breaking news
BCCI
-
వివాదంలో BCCI బాస్ మిథున్ మన్హాస్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వివాదంలో చిక్కుకున్నాడు. జూనియర్ స్థాయిలో క్రికెట్ సెలక్షన్ ఎంపిక సమయంలో అతడు పుట్టిన తేదీని మార్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి, మాజీ డిప్యూటీ ఎస్పీ సుదర్శన్ మెహతా స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్రమంలో భారత న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 175 (3) ప్రకారం.. చీటింగ్, ఫ్రాడ్, పుట్టిన తేదీ ఫోర్జరీ తదితర ప్రొవిజన్లకు అనుగుణంగా మన్హాస్‌పై నౌబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పిటిషనర్ అందించిన వివరాల ప్రకారం.. మిథున్ మన్హాస్ జూనియర్ లెవల్, నేషనల్ లెవల్లో క్రికెట్ ఆడే సమయంలో వేర్వేరు పుట్టిన తేదీలను నమోదు చేశారు.పోలీసులకు కోర్టు ఆదేశాలుసబ్ జూనియర్, జూనియర్ కేటగిరీలలో అర్హత పొందేందుకు ఈ మేరకు అక్రమాలకు పాల్పడ్డాడని పిటిషనర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన స్థానిక కోర్టు సెప్టెంబరు 3లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేసి.. నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.ఢిల్లీ తరఫునకాగా 45 ఏళ్ల మిథున్ మన్హాస్ సొంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్. అయితే, దేశవాళీ క్రికెట్లో అతడు ఎక్కువగా ఢిల్లీ జట్టుకు ఆడాడు. కెప్టెన్‌గానూ పనిచేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి అనుభవం ఉన్న మిథ/న్.. 157 మ్యాచ్‌లు ఆడి 9714 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు కూడా ఉన్నాయి.ఇక లిస్ట్-ఎ క్రికెట్లో 130 మ్యాచ్‌లలో కలిపి మిథున్ 4126 పరుగులు సాధించాడు. అదే విధంగా 91 టీ20 మ్యాచ్‌లు ఆడి 1179 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్, పూణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.కెరీర్ చరమాంకంలో మిథున్ మన్హాస్ 2015లో జమ్మూ కశ్మీర్ క్రికెట్ సబ్ కమిటీ మెంటర్‌గా పనిచేశాడు. ఆ మరుసటి ఏడాది కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన మిథున్.. బంగ్లాదేశ్ అండర్-19 జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగానూ పనిచేశాడు. అయితే, టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని మిథున్.. పెద్దల అండతో ఏకంగా బీసీసీఐ బాస్ అయ్యాడు.చదవండి: సచిన్ కంటే కోహ్లి బెటర్: డివిలియర్స్ -
సంజయ్ బంగర్ కూతురు సంచలన ప్రకటన
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు (ట్రాన్స్‌జెండర్) అనయ బంగర్ మరోసారి వార్తల్లో నిలిచింది. త్వరలో మహిళల క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా కొత్త చాప్టర్‌ను ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. ‘మీ అందరికీ ఒక శుభవార్త. నేను 2027లో మహిళల ఎలైట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. దీని గురించి చాలా విషయాలు పంచుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు చెప్పలేను. నాకు ఆ సంస్థ నుంచి అనుమతి వచ్చిందన్న విషయం మాత్రం స్పష్టం చేయగలను.’ అని చెప్పుకొచ్చింది.ట్రాన్స్జెండర్లను ఉమెన్స్ క్రికెట్లోకి అనుమంతించేది లేదంటూ వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలోనే ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఐసీసీ నిర్ణయాన్ని అనయ బంగర్ సవాల్ చేయడం సంచలనంగా మారింది. ట్రాన్స్జెండర్లకు మహిళల క్రికెట్లో ఆడే హక్కు ఎందుకు ఉండదో చెప్పాలని ఐసీసీని ప్రశ్నించింది. అంతేకాదు లింగమార్పిడి తర్వాత మహిళా క్రికెటర్లతో సమానంగా తన శారీరక స్థితి ఉందని పేర్కొన్న అనన్య బంగర్, తన రిపోర్టుల్లో మహిళా క్రికెటర్లకు ఉండే కండబలం, గ్లూకోస్, ఆక్సిజన్ లెవల్స్.. తనకు అలానే ఉన్నాయని నిరూపించుకుంటానని సవాల్ చేస్తూ బీసీసీఐ, ఐసీసీకి లేఖలు రాసింది. ఈ నేపథ్యంలోనే అనయ బంగర్ మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన ఆసుపత్రిలో చేయించుకున్న అదనపు రక్త పరీక్షలు, శస్త్ర చికిత్స వివరాలు సహా వైద్య, శారీరక సమాచారాన్ని ఒక సంస్థ (పేరు చెప్పలేని) పరిశీలించింది. ‘అనయ బంగర్ రిపోర్ట్స్‌ను సుశితంగా పరిశీలించాం. ట్రాన్స్‌జెండర్ అయినప్పటికీ, మహిళలతో సమానంగా శారీరక స్థితి ఉండడంతో అనయకు మహిళల క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వాల్సిందే’ అని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.అయితే అనయ బంగర్ తాను మహిళల ఎలైట్ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, భారత మహిళల జట్టుకు ఆడడం మాత్రం కష్టమే. క్రికెట్ ఆడేందుకు ట్రాన్స్జెండర్లకు అనుమతి లేదనే ఐసీసీ నిబంధనలే ఇందుకు కారణం. పురుష దశ దాటిన తర్వాత లింగ మార్పిడి చేసుకున్న ట్రాన్స్జెండర్లు అంతర్జాతీయ మహిళల క్రికెట్లో పాల్గొనేందుకు అర్హులు కారు అని ఐసీసీ పేర్కొంది. ఇక అనయ తండ్రి సంజయ్ బంగర్ టీమిండియా తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. 2014 నుంచి 2019 వరకు సంజయ్ బంగర్ టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ తన కుటుంబం మద్దతుతో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారాడు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (HRT), జెండర్-అఫర్మింగ్ సర్జరీ పూర్తి చేసుకుని అనయా బంగర్గా గుర్తింపు పొందింది.😇 pic.twitter.com/pDOjd2B5mB— Anaya Bangar (@anayabangarbnxf) August 17, 2026Anaya Bangar gets candid on her upcoming debut in women’s cricket: I had given up on the hope of ever playing againFor Anaya Bangar, life has been a relentless battle of resilience, grit, and unwavering authenticity.Following her post-transition journey and a deeply personal… pic.twitter.com/h1xH292uAZ— Ritam English (@english_ritam) August 18, 2026Read: జడ్డూ చర్యపై గంభీర్ అసహనం! -
కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్
-
వీవీఎస్ లక్ష్మణ్ కు గుడ్ న్యూస్..! బీసీసీఐ కీలక నిర్ణయం
-
చావుతో పోరాడి దేశానికి కప్ తెచ్చిన యోధుడు.. యువరాజ్ సింగ్ లైఫ్ స్టోరీ
-
ఆ నలుగురికే కాదు.. అందరికీ తెలియాల్సిందే: గావస్కర్
ఐపీఎల్ 2027 వేలానికి ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఆటగాళ్ల ట్రేడింగ్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు మారబోతున్నాడే ప్రచారం జోరుగా సాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తప్ప.. మిగిలిన ఫ్రాంఛైజీలన్నీ హార్దిక్ కోసం పోటీలో ఉన్నాయని ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అంటున్నారు.అయితే, ముంబై యాజమాన్యం మాత్రం ఇంతవరకు హార్దిక్ ట్రేడింగ్ విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ లేదంటే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈ ఆల్‌రౌండర్ చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇలాంటి తరుణంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కీలక విజ్ఞప్తి చేశాడు. ఐపీఎల్ ట్రేడింగ్ విషయంలో పారదర్శకత పాటించాలని సూచించాడు. ‘‘వేలానికి ముందు ఆటగాళ్లు ఒక ఫ్రాంఛైజీ నుంచి మరో ఫ్రాంఛైజీకి మారే అంశం గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే, ఈ విండో పూర్తి కావడానికి ఇంకా సమయం ఉంది. సమయం వచ్చినపుడు ఏ ఆటగాడు ఏ జట్టు నుంచి మరే జట్టుకు మారుతున్నాడో ఫ్రాంఛైజీలు అధికారికంగా ప్రకటిస్తున్నాయి. కానీ ఎంతకు ట్రేడింగ్ (ధర) జరిగిందన్న విషయం మాత్రం బహిర్గతం కావడం లేదు.సదరు ఆటగాడు, బీసీసీఐ, రెండు ఫ్రాంఛైజీల వద్ద మాత్రమే ఆ సమాచారం ఉంటోంది. అలాంటపుడు ఫ్రాంఛైజీలు తమ సాలరీ క్యాప్‌నకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నాయా? లేదంటే ఉల్లంఘిస్తున్నాయా? అన్న విషయం ఎలా తెలుస్తుంది. అందుకే ట్రేడింగ్ విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలి. ఆ నంబర్లను కూడా బహిరంగంగా ప్రకటించాలి.ఫ్రాంఛైజీలు జవాబుదారీతనం పాటించేలా చూడాలి. ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యంత గొప్ప లీగ్‌గా కొనసాగుతోంది. ఇలాంటి టోర్నీలో పారదర్శకతకు పెద్దపీట వేయకపోతే.. విమర్శలు వచ్చే అవకాశం ఉంది’’ అని సునిల్ గావస్కర్ మిడ్-డేకు రాసిన కాలమ్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. -
బీసీసీఐ బిగ్ ట్విస్ట్.. అగార్కర్‌కు చెక్? రేసులోకి ఊహించని పేరు
టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని పొడిగించాలా? లేదా వద్దా? అన్న అంశంపై బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. అతడి భవితవ్యం తెల్చేందుకు శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ పెద్దలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ అగర్కార్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించకపోతే అతడి స్ధానాన్ని భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ భర్తీ చేసే అవకాశముందని 'ది టెలిగ్రాఫ్' తమ కథనంలో వెల్లడించింది. టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం.. తొలుత అగార్కర్ స్థానంలో లక్ష్మణ్‌ను పరిగణనలోకి తీసుకున్నారని, అయితే ప్రయాణాల భారం కారణంగా చీఫ్ సెలక్టర్ పదవిని చేపట్టడానికి అతడు చూపలేదంట. దీంతో లక్ష్మణ్‌కు 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్' (Director of Cricket) అనే నూతన పదవిని కట్టబెట్టేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు సమాచారం. వాస్తవానికి అగార్కర్ కాంట్రాక్ట్ ఈ ఏడాది జూన్‌తో ముగియాల్సి ఉంది. కానీ భారత క్రికెట్ బోర్డు అతడికి మూడు నెలల పొడిగింపు ఇచ్చింది. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్-2027 వరకు అతడినే కొనసాగించాలని బోర్డు పెద్దలు భావించినట్లు వార్తలు వచ్చాయి.కానీ 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం.. రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తు విషయంలో బీసీసీఐకి అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడిని తప్పించే యోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది.చదవండి: IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్! -
అగార్కర్ పదవి ఉంటుందా? ఊడుతుందా? డెడ్‌లైన్ అప్పుడే!
శ్రీలంకతో టెస్టు సిరీస్ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌తో అగార్కర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలోనే అతడిని కొనసాగించాలా లేక వేరేవారికి అవకాశమివ్వాలా అనే దానిపై బీసీసీఐ ఒక నిర్ణయానికి రానుంది. అయితే 2027 వన్డే ప్రపంచకప్ వరకు అగార్కర్‌ను కొనసాగించాలనే అంశం కూడా బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 2023లో అగార్కర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు అతడిని వివాదంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తొలగించడంలో అగార్కర్ తెర వెనుక ప్రధాన పాత్ర పోషించాడనే వార్త అప్పట్లో బాగా వైరలయ్యింది. అంతేకాదు ఇంగ్లండ్‌తో జులైలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత రోహిత్‌ను జట్టు నుంచి తప్పించే ఆలోచన ఉందని సెలెక్టర్లు అతడికి తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం రోహిత్ జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని వ్యాఖ్యానించారు.2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ భవిష్యత్తును ప్రతి సిరీస్ తర్వాత సమీక్షించాలని బీసీసీఐ కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే సైకియా చేసిన వ్యాఖ్యలు సెలెక్టర్లకు అసంతృప్తి కలిగించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అగార్కర్‌తో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సెలక్షన్ కమిటీ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు రోహిత్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఇక బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవీకాలం పొడిగింపు సందర్భాలు చాలా తక్కువ. గతంలో శివసుందర్ దాస్, ఎస్. శరత్, సుబ్రోతో బెనర్జీ, అజయ్ రాత్రా సహా మిగిలినవాళ్లంతా తన పదవీ కాలం ముగియగానే బయటికి వెళ్లిపోయారు. కానీ అగర్కార్ సెలెక్టర్‌గా వచ్చిన తర్వాత అతడు మంచి ఫలితాలు సాధించాడు. అతడి సెలెక్షన్ పర్యవేక్షణలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ చేరడంతో పాటు వాటిలో మూడు టైటిల్స్‌ను అందుకుంది. జట్టులో మార్పులు కూడా ఫలితాలు ఇవ్వడంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అగార్కర్‌కు మద్దతు ఇచ్చింది. మధ్యలో రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐతో అభిప్రాయబేధాలు వచ్చినప్పటికీ, ఇవేవీ పట్టించుకోకుండా అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించే యోచనలో ఉంది. అంతకముందు 2022 టీ20 ప్రపంచకప్ సమయంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న చేతన్ శర్మపై విమర్శలు వచ్చాయి. ఇక 2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ భారత్ ఫైనల్ చేరడంలో విఫలం కావడంతో అప్పటి సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌పై అటు బీసీసీఐ, ఇటు అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి అగార్కర్‌పై విశ్వాసముంచి బీసీసీఐ అతడి పదవిని పొడిగిస్తుందా? తొలగిస్తుందా అనేది వచ్చే నెలతో తేలిపోనుంది.Read: సైక్లింగ్‌లో విషాదం.. ప్రాణం తీసిన అజాగ్రత్త! -
లైవ్ మ్యాచ్‌లో ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్.. లక్ష జరిమానా!
తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా, తన ప్రియురాలికి ఒక యువ బ్యాటర్ ఫోన్లో టెక్ట్స్ మెసేజ్ పంపాడు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనలను ఉల్లంఘించినందుకు, సదరు యువ బ్యాటర్‌కు బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ACSU) రూ. 1 లక్ష జరిమానా విధించింది. ‘‘విచారణ కొనసాగుతున్నందున తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆటగాడి పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు. ‘జరిమానా విధించిన ఆటగాడు ఎడమచేతి వాటం బ్యాటర్ అని, గతేడాది రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున రెండు అర్ధశతకాలు సాధించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతను తన ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్‌లు పంపుతూ కనిపించాడు. ఇది ఎలాంటి అవినీతి ఆరోపణల కిందకు రానప్పటికీ, మ్యాచ్ జరుగుతున్నప్పుడు PMOAలో మొబైల్ ఫోన్ వాడటం నిషేధం. అందువల్ల ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకే అతడికి లక్ష జరిమానా విధించాం" అని సీనియర్ అధికారి పేర్కొన్నాడు. మొదట యువ ఆటగాడిపై రెండేళ్ల నిషేధం విధించాలనుకున్నప్పటికీ, నేరం పెద్దది కాకపోవడంతో జరిమానాతో సరిపెట్టారు.ఐపీఎల్ 2026 సీజన్లో, రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్లో ఫోన్ వాడడం అప్పట్లో సంచలనం కలిగించింది. రోమీ భిందర్ పక్కనే వైభవ్ సూర్యవంశీ కూడా అతడి ఫోన్ చూస్తుండడం వైరల్‌గా మారింది. దీంతో మ్యాచ్ జరుగున్న సమయంలో ఫోన్ చూడడం పీఎంవోఏ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. దీంతో బీసీసీఐ పీఎంవోఏ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రోమీ భిందర్‌కు లక్ష జరిమానా విధించిన బీసీసీఐ వైభవ్‌ను మాత్రం హెచ్చరికలతో సరిపెట్టింది. -
Asia Cup 2026: టీమిండియాకు భారీ షాక్
ఏసీసీ మహిళల ఆసియా కప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ టోర్నీకి దూరమైంది. ఆసియా కప్ ఈవెంట్‌తో పాటు.. ఆసియా క్రీడలకు కూడా ఆమె అందుబాటులో ఉండటం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఇంగ్లండ్ వేదికగా ‘ది హండ్రెడ్’ మహిళల లీగ్-2026లో జెమీమా రోడ్రిగ్స్ సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. అయితే, ఇటీవల ఆగష్టు 3 నాటి మ్యాచ్ సందర్భంగా తొడ కండరాల నొప్పితో విలవిల్లాడింది.గాయం తీవ్రతరంఫలితంగా హండ్రెడ్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు జెమీమా దూరమైంది. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్న ఆమె గాయం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వైద్య బృందం సూచన మేరకు ఆమెకు విశ్రాంతి అవసరమని నిర్ణయించింది.ఈ క్రమంలో ఆసియా కప్, ఆసియా క్రీడలకు జెమీమా రోడ్రిగ్స్ దూరమైనట్లు బోర్డు ప్రకటించిది. ఇక ఆసియా కప్ టోర్నీకి మాత్రం జెమీమా స్థానంలో ప్రతికా రావల్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా ఆసియా కప్ నిర్వహణకు ఆగష్టు 28- సెప్టెంబరు 13 మధ్య షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు యూఏఈ వేదిక.ఆసియా కప్-2026 టోర్నీకి భారత మహిళల జట్టు (అప్డేటెడ్)హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, భారతి ఫల్మలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి.కమలిని (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్, ప్రతికా రావల్.చదవండి: ఇదేం బ్యాటింగ్.. ముసలోళ్ల జట్టు: ఆసీస్‌పై పాంటింగ్ ఫైర్ -
చీఫ్ సెలక్టర్ లేదా హెడ్‌కోచ్ అవుతా: టీమిండియా దిగ్గజం
భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో భాగమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నాడు. తనకు ఏ పదవి ఇచ్చినా వంద శాతం న్యాయం చేస్తానంటూ మనలోని మాటను వెల్లడించాడు.గంభీర్, అగార్కర్‌పై విమర్శలుకాగా టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరి నేతృత్వంలో వైట్‌బాల్ క్రికెట్లో ఐసీసీ టోర్నీలో భారత జట్టు మంచి ఫలితాలు నమోదు చేస్తున్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం ఇటీవల ఘోర పరాభవాలు చవిచూసింది.వరుస పరాభవాలుఎన్నడూలేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ కావడం.. పాతికేళ్ల తర్వాత సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ కావడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌కు తొలిసారి వన్డే సిరీస్ కోల్పోవడం.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్ కావడం.. ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్‌లో 4-0తో వైట్‌వాష్ కావడం, వన్డే సిరీస్‌ను కోల్పోవడం తాజా ఉదాహరణలు.చీఫ్ సెలక్టర్, హెడ్‌కోచ్ అయ్యేందుకు సిద్ధంఈ నేపథ్యంలో శ్రీలంకతో తాజాగా రెండు టెస్టుల సిరీస్ తర్వాత వీరి భవితవ్యంపై స్పష్టత రానుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హర్భజన్ సింగ్ బీసీసీఐలో ఏ పదవి ఇచ్చినా చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం గమనార్హం.‘‘బీసీసీఐ అధ్యక్షుడు, చీఫ్ సెలక్టర్ లేదంటే హెడ్‌కోచ్... ఈ మూడింటిలో ఏ బాధ్యత ఇచ్చినా నెరవేర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భారత క్రికెట్‌కు ఏ స్థాయిలోనైనా సేవ చేయడం నాకు ఎల్లప్పుడూ సంతోషమే. భవిష్యత్తులో ఈ మూడింటిలో ప్రతీ పాత్ర పోషించాలని నేను కోరుకోవడం లేదు.గంభీర్‌కు మద్దతుఅయితే, నా తలరాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. ఒకవేళ నాకే గనుక నిజంగా అవకాశం వస్తే.. అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అని భజ్జీ PTI ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదే విధంగా ప్రతీ దానికి గంభీర్‌ను విమర్శించడం తగదని.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే అతడు ప్రతీ నిర్ణయం తీసుకుంటాడని అండగా నిలిచాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ అత్యున్నత పదవి! -
వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ అత్యున్నత పదవి?
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ త్వరలోనే బీసీసీఐ అత్యున్నత పదవిని అలంకరించనున్నట్లు సమాచారం. గంభీర్ స్థానంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా రానున్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో లక్ష్మణ్‌కు బీసీసీఐ (హెడ్‌కోచ్ పదవికి మించి) డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.కొత్తగా రూపొందించనున్న డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవికి లక్ష్మణ్ అయితేనే మంచి ఫలితం ఉంటుందని బీసీసీఐ భావించింది. అంతేకాదు లక్ష్మణ్ ఆ పదవిలో తన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహిస్తాడని బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు సీఈవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.ప్రస్తుతం లక్ష్మణ్ సీవోఈ హెడ్‌గా ఆటగాళ్ల పునరావాసం, శిక్షణ వంటి బాధ్యతలు చూస్తున్నాడు. 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్'గా నియమితులైతే, ఆయన పరిధి మరింత విస్తృతం కానుంది. సీనియర్ పురుషుల, మహిళల జట్ల వ్యూహరచన, జాతీయ సెలక్షన్ కమిటీతో సమన్వయం, జూనియర్ స్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకు ఆటగాళ్ల ప్రగతిని పర్యవేక్షించడం వంటి కీలక అధికారాలు ఆయన చేతికి రానున్నాయి.ఇదే సమయంలో, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం కూడా సెప్టెంబర్‌తో ముగియనుంది. ఆయన పదవీకాలాన్ని 2027 జూన్ వరకు పొడిగించాలా? లేక కొత్త వారిని నియమించాలా? అనే అంశంపై కూడా బీసీసీఐ చర్చిస్తోంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కొత్త కోచింగ్ బృందంతో సమన్వయం కోసం లక్ష్మణ్ లాంటి అనుభవజ్ఞుడి సేవలు అవసరమని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.గతంలో రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవిని చేపట్టాలని బీసీసీఐ కోరినప్పటికీ, లక్ష్మణ్ సున్నితంగా తిరస్కరించాడు. బెంగళూరులోని నూతన సీవోఈ ప్రాజెక్టుపై దృష్టి సారించేందుకే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు గాడిన పడటంతో, ఆయన అనుభవాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది. Read: ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్ -
భారత్-అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌లో మార్పు!
సెప్టెంబర్‌లో భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మధ్య జరగాల్సిన మూడు టీ20ల సిరీస్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఇటీవల ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఈ మూడు మ్యాచ్‌లు వచ్చే నెల 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్లో స్వల్ప మార్పు చేయాలని బీసీసీఐని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు అభ్యర్దించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి పండగను పురస్కరించుకుని, ఆ రోజున ఒక టీ20 మ్యాచ్ నిర్వహించాలని ఏసీబీ కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రోజు పండగ సెలవు దినం కావడంతో మ్యాచ్‌ను వీక్షించడానికి స్టేడియానికి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఆశిస్తోంది. ఈ ప్రతిపాదనకు భారత క్రికెట్ బోర్డు అంగీకరిస్తే.. సెప్టెంబర్ 13 లేదా 15న జరగాల్సిన మ్యాచ్‌లలో ఒకదానిని సెప్టెంబర్ 14కి మార్చనుంది. కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం ఇది అఫ్గానిస్తాన్‌కు హోమ్ సిరీస్ కావడం విశేషం. గతంలో అఫ్గాన్ జట్టు తన హోమ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడినప్పటికి, టీమిండియాతో హోమ్ సిరీస్ ఆడడం మాత్రం ఇదే తొలిసారి. ఈ చారిత్రత్మక సిరీస్ ప్రసార హక్కులకు సంబంధించి అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. సోనీ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ వంటి ప్రముఖ ఛానళ్లతో ఏసీబీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.చదవండి: AFG vs IRE: అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్ -
'బుమ్రాకు గాయం.. వారిదే పూర్తి బాధ్యత'
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యలతో సతమతవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో మెకాలి గాయానికి గురైన బుమ్రా ఇంకా కోలుకోలేదు. దీంతో శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్‌కు కూడా బుమ్రా దూరమయ్యాడు. తొలుత లంకతో సిరీస్ ఆరంభ సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని సెలక్టర్లు అంచనా వేశారు. కానీ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రాకపోవడంతో అతడిని లంక టూర్‌ను నుంచి సెలక్టర్లు తప్పించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఫిట్నెస్, వర్క్‌లోడ్ నిర్వహణలో టీమ్ మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైందని అతడు మండిపడ్డాడు.కాగా గతేడాది ఆరంభంలో వెన్ను గాయం బారిన పడినప్పటికి నుంచి బుమ్రా వర్క్‌లోడ్‌ను బీసీసీఐ పర్యవేక్షిస్తునే ఉంది. కీలక మ్యాచ్‌లలోనూ అతడు ఆడుతూ వస్తున్నాడు. మిగిలిన మ్యాచ్‌లకు సెలక్షన్ కమిటీ బుమ్రాకు విశ్రాంతి ఇస్తోంది. అయినప్పటికి ఆశించిన ఫలితాలు రావడం లేదు."బుమ్రా వర్క్‌లోడ్ విషయంలో ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధం లేని విషయం. సీఓఈ కేవలం ఆటగాడి ఫిట్నెస్ స్థితిపై సమాచారం మాత్రమే ఇస్తుంది. ఏ మ్యాచ్‌లు ఆడాలి, ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలనేది కెప్టెన్, కోచ్, సెలెక్టర్లే నిర్ణయిస్తారు" అని బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. అదేవిధంగా బుమ్రాతో పాటు జట్టులోని పలువురు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంపై కూడా బద్రీనాథ్ ఆందోళన వ్యక్తం చేశాడు. "జట్టులో ఇంతమంది ఆటగాళ్ల గాయాలకు గల స్పష్టమైన కారణాలైతే నాకు తెలియదు. కానీ క్రికెట్ వంటి ప్రొఫెషనల్ క్రీడల్లో గాయాలు తప్పవు. వాటిని పూర్తిగా నియంత్రించలేం. అయితే సరైన మేనేజ్మెంట్, నిరంతర పర్యవేక్షణ చాలా అవసరమని " అతడు అన్నాడు. -
కాశ్మీర్లో క్రికెట్ పండగ.. కీలక మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!
జమ్మూ అండ్ కాశ్మీర్ మరో కీలక క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్దమైంది. శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియంలో అక్టోబర్ 1 నుంచి 5 వరకు జమ్మూ కాశ్మీర్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికి.. జమ్మూ హెడ్ కోచ్ అజేయ్ శర్మ మాత్రం ధ్రువీకరించాడు.ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు అతడు తెలిపాడు. షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియంలో చేపట్టాల్సిన మౌలిక వసతుల అభివృద్ధిపై స్ధానిక క్రికెట్ అసోసియేషన్‌కు దిశానిర్దేశం చేసేందుకు బీసీసీఐ ప్రతినిధుల బృందం ఇప్పటికే రెండుసార్లు శ్రీనగర్‌లో పర్యటించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్టేడియం కెపాసిటీ 5,000గా ఉంది. కాగా షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియం గతంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు కూడా ఆతిథ్యమిచ్చింది. ఈ మైదానంలో ఇప్పటివరకు రెండు వన్డే మ్యాచ్‌లు జరిగాయి.శ్రీనగర్ వేదికగా 1983లో భారత్-వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత చివరగా 1986లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ను ఈ గ్రౌండ్లో నిర్వహించారు. అయితే జమ్మూ-కాశ్మీర్లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల కారణంగా చాన్నాళ్ల పాటు డొమాస్టిక్ మ్యాచ్‌లు సైతం నిర్వహించలేదు. అయితే పరిస్థితులు కాస్త సద్దుమణగడంతో గతేడాది అక్టోబర్ 15-18 మధ్య శ్రీనగర్‌లోని ఈ స్టేడియంలో ముంబై, జమ్మూ కాశ్మీర్ మధ్య కీలక రంజీ ట్రోఫీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది.మళ్లీ ఏడాది తర్వాత జమ్మూ కాశ్మీర్లో క్రికెట్ సందడి నెలకొంది. కాగా రంజీ ట్రోఫీ 2025-26 విజేతగా జమ్మూ నిలిచిన సంగతి తెలిసిందే. జమ్మూ అండ్ కాశ్మీర్‌కు ఇదే తొలి రంజీ టైటిల్ కావడం విశేషం. ఈ చారిత్రత్మక విజయంలో పేసర్ ఆకిబ్ నబీది కీలక పాత్ర. అతడు ప్రస్తుతం భారత జట్టుతో పాటు శ్రీలంక పర్యటనలో ఉన్నాడు.చదవండి: IND vs SL: గిల్ కాదు.. అతడితో జాగ్రత్త! శ్రీలంకకు దిగ్గజ క్రికెటర్ వార్నింగ్ -
సర్ఫరాజ్ సెలక్షన్ వెనుక అసలు కారణం ఇదే.. BCCI మాస్టర్ స్కెచ్
-
IND vs SL: టీమిండియా దిగ్గజ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే లంకకు చేరుకున్న టీమిండియాకు.. వార్మప్ మ్యాచ్‌తో కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరంఈ సిరీస్‌లో 2-0తో గెలిస్తేనే డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్ ఫైనల్ రేసులో టీమిండియా నిలవగలుగుతుంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌లకు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యారు. గాయాల వల్ల ఈ ముగ్గురూ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయారు.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కీలక సూచనలు చేశాడు. ఆటగాళ్లు గాయాల బెడద, టెస్టు క్రికెట్లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తప్పక దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. ఈ మేరకు JITO ప్రీమియర్ లీగ్ ఆరంభం సందర్భంగా మాట్లాడుతూ..అదే అత్యంత ముఖ్యం‘‘ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడటం అత్యంత ముఖ్యం. ఇటీవలి కాలంలో భారత జట్లు స్పిన్ ఆడేందుకు ఇబ్బంది పడటం చూస్తున్నాం. ఇందుకు కారణం వారు దేశీ క్రికెట్ ఆడకపోవడమే.బీసీసీఐ ఈ విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించాలి. ప్రతి ఒక్క ఆటగాడు మల్టీ-డే మ్యాచ్‌లు ఆడేలా చూడాలి. సీనియర్లను చూసి యువ ఆటగాళ్లు కూడా ఎంతో నేర్చుకుంటారు. వారితో కలిసి ఆడటం వల్ల యువ ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.మనోళ్లు తేలిపోతున్నారుఇటీవల టీమిండియా ఎన్నో టీ20, వన్డే మ్యాచ్‌లు ఆడింది. అయితే, స్పిన్ బౌలింగ్‌లో మనోళ్లు అత్యుత్తమంగా రాణించలేకపోయారు. ఇక టెస్టు ఫార్మాట్ మరింత భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది’’ అని కపిల్ దేవ్ టీమిండియాతో పాటు బీసీసీఐకి సూచించాడు. కాగా శ్రీలంకతో ఆగష్టు 15 నుంచి టీమిండియా తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక. చదవండి: IND vs AFG: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ -
IND vs AFG: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. అఫ్గానిస్తాన్ భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యమిస్తుందని ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా వెల్లడించింది.అఫ్గాన్ క్రికెట్‌కు అండగా ఉంటాముఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘‘అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్‌లో టీమిండియాతో టీ20 సిరీస్‌కు ఆతిథ్యమివ్వడం పట్ల బీసీసీఐ సంతోషంగా ఉంది. భారత్- అఫ్గానిస్తాన్ జట్ల మధ్య పోరు చాలా ఏళ్లుగా ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఇరుజట్లలోనూ మంచి నైపుణ్యాలున్న క్రికెటర్లు ఉన్నారు.అఫ్గానిస్తాన్ ఆటగాళ్లలో చాలా మందికి భారత్‌లోనూ అభిమానులు ఉన్నారు. ఇరు దేశాల క్రికెట్ సంబంధాలు రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నాయి. 2018లో తొలిసారి బారత్ అఫ్గానిస్తాన్‌కు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చింది.చిరస్మరణీయంఅప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత పటిష్టంగా మారాయి. ఇటీవలే జూన్‌లో అఫ్గాన్‌తో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. ఇప్పుడు ఇరుజట్లు టీ20 సిరీస్‌లో తలపడబోతున్నాయి. ఢిల్లీలో అఫ్గాన్ జట్టు టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వడం చిరస్మరణీయంగా మిగిలిపోనుంది’’ అని పేర్కొన్నాడు.కాగా సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో అఫ్గానిస్తాన్- టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక. అయితే, అఫ్గాన్‌తో టీమిండియా సిరీస్ ఖరారైన నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.బంగ్లాదేశ్‌కు షాక్నిజానికి సెప్టెంబరులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వస్తుందని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆశలు పెట్టుకుంది. కానీ బీసీసీఐ మాత్రం అఫ్గాన్‌ను రంగంలోకి దింపి బంగ్లాకు చెక్ పెట్టింది.కాగా టీ20 ప్రపంచకప్-2026 సమయంలో భారత్‌లో తమకు భద్రత లేదంటూ అప్పటి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వద్ద పంచాయితీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య అప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లా బోర్డు తమ జట్టు భారత్‌కు వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చుంది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగి ఒప్పించే ప్రయత్నం చేయగా.. బంగ్లా పట్టువీడలేదు. వేదిక మార్చలేదు కాబట్టి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. టోర్నీ నుంచే తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. దీంతో బంగ్లా బోర్డు- బీసీసీఐ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.ఇక లేనట్లేనా?అయితే, ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం బీసీసీఐతో బంధాలు పునరుద్ధరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బంగ్లా బోర్డు అధ్యక్షుడిగా నియమితుడైన మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.. ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. బీసీసీఐతో పలుమార్లు సంప్రదింపులు జరిపానని.. అయితే, ద్వైపాక్షిక సిరీస్ విషయంలో వారిదే అంతిమ నిర్ణయం అని ఇటీవల పేర్కొన్నాడు. అయితే, బీసీసీఐ మాత్రం బంగ్లాతో సిరీస్ విషయంలో ఇప్పటికీ స్పష్టతనివ్వలేదు. అదే సమయంలో అఫ్గాన్‌తో సిరీస్ ఖరారు చేసి.. భారత్‌ను ఆతిథ్య దేశంగా ఉపయోగించుకునే బంపరాఫర్ ఇచ్చింది.అఫ్గానిస్తాన్ వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20: సెప్టెంబరు 13- ఆదివారంరెండో టీ20: సెప్టెంబరు 15- మంగళవారంమూడో టీ20: సెప్టెంబరు 17- గురువారంవేదిక: ఢిల్లీ.చదవండి: టెస్టులలో ఎవరికీ సాధ్యం కాని ఘనత.. జైసూ సరికొత్త ఫీట్ -
టీమిండియాతో సిరీస్ ఖరారు.. భారత్‌లో వారి ఆతిథ్యం!
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) టీమిండియాతో టీ20 సిరీస్‌ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, అఫ్గాన్ భారత్‌లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.కాగా అఫ్గానిస్తాన్‌లో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ భారత్ లేదంటే యూఏఈలలో పలు సిరీస్‌లకు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీమిండియాతో భారత్‌లో తలపడేందుకు సిద్ధమైంది.షెడ్యూల్ ఖరారుఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా- అఫ్గానిస్తాన్ మధ్య సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మూడు మ్యాచ్‌లు నిర్వహిస్తారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. గతంలో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లకు అఫ్గానిస్తాన్ భారత్‌లో ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2017లో ఐర్లాండ్‌తో వైట్‌బాల్ సిరీస్ ఆడిన అఫ్గాన్ జట్టు.. 2017లో విండీస్‌తో ఆల్ ఫార్మాట్ సిరీస్ ఆడింది.టెస్టు, వన్డేలలో ఓటమిఇక ఇటీవల అఫ్గానిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో జూన్‌లో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లన్పూర్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్.. అఫ్గాన్‌ను ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఇక మూడు వన్డేల సిరీస్‌లోనూ ఆతిథ్య భారత జట్టు.. అఫ్గాన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా మరోసారి అఫ్గాన్ టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈసారి భారత్‌లో ఆతిథ్య దేశంగా అఫ్గాన్.. శ్రేయస్ అయ్యర్ సేనతో టీ20 సిరీస్ ఆడుతుంది.పరాభవాల తర్వాత గెలుపు బాట పట్టిన భారత టీ20 జట్టుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, యూకే టూర్లో భాగంగా అతడికి ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌లో భారత్ 2-0తో వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలోనూ 4-0తో క్లీన్‌స్వీప్‌నకు గురై ఘోర పరాభవం ఎదుర్కొంది. అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లి.. ఆతిథ్య జట్టును 3-0తో వైట్‌వాష్ చేసి తిరిగి విజయాల బాట పట్టింది.శ్రీలంక పర్యటనలోఇక టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో గిల్ సేన రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు.. ఆగష్టు 23న రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్‌గా SRH మాజీ ప్లేయర్ -
జై షా విజన్.. 40 ఎకరాల బీడు భూమి నుంచి సీఓఈ దాకా!
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గురుంచి ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్రమైన చర్చనడుస్తోంది. సీఓఈ క్లియరెన్స్ ఇచ్చిన కొద్ది రోజులకే ఆటగాళ్ల గాయాలు తిరగబెట్టడం పలు అనుమానులకు తావనిస్తోంది. పూర్తి ఫిట్నెస్ సాధించకుండానే సీఓఈ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ఇస్తుందనున్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత జట్టులోని జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు సీఓఈలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా, బోర్డు అధికారులు సీఓఈను సందర్శించారు. వీరంతా సీఓఈ హెడ్ వీవీయస్ లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేవజిత్ సైకియా కీలక విషయాలను వెల్లడించారు. ఒకప్పుడు ఏ ఉపయోగం లేకుండా పడివున్న 40 ఎకరాల బంజారు భూమిని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దడంలో అప్పటి బీసీసీఐ సెక్రెటరీ జై షాది కీలక పాత్ర అని సైకియా తెలిపారు."బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఈరోజు అందుబాటులో ఉందంటే అందుకు ప్రధాన కారణం జై షా. 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్' ఏర్పాటు కోసం అతడు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లోని అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చాడు.ఎన్నో ఏళ్లుగా తాత్కాలిక ఏర్పాట్లతో సాగిన నేషనల్ క్రికెట్ అకాడమీ స్థానంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు ఉండే ఓ అత్యాధునిక ట్రైనింగ్ సెంటర్‌ను తీసుకురావాలని అతడు బలంగా నిశ్చయించుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును ప్రారంభించే క్రమంలో అనేక నిబంధనలను పాటించాల్సి వచ్చింది.చట్టపరమైన అడ్డంకులన్నింటినీ తొలగించేందుకు జై షా స్వయంగా పలుమార్లు ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా, 40 ఎకరాల బీడు భూమిని క్రమబద్ధీకరించే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఆ భూమి నిరుపయోగంగా పడి ఉండటంతో పాటు, చాలామంది దానిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు.అందుకే 2022 ఫిబ్రవరి 14న పనులు ప్రారంభించడానికి ముందే దానిని చట్టబద్ధంగా సొంతం చేసుకున్నాం. అడ్డంకులన్నింటినీ దాటుకుని ఈ రోజు అత్యాధునిక సౌకర్యాలతో ఈ సెంటర్ రూపుదిద్దుకుంది" అని సైకియా విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కాగా ఈ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యకలాపాలు నవంబర్ 2024లో ప్రారంభమయ్యాయి. -
నేను ఎందుకు కాదంటాను? అంతా వాళ్ల చేతిలోనే ఉంది: భువీ
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ రీఎంట్రీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్-2027 కోసం సెలక్టర్ల నుంచి పిలుపు వస్తే, తిరిగి జాతీయ జట్టు తరపున ఆడేందుకు సిద్దంగా ఉన్నానని భువీ తెలిపాడు. కాగా 36 ఏళ్ల భువనేశ్వర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు టైటిల్స్‌ను సొంతం చేసుకోవడంలో ఈ యూపీ పేసర్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లతో భువీ సత్తాచాటాడు. దీంతో అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. రవిచంద్రన్ అశ్విన్, రవి శాస్త్రి, దినేష్ కార్తీక్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం భువీని ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించారు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కుమార్ కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు తను రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు."జాతీయ జట్టు సెలెక్టర్ల నుంచి పిలుపు వస్తే నేను ఎందుకు కాదంటాను? భారత్ తరపున ఆడేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దమే. కానీ నా చేతుల్లో లేని విషయం గురుంచి ఎక్కువ నేను ఆలోచించను. నన్ను తీసుకోవాలా లేదా అన్నది సెలక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉటుంది. అయితే నా శరీరం అలిసిపోయేంతవరకు క్రికెట్ ఆడుతూనే ఉంటాను. అందుకే యూపీ టీ20 లీగ్ ఆడేందుకు ఇక్కడికి వచ్చాను. అంతేతప్ప మెరుగ్గా రాణించి ఎవరినో ఆకట్టుకోవాలని అయితే ఇక్కడికి రాలేదు. ఐపీఎల్లో కూడా అంతే. జట్టు కోసం రాణించి మ్యాచ్‌లు గెలవాలన్నదే నా లక్ష్యం. ఎవరో ఏదో అన్నారని లేదా మరో చోట ఎంపికవ్వాలనే ఆశతో నేను ఆడడం లేదు" అని హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భువీ పేర్కొన్నాడు. కాగా భువనేశ్వర్ చివరిసారిగా 2022లో భారత్ తరపున ఆడాడు.చదవండి: ఆ పేరంటే ద్వేషం: భారత బాక్సర్ మాటలకు మోదీ రియాక్షన్ వైరల్ -
‘షమీ అదొక్కటి చెయ్యు.. నీ రీఎంట్రీ తథ్యం’
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తు ఏంటనేది బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముందే చెప్పేశాడు. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం తాము యువ ఆటగాళ్లను ఎక్కువగా ప్రోత్సహించనున్నామని, షమీ లాంటి సీనియర్ ఆటగాళ్లు గతంలో టీమిండియాకు విలువైన సేవలు అందించినప్పటికీ ఇప్పుడు అతడి సేవలు జట్టుకు అవసరం లేదని భావిస్తున్నట్లు అగార్కర్ పరోక్షంగా పేర్కొన్నాడు. దీంతో షమీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే అనే వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందనే వార్తలు వినిపిస్తన్నాయి. అయితే బుమ్రా లాంటి టాప్ బౌలర్ తరచూ గాయాల బారిన పడుతుండడం ఇప్పుడు టీమిండియాను ఆందోళనలోకి నెట్టేస్తుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్.. షమీ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎంపిక కావడం లేదన్న నిరాశను పక్కనబెట్టి జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తూనే ఉండాలని, షమీకి తానిచ్చే సలహా అదొక్కటేనని జహీర్ పేర్కొన్నాడు.‘‘ముందుకు ఎలా వెళ్లాలో నిర్ణయించుకోవాల్సింది షమీనే. మ్యాచ్‌లు ఆడుతూ బాగా రాణిస్తే జాతీయ జట్టుకు అందుబాటులో ఉన్నట్టే. ప్రస్తుతం జట్టు ఆలోచన మరోలా ఉండొచ్చు. కానీ ఆటగాడిగా మన ఆలోచన, మనం జట్టుకు ఎలా ఉపయోగపడగలమన్నది ముఖ్యం. షమీ ఇప్పుడు చేస్తున్నదే కొనసాగించాలి. మ్యాచ్‌లు ఆడటం, రాణించడమే చాలా ముఖ్యం’’ అని జహీర్ చెప్పాడు.ఇక జస్ప్రీత్ బుమ్రా వరుస సిరీస్‌లకు ఫిట్‌గా ఉండకపోవడం, సుందర్, సాయి సుదర్శన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్లు ఫిట్నెస్ కాపాడుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జహీర్ టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడడంపై స్పందించాడు."గాయాలు ఆటలో సహజం. అవి ప్రతి వ్యక్తి ప్రయాణంలో అంతర్భాగం. ఆటగాళ్ల పని భారం తగ్గించడం అవసరమే అయినా.. పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. ముఖ్యంగా పేసర్ గాయపడినప్పుడు లేదా కష్టమైన దశను ఎదుర్కొంటు న్నప్పుడు మన నియంత్రణలో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలి. గాయానికి అసలు కారణం ఏంటో తెలుసుకునే వరకు ముందుకు సాగడం కష్టం" అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.Read: బాడీ షేమింగ్‌పై ట్రోల్స్.. కట్‌చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ! -
భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఫిట్‌నెస్‌పై జట్టు మేనేజ్మెంట్ కీలక అప్డేట్ ఇచ్చింది. తొలి టెస్టుకు ముందు లంకతో ఆడిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన గిల్ చేతి వేలికి చిన్న గాయమైన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దూరంగా ఉన్న గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బ్యాటింగ్ చేసే సమయంలో గిల్ చేతి వేలి గాయంతో ఏమైనా బాధపడ్డాడా లేక బాగానే ఉన్నాడా అన్నదానిపై భారత బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించాడు. 'నెట్ ప్రాక్టీస్ సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ చేతి వేలికి చిన్న గాయమైంది. అయితే అతడికి అయిన గాయం మైనర్దే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే వార్మప్ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆటకు దూరంగానే ఉన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన గిల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపించాడు. దీంతో అతడి చేతివేలి గాయం పూర్తిగా తగ్గిపోయినట్లే. తన బ్యాటింగ్‌తో తొలి టెస్టుకు దూరమవుతాడన్న సందేహాలను కూడా గిల్ పటాపంచలు చేశాడు. ఇది చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే టీమిండియాకు ఎంపికైన 13 మంది ఆటగాళ్లు ప్రస్తుతం గాయాల బారిన పడి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో పునరావాస కేంద్రంలో గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో మరే ఆటగాడు గాయపడ్డా టీమిండియాకు ఎదురుదెబ్బ అవుతుందని భయపడుతున్నాం. అందుకే గిల్‌కు చిన్న గాయమే అయినప్పటికీ, పూర్తిగా కోలుకోవాలనే వార్మప్ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆడించలేదు. చేతి వేలి గాయం మానడంతో చివరి రోజు బ్యాటింగ్‌కు దిగిన గిల్ మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేసి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలిచ్చాడు.' అని చెప్పుకొచ్చాడు. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ 55 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 21వ ఓవర్లో కేషారా నువంతా బౌలింగ్‌లో గిల్ వెనుదిరిగాడు. ఇక గిల్ గాయం మొదట మేనేజ్మెంట్ను భయపెట్టినప్పటికీ, అతడు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక 2025 నుంచి గిల్ టెస్టుల్లో నాలుగో స్థానంలో వస్తున్నాడు. అంతకముందు 2020 నుంచి 2023 వరకు గిల్ టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడాడు. అయితే జైస్వాల్‌కు జతగా కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా అదరగొట్టడంతో వీరి జోడినే శ్రీలంక టెస్టు సిరీస్‌లోనూ కంటిన్యూ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ లెక్కన గిల్ మరోసారి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు రానున్నాడు. ఇక టెస్టుల్లో గిల్‌కు నాలుగో స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 ఇన్నింగ్స్‌ల్లో 88.75 సగటుతో గిల్ ఆరు సెంచరీలు సాధించడం విశేషం. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది.Read: ఐదేళ్ల వయసులోనే MMA చాంపియన్.. ఎవరీ బుడ్డోడు! -
‘రోబోలు కాదు’.. ఆటగాళ్ల గాయాలపై లక్ష్మణ్ ఆగ్రహం!
టీమిండియాలో చాలా మంది ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆటగాళ్ల రీఫ్రెష్మెంట్కు రీహాబిలిటేషన్ సెంటర్లా ఉపయోగపడాల్సిన సీవోఈ కేంద్రం ఇప్పుడు ఆసుపత్రి వార్డులా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీవోఈలో చికిత్స తీసుకుంటున్న ఆటగాళ్లతో ఒక జట్టునే తయారు చేయొచ్చని సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈవో) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీవోఈ కేంద్రంలోని ఆటగాళ్ల పునరావాసం, ఎంత వేగంగా కోలుకుంటున్నారనే దానిపై సమీక్షించేందుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆదివారం లక్ష్మణ్‌ను కలిశారు. వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గాయపడిన క్రీడాకారుడు అనుకున్న సమయానికి వేగంగా కోలుకోవడానికి వారేమీ రోబోలు లేదా యంత్రాలు కాదని స్పష్టం చేశారు. ప్రతీ ఆటగాడి శరీరం స్పందించే తీరు వేరువేరుగా ఉంటుందని, తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన ఆధునిక క్రికెట్లో గాయపడిన ప్లేయర్‌కు అవసరమైనంత కోలుకునే సమయం ఇవ్వడం అత్యంత కీలకమని లక్ష్మణ్ తెలిపాడు. ప్రతి ఒక్కరి నుంచి ఒకే విధమైన రికవరీ సమయాన్ని ఆశించడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు.ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ స్థానంలో కొత్తగా పునర్నిర్మించిన 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీహాబిలిటేషన్ సెంటర్లో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, వికెట్ కీపర్-బ్యాటర్ సాయి సుదర్శన్, నితీశ్ కుమార్‌రెడ్డి, అశోక్ శర్మ సహా మొత్తంగా 13 మంది ఆటగాళ్లు రీహాబిలిటేషన్‌లో గడుపుతున్నారు. అయితే వీరంతా వేగంగా కోలుకుంటున్నారని లక్ష్మణ్ వెల్లడించాడు. భారత క్రికెటర్ల ఫిట్నెస్ను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడంలో, వారికి అవసరమైన హై-టెక్ రీహాబిలిటేషన్ సదుపాయాలు అందించడంలో సీవోఈ ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందన్నాడు. టీమ్ మేనేజ్మెంట్, ఫిజియోలు, సీవోఈ వైద్య నిపుణుల మధ్య అత్యుత్తమ సమన్వయం ఉందన్న ఆయన.. ఆటగాళ్ల భవిష్యత్తు, శారీరక దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకుని నిపుణుల పర్యవేక్షణలోనే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు.నితీశ్ రెడ్డి గాయంపై స్పందించిన లక్ష్మణ్.. ఒక ఆల్‌రౌండర్‌గా పనిభారాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడం కోసమే అతడిని పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించేవరకు శిక్షణ తీసుకుంటాడని తెలిపాడు. ఇక యో-యో అనేది ఆటగాడి అనెరోబిక్ సామర్థ్యాన్ని పరీక్షించే ఒక పరీక్ష అని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లు ఒక సిరీస్‌లో భాగంగా ఉన్నప్పుడు యో-యో చేయడాని వీలు ఉండదు, అంతేకాదు దాని నుంచి కోలుకోవడానికి శరీరానికి చాలా కష్టంగా ఉంటుందన్నాడు.అందుకే బ్రాంకో టెస్ట్ ఒక కండిషనింగ్ సెషన్‌లా పనిచేస్తుందని, ఇది పరోక్షంగా ఆటగాడి ఫిట్నెస్ స్థాయిలను, అనెరోబిక్ ఫిట్నెస్ స్థాయిలను కూడా పరీక్షిస్తుందని తెలిపాడు. దీనిని వివిధ వయసుల వారిలో పరిగణనలోకి తీసుకుంటామని, సీజన్ పొడవునా దీనిని నిర్వహిస్తామని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.చదవండి: నామమాత్రపు మ్యాచ్.. లివింగ్‌స్టోన్, జూనియర్ ఏబీ విధ్వంసం -
ఇండియన్ క్రికెట్ ట్రైనింగ్ సెంటరా? లేదా ఆస్పత్రి వార్డా?
భారత పురుషల క్రికెట్ జట్టు గతంలో ఎన్నడూ లేనంత విధంగా గాయాల సమస్యను ఎదుర్కొంటుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రస్తుతం ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చే కేంద్రంలా కాకుండా ‘ఆస్పత్రి వార్డు’ను తలపిస్తోంది. జట్టులో చాలా మంది కీలక ఆటగాళ్లు అక్కడే చికిత్స పొందుతున్నారు.మైదానంలో మెరుపులు మెరిపించాల్సిన మన స్టార్ క్రికెటర్లు సీఓఈలో గాయాలతో పోరాడుతున్నారు. ప్రస్తుతం సీఓఈలో ఉన్న ఆటగాళ్లతో ఒక జట్టునే తాయారు చేయొచ్చు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో అత్యవసర భేటీకి సిద్ధమయ్యారు.ఈ క్రమంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావసం పొందుతున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. దైనిక్ జాగరణ్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రస్తుతం 13 మంది భారత క్రికెటర్లు సీఓఈలో ఉన్నారు. వారిలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా టాప్ క్రికెటర్లు ఉన్నారు.జస్ప్రీత్ బుమ్రాపేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఎడమ మోకాలి సమస్యతో బాధపడుతున్నాడు. మోకాలి కీలులో చేరిన వాటర్‌ను తొలగించి జాయింట్ ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందిస్తున్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్ సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని సెలక్టర్లు భావించారు. కానీ రన్నింగ్, డ్రిల్స్ చేసే సమయంలో మోకాలిలో అతడికి ఇంకా నొప్పి ఉంది. పూర్తి స్థాయి బౌలింగ్ వర్క్‌లోడ్‌ను తట్టుకునే స్థితిలో అతడు లేడు. దీంతో జస్ప్రీత్ లంక టూర్‌కు దూరమయ్యాడు.హార్దిక్ పాండ్యా ఇక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయాలు కొత్తేమి కాదు. ఈ బరోడా క్రికెటర్ జట్టులో కంటే ఎక్కువగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఎక్కువగా గడుపుతుంటాడు. ఐపీఎల్ తర్వాత ఇప్పటివరకు అతడు ఇంకా జాతీయ జట్టులోకి తిరిగి రాలేదు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే అతడు తొడ కండరాల గాయం కారణంగా సీఓఈలో చేరాడు. అయితే అతడు వేగంగా కోలుకోవడంతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ సిరీస్ ఆరంభానికి ముందు మళ్లీ అతడి గాయం తిరగబెట్టింది. దీంతో అతడు అఫ్గాన్‌తో పాటు ఇంగ్లండ్‌తో వన్డేలకు దూరమయ్యాడు. అయితే తాజాగా మళ్లీ అతడు కుడి కాలి పిక్క గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా రన్నింగ్, బౌలింగ్ ఆపేయాలని డాక్టర్లు సూచించారు.వాషింగ్టన్ సుందర్తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ భారత జట్టులో ప్రస్తుతం కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడి కుడి కాలి తొడ కండరానికి గాయమైంది. దీంతో స్వదేశంలో అఫ్గాన్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లకు వాషీ దూరమయ్యాడు.అయితే శ్రీలంకతో టెస్టు సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని ప్రధాన జట్టులో చోటు కల్పించారు. కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. దీంతో శ్రీలంక టూర్‌కు కూడా సుందర్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.సాయిసుదర్శన్ యువ బ్యాటర్ సాయిసుదర్శన్ కూడా సీఓఈలో ఉన్నాడు. కుడి కాలి బొటనవేలి నొప్పి తగ్గకపోవడంతో అతడిని శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి తప్పించారు.శుబ్‌మన్ గిల్భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తాజాగా ఈ జాబితాలోకి చేరాడు. శ్రీలంకతో టెస్టులకు ముందు ప్రాక్టీస్ లో గిల్ కుడిచేతి వేలికి దెబ్బ తగిలింది. దీంతో ముందుస్తు జాగ్రత్త చర్య భాగంగా వార్మాప్ మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగలేదు. రాహుల్ భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.వీరితో పాటు నితీష్ కుమార్ రెడ్డి (ఎడమ తొడ కండరాల గాయం), హర్షిత్ రాణా (కుడి తొడ కండరాల గాయం), ఆకాశ్ దీప్(వెన్ను గాయం), వరుణ్ చక్రవర్తి(ఎడమ తొడ కండరాల గాయం), రియాన్ పరాగ్ ( భుజం గాయం), సుయాష్ శర్మ(మోకాలి గాయం), యుధ్వీర్ సింగ్(కుడి భుజం గాయం), అశోక్ శర్మ( వెన్ను గాయం)లు కూడా తమ తమ గాయాల నుంచి కోలుకుంటున్నారు. -
వీవీఎస్ లక్ష్మణ్‌తో సైకియా భేటీ.. కారణం ఇదే!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా.. హెడ్ ఆఫ్ క్రికెట్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ఆదివారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హుటాహుటిన ఆయన బెంగళూరుకు బయల్దేరినట్లు సమాచారం. కాగా గత కొంతకాలంగా టీమిండియా గాయాల బెడదతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.స్టార్ ఆటగాళ్లంతా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నారు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.. అదే విధంగా బౌలర్లు వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్.. బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా గాయాల నుంచి కోలుకోలేదు.ఇక తొడకండరాల నొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా పరిస్థితిలో ఏమాత్రం పురోగతి లేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేవజిత్ సైకియా బెంగళూరుకు వెళ్లి లక్ష్మణ్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమైనట్లు బీసీసీఐ వర్గాలు తాజాగా పీటీఐకి వెల్లడించాయి.‘‘అవును.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా బెంగళూరులో వీవీఎస్ లక్ష్మణ్‌తో భేటీ అవుతారు. ఇరువురి మధ్య చర్చ జరుగుతుంది. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆన్లైన్లో ఈ భేటీలో పాల్గొంటారనే సమాచారం ఉన్నా.. స్పష్టత మాత్రం లేదు.ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యల గురించి సైకియా- లక్ష్మణ్ చర్చిస్తారు. ఇద్దరూ కలిసి మీడియా ఎదుటకు వచ్చి అన్ని ప్రశ్నలకు బదులిస్తారు’’ అని బీసీసీఐ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి. కాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE), టీమిండియా సెలక్టర్ల మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ గురించి పూర్తి సమాచారం ఇవ్వకుండానే.. వారిని రిలీజ్ చేయడం సరికాదని సెలక్టర్లు హితవు పలికినట్లు సమాచారం. ఇటీవల హర్షిత్ రాణా.. తాజాగా బుమ్రా, సాయి సుదర్శన్‌ల ఫిట్నెస్ గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వకలేదని తెలుస్తోంది.దీంతో వారిని తొలుత పలు సిరీస్‌లకు ఎంపిక చేసి.. ఆ తర్వాత వారి స్థానాలను వేరే వారితో భర్తీ చేయడంలో ఇబ్బందులు తలెత్తిన విషయాన్ని CoE దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. బుమ్రా, సుదర్శన్ రిలీజ్ చేయడం వల్ల జట్టు ఎంపిక సమయంలో క్లారిటీ లేకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
గిల్‌కు గాయం.. బీసీసీఐ అధికారిక ప్రకటన
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక అప్డేట్ అందించింది. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. కాగా గిల్ ఇటీవల తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా కండరాల నొప్పితో గిల్ ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న గిల్.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యాడు. అతడి సారథ్యంలో టీమిండియా లంకతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.ఫైనల్ రేసులో ఉండాలంటే గాలె, కొలంబో వేదికలుగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్ ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ ఈ సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకను 2-0తో వైట్‌వాష్ చేయాల్సిందే.గిల్‌కు గాయంకాగా టీమిండియా శ్రీలంక గడ్డ మీద చివరగా 2017లో టెస్టు సిరీస్ ఆడింది. ఈ నేపథ్యంలో స్థానిక పిచ్ పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో టీమిండియా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. అయితే, గురువారం నెట్స్‌లో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ కుడిచేతి వేలికి గాయమైంది.ఈ క్రమంలో టీమ్ డాక్టర్ వచ్చి పరిశీలించి బాండ్‌ఎయిడ్ వేయగా.. గిల్ తిరిగి బ్యాటింగ్ చేశాడు. అయితే, శ్రీలంక ఎలెవన్‌తో టాస్ సందర్భంగా గిల్ మైదానంలోకి రాలేదు. అతడికి బదులు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్కు వచ్చాడు.బీసీసీఐ అధికారిక ప్రకటనఈ నేపథ్యంలో బీసీసీఐ గిల్ గాయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయపడ్డాడు. గురువారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి ఉంగరం వేలుకు గాయమైంది.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్‌తో వామప్ మ్యాచ్‌లో తొలిరోజు గిల్ మైదానంలోకి రాడు. బీసీసీఐ వైద్యబృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. గిల్ గైర్హాజరీలో ఈ మ్యాచ్‌లో కేఎల్ జట్టును ముందుకు నడిపిస్తాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
వాళ్ళకి దూరంగా ఉండు లేదంటే.. బుర్డోడికి ఉతప్ప వార్నింగ్
-
క్రికెట్ వదిలి ఆఫీస్ కి ఇషాన్ కిషన్ శాలరీ ఎన్ని లక్షలో తెలుసా ?
-
బీసీసీఐ పెన్షన్ ఎంత.. ఎవరెవరికి వస్తుంది..?
అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ మాజీ క్రికెటర్లకు అందించే పెన్షన్ పథకం మరోసారి చర్చలోకి వచ్చింది. 2004లో ప్రారంభమైన ఈ పథకంలో సుమారు 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లు, ఇతర అధికారులు ప్రయోజనం పొందుతున్నట్లు సమాచారం.మొదటల్లో కనీసం ఒక టెస్టు మ్యాచ్ ఆడిన మాజీ క్రికెటర్లకు నెలకు రూ.5,000 పెన్షన్ అందించేవారు. 2022లో బీసీసీఐ పెన్షన్ మొత్తాలను భారీగా పెంచింది. దీంతో సుమారు 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లు, అధికారులు లబ్ది పొందారు.ప్రస్తుతం క్రికెటర్ల నెల పెన్షన్ ఎంత..?25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన పురుష క్రికెటర్లు- రూ.70,000ఇతర మాజీ పురుష టెస్టు క్రికెటర్లు- రూ.60,000మాజీ మహిళా అంతర్జాతీయ క్రికెటర్లు- రూ.52,5002003కు ముందు రిటైరైన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లు- రూ.45,000ఇతర మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లు- రూ.30,000జీవితాంతం వస్తుందా..?అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, పెన్షన్ సాధారణంగా శాశ్వతంగా రద్దు కాదు. అయితే మాజీ క్రికెటర్ లేదా అధికారి బీసీసీఐ లేదా రాష్ట్ర క్రికెట్ సంఘంలో జీతభత్యాలు తీసుకునే పదవిలో చేరితే, ఉదాహరణకు కోచ్, సెలెక్టర్, అడ్మినిస్ట్రేటర్ వంటి బాధ్యతలు చేపడితే, పెన్షన్ చెల్లింపులో తాత్కాలిక విరామం ఉండవచ్చు.పెన్షన్ పొందుతున్న ప్రముఖ క్రికెటర్లు..?పెన్షన్ పొందుతున్న మాజీ క్రికెటర్ల జాబితాను బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. అయితే అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, పెన్షన్ అర్హత ఉన్న ప్రముఖ మాజీ క్రికెటర్లలో ప్రస్తుతం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వంటి వారు ఉంటారు.అజింక్య రహానేకు ఎంత..?రహానే భారత్ తరఫున 85 టెస్టులు ఆడాడు. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అత్యధిక రూ.70,000 నెలవారీ పెన్షన్ బ్రాకెట్‌కు అర్హత పొందుతాడు. -
‘వాళ్లిద్దరికి పడట్లేదు.. నువ్వు టీమిండియా కోచ్‌గా రావాలి’
భారత దిగ్గజ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్‌కోచ్‌గా తనకు గతంలో అవకాశం వచ్చిందని.. అయితే, తనకు స్వేచ్ఛనిస్తేనే ఈ పనిచేస్తానని యాజమాన్యంతో కరాఖండిగా చెప్పినట్లు తెలిపాడు.కాగా 2017లో టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే, కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి మధ్య విభేదాలు వచ్చినట్లు ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కోచ్‌గా తనకు ఆఫర్ వచ్చిందని సెహ్వాగ్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. క్రికెట్నెక్ట్స్తో మాట్లాడుతూ..వాళ్లిద్దరికి పడట్లేదు‘‘ఆరోజు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి, కెప్టెన్ విరాట్ కోహ్లి గనుక నన్ను సంప్రదించకపోయి ఉంటే.. నేను అస్సలు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసేవాడినే కాదు. అమితాబ్ నాతో అధికారికంగా సమావేశం నిర్వహించాడు. అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లికి పడటం లేదని.. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని చెప్పాడు.నువ్వు టీమిండియా కోచ్‌గా రావాలిఅందుకే నేను కోచ్‌గా రావాలని వారు కోరుకుంటున్నట్లు తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీ 2017 తర్వాత అనిల్ కాంట్రాక్టు ముగిసిపోతుందని.. ఆ వెంటనే వెస్టిండీస్ పర్యటన నుంచి నేను బాధ్యతలు చేపట్టాలని సూచించాడు. అయితే, నేను అప్పుడు యస్ అని గానీ.. నో అని గానీ చెప్పలేదు. నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదుఒకవేళ నేను కోచ్‌గా వస్తే మాత్రం నేను కోరుకున్న సహాయక సిబ్బందినే నియమించాలని చెప్పేవాడిని. అసిస్టెంట్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియో, ట్రైనర్.. ఇలా ప్రతి ఒక్కరి విషయంలో నా ఛాయిస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరేవాడిని. కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే నేను వెళ్లలేదు’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.కాగా 2017 జూన్‌లో కుంబ్లే హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో సంజయ్ బంగర్ నాడు తాత్కాలిక కోచ్‌గా వచ్చాడు. ఇక ఆ తర్వాత జూలై 2017 నుంచి 2021 వరకు రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా పనిచేశాడు.ఇక రవిశాస్త్రి- కోహ్లి నేతృత్వంలో టెస్టు ఫార్మాట్లో టీమిండియా మంచి విజయాలు అందుకుంది. ఇదిలా ఉంటే.. భారత విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన సెహ్వాగ్.. టెస్టుల్లో 8586, వన్డేల్లో 8273, టీ20లలో 394 పరుగులు సాధించాడు.చదవండి: గంభీర్‌పై ఫిర్యాదు చేసిన సీనియర్ ప్లేయర్లు! -
గంభీర్‌పై ఫిర్యాదు చేసిన సీనియర్ ప్లేయర్లు!
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వైఖరి పట్ల సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలకు వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వైదొలిగిన సంగతి తెలిసిందే.ఘోర పరాభవాలుఈ క్రమంలో బీసీసీఐ ఏరికోరి గంభీర్‌తో ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసింది. అయితే, అతడి మార్గదర్శనంలో విజయాల మాట పక్కనపెడితే.. టీమిండియా ఇప్పటికే ఎన్నో ఘోర పరాభవాలు చవిచూసింది. ముఖ్యంగా టెస్టుల్లో సొంతగడ్డ మీదే న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో వైట్‌వాష్ అయింది.ఇటీవల టీ20 సిరీస్‌లో పసికూన ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్‌స్వీప్ అయింది. అయితే, భారత జట్టు ఇలా అవమానకర రీతిలో పరాజయాల పాలైనప్పుడు గంభీర్.. ఆ తప్పును ఆటగాళ్లు లేదంటే సహాయక సిబ్బందిపై నెట్టేస్తున్నాడనే భావన జట్టు అంతర్గత సభ్యుల్లో నిండిపోయినట్లు సమాచారం.తప్పంతా మాపైనే నెట్టేస్తారా?ఏ ఒక్క ఓటమికి కూడా గంభీర్ జవాబుదారీగా ఉండకుండా తప్పంతా తమపైనే నెట్టేయడాన్ని కొంతమంది సీనియర్ ఆటగాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అపెక్స్ సభ్యులకు వీరు అనధికారికంగా ఫిర్యాదు చేసినట్లు క్రిక్‌బ్లాగర్ పేర్కొంది.ఈ నేపథ్యంలో బీసీసీఐ పెద్దల్లో కొంతమంది గంభీర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం ఇప్పటికీ అతడికి మద్దతుగా నిలిచినట్లు సమాచారం. టీమిండియా నాయకత్వ బృందం నిర్ణయాల్లో తలదూర్చడం సరైన పద్ధతి కాదనే యోచనలో వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.అసంతృప్తి, సందేహాలుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు క్రిక్‌బ్లాగర్‌తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్ కోచింగ్ శైలి, అతడి తీరు పట్ల కొంతమంది సీనియర్ క్రికెటర్లు బీసీసీఐ అపెక్స్ మండలి వద్ద అసంతృప్తి, సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, అనధికారికంగానే వారు ఈ ఫిర్యాదు చేశారు. కాబట్టి శ్రీలంక పర్యటన నేపథ్యంలో గంభీర్‌పై పెద్దలు దృష్టి సారించారు’’ అని పేర్కొన్నాయి.లంక టూర్లో రాణిస్తేనే..కాగా ఆగష్టు 15-28 మధ్య టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుండగా.. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా ఫైనల్ రేసులో ఉండాలంటే శ్రీలంకను 2-0తో వైట్‌వాష్ చేయాల్సిందే. ఒకవేళ ఇక్కడ ప్రతికూల ఫలితం వస్తే గనుక గంభీర్ భవితవ్యం (టెస్టు కోచ్‌గా) ప్రశ్నార్థకంగా మారనుంది. గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాతే తొలిసారి భారత్ కనీసం డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కూడా చేరకుండా నిష్క్రమించింది.చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే? -
ఆసీస్, ఇంగ్లండ్ వల్ల కాలేదు.. చరిత్ర సృష్టించిన బీసీసీఐ!
భారత ఆటగాడు అజింక్య రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ పొందిన ఆటగాళ్లకు బీసీసీఐ పెన్షన్ అందిస్తుంది. రహానే సీనియర్ టెస్టు క్రికెటర్ కావడంతో, అతడు నెలకు పెన్షన్ కింద రూ. 70వేలు అందుకోనున్నాడు. ఈ సంగతి పక్కనబెడితే క్రికెట్ చరిత్రలో బీసీసీఐ (భారత్), ఈసీబీ (ఇంగ్లండ్), క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ సంపన్న బోర్డులుగా గుర్తింపు పొందాయి. కానీ ఈ మూడు బోర్డుల్లో బీసీసీఐ మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లకు గౌరవ వేతనం కింద పెన్షన్ అందిస్తుండడం విశేషం.అటు ఆస్ట్రేలియా కానీ.. ఇటు ఇంగ్లండ్ కానీ తమ మాజీ ఆటగాళ్లకు ఎలాంటి పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదు. దీంతో క్రికెట్ చరిత్రలోనే మాజీ ఆటగాళ్లకు పెన్షన్ కల్పిస్తున్న ఏకైక బోర్డుగా బీసీసీఐ చరిత్ర సృష్టించింది. బీసీసీఐ అందిస్తున్న పెన్షన్ విధానాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం.బీసీసీఐ కల్పిస్తున్న పెన్షన్ వివరాలు👉మాజీ క్రికెటర్లు: నెలకు రూ. 58,750👉టెస్టు క్రికెటర్లు: నెలకు రూ. 60 వేలు👉సీనియర్ టెస్టు క్రికెటర్లు: నెలకు రూ. 70 వేలు👉ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు: నెలకు రూ. 30 వేల నుంచి 45వేలు👉అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు: నెలకు రూ. 52,500👉దేశవాళీ మహిళా క్రికెటర్లు: నెలకు రూ. 45వేలుఇక దేశవాళీ క్రికెట్లో రాష్ట్రాల వారీగా చూసుకుంటే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తమ రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ ఆడిన 150 మంది మాజీ క్రికెటర్లకు పెన్షన్‌తో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఆదర్శంగా నిలిచింది. మిగతా రాష్ట్రాల బోర్డులు కూడా తమ మాజీ క్రికెటర్లకు తమకు తోచినంత పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. 🔴 NO AUSTRALIA, NO ENGLAND- ONLY BCCI PAYS CRICKETERS AFTER RETIREMENT 🤯- Cricket Australia: No pension system- England Cricket: No pension systemBCCI: Pays an avg pension of ₹58,750/month to former cricketers.Current BCCI pension structure:- Test cricketers:… pic.twitter.com/HM0Y3aBMqr— Sam (@cricsam02) August 3, 2026Read: ప్రేమకు ఎండ్‌కార్డ్.. గర్ల్‌ఫ్రెండ్‌తో రొనాల్డో పెళ్లి ఎప్పుడంటే? -
తీవ్ర అసంతృప్తిలో గిల్, గంభీర్.. వాళ్లపై బీసీసీఐ వేటు!
ఇటీవలి కాలంలో టీమిండియాకు గాయాల బెడద ఎక్కువైంది. కీలక ఆటగాళ్లంతా జట్టుకు అవసరమైన సమయంలో అందుబాటులో లేకుండా పోతున్నారు. జట్టు విజయావకాశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2026 తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు, అయితే, గాయం వల్ల టూర్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. పాండ్యా మాదిరే అరుదైన నైపుణ్యాలున్న నితీశ్ కుమార్ రెడ్డి కూడా గాయపడ్డాడు.యువ పేసర్ హర్షిత్ రాణాతో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఇటీవలే ఈ గాయాల జాబితాలో చేరారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.ఫిజియోథెరపీ టీమ్‌లో సమూలంగా మార్పులు చేపట్టేందుకు బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంజూరీ మేనేజ్మెంట్, ఫిట్నెస్ క్లియరెన్స్‌ల విషయంలో స్పష్టత లేదని.. ఇందుకు హెడ్ ఫిజియోథెరపిస్ట్ నిర్లక్ష్యమే కారణమని యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు క్లియరెన్స్ సర్టిఫికెట్తో తిరిగి వచ్చిన తర్వాత.. ఆ వెంటనే మళ్లీ గాయాల బారిన పడటాన్ని ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్ ఫిజియోథెరపిస్ట్ కమలేశ్ జైన్, టీమ్ డాక్టర్ రిజ్వాన్ ఖాన్‌లపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం.ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘కమలేశ్ జైన్ విషయంలో మేనేజ్మెంట్ అసంతృప్తితో ఉంది. ఆటగాళ్లు తరచూ గాయాలబారిన పడటం వల్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తమ తుదిజట్టు కూర్పులో ఇబ్బంది పడుతున్నారు.పదిహేను మంది సభ్యులు ఉన్నప్పటికీ సరైన కాంబినేషన్‌ని సెట్ చేయలేక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గాయాల విషయంలో సిబ్బంది పూర్తి అవగాహన, స్పష్టతతో ఉండాలి. ఆటగాళ్లను తిరిగి మైదానంలోకి పంపేందుకు తొందరపడకూడదు.వారు పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే సర్టిఫికెట్ జారీచేయాలి. హడావుడిగా రంగంలోకి దించడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా విషయంలో ఇదే జరిగింది. ఇలాంటి తొందరపాటు చర్యలు కీలక సమయంలో జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తాయి. అందుకు సదరు బృందం కచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సిందే. వారి నుంచి సరైన వివరణ లభించకపోతే వేటు తప్పకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి.కాగా ఆటగాళ్లు తరచూ గాయపడటం పట్ల టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఒకటి, రెండు మ్యాచ్‌ల తర్వాత ఆటగాళ్లు గాయపడితే.. వన్డే వరల్డ్‌కప్-2027 వంటి మేజర్ టోర్నీలో తమకు ఇబ్బందులు తప్పవన్నాడు. ఫిట్నెస్ సమస్యలు మెరుగుపరచుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు బీసీసీఐ వైద్య బృందాన్ని కాదని.. చికిత్స కోసం బయటి డాక్టర్లను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కాగా గిల్ తరచూ మెడనొప్పి, కండరాల నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.చదవండి: బుమ్రా అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ -
‘అతడిని ఎంపిక చేయబోం.. రిటైరవ్వడమే మంచిది’
భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకోవడం కష్టమే అనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. తాజాగా భువనేశ్వర్ కుమార్‌తో పాటు మహమ్మద్ షమీ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. 2027 వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది ఫాస్ట్ బౌలర్లను సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. అయితే ఇందులో అందరూ యంగ్ బౌలర్లే ఉంటారని అగార్కర్ పేర్కొన్నాడు. 30 సంవత్సరాలు దాటిన బౌలర్లను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని బాంబు పేల్చాడు.'షమీ టీమిండియా అత్యుత్తమ మ్యాచ్ విన్నర్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో షమీ ఛాంపియన్. కానీ భవిష్యత్తు కోసం మేము యువ పేస్ బౌలింగ్ దళానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. భారత క్రికెట్‌కు అతని సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. మేము అతడిని గౌరవిస్తున్నాము.’ అని చెప్పుకొచ్చాడు. అగార్కర్ వ్యాఖ్యల ను బట్టి చూస్తే మాత్రం షమీ రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందంటూ పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది.ఒకప్పుడు భారత బౌలింగ్ దళానికి ప్రధాన బలంగా నిలిచిన షమీ.. ఇప్పుడు సెలెక్టర్ల దీర్ఘకాలిక ప్రణాళికల్లో చోటు దక్కించు కోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా భారత జట్టు తరఫున వన్డే ఆడగా, అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చివరిసారి కనిపించాడు. షమీతో పాటు భువనేశ్వర్ కుమార్ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఎదురుచూస్తున్నారు. దీనికి తగినట్లుగానే గత రెండేళ్లుగా వీళ్లిద్దరి గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. దేశవాళీ, రంజీలు అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ బీసీసీఐ మాత్రం ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లను పట్టించుకోవడం లేదు. అవకాశాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా హెడ్‌కోచ్‌గా గంభీర్, సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాత వీళ్ల అడ్రస్ గల్లంతయ్యింది.🚨 Ajit Agarkar breaks silence on Mohammed Shami .🚨🔹We've picked our group of 15 fast bowlers for the future and want to give young players more opportunities ahead of the World Test Championship and the 2027 ODI World Cup.Shami has been one of India's finest match-winners… pic.twitter.com/p0mEPybruS— Indian cricket (@Cricketpaglu45) August 1, 2026చదవండి: హార్దిక్ మాజీ భార్యపై తీవ్ర విమర్శలు! -
ఆసియా కప్ 2026కు భారత జట్టు ప్రకటన
మహిళల ఆసియా కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్సీపై ఇటీవల చర్చ జరిగినప్పటికీ హర్మన్‌ప్రీత్ కౌర్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. జట్టులో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ వంటి కీలక ప్లేయర్లకు చోటు దక్కింది.శ్రేయాంక పాటిల్‌కు చోటు లేదుటీ20 ప్రపంచకప్ జట్టులో ఉన్న శ్రేయాంక పాటిల్‌కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆమె కుడి చీలమండకు గాయమయ్యింది. శ్రేయాంక స్థానంలో టీ20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన ప్రేమా రావత్ ఆసియా కప్ జట్టులోనూ కొనసాగింది. ఇదే జట్టులో జరిగిన ప్రధాన మార్పు.భారత మహిళల ఆసియా కప్ 2026 జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమిలిని, అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్.కాగా, ఆసియా కప్ 2026 సెప్టెంబర్ 17న మొదలై 22వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీ ఫిక్చర్స్ ఇంకా ఖరారు కాలేదు. -
గుండుతో దర్శనం.. హార్దిక్ పాండ్యా కొత్త లుక్ వైరల్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించుకున్న పాండ్యా క్లీన్ హెడ్షేవ్ (గుండు)తో కనిపించాడు. దీంతో పాండ్యా కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తిరుమల పర్యటనలో హార్దిక్ పాండ్యా శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మొక్కుబడి తీర్చుకునే భాగంగానే తలనీలాలు సమర్పించారా.? లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా? అనేది తెలియాలి. ఇక ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయానికి గురైన పాండ్యా స్వదేశంలో అప్గానిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)లో పాండ్యా రీహాబిలిటేషన్‌లో గడుపుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవడంపై బీసీసీఐ ప్రత్యేక ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగానే పరిమితంగానే పాండ్యా సేవలు ఉపయోగించుకోవాలని చూస్తోంది. మరోవైపు పాండ్యా కూడా 2027 వన్డే ప్రపంచకప్ వరకు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించినప్పటికీ.. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పాండ్యా కెప్టెన్‌గా వచ్చిన తర్వాత కూడా ముంబై గత మూడు సీజన్లలో నిరాశాజనక ఫలితాలే అందుకుంది. దీంతో పాండ్యాను ముంబై ఇండియన్స్ వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు పాండ్యా వేరే జట్టులో దర్శనమిచ్చే అవకాశముంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ట్రేడ్ లేదా ఒప్పందం ఖరారు కాలేదు. మొత్తంగా 2027 సీజన్లో హార్దిక్ ఏ జట్టు జెర్సీలో కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.Indian cricketer Hardik Pandya visited the Sri Venkateswara Swamy Temple in Tirumala today with Mahika Sharma.Hardik offered his hair as part of a religious vow and was seen in a new bald look. The two also took part in the early morning Suprabhatha Seva. 🙏 pic.twitter.com/mdkQlecKLv— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) August 2, 2026 Hardik Pandya with Mahieka at the Tirumala Temple. pic.twitter.com/3FjJ33ltw8— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2026Read: అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు -
రిటైర్మెంట్ తర్వాత రహానేకి బీసీసీఐ పెన్షన్.. నెలకి ఎంతంటే?
టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే ఇటీవల తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల రహానే ప్లేయర్‌గా, కెప్టెన్‌గా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకున్నాడు.అతడి సారథ్యంలోనే భారత్ 2021లో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రహానేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.రహానే పెన్షన్ ఎంతంటే?బీసీసీఐ మాజీ క్రికెటర్లను వారి అనుభవం, ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల ఆధారంగా మూడు విభాగాలగా విభజించింది. అత్యధికంగా 25 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు టాప్ కేటగిరీకి వస్తారు. వారికి ప్రస్తుతం నెలకు రూ.70,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లకు నెలకు రూ. 50,000 దక్కేది. కానీ 2022లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ మొత్తాన్ని రూ.70,000కు పెంచాడు. ఇప్పుడు భారత్ తరఫున 85 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రహానే, అత్యున్నత పెన్షన్ స్లాట్‌లో ఉన్నాడు. అతడికి ప్రతీ నెల రూ.70,000 పెన్షన్ లభించనుంది. ఇక దిగువ శ్రేణిలోని వారికి రూ. 60 వేలు, ఫస్ట్‌క్లాస్ మాజీ ఆటగాళ్లకు రూ. 30 వేలు పెన్షన్ అందిస్తోంది. పెన్షన్ పథకం ప్రస్తుతం దాదాపు 900 మందికి పైగా రిటైర్డ్ క్రికెటర్లు, అంపైర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. -
అగార్కర్ అవుట్.. అశ్విన్ ఇన్ ఇక హిట్ మ్యాన్ ను ఆపేదెవరు
-
ఓ శకం ముగిసింది! క్రికెట్‌కు రహానే గుడ్‌బై.. అభిమానులు ఎమోషనల్
-
కొడితే సిక్స్ పడాల్సిందే.. వైభవ్ కీలక వ్యాఖ్యలు
-
పక్కలో బల్లెంలా తయారయ్యాడు.. పంత్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్!
