ఓటీపీ.. జర జాగ్రత్త! | Cyber Scams Rise in Telangana | Sakshi
Sakshi News home page

ఓటీపీ.. జర జాగ్రత్త!

Feb 20 2026 5:08 AM | Updated on Feb 20 2026 5:07 AM

Cyber Scams Rise in Telangana

సైబర్‌ ఫ్రాడ్‌ కేసుల్లో ఈ తరహా మోసాలూ ఎక్కువే

ఆన్‌లైన్‌ మోసాలకు కేంద్ర బిందువుగా తెలంగాణ  

సాక్షి, స్పెషల్‌ డెస్క్: దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,862 లక్షల కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగాయి. 2023–24తో పోలిస్తే ఈ మొత్తం 18% ఎక్కువ. యూపీఐ పేమెంట్స్‌ 2025 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య రూ.230 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఈ స్థాయిలో జరుగుతున్న డిజిటల్‌ చెల్లింపులను మరింత సురక్షితం చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

దీని ప్రకారం వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వ్యవస్థకు మించి డైనమిక్‌ టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్, బయో మెట్రిక్స్‌ (ఫింగర్‌ప్రింట్స్, ఫేషియల్‌ రికగి్నషన్‌) వినియోగాన్ని ప్రోత్సహించనున్నారు. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్నాయి. సైబర్‌ ఫ్రాడ్‌ కేసుల్లో ఓటీపీ మోసాలు ఎక్కువగా ఉండడం గమనార్హం.  

సైబర్‌ నేరాల్లో దాదాపు సగం వాటా సైబర్‌ ఫ్రాడ్‌ (వంచన) కేసులే ఉన్నాయి. 2023లో ఈ కేసులు 46.5% నమోదయ్యాయి. సైబర్‌ చీటింగ్‌ (మోసం) కేసులు 2021లో 24.99% ఉండగా, 2023 నాటికి 40.49%కి చేరాయి. సంవత్సరాల వారీగా వివిధ సైబర్‌ నేరాల తీరు (శాతాల్లో) ఇలా ఉంది..

కరోనా మహమ్మారి తదనంతరం సైబర్‌ నేరాలకు తెలంగాణ కేంద్ర బిందువుగా మారింది. 1,00,000 మంది జనాభాకు సైబర్‌ నేరాల సంఖ్య (సైబర్‌ క్రైమ్‌ రేటు) 2018లో 3.3 మాత్రమే. 2023 నాటికి ఈ సంఖ్య దాదాపు 15 రెట్లు పెరిగి 47.8కి చేరుకుంది. ఆసక్తికర విషయమేమిటంటే.. దేశంలో సైబర్‌ నేరాలు అధికంగా నమోదైన మొదటి ఐదు ప్రాంతాలు దక్షిణాదికి చెందినవే కావడం. టాప్‌–5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్‌ క్రైమ్‌ రేటు 1,00,000 జనాభాకు ఇలా..

సైబర్‌ ఫ్రాడ్‌ కేసుల్లో ఓటీపీ సంబంధ నేరాలు నాలుగింట ఒక వంతుకుపైగా ఉన్నాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ఫ్రాడ్‌ కేసులు 2023లో తగ్గాయి. సంవత్సరాల వారీగా సైబర్‌ నేరాల తీరు ఇలా ఉంది..

Advertisement
 
Advertisement
Advertisement