రియల్‌ క్రైమ్ స్టోరీగా వస్తోన్న కాక్‌రోచ్.. రిలీజ్ డేట్ ఫిక్స్ | Tollywood movie Cock Roach Ready For Release | Sakshi
Sakshi News home page

Cock Roach Movie: రియల్‌ క్రైమ్ స్టోరీగా వస్తోన్న కాక్‌రోచ్.. రిలీజ్ డేట్ ఫిక్స్

Feb 23 2026 8:58 PM | Updated on Feb 23 2026 9:31 PM

Tollywood movie Cock Roach Ready For Release

అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా  చిత్రం కాక్‌రోచ్. ఈ సినిమాకు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 6న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ..' సునీల్ కుమార్ రెడ్డితో మా కాంబినేషన్‌లో విజయవంతమైన మంచి చిత్రాలు చేశాం. మేము కలిసి చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇది. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం. ఈ చిత్ర నిర్మాణ సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం.  మార్చి 6వ తేదీన మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు మా మూవీ కొత్తదనం ఇస్తుందని' అన్నారు.

డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. - 'నేను జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశా. పాత్రికేయుడిగా నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో దర్శకుడిగా మారా. ఆ క్రమంలోనే ఈ కాక్రోచ్ అనే చిత్రాన్ని రూపొందించా. ఈ సినిమా చేసే ముందు పోలీస్ డిపార్ట్ మెంట్ వారి సపోర్ట్ నా సహచర పాత్రికేయ మిత్రుల సహకారం తీసుకున్నా. అనేక కేసులను స్టడీ చేశాను. నేరస్థులతో కూడా చాలా విషయాలు అడిగి ఎన్నో కొత్త విశేషాలు తెలుసుకున్నాను. విశాఖ, గాజువాక ప్రాంతంలో ఉండే కొందరు నేరస్తుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయలెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించా. రోడ్డు మీద ఉండే వేశ్యకు, ఒక క్రిమినల్‌కు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించా. డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది' అని. అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేశ్, మల్లిక, ఎఫ్.ఎమ్. బాబాయ్, తాటికొండ ప్రసాద్, సునీత, రాజు, బాలాజీ, ఎల్ బీ రమణ కీలక పాత్రల్లో నటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement