పరీక్షాకేంద్రం గుర్తించేలా క్యూఆర్‌ కోడ్‌ | QR code to identify the Exam center | Sakshi
Sakshi News home page

పరీక్షాకేంద్రం గుర్తించేలా క్యూఆర్‌ కోడ్‌

Feb 20 2026 4:54 AM | Updated on Feb 20 2026 4:55 AM

QR code to identify the Exam center

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లను విడుదల చేసినట్టు ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. హాల్‌ టికెట్‌పైనే క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, దీని ఆధారంగా పరీక్ష కేంద్రాన్ని తేలికగా గుర్తించవచ్చన్నారు. ముందుగా కాలేజీలకు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఇచ్చామని, హాల్‌ టికెట్‌లో తప్పులుంటే సరిచేసుకోవడం తేలికనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలో విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే లింక్‌ ఇస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement