WC 2023: ‘షూటౌట్’లో అర్జెంటీనాకు పరాభవం.. సౌత్ కొరియా ముందుకు..

క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియా
Men's Hockey World Cup 2023: ప్రపంచకప్ హాకీ టోర్నీలో దక్షిణ కొరియా జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. భువనేశ్వర్‌లో సోమవారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో కొరియా ‘షూటౌట్’లో 3–2తో 2016 రియో ఒలింపిక్స్ విజేత అర్జెంటీనా జట్టును ఓడించింది.
నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 5–5తో సమంగా నిలిచాయి. మరో ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో జర్మనీ 5–1తో ఫ్రాన్స్‌పై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇదిలా ఉంటే.. ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ బోల్తా పడిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో విఫలమై ఇంటిబాట పట్టింది. దీంతో ఈ మెగా టోర్నీ చరిత్రలో టీమిండియా పతక నిరీక్షణ మరో నాలుగేళ్లు కొనసాగనుంది.
చదవండి: KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే..
Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్?
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు