రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే | Rishab Shetty Reacts Rashmika Wedding Invitation | Sakshi
Sakshi News home page

Rashmika Wedding: పెళ్లికి ఆహ్వానం అందిందా? రిషభ్ ఏం చెప్పాడంటే?

Feb 25 2026 1:16 PM | Updated on Feb 25 2026 1:42 PM

Rishab Shetty Reacts Rashmika Wedding Invitation

హీరోయిన్ రష్మిక పెళ్లి మరికొన్ని గంటల్లో జరగనుంది. హీరో విజయ్ దేవరకొండతో ఉదయ్‌పుర్ వేదికగా ఏడడుగులు వేయనుంది. గతంలోనే రష్మిక.. కన్నడ హీరో రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకోవాల్సింది. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల అది రద్దయింది. అప్పటినుంచి రక్షిత్ శెట్టి అతడి స్నేహితులకు రష్మిక అంటే ఎందుకో కోపం? తాజాగా రష్మిక పెళ్లికి పిలిచిందా అనే ప్రశ్న 'కాంతార' రిషభ్ శెట్టికి ఎదురైంది. మరి అతడేం సమాధానమిచ్చాడో తెలుసా?

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని)

కర్ణాటకకు చెందిన రష్మిక.. రిషభ్ శెట్టి దర్శకత్వం వహించిన 'కిరిక్ పార్టీ' సినిమాతోనే హీరోయిన్ అయింది. ఇందులో రక్షిత్ శెట్టి హీరో. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే రక్షిత్-రష్మిక ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబ పెద్దల్ని ఒప్పించి ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో పెళ్లి రద్దయింది. అప్పటినుంచి రిషభ్ శెట్టి, రక్షిత్ శెట్టితోపాటు అతడి స్నేహితులు.. రష్మిక గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. ఇప్పుడు కూడా అదే జరిగింది.

మంగళవారం ఉదయం మంత్రాలయంకి వచ్చిన రిషభ్ శెట్టి.. రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఓ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టైంలోనే.. రష్మిక మిమ్మల్ని తన పెళ్లికి పిలవలేదా? అని ఓ రిపోర్టర్ అడిగాడు. ప్రశ్న మధ్యలో ఉండగానే థ్యాంక్యూ అని చెబుతూ రిషభ్ శెట్టి అక్కడనుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్మిక పెళ్లి విషయానికొస్తే.. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి చేసిన విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. ఉదయ్‌పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గురువారం ఉదయం పెళ్లి చేసుకోనున్నారు. ఉదయం తెలుగు పద్ధతిలో, సాయంత్రం రష్మిక కుటుంబానికి చెందిన కొడవ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనుంది.

(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)

Advertisement
 
Advertisement
Advertisement