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ, శ్రీలంకతో జరగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఊహించిన విధంగానే, దక్షిణాఫ్రికా టెస్ట్ పర్యటనలో నిరాశాజనక ప్రదర్శన, ఆఫ్ఘనిస్తాన్పై సాధారణ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ , ప్రధాన వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే మరోవైపు ధ్రువ్ జురెల్ రెండో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. పంత్‌కు బ్యాకప్‌గా ప్రతీ సిరీస్‌కు ఎంపికవుతూ వస్తున్న ధ్రువ్ జురేల్ సిరీస్ సిరీస్‌కు రాటుదేలుతూ పంత్‌కు పక్కలో బల్లెంలా తయారయ్యాడనిపిస్తోంది. టెస్టు క్రికెట్లో ఇప్పటికైతే టీమిండియా వికెట్ కీపర్‌గా మొదటి ప్రాధాన్యత పంతకే ఉన్నప్పటికీ, జురేల్ రాకతో పోటీ తీవ్రమయింది. జురెల్ తనకు అవకాశాలు వచ్చినప్పుడల్లా బ్యాటింగ్‌తో పాటు వికెట్ల వెనుక కూడా నిలకడ ప్రదర్శిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకునే పనిలో పడ్డాడు.Photo Credit: BCCI Twitterఈ నేపథ్యంలోనే పంత్ స్థానాన్ని భర్తీ చేయడానికి జురెల్ నిజంగా అర్హుడేనా అని చూస్తే మాత్రం తొలి 10 టెస్టుల్లో పంత్ 727 పరుగులు చేస్తే, ధ్రువ్ జురెల్ 478 పరుగులు సాధించాడు. అయితే పంత్ టెస్టుల్లో ప్రధానంగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. కానీ జురెల్ జట్టులో ఉంటే అతడి బ్యాటింగ్ స్థానం ఆరు లేదా ఏడు. దీనివల్ల జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్లంతా ఔటైన తర్వాత కానీ ధ్రువ్ జురెల్‌కు అవకాశం రావడం లేదు. దీంతో అతడు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడేందుకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే ఒత్తిడి పరిస్థితులు ఉన్నప్పుడు సంయమనం పాటించడంలో పంత్‌తో పోలిస్తే జురెల్ ఒక మెట్టుపైనే ఉంటాడు. ఇక జురెల్‌తో పోలిస్తే పంత్ ప్రతీ 100 బంతులకు 18 పరుగులు వేగంగా సాధించడంలో దిట్ట. ఇంగ్లండ్‌లో జేమ్స్ అండర్సన్, ఆస్ట్రేలియాలో నాథన్ లయన్ ఇలా విదేశీ గడ్డపై ఎలాంటి బౌలర్లనైనా తన దూకుడైన బ్యాటింగ్‌తో పరుగులు సాధించడంలో ముందుంటాడు. అయితే పంత్‌తో పోలిస్తే ధ్రువ్ జురెల్ది పూర్తిగా భిన్నమైన బ్యాటింగ్. టెక్నికల్‌గా బ్యాటింగ్ ఆడడంలో నేర్పరి అయిన ధ్రువ్ జురెల్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. తర్వాత ఓపికతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌లు నిర్మించడంలోనూ జురెల్ ముందు వరుసలో ఉంటాడు.బ్యాటింగ్ సంగతి పక్కనబెడితే, వికెట్‌కీపింగ్ నైపుణ్యంలో మాత్రం పంత్, జురెల్ సమానంగానే కనిపిస్తున్నారు. పది టెస్టుల తర్వాత పంత్ వికెట్ల వెనుక 47 డిస్మిసల్స్ చేస్తే, జురెల్ 15 నమోదు చేశాడు. ఇది పంత్‌కు అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ, పంత్ కీపర్‌గా లేని 10 ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే కీపింగ్ చేశాడు. అదీగాక జురెల్ తుదిజట్టులో ఉన్నప్పటికీ, అనేక మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ లేదా పంత్‌లో ఒకరు గ్లోవ్స్ చేపట్టేవారు. అయితే 2026లో దేశీయంగా జురెల్ పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ, విదేశీ పర్యటనలన్నింటిలోనూ పంత్‌కు ప్రత్యామ్నాయంగా జురెల్‌ను ఎంపిక చేస్తూ ఉండడం, అతడి వికెట్‌కీపింగ్ సామర్థ్యాలపై యాజమాన్యానికి నమ్మకం పెరుగుతోందనిపిస్తోంది.Read: ‘కంగ్రాట్స్ జింక్స్.. నువ్వు నా ఫెవరెట్ బ్యాటింగ్ పార్టనర్’ -
BCCI నుంచి వైభవ్‌కు బిగ్ గిఫ్ట్.. వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్!
-
బీసీసీఐ కీలక నిర్ణయం
భారత క్రికెట్లో వయో మోసాన్ని (Age Fraud) అరికట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలు చేపట్టింది. వయో విభాగాల క్రికెట్లో పారదర్శకత పెంచేందుకు స్వతంత్ర సంస్థను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.అండర్-16, అండర్-19, అండర్-23 విభాగాల్లో ఆడే క్రికెటర్ల పత్రాలన్నింటినీ ఈ స్వతంత్ర సంస్థ పరిశీలించనుంది. ఆటగాళ్ల ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల రికార్డులు వంటి వివరాలను సంబంధిత అధికారులు, విద్యాసంస్థలతో సరిపోల్చి వాటి ప్రామాణికతను నిర్ధారించనుంది.పత్రాల్లో ఏవైనా తేడాలు లేదా తారుమార్లు ఉన్నట్లు తేలితే, సంబంధిత ఆటగాడిని బీసీసీఐ వయో విభాగాల టోర్నీల్లో తన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించకుండా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే చర్యలు తీసుకునే ముందు ఆటగాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, తమ వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించనుంది.ఇకపై అన్ని వయో విభాగాల క్రికెటర్లకు బయోమెట్రిక్ ధ్రువీకరణ కూడా తప్పనిసరి చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. గతంలో వయో మోసం ఆరోపణలతో రసిఖ్ సలామ్, ప్రిన్స్ యాదవ్, మంజోత్ కల్రా, నితీష్ రాణా వంటి పలువురు ఆటగాళ్లు బీసీసీఐ చర్యలను ఎదుర్కొన్నారు.ఆధార్‌లో చిరునామా మార్చాలిఅలాగే 2026-27 సీజన్‌కు రాష్ట్ర సంఘాన్ని మార్చుకోవాలనుకునే ఆటగాళ్లు సెప్టెంబర్ 1లోపు తమ ఆధార్ కార్డులో చిరునామాను నవీకరించి బీసీసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఒక సంవత్సరం నిరీక్షణ కాలం పూర్తయిన తర్వాతే వారు కొత్త రాష్ట్రం తరఫున ఆడేందుకు అర్హత పొందుతారు. -
రహానే రిటైర్మెంట్పై బీసీసీఐ తొలి స్పందన
టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే గురువారం తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దశాబ్దంన్నర పాటు భారత క్రికెట్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రహానే ఇటీవలే ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. వయసు మీదపడడం, ఫామ్ లేమి, జట్టులో యువకుల రాక పెరగడం వెరసి రహానే క్రమంగా టీమిండియాకు దూరమవుతూ వచ్చాడు. అయితే ఐపీఎల్లో మాత్రం రహానే ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రహానే వచ్చే ఐపీఎల్ సీజన్లో మనకు మరోసారి కనిపించొచ్చు. ఇదిలా ఉంటే రహానే రిటైర్మెంట్ పోస్టుపై బీసీసీఐ తొలిసారి తన స్పందన వ్యక్తం చేసింది. భారత క్రికెట్‌కు రహానే అందించిన సేవలకు కృతజ్క్షతలు తెలుపుతూ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసింది. 'ఒక అద్భుతమైన కెరీర్ ముగిసింది. క్రికెటర్‌గా భారత క్రికెట్‌కు మీరు అందించిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు అజింక్య రహానే. క్రికెటర్‌గా మీరు సాధించిన అద్భుత విజయాలు ఒక జ్ఞాపకాలుగా ఎప్పటికీ గుర్తుండిపోతాయనడంలో సందేహం లేదు. రిటైర్మెంట్ తర్వాతి చాప్టర్‌కు ‘ఆల్ ది బెస్ట్ రహానే'’ అంటూ బీసీసీఐ ఎమోషనల్ ట్వీట్ చేసింది..15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలున్నాయి. ఇక 90 వన్డే మ్యాచ్‌ల్లో 2,962 పరుగులు సాధించిన రహానే ఖాతాలో మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో 20 మ్యాచ్‌లాడిన రహానే 375 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. రహానేకు టెస్టు కెప్టెన్‌గా అజేయమైన రికార్డు ఉంది. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం. 2020-21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీని రహానే సారథ్యంలోనే టీమిండియా 2-1 తేడాతో చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాపై టెస్టు విజయం, 2018లో అఫ్గానిస్తాన్‌పై విజయంలో రహానే కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కీలకపాత్ర పోషించాడు. An illustrious career comes to an end 🇮🇳Thank you @ajinkyarahane88 for your immense contribution to Indian cricket and all the memories that will be cherished forever Wishing you the very best in your next chapter #TeamIndia | #ThankYouAjinkya pic.twitter.com/Gbi7sIcgwS— BCCI (@BCCI) July 30, 2026 AJINKYA RAHANE IN TEARS 🥹- The moment ajji announced his retirement, Cap 278 Signing off forever 🥹❤️ pic.twitter.com/jgCCXh8kv8— Sam (@cricsam02) July 30, 2026Read: జెమీమా విధ్వంసం.. పరుగు తేడాతో థ్రిల్లింగ్ విజయం -
శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం!
టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తే అతడి కండరాలు పట్టేస్తున్నాయి. తరచూ మెడ నొప్పి కారణంగానూ అతడు ఇబ్బంది పడుతున్నాడు.ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగానూ గిల్ అసౌకర్యానికి గురైన సంగతి తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న వేళ కండరాల నొప్పితో గిల్ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు, ఐపీఎల్ సందర్భంగా మెడ నొప్పితో మ్యాచ్‌లు మిస్సయ్యాడు.అక్కడ ఎలా ఆడగలరు?విరామం లేని షెడ్యూల్, ఒత్తిడి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. ఇక రానున్న ఏడాది కాలంలో టీమిండియా మరింత బిజీ కానుంది. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2027 వంటి మేజర్ ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫిట్నెస్ సమస్యల గురించి గిల్ మాట్లాడిన సంగతి తెలిసిందే.ఒకటి, రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత గాయపడి.. జట్టుకు దూరమయ్యే వాళ్లు వరల్డ్‌కప్‌లో వరుసగా ఏడు- ఎనిమిది మ్యాచ్‌లు ఎలా ఆడగలరని ప్రశ్నించాడు. జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకొని ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయంఅయితే, స్వయంగా గిల్ సైతం గాయాల బారిన పడటాన్ని ఇంగ్లండ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్ ప్రశ్నించాడు. డెబ్బై పరుగులు చేయగానే కండరాలు పట్టేయడం.. మైదానం నుంచి నిష్క్రమించడం గిల్‌కు అలవాటైపోయిందని విమర్శించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ వైద్య బృందాన్ని కాదని.. ఫిట్నెస్ సమస్యలకు పరిష్కారం కనుగొనే క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందాన్ని కాదని.. బయటి డాక్టర్ల వద్ద గిల్ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..‘‘చాన్నాళ్లుగా గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడు. రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోందని భావించాడు. అందుకే బీసీసీఐ వైద్యబృందాన్ని కాదని.. బయటి డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకున్నాడు. పరిస్థితి ఇప్పుడు చాలా వరకు మెరుగుపడింది. అయితే ఇది నిరంతర ప్రక్రియ’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: 30 ఏళ్లు దాటినా తగ్గేదేలే!.. టీమిండియాలో రీఎంట్రీకి సై! -
'స్టార్ ప్లేయర్స్‌నే భయపెట్టాడు.. అయినా జట్టులో నో ఛాన్స్'
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్న జమ్మూ కాశ్మీర్ పేస్ సంచలనం ఆకిబ్ నబీకి మరోసారి నిరాశే ఎదురైంది. అతడిని జట్టు ఎంపిక కోసం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఈ జట్టులో నలుగురు స్పెషలిస్ట్ పేసర్లకు సెలక్టర్లు అవకాశం కల్పించినప్పటికి.. గత రంజీ సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన నబీకి మాత్రం చోటు దక్కక పోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు."ఆకిబ్ నబీని ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే తెలియదు. అతడి వద్ద పేస్ తక్కువగా ఉండడంతోనే సెలక్ట్ చేయలేదని చాలా మంది చెబుతున్నారు. వాస్తవానికి పేస్‌తో పనిలేదు, ఒక బౌలర్ సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నాడా? లేదా అన్నది ముఖ్యం. దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే నబీ టాలెంట్‌ను మనం చూశాం. రంజీ సీజన్ అసాంతం అద్భుతంగా రాణించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లో కూడా అతడు కేఎల్ రాహుల్ వంటి సీనియర్ బ్యాటర్‌ను సైతం ఇబ్బంది పెట్టాడు. కాబట్టి అతడి ప్రదర్శనకు తగిన గుర్తింపు దక్కాల్సిందే. అతడు మంచి రిథమ్‌లో ఉన్నాడు. అతడిని వీలైనంత త్వరగా జట్టులోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని స్పోర్ట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా రంజీ ట్రోఫీ టైటిల్‌ను జమ్ముకాశ్మీర్ తొలిసారి సొంతం చేసుకోవడంలో నబీది కీలక పాత్ర. ఫైనల్లో 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడు ఇప్పటివరకు 43 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 18.63 సగటుతో 162 వికెట్లు పడగొట్టాడు. అందులో పదిహేను ఫైవ్ వికెట్ల హాల్స్ ఉండడం గమనార్హం. -
టీమిండియాకు కొత్త కోచ్‌గా శుభదీప్ ఘోష్.. ఎవరీ ఈయన?
-
నా కల నెరవేరింది.. వైభవ్ ఎమోషనల్ కామెంట్స్
-
సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్?
టీమిండియా తరఫున సారాన్ష్ జైన్ రూపంలో దేశవాళీ సీనియర్ క్రికెటర్ అంతర్జాతీయంగా అరంగేట్రం చేయనున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాన్ష్ జైన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సారాన్ష్ జైన్ లోయర్ ఆర్డర్లో బ్యాటర్‌గా పరుగులు సాధించడంలో సమర్థుడు. దీంతో లంకతో సిరీస్‌లో సారాన్ష్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు కూడా దీనికి మరో ప్రధాన కారణం. 33 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన సారాన్ష్ 2014లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్‌కు ప్రధాన ఆటగాడిగా మారిపోయిన సారాన్ష్ ఆ తర్వాత సెంట్రల్ జోన్‌తో పాటు రెస్టాఫ్ ఇండియాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. తండ్రి కూడా క్రికెటరే.. స్పిన్ బౌలర్ అయిన సారాన్ష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 181 వికెట్లతో పాటు 2,223 పరుగులు సాధించాడు. సారాన్ష్ జైన్ తండ్రి సుబోధ్ జైన్ కూడా క్రికెటరే. మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడారు. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ బౌలర్ అయిన సుబోధ్ జైన్ తొమ్మిది మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఇక సారాన్ష్ జైన్ దేశవాళీ సీనియర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ వద్ద శిక్షణ పొంది ఆటలో మరింత రాటుదేలాడు. 2022లో తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సారాన్ష్ జైన్ సభ్యుడిగా ఉన్నాడు. చెన్నై వేదికగా ముంబైతో జరిగిన రంజీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో కీలక హాఫ్ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. లంక-ఏపై రాణించి సెలెక్టర్ల దృష్టిలో..ఇటీవలే శ్రీలంక-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో సారాన్ష్ జైన్ రాణించాడు. బ్యాట్‌తో 70 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే సెలెక్టర్ల దృష్టిలో పడిన సారాన్ష్ జైన్ తాజాగా సుందర్ స్థానంలో లంకతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. వేలంలో అన్సోల్డ్ఇక ఐపీఎల్ 2024 నుంచి 2026 వరకు సారాన్ష్ జైన్ తన పేరును రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వేలంలో అతడిని ఎవరు కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ ద్వారా కాకుండా దేశవాలీ క్రికెట్లో రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అరుదైన క్రికెటర్ల జాబితాలో సారాన్ష్ జైన్ పేరును లిఖించుకున్నాడు.Saransh Jain has earned his maiden Test call-up 👏Take a look at the new off-spinner, who set the stage on fire with his stunning 5/49 in the Duleep Trophy final. 👌 pic.twitter.com/VIlTxFDhAy— BCCI Domestic (@BCCIdomestic) July 28, 2026Read: కోచ్ మార్పుకు డిమాండ్.. గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే! -
కోచ్ మార్పుకు డిమాండ్.. గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే!
జింబాబ్వేపై టీ20 సిరీస్ విజయం తర్వాత టీమిండియా కోచ్ మార్పు అంశం సోమవారం పెద్ద ప్రకంపనలే సృష్టించింది. గంభీర్‌ను తీసేసి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు పూర్తిస్థాయి హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు డిమాండ్ చేశారు. రోజంతా ఇదే అంశంపై సోషల్ మీడియాలో వాడీవేడి చర్చ కూడా జరిగింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుస సిరీస్ ఓటములు టీమిండియాను తీవ్రంగా దెబ్బకొట్టాయి. దీంతో జింబాబ్వే పర్యటనకు ప్రధాన కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా జట్టుతో పాటు పంపించారు. జింబాబ్వే చిన్నజట్టే అయినప్పటికీ, లక్ష్మణ్ కోచింగ్ విధానం టీమిండియా ఆటగాళ్లకు బాగా వంటబట్టింది. అందుకే శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఎదురైన పరాభవాలను మర్చిపోయేట్లు చేసింది. బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ, జింబాబ్వే గడ్డపై మన యువ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దీని వెనుక వీవీఎస్ లక్ష్మణ్ వ్యూహాలు, ఆలోచనలు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఒక నాలుగు అంశాలు గంభీర్, లక్ష్మణ్ మధ్య ఉన్న కోచింగ్ తేడాలను స్పష్టంగా చూపిస్తోంది.స్థిరమైన ఓపెనింగ్ జోడిఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తరఫున అభిషేక్, సంజూ శాంసన్ ఓపెనర్లుగా వచ్చారు. వైభవ్ ఈ సిరీస్‌లకు ఎంపికైనప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్‌కు విశ్రాంతినిచ్చి, అతడి స్థానంలో ప్రబ్సిమ్రన్ను ఎంపిక చేశారు. అయితే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో విశేషంగా రాణించిన అభిషేక్ శర్మ జింబాబ్వే పర్యటనలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మరోవైపు తనకు వచ్చిన అవకాశాన్ని వైభవ్ రెండు చేతులా ఒడిసిపట్టాడు. రెండు అర్ధసెంచరీలు సహా 155 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎగరేసుకుపోయాడు. అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో కోచ్‌గా లక్ష్మణ్ తన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశాడు. అభిషేక్ విఫలమైనప్పటికీ అతడికి అవకాశాలు ఇచ్చి స్థిరమైన ఓపెనింగ్ జోడిని కొనసాగించాడు.ముగ్గురు పేసర్లతో బరిలోకియూకే పర్యటనలో కోచ్ గౌతమ్ గంభీర్ బౌలర్లను ఉపయోగించిన తీరు విమర్శలకు దారి తీసింది. పేస్‌కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్‌లపై అనవసర ప్రయోగాలకు పోయి స్పిన్-ఆల్‌రౌండర్ల కలయికపై ఎక్కువగా ఆధారపడి గంభీర్ చేతులు కాల్చుకున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో మొత్తం ఐదుగురిలో ఒకే ఒక పేసర్‌ను ఆడించడం గమనార్హం. ఇక వన్డే సిరీస్‌లోనూ గంభీర్ వ్యూహాలు పనిచేయలేదు. బౌలర్లంతా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. అయితే జింబాబ్వే పర్యటనలో మాత్రం లక్ష్మణ్ గంభీర్‌కు విరుద్ధంగా వ్యవహరించాడు. టీ20 సిరీస్‌లో ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో ఆడాలని నిర్ణయించిన లక్ష్మణ్.. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లతో పాటు అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ సేవలు వినియోగించుకొని అద్భుత ఫలితాలు రాబట్టాడు. దాదాపు రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన మయాంక్ యాదవ్‌పై నమ్మకముంచిన లక్ష్మణ్ అవకాశాలిచ్చాడు. దీంతో మయాంక్ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు.ఆల్‌రౌండర్ల వినియోగంఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హర్షిత్ రానాలకు గంభీర్ తుది 11 మందిలో చోటిచ్చాడు. దీని ఫలితంగా మిడిలార్డర్లో బ్యాటింగ్ లోపించడంతో పాటు, తన నాలుగు ఓవర్ల కోటాను నమ్మకంగా పూర్తి చేయగల స్పెషలిస్ట్ బౌలర్ కొరత కూడా ఏర్పడింది. కానీ లక్ష్మణ్ మాత్రం కేవలం ఒక్క ఆల్‌రౌండర్‌కే చోటు కల్పించాడు. తొలి రెండు టీ20ల్లో శివమ్ దూబేను ఆడిపించిన లక్ష్మణ్ చివరి టీ20 మ్యాచ్‌కు సూర్యాంశ్ షెడ్గేను చాన్స్ ఇచ్చాడు. ఇలా చేయడం వల్ల జట్టులో ఒక పూర్తిస్థాయి బ్యాటర్‌కు అవకాశం కల్పించడంతో పాటు ఒక స్పిన్నర్‌కు అవకాశం కల్పించినట్లయింది. రింకూ సింగ్ ఫినిషర్‌గా, రవి బిష్ణోయ్ స్పిన్నర్‌గా తమ పాత్రను సమర్థంగా పోషించారు.ఆటగాళ్లపై నమ్మకంజింబాబ్వేలో భారత్ 3-0తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సమయంలో అభిషేక్, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లు ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నప్పటికీ తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ వారికి అండగా నిలిచాడు. కండరాల గాయానికి గురైన వరుణ్ చక్రవర్తి స్థానంలో, చివరి నిమిషంలో బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ముఖ్యంగా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక క్లిష్టమైన టీ20 మ్యాచ్‌లో బిష్ణోయ్ అధిక ఎకానమీ రేటుతో ఇబ్బంది పడ్డాడు.అయినప్పటికీ జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో రవి బిష్ణోయ్‌ను ప్రధాన స్పిన్నర్‌గా ఆడించి ఫుంజుకోవడానికి తోడ్పడ్డాడు. ఈ సిరీస్‌లో రవి బిష్ణోయ్ మొత్తంలో 5.667 సగటు ఎకానమీతో 3 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు పడగొట్టాడు.చదవండి: శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. లంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ అతడికి డిప్యుటీగా ఉండనున్నాడు. ఇక ఏడాది తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనుండగా, సారాన్ష్ జైన్ తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక బుమ్రా, సాయి సుదర్శన్‌లను ఎంపిక చేసినప్పటికీ సిరీస్ మొదలయ్యే సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు జరగనుంది. అయితే టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ఆగస్టు 7 నుంచి కొలంబో వేదికగా నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా గాయానికి గురైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికవుతాడని భావించినప్పటికీ, అతడి పేరును పరిగణలోకి తీసుకోలేదు. మరో ఆల్‌రౌండర్ నితీశ్ రానాతో పాటు పేసర్ హర్షిత్ రానాలు కూడా గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లంక టూర్‌కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది.టెస్టు మ్యాచ్ సిరీస్:ఆగస్టు 15-19 వరకు: తొలి టెస్టు, గాలేఆగస్టు 23-27 వరకు: రెండో టెస్టు, కొలంబోభారత జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాన్ష్ జైన్. 🚨 News 🚨#TeamIndia's squad for the 2⃣-match Test Series against Sri Lanka announced Note: Washington Sundar was not available for selection for the first Test. More Details ▶️ https://t.co/Vk0Xd8Axmq #SLvIND pic.twitter.com/NuCcKBohMj— BCCI (@BCCI) July 28, 2026చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విండీస్ బౌలర్ ప్రపంచ రికార్డు -
రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్!
జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా తర్వాతి సిరీస్ శ్రీలంకతో ఆడనుంది. లంక పర్యటనలో ఈసారి వైట్‌బాల్ సిరీస్‌కు బదులుగా సంప్రదాయ టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు భారత్ జట్టును మంగళవారం ప్రకటించనుంది. ఏడాది కాలంగా టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు తిరిగి టెస్టుల్లో ఆడనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే లంకతో టెస్టు సిరీస్‌కు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుమ్రా ఒకవేళ లంకతో టెస్టు సిరీస్‌కు దూరమైతే అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లంక-ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో 10 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేసిన గుర్నూర్ బ్రార్ ఎంపికలో ముందు వరుసలో ఉన్నాడు. స్వదేశంలో ఆఫ్గన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు ఎంపికైనప్పటికీ గుర్నూర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా గుర్నూర్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే టెస్టు క్రికెట్లో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వని గుర్నూర్, లంకతో సిరీస్‌లో బుమ్రా స్థానంలో ఆడే అవకాశాలున్నాయి. బుమ్రా దూరమైతే మాత్రం సిరాజ్, ప్రసిధ్ భారత పేస్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నారు.ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా రెండో వన్డే సమయంలో మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో చివరి వన్డేకు దూరమయ్యాడు. జూలై 24న బుమ్రాకు నిర్వహించిన పరీక్షల్లో అతడి మోకాలు వాపు ఉందని తేలింది. దీంతో తదుపరి పరీక్షల కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ లెక్కన బుమ్రా తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంలో విఫలమైతే లంకతో సిరీస్‌కు అతడు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హర్షిత్ రానా, నితీశ్ కుమార్‌రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు కూడా గాయాలతో బాధపడుతూ లంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమానంగా మారింది. టీమిండియా 2017లో చివరిసారి లంకలో టెస్టు సిరీస్ ఆడింది. అప్పటి సిరీస్‌లో కోహ్లి, అశ్విన్‌తో పాటు పుజారా ఆడారు. ఈ సిరీస్‌లో ఆతిథ్య లంక జట్టును వైట్‌వాష్ చేసింది. తాజాగా గిల్ నేతృత్వంలోని టీమిండియా లంక గడ్డపై సరికొత్త సవాల్‌కు సిద్ధమయింది.Read: ‘అగార్కర్ వింటున్నావా? వైభవ్‌ను రోహిత్‌కు జతగా పంపాలి’ -
కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ కసిగా కనిపిస్తున్నాడు. పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ రీఎంట్రీ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని వాసూ పరన్జేప్ క్రికెట్ అకాడమీలో సూర్యకుమార్ మూడు గంటల పాటు నెట్స్‌లో సాధన చేశాడు. దాదాపు 3 గంటల పాటు వెయ్యి బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ వినూత్న షాట్లు ఆడి అలరించాడు. మళ్లీ టీమిండియాలో ఎప్పుడెప్పుడు అడుగుపెడదామా అన్నంతగా సూర్యలో కసి కనిపిస్తుంది. నెట్స్‌లో చెమటోడ్చిన వీడియోను ఎక్స్‌లో పంచుకున్న సూర్య.. ‘సండే ఫన్డే. క్విక్ రన్. 3 గంటల పాటు వెయ్యి బంతులు ఆడాను. మంచి ఫీల్ వచ్చింది’ అని క్యాప్షన్ జత చేశాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేసింది. ఇక 35 ఏళ్ల సూర్యకుమార్ టీమిండియా కెప్టెన్‌గా 2026 టీ20 ప్రపంచకప్‌ను అందుకున్నాడు. అయితే బ్యాటర్‌గా విఫలమవుతూ వచ్చిన సూర్యకుమార్ ఐపీఎల్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో టీ20 కెప్టెన్సీ పదవిని కోల్పోయిన సూర్యకుమార్‌కు జట్టులోనూ చోటు ప్రశ్నార్థకంగా మారింది. అయితే సూర్య టీమిండియాలో చోటు కోల్పోయిన తర్వాత మహారాజ ట్రోఫీలో తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అప్పటినుంచి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న సూర్యకుమార్ కఠోర సాధన కొనసాగిస్తున్నాడు. Sunday was fun. Quick run 🏃🏾 Batted around 1000 balls for 3 hours. Felt good 💪 pic.twitter.com/x6wH9Ebpmv— Surya Kumar Yadav (@surya_14kumar) July 26, 2026Read: మీరాబాయి స్వర్ణ పతకం వెనుక కన్నీటిగాథ! -
'గంభీర్ వద్దు; లక్ష్మణ్ ముద్దు'.. బీసీసీఐకి ఆటగాళ్ల విజ్ఞప్తి!
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా హెడ్‌కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న గంభీర్ కోచ్‌గా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న వేళ.. తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ అదరగొట్టడంతో కోచ్ మార్పు చేయాలని కొందరు టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ వద్ద వాపోయినట్లు సమాచారం. టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను తొలగించి, అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు పూర్తి స్థాయి కోచ్ బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాజాగా వరుస వైఫల్యాలతో జింబాబ్వే టూర్‌కు గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా జట్టుతో పంపించారు. గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో వరుస ఓటములు చవిచూసిన కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జింబాబ్వే గడ్డపై తొలి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు లక్ష్మణ్ రాకతోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. జింబాబ్వే చిన్న జట్టే అయినప్పటికీ, వారిపై సాధించిన ఏకపక్ష విజయాలు మాత్రం టీమిండియా దూకుడును చూపెట్టింది. దీంతో కెప్టెన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు గంభీర్‌ను తొలగించి లక్ష్మణ్‌ను కోచ్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ బీసీసీఐ గంభీర్ స్థానంలో లక్ష్మణ్‌కు హెడ్‌కోచ్ పదవి కట్టబెడితే, దానిని స్వీకరించడానికి లక్ష్మణ్ సిద్ధంగా ఉన్నాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.ఇక టీమిండియా తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. అతడి కోచింగ్‌లో టీమిండియా 2022లో వరుసగా ఐర్లాండ్‌పై 2-0తో, జింబాబ్వేపై 3-0తో, న్యూజిలాండ్‌పై 1-0తో టీ20 సిరీస్‌లు గెలుచుకుంది. అయితే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, మళ్లీ 2024లో జింబాబ్వేపై 4-1 తేడాతో, సౌతాఫ్రికాపై 3-1 తేడాతో టీ20 సిరీస్‌లు గెలుచుకుంది. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియాకు వీవీఎస్ లక్ష్మణ్ లక్కీ కోచ్‌గా మారిపోయాడు. మరి టీమిండియా కోచ్ మార్పు తధ్యమేనా! 🚨 BREAKING NEWS 🚨🚨 INDIA PLAYERS REPORTEDLY WANT VVS LAXMAN AS PERMANENT HEAD COACH 🚨According to reports, several Indian team players have reportedly requested the BCCI to consider appointing VVS Laxman as the permanent head coach. The reports claim some players believe… pic.twitter.com/uiwSTwNi38— Muffatball vikrant (@Vikrant_1589) July 26, 2026చదవండి: ‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్‌కు చురకలు! -
హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్‌ప్లాన్!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించాలనే ఉద్దేశంతో అప్పటివరకు జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లకు అతడిని ఎంపిక చేయబోమని బీసీసీఐ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయం బారిన పడ్డ పాండ్యా కోలుకొని ఫిట్నెస్ సాధించిన పాండ్యాను మొదట అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ ఇదే సమయంలో పాండ్యాకు తొడ కండరాల్లో గాయం తిరగబెట్టడంతో ఆఫ్గన్‌తో పాటు ఇంగ్లండ్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరంలోనే చికిత్స తీసుకుంటున్న పాండ్యా పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నాడు. రేవ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం పాండ్యా తన ఫిట్‌నెస్‌పైనే పూర్తి దృష్టి సారించాడని తెలుస్తోంది. అందుకే పూర్తిగా కోలుకున్నా ఇప్పుడే టీమిండియాలోకి రాకూడదనే ఉద్దేశంతో పాండ్యా 'పర్ఫార్మెన్స్ బ్లాక్' పేరిట దీర్ఘకాలిక ఫిట్నెస్ టార్గెట్ చేసుకొని దానిని అనుసరిస్తున్నట్లు సమాచారం. 32 ఏళ్ల వయసున్న పాండ్యా ఇప్పటికే తన ప్రోగ్రామ్‌లో గరిష్ట ఫిట్నెస్ను సాధించేందుకు దగ్గర్లో ఉన్నాడని, అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ కూడా పాండ్యాను 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆచితూచి వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది. అందుకే వన్డే ప్రపంచకప్‌లోపు జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పాండ్యాను ఎక్కువగా ఆడించే అవకాశం లేదనిపిస్తోంది. ఒకవేళ సెలెక్ట్ చేసినా అది 50 ఓవర్ల ఫార్మాట్ మాత్రమే అతడికి ప్రాధాన్యమివ్వనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా పాండ్యా కీలకం కానున్నాడని బీసీసీఐ బలంగా నమ్ముతోంది. అందుకే ప్రపంచకప్ సమీపిస్తుందనగా, అప్పుడు జరిగే వన్డే సిరీస్‌లకు పాండ్యాను ఎంపిక చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యాను ఆ ఫ్రాంచైజీ విడుదల చేయనుంది. దీంతో ట్రేడింగ్‌లో పాండ్యా కేకేఆర్ లేదా చెన్నై జట్లకు వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.Read: ‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’ -
ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్.. గంభీర్ రాజీమానాకు డిమాండ్!
నీట్ లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా యువతరం భగ్గుమనడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ఉద్యమానికి యువతరం పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో చివరకు కేంద్రం తలవంచాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత జట్టు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. నీట్ లీకేజీ వ్యవహారంలో తన బాధ్యతల్లో విఫలమైన ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లే.. గంభీర్ కూడా టీమిండియా వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ డిమాండ్ చేయడం ఆసక్తి కనిపించింది. విద్యార్థులు చేసిన ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చినట్లే.. గంభీర్ కూడా తమ నిరసనలకు దిగిరావాలని, లేకుంటే రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాల్సి వస్తుందని హెచ్చరించడం గమనార్హం. గంభీర్ ఇలాగే కోచ్‌గా కొనసాగితే మాత్రం 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓటమి ఖాయమని కొందరు జోస్యం చెబుతున్నారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ హర్షిత్ రానా, సుందర్ లాంటి క్రికెటర్లకు తరచూ అవకాశాలు ఇస్తున్నాడని, సీనియర్లకు అవకాశాలు తగ్గేలా చేయడంలో గంభీర్‌దే కీలకపాత్ర అని విమర్శిస్తున్నారు. అయితే ఇటీవలే గంభీర్ హెడ్‌కోచ్‌గా ఐర్లాండ్ చేతిలో 2-0తో, ఇంగ్లండ్ చేతిలో 4-0తో ఓడిన టీమిండియా ఆ తర్వాత వన్డే సిరీస్‌ను కూడా 2-1తో కోల్పోయింది. దీంతో ప్రస్తుతం జింబాబ్వే టూర్‌కు గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను మెంటార్‌గా జట్టుతో పంపించారు. కోచ్ మారగానే టీమిండియా టీ20 సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు, తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్ కూడా గంభీర్‌ను ట్రోల్స్‌కు గురయ్యేలా చేసింది. అయితే కొంతమంది గంభీర్ మద్దతుదారులు మాత్రం అతడి కోచింగ్ సారథ్యంలోనే టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిందన్న విషయం మరువకూడదని కామెంట్లు చేశారు. మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్‌తో క్రికెట్ అభిమానుల నుంచి గంభీర్‌కు సెగ తగిలినట్లయింది. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ మాత్రమే కావడంతో బీసీసీఐ పెద్దగా పట్టించుకోలేదు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. Education Minister Dharmendra Pradhan resigned. pic.twitter.com/Ne2s3DMB50— TukTuk Academy (@TukTuk_Academy) July 25, 2026🚨 FAN PROTESTS GROW AGAINST GAMBHIR 🚨Growing frustration over Team India's recent performances has sparked fresh online campaigns and fan protests demanding Gautam Gambhir step down as head coach! 🇮🇳🏏🔥 pic.twitter.com/KlXfpDb364— CreaseBuzz (@CreaseBuzz) July 25, 2026Ab resignation aa gaya hai toh asli protest shuru karein?#CJP #dharmendrapradharesign pic.twitter.com/GmC7Ze5S5e— Tigerexch.ai (@Tigerexch_ai) July 25, 2026 -
అది వాళ్ల నిర్ణయం: బీసీసీఐ ఉపాధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో రోహిత్ రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్ వన్డేల్లో కొనసాగుతున్నాడు.బ్యాట్‌తోనే సమాధానంవన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా రోహిత్ శర్మ ఫిట్నెస్ను కూడా మెరుగుపరచుకుని ముందుకు సాగుతున్నాడు. అయితే, ఇటీవల ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన వన్డేనే హిట్‌మ్యాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అనే ప్రచారం జరిగింది.అయితే, ఇవన్నీ వట్టి ఊహాగానాలే అని తేలింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మెరుపు శతకం (138)తో చెలరేగి విమర్శకులకు రోహిత్ బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. అంతేకాదు.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తాను ఇప్పట్లో రిటైర్ కానని.. తాను ఆడినంత కాలం ఇలాంటి వదంతులు వస్తూనే ఉంటాయని పేర్కొన్నాడు.నిప్పు లేనిదే పొగ రాదుబీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సైతం రోహిత్ రిటైర్మెంట్ వార్తల్ని కొట్టిపారేశాడు. కానీ.. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం.. ‘‘నిప్పు లేనిదే పొగ రాదు.. ఏదో జరిగే ఉంటుంది’’ అని అభిమానుల్లో సందేహాలు రేకెత్తించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.సెలక్టర్లదే అంతిమ నిర్ణయంయూపీ టీ20 లీగ్ మినీ వేలం కార్యక్రమానికి హాజరైన రాజీవ్ శుక్లా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మా జట్టులో రోహిత్ అంతర్భాగం. అతడి ఆట కొనసాగుతుంది. మీడియా, సోషల్ మీడియాలో రోహిత్ గురించి వస్తున్న వార్తలకు అసలు అర్థమే లేదు.ఇప్పట్లో అతడు రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరికి తమ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అయితే, జట్టులో ఎవరు ఉండాలి.. ఎవరిని తప్పించాలి అనే విషయంలో సెలక్టర్లదే అంతిమ నిర్ణయం’’ అని పేర్కొన్నాడు.ఇక ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో టీమిండియా వరుసగా మూడు సిరీస్‌లు కోల్పోయిన నేపథ్యంలో రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ‘‘టీమిండియా ప్రస్తుతం బాగానే ఆడుతోంది. మ్యాచ్‌లు గెలుస్తోంది. కాబట్టి ఇప్పట్లో నాయకత్వ బృందంలో మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదు’’ అని కుండబద్దలు కొట్టాడు.వరుస పరాజయాల తర్వాత..కాగా టీ20 సిరీస్‌లలో పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ అయిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ 1-2తో ఓటమిపాలైంది. దీంతో టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌పై విమర్శలు రాగా.. రాజీవ్ శుక్లా మాత్రం తమ నాయకత్వ బృందానికి మద్దతుగా నిలవడం విశేషం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టు.. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: బంగ్లాదేశ్ అడ్డుపుల్ల.. అఫ్గాన్‌కు షాక్! -
బంగ్లాదేశ్ అడ్డుపుల్ల.. ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ వాయిదా?
