మత రాజకీయాలు చెల్లవు.. కరూర్‌ ఘటనకు కారణం తెలుసు : విజయ్‌ | Vijay comments On Karur Incident and political career in tamilnadu | Sakshi
Sakshi News home page

మత రాజకీయాలు చెల్లవు.. కరూర్‌ ఘటనకు కారణం తెలుసు : విజయ్‌

Feb 24 2026 11:17 AM | Updated on Feb 24 2026 11:48 AM

Vijay comments On Karur Incident and political career in tamilnadu

తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజిల్‌ గుర్తు విప్లవం సృష్టించడం ఖాయమని టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌ పిలిపునిచ్చారు. ఆపై కరూర్‌ ఘటన గురించి విజయ్‌ మాట్లాడారు. మనఃసాక్షి లేకుండా కరూరు ఘటనలో తనపై నిందలు వేశారని,  ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అందరికీ తెలుసునని  ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. 

ఈ సమయంలో ఆయన  కొంత సేపు ప్రసంగాన్ని ఆపేసి మౌనంగా  ఉండటంతో  కార్యకర్తలు తలైవా.... తలైవా... అంటూ నినాదాలు చేశారు.  అనంతరం క్షమాపణలు చెప్పుకుంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. మతాలకు అతీతంగా తమ పార్టీ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కొంత మంది మతాలను అడుపెట్టుకొని ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలని చూస్తుంటారన్నారు. ఇక్కడ కొంత మంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మాట్లాడకుండా ఉంటేనే మంచిదని హితవు పలికారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement