అలియా భట్‌ 'ఆల్ఫా'.. రూ. 215 కోట్ల ఢీల్‌ వద్దంటూ.. | Alia Bhatt Alpha Movie Netflix Deal Cancelled | Sakshi
Sakshi News home page

అలియా భట్‌ 'ఆల్ఫా'.. రూ. 215 కోట్ల ఢీల్‌ వద్దంటూ..

Feb 24 2026 9:54 AM | Updated on Feb 24 2026 10:38 AM

Alia Bhatt Alpha Movie Netflix Deal Cancelled

అలియా భట్‌.  శార్వరీ వాఘ్‌ నటించిన  స్పై థ్రిల్లర్ చిత్రం 'ఆల్ఫా'. దర్శకుడు  శివ్‌ రావేల్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తుంది.  మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఇది రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లో  అనిల్‌ కపూర్, బాబీ డియోల్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే,  మొదట డిసెంబర్ 25, 2025న రిలీజ్ అనుకున్నారు. తర్వాత ఏప్రిల్ 17, 2026కి వాయిదా వేశారు.

'ఆల్ఫా' సినిమాను థియేటర్‌లో కాకుండా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. అందుకోసం రూ. 215 కోట్లు  నెట్‌ఫ్లిక్స్ ఆఫర్‌ చేసినట్లు తెలిసిందే. అయితే, దానిని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ తిరస్కరించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ చిత్రం థియేటర్లలోనే విడుదల అవుతుందని తాజాగా ఆ సంస్ధ ధృవీకరించింది.   యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించే సినిమాలన్నీ కూడా థియేటర్ స్లేట్‌లోని ఉంటాయని పేర్కొంది. ఎట్టిపరిస్థితిల్లోనూ నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో తమ భారీ చిత్రాలను ఉంచదని, ప్రేక్షకులకు సినిమాటిక్ అనుభవాలను అందించడంలో ప్రాముఖ్యతను ఇస్తామని యష్ రాజ్ ఫిల్మ్స్  ప్రతినిధి పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement