బరువు తగ్గడం కొందరికి అతి పెద్ద సవాలు. పైగా అదొక భారమైన సమస్యగా మారిపోతుంటుంది. ఎందుకంటే వారికి సాధారణ ఆహార మార్పులు ఓ పట్టాన పనిచేయవు. అలా.. బరువు తగ్గినట్టే తగ్గి ..ఇట్టే పెరిగిపోతుంటా. దాంతో విసుగు పుట్టుకొచ్చేస్తుంటుంది కూడా. అలానే ఇబ్బంది పడింది మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్ళై. ఆమెకు బరువు తగ్గడం శారీరకంగా, మాససికంగా పెను సమస్యగా మారింది. ఏ డైట్ ఫాలో అయిన ఫలితం శూన్యం. తగ్గినట్టు తగ్గి పెరిగిపోతోంది. చివరికి ఆమె ఏం చేసి బరువు తగ్గగలిగిందంటే..
రక్తపోటు సమస్యల కారణంగా అంబికాను కార్డియాలజిస్ట్‌లు బరువు తగ్గేందుకు ప్రయత్నించమని సూచించారు. బరువు తగ్గితే ఆమె వాడే అన్ని మందులు ఆపేయొచ్చట. అందుకే తాను చాలామందిని వెయిట్‌లాస్ జర్నీలో తనతో కలిసి జాయిన్ అవ్వమని పిలునిస్తుందట కూడా. ఈ బరువుని నిర్లక్ష్యం చేస్తే భారీకాయంతో మూల్యం చెల్లించుకుంటామంటోంది. అధిక బరువు.. అన్ని అనారోగ్య సమస్యలకు మూలం కాబట్టి పట్టుదలతో దానిపై యుద్ధం చేయాలని అంటోంది.
డైట్ మార్పులు..
తగ్గినట్టు తగ్గి..కొన్ని నెలలో బరువు పెరిగిపోవడంతో విసిగిపోయి..డైట్‌లోనే మార్పులు చేసింది. నో బ్రెడ్, చపాతీ, రైస్, పరాఠా, మాల్వా పరాఠా అని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యింది. అందుకు బదులుగా కూరగాయలు, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకునేదాన్ని అని అంటోంది. చాలామటుకు ఆవిరిలో లేదా రోస్ట్ చేసినవి తీసుకునేదాన్ని అని చెప్పుకొచ్చింది. అప్పుడే తన బరువులో స్వల్ప మార్పులు సంభవించాయని అంటోంది.
పిండి పదార్థాలకు దూరంగా ఉండటం తోపాటు డీప్ ఫ్రై చేసిన ఆహారాలను కూడా దరిచేరనిచ్చేదికాదు. సాధ్యమైనంతవరకు ఆవిరిలో ఉడికించిన వాటికి ప్రాధాన్యత ఇచ్చి..సుమారు ఐదు కిలోల బరువు తగ్గిందట. అంతేగాదు బరువు తగ్గడంలో తనలా హెచ్చు తగ్గులతో ఇబ్బంది పడుతుంటే గనుక అనారోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలను తగ్గించడానికి ప్రయత్నిస్తే..సత్వర మార్పుల తోపాటు బరువు తగ్గడం కూడా తథ్యం అని నమ్మకంగా చెబుతోంది. అందుకు సంబంధంచిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: పొలాల నుంచి డిజిటల్ ప్రపంచంలోకి..ఇవాళ 400 మందికి పైగా యువతకు..!)


