కొరియా చేతిలో ఇరాన్‌ మహిళల జట్టు ఓటమి  | Iran beaten in opening game of Womens AFC Asian Cup | Sakshi
Sakshi News home page

కొరియా చేతిలో ఇరాన్‌ మహిళల జట్టు ఓటమి 

Mar 3 2026 3:43 AM | Updated on Mar 3 2026 3:43 AM

Iran beaten in opening game of Womens AFC Asian Cup

గోల్డ్‌కోస్ట్‌: ఇరాన్‌ లక్ష్యంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో బాంబుల మోత మోగుతోంది. ఇరాన్‌ కూడా గల్ఫ్‌ వ్యాప్తంగా ఉన్న అమెరికా స్థావరాల్ని లక్ష్యం చేసుకుంది. ఇలా అక్కడి వాతావరణం భీతావహంగా ఉంది. ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లోనూ ఇరాన్‌ మహిళల జట్టు ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టోరీ్నలో బరిలోకి దిగింది. ఆ్రస్టేలియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో ఇరాన్‌ 0–3 గోల్స్‌ తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. 2022 చాంపియన్‌ అయిన కొరియా జట్టు ఆట మొదలైనప్పటి నుంచి ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పై అదేపనిగా దాడులు చేసింది.

 తొలి అర్ధభాగంలోనే ఏకంగా 20 సార్లు లక్ష్యంపై గురిపెట్టిన కొరియన్లు కేవలం ఒక గోల్‌ చేయగలిగారు. 37వ నిమిషంలో చో యు రి గోల్‌ సాధించింది. రెండో అర్ధభాగంలో కిమ్‌ హే రి (59వ నిమిషంలో) గోల్‌ చేయగా... కొ యూ జిన్‌ (75వ నిమిషంలో) హెడర్‌తో కొరియాకు 3–0తో తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఇరాన్‌కు ఒక్క గోల్‌ అవకాశాన్ని ఇవ్వకుండా కొరియా డిఫెండర్లు చక్కని సమన్వయం చూపారు. మ్యాచ్‌ ముందుగానీ, తర్వాత గానీ ఇరాన్‌ కోచ్‌ మర్జియె జఫారి తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న వైమానిక దాడులపై మాట్లాడేందుకు తిరస్కరించారు.   

Advertisement
 
Advertisement
Advertisement