అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులు! | Fire Accident Ameerpet Mythrivanam | Sakshi
Sakshi News home page

అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులు!

Feb 20 2026 11:45 AM | Updated on Feb 20 2026 1:06 PM

Fire Accident Ameerpet Mythrivanam

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. అమీర్‌పేటలోని మైత్రివనంలో నీలగిరి బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. నీలగిరి బ్లాక్‌లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.

భవనం నాలుగో అంతస్తులోని ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థులు ఉండటంతో వారిని రక్షించేందుకు రెస్య్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మంటల్లో చిక్కుకున్న వారిని బాల్కనీ నుంచి కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement