బాలీవుడ్ ప్రముఖ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని గ్లోబల్‌స్టార్‌గా వెలుగొందుతోందామె. ఎప్పుడూ బిజీగా ఉండే ఆమె సరదా ఫన్నీ విషయాలు, బ్యూటీ అండ్ ఫిట్‌నెస్ టిప్స్‌ని తన అభిమానులతో షేర్ చేసుకుంటుంటారామె. అలానే ఈసారి ఓ చక్కటి బ్యూటీ టిప్‌తో మన ముందుకు వచ్చారు. ఏజ్ పెరిగే కొద్ది ముఖంపై ఏర్పడి రంధ్రాలను టైట్ చేసేలా ముఖం అందాన్ని కాపాడుకోవడటం ఎలాగో షేర్ చేశారామె. మరి ఆ అద్భుతమైన సౌందర్య చిట్కా ఏంటో చూద్దామా..!.
ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్, అందానికి కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన ప్రియంకా చోప్రా రెడ్‌కార్పెట్ ప్రదర్శనలో అయినా, మ్యాగ్జైన్ కవర్‌పైన సాధారణ సెల్ఫీలు అయినా..స్టన్నింగ్ లుక్‌తో మెరిపోతుంటుంది. చర్మ సంరక్షణ విషయంలో చాలా కేర్‌గా ఉంటుందామె. మేకప్ కంటే నేచురల్ అందానికే ప్రాధాన్యత ఇచ్చే ప్రియాంక చాలా సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలనే అనుసరిస్తుందామె. తాజాగా షేర్ చేసని టిప్ ఏంటంటే..
చర్మంపై ఉండే రంధ్రాలు పెద్దగా కనిపంచకుండా..ముఖం వాపుని తగ్గించే చక్కటి కోల్డ్ ఫేషియల్‌ని పరిచయం చేస్తుంది. ఇది అందరికీ తెలిసందే గానీ ఆమె ఓ ప్రత్యేకమైన డివైజ్‌తో చాలా సులభంగా చేసుకోవచ్చంటూ సరికొత్తగా చూపించారామె. నిజానికి చల్లటి నీటిలో ముఖం డిప్ చేయడం కాస్త ఇబ్బందికరంగానూ..శ్వాసకు సంబంధించి ఊపిరాడనట్లుగా కూడా ఉంటుంది. అదే ప్రియంక షేర్ చేసిన వీడియోలో బీతింగ్ అటాట్‌మెంట్‌తో ఉన్న ఐస్ వాటర్ డింకింగ్ చక్కటి సౌకర్యవంతమైన శ్వాసకు అనుమతిస్తుంది.
ముఖం పూర్తిగా మునిగిపోయేలా కొద్దిసేపు ఉంచగలుగుతాం. ఈ ఫేస్‌టబ్ కోల్డ్‌ఫ్లంజ్ అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి రూపొందించిన ప్రత్యేక సాధనం. కోల్డ్ ఫేషియల్‌గా ఇది అద్భుతమైన డివైజ్‌గా చెప్పొచ్చు. అలాగే ఇలా చేయడం వల్ల ముఖంపై మృతకణాలు తగ్గి ముఖం మంతా రక్తప్రసరణ జరుగుతుంది. ముఖం తాజాగా గ్లో గా ఉంటుందని సెలబ్రిటీలు తప్పకుండా పాటించే టిప్ ఇంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.
(చదవండి: వలస వచ్చి.. ప్రేమ ‘నరకం’లో పడి.. ఇప్పుడు ‘కరోడ్‌పతి’గా..)


