రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి? | Vijay Devarakonda Parents Conditions To Marry Rashmika | Sakshi
Sakshi News home page

Vijay Rashmika Wedding: రష్మి‍కతో కొడుకు పెళ్లి.. విజయ్ పేరెంట్స్ గతంలోనే హింట్ ఇచ్చారు

Feb 24 2026 3:35 PM | Updated on Feb 24 2026 3:38 PM

Vijay Devarakonda Parents Conditions To Marry Rashmika

అనుకున్నట్లే టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు. చాన్నాళ్లుగా వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ రెండు రోజుల క్రితమే అధికారికంగా తమ వివాహం విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఉదయ్‌పుర్‌లో పెళ్లి హడావుడి మొదలైపోయింది. ఈ గురువారమే(ఫిబ్రవరి 26) విజయ్-రష్మిక కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. అయితే తమ ఇంటికి రాబోయే కోడలి గురించి విజయ్ తల్లిదండ్రులు గతంలో మాట్లాడారు. ఒకటి రెండు కండిషన్స్ కూడా పెట్టారు. ఇంతకీ అవేంటి?

(ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

విజయ్ తెలంగాణ అబ్బాయి కాగా.. రష్మిక కన్నడ అమ్మాయి. వీళ్లిద్దరూ తొలుత 'గీతగోవిందం' అనే సినిమా కోసం కలిసి పనిచేశారు. ఆ టైంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం చిగురించి, తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటల వరకు వచ్చింది. అయితే అదే మూవీ ఈవెంట్‌లోనే విజయ్ తల్లిదండ్రులు తమ కోడలి ఎలా ఉండాలి అనే విషయాల్ని కొన్ని చెప్పారు. ఇప్పుడు రష్మిక వాటిని నిజం చేసినట్లు కనిపిస్తోంది.

'గీతగోవిందం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ సుమ మాట్లాడుతూ.. మీకు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారు? అని విజయ్ తల్లిదండ్రులని అడిగింది. దీనికి సమాధానమిచ్చిన తల్లి మాధవి.. మా బాబుని(విజయ్ దేవరకొండ) బాగా చూసుకునే కోడలు వస్తే చాలు, అతడిని ప్రేమించాలి అంతే. ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఆమె, అతడిని బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు. విజయ్ తండ్రి గోవర్థన్ ఇదే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కులం, మతం గురించి పట్టింపులు లేవు. భారతీయురాలిని, ముఖ్యంగా దక్షిణాది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషం అని అన్నారు.

మరో మూవీ ఈవెంట్‌లో విజయ్ కూడా తనకు కాబోయే భార్య గురించి మాట్లాడుతూ.. తనకు అరేంజ్డ్ మ్యారేజ్ వర్కౌట్ కాదని, చేసుకుంటే లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను. కానీ ఆ అమ్మాయి నా తల్లిదండ్రులకు కూడా నచ్చాలి అని కండిషన్ పెట్టాడు. మరో సందర్భంలో రష్మిక మాట్లాడుతూ.. మాధవి(విజయ్ తల్లి) ఆంటీ తనకు మరో అమ్మలాంటిది అని చెప్పుకొచ్చింది. చూస్తుంటే విజయ్ దేవరకొండ పేరెంట్స్ పెట్టిన కండిషన్స్‌కి తగ్గట్లే రష్మిక.. వీళ్ల ఇంటి కోడలు కాబోతోంది. గతంలో పలుమార్లు వీళ్లు హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కలిపి ఉన్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: విజయ్‌ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్‌ గ్యాప్‌ ఎంతంటే?)

Advertisement
 
Advertisement
Advertisement