ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే మృతి చెందినట్లు సమాచారం. ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగిన నేపథ్యంలో ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఆ దాడుల్లో ఖమేనీ భార్య తీవ్రంగా గాయపడంది. వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సమాచారం. అయితే మన్సూరే మృతిపై ఇరాన్ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సోమవారం మరణించినట్టు ఆదేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది.ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటికే ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనుమరాలు మృతి చెందారు. ఖమేనీ మృతితో ఇప్పటికే ఇరాన్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మన్సూరే ఖోజాస్తే కూడా మరణించడంతో ఉద్రితకలు మరింత పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సామ్రాజ్యవాద శక్తుల దాడులను భీకరంగా తిప్పికొడతామని ఇప్పటకే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది.