టీమిండియాతో ఢిల్లీ వేదికగా చారిత్రక టీ20 సిరీస్ ఆడాలని భావించిన అఫ్గానిస్తాన్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సెప్టెంబర్‌లో జరగాల్సిన టీ20 సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా తమ దేశంలో టీమిండియాతో వైట్‌బాల్ టూర్ ప్లాన్ చేయనుండడమే వాయిదాకు కారణమని తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు అఫ్గానిస్తాన్‌లో రాజకీయ అస్థిరత కారణంగానే ఆ జట్టు తమ మ్యాచ్‌లను యూఏఈ లేదా భారత్ వేదికగా ఆడాలని నిర్ణయిం చుకుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాతో టీ20 సిరీస్‌కు ప్లాన్ చేసింది. ఢిల్లీ వేదికగా ప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ సిరీస్‌కు అఫ్గానిస్తాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, సొంతగడ్డపై టీమిండియా పర్యాటక జట్టుగా మ్యాచ్‌లు ఆడనుండడం విశేషం.బంగ్లాదేశ్ అడ్డుపుల్ల..కొన్నాళ్ల కిందట భారత్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మాత్రం మనతో సంబంధాలు తిరిగి బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సౌతాఫ్రికా వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ సమావేశాల్లోనూ బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌తోనే ఆ బంధాన్ని తిరిగి మొదలుపెట్టాలని బంగ్లా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ 1 నుంచి 13 మధ్య టీమిండియా తమ గడ్డపై ఆరు మ్యాచ్‌ల వైట్ బాల్ సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) ఆడేలా ఇప్పటికే బీసీసీఐకి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఒకవేళ భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే బీసీసీఐ బంగ్లాదేశ్ టూర్‌కు పచ్చజెండా ఉపనుంది. ఒకవేళ బీసీసీఐ ఆమోదం పొందితే మాత్రం అదే సమయంలో జరగాల్సిన ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ వెనక్కి వెళ్లే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి ఆసియా గేమ్స్ ఉండడం, ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో సిరీస్ ఉండడంతో అఫ్గానిస్తాన్‌తో సిరీస్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఈ లెక్కన విండీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత అంటే నవంబర్‌లో ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ ఆడే అవకాశముంటుంది.రాజకీయ వివాదం..బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలోని యువత భారత్‌పై విష ప్రచారాలు చేస్తూ మతోన్మాద చర్యలకు పాల్పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ చర్యలను సీరియస్‌గా తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే భారత ప్రభుత్వం ఆదేశాలతో కేకేఆర్ జట్టు బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్‌ను తొలగించింది. దీంతో ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆడలేమంటూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయినప్పటికీ బంగ్లా తన వైఖరిని మార్చుకోలేదు. దీంతో ఆ టోర్నీకి బంగ్లాదేశ్ దూరంగా ఉండిపోయింది. అయితే బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత తారిక్ రెహమాన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించారు.ఈ నేపథ్యంలోనే క్రికెట్ ద్వారా భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని తారిక్ రెహమాన్ ప్రభుత్వం భావిస్తోంది. మరి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ టూర్లో పాల్గొనేందుకు బీసీసీఐకి అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.Read: బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్‌గా తిలక్ వర్మ రికార్డు -
బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్‌గా తిలక్ వర్మ రికార్డు
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో విజయం ద్వారా టీమిండియా వరుస ఓటములకు చెక్ పెట్టింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్ ఆ తర్వాత వైభవ్ విధ్వంసంతో సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. ఇవాళ హరారే వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఒడిసిపట్టాలని చూస్తోంది. ఇదిలా ఉంటే, జింబాబ్వే సిరీస్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను మెంటార్‌గా జట్టుతో పంపించారు. తొలి టీ20లో విజయం తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ డ్రెస్సింగ్ రూమ్‌లో విన్నింగ్ సందేశాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలో మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. Photo Credit: BCCI Twitterఅయితే బీసీసీఐ ఇటీవల ‘బెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ప్రవేశపెట్టింది. తాజాగా ఈ అవార్డును తిలక్ వర్మ అందుకున్నాడు. తిలక్‌వర్మకు అవార్డు ఇవ్వడంపై లక్ష్మణ్ వివరణ ఇచ్చాడు. ‘గ్రౌండ్‌తో పాటు మైదానం వెలుపల కూడా తన నైపుణ్యంతో అద్భుత వైఖరి ప్రదర్శించినందుకు తిలక్ వర్మకు ఈ అవార్డు ఇస్తున్నట్లు’ లక్ష్మణ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో బెస్ట్ యాటిట్యూడ్ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు. తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘జట్టుకు నా నుండి ఏమి అవసరమో అది చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను, దానికోసం నా వంతు ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. మరో విషయమేమిటంటే, నేను మైదానం వెలుపల చేసే కఠోర శ్రమ మైదానంలో నన్ను మరింత మెరుగ్గా ఆడేలా చేస్తుంది. ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని తిలక్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. BCCI introduces a new 'Best Attitude of the Match' award, with Tilak Varma becoming its first-ever recipient following the 1st India vs Zimbabwe T20I at Harare!!! pic.twitter.com/FQv7VH5FDx— 𝓝𝓾𝓽𝓽𝔂𝓣𝓲𝓵𝓪𝓴 (@TilakVarmaaa) July 24, 2026Read: కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్వెల్త్లో భారత్ బోణీ -
సొంతగడ్డపై పర్యాటక జట్టుగా టీమిండియా!
టీమిండియా విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. సొంతగడ్డ మీదే పర్యాటక జట్టుగా మ్యాచ్‌లు ఆడనుంది. అవును.. మీరు చదివింది కరెక్టే!.. ఇంతకీ సంగతి ఏమిటంటే.. అఫ్గానిస్తాన్‌కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితులు లేవు.ఇప్పటికే పలు మ్యాచ్‌లు ఈ నేపథ్యంలో భారత్ అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ACB)కు అండగా నిలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సహకారంతో ఏసీబీ భారత్‌లో ఆతిథ్య దేశంగా తమ మ్యాచ్‌లు నిర్వహించుకుంటోంది. డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నోలను తమ హోంగ్రౌండ్లుగా గతంలో ఎంచుకుంది. అంతేకాదు.. న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు కూడా షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంది. అయితే, ఒక్క బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. తాజాగా టీమిండియాకే భారత్‌లో ఆతిథ్యం ఇచ్చేందుకు అఫ్గాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఢిల్లీలో అఫ్గాన్- భారత్ సిరీస్టీమిండియా- శ్రీలంక టెస్టు సిరీస్ ... ఆసియా క్రీడలు-2026 మధ్య విరామంలో టీమిండియా- అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 27 నుంచి భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుండగా.. ఆసియా క్రీడలకు సెప్టెంబరు 24న తెర లేవనుంది.ఈ క్రమంలో సెప్టెంబరు 13 నుంచి టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గాన్ బోర్డు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక అని తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది.గెలుపు బోణీఇదిలా ఉంటే.. ఇటీవలే అఫ్గాన్ జట్టు భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో ఏకైక టెస్టులో ఓడిపోయిన అఫ్గాన్.. మూడు వన్డేల సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్ అయింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారి టీ20 సిరీస్ ఆడిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయిన శ్రేయస్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. తాజాగా జింబాబ్వే గడ్డ మీద గురువారం నాటి తొలి టీ20లో గెలిచి ఎట్టకేలకు.. ఏడు మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం సాధించింది.చదవండి: విజయానికి క్రెడిట్ నాకు ఇవ్వొద్దు.. ఆ అర్హత లేదు: వైభవ్ -
AUS vs ENG: భారత్‌లో యాషెస్ టెస్టు మ్యాచ్!
క్రికెట్లో అత్యంత ప్రాచీన, ప్రతిష్టాత్మక, చరిత్రాత్మక సిరీస్‌లలో యాషెస్ టెస్టు సిరీస్ ఒకటి. ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ పోరు 1882లో మొదలైంది. నాటి నుంచి ప్రతి రెండేళ్లకొకసారి ఇరుజట్ల మధ్య ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు.ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP)లో భాగంగా జరిగే ఈ సిరీస్‌కు ఆసీస్, ఇంగ్లండ్ చెరోసారి ఆతిథ్యం ఇవ్వడం పరిపాటి. అయితే, ఈ చారిత్రక సిరీస్‌లో భాగంగా ఒక మ్యాచ్‌ను భారత గడ్డపై నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) సంకేతాలు ఇచ్చింది.బీసీసీఐతో అనుబంధంఆసీస్ క్రికెట్ బోర్డు సీఈఓ టాడ్ గ్రీన్బర్గ్ ఈ విషయం గురించి బీబీసీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో మా బంధం బలమైనది. అదే విధంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తోనూ మాకు సత్సంబంధాలు ఉన్నాయి.ఇండియాలో యాషెస్ మ్యాచ్ నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడే దీని గురించి మేమేమీ ప్రణాళికలు రచించడం లేదు. కానీ ఈ అంశం అయితే మా పరిశీలనలో ఉంది. ఆసీస్- ఇంగ్లండ్- ఇండియా మధ్య టెస్టు క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు జట్ల మ్యాచ్‌లకు అభిమానులు ఉన్నారు. వారిని అలరించడం కోసం.. టెస్టు క్రికెట్ అభివృద్ధి కోసం మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాము’’ అని గ్రీన్బర్గ్ స్పష్టం చేశారు.డిసెంబరులో బీబీఎల్ మ్యాచ్ఆసీస్ టీ20 లీగ్ బిగ్ బాష్ లీగ్ (BBL) తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మెల్బోర్న్ రెనెగేడ్స్- పెర్త్ స్కార్చర్స్ మధ్య డిసెంబరు 12, 2026న ఈ మ్యాచ్ జరుగనుంది.యాషెస్ 2027 షెడ్యూల్ ప్రకటనఅదే విధంగా.. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లను ఆస్ట్రేలియాలో నిర్వహించేందుకు బీసీసీఐ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. యాషెస్ 2027 షెడ్యూల్‌ను ఈసీబీ ఇటీవలే ప్రకటించింది. జూన్ 18- ఆగష్టు 2 వరకు ఈ సిరీస్ జరుగుతుంది.ట్రెంట్ బ్రిడ్జ్, లార్డ్స్, ఎడ్జ్‌బాస్టన్, సౌతాంప్టన్, ది ఓవల్ మైదానాలు ఇందుకు వేదికలు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియాకు 2029-2030 సైకిల్లో ఆతిథ్య హక్కులు వస్తాయి. కాబట్టి అప్పటికి భారత్‌లో ఒక మ్యాచ్ నిర్వహించినా ఆశ్చర్యం లేదు.చదవండి: వైభవ్ మెరుపులు -
అతడికి 2 నెలలే డెడ్‌లైన్.. రోహిత్, కోహ్లికి మంచి రోజులు!
టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవిలో కొనసాగుతున్న మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ సెప్టెంబర్‌తో ముగియనున్నట్లు తెలుస్తోంది. కాగా వన్డే ప్రపంచకప్ వరకు తనను సెలెక్టర్‌గా కొనసాగేందుకు అవకాశమివ్వాలని అగార్కర్ చేసిన అభ్యర్థనను బీసీసీఐ పట్టించుకోనట్లుగా అనిపిస్తోంది. సెలెక్టర్‌గా ఎంపికైన తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్స్ సాధించినప్పటికీ అగార్కర్ విషయంలో మాత్రం విమర్శలే వ్యక్తమయ్యాయి. అందుకే అగార్కర్‌ను సెలెక్టర్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో కొత్త సెలెక్టర్ కోసం వెతుకులాటను ప్రారంభించినట్లు సమాచారం. ఇక అగార్కర్ సెలెక్టర్ పదవి నుంచి దిగిపోతే మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు వన్డే వరల్డ్‌కప్ 2027 ఆడేందుకు మార్గం సుగమం అవుతుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం సెప్టెంబర్ తర్వాత టీమిండియాకు కొత్త సెలెక్టర్‌ను చూసే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ తర్వాత నుంచి జరగనున్న సిరీస్‌లకు కొత్త సెలెక్టర్ నేతృత్వంలోనే జట్టు ఎంపిక జరగనుంది. ఇక అజిత్ అగార్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జట్టులో పలు కీలక మార్పులు చేస్తూ వస్తున్నాడు. Photo Credit: BCCI Twitterఅగార్కర్ పదవీకాలంలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నీలు ఆడింది. 2023 వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ 2024, చాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026.. వీటిల్లో మూడు టైటిళ్లు భారత జట్టు సొంతం చేసుకోవడం విశేషం. అయినప్పటికీ సెలెక్టర్‌గా అగార్కర్‌పై మాత్రం విమర్శలే రావడం గమనార్హం. జట్టు సెలక్షన్ విషయంలో అగార్కర్ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టుకు కెప్టెన్ చేయడం, హార్దిక్ పాండ్యకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై అభిమానులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా.. తన నిర్ణయాలను మాత్రం అగార్కర్ బహిరంగంగానే సమర్థించుకుంటూ వచ్చాడు. సెలక్షన్ అనేది కేవలం ప్లేయర్ల గణాంకాలపై ఆధారపడదని, జట్టుకు సరిపోయే కాంబినేషన్, ఆటగాళ్ల పాత్రలు, వ్యూహాలు కీలకమని అగార్కర్ ప్యానెల్ నిరూపించింది. టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కారణంగా 2025లోనే అగార్కర్ సెలెక్టర్ పదవీకాలన్ని మరో ఏడాది పొడిగించిన బీసీసీఐ మరోసారి అతడి పదవీకాలాన్న పొడిగించేందుకు సముఖత వ్యక్తం చేయడం లేదు.చదవండి: Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? -
అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా!
శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభానికి ముందు బీసీసీఐని ఒక అంశం తెగ కలవరపెడుతోంది. అదేంటంటే కండరాల గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించి తుది జట్టును ఇంకా ప్రకటించనప్పటికీ అతడి గాయం తీవ్రత చాలా ఎక్కువగానే ఉండడంతో ఫిట్‌నెస్‌పై స్పష్టత రావడం లేదు. అందుకే శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టు ప్రకటనను బీసీసీఐ సెలెక్టర్లు వాయిదా వేసినట్లు సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టెస్టు సిరీస్ ప్రారంభానికి మరో మూడు వారాలు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ వారం చివర్లో లేదా వచ్చే సోమవారం నాటికి జట్టును ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది.వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు. కండరాల గాయానికి స్కానింగ్ నిర్వహించనుండగా.. అది గ్రేడ్-1 గాయంగా పరిగనణించే అవకాశాలున్నట్లు ఒక నివేదిక పేర్కొంటుంది. దీంతో సుందర్ గాయంపై పూర్తి నివేదిక వచ్చాకే జట్టును ప్రకటించాలనుకుంటున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా సుందర్ కండరాల గాయానికి గురవ్వడంతో ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌కు కూడా దూరంగా ఉన్నాడు.ఇక గిల్ సారథ్యంలోని టీమిండియా ఆగస్టు 4న శ్రీలంకలోని కొలంబోకు చేరుకోనుంది. టెస్టు సిరీస్ కు ముందు స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆగస్టు 7 నుంచి 10 వరకు కొలంబోలో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆటగాళ్లకు శ్రీలంక పిచ్‌లు, వాతావరణానికి అలవాటు పడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు రెండో టెస్టు జరగనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తున్న ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. తొమ్మిది మ్యాచ్‌ల తర్వాత భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 44.44 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇక 2017 తర్వాత శ్రీలంకలో భారత్ టెస్టు సిరీస్ ఆడడం ఇదే. 2017లో కోహ్లి కెప్టెన్సీలో లంకలో పర్యటించిన టీమిండియా 3-0 తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక చివరగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. మరోవైపు శ్రీలంక మాత్రం తాము ఆడిన చివరి టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్‌కు 2-0తో కోల్పోయింది.చదవండి: ‘నిజమే సైకోలా ప్రవర్తించాడు కానీ శిక్షించొద్దు’ -
జైస్వాల్ కు అవకాశం ఇవ్వాలి.. రోహిత్ రిటైర్మెంట్ పై యూవీ కీలక వ్యాఖ్యలు
-
లంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి ఆ ఇద్దరు!
ఐపీఎల్ తర్వాత వరుసగా వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీగా గడిపిన టీమిండియా వచ్చే నెలలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో టెస్టు సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ప్రకటించే అవకాశముంది. కాగా సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు టెస్టు జట్టులోకి తిరిగి రానున్నారు. వీరితో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ, కుల్దీప్ యాదవ్ పేర్లు కూడా పరిగణలో ఉన్నాయి. గాయంతో ఇంగ్లండ్ సిరీస్ నుంచి వైదొలిగిన వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమాంగానే ఉంది. అయితే గాయం నుంచి కోలుకున్న నితీశ్ కుమార్ రెడ్డి లేదా సారాన్ష్ జైన్‌లో ఒకరు ఈ సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశముంది. ఇక బుమ్రా, జడేజాలు తమ చివరి టెస్టు మ్యాచ్‌ను 2025 నవంబర్‌లో సౌతాఫ్రికాతో ఆడారు.గిల్ సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలకు టెస్టు సిరీస్‌లను కోల్పోయింది. ఆఫ్గన్‌తో జరిగిన ఏకైక టెస్టులో మాత్రం భారీ విజయం సాధించడం ఊరట కలిగించింది. అయితే సొంతగడ్డపై ఎదురైన పరాభవాలను మరిచిపోయేందుకు లంకతో టెస్టు సిరీస్‌లో రాణించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇక టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు శ్రీలంక-ఏ జట్టుతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగ2ఆ, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్లో ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. 🚨 GOOD NEWS FOR TEAM INDIA 🇮🇳Jasprit Bumrah & Ravindra Jadeja set to play in the Test series vs Sri Lanka. [Sahil Malhotra from TOI]Test squad will be announced this week. pic.twitter.com/kAJ3m0tBqj— Johns. (@CricCrazyJohns) July 21, 2026Read: కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు -
దేశవాళీ క్రికెట్లో కొత్త రూల్స్.. తస్మాత్ జాగ్రత్త!
దేశవాళీ సీజన్‌కు (2026-27) ముందు బీసీసీఐ పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రతిపాదించిన చట్టాలను ఐసీసీ అమలు పరచనున్న సంగతి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు సమానంగా బీసీసీఐ కూడా దేశవాళీ టోర్నీల్లో ఆయా చట్టాలను అమలు చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు అన్ని దేశీయ టోర్నీల్లో అంతర్జాతీయంగా ఉన్న రూల్స్ అన్ని అమల్లోకి రానున్నాయి. దేశవాళీ క్రికెట్లో మరింత పారదర్శకత, న్యాయంతో కూడిన క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలను తీసుకొచ్చినట్లు బీసీసీఐ తెలిపింది.చివరి ఓవర్ పూర్తి చేయాల్సిందేఇకపై ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రోజులో చివరి ఓవర్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే. ఇప్పటి వరకు చివరి ఓవర్ మధ్యలో వికెట్ పడితే అంపైర్లు ఆ రోజు ఆటను ముగించే అవకాశం ఉండేది. అయితే కొత్త నిబంధన ప్రకారం వికెట్ పడినా మిగిలిన బంతులన్నీ తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. దీంతో కొత్త బ్యాటర్ కూడా మిగిలిన బంతులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త బ్యాటర్‌ను పంపకుండా సమయం వృథా చేసే అవకాశాన్ని నివారించడానికే ఈ మార్పు తీసుకొచ్చారు.ఉద్దేశపూర్వక నోబాల్ వేస్తే కఠిన చర్యలుకొత్త నిబంధనల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగా నోబాల్స్ వేస్తే బౌలర్లపై కఠినచర్యలు తీసుకోనున్నారు. ఎవరైనా బౌలర్ ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్ ఫుట్ నోబాల్ లేదా పిచ్‌పై పడకుండా డెలివరీ వేస్తే, అతడు ఆ ఇన్నింగ్స్‌కే కాదు, మొత్తం మ్యాచ్‌లోనే బౌలింగ్ చేసే హక్కును కోల్పోతాడు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అన్నది అంపైర్లే నిర్ణయిస్తారు.ఫీల్డర్ ముందే బంతిని అడ్డుకుంటే?బ్యాటింగ్ సమయంలో స్ట్రైక్‌లో ఉన్న బ్యాటర్ వద్దకు చేరకముందే ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా బంతిని అడ్డుకుంటే, దానిని నోబాల్‌తో పాటు డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. అలాగే మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో జట్లు ‘డిక్లరేషన్’ లేదా ‘ఫోర్ఫిట్’ చేసే అవకాశాన్ని కూడా తొలగించారు.కోచ్‌లకు అనుమతి..వన్డే మ్యాచ్‌ల్లో డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్ మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో నేరుగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వనున్నారు.దీంతో మ్యాచ్ మధ్యలోనే వ్యూహాలను మరింత సమర్థంగా చర్చించే అవకాశం జట్లకు లభించనుంది.షార్ట్ రన్‌పై స్పష్టతబ్యాటర్లు ప్రత్యర్థిని మోసం చేయాలనే ఉద్దేశం లేకుండా పరుగు మధ్యలో తిరిగి వెనక్కి వస్తే, దానిని డెలిబరేట్ షార్ట్ రన్‌గా పరిగణించరు. కానీ ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీసుకుంటే, తదుపరి బంతిని ఏ బ్యాటర్ ఎదుర్కోవాలో నిర్ణయించే అధికారం ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌కు ఉండేలా నిబంధన తీసుకొచ్చారు.డెడ్ బాల్ రూల్‌లో మార్పుఇప్పటి వరకు బంతి బౌలర్ లేదా వికెట్‌కీపర్ చేతిలోకి వచ్చిన తర్వాతే సాధారణంగా డెడ్ బాల్‌గా పరిగణించేవారు. ఇకపై బంతి ఏ ఫీల్డర్ చేతిలో స్థిరంగా ఉన్నా లేదా మైదానంలో పూర్తిగా నిలిచిపోయినా దానిని డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు.👉వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో లెగ్‌సైడ్ వైడ్ విషయంలో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. బంతి విసిరే సమయంలో ఫీల్డర్లందరూ తప్పనిసరిగా బౌండరీ లైన్ లోపలే ఉండాలి. దీంతో బౌండరీ బయట నిలబడి ప్రయోజనం పొందే అవకాశానికి చెక్ పడుతుంది. అలాగే వికెట్‌కీపర్ బంతి డెలివరీ సమయంలో తప్పనిసరిగా వికెట్ వెనుకనే ఉండాలి.👉మ్యాచ్‌లో ఎవరైనా అక్రమ పరికరాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తిస్తే, అంపైర్లు వాటి వినియోగాన్ని వెంటనే నిలిపివేసి సంబంధిత అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదిత నిబంధనలను 2026-27 దేశీయ సీజన్ నుంచే అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.Read: గంభీర్ చేతుల్లో అతడి కెరీర్ కూడా నాశనమే! -
‘రోహిత్, కోహ్లిలను టచ్ చేయడం అసాధ్యం’
టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లిలను జట్టులో నుంచి తొలగించడం చాలా కష్టతరమని, బలవంతంగా పంపించాలని చూస్తే మాత్రం అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించాడు. ఇటీవలే రోహిత్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వచ్చిన వేళ అశ్విన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.తన యూట్యూబ్ షో 'ఆష్ కి బాత్’లో అశ్విన్ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడాలని అనుకుంటే వారిని జట్టు నుంచి తప్పించడం చాలా చాలా కష్టం. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది.. వారి అద్భుతమైన కెరీర్ రికార్డులు. రోహిత్ ఇప్పటికే 12 వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు. అలాంటి ఆటగాడిని సులభంగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. తన ఆటతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. Photo Credit: BCCI Twitterఇక రెండో కారణం ఏంటంటే.. అది రోహిత్, కోహ్లికి భారీ అభిమాన బలం ఉంది. వీరిద్దరు మ్యాచ్‌లు ఆడుతున్నారంటే.. వారిని చూసేందుకే లక్షలాది మంది అభిమానులు స్టేడియాలకు తరలివస్తారు. అలాంటి స్టార్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పిస్తే భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. వారిని తప్పించాలని చూస్తే అభిమానులు ఊరుకుంటారా? ఒకవేళ తొలగిస్తే మాత్రం స్టేడియం పైకప్పు లేచిపోవడం గ్యారంటీ' అంటూ తనదైన శైలిలో అశ్విన్ చమక్కులు పంచాడు.Photo Credit: BCCI Twitterఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో రోహిత్ విపలం కావడంతో మూడో వన్డే అతడికి చివరిది కానుందని, ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలంటూ బీసీసీఐ కొట్టిపారేయడంతో ఊహాగానాలకు తెరపడింది. ఇక రోహిత్ కూడా తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్‌తో మూడోవన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 138 పరుగులు సాధించాడు. మరోవైపు కోహ్లి కూడా అర్ధసెంచరీతో రాణించి తమకు తిరుగులేదని చాటిచెప్పాడు. ఇక బౌలర్ల పరిస్థితి గురించి అశ్విన్ కాస్త భిన్నంగా స్పందించాడు. 'మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేదా భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు జట్టులో లేకపోతే కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తారు. కానీ స్టార్ బ్యాటర్ల జరిగినంత స్థాయిలో చర్చ జరగదు. భవిష్యత్తులో బౌలర్ల కోసం కూడా అభిమానులు అదే స్థాయిలో గళమెత్తితే వారిని కూడా జట్టు నుంచి తప్పించడం కష్టమవుతుంది. ఇది జరగాలని నేను కోరుకుంటున్నా' అని అశ్విన్ తెలిపాడు. Read: స్పెయిన్ నంబర్‌వన్.. ర్యాంకింగ్స్‌లో మొరాకో, నార్వే సంచలనం -
దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్‌కు మరో అవమానం!
దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోపీకి సంబంధించి వెస్ట్‌జోన్ జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ వెస్ట్‌జోన్‌కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, షామ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా, ఉర్విల్పటేల్, హార్విక్ దేశాయ్‌లను వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. ఇక రిజర్వ్ ప్లేయర్లుగా జయ్ గోహిల్, ఆర్యా దేశాయ్, అర్షిన్ కులకర్ణి, విజయ్ జైస్వాల్, రాజ్‌వర్దన్ హంగ్రేకర్లకు చోటు దక్కింది.అయితే భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టోర్నీలో ఆడతాడని అంతా భావించారు. కానీ సెలెక్టర్లు అతడిని దులీప్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోలేదు. శ్రీలంకతో టెస్టు సిరీస్ ఉన్న కారణంగానే జైస్వాల్‌ను ఎంపిక చేయలేదని తెలుస్తోంది. ఇక జైస్వాల్‌తో పాటు టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లను కూడా పక్కనబెట్టారు. అయితే శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లోనే ఎక్కువగా ఆడుతున్నాడు. వెన్నునొప్పి కారణంగా చాలా సేపు బ్యాటింగ్ చేయాల్సిన టెస్టు ఫార్మాట్‌కు దూరంగానే ఉంటున్నాడు. ఇక టీమిండియాలో చోటు కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రస్తుతం రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. దులీప్ ట్రోఫీని అందుకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పటికీ, అతడిని ఎంపిక చేయలేదు. దీంతో 2026-27 రంజీ సీజన్లో ముంబై తరఫున సూర్యకుమార్ ఆడాలని భావిస్తున్నాడు. ఇక మరో సీనియర్ అజింక్య రహానేను కూడా సెలెక్టర్లు పక్కనబెట్టారు. టీమిండియా ఫ్యూచర్ క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వెస్ట్ జోన్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షమ్స్ ములానీ (వైస్ కెప్టెన్), హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), జయమీత్ పటేల్, పృథ్వీ షా, శివాలిక్ శర్మ, సిద్ధార్థ్ దేశాయ్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, అతిత్ షేత్, ముఖేష్ చౌదరి, తనుశ్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండేరిజర్వ్ ప్లేయర్లు: జే గోహిల్, ఆర్య దేశాయ్, అర్షిన్ కులకర్ణి, మహేష్ పిథియా, విశాల్ జైస్వాల్ మరియు రాజవర్ధన్ హంగర్గేకర్.చదవండి: మెస్సీ అలా.. లామినే ఇలా; చివరికి! -
రోహిత్ వివాదం.. టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
రోహిత్ శర్మ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్‌లు ఉన్న సమయంలో వీలైనంత మేర సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిదని ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. శనివారం లండన్‌లోని భారత హైకమిషన్ నిర్వహించిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో భాగంగా టీమిండియాతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గంభీర్ సహా ఆటగాళ్లంతా హాజరయ్యారు.99 శాతం అదే ధోరణిలో: రాజీవ్ శుక్లారాజీవ్ శుక్లా మాట్లాడుతూ..'భారతదేశంలో 99 శాతం మంది ప్రజలు తమను తాము క్రికెట్ నిపుణులుగా భావిస్తుంటారని, అందుకే మ్యాచ్‌లకు ముందు ఆటగాళ్లు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని నా అభిప్రాయం. మన జట్టులో ప్రతిభకు కొదవలేదని, కేవలం ఆటపై దృష్టి పెట్టడమే ఆటగాళ్లు ముందున్న కర్తవ్యం. అనవసర విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.' అని చెప్పుకొచ్చారు.బయటి విషయాలు పట్టించుకోను: గిల్టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తన చేతిలో లేని బయటి అంశాల గురించి ఆలోచించకుండా, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా అధిగమించగలనని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే టీమిండియాలో క్యాంప్‌లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్న వేళ గిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇక గాయాల నుంచి కోలుకొని టీ20 కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన శ్రేయస్ అయ్యర్ తన పునరాగమన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహచర ఆటగాళ్లు చేసిన ఫోన్ కాల్స్, వారు ఇచ్చిన మద్దతు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, అందుకే మరింత బలంగా జట్టులోకి తిరిగి రాగలిగానని అయ్యర్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. చారిత్రక బంధం: గంభీర్ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ భారత్-బ్రిటన్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాల వల్ల యూకే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రదేశమేనని అన్నారు. భారత క్రికెట్ అనేది కేవలం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కాదని, జట్టును బేషరతుగా ప్రేమించే ప్రతి ఒక్క నిజాయితీ గల అభిమానికి చెందుతుందని గంభీర్ స్పష్టం చేశాడు. ఇక ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చిన యూకేలోని భారత హైకమిషనర్ పి. కుమారన్, డిప్యూటీ హైకమిషనర్ కార్తీక్ పాండేలు టీమిండియాకు ఘన స్వాగతం పలికారు. ఇదే వారంలో అమల్లోకి వచ్చిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) వ్యాపారంతో పాటు క్రీడారంగానికి కూడా ఎన్నో కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ టీమిండియా సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇవాళ చివరి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. -
రంగంలోకి జైషా..ఒక్క ఫోన్ కాల్ తో వణికిపోయిన గంభీర్, అగార్కర్
-
రోహిత్‌పైనే అందరి దృష్టి
లండన్: భారత ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌పై గత మూడు రోజులుగా సాగుతున్న చర్చకు నేడు తెరపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో టీమిండియా మూడో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్‌తోనే రోహిత్ అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వార్తలు వెలువడటంతో... అభిమానులందరి దృష్టి ‘హిట్ మ్యాన్’పైనే ఉండనుంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని రోహిత్ భావిస్తున్నా... సెలక్టర్లు అందుకు సుముఖంగా లేరని రోహిత్ సన్నిహిత వర్గాలు అంటుండగా... లార్డ్స్ మ్యాచ్ రోహిత్ శర్మకు చివరిది కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. రోహిత్ కుటుంబ సభ్యులు లండన్ చేరుకోవడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వాదనకు బలం చేకూరుతోంది. అదే జరిగితే వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌ను భారత జెర్సీలో చూడటం ఇదే చివరిసారి కానుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా... రెండో మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్ లెక్క సరిచేసింది. దీంతో ఈ పోరులో గెలిచిన జట్టు సిరీస్ చేజిక్కించుకోనుంది. రో‘హిట్’ కొట్టేనా! గత రెండు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ బ్యాట్ నుంచి మెరుపు ఆరంభం ఆశిస్తుండగా... కెపె్టన్ శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. అస్వస్థతతో గత మ్యాచ్‌కు దూరమైన కేఎల్ రాహుల్ తిరిగి రావడం ఖాయం కావడంతో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. గాయం కారణంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరం కాగా... అతడి స్థానంలో ఎంపికైన లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబేకు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా మునపటి వాడి ప్రదర్శిస్తుండగా... ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ అతడికి అండగా నిలుస్తున్నారు. మరోవైపు గత మ్యాచ్‌లో టాపార్డర్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోయినా... ఒంటరి పోరాటంతో జట్టును గెలిపించిన రూట్‌పై ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది. గత మూడు వన్డేల్లోనూ నాటౌట్‌గా నిలచిన రూట్... భారత్‌పై తొలి వన్డేలో 76, రెండో వన్డేలో 99 పరుగులు చేశాడు. రూట్ నిలకడకు ఇతర బ్యాటర్ల దూకుడు తోడైతే ఇంగ్లండ్‌ను ఆపడం కష్టతరమే! బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌పైనే ఆ జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. పిచ్ ఎలా ఉందంటే... లార్డ్స్‌లో టీమిండియాకు గొప్ప రికార్డేమీ లేదు. ఈ మైదానంలో భారత జట్టు వన్డే మ్యాచ్ గెలిచి రెండు దశాబ్దాలు దాటింది. చివరగా 2004లో దినేశ్ కార్తీక్ అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఓవరాల్‌గా ఈ మైదానంలో తొమ్మిది వన్డేలు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గింది. అందులో 1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్ కూడా ఉంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలం. ఇటీవల న్యూజిలాండ్‌తో టెస్టు సందర్భంగా పిచ్ అనూహ్యంగా స్పందించింది. గత రికార్డు చూసుకుంటే లక్ష్యఛేదన కన్నా... మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, అక్షర్, శివమ్ దూబే, కుల్దీప్/హర్ష్ దూబే, బుమ్రా, గుర్నూర్, ప్రసిధ్. ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), డకెట్, బెథెల్, రూట్, బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, అట్కిన్సన్, ఆర్చర్, సాఖిబ్/టంగ్, ఆదిల్ రషీద్. -
IND vs ENG: వాషీ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
ఇంగ్లండ్‌తో మూడో వన్డేకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు తెలిపింది. అతడి స్థానంలో హర్ష్ దూబేను ఎంపిక చేసినట్లు శనివారం ప్రకటించింది. కాగా మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్- భారత్ చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. అర్ధ శతకాలతో రాణించితొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (80)తో కలిసి ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్ (52), వాషింగ్టన్ సుందర్ (57 )జట్టును గెలిపించారు. ఇద్దరూ అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో వాషీ సిక్సర్ బాది విజయ లాంఛనం పూర్తి చేశాడు.గాయపడ్డ వాషీఅయితే, రెండో వన్డేలో మాత్రం బ్యాటింగ్ పరంగా అక్షర్ (1)తో పాటు వాషీ (2) పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా వాషీ గాయపడ్డాడు. అతడి చీలమండకు గాయమైంది. దీంతో అతడు బౌలింగ్‌కు రాలేదు. తాజా సమాచారం ప్రకారం అతడి గాయం తీవ్రమైనట్లు తెలుస్తోంది.జట్టులోకి హర్ష్ దూబేఈ నేపథ్యంలోనే వాషీ స్థానంలో యువ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబేను బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా మహారాష్ట్రకు చెందిన హర్ష్ దూబే.. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి రెండు వన్డేలు ఆడిన లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ ప్లేయర్.. నాలుగు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేకు లార్డ్స్ వేదిక.చదవండి: IND vs ENG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే! -
‘లార్డ్స్ వన్డే ఆఖరిది కాదు’
న్యూఢిల్లీ: ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్పై వాదోపవాదాలు నడుస్తున్న తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టతనిచ్చింది. ఇంగ్లండ్‌తో లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం జరగనున్న మూడో వన్డే రోహిత్ శర్మ కెరీర్‌కు చివరిదనే వాదనను బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తోసిపుచ్చాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండగా... అందులో ఆడాలని రోహిత్ భావిస్తుండగా... అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోహిత్ వన్డే కెరీర్‌పై శుక్రవారం సైకియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్ కెరీర్‌కు సంబంధించి ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఆదివారం లార్డ్స్‌లో రోహిత్ చివరి వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదు. భారత వన్డే జట్టులో రోహిత్ కీలక సభ్యుడు. జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో అతడు భాగం. లార్డ్స్ వన్డే అతడికి చివరి మ్యాచ్ కాదు’ అని సైకియా వెల్లడించాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రోహిత్ వన్డే కెరీర్‌కు రిటైర్మెంట్ వార్తలకు ఫుల్స్టాప్ పడ్డట్లు అయింది. కెప్టెన్ గా భారత జట్టుకు టి20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ అందించిన రోహిత్... వన్డే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు. 2023లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలవగా... ఈసారి చిరకాల కల నెరవేర్చుకునేందుకు రోహిత్ మరో ఏడాది పాటు కెరీర్ కొనసాగించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాడు. -
రోహిత్ ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్..LORDS లో రిటైర్మెంట్!
-
‘రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై కోహ్లి రియాక్షన్!’
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ మరో సీనియర్ విరాట్ కోహ్లి రియాక్షన్ ఆసక్తిగా మారింది. లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్‌కు ఆఖరిదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా జట్టు నుంచి రోహిత్‌ను తొలగిస్తున్నట్లు బీసీసీఐ ముందే హిట్‌మాన్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి రోహిత్ నిజంగానే అంతర్జాతీయ క్రికెట్‌కు ఈడ్కోలు పలుకుతాడా? లేదా అన్నది ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డే ద్వారా తేలిపోనుంది. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ రిటైర్ అవ్వనున్నాడనే వార్తలు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో ఊగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా రోహిత్, కోహ్లి, బుమ్రాలు పక్కపక్కనే కూర్చొని మ్యాచ్‌ను సీరియస్‌గా వీక్షించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. అయితే కోహ్లి, రోహిత్ పక్కపక్కనే కూర్చోవడం చాలా అరుదు. దీంతో వీడియోను లింక్ చేస్తూ ఒక అభిమాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'డ్రెసింగ్ రూమ్‌లో కోహ్లి, రోహిత్‌లు ఇలా పక్కపక్కన కూర్చోవడం ఎప్పుడూ చూడలేదు. రోహిత్ రిటైర్ అవ్వబోతున్నాడనే వార్త తెలిసినప్పటి నుంచి కోహ్లి దిగాలుగా కనిపిస్తున్నాడని, అతడి పక్కనే కూర్చొని ధైర్యం చెబుతున్నట్లుగా అనిపిస్తోందని, నిజమైన స్నేహం అంటే ఇదేనంటూ' కామెంట్ చేశాడు.ఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్పై అటు హిట్‌మ్యాచ్ కానీ, ఇటు బీసీసీఐ ఇప్పటివరకు స్పందించలేదు. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ కూడా రోహిత్ ఫామ్‌పై స్పందించాడే తప్ప అతడి రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కొంతమంది అభిమానులు వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ ఆడుతాడని, తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు రోహిత్ 10 కిలోల బరువు కూడా తగ్గాడని, మూడో వన్డేలో భారీ ఇన్నింగ్స్‌తో మెరుస్తాడని జోస్యం చెబుతున్నారు. ఇక శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (66 బంతుల్లో 65; 8 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 66; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (133 బంతుల్లో 99 నాటౌట్; 9 ఫోర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అజేయంగా నిలిచాడు. Never seen Kohli and Rohit sit together in the dressing room like this. Kohli's looking concerned seems like that Rohit retirement news is actually true and he knows. pic.twitter.com/7vcOZejDMq— Dhillon (@sehajdhillon_) July 16, 2026Read: అపశకునం ముద్ర.. ఫైనల్‌కు దూరంగా అర్జెంటీనా అధ్యక్షుడు! -
రోహిత్ శర్మ రిటైర్మెంట్..? ఎల్లుండే ఆఖరి మ్యాచ్?
టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా? అంటే అవునానే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఆదివారం(జూలై 19) ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో వన్డే అతడి చివరి ఇంటర్ననేషనల్ మ్యాచ్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది రోహిత్ తనంతంట తాను తీసుకున్న నిర్ణయం కాదని, సెలక్టర్ల ఒత్తిడి మేరకే అతడు తప్పుకొంటున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ హిట్‌మ్యాన్‌తో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మకు చోటు లేదని అగార్కర్ చెప్పినట్లు సమాచారం.అతడి స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌కు అవకాశమివ్వనున్నట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తమ కథనంలో రాసుకొచ్చింది. జైశ్వాల్ తాను ఆడిన ప్రతీ మ్యాచ్‌లో నూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికి, జట్టులో ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీ లేకపోవడంతో అతడికి చోటు దక్కడం లేదు.ఈ క్రమంలోనే 2027 వన్డే ప్రపంచకప్ నాటికి యశస్విని పూర్తి స్ధాయి ఓపెనర్‌గా సిద్దం చేయాలని మేనెజ్మెంట్ భావిస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ వయస్సును కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే వరల్డ్ కప్ నాటికి 40 ఏళ్ల 6 నెలలకు పైగా వయసు ఉండే రోహిత్ ఫిట్‌నెస్‌పై కూడా బీసీసీఐకి సందేహాలు ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అసంతృప్తిలో రోహిత్!అయితే ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే అతడు బీసీసీఐ పెద్దలతో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ ఇప్పటికే టీ20ఐలు, టెస్టుల నుంచి తప్పుకోగా.. వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. అతడు టెస్టుల నుంచి తప్పుకున్నప్పటి నుంచి, రోహిత్ భవిష్యత్తుపై సెలెక్షన్ కమిటీ టీమ్ మేనేజ్మెంట్తో నిరంతరం చర్చిస్తూనే ఉంది. కాగా రోహిత్ ఇటీవల ఆశించిన విధంగా రోహిత్ ఆడలేకపోతున్నాడు. సిడ్నీలో 121 నాటౌట్ ఇన్నింగ్స్ తర్వాత 11 మ్యాచ్‌లు ఆడిన 35.18 సగటుతో 387 పరుగులు చేశాడు. వీటిలో 3 అర్ధ సెంచరీలు ఉన్నా... అతని స్థాయిలో బ్యాటింగ్‌లో దూకుడు కనిపించలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో రెండు వన్డేల్లో కలిపి 68 బంతుల్లో 37 పరుగులే చేయగలిగాడు. ఇక వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా గుర్తింపు ఉన్న రోహిత్ 19 ఏళ్ల కెరీర్లో 287 వన్డేల్లో 48.58 సగటుతో 11,757 పరుగులు చేశాడు. వీటిలో 33 సెంచరీలు, 62 అర్ధసెంచరీలు ఉన్నాయి.చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్‌మన్ గిల్ -
విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్‌పై వివాదం
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్‌పై వివాదం చెలరేగింది. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధితో దురుసుగా ప్రవర్తించి, అసభ్య పదజాలం ఉపయోగించాడని ఆరోపణలు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.సోషల్‌మీడియా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఓ జర్నలిస్టు భారత జట్టు బస్సు బయలుదేరే దృశ్యాలను (కోహ్లి బస్సులోకి ఎక్కుతుండగా) అధికారిక మీడియా పాయింట్లో నిలబడి చిత్రీకరిస్తున్నాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్ అక్కడికి వచ్చి సదరు జర్నలిస్టును అక్కడి నుంచి వెళ్లిపోవాలని తీవ్ర పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.జర్నలిస్టు తన వద్ద అధికారిక అక్రిడిటేషన్ కార్డు ఉందని చెప్పినా, బాడీగార్డ్ పట్టించుకోకుండా అవమానకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పలువురు మీడియా ప్రతినిధులు సోషల్ మీడియాలో వెల్లడించడంతో వివాదం ముదిరింది.బీసీసీఐ నిబంధనలపై ప్రశ్నలుఈ ఘటనతో మరో అంశం కూడా చర్చనీయాంశమైంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు విదేశీ పర్యటనల్లో వ్యక్తిగత బాడీగార్డులు, వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి.బీసీసీఐ అమల్లో ఉన్న క్రమశిక్షణ మార్గదర్శకాల ప్రకారం విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల భద్రతను బోర్డు, స్థానిక నిర్వాహకులు ఏర్పాటు చేసిన అధికారిక భద్రతా సిబ్బందే చూసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత భద్రతా సిబ్బందికి సాధారణంగా అనుమతి ఉండదు.బీసీసీఐ స్పందన కోసం ఎదురుచూపుఈ ఘటనపై ఇప్పటివరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే విరాట్ కోహ్లీ కూడా స్పందించలేదు. అయితే ఆరోపణలు నిజమని తేలితే, బీసీసీఐ అంతర్గతంగా విచారణ జరిపే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగగా.. ఆ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ మాత్రం విఫలమయ్యాడు. రెండో వన్డే జులై 16న కార్డిఫ్ వేదికగా జరుగనుంది. -
మాట తప్పిన బీసీసీఐ!?
టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే రాజీనామా అంశంలో బిగ్ ట్విస్ట్..! వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు తన పదవి నుంచి తప్పుకొన్నాడని తొలుత వార్తలు వచ్చాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ తర్వాత డస్కటే తన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.మాట తప్పిన బీసీసీఐ!అయితే, కేవలం వ్యక్తిగత కారణాలు కాకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యాజమాన్యం తనకు ఇచ్చిన మాట తప్పినందు వల్లే డస్కటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం. కాగా రెండేళ్ల క్రితం గౌతం గంభీర్ భారత హెడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాత డస్కటే టీమ్ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. గంభీర్ ఏరికోరి తెచ్చుకుంటే..గతంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కలిసి పని చేసిన అనుభవంతో డస్కటేను గంభీర్ ఎంచుకున్నాడు. అయితే ఇప్పటికీ తన బాధ్యతలపై స్పష్టత లేకపోవడంతో డస్కటే జట్టుకు దూరం కావడమే సరైందిగా భావిస్తున్నట్లు తెలిసింది. టీమ్‌తో చేరినప్పుడు తనకు స్పెషలిస్ట్ ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారట. కానీ హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్‌ను చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా కొనసాగించడంతో డస్కటేకు ఆ అవకాశం దక్కలేదు.పని లేదు.. అందుకే‘బ్యాటింగ్ బాధ్యతలను గంభీర్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ చూస్తున్నారు. పేసర్ల కోసం మోర్నీ మోర్కెల్, స్పిన్నర్లకు సాయిరాజ్ బహుతులే కోచ్‌లుగా ఉన్నారు. ఇక డస్కటేకు పని ఏముంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు.. లండన్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న డస్కటే తన కుటుంబంతో తగిన సమయం గడిపేందుకు కూడా భారత జట్టును వీడాలని భావిస్తున్నట్లు క్రిక్‌బజ్ పేర్కొంది.అంతర్జాతీయ జట్టుకంటే ఫ్రాంచైజీ లీగ్‌లతో కలిసి పని చేయడం తనకు సౌకర్యంగా ఉంటుందని కూడా డస్కటే అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు లీగ్‌ల యాజమాన్యాలు డస్కటేను సంప్రదించినట్లు సమాచారం. ఇక డస్కటే నిజంగా తప్పుకొంటే దిలీప్‌ను బీసీసీఐ మరికొంత కాలం పాటు ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగించే అవకాశం ఉంది. చదవండి: ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్ రికార్డు -
అప్పటి నుంచే విబేధాలు.. టీమిండియాను వీడనున్న కోచ్?
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు భారత పురుషల క్రికెట్ జట్టు కోచింగ్ స్టాప్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక సీనియర్ సపోర్ట్ స్టాఫ్ సభ్యుడు తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. ఇంగ్లండ్ టూర్ ముగిసిన తర్వాత సదరు సభ్యుడు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది.అయితే అతడు మేనెజ్మెంట్పై అసంతృప్తితో తప్పుకుంటున్నారా లేదా కొత్త కోచింగ్ బాధ్యతల కోసమా అనేది స్పష్టం కాలేదు. కానీ ఆ కోచ్ ఇప్పటికే ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీతో చర్చలు జరిపారని, త్వరలోనే ఆ జట్టు కోచింగ్ స్టాప్‌లో చేరనున్నాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో మరొకరు కూడా తప్పుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత భారత హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. ఆ తర్వాత అతడి స్ధానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. అతడితో పాటు ర్యాన్ టెన్‌డెష్కాట్, అభిషేక్ నాయర్ సహాయక కోచ్‌లగా.. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌లగా నియమితులయ్యారు. టి. దిలీప్‌ను యథావిధిగా ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌గా తప్పుకొని, కేకేఆర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. తర్వాత సీతాన్షు కోటక్ బ్యాటింగ్ కోచ్‌గా గంభీర్ కోటరీలోకి చేరాడు. అప్పటి నుంచే విబేధాలు?అయితే గంభీర్ హయాంలో సొంతగడ్డపై భారత్ వరుసగా న్యూజిలాండ్ (2024), దక్షిణాఫ్రికా (2025) చేతుల్లో ఘోర టెస్ట్ సిరీస్ ఓటములను చవిచూసింది. దీంతో దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు-కోచ్‌లకు మధ్య, అలాగే సెలెక్టర్లకు-కోచింగ్ స్టాఫ్‌కు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు అప్పటిలో వార్తలు వచ్చాయి. ఆ విభేదాలు ఇప్పుడు కూడా అలానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్లే సదరు కోచ్ టీమిండియాను వీడేందుకు సిద్దమయ్యాడు మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా టీ20 నంబర్ వన్ జట్టు అయిన భారత్‌కు యూకే పర్యటన తీవ్ర నిరాశను మిగిల్చింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటివరకు పర్యటనలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. దీంతో ఈ వరుస వైఫల్యాలపై నివేదిక ఇవ్వాలని గంభీర్‌ను బీసీసీఐ సూచింది. భారత్‌కు చేరుకున్న వెంటనే భారత కోచింగ్ బృందంతో బీసీసీఐ పెద్దలు సమావేశం కానున్నారు. ఇక జింబాబ్వే పర్యటనతో పాటు ఆసియా క్రీడలకు భారత జట్టు తాత్కాలిక హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. అయితే శ్రీలంక టెస్ట్ సిరీస్‌తో పాటు ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే హోమ్ సిరీస్‌లో గంభీర్ హెడ్‌కోచ్‌గా ఉండనున్నాడు. -
కోచ్‌గా గంభీర్ అవుట్.. అదే నిజమైతే టీమిండియానే WORLD NO1
-
ఇంగ్లండ్‌తో సిరీస్ ఓటమి.. తొలి వేటు అతడి మీదేనా?
టీమిండియా ప్రస్తుతం గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుంది. నాలుగు నెలల క్రితం పొట్టి ఫార్మాట్లో మూడోసారి చాంపియన్‌గా నిలిచిన టీమిండియా ఇప్పుడు మాత్రం వరుస ఓటములు చవిచూస్తోంది. ఐర్లాండ్‌తో సిరీస్ ఓడిపోయి పరువు పోగొట్టుకున్న భారత జట్టు ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-3తో సిరీస్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమితో బీసీసీఐ కోచింగ్ స్టాఫ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో ఇప్పటికే తీవ్ర అసంతృత్తితో ఉన్న బీసీసీఐ అతడిని తొలగించడానికి ముందు కోచింగ్ జట్టును ప్రక్షాళన చేయాలని చూస్తోంది. ఈ మేరకు గంభీర్ టీంలో కీలకంగా ఉన్న వ్యక్తులను తప్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే సపోర్ట్ స్టాఫ్‌లో ఒక వ్యక్తిని పదని నుంచి తొలగించాలని చూస్తున్న బీసీసీఐకి ఒక వార్త అందింది. గంభీర్ కోచింగ్ స్టాఫ్‌లో ఒక కీలక వ్యక్తి తనంతట తానుగా బయటికి వెళ్లినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి ఎవరనే వివరాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. మరి సదరు వ్యక్తి నిష్క్రమణ వ్యక్తిగత కారణాలతోనా లేక తన పాత్రకు న్యాయం చేయకపోవడంతో తప్పుకున్నాడా అనేది స్పష్టంగా తెలియదు. మొత్తానికి రెండు వరుస సిరీస్ ఓటములు టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇక నేడు సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా చివరి టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి వైట్‌వాష్ గండం నుంచి బయటపడాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తోంది.ఇప్పటికే ఆసియా గేమ్స్‌తో పాటు జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలోని కోచింగ్ స్టాఫ్‌ను పంపించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. దీంతో గంభీర్‌తో పాటు అతడి సపోర్ట్ స్టాఫ్‌పై కూడా త్వరలో వేటు పడే అవకాశముంది. చదవండి: వింబుల్డన్‌లో ఓటమి.. రిటైర్మెంట్పై జకోవిచ్ కీలక వ్యాఖ్యలు -
BCCI సంచలన నిర్ణయం? అప్పుడు గిల్.. ఇప్పుడు తిలక్
-
నేపాల్‌తో చారిత్రక క్రికెట్ సిరీస్.. వైభవ్‌కు ప్రమోషన్!
నేపాల్‌తో క్రికెట్ బంధాన్ని పెంచుకునే క్రమంలో బీసీసీఐ మరో కీలక అడుగు వేయనుంది. సమీప భవిష్యత్తులో భారత జట్టు క్రికెట్ సిరీస్ ఆడేందుకు నేపాల్‌కు పంపించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటన విడుదల చేశారు. భౌగోళిక రాజకీ యాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న బంధం చారిత్రక క్రికెట్ సిరీస్ నిర్వహణతో మరింత బలపడనుంది. అయితే నేపాల్ పర్యటనకు సీనియర్ జట్టును కాకుండా ఇండియా-ఏ జట్టును పంపించనున్నట్లు దేవజిత్ స్పష్టం చేశారు.అయితే నేపాల్‌తో ఆడబోయే సిరీస్ ఏ ఫార్మాట్లో నిర్వహించాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఈ సిరీస్‌కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పంపే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇండియా-ఏ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను వైభవ్‌కు అప్పగించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.ఇప్పటికైతే తిలక్ వర్మ ఇండియా-ఏ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడికి విశ్రాంతినిచ్చి వైభవ్‌ను కెప్టెన్ హోదాలో నేపాల్‌కు పంపే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే టీమిండియాకు ఎంపికైన వైభవ్ ఆటలో ఇంకా ఎంతో మెరుగుపడాల్సిన అవసరం ఉందని బీసీసీఐ భావిస్తోంది.ఇటీవల సంవత్సరాల్లో ఆసియా దేశాల నుంచి క్రికెట్లో అడుగుపెట్టిన దేశాల్లో నేపాల్ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఆటలో పురోగతి సాధించడం ద్వారా నేపాల్ జట్టు వరుసగా 2024తో పాటు 2026 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాప్రికాకు ఓడించినంత పని చేసిన నేపాల్.. 2026 టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను కూడా ఓడించినంత పని చేసింది. చివరకు ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు పరుగుల తేడాతో గట్టెక్కింది. ఇక ఇదే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్పై విజయంతో నేపాల్ మెగా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్ టూర్‌కు ఎంపికైనప్పటికీ వైభవ్ సూర్యవంశీకి ఆ సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. అయితే ఇంగ్లండ్ టూర్లో మాత్రం తొలి టీ20 మినహా మిగతా అన్న్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ వైభవ్ రాణించడంలో విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లు కలిపి వైభవ్ 42 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌తో పాటు లంకలో జరిగిన ట్రై సిరీస్‌లో పరుగుల పండుగ చేసుకున్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. India A are likely to tour Nepal.. @BCCI secretary Devajit Saikia had hinted about this to reporters in Mumbai recently!— Gaurav Gupta (@toi_gauravG) July 10, 2026చదవండి: ‘శ్రేయస్‌ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’ -
తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!.. గంభీర్‌కు గండం!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. మెగా ఈవెంట్ తర్వాత దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు తొలిసారిగా టీ20 సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది.అత్యంత చేదు అనుభవంవరల్డ్కప్లో జట్టును విజేతగా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌పై అనూహ్యంగా వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఈ టూర్ నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, శ్రేయస్‌కు సారథిగా తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం ఎదురైంది.ఇంగ్లండ్ పర్యటనలోనూఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఐరిష్ జట్టు చేతిలో ఓటమి చెందడం.. సిరీస్‌ను భారత్ చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇక ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే తరహా ఫలితం పునరావృతమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓటమి పాలైంది.తీవ్ర స్థాయిలో విమర్శలుఈ క్రమంలో ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుదిజట్టు ఎంపికలో గంభీర్‌దే అంతిమ నిర్ణయం అని.. తరచూ మార్పులు చేస్తూ కెప్టెన్‌ను సైతం గందరగోళానికి గురిచేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడం గంభీర్‌కు ఇష్టం లేదని.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఒత్తిడితోనే అతడు ఇందుకు అంగీకరించాడనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్‌లు కోల్పోవడం సందేహాలకు తావిస్తోంది.తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం వరుస ఓటములపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సేనతో పాటు.. గంభీర్ టీమ్‌పైనా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.వేటు పడుతుందా?ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ANIతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా స్వదేశానికి తిరిగి రాగానే వరుస ఓటములపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. గంభీర్‌పై కూడా స్క్రుటినీ ఉంటుంది’’ అని తెలిపాయి. కాగా గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందిలో ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్‌గా ర్యాన్ టెన్ డష్కాటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఉన్నారు.ఇక తాజా సిరీస్‌లలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ విఫలం కావడంతో ఎవరిపైనైనా వేటు పడుతుందా? లేదంటే గంభీర్ చెప్పినట్లు సంధి దశ కాబట్టి పదవీకాలం పూర్తయ్యేంత వరకు వీరిని కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా గంభీర్ కాంట్రాక్టు 2027 వరకు ఉన్న సంగతి తెలిసిందే.గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా డిజాస్టర్లు ఇవే👉స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్👉పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (ఆస్ట్రేలియాతో)ని చేజార్చుకున్న భారత్👉పాతికేళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్ 👉అరంగేట్రం నుంచి మూడు సీజన్లలో డబ్ల్యూటీసీ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి (2023-25)👉సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు తొలిసారి వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్👉ఐర్లాండ్‌కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన భారత్👉ఇంగ్లండ్‌కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు అతిపెద్ద ఓటమి (ఇంగ్లండ్‌తో రెండో టీ20లో 125 పరుగుల తేడాతో చిత్తు) etc.చదవండి: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ -
‘శ్రేయస్‌ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’
ఐర్లాండ్ గడ్డపై సిరీస్ ఓటమితో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై అదే దారుణ ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. తొలి టీ20 వర్షార్పణం కాగా, ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల్లోనూ పరాజయం చవిచూసిన టీమిండియా 0-3తో ఇంగ్లండ్‌కు సిరీస్‌ను కోల్పోయింది. కనీసం చివరి టీ20లోనైనా విజయం సాధించి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించాలని టీమిండియా భావిస్తోంది. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఏదీ కలిసిరావడం లేదు. బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ కెప్టెన్‌గా వరుస ఓటములు అతడిని ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమి (ఒక మ్యాచ్ రద్దు) పాలయ్యింది. దీంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా టీ20ల్లో ఇప్పటిదాకా గెలుపు రుచి చూడలేదు. అటు టీమిండియా కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. దీంతో అయ్యర్ కెప్టెన్సీపై అప్పుడే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈసారి అయ్యర్‌తో పాటు కోచ్ గంభీర్‌పై కూడా కత్తి వేలాడుతోందనే వార్తలు వస్తున్నాయి. అదీగాక జింబాబ్వే టూర్‌తో పాటు ఆసియా గేమ్స్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను టీమిండియా వెంట పంపించాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ రెయాన్ టెన్డెస్కటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో టీమిండియా ఓటమి పాలైన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టెన్ డస్కటే మాట్లాడాడు. 'టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. అతడి కెప్టెన్సీలో టీమిండియాకు వెంటనే విజయాలు రావాలంటే ఎలా? కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. మ్యాచ్ ఓటములకు శ్రేయస్‌ను నిందించడం ఆపండి. అతడు కెప్టెన్‌గా నిలుదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పుడు వచ్చే ఓటములే తర్వాత గెలుపుకు బాటలు వేస్తాయి. నిజానికి శ్రేయస్ తన నాయకత్వాన్ని బాధ్యతగా నిర్వహిస్తున్నాడు. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం కొన్ని మ్యాచ్‌లకే అతడు కెప్టెన్‌గా వైఫల్యం చెందాడని పేర్కొనడం సరికాదు. అంతకముందు సూర్యకుమార్ కూడా ఆరంభంలో ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఎలాంటి విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకాలం ఒక కెప్టెన్సీలో ఆడి ఇప్పుడు మరో కొత్త కెప్టెన్‌తో ఆడుతుండడంతో జట్టులో సమతుల్యం లోపించింది. రాబోయే రోజుల్లో అది చక్కబడి మళ్లీ అంతా సవ్యంగా సాగుతుంది. ఇక జట్టులో పాండ్యా, బుమ్రా లోటు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ బాగా రాణిస్తున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 190 పరుగులు సాధించడమే గాక కోహ్లీ రికార్డును కూడా సమం చేశాడు. టీమిండియా మ్యాచ్‌లు ఓడుతున్నప్పటికీ అయ్యర్ మాత్రం బ్యాటర్‌గా విఫలం కాలేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్, టీమిండియా మధ్య చివరి టీ20 మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా ఆడనున్నాయి. 🔴 STOP BLAMING SHREYAS IYER – COACH SAYS HE NEEDS TIME 🤯🎙️: Ryan ten Doeschate backed Shreyas, saying he deserves time as captain. He praised Iyer's leadership, accountability, and batting, urging everyone not to judge him after just a few matches.pic.twitter.com/tqNDEQAXEm— Sam (@cricsam02) July 10, 2026Read: అరుదైన ఫీట్‌తో ఫిఫా చరిత్రను తిరగరాసిన ఎంబాపె -
గంభీర్ కు బిగ్ షాక్.. టీమిండియా కోచ్ గా VVS లక్ష్మణ్
-
నక్వీని అడిగినా ట్రోఫీ ఇవ్వడం లేదు: బీసీసీఐ
ఆసియా కప్-2025 ముగిసి దాదాపు తొమ్మిది నెలలు పూర్తైంది. అయినప్పటికీ చాంపియన్‌గా నిలిచిన టీమిండియా చేతికి ట్రోఫీ ఇంకా రానేలేదు. ఇప్పటికీ ఆసియా క్రికెట్ మండలి (ACC) ఈ విషయంపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ టోర్నీలో సూర్యకుమార్ సేన విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి టీమిండియా ట్రోఫీని గెలుచుకుంది.టీమిండియా నిరాకరణఅయితే, నాడు పహల్గామ్ ఉగ్రదాడి.. అందుకు బదులుగా ఆపరేషన్ సింధూర్ జరిగిన నేపథ్యంలో భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీసీ అధ్యక్షుడు, పాక్ మంత్రి అయిన మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది.దీంతో నక్వీ ట్రోఫీని తనతో పాటు పాకిస్తాన్‌కు ఎత్తుకెళ్లిపోయాడనే వార్తలు వచ్చాయి. అంతేకాదు.. తన అనుమతి లేకుండా ఏసీసీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించవద్దని.. ట్రోఫీ ఎవరికీ ఇవ్వద్దని అతడు ఆదేశించినట్లు సమాచారం. దీంతో తొమ్మిది నెలల కాలం గడిచినా ట్రోఫీ ఇంకా టీమిండియాకు చెంతకు చేరనేలేదు.నక్వీని అడిగినా ఇవ్వడం లేదుఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా స్పందించారు. పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఆసియా కప్ ట్రోఫీ ఇంత వరకు మా చేతికి రాలేదు. ఈ విషయం గురించి మేము ఆసియా క్రికెట్ మండలి చైర్మన్ (నక్వీ), డైరెక్టర్లతో కూడా మాట్లాడాము. ట్రోఫీ మాకు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాము.కానీ ఇప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. మేము వాళ్లతో మాట్లాడినా ఫలితం కనిపించలేదు. అయినా ట్రోఫీ ఉంటేనే మేము గెలిచినట్లు కాదు కదా!.. మా విజయాన్ని ప్రపంచం మొత్తం చూసింది. అయినా సరే ట్రోఫీ మాకు ముఖ్యం. మేము గెలుచుకున్నది ఎప్పటికైనా మాకే సొంతము’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.చదవండి: వైభవ్‌ను అందుకే ఆడిస్తున్నాం: గంభీర్ -
దాదా బర్త్‌డే.. ఈ ఫొటోలు చూశారా?
-
జట్టు ఎంపికలో శ్రేయస్ మార్క్.. ఆర్సీబీ ఏం పాపం చేసింది?
జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత కల్పించారు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ జట్టును కాకుండా రెండో జట్టును అక్కడికి పంపుతున్న నేపథ్యంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సిరీస్‌కు సంబంధించి టీమిండియా ఎంపికలో ప్రస్తుత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. జింబాబ్వే సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లలో శ్రేయస్ సహా నలుగురు ఆటగాళ్లు పంజాబ్ కింగ్స్ జట్టుకు చెందినవారే కావడం విశేషం. కెప్టెన్ శ్రేయస్‌తో పాటు సూర్యాన్ష్ షెడ్గే, ప్రబ్‌సిమ్రన్ సింగ్, యష్ ఠాకూర్లు ఎంపికయ్యారు. వీరంతా ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. మిగిలిన ఆటగాళ్ల విషయానికొస్తే ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు (అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హర్ష్ దూబే), కేకేఆర్ నుంచి వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్ ఉన్నారు. ఇక లక్నో సూపర్‌జెయింట్స్ నుంచి మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లు ఉండగా, సీఎస్కే నుంచి శివమ్ దూబే, రాజస్తాన్ రాయల్స్ నుంచి వైభవ్ సూర్యవంశీ, ముంబై ఇండియన్స్ నుంచి తిలక్ వర్మ, గుజరాత్ టైటాన్స్ నుంచి అశోక్ శర్మకు చోటు దక్కింది. అయితే మిగిలిన రెండు ఫ్రాంచైజీలు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మాత్రం ఒక్క ఆటగాడు కూడా ఎంపిక కాలేదు. 'ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టు ఎంపికలో శ్రేయస్ అయ్యర్ హవా నడుస్తుందని.. చాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ నుంచి మాత్రం ఒక్క క్రికెటర్‌కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది' అని పేర్కొన్నారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జూలై 23న హరారే వేదికగా జింబాబ్వే, భారత్ తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నాయి.జింబాబ్వే పర్యటనకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రబ్‌సిమ్రన్ (వికెట్ కీపర్)Read: శ్రీ చరణి సంచలనం.. ఏకైక భారత క్రికెటర్‌గా ఘనత -
న్యూజిలాండ్ పర్యటనకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం
త్వరలో (అక్టోబర్ 22 నుండి డిసెంబర్ 1) న్యూజిలాండ్‌లో జరుగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రణాళికను సిద్ధం చేసింది. సీనియర్ జట్టు పర్యటనకు ముందే 'ఏ' జట్టును న్యూజిలాండ్‌కు పంపించాలని నిర్ణయించింది. 'ఏ' జట్టులో కొందరు కీలక టెస్టు జట్టు సభ్యులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. వారికి న్యూజిలాండ్ పరిస్థితుల్లో వీలైనంత మ్యాచ్ ప్రాక్టీస్ అందించాలన్నదే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం భారత టెస్టు బ్యాటర్లలో రిషభ్ పంత్ మినహా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ తదితరులు న్యూజిలాండ్‌లో టెస్టు అనుభవం చాలా తక్కువగా లేదా అసలు లేదు. అక్కడ స్వింగ్, సీమ్‌కు అనుకూలించే పిచ్‌లపై ముందుగానే ఆడడం ద్వారా వారు పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది.న్యూజిలాండ్ పిచ్‌లపై బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుండటంతో విదేశీ బ్యాటర్లకు పరుగులు చేయడం ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. అందుకే సీనియర్ ఆటగాళ్లను కూడా ఇండియా-ఏ జట్టులో చేర్చి ముందుగానే అక్కడికి పంపాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ పర్యటనలో ఇండియా-ఏ జట్టు మూడు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే, భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులతో కూడిన మల్టీ ఫార్మాట్ సిరీస్ జరగనుంది. ఇందులో వన్డే సిరీస్ 2027 ప్రపంచకప్‌కు జట్టు కూర్పును ఖరారు చేయడంలో ఉపయోగపడనుండగా, రెండు టెస్టులు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 ఫైనల్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. -
సంజూకు మళ్లీ అన్యాయం..? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్!
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అంతర్జాతీయ టీ20 కెరీర్ మరోసారి సందిగ్ధంలో పడింది. మొన్న ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20కి తుది జట్టులో కోల్పోయిన సంజాకు ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. ఈ నెలఖారులో జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే ఈ జట్టులో జట్టులో శాంసన్‌కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్‌ను తొలిసారి నేషనల్ టీమ్‌కు ఎంపిక చేశారు. అదేవిధంగా యధావిధిగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులో కొనసాగించారు. జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను వైభవ్ ఆరంభించనున్నాడు.వేటునా? విశ్రాంతా?సాధారణంగా జింబాబ్వే లాంటి పర్యటనలను సీనియర్లకు విశ్రాంతినిచ్చి, యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు అవకాశమిస్తారు. కానీ ఈసారి సీనియర్ బ్యాటర్లలో కేవలం సంజూ శాంసన్‌ను మాత్రమే పక్కన పెట్టడం పలు అనుమానాలకు తావనిస్తోంది. అతడిని కావాలనే తప్పించారా? లేదా రెస్ట్ ఇచ్చారా? అన్నది ఇంకా స్పష్టతలేదు.అయితే సంజూ ప్రస్తుతం కేవలం టీ20 ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్, జింబాబ్వే టూర్ల తర్వాత భారత్‌కు పెద్దగా టీ20 సిరీస్‌లు లేవు. మళ్లీ సెప్టెంబర్‌లో ఆసియాకప్ గేమ్స్‌లో టీమిండియా తలపడనుంది. అంటే దాదాపు రెండు నెలల విరామం లభిస్తోంది. అలాంటిప్పుడు కేవలం ఒక్క ఫార్మాట్ ఆడే సంజూకు ‘విశ్రాంతి’ ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయిసంజూకు రెస్ట్ కాదని, కావాలనే పక్కన పెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ హీరో అయిన సంజూకు మరోసారి అన్యాయం జరిగిందని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా పొట్టి ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్లో దుమ్ములేపిన సంజూ.. యూకే టూర్లో మాత్రం విఫలమయ్యాడు. ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో రెండో టీ20కు అతడిని తప్పించి చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అవకాశమిచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రధాన జట్టులోనే అతడికి చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో మాత్రం సంజూ సభ్యునిగా ఉన్నాడు. -
సంజూపై వేటు.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సోమవారం టీమిండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టులో ఓపెనర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున సంచలన ప్రదర్శన కనబరిచిన ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నాడు.ఇక 2026 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలవడంలో సంజూ శాంసన్‌ది కీలకపాత్ర. టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంజూ శాంసన్ ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లతో పాటు ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో ఆడినప్పటికీ విఫలమయ్యాడు. దీంతో రెండో టీ20కి శాంసన్‌ను తప్పించి వైభవ్‌కు అవకాశమిచ్చారు. ఇక జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సంజూ శాంసన్‌ను పూర్తిగా పక్కనబెట్టారు. చిన్న జట్టుతో సిరీస్ కావడంతో శాంసన్‌కు రెస్ట్ ఇచ్చి ఉంటారని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. ఇక జాతీయ జట్టుకు తొలిసారి ఎంపికైన ప్రబ్‌సిమ్రన్ ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున 168.87 స్ట్రైక్‌రేట్‌తో 510 పరుగులు సాధించాడు. ఇతర మార్పుల విషయానికొస్తే రింకూ సింగ్, మయాంక్ యాదవ్ తిరిగి రీఎంట్రీ ఇవ్వగా.. హర్ష్‌దూబే, యష్ ఠాకూర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ అశోక్ శర్మకు పిలుపొచ్చింది.జింబాబ్వే పర్యటనకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రబ్‌సిమ్రన్ (వికెట్ కీపర్).జింబాబ్వే పర్యటనలో టీమిండియా షెడ్యూల్:తొలి టీ20: జూలై 23, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)రెండో టీ20: జూలై 25, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)మూడో టీ20: జూలై 26, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)Read: టీమిండియాతో మూడో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన -
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై రచ్చ.. స్పందించిన బీసీసీఐ
టీమిండియా తరపున అరంగేట్రం కోసం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరీక్షణ కొనసాగుతోంది. ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన వైభవ్.. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్లోనూ డెబ్యూ చేసే సూచనలు కనిపించడం లేదు. వర్షం కారణంగా రద్దు అయిన తొలి టీ20లో వైభవ్‌కు భారత తుది జట్టులో చోటు దక్కలేదు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లనే ఓపెనింగ్ జోడీగా టీమ్ మేనెజ్మెంట్ కొనసాగిస్తోంది. సంజూ వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలం కావడంతో సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. హెడ్ కోచ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు మాత్రం సీనియర్ ప్లేయర్లకే మద్దతు ఇస్తున్నారు. దీంతో గంభీర్, అయ్యర్ తీరుపై చాలా మంది మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్, కోచ్ విమర్శలు చేయడం సరికాదని శుక్లా అన్నారు.వైభవ్ సూర్యవంశీకి అద్భుతమైన టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్లో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. జట్టు మేనేజ్మెంట్పై వస్తున్న విమర్శలు నా వరకు వచ్చాయి.నేను ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. మ్యాచ్ పరిస్థితిని బట్టి కోచ్, కెప్టెన్ తుది నిర్ణయం తీసుకుంటారు. సరైన సమయం వచ్చినప్పుడు వైభవ్‌కు ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది. అంతవరకు ఇలాంటి అనవసర విమర్శలు చేయడం ఆపాలి." అని 'టైమ్స్ నౌ'తో శుక్లా పేర్కొన్నారు.చదవండి: IND vs ENG: భారత్‌తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! స్టార్లు వచ్చేశారు -
‘శాశ్వతం’గా బెంగళూరుకు షిఫ్ట్ అయిన హార్దిక్ పాండ్యా!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ముంబై నుంచి అతడు మకాం మార్చేశాడు. ‘శాశ్వతం’గా బెంగళూరులో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. హార్దిక్ పాండ్యా సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.వెన్నునొప్పి కారణంగా..కాగా అరుదైన పేస్ బౌలింగ్ నైపుణ్యాలున్న హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ కారణాల దృష్ట్యా.. చాన్నాళ్ల క్రితమే టెస్టు ఫార్మాట్‌ను వదిలేశాడు. వన్డే, టీ20లలో టీమిండియా కీలక ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న ఈ బరోడా ఆటగాడిని తరచూ గాయాలు వేధిస్తున్నాయి. ఒకానొక దశలో వెన్నునొప్పి కారణంగా ఏళ్ల పాటు జట్టుకు దూరమైన అతడు.. ఊహించని రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చాడు.భారత్ టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కొన్నాళ్లుగా హార్దిక్ పాండ్యా తరచూ గాయాల బారిన పడుతున్నాడు. వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్-2026లో పలు మ్యాచ్‌లకు దూరమైన ఈ ఆల్‌రౌండర్.. తాజాగా తొడ కండరాల గాయంతో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరమయ్యాడు.శాశ్వత శిక్షణా శిబిరం అక్కడే!ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE- Centre of Excellence)లో హార్దిక్ పాండ్యా పునరావాసం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో CoEనే తన శాశ్వత శిక్షణా శిబిరంగా మార్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ముంబై నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి హార్దిక్ పాండ్యా సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ ఇప్పటికే శాశ్వతంగా బెంగళూరుకు షిఫ్ట్ అయిపోయాడు. సిటీ శివార్లలో ఓ ప్రాపర్టీని అద్దెకు తీసుకున్నాడు. CoEకి అది అతి దగ్గరగా ఉంటుంది. CoEనే శాశ్వత ట్రెయినింగ్ సెంటర్‌గా మార్చుకున్న తొలి భారత క్రికెటర్ ఇతడేనేమో!అందుకే ముంబై నుంచి బెంగళూరుకు షిఫ్ట్తన కెరీర్ చరమాంకం వరకు అతడు ఇక్కడే శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి ముంబైలో తన ఇంటి నుంచి.. ట్రెయినింగ్ సెంటర్‌కు వెళ్లడం హార్దిక్‌కు చాలా కష్టంగా మారింది. సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న క్రికెటర్‌గా CoEలో అతడికి అన్ని సౌకర్యాలూ లభిస్తాయి.గాయం నుంచి కోలుకోవడం నుంచి.. నైపుణ్యాలు మెరుగుపెట్టుకోవడం సహా ప్రతీ విషయంలోనూ అతడికి బీసీసీఐ నుంచి సహకారం ఉంటుంది. అందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్, దేశీ టోర్నీలు, టీమిండియా తరఫున విధుల్లో ఉన్నపుడు మాత్రం అతడు CoEకి దూరంగా జట్టుతో కలిసి ఉంటాడు.మరో ఐదు నుంచి ఆరేళ్ల పాటు హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ కెరీర్ సజావుగా కొనసాగించాలనుకుంటున్నాడు. అందుకోసం తనను తాను మెరుగుపరచుకోవడం అత్యవసరం’’ అని పేర్కొన్నాయి. కాగా హార్దిక్ పాండ్యా ప్రస్తుతం వ్యక్తిగత సెలవులో ఉన్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకునే క్రమంలో త్వరలోనే CoEకి అతడు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.చదవండి: వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తిప్పికొట్టిన శ్రేయస్ -
చివరి నిమిషంలో భారత టీ20 సిరీస్ రద్దు..?
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్ట్‌లో జరగాల్సి ఉన్న టీ20 సిరీస్‌పై అనిశ్చితి నెలకొంది. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సిరీస్ చివరి నిమిషంలో రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటగాళ్ల పనిభారం, భవిష్యత్ టోర్నీల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి భారత ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో ఈ సిరీస్ లేదు. అయితే లంక బోర్డు అభ్యర్థన మేరకు బీసీసీఐ ఈ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఇంకా అధికారిక షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. ఈ లోపే బిజీ షెడ్యూల్ దృష్ట్యా బీసీసీఐ ఈ సిరీస్‌ను డిస్మిస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ సిరీస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. గతేడాది నవంబర్‌లో శ్రీలంకను తీవ్రంగా ప్రభావితం చేసిన ‘సైక్లోన్ డిట్వా’ బాధితుల సహాయార్థం ఈ సిరీస్‌ను నిర్వహించాలని అనుకున్నారు. ఈ సిరీస్‌కు కేవలం క్రికెట్ పరమైన ప్రాధాన్యమే కాకుండా మానవతా కోణం కూడా ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యం నెరవేరేలా లేదు.టీ20 సిరీస్‌పై అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ఆగస్ట్‌లోనే ఇరు జట్ల మధ్య జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మాత్రం యథావిధిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి 27 వరకు జరగనున్న ఈ టెస్టులు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2025-27)లో భాగంగా జరుగనున్నాయి. -
వైభవ్ ఇంకా పసివాడే!
లండన్: సీనియర్ క్రికెట్ అయిన ఐపీఎల్లో అతను ఎంతో మంది స్టార్ బౌలర్లను చితక్కొట్టవచ్చు గాక... తొలిసారి ఇప్పుడు భారత సీనియర్ జట్టులోనూ చోటు దక్కించుకోవచ్చు గాక... కానీ వైభవ్ సూర్యవంశీని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకా పసివాడిగానే గుర్తిస్తోంది. 16 ఏళ్లకంటే తక్కువ వయసు ఉండటంతో అతను ‘పెద్దల’ గదిలో భాగంగా ఉండరాదని సూచించింది. అందుకే వైభవ్ కోసం ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్‌ను కేటాయిస్తోంది. దేశవాళీ క్రికెట్లో బిహార్ జట్టు సభ్యుడిగా, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడిగా ఇప్పటికే వైభవ్ టీమ్ డ్రెస్సింగ్‌రూమ్‌లోనే ఉన్నాడు. ‘వైభవ్ వయసు 16 ఏళ్లకంటే తక్కువ. ఇలాంటి ఆటగాళ్లకు తగిన భద్రత కల్పించే విషయంలో ఇంగ్లండ్ దేశంలోని చట్టాలను మేం అమలు చేస్తాం. అతను మ్యాచ్ జరిగేటప్పుడు లేదా టీమ్ మీటింగ్‌ల సమయంలో మాత్రం తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోవచ్చు. అయితే దుస్తులు మార్చుకునే సమయంలో అతను అక్కడ ఉండరాదు. లేదా ఎవరూ లేని సమయంలో మార్చుకున్నా... ఇతర ఆటగాళ్లు వస్తే వెంటనే గదిని వీడాలి. అందుకే వైభవ్ కోసం అదనంగా మరో డ్రెస్సింగ్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’ అని ఈసీబీ వెల్లడించింది.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు జరిగే ఐర్లాండ్ సిరీస్‌కు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. నిజానికి ఇవి ఐసీసీ నిబంధనలు. ద్వైపాక్షిక సిరీస్‌ల సమయంలో వీటిని పాటించాల్సిన అవసరం లేదు. అయితే ఈసీబీ తమ ‘సేఫ్ హ్యాండ్స్’ విధానం ప్రకారం వైభవ్‌ను ప్రత్యేక ఆటగాడిగా చూస్తోంది. గతంలో ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్‌లో ఆర్స్నల్ జట్టుకు చెందిన ఇద్దరు అండర్–16 ప్లేయర్లు ఏథన్ ఎన్వనరి, మ్యాక్స్ డోమన్కు కూడా ఇలాగే విడిగా ఉంచారు.15 ఏళ్ల వైభవ్ వెంట అతని తల్లిదండ్రులను పంపించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రేపు ఐర్లాండ్‌తో జరిగే తొలి టి20లో అతను బరిలోకి దిగితే భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో (15 ఏళ్ల 91 రోజులు) అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. -
‘భవిష్యత్తు బాగుంటుంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టి20 లీగ్ మున్ముందు పెద్ద స్థాయికి చేరే అవకాశం ఉందని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే తాము జత కట్టామని వరంగల్ వారియర్స్ సహ యజమాని వరుణ్ జూపల్లి అన్నారు. ఎంతో మంది ప్రతిభ గల యువ ఆటగాళ్లు సరైన అవకాశం ఎదురు చూస్తున్నారని, తొలి సీజన్లో ఇప్పటి వరకు లభిస్తున్న స్పందనను చూస్తే లీగ్ విజయవంతమైనట్లుగా చెప్పవచ్చని మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘మా సన్నిహితులు అమెరికాలోని మేజర్ క్రికెట్ లీగ్‌లోని ఒక జట్టులో సహ యజమానిగా ఉన్నారు. ఆ కారణంగా టీజీ టి20లో టీమ్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన కలిగింది. క్రికెట్‌పై ఆసక్తితో పాటు మన వద్ద జరుగుతున్న టోర్నీలో భాగమైతే బాగుంటుందని ముందుకు వచ్చాం. ఇందులో లాభాల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. రాబోయే సీజన్లలో లీగ్ మరింత పెద్ద స్థాయికి చేరుతుంది’ అని వరుణ్ వ్యాఖ్యానించారు. టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడినా... వరంగల్ టీమ్ అన్ని విధాలా పటిష్టంగా ఉందని వరుణ్ చెప్పారు. ముఖ్యంగా పేరాల అమన్ రావు అద్భుత ప్రదర్శనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘అమన్ సూపర్ షాట్స్ ఆడాడు. సాధికారికంగా అతను బ్యాటింగ్ చేసిన తీరును చూస్తే ఐపీఎల్‌లోకి ఎందుకు ఎంపికయ్యాడో తెలుస్తుంది. అమన్ మాత్రమే కాకుండా ఇతర కుర్రాళ్లపై కూడా మాకు నమ్మకం ఉంది. లీగ్‌లో వారియర్స్ మంచి ఫలితాలు సాధించడం ఖాయం’ అని వరుణ్ వెల్లడించారు. బీసీసీఐ అనుమతించిన నిబంధనల ప్రకారం భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉండటంతో తొలి మ్యాచ్ ఆడలేదని... తర్వాతి మ్యాచ్‌లలో అతను బరిలోకి దిగుతాడని వరుణ్ స్పష్టం చేశారు. -
భారత జట్టులోకి డేంజరస్ ప్లేయర్.. బీసీసీఐ అధికారిక ప్రకటన
ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు స్టార్ ప్లేయర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి తొడ కండరాల గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో ముంబై ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్గేను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. సూర్యాన్ష్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది. కాగా అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో నితీశ్ గాయపడ్డాడు. దీంతో లక్నో వేదికగా జరిగిన రెండో వన్డేకు అతడు దూరమయ్యాడు. మూడో మ్యాచ్‌కు మళ్లీ అతడు తిరిగొచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడు కాస్త అసౌకర్యానికి గురయ్యాడు. ఈ ఆంధ్ర క్రికెటర్ గాయం కాస్త తీవ్రమైనది తేలడంతో జట్టు నుంచి తప్పించారు. ఇక సూర్యాన్ష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన త్రైపాక్షిక సిరీస్‌లో భారత్-ఏ విజయం సాధించడంలో సూర్యాన్ష్ కీలక పాత్ర పోషించాడు. ఈ ముంబైకర్‌కు బౌలింగ్‌తో పాటు అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. లోయర్ ఆర్డర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగలడు. ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ తరపున కూడా అతడు అద్భుతంగా రాణించాడు.ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20లకు భారత జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, సూర్యాన్ష్ షెడ్గే, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీచదవండి: Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డీల్.. రూ.12 కోట్లు వదులుకుని? -
నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్ టూర్‌కు దూరం!
టీమిండియా ఆల్‌రౌండర్, తెలుగు క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్ టూర్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న నితీశ్ రెడ్డి రెండు సిరీస్‌ల నుంచి వైదొలినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రక టన విడుదల చేయాల్సి ఉంది. నితీశ్‌రెడ్డిని బెంగళూరులోని బీసీసీఐ రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించే అవకాశముంది. కాగా ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇక గాయపడిన నితీశ్‌కుమార్ రెడ్డి స్థానంలో ముంబై ఆల్‌రౌండర్ సుయాన్ష్ హెగ్డేను ఎంపిక చేసినట్లు సమాచారం. శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్‌లో సూర్యాన్ష్ మంచి ప్రదర్శన కనబరిచి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. సిరీస్‌లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యాన్ష్ 149 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో రెండు వికెట్లు తీశాడు. అయితే అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ సమయంలోనే తొడ కండరాల నొప్పితో రెండో వన్డేకు నితీశ్ రెడ్డి దూరమయ్యాడు. అయితే చివరి వన్డేలో ఆడిన నితీశ్ రెడ్డి మరోమారు తొడ కండరాల గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో నితీశ్‌రెడ్డి నాలుగు వారాల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఆఫ్గన్‌తో ఏకైక టెస్టుతో పాటు వన్డే సిరీస్‌కు నితీశ్ రెడ్డి చోటు దక్కించుకున్నప్పటికీ కేవలం ఒక టెస్టుతో పాటు వన్డే మాత్రమే ఆడాడు. ఇక ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా మంగళవారం రాత్రి బెల్ఫాస్ట్కు బయల్దేరనుంది.Some #TeamIndia News: Nitish Reddy's left quadriceps injury has aggravated. He is out of UK Tour. Rehab will take some time @BCCI #Cricket— Kushan Sarkar (@kushansarkar) June 23, 2026చదవండి: బీసీసీఐకి సునీల్ గావస్కర్ కీలక విజ్ఞప్తి! -
బీసీసీఐకి సునీల్ గావస్కర్ కీలక విజ్ఞప్తి!
భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించే అంశమై బీసీసీఐకి కీలక విజ్ఞప్తి చేశారు. వరుస సిరీస్‌లతో బిజీగా ఉండే భారత క్రికెటర్లకు ప్రతీ ఏడాది ఒక నెలపాటు విశ్రాంతి ఇస్తే బాగుంటుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతంగా గత రెండేళ్లుగా టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీగా మారిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి చూసుకుంటే టీ20 ప్రపంచకప్, ఆపై ఐపీఎల్ రెండు నెలల పాటు సాగింది. ఆ తర్వాత ఆరు రోజుల గ్యాప్‌తో భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరిగింది. ఇలా వరుస సిరీస్‌లతో ఆటగాళ్లు అలసిపోవడమే గాక, గాయాల బారిన పడుతున్నారని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. ఆఫ్గన్, ఐర్లాండ్ వంటి చిన్న దేశాల్లో క్రికెట్‌ను ప్రోత్సహించి, వారి ఆర్థిక ఎదుగుదలకు సహాయపడడంలో బీసీసీఐ మంచి పనే చేస్తోందన్నారు. కానీ ఇదే సమయంలో మన క్రికెటర్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి సారించాలని, ఏడాదిలో మన ఆటగాళ్లకు ఒక నెల విశ్రాంతి ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే భారత్‌లో క్రికెటర్లకు కొదువ లేదని, ప్రతిభావంతులు పుష్కలంగా ఉన్నారని, కాబట్టి వీలైనంతమేర సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పిస్తూ ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ రొటేట్ చేయాలని తెలిపారు. అఫ్గానిస్తాన్‌తో టెస్టులో గిల్, రాహుల్ శతకాలు సాధించారని, బుమ్రాకు విశ్రాంతినిచ్చి మానవ్ సుతార్‌కు అవకాశమిచ్చి మంచి పని చేశారని కొనియాడారు. ఇలా చేయడం వల్ల జట్టులో కీలక ప్లేయర్‌కు తగినంత విశ్రాంతి దొరికి మేజర్ సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక అభిమానుల గురించి కూడా బీసీసీఐ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అండర్-19 మ్యాచ్‌లు ఎక్కువగా నిర్వహిస్తే యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని, దీనివల్ల టీమిండియాకు అదనపు జట్లు తయారయ్యేందుకు ఇది మరింత దోహద పడుతుందని తెలిపారు.ఇక ఆఫ్గన్‌తో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు తర్వాత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఇంగ్లండ్ పర్యటనలో బిజీ కానుంది. ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.చదవండి: హాలండ్ జోరు.. ఉత్కంఠ పోరులో నార్వే విజయం -
తెలంగాణ టి20కి వేళాయె..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక టి20 లీగ్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో అధికారికంగా టీజీ టి20 లీగ్‌ను తొలిసారి నిర్వహించనున్నారు. గతంలో పలు వేర్వేరు లీగ్ టోర్నీలు జరిగినా... బీసీసీఐ అనుమతితో అధికారికంగా టోర్నీని జరపడం ఇదే తొలిసారి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర తదితర అసోసియేషన్లు రాష్ట్ర స్థాయిలో వర్ధమాన క్రికెటర్ల కోసం ఇలాంటి టి20 లీగ్‌ను నిర్వహిస్తుండగా, ఇప్పుడు హెచ్‌సీఏ కూడా ఆ జాబితాలో చేరింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో నేడు టోర్నీ మొదలు కానుంది. 22 రోజుల పాటు జరిగే టోర్నీలో ఫైనల్ సహా మొత్తం 32 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జూలై 12న ఫైనల్ జరుగుతుంది. తొలి రోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మొదలయ్యే తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌తో ఖమ్మం ఏసెస్ జట్టు తలపడుతుంది. దీనికి ముందు సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, జియో హట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 160 మంది ప్లేయర్లు... టీజీ టి20 లీగ్ బరిలో ఎనిమిది జట్లు నిలిచాయి. హైదరాబాద్ ఇ–చాంపియన్స్, కరీంనగర్ డైమండ్స్, ఖమ్మం ఏసెస్, పాలమూరు స్ట్రైకర్స్, మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్, రంగారెడ్డి రైజర్స్, నల్గొండ నైట్స్ టీమ్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ టీమ్‌లకు అభిరథ్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్, ప్రజ్ఞయ్ రెడ్డి, రవితేజ, అమన్ రావు, తనయ్ త్యాగరాజన్, రాహుల్ బుద్ధి కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ముందుగా బిడ్ ద్వారా ఎనిమిది మంది ఫ్రాంచైజీలను ఎంపిక చేయగా, ఆ తర్వాత వేలం ద్వారా టీమ్‌లు ఆటగాళ్లను ఎంచుకున్నాయి.ఒక్కో టీమ్‌లో 20 మంది ఆటగాళ్ల చొప్పున మొత్తం 160 మంది ప్లేయర్లకు అవకాశం కల్పించారు. వేలంలో అత్యధికంగా టీమిండియా ఆటగాడు తిలక్ వర్మకు రూ.33 లక్షలు దక్కగా, పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు రూ.14 లక్షలు లభించాయి. అన్క్యాప్డ్ ప్లేయర్ మిలింద్కు అత్యధికంగా రూ. 17 లక్షలు దక్కాయి. ఆటగాళ్ల కోసం అన్ని జట్లు కలిపి మొత్తం రూ. 4.74 కోట్లు వెచ్చించాయి. అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ కారణంగా తిలక్, సిరాజ్ ఎన్ని మ్యాచ్‌లు ఆడతారనే విషయంపై స్పష్టత లేదు. రూ.49 టికెట్... తొలిసారి నిర్వహిస్తున్న లీగ్ కోసం హెచ్‌సీఏ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తుండగా, ప్రత్యేక గీతాన్ని కూడా రూపొందించారు. టోర్నీకి శ్రీనిధి యూనివర్సిటీ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. టోర్నీ నిర్వహణకు సంబంధించి కొందరు న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తడంతో దీనిపై హెచ్‌సీఏ వివరణ ఇచ్చింది. లీగ్ నిర్వహణకు బీసీసీఐ అధికారికంగా అనుమతి ఇచ్చిందని, బోర్డు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) పర్యవేక్షణలోనే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఎక్కువ మంది అభిమానులు స్టేడియంలో లీగ్ మ్యాచ్‌లు చూడటం కోసం కేవలం రూ.49 టికెట్‌ను అందుబాటులో ఉంచారు. ‘డిస్ట్రిక్ట్ ’ యాప్ ద్వారా ఫ్యాన్స్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఫ్రాంచైజీల వివరాలు » కరీంనగర్ డైమండ్స్ – ఈఐపీఎల్ గ్రూప్ అండ్ టిబరుమల్ జ్వెలర్స్ » ఖమ్మం ఏసెస్ – అన్విత గ్రూప్ » పాలమూరు స్ట్రైకర్స్ – వీరభద్ర స్టీల్స్ » మెదక్ ఫాల్కన్స్ – బృంద ఇన్ఫ్రా » వరంగల్ వారియర్స్ – బైన్ గ్లోబల్ రిసోర్సెస్ » రంగారెడ్డి రైజర్స్ – బూరుగు ఇన్ఫ్రా అండ్ ప్రణవ » నల్లగొండ నైట్స్ – కిశోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్æ » హైదరాబాద్ ఇ–చాంపియన్స్– ఉషోదయ ఎంటర్ప్రైజెస్ -
ఇంగ్లండ్ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) శిబిరంలో ఉన్న పాండ్యా అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌కు ఇంకా సమయం ఉండడంతో అప్పటివరకు పాండ్యా కోలుకుంటాడని వార్తలు వచ్చినప్పటికీ, బీసీసీఐ మెడికల్ బృందం మాత్రం పాండ్యా ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధంగా లేడని తెలిపింది. ఎందుకంటే రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న పాండ్యా ఫిట్నెస్ టెస్టులో విఫలమయ్యాడని, అతడు కోలుకునేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశముందని సమాచారం. అయితే ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జూలై 14 నుంచి 19 మధ్య మూడు వన్డేలు ఆడనుంది. ఈ లెక్కన హార్దిక్ టీమిండియాతో జాయిన్ కావడం కష్టమే. ఇక గాయంతో బాధపడుతున్న కోహ్లీ కూడా ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడుతాడా లేదా అనేది జూన్ 22న (సోమవారం) తేలనుంది. ఆరోజు కోహ్లికి ఫిట్నెస్ టెస్టు జరగనుంది.అయితే అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ టూర్లకు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్‌కప్ రోడ్‌మ్యాప్ ప్రక్రియలో భాగంగా పాండ్యా కీలకం కానున్నాడని అజిత్ అగార్కర్ వెల్లడించాడు. కానీ ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో వెన్ను గాయంతో బాధపడ్డ పాండ్యా సీవోఈకి చేరుకున్నాడు. వెన్ను నొప్పి నుంచి తేరుకునే లోపే తొడ కండరాల గాయం కావడంతో ఆఫ్గన్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ఒక్కరోజు ముందే పాండ్యా ఆడడం లేదని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.2027 వన్డే వరల్డ్‌కప్ ఆడేనా?వరుస గాయాలతో సతమతమవుతున్న పాండ్యా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఆడుతాడా లేదా అన్నది మిస్టరీగా మారింది. టీమిండియా కూడా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం మళ్లీ సెప్టెంబర్‌లో వెస్టిండీస్ టూర్లో వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అప్పటికి కోలుకొని పాండ్యా జట్టులోకి వస్తే మంచిదే, కానీ మళ్లీ ఏదైనా గాయం బారిన పడితే మాత్రం వన్డే ప్రపంచకప్‌కు పాండ్యా అందుబాటులో ఉండేది అనుమానమే.Read: నోరు మూసుకున్నందుకు రెడ్‌కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి! -
మాజీ కోచ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీ ఎలాంటి తప్పులు చేయకూడదంటే?
-
రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ స్పందన!
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆ మెగాటోర్నీలో ఆడతారా లేదా అన్న దానిపై బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్ చర్చకు వస్తే ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు ఆటకు పూర్తిగా వీడ్కోలు పలుకుతారనే వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పీటీఐకి ఇంటర్వ్యూ ఇస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నామని, ఈ ప్రయాణంలో కొంతమంది ఆటగాళ్లకు అవకాశాలు లభించకపోవచ్చని పేర్కొన్నారు. సైకియా మాటలను బట్టి చూస్తే జట్టులో సీనియర్లుగా చెలామణి అవుతున్న రోహిత్, కోహ్లీలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగుతారా లేదా అన్నదానిపై సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిజానికి కోహ్లి, రోహిత్‌లు మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ సైకియా వ్యాఖ్యలు సమాధానం కంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.గంభీర్, అగార్కర్ల మాదిరిగానే, రోహిత్, కోహ్లీల 2027 ప్రపంచ కప్ అవకాశాలపై సైకియా కూడా స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదు. ఈ విషయంపై బీసీసీఐ ఏమైనా అంతర్గత చర్చలు జరిపిందా అని అడగ్గా, ఇది ప్రాథమికంగా కొనసాగుతున్న ప్రక్రియ అని, ఇందులో భాగస్వాములందరూ తమ అభిప్రాయాలలో ఏకీభవిస్తున్నారని సైకియా అన్నారు. 'మాది చాలా సమన్వయంతో కూడిన బృందం, ఇందులో చాలా మంది నిపుణులు ఉన్నారు. సంబంధిత వర్గాలన్నింటినీ కలుపుకొని వెళ్తాము. ఏ నిర్ణయాలలోనైనా క్రికెట్ కమిటీ, సెలెక్టర్లు, సహాయక సిబ్బంది, ప్రధాన కోచ్, సంబంధిత ఆటగాళ్లతో సహా ఇతర భాగస్వాములందరూ పాలుపంచుకుంటారు.క్రమం తప్పకుండా సంభాషణలు జరుగుతున్నాయి. అందువల్ల, మనకు ప్రత్యేక సంప్రదింపుల సమావేశం అవసరం లేదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ' అని సైకియా పేర్కొన్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతుండగా, కోహ్లీ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. -
ఆఫ్గన్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలకమార్పు
స్వదేశంలో అప్గానిస్తాన్‌తో జరుగున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అయితే చెన్నై వేదికగా మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో టీమిండియా జట్టులో కీలక మార్పు జరగనుంది. మోకాలి గాయంతో తొలి రెండు వన్డేలకు దూరమైన హర్షిత్ రానా చివరి వన్డే ఆడనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘హర్షిత్ రానా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రీహాబిలిటేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. చెన్నై వేదికగా జరగనున్న మూడో వన్డే ఆడేందుకు టీమిండియాలో జాయిన్ అయ్యాడు’ అని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపారు. ఇక 2026 టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ హర్షిత్ రానా గాయపడ్డాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. అయితే ఫిట్నెస్ నిరూపించుకోకుండానే హర్షిత్ రానాకు ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేసిన టీమిండియాలో చోటు లభించడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అతడి ఎంపికపై కూడా క్రీడా వర్గాల్లో కూడా పెద్ద చర్చే నడిచింది. ఈ విషయాలన్నీ పక్కనబెడితే హర్షిత్ రానా అప్గానిస్తాన్‌తో మూడో వన్డేలో ఆడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 24 ఏళ్ల హర్షిత్ రానా టీమిండియా తరఫున 14 వన్డేలాడి 16 వికెట్లు తీశాడు. చివరగా ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హర్షిత్ రానా టీమిండియా తరఫున మ్యాచ్ ఆడాడు. ఇక గిల్ సారథ్యంలోని టీమిండియా ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తోంది. వర్షంతో తొలి వన్డేలో బ్యాటింగ్‌కు పెద్దగా అవకాశం రాలేదు. అయితే రెండో వన్డేలో మాత్రం కెప్టెన్ గిల్‌తో పాటు ఇషాన్ కిషన్ సెంచరీల మోత మోగించారు. దీంతో రెండో వన్డేలో టీమిండియా 170 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డేకి భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కులదీప్ సింగ్ యాదవ్, ప్రిన్స్ దీప్, కృష్ణ యాదవ్, యువరాజు బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రానా.చదవండి: గాయంతో శ్రేయాంక ఔట్.. ఆమె స్థానంలో ఎవరంటే? -
గాయంతో శ్రేయాంక ఔట్.. ఆమె స్థానంలో ఎవరంటే?
భారత క్రికెటర్ శ్రేయాంక పాటిల్ గాయంతో మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీకి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. కాగా శ్రేయాంక పాటిల్ స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రేమా రావత్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో రెండు వరుస విజయాలతో జోష్ మీదున్న హర్మన్ సేనకు శ్రేయాంక పాటిల్ గాయపడడం ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.ఇక ప్రేమా రావత్‌కు అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం రానప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున డబ్ల్యూపీఎల్‌లో తన లెగ్-స్పిన్‌తో ఆకట్టుకుంది. అంతేకాకుండా, దేశీయ సర్క్యూట్లో ఉత్తరాఖండ్ తరఫున కూడా ప్రేమా రావత్ రాణించింది. అంతేకాదు ఆమె ఇండియా-ఎ తరఫున కూడా కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు నమోదు చేసి బీసీసీఐ దృష్టిలో పడింది.కాగా టోర్నీలో భాగంగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కీలక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయపడింది. ఫీల్డింగ్ చేసే క్రమంలో ఆమె కుడి కాలి మడమ తిరగబడింది. దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలాడింది. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కనీసం కాలు కింద పెట్టలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్‌పై గ్రౌండ్ వెలుపలి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత స్కానింగ్ కోసం పాటిల్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా రిపోర్టులో శ్రేయాంక చీలమండకు గాయమైనట్లు తేలింది. ఆమె కోలుకునేందుకు కనీసం ఆరు వారాలు పట్టే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో శ్రేయాంకను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)కు రావాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. శిబిరంలోనే శ్రేయాంక పాటిల్ చికిత్స తీసుకోనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే శ్రేయాంకకు గాయాలు కొత్తేమి కాదు. గతంలో వేలి ఫ్రాక్చర్, ఆ తర్వాత గ్రేడ్-3 షిన్ స్ప్లింట్స్ గాయాల కారణంగా శ్రేయాంక దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైంది. డబ్ల్యూపీఎల్-2026 సీజన్‌తో ఆమె పునరాగమనం చేసింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవడంలో శ్రేయాంకది కీలక పాత్ర. ఇప్పుడు వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో కూడా సత్తాచాటాలని భావించిన శ్రేయాంకకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇక పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై వరుసగా భారీ విజయాలు సాధించిన హర్మన్ సేన గ్రూప్-ఎ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లను ఎదుర్కోనుంది. -
వైభవ్‌కు తోడుగా తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: భారత సీనియర్ జట్టులోకి తొలిసారి ఎంపికైన సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ఏర్పాటు చేయనుంది. ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే 15 ఏళ్ల వైభవ్‌కు తోడుగా అతని తల్లిదండ్రులను పంపాలని బోర్డు నిర్ణయించింది. ఈ వయసులో అమ్మానాన్న తన పక్కన ఉండటం వైభవ్‌కు మేలు చేస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అభిప్రాయ పడ్డారు. తనకంటే వయసులో పెద్దవారైన క్రికెటర్లతో కలిసి ఉండటంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సైకియా వెల్లడించారు. ‘సాధారణంగా ఏదైనా సీనియర్ టీమ్‌లలో ఇంత చిన్న వయసు ఆటగాళ్లు ఉండరు. ఎప్పుడో సచిన్ టెండూల్కర్ చిన్న వయసులో జాతీయ జట్టులోకి వచ్చాక ఇన్నేళ్లకు ఇప్పుడు మళ్లీ వైభవ్‌లాంటి కుర్రాడు వచ్చాడు. సహజంగానే 15 ఏళ్ల అబ్బాయికి సీనియర్లతో కలిసి ఉండటంలో సమస్యలు వస్తాయి. మిగతా ఆటగాళ్లంతా 18 ఏళ్లకు పైగా వయసు ఉన్నవారే. అలాంటి వాతావరణంలో అలవాటు పడేందుకు తల్లిదండ్రులు తోడుగా ఉండటం మేలు చేస్తుంది. స్కూల్ విద్యార్థులు విహారయాత్రకు వెళ్లినప్పుడు కూడా పెద్దవాళ్లు తోడుగా ఉంటారు. ఇదీ అలాంటిదే. వైభవ్ ఇంకా స్కూల్ కుర్రాడే. అతను రాబోయే కొన్నేళ్ల పాటు భారత క్రికెట్‌కు పెద్ద ఆస్తిలాంటివాడు’ అని సైకియా వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవల శ్రీలంకలో ‘ఎ’ మ్యాచ్ సందర్భంగా వైభవ్ ప్రత్యర్థి ఆటగాళ్లతో దూకుడుగా వ్యవహరించిన అంశంపై తాము ఎలాంటి చర్యలు తీసుకోమని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. ‘ఇదంతా ఆటలో భాగంగానే జరిగింది. ఇలాంటి అంశాల్లో మ్యాచ్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఏం చేయాలనేది వారిష్టం. బీసీసీఐకు దీంతో ఎలాంటి సంబంధం లేదు. మేం మ్యాచ్ రిఫరీ పాత్ర పోషించలేం కదా’ అని సైకియా స్పందించారు. -
'నెక్స్ట్ సచిన్, కోహ్లి' అంటూ భజన.. వారు ఏమయ్యారో తెలుసు కదా?
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. అయితే ఈసారి అతడి ప్రదర్శన గురుంచి కాకుండా ప్రవర్తన గురుంచి చర్చ నడుస్తోంది. శ్రీలంక పర్యటనలో ప్రత్యర్థి ఆటగాళ్ల స్లెడ్జింగ్‌కు ఈ యువ బ్యాటర్ తీవ్రంగా రియాక్ట్ అవ్వడమే ఇందుకు కారణం.అతడి ప్రవర్తనను కొందరు తప్పుబడుతుంటే, మరొకరు సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై బీసీసీఐకి కొన్ని విలువైన సూచనలు చేశారు. ఇప్పటివరకు విజయాలనే చూసిన వైభవ్.. కొన్ని సందర్భాల్లో వైఫల్యాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని అప్టన్ అభిప్రాయపడ్డారు.కాగా ప్యాడీ అప్టన్ సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా తన సేవలను అందించాడు. 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలవడంలోనూ, 2009లో టెస్ట్ క్రికెట్లో నంబర్ వన్ స్థానానికి చేరడంలోనూ ఆయనదే కీలక పాత్ర."వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే మైదానంలో చాలా సార్లు తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. క్లిష్ట సమయాల్లో కూడా రాణించేందుకు అవసరమైన మైండ్ సెట్ అతడికి ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏ ప్లేయర్ కూడా తన కెరీర్ అంతటా ఒకే విధమైన ఫామ్‌ను కొనసాగించలేడనే విషయాన్ని వైభవ్ గ్రహించాలి. అతడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ ఆ ఫామ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని ఆశించకూడదు. ఒకవేళ నేను కనుక ఇప్పుడు అతడితో ఉంటే.. తక్కువ స్కోర్లు రావడం, కొన్నిసార్లు విఫలం కావడం లేదా ఫలితాలు ఆశించినట్లుగా రాకపోవడం వంటివి సహజమని అర్థమయ్యేలా చెప్పేవాడిని. ఇంతకంటే భిన్నంగా ఏమి జరగదు. ప్రతీ ఆటగాడు ఏదో ఒక దశలో తన ఫామ్‌ను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ బ్యాడ్ ఫామ్ నుంచి ఎంత వేగంగా బయటపడతాడనేదే అతడి కెరీర్‌ను నిర్ణయిస్తుంది. బయట నుంచే వచ్చే ఒత్తిడి, అనవసరపు చర్చలను సమర్ధవంతంగా ఎదుర్కొవడం వైభవ్ ముందున్న అతిపెద్ద సవాల్.ప్రపంచంలోనే అత్యంత మానసిక దృఢత్వం కలిగిన, ఎంతో అనుభవం ఉన్న మేటి అథ్లెట్లు సైతం కొన్నిసార్లు బయటి , విమర్శలు , ఇతరుల అభిప్రాయల వల్ల తమ ఏకాగ్రతను కోల్పోయి కెరీర్ నాశనం చేసుకున్నారు.అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారుగత 5-6 ఏళ్లలో భారతదేశంలో రాత్రికి రాత్రే స్టార్స్‌గా ఎదిగిన ఎంతోమంది యువ సూపర్ స్టార్లను మనం చూశాం. ఐపీఎల్లో ఒక సీజన్ అద్భుతంగా ఆడగానే.. వారిని తర్వాతి సచిన్ టెండూల్కర్ అనో, తర్వాతి విరాట్ కోహ్లీ అనో లేదా తర్వాతి ఎంఎస్ ధోని అనో పిలవడం మొదలుపెట్టేస్తారు. కానీ వారిలో చాలా మంది అడ్రస్ లేకుండా అయిపోయారు. వారు కేవలం సాధారణ ఐపీఎల్ ఆటగాళ్ల స్థాయికే పరిమితమైపోయారు. దీనికి ప్రధాన కారణం.. వారు కూడా ఈ బయటి హడావుడిలో, విపరీతమైన అంచనాల వలయంలో చిక్కుకుపోవడమే. ఎవరైనా తప్పులు చేయడం సహజం. వైభవ్ కూడా తప్పు చేశాడనేది నిజమే. కానీ ఎలాంటి ఒత్తిడి, ఆందోళన కారణంగా అలా చేశాడో నేను ఊహించగలను. ఈ ఊహించని ఘటన నుంచి కోలుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి అతడికి ఎవరు గైడెన్స్ ఇస్తారన్నది చాలా ముఖ్యం. రాబోయో రోజుల్లో అతడు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనున్నాడు. ప్రత్యర్థి జట్లు మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. వీటిన్నంటిని అతడు తట్టుకోవడానికి సిద్దంగా ఉండాలి. ముఖ్యంగా ఫెయిలూర్స్‌ను కూడా అతడు స్వీకరించాలి. అంతే తప్ప సహనం కోల్పోకూడదు. ఈ 15 ఏళ్ల వండర్ కిడ్‌ను కేవలం టెక్నికల్‌గానే కాకుండా, మానసికంగా కూడా ఒక గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని" స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్యాడీ అప్టన్ పేర్కొన్నాడు. -
IPL 2027: బీసీసీఐ కీలక నిర్ణయం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2027 సీజన్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. క్యాష్ రిచ్ లీగ్ ఇరవయ్యవ ఎడిషన్.. గత సీజన్‌తో పోలిస్తే దాదాపు రెండు వారాల ముందే ఆరంభం అవుతుందని వెల్లడించింది.మరోసారి బెంగళూరుదే టైటిల్‌కాగా ఐపీఎల్-2026 మార్చి 28న మొదలై.. మై 31న ఫైనల్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో.. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. గుజరాత్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది.ముందుగానే ఐపీఎల్ఇక వచ్చే సీజన్ విండో గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. PTIతో మాట్లాడుతూ.. మార్చి 10 నుంచి మే 15 మధ్య టోర్నీ నిర్వహణ కోసం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపాడు. ‘‘ఈ ఏడాది ఐపీఎల్ 28 మార్చిలో మొదలై.. మే 31న ముగిసింది.కారణం ఇదేనిజానికి మే 15 తర్వాత చాలా చోట్ల వాతావరణం కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. కొన్నిచోట్ల ముందుగానే రుతుపవనాల రాకతో వర్షం పడింది. అందుకే వచ్చే ఏడాది నుంచి షెడ్యూల్ మార్చాలని అనుకుంటున్నాం.ఇందుకు సంబంధించి మా జనరల్ మేనేజర్‌కు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాను. మార్చి 10- మే 15 మధ్య టోర్నీ జరిగేలా షెడ్యూల్ వీలు అవుతుందో చూడమన్నాను. ప్లే ఆఫ్స్, ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారకుండా ముందుగానే చర్యలు తీసుకోవాల్సి ఉంది. వాతావరణ పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడడం కంటే షెడ్యూల్లో మార్పు చేస్తే బాగుంటుందనే యోచనలో ఉన్నాము’’ అని దేవజిత్ సైకియా తెలిపాడు. చదవండి: ముంబై ఇండియన్స్‌కి సూర్య గుడ్‌బై! -
వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్
-
వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్
శ్రీలంక-ఎ జట్టు ప్లేయర్‌తో గొడవపడిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్ తగిలింది. అతడి మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 50 శాతం కోత విధించింది. వైభవ్‌తో పాటు ఇండియా-ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మపై కూడా 30 శాతం జరిమానా పడింది. మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రగాష్ సిఫార్సుల మేరకు భారత క్రికెట్ బోర్డు ఈ కఠిన చర్యలు తీసుకుంది. లంక ఆటగాడు విషేన్ హలంబెజ్పై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకుంది. అతడి మ్యాచ్‌లో కూడా 50 శాతం కోత విధించారు.ఏమి జరిగిదింటే?ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జూన్ 15న దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు తలపడ్డాయి. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ 'సూపర్ ఓవర్'కు దారితీసింది. సూపర్ ఓవర్లో శ్రీలంక 'ఎ' జట్టు విజయం సాధించింది. 17 పరుగుల టార్గెట్‌ను భారత్ చేధించలేకపోయింది. అయితే సూపర్ ఓవర్ ముగిసిన అనంతరం శ్రీలంక యువ ఆటగాడు విషేన్ హలంబెజ్ శృతిమించి ప్రవర్తించాడు. ఓటమి బాధలో ఉన్న వైభవ్ సూర్యవంశీ దగ్గరకు వెళ్లి.. “ఇక లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్ళు.. ఇది ఐపీఎల్ కాదు” అని వ్యంగ్యంగా అన్నాడు. దీంతో సహనం కోల్పోయిన వైభవ్.. హలంబెజ్ వైపు దూసుకెళ్లి అతని ఛాతీపై బలంగా నెట్టాడు. లంక ఆటగాడు కూడా ప్రతిఘటించడంతో ఇద్దరి తీవ్ర వాగ్వదం మొదలైంది. తోటి ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. అంతకుముందు వెలుతురు సరిగ్గా లేకపోయినప్పటికి అంపైర్లు సూపర్ ఓవర్ నిర్ణయించడం పట్ల భారత కెప్టెన్ తిలక్ వర్మ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ నిర్వహణ, నో-బాల్ కాల్స్ వంటి విషయాల్లో అంపైర్లతో తిలక్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే తిలక్‌పై కూడా బోర్డు క్రమశిక్షణా చర్యలు చర్యలు తీసుకుంది.చదవండి: అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ -
బీసీసీఐ అనుమతి లేదు.. విజయ్ దేవరకొండకు నోటీసులు
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు పంపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతి లేకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) టీజీ20 లీగ్ నిర్వహిస్తోందని.. దీనినిప్రమోట్ చేయటం నేరమని ఆరోపించింది.బీసీసీఐ అనుమతి లేకుండా కార్పొరేట్ కంపెనీలతో HCA వ్యాపారం చేస్తోందని.. ఇది ఎంతమాత్రం సరికాదని టీసీఏ పేర్కొంది. లీగ్‌తో మమేకమైన సినీ హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేశ్‌లతో పాటు.. క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్‌లకు టీసీఏ లీగల్ నోటీసులు పంపింది.స్థానిక టీ20 లీగ్ నిర్వహణకు 45 రోజుల ముందు అనుమతి తీసుకోవాలి.. కానీ బీసీసీఐ అనుమతి లేకుండా డబ్బులు వాసులు చేసి HCA లీగ్ నిర్వహిస్తోందని టీసీఏ ఆరోపణలు చేసింది.టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘TG20 ఒక మోసపూరిత లీగ్. TG20 లీగ్‌ను నిర్వహించడానికి HCA వద్ద BCCI అనుమతులు లేవు. లీగ్ అనుమతులు చూపించమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు నేను సవాలు విసురుతున్నాను. 'తెలంగాణ' అనే పదాన్ని ఉపయోగించే హక్కు HCAకు లేదు. తెలంగాణ క్రికెట్ వ్యవహారాలను చూసుకోవడానికి 'తెలంగాణ క్రికెట్ అసోసియేషన్' ఉంది’’ అని పేర్కొన్నారు. -
వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ
గత కొన్నాళ్లుగా తన ఆట తీరుతో హాట్‌టాపిక్‌గా మారిన భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. భారత్- ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక పర్యటనలో ఉన్న ఈ పిల్లాడు.. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్నాడు.సూపర్ ఓవర్లో లంక విజయంఇందులో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక భారత్- ‘ఎ’ జట్టుపై సూపర్ ఓవర్లో విజయం సాధించింది.నువ్వు ఇక ఇంటికి వెళ్లుఈ క్రమంలో లంక ప్లేయర్ విశేన్ హలంబగే.. భారత ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్ అయిపోయింది. నువ్వు ఇక ఇంటికి వెళ్లు’’ అని రెచ్చగొట్టినట్లు తెలిసింది. దీంతో సహనం కోల్పోయిన వైభవ్.. అతడిపైకి దూసుకెళ్లాడు. విశేన్‌ను వెనక్కి నెట్టేయగా.. అతడూ వైభవ్‌ను తోసేశాడు.ఇంతలో లంక సీనియర్ ప్లేయర్ డిక్విల్లా ఇద్దరినీ విడదీసి.. వైభవ్‌ను అక్కడి నుంచి పంపించాడు. అయితే, వైభవ్ వెళ్తూ వెళ్తూ వేలు చూపించి బెదిరించినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇది అనధికారిక మ్యాచ్ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.స్పందించిన బీసీసీఐఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా వైభవ్ సూర్యవంశీ వివాదం గురించి స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా- ‘ఎ’ జట్టు కీలక టోర్నమెంట్ ఆడుతోంది. వర్దమాన క్రికెటర్లు టీమిండియాలోకి వచ్చేందుకు ఇదొక మంచి అవకాశం.ముక్కోణపు వన్డే సిరీస్ రూపంలో వారికి తమను తాము నిరూపించుకునే అవకాశం దొరికింది. కాబట్టి వాళ్లంతా కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరత్రా విషయాలను పట్టించుకోకూడదు. అలా చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది.ఆటపైనే దృష్టి పెట్టండిఅక్కడికి ఎందుకు వెళ్లారో ఆ విషయంపై మాత్రమే దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈ ట్రై సిరీస్‌లో ఇండియా విజేతగా నిలవగలదు. మా దృష్టి మొత్తం విజయం మీదే కేంద్రీకృతమై ఉంది. ఆటగాళ్లు అందుకు అనుగుణంగా నడుచుకోవాలి’’ అని దేవజిత్ సైకియా పరోక్షంగా భారత క్రికెటర్లను హెచ్చరించాడు.కాగా ఈ మ్యాచ్ సందర్భంగా సూపర్ ఓవర్ విషయంలో కెప్టెన్ తిలక్ వర్మ సైతం అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లంక, భారత్‌తో పాటు అఫ్గనిస్తాన్ కూడా ఈ ట్రై సిరీస్‌లో భాగమైంది. భారత్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు ఓడిపోయింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. -
గుజరాత్ టైటాన్స్ ప్లేయర్‌కు జాక్‌పాట్.. టీమిండియాకు ఎంపిక!
ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏతో మ్యాచ్‌లో ఓటమితో ఫైనల్ అవకాశాలను ఇండియా-ఏ క్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓటమి బాధలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు గుడ్‌న్యూస్ అందింది. గాయపడిన యద్వీర్ సింగ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు అశోక్ శర్మను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో అశోక్ శర్మ తక్షణమే శ్రీలంకకు బయల్దేరనున్నాడు. బుధవారం అప్గానిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో అశోక్ శర్మ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అశోక్ శర్మ గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం విశేషం. ఆరు వికెట్లే తీసినప్పటికీ అతడి స్పీడ్ బౌలింగ్ ఇవాళ ఇండియా-ఏ జట్టులోకి పిలుపు వచ్చేలా చేసింది. ఇక యద్వీర్ సింగ్ భుజం గాయంతో ఇండియా-ఏ ఆడిన మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ వేయడంలో ఇబ్బంది పడిన యద్వీర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో అతడి స్థానంలో అశోక్ శర్మను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. గాయంతో బాధపడుతున్న యద్వీర్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు రావాలని బీసీసీఐ అతడిని ఆదేశించింది.బుధవారం అఫ్గానిస్తాన్ జట్టుతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాచ్‌లో గెలవడమే కాదు భారీ రన్‌రేట్ సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా-ఏ జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. అదే సమయంలో అఫ్గానిస్తాన్ జట్టు లంకతో జరిగే తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం సమీకరణాలు మారిపోనున్నాయి. ఎందుకంటే ఆఫ్గన్‌పై ఇండియా గెలిచి, శ్రీలంకపై ఆఫ్గన్ గెలిస్తే.. ఇరుజట్లు నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఉంటాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకం కానుంది. చదవండి: కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్! -
లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై నిషేధం తప్పదా!
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సోమవారం శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో భారత్ ఓటమి చవిచూసింది. అయితే ఈ ఓటమి కంటే వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ హైలైట్‌గా నిలిచింది. లంక ఆటగాళ్ల తప్పు అటుంచితే, వైభవ్ చేసిన తప్పులకు అతడికి శిక్ష తప్పేలా లేదు. మరి ఈ గొడవతో వైభవ్ సూర్యవంశీపై నిషేధం పడనుందా అనేది ఒకసారి తెలుసుకుందాం. నిజానికి ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక ఆటగాడు ఇలా గొడవ పడితే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అది భారీ జరిమానా నుంచి నిషేధం వరకు ఉంటుంది. అయితే వైభవ్, లంక ఆటగాదళ్ల మధ్య జరిగిన గొడవ అనధికారిక మ్యాచ్ కిందకు రావడంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం తక్కువగానే ఉంటుంది. కేవలం మ్యాచ్ రిఫరీ నుంచి జరిమానా ఎదుర్కొనేందుకు ఆస్కారముంది. అంతేకాదు బీసీసీఐ కూడా వైభవ్ సూర్యవంశీని మందలించడం లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.అసలేం జరిగింది?మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు స్వల్ప గొడవ జరిగింది. వైభవ్, సూర్యాంశ్లను ఉద్దేశించి లంక ఆటగాళ్లు ఏదో అనడంతో క్రికెటర్లు ఒకరిపై మరొకరు దూసుకొచ్చారు. సూర్యాంశ్ వైపు వెళుతున్న విశేన్ హలంబాగేను వైభవ్ అడ్డుకోగా... అతడిని కూడా లంక ఆటగాడు తోసేశాడు. సీనియర్ ఆటగాడు డిక్వెలా జోక్యం చేసుకొని ఇద్దరినీ విడిపించాల్సి వచ్చింది. తిరిగి వెళుతూ కూడా 15 ఏళ్ల వైభవ్ మీ సంగతి చూస్తా అన్నట్లుగా హెచ్చరిస్తూ సైగలు చేయడం కనిపించింది. జాతీయ జట్టులో చోటుఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్‌ను ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన టీమిండియా జట్టుకు ఎంపిక చేసింది. తాజా ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రంకు ముందే వైభవ్ సూర్యవంశీ నిషేధం ఎదుర్కోనున్నాడా అనేది చూడాలి. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌లోనూ వైభవ్ సూర్యవంశీ రాణించడంలో విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 69 పరుగులు మాత్రమే చేసిన వైభవ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. టీ20, వన్డే ఫార్మాట్లలో ఒకేలా ఆడుతానంటే కుదరదు.. కొంచెం ఓపిక వహించాల్సిన అవసరముందంటూ అభిమానులు పేర్కొంటున్నారు.Another heated moment between Vaibhav Sooryvanshi and Sri Lankan players. 🥶 https://t.co/iwmOQfMZwv pic.twitter.com/cUINMCFuJ5— Qamar. (@Qamar5618) June 15, 2026A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026 -
అతడిని విస్మరించొద్దు.. సెలెక్టర్లకు మాజీ క్రికెటర్ హెచ్చరిక!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టు క్రికెట్లో వేగంగా ఆడుతాడనే పేరుంది. కానీ వన్డే, టీ20 క్రికెట్లో మాత్రం పంత్ ఆట పూర్తి విరుద్ధంగా ఉంటుంది. వేగంగా ఆడాల్సిన వన్డే, టీ20 క్రికెట్లో సరిగ్గా ఆడకపోవడం.. ఆచితూచి ఆడాల్సిన టెస్టు క్రికెట్లో వేగాన్ని చూపించడం పంత్ నైజం. అయితే ఇటీవలే పేలవ ఫామ్ కారణంగా వన్డే, టీ20 క్రికెట్లో చోటు కోల్పోయిన పంత్ టెస్టు జట్టులో మాత్రం స్థానం నిలుపుకున్నాడు. అయితే పరిమిత ఓవర్ల ఆటలో పంత్ ఆట ఇక ముగిసినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలకవ్యాఖ్యలు చేశాడు. జియో హాట్‌స్టార్ ఇంటర్వ్యూలో పఠాన్ మాట్లాడాడు. పంత్‌ను వైట్‌బాల్ జట్టు నుంచి తొలగించినప్పటికీ 2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో అతడిని పూర్తిగా విస్మరించివద్దని సెలెక్షన్ కమిటీని కోరాడు. 'వన్డే క్రికెట్ నుంచి తప్పించారనే నిరాశ వాదాన్ని వదిలేసి మళ్లీ ట్రాక్ ఎక్కితే పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాలో చోటు దక్కించుకోవడం పంత్‌కు పెద్ద కష్టమేమి కాదు. ఈ విషయంలో పంత్ తన సహచర క్రికెటర్లను ఆదర్శంగా తీసుకోవాలి. వన్డేల్లో వికెట్ కీపర్ ఇప్పుడు కేఎల్ రాహుల్ తొలి ఛాయిస్. ఓపెనర్‌గా, అవసరమైతే ఐదు లేదా ఆరో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడు. అతడికి బ్యాకప్‌గా ఇషాన్ కిషన్ ను తీసుకొచ్చారు. ఇషాన్ కూడా టాపార్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. షార్ట్‌పిచ్ బంతులను కూడా చక్కగా ఆడగలడు. బీసీసీఐకి మూడో ఆప్షన్ సంజు శాంసన్. అతడికి ఎప్పుడు అవకాశం వచ్చినా వన్డేల్లో సత్తా చాటడంలో ముందుంటాడు. గత టీ20 ప్రపంచకప్‌లోనూ శాంసన్ పలు కీలక ఇన్నింగ్స్ లు ఆడటం చూశాం. పంత్ విషయంలో మాత్రం సెలక్టర్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 2027 వన్డే ప్రపంచ కప్ సెలక్షన్స్‌లో పూర్తిగా అతడిని పక్కన పెట్టొద్దు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి ఫామ్ గొప్పగా లేదని తెలుసు. గతంలో ఇషాన్ కిషన్ కూడా జట్టులో నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత రాణించి మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. సారథిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని జార్ఖండ్‌కు అందించాడు. అందుకే అతడిని పంత్ స్ఫూర్తిగా తీసుకోవాలి. వైట్‌బాల్ క్రికెట్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వాలి.' అని ఇర్ఫాన్ తెలిపాడు. పంత్ చివరిసారిగా 2024లో వన్డే మ్యాచ్ ఆడాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా జట్టులో ఉన్నప్పటికీ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ పంత్ కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలమయ్యాడు. లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున 14 మ్యాచ్‌లాడిన పంత్ 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్‌గా జట్టును నడిపించడంలో విఫలమైన పంత్ పాయింట్ల పట్టికలో లక్నోను ఆఖరి స్థానంలో నిలిపాడు. దీంతో లక్నో యాజమాన్యం పంత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఐపీఎల్లో చెత్త ప్రదర్శన చేసినప్పటికీ ఇటీవలే ఆఫ్గన్‌తో జరిగిన టెస్టులో మాత్రం పంత్ ఆకట్టుకున్నాడు. 121 బంతులాడిన పంత్ 81 పరుగులు సాధించాడు. ఇక సౌతాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌కు రోహిత్, కోహ్లీలను నేరుగా ఎంపిక చేస్తారనే ఊహాగానాలను పఠాన్ తోసిపుచ్చాడు.చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. కోహ్లీ విషయంలో కీలక ప్రకటన!
అప్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు గాయంతో దూరమైన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విషయంలో ఒక కీలక అప్డేట్ వచ్చింది. కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లీ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూలైలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ లెక్కన అభిమానులకు కోహ్లీ విషయంలో ఇది గుడ్‌న్యూస్.జూలై 14 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఐపీఎల్ 2026 సీజన్ సమయంలోనే కోహ్లీ కండరాల గాయంతో సతమతమయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో చివరిదాకా బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ కండరాల గాయం తీవ్రత పెరిగిపోయింది. దీంతో ఫైనల్ పూర్తయిన మరుసటి రోజే కోహ్లీ తన కాలిని స్కాన్ చేయించుకున్నాడు. రిపోర్ట్‌లో కోహ్లి కాలిలో ఉండే డిస్టల్ సెమిమెంబ్రానోనస్ టెండన్ టియర్‌లో చీలిక వచ్చినట్లు తేలింది. డిస్టల్ సెమిమెంబ్రానోనస్ అనేది మోకాలి వెనుక భాగంలో ఉంటుంది. దీనిలో చీలిక వస్తే అది కాలి కండరాలను తీవ్రంగా బాధిస్తోంది. ఇది అత్యంత అరుదుగా జరుగుతుందని, కోలుకోవడానికి ఒక్కోసారి ఆరు నెలలు సమయం పడుతుందని వైద్యబృందం తెలిపింది. కానీ కోహ్లీ విషయంలో అద్భుతం జరిగిందని, అతడి అసామాన్యమైన ఫిట్నెస్ కారణంగా నాలుగు వారాల్లోనే పూర్తిగా కోలుకుంటాడని పేర్కొన్నారు. దీంతో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉంటాడనే వార్తలు వస్తున్న వేళ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్లో ఇప్పటికే చాలా రికార్డులు తన పేరిట లిఖించుకున్న కోహ్లీ సచిన్ వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకుంటాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. 37 ఏళ్ల కోహ్లీ కెరీర్లో ఇప్పటివరకు 85 అంతర్జాతీయ సెంచరీలున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ కోహ్లీకి ఆఖరి టోర్నీ అని ప్రచారం జరుగుతున్న వేళ టీమిండియా ఆ టోర్నీ వచ్చేలోగా స్వదేశం, విదేశం కలిపి సుమారు 28 నుంచి 30 వన్డేల వరకు ఆడే అవకాశముంది. ఇందులోనే ఆసియా కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఉన్నాయి. ఈ లెక్కన సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీకి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు.చదవండి: భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్! యార్కర్ల కింగ్ అరంగేట్రం? -
భారత అండర్–19 జట్టులో యశ్వీర్ గౌడ్
న్యూఢిల్లీ: శ్రీలంకలో వచ్చే నెలలో పర్యటించే భారత అండర్–19 పురుషుల క్రికెట్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్ ఊట్కూరు యశ్వీర్ గౌడ్ ఎంపికయ్యాడు. యశ్వీర్ గౌడ్ తల్లిదండ్రులు ఊట్కూరు రాజ్‌కుమార్ గౌడ్, వాణి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యశ్వీర్ ఎనిమిదేళ్ల ప్రాయంలో బంతి పట్టాడు.విద్యానగర్‌లోని డేనియల్ క్రికెట్ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్న యశ్వీర్ ప్రస్తుతం కోచ్ కృష్ణమోహన్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. గత ఏడాది హైదరాబాద్ జట్టు తొలిసారి వినూ మన్కడ్ బీసీసీఐ అండర్–19 ట్రోఫీ టైటిల్ నెగ్గడంలో యశ్వీర్ కీలకపాత్ర పోషించాడు. యశ్వీర్ ఈ టోర్నీలో 15 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల తెలంగాణ టి20 లీగ్‌లో హైదరాబాద్ ఫ్రాంచైజీ యశ్వీర్ను రూ. 3 లక్షలకు సొంతం చేసుకుంది. మరోవైపు భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ కూడా శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టులోకి ఎంపికయ్యాడు. మరోవైపు స్వదేశంలో శ్రీలంక అండర్–19 మహిళల జట్టుతో జరిగే వన్డే, టి20 సిరీస్‌లో పాల్గొనే భారత అండర్–19 జట్టులో ఆంధ్ర వికెట్ కీపర్ కె.దీక్ష చోటు దక్కించుకుంది. 15 మంది సభ్యులతో కూడిన భారత వన్డే, టి20 జట్లకు భవిక అహిరె కెప్టెన్‌గా వ్యవహరించనుంది. -
భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు
శ్రీలంక పర్యటనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అండర్-19 జట్టును ప్రకటించింది. యశ్వర్దన్ సింగ్ చౌహాన్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. కాగా ఈ పర్యటనలో భాగంగా భారత అండర్-19 జట్టు ఆతిథ్య లంకతో వన్డే, ఫోర్-డే మ్యాచ్‌లు ఆడనుంది.ఇక ఈ జట్టులో టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid)కు కూడా చోటు దక్కింది. వన్డే జట్టులోని ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా పదహారేళ్ల అన్వయ్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.కొత్త జట్టుబీసీసీఐ జూనియర్ క్రికెట్ కమిటీ పంథా మార్చింది. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఒక్క ఆటగాడిని కూడా తాజా టూర్‌కు ఎంపిక చేయలేదు. ఈ పర్యటనతో యశ్వర్దన్ సారథ్యంలో కొత్త జట్టును తీర్చిదిద్దే దిశగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ జట్టులో ఆల్‌రౌండర్లకే సెలక్టర్లు పెద్దపీట వేశారు.మరోసారి అన్వయ్‌కు చోటుగతేడాది నవంబరులో చివరగా అన్వయ్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో ఆడిన భారత్- ‘బి’ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.బెంగళూరు వేదికగా ఈ సిరీస్‌లో ఏకైక మ్యాచ్ ఆడిన అన్వయ్.. అఫ్గన్ బౌలర్ నజీఫుల్లా అమిరి బౌలింగ్‌లో తొలి బంతికే అవుటై వెనుదిరిగాడు. అయితే, దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సెలక్టర్లు తాజాగా మరోసారి అవకాశం ఇచ్చారు.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్ అండర్-19 వన్డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్ కెప్టెన్), యశ్వర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), వినీత్ వీకే, అర్జున్ రాజ్‌పుత్, కుషాగ్రా ఓజా, రజత్ బఘెల్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), అన్మోల్జీత్ సింగ్, వూట్కూరి యశ్వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, శవిన్ వి, కావ్యా పరేశ్ పటేల్, మోహిత్ ఉల్వా. ఇషాన్ సూద్.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్ అండర్-19 మల్టీ-డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్ కెప్టెన్), యశ్వర్దన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), పటేల్ కుష్, మనల్ చౌహాన్, కుషాగ్రా ఓజా, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), ఆర్యన్ సందేశ్ సక్పాల్ (వికెట్ కీపర్), హేమ్చుదేశన్ జె, బికె కిషోర్, రోహిత్ అనిల్ యాదవ్, కావ్య పరేష్ సింగ్ పటేల్, ప్రియాన్షు సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట.భారత్ అండర్-19 వర్సెస్ శ్రీలంక అండర్-19 షెడ్యూల్ (మూడు వన్డేలు, రెండు యూత్ టెస్టులు)👉హంబన్‌టోటా వేదికగా మూడు వన్డేలు👉జూలై 4, జూలై 6, జూలై 9 తేదీల్లో వన్డేల నిర్వహణ👉గాలే వేదికగా జూలై 13-16 మధ్య మొదటి యూత్ టెస్టు👉కొలంబో వేదికగా జూలై 20-23 మధ్య రెండో యూత్ టెస్టు.చదవండి: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు -
కెప్టెన్ గా శ్రేయస్... ఆనందంతో అయ్యర్ తండ్రి డాన్స్ వైరల్ అవుతున్న వీడియో
-
వాళ్లకే దిక్కులేదు!.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు?
టీమిండియా సెలక్టర్ల తీరుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు.. ఆసియా క్రీడలు-2026 టోర్నీకి ప్రకటించిన టీ20 జట్టులో అర్హులకు చోటు దక్కలేదని మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లు కేవలం హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వల్లే జట్టులో ఉన్నారని పెదవి విరుస్తున్నారు.ఇంతకంటే ఇంకేం చేయాలి?గత రెండేళ్లుగా ఐపీఎల్లో సత్తా చాటుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి వరుసగా రెండుసార్లు టైటిల్ అందించిన రజత్ పాటిదార్ (Rajat Patidar)ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. భారత టీ20 జట్టులో పాటిదార్‌కు చోటిచ్చేందుకు ఆస్కారం లేదని పేర్కొన్నాడు. ఇప్పటికే టీ20 ప్రపంచకప్-2026 గెలిచిన జట్టు నుంచి చాలా మందిని తప్పించారని.. పాటిదార్ కోసం ఈ సంఖ్యను మరింత పెంచలేరని పేర్కొన్నాడు.ఆవేదన అర్థం చేసుకోగలను!.. కానీఈ మేరకు.. ‘‘భారత టీ20 జట్టులో రజత్ పాటిదార్ ఎందుకు లేడు? అతడు కచ్చితంగా జట్టులో ఉండాలి కదా!.. ఇంతకంటే గొప్పగా ఏ ఆటగాడైనా ఏం చేయగలడు?.. చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు.భజ్జీ (హర్భజన్ సింగ్) కూడా ఇలాగే ట్వీట్ చేశాడు. భజ్జీతో నేనూ ఏకీభవిస్తాను. అందరి మనసుల్లోనూ ఇదే భావన ఉంది. అర్హుడైనా అతడికి స్థానం దక్కలేదన్న ఆవేదనను నేనూ అర్థం చేసుకోగలను.అయితే, ఇక్కడ భావోద్వేగాల కంటే కూర్పుకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రజత్ పాటిదార్‌కు చోటివ్వాలంటే ఎవరో ఒకరిని తీసేయాల్సి ఉంటుంది. మరి అతడి కోసం ఎవరిని బలి చేయాలంటారు?వాళ్లకే దిక్కులేదు.. అతడికి చోటు ఎలా?ప్రపంచకప్ గెలిచిన జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పైనే వేటు వేశారు. అతడితో పాటు రింకూ సింగ్‌నూ తప్పించారు. వీరిద్దరి స్థానంలో కొత్త సారథిగా శ్రేయస్ అయ్యర్, ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వచ్చారు.ఇంతకంటే ఇంకెన్ని మార్పులు చేయాలి? ప్రపంచకప్ గెలిచిన జట్టు నుంచి ఇంకెంత మంది సభ్యులను నిర్దాక్షిణ్యంగా తప్పించాలి?’’ అని ఆకాశ్ చోప్రా విమర్శకులను ప్రశ్నించాడు.సారథిగా సరైనోడుఏదేమైనా శ్రేయస్ అయ్యర్ సారథిగా సరైనోడని.. అందుకే మూడేళ్ల తర్వాత ఏకంగా కెప్టెన్‌గా టీ20 జట్టులో పునరాగమనం చేశాడని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్ గెలిచిన 35 ఏళ్ల సూర్యతో పాటు రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్‌లపై సెలక్టర్లు వేటు వేశారు.మరోవైపు.. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. అయితే, బుమ్రాను ఆసియా క్రీడల జట్టుకు మాత్రం ఎంపిక చేశారు. కొత్తగా శ్రేయస్ అయ్యర్‌తో పాటు యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రాగా.. రవి బిష్ణోయి, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్‌లకు కూడా చోటు దక్కింది.చదవండి: ‘అతడు పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో చోటు దండగ’ -
సెలెక్షన్ కమిటీపై భువనేశ్వర్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా వెటరన్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ తనను జాతీయ జట్టకు ఎంపిక చేయకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను ఎంపిక చేయాలని ఎవరిని అడుక్కోనని, టాలెంట్‌ను గుర్తించి జట్టులోకి ఎంపిక చేస్తే ఆడుతానంటూ భువీ కుండబద్దలు కొట్టాడు. టీమిండియాకు చాలాకాలం క్రితమే దూరమైన 36 ఏళ్ల భువనేశ్వర్ ఇటీవలే ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆర్సీబీ తరఫున ఆడిన భువనేశ్వర్ 28 వికెట్లతో అదరగొట్టాడు. తద్వారా ఆర్సీబీ వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో భువనేశ్వర్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఇటీవలే ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆసియా గేమ్స్‌కు సంబంధించి టీమిండియా జట్లను ప్రకటించిన బీసీసీఐ భువనేశ్వర్‌కు మరోసారి మొండిచేయి చూపించింది. అయితే రెస్ట్ పేరుతో సిరాజ్‌ను ఈ టోర్నీల నుంచి తప్పించడంతో భువీ పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. కానీ అనూహ్యంగా సిరాజ్ స్థానంలో ప్రసిధ్ క్రిష్ణను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో భువనేశ్వర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే బుధవారం భువనేశ్వర్ కుమార్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. 'నేను టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. కానీ నా మనసులో ఉన్న మాటలను బయటపెట్టకపోవడం నా నైజం. ప్రతీ ఒక్కరు తమ పని తాము చేస్తున్నట్లే నా పని నేను చేస్తున్నా. బీసీసీఐ సెలెక్టర్లు కూడా వారి పని చేస్తున్నారు. ఎంపిక చేయడం, చేయకపోవడం వారి బాధ్యత. నేను సరిపోతానని భావిస్తే, వాళ్లే ఎంపిక చేస్తారు. నన్ను ఎంపిక చేయమని ఎవరిని అడగను. టీమిండియా తరఫున ఆడాలనే కోరిక ఇప్పటికీ నాలో బలంగా ఉంది. నేను మెరుగైన ప్రదర్శన చేస్తున్నా. టీమిండియా తరఫున ఆడడాన్ని ఇప్పటికీ ఒక అదృష్టంగానే భావిస్తాను.' అని ముగించాడు.టీమిండియాకు ఎంతోకాలం ఫ్రంట్‌లైన్ బౌలర్‌గా సేవలందించిన భువనేశ్వర్ 2022లో టీమిండియా తరఫున చివరిసారి ఆడాడు. నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ భువీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు పరిమితమైన తర్వాత సీనియర్లను పక్కనబెట్టి, యువ బౌలర్లకు అవకాశం ఇచ్చేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపింది. దీంతో భువనేశ్వర్ కుమార్ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో 2018లోనే భువీ టెస్టు కెరీర్ ముగిసిపోయింది. మరి ఈ లెక్కన భువనేశ్వర్ మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడా అంటే చెప్పడం కష్టమే. 36 ఏళ్ల వయసులోనే తన బౌలింగ్‌లో పదును తగ్గని భువనేశ్వర్‌ను ఆడించాలనుకుంటే మాత్రం ఇదే మంచి అవకాశం. ఎందుకంటే 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టులో చాలా మార్పులు జరగనున్నాయి. రోహిత్, కోహ్లీ, జడేజా వంటి క్రికెటర్లు వీడ్కోలు పలికే అవకాశముంది. ఇప్పటికే ఐపీఎల్ పుణ్యమా అని ప్రిన్స్‌యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా వంటి బౌలర్లు రేపటి భారత బౌలింగ్ భవిష్యత్తుకు ఆశాకిరణంలా కనిపిస్తున్నారు.చదవండి: స్టోక్స్‌పై పిడిగుద్దుల వర్షం.. ఎవరీ రగ్బీ ప్లేయర్? -
పాక్ జట్టు ప్రకటన.. బీసీసీఐ అలా.. పీసీబీ ఇలా!
ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. సల్మాన్ ఆఘాను తప్పించి అతడి స్థానంలో సాహిబ్జాదా ఫర్హాన్‌కు సారథిగా పగ్గాలు అప్పగించింది.స్టార్లు లేకుండానే...ఆసియా క్రీడల్లో పాల్గొనే పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజం, షాహిన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్ తదితరుల పేర్లు కనిపించలేదు. సల్మాన్ సహా వీరందరికీ విశ్రాంతినివ్వాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.కొత్త ముఖాలకు చోటుఈ క్రమంలోనే పాక్ ఫర్హాన్ కెప్టెన్సీలో ద్వితీయ శ్రేణి జట్టును ఆసియా క్రీడలకు పంపనుంది. ఈ ఈవెంట్లో ఫర్హాన్‌కు డిప్యూటీగా అబ్దుల్ సమద్ వ్యవహరించనున్నాడు. ఇక ఇంతవరకు అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేయని ఆకిఫ్ జావేద్, అలీ రెజా, మాజ్ సదాకత్, సాద్ మసూద్‌లకు కూడా సెలక్టర్లు ఆసియా క్రీడల జట్టులో చోటిచ్చారు.పీసీబీ ఇలా.. బీసీసీఐ అలామరోవైపు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం ఆసియా క్రీడలకు పూర్తిస్థాయి జట్టును పంపేందుకు సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన జట్టును ఇటీవలే ప్రకటించింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ఈ జట్టుకు ఎంపిక చేసింది.ముఖాముఖి పోరు ఉంటుందా?కాగా లీగ్ దశలో భారత్- పాకిస్తాన్ తలపడే పరిస్థితి లేకపోవచ్చు. అయితే, సెమీస్ లేదంటే ఫైనల్లో దాయాదులు ముఖాముఖి ఎదురుపడే అవకాశం ఉంది. ఇటీవల ఆసియా కప్-2026, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీల్లో భారత్ చేతిలో పాక్ మరోసారి భంగపడ్డ సంగతి తెలిసిందే.ఆసియా కప్‌లో ఫైనల్ చేరినప్పటికీ.. వరల్డ్‌కప్ టోర్నీలో కనీసం సెమీస్ కూడా చేరకుండానే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడల్లో పూర్తిస్థాయి జట్టును కాకుండా ద్వితీయ శ్రేణి జట్టును పీసీబీ రంగంలోకి దించడం విశేషం.తొలిసారి సారథిగాఇదిలా ఉంటే.. 30 ఏళ్ల సాహిబ్జాదా ఫర్హాన్ ఇప్పటి వరకు పాకిస్తాన్ తరఫున 46 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. రెండు శతకాలు, పది అర్ధ శతకాల సాయంతో 1305 పరుగులు సాధించాడు. ఆసియా క్రీడల సందర్భంగా తొలిసారిగా పాక్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.కాగా సెప్టెంబరు 19- అక్టోబరు 4 వరకు జపాన్ వేదికగా ఆసియా క్రీడలు- 2026 జరుగనున్నాయి. ఇక క్రికెట్ పోటీలను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. కాగా 2023లో బీసీసీఐ తొలిసారిగా పురుష, మహిళా జట్లను ఆసియా క్రీడలకు పంపగా.. రుతురాజ్ గైక్వాడ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌ల సారథ్యంలో భారత్ రెండు విభాగాల్లోనూ పసిడి పతకాలు సాధించింది.ఆసియా క్రీడలకు పాక్ జట్టుసాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), అబ్దుల్ సమద్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, అకీఫ్ జావేద్, అలీ రజా, అరాఫత్ మిన్హాస్, హైదర్ అలీ, హసన్ నవాజ్, మాజ్ సదాకత్, సల్మాన్ మీర్జా, సాద్ మసూద్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), సుఫీయాన్ ముకీమ్.చదవండి: ‘అతడు పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో దండగ’ -
'అతడు పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ'
హైదరాబాదీ, తెలుగు తేజం తిలక్ వర్మ భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ స్ధానంలో ఆ బాధ్యతలను తిలక్‌కు బీసీసీఐ అప్పగించింది. ఇకపై టీ20ల్లో శ్రేయస్ అయ్యర్‌కు డిప్యూటీగా అతడు వ్యవహరించున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఏషియన్ గేమ్స్‌కు జట్టు ఎంపిక సందర్బంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించడాన్ని భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టాడు. అదేవిధంగా ఐపీఎల్-2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను ఎందుకు జట్టులో తీసుకోలేదని అతడు సెలక్టర్లపై విమర్శలు గుప్పించాడు."తిలక్ వర్మకు కెప్టెన్‌గా అసలు అనుభవమే లేదు. అదేవిధంగా అతడు ఫామ్‌లో కూడా లేడు. అతడికి భారీ షాట్లు ఆడే సత్తా సైతం లేదు. పాటిదార్ లాగా బౌలర్లను టార్గెట్ చేయలేడు. గత రెండు మూడు ఐపీఎల్ సీజన్ల నుంచి తిలక్ వర్మ ఆశించినంత మేర రాణించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లోనూ నిరాశపరిచాడు.అయినప్పటికి వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. మరోవైపు భారత టీ20 జట్టులో వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కే అర్హత లేదు. అతడు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున బౌలింగ్ కూడా చేయలేదు. కేవలం మిడిలార్డర్ బ్యాటర్‌గా ఆడాడు. టీమిండియాలో కూడా అతడు రెగ్యులర్‌గా బౌలింగ్ చేయడం లేదు. అలాంటప్పుడు అతడిని ఒక ఆల్‌రౌండర్‌గా ఎలా జట్టులోకి తీసుకున్నారో సెలక్టర్లకే తెలియాలి. అతడి స్ధానంలో పాటిదార్‌ను ఎంపిక చేయాల్సిందని" శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: అతడి కంటే భువీ ఎంతో బెటర్.. సెలక్టర్లు తప్పు చేశారు!? -
అతడి కంటే భువీ ఎంతో బెటర్.. సెలక్టర్లు తప్పు చేశారు!?
ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్ల కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో కీలక మార్పు చోటు చేసింది. ఈ టీ20 సిరీస్‌ల నుంచి స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 'వర్క్‌లోడ్ మేనేజ్మెంట్'లో భాగంగా సిరాజ్‌కు విశ్రాంతినిచ్చినట్లు బోర్డు తెలిపింది. అతడి స్ధానంలో కర్ణాటక పేసర్ ప్రసిద్ద్ కృష్ణను జట్టులో తీసుకున్నారు. అయితే సిరాజ్ స్ధానాన్ని ప్రసిద్ద్ కృష్ణతో భర్తీ చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.అతడికి బదులుగా వెటరన్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయాల్సిందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రసిద్ద్‌తో పోలిస్తే భువీ ఎంతో బెటర్ అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. భువనేశ్వర్ నవంబర్ 2022 నుంచి భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ, డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు.ఇటీవల ముగిసిన ఐపీఎల్ 19వ సీజన్లో అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 16 మ్యాచ్‌లలో 28 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ టీ20ల్లో కూడా ఈ యూపీ ఫాస్ట్ బౌలర్‌కు మంచి రికార్డు ఉంది. 87 మ్యాచ్‌లు ఆడి 6.96 ఎకానమీ రేట్‌తో 90 వికెట్లు పడగొట్టాడు. 36 ఏళ్ల భువీ ఇప్పటికి కొత్త బంతితో అద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడు. ఈ ఆర్సీబీ పేసర్ ప్రస్తుతం యువ క్రికెటర్ల కంటే ఫిట్‌గా కనిపిస్తున్నాడు. దీంతో అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయినప్పటికి సెలక్టర్లు మాత్రం అతడి పేరును పరిగణలోకి తీసుకోవడం లేదు.ప్రసిద్ద్ కృష్ణ విషయానికి వస్తే.. టెస్ట్, వన్డేల్లో టీమిండియా తరపున కాస్త ఫర్వాలేదనిపించినప్పటికి, టీ20ల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి కేవలం 8 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-2026 సీజన్లోనూ ఆశించినంత మేర రాణించలేకపోయాడు.ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ , శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ సింగ్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.చదవండి: ‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’ -
BCCI: సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లే భారత టీ20 జట్టు నుంచి స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను తప్పించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోకాగా టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఫామ్‌లేమితో బాధపడుతున్న సూర్యను తప్పించి.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. దాదాపు మూడేళ్ల తర్వాత అతడిని జట్టును ఎంపిక చేయడమే కాకుండా.. కెప్టెన్‌గా నియమించింది.ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా జూన్ 26 నుంచి ఐర్లాండ్‌లో పర్యటించనుంది. తొలుత ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడి.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. వైభవ్ సూర్యవంశీకి చోటుఇందుకోసం ప్రకటించిన జట్టులో తొలిసారిగా పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తాడని యాజమాన్యం తొలుత ప్రకటించింది.అందుకే సిరాజ్‌ను తప్పిస్తు న్నాంతాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ‘‘మా వైద్య బృందంతో చర్చల అనంతరం.. సిరాజ్‌కు విశ్రాంతి కావాలని భావించాము. పనిభారాన్ని తగ్గించే క్రమంలో అతడిని ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన నుంచి తప్పిస్తున్నాము. సుదీర్ఘమైన అంతర్జాతీయ క్రికెట్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.సిరాజ్ స్థానంలో ప్రసిద్ కృష్ణను సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సిరాజ్‌కు బదులు ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో అతడు టీ20 సిరీస్‌లలో పాల్గొంటాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌కు టీమిండియా (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ కృష్ణ.చదవండి: టీమిండియాలో చోటివ్వరా? సెంచరీతో కదంతొక్కాడు! -
అతడికి షరతులు వర్తించవా?.. అగార్కర్‌కు చురకలు!
ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్‌కు సంబంధించి టీమిండియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో ఆటగాళ్ల ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌కు ముందు గాయానికి గురైన పేసర్ హర్షిత్ రాణా అప్పటినుంచి ఒక్క మ్యాచ్ ఆడకపోయినప్పటికీ మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. హర్షిత్ రాణా ఎంపికపై భారత మాజీ క్రికెటర్ శఠగోపన్ రమేశ్ అసహనం వ్యక్తం చేశాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఏ ప్రాతిపాదికన హర్షిత్ రాణాను ఎంపిక చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి ఎంపికల వల్ల మహ్మద్ షమీ, భువనేశ్వర్ వంటి సీనియర్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మాట్లాడుతూ..‘హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు? మోకాలి శస్త్రచికిత్స అనంతరం దేశవాలీలో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా ఇప్పుడు మూడు జట్లకు ఎంపిక చేయడం పట్ల సమాధానం మాత్రం ఉండదు. కొన్నాళ్లుగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న షమీ లాంటి క్రికెటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు. దేశవాలీ క్రికెట్లో ఆటగాళ్లు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాలనే నిబంధనను హర్షిత్ రాణా విషయంలో సెలెక్షన్ కమిటీ గాలికొదిలేసింది. కోహ్లీ, రోహిత్ ఇలా ఎవరైనా ఫిట్నెస్ నిరూపించుకుంటూనే జట్టులో చోటు ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. పాండ్యా గాయపడినప్పుడు కూడా జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందేనని అల్టీమేటం జారీ చేశారు. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్‌ను కూడా న్యూజిలాండ్‌తో వన్డేలకు ముందు విజయ్ హజారే ట్రోఫీ ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలని కోరారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ హర్షిత్ రాణా విషయంలో మాత్రం అలా జరగలేదు. అతడికి ఈ షరతులు ఎందుకు వర్తించవనేది అగార్కర్ సమాధానం చెప్పాలి.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇక హర్షిత్ రాణా 2026 టీ20 ప్రపంచకప్‌కు టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా మోకాలికి గాయమైంది. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న హర్షిత్ రాణా ఐపీఎల్ 2026 సీజన్‌కు కూడా దూరంగా ఉన్నాడు.చదవండి: ఫూటుగా తాగి ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం! -
టీం ఇండియా కెప్టెన్సీపై అయ్యర్ ఫస్ట్ రియాక్షన్
-
మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియన్స్!
టీమిండియా టీ20 కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌కు కూడా గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సూర్యకుమార్‌ను అన్‌ఫాలో చేసింది. టిట్ ఫర్ టాట్ అన్న తరహాలో సూర్యకుమార్ కూడా తన ఇన్‌స్టా అకౌంట్లో ముంబై ఇండియన్స్ పేజీని అన్‌ఫాలో చేయడమే గాక పేజీ నుంచి ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన అన్ని ఫొటోలు, వీడియోలను తొలగించాడు. ప్రస్తుతం సూర్య ఇన అకౌంట్లో దీంతో ముంబై ఇండియన్స్‌తో సూర్యకుమార్‌కు బంధం ముగిసినట్లేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం అభిమానులు నిద్రలేచేసరికే ఇదంతా జరిగిపోవడంతో సూర్యకుమార్‌కు బ్యాడ్‌టైం నడుస్తున్నట్లుగా అనిపిస్తోంది. మొన్న కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు లేకుండా చేసి బీసీసీఐ అవమానిస్తే.. ఇవాళ ముంబై ఇండియన్స్ సూర్యకుమార్‌ను అన్‌ఫాలో చేసి అవమానించిందని అభిమానులు తెగ బాధపడిపోతున్నారు.సూర్యకుమార్ బయోను అభిమానులు పరిశీలించి చూడగా.. అతడి బయోలో ముంబై ఇండియన్స్‌తో పాటు ముంబై అనే పదాన్ని కూడా తొలగించాడు. ప్రస్తుతం సూర్యకుమార్ ఇన్‌స్టా అకౌంట్లో ముంబై ఇండియన్స్‌కు సంబంధించి కేవలం ఒక్క ఫొటో మాత్రమే ఉంది. అది కూడా ధోని, రోహిత్ శర్మలతో కలిసి దిగిన ఫొటో ఉంది. సూర్య కంటే ముందే ముంబై ఇండియన్స్‌ను వీడుతున్నట్లు వార్తలు వచ్చిన ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా సూర్యకుమార్ అన్‌ఫాలో చేయడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్లో సూర్యకుమార్ పేలవ ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్ 270 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. అతడి ఖాతాలో రెండు అర్థసెంచరీలు మాత్రమే ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ముంబై తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2018లో కేకేఆర్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చిన సూర్యకుమార్ అప్పటి నుంచి ఎనిమిదేళ్లుగా ముంబైకే ఆడుతూ వచ్చాడు. ఇందులో ముంబై రెండుసార్లు (2019, 2020) ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీమిండియాను మూడోసారి టీ20 చాంపియన్స్‌గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. బ్యాటింగ్ ఫెయిల్యూర్ తాజాగా అతడి టీ20 కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి దూరమయ్యేలా చేసింది. శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌ను చేయడంతో ఇక టీమిండియాలో సూర్యకుమార్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు అటు సూర్యకుమార్ కానీ.. ఇటు ముంబై ఇండియన్స్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సూర్యకుమార్ ముంబైని వీడుతాడా లేదా ఇవన్నీ ఊహాగానాలకే పరిమితమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.Suryakumar Yadav removed Mumbai Indians and Mumbai from his bio. He unfollowed Mumbai Indians. MI unfollowed him. He deleted all MI related pics and videos from his insta id. He changed his pfp too. What's cooking? pic.twitter.com/PL6ErA6tDc— SKY n Supla Shot (@sky_63_mr_t20i) June 7, 2026 -
సంజుకు షాక్ ఇచ్చిన BCCI.. ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన
-
టీమిండియాలో నో ప్లేస్.. గంటల వ్యవధిలోనే హ్యాట్రిక్‌తో చెలరేగిన షమీ
భారత క్రికెట్లో గత కొంతకాలంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే, అది మహ్మద్ షమీయే అని చెప్పాలి. ఎందుకంటే ఇతగాడు ఫార్మాట్లకతీతంగా ఎంత అద్భుతంగా రాణించినా, జాతీయ జట్టులోకి తిరిగి రాలేకపోతున్నాడు.హర్షిత్ రాణా లాంటి బౌలర్ ఏమీ సాధించకపోయినా, ప్రతిసారి జట్టులో దర్శినమిస్తున్న వేల, షమీకి జరుగుతున్న అన్యాయంపై కొందరు తీవ్రస్థాయిలో గళమెత్తుతున్నారు. హర్షిత్‌కు ఉన్న అర్హతలేంటి, షమీకి లేనివేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై బీసీసీఐని, సెలెక్టర్లను, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను నిలదీస్తున్నారు.తాజాగా ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు భారత జట్టును ప్రకటించగా.. షమీకి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసినా, సెలెక్టర్లు షమీని పరిగణలోకి తీసుకోలేదు.తాను లేని భారత జట్లను ప్రకటించిన గంటల వ్యవధిలోనే షమీ హ్యాట్రిక్ వికెట్లు తీసి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. బెంగాల్ టీ20 లీగ్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ టోర్నీలో సిలిగురి స్ట్రయికర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. రార్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో వరుస మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు.మొదటగా తన ఐపీఎల్ సహచరుడు షాబాజ్ అహ్మద్‌ను ఔట్ చేసిన షమీ.. ఆ తర్వాతి రెండు బంతుల్లో రోహిత్ కుమార్, దీపాంజన్ ముఖర్జీ వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా నాలుగు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.షమీ (4/27)తో పాటు కరణ్ లాల్ (3/36) అద్భుత బౌలింగ్ చేయడంతో రార్ టైగర్స్‌పై సిలిగురి స్ట్రయికర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో షమీ, కరణ్ లాల్ ధాటికి తడబడిన రార్ టైగర్స్ 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. -
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్!?
భారత క్రికెట్లో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ప్రస్ధానం ముగిసింది. టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ తప్పించింది. అతడి స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలకు ప్రకటించిన భారత జట్లలో సూర్యకుమార్‌కు కనీసం ఆటగాడిగా కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. పేలవ ఫామ్ కారణంగానే సెలక్టర్లు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.భారత్‌కు ఆసియాకప్, టీ20 ప్రపంచకప్‌ను అందించినప్పటికి అతడి ఫామ్ మాత్రం దారుణంగా పడిపోయింది. ఐపీఎల్-2026లోనూ సూర్య రాణించలేకపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్యకుమార్ 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ కారణాలతో అతడిని జట్టు నుంచి తప్పించారు.సూర్య రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా?అయితే సూర్యకుమార్‌పై వేటు పడిన కొద్దిసేపటికే అతడికి సంబందించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. "భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. విమర్శలు, ఆన్లైన్ ట్రోలింగ్ వల్ల తీవ్ర నిరాశకు గురయ్యాను. అందుకే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను" అంటూ సూర్యకుమార్ పేరుతో ఉన్న ఒక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా స్క్రీన్‌షాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.అయితే అది ఫేక్ పోస్ట్ అని తేలింది. @unreal_skyy అనే ఒక ఫేక్ అకౌంట్ నుంచి ఎవరో ఆకతాయి చేసిన పోస్ట్ అది. అంతే తప్ప స్కై నుంచి కానీ బీసీసీఐ నుంచి కానీ అతడి రిటైర్మెంట్కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సూర్య ప్రస్తుతం ముంబై టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు.చదవండి: జట్టు నుంచి తీసేశారు.. కట్ చేస్తే! సూర్యకుమార్ సంచలన నిర్ణయం? -
టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ తొలి స్పందన!
భారత జట్టు టీ20 కెప్టెన్‌గా తనను నియమించడంపై శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించాడు. ముంబై టీ20 లీగ్‌లో ముంబై ఫాల్కన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ విజయం అనంతరం మాట్లాడాడు. 'చాలా సంతోషంగా ఉంది. ఆటగాడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే పెద్ద విషయం. అలాంటిది ఒక జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప అనుభూతి. ఇది నా గౌరవాన్ని, బాధ్యతను పెంచింది. ఇన్నేళ్లుగా నాకు మద్దతిస్తూ అండగా నిలబడిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. టీ20 కెప్టెన్సీ ఇచ్చిన జోష్‌తో ఇవాళ ముంబై ఫాల్కన్స్ తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా జట్టును గెలిపించడం సంతోషంగా ఉంది. నిజంగా నాకు ఇది కేక్‌పై ఐసింగ్లాగా అనిపించింది. అయితే ఇవాళ మ్యాచ్‌లో నాకు ప్రత్యర్థిగా ఉన్న సూర్యకుమార్ దగ్గరికి వెళ్లి అతడిని ఆప్యాయంగా పలకరించాను. అతడు కూడా నాకు కెప్టెన్సీ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇది నా జోష్‌ను డబుల్ చేసింది.' అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. సూర్యకుమార్ సారథ్యంలోని ట్రంప్ నైట్స్ ఎంఎన్ఈ జట్టుపై శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ముంబై ఫాల్కన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రంప్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (24 బంతుల్లో 48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నూతన్ కుమార్ (34)పర్వాలేదనిపించాడు. ఫాల్కన్స్ బౌలర్లలో ప్రతమేశ్ డాకే 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఫాల్కన్స్ అయ్యర్ విజృంభణతో 16.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ట్రంప్ నైట్స్ బౌలర్లలో హితేశ్ కడమ్ 2 వికెట్లు తీశాడు.What a day for @ShreyasIyer15 😍Named #TeamIndia's T20I captain, then followed it up with a match-winning knock against Triumphs Knights MNE! 👏Watch #T20Mumbai on Star Sports & JioHotstar! pic.twitter.com/m6BeCZV1XW— Star Sports (@StarSportsIndia) June 7, 2026क्या शानदार पल है! मैच के दौरान वानखेड़े स्टेडियम में Suryakumar Yadavने Shreyas Iyer को गले लगाया। 🥹❤️मुंबई के लड़के एक-दूसरे का साथ देते हुए। 🫂❤️ pic.twitter.com/YiZmJmHaNR— 𝓢𝓸𝓷 𝓢𝓲𝓷𝓰𝓱 𝓨𝓪𝓭𝓪𝓿 (@SONSINGH_Ya) June 7, 2026చదవండి: టెస్టులో సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ! -
సూర్యను తొలగించడంపై రోహిత్ స్పందన!
టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయడంపై సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ స్పందించాడు. కెప్టెన్సీ అనేది అంత సులభంగా రాదని అయ్యర్‌ను చూస్తే తనకు స్పష్టంగా అర్థమవుతుందని తెలిపాడు. 2024లో కేకేఆర్‌కు టైటిల్ అందించిన అయ్యర్ మరుసటి ఏడాది పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా అతడి ప్రదర్శనలే ఇవాళ టీమిండియా టీ20 కెప్టెన్‌ను చేసిందని పేర్కొన్నాడు. అక్కడ నేర్చుకున్న విషయాలు ఇవాళ భారత కెప్టెన్సీకి అవసరమైన అనుభవాన్ని అందించనుందని తెలిపాడు. టీ20 ముంబై లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రోహిత్ శర్మ శనివారం మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘గత కొన్నేళ్లుగా శ్రేయస్ అయ్యర్ ఆటతీరు చూసుకుంటే అతడు కెప్టెన్‌గా అద్భుతాలు చేయబోతున్నాడనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ముంబై క్రికెటర్లకు ఏదీ సులభంగా రాదని, కెప్టెన్సీ అనే హోదాను కష్టపడి సంపాదించుకోవాలన్న విషయం శ్రేయస్‌కు తెలుసు.’అని వివరించాడు. సూర్యకుమార్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించడంపై కూడా రోహిత్ స్పందించాడు. ‘టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ తనదైన ముద్ర వేశాడు. సూర్యకుమార్‌కు కెప్టెన్సీ అంత సులభంగా దక్కలేదన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే సూర్యకుమార్ జట్టులోకి వచ్చే సమయానికే అతడి వయసు 31 లేదా 32 ఉంటుంది. ఆ వయసులో ఫామ్‌లో ఉండడమే గొప్ప విషయం. కానీ సూర్య దానిని అధిగమించడమే కాదు టీ20 క్రికెట్లో ఆటగాడిగా, కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశాడు. ఎల్లప్పుడూ పోరాడడంలో సూర్య ముందుండే వాడు. భారత్‌కు మూడో టీ20 ప్రపంచకప్ రావడంలో కెప్టెన్‌గా అతడి పాత్ర అమోఘం. తనకు వచ్చిన అవకాశాలను సూర్య రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. ఐదేళ్లలోనే అతడు టీమిండియాకు ఎంతో చేశాడు. ముంబై ఆటగాళ్లలోనే ఇది స్వతహాగా ఉన్న లక్షణం. ఏదీ ఊరికే రాదు, కష్టపడి సంపాదించుకోవాల్సిందే అన్న విషయం మా క్రికెటర్లకు తెలుసు.’ అని చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ గాయం కారణంగా అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడడం అనుమానమే. గాయంతో బాధపడుతున్న భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ ఈనెల 8న సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ (సీఓఈ)లో చేరనున్నాడు. బెంగళూరులోని ఈ సెంటర్లో అతడి ఫిట్నెస్ను పరీక్షించనున్నారు. మూడు రోజుల పాటు సీఓఈలో ఉండి, ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్ కోసం జట్టుతో చేరనున్నాడు.Rohit Sharma congraluating Shreyas Iyer for becoming the T20 Captain of India ❤️- The Mumbai Boys! pic.twitter.com/vcDf8yrPXW— Johns. (@CricCrazyJohns) June 6, 2026చదవండి: క్రీడాస్ఫూర్తిని మంటగలిపిన కేఎల్ రాహుల్! -
‘అందుకే హార్దిక్‌ను కాదని నితీశ్ రెడ్డిని ఎంపిక చేశాం’
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడి స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకే పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ భారత టీ20 జట్టు సారథిగా వ్యవహరించడమే ఇందుకు కారణం.అప్పుడు కెప్టెన్సీ చేజారిందిఅయితే, అనూహ్యంగా హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను కెప్టెన్‌ను చేసింది బీసీసీఐ. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నైపుణ్యాలున్న హార్దిక్‌ను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాడు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.కాలం గిర్రున తిరిగింది.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లలో ఎదురులేని శక్తిగా ఎదిగిన టీమిండియా.. ఈ ఏడాది స్వదేశంలో టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచింది. సొంతగడ్డపై పొట్టి వరల్డ్‌కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.సూర్యపై తప్పని వేటుకానీ ఊహించని రీతిలో బీసీసీఐ సూర్యపై వేటు వేసింది. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు జట్టులోనూ స్థానం లేకుండా చేసింది. ఐర్లాండ్ పర్యటన నుంచే కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టనున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.పిల్లాడికి అవకాశంఐర్లాండ్తో పాటు.. ఇంగ్లండ్ టూర్.. ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. చిచ్చరపిడుగు, పదిహేనేళ్ల సూర్యవంశీని తొలిసారి టీమిండియాకు ఎంపిక చేసింది. అయితే, ఈ మూడు జట్లలోనూ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు.హార్దిక్‌కు దక్కని చోటుకాగా ఐపీఎల్-2026లో హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా.. ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో జట్టు పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. ఇక హార్దిక్ పది మ్యాచ్‌లు ఆడి కేవలం 206 పరుగులు చేయడంతో పాటు.. కేవలం నాలుగు వికెట్లు తీశాడు.ఇక వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినా.. అతడు ఆడే విషయంపై బీసీసీఐ ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.మూడు జట్లలోనూ నితీశ్ రెడ్డితాజాగా టీ20 జట్టు నుంచి పూర్తిగా పక్కనపెట్టేస్తూ టీమిండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో యువ ఆల్‌రౌండర్, ఆంధ్రా ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్.. ఆసియా క్రీడల జట్టులో అతడికి చోటు ఇచ్చారు.అందుకే అతడిని ఎంపిక చేశాంఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘వన్డేల్లో అతడు ముఖ్యమైన ఆటగాడు. అతడితో పాటుగా అరుదైన నైపుణ్యాలున్న నితీశ్ రెడ్డి మాకు దొరికాడు.రొటేషన్ పద్ధతిలో ఇద్దరి సేవలు వాడుకుంటాము. అందుకే హార్దిక్‌కు విశ్రాంతినిచ్చాము. వన్డే వరల్డ్‌కప్ నాటికి అతడు ఫిట్‌గా ఉంటాడో లేదో చూడాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. తద్వారా హార్దిక్ ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం సందేహం ఉన్నా.. వన్డే వరల్డ్‌కప్ టోర్నీలోనూ నితీశ్ రెడ్డినే ఆడిస్తామని అగార్కర్ పరోక్షంగా స్పష్టం చేశాడు. అదే జరిగి.. నితీశ్ రెడ్డి అద్భుతంగా ఆడితే.. హార్దిక్ మున్ముందు జట్టులో కొనసాగడం కూడా కష్టమే అవుతుంది. చదవండి: ‘మేము సెలక్ట్ చేయలేదు.. తనంతన తానే ఎంపికయ్యాడు’ -
పాపం రా బుడోడా అభిషేకే కే ఎసరు పెట్టిన వైభవ్
-
బీసీసీఐ మెచ్చిన తెలుగు క్రికెటర్.. భారత జట్టులోకి స్వాగతం!
శ్రీలంకలో జరగనున్న ట్రై సిరీస్ కోసం ఇప్పటికే భారత-ఏ జట్టు ఆ గడ్డపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో తెలుగు కుర్రాడు షేక్ రషీద్‌కు చోటు దక్కడం ఆసక్తికర అంశంగా మారింది. ధ్రువ్ జురేల్ నేతృత్వంలోని జట్టులో సాయి సుదర్శన్, పడిక్కల్, రుతురాజ్, ఆయుష్ బదోని వంటి ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. 2021 అండర్-19 ఆసియా కప్ టోర్నీ ద్వారా షేక్ రషీద్ తొలిసారి బీసీసీఐ దృష్టిలో పడ్డాడు. జట్టు టైటిల్ గెలవడంలో షేక్ రషీద్ కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత 2022 ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌కు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ ఆరంభంలోనే కోవిడ్ బారిన పడ్డాడు. అయితే లీగ్ దశ ఆఖరికి చేరుకున్న క్రమంలో తిరిగి జట్టులోకి వచ్చిన రషీద్ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో 108 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఫైనల్లోనూ కీలక హాఫ్ సెంచరీతో మెరిసిన షేక్ రషీద్ టీమిండియా టైటిల్ గెలవడంలోనూ సహాయపడ్డాడు.ఎవరీ షేక్ రషీద్?ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ రషీద్ క్రికెట్ ప్రయాణం అడ్డంకులతో సాగింది. అతడి తండ్రి షేక్ వలీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కొడుకు లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కష్టపడ్డాడు. తండ్రి త్యాగంతో ఇవాళ ఇండియా-ఏ జట్టుకు ఎంపికైన షేక్ రషీద్ త్వరలోనే జాతీయ జట్టుకు కూడా ఎంపికవ్వాలని కోరుకుందాం. అండర్-19 టీ20 ప్రపంచకప్ అతడికి గుర్తింపు తెచ్చినప్పటికీ దేశవాలీ క్రికెట్లో రాణించాలంటే రంజీ మ్యాచ్‌లు ఆడడం తప్పనిసరి. అందుకే 2022లో ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన షేక్ రషీద్ ఓర్పు, టెక్నిక్, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యాన్ని అలవరుచుకున్నాడు. 2025-26 రంజీ సీజన్లో షేక్ రషీద్ అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో షేక్ర రషీద్ మూడు శతకాలతో 627 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 27 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన షేక్ రషీద్ 46 సగటుతో 1831 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలున్నాయి. లంక పర్యటనలో ముందుగా శ్రీలంక, అఫ్గానిస్తాన్‌తో కలిసి ఇండియా-ఏ ట్రై వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.శ్రీలంకలో జరిగే మల్టీ-డే గేమ్‌ల కోసం భారత-ఏ జట్టు: ధృవ్ జురెల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సరాన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, ఎన్ జగదీశన్, అమన్ మోఖడే, షేక్ రషీద్, జీషన్ అన్సారీఇండియా-ఏ టూర్ ఆఫ్ శ్రీలంక షెడ్యూల్జూన్ 25- తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)జులై 2- రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)చదవండి: గంభీర్ చేతిలో అంతుచిక్కని పదార్థం.. ట్రోల్ సరికాదు! -
తెలుగోడే అర్హుడు.. అందుకే అక్షర్‌ను తప్పించాం!
తెలుగు క్రికెటర్ నంబూరి తిలక్ వర్మకు బీసీసీఐ వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం బీసీసీఐ ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్‌తో పాటు ఆసియా గేమ్స్‌కు టీమిండియా జట్టును ఎంపిక చేసింది. ఈ టోర్నీలకు వేర్వేరుగా ప్రకటించిన జట్లలో తిలక్ వర్మ చోటు దక్కించుకోవడమే గాక, శ్రేయస్ అయ్యర్‌కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. అయితే ఉన్నపళంగా అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను తిలక్ వర్మకు అప్పగించడంపై బీసీసీఐ స్పందించింది. జట్లను ప్రకటించిన అనంతరం సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడాడు. ‘రాబోయే రెండేళ్ల కాలంలో టీమిండియా చాలా టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులోనే 2028 టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. అక్షర్‌పటేల్ అప్పటి వరకు జట్టులో ఉంటాడా లేదా అనేది సందేహం. అందుకే మాకు తిలక్ వర్మ డిప్యూటీ కెప్టెన్ పదవికి సరైనోడిలా కనిపించాడు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పటికీ, రాబోయే రెండేళ్ల సైకిల్‌ను దృష్టిలో పెట్టుకొని తిలక్ వర్మను డిప్యూటీగా ఎంపిక చేయాలని నిర్ణయించాం. అందునా తిలక్ వర్మ ఒక అద్భుత ఆటగాడు. డిప్యూటీ కెప్టెన్‌గా అదనపు బాధ్యతలు ఇవ్వడం ద్వారా మరింత నేర్చుకుంటాడన్నది మా నమ్మకం.’ అని చెప్పుకొచ్చాడు. అజిత్ అగార్కర్ చెప్పినట్లుగానే తిలక్ వర్మ కొన్నేళ్లుగా భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. 2024లో సౌతాఫ్రికా గడ్డపై రెండు శతకాలు బాదిన తిలక్ వర్మ, ఆ గడ్డపై 3-1 తేడాతో సిరీస్‌ను గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక గతేడాది ఆసియా కప్ ఫైనల్లో భారత్ గెలవడంలో తిలక్ వర్మదే కీలకపాత్ర. ఆ మ్యాచ్‌లో 69 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటిదాకా బ్యాటర్‌గా రాణించిన తిలక్ వర్మ ఇకపై వైస్ కెప్టెన్సీ బాధ్యతలు సవాల్ విసరనున్నాయి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌తో పాటు 2028 టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారించిన నేపథ్యంలో తిలక్ వర్మ బ్యాటర్‌గా భారత బ్యాటింగ్‌లో మూల స్తంభాల్లో ఒకడిగా ఉండడంతో పాటు డిప్యూటీ నాయకత్వ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇక అక్షర్‌పటేల్ వైస్‌కెప్టెన్ పదవిని కోల్పోయినప్పటికీ సీనియర్ స్పిన్నర్‌గా జట్టులో చోటు కాపాడుకున్నాడు.ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.చదవండి: కనిపించని సూర్యకుమార్ పేరు.. కెరీర్‌కు ఎండ్‌కార్డ్! -
కనిపించని సూర్యకుమార్ పేరు.. కెరీర్‌కు ఎండ్‌కార్డ్!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్‌గా ముద్రపడిన సూర్యకుమార్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడింది. తాజాగా శనివారం ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్, ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన టీమిండియా జట్టులో సూర్యకుమార్‌కు చోటు దక్కలేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కనీసం సూర్య పేరును ప్రస్తావించలేదని స్పష్టంగా తెలుస్తోంది. సరిగ్గా నాలుగు నెలల కిందట టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ కెరీర్ ఇలా అర్థంతరంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. టీమిండియాకు ఆసియా కప్‌తో పాటు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకు వీడ్కోలు పలుకుతూ బీసీసీఐ చివరి మ్యాచ్ ఏమైనా ఆడిస్తుందేమో అని అభిమానులు ఆశించారు. కానీ బీసీసీఐ తన పంథా మార్చి ఫామ్‌లో లేని ఆటగాళ్లను నిరభ్యరంతంగా జట్టు నుంచి పక్కనబెట్టేస్తుంది. కొన్ని రోజులుగా కెప్టెన్సీ పదవి నుంచి మాత్రమే సూర్యను తప్పిస్తారని వార్తలు వచ్చినప్పటికీ, ఇవాళ ప్రకటించిన జట్టులో సూర్యకుమార్ పేరు కనిపించకపోవడంతో అతడి కెరీర్‌కు ముగింపు పడినట్లయింది.తుఫానులా దూసుకొచ్చిన సూర్య31 ఏళ్ల వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ అనతికాలంలోనే టీ20 క్రికెట్లో స్టార్ హోదాను పొందాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరు పొందిన సూర్య మైదానం నలువైపులా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో సూర్యకుమార్ జట్టు పగ్గాలు చేపట్టాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అసమాన ప్రదర్శన కనబరిచిన సూర్య ఆట 2025 నుంచి పతనం దిశగా సాగింది. కెప్టెన్సీ ఒత్తిడిలో తన సహజసిద్ధమైన ఆటకు దూరంగా జరిగిన సూర్యకుమార్ ఫామ్‌లేమితో తంటాలు పడ్డాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ సూర్య పెద్దగా రాణించింది లేదు. అయితే టీమిండియా గెలిచిన టీ20 ప్రపంచకప్‌కు సూర్య కెప్టెన్ హోదాలో ఉండడమే అతడికి దక్కిన ఘనత అని చెప్పొచ్చు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లోనూ సూర్యకుమార్ పేలవ ప్రదర్శన చేయడంతో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. సీనియర్ అయినా, అనుభవం ఉన్నా సరే ఫామ్‌లో ఉన్న ఆటగాడిగే తన మద్దతు ఉంటుందని కోచ్ గౌతమ్ గంభీర్ కుండబద్ధలు కొట్టడంతో సూర్యకుమార్ కెప్టెన్సీతో పాటు జట్టులో అతడి చోటు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన జట్టులో సూర్యకుమార్ చోటు కోల్పోయాడు. సూర్యకుమార్ టీమిండియా తరఫున 113 టీ20లు ఆడి 3,272 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 25 అర్థసెంచరీలున్నాయి. దీంతో పాటు సూర్యకుమార్ 37 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. మొత్తంమీద టీమిండియాలోకి తుఫానులా దూసుకొచ్చిన సూర్యకుమార్ ఐదేళ్లు తిరక్కుండానే అశనిపాతంలా కిందకు పడిపోవడం గమనార్హం. చివరగా ఎన్నేళ్లు ఆడామాన్నది కాదు.. ఆడిన కొద్దికాలంలోనే తన పేరును చరితార్థం చేసుకున్న సూర్యకుమార్‌కు హ్యాట్సాఫ్. గుడ్‌బై మిస్టర్ 360.. సూర్యకుమార్ యాదవ్.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. ఇక దబిడిదిబిడే! -
BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. ఇక దబిడిదిబిడే!
ఊహించిందే జరిగింది.. రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సువర్ణావకాశం వచ్చింది. ఐపీఎల్-2026లో సత్తా చాటిన ఈ చిచ్చరపిడుగుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతడిని ఏకంగా టీమిండియాకు ఎంపిక చేసింది.సచిన్ రికార్డు బద్దలుజూన్లో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో పర్యటించే భారత టీ20 జట్టుకు వైభవ్‌కు ఎంపిక చేసిన సెలక్టర్లు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టులోనూ అతడికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు.అత్యంత పిన్న వయస్సులోనే జాతీయ జట్టుకు ఎంపికైన భారత ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కాగా సచిన్ 1989లో పదహారేళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్ మీద అరంగేట్రం చేశాడు. ఇక వైభవ్ కేవలం పదిహేనేళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌పై అతడు అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైపోయింది.నిలకడైన ఆట.. విధ్వంసకర బ్యాటింగ్గతేడాది రాజస్తాన్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా దుమ్ములేపాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో శతకాల మోత మోగించాడు.అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులతో రాణించి.. భారత్ విజేతగా నిలవడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఈవెంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.అత్యధిక పరుగుల వీరుడిగా ఘనతఇదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 36 బంతుల్లో శతక్కొట్టాడు. ఓవరాల్‌గా పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించాడు.తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు వైభవ్. ఇప్పటికే అత్యంత పిన్న వయస్సులోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్‌ను కూడా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.పైసా వసూల్ ప్రదర్శన.. టీమిండియాకు ఎంపికఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని వీలైనంత త్వరగా టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందుకు సానుకూలంగా స్పందించిన బీసీసీఐ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదిహేనేళ్ల వయస్సులోనే అతడిని ఎంపిక చేయడం విశేషం. ఓవరాల్‌గా రాజస్తాన్ ప్లే ఆఫ్స్‌ను చేర్చి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చిన వైభవ్.. ఇప్పుడు టీమిండియా తరఫున దుమ్ములేపేందుకు సిద్ధమయ్యాడు. చిన్న వయస్సులోనే భారత జట్టుకు ఎంపికైన వైభశ్ సూర్యవంశీకి శుభాభినందనలు.. అతడి బంగారు భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్!! చదవండి: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ ప్రకటన.. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడలకు జట్లు ఇవే -
టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ ప్రకటన.. సూర్యవంశీకి ఛాన్స్
టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడి స్ధానంలో జట్టు పగ్గాలను మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లకు జట్టు ఎంపిక సందర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్‌కు డిప్యూటీగా హైదరాబాదీ తిలక్ వర్మను సెలక్టర్లు నియమించారు. వీటితో పాటు సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడలకు భారత జట్టును ప్రకటించారు. ఏషియన్ గేమ్స్‌లో కూడా టీమిండియా కెప్టెన్‌గా అయ్యర్ వ్యవహరించనున్నాడు.వైభవ్‌కు ఛాన్స్ఇక ఐపీఎల్-2026లో దుమ్ములేపిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీ20 జట్టులో చోటు కల్పించారు. దీంతో 15 ఏళ్ల సూర్యవంశీ.. భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయష్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు.సూర్య ఖేల్ ఖతంఇక టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ ప్రస్ధానం ముగిసినట్లే. సారధిగా భారత్‌కు టీ20 ప్రపంచకప్-2026ను అందించినప్పటికి.. పేలవ ఫామ్, భవిష్యత్తు ప్రణాళికల కారణంగా అతడిపై వేటు వేశారు. కెప్టెన్‌గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే సూర్యను తొలగించారు. గత కొంత కాలంగా టీ20లకే పరిమితమైన సూర్యను, ఇకపై మరి భారత జెర్సీలో చూడకపోవచ్చు.ప్రిన్స్ యాదవ్‌కు చోటుమరోవైపు వైభవ్‌తో పాటు ఈ ఏడాది సీజన్లో అదరగొట్టిన లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌కు కూడా టీ20 జట్టులో చోటు దక్కింది. ప్రిన్స్ యాదవ్ ఇప్పటికే అఫ్గానిస్తాన్‌తో వన్డేలకు ఎంపికైన సంగతి తెలిసిందే.ఐర్లాండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణాఇంగ్లండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఆసియా క్రీడలకు భారత టీ20 జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయి, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ -
పంథా మార్చిన బీసీసీఐ.. బలవంతంగా పంపుతున్న వైనం!
బీసీసీఐ తన పంథా మార్చేసిందా? ఒకప్పుడు స్టార్ క్రికెటర్లు రిటైర్ అవుతున్నారంటే వీడ్కోలు మ్యాచ్‌తో పాటు ఘనంగా సత్కారాలు, సన్మానాలు జరిగేవి. ఆటగాడు కోరుకున్న చోటే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేలా సన్నాహకాలు చేసే వారు. కానీ ఇప్పుడు అదంతా గతం గతః అన్నట్లుగా తయారైంది. సరైన ప్రదర్శన చేయకుండా జట్టుకు భారంగా మారిన సదరు ఆటగాడికి వీడ్కోలు మ్యాచ్ లేకపోగా బలవంతంగా జట్టు నుంచి పంపించే మహత్తర కార్యక్రమానికి తెర లేచింది. తాజాగా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో బీసీసీఐ అవలంబిస్తోన్న వైఖరి ఇందుకు ఉదాహరణ.బీసీసీఐ నుంచి ఘనంగా వీడ్కోలు అందుకన్న క్రికెటర్లలో సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, హర్భజన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. అయితే ఈ మధ్య కాలంలో ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయకపోతే రిటైర్మెంట్కు సమయం వచ్చేసిందంటూ వార్తలు రావడం, ఆ తర్వాత కనీస వీడ్కోలు మ్యాచ్ కూడా లేకుండానే వాళ్లు రిటైర్ ఇవ్వడం జరిగిపోతున్నాయి. తాజాగా సూర్యకుమార్‌ను ముందు టీ20 కెప్టెన్‌గా తొలగించిన బీసీసీఐ ఇప్పుడు బలవంతంగా జట్టులో నుంచి పంపించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీమిండియాలోకి లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనతికాలంలోనే సూర్యకుమార్ టీ20 క్రికెట్లో స్టార్ హోదా పొందాడు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో అతడి స్థానంలో సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్‌తో పాటు 2026 టీ20 ప్రపంచకప్‌ను నిలుపుకోవడం విశేషం. ధోని, రోహిత్ తర్వాత భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ నిలిచాడు. గంగూలీ, ద్రవిడ్, కోహ్లీలకు సాధ్యం కాని ఐసీసీ మేజర్ టైటిల్ సూర్య ఖాతాలో ఉండడం గమనార్హం. మరి ఇలాంటి హోదా పొందిన సూర్యకుమార్‌కు, కేవలం టీ20 స్పెషలిస్ట్‌గా ముద్రపడిన వ్యక్తికి గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరముంది. అంతేకాని పొమ్మనలేక పొగబెట్టడం అన్న తరహాలో బీసీసీఐ ప్రవర్తించడంపై టీమిండియా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ కెప్టెన్సీ పదవి నుంచి తొలగ2ఇంచారు కాబట్టి కనీసం ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు అతడిని పరిగణలోకి తీసుకొని సెండాఫ్ మ్యాచ్ ఆడేలా అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.గతంలో అలా..భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ 1986లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. కానీ అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్.. తమతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాలని గావస్కర్‌ను కోరాడు. దీనికి గావాస్కర్ ఒప్పుకోవడం, బీసీసీఐ కూడా ఓకే అనడంతో 1987లో పాక్‌తో టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత ఘనంగా వీడ్కోలు పలికాడు. పనిలో పనిగా గావస్కర్ 10వేల పరుగులు కూడా పూర్తయ్యాయి. అలా గావస్కర్ తన వీడ్కోలు మ్యాచ్‌ను ఎన్నటికీ మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోయింది.టెండూల్కర్ 200వ టెస్టు మ్యాచ్భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ ఎలాంటి వీడ్కోలు ఇచ్చిందో అందరికీ తెలిసిందే. అతడి వందో సెంచరీ కోసం కొన్నేళ్లు వేచి చూడాల్సి వచ్చినా బీసీసీఐ అతడిని పక్కకు పెట్టలేదు. 2014లో ముంబైలోని తన హొంగ్రౌండ్లో 200వ టెస్టు మ్యాచ్ ఆడిన సచిన్‌కు స్టేడియం మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. ఆ మధురానుభూతులు ఇప్పటికీ తన కళ్ల ముందు ఉన్నాయని సచిన్ చాలాసార్లు పేర్కొన్నాడు.షాక్ ఇచ్చిన ధోని..భారత క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్‌గా ఎంఎస్ ధోనికి పేరుంది. రెండు ప్రపంచకప్‌లతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని సాధించిన ధోనికి 2019 వరల్డ్‌కప్‌లో సెమీస్ మ్యాచ్ చివరిది అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. 2019లో ఆటకు దూరమైన ధోని.. తాను తలచుకుంటే బీసీసీఐకి చెప్పి ఒక వీడ్కోలు మ్యాచ్ ఆడడం పెద్ద విషయం కాదు. కానీ ధోని అలా చేయలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం రావాలనే ఉద్దేశంతో 2020 ఆగస్టు 15 సాయంత్రం ఏడు గంటలకు తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం ఒక పోస్టు పెట్టి ప్రకటించాడు.గంభీర్ రాక.. మారిన పరిస్థితులుటీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ భారత హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అనుభవానికి ప్రాధాన్యమివ్వకుండా ఫామ్‌లో ఉన్న ఆటగాడికే తన మద్దతు ఉంటుందని గంభీర్ వచ్చిన కొత్తలోనే కుండబద్దలు కొట్టాడు. తన సమకాలీన క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలోనూ ఇలాంటి వైఖరినే వ్యవహరించాడు. 2024లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్‌లో ఈ ఇద్దరు విఫలమయ్యారు. దీంతో తాము టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందని భావించిన రోహిత్, కోహ్లీలు స్వల్ప వ్యవధిలో గుడ్‌బై చెప్పేశారు. అలా కాదని వీళ్లిద్దరు బీసీసీఐకి తమకు ఒక చివరి టెస్టు మ్యాచ్ ఏర్పాటు చేయాలని అడిగి ఉంటే సమాధానం ఎలా వచ్చి ఉండేదో. ఇప్పుడు సూర్యకుమార్ వంతు వచ్చింది. ఒకప్పుడు మిస్టర్ 360 డిగ్రీస్ క్రికెటర్‌గా పేరు పొందిన సూర్యకుమార్ ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా మిగిలిపోయాడు. టీమిండియా క్రికెట్‌కు అతడు అందించిన రెండు కప్పులను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ అతడికి ఆఖరి టీ20 మ్యాచ్ ఆడే అవకాశం కల్పించాలని కోరుకుందాం.చదవండి: గెంటేస్తారన్న భయం.. కట్‌చేస్తే చరిత్రకు అడుగు దూరంలో! -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ఏడాది తర్వాత బరిలోకి దిగనున్న సూపర్ స్టార్
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గోనేందుకు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) నుండి అనుమతి లభించింది.దీంతో దాదాపు ఏడాది తర్వాత పాండ్యా వన్డేల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. కాగా గత నెలలో అఫ్గాన్‌తో సిరీస్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో పాండ్యాకు చోటు దక్కింది. కానీ వెన్ను గాయంతో బాధపడుతున్న పాండ్యాకు ఈ సిరీస్ ఆరంభానికి ముందు తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలని సెలక్టర్లు కండీషన్ పెట్టారు. దీంతో జూన్ 2న బెంగళూరులోని సీఓఈకి వెళ్లిన పాండ్యాకు వైద్యులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతడు ఉత్తీర్ణత సాధించడంతో సీఓఈ వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దైనిక్ జాగరణ్ తమ కథనంలో పేర్కొంది. మరోవైపు తొడ కండరాల గాయంతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఫిట్నెస్ పరీక్షను ఎదుర్కోనున్నాడు.ఇందులో పాసైతేనే అఫ్గాన్‌తో సిరీస్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉంటాడు. లేదంటే అతడి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్‌తో సెలక్షన్ కమిటీ భర్తీ చేయనుంది. ఇక ఈ సిరీస్‌కు ఇప్పటికే టీమిండియా స్టార్, రన్‌మిషన్ విరాట్ కోహ్లి గాయం కారణంగా దూరమయ్యాడు. కోహ్లి ప్రస్తుతం కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడి స్ధానాన్ని రుతురాజ్ గైక్వాడ్‌తో భర్తీ చేశారు.పాండ్యా విషయానికి వస్తే.. చివరిసారిగా 2025 మార్చిలో భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. పాండ్యా ఇప్పటివరకు 94 వన్డేలు ఆడి, 32.82 సగటుతో 1904 పరుగులు చేశాడు. అంతేకాకుండా అతడి పేరిట 91 వన్డే వికెట్లు ఉన్నాయి. అయితే వన్డే మ్యాచ్‌లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేసేందుకు అతడి శరీరం సహకరిస్తుందో లేదో చూడాలి. వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది.అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టు ఇదేశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ*, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ (వైస్‌కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా*, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ENG vs NZ: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే -
నేడే భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకు ఛాన్స్?
2026 టీ20 వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత్ తమ తర్వాతి సిరీస్‌కు సమాయత్తమవుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో జరిగే సిరీస్‌లలో తలపడే భారత జట్లను నేడు సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. జూన్ 26న ప్రారంభమయ్యే ఈ టూర్లో భాగంగా ముందుగా ఐర్లాండ్‌తో 2 టి20లు జరుగుతాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో 5 టి20లు, 3 వన్డేలు ఉంటాయి. వీటితో పాటు సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే టీమ్‌ను కూడా అజిత్ అగార్కర్ నాయకత్వంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. సూర్యకుమార్‌పై వేటు తప్పదా! రెండు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుల ఎంపికను మినహాయిస్తే రెండు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. టి20 కెపె్టన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తొలగించడం ఖాయమైపోయింది. అతని సారథ్యంలో వరల్డ్ కప్ గెలుచుకున్న వెంటనే ఇది చోటు చేసుకోనుండటం గమనార్హం. 2025లో ఐసీసీ టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకొని ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తర్వాత కూడా రోహిత్ శర్మ తన కెపె్టన్సీని కోల్పోయాడు. సూర్య విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే రోహిత్ ఆటగాడిగా తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. కానీ సూర్య టీమ్‌లో కూడా చోటు కోల్పోనున్నాడు. వరల్డ్ కప్ నెగ్గినా సుదీర్ఘ కాలంగా అతని ఫామ్ పేలవంగా ఉంది. వరల్డ్ కప్‌లో 9 ఇన్నింగ్స్‌లలో కలిపి 242 పరుగులే చేసిన సూర్య... ఐపీఎల్‌లోనూ దానిని కొనసాగిస్తూ 13 ఇన్నింగ్స్‌లలో 270 పరుగులే చేయగలిగాడు. 2028 టీ20 వరల్డ్ కప్, అదే ఏడాది జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని టి20 టీమ్‌ను సిద్ధం చేస్తున్న సెలక్టర్లు 36 ఏళ్ల సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. సూర్య స్థానంలో మరో ముంబైకర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో అతని నాలుగో స్థానాన్ని కూడా భర్తీ చేయనున్నాడు. శ్రేయస్ 2023 డిసెంబర్లో భారత్ తరఫున చివరిసారిగా టి20 ఆడినా...ఐపీఎల్లో తన బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చిన అతని నాయకత్వంలో 2024లో కోల్‌కతా విజేతగా నిలవగా... 2020, 2025లో ఢిల్లీ, పంజాబ్‌కు రన్నరప్‌గా నిలిచాయి. లాంఛనమేనా! మరోవైపు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి రావడం లాంఛనమే కావచ్చు. అసాధారణ ఆటతో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న వైభవ్‌ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఐపీఎల్లో ఏకంగా 237.30 సగటుతో అతను 776 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే భారత టీ20 జట్టు టాప్–3 అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్లతో పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో వైభవ్‌ను ఆడించడం కష్టంగా అనిపిస్తున్నా... ఆసియా క్రీడలకు మాత్రం అతను ఎంపిక కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. -
వైభవ్ క్రేజ్.. స్వదేశంలో ముగిసి విదేశంలో మొదలు!
ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడిచింది. ఈ సీజన్లో 16 మ్యాచ్‌లాడిన వైభవ్ 237 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవడంతో పాటు మోస్ట్ వాల్యుబల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసంపై దిగ్గజాలు సహా మాజీ క్రికెటర్లు అభినందించారు. వైభవ్‌ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని కూడా డిమాండ్లు వినిపించాయి. అయితే వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు విదేశాలకు కూడా పాకింది. విదేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు కూడా వైభవ్‌ను టీమిండియాకు ఎంపిక చేయాలని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులోనూ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావన వచ్చింది. మ్యాచ్ తొలిరోజు మధ్యలో వర్షం పడడంతో విరామ సమయంలో కామెంటేటర్ సైమన్ డౌల్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ప్రస్తావన తీసుకొచ్చాడు. అతని బ్యాటింగ్ అద్భుతమంటూ, నేరుగా భారత జట్టులోకి తీసుకుంటారేమోనని పేర్కొన్నాడు. దీనికి సహచర కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు నాసిర్ హుస్సేన్, ఇయన్ వార్డ్ కూడా.. 'అవును వైభవ్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసినట్లుంది'అంటూ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంపికపై ఇంకా సమయం ఉందని బీసీసీఐ పేర్కొంది. 15 ఏళ్లే కావడంతో అతడికి క్రికెటర్‌గా చాలా భవిష్యత్తు ఉందని, ఈలోగా ఇండియా-ఏ తరఫున తన ఆటను చూపించే అవకాశమిస్తున్నట్లు తెలిపింది. లంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇండియా-ఏ జట్టు శ్రీలంక-ఏ, అఫ్గానిస్తాన్-ఏ జట్లతో ట్రై సిరీస్ ఆడనుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్‌కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 31 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 124 పరుగులతో ఆడుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 151 పరుగుల లీడ్‌లో ఉంది."Open the batting with Sooryavanshi!" 😅👀 pic.twitter.com/PL21ZRvWFA— Sky Sports Cricket (@SkyCricket) June 4, 2026చదవండి: గెంటేస్తారన్న భయం.. కట్‌చేస్తే చరిత్రకు అడుగు దూరంలో! -
సూర్యకు టైమ్ లేదు!.. టీ20 కొత్త కెప్టెన్ ఖరారు!
టీమిండియా టీ20 కెప్టెన్ మార్పు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్‌కు మరికొన్నాళ్లు సమయం ఇవ్వాలని తొలుత భావించినప్పటికీ.. ఇప్పుడు బోర్డు ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.అగ్రపథంలో నిలిపి.. ప్రపంచకప్ అందించికాగా గత రెండేళ్లుగా టీ20లలో సారథిగా భారత్‌ను అగ్రపథంలో నిలిపాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav). ఈ ఏడాది సొంతగడ్డపై ప్రపంచకప్ టోర్నీలో చాంపియన్‌గా నిలిపి.. దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. అయితే, ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. కెప్టెన్ అయిన తర్వాత పూర్తిగా తేలిపోయాడు.ఈ నేపథ్యంలో 35 ఏళ్లపై సూర్యను కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు నాయకత్వ బృందం సిద్ధమైంది. అయితే, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో అతడి ప్రదర్శన చూసిన తర్వాతే తుది నిర్ణయానికి రావాలని భావించింది. తాజాగా ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన సూర్య దారుణ వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ సీజన్లో పదమూడు ఇన్నింగ్స్ ఆడిన సూర్య కేవలం 270 పరుగులే చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 60.ఐర్లాండ్ పర్యటన నుంచే కొత్త కెప్టెన్ఈ నేపథ్యంలో సూర్యను తక్షణమే కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చినట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో తెలిపింది. ఐర్లాండ్ పర్యటన నుంచే కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.ముంబైలో శనివారం జరిగే సెలక్షన్ ప్యానెల్ సమావేశంలో అతడి పేరును అధికారికంగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్ తర్వాత టీమిండియా యూకేకు పయనం కానుంది.యూకే టూర్ సాగుతుందిలా..ఇందులో భాగంగా తొలుత జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్ వేదికగా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. తదుపరి జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లలో పాల్గొంటుంది. అనంతరం సెప్టెంబరు- అక్టోబరు మధ్య జపాన్ వేదికగా ఆసియా క్రీడల్లో భాగమవుతుంది.వైస్ కెప్టెన్‌గా తిలక్!ఇదిలా ఉంటే.. సూర్యను కెప్టెన్‌గా తొలగించడంతో పాటు.. జట్టు నుంచి కూడా అతడిని తప్పించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు పీటీఐ బుధవారం వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్‌కు డిప్యూటీగా హైదరాబాదీ తిలక్ వర్మను నియమించనున్నట్లు పేర్కొంది. అదే విధంగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో సెలక్టర్లు చోటు ఇవ్వనున్నట్లు సదరు వార్తా సంస్థ తెలిపింది.కెప్టెన్‌గా పునరాగమనం!కాగా 2023లో చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు శ్రేయస్ అయ్యర్. ఇక ఐపీఎల్-2024లో సారథిగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన ఈ ముంబైకర్.. 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే, ఈ ఏడాది మాత్రం ప్లే ఆఫ్స్ వరకు కూడా తీసుకువెళ్లలేకపోయాడు. ఓవరాల్‌గా గత మూడేళ్లలో ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మద్దతుతో అతడు భారత టీ20 జట్టులో దాదాపు మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. ఏకంగా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం కావడం విశేషం.చదవండి: ‘ఇండియాలో లైఫ్ కోహ్లికి అస్సలు నచ్చదు’ -
క్రికెట్ దేవుడి రికార్డుకే ఎసరు.. చరిత్ర సృష్టించనున్న సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లకు వైభవ్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ బ్రేక్ చేయనున్నాడు. సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాక్‌పై తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వైభవ్ వయస్సు కేవలం 15 ఏళ్ల 70 రోజులు మాత్రమే. దీంతో మరో నెల రోజుల్లో సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు అవ్వడం ఖాయమన్పిస్తోంది. కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించనుంది. ఈ సందర్భంగా సెలక్టర్లు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమవుతున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను టీ20 జట్టు సారధిగా నియమించనున్నట్లు సమాచారం. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ ఎంపికను కూడా సెలక్టర్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో 776 పరుగులు పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా వైభవ్ నిలిచాడు. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్,సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అవార్డులు కూడా సూర్యవంశీనే సొంతం చేసుకున్నాడు. అతడు ఐర్లాండ్ టూర్ కంటే ముందు శ్రీలంకలో ఇండియా-ఎ తరపున ఆడనున్నాడు.చదవండి: IND vs AFG: పంత్‌కు గంభీర్ క్లాస్.. లీక్ చేసిన అసిస్టెంట్ కోచ్! -
భారత క్రికెటర్ల రిటైర్మెంట్పై బీసీసీఐ కఠిన నిర్ణయం..?
భారత క్రికెటర్ల రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ లేదా దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెంటనే కొందరు ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో ఆడేందుకు క్యూ కడుతుండటంతో కొత్త విధానం తీసుకురావాలని భావిస్తోంది. ఈ అంశంపై త్వరలో జరుగబోయే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ కీలక చర్చ జరపనుంది.ఇటీవల తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, వెంటనే క్యాండీ రాయల్స్ తరఫున లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో రిటైర్మెంట్ ప్రకటించి విదేశీ లీగ్‌లలో ఆడే ధోరణిపై బీసీసీఐ దృష్టి సారించింది.గతంలో దినేశ్ కార్తీక్, యువరాజ్ సింగ్, ఉన్ముక్త్ చంద్, ప్రవీణ్ తాంబే, ఇర్ఫాన్ పఠాన్ వంటి ప్రముఖ క్రికెటర్లు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు.ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, దేశవాళీ క్రికెట్ లేదా ఐపీఎల్ ఆడుతున్నా.. ఏ క్రికెటర్‌కూ విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతి లేదు. అయితే దేశీయంగా సరైన అవకాశాలు రాని కొందరు క్రికెటర్లు అదే పనిగా భారత క్రికెట్‌తో సంబంధాలు తెంచుకొని పరాయి దేశ లీగ్‌లవైపు పయనమవుతున్నారు. -
BCCI సంచలన నిర్ణయం టీ20 కెప్టెన్సీ నుండి సూర్య ఔట్?


