రోహిత్ శర్మపై కుట్ర..! ఇది మీకు న్యాయమేనా? | Furious fans slam Indian board as Gill replaces Rohit sharma as ODI captain | Sakshi
Sakshi News home page

#Rohit Sharma: రోహిత్ శర్మపై కుట్ర..! ఇది మీకు న్యాయమేనా?

Oct 4 2025 6:51 PM | Updated on Oct 4 2025 7:15 PM

Furious fans slam Indian board as Gill replaces Rohit sharma as ODI captain

భారత క్రికెట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ శకం ముగిసింది. ఇప్పటికే టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్‌ను తాజాగా వన్డే కెప్టెన్సీ నుంచి సైతం బీసీసీఐ తప్పించింది. అత‌డి స్ధానంలో యువ ఆట‌గాడు శుబ్‌మ‌న్ గిల్‌ను కొత్త వ‌న్డే కెప్టెన్‌గా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నియ‌మించింది.

బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని హిట్‌మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా బీసీసీఐపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. రోహిత్ ఇప్ప‌టికీ ఫిట్‌గా ఉన్నాడ‌ని, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్-2027 వ‌ర‌కు అత‌డు ఆడ‌గ‌ల‌డ‌ని ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు.

రోహిత్ శర్మ ది బెస్ట్ కెప్టెన్‌.. బీసీసీపై అత‌డిని కావాల‌నే త‌ప్పించంద‌ని ఓ యూజ‌ర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌ను ఇలా అవ‌మానిస్తారా? అని మ‌రో యూజ‌ర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఎక్స్‌లో రోహిత్ శ‌ర్మ పేరు ట్రెండ్ అవుతోంది. థాంక్యూ రోహిత్ అని అభిమానులు భావోద్వేగానికి లోన‌వ‌తున్నారు.

 

తిరుగులేని రోహిత్‌..
మూడు ఫార్మాట్‌ల‌లోనూ తిరిగి లేని కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. నాయకుడిగా హిట్‌మ్యాన్‌ భార‌త్‌కు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024, ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 టైటిల్స్‌ను అత‌డి సార‌థ్యంలోనే టీమిండియా సొంతం చేసుకుంది. 

అదేవిధంగా వన్డే ప్రపంచకప్ 2023లో జ‌ట్టును ఫైనల్‌ వరకూ తీసుకెళ్లాడు. ఆ టోర్నీలో భార‌త్ మొత్తంగా 11 మ్యాచ్‌ల‌లో ప‌దింట గెలిచింది. అనుహ్యంగా తుది పోరులో ఓట‌మి పాలై తృటిలో ట్రోఫీని కోల్పోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఓవరాల్‌గా 56 వన్డే మ్యాచ్‌లు ఆడింది.

అందులో 42 మ్యాచ్‌లలో గెలిచింది. 12 మ్యాచ్‌లలో ఓడిపోయింది.  ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. మరో మ్యాచ్‌ టైగా ముగిసింది. కెప్టెన్‌గా అతడి విజయం శాతం 76గా ఉంది. 

ఆసీస్ టూర్‌కు భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ , అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement