'జీన్స్‌' మూవీని తలపించే పెళ్లి వేడుక..! | Twin brothers marry twin sisters in rare double wedding | Sakshi
Sakshi News home page

అరుదైన పెళ్లి: ట్విన్‌ సిస్టర్స్‌ని పెళ్లాడిన ట్విన్‌ బ్రదర్స్‌..!

Feb 25 2026 1:53 PM | Updated on Feb 25 2026 2:16 PM

Twin brothers marry twin sisters in rare double wedding

సోషల్‌ మీడియాలో ఓ పెళ్లి వేడుక అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. సాధారణంగా పెళ్లి వేడకల్లో వధూవరుల జంట చూడముచ్చటగా ఉంటేనే బంధుమిత్రులు మురిసిపోతారు. అలాంటిది ఒకేలా ఉండే ఇద్దరు వరులు అచ్చం ఒకేలా ఉండే ఇద్దరు వధువులను పెళ్లి చేసుకుంటే ఆ సందడి, హడావిడే వేరు. అచ్చం అలానే ఇక్కడ ఒకేలా ఉండే ఇద్దరు కవల సోదరిమణులు..ఒకేలా ఉండే కవల సోదరులను పెళ్లాడారు. 

ఇది తెలంగాణలోని కామారెడ్డిలో జిల్లా ఘన్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఒకే పోలికలతో ఉన్న ఈ రెండు జంటలు, మూడు ముళ్ల బంధంతో ఒకటవ్వడం అక్కడున్నవారందర్నీ ఆకట్టుకుంటోంది. వారే ట్విన్‌ బ్రదర్స్‌ అయిన దుంపటి విజయ్‌, వినయ్‌లు, ట్విన్‌ సిస్టర్స్‌ అయిన కుమ్మరి కీర్తన, కీర్తీలను పెళ్లాడారు. 

ఆ ఇరు జంటలు పెళ్లిపీటల మీద కూర్చున్న దృశ్యం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఇలా ఇద్దరు కవలలు, మరో ఇద్దరు కవలలను పెళ్లి చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతంది. అక్కడి గ్రామస్తులు ఇలాంటి పెళ్లి ఘట్టాన్ని కనులారా వీక్షించడం అదృష్టంగా భావిస్తున్నామని చెబుతుండటం విశేషం. 

(చదవండి: జస్ట్‌ 11 నెలల్లో 52 కిలోలు బరువు తగ్గింది..! నో జిమ్‌, నో స్ట్రిక్ట్‌ డైట్‌..)

 

Advertisement
 
Advertisement
Advertisement