Photo Credit: Twitter
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో యూఏఈపై రికార్డు డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. తన విధ్వంసం వెనుక నలుగురు వ్యక్తులు ప్రధాన కారణమని, అందులో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌దే ప్రధాన పాత్ర అని వైభవ్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ తన ఇన్నింగ్స్ వెనుక ఉన్న దాగున్న విషయాలను ప్రస్తావించాడు.
వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ..''వేగవంతమైన 150 పరుగుల రికార్డు నా పేరిట ఉంది. దానిని ఇవాళ బద్దలుకొట్టాను. ఆ తర్వాత డబుల్ సెంచరీతో ఎవరికీ సాధ్యం కాని రికార్డును నా పేరిట లిఖించుకున్నా. ఈ సంతోష సమయంలో నేను నలుగురు వ్యక్తులతో మాత్రమే మాట్లాడాను. అందులో ఒకరు మా నాన్నగారు, మరొకరు నా కోచ్ మనీష్ ఓజా.
వేగంగా ఆడి చూడు..
ఇక మూడో వ్యక్తి నా స్నేహితుడు అయితే, చివరగా మాట్లాడింది యువరాజ్ సార్‌తో. నా విధ్వంసకర ఇన్నింగ్స్‌కు యువరాజ్ సింగ్ ప్రధాన కారణం. బ్యాటింగ్ దిగడానికి ముందు యువరాజ్ సార్‌తో దాదాపు అరగంట సేపు మాట్లాడాను. క్రికెట్‌లో గురువుగా భావించే యువరాజ్ సార్.. ఆటను ఎలా మెరుగుపరుచుకోవాలో సలహా ఇచ్చారు.
అంతేకాదు ఇటీవల బ్యాటింగ్ చేసే సమయంలో ఎదుర్కొన్న సమస్యలను అధిగమించేందుకు మార్గదర్శనం చేశారు. '20 బంతులు వేగంగా ఆడి చూడు.. స్కోరు భిన్నంగా ఉండే అవకాశముంటుంది' అని సలహా ఇచ్చారు. ఆయన సలహాను ఆచరణలో పెట్టడం వల్లే ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆవిష్కృతమైంది.
బ్యాటింగ్ సమయంలో ఉపయోగపడే టెక్నిక్‌లను కూడా ఫోన్‌లోనే వివరించారు. ఇవాళ బ్యాటింగ్‌లో ఎలాంటి తప్పులు చేయకూడదనే ఆలోచనతో గ్రౌండ్‌లోకి దిగాను. యువరాజ్ సార్ సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి'' అని వైభవ్ ముగించాడు.
తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలం..
వైభవ్ 53 బంతుల్లో చేసిన 204 పరుగులు లిస్ట్ 'ఎ' క్రికెట్‌లో సమీప భవిష్యత్తులో బద్దలు కొట్టడం అసాధ్యం. కేవలం బౌండరీల ద్వారానే 196 పరుగులు సాధించడం అతని శక్తి, మానసిక స్థైర్యానికి నిదర్శనం. 15 ఏళ్ల వయసులో విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్ ఆసియా కప్ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 11 పరుగులు చేసిన వైభవ్, పాక్‌తో మ్యాచ్‌లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన ఒక మ్యాచ్‌లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ వైభవ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. తాజా విధ్వంసకర ఇన్నింగ్స్ వైభవ్ ఆటను మరోసారి గుర్తు చేసింది.
𝗦𝗣𝗘𝗖𝗜𝗔𝗟: It was a 30-minute phone call with his idol Yuvraj Singh that unshackled Vaibhav Sooryavanshi 🙌 He then created history with a world record 52-ball 204. The teenage sensation takes us inside his unbelievable knock and reveals how the moment unfolded 👏 - By @Moulinparikh 🎥 🔽 Don't miss this one! #TeamIndia | #RisingStarsAsiaCup https://t.co/n3wLiiQkOj
— BCCI (@BCCI) November 25, 2026
Before his record-shattering knock, Vaibhav Sooryavanshi spoke to four people. His father, his childhood coach, his childhood friend and…….🤔 Stay tuned for a special interview coming up at 9:00 AM IST on https://t.co/sfyVercpdu as the batting sensation decodes his epic double century 💯💯 #TeamIndia | #RisingStarsAsiaCup
— BCCI (@BCCI) November 24, 2026
ఇదీ చదవండి: ILT20: టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు!


