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు వెలుగు చూసినట్లు కేంద్ర గనుల శాఖ ఇప్పటికే ప్రకటించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారి జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని రియాసీ జిల్లాలోని సలాల్ హైమాన ప్రాంతంలో లిథియం నిల్వలను గుర్తించినట్లు గనుల శాఖ ట్విటర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ అర్జెంటీనా దేశంతో లిథియం మైనింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఖాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కాబిల్) అర్జెంటీనా దేశంలోని ‘కేమ్యాన్’ అనే సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇదీ చదవండి: బీటావోల్ట్ బ్యాటరీ.. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్ళు పనిచేసే కెపాసిటీ! ఈ ఒప్పందంలో భాగంగా అర్జెంటీనాలోని ఐదు లిథియం బ్లాక్‌ల్లో భారత్ మైనింగ్ ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చుచేయనుంది. అక్కడి అవసరాలను తీర్చేలా ప్రభుత్వం బ్రాంచి ఆఫీస్‌ను సైతం మొదలుపెట్టనున్నట్లు తెలిసింది. కాబిల్ నాల్కో, హిందుస్థాన్ కాపర్, ఎంఈసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది. -
అర్జెంటీనాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
అర్జెంటీనా నూతన అధ్యక్షుడు జేవియర్ మిలీ.. ఇలా అధికారం చేపట్టారో లేదో అంతలోనే అనూహ్య నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది ఐదు వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు జేవియర్ మిలీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. జేవియర్ మిలీ డిసెంబర్ 10న అర్జెంటీనా నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంక్షోభంలో కూరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలు ప్రారంభించారు. దేశంలోని ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు పలు రంగాలలో కోతలు, పెట్టుబడుల తగ్గింపులకు శ్రీకారం చుట్టారు. జేవియర్ మిలీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ పాల్గొన్నారు. కాగా 2023కు ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్టులను సమీక్షించనున్నట్లు మిలీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అర్జెంటీనాలో త్వరలో ద్రవ్యోల్బణం దాదాపు 200 శాతానికి చేరుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వ నిబంధనలు, ఎగుమతులు, పెట్టుబడులను సవరించేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు పరిశ్రమలను ప్రైవేటీకరించేందుకు అనుమతిస్తానని మిలే ప్రకటించారు. దేశాన్ని పునర్నిర్మాణ మార్గంలో తీసుకెళ్లడం, ప్రజలకు స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి కల్పించడం, దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉన్న నిబంధనలను సవరించడమే తన లక్ష్యమని మిలీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పలు ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరణపరం చేయనుందని నూతన అధ్యక్షుడు జేవియర్ మిలీ తెలిపారు. ఈ చర్యలలో పెసా (అర్జెంటీనా కరెన్సీ) విలువను 50 శాతం మేరకు తగ్గించడం, ఇంధనం, రవాణా సబ్సిడీలపై కోత, కొన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు స్వస్తి పలకడం వంటివి ఉన్నాయి. 53 ఏళ్ల మైలీ తన ఎన్నికల ప్రచారంలో తాను దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని, ఇందుకోసం పలు మార్పులు చేస్తానని పేర్కొన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రస్తుత తరుణంలో నిరాశ చెందిన అర్జెంటీనా ప్రజలకు ఆయన ఆశాజ్యోతిగా కనిపించారు. ఈ నేపధ్యంలో ప్రజా మద్దతుతో ఆయన ఆ కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుని నిర్ణయాలివే.. తన 21 క్యాబినెట్ పదవులలో 12 పదవులను తొలగించారు. ఐదువేల మంది మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించారు. లెక్కలేనన్ని ప్రభుత్వ నిబంధనలకు ముగింపు పలికారు. మిలిటరీలో అనేక మార్పులు చేశారు. ఆత్మరక్షణ హక్కును నిర్ధారించే బిల్లుకు మద్దతు పలికారు. చిన్నారుల ఇంటి విద్యను చట్టబద్ధం చేసే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. బిట్‌కాయిన్‌లో చట్టబద్ధమైన చెల్లింపు ఒప్పందాలకు శ్రీకారం పలికారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ దిశగా ముందడుగు వేశారు. సొంత చమురు పరిశ్రమను తెరిచే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ భీకర దాడులు.. 24 గంటల్లో 200 మంది మృతి -
అర్జెంటీనా లిథియం నిల్వలపై భారత్ దృష్టి
న్యూఢిల్లీ: లిథియం దిగుమతుల కోసం ప్రస్తుతం చైనాపైనే ఎక్కువగా ఆధారపడుతున్న భారత్.. ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా అర్జెంటీనాలో అయిదు లిథియం బ్లాకులను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. భారత అవసరాల కోసం విదేశాల్లో ఖనిజ నిక్షేపాలను అభివృద్ధి చేసే జాయింట్ వెంచర్ కంపెనీ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబిల్), అర్జెంటీనాకు చెందిన క్యాటామార్కా మినరా వై ఎనర్జెటికా సొసైడాడ్ డెల్ ఎస్టాడో (క్యామ్‌యెన్) ఇందుకు సంబంధించిన ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయి. చర్చలు తుదిదశలో ఉన్నాయని, త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే అయిదేళ్లలో లిథియం నిక్షేపాల అన్వేషణ, గనుల అభివృద్ధిపై భారత్ సుమారు రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించాయి. భారత్ ఇప్పటికే ఆ్రస్టేలియాలో రెండు లిథియం, మూడు కోబాల్ట్ గనులను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే క్రమంలో లిథియంకు సంబంధించి అర్జెంటీనాతో ఒప్పందం రెండోది కానుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటి బ్యాటరీల్లో లిథియంను విరివిగా ఉపయోగిస్తారు. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 25,000 కోట్ల విలువ చేసే లిథియంను చైనా, హాంకాంగ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 98 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉండగా ఇందులో 20 శాతం నిక్షేపాలు అర్జెంటీనాలో ఉన్నాయి. -
అది మెస్సీ క్రేజ్.. జెర్సీల విలువ 64 కోట్ల పై మాటే..!
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవ్యాప్తంగా ఈ స్టార్ ఫుట్‌బాలర్‌కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మెస్సీ ప్రపంచంలో ఏ మూలలో ఫుట్‌బాల్ ఆడినా ఇసకేస్తే రాలనంత మంది జనాలు స్టేడియాలకు తరలి వస్తారు. అతను ధరించే బ్రాండ్లు, అతని ఎండార్స్మెంట్ల రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. తాజాగా మెస్సీ ధరించిన జెర్సీలను ఆన్లైన్లో వేలానికి పెట్టగా కళ్లు బైర్లు కమ్మే మొత్తానికి అవి అమ్ముడుపోయాయి. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను న్యూయార్క్‌లో ఆన్లైన్ వేలానికి పెట్టగా.. ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 78 లక్షల డాలర్లకు (రూ. 64 కోట్ల 86 లక్షలు) ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో ఓ వ్యక్తి ధరించిన జెర్సీలు అమ్ముడుపోవడం క్రీడల చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యుంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి, మూడోసారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో మెస్సీ రెండు గోల్స్ సాధించి అర్జెంటీనాను ఒంటిచేత్తో గెలిపించాడు. -
పిల్లల గణతంత్ర ప్రపంచం!
ఇది ఒక అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్. దీని పేరు చిల్డ్రన్స్ రిపబ్లిక్. ఈ పార్కు లోపలి వాతావరణం పూర్తిగా పేరుకు తగినట్లుగానే ఉంటుంది. అర్జెంటీనాలోని మాన్యువల్ బి గానెట్ నగరంలో ఉందిది. దేశంలోని పిల్లలకు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామిక పద్ధతుల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అర్జెంటీనా ప్రభుత్వం 1951 నవంబర్ 26న ఈ పార్కును ప్రారంభించింది. ఈ పార్కు నిర్మించిన 130 ఎకరాల స్థలంలో అంతకు ముందు గోల్ఫ్‌కోర్స్ ఉండేది. ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుని, ఈ పార్కు నిర్మాణం చేపట్టింది. ఇందులో నగరాలు, పట్టణాలు, పల్లెల నమూనాలు, తాజ్‌మహల్ స్ఫూర్తితో నిర్మించిన ‘ప్యాలెస్ ఆఫ్ కల్చర్’, పిల్లల బ్యాంకు, ఆక్వేరియం, పిల్లల పార్లమెంటు వంటి ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. ఈ పార్కులోని పిల్లల బృందాలు పిల్లల పార్లమెంటు కోసం తమ ప్రతినిధులను తామే ఎన్నుకుంటారు. అందరూ కలసి ఉమ్మడి ప్రయోజనాల కోసం పనులు చేస్తారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైన చేప! చూస్తే భయపడాల్సిందే!) -
రైట్...రైట్!
ఉదారవాదులూ, వామపక్షవాదులూ ‘గత కాలమె మేలు వచ్చు కాలము కంటెన్...’ అనుకోక తప్పని సమయం వచ్చినట్టుంది. మొన్న అర్జెంటీనాలో, ఇప్పుడు నెదర్లాండ్స్‌లో జరిగిన ఎన్నికల్లో మితవాద నేతలు విజయకేతనాలు ఎగరేయటం...యూరప్ ఖండంలోని చాలాచోట్ల నానాటికీ మితవాద పార్టీలకు ఆదరణ పెరుగుతుండటం ప్రపంచం ‘కుడి’వైపు మళ్లుతున్న సూచనలు అందిస్తున్నాయి. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో ఇటీవల తీవ్ర మితవాద పక్ష నేత జేవియర్ మిలీ వామపక్ష నేత సెర్జియా మాసాను ఓడించి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సెంట్రల్ బ్యాంకు మూసివేత, స్థానిక కరెన్సీ పెసో రద్దు ఆయనగారి వాగ్దానాలు. దేశ సాంఘిక, ఆర్థిక విధానాలను ధ్వంసం చేసి నవ అర్జెంటీనా నిర్మించటమే తన ధ్యేయమని చెప్పుకొన్నారు. తాజాగా నెదర్లాండ్స్‌లో తీవ్ర మితవాద పక్షమైన పార్టీ ఫర్ ఫ్రీడమ్ (పీవీవీ) 37 స్థానాలు గెల్చుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. 150 స్థానాలున్న దిగువ సభలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 76 స్థానాలకు దూరంలోనే వున్నా ఆ పార్టీ నేత గీర్డ్ వైల్డర్స్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు మొదలెట్టింది. అయితే పీవీవీ ప్రవచించే ఇస్లాం వ్యతిరేకత అక్కడ రాజ్యాంగ విరుద్ధం కావటంవల్ల ప్రధాన స్రవంతి పార్టీలు ప్రభుత్వంలో చేరేందుకు నిరాకరిస్తున్నాయి. మసీదుల మూత, ఖురాన్ నిషేధం, ముస్లిం దేశాల నుంచి వలసలు అరికట్టడం వైల్డర్స్ వాగ్దానాలు. రెండో ప్రపంచ యుద్ధానంతరం పశ్చిమ యూరప్‌లో మితవాద పక్షాలకు కాలం చెల్లి, ఉదార వాద పార్టీల ఆధిక్యతే సాగింది. ఒక్క ఇటలీలోని సోషల్ మూవ్మెంట్ పార్టీ (ఎంఎస్ఐ)కి తప్ప ఎక్కడా మితవాదులకు ఆదరణ దొరకలేదు. 1955–80 మధ్య అక్కడక్కడ మితవాద పార్టీలు తలెత్తి కొద్దో గొప్పో స్థానాలు గెల్చుకున్న ఉదంతాలున్నా అవి ఒకటి రెండు దఫాలకు మించి నిలబడ లేకపోయాయి. 1956లో ఫ్రాన్స్‌లో యూనియన్ అండ్ ఫ్రెంచ్ ఫ్రెటర్నిటీ (యూఎఫ్‌ఎఫ్) 13 శాతం ఓట్లు గెల్చుకుని, 52 స్థానాలు సాధించినా చాలా త్వరగానే కనుమరుగయింది. అంతవరకూ దుందు డుకువాదులుగా పేరుబడిన అతి మితవాద పక్షాలు 1980–2000 మధ్య అంతక్రితంతో పోలిస్తే ఎంతోకొంత మెరుగయ్యాయి. ఆస్ట్రియాలో ఫ్రీడమ్ పార్టీ (ఎఫ్పీ), నెదర్లాండ్స్‌లో సెంటర్ పార్టీ (సీపీ) ఓటర్లను ఆకట్టుకోవటం మొదలెట్టాయి. అయితే ఉదారవాద పార్టీలు, వామపక్ష పార్టీల తర హాలో వీటికి నిర్దిష్టమైన సిద్ధాంతమేమీ ఉండదు. స్థానికత, జనాకర్షణ, అవినీతి, పెరుగుతున్న నేరాలు, వలసలు, ముస్లింలపై వ్యతిరేత వంటివే ఈ పార్టీలకు ఊపిరి. 1980కి ముందు ఒక శాతం అంతకన్నా తక్కువ ఓట్లు మాత్రమే రాబట్టుకునే మితవాదులు 2010 నాటికి 10 శాతం ఓట్లు తెచ్చు కునే స్థితికి ఎదిగారు. ఒక్క ఆస్ట్రియా దీనికి మినహాయింపు. అక్కడ తీవ్ర మితవాద ఫ్రీడమ్ పార్టీ (ఎఫ్పీ) 1999లో 27 శాతం ఓట్లు సాధించి కూటమి ప్రభుత్వంలో చేరింది. ఈ పరిణామం యూర ప్‌కు మింగుడుపడలేదు. ఆ దేశంపై పలు ఆంక్షలు సాధించటంతోపాటు చాలా దేశాలు అక్కడికి దౌత్య పర్యటనలు మానుకున్నాయి. 2019లో ఎఫ్పీ నేత అవినీతి ఆధారాలతోసహా బట్టబయలు కావటంతో దానికి ఆదరణ సన్నగిల్లింది. కానీ మొన్న ఫిబ్రవరిలో జరిగిన ప్రాంతీయ ఎన్నికల్లో అది 24 శాతం ఓట్లతో బలం పుంజుకుంది. వేరే దేశాల్లో కూడా మితవాదులకు ఆదరణ పెరుగుతున్న దాఖలాలు కనబడుతూనే వున్నాయి. స్పెయిన్, బెల్జియం, ఇటలీ, జర్మనీ తదితర దేశాలు ఇందుకు ఉదాహరణ. ఈ ఏడాది మొదట్లో ఇటలీలో నియో ఫాసిస్ట్ పార్టీగా ముద్రపడిన ఎంఎస్ఐ అధికారం చేజిక్కించుకోగా, నిరుడు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో అతి మితవాది మెరిన్ లీ పెన్ రెండో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచారు. ఆమె పార్టీ దిగువ సభలో భారీగా స్థానాలు గెల్చుకుంది. జర్మనీలో నియో నాజీ పార్టీ ఏఎఫ్‌డీ ప్రస్తుతానికైతే ద్వితీయ స్థానంలో ఉంది. ఒక్క పోలాండ్ ఇందుకు మినహాయింపు. అక్కడ 2019 ఎన్నికల్లో 43.6 శాతం ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న మితవాద లా అండ్ జస్టిస్ పార్టీ (పీఐఎస్)ని మొన్న అక్టోబర్ ఎన్నికల్లో అధికారంలో నుంచి దించలేకపోయినా, ఆ పార్టీ ఆధిక్యతను 35 శాతానికి తగ్గించటంలో ఉదారవాద పార్టీలు విజయం సాధించాయి. నెదర్లాండ్స్‌లో వైల్డర్స్ సాధించిన ఆధిక్యత సహజంగానే యూరప్ అంతటా రాజకీయ ప్రకంప నలకు కారణమైంది. ఎందుకంటే ఇంతవరకూ నెదర్లాండ్స్‌లో ఏ మితవాద పార్టీ 20 శాతం దాటి ఓట్లు సాధించలేదు. తొలిసారి వైల్డర్స్ 23.6 శాతం ఓట్లు గెల్చుకున్నారు. అంతేకాదు... ఇటలీ మిత వాద నేత మెలొని, ఫ్రాన్స్ మితవాద నేత మెరైన్ లీ పెన్ మాదిరి తన తీవ్రవాద భావాలను కాస్త యినా సవరించుకోలేదు. అధికారంలోకి రాగానే ఈయూలో ఉండాలా వద్దా అనే అంశంపై రిఫరెండమ్ నిర్వహిస్తానని వైల్డర్స్ హామీ ఇచ్చారు. ఇది ఆచరణలో సాధ్యమా కాదా అన్న సంగతలావుంచి వర్తమాన స్థితిగతుల నుంచి గట్టెక్కటం ఎలాగో తెలియక అన్ని దేశాల్లోనూ పాలకులు తలలు పట్టు కుంటున్నారు. ఒకపక్క ఉక్రెయిన్ నుంచి రోజూ వేలాదిమంది శరణార్థులు వస్తున్నారు. పశ్చిమా సియా, ఆఫ్రికా ఖండ దేశాల నుంచి సైతం నిత్యం వలసలుంటున్నాయి. ఇందుకు ఈయూనే తప్పు బట్టాలి. వివిధ దేశాల్లో మంటరాజుకోవటానికి కారణమవుతున్న అమెరికా వైఖరిని నిలువరించక పోగా దానికి సహకారం అందించటమే వలసలు పెరగటానికి కారణం. అశాంతితో దహించుకుపో తున్న దేశాలను వదిలి సహజంగానే జనం సురక్షిత ప్రాంతాలు వెదుక్కుంటారు. ఇతరత్రా విషయా లెలావున్నా వలసలపై ఓటర్లలో ఉన్న భయాందోళనలకు పరిష్కారం వెదకటంలో ప్రధాన స్రవంతి పార్టీలు విఫలమైతే అన్నిచోట్లా రాగలకాలంలో అతి మితవాద పక్షాలదే పైచేయి అవుతుంది. -
FIFA World Cup 2026 Qualifiers: ఐదుసార్లు విశ్వవిజేతకు షాక్.. తొలిసారి..!
రియో డి జనీరో: ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టుకు పరాజయం ఎదురైంది. మెస్సీ సారథ్యంలోని ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా 1–0 గోల్ తేడాతో బ్రెజిల్ జట్టును ఓడించింది. ఆట 63వ నిమిషంలో నికోలస్ ఒటామెండి హెడర్ షాట్‌తో గోల్ సాధించి అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్వదేశంలో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. -
కోరి తెచ్చుకున్న కొరివి?
ఎన్నికలు, ఫలితాలనేవి ఉద్వేగాలను రేపడం సహజం. అయితే, కొన్ని ఎన్నికలు, కొందరి ఎంపికలు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తాయి. అనుమానాలతో పాటు ఆందోళనలూ రేపుతాయి. అర్జెంటీనా కొత్త అధ్యక్షుడిగా ఛాందసవాద జేవియర్ మిలీ తాజా ఎన్నిక అలాంటిదే. ఓట్ల లెక్కింపులో మిలీ 56 శాతం ఓట్లు సాధిస్తే, అధికార పక్షమైన పెరోనిస్ట్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి సెర్జియో మస్సాకు 44 శాతం ఓట్లే వచ్చాయి. వర్తమాన అర్జెంటీనా రాజకీయ వ్యవస్థపై నెలకొన్న ప్రజాగ్రహానికి, ‘సరికొత్త రాజకీయ శకం’ తీసుకువస్తానన్న వాగ్దానం తోడై సృష్టించిన ప్రభంజనంలో మిలీ విజయతీరాలకు చేరారు. అయితే, ఆయన విజయం అర్జెంటీనాలోని ప్రతిపక్షాల్లోనే కాదు... అంతర్జాతీయంగానూ ఆందోళన రేపుతోంది. కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని భావిస్తున్నారు. నలభై ఏళ్ళుగా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్న దక్షిణ అమెరికా దేశాన్ని కొత్త అధ్య క్షుడు మళ్ళీ వెనక్కి నడిపిస్తారనే భయం నెలకొంది. అదెలా ఉన్నా... అర్జెంటీనా దౌత్య సంబంధాలు, ఆర్థిక భవితవ్యం, ఆ ప్రాంత రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. నాలుగున్నర కోట్ల జనాభా గల అర్జెంటీనాలో నవంబర్ 19న జరిగిన ఎన్నికలు, ఫలితాలు ఇంతగా చర్చనీయాంశమైంది అందుకే. ఎన్నికల్లో మిలీకి పట్టం కట్టినమాట నిజమే అయినా, అంత మాత్రాన అర్జెంటీనా ప్రజలందరూ ఆయన భావజాలంతో ఏకీభవిస్తున్నట్టు అనుకోలేం. దశాబ్దాల నిర్వహణ లోపాలు, అవినీతితో ఆ దేశం దీర్ఘకాలంగా ఆర్థిక కష్టాల ఊబిలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. ప్రపంచస్థాయిలోనే ఎక్కువగా ద్రవ్యోల్బణం 150 శాతానికి దగ్గరలో ఉంది. దారిద్య్రం పెరుగుతోంది. దేశంలో నూటికి 40 మందికి పైగా దారిద్య్రంలో మగ్గు తున్నారు. అధికార కరెన్సీ పెసో విలువ ఎన్నడూ లేనంతగా పడిపోయింది. మూడేళ్ళ క్రితం కరోనా రావడానికి ముందు దాకా 80 పెసోలు ఒక డాలరైతే, ఇవాళ వెయ్యి పెసోలైతే కానీ ఒక డాలర్‌కు సమానం కాని దుఃస్థితి. ఈ ఆర్థిక కష్టాలకు రాజకీయ వ్యవస్థ, ముఖ్యంగా వామపక్షాలు కారణమని మిలీ ఆరోపణ. ఆ ఆరోపణల్ని అధికారపక్ష అభ్యర్థి సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. ఎలాగైనా సరే జీవన పరిస్థితుల్లో మార్పు రావాలని తహతహలాడుతున్న జనం మిలీతో ఏకీభావం లేకున్నా ఆయనకే ఓటేశారు. అందుకే, ఈ ఎన్నిక ‘‘నిరసన ఓటు’’ ఫలితమని నిపుణుల మాట. ఆర్థిక నిపుణుడు, మాజీ టీవీ ప్రముఖుడు, తాంత్రిక సెక్స్ కోచ్ 53 ఏళ్ళ జేవియర్ మిలీకి నిజా నికి రాజకీయ అనుభవం లేదు. కానీ, ప్రజలకు ఆయన బాసలు కోటలు దాటాయి. పన్నులు తగ్గిస్తా ననీ, అర్జెంటీనా కేంద్ర బ్యాంకును రద్దు చేస్తాననీ, దేశ కరెన్సీ పెసో స్థానంలో అమెరికా డాలర్‌ను తెస్తాననీ అన్నారు. గర్భస్రావంపై నిషేధం ఎత్తేస్తానన్నారు. కారుణ్య మరణాల్ని వ్యతిరేకించారు. తుపాకులపై నియంత్రణల్ని సడలిస్తానన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ‘సామ్యవాదంపై పోరాటం’ చేయదలచిన దేశాలే అర్జెంటీనాకు మిత్రపక్షాలంటూ తన భావజాలాన్ని కుండబద్దలు కొట్టారు. అసలే కష్టాల్లో ఉన్న దేశాన్ని ఆయన అధ్యక్షత మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని వందమందికి పైగా ప్రముఖ ఆర్థికవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. పైగా, అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్యదేశాలైన బ్రెజిల్, చైనా, అమెరికా, చిలీ నేతల్ని మిలీ దుమ్మెత్తిపోశారు. ఇక, సర్కారు వద్దే డాలర్లు లేని వేళ దేశ కరెన్సీ స్థానంలో డాలర్లను ప్రవేశపెడతాననడం ఆచరణ సాధ్యం కాని పని. ఏ కొద్దిగా ప్రయత్నించినా అది మరో సంక్షోభానికి తెర తీస్తుంది. అర్జెంటీనా సంగతి అటుంచితే, మిలీ విజయవార్త మిగతా ప్రపంచానికీ శుభవార్తేమీ కాదు. అందుకు అనేక కారణాలు. టీవీ ప్రముఖుడిగా తెచ్చుకున్న పేరును ఆయన రాజకీయాల్లో మదుపు పెట్టారు. రెచ్చగొట్టే మాటలు, మితిమీరిన హావభావ విన్యాసాలతో ముందుకు సాగుతున్నారు. సుమారు అయిదేళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చిన ఈ స్వేచ్ఛావాది ప్రపంచ వాతావరణ మార్పు ఓ పెద్ద సామ్యవాద అబద్ధం అంటారు. ప్రపంచవ్యాప్తంగా అతివాదులకు నచ్చే ఆ మాటల్ని ఐరోపా లాంటివి స్వాగతిస్తున్నాయి. విజేత మిలీని తక్షణం అభినందించిన వారి జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో తదితరులు ఉండడం గమనార్హం. అమెరికాలో ట్రంప్ హయాంలో, బ్రెజిల్లో బొల్సొనారో ఏలుబడిలో జరిగిందేమిటో అందరికీ తెలిసిందే, చూసినదే. మరి, స్నేహితుల్ని బట్టి స్వభావం తెలుస్తుందన్న దాన్ని బట్టి రానున్న రోజుల్లో మిలీ ఎలాంటి పోకడలు పోగలరో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలతో నిత్యం పోరాడే అధ్యక్షుడి వల్ల అర్జెంటీనా ప్రజాస్వామ్యం మరింత బలహీనపడే ముప్పుంది. ఎన్నికల ప్రచార సమయంలో రంపం చేతబట్టి, ఖర్చునూ, కష్టాల్నీ కోసేస్తానని మిలీ చెబుతూ వచ్చారు. విజయోత్సవ ప్రసంగంలోనూ దేశంలో ‘అంచెలంచెలుగా కాక సమూలంగా మార్పు తెస్తా’నని వాగ్దానం చేశారు. అనుభవమే కాదు... భావోద్వేగాలపై అదుపు కానీ, పార్లమెంట్లో మెజారిటీ కానీ లేని మిలీ ఏం చేయగలుగుతారు, ఎంతకాలం నిలబడగలుగుతారన్నది సందేహమే! కొద్దికాలమే పదవిలో ఉన్నా దేశానికి నష్టం భారీగా ఉండవచ్చని పలువురి భయం. అసలు అర్జెంటీనాలో ప్రజాస్వామ్యం బీటలు వారుతోందని ఇప్పటికి మూడేళ్ళుగా అమెరికా, బ్రెజిల్ హెచ్చరిస్తూనే ఉన్నాయి. మిలీ హయాంలో ఆ భయాలన్నీ నిజమైతే, ఆ దేశానికి అంతకన్నా విషాదం మరొ కటి ఉండదు. మాటల్లో, చేష్టల్లో ట్రంప్‌కు తీసిపోని మిలీని అంతా ‘ఎల్లోకో’ (పిచ్చివాడు) అంటుంటారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం పక్కకుపోయి, అధికారం పిచ్చోడి చేతిలో రాయిగా మారితే కష్టమే! కారణాలేమైనా ఇది మెజారిటీ అర్జెంటీనా పౌరులు కోరి తెచ్చుకున్న కొరివి!! -
అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో జేవియర్ ఘన విజయం
బ్యూనోస్ ఎయిరీస్ (అర్జెంటీనా): అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఆర్థికవేత్త, టీవీ విశ్లేషకుడు జేవియర్ మిలే ఘన విజయం సాధించారు. ఆర్థిక మంత్రి సెర్గియో మస్సాను మట్టికరిపిస్తూ 55.7 శాతం ఓట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 99.4 శాతం ఓట్లను లెక్కించగా ప్రత్యర్థి సెర్గియోకు 44.3 శాతం ఓట్లు పడ్డాయి. ఈ దక్షిణ అమెరికా దేశంలో 1983లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తే ఒక నేతకు అధిక మెజారిటీ రావడం ఇదే తొలిసారి. -
Lionel Mess: ఎనిమిదోసారి బాలన్ డి'ఓర్ నెగ్గిన మెస్సీ.. (ఫొటోలు)
-
రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న మెస్సీ
దిగ్గజ ఫుట్‌బాలర్, ఇంటర్ మయామీ స్టార్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ (36) మరోసారి ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్నాడు. 2023 సంవత్సరానికి గాను మెస్సీని ఈ అవార్డు వరించింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయి ఎనిమిదోసారి కైవసం చేసుకోవడం విశేషం. మెస్సీ తర్వాత ఈ అవార్డును అత్యధికంగా క్రిస్టియానో రొనాల్డో (5) దక్కించుకున్నాడు. The moment when 🐐 was announced as the #BallonDor winner. - Lionel Messi, the icon!pic.twitter.com/QNZOmBgeMe — Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2023 2009లో తొలిసారి బాలన్ డి'ఓర్ సొంతం చేసుకున్న లియో.. 2010, 2011, 2012, 2015, 2019, 2021, 2023 సంవత్సరాల్లో ఈ అవార్డును చేజిక్కించుకున్నాడు. ఈ ఏడాది బాలన్ డి'ఓర్ కోసం నార్వే ఆటగాడు, మాంచెస్టర్ సిటీ స్ట్రయికర్ ఎర్లింగ్ హాలాండ్ మెస్సీతో పోటీపడ్డాడు. అయినా అవార్డు దిగ్గజ ఫుట్బాలర్నే వరించింది. పారిస్ వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో మరో దిగ్గజ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్ మెస్సీకి అవార్డు అందించాడు. కాగా, లియో గతేడాది అర్జెంటీనాకు వరల్డ్‌కప్ అందించిన విషయం తెలిసిందే. మహిళల విభాగంలో ఎయిటనా బొన్మాటి.. మహిళల విభాగంలో బాలన్ డి'ఓర్ అవార్డును స్పెయిన్ ఫుట్‌బాలర్, బార్సిలోనా సెంట్రల్ మిడ్ ఫీల్డర్ ఎయిటనా బొన్మాటి దక్కించుకుంది. ఎయిటనా ఈ అవార్డుకు తొలిసారి ఎంపికైంది. ఎయిటనా 2023 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచిన స్పెయిన్ జట్టులో సభ్యురాలు. -
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం.. 400కు పైగా స్కోర్ నమోదు
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. అర్జెంటీనా మహిళల జట్టు టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్‌ను నమోదు చేసింది. చిలీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా రికార్డు స్థాయిలో 427 పరుగులు (వికెట్ నష్టానికి) చేసింది. పొట్టి క్రికెట్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా (పురుషులు, మహిళలు) చరిత్రకెక్కింది. గతంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు బెహ్రయిన్ మహిళల జట్టు పేరిట ఉండేది. ఆ జట్టు 2022లో సౌదీ అరేబియాపై 318 పరుగులు చేసింది. తాజాగా ఈ రికార్డును అర్జెంటీనా బద్దలుకొట్టింది. పురుషుల క్రికెట్ విషయానికొస్తే.. అత్యధిక స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. తాజాగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో నేపాల్ టీమ్ 314 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇద్దరు భారీ సెంచరీలు.. అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి ఓ రేర్ ఫీట్ నమోదైంది. ఓ ఇన్నింగ్స్‌లో తొలిసారి రెండు సెంచరీలు నమోదయ్యాయి. చిలీతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా మహిళా క్రికెటర్లు లూసియా టేలర్ (84 బంతుల్లో 169; 27 ఫోర్లు), అల్బెర్టీనా గలాన్ (84 బంతుల్లో 145 నాటౌట్; 23 ఫోర్లు) భారీ శతకాలు బాదారు. వీరితో పాటు మరియా (16 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు) కూడా రాణించడంతో అర్జెంటీనా వికెట్ నష్టానికి 427 పరుగులు చేసింది. ఇంత భారీ స్కోర్ చేసినా అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం విశేషం. Argentina Women have registered the highest total in T20Is (Men's or Women's) with 427/1 against Chile Women and also secured an easy win against them. This surpasses the previous record of 318/1 set by Bahrain Women against Saudi Arabia Women. pic.twitter.com/BjxwpW3V9x — CricTracker (@Cricketracker) October 14, 2023 టీ20ల్లో ఐదుసార్లు.. అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో 2 సెంచరీలు నమోదవ్వడం ఇదే తొలిసారి అయితే టీ20ల్లో మాత్రం ఈ ఫీట్ ఐదుసార్లు నమోదైంది. 2011లో మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు తొలిసారి నమోదయ్యాయి. ఆతర్వాత 2016 ఐపీఎల్లో ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి సెంచరీలు చేశారు. ఆతర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో, 2019 ఐపీఎల్లో (సన్‌రైజర్స్ ఆటగాళ్లు బెయిర్‌స్టో (114), డేవిడ్ వార్నర్ (100 నాటౌట్)), 2022లో బల్గేరియాపై ఇద్దరు చెక్ రిపబ్లిక్ ప్లేయర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు. ఎక్స్‌ట్రాలు 73 పరుగులు.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో చిలీ బౌలర్లు రికార్డు స్థాయిలో 73 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్స్‌ట్రాల రూపంలో ఇన్ని పరుగులు రావడం ఇదే తొలిసారి. టీ20ల్లో అతి భారీ విజయం.. అర్జెంటీనా మహిళల జట్టు అంతర్జాతీయ టీ20ల్లో అతి భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా 427 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన చిలీ 63 పరుగులకే ఆలౌటై, 364 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చిలీ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. ఇద్దరు సున్నా స్కోర్లకే పరిమితమయ్యారు. కేవలం ఒక్కరు (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. చిలీ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాలే (29) అత్యధిక స్కోర్ కావడం విశేషం. చిలీ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు రనౌట్లు కావడం మరో విశేషం. -
అర్జెంటీనాను గెలిపించిన మెస్సీ
2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. బ్యూనస్ ఎయిర్స్లో శుక్రవారం జరిగిన దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా 1–0తో ఈక్వెడార్ జట్టును ఓడించింది. 83 వేల మంది ప్రేక్షకులు హాజరైన ఈ మ్యాచ్‌లో ఆట 78వ నిమిషంలో కెపె్టన్ మెస్సీ చేసిన గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్లింది. 176 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మెస్సీకిది 104వ గోల్ కావడం విశేషం. వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో మెస్సీకిది 29వ గోల్. 29 గోల్స్‌తో లూయిస్ స్వారెజ్ (ఉరుగ్వే) పేరిట ఉన్న రికార్డును మెస్సీ సమం చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కొలంబియా 1–0తో వెనిజులాపై గెలుపొందగా... పరాగ్వే–పెరూ మ్యాచ్ 0–0తో ‘డ్రా’ అయింది. 2026 ప్రపంచకప్‌ను అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. మొత్తం 48 దేశాలు బరిలోకి దిగుతాయి. -
కొనసాగుతున్న మెస్సీ మేనియా.. కళ్లు చెదిరే గోల్ చేసిన ఫుట్‌బాల్ దిగ్గజం
పీఎస్జీని వీడి డేవిడ్ బెక్‌హమ్ ఇంటర్ మయామీ క్లబ్లో చేరిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ.. ఈ అమెరికన్ క్లబ్ తరఫున తన గోల్స్ పరంపరను కొనసాగిస్తున్నాడు. లీగ్స్ కప్‌లో భాగంగా ఫిలడెల్ఫియా యూనియన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ ఓ కళ్లు చెదిరే గోల్‌తో మెరిశాడు. What can't he do?! 🐐 Make it NINE goals in six games for Leo Messi. pic.twitter.com/HLf3zBFTmV — Major League Soccer (@MLS) August 15, 2023 మ్యాచ్ 20వ నిమిషంలో పెనాల్టీ ఏరియా బయట 36 గజాల దూరం నుంచి మెస్సీ చేసిన గోల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్‌లో మయామీ ఆటగాళ్లు మార్టినెజ్, జోర్డీ అల్బా, డేవిడ్ రూయిజ్ కూడా గోల్స్ చేసినప్పటికీ.. మెస్సీ చేసిన గోలే మ్యాచ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. మెస్సీ కెరీర్లో ఇది సెకండ్ లాంగెస్ట్ గోల్ కావడం విశేషం. ఈ గోల్‌తో మెస్సీ ఇంటర్ మియామీ తరఫున తన గోల్స్ సంఖ్యను 9కి పెంచుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. మెస్సీ, మార్టినెజ్, జోర్డీ, రూయిజ్ గోల్స్ చేయడంతో మయామీ.. ఫిలడెల్ఫియాపై 4-1 గోల్స్ తేడాతో గెలుపొంది, లీగ్స్ కప్ ఫైనల్స్‌కు చేరింది. ఫిలడెల్ఫియా తరఫున అలెజాండ్రో బెడోయా ఏకైక గోల్ చేశాడు. కాగా, మెస్సీ ఇంటర్ మయామీ తరఫున బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ గోల్ చేశాడు. మాయమీ తరఫున ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మెస్సీ మొత్తం 9 గోల్స్ చేశాడు. తద్వారా మయామీ తరఫున ఆరు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. మెస్సీకి ముందు గొంజాలో హిగ్వేన్ (29), లియోనార్డో కంపానా (16) ఉన్నారు. -
వన్డే ఫార్మాట్లో పెను సంచలనం.. 515 పరుగుల రికార్డు స్కోర్, 450 పరుగుల తేడాతో విజయం
ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో పెను సంచలనం నమోదైంది. యూఎస్ఏ అండర్-19 జట్టు అర్జెంటీనా యువ జట్టుపై 450 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. టొరొంటో వేదికగా నిన్న (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అండర్-19 క్రికెట్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. 2002లో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్.. కెన్యాపై చేసిన 480 పరుగులే ఈ మ్యాచ్‌కు ముందు వరకు అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లో ఉండింది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసి, అండర్-19 వన్డే ఫార్మాట్లో 500 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్లోనూ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా యూఎస్ఏ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు టీమ్ రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్లో అతి భారీ విజయం.. యూఎస్ఏ నిర్ధేశించిన 516 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అర్జెంటీనా.. పేసర్ ఆరిన్ నాదకర్ణి (6-0-21-6) ధాటికి 65 పరుగులకే కుప్పకూలి, 450 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. అండర్-19 క్రికెట్ వన్డే ఫార్మాట్లో ఇదే అతి భారీ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండింది. 2002లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 430 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవరాల్‌గా (లిస్ట్-ఏ క్రికెట్) చూసినా యూఎస్ఏ సాధించిన విజయమే వన్డే ఫార్మాట్ మొత్తంలో అతి భారీ విజయంగా నమోదైంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అతి భారీ విజయం రికార్డు తమిళనాడు (అరుణాచల్‌పై 435 పరుగుల తేడాతో విజయం) పేరిట ఉండింది. మ్యాచ్ విషయానికొస్తే.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భవ్య మెహతా (136), రిషి రమేశ్ (100) సెంచరీలతో.. ప్రణవ్ చట్టిపలాయమ్ (61), అర్జున్ మహేశ్ (67) అర్ధసెంచరీలతో చెలరేగడంతో యూఎస్ఏ టీమ్ రికార్డు స్కోర్ చేసింది. యూఎస్ఏ టీమ్‌లో అమోఘ్ ఆరేపల్లి (48), ఉత్కర్ష్ శ్రీవత్సవ (45) కూడా రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన అర్జెంటీనా 19.5 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది. నాదకర్ణితో పాటు ఆర్యన్ సతీశ్ (2), పార్థ్ పటేల్ (1), ఆర్యన్ బత్రా (1) వికెట్లు పడగొట్టారు. అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో థియో (18) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
బంతిని తన్నబోయి ప్రత్యర్థి కాలు విరగొట్టాడు
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆటగాళ్లకు దెబ్బలు తగలడం సహజం. కోపంతో గొడవలు జరిగిన సమయంలో ఆటగాళ్లు కొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తూ తనకు తెలియకుండా జరిగిన పొరపాటు వల్ల ప్రత్యర్థి ఆటగాడికి ఎంత నష్టం జరిగిందనేది ఈ వార్త తెలియజేస్తుంది. విషయంలోకి వెళితే.. కోపా లిబెర్టడోర్స్ టోర్నీ(Copa Libertadores)లో భాగంగా బ్రెజిల్ ఫ్లుమినెన్స్,అర్జెంటినోస్ జూనియర్స్ తలపడ్డాయి. మ్యాచ్‌లో ఇరుజట్లు చెరొక గోల్ కొట్టడంతో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. కాగా ఆట 56వ నిమిషంలో బ్రెజిల్ ఫ్లుమినెన్స్ ఆటగాడు మార్సెలో బంతిని తన్నబోయి అనుకోకుండా ప్రత్యర్థి డిఫెండర్ లుసియానో సాంచెజ్ ఎడమ కాలు గట్టిగా తొక్కాడు. మార్సెలో బంతిని తన్నబోయే సమయంలోనే లుసియానో అతని వైపు దూసుకురావడం.. కాలు అడ్డుపెట్టడం జరిగిపోయాయి. దీంతో లుసియానో ఒక్కసారిగా కుప్పకూలిపోయి నొప్పితో విలవిలలాడాడు. ఊహించని సంఘటనతో మార్సెలో షాక్ తిన్నాడు. వెంటనే వైద్య సిబ్బంది మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. లూసియానోను పరీక్షించిన వైద్యులు కాలు విరిగిపోయినట్టు గుర్తించారు. అతను కోలుకునేందుకు 8 నెలల నుంచి 12 నెలలు పట్టనుందని సమాచారం. బాధ భరించలేక ఏడుస్తునే మైదానం వీడిన లూసియానోను చూసి మార్సెలో కంటతడి పెట్టుకున్నాడు. ''నేను ఈరోజు మైదానంలో నేను చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నా. సహచర ఫుట్‌బాలర్‌ను కావాలని గాయపరచలేదు. లుసియానో సాంచెజ్.. నువ్వు తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా'' అని మార్సెలో ట్విటర్లో పేర్కొన్నాడు. మార్సెలో పోస్ట్‌పై అర్జెంటీనా క్లబ్ స్పందిస్తూ.. ''మనం ప్రత్యర్థులం.. శత్రువులం కాదు'' అని కామెంట్ చేసింది. Dios mio https://t.co/LO8ezSX3Oe pic.twitter.com/V9a24dYGBu — Usuarios siendo domados (@sindicatodedom4) August 1, 2023 చదవండి: 100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్ స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్‌లకు షాక్; డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో భారీ కోత -
క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్‌కేసులో డెడ్‌బాడీ ముక్కలు
Fernando perez algaba: అర్జెంటీనాకు చెందిన క్రిప్టోకరెన్సీ ఇన్‌ప్లూయెన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా (41) అదృశ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. గత వారం రోజులకు ముందు తప్పిపోయిన ఫెర్నాండో శవమై కనిపించాడు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒక సూట్ కేసులో ఆయన మృతదేహానికి చెందిన కొన్ని భాగాలను పోలీసులు కనుగొన్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక ప్రవాహం సమీపంలో సూట్‌కేస్‌లో అల్గాబా అవశేషాలను పోలీసులు కను గొన్నారు. అనుమానాస్పద ఎర్రటి సూట్‌కేస్‌ని కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా గుర్తించారు. దీంతో పెద్దల సాయంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేయగా సూట్‌కేసులో అల్గాబా కాళ్లు, ముంజేతులు కనుగొన్నారని పోస్ట్ పేర్కొంది. అతని మరో చేయి ప్రవాహంలో కనిపించింది. చివరికి బాధితుడి మొండెం, కత్తిరించిన తల వంటి మరిన్ని శరీర భాగాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని బాడీ మీద ఉన్న వివిధ రకాల టాటూలు , వేలిముద్ర విశ్లేషణ ద్వారా అతని గుర్తించారు. అప్పుల కారణంగానే హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ, శవపరీక్షలో ఫెర్నాండో పెరెజ్ అల్గాబా శరీరం మూడు బుల్లెట్ గాయాలున్నట్టు తేలింది. ఇదొక ఒక ప్రొఫెషనల్ నేరగాడి పని అని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అతను చాలా అప్పుల్లో ఉన్నాడని, మోసం ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఫెర్నాండో పెరెజ్ అల్గాబా మరణానికి కారణాలను పోలీసుల విచారిస్తున్నారు. కాగా అల్గాబా విలాసవంతమైన వాహనాలను అద్దెకు ఇవ్వడం, క్రిప్టోకరెన్సీని విక్రయించడం ద్వారా భారీ సంపదను ఆర్జించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు మిలియన్ ఫాలోయర్లు ఉన్నరు. విలాసవంతమైన జీవనశైలిని అనుసరించే ఈ క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ ఎల్లప్పుడూ ‘ రాగ్స్ టు రిచెస్ స్టోరీ’ ల గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. అతనికి అనేక కంపెనీలు కూడా ఉన్నాయి. 24 ఏళ్లకే అల్గాబా విలాసవంతమైన కార్లు, మోటార్‌సైకిళ్లు, జెట్ స్కీ లాంటి ఆస్తులున్నాయి. వీటిపై కూడా చాలా వివాదాలు ఉన్నట్టు సమాచారం. జూలై 19 నుంచి కనిపించకుండా పోయాడు. -
మెస్సీ అదరగొట్టినా.. తీవ్ర నిరాశలో అభిమానులు!
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరపున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మెస్సీ అదనపు సమయంలో వచ్చిన ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. ఇది మరువకముందే మరోసారి ఇంటర్ మియామి క్లబ్ తరపున అదరగొట్టాడు. బుధవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) అట్లాంటా యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్ మియామి క్లబ్ 4-0తో ఘన విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో సింగిల్ గోల్‌తో మెరిసిన మెస్సీ ఈసారి మాత్రం డబుల్ గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆట ఎనిమిదో నిమిషంలో సెర్జియో బస్క్వెట్స్ నుంచి పాస్ అందుకున్న మెస్సీ బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించి ఇంటర్ మియామి క్లబ్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 22వ నిమిషంలో మరో గోల్‌తో మెరిసిన మెస్సీ మ్యాచ్‌లో రెండో గోల్ నమోదు చేశాడు. ఇక ఆట 53వ నిమిషంలో రాబర్ట్ టేలర్‌కు మెస్సీ అసిస్ట్ అందించగా.. అది గోల్‌గా వెళ్లడంతో ఇంటర్ మియామి 3-0తో భారీ ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఇక 84వ నిమిషంలో క్రిస్టోఫర్ మెక్వే గోల్ కొట్టడంతో 4-0తో ఇంటర్ మియామి స్పష్టమైన విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ చివర్లో 12 నిమిషాలు ఉందనగా ఇంటర్ మియామి క్లబ్ మెస్సీని వెనక్కి పిలిచింది. మొత్తం గేమ్ ఆడించడానికి రిస్క్ తీసుకోలేమని తెలిపింది. దీంతో మెస్సీ మైదానం నుంచి వెళ్లిపోయే సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. అయితే కేవలం మెస్సీ ఆటను చూడడానికే తాము వచ్చామని.. అతను ఆడకపోతే మేం ఇక్కడ ఉండడం వ్యర్థమంటూ.. మెస్సీ మైదానం వీడగానే చాలా మంది అభిమానులు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది గమనించిన మెస్సీ మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్‌ను ఉద్దేశించి.. ''నాకోసం మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు.. కానీ ఇలా మ్యాచ్ మధ్యలో మీరు వెళ్లిపోవడం నాకు నచ్చలేదు.. ఇలాంటివి వద్దు.. మీ అభిమానానికి థాంక్స్'' అంటూ పేర్కొన్నాడు. من مغادرة الجماهير بعد خروج الأسطورة ميسي🏟️ pic.twitter.com/RdW11m84Iu — Messi Xtra (@M30Xtra) July 26, 2023 That Busquets > Messi link up play 😍 Lionel Messi makes it two goals in two gamespic.twitter.com/MYRNwukH0N — 101 Great Goals (@101greatgoals) July 25, 2023 LIONEL MESSI WITH HIS SECOND GOAL OF THE MATCH FOR INTER MIAMI! Via MLS.pic.twitter.com/itYUdcED4h — Roy Nemer (@RoyNemer) July 26, 2023 చదవండి: FIFA World Cup: ప్రపంచకప్‌లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా.. Asian Games 2023: హర్మన్‌పై వేటు.. ఆసియా గేమ్స్‌లో జట్టును నడిపించేది ఎవరు? -
ఒక్క మ్యాచ్ ఆడగానే కెప్టెన్‌ను చేసేశారు.. ఇంటర్ మియామి సారధిగా మెస్సీ
ఏడుసార్లు బాలన్ డి'ఓర్ విజేత, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ ఇంటర్ మియామీ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నెల ప్రారంభంలో పీఎస్జీ నుంచి ఇంటర్ మియామికి మారిన మెస్సీ, మెక్సికన్ క్లబ్ క్రూజ్ అజుల్‌తో జరిగిన మ్యాచ్‌తో మియామి తరఫున అరంగేట్రం చేశాడు. కేవలం ఒక్క మ్యాచ్ ఆడగానే మెస్సీని కెప్టెన్‌ను చేసేశారు మియామి క్లబ్ నిర్వహకులు. ఈ విషయాన్ని మియామి క్లబ్ మేనేజర్ టాటా మార్టినో సోమవారం ప్రకటించారు. మెస్సీ మియామికి ఆడిన తొలి మ్యాచ్‌లోనే గోల్ కొట్టాడు. క్రూజ్ అజుల్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ 25 గజాల దూరం నుండి ఫ్రీకిక్ గోల్ కొట్టి, తన జట్టును 2-1తో గెలిపించాడు. 54వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన మెస్సీ ఈ గోల్ కొట్టాడు. కాగా, మెస్సీ.. అమెరికన్ ప్రొఫెషనల్ సాకర్ క్లబ్ అయిన ఇంటర్ మయామి క్లబ్‌తో 2025 సీజన్ పూర్తయ్యే వరకు ఆడేందుకు ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ సీజన్‌కు రూ. 492 కోట్లు (60 మిలియన్ డాలర్లు) అని క్లబ్ వర్గాలు వెల్లడించాయి. మియామి ఆఫర్‌కు ముందు మెస్సీకి సౌదీ క్లబ్ అల్ హిలాల్, బార్సిలోనా క్లబ్‌ల నుంచి భారీ మొత్తంలో ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించాడు. మెస్సీకి మియామి క్లబ్‌పై ఉన్న ఆసక్తిని చూసి యాజమాన్యం కేవలం ఒక్క మ్యాచ్ ఆడగానే కెప్టెన్సీ కట్టబెట్టింది. బుధవారం (జులై 26) నుంచి ప్రారంభంకాబోయే లీగ్స్ కప్‌లో మెస్సీ మియామి నూతన సారధిగా బాధ్యతలు చేపడతాడు. ఈ లీగ్‌లో మియామి తమ తొలి మ్యాచ్‌లో ఆట్లాంటా యునైటెడ్‌తో తలపడుతుంది. -
సీజన్‌కు రూ.492 కోట్ల చొప్పున.. మియామి క్లబ్‌కు మెస్సీ
ఫోర్ట్ లాడెర్డేల్ (ఫ్లోరిడా): అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ కొత్త గూటికి చేరాడు. అమెరికన్ ప్రొఫెషనల్ సాకర్ క్లబ్ అయిన ‘ఇంటర్ మయామి’ జట్టుతో ఆడేందుకు సోమవారం ఇక్కడికి వచ్చాడు. ఈ క్లబ్‌కు చెందిన స్టేడియంలో అతను ‘10 నంబర్ జెర్సీ’తో ప్రవేశించగానే క్లబ్ సహ యజమాని, ఇంగ్లండ్ సాకర్ స్టార్, మాజీ కెప్టెన్ బెక్‌హామ్ ఆలింగనం చేసుకొని అభిమానుల హర్షధ్వానాల మధ్య స్వాగతం పలికాడు. 2025 సీజన్ పూర్తయ్యే వరకు ఇంటర్ మయామితో ఆడేందుకు మెస్సీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ సీజన్‌కు రూ. 492 కోట్లు (60 మిలియన్ డాలర్లు) అని క్లబ్ వర్గాలు వెల్లడించాయి. View this post on Instagram A post shared by ESPN FC (@espnfc) చదవండి: Asian Games 2023: ఆసియా క్రీడల్లో ఆడనివ్వండి -
ఓ హైదరాబాదీ విద్యార్థి ఫుట్‌బాల్ ప్రేమకథ!
అభిమానం హద్దుల్ని చెరిపేస్తుంది. ఆట మీద, ఆటగాడి మీద ప్రేమ ఎన్ని వందల, వేల కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించేలా చేస్తుంది. హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఎస్.ఎన్. కార్తికేయ పాడి అందుకు తాజా ఉదాహరణ. పందొమ్మిది ఏళ్ళ ఈ కుర్రాడు తన అభిమాన ఫుట్‌బాల్ ఆటగాడైన ప్రసిద్ధ అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్‌ను కలిసేందుకు కష్టపడి కలకత్తా దాకా ప్రయాణించారు. ఈ జూలై మొదటివారంలో భారత సందర్శనకు వచ్చిన ఆ ప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాణ్ణి అతి కష్టం మీద స్వయంగా కలిసి, తన అభిమానాన్ని చాటుకున్నారు. కొద్ది నెలల క్రితమే అర్జెంటీనా జట్టు గెలిచినప్పుడు ‘2022 ప్రపంచ కప్ (ఫిఫా -2022)’ నిర్వాహకులు అందించిన నమూనా ట్రోఫీ చేత ధరించిన తన ఆరాధ్య ఆటగాడితో కలసి ఫోటో దిగారు. మార్టినెజ్ పై మనోడికి అంత పిచ్చి ప్రేమకు కారణం లేకపోలేదు. 1986లో డీగో మ్యారడోనా సారథ్యంలో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అర్జెంటీనా జట్టు మళ్ళీ గత ఏడాదే ప్రపంచ కప్‌లో విజేతగా విజయపతాకాన్ని రెపరెపలాడించింది. ఈ తాజా విజయంలో గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ కీలక పాత్ర పోషించారు. మెస్సీ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ళు అర్జెంటీనాకు ఉన్నప్పటికీ... ఫ్రాన్స్ జట్టుతో ఈ ఫిఫా-2022 ఫైనల్ మ్యాచ్ 3 – 3 గోల్స్‌తో సమం అయింది. మార్టినెజ్ది కీలక పాత్ర విజేతను నిశ్చయించే పెనాల్టీ షూటౌట్లో గోల్‌కీపర్ మార్టినెజ్ ప్రతిభా నైపుణ్యాలు అర్జెంటీనాకు కలిసొచ్చాయి. ఫ్రాన్స్ పెనాల్టీ కిక్‌ను నిలువరించి, 4-2 గోల్స్ తేడాతో అర్జెంటీనా జట్టును విజేతగా నిలపడంలో ముఖ్యుడు మార్టినెజ్. అంతకు ముందు 2021 కోపా కప్ సెమీ ఫైనల్లో సైతం మూడు పెనాల్టీ కార్నర్లను నిలువరించి, అర్జెంటీనా జట్టు ఫైనల్‌కు చేరి, కప్పు సాధించేలా చేయడంలోనూ మార్టినెజ్ కీలకం. అందుకే, ఆయన ఆటతీరును అభిమానులు మరవలేరు. అంతటి దిగ్గజ ఆటగాడు మన దేశానికి వస్తున్నారని తెలుసుకున్న టీనేజ్ స్టూడెంట్ కార్తికేయ పాడి తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవాలని శ్రమించారు. ప్రముఖ మోహన్ బగాన్ క్లబ్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్టినెజ్ గత వారం కలకత్తా వచ్చారు. అంతగా ప్రచారం లేని ఈ కార్యక్రమం గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కార్తికేయ ఎలాగైనా తన ఫేవరెట్ ప్లేయర్‌ను కలవాలనుకున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, కలకత్తా వెళ్ళారు. ఎలాగోలా అక్కడ తన ఆరాధ్యదైవాన్ని చేరుకోగలిగారు. ఫుట్‌బాల్ ప్రేమికుడూ, స్వయంగా స్కూలు, కాలేజీ స్థాయిలో సోకర్ ఆటగాడూ అయిన కార్తికేయ తన అభిమాన జట్టు గోల్ కీపర్‌ను ఆయన హోటల్ విడిదిలో ప్రత్యేకంగా కలిసే అదృష్టం దక్కించుకున్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణించి ఖతార్‌లో జరిగిన ఫిఫా-2022 ప్రపంచ కప్ తర్వాత విశ్వవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, అభిమానుల్ని సంపాదించుకున్న మార్టినెజ్ తన కోసం ఓ తెలుగు విద్యార్థి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన వివరాలు విని, ముగ్ధుడయ్యారు. వీరాభిమాని కార్తికేయ కోరికను మన్నించి ఫోటో దిగడమే కాక, తమ అర్జెంటీనా జట్టు జెర్సీపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఆరాధ్య దైవమైన అర్జెంటీనా ఆటగాడిని కలసి, మాట్లాడి, ఫోటో, అరుదైన జెర్సీపై ఆటోగ్రాఫ్ తీసుకొని, హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కార్తికేయ పాడి ఆనందానికి అవధులు లేవు. “ఫుట్ బాల్ దిగ్గజాల్లో ఒకరైన మార్టినెజ్‌ను స్వయంగా కలసి, మాట్లాడడం ఏ ఫుట్‌బాల్ ప్రేమికుడికైనా ఓ కల. అలా నా కల నిజమైన క్షణమిది. ఈ మధురానుభూతిని మాటల్లో వర్ణించలేను” అని ఈ టీనేజ్ విద్యార్థి ఉద్వేగంగా చెప్పారు. సంగీతం, ఆటలు ఈ తెలుగు కుర్రాడు హైదరాబాద్ శివార్లలోని డాక్టర్ బీవీ రాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ) నర్సాపూర్ క్యాంపస్‌లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థికి చదువుతో పాటు సంగీతం, ఆటల పట్ల అమితమైన ఆసక్తి. స్వయంగా ఫుట్‌బాల్ ఆడడంతో పాటు లండన్‌లోని రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో పాశ్చాత్య సంగీత గానంలోనూ, అలాగే పియానో వాదనలోనూ 5వ గ్రేడ్ ఉత్తీర్ణుడయ్యారు. “శ్రమిస్తే ఏ స్థాయికైనా ఎదగవచ్చనడానికి మార్టినెజ్ ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన స్ఫూర్తితో, రాబోయే రోజుల్లో అటు సంగీతం, ఇటు ఆటలు కొనసాగిస్తూనే, చదువులో మంచి మార్కులు సాధించి, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి. మా అమ్మానాన్న, తమ్ముడు గర్వపడేలా చేయాలనేది నా లక్ష్యం” అన్నారు నవతరానికి ప్రతినిధి అయిన కార్తికేయ. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కార్తికేయ తండ్రి రవి పాడి సైతం తెలుగునాట మారుమూల ప్రాంతం నుంచి వచ్చి, ఎంతో శ్రమించి ఇండియన్ రైల్వే సర్వీసులో ఉన్నతాధికారిగా ఎదిగారు. సంగీత, సాహిత్య, సినీ ప్రేమికుడిగా, అరుదైన సినిమా గ్రామ్‌ఫోన్ రికార్డులు, పోస్టల్ స్టాంపులు, ప్రత్యేక కవర్ల సేకర్తగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. -రెంటాల జయదేవ -
Wimbledon 2023: వేట మొదలు...
కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ టోరీ్నలో అడుగు పెట్టిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించాడు. వరుస సెట్లలో గెలిచి టైటిల్ వేటను ఆరంభించాడు. 2018 నుంచి ఈ టోరీ్నలో ఓటమి ఎరుగని ఏడుసార్లు చాంపియన్ ఎనిమిదోసారి విజేతగా అవతరించాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్ టోరీ్నలు ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ జొకోవిచ్ ఖాతాలోకే వెళ్లాయి. వింబుల్డన్‌లోనూ జొకోవిచ్ అజేయంగా నిలిస్తే అరుదైన ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించేందుకు జొకోవిచ్‌కు రెండోసారి అవకాశం లభిస్తుంది. 2021లో జొకోవిచ్ ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోరీ్నలను గెలిచి చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. 1969లో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా) తర్వాత పురుషుల టెన్నిస్‌లో మరో ప్లేయర్ ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను సాధించలేకపోయాడు. లండన్: కాస్త పోటీ ఎదురైనా... కీలకదశలో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచిన సెర్బియా టెన్నిస్ మేటి నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 7–6 (7/4)తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 2 గంటల 12 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 13 ఏస్‌లు సంధించాడు. తన సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 45 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ నెట్ వద్దకు 35 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. జొకోవిచ్ 18వ సారి వింబుల్డన్ టోరీ్నలో ఆడుతుండగా... కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోరీ్నలో బరిలోకి దిగిన కాచిన్ పది ఏస్‌లు సంధించి, 29 అనవసర తప్పిదాలు చేశాడు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–1, 5–7, 6–4, 6–3తో లారెంట్ లోకిలి (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–3, 7–5, 6–4తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)పై, 14వ సీడ్ ముజెట్టి (ఇటలీ) 6–3, 6–1, 7–5తో వారిలాస్ (కెనడా)పై, 17వ సీడ్ హుర్కాజ్ (పోలాండ్) 6–1, 6–4, 6–4తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. స్వియాటెక్ బోణీ మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్), నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), ఐదో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), ప్రపంచ మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో స్వియాటెక్ 6–1, 6–3తో లిన్ జు (చైనా)ను ఓడించగా... పెగూలా 6–2, 6–7 (8/10), 6–3తో లారెన్ డేవిస్ (అమెరికా)పై, గార్సియా 6–4, 6–3తో కేటీ వోలినెట్స్ (అమెరికా)పై, అజరెంకా 6–4, 5–7, 6–4తో యు యువాన్ (చైనా)పై విజయం సాధించారు. -
సింగర్‌లా కనిపించాలని సర్జరీ.. ఇప్పుడేమో సగం మొహానికి స్పర్శ లేదు, ముక్కు, మూతి చూస్తే..
అభిమానం వెర్రితలలు వేస్తే ‘ఫ్రాన్ మారియానో’లా ఉంటుంది. అతను అర్జంటీనా వాసి. స్పానిష్ (ప్యుర్టో రికా) గాయకుడు, పాటల రచయిత, నటుడు రికీ మార్టిన్ వీరాభిమాని! సాధారణంగా అయితే సెలబ్రిటీల అభిమానులు.. సెలబ్రిటీల అభినయ, ఆహార్య, వాచకాలను అనుకరిస్తూ ఆనందపడుతుంటారు. కానీ ఫ్యాన్ ఫ్రాన్ మారియానో మాత్రం తన రూపు రేఖలనే మార్చేసుకున్నాడు కనుబొమలు సహా! అచ్చం రికీలాగే కనిపించాలనే కోరికతో ఏకంగా డజన్‌కి పైగా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నాడు. తన కనుబొమలు కూడా రికీ మార్టిన్ కనుబొమలను పోలి ఉండాలని మోటార్ ఆయిల్ ఇంజెక్షన్ చేయించుకున్నాడు. ఈ ప్రకియంతా అతన్ని త్రీవమైన శారీరక, మానసిక వ్యధలోకి నెట్టింది. ఇప్పుడు అతను ఇటు తనలా కాకుండా అటు రికీ మార్టిన్లా కాకుండా తయారయ్యాడు. ఈ మధ్యే ఓ రియాలిటీ షో (అర్జంటీనా)లో తనలాంటి ఫ్యాన్స్‌కి తన అనుభవాన్ని చెబుతూ ఏ అభిమానీ తనలా మారొద్దని.. అభిమానాన్ని హద్దులు మీరనివ్వద్దని హెచ్చరించాడు. ‘నా ముక్కు, మూతి నావి కాకుండా పోయాయి. నా సగం మొహానికి స్పర్శే తెలియడం లేదు. మంచినీళ్లనూ గటగటా తాగలేని పరిస్థితి.. కర్చీప్ని నీళ్లలో ముంచి నోట్లో పిండుకోవాల్సి వస్తోంది’ అని వాపోతున్నాడు మారియానో. ఇతని గాథ విన్నవాళ్లంతా ‘ప్చ్ .. క్రేజీ ఫెలో.. ’ అంటూ జాలిపడుతున్నారు. చదవండి: ఇదేం ఆచారం.. వధువు నెత్తి కొట్టుకుంది.. ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ -
FIFA Rankings: టైటిల్ సాధించి.. టాప్- 100లో.. 1996లో అత్యుత్తమంగా..
స్వదేశంలో ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్‌కప్ నాలుగు దేశాల టోర్నీలో టైటిల్ సాధించినందుకు భారత జట్టు ర్యాంకింగ్స్‌లో పురోగతి కనిపించింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) తాజా ర్యాంకింగ్స్‌లో సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత పురుషుల జట్టు సరిగ్గా 100వ స్థానంలో నిలిచింది. క్రితంసారి భారత్ 101వ ర్యాంక్‌లో నిలువగా... ఈసారి ఒక స్థానం మెరుగుపర్చుకుంది. 2019 ఫిబ్రవరి 7 తర్వాత భారత జట్టు మళ్లీ టాప్–100లోకి రావడం ఇదే తొలిసారి. 2019 ఫిబ్రవరిలో భారత్ 97వ ర్యాంక్‌లో నిలిచింది. ఆ తర్వాత భారత ర్యాంక్ పడిపోయింది. 1996లో భారత్ అత్యుత్తమంగా 94వ ర్యాంక్‌లో నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు స్వదేశంలో జరుగుతున్న దక్షిణాసియా చాంపియన్‌షిప్‌లో బరిలో ఉంది. శనివారం జరిగే సెమీఫైనల్లో లెబనాన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... ఫ్రాన్స్ రెండో ర్యాంక్‌లో, బ్రెజిల్ మూడో ర్యాంక్‌లో ఉన్నాయి. -
#LionelMessi: 'కేజీఎఫ్' బ్యాక్‌గ్రౌండ్.. రోమాలు నిక్కబొడిచేలా..
5 అడుగుల 9 అంగుళాలు.. మొహంపై చెరగని చిరునవ్వు.. 18 ఏళ్లుగా తన ఆటతో అభిమానులను అలరిస్తూనే వస్తున్నాడు.. మారడోనా తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ అభిమానులకు ఆరాధ్య దైవంగా మారిపోయాడు.. ఈ తరంలో ఫుట్‌బాల్‌లో క్రిస్టియానో రొనాల్డోతో పోటీ పడుతున్న అతను ఒక మెట్టుపైనే ఉన్నాడు.అతనే అర్జెంటీనా గ్రేట్ లియోనల్ మెస్సీ. లియోనల్ మెస్సీ.. ఫుట్‌బాల్ కెరీర్లో చూడాల్సినవన్నీ చూశాడు. పసిఫిక్ దేశాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే కోపా అమెరికా కప్‌ను 2021లో అర్జెంటీనాకు అందించాడు. ఇక ఇంతకాలం వెలితిగా ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ను కూడా గతేడాది ఒడిసిపట్టాడు. వరల్డ్‌కప్ సాధించిన తర్వాత ఆటకు గుడ్‌బై చెప్తాడని అంతా భావించారు. కానీ మెస్సీ అలా చేయలేదు. తనలో శక్తి ఉన్నంతవరకు ఆడతానని.. ఇక ఆడలేను అన్నప్పుడు రిటైర్ అవుతానని మెస్సీ స్వయంగా పేర్కొన్నాడు. ఆల్‌టైమ్ గ్రేట్‌గా అభివర్ణిస్తున్న లియోనల్ మెస్సీ ఇవాళ(జూన్ 24న) 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మరి కెరీర్లో ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగిన శిఖరంలా కనిపించే మెస్సీకి గుండె లోతుల్లోనుంచి చెబుతున్న ఒక్క మాట.. Happy Birthday Lionel Messi.. విచిత్రమైన డెబ్యూ.. ఏ ఆటగాడైనా తన అరంగేట్రంలో అదరగొట్టాలని భావించడం సహజం. కానీ మెస్సీ విషయంలో కాస్త భిన్నం. 2005లో అర్జెంటీనా తరపున హంగేరీతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేశాడు. అది కూడా ఒక సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా. అయితే తొలి మ్యాచ్‌లోనే మెస్సీకి వింత అనుభవం ఎదురైంది. హంగేరీ ఆటగాడు మెస్సీ జెర్సీని పట్టుకొని లాగడంతో .. మెస్సీ మోచేతి సదరు ఆటగాడికి బలంగా తాకింది. దీంతో రిఫరీ మెస్సీకి రెడ్‌కార్డ్ చూపించాడు. కేవలం 47 సెకన్ల పాటు మాత్రమే గ్రౌండ్లో ఉన్న మెస్సీ అనూహ్య రీతిలో మైదానం వీడాల్సి వచ్చింది. అంతుచిక్కని వ్యాధి.. మెస్సీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మెస్సీ జీవితంలో ఫుట్‌బాల్ ఆటగాడు కాలేడని వైద్యులు ప్రకటించారు. అయితే మెస్సీకి చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు 900 డాలర్లు ఖర్చు అయ్యేది. మెస్సీ కుటుంబానికి ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో మెస్సీ చికిత్సకు కష్టంగా మారింది. దీంతో మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధం కారణంగా బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ రంగంలోకి దిగింది. మెస్సీ కుటుంబానికి అండగా నిలబడిన బార్సిలోనా మెస్సీతో పాటు కుటుంబాన్ని మొత్తం స్పెయిన్‌కు తరలించి మెస్సీకి చికిత్స చేయించడం విశేషం. అలా 11 ఏళ్ల వయసులోనే మెస్సీ బార్సిలోనాకు రుణపడిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆల్‌టైమ్ గ్రేట్‌గా గుర్తింపు.. 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన లియోనల్ మెస్సీ అర్జెంటీనా తరపున 175 మ్యాచ్‌ల్లో 103 గోల్స్ చేశాడు. అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా.. ఫుట్‌బాల్ ప్రపంచంలో రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. తన కెరీర్లో ఎక్కువగా బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్.. పారిస్ సెయింట్ జెర్మన్ క్లబ్ తరపున 75 మ్యాచ్‌ల్లో 32 గోల్స్.. ఓవరాల్‌గా అంతర్జాతీయ, ప్రైవేటు ఫుట్‌బాల్ క్లబ్స్ కలిపి 1028 మ్యాచ్‌లాడి 807 గోల్స్‌తో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. Happy Birthday Thalaivaaa😘🐐❤️#LeoMessi #Messi𓃵 #Messi #LionelMessi #HappyBirthdayMessi pic.twitter.com/NY7CR1WQrD — Chikadhee 🇦🇷 ™ (@Chickadhi) June 23, 2023 Happy 36th birthday GOAT 🐐#LionelAndresMessi. Happy Birthday Leo 🦁 Hoping for another Ballon d'Or in October. 🤗🤗#Messi #Leo #Messi36 #Messi𓃵 #MessiBirthday #LionelMessi pic.twitter.com/pSwzXxD0Hs — Fukkard (@Fukkard) June 24, 2023 #GOAT𓃵 #Messi𓃵 📸🙌🏻🐐🎂 pic.twitter.com/chrslX3wvd — sameer ᴩᴀᴛʜᴀɴ 👑🦁 (@sameerp07528955) June 24, 2023 -
మెస్సీని మిస్సయ్యాం!.. అర్జెంటీనా వస్తానంటే భారత్ వద్దన్నది
లియోనల్ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. అతను ఒక మ్యాచ్ ఆడితే కోట్లలో వీక్షిస్తారు. అలాంటి మెస్సీ మన దేశానికి వచ్చి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతానంటే భారత్ వద్దనడం ఆశ్చర్యం కలిగించింది. అర్జెంటీనా ప్రస్తుతం ఫుటబాల్లో చాంపియన్ అన్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ సేన ఫ్రాన్స్‌పై ఫూటౌట్లో 4-2తో విజయం సాధించి మూడోసారి వరల్డ్‌కప్ గెలుచుకుంది. అన్నీ తానై నడిపించిన మెస్సీ అర్జెంటీనాకు కప్ అందించి 36 సంవత్సరాల నిరీక్షణకు తెరదించాడు. ఇలాంటి మేటి చాంపియన్ టీమ్ వచ్చి ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడతామంటే ఫుట్‌బాల్ అభివృద్ధి కోరే ఏ దేశమైనా ఎగిరి గంతేస్తుంది. ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తుంది. కానీ జనాభాలో చైనాను మించిన భారత్ మాత్రం తమ ఫుట్‌బాల్ అబిమానులకు నిరాశ కలిగించే నిర్ణయంతో అర్జెంటీనా వస్తనంటే వద్దన్నది. అర్జెంటీనా జట్టు అయినా.. ఆ జట్టు ఆటగాళ్లయినా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్. అలాంటి జట్టు అప్పియరెన్స్ ఫీజుగా 50 లక్షల డాలర్లు(రూ.40 కోట్లు) ఇస్తే చాలు అందుబాటులో ఉన్న జూన్ 12 నుంచి 20వ తేదీల్లో భారత్ వేదికపై ఒక మ్యాచ్ ఆడి వెళతామంది. కానీ అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF) అంత మొత్తం ఇవ్వలేం అనేసరికి మెస్సీ టీమ్ జూన్ 15న బీజింగ్‌లో ఆస్ట్రేలియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది. మనకంటే చిన్నదేశం ఇండోనేషియా వాళ్లు అడిగినంత ఫీజులో ఏ లోటు లేకుండా చెల్లించి జకార్తాలో 19న అర్జెంటీనాతో మ్యాచ్ ఆడి తమ కోరికను నెరవేర్చుకుంది. అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న మన భారత్ మాత్రం రూ. 40 కోట్లు ఇచ్చుకోలేక అర్జెంటీనాతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించడం విస్మయం కలిగించే అంశం. చదవండి: #LionelMessi: ఆపడం ఎవరి తరం.. కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ -
#LionelMessi: ఆపడం ఎవరి తరం.. కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మంచి దూకుడు మీద ఉన్నాడు. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ గెలిచినప్పటి నుంచి మెస్సీలో ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు. పైగ రోజురోజుకు మెస్సీ క్రేజ్ పెరుగుతూనే ఉంది. అతని జోరు.. ఫిట్నెస్ చూస్తుంటే మరో ఫిఫా వరల్డ్‌కప్ ఆడేలా కనపిస్తున్నాడు. తాజాగా గురువారం బీజింగ్ వేదికగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్‌లో మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ నమోదు చేశాడు. ఆట మొదలైన నిమిషం 19 సెకన్ల వ్యవధిలోనే మెస్సీ అర్జెంటీనాకు గోల్ అందించాడు. మెస్సీ కెరీర్లో ఇదే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గత ఏడు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా తరపున మెస్సీకి ఇది ఏడో గోల్ కాగా.. ఓవరాల్‌గా ఈ ఏడాది 13 మ్యాచ్‌ల్లో 17 గోల్స్ చేసిన మెస్సీ.. 5 అసిస్ట్‌లు అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అర్జెంటీనా ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే మెస్సీ గోల్ అందించగా.. ఆట 68వ నిమిషంలో జెర్మన్ పెజెల్లా జట్టుకు రెండో గోల్ అందించాడు. Leo Messi. After one minute. Of course ☄️ (via @CBSSportsGolazo)pic.twitter.com/r5UknzrZvB — B/R Football (@brfootball) June 15, 2023 చదవండి: ఐపీఎల్ బంధం ముగిసే.. మేజర్ లీగ్ క్రికెట్లో మొదలు -
చైనాలో మెస్సీకి చేదు అనుభవం.. కారణం?
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి చైనాలో చేదు అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్ విషయంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు మెస్సీని అడ్డుకోవడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. ఈ గురువారం(జూన్ 15న) బీజింగ్ వేదికగా ఆస్ట్రేలియాతో అర్జెంటీనా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం జూన్ 10న మెస్సీ చైనాలోని బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టాడు. అయితే పాస్‌పోర్ట్ చెక్ చేసిన పోలీసులు మెస్సీని అడ్డుకున్నారు. మెస్సీకి చైనా వీసా లేదని, అప్లై కూడా చేసుకోలేదని వివరించారు. అయితే తన దగ్గరున్న స్పానిష్, అర్జెంటీనా పాస్‌పోర్టును అందజేసిన మెస్సీ.. తైవాన్లాగే చైనాలో కూడా తనకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని భావించానని తెలిపాడు. కానీ చైనాలోకి రావాలంటే వీసా ఉండాల్సిందేనని, వెంటనే అప్లై చేసుకోవాలని.. తైవాన్ రూల్ వర్తించదని పోలీసులు వెల్లడించారు. అయితే అధికారులు చొరవ తీసుకొని అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కింద వీసా అందించి సమస్యను పరిష్కరించారు. దీంతో పోలీసులకు మెస్సీ కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జూన్ 15న ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం జట్టుతో కలిసి ఇండోనేషియా వెళ్లనున్న మెస్సీ జూన్ 19న ఇండోనేషియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. ఇక గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌తో గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్నాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనా మూడోసారి వరల్డ్‌కప్ గెలవడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. -
ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!
ఏ దేశంలోని రోడ్లయినా వివిధ ప్రాంతాలను కలుపుతాయనే విషయం మనకు తెలిసిందే. వివిధ రోడ్లపై ప్రయాణించడం ద్వారా మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవచ్చు. అయితే కొన్ని రోడ్లు చిన్నవిగా, మరికొన్ని రోడ్లు పెద్దవిగా ఉండటాన్ని మనం గమనించేవుంటాం. మనదేశంలోని అతిపెద్ద రోడ్డు విషయానికివస్తే అది నేషనల్ హైవే-44. ఇది 3,745 కిలోమీటర్ల దూరం కలిగివుంది. ఇది కన్యాకుమారితో మొదలై శ్రీనర్ వరకూ ఉంటుంది. అయితే ప్రపంచంలో దీనికి మించిన అతిపెద్ద హైవే ఉందని, దానిపై ప్రయాణిస్తే ఏకంగా 14 దేశాలు చుట్టేయచ్చనే సంగతి మీకు తెలుసా? ఉత్తర అమెరికా- దక్షిణ అమెరికాలను కలిపే పాన్ అమెరికా హైవే ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి. అలస్కాలో మొదలై అర్జెంటీనా వరకూ ఈ రహదారి కొనసాగుతుంది. రెండు మహా ద్వీపాలను అనుసంధానించే ఈ సింగిల్ రూట్ నిర్మాణానికి 1923లో తొలి అడుగు పడింది. ఈ హైవేను మొత్తం 14 దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ రహదారిలోని 110 కిలోమీటర్ల ఒక భాగం నిర్మాణం ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఈ భాగాన్ని డారియన్ గ్యాప్ అని అంటారు. ఇది పనామా కొలంబియాల మధ్య ఉంది. కాగా ఈ డారియన్ గ్యాప్ ప్రాంతం కిడ్నాప్‌లు, డ్రగ్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్ తదితర అక్రమ కార్యకలాపాలకు నిలయంగా మారింది. దీంతో జనం ఈ మార్గాన్ని దాటేందుకు బోటు లేదా ప్లెయిన్ మాధ్యమంలో బైపాస్ చేస్తారు. చదవండి: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. భార్య కోసం ఇండియా నుంచి యూరప్‌కు సైకిల్‌పై ఆ 14 దేశాలు ఇవే.. 1. యునైటెడ్ స్టేట్స్ 2.కెనడా 3. మెక్సికో 4. గ్వాటెమాల 5. ఎల్ సల్వడార్ 6.హోండురాస్ 7. నికరాగ్వా 8. కోస్టా రికా 9.పనామా 10.కొలంబియా 11. ఈక్వెడార్ 12. పెరూ 13.చిలీ 14. అర్జెంటీనా ప్రయాణానికి ఎంత సమయం పడుతుందంటే... ఎవరైనా ప్రతీరోజూ సుమారు 500 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలిగితే వారు 60 రోజుల్లో ఈ రహదారి ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. కార్లెస్ సాంటామారియా అనే సైకిలిస్టు ఈ రహదారిని 177 రోజుల్లో చుట్టివచ్చాడు. ఈ నేపధ్యంలో అతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఈ రహదారి మొత్తం పొడవు 48 వేల కిలోమీటర్లు. The Pan-American highway is the longest highway in the world. This road is about 19.000 miles/30.000km long #nowyouknow #FridayThoughts pic.twitter.com/oRdBTMhFRD — 🇺🇦Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) November 6, 2020 -
FIFA Rankings: అర్జెంటీనా @ 1.. భారత్ @ 101
జ్యూరిక్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా జట్టు ఆరేళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ఇటీవల పనామా, కురాసావ్ జట్లతో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా గెలుపొందడంతో మెస్సీ బృందం రెండో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకుంది. గత ఏడాది ఖతర్‌లో జరిగిన ప్రపంచకప్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా 36 ఏళ్ల తర్వాత జగజ్జేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మొరాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో బ్రెజిల్ ఓడిపోవడంతో ఆ జట్టు నంబర్‌వన్ ర్యాంక్ నుంచి రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్‌కు చేరుకుంది. మూడో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ రెండో స్థానానికి ఎగబాకింది. బెల్జియం నాలుగో ర్యాంక్‌లో, ఇంగ్లండ్ ఐదో ర్యాంక్‌లో ఉన్నాయి. భారత్ @ 101 గురువారం విడుదల చేసిన ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఐదు స్థానాలు పురోగతి సాధించి 101వ ర్యాంక్‌కు చేరుకుంది. స్వదేశంలో జరిగిన మూడు దేశాల టోర్నీలో కిర్గిజ్ రిపబ్లిక్, మయాన్మార్ జట్లపై గెలిచి విజేతగా నిలవడంతో ర్యాంకింగ్స్‌లో భారత్ ఎగబాకింది. 1994లో భారత్ అత్యుత్తమంగా 94వ ర్యాంక్‌లో నిలిచింది. -
భళా అర్జెంటీనా.. ఆరేళ్ల తర్వాత అగ్రస్థానం
ఫిఫా ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా ఆరేళ్ల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని అధిరోహించింది. ఇటీవలే పనామా, కురాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లలో విజయాలు అందుకున్న అర్జెంటీనా 1840. 93 పాయింట్లతో నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో మెస్సీ సేన ఆరేళ్ల తర్వాత అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక గతేడాది డిసెంబర్లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షటౌట్లో 4-2తో ఓడించి మూడోసారి విజేతగా నిలిచింది. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ తన కోరికను నెరవేర్చుకోవడంతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్ 1838.45 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. యుఇఎఫ్ఎ యూరో క్వాలిఫైయింగ్‌లో భాగంగా ఫ్రాన్స్.. నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లను ఓడించి ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఇక ఏడాది కాలంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న బ్రెజిల్.. ఫిఫా వరల్డ్‌కప్‌లో మొరాకో చేతిలో 2-1తో ఓడింది. ఆ తర్వాత బ్రెజిల్ ఆశించినంతగా ఆడలేక 1834.21 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక బెల్జియం 1792. 53 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 1792.43 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ 1731. 23 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. యూరోప్ దేశాలైన క్రొయేషియా, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ ఆరు నుంచి పది స్థానాల్లో నిలిచాయి. 🇦🇷🏆 World champions ✅ 🇦🇷🥇 Top of the #FIFARanking ✅ — FIFA World Cup (@FIFAWorldCup) April 6, 2023 -
హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మంగళవారం మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అర్జెంటీనా తరపున వందో అంతర్జాతీయ గోల్ సాధించాడు. కురాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా 7-0తో రికార్డు విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. ఆట 20, 33, 37వ నిమిషాల్లో మెస్సీ గోల్స్ చేసి హ్యాట్రిక్‌తో పాటు వందో గోల్స్ సాధించాడు. ప్రస్తుతం మెస్సీ ఖాతాలో 102 గోల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ(174 మ్యాచ్‌ల్లో 102 గోల్స్) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్‌ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెస్సీ మూడు గోల్స్ చేయగా.. నికోలస్ గొంజాలెజ్(ఆట 23వ నిమిషం), ఎంజో ఫెర్నాండేజ్(ఆట 35వ నిమిషం), ఏంజెల్ డి మారియా(ఆట 78వ నిమిషం), గొంజాలో మాంటెల్(ఆట 87వ నిమిషం)లో గోల్స్ చేయడంతో అర్జెంటీనా 7-0 తేడాతో కురాకోను చిత్తుగా ఓడించింది. కాగా మెస్సీకి అర్జెంటీనా తరపున ఇది ఏడో అంతర్జాతీయ హ్యాట్రిక్ గోల్స్ కావడం విశేషం. MESSI WHAT A CRAZY HALF, ENJOY THE GOALS!!!! 🐐🐐🐐 pic.twitter.com/f9nwKcoUeS — mx ⭐️⭐️⭐️ (@MessiMX30iiii) March 29, 2023